హల్లులలో మూర్ధన్య శ్వాస ఊష్మ (voiceless retroflex fricative) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ʂ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṣ].

ష
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

ఉచ్చారణా లక్షణాలు

మార్చు

స్థానం: మూర్ధం (cerebral)

కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)

సామాన్య ప్రయత్నం: శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: ఊష్మం (fricative)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

మార్చు

ఆధునిక తెలుగు ఉచ్చారణలో దీనిని ఆంగ్ల [∫] ధ్వనికి సమీపంగా దంతమూలీయోత్తర ఊష్మం (Voiceless postalveolar fricative) గా పలకడం కద్దు.

ష గుణింతం

మార్చు

ష, షా, షి, షీ, షు, షూ, షె, షే, షై, షొ, షో, షౌ, షం, షః

"https://te.wikipedia.org/w/index.php?title=ష&oldid=2952599" నుండి వెలికితీశారు