ఎ. మోహన గాంధీ

సినీ దర్శకుడు
(మోహన్ గాంధి నుండి దారిమార్పు చెందింది)

అన్నే మోహనగాంధీ తెలుగు దర్శకుడు. ఇతడు పలు తెలుగు, కన్నడ, తమిళ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

అన్నె మోహనగాంధీ
Anne MohanaGandhi.jpg
జననంఅన్నె మోహనగాంధీ
(1947-07-07) 1947 జూలై 7 (వయస్సు: 73  సంవత్సరాలు)
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
నివాసంహైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుఎ. మోహన గాంధీ
చదువుబిఎస్సీ
వృత్తిదర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు1967–ఇప్పటివరకు

నేపధ్యముసవరించు

1947 లో విజయవాడలో జన్మించాడు. అక్కడే యస్.ఆర్.ఆర్;సి.వి.ఆర్ కళాశాలలో బిఎస్సీ చదివాడు. తదుపరి ఉన్నత చదువుల కోసం మణిపాల్ లో ఇంజనీరింగ్ విద్యలో చేరాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో నాలుగు నెలలు తిరక్కుండానే దానిని మానివేసి తిరిగి విజయవాడ వచ్చేశాడు.మణిపాల్ వెళ్ళినప్పుడల్లా ఇతని కజిన్ వెంకటరత్నం ఇతని వెంట తోడుగా వచ్చేవాడు. ప్రయాణం మధ్యలో మద్రాసులో ఉదయం నుండి సాయంకాలం దాకా ఉండవలసి వచ్చేది. అప్పుడే ఇతని కజిన్ దూరపుబంధువు అయిన శోభన్ బాబు గారిని కలవడానికి వెళ్ళేవారు. అప్పటికి శోభన్ బాబు తెలుగు చిత్రసీమలో ఇంకా నిలదొక్కుకోలేదు. అతడు వీరి యోగక్షేమాలు కనుక్కొనేవాడు. 1968లో, చదువు మానేసి విజయవాడ వచ్చేశాడు. కోలుకోవడానికి నాలుగైదు నెలలు పట్టింది. స్టేజీ నాటకాలు వేసిన అనుభవం ఉండటంతో సినిమాల పట్ల తన ఆసక్తిని వెంకటరత్నానికి చెప్పాడు. అతడు వెంటనే మోహన గాంధీని హీరో శోభన్ బాబు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. కానీ శోభన్ బాబు ఇతడికి సినిమాల పట్ల గల ఆసక్తిని గమనించి మరోసారి ఆలోచించుకోమన్నారు. మొదట ఎడిటింగ్ పట్ల తనకు ఆసక్తి ఉన్నదని శోభన్ తో చెప్పడంతో, ఎడిటింగ్ అంటే ఒక్క అంశానికే పరిమితమై పోతావు... దర్శకత్వ శాఖలో ప్రయత్నించు అని ఆయన సలహా ఇచ్చాడు. తనకి చిత్రసీమలో ఎవరూ తెలియదని, శోభన్ బాబే తనను రికమెండ్ చేయాలని గాంధీ అభ్యర్థించాడు. హీరో శోభన్ బాబు ద్వారా తెలుగు చలన చిత్ర సీమలో 1967లో ప్రవేశించాడు.

సినీ జీవితముసవరించు

నాటకాల రాయుడు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, మానవుడు దానవుడు, దేవుడు చేసిన పెళ్ళి, అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు, కమలమ్మ కమతం, జీవన్ ధారా, మై ఇంతకామ్ లూంగా మొదలైన చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసారు. అక్కినేని సంజీవి, పి.సుబ్రహమణ్యం, పి.సి.రెడ్డి, ప్రత్యగాత్మ, టి.రామారావు, వి.బి.రాజేంద్రప్రసాద్ మొదలైన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు గ్రహించి 1977లో తొలిసారి నిర్మాత శ్రీ ఎ.వి.సుబ్బారావు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి అర్ధాంగి చిత్రానికి దర్శకత్వం వహించాడు[1].

దర్శకత్వం వహించిన చిత్రాలుసవరించు

తెలుగుసవరించు

కన్నడంసవరించు

  1. సర్కిల్ ఇనస్పెక్టర్
  2. చాముండి

మూలాలుసవరించు

  1. అన్నే, మోహన్ గాంధీ. "మొదటి సినిమా-అన్నే మోహన్ గాంధీ" (PDF). కౌముది.నెట్. Retrieved 1 September 2015.

బయటి లంకెలుసవరించు