2023 ఆసియా కప్
తేదీలు2023 ఆగస్టు 30 – 2023సెప్టెంబరు 17
నిర్వాహకులుఏసియన్ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లుగ్రూప్ స్థాయి, ఫైనల్
ఆతిథ్యం ఇచ్చేవారు Pakistan
 Sri Lanka
ఛాంపియన్లు India
పాల్గొన్నవారు6
ఆడిన మ్యాచ్‌లు13
2022
2025

2023 ఆసియా కప్ ఆసియా దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే 16 వ క్రికెట్ టోర్నమెంటు. ఈ పోటీల్లో మ్యాచ్‌లు వన్డే ఇంటర్నేషనల్స్ (ODIలు)గా ఆడతారు. దీనికి పాకిస్తాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తాయి. [1] ఈ పోటీల్లో 6 జట్లు ఆడతాయి. [2] ఇది 2023 ఆగస్టు, సెప్టెంబరుల్లో జరగనుంది [3] ఈ పోటీల్లో శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్. [4] ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఆతిథ్యమిస్తున్న మొదటి ఆసియా కప్ ఇది. ఈ పోటీల్లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా, మిగిలిన తొమ్మిది మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. [5]

ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లోని ఐదు పూర్తి కాల సభ్యదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా, పాకిస్థాన్, శ్రీలంకలు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటాయి. 2023 ACC పురుషుల ప్రీమియర్ కప్‌ను గెలుచుకోవడానికి అర్హత సాధించిన నేపాల్ కూడా ఈ పోటీల్లో ఆడనుంది. నేపాల్ తొలిసారిగా అర్హత సాధించడం ద్వారా ACC ఆసియా కప్‌లో ఆడనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) 2023, 2024 లలో జరిగే పోటీల విషయమై 2023 జనవరిలో క్యాలెండర్‌ను ప్రకటించింది, [6] [7] అప్పుడే అది ఈ టోర్నమెంటు తేదీలను, ఆకృతినీ ధృవీకరించింది. [8] వాస్తవానికి, ఈ టోర్నమెంటు 2021లో జరగాల్సి ఉంది. అయితే COVID-19 మహమ్మారి కారణంగా 2023కి వాయిదా పడింది.

నేపథ్యం మార్చు

2020 జూన్‌లో, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB), ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC)తో సమావేశమైన తరువాత, భారతదేశం పాకిస్తాన్‌కు వెళ్లడానికి ఇష్టపడని నేపథ్యంలో, 2020 ఆసియా కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇచ్చే విషయమై తాము ఒప్పుకుంటున్నట్లు తెలిపింది, [9] [10] "COVID-19 మహమ్మారి ప్రభావం, పర్యవసానాల దృష్ట్యా, 2020 ఆసియా కప్ కోసం వివిధ వేదికల గురించి చర్చించబడ్డాయి, నిర్ణీత సమయంలో తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు" సమావేశం తరువాత ACC ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది. [11] 2020 జూలైలో ఈ పోటీల వాయిదాకు సంబంధించి ఎసిసి అధికారిక ప్రకటన చేసింది. [12] 2020 లో జరగాల్సిన పోటీలు, 2021 జూన్ లో శ్రీలంకలో జరిగేలా షెడ్యూలు మార్చారు. [13]

2021 మార్చిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ పోటీ జూన్‌లో జరగనుంది. దాంతో జూన్ లోనే తలపెట్టిన ఈ టోర్నమెంటు మరింత వాయిదా పడే ప్రమాదం ఏర్పడింది. [14] టోర్నమెంట్ మరోసారి 2023కి వాయిదా పడింది [15] 2021 మేలో ఎసిసి, 2021 టోర్నమెంటును 2023 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర క్రికెట్ ఈవెంట్‌ల షెడ్యూల్‌పై COVID-19 వలన ఏర్పడిన నిరంతర ప్రభావం కారణంగా టోర్నమెంటును జరపడం కష్టమని పేర్కొంది. [16] [17] 2022 ఎడిషన్‌కు ఆతిథ్యం ఇచ్చే హక్కులను నిలుపుకున్న తర్వాత 2022 ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. [18] అయితే, 2021 అక్టోబరులో, ఎసిసితో సమావేశం తరువాత, రమీజ్ రాజా, 2023 టోర్నమెంటుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుందని, 2022 పోటీలకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తుందనీ ధృవీకరించాడు. [19]

2022 అక్టోబరులో, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) కార్యదర్శి, ఎసిసి ప్రెసిడెంటు అయిన జయ్ షా మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారతదేశం పాకిస్తాన్‌కు వెళ్లదని చెప్పాడు.[20] పాకిస్థాన్‌ను ముందుగా ఆతిథ్య దేశంగా ధృవీకరించినప్పటికీ, "2023 ఆసియా కప్ తటస్థ వేదికపై జరుగుతుంది" అని పేర్కొన్నాడు.[21] ఈ ప్రకటనకు సమాధానంగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) "ఈ ముఖ్యమైన, సున్నితమైన విషయం" గురించి చర్చించడానికి ACC బోర్డు అత్యవసర సమావేశం జరపాలని అభ్యర్థించింది. ఈ ప్రకటన వలన 2023 CWC, 2024-2031 సైకిల్‌లో భారతదేశంలో జరిగే ఇతర ICC ఈవెంట్‌లలో పాకిస్తాన్ పాల్గొనడంపై ప్రభావం ఉంటుందని పిసిబి తెలిపింది. [22]

2022 డిసెంబరులో అప్పటి పిసిబి ఛైర్మన్ రమీజ్ రాజా, పాకిస్తాన్‌లో ఆడడానికి భారతదేశం ఇష్టపడని కారణంగా తమ ఆతిథ్య హక్కులను ఉపసంహరిస్తే పాకిస్తాన్, ఈ టోర్నమెంటు నుండి వైదొలగే విషయాన్ని పరిశీలిస్తుందని చెప్పాడు.[23] అయితే, 2023 జనవరిలో, టోర్నమెంటులో పాల్గొనే జట్లు, గ్రూపులను ఎసిసి ధృవీకరించింది. దాని ప్రకారం భారత, పాకిస్తాన్‌లు రెండూ పాల్గొంటాయి. [24]

2023 మార్చిలో, పాకిస్తాన్ ఆతిథ్య దేశంగానే ఉంటుందని ప్రతిపాదించారు. కనీసం రెండు భారత్-పాకిస్తాన్ పోటీలతో సహా, భారత్ ఆడే మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయని ఆడాలని చెబుతూ, ఆ వేదిక ఏదో ధృవీకరించలేదు. [25] పాకిస్థాన్ ప్రతిపాదించిన హైబ్రిడ్ నమూనాను శ్రీలంక, బంగ్లాదేశ్‌లు తిరస్కరించాయి.[26] దీనిపై స్పందించిన పీసీబీ చైర్మన్ నజామ్ సేథీ రెండు ప్రత్యామ్నాయాలను ప్రతిపాదించాడు. మొదటిది, భారతదేశం తమ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికలో ఆడటం, మిగిలిన జట్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం. రెండవది, గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరపాలి. రెండవ దశలో భారత జట్టు ఆడే మ్యాచ్‌లూ, ఆ తర్వాత ఫైనల్‌తో సహా తదుపరి దశ మ్యాచ్‌లూ అన్నీ తటస్థ వేదికలో జరపాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఈ రెండో ప్రత్యామ్నాయానికి అంగీకరించాయి. [27]


2023 ఆసియా కప్ ఆసియా దేశాల క్రికెట్ జట్ల మధ్య జరిగే 16 వ క్రికెట్ టోర్నమెంటు. ఈ పోటీల్లో మ్యాచ్‌లు వన్డే ఇంటర్నేషనల్‌ల రూపంలో ఆడతారు. దీనికి పాకిస్తాన్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి.[28] ఈ పోటీల్లో 6 జట్లు ఆడతాయి.[2] ఇది 2023 ఆగస్టు, సెప్టెంబరుల్లో జరగనుంది [29] ఈ పోటీల్లో శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్.[30] ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఆతిథ్యమిస్తున్న మొదటి ఆసియా కప్ ఇది. ఈ పోటీల్లో నాలుగు మ్యాచ్‌లు పాకిస్థాన్‌లో జరగనుండగా, మిగిలిన తొమ్మిది శ్రీలంకలో జరుగుతాయి. [31]

విజేత మార్చు

2023 ఆసియా కప్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ 2023 సెప్టెంబరు 17న కొలంబోలో జరగగా[32] భారత్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఎనిమిదో టైటిల్‌ను గెలుచుకుంది.[33] శ్రీలంక డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది.[34]

ఫార్మాట్ మార్చు

టోర్నమెంటు లోని గ్రూపులు, ఫార్మాట్ లను 2023 జనవరి 9 న ప్రకటించారు. ఆరు జట్లను మూడు గ్రూపులుగా విభజించారు.[35] మొత్తం 13 మ్యాచ్‌లలో ఆరు లీగ్ మ్యాచ్‌లు, ఆరు సూపర్ 4 మ్యాచ్‌లు, ఒక ఫైనల్ ఉన్నాయి. [36] క్వాలిఫయర్ ఈవెంట్ (2023 ACC పురుషుల ప్రీమియర్ కప్) ఛాంపియన్‌గా నిలిచిన భారతదేశం, పాకిస్థాన్, నేపాల్ లు గ్రూప్ Aలోను, డిఫెండింగ్ ఛాంపియన్‌ శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లు గ్రూప్ Bలోనూ ఉన్నాయి.[37] ప్రతి గ్రూపు లోనూ మొదటి రెండు జట్లు సూపర్ 4కి చేరుకుంటాయి. అక్కడ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్‌లో తలపడతాయి. [38]

పాకిస్తాన్, భారతదేశం A1 & A2 సీడ్‌లుగా ఉండగా, బంగ్లాదేశ్, శ్రీలంకలు B1 & B2 గా ఉన్నాయి. ఒకవేళ నేపాల్, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తే, వారు నాకౌట్ అయిన జట్టు (గ్రూప్ Aలో పాకిస్థాన్ లేదా భారత్, గ్రూప్ Bలో శ్రీలంక లేదా బంగ్లాదేశ్) స్లాట్‌ను తీసుకుంటాయి. [39] [40]

జట్లు మార్చు

  ఆఫ్ఘనిస్తాన్   బంగ్లాదేశ్[41]   భారతదేశం   నేపాల్   పాకిస్తాన్[42]   శ్రీలంక
  Pakistan

  Sri Lanka

లాహోర్ ముల్తాన్ కొలంబో క్యాండీ
గడ్డాఫీ స్టేడియం ముల్తాన్ క్రికెట్ స్టేడియం ఆర్ ప్రేమదాస స్టేడియం పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం
సామర్థ్యం: 27,000[43] సామర్థ్యం: 30,000[44] సామర్థ్యం: 35,000 సామర్థ్యం: 35,000
మ్యాచ్‌లు: 3 మ్యాచ్‌లు: 1 మ్యాచ్‌లు: 6 మ్యాచ్‌లు: 3
       

 

 

 


మూలాలు మార్చు

  1. "Asia Cup 2023 dates: Matches start on August 31; Four in Pakistan, nine in Sri Lanka". SportStar (in ఇంగ్లీష్). Retrieved 15 June 2023.
  2. 2.0 2.1 "Asia Cup 2023: 50-over format tournament in September; India-Pakistan in same group". The Indian Express (in ఇంగ్లీష్). 5 January 2023. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  3. "Asia Cup to be held in September before ODI World Cup, confirms ACC chairman Jay Shah". WION. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  4. "Brilliant Sri Lanka clinch Asia Cup 2022 title". International Cricket Council (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  5. "Four Asia Cup matches in Pakistan; remaining nine in Sri Lanka". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-06-15.
  6. "Asian Cricket Council announces new pathway structure and calendar for 2023 & 2024". Asian Cricket Council (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  7. "Asia Cup 2023 | Asia Cup News | Asia Cup Schedule 2023 | Asia Cup Hybrid Model - cricfr". www.cricfr.com. Retrieved 2023-05-25.
  8. "ACC announces Asia Cup schedule". The Daily Observer. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  9. "Asia Cup likely in Sri Lanka; PCB offers SLC to swap hosting rights". ESPNcricinfo. Archived from the original on 12 June 2020. Retrieved 12 June 2020.
  10. "Sri Lanka Cricket Offers To Host Asia Cup 2020 Edition". Cricket Addictor. 9 June 2020. Archived from the original on 10 June 2020. Retrieved 10 June 2020.
  11. "Pakistan gave us green light to host 2020 Asia Cup: SLC chief Shammi Silva". Gulf News. 9 June 2020. Archived from the original on 9 June 2020. Retrieved 10 June 2020.
  12. "Asia Cup 2020 postponed". The Daily Star. 9 July 2020. Archived from the original on 9 July 2020. Retrieved 9 July 2020.
  13. "Asia Cup postponed to 2022". The News. Archived from the original on 11 April 2021. Retrieved 12 April 2021.
  14. "Asia Cup to be postponed if India reach final of World Test Championship: PCB". Times of India. 28 February 2021. Retrieved 28 February 2021.
  15. "Asia Cup postponed once again". CricBuzz. 23 May 2021. Archived from the original on 23 May 2021.
  16. "Cricket tournament: 2021 Asia Cup postponed to 2023 due to packed schedule". Business Standard (in ఇంగ్లీష్). 23 May 2021. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  17. "2021 Edition of the Asia Cup to be postponed". Asian Cricket Council. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  18. "Asia Cup 2021 to be postponed amid hectic cricket calendar". ESPNcricinfo. Archived from the original on 24 May 2021. Retrieved 24 May 2021.
  19. "Asia Cup 2023 to be played in Pakistan, confirms PCB chief Ramiz Raja". Wion News. Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  20. "India won't travel to Pakistan for 2023 Asia Cup". ESPNcricinfo. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  21. "India won't visit Pakistan for Asia Cup 2023, neutral venue not unprecedented: BCCI secretary". Dawn (in ఇంగ్లీష్). 18 October 2022. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  22. "Jay Shah statement could 'impact Pakistan's visit to India' for 2023 ODI World Cup, says PCB". ESPNcricinfo. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  23. "PCB could pull out of 2023 Asia Cup if tournament is moved out of Pakistan". ESPNcricinfo. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  24. "Najam Sethi takes a dig at Jay Shah for 'unilaterally presenting' Asian Cricket Council calendar for 2023-2024". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  25. "2023 Asia Cup likely in Pakistan and one other overseas venue for India games". ESPNcricinfo (in ఇంగ్లీష్). Archived from the original on 24 March 2023. Retrieved 2023-03-24.
  26. "Asia Cup 2023: Sri Lanka, Bangladesh give thumbs down to PCB's hybrid hosting model".
  27. "Blow to India: Sri Lanka, Bangladesh back Pakistan's hybrid proposal on Asia Cup 2023". Geo News (in ఇంగ్లీష్). 16 May 2023. Retrieved 19 May 2023.
  28. "Asia Cup 2023 dates: Matches start on August 31; Four in Pakistan, nine in Sri Lanka". SportStar (in ఇంగ్లీష్). Retrieved 15 June 2023.
  29. "Asia Cup to be held in September before ODI World Cup, confirms ACC chairman Jay Shah". WION. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  30. "Brilliant Sri Lanka clinch Asia Cup 2022 title". International Cricket Council (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  31. "Four Asia Cup matches in Pakistan; remaining nine in Sri Lanka". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-06-15.
  32. "Asia Cup 2023 to kick off on August 30; India-Pakistan on September 2 in Kandy". ESPNcricinfo (in ఇంగ్లీష్). 19 July 2023. Retrieved 17 August 2023.
  33. "Siraj's brutal spell blows Sri Lanka away as India lift 8th Asia Cup title". Retrieved 17 September 2023.
  34. "Brilliant Sri Lanka clinch Asia Cup 2022 title". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 17 August 2023.
  35. "Groups and format announced for Men's Asia Cup 2023". ThePapare (in అమెరికన్ ఇంగ్లీష్). 5 January 2023. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  36. "Asia Cup 2023 cricket groups announced: Will India, Pakistan face each other in September?". Khaleej Times (in ఇంగ్లీష్). Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  37. "Asia Cup Cricket: Bangladesh grouped with Sri Lanka, Afghanistan". The Daily Observer. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  38. "India, Pakistan placed in same group at 2023 Asia Cup". The Business Standard (in ఇంగ్లీష్). 2023-01-05. Archived from the original on 6 January 2023. Retrieved 2023-01-06.
  39. "Pakistan vs India set for September 2 in Kandy in Asia Cup". ESPNcricinfo. Retrieved 19 July 2023.
  40. "Multan & Lahore Cricket Stadium will be hosted 4 matches scheduled in Pakistan & Rest will be played in Srilanka (Colombo & Kandy Cricket Stadiums)". cricinfo. Retrieved 6 August 2023.
  41. "Tanzid and Naim step up as Bangladesh look to the future with Asia Cup squad". ESPN Cricinfo. Retrieved 12 August 2023.
  42. "Faheem Ashraf in, Shan Masood out as Pakistan name 18 for Asia Cup and Afghanistan ODIs". ESPN Cricinfo. Retrieved 9 August 2023.
  43. "PCB team to visit Bugti Stadium next week". Pakistan Cricket Board. 10 January 2014. Retrieved 20 July 2019.
  44. "Multan Cricket Stadium | Pakistan | Cricket Grounds | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 1 November 2022.