కె. రాణి
కె. రాణి(04,సెప్టెంబరు1942) తెలుగు సినిమారంగంలో తొలికాలం నాటి గాయని. ఈమె ఆకాలంలోని సుమారు అందరు గాయకులతో గొంతు కలిపి ఎన్నో మధురమైన పాటలు గానం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాస్’ చిత్రంలోని ‘‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’’ పాటతో ఆమె ప్రసిద్ధిగాంచారు. తెలుగులో సుమారు 500పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, సిన్హల, ఉజ్బెక్ భాషల్లో పాటలు పాడారు. ‘రూపవతి’ చిత్రంతో తన సినీ కెరీర్‌ను ఆరంభించిన రాణి.. ‘బాటసారి’, ‘జయసింహ’, ‘ధర్మదేవత’, ‘లవకుశ’ వంటి చిత్రాల్లో తన పాటలు ఆలపించారు.[1]
కె. రాణి | |
---|---|
జననం | కె.ఉషారాణి. 04,సెప్టెంబర్1942 తుముకూరు, కర్ణాటక రాష్ట్రం |
మరణం | జూలై 14, 2018 హైదరాబాదు, తెలంగాణ |
వృత్తి | గాయని |
ప్రసిద్ధి | సోలో సింగర్ |
భార్య / భర్త | గాలివీటి సీతారామరెడ్డి |
తండ్రి | కిషన్ |
తల్లి | లలిత |
జీవిత విశేషాలు
మార్చుఈమె అసలు పేరు కె.ఉషారాణి. ఈమె 04,సెప్టెంబర్1942లో కర్ణాటక రాష్ట్రంలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించింది. ఈమె తండ్రి రైల్వేలో ఉద్యోగి. వీరు ఉత్తర భారతదేశం నుండి వచ్చి కడపలో స్థిరపడ్డారు. ఈమెకు 1966లో గాలివీటి సీతారామరెడ్డితో వివాహం జరిగింది. ఈమె మామగారు బహద్దూర్ సుబ్బారెడ్డి జిల్లా కలెక్టరుగా పనిచేశాడు. సీతారామరెడ్డికి హైదరాబాదులోని చార్మినార్ సమీపంలో సదరన్ మూవిటోన్ అనే స్టూడియో వుండేది. ఈ స్టూడియోలోనే ‘సతీ అరుంధతి’, ‘నిజం చెబితే నమ్మరు’ వంటి సినిమాలు నిర్మించారు. లవకుశ నిర్మాత శంకరరెడ్డి ‘రహస్యం’ సినిమాను సదరన్ మూవిటోన్ స్టూడియోలోనే నిర్మించడం విశేషం. వీరికి ఇద్దరు అమ్మాయిలు. "మెల్లిసై రాణి" అని అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ఆమెని కీర్తించారు. భారత రాష్ట్రపతి భవన్‌లో అప్పటి రాష్ట్రపతి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ తదితరులను ఆమె తన గానామృతంతో ఓలలాడించారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో భాషల్లో కలిపి రాణి ఐదు వందలకు పైగా పాటలు పాడారు.[2]
మరణం
మార్చు2018, జూలై 14న హైదరాబాదులోని తన కుమార్తె ఇంటిలో మరణించింది.[3]
సినిమా పాటలు
మార్చు1951 లో రాణి తొలిసారి ‘రూపవతి’ అనే సినిమాలో “వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయ్, సయ్యనవోయ్ మనసార దరిచేరవోయ్” అనే కోరస్ పాటని సి. ఆర్. సుబ్బురామన్ సంగీత దర్శకత్వంలో పాడింది.
కె.రాణి పాడిన తెలుగు సినిమా పాటల పాక్షిక జాబితా:
క్రమ సంఖ్య | సినిమా పేరు | పాట పల్లవి | సహ గాయకుడు/ గాయని | సంగీత దర్శకుడు | గేయ రచయిత | సినిమా విడుదలైన సంవత్సరం |
---|---|---|---|---|---|---|
సి.ఆర్. సుబ్బరామన్ | కె.జి.శర్మ | 1951 | ||||
1 | రూపవతి | వయ్యారి రాజా జిలిబిలి వలపుల రాణినోయి | జిక్కి బృందం | సి.ఆర్. సుబ్బరామన్ | కె.జి.శర్మ | 1951 |
3 | అత్తింటి కాపురం | నాజీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే | సుసర్ల దక్షిణామూర్తి, జి.రామనాథ అయ్యర్ |
తోలేటి | 1952 | |
4 | ధర్మ దేవత | ఏ ఊరే చిన్నదానా తొలకరి మెరుపల్లె మెరసేవు | కె. ప్రసాదరావు | సి.ఆర్. సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1952 |
5 | ధర్మ దేవత | చిందువేయవోయి చిన్ని కృష్ణయ్య ఓ బాల | బి.ఎన్.రావు, జిక్కి |
సి.ఆర్. సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1952 |
6 | ధర్మ దేవత | పాటకు పల్లవి కావాలోయి ఆటలు గజ్జలు కావాలోయి | సి.ఆర్. సుబ్బరామన్ | కె.జి. శర్మ | 1952 | |
7 | ధర్మ దేవత | లంబాడి లంబాడి లంబాడి లంబ లంబ లంబ | సి.ఆర్. సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1952 | |
8 | పెళ్ళి చేసి చూడు | అమ్మా నొప్పులే అమ్మమ్మ నొప్పులే ఫస్టుక్లాసులో | ఉడుతా సరోజిని | ఘంటసాల | పింగళి | 1952 |
9 | పెళ్ళి చేసి చూడు | బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా లోకమునే | ఎ.పి.కోమల, ఉడుతా సరోజిని |
ఘంటసాల | ఊటుకూరి | 1952 |
10 | సింగారి | ఆవో మహారాజ్..ఒక జాన్ కడుపే లేదంటే ఈ లోకాన లేదు గలాటా | కె.హెచ్.రెడ్డి | ఎస్.వి.వెంకట్రామన్, టి.కె.రామనాథన్, టి.ఎ.కళ్యాణం |
1952 | |
11 | సింగారి | కొటారు మానిపైనే గూడు కట్టుకొక్కేరను కొట కొత్తళ౦ | కె.హెచ్.రెడ్డి | ఎస్.వి.వెంకట్రామన్, టి.కె.రామనాథన్, టి.ఎ.కళ్యాణం |
1952 | |
12 | దేవదాసు | అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశానిరాశేనా మిగిలేది | సి.ఆర్. సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1953 | |
13 | దేవదాసు | చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే | ఘంటసాల | సి.ఆర్. సుబ్బరామన్ | సముద్రాల సీనియర్ | 1953 |
14 | పుట్టిల్లు | ఓహో హో బ్యూటీ దిస్ ఈజ్ మై డ్యూటీ ఆహా హా బ్యూటీ | పిఠాపురం | మోహన్ దాస్, చలపతి రావు |
1953 | |
15 | నిరుపేదలు | సార్ సార్ సార్ పాలీష్ ఒక్క బేడకు చక్కని పాలీష్ చెక్కు చెదరితే డబ్బులు వాపస్ | టి.వి.రాజు | అనిసెట్టి | 1954 | |
16 | మా గోపి | మా వదిన మా వదిన నా పేరున ఒక జాబును వ్రాసింది | జిక్కి బృందం | ఎం.ఎస్.విశ్వనాథన్, రామమూర్తి |
అనిసెట్టి | 1954 |
17 | చిరంజీవులు | నాటిన అంటుకు ...ఎంచక్కా ఎంచక్కా ఎంచక్కా | కె.జమునారాణి | ఘంటసాల | మల్లాది రామకృష్ణశాస్త్రి | 1956 |
18 | బాల సన్యాసమ్మ కథ | అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి | పి.లీల, మైధిలి |
ఎస్.రాజేశ్వరరావు | సముద్రాల జూనియర్ | 1956 |
19 | బాల సన్యాసమ్మ కథ | కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు | మైధిలి బృందం | ఎస్. రాజేశ్వరరావు | సముద్రాల జూనియర్ | 1956 |
20 | బాల సన్యాసమ్మ కథ | నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ | పిఠాపురం | ఎస్. రాజేశ్వరరావు | సముద్రాల జూనియర్ | 1956 |
21 | అల్లావుద్దీన్ అద్భుతదీపం | సొగసరిదాననయ్య రంగేళి సింగారి | ఎస్.రాజేశ్వరరావు, ఎస్.హనుమంతరావు |
ఆరుద్ర | 1957 | |
22 | తోడికోడళ్ళు | ఎంతెంత దూరం కోశెడు దూరం నీకు మాకు చాలా చాలా దూరం | పి.సుశీల బృందం | మాస్టర్ వేణు | ఆత్రేయ | 1957 |
23 | వద్దంటే పెళ్ళి | రావో రావో ప్రియతమా నీవే నాకు సరసుమా | రాజన్ - నాగేంద్ర | శ్రీరామ్‌చంద్ | 1957 | |
24 | స్వయంప్రభ | ఒరె గున్నా ఏమో అనుకున్నాబల్ గడసరివన్నా ఓ సొగసరి | రమేష్ నాయుడు | ఆరుద్ర | 1957 | |
25 | కొండవీటి దొంగ | తమలపాకు సున్నము పడుచువాళ్లకందము | పి.బి.శ్రీనివాస్ | ఎస్.ఎల్.మర్చెంట్, ఎం.ఎస్.శ్రీరామ్ |
1958 | |
26 | శోభ | వెలుగేలేని ఈ లోకాన జాలే లేని ఈ జగాన ఎడారియేగా | ఎ.ఎం. రాజా | ఏ.ఎమ్.రాజా | పి.వసంతకుమార రెడ్డి | 1958 |
27 | దైవబలం | ఝంఝంఝం ఝమా బావా బంకమట్టిలాగ పట్టినావు | బృందం | అశ్వత్థామ | కొసరాజు | 1959 |
28 | మనోరమ | ఓహోహో కాంతమ్మఒక్కసారి చూడమ్మాకొత్త పెళ్ళి కూతురులా | పి.బి.శ్రీనివాస్ | రమేష్ నాయుడు | 1959 | |
29 | సిపాయి కూతురు | ఓ మావయ్యా .. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకటిలో | పిఠాపురం | యం.ఎస్.రాజు | కొనకళ్ల వెంకటరత్నం | 1959 |
30 | కన్నకూతురు | ఏమి పేరు పెట్టుదాం ఏమని చాటుదాం | ఎ.పి.కోమల బృందం | ఎం.రంగారావు | నారపరాజు | 1960 |
31 | ఉషాపరిణయం | ఒట్టేసుకో ఒట్టేసుకో ఓ మరదలా నను కట్టేసుకో | పిఠాపురం | ఎస్.హనుమంతరావు | సదాశివబ్రహ్మం | 1961 |
32 | ధాన్యమే ధనలక్ష్మి | ఆంగ్ల నాగరిక రీతులు అధ్బుతమైన కళాజ్యోతులు | సరోజిని | మారెళ్ళ | అనిసెట్టి | 1961 |
33 | యోధాన యోధులు | టిక్కు టెక్కుల చిట్టి టెక్కు నిక్కు హోయల చిట్టి | అశ్వద్ధామ | సుంకర | 1961 | |
34 | ఏకైక వీరుడు | ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన | ఎల్.ఆర్. ఈశ్వరి | ఎస్.పి. కోదండపాణి | వీటూరి | 1962 |
35 | పతిగౌరవమే సతికానందం | మురిపించు ప్రియరాణీ మృదువైన మంజువాణీ | రాజు | సాలూరి రాజేశ్వరరావు | అనిసెట్టి | 1962 |
36 | తల్లి బిడ్డ | ఆడించరె జోల లాడించరె అందాల బాబును దీవించి | బృందం | బి.శంకరరావు | ఎ.వేణుగోపాల్ | 1963 |
37 | సతీ అరుంధతి | పోయిరావే తల్లి పోయి రావమ్మా ఆరని జ్యోతి | బృందం | అశ్వద్ధామ | దాశరథి | 1968 |
మూలాలు
మార్చు- ↑ "పాటల రాణి ఇక లేరు!".[permanent dead link]
- ↑ సారంగ, జ్ఞాపకాలు (15 July 2018). "అందమైన పాటలా ఆమె ప్రయాణం! –". magazine.saarangabooks.com. పురాణం విజయ దుర్గ. Retrieved 7 August 2020.
- ↑ సితార, పాటల పల్లకి. "పాటల తోటను వీడిన పాటల రాణి". www.sitara.net. ఆచారం షణ్ముఖాచారి. Archived from the original on 2 ఆగస్టు 2018. Retrieved 7 ఆగస్టు 2020.