జిక్కి
జిక్కి అని ముద్దుగా పిలుచుకునే పి.జి.కృష్ణవేణి (నవంబరు 3, 1938 - ఆగష్టు 16, 2004) తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. మూడు దశాబ్దాల పాటు పదివేలకు పైగా పాటలు పాడారు. చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో జన్మించిన జిక్కి ఏ సంగీత శిక్షణ లేక పోయినా వినికిడి జ్ఞానంతో పాడటం నేర్చుకొన్నది. జిక్కి తండ్రి మద్రాసులో స్టూడియోలో చిన్నాచితక పనులు చేస్తుంటే ఆమె ఎప్పుడైనా వెళ్లినపుడు అదంతా తిరిగేది. అలా తిరుగుతున్నపుడు చూసిన దర్శకులు గూడవల్లి రామబ్రహ్మం, పంతులమ్మ (1943) సినిమాలో చిన్నవేషంతో పాటు పాట పాడే అవకాశం కల్పించారు. జిక్కి గాయకుడైన ఏ.ఎమ్.రాజాను ప్రేమవివాహం చేసుకున్నది. వీరికి ఆరుగురు సంతానం. అరవయ్యేళ్లు దాటాక కూడా ఆమె ఆదిత్య 369 సినిమాలో జాణవులే... అనే పాట పాడి తన గొంతులో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించారు
జిక్కి | |
---|---|
![]() | |
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | పి.జి.కృష్ణవేణి |
జననం | నవంబరు 3, 1937 చంద్రగిరి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
మరణం | ఆగష్టు 16, 2004ఆగస్టు 16, 2004 (వయస్సు 68) |
వృత్తి | నేపధ్య గాయని |
క్రియాశీల కాలం | 1938-2004 |
ప్రాచుర్యం పొందిన గీతాలుసవరించు
- వద్దురా కన్నయ్యా! ఈ పొద్దు ఇలు వదలి పోవద్దురా అయ్యా
- జీవితమే సఫలము... ప్రేమకథా మధురము
- 'ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా'
- 'పందిట్లో పెళ్లవుతున్నాదీ,'
- పులకించని మది పులకించు లాంటి పాటలు
చిత్ర సమాహారంసవరించు
బయటి లంకెలుసవరించు
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జిక్కి పేజీ https://www.youtube.com/watch?v=dbRDTW7Dhr4 https://www.youtube.com/watch?v=iacPOtTuXp8