హ
తెలుగు భాషకు అక్షరములు 56. అందులో 16 అచ్చులు, 37 హల్లులు, 3 ఉభయాక్షరములు ఉన్నాయి.
- తెలుగు అక్షరమాలలో అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు.
- అచ్చులు మూడు రకములు. అవి: హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ. దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి తొమ్మిది అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.
- ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.
- తెలుగు అక్షరమాలలో హల్లులు 37 . క నుండి హ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు.
- పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప. సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - గ, జ, డ, ద, బ. స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష. స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి. క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ చ వర్గము - చ, ఛ, జ, ఝ, ఞ ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ త వర్గము - త, థ, ద, ధ, న మ వర్గము - ప, ఫ, బ, భ, మ
- ఉభయాక్షరములు 3 అవి సున్న, అరసున్న, విసర్గము.
![]() | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
తెలుగు వర్ణమాల | |||||||||
అచ్చులు | |||||||||
అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
ఋ | ౠ | ఌ | ౡ | ||||||
ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
ఉభయాక్షరమలు | |||||||||
ఁ | ం | ః | |||||||
హల్లులు | |||||||||
క | ఖ | గ | ఘ | ఙ | |||||
చ | ఛ | జ | ఝ | ఞ | |||||
ట | ఠ | డ | ఢ | ణ | |||||
త | థ | ద | ధ | న | |||||
ప | ఫ | బ | భ | మ | |||||
య | ర | ల | వ | ||||||
శ | ష | స | హ | ||||||
ళ | క్ష | ఱ | |||||||
ౘ | ౙ | ||||||||
చిహ్నములు | |||||||||
ఽ |
హ సవరించు
హల్లులలో కంఠమూలీయ శ్వాస ఊష్మ (voiceless glottal fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [h]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [h].
ఉచ్చారణా లక్షణాలు సవరించు
స్థానం: కంఠమూలీయ (glottal)
కరణం: నాద తంత్రులు (vocal cords)
సామాన్య ప్రయత్నం: శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: ఊష్మ (fricative)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర సవరించు
హకారము ప్రాచీన ద్రవిడ భాషలో లేని అక్షరమని సామాన్య అభిప్రాయము. కానీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు మూల ద్రావిడ భాషలో కంఠమూలీయ ధ్వని ఉండేదని, నేటికీ తమిళములో కనిపించే ఆయిదం అక్షరం దీనికి సాక్షమని అభిప్రాయపడ్డారు[1]. ప్రస్తుతం తమిళములో క, గ, హ ధ్వనులను ఒకటే అక్షరముతో రాస్తారు. తెలుగు మొదలైన ఇతర ద్రావిడ భాషల మాత్రం సంస్కృతం నుండి దీన్ని అక్షరంగా స్వీకరించినవి.[2]
ఏ అక్షరమునైనా పలికేటప్పుడు నాలిక ఆడించే బదులు ఊపిరి గొంతులోనుండి విడిస్తే హకారము పలుకుతుంది. పెసరపప్పును పెహరపప్పు అని అనటము మనము అప్పుడప్పుడు వింటూనే ఉంటాము. కన్నడములో పకారాది శబ్దములన్నీ చాలావరకు హకారాలు కావడము గమనించదగ్గ విషయము (పాలు = హాలు, పావు = హావు, పులి = హులి).[2]
హ గుణింతం సవరించు
హ, హా, హి, హీ, హు, హూ, హె, హే, హై, హొ, హో, హౌ, హం, హః
మూలాలు సవరించు
- ↑ "Evidence for Laryngeal *h in proto-Dravidian" Comparative Dravidian Linguistics: Current Perspectives By Bhadriraju Krishnamurti pp. 323-345 ISBN 0198241224
- ↑ 2.0 2.1 ఆంధ్ర భాషా వికాసము - గంటి జోగి సోమయాజి
- Dravidian Languages - Bhadriraju Krishnamurti pp. 154–157 ISBN 0521771110