కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ

భారత జాతీయ కాంగ్రెసుకు చెందిన కార్యనిర్వాహక అంగం
(సి.డబ్ల్యు.సి నుండి దారిమార్పు చెందింది)

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి), భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యనిర్వాహక కమిటీ. 1920 డిసెంబరులో నాగపూరులో జరిగిన కాంగ్రెసు పార్టీ సమావేశాల్లో సి. విజయరాఘవాచారియర్ నేతృత్వంలో దీన్ని ఏర్పరచారు. ఇది పార్టీ సీనియర్ నాయకులతో కూడి ఉంటుంది. ముఖ్యమైన విధానం, సంస్థాగత విషయాలపై నిర్ణయాలు తీసుకోవడం, జాతీయ స్థాయిలో పార్టీ కార్యకలాపాలు, ప్రచారాలకు మార్గనిర్దేశం చేయడం దీని బాధ్యతలు. ఇందులో సాధారణంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) నుండి ఎన్నికైన పదిహేను మంది సభ్యులు ఉంటారు. సిడబ్ల్యుసికి పార్టీ అధ్యక్షుడు నాయకత్వం వహిస్తారు. పార్టీ కేంద్ర పాలకమండలి అయిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు.

అలహాబాద్ ఆనంద్ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన మహాత్మా గాంధీ. ఎడమవైపు వల్లభాయ్ పటేల్, కుడివైపు విజయ లక్ష్మీ పండిట్, 1940 జనవరి

వర్కింగ్ కమిటీ వివిధ సమయాల్లో పార్టీలో వివిధ స్థాయిల్లో అధికారాలు ఉండేవి. స్వాతంత్ర్యం రావడానికి ముందు, వర్కింగ్ కమిటీ అధికార కేంద్రంగా ఉండేది. కాంగ్రెస్ అధ్యక్షుడి కంటే వర్కింగ్ ప్రెసిడెంట్ చురుకుగా ఉండేవారు. 1967 తర్వాత కాలంలో, కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా చీలిపోయినప్పుడు (ఇందిరాగాంధీకి విధేయులైన వర్గానికీ, కామరాజ్, ప్రఫుల్ల చంద్ర సేన్, అజోయ్ ముఖర్జీ, మొరార్జీ దేశాయ్ వంటి నాయకులతో కూడిన ప్రాంతీయ నాయకుల సిండికేట్ ల మధ్య చీలిపోయింది) వర్కింగ్ కమిటీ ఆధిపత్యం క్షీణించింది. కానీ 1971 లో ఇందిరా గాంధీ విజయం సాధించాక, రాష్ట్రాల నుండి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుండి అధికారం తిరిగి కేంద్రీకృతమైంది. ఢిల్లీలోని వర్కింగ్ కమిటీ మరోసారి పార్టీకి ప్రధాన నిర్ణయాధికార సంస్థగా మారింది.[1] కాంగ్రెస్ నిర్ణయాధికారంలో ఉండే కేంద్రీకృత స్వభావం అప్పటి నుండి రాష్ట్రాలలోని పరిశీలకులు ఢిల్లీ నుండి వచ్చిన ఆదేశాలు "హైకమాండ్" నుండి వచ్చినట్లు చెప్పడం పరిపాటి అయింది.

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూర్పు

మార్చు

మూలాలు:[2][3][4]

అధ్యక్షుడు

పేరు చిత్తరువు ప్రభుత్వంలో స్థానం
మల్లికార్జున్ ఖర్గే
 

సభ్యులు [5]

ఎస్. లేదు సభ్యుడు చిత్తరువు ప్రభుత్వంలో స్థానం
1. సోనియా గాంధీ  
  • పార్లమెంటు సభ్యులు
  • కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
2. మన్మోహన్ సింగ్  
3. రాహుల్ గాంధీ  
  • పార్లమెంటు సభ్యులు
  • కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు
4. ఎ. కె. ఆంటోనీ  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
5. అంబికా సోనీ  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
6. అభిషేక్ సింఘ్వీ  
  • పార్లమెంటు సభ్యులు
7. అధీర్ రంజన్ చౌదరి  
  • పార్లమెంటు సభ్యులు
8. అజయ్ మాకెన్  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
9. ఆనంద్ శర్మ  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
10. జైరామ్ రమేష్  
  • పార్లమెంటు సభ్యులు
  • మాజీ కేంద్రమంత్రి
11. గైఖంగం గంగ్మై
  • మణిపూర్ మాజీ ఉప ముఖ్యమంట్రి
12. జితేంద్ర సింగ్  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
13. సెల్జా కుమారి  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
14. లాల్ తన్హావ్లా  
  • మిజోరం మాజీ ముఖ్యమంత్రి
15. ముకుల్ వాస్నిక్  
  • పార్లమెంటు సభ్యులు
  • మాజీ కేంద్రమంత్రి
16. చరణ్జిత్ సింగ్ చన్నీ  
  • పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
17. ప్రియాంక గాంధీ వాద్రా  
  • ప్రధాన కార్యదర్శి
18. పి. చిదంబరం  
19. రణదీప్ సుర్జేవాలా  
  • పార్లమెంటు సభ్యులు
20. ఎన్. రఘువీరా రెడ్డి
  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు
21. తారిక్ అన్వర్
 
  • మాజీ పార్లమెంటు సభ్యులు
22. సచిన్ పైలట్  
  • రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి
23. తామ్రధ్వజ్ సాహు
  • శాసన సభ్యులు
24. శశి థరూర్  
  • పార్లమెంటు సభ్యులు
25. సల్మాన్ ఖుర్షీద్  
  • మాజీ Union Minister
  • మాజీ పార్లమెంటు సభ్యులు
26. దిగ్విజయ్ సింగ్  
  • పార్లమెంటు సభ్యులు
  • మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి
27. దీపక్ బబరియా
  • శాసన సభ్యులు
28. మీరా కుమార్  
  • లోక్‌సభ మాజీ స్పీకరు
29. జగదీష్ ఠాకూర్
  • గుజరాత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు]]
30. గులాం అహ్మద్ మీర్
  • జమ్మూకాశ్మీరు పిసిసి మాజీ అధ్యక్షుడు
31. అవినాష్ పాండే
  • మాజీ పార్లమెంటు సభ్యులు
32. దీపా దాస్మున్షి  
  • మాజీ పార్లమెంటు సభ్యులు
33. గౌరవ్ గొగోయ్
  • పార్లమెంటు సభ్యులు
  • లోక్‌సభలో కాంగ్రెసు పార్టీ ఉపనేట
34. సయ్యద్ నసీర్ హుస్సేన్
  • పార్లమెంటు సభ్యులు
35. కమలేశ్వర్ పటేల్  
  • శాసస సభ్యులు
36. కె. సి. వేణుగోపాల  
  • పార్లమెంటు సభ్యులు

శాశ్వత ఆహ్వానితులు

మార్చు
ఎస్. నో సభ్యుడు చిత్తరువు స్థానం
1. ప్రతిభా సింగ్ ఎంపీ లోక్‌సభ మండి
2. పవన్ కుమార్ బన్సాల్   మాజీ ఎంపీ, (చండీగఢ్)
3. వీరప్ప మొయిలీ   మాజీ ఎంపీ, (కర్ణాటక)
4. హరీష్ రావత్   ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి
5. మోహన్ ప్రకాష్ రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే
6. రమేష్ చెన్నితల   కేరళ ఎమ్మెల్యే
7. బి. కె. హరిప్రసాద్ ఎంఎల్సి, కర్ణాటకకర్ణాటక
8. మనీష్ తివారీ   ఎంపీ, పంజాబ్
9. తారిఖ్ హమీద్ కర్రా మాజీ ఎంపీ, జమ్మూ & కాశ్మీర్
10. దీపేందర్ సింగ్ హుడా   ఎంపీ, హర్యానా
11. గిరీష్ చోడంకర్
12. టి. సుబ్బరామారెడ్డి   మాజీ ఎంపీ, ఆంధ్రప్రదేశ్
13. కె. రాజు
14. చంద్రకాంత్ హందోర్   మహారాష్ట్ర మాజీ ఎమ్మెల్యే
15. మీనాక్షి నటరాజన్   మాజీ ఎంపీ, మధ్యప్రదేశ్
16. ఫులో దేవి నేతమ్ ఎంపీ, ఛత్తీస్గఢ్
17. దామోదర్ రాజా నరసింహ తెలంగాణ క్యాబినెట్ మంత్రి
18. సుదీప్ రాయ్ బర్మన్   త్రిపుర ఎమ్మెల్యే

ప్రత్యేక ఆహ్వానితులు

మార్చు
సభ్యుడు పార్టీ స్థానం
జి. సంజీవ రెడ్డి అధ్యక్షుడు, INTUC
నీరజ్ కుందన్ అధ్యక్షుడు, NSUI
బివి శ్రీనివాస్ అధ్యక్షుడు, IYC
లాల్జీ దేశాయ్ చీఫ్ ఆర్గనైజర్, సేవాదళ్
గిడుగు రుద్రరాజు ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు
చింతా మోహన్ మాజీ ఎంపీ
సచిన్ రావు శిక్షణ ఇంచార్జి

విమర్శ

మార్చు

కాంగ్రెస్ దాదాపు 20 సంవత్సరాలుగా సిడబ్ల్యుసికి అంతర్గత ఎన్నికలు నిర్వహించలేదు. చివరి ఎన్నికలు 1998లో జరిగాయి [6] అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని 2017లో ఎన్నికల సంఘం ఆదేశించింది.[7] కానీ 2020 నాటికి ఎన్నికలు జరగలేదు.[8] 2019 లో మహారాష్ట్రలో సైద్ధాంతికంగా శివసేనతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్, సిడబ్ల్యుసిని రద్దు చేయాలని సోనియా గాంధీని బహిరంగంగా కోరుతూ "ఇకపై వారిని విశ్వసించలేము" అన్నాడు.[9][10] 2020 లో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రచురించిన ఒక పత్రంలో సిడబ్ల్యుసి సభ్యులలో చాలామంది "స్వార్థమే పరమార్థంగా ఉన్న విలువలు లేని, అవకాశవాదులు" అని వర్ణించింది.[11]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Towards a More Competitive Party System in India", Ram Joshi and Kirtidev Desai, Asian Survey, Vol. 18, No. 11. (Nov., 1978), pp. 1091-1116.
  2. "Indian National Congress".
  3. "Analysis: New Congress Working Committee - Focus on Polls, Not Rocking Boat".
  4. Phukan, Sandeep (20 August 2023). "Shashi Tharoor, Sachin Pilot included in revamped Congress Working Committee". The Hindu.
  5. "Indian National Congress - Congress Working Committee".
  6. "Nobody But Rahul, Says Congress Leader Whose Father Ran vs Sonia Gandhi". Archived from the original on 12 August 2019. Retrieved 23 August 2020.
  7. "Election Commission Tells Congress to Hold Internal Elections by June 30". Retrieved 23 August 2020.
  8. Pankaj Vohra (August 8, 2020). "EC can freeze Congress symbol or initiate action if the party remains leaderless". Retrieved 23 August 2020.
  9. "Congress "Defamed", Rahul Gandhi Should Return to Lead: Sanjay Nirupam After Maharashtra Twist". Archived from the original on 6 February 2020.
  10. "Old Grudge, Unfulfilled Demand: Why Rahul Gandhi Remained Absent from Cong's Meet on Delhi Riots". 26 February 2020. Archived from the original on 26 February 2020.
  11. "Congress moving towards extinction?". Archived from the original on 14 March 2020.