పద్మ పురస్కార గ్రహీతల జాబితా - 2023
పద్మ పురస్కారం భారతదేశ ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం. 2022వ సంవత్సరానికి గాను వివిధ రంగాలకు చెందిన 106 మంది (పద్మ విభూషణ్ పురస్కారం - 6, పద్మభూషణ్ పురస్కారం - 09, పద్మశ్రీ పురస్కారం - 91) పద్మ పురస్కారాలకు ఎంపికయ్యారు.[1][2]
పద్మ పురస్కారం | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
ఎలాంటి పురస్కారం | పౌర | |
విభాగం | సాధారణ | |
వ్యవస్థాపిత | 1954 | |
మొదటి బహూకరణ | 1954 | |
క్రితం బహూకరణ | 2022 | |
బహూకరించేవారు | భారత ప్రభుత్వం | |
నగదు బహుమతి | ... | |
వివరణ | ... |
2023, మార్చి 22న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా జరిగిన పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా 50 మందికి పద్మ పురస్కారాలు అందజేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, స్మృతి ఇరానీ పాల్గొన్నారు.[3][4] 2023 ఏప్రిల్ 5న మిగిలిన వారికి పద్మ అవార్డులు అందజేశారు.[5]
పద్మ విభూషణ్ పురస్కారం
మార్చుఅసాధారణమైన విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మ విభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో రెండవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 6మందికి ఈ పురస్కారం అందజేశారు.
క్రమసంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
---|---|---|---|
1 | బాలకృష్ణ దోశీ | ఆర్కిటెక్చర్ | గుజరాత్ |
2 | జాకీర్ హుస్సేన్ | కళ | మహారాష్ట్ర |
3 | ఎస్.ఎం. కృష్ణ | ప్రజా వ్యవహారాలు | కర్ణాటక |
4 | దిలీప్ మహలనాబిస్ | వైద్యం (ఓఆర్‌ఎస్ సృష్టికర్త) | పశ్చిమ బెంగాల్ |
5 | శ్రీనివాస్ వరదన్ | సైన్స్, ఇంజనీరింగ్ | యుఎస్ఏ |
6 | ములాయం సింగ్ యాదవ్ | ప్రజా వ్యవహారాలు | ఉత్తర ప్రదేశ్ |
పద్మభూషణ్ పురస్కారం
మార్చుహై ఆర్డర్ విశిష్ట సేవ కొరకు ఇచ్చేది పద్మభూషణ్ పురస్కారం. ఇది భారతదేశంలో మూడవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 9మందికి ఈ పురస్కారం అందజేశారు.
క్రమసంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
---|---|---|---|
1 | ఎస్ ఎల్ భైరప్ప | సాహిత్యం, విద్య | కర్ణాటక |
2 | కుమార్ మంగళం బిర్లా | వాణిజ్యం, పరిశ్రమ | మహారాష్ట్ర |
3 | దీపక్ ధర్ | సైన్స్, ఇంజనీరింగ్ | మహారాష్ట్ర |
4 | వాణి జయరాం | కళ | తమిళనాడు |
5 | చిన జీయర్ స్వామి | ఆధ్యాత్మికం | తెలంగాణ |
6 | సుమన్ కళ్యాణ్పూర్ | కళ | మహారాష్ట్ర |
7 | కపిల్ కపూర్ | సాహిత్యం, విద్య | ఢిల్లీ |
8 | సుధా మూర్తి | సామాజిక సేవ | కర్ణాటక |
9 | కమలేశ్ డి పటేల్ | ఆధ్యాత్మికం | తెలంగాణ |
పద్మశ్రీ పురస్కారం
మార్చువిశిష్ట సేవ కొరకు అవార్డు ఇచ్చేది పద్మశ్రీ పురస్కారం. ఇది భారతదేశంలో నాల్గవ అత్యధిక పౌర పురస్కారం. 2023లో 91మందికి ఈ పురస్కారం అందజేశారు.
క్రమసంఖ్య | పేరు | రంగం | రాష్ట్రం/దేశం |
---|---|---|---|
1 | డా. సుకమ ఆచార్య | ఆధ్యాత్మికం | హర్యానా |
2 | జోధయ్యబాయి బైగా | కళ | మధ్యప్రదేశ్ |
3 | ప్రేమ్‌జిత్ బారియా | కళ | దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ |
4 | ఉషా బార్లే | కళ | ఛత్తీస్‌గఢ్ |
5 | మునీశ్వర్ చందావార్ | వైద్యం | మధ్యప్రదేశ్ |
6 | హేమంత్ చౌహాన్ | కళ | గుజరాత్ |
7 | భానుభాయ్ చితారా | కళ | గుజరాత్ |
8 | హెమోప్రోవా చుటియా | కళ | అస్సాం |
9 | నరేంద్ర చంద్ర దెబ్బర్మ (మరణానంతరం) | ప్రజా వ్యవహారాలు | త్రిపుర |
10 | సుభద్రా దేవి | కళ | బీహార్ |
11 | ఖాదర్ వల్లీ దూదేకుల | సైన్స్, ఇంజనీరింగ్ | కర్ణాటక |
12 | హేమ్ చంద్ర గోస్వామి | కళ | అస్సాం |
13 | ప్రితికనా గోస్వామి | కళ | పశ్చిమ బెంగాల్ |
14 | రాధా చరణ్ గుప్తా | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
15 | మోదడుగు విజయ్ గుప్తా | సైన్స్, ఇంజనీరింగ్ | తెలంగాణ |
16 | అహ్మద్ హుస్సేన్ & శ్రీ మొహద్ హుస్సేన్ * (ద్వయం) | కళ | రాజస్థాన్ |
17 | దిల్షాద్ హుస్సేన్ | కళ | ఉత్తర ప్రదేశ్ |
18 | భికు రామ్‌జీ ఇదటే | సామాజిక సేవ | మహారాష్ట్ర |
19 | సి.ఐ. ఇస్సాక్ | సాహిత్యం, విద్య | కేరళ |
20 | రత్తన్ సింగ్ జగ్గీ | సాహిత్యం, విద్య | పంజాబ్ |
21 | బిక్రమ్ బహదూర్ జమాటియా | సామాజిక సేవ | త్రిపుర |
22 | రామ్‌కుయివాంగ్‌బే జేన్ | సామాజిక సేవ | అస్సాం |
23 | రాకేష్ రాధేశ్యామ్ ఝున్‌జున్‌వాలా (మరణానంతరం) | వాణిజ్యం, పరిశ్రమ | మహారాష్ట్ర |
24 | రతన్ చంద్రాకర్ | వైద్యం | అండమాన్ నికోబార్ |
25 | మహిపత్ కవి | కళ | గుజరాత్ |
26 | ఎం.ఎం. కీరవాణి | కళ | ఆంధ్రప్రదేశ్ |
27 | అరీజ్ ఖంబట్టా (మరణానంతరం) | వాణిజ్యం, పరిశ్రమ | గుజరాత్ |
28 | పరశురామ్ కోమాజీ ఖునే | కళ | మహారాష్ట్ర |
29 | గణేష్ నాగప్ప కృష్ణరాజనగర | సైన్స్, ఇంజనీరింగ్ | ఆంధ్రప్రదేశ్ |
30 | మగుని చరణ్ కుమార్ | కళ | ఒడిషా |
31 | ఆనంద్ కుమార్ | సాహిత్యం, విద్య | బీహార్ |
32 | అరవింద్ కుమార్ | సైన్స్, ఇంజనీరింగ్ | ఉత్తర ప్రదేశ్ |
33 | దోమర్ సింగ్ కున్వర్ | కళ | ఛత్తీస్‌గఢ్ |
34 | రైజింగ్ బోర్ కుర్కలాంగ్ | కళ | మేఘాలయ |
35 | హీరాబాయి లాబీ | సామాజిక సేవ | గుజరాత్ |
36 | మూల్‌చంద్ లోధా | సామాజిక సేవ | రాజస్థాన్ |
37 | రాణి మాచయ్య | కళ | కర్ణాటక |
38 | అజయ్ కుమార్ మాండవి | కళ | ఛత్తీస్‌గఢ్ |
39 | ప్రభాకర్ భానుదాస్ మందే | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర |
40 | గజానన్ జగన్నాథ మనే | సామాజిక సేవ | మహారాష్ట్ర |
41 | అంతర్యామి మిశ్రా | సాహిత్యం, విద్య | ఒడిషా |
42 | నాడోజ పిండిపాపనహళ్లి మునివెంకటప్ప | కళ | కర్ణాటక |
43 | ప్రొఫెసర్ (డా.) మహేంద్ర పాల్ | సైన్స్, ఇంజనీరింగ్ | గుజరాత్ |
44 | ఉమా శంకర్ పాండే | సామాజిక సేవ | ఉత్తర ప్రదేశ్ |
45 | రమేష్ పర్మార్ & శాంతి పర్మార్ * (ద్వయం) | కళ | మధ్యప్రదేశ్ |
46 | డా. నళిని పార్థసారథి | వైద్యం | పుదుచ్చేరి |
47 | హనుమంత రావు పసుపులేటి | వైద్యం | తెలంగాణ |
48 | రమేష్ పతంగే | సాహిత్యం, విద్య | మహారాష్ట్ర |
49 | కృష్ణ పటేల్ | కళ | ఒడిషా |
50 | కె. కళ్యాణసుందరం పిళ్లై | కళ | తమిళనాడు |
51 | వి. పి. అప్పుకుట్టన్ పొదువల్ | సామాజిక సేవ | కేరళ |
52 | కపిల్ దేవ్ ప్రసాద్ | కళ | బీహార్ |
53 | ఎస్.ఆర్.డి. ప్రసాద్ | క్రీడలు | కేరళ |
54 | షా రషీద్ అహ్మద్ క్వాద్రీ | కళ | కర్ణాటక |
55 | సి.వి. రాజు | కళ | ఆంధ్రప్రదేశ్ |
56 | బక్షి రామ్ | సైన్స్, ఇంజనీరింగ్ | హర్యానా |
57 | చెరువాయల్ కె రామన్ | వ్యవసాయం | కేరళ |
58 | సుజాత రాందొరై | సైన్స్, ఇంజనీరింగ్ | కెనడా |
59 | అబ్బారెడ్డి నాగేశ్వరరావు | సైన్స్, ఇంజనీరింగ్ | ఆంధ్రప్రదేశ్ |
60 | పరేష్ భాయ్ రత్వా | కళ | గుజరాత్ |
61 | బి. రామకృష్ణారెడ్డి | సాహిత్యం, విద్య | తెలంగాణ |
62 | మంగళ కాంతి రాయ్ | కళ | పశ్చిమ బెంగాల్ |
63 | కె.సి. రన్రెంసంగి | కళ | మిజోరం |
64 | వడివేల్ గోపాల్ & మాసి సదయ్యన్ * (ద్వయం) | సామాజిక సేవ | తమిళనాడు |
65 | మనోరంజన్ సాహు | వైద్యం | ఉత్తర ప్రదేశ్ |
66 | పతయత్ సాహు | వ్యవసాయం | ఒడిషా |
67 | రిత్విక్ సన్యాల్ | కళ | ఉత్తర ప్రదేశ్ |
68 | కోట సచ్చిదానంద శాస్త్రి | కళ | ఆంధ్రప్రదేశ్ |
69 | సంకురాత్రి చంద్రశేఖర్[6] | సామాజిక సేవ | ఆంధ్రప్రదేశ్ |
70 | కె. షానతోయిబా శర్మ | క్రీడలు | మణిపూర్ |
71 | నెక్రమ్ శర్మ | వ్యవసాయం | హిమాచల్ ప్రదేశ్ |
72 | గురుచరణ్ సింగ్ | క్రీడలు | ఢిల్లీ |
73 | లక్ష్మణ్ సింగ్ | సామాజిక సేవ | రాజస్థాన్ |
74 | మోహన్ సింగ్ | సాహిత్యం, విద్య | జమ్మూ & కాశ్మీర్ |
75 | తౌనోజం చావోబా సింగ్ | ప్రజా వ్యవహారాలు | మణిపూర్ |
76 | ప్రకాష్ చంద్రసూద్ | సాహిత్యం, విద్య | ఆంధ్రప్రదేశ్ |
77 | నెయిహునువో సోర్హీ | కళ | నాగాలాండ్ |
78 | డా. జనుమ్ సింగ్ సోయ్ | సాహిత్యం, విద్య | జార్ఖండ్ |
79 | కుశోక్ థిక్సే నవాంగ్ చంబా స్టాంజిన్ | ఆధ్యాత్మికత | లడఖ్ |
80 | ఎస్. సుబ్బరామన్ | ఆర్కియాలజీ | కర్ణాటక |
81 | మోవా సుబాంగ్ | కళ | నాగాలాండ్ |
82 | పాలం కళ్యాణ సుందరం | సామాజిక సేవ | తమిళనాడు |
83 | రవీనా రవి టాండన్ | కళ | మహారాష్ట్ర |
84 | విశ్వనాథ్ ప్రసాద్ తివారీ | సాహిత్యం, విద్య | ఉత్తర ప్రదేశ్ |
85 | ధనిరామ్ టోటో | సాహిత్యం, విద్య | పశ్చిమ బెంగాల్ |
86 | తులా రామ్ ఉపేతి | వ్యవసాయం | సిక్కిం |
87 | డాక్టర్ గోపాల్సామి వేలుచామి | వైద్యం | తమిళనాడు |
88 | డాక్టర్ ఈశ్వర్ చందర్ వర్మ | వైద్యం | ఢిల్లీ |
89 | కూమి నారిమన్ వాడియా | కళ | మహారాష్ట్ర |
90 | కర్మ వాంగ్చు (మరణానంతరం) | సామాజిక సేవ | అరుణాచల్ ప్రదేశ్ |
91 | గులాం ముహమ్మద్ జాజ్ | కళ | జమ్మూ & కాశ్మీర్ |
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Padma awards2023: చినజీయర్ స్వామికి పద్మభూషణ్.. కీరవాణికి పద్మశ్రీ". EENADU. 2023-01-25. Archived from the original on 2023-01-25. Retrieved 2023-01-25.
- ↑ "రాష్ట్రం నుంచి ఐదుగురికి పద్మ పురస్కారాలు ఇదే వారి నేపథ్యం". ETV Bharat News. 2023-01-26. Archived from the original on 2023-01-26. Retrieved 2023-01-26.
- ↑ "Padma Awards: 2023 ఏడాదికి పద్మ పురస్కారాలు ప్రదానం". EENADU. 2023-03-22. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
- ↑ telugu, NT News (2023-03-22). "రాష్ట్రపతి భవన్‌లో వేడుకగా పద్మ అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-24. Retrieved 2023-03-24.
- ↑ Velugu, V6 (2023-04-05). "Padma awards : ఘనంగా పద్మ పురస్కారాల ప్రదానోత్సవం". V6 Velugu. Archived from the original on 2023-04-05. Retrieved 2023-04-05.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andhra Jyothy (26 January 2023). "పేదల కళ్లలో 'సంకురాత్రి'". Archived from the original on 26 January 2023. Retrieved 26 January 2023.