పుహళేంది
(పుహళంది నుండి దారిమార్పు చెందింది)
పుహళేంది, ప్రముఖ దక్షిణ భారత సినీ సంగీత దర్శకుడు. అనేక తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాలకు సంగీతం సమకూర్చాడు. మలయాళీ అయిన పుహళేంది అసలు పేరు వేలాయుధన్ నాయర్. ఈయన తెలుగులో పసివాడి ప్రాణం, వింత కథ, సంసారం ఒక సంగీతం, జడగంటలు, జేగంటలు వంటి సినిమాలకు సంగీతం సమకూర్చాడు. ఈయన సినిమాలకే కాక భాగవతం టీవీ ధారావాహికకు కూడా సంగీతం సమకూర్చాడు.
పుహళేంది | |
---|---|
ప్రసిద్ధి | భారత సినీ సంగీత దర్శకుడు |
పుహళేంది ఫిబ్రవరి 27న తిరువనంతపురంలోని ఒక హోటల్లో గుండెపోటుతో మరణించాడు.[1]
సంగీతం సమకూర్చిన చిత్రాలు
మార్చు- సహాయ సంగీత దర్శకునిగా
- శ్రీనాథ కవిసార్వభౌముడు (1993)
- స్వాతి కిరణం (1992)
- పెళ్ళి పుస్తకం (1991)
- సూత్రధారులు (1990)
- జానకిరాముడు (1988)
- శృతిలయలు (1987)
- మంగమ్మగారి మనవడు (1984)
- పెళ్ళి చూపులు (1983)
- శుభలేఖ (1982)
- రాధా కళ్యాణం (1981)
- త్యాగయ్య (1981) (సహాయ సంగీత సూపర్వైజర్)
- కలియుగ రావణాసురుడు (1980)
- సప్తపది (1980)
- శుభోదయం (1980)
- తాయారమ్మ బంగారయ్య (1979)
- శంకరాభరణం (1979)
- సీతామాలక్ష్మి (1978)
- ఇంద్రధనుస్సు (1977)
- మాంగల్యానికి మరో ముడి (1976)
- సెక్రటరీ (1976)
- సీతా కళ్యాణం (1976)
- గుణవంతుడు (1975)
- జీవనజ్యోతి (1975)
- ఓ సీత కథ (1974)
- అందాల రాముడు (1973)
- మాయదారి మల్లిగాడు (1973)
- నేరము – శిక్ష (1973)
- శారద (1973)
- బడిపంతులు (1972)
- కొడుకు కోడలు (1972)
- చెల్లెలి కాపురం (1971)
- చిన్ననాటి స్నేహితులు (1971)
- బాలరాజు కథ (1970)
- బుద్ధిమంతుడు (1969)
- బంగారు పిచ్చుక (1968)
- ప్రాణమిత్రులు (1967)
- సాక్షి (1967)
- సుడిగుండాలు (1967)
- ఆస్తిపరులు (1966)
- కన్నెమనసులు (1966)
- అంతస్థులు (1965)
- సుమంగళి (1965)
- తేనె మనసులు (1965)
- తోడు నీడ (1965)
- ఆత్మబలం (1964)
- దాగుడుమూతలు (1964)
- మూగమనసులు (1964)
- మంచి మనసులు (1962)
- ఇద్దరు అమ్మాయిలు (1972)
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2008-06-24. Retrieved 2008-05-19.