జ్ఞానపీఠ పురస్కారం

భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం
(జ్ఞానపీఠ్ అవార్డు నుండి దారిమార్పు చెందింది)

భారతదేశపు సాహితీ పురస్కారాల్లో జ్ఞానపీఠ పురస్కారం అత్యున్నతమైంది. దీన్ని టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా పత్రిక వ్యవస్థాపకులైన సాహు జైన్ కుటుంబం ఏర్పాటు చేసిన భారతీయ జ్ఞానపీఠం వారు ప్రదానం చేస్తారు. వాగ్దేవి కాంస్య ప్రతిమ, పురస్కార పత్రం, పదకొండు లక్షల రూపాయల నగదు ఈ పురస్కారంలో భాగం.1964లో నెలకొల్పబడిన ఈ పురస్కారం మొదటిసారిగా 1965లో మలయాళ రచయిత జి శంకర కురుప్‌కు వచ్చింది. భారతీయ అధికార భాషలలో దేనిలోనైనా రాసే భారత పౌరులు ఈ బహుమతికి అర్హులు. ఐతే ఒక భాషాసాహిత్యానికి ఈ పురస్కారం లభించిన తర్వాత మూడేళ్ళపాటు ఆ భాషాసాహిత్యాన్ని ఈ పురస్కారానికి పరిశీలించరు.

Jnanpith Award
పురస్కారం గురించి
విభాగం సాహిత్యం (వ్యక్తిగత)
వ్యవస్థాపిత 1964
మొదటి బహూకరణ 1965
క్రితం బహూకరణ 2018
మొత్తం బహూకరణలు 56
బహూకరించేవారు భారతీయ జ్ఞానపీఠ్
నగదు బహుమతి 11 lakh (equivalent to 14 lakh or US$18,000 in 2020)
వివరణ భారతదేశం లో సాహితీ పురస్కారం
మొదటి గ్రహీత(లు) G. Sankara Kurup

1982కు ముందు, ఏదైనా ఒక రచనకు గాను సంబంధిత రచయితకు ఈ పురస్కారం ఇచ్చేవారు. అప్పటినుండి, భారతీయ సారస్వతానికి చేసిన సేవకు కూడా ఈ బహుమతిని ఇస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కన్నడ రచయితలు అత్యధికంగా ఎనిమిదిసార్లు ఈ పురస్కారం అందుకున్నారు. హిందీ రచయితలు ఆరుసార్లు అందుకున్నారు.

అవార్డు

మార్చు
 
విశ్వనాథ సత్యనారాయణకు అందజేసిన జ్ఞాన పీఠ్ అవార్డు దృశ్యచిత్రం
సంవత్సరం పేరు కృషి భాష
1965 జి. శంకర కురుప్ ఒడక్కుజల్ (వేణువు) మలయాళం
1966 తారాశంకర్ బందోపాధ్యాయ గణదేవత బెంగాలి
1967 డా.కె.వి.పుట్టప్ప (కువెంపు) శ్రీ రామాయణ దర్శన కన్నడ
1967 ఉమాశంకర్ జోషి నిషిత గుజరాతీ
1968 సుమిత్రానందన్ పంత్ చిదంబర హిందీ
1969 ఫిరాఖ్ గోరఖ్‌పురి గుల్-ఎ-నగ్మా ఉర్దూ
1970 విశ్వనాథ సత్యనారాయణ రామాయణ కల్పవృక్షం తెలుగు
1971 బిష్ణు డే స్మృతి సత్తా భవిష్యత్ బెంగాలి
1972 రామ్‌ధరీ సింగ్ 'దినకర్' ఊర్వశీ హిందీ
1973 దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె నాకుతంతి (నాలుగు తీగలు (తంత్రులు) కన్నడ
1973 గోపీనాథ్ మొహంతి మట్టిమతల్ ఒరియా
1974 విష్ణు సఖారాం ఖాండేకర్ యయాతి మరాఠీ
1975 పి.వి.అఖిలాండం చిత్రప్పావై తమిళం
1976 ఆశాపూర్ణా దేవి ప్రథం ప్రతిశృతి బెంగాలి
1977 కె.శివరామ కారంత్ మూక్కజ్జియ కనసుగళు (బామ్మ కలలు) కన్నడ
1978 ఎస్.హెచ్.వి.ఆజ్ఞేయ కిత్నీ నావోన్ మే కిత్నీ బార్ (ఎన్ని పడవల్లో ఎన్నిసార్లు?) హిందీ
1979 బీరేంద్ర కుమార్ భట్టాచార్య మృత్యుంజయ్ అస్సామీ
1980 ఎస్.కె.పొట్టెక్కాట్ ఒరు దేశత్తింతె కథ (ఒక దేశపు కథ) మలయాళం
1981 అమృతా ప్రీతం కాగజ్ తే కాన్వాస్ పంజాబీ
1982 మహాదేవి వర్మ హిందీ
1983 మాస్తి వెంకటేశ అయ్యంగార్ కన్నడ
1984 తకళి శివశంకర పిళ్ళె మలయాళం
1985 పన్నాలాల్ పటేల్ గుజరాతీ
1986 సచ్చిదానంద రౌత్రాయ్ ఒరియా
1987 విష్ణు వామన్ శిర్వాద్కర్ మరాఠీ
1988 డా.సి.నారాయణ రెడ్డి విశ్వంభర తెలుగు
1989 ఖుర్రతుల్-ఐన్-హైదర్ ఉర్దూ
1990 వి.కె.గోకాక్ కన్నడ
1991 సుభాష్ ముఖోపాధ్యాయ బెంగాలి
1992 నరేశ్ మెహతా హిందీ
1993 సీతాకాంత్ మహాపాత్ర ఒరియా
1994 యు.ఆర్.అనంతమూర్తి కన్నడ
1995 ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళం
1996 మహాశ్వేతా దేవి బెంగాలీ
1997 అలీ సర్దార్ జాఫ్రి ఉర్దూ
1998 గిరీష్ కర్నాడ్ కన్నడ
1999 నిర్మల్ వర్మ హిందీ
1999 గురుదయాల్ సింగ్ పంజాబీ
2000 ఇందిరా గోస్వామి అస్సామీ
2001 రాజేంద్ర కేశవ్‌లాల్ షా గుజరాతీ
2002 డి.జయకాంతన్ తమిళం
2003 విందా కరందీకర్‌ మరాఠీ
2004 రెహమాన్ రాహి‌ కష్మీరీ
2005 కువర్ నారాయణ్‌ హిందీ
2006 రవీంద్ర కేళేకర్‌ కొంకణి
2006 సత్యవ్రత శాస్త్రి‌ సంస్కృతం
2007 డా.ఓ.యన్.వి.కురూప్ మళయాళం
2008 అక్లాక్ ముహమ్మద్ ఖాన్ ఉర్దూ
2009 అమర్ కాంత్ హిందీ
2009 శ్రీ లాల్ శుక్లా హిందీ
2010 చంద్రశేఖర కంబార కన్నడ
2011 ప్రతిభా రాయ్ ఒడియా
2012 రావూరి భరద్వాజ పాకుడురాళ్ళు (మాయాజలతారు) తెలుగు
2013 కేదార్‌నాథ్‌ సింగ్ హిందీ
2015 రఘువీర్ చౌదరి గుజరాతీ
2016 శంఖ ఘోష్ బెంగాలీ
2017 కృష్ణ సోబ్తి హిందీ
2018 అమితవ్ ఘోష్ ఆంగ్లం
2019 అక్కితం అచ్యుతన్ నంబూతిరి మలయాళం
2021 నీలమణి ఫూకాన్ అస్సామీ
2022 దామోదర్ మౌజో కొంకణి
2023 గుల్జార్ ఉర్దూ[1]
2023 జగద్గురు రామభద్రాచార్య సంస్కృతం[1]

బయటి లింకులు

మార్చు
  1. 1.0 1.1 Andhrajyothy (17 February 2024). "58 Jnanpith Award: ఈసారి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం ఎవరెవరికంటే..?". Archived from the original on 17 February 2024. Retrieved 17 February 2024.