రాయలసీమ సంస్కృతి
రాయలసీమ విజయనగర సామ్రాజ్యంలో భాగంగా శ్రీ కృష్ణదేవ రాయలచే పరిపాలించబడింది. అది వరకూ తూర్పు చాళుక్యుల పరిపాలనా కేంద్రంగా హిరణ్యక రాష్ట్రంగా ఈ ప్రాంతం విలసిల్లినది. తర్వాత రాయలసీమ పై చోళుల ప్రభావం పెరిగింది. తెలంగాణ, కోస్తా ప్రాంతాలతో పోలిస్తే రాయలసీమ వైశాల్యంలో చిన్నదైననూ తెలుగు,తమిళం, కన్నడ, ఉర్దూ కళల్లో, సంస్కృతుల్లో, సాహిత్యంలో ఈ ప్రాంతం యొక్క ప్రభావం బహు అధికం.
సాహిత్యం
మార్చువిజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి అయిన శ్రీ కృష్ణదేవ రాయలు హయాంలో ఈ ప్రాంతపు సంస్కృతి చాలా ఉన్నతి చెందినది. అష్టదిగ్గజాలలో ఐదు మంది (అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, కందుకూరి రుద్రకవి (మాదయ్యగారి మల్లన), అయ్యలరాజు రామభధ్రుడు) ఈ ప్రాంతం వారే.
కడప జిల్లాకి చెందిన యోగి వేమన, బ్రహ్మం గారు తమ రచనల ద్వారా సామాన్య ప్రజానీకాన్ని విద్యావంతులని చేయటానికి ఎంతో కృషి చేశారు. శ్రీమద్భాగవతముని రచించిన పోతనామాత్యుడు కూడా ఒంటిమిట్ట లోనే జన్మించాడన్న అభిప్రాయం ఉంది.
బళ్ళారి రాఘవ, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, కోలాచలం శ్రీనివాసరావు వంటి రంగస్థల ప్రముఖులను అందించిన బళ్ళారి ప్రదేశానికి గొప్ప చరిత్ర గలదు. బళ్ళారి లోని రాఘవ కళా మందిర్ బళ్ళారి రాఘవ పేరు పై స్థాపించినదే.
తత్త్వవేత్తలు, ఆధ్యాత్మిక గురువులు అయిన జిడ్డు కృష్ణమూర్తి, కట్టమంచి రామలింగారెడ్డి చిత్తూరుకి చెందినవారు.
చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన పలు ఉర్దూ రచయితలు ఉర్దూ సాహ్యిత్యానికి సేవ చేశారు.
సంగీతం
మార్చుబ్రాహ్మణ కులంలో కేవలం రాయలసీమ ప్రాంతానికి మాత్రం పరిమితమైనది ములకనాడు బ్రాహ్మణ ఉపకులం. ఈ కులానికి చెందిన త్యాగరాజు కాకర్ల (అర్ధవీడు)కి చెందినవాడు. ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లా ఉన్ననూ ఒకానొక గానంలో ఈయన పూర్వీకులు రాయలసీమకి చెందినవారని తానే స్వయంగా చెప్పుకొన్నారు.
వాగ్గేయకారుడైన అన్నమయ్య కడప జిల్లాకి చెందిన తాళ్ళపాకకి చెందినవాడు.
తరిగొండ నరసింహ స్వామి పై, వెంకటేశ్వర స్వామి పై అనేక గీతాలని రచించిన వెంగమాంబ తిరుపతి వద్దనున్న తరిగొండకి చెందినది.
ప్రముఖ సంగీతకారుడు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ అనంతపురానికి చెందినవాడు.
ప్రముఖ సంగీతకారుడు (, వైద్యుడు) అయిన శ్రీపాద పినాకపాణి జన్మత: శ్రీకాకుళం జిల్లాకి చెందినవారైననూ, కర్నూలులో స్థిర పడ్డారు.
పుణ్యక్షేత్రాలు
మార్చు- తిరుమల వెంకటేశ్వరాలయం
- శ్రీశైలం శివాలయం
- అహోబిళం నరసింహాలయం
- శ్రీ కాళహస్తి శివాలయం
- మహానంది శివాలయం
- యాగంటి శివాలయం
- మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆలయం
- పుట్టపర్తి సత్య సాయి బాబా ఆలయం
- కాణిపాకం విఘ్నేశ్వరాలయం
- కదిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం
- కసాపురం,మురిడి, నేమకల్లు ఆంజనేయస్వామి ఆలయాలు
- లేపాక్షి నందీశ్వరాలయం
- ఒంటిమిట్ట
- పుష్పగిరి
- తాళ్ళపాక
- తాడిపత్రి
- గండి
ఆధ్యాత్మిక గురువులు
మార్చుభాష
మార్చుకర్నూలు పట్టణంలో వాడే భాష పైన మహబూబ్ నగర్ ప్రభావం ఉంటుంది. జిల్లాలోని మిగతా ప్రదేశాలలో భాష, కడప, అనంతపురం లలో వాడే భాష ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. చిత్తూరు భాష పూర్తిగా వేరుగా ఉంటుంది. పడమర భాగం పైన కన్నడ, తూర్పు భాగం పైన తమిళం ల ప్రభావం చిత్తూరు పైన చాల ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మధ్యన ఉండటం వలన వైఎస్ఆర్ జిల్లా లోని దక్షిణ భాగం పైన చిత్తూరు ప్రభావం, ఉత్తర భాగం పైన కర్నూలు ప్రభావం, తూర్పు భాగం పైన నెల్లూరు ప్రభావం, పడమటి భాగం పైన అనంతపురం ప్రభావం ఉంటాయి. అనంతపురం జిల్లా పైన కర్ణాటక ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
కర్నూలు
మార్చు- గోడంబి = జీడిపప్పు
- జేజి=నాయన్నమ్మ
- జేజి నాయన=నాన్నకు నాన్న
- బుడ్డలు = వేరుశెనగ
- చల్ల ముద్ద = నిశ్చితార్థం (రాగి ముద్దలు పూజిస్తారు)
- మలిబెండ్లి = పెళ్ళి తర్వాత జరిగే రిసెప్షన్ (తొలి పెళ్ళి, మలి పెళ్ళి)
- మెరవని = పెళ్ళిలో జరిగే ఊరేగింపు
- దుడ్లు, లెక్క = డబ్బు (గ్రామ్యం)
- జంపు = పొడుగు
- మోడం = మబ్బులు, మేఘాలు
- మబ్బు = చీకటి, మూర్ఛ
- ముసర = మెతుకులు
- బేస్త వారం=గురువారం
- మజ్జు = బద్ధకం
- జాస్తి = ఎక్కువ (కన్నడ ప్రభావం, నాస్తికి వ్యతిరేకం)
- దొబ్బు = త్రోయుట
- ఉల్లిగడ్డ = ఉల్లి
- వెల్లిపాయ = వెల్లుల్లి
- పాలెగాడు = మొనగాడు
- మాదిరి, లెక్క = లాగా
- పైటాల = మధ్యాహ్నం
- వారకు = మూలకు
- మాపటి = మరుసటి రోజు
- జాలాడి = స్నానపు గది
- కొట్టిడిల్లు = ఇంట్లో కిటికీలు లేని ఒకే తలుపు ఉన్న చాలా చిన్న గది
- తపేళ = ఒక రకమైన చెంబు
- గుత్త = కౌలు
- గడం = ?
- గవాక్షి = ఇంటి పై ఉండె కిటికి లాంటిది
- దోని = నీళ్ళు నిలువ ఉంచుకునేందుకు కట్టిన తొట్టి
- మిద్దె = డాబా
- గాడిపాడు = pasuvulanu katti vunchadaaniki vaade rathi palaka
- బెరీన=తొందరగ
- సారికి/జాంకులు = మాటిమాటికి
- పొద్దుమూకులు
- రిమ్మ
- రిల్ల
- యవ్వారం = వ్యవహారం, ముచ్చట్లు
- సద్ది పండగ
- తళువాలు = తలంబ్రాలు
- లోట = గ్లాసు
- తళ్ళె = కంచం
- వల్లె = తువ్వాలు
- దంటు = చొప్ప దంటు
- బాణాలు = టపాకులు
- పుస్తెలు
- చిత్రాన్నం = పులిహోర (నిమ్మపులుసుతో చేసేది)
- బ్యాళ్ళు/బ్యాడలు = పప్పు
- తునకలు = ముక్కలు
- పొటుకు
- నవ్వార = Mancham ku vaade ribbon
- నేలమాళిగ = underground house
- వాంతికి = వాంతులు
- బేదులు = విరేచనాలు
- వాకిలి = తలుపు
- పుండుకూర = గోంగూర
- ఆతిరాన = అరిశెలు
- బిర్రుగా = గట్టిగా (Tight గా)
- పై = ఒళ్ళు
- తుళువ = అల్లరి
- గోము = మారాం
- జోరిగా = Joreega ante ado rakamaina purugu eppudu Jhummm ani arusthu vuntundi. Jorugaa ante chaala ekkuvagaa
- పుర్ర చేయి
- లొడ్డ చేయి = ఎడమ చేయి
- పాయం
- మొర్సు
- బుడకడం
- జోము పట్టడం
- తాట్ పారం
- అనా? - అవునా?
భాషా ప్రయోగం
మార్చు- గ్రామాలలో 'స్త' 'చ్చ' గా మారుతుంది. ఉదా: వస్తా -> వచ్చా
- భూతకాలంలో య ఒత్తు చేరుతుంది. ఉదా: చేసి ఉండినారు -> చేసిన్యారు
కడప
మార్చు- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనక్కాయలు = వేరుశెనగ
- అబ్బ = నాన్నకు తండ్రి
- అబ్బి = అబ్బాయి
- అమ్మి = అమ్మాయి
- తాపలు = మెట్లు
- మెట్లు = చెప్పులు
- యోవ్ = అయ్యా ఓ (అయ్యోవ్)
- మ్మోవ్ = అమ్మా ఓ (అమ్మోవ్)
- జంపు = పొడవు
- బరగొడ్లు = పశువులు (ప్రత్యేకించి గేదెలు)
- ఎర్ర గడ్డలు = ఉల్లి పాయలు
- తెల్ల గడ్డలు = వెల్లుల్లి
- ఒక్క తూరి = ఒక్క సారి
- కళింగర కాయ = పుచ్చకాయ
- దోసకాయ = కర్బూజా/కీరకాయ
భాషా ప్రయోగం
మార్చు- ప్రశ్న రూపం మారుతుంది. ఉదా: వచ్చినావా? -> వచ్చినావ్?
- వెయ్యటంలో 'వ' బదులు 'బ' వస్తుంది. ఉదా: బెయ్ (వెయ్), బేస్కో (వేస్కో)
అనంతపురం
మార్చు- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనగ గింజలు=వేరుశెనగ
- తిరిగింపు = పెళ్ళిలో జరిగే ఊరేగింపు
- తిక్కటం = రుద్దటం
- పోగొట్టుక పోయింది = కనిపించట్లేదు
- ఏమేం (అర్థం కాదు)= ఏమియు (అర్థం కాదు)
- అప్పా = అయ్యా
- చిక్కటం = దొరకటం
- కట్ల = లాగా
- విన్నూరు = రెండు వందలు (కన్నడలో కూడా ఇలానే ఉపయోగిస్తారు, వ్యావహారికం: ఇన్నూరు)
(శ్ర్రీ ఎం.కే. పాండురంగారావు, హిందూపురం, అనంతపురం జిల్లా గారి సౌజన్యంతో)
- అంతలక్కల = అన్ని చోట్ల
- మల్యాడు = తచ్చాడు, తిరుగు
- ఆసంది, ఈసంది = అక్కడ, ఇక్కడ
- జంపనా = పొడవుగా, నేరుగా
- ఇసయం = విషయం
- గడ్డకురా = బయటకు రా
- ఎల్లబారు =బయలుదేరు (ఎలబారు)
- గసలు = ఇబ్బందులు
- హటాలు = సరిహద్దులు (భూముల)
- ఎల్లాకు = అంతయూ
- తొక్కులాడు = ఆందోళన చెందు (ఇదే పదం కర్నూలులో కూడా ఉంది)
- ఊనప్పా = విషయం నిజమే సుమా
- యాతాకి, యాడికి = ఎక్కడికి
- సలపాగ = పలుచగా
- గొంటు, లెక్క, దుడ్డు = సొమ్ము, డబ్బు
- తక్కు = అబద్ధం
- మోదండంగా = వాస్తవాలు పూర్తిగా తెలియకుండా
- ఇలేవారీగా = విడమరిచిన విధంగా
- కుసిద్దము = దురాలోచన
- నలిబడా = చక్కగా
- అడ్డరువులు = వ్యతిరేక సలహాలు
- కుసాలుగా ఉందా? = తమాషాగా ఉందా?
- పార్రా (పార్రి+రా) = పదండర్రా, పరుగెత్తరా
- గూడ్కా, గుడక = కూడా (ఇది కర్నూలులో కుడా వినియోగిస్తారు)
- పొదూతునా అసడ్డాలే = విరామం లేకుండా అవాంతరాలే
- రచ్చు కురుత్తా వుంది = జనసందోహం అధికంగా ఉంది (సంతలో)
- పొగెగురుతా ఉంది = ప్రజలు సమృద్ధిగా జీవిస్తున్నారు
- మోపవడం = అతిగా ప్రవర్తించడం
- గోజు పెట్టుకుంటా వుండాడు = చాదస్తం పెంచుకుంటున్నాడు
భాషా ప్రయోగం
మార్చు- రాకుండా, లేకుండా, పోకుండా లలో 'కో' చేరుతుంది. ఉదా: రాకోకుండా, లేకోకుండా, పోకోకుండా
చిత్తూరు
మార్చు- ముంతమామిడి పప్పు = జీడిపప్పు
- చెనిక్కాయలు = వేరుశెనగ
- దారపోయింది = కనిపించట్లేదు
- పూడవటం = పోవటం
- కాలు = పావు
- ముక్కాలు = ముప్పావు
- జల్జారు = స్నానాల గది
- కిండలు = తమాషా
- అబ్బియ్య = అబ్బాయి
- అమాయా = అమ్మాయీ
- అబాయా = అబ్బాయీ
- నాయిన =నాన్న !
- యాంది = ఏమిటి
- గోయిందా =గోవిందా
- వైద్దిగం = వైద్యం
- తిరపతి (తిరప్తి)= తిరుపతి
- సిత్తూరు = చిత్తూరు
- కాలాస్త్రి = శ్రీ కాళహస్తి
- ఆయమ = ఆమె
- మునక్కాయ = ములక్కాడ !
- గొయాకాయ = జామకాయ
- ఆడికి = అక్కడికి
- యాడికి = ఎక్కడికి
- ఈడకి = ఇక్కడికి
- ఈడికి = వీడికి
- సుక్కురారం = శుక్రవారం
- సనారం = శనివారం
- అన్ని రోజులూ ఇంతే
- అట్నేలే = ఆవిధంగానేలే
- ఇట్రారా = ఇటు రారా
- ఎంకటేసర సామి = శ్రీ వేంకటేశ్వర స్వామి
- నా (రా)యినా = నారాయణా
- దాపటెద్దు = మడకకి కుడి వైపునున్న ఎద్దు
- ఎలపటెద్దు = అదే మడకకి ఎడమ వైపునున్న ఎద్దు
పిల్లకాయ, కుంక,= బాలుడు పిలగోడు, పిల్లోల్లు= పిల్లలు జల్లి = అబద్దము ఎసరు సేమిరి సంగటి కొరివి దండెం పొగ్గూడు సాచ్చుక్క కొట్టము గొడ్డు గోకుడుబెల్లం నక్కిళ్ళు వరంటు ఊరిబిండి ఊదర నెల్లికాయ చనిక్కాయలు రాగులు, ఉద్దులు ఉలవలు మడవలి ఉబ్బ సౌడు చలువ పడిశము జెరము దుక్కి,\ ఎలిదుక్కి, కాడిమాను, పలుపు ముగుదాడు పగ్గం బుట్టిమేత నుగ్గులు చేపలు కొర్దలు, ఉల్సలు, పక్కిలు ఇసుకదొందులు కొరబేను తాంబేలు
బెళబాయి, గెద్ద, పులిచంద్రాయిలు, పిచ్చికలు, పూరేడి, కౌజు, జెముడుగాకి, గబ్బిళాయి, కలివికోడి
చిర్రాకు, పొనగంటి, చక్రవర్తి, పప్పాకు, గోగాకు, చుక్కాకు, చింతాకు, ఎరబొద్దాకు, గురుగాకు, అవిసాకు, మునగాకు, బచ్చలి
కాడిమాను పలికిమాను మేడి కపిలి గూడ ఏతము మడవ ఫలితము కొండ్ర సాలు కపిలిబార కదురుగోలు తొండము తొండంతాడు మోకు బాన (కపిలిబాన) కడిసీల బండినొగ నొగ పలుపులు కొడవలి, లిక్కి గోరుగిల్లు జాటి ములుగర్ర ముకుతాడు మూజెంబరము
బళ్ళ (చెరుకు గానుగకు)
భాషా ప్రయోగం
మార్చు- గా? (కదా?) అన్న రూపంలో అది పోయి ఎమే? (ఏమి?) చేరుతుంది. ఉదా: చెప్పొచ్చుగా? -> చెప్పెమే?
- అవ్వదు, కాదు రూపం మారుతుంది. అయ్యేది లేదు అని అంటారు. కన్నడలో ఆయత్తల్ల (ఆయత్తు+అల్ల) దీనికి మూలం.
ఆహారం
మార్చు- బొరుగులు (మరమరాలతో చేసే అల్పాహారం) సీమ ప్రత్యేకత. వీటిలోనికి బజ్జీలు నంజుకొంటారు. ఒక్క చిత్తూరు జిల్లా మినహా, మిగతా మూడు జిల్లాల లోను దీనిని చేస్తారు. ఇది హోటళ్ళలో కూడా లభ్యం. అయితే ఒక్కో జిల్లాలో దీనికి ఒక్కో పేరు ఉంది. కర్నూలులో బొరుగుల తిరగవాతగా, అనంతపురంలో ఉగ్గాని గా, కడపలో బొరుగుల చిత్రాన్నంగా వ్యవహరిస్తారు.
- ఇదే విధంగా జొన్న రొట్టెలను కూడా చిత్తూరును మినహాయించి మూడు జిల్లాల్లోనూ తింటారు. కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాలలో ఈ మధ్య ఇది హోటళ్ళలో కూడా లభ్యమౌతుంది. మధుమేహానికి మంచి పత్యకారి.
- రాగిసంగటి కడపలో బాగా తింటారు. వీటి కోసం ప్రత్యేకంగా హోటళ్ళను జిల్లాలో చాల విరివిగా చూడవచ్చు. మిగతా మూడు జిల్లాల్లో కంటే కడపలోనే ఎక్కువగా తింటారు. బెంగుళూరులోని పెద్ద పెద్ద రెస్టారెంటులలో కూడా ఈ మధ్య ఇది లభిస్తోంది.
- పొంగలి చిత్తూరులో బాగా ఎక్కువ. చాలా మంది తెలంగాణా వాసులకి పొంగలి తెలియదు. అయితే తమిళనాడు పొంగలి ఇక్కడి పొంగలి ఒకటే విధంగా ఉంటాయి. కర్ణాటకలో పొంగలిలో పాలని వినియోగిస్తారు.
- ఇడ్లీల తయారీలో చిత్తూరు జిల్లా వారు ఇడ్లీ రవ్వకు బదులుగా ఉప్పుడు బియ్యాన్ని వినియోగిస్తారు. ఇడ్లీ, దోసె లలో చిత్తూరు జిల్లా వారు పచ్చడి, సాంబారు లే కాకుండా మాంసాహార పులుసు కూరలని తింటారు.
- సాంబారులో ఇతర కూరగాయ ముక్కలతో బాటుగా చిత్తూరులో మామిడికాయని కూడా వేస్తారు. కొద్దిగా వగరు, పులుపులు కలవటంతో సాంబారు మరింత రుచికరం అవుతుంది.
- ఇతర మామిడి కాయలు సాధారణంగా గుండ్రంగా ఉంటాయి. కానీ చిత్తూరు జిల్లాకి చెందిన ఒక రకం మామిడి పొడవుగా ఉంటాయి. ఇవి పులుపు తక్కువగా ఉండి పచ్చిగానే తినటానికి రుచికరంగా ఉంటాయి. ఇతర జిల్లాలలో వీటినే తోతాపురి అని అంటారు.
- బనగానెపల్లె "బేనిషా" మామిడి పళ్ళు రాష్ట్రం మొత్తం పేరొందింది.[1] మామిడి పళ్ళను ఇష్టపడే నవాబు, ఒక్కొక్క రకం మామిడి చెట్టుకి ఒక్కొక్క రకం గుర్తు (నిషాన్) చెక్కించేవాడు. అయితే ఒక రకం మామిడి పండు ఎంతో తీయగా, మిగతా అన్ని రకాల కంటే రుచిగా ఉండటంతో, ఆ చెట్టుకి ఏ గుర్తు చెక్కించక, దానికి గుర్తు లేనిది (బే నిషాన్) అని నామకరణం చేయించాడు. అదే వాడుకలో బేనిషా అయ్యింది. ఒక NTR చిత్రంలో "బంగినపల్లి మామిడి పండు రంగుకొచ్చింది" అనే పాట కూడా ఉంది.
- పులిహోరని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో చిత్రాన్నం అని అంటారు. చిత్తూరు జిల్లాలో పులుసన్నం అని అంటారు (నిమ్మకాయ పులుసు, చింతపండు పులుసు లతో చేస్తారని కాబోలు)
- బొబ్బట్లని కర్నూలులో భక్ష్యాలు అనీ, మిగతా జిల్లాలలో పోళిగ/ఓళిగలనీ అంటారు. అయితే కర్నూలులో వీటి తయారీలో మైదా/గోధుమ పిండి కాకుండా ఫేనీ రవ్వని ఉపయోగిస్తారు. కర్నూలు అనంతపురం జిల్లాలలో వీటిని విక్రయించే ప్రత్యేక దుకాణాలు ఉంటాయి. బెంగుళూరులో బేకరీల్లోనూ, స్వీటు షాపులలోనూ, హోటళ్ళలోనూ వీటిని విక్రయిస్తారు.
- గారెలని సీమలో అలచందలుతో కూడా చేస్తారు
- కర్నూలుకి చెందిన పుల్లారెడ్డి నేతి మిఠాయిలు హైదరాబాదు, బెంగుళూరు నగరాలతో బాటు విదేశాలలో కూడా ప్రాచుర్యం పొందినది.
- సీమలో కాఫీ సేవనం ఎక్కువ. అయితే ఇప్పటి తరాలు ఉద్యోగరిత్యా పట్టణాలలో ఉండటం వలన టీకి కూడా కాస్త చోటు దక్కింది.
ఉత్సవాలు ప్రదర్శనలు
మార్చు- కడపలోని మయూర బేకరి వాళ్ళు అప్పుడప్పుడూ టౌనులో ఫుడ్ ఫెస్టివళ్ళను నిర్వహిస్తుంటారు. ప్రతి నూతన సంవదత్సరానికి వీరి చే నిర్వహింప బడే కేక్ ఎగ్జిబిషన్ లలో కేక్ లను టైటానిక్ నావ వంటి వింత వింత ఆకారాల్లో రూపొందించటంతో ఈ ఎగ్జిబిషన్ కి విపరీతమైన జనాదరణ ఉంటుంది.
- ఫ్యాక్షనిజానికి మారుపేరు అన్న నానుడికి దూరమవ్వటానికి ప్రతి యేడాది కడపలో "కడపోత్సవాలు" నిర్వహిస్తారు. ఇది ఒక ఆధ్యాత్మిక ఉత్సవం.
సినిమాలు
మార్చుమద్రాసుకి దగ్గర కావటంతో మొదటి తరం సినిమాల్లో సీమకి బాగా ప్రాధాన్యం ఉండేది. అప్పటి నిర్మాతల్లో చాలా మంది ఇక్కడి వారే.
- కె.వి.రెడ్డి: ప్రముఖ దర్శకులు. తాడిపత్రికి చెందినవారు.
- నీలకంఠ : వైవిధ్య చిత్రాలైన షో, మిస్సమ్మ (2003) దర్శకుడు
- బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి: మల్లీశ్వరి (1951) చిత్రదర్శకుడు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి దక్షిణ భారతీయుడు. కడప జిల్లా పులివెందుల తాలూకా కొత్తపల్లికి చెందిన వారు
- బి.నాగిరెడ్డి: ప్రముఖ నిర్మాత. కడప జిల్లా
- శాంతకుమారి: అలనాటి మేటి నటి. కడప జిల్లా, ప్రొద్దుటూరుకి చెందినవారు
- బి. పద్మనాభం: హాస్యనటుడు. కడప జిల్లా, పులివెందుల తాలూకా, సింహాద్రిపురంకి చెందినవారు
- జయప్రకాశ్ రెడ్డి: సీమ భాషని నిఖార్సుగా పలికే హాస్యనటుడు, ప్రతినాయకుడు. కర్నూలు జిల్లా, ఆళ్ళగడ్డ మండలం, శిరివెళ్ళ గ్రామానికి చెందిన వారు.
మొట్టమొదటి సారిగా ఇక్కడి ఫ్యాక్షన్ని ఆధారం చేసుకున్న సినిమా ప్రేమించుకుందాం రా. తర్వాత సమరసింహా రెడ్డి, ఆది, ఇంద్ర, ఒక్కడు వంటి సినిమాలు సీమలోని ఫ్యాక్షన్ ని ప్రధాన కథాంశాన్నిగా తీసుకొని నిర్మింపబడ్డాయి. ఒట్టేసి చెబుతున్నా, ఎవడి గోల వాడిదిలో ఫ్యాక్షన్ సినిమాలని హాస్యాస్పదంగా విమర్శించటం జరిగింది.
ఫ్యాక్షన్ రాజకీయాలు
మార్చువిజయనగర సామ్రాజ్య విఛ్ఛిన్నం తర్వాత నిజాం పాలనలోకి వచ్చిన రాయలసీమ ప్రాంతంపై సుదూరంగా ఉన్న హైదరాబాదు నుండి గట్టిపట్టుతో పరిపాలించలేకపోయారు. కేంద్రం పట్టు సడలి అనేక మంది స్థానిక పాలెగాళ్లు పెత్తనం చెలాయించడం ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పాలెగాళ్ల వ్యవస్థ నిర్మూలించబడినా పెత్తందారులు, ఫ్యాక్షనిస్టుల రూపంలో వారి అజమాయిషీ కొనసాగింది.[2] ఒకప్పుడు ఇక్కడి రాజకీయాలు ఫ్యాక్షన్ కి మారు పేరు.[3][4] మారుతున్న పరిస్థితులలో యువత చైతన్యవంతులై ఫ్యాక్షన్ వలన జరిగే అనర్థాలను గుర్తించారు. చెదురు ముదురు ఘటనలు మినహా ప్రస్తుతము ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైనది.
కులం
మార్చుఇక్కడ అన్ని కులాల వారు ఉన్నప్పటికీ, రెడ్లదే అన్నింటా పై చేయిగా ఉంటుంది. వ్యవసాయం, వ్యాపారం, రాజకీయాలలో ఇది బాగా కనబడుతుంది. మిగతా కులాల వారు ఎక్కువ ప్రభుత్వోద్యోగులు అయ్యి ఉంటారు.
అనంతపురంలో రెడ్ల తర్వాత స్థానం కమ్మ వాళ్లది. (సీమలో చౌదరిలని కమ్మ వాళ్ళు అంటారు. వీళ్ళు చౌదరి అని కాకుండా నాయుడు అని పెట్టుకుంటారు.)
రాష్ట్రంలో మిగతా ప్రదేశాలలో లాగానే జనాభా పరంగా బలిజ కులస్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ వారి ప్రభావం పెద్దగా కనిపించదు. (ఇక్కడ బలిజులు అనగా మిగతా ప్రదేశాల్లో కాపు/నాయుడు/తెలగ/ఒంటరి కులస్థులు. బలిజులలో ఒక్క శెట్టి బలిజ మాత్రమే ఇక్కడ అగ్ర కులం.పెరిక బలిజ,లింగ బలిజ, వాడ బలిజ వంటివి వెనుకబడిన కులాలు. కాగా కోస్తా ఆంధ్రలో వీరి కులవృత్తి కాని కల్లు గీత ఎంచుకుని వీరు గీత కార్మిక కులస్తులుగా 1920 నుండి మార్పు చెందారు. తమ కులం గౌరవం కోసం శెట్టిబలిజ గా ఇప్పటికీ పోరాటం చేస్తున్నారు. అయితే ఈ రెండు శెట్టి బలిజలు, వేర్వేరు కులాలు అని కొంత మంది భావన. శెట్టిబలజ పేరుతో మొదట రిజిస్ట్రేషన్ చేసుకున్నది ఆంధ్రా ప్రాంత వాసులే నిజానికి ఈడిగ కులం తో ఆంధ్ర శెట్టి బలిజ లకు ఎలాంటి సంబంధం లేదు..ఉత్తర భారతదేశం నుండి వచ్చిన సేఠ్ లు సీమలో వ్యాపారాలు చేస్తుంటారు. ముఖ్యంగా బంగారు దుకాణాలు, బట్టల దుకాణాలు, గిఫ్ట్ ఆర్టికల్స్ నడుపుతుంటారు.
కడపలో కన్నడిగ బ్రాహ్మణులు నెలకొల్పిన "మయూర" చాలా పేరు గలది. బేకరీలు, రెస్టారెంటులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు దీని ప్రత్యేకత.
మతం
మార్చుకడప, కర్నూలు, అనంతపురం లలో ముస్లింలు ఎక్కువగా ఉంటారు. చిత్తూరులో తక్కువగా కనిపిస్తారు. అయిననూ రెండు మతాలు చాల కలివిడిగా ఉండటం గమనించవచ్చును. ఎట్టి సందర్భం లోనూ సీమలో మత సంఘర్షణలకు తావు ఉండదు. ఉద్యోగార్థులు, సంతాన సాఫల్యం కోరుకునే హిందువులు కూడా దర్గాలకి వెళతారు, అక్కడ అన్నదానాలు చేస్తారు. రంజాన్కి ముస్లింలు తమ హిందువు స్నేహితులని కుడా విందుకి ఆహ్వానిస్తారు. కర్నూలు జిల్లాలోని పీర్ల పండగ లో హిందువులు కుడా పాల్గొంటారు. కొన్ని గ్రామాలలో ప్రక్క ప్రక్క ఇళ్ళలో ఉన్న హిందూ-ముస్లిం మతస్థులు పరస్పర సహాయాలు చేసుకొంటూ ఒకే కుటుంబం అంతగా పెనవేసుకుపోయిన వైనాలు అనేకం. కడపలోని పెద్ద దర్గాకి ఎ. ఆర్. రెహమాన్ వంటి ముస్లిం ప్రముఖులతో బాటు, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, రాంచరణ్ తేజ వంటి హిందువులు కూడా దర్శించుకోవటం గమనార్హం.
చిత్తూరులో తక్కువగానే ఉన్నా మిగతా మూడు జిల్లాలలోనూ క్రైస్తవులు బాగానే కనిపిస్తారు.
చూడవలసిన ప్రదేశాలు
మార్చుకడప
మార్చు- గండికోట
- సిద్దవటం కోట, సిద్దవటం
- పెద్ద దర్గా, కడప
- తాళ్ళపాక
- నందలూరు
- రామాలయం, ఒంటిమిట్ట
- పొలతల
- పుష్పగిరి
- గుమ్డలకొన, యర్రగుంటకోట
kadiri kuntlapalii hanuman temple
కర్నూలు
మార్చు- అహోబిలం - షాహీ జామియ మసీదు
- కొండారెడ్డి బురుజు
- బనగానపల్లె నవాబు కోట
- బెలూం గుహలు, కొలిమిగుండ్ల
- శ్రీ శైలం
- మహానంది
- యాగల్లు
- మంత్రాలయం
అనంతపురం
మార్చు- లేపాక్షి బసవన్న
- పెనుగొండ కోట, పెనుగొండ
- కసాపురం (ఆంజనేయ స్వామి)
- పుట్టపర్తి
చిత్తూరు
మార్చువృత్తులు
మార్చుఅన్ని జిల్లాలలో వ్యవసాయం ప్రధాన వృత్తి. పొగాకు, పత్తి, ప్రొద్దు తిరుగుడు, వేరుశెనగ, ఉల్లి ప్రధాన పంటలు.
వస్త్రధారణ, ఆభరణాలు
మార్చుదాదాపు అన్ని జిల్లాల గ్రామాలలో పురుషులు పంచె, సాధారణంగా చొక్కా, అప్పుడప్పుడూ కుర్తా తలపాగా ధరిస్తారు. దాదాపుగా తెలుపు, దానికి సంబధించిన పంచలు, చొక్కాలు, తలపాగాలే ఎక్కువగా ధరిస్తారు. జిల్లా కేంద్రాలు, ఇతర ముఖ్య నగరాలలోని పురుషులు సాధారణ చొక్కా ప్యాంటు ధరిస్తారు. స్త్రీలు చీరలు ధరిస్తారు. యువతులు ఎక్కువగా సల్వార్ కమీజ్ లలోనూ, పండగలప్పుడు లంగా ఓణి లలోనూ కనిపిస్తారు.
జీవన సరళి
మార్చువిశేషాలు
మార్చు- కర్నూలు జిల్లా ఆదోని లోని హోటళ్ళలో పూరీలను కూడా చపాతీల్లాగా త్రికోణాకారంలోనే కాలుస్తారు.
- అనంతపురం సరిహద్దు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అందరికీ అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో తెలుగు పాఠాలని కన్నడలోకి అనువదించి చెబుతారు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Andhra Pradesh District Gazetteers: Kurnool v. 4 - 1967 By Andhra Pradesh (India) పేజీ.243
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-05-05. Retrieved 2009-08-05.
- ↑ http://www.rediff.com/news/dec/05war.htm
- ↑ http://www.hindu.com/fline/fl2204/stories/20050225002403300.htm[permanent dead link]
V