క్ష
ఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో క, ష ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. దీనిని ప్రత్యేక వర్ణంగా గుర్తింపు లేకున్నా, ఎక్కువ పదాలలో ఈ ధ్వనులు జంటగా రావడం వలన దీనికి వర్ణమాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించారు.
|
ఉచ్చారణా లక్షణాలు
మార్చుస్థానం: మృదు తాలువు (soft palate)
కరణం: జిహ్వమూలము (tongue root)
సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated) , శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: ఊష్మం (fricative)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
మార్చుఈ వర్ణాన్ని తెలుగు, సంస్కృతాలలో ఇప్పుడు ప్రత్యేక ధ్వనిగా కాక క, ష ధ్వనుల సంయుక్తాక్షరంగా పలుకుతారు. నన్నయ్య ఈ అక్షరానికి క, గ అక్షరాలతో యతి పాటించగా, తిక్కన ష అక్షరంతో యతిమైత్రి కుదర్చడం ఆసక్తిదాయకమైన అంశం.
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |