వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2009

2009 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

1వ వారం
మైఖేలాంజిలో పీటా

మైఖేలాంజెలో ఇటలీకి చెందిన ప్రసిద్ధ శిల్పి, చిత్రకారుడు, భవన రూపకర్త. ఇతని సుప్రసిద్ధ శిల్పం "పీటా" తన 24 సంవత్సరాల వయసులోనే పూర్తిచేశాడు. శిలువ వేయబడిన యేసుక్రీస్తు దేహాన్ని అతని తల్లి మేరీమాత వడిలో చూపే ఈ శిల్పం ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కళాకృతులలో ఒకటి.

ఫోటో సౌజన్యం: Glimz
2వ వారం
సెయింట్ పీటర్స్ బసిలికా

రోమ్ నగరంలోని వాటికన్ నగరంలోని "సెంట్ పీటర్స్ బసిలికా" ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన భవనాలలో ఒకటి. దీని నిర్మాణం 1506 - 1625 మధ్యకాలంలో జరిగింది. మైఖేలాంజెలో వంటి అనేక కళాకారులు, భవన నిర్మాపకులు దీని నిర్మాణంలో పాలు పంచుకొన్నారు.

ఫోటో సౌజన్యం: Wolfgang Stuck
3వ వారం
రక్తంలో కణాలు

మనిషి రక్తంలోని కణాలు - స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ద్వారా తీసిన ఛాయాచిత్రం. ఇందులో తెల్ల కణాలు, ఎర్రకణాలు, లింఫోసైటులు, ఒక మోనోసైటు, ఒక న్యూట్రోఫిల్, మరికొన్ని ప్లేట్‌లెట్‌లు ఉన్నాయి.

ఫోటో సౌజన్యం: Bruce Wetzel, Harry Schaefer (ఫొటోగ్రాఫరులు) నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్
4వ వారం
రక్తంలో కణాలు

డిమిట్రి ఇవనోవిఛ్ మెండలీఫ్ (1834 - 1907) రష్యాకు చెందిన రసాయన శాస్త్రవేత్త. ఇతడు మొట్టమొదట రసాయనిక మూలకాలతో ఆవర్తన పట్టికను ఆవిష్కరించాడు. పూర్తి వ్యాసం చూడండి మెండలీఫ్

ఫోటో సౌజన్యం:
5వ వారం
అరగొండ ఆంజనేయ స్వామి దేవాలయం

చిత్తూరు జిల్లా అరగొండలో కొండపై ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం. ఈ ఆలయానికి దారి ఏర్పాటు అసాధ్యం అని భావిస్తున్న తరుణంలో ఒక భక్తుడు ప్రొక్లెయినర్ సాయంతో ఒంటిచేత్తో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం ఇక్కడి విశేషం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
6వ వారం
శ్రీశైలం వీధుల్లో రుద్రాక్షల అమ్మకం

ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో ఏటా శివరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాయి

ఫోటో సౌజన్యం: విశ్వనాథ్
7వ వారం
తుంగ, భద్ర నదుల సంగమం

తుంగ, భద్ర నదుల సంగమం

ఫోటో సౌజన్యం: కాసుబాబు
8వ వారం
డాల్ఫిన్ షాము ప్రదర్శన

డాల్ఫిన్ షాము ప్రదర్శన

ఫోటో సౌజన్యం: Pidarah
9వ వారం
హనుమాన్ జంక్షన్‌ సెంటర్

ఏలూరు - విజయవాడ మార్గంలో హనుమాన్ జంక్షన్ కూడలిలో ఆంజనేయ స్వామి మందిరం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
10వ వారం
భూమిపై ఖండాలు

ప్రపంచంలోని వివిధ భూభాగాలను ఖండాలు అంటారు. వివిధ భూభాగాలు కలసి ఉన్న విధానాన్ని బట్టి ఖండాలను వివిధ పద్ధతులలో భావించవచ్చును.

ఫోటో సౌజన్యం: AlexCovarrubias
11వ వారం
సైబీరియన్ పులి

సైబీరియన్ పులిని ఉత్తర చైనా పులి, మంచూరియన్ పులి, అని కూడా పిలుస్తారు. ఇది పులి ఉపజాతిలో ఫెలిడే కుటుంబంలో అతి పెద్దదైన జంతువు. సాధారణంగా మనుషులను తినడానికి అలవాటు పడదు.

ఫోటో సౌజన్యం: Crushinator
12వ వారం
బాబు కార్టూను

బాబు అనే సంతకంతో ప్రసిద్ధుడైన కార్టూనిస్టు కొలను వెంకట దుర్గాప్రసాద్‌ గీసిన ఒక వ్యంగ్య చిత్రం ఇది. ఇందులో ఎన్నికల మ్యానిఫెస్టోలు ఎలా తయారవుతాయో చెబుతున్నాడు కార్టూనిస్టు.పాపం! సామన్యుడైన ఆ ఓటరు దగ్గర సరైన దీపంకూడ లేదు. కొవ్వొత్తి వెలుగులో ఆబగా తన ఆశలను కాయితం మీద నింపుతున్నాడు.

ఫోటో సౌజన్యం: బాబు మరియు శివ

ఫైలు:

13వ వారం
లోలకము

లోలకము కాలాన్ని కొలిచే గడియారం నిర్మాణంలో ప్రధానమైన సాధనము. అది ఒక చివర నుండి మరొక చివరకు వెళ్ళి మళ్ళీ మొదటి స్థానానికి వస్తే ఒక కంపనం పూర్తి చేసిందని అంటాము. లోలకం కదులుతున్నపుడు దాని వేగము, త్వరణము అనే సదిశ రాశులు ఎలా మారుతుంటాయో ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: hubert.christiaen at telenet dot be మరియు Siebrand
14వ వారం
ఆకులో భాగాలు

పత్రాలు లేదా ఆకులు వృక్ష కాండం మీద కణుపుల దగ్గర అభివృద్ధి చెందే పార్శ్వ ఉపాంగాలు. ఆకులు కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని తయారుచేస్తాయి. ఆకు నిర్మాణంలోని భాగాలను ఈ చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: H McKenna మరియు సాయి
15వ వారం
రాట్నాలమ్మ తల్లి దేవాలయం

రాట్నాలకుంట, పశ్చిమ గోదావరిజిల్లాలో ఒక గ్రామం. ఇక్కడి గ్రామదేవత రాట్నాలమ్మ తల్లి ఆలయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధమైనది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
16వ వారం

[[బొమ్మ:|150px|center|alt=శివమొగ్గ అడవులలో కనిపించే ఉడుత.]] శివమొగ్గ జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఆ జిల్లా మలనాడు ప్రాంతంలో దట్టమైన అడవులున్నాయి. అక్కడ కనిపించే పెద్ద మలబార్ ఉడుత (Ratufa indica giant squirrel)

ఫోటో సౌజన్యం: Vijay Cavale మరియు Shyamal
17వ వారం
మైకేలాంజిలో డేవిడ్

ప్రసిద్ధ శిల్పి మైఖేలాంజెలో చెక్కిన పాలరాతి శిల్పం "డేవిడ్" ప్రస్తుతం ఫ్లారెన్సు నగరం మ్యూజియంలో ఉంది. ఇది రెనసాన్స్ నాటి కళాకృతులకు ప్రతీకగా నిలిచింది. ఈ శిల్పాన్ని మైఖేలాంజిలో 1504లో పూర్తి చేశాడు.

ఫోటో సౌజన్యం: డేవిడ్.గయా
18వ వారం
గండికోట వద్ద పెన్నానది

గండికోట, కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చింది. ఇక్కడి దృశ్యం చాలా అందంగా ఉంటుంది.

ఫోటో సౌజన్యం: User:Tvjagan మరియు వైజాసత్య
19వ వారం
ఆర్.కె.లక్ష్మణ్ వ్యంగ్యచిత్ర సృష్టి - సామాన్య మానవుడు.

భారతదేశ కార్టూన్ రంగ చరిత్రలో ఆర్.కె. లక్ష్మణ్ సృష్టించిన "సామాన్య మానవుడు" (కామన్ మాన్) అనితర ప్రాచుర్యం పొందినది. లక్ష్మణ్ వేసిన దాదాపు అన్ని రాజకీయ వ్యంగ్య చిత్రాలలోను ఈ సామాన్య మానవుడు సాక్షిగా నిలుస్తూ, ఎన్నడూ ఒక్క మాటకూడ మాట్లాడడు. ముంబాయిలో వర్లీ సముద్ర తీరంలో, సామాన్య వ్యక్తికి ఒక లోహ విగ్రహం ప్రతిష్టించారు. బారతదేశంలో ఒక కార్టూన్ పాత్రకు ఒక విగ్రహం ఉండటం ఇదొక్కచోటే!

ఫోటో సౌజన్యం: శివరామ ప్రసాదు
20వ వారం
2009 ఎన్నికల మహాసంగ్రామం

2009 ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఆంధ్ర ప్రదేశ్‌లో మూడు పార్టీలు ప్రముఖంగా పోటీలో ఉన్నాయి. ఆ ఎన్నికలను "మహాసంగ్రామం" అని కొన్ని మీడియాలలో వర్ణించారు. ఆ మూడు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, చిరంజీవి - ఈ ముగ్గురూ యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా ఈ పోస్టరులో హాస్యంగా చూపారు. ఈ ఎన్నికల ఫలితాలు మే 16న వెలువడనున్నాయి.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
21వ వారం
గంగిరెద్దును ఆడించే యువకుడు

గంగిరెద్దుల ఆట సంక్రాంతి సమయంలో కనుపించే ఒక గ్రామీణ సాంస్కృతిక కళారూపం మరియు వినోదం. అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. "అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు" అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ ధాన్యం, ధనం వంటి బహుమతులు తీసుకొంటుంటారు.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
22వ వారం
యామినీ రెడ్డి కూచిపూడి నృత్య ప్రదర్శన

కూచిపూడి నృత్యము, భారతీయ నృత్యరీతులలో ఒకటి. కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఉద్భవించినది. ఇక్కడి బొమ్మలో యామినీ రెడ్డి అనే కళాకారిణి నృత్య ప్రదర్శనను చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రమేష్ లల్వాని మరియు చల్లియన్
23వ వారం


రజతాక్షి అనే చిన్న పక్షి

రజతాక్షి (Silvereye లేదా Wax-eye) ఒక చిన్న పక్షి. దీని శాస్త్రీయ నామం Zosterops lateralis. ఇది అధికంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నైఋతి పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఫోటో సౌజన్యం: Brett Donald
24వ వారం
అంపశయ్యపై భీష్ముడు - పర్షియన్ చిత్రం

కురుక్షేత్ర సంగ్రామంలో 10వ రోజు భీష్ముడు ఒరిగిపోయి అంపశయ్యపై విశ్రమించాడు. శ్రీకృష్ణుడు, పాండవులు అతనిని దర్శించుకోవడం ఈ చిత్రంలో చూడవచ్చును. 1760 దశకంలో సంస్కృత కావ్యాలను పర్షియన్ భాషలోకి అనువదించారు. అలాంటి ఒక పుస్తకం "Razmnama" (యుద్ధ గ్రంధం)లోనిది ఈ చిత్రం. ఈ బొమ్మలో ఒక విశేషం ఏమంటే ఇందులో కృష్ణుడు తప్ప మిగిలినవారంతా ఇస్లామిక్ సంప్రదాయపు దుస్తులు, ఆయుధాలు ధరించి ఉన్నారు.

ఫోటో సౌజన్యం: plantcultures నుండి. చిత్రకారుని పేరు తెలియదు. అప్‌లోడ్ చేసినవారు Ranveig
25వ వారం
భక్తప్రహ్లాద సినిమా పోస్టరు

భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ చిత్రము. హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ చిత్రము సెప్టెంబర్ 15, 1931న విడుదలైనది. అప్పుడు ఈ చిత్ర నిర్మాణ వ్యయం 20వేల రూపాయలు.

ఫోటో సౌజన్యం: అప్‌లోడ్ చేసినవారు నవీన్
26వ వారం
భీష్మ ప్రతిజ్ఞ

తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేసిన వృత్తాంతం మహాభారతం ఆదిపర్వంలో వస్తుంది. ఆ సన్నివేశాన్ని రాజా రవివర్మ చిత్రించిన విధం ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: రాజా రవివర్మ చిత్రం, అప్‌లోడ్ చేసినవారు ImpuMozhi
27వ వారం
ప్రపంచ జనాభా పెరుగుదల

ప్రపంచ జనాభా పెరుగుదల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ బొమ్మలో చూడవచ్చును. 1800 నాటికి ప్రపంచ జనాభా ఒక బిలియన్ లోపే ఉంది. తరువాతి బిలియన్ పెరగడానికి 123 సంవత్సరాలు పట్టింది. ఐతే 33 సంవత్సరాలలోనే ఇంకో బిలియన్ పెరిగింది. ఇలా ఉన్నకొద్దీ వేగంగా పెరిగి ప్రస్తుత ప్రపంచ జనాభా 6 బిలియన్లపైనే ఉంది.

ఫోటో సౌజన్యం: Liftarn మరియు El_T
28వ వారం
చిత్రకారుడు సాహిబ్ దీన్. ఉదయపూర్, 1649-53.

రాముని సైన్యం మరియు లంక సైన్యం మధ్య యుద్ధము.

ఫోటో సౌజన్యం: చిత్రకారుడు సాహిబ్ దీన్. ఉదయపూర్, 1649-53. బ్రిటిష్ మ్యూజియం.[1]
29వ వారం
సిస్టైన్ చాపెల్ పైకప్పు

సిస్టైన్ చాపెల్ పైకప్పు, మైఖెల్ ఏంజెలో(1508–1512) నాలుగేండ్ల కాలంలో పూర్తిచేశాడు.

ఫోటో సౌజన్యం: Quadell
30వ వారం
సన్ బర్డ్

సిక్కిం రాష్ట్రీయ పక్షి అయిన సన్ బర్డ్ ను స్థానికంగా అక్కడ "చిలిం" అని అంటారు.

ఫోటో సౌజన్యం: Lip Kee Yap
31వ వారం
ఏకశిలాతోరణం

కాకతీయ రాజు గణపతిదేవుడు కట్టంచిన ఓరుగల్లు కోట లోని శిలాతోరణము

ఫోటో సౌజన్యం: సంతోష్ కొర్తివాడ
32వ వారం
సత్యమూర్తి కార్టూను

భార్య అదుపులో ఉన్న భర్త గురించి సత్యమూర్తి కార్టూను

ఫోటో సౌజన్యం: సత్యమూర్తి మరియు శివా
33వ వారం
"బ్రహ్మరధం" సినిమా పోస్టరు

1947లో విడుదలైన బ్రహ్మరధం సినిమా పోస్టరు. చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బి.జయమ్మ, అద్దంకి శ్రీరామమూర్తి నటించారు.

ఫోటో సౌజన్యం: రూపవాణి 1946 సంచిక
34వ వారం


లాడ్ బజారులో గాజుల దుకాణం

హైదరాబాదు లాడ్ బజారులో ఒక గాజుల దుకాణం లోపలి దృశ్యం

ఫోటో సౌజన్యం: Cephas_405
35వ వారం
సీతారామలక్ష్మణుల వనవాసం

రామాయణం అరణ్యకాండలో సీతారామలక్ష్మణుల వనవాసం వర్ణన ఉంది. 1650 సంవత్సరానికి చెందిన ఈ బొమ్మలో వారి జీవన విధానం చూపారు. సీత పర్ణశాలలో వంట వండడం, రామ లక్ష్మణులకు భోజనం వడ్డించడం, రాముడు యజ్ఞం చేసుకోవడం, లక్ష్మణుడు మాంసం (?) కాల్చడం..

ఫోటో సౌజన్యం: బ్రిటిష్ మ్యూజియం మరియు DIRECTMEDIA Publishing GmbH.
36వ వారం
ముంబాయి మెరైన్ డ్రైవ్ వద్ద వినాయక నిమజ్జకనం

వినాయక చవితి తరువాత 10వ రోజున వినాయకుని విగ్రహాలను నిమజ్జనం చేయడం అనేది పెద్ద సంరంభంతో జరిగే కార్యక్రమం. ముంబాయి మెరైన్ డ్రైవ్ సమీపంలో జరిగే నిమజ్జన కార్యక్రమం ఈ బొమ్మలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: కప్పగంతు శివరామ ప్రసాదు
37వ వారం
1870-71 సంవత్సరానికి చెందిన పంచాంగం ముఖచిత్రం

1870-71 సంవత్సరానికి చెందిన పంచాంగం (హిందూ కేలెండర్) - వస్త్రంమీద అద్దిన రాజస్థాన్ చిత్రం - సిద్ధి బుద్ధి సమేత వినాయకుడు, రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుడు, ఎడమవైపున దశావతారాలు, కుడివైపున జాతక రాసులు చిత్రీకరింపబడినాయి.

ఫోటో సౌజన్యం: [2] & [3]
38వ వారం
తిరుపతి బస్ స్టేషన్

తిరుపతి ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్ స్టేషన్, మరియు దాని పరిసర ప్రాంతాలు. బొమ్మ వెనుక భాగంలో ఏడుకొండలు

ఫోటో సౌజన్యం: కాసుబాబు
39వ వారం
జయదేవ్ కార్టూను

రెండు బొమ్మల మధ్య ఆరు తేడాలను కనిపెట్టమని పత్రికలలో వచ్చే ఫీచర్‌గురించి ప్రముఖ తెలుగు కార్టూనిస్టు జయదేవ్ గీసిన వ్యంగ్య చిత్రం. ఈ బొమ్మలో నిజంగానే ఇద్దరు కవలపిల్లలకు ఆరు తేడాలున్నాయి.

ఫోటో సౌజన్యం: జయదేవ్ మరియు కప్పగంతు శివరామ ప్రసాదు
40వ వారం
ఛాలెంజర్ స్పేస్ షటిల్

నాసా వారి ఛాలెంజర్ స్పేస్ షటిల్ (Shuttle Carrier Aircraft NASA-905 పైన) - జాన్సన్ ఎయిర్ స్పేస్ సెంటర్ మీదుగా కెన్నెడీ స్పేస్ సెంటర్‌కు తిరిగి వస్తుండగా - ఏప్రిల్ 9, 1983 నాటి సినిమా.

ఫోటో సౌజన్యం: Great Images in NASA Description
41వ వారం
సజ్జలు

సజ్జలు ఒక రకమైన చిరుధాన్యము (మిల్లెట్). దీన్ని ఆంగ్లంలో పెర్ల్ మిల్లెట్ అని పిలుస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో సజ్జలను ముఖ్యంగా సంకటి చేయడానికి వాడతారు.

ఫోటో సౌజన్యం: జె. విల్సన్
42వ వారం


తడ జలపాతం

తడ, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. తడకు సమీపంలో వరదయ్యపాలెం వద్ద "ఉబ్బలమడుగు" అనే చోట ఒక జలపాతం ఉంది. ఈ చుట్టుప్రక్కల అడవి ప్రదేశం, ట్రెక్కింగ్‌కు అనువైన దారి, జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.

ఫోటో సౌజన్యం: mckaysavage
43వ వారం


భింభేట్కా చిత్రాలు

మధ్య ప్రదేశ్ నందలి బింబెట్కా అను ప్రదేశములో రాళ్ళమీద చిత్రించిన ఈ చిత్రాలు కొన్ని 9,000 సంవత్సరాలు పురాతనమైనవి. ఇక్కడి గుహలలో లభించిన ఆధారవల్ల భారతదేశంలో లక్ష సంవత్సరాలకు పూర్వమే మానవుల ఆవాసాలున్నట్లు తెలుస్తుంది.

ఫోటో సౌజన్యం: LRBurdak
44వ వారం


1932 బస్సు - డెక్కన్ క్వీన్

1932 నాటి మొదటితరం ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. బస్సు - డెక్కన్ క్వీన్ - విజయవాడ బస్ స్టేషన్‌లో ప్రదర్శనకు పెట్టారు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
45వ వారం


అమరావతి స్తూపంలో పద్మం

ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక బౌద్ధక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో అమరావతి స్తూపం తలమానికం వంటిది. ఆ స్తూపం అంచు ఫలకాలపై పాలరాతిలో చెక్కిన ఈ పద్మాలు ఆనాటి శిల్పుల కళావైదుష్యానికి ప్రతీకలు.

ఫోటో సౌజన్యం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యూజియం మరియు కాసుబాబు
46వ వారం
తక్కెడ

తక్కెడ( త్రాసు, తుల, తరాజు), బరువును తూచే సాధనం.
ఒక సమాంతర దండం (కర్ర) మధ్య పట్టుకొనేందుకు ఒక తాడు ఉండి,
రెండు చివరల రెండు పళ్ళాలు వేళ్ళాడుతుంటాయి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
47వ వారం
ఛార్మినార్ నుండి హైదరాబాదు నగరం దృశ్య

ఛార్మినార్ పైనుండి హైదరాబాదు నగరం దృశ్యం. చిత్రంలో కనుపించే పెద్ద భవనం యునాని ఆసుపత్రి.

ఫోటో సౌజన్యం: jaroslavd
48వ వారం
పాకాల చెరువు

పొగళ్ళపల్లి వద్ద పాకాల చెరువు. 30చదరపు కి.మీ.ల ఈ చెరువు క్రీ.శ.1213 లో కాకతీయ రాజు గణపతి దేవునిచే తవ్వించబడింది. నర్సంపేట పట్టణానికి 12కి మీ దూరంలో నున్న ఈ సరస్సు, చుట్టుప్రక్కల ఉన్న అభయారణ్యం చాలా అందమైనవి.

ఫోటో సౌజన్యం: aloshbennett
49వ వారం
విస్సన్నపేట సెంటర్

విస్సన్నపేట సెంటర్ - విస్సన్నపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
50వ వారం
ఏలూరు ఇంజినీరింగ్ కాలేజి లైబ్రరీ

సర్ సి. ఆర్. రెడ్డి ఇంజినీరింగ్ కాలేజి గ్రంధాలయం - ఈ కాలేజి ఏలూరు పట్టణం సమీపంలో వట్లూరు గ్రామం పరిధిలో ఉంది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
51వ వారం
ఇండియా గేట్

భారత దేశపు రాజధాని క్రొత్త ఢిల్లీ నగరంలో ఉన్న చూడచక్కని ప్రదేశాలలో ఒకటైన ఇండియా గేట్ 9 దశాబ్దాల క్రితం మొదటి ప్రపంచ యుద్ధంలో మరియు అఫ్ఘన్ యుద్ధంలో అమరులైన 90 వేల యుద్ధజవానుల స్మృత్యర్థం నిర్మించిన అపురూప కట్టడం.

ఫోటో సౌజన్యం: Shashwat Nagpal
52వ వారం
చిన్న తిరుపతి బోర్డు

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలను "చిన్న తిరుపతి" అని కూడా అంటారు. హిందువులకు ఆవు పూజనీయం. తెలుగువారికి వెంకటేశ్వరుడు కులదైవం.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
53వ వారం
అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం.

ఫోటో సౌజన్యం: విశ్వనాథ్