అనేది తెలుగు అక్షరమాలలోని హల్లులలో ప్రథమాక్షరము. హల్లులలో కంఠ్య శ్వాస అల్పప్రాణ (Unaspirated voiceless velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [k]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [k].

క
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఇది వ్యంజనవర్ణములలోని మొదటి యక్షరము. ఇది "క" వర్గంలో మొదటి అక్షరం.

ఉచ్చారణా లక్షణాలు

మార్చు

ప్రత్యయంగా

మార్చు

"క" ను వివిధ భాషలలో ప్రత్యయంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు చదువు'క'రా; ఎత్తు'క'రా, తీసు'క'పో మొదలగు పదాలున్నాయి. ఇవే పదాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని కోస్తా ప్రాంతంలో "కు" ప్రత్యయంగా ఉపయోగిస్తారు. ఉదాహరణకు చదువు'కు'రా; ఎత్తు'కు'రా, తీసు'కు'పో మొదలగునవి.

సుమతీ శతకంలోని పద్యాలలో ఈ ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాహరణకు

  • "మడి దున్నుక బ్రతువచ్చు మహిలో సుమతీ."
  • "తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతీ"

భాస్కర రామాయణం లోని పద్యాలలో ఈ ప్రత్యయం కనిపిస్తుంది. ఉదాహరణకు

  • "ఎత్తుక పోవఁగా నృపతి" [భాస్కర రామాయణం 3-1-30]
  • "గరళంబెత్తక గ్రోలఁగా దలచితే." [భాస్కర రామాయణం 3-2-102]

మల్హణ చరిత్ర లో పద్య పాదమైన "చెలియా పిలుచుకరమ్మా" లో "క" ప్రత్యయాన్ని ఉపయోగించారు.

అనర్ఘరాఘవం లో "త్రవ్వుక తినెడు భూదారవరుని" అనే పాదంలో, హంసవింశతి లో "నవమేషముఁ బట్టుకపోవ" పాదంలో, కాళహస్తిమాహాత్మ్యం లోని "నూఱుక త్రావ నీతఁడు కనుంగొనునంతటిలో మనుష్యులన్‌" పాదంలో కూడా "క" ప్రత్యయాన్ని ఉపయోగించడం గమనించవచ్చు.

పరుషము

మార్చు

పలుకడానికి కొంత శ్రమ అవుసరమైన అక్షరాలు పరుషములు. వీటికి "శ్వాసములు" అన్న పేరు కూడా ఉంది. "క,చ,ట,త,ప"లు పరుషములు అంటారు.

క గుణింతం

మార్చు

క, కా, కి, కీ, కు, కూ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః

క+అ క+ఆ క+ఇ క+ఈ క+ఉ క+ఊ క+ఎ క+ఏ క+ఐ క+ఒ క+ఓ క+ఔ క+అం క+అః
కా కి కీ కు కూ కె కే కై కొ కో కౌ కం కః

వృత్యానుప్రాసలో "క"

మార్చు

ఒక హల్లు (వర్ణము) మరల మరల వచ్చుటను వృత్యనుప్రాసమందురు. [1]

ఉదా: కాకీక కాకికి కాక కేకికా?

కాకి ఈక కాకికి కాక కేకి (నెమలి) కి ఉంటుందా? అని అర్థం.

మూలాలు

మార్చు
  1. "అలంకారములు - telugu vyakaranamu". sites.google.com. Archived from the original on 2023-02-18. Retrieved 2023-02-18.
"https://te.wikipedia.org/w/index.php?title=క&oldid=3889725" నుండి వెలికితీశారు