వాడుకరి చర్చ:Arjunaraoc/పాత చర్చ 3

తాజా వ్యాఖ్య: Help టాపిక్‌లో 11 సంవత్సరాల క్రితం. రాసినది: Vyom25

పాత చర్చ 2 | పాత చర్చ 3 | పాత చర్చ 4

ప్రసాదు నుండి మీకు కృతజ్ఞతలు

మార్చు

మీకు జవాబు వ్రాయుటకు నా talk page ఎక్కడ వుందో తెలియలేదు. నా శునశ్శేపుడు(శునశ్సేపుడు కాదు) వ్యాసము శీర్షికను శునశ్శేపుడు గా మార్చ ప్రార్ధన. ప్రసాదు.

ఇక్కడ రాయటం సరిపోతుంది. నేను మార్చాను. అలాగే మీ చర్చాపేజీలో వ్యాఖ్యవ్రాశాను గమనించండి.--అర్జున (చర్చ) 11:40, 6 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ఈ వారం వ్యాస పరిగణన ఏ ప్రాతిపదికన చేస్తారు?

మార్చు

ఈ వారం వ్యాస పరిగణలనలో అసంపూర్తిగా ఉన్న వ్యాసాలు, వికీకరణ జరగని వ్యాసాలను చేర్చవచ్చా? చతుర్భుజి అనే వ్యాసం పూర్తి అయినది కాదు. అసంపూర్తిగా ఉన్నది. దాని చర్చాపేజీలో "ఈ వారం వ్యాస పరిగణన" మూస కూడా లేదు. ఈ వ్యాసాలను యే విధంగా పరిగణిస్తారు? అందరికీ మొదట కనిపించే మొదటి పేజీలో అనేక మైన పూర్తిఅయిన వ్యాసాలు ఉండగా వికీకరణ జరగని శుద్ధి కాని, అసంపూర్ణ వ్యాసాలను పరిగణన లోనికి తీసుకోవచ్చా? ఏ ప్రాదిపదికన చేరుస్తారో తెలుపగలరు.( కె.వి.రమణ- చర్చ 16:44, 11 ఫిబ్రవరి 2013 (UTC))Reply

వర్గం:ఈ_వారం_వ్యాసం_పరిగణనలు లో సూచనలు గమనించండి. పరిగణన అంటే ప్రతిపాదన మాత్రమే. వ్యాసాల లోటుపాట్లను చర్చాపేజీలలో తెలిపితే పరిష్కరించినమీదట ఈ వారం వ్యాసంగా ప్రకటితమవవచ్చు. బొమ్మకు సంబంధించి ఉదా: దస్త్రంపై_చర్చ:Bangalore_Wikipedian_on_phone_5_closeup.jpg చూడండి. నాణ్యతగల వ్యాసాలను మొదటిపేజీలో ప్రకటించాలన్న వుద్దేశ్యమున్నా, నాణ్యతను పెంచడానికి సభ్యుల సహకారం తక్కువగా వుంటే ఈ వారం వ్యాసం శీర్షిక కొనసాగటంకోసం, కొన్ని లోపాలు గల వ్యాసాలు ప్రదర్శించబడతాయని గమనించండి. --అర్జున (చర్చ) 01:21, 12 ఫిబ్రవరి 2013 (UTC)Reply
అన్నట్లు వికీ చర్చలలో గౌరవపూర్వక సంభోధన వాక్యాలు పద్ధతి కాదు. అందుకని మీ వ్యాఖ్యలో అవి తొలగించాను. --అర్జున (చర్చ) 01:23, 12 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ధన్యవాదములు

మార్చు

అర్జున గారికి, తెవికీలో నాకృషిని గుర్తించి 2012 తెవికీ పతకము ప్రదానము చేసినందుకు కృతఞాతలు. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:25, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

మీ సందేశానికి ధన్యవాదాలు. మీలాంటి వారి కృషివలనే తెవికీ మెరుగవుతుంది. అభివందనలు. --అర్జున (చర్చ) 12:27, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

టైపింగ్ లో యిబ్బందులు

మార్చు

నేను Hertz, maxwell అనే పదాలు టైప్ చేయలేకపోతున్నాను. అవి హెర్ట్జ్ అనీ, మాక్స్వెల్ అనీ వస్తున్నాయి. అవి "హెర్ట్ జ్ " అనీ "మాక్స్ వెల్" అనీ ఉండాలి. కానీ మధ్య స్పేస్ తొలగిస్తే అక్షరాలు విలీనం అవుతున్నాయి. సహాయం చేయగలరు.(  కె. వి. రమణ. చర్చ 15:35, 20 ఫిబ్రవరి 2013 (UTC))Reply

మొదటిగా సహాయకేంద్రంలో వ్రాసినట్లు చూశాను. అక్కడే స్పందించాను చూడండి వికీపీడియా:సహాయ_కేంద్రం#పదాలను టైపింగ్ లో యిబ్బందుల గూర్చి. మరింత సహాయం కావలంటే అక్కడే వ్రాసి {{సహాయం కావాలి}} మూస చేర్చండి--అర్జున (చర్చ) 15:42, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

బాటు సభ్యత్వం ఉపయోగించండి

మార్చు

మీరు నిమిషానికి 40-50 దిద్దుబాట్లు చేయగలిగే అవకాశమున్న వాటికి బాటు సభ్యత్వం ఉపయోగించడం లేదు. ఇదివరకే బాటు సభ్యత్వం ఉన్ననూ మామూలు దిద్దుబాట్లు చేసే సభ్యనామంతోనే అలా చేయడాన్ని దిద్దుబాట్లు పెంచుకొనే చర్యగా సభ్యులు పరిగణించకముందే మానుకోవడం మంచిది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:10, 20 ఫిబ్రవరి 2013 (UTC)Reply

మీ స్పందనకి ధన్యవాదాలు. మీరు పొరబడినట్లున్నారు. తొలగించు మూసలు తెవికీలో అభివృద్ధి కాలేదు. ఇంగ్లీషు వికీలో చాలా అభివృద్ధిచెంది, నిర్వహణ సమర్థవంతంగా చేయటానికి ట్వింకిల్ అనే పరికరాన్ని వాడుతున్నారు. దానిని తెవికీలో వాడటానికి తొలగింపు మూసలను దిగుమతి చేస్తున్నాను. ఇది నిర్వాహక లేక అధికారి ఖాతాతోనే సాధ్యమవుతుంది. ఈ దిగుమతులతో ఎక్కడైనా ఇప్పుడు వాడుతున్న మూసలకు ఇబ్బంది కలిగితే సరిదిద్దుతున్నాను. ఇంకేదైనా ఇబ్బందులుంటే తెలియచేయండి.--అర్జున (చర్చ) 03:11, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
అర్జునరావు గారూ, మీ బాటుకు తాత్కాళికంగా నిర్వాహకహోదా ఇచ్చుకోండి. ఆ విధంగా అయితే ఈ మార్పులు దాగిఉంటాయి. అలాగే పనికూడా జరుగుతుంది --వైజాసత్య (చర్చ) 08:15, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
నేను బాటు వాడటంలేదు. ప్రత్యేక:దిగుమతి వాడుతున్నా కూడ ఇటీవలి మార్పులలో నేను చేసే మార్పులన్నీ ఒక వరుసలో చూపెడుతుంది కాబట్టి సహసభ్యులకు ఇబ్బంది కలుగుతుందనుకోను. ఇది ప్రధానంగా వికీపీడియా:Twinkleకొరకు చేస్తున్నాను. దీనికి కావలసిన పేజీలు, మూసలు ఇంకా కొన్ని దిగుమతి చేయవలసి వుంది. దీనిలో మీలాంటి అనుభవజ్ఞులైన సహ నిర్వాహకులు, అధికారులు పాల్గొని సహకరించాలని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 08:36, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
ఓహో, అలాగా!! ఇటీవల అభివృద్ధి చెందిన కొత్త విధానాలు పద్ధతులు నాకు తెలియవు. అన్నింటినీ అవగాహన చేసుకోవటానికి కొద్దిగా సమయం పడుతుంది. తప్పకుండా నాకు తెలిసినంతవరకూ సహాయం చేయగలను. మీరు తెచ్చిన మార్పులు, ప్రతిపాదనలు నేను ఇంకా మొత్తం చూడలేదు. మీ మార్గదర్శకంలో జిల్లాల వ్యాసలపై జరిగిన కృషి చాలా బాగుంది --వైజాసత్య (చర్చ) 08:52, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply
మీ ప్రశంసకు ధన్యవాదాలు. దానికొరకు సహకరించిన సభ్యులందరి వల్లనే అది సాధ్యమైంది. అలాంటి సహకార పథకాలు ఎక్కువవ్వాలని కోరిక. నేను ఎక్కువ క్రియాశీలంగా వున్న గత మూడేళ్లలో జరిగిన మార్పుల క్లుప్త సమాచారం వికీపీడియా:2012_లక్ష్యాలుమరియు అది వున్న వర్గపుపేజీలలో మరియు తెలుగు వికీపీడియా వ్యాసంలో చూడవచ్చు.--అర్జున (చర్చ) 09:12, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply

రిఫరెన్సులు గూర్చి

మార్చు

తెవికీ లో వ్యాసాలు తయారుచేస్తున్నప్పుడు వాటికి రెఫరెన్సులు ఉండాలనే నియమం ఉన్నదా? అవి చేర్చక పోయినా ఫరవాలేదా?అవి ఆంగ్ల వికీ పీడియా లోని రిఫరెన్సులు చేర్చవచ్చా! ఇతర బ్లాగులు,వెబ్ సైట్ల నుండి చేర్చవచ్చా! (  కె. వి. రమణ. చర్చ 05:12, 21 ఫిబ్రవరి 2013 (UTC))Reply

సాధ్యమైనంతవరకు అంతర్జాలంలో గల తెలుగు మూలాలు లేనిచో ఇతర తెలుగుపుస్తకాలు, మాధ్యమాల మూలాలు లేనిచో ఆంగ్ల మూలాలు పేర్కొనవచ్చు. ఆంగ్ల వ్యాసానికి అనువాదం చేస్తుంటే ఆంగ్ల మూలాలు వుంచవచ్చు.--అర్జున (చర్చ) 05:16, 21 ఫిబ్రవరి 2013 (UTC)Reply

హాట్ కేట్

మార్చు

హాట్ కేట్ నాకు బాగా ఉపయోగపడున్నది. విక్షనరీలో కూడా సుమారు 54,000 పైగా వ్యాసాలు చేరాయి. వీటిని యాంత్రికంగా వర్గీకరించడం చాలా కష్టమైన పని. కాబట్టి హాట్ కేట్ ను విక్షనరీలో చేతనం చేయగలిగితే మాకు చాలా సహాయపడుతుంది.Rajasekhar1961 (చర్చ) 11:13, 24 ఫిబ్రవరి 2013 (UTC)Reply

ధన్యవాదాలు. సుజాతగారికి ఈ విషయాన్ని తెలియజేసి ఆమెను సహాయపడమని కోరతాను.Rajasekhar1961 (చర్చ) 16:53, 24 ఫిబ్రవరి 2013 (UTC)Reply
అర్జున గారూ, హాట్ కేట్ చేతనం చేసుకుని ఉపయోగించి చూశాను. వ్యాసాల వర్గీకరణకు మంచి సాధనం. నిర్వహణకు మంచి పరికరం. విక్షనరీలో నాకు నిర్వాహకహోదా ఉండాలి. నేను హాట్‌కేట్ అందులో స్థాపితం చేయగలను. అంతలో మీరు హాట్‌కేట్ ఉపయోగించే విధానం గురించి తెలుగులో ఒక పేజీనీ వ్రాయగలరా --వైజాసత్య (చర్చ) 03:45, 10 మార్చి 2013 (UTC)Reply

అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం

మార్చు

వికీపీడియా:సమావేశం/అంతర్జాతీయ మహిళా దినోత్సవం, భారతదేశం ను ప్రత్యేక:Import ద్వారా తెలుగు వికీపీడియాకి దిగుమతి చేశాను. కొంత అనువాదం చేశాను. ఒకసారి చూసి దయచేసి వికీకరించండి.Rajasekhar1961 (చర్చ) 06:54, 5 మార్చి 2013 (UTC)Reply

  • రెండు మూసలను దిగుమతి చేశాను. ఇప్పడు ఇంగ్లీషులో లాగానే వుంది. ఎడిటథాన్ అనేది సమావేశం లో మార్పులు ప్రధానంగా జరుగుతాయనితెలిపే పేరుమాత్రమే--అర్జున (చర్చ) 08:19, 5 మార్చి 2013 (UTC)Reply

ట్వింకిల్ పరికరం తెలుగులోకి

మార్చు

అర్జునరావు గారూ, నేను ట్వింకిల్ పరికరాన్ని తెలుగులోకి అనువదిస్తున్నాను. ఉదాహరణకి టాక్‌బాక్ కు ప్రత్యుత్తరమని తర్జుమా చేశాను. మిగిలిన ఉపపరికరాలకు మీకు తోచిన పేర్లు సూచించగలరు --వైజాసత్య (చర్చ) 04:14, 12 మార్చి 2013 (UTC)Reply

  • ఈ మూసలపేర్లను తెలుగులోకి అనువదించితే నిర్వహణ ఇబ్బందులు కలుగుతాయని అనుమానం. దీని కోడ్ తెలుగు రూపం నిర్వహించేవారెవరైనా వుంటే మూసపేర్ల అనువాదాలు చేయవచ్చు. ప్రస్తుతానికి మూసలో సందేశాలు అనువాదం చేస్తేసరిపోతుందనుకుంటాను.--అర్జున (చర్చ) 04:29, 12 మార్చి 2013 (UTC)Reply

హైదరాబాదులో తెవికీ సమావేశం

మార్చు

అర్జునరావు గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అత్యంత విలువైన అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:48, 13 మార్చి 2013 (UTC)Reply

చర్చపేజీచూడండి.--అర్జున (చర్చ) 06:14, 14 మార్చి 2013 (UTC)Reply
అంచనా వ్యయం ఒక సారి సరి చూసి పైన ఉన్నది చెరిపేయండి.విశ్వనాధ్ (చర్చ) 14:02, 14 మార్చి 2013 (UTC)Reply

మీ రాక కోసం...

మార్చు

అనుభవజ్ఞులైన మీరాకతో తెలుగు వికీపీడియా సర్వసభ్య సమావేశం దిగ్విజయవంతం కాగలదని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ .... ఈ నేపథ్యంలో జరుగనున్న ముందస్తు సమావేశాలకు తమరు హాజరై సర్వ సభ్య సమావేశ రూపకల్పన మరియు నిర్వహణకు దిశానిర్దేశం చేయవలసిందిగా నా ప్రత్యేక విన్నపం. ......Malladi kameswara rao (చర్చ) 13:54, 13 మార్చి 2013 (UTC)Reply

వ్యక్తిగతకారణాల రీత్యా ముందస్తుసమవేశాలకు హాజరవటం వీలుకాదు. ప్రధాన సమావేశానికి హాజరవటానికి ప్రయత్నిస్తాను. --అర్జున (చర్చ) 06:14, 14 మార్చి 2013 (UTC)Reply

లింకు చేర్చుట

మార్చు

అర్జునరావుగారూ ! సర్వసభ్య సమావేశాలు ప్రకటనలో వికీపీడియా:అంతర్జాతీయ వికీపీడియా లింకు చేరిస్తే ఆసక్తి ఉన్నవారు అది చదివి వికీపీడియాను గురించి తెలుసుకుంటారని మల్లది కామేశ్వరరావు గారు అభిప్రాయపడుతున్నారు. మీరు అది గమనించి చేరిస్తే ప్రయోజనం ఉన్నదని భావిస్తే చేర్చండి. --t.sujatha (చర్చ) 17:04, 16 మార్చి 2013 (UTC)Reply

తప్పక చేర్చవచ్చు. నేను చేర్చుతాను.--అర్జున (చర్చ) 04:32, 17 మార్చి 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియాను నడిపిస్తున్న సారధులు

మార్చు

వికీపీడియా వ్యాసంలో తెలుగు వికీపీడియాను నడిపిస్తున్న సారధులులో సమాచారాన్ని కొద్దిగా సరిచేశాను. పరిశీలించవలసిందిగానూ, అవసరమైన మార్పులు చేయవలసిందిగానూ నా కోరిక. ....Malladi kameswara rao (చర్చ) 14:33, 18 మార్చి 2013 (UTC)Reply

వికీ ప్రకటన

మార్చు

ప్రకటన మరొకటి అప్లోడ్ చేసాను దయచేసి పాతదానితో రీప్లేస్ చేయగలరు.విశ్వనాధ్ (చర్చ) 14:58, 18 మార్చి 2013 (UTC)Reply

శాస్త్రజ్ఞుడు

మార్చు

"శాస్త్రజ్ఞుడు" అనే పదం యొక్క ఆంగ్ల అక్షరాల టైపింగ్ గూర్చి 10 రోజుల క్రిందట వికీపీడియా సహాయ కేంద్రంలో చేర్చడం జరిగింది. దానికి సరైన స్పందన గానీ, సహాయం కానీ లభించలేదు. తగువిధంగా సహాయపడగలరని కోరుతున్నాను.-- - -  కె.వెంకటరమణ చర్చ 10:17, 25 మార్చి 2013 (UTC)Reply

సరిదిద్దండి

మార్చు

వికీపీడియా చర్చ:చరిత్రలో ఈ రోజు/మార్చి 29 లో నేను వ్రాసిన విషయాన్ని పరిశీలించి సరిదిద్దగలరు..-- - -  కె.వెంకటరమణ చర్చ 03:01, 27 మార్చి 2013 (UTC)Reply

మూస-script error

మార్చు

{{Talkback|kvr.lohith}}

జాకెట్ = కోటు, జాకెట్ = చోళి

మార్చు

కె.వెంకటరమణ గారు ఇదే సబ్ హెడ్ తో నా చర్చా పేజీలో వారి అభిప్రాయలని తెలిపారు. తరలింపు కి ముందు ఇవి కూడా పరిగణలోకి తీసుకొనవలసిందిగా మనవి. శశి (చర్చ) 12:57, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply

వికీపీడియా:సహాయ కేంద్రం లో స్పందన చూడండి.--అర్జున (చర్చ) 13:04, 1 ఏప్రిల్ 2013 (UTC)Reply


తెలుగు వికీపీడియా మహోత్సవం 2013కు ఆహ్వానం

మార్చు
 

Arjunaraoc గారికి నమస్కారం,

విజయ తెలుగు ఉగాదిని పురస్కరించుకుని, తెలుగు వికీపీడియా మహోత్సవం 2013ను 10 మరియు 11 ఏప్రిల్ 2013న జరుపుకుంటున్నాం. ఇది హైదరాబాదులోని గోల్డెన్ థ్రెషోల్డ్‍లో జరుగనుంది.
దయచేసి ఉత్సవ నమోదు పత్రం వద్ద తమ పేరును నమోదు చేసుకోగలరు.
హైదరాబాదు బయట నుండీ వచ్చేవారికి దారి ఖర్చులు చెల్లింపబడతాయి.

వికీపీడియా సభ్యులుగా మీరు చేస్తున్న విశేష కృషికి అభినందనలు. ఈ సమావేశంలో హాజరయి, మీ అనుభవాలు మిగితా సభ్యులతో పంచుకుంటారని ఆశిస్తున్నాం. మీరు రాలేని పక్షంలో దయచేసి మీ సందేశాన్ని పాఠ్యం/ఆడియో(శ్రవ్యకం)/దృశ్యకం(వీడియో) రూపంలో ఇక్కడ పొందుపరచగలరు. మీ రచనలకూ, మీ విశేష కృషికీ ధన్యవాదాలు.

మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాము. రహ్మానుద్దీన్ (చర్చ) 07:53, 2 ఏప్రిల్ 2013 (UTC)Reply

విన్నపము

మార్చు

అర్జున గారూ! నమస్కారం! నేను విక్షనరీనందు విగత నిర్వాహకునిగా ఉన్నాను. కానీ ఇంకనూ నిర్వాహకునిగా పని చేయాలను కుంటున్నాను. ఈ సందర్భములో దానికి సంబంధించిన విధి విధానముల "పని" అయ్యేందుకు కావలసిన మీ సహయ సహకారముల కోసము విన్నవించు కుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:49, 5 ఏప్రిల్ 2013 (UTC)Reply

తెలుగు వికీపీడియా లో అధికారిగా దాదాపు సంవత్సరం కాలం వున్నారు కాబట్టి నేను కొత్తగా సాయంచేయగలిగినది వున్నది ఏమున్నది. విక్షనరీలో నేను అంత క్రియాశీలకంగా లేను. ఆ ప్రాజెక్టులో ప్రతిపాదనచేసి దానిని ముందుకుతీసుకువెళ్లండి. శుభం.--అర్జున (చర్చ) 03:38, 6 ఏప్రిల్ 2013 (UTC)Reply

CIS-A2K వారి ధన్యవాదాలు

మార్చు

అర్జునరావు గారు 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు చేసిన కృషికి చాలా ధన్యవాదాలు.--విష్ణు (చర్చ)18:47, 7 ఏప్రిల్ 2013 (UTC)Reply

తెలుగు ప్రముఖులు

మార్చు

దయచేసి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టు మూసను చూడండి. నేను చేసినదానిలో కొన్ని దోషాలున్నాయి. ఒకసారి చూసి సవరించండి.Rajasekhar1961 (చర్చ) 05:37, 21 ఏప్రిల్ 2013 (UTC)Reply

తెలుగు ప్రముఖులకు సంబంధించిన చర్చా పేజీలలో ప్రాజెక్టు మూసను చేర్చుతున్నాను. ఇంతవరకు ఉన్న వ్యాసాలను ప్రాజెక్టులో చేర్చడానికి వర్గీకరించడానికి ఇది చాలా అవసరం. కానీ అవి సరిగా ఆయా వర్గాలలో చేరుతున్నాయా లేదా అని నిర్ధారించలేకపోతున్నాను. ఒకసారి చూడండి.Rajasekhar1961 (చర్చ) 08:43, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply

కొత్తసభ్యుడు

మార్చు

అర్జున్ గారు,బెంగళూరులో సకలా భత్తుల క్రిష్ణమూర్తి అనే విశ్రాంత బోటని రీడరు వున్నారు.ఆయన ఆంధ్రభూమిలో వృక్షశాస్త్రం పై వ్యాసాలు వ్రాస్తుంటారు.అయనతో ఫోనులో మాట్లాడి,తెవికీలో రచనలు చేయుటకై కోరినాను.అయన తెలుగు టైపుచెయ్యటంలో ఇబ్బందులున్నాయని చెప్పారు. మీరు బెంగళూరులో వున్నందున, ఈ విషయంలో మీరెమైన చొరవతీసుకొని ఆయనకు సలహాలివ్వగలరా?ఆయన సెల్ నంబరు:9448848529.పాలగిరి (చర్చ) 01:03, 23 ఏప్రిల్ 2013 (UTC)Reply

Forced user renames coming soon for SUL

మార్చు

Hi, sorry for writing in English. I'm writing to ask you, as a bureaucrat of this wiki, to translate and review the notification that will be sent to all users, also on this wiki, who will be forced to change their user name on May 27 and will probably need your help with renames. You may also want to help with the pages m:Rename practices and m:Global rename policy. Thank you, Nemo 17:16, 3 మే 2013 (UTC)Reply

రాజశేఖర్ గారికి అధికారహోదా

మార్చు

అర్జునరావు గారూ, ఈ ప్రతిపాదన విజయవంతమైనందువలన రాజశేఖర్ గారికి అధికార హోదా ఇవ్వగలరు --వైజాసత్య (చర్చ) 05:33, 13 మే 2013 (UTC)Reply

  • ఇంకొకరిని అధికారిగా చేర్చే హక్కు స్టివార్డులకే వున్నదనుకున్నాను. గమనిస్తే ప్రస్తుత అధికారులు చేయవీలుందని తెలిసింది. ఇప్పుడే చేశాను. --అర్జున (చర్చ) 06:30, 13 మే 2013 (UTC)Reply

అధికార హోదాకు మద్దతు

మార్చు

మీరు నాయొక్క అధికారిక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 10:01, 13 మే 2013 (UTC)Reply

ధన్యవాదాలు

మార్చు

మీ అభిమానానికి ధన్యవాదాలు అర్జున్ గారూ. అహ్మద్ నిసార్ (చర్చ) 18:50, 20 మే 2013 (UTC)Reply

m:User:COIBot/XWiki/samputi.com

మార్చు

A heads up that COIBot has identified an IP address going on a bit of a spree adding a site's url. Billinghurst (చర్చ) 08:57, 22 మే 2013 (UTC)Reply

Thanks for the alert. I have blocked the contributor for few days. --అర్జున (చర్చ) 09:54, 22 మే 2013 (UTC)Reply

న్యాయమూర్తి

మార్చు

చల్లా కొండయ్య పేజీ చూడండి. న్యాయమూర్తి మూస తెలుగులోకి రాలేదు.Rajasekhar1961 (చర్చ) 09:40, 24 మే 2013 (UTC)Reply

ఐ.పి నెంబర్లకు స్వాగత సందేశాలు

మార్చు

మీ సూచనలను తప్పకుండా ఆచరిస్తాను. ధన్యవాదాలు Pranayraj1985 (చర్చ) 06:10, 2 జూన్ 2013 (UTC)Reply

తొలగింపు మూసలు

మార్చు

నమస్కారం అర్జున్ గారూ. నేను పవన్ జంధ్యాలను. మిమ్మల్ని ఒక విషయాన్ని అడగాలి. ఒక బొమ్మకు కొత్త కూర్పుని ఎగుమతి చేసాక ఇంతకు ముందు ఉన్న బొమ్మ అనాధ అవుతుంది. దీనికి ఆంగ్ల వికీలో http://en.wikipedia.org/wiki/Template:Orphaned_non-free_revisions వాడుతారు. మరి తెవికీలో ఏది వాడతారు..? ఈ విషయంలో మీరు నాకు సహాయం చేయగలరని ఆశిస్తున్నాను. Pavanjandhyala (చర్చ) 07:46, 15 జూన్ 2013 (UTC)Reply

  • పాత కూర్పుల లైసెన్స్ వికీపీడియాలో వాడదగిన లైసెన్స్ లు కానప్పుడు, వాటిని తొలగించడానికి ఇంగ్లీషులో ఆ మూస వాడుతున్నట్లున్నారు. తెలుగులోకి ఆ మూసను చేర్చి తెవికీలో కూడా అవసరమైనప్పుడు వాడవచ్చు. అన్నట్లు ప్రశ్నలు సందర్భం ప్రకారం తగిన చర్చాపేజీలో లేక రచ్చబండలో రాసి అవసరమైతే {{సహాయం కావాలి}} మూస చేర్చితే మరింతమంది అభిప్రాయాలు తెలియచేయడానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 07:59, 15 జూన్ 2013 (UTC)Reply

ధన్యవాదాలు. మీ సూచనలను తప్పక అనుసరిస్తాను. Pavanjandhyala (చర్చ) 08:45, 15 జూన్ 2013 (UTC)Reply

సైట్ నోటీస్

మార్చు

విద్య ఉపాధి ప్రాజెక్టు క్రింద వ్యాసరచన పోటీలు నిర్వహించాలని క్రిందటి వారం సమావేశంలో నిర్ణయించాము. వివరాలను ప్రాజెక్టు పేజీలో చేర్చాను. వాటికోసం సైట్ నోటీస్ లో విద్య ఉపాధి ప్రాజెక్టు గురించి ఈ నెల చేర్చమని మనవి.Rajasekhar1961 (చర్చ) 08:25, 15 జూన్ 2013 (UTC)Reply


Article requests in Telugu

మార్చు

Hi! Do you do article requests in Telugu? I found en:Water cycle does not yet have an article in Telugu. Thanks WhisperToMe (చర్చ) 05:04, 23 జూన్ 2013 (UTC)Reply

బెంగుళూరు తెవికీసమావేశం గురించి వికీ పై ప్రకటన ప్రతిపాదన

మార్చు

I am fine with it. Please go ahead!- శశి (చర్చ) 04:24, 8 జూలై 2013 (UTC)Reply

వెంకటరమణ గారికి నిర్వాహకహోదా

మార్చు

అర్జున గారూ, వెంకటరమణ గారి నిర్వాహకహోదా ప్రతిపాదన సమాజపు మద్దతుతో విజయవంతంగా ముగిసింది. ఆయనకు నిర్వాహకహోదా ఇవ్వగలరు --వైజాసత్య (చర్చ) 05:03, 18 జూలై 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకు మద్దతు

మార్చు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:16, 18 జూలై 2013 (UTC)Reply

నిర్వాహక హోదాకు మద్దతు

మార్చు

మీరు నాయొక్క నిర్వాహ హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 12:16, 18 జూలై 2013 (UTC)Reply

నిర్వాహకత్వ హోదాకు మద్దతు తెలిపింనందుకు ధన్యవాదాలు

మార్చు

మీరు నాయొక్క నిర్వాహక హోదాకు మద్దతునిచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా అభివృద్ధికి నావంతు కృషి చేస్తానని హామీ యిస్తున్నాను.రహ్మానుద్దీన్ (చర్చ) 15:52, 22 జూలై 2013 (UTC)Reply

Help

మార్చు

Sorry for posting this message in English as I don't know Telugu. I wanted to know that what is the difference between 1971లో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం and భారత్ పాక్ యుద్ధం 1971. They seem duplicate please correct me if otherwise. Again sorry posting this message in English. Thank you.--Vyom25 (చర్చ) 14:22, 25 జూలై 2013 (UTC)Reply

నోటిసు / బానర్లు సహాయపట్టి గురించి సహాయం

మార్చు

నమస్కారం అర్జున గారు. నోటిసు / బానర్లు గురించి రచ్చబండలో పవి గారి జవాబు చూడండి. సహాయపట్టి ఎక్కడ ఉంచాలో సలహా ఇవ్వగలరు. --విష్ణు (చర్చ)07:58, 4 ఆగష్టు 2013 (UTC)

ధన్యవాదాలు

మార్చు

అర్జున గారు తెలుగు పతాకానికి చాలా ధన్యవాదాలు. అదీ... మీ ద్వారా పొందడం ఇంకేంతో సంతృప్తినందించింది. మన తెలుగు వికీకి దాసాన దాసుడనై ఉంటాను. -- విష్ణు (చర్చ)14:30, 16 ఆగష్టు 2013 (UTC)

  • :-) అంతమాట ఎందుకులేండి. మనకు వీలైనంతవరకు మనకృషి చేస్తే చాలు.--అర్జున (చర్చ) 14:52, 16 ఆగష్టు 2013 (UTC)

ప్రత్యుత్తరం

మార్చు
 
నమస్కారం Arjunaraoc గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 04:26, 20 ఆగష్టు 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

వైజాసత్య (చర్చ) 04:26, 20 ఆగష్టు 2013 (UTC)

కర్నూలు పట్టణ ఛాయాచిత్రాలు

మార్చు

అర్జునగారికి నమస్కారం. మాట్లాడి చాలా కాలం అయినది. కొండారెడ్డి బురుజు యొక్క ఛాయాచిత్రాలని వివిధ కోణాల్లో బంధించాను. అలాగే సిల్వర్ జూబిలీ డిగ్రీ కళాశాల, కర్నూలు మరియు కర్నూలు వైద్య కళాశాల వ్యాసాలలో సంబంధిత చిత్రాలు చేర్చాను. వీటన్నిటినీ కర్నూలు లో కూడా చేర్చాను. ఓర్వకల్లు లో దక్షిణ అమెరికాలోని రాతి పర్వతాలని పోలిన గుట్టలు ఉన్నాయి. వీటి రంగు, పొరలు పొరలు గా ఇవి ఏర్పడిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. రోడ్డు రవాణా స్థంభించి పోవటం మూలాన ఈ మారుకి ఇది సాధ్యం కాలేదు. వీలు కుదరగనే అవి కూడా జత పరుస్తాను. మీ సమాచారనికై - శశి (చర్చ) 14:07, 12 సెప్టెంబర్ 2013 (UTC)

రచ్చబండ పేజీ

మార్చు

మీరు రచ్చబండ పేజీలో ఈ వారం వ్యాసం,ఈ వారం బొమ్మ , విలీన వ్యాసాల గూర్చి బాక్సులలో ఉంచారు. దీని వల్ల నిరంతర సమీక్షకు చాలా ఉపయోగపడుతుంది. 260 విలీన వ్యాసాలలో 200 విలీనాలు చేసితిని. ఇలాగే రచ్చబండ పేజీలో అనువాదం కోసం, వికీకరణ కోసం, మొలక విస్తరణ కోసం ఎదురుచూసే పేజీల గణాంకాలను చేరిస్తే బాగుండునేమో పరిశీలించండి. -- కె.వెంకటరమణ చర్చ 10:12, 25 సెప్టెంబర్ 2013 (UTC)

మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు. వికీని బాగా పరిశీలించి, నిర్వహణలో వ్యక్తులకు కీలకబాధ్యతలు తగ్గించడానికి అలాచేయడం జరిగింది. మీకు ఉపయోగంగావున్నందులకు, మీ కృషికి సహకరించినందులకు సంతోషం. దీనిని తప్పనిసరిగా విస్తరించవచ్చు. అయితే ముఖ్యమైన నిర్వహణను ప్రత్యేకంగా చూపడానికి వేరొక మూస చేసి సముదాయపందిరిలో పెడితే బాగుంటుందేమో. అన్నట్లు దీనిని ఉదాహరణగా మీరైనా చేయవచ్చు. --అర్జున (చర్చ) 10:43, 25 సెప్టెంబర్ 2013 (UTC)
Return to the user page of "Arjunaraoc/పాత చర్చ 3".