వాడుకరి:Pranayraj1985/వికీ ఛాలెంజ్

వికీ పరిచయం, ప్రోత్సాహం

మార్చు

నాకు చిన్నప్పటి నుండి సినిమాలు అంటే ఇష్టం. అలాగే సినిమా పాటలను, నచ్చిన అంశాలను, సూక్తులను, ఏదన్న మీటింగ్ జరిగినపుడు వక్తలు మాట్లాడిన దానిలో విశేషాలను నోట్ చేసుకోవడం అలవాటుగా మారింది. డిగ్రీ పూర్తయ్యాక 2009లో హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలోని రంగస్థల కళలశాఖలో విద్యార్థిగా చేరాను. అక్కడ నాకు డా. పెద్ది రామారావు గారు రంగస్థల పాఠాలు బోధించేవారు. అలా పెద్ది సారుతో అనుబంధం ఏర్పడింది. ఆయన సూచనలతో అప్పుడప్పుడు నాటకం గురించి చిన్నచిన్న వ్యాసాలు రాస్తుండేవాణ్ని. 2012లో హైదరాబాద్ విశ్వవిద్యాలయం, రతన్ టాటా ట్రస్ట్ వారి సహకారంతో గోల్డెన్ త్రెషోల్డ్ లో ప్రారంభించిన థియేటర్ ఔట్రీచ్ యూనిట్ ప్రాజెక్టులోకి రామారావు గారు నన్ను ప్రాజెక్టు అసిస్టెంట్ గా తీసుకోవడం జరిగింది. అప్పుడు టాటా ట్రస్ట్ లో ప్రోగ్రామ్ ఆఫీసర్ గా ఉన్న టి. విష్ణువర్ధన్ గారు అక్కడే నాకు పరిచయమయ్యారు. కొంతకాలం తరువాత విష్ణువర్ధన్ గారు బెంగళూరు లోని సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సిఐఎస్) సంస్థకి మారారు. భారతీయ భాషల్లో వికీపీడియానను అభివృద్ధి చేయడం ఆ సంస్థ ముఖ్యోద్దేశ్యం. విష్ణు సార్ హైదరాబాదుకి వచ్చినప్పుడల్లా నాకు వికీపీడియా గురించి చెప్తూ, "వికీపీడియాలో రాస్తే గ్లోబల్ లెవల్లో గుర్తింపు వస్తుంది ప్రణయ్" అని చెప్పి నాకు వికీపీడియా పరిచయం చేసారు. 2012, నవంబరు నెలలో నేను తెలుగు వికీపీడియాలోకి వెళ్ళి అజ్ఞాత వాడుకరిగా కొన్ని మార్పులు చేసాను. అలా అప్పుడప్పుడు తెవికీలో వ్యాసాలను పరిశీలిస్తూ మార్పులు చేస్తుండేవాన్ని. విష్ణువర్ధన్ గారు వికీపీడియా కార్యక్రమాల గురించి నాకు చెపుతుండేవారు.

వికీలో చేరిక, సభ్యుల సహకారం

మార్చు

2013, మార్చి 8న తెలుగు వికీపీడియాలో చేరాను. 2014లో విజయవాడలో జరిగిన దశాబ్ది ఉత్సవాలకు, 2015లో తిరుపతిలో జరిగిన పదకొండో వార్షికోత్సవాలకు ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించాను. వికీ శిక్షణా శిబిరాలు, సమావేశాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నందుకు 2016, నవంబరు 8వ తేదిన తెలుగు వికీపీడియా నిర్వాహకుడి హోదా వచ్చింది.

వికీ ఛాలెంజ్ పరిచయం - స్ఫూర్తి

మార్చు

2016లో ఇటలీలో జరిగిన వికీమానియాకు తెలుగు వికీపీడియా తరపున నేను పాల్గొనడం జరిగింది. అక్కడ ఒక చర్చలో 100వికీడేస్ (100 రోజులు - 100 వ్యాసాలు) ఛాలెంజ్ గురించి తెలిసింది. ఆ తర్వాత కొంతకాలానికి తెలుగు వికీపీడియన్ పవన్ సంతోష్ గారు 100వికీడేస్ ని పూర్తిచేసారు. గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన వికీపీడియా నెలవారీ సమావేశంలో కలిసినప్పుడు, నన్ను కూడా 100వికీడేస్ ఛాలెంజ్ లో పాల్గొనమని చెప్పాడు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రాయడం సాధ్యం కాదేమో అన్నాను. అప్పుడు తను నాకు తన అనుభవం గురించి చెప్తూ, తన 100వికీడేస్ ఛాలెంజ్ సమయంలో తిరుమలకి వెళ్ళాల్సివచ్చిందని, అక్కడ ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో వెంటనే బస్సులో కొండకింద తిరుపతికి వెళ్ళి నెట్ సెంటర్ లో కూర్చొని ఆరోజు వ్యాసం పూర్తిచేశానని చెప్పాడు. ఆ సంఘటన నాకు ఎంతో స్పూర్తి కలిగించింది. నేను కూడా 100వికీడేస్ రాయాలని నిర్ణయించుకున్నాను. ఈలోపు పవన్ గారి చెల్లెలు మీనా గాయత్రి గారు కూడా 100వికీడేస్ ఛాలెంజ్ ప్రారంభించారు.

మామిడి హరికృష్ణ గారి స్ఫూర్తి (ఏ రోజైతే నేను చదవలేదో, రాయలేదో ఆరోజు నేను లేనట్టే అనే మాట)

ప్రారంభం

మార్చు

2016, సెప్టెంబరు 8న నా అభిమాన నటుడు విక్టరీ వెంకటేష్ నటించిన 'ప్రేమతో రా' సినిమా వ్యాసంతో నా వికీ ఛాలెంజ్ ను ప్రారంభించాను.

అవరోధాలు - అధిగమించడం

మార్చు

ఛాలెంజ్ ప్రారంభించిన తొలిరోజుల్లో నేను అవంతిక సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాను. 6 గంటలకి లొకేషన్ కి వెళ్తే, మళ్ళీ రాత్రి 11 గంటలకి వచ్చేవాడిని. లొకేషన్ లో మొబైల్ సిగ్నల్ లేదు. అందుకని పొద్దున 5.30 (UTC 00:00) తరువాత వ్యాసాన్ని కొంత రాసి, మళ్ళీ రాత్రి వచ్చి మిగిలిన వ్యాసాన్ని పూర్తిచేసేవాన్ని.

కొంతకాలం తరువాత నాటక ప్రదర్శనలకు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళవలసి వచ్చింది. అక్కడికి లాప్టాప్ తీసుకెళ్లడం అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి నా మొబైల్ తోనే వ్యాసాలను రాసేవాన్ని. ప్రదర్శనలకు ముందు నా ఫ్రెండ్స్ దగ్గర మొబైల్ హట్స్పాట్ తీసుకొని నా మొబైల్లో వ్యాసాలను సృష్టించి, కొంత సమాచారం చేర్చి నాటక ప్రదర్శన అయిపోయిన తరువాత లేదా ఇంటికి వచ్చిన తరువాత ఆయా వ్యాసాలను అభివృద్ధి చేసేవాన్ని. ఈ విషయంలో జియో నెట్వర్క్ చాలా ఉపయోగపడింది. నా వ్యాస రచనకు ఎంతగానో తోడ్పడింది, ఇప్పటికీ తోడ్పడుతోంది.

వికీవత్సరం ఐడియా

మార్చు

అందరూ 100వికీడేయస్ ఛాలెంజ్ చేస్తున్నారు, అలా కాకుండా నేను దాన్ని పెంచుకొని వికీవత్సరం (WikiYear) చేద్దామనుకున్నాను. ఈ విషయం పవన్ గారికి, మెసెంజర్ లో వికీమీడియా ప్రోగ్రాం ఆఫీసర్ అసఫ్ కి చెప్పగానే గో హెడ్ అన్నారు. అలా వికీవత్సరం, ఆ తరువాత 1000వికీడేస్, ఇప్పుడు 2200వికీడేస్ పూర్తయ్యాయి.

100రోజులతోనే ఆపకూడదు అని చారి సార్ చేసిన సూచన గురించి

మైలురాళ్లు - గుర్తింపులు

మార్చు
  1. 2016, డిసెంబరు 16న 100వికీడేస్ పూర్తయింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు సత్కరించి, వ్యాస రచనకు కావలసిన రిఫరెన్స్ కోసం పుస్తకాలు అందించారు.
  2. 101 నుండి 200 వరకు తెలంగాణ అంశాలపై 100 వ్యాసాలు, 201 నుండి 300 వరకు 100 మహిళా వ్యాసాలు, 365వ రోజు తెలంగాణ సంస్కృతి, 500వ రోజు సండే సినిమా, 1000వ రోజు శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం, మోత్కూర్, 1500వ రోజు నిజాం మ్యూజియం మొదలైన వ్యాసాలు రాశాను.
  3. 2017, సెప్టెంబరు 7న 'వికీవత్సరం' పూర్తైన ఈ సందర్భంగా సెప్టెంబరు 8న భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నాకు అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి కేటీఆర్ గారు కూడా తన ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా అభినందనలు తెలుపడమేకాకుండా ప్రగతి భవన్ లోని తన ఛాంబర్‌లో సత్కరించారు.
  4. 2018 తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జూన్ 1న తెలంగాణ ప్రభుత్వ సమాచార, సాంకేతిక (ఐటీ) శాఖ నిర్వహించిన వార్షిక నివేదిక కార్యక్రమంలో రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేతలమీదుగా లోకలైజేషన్ (స్థానికీకరణ) విభాగంలో తొలి అవార్డును అందజేశారు.

వికీ ఛాలెంజ్ వ్యాసాలు (సంక్షిప్త జాబితా)

మార్చు
క్రమసంఖ్య ప్రత్యేకత వ్యాసంపేరు తేది
1 1వ వ్యాసం ప్రేమతో రా 2016, సెప్టెంబరు 8
2 100వ వ్యాసం పాప్‌కార్న్ థియేటర్ 2016, డిసెంబరు 16
3 161వ వ్యాసం (వికీకల్యాణం (పెళ్ళిరోజు) వ్యాసం) తెలంగాణ యువ నాటకోత్సవం 2017, ఫిబ్రవరి 15
4 200వ వ్యాసం సాఫ్ట్‌నెట్ (మనటీవీ) 2017, మార్చి 26
5 300వ వ్యాసం శ్రీలక్ష్మి కనకాల 2017, జూలై 4
6 365వ వ్యాసం (వికీవత్సర వ్యాసం) తెలంగాణ సంస్కృతి 2017, సెప్టెంబరు 7
7 400వ వ్యాసం జూనియర్స్ 2017, అక్టోబరు 12
8 500వ వ్యాసం సండే సినిమా 2018, జనవరి 20
9 600వ వ్యాసం ఆరోగ్య లక్ష్మి పథకం 2018, ఏప్రిల్ 30
10 700వ వ్యాసం మురళీధర్ తేజోమూర్తుల 2018, ఆగస్టు 8
11 730వ వ్యాసం (2వ వికీవత్సర వ్యాసం) సప్తగుండాల జలపాతం 2018, సెప్టెంబరు 7
12 800వ వ్యాసం హిల్ ఫోర్ట్ ప్యాలెస్ 2018, నవంబరు 16
13 900వ వ్యాసం లాస్ట్ హొరైజన్ 2019, ఫిబ్రవరి 24
14 1000వ వ్యాసం శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం 2019, జూన్ 4
15 1095వ వ్యాసం (3వ వికీవత్సర వ్యాసం) తెలంగాణ యువ నాటకోత్సవం - 5 2019, సెప్టెంబరు 7
16 1100వ వ్యాసం ఖైరతాబాదు వినాయకుడు 2019, సెప్టెంబరు 12
17 1200వ వ్యాసం హైదరాబాదు సరిహద్దు గోడ 2019, డిసెంబరు 21
18 1300వ వ్యాసం కల్వల మాధవరెడ్డి 2020, మార్చి 30
19 1400వ వ్యాసం రంగనాయకసాగర్ జలాశయం 2020, జూలై 9
20 1460వ వ్యాసం (4వ వికీవత్సర వ్యాసం) పద్మ పురస్కారం 2020, సెప్టెంబరు 7
21 1500వ వ్యాసం నిజాం మ్యూజియం 2020, అక్టోబరు 17
22 1550వ వ్యాసం (రోజుకొక వ్యాసం కాన్సెప్ట్ మార్పు) వివాహ పంచమి 2020, డిసెంబరు 6
23 1600వ రోజు (1,830వ వ్యాసం) బొగ్గులకుంట 2021, జనవరి 25
24 1700వ రోజు (2,085వ వ్యాసం) సిరిసిల్ల పురపాలకసంఘం 2021, మే 5
25 1800వ రోజు (2,546వ వ్యాసం) ఫ్రేజర్ ఆల్బమ్ 2021, ఆగస్టు 13
26 1825వ రోజు (5వ వికీవత్సర వ్యాసం: 2,605వ వ్యాసం) తెలంగాణ వంటకాలు 2021, సెప్టెంబరు 7
27 1900వ రోజు (2,771వ వ్యాసం) ఏదుళ్ళగూడెం 2021, నవంబరు 21
27 2000వ రోజు (3,015వ వ్యాసం) తెలంగాణ చరిత్ర 2022, మార్చి 1
28 2100వ రోజు (3,284వ వ్యాసం) మహబూబాబాదు రెవెన్యూ డివిజను 2022, జూన్ 8
29 2191వ రోజు (6వ వికీవత్సర వ్యాసం: 3450వ వ్యాసం) కీర్తి పురస్కారాలు (2019) 2022, సెప్టెంబరు 7
30 2200వ రోజు (3,466వ వ్యాసం) డైమండ్ రత్నబాబు 2022, సెప్టెంబరు 16
31 2300వ రోజు (3,655వ వ్యాసం) కాదంబరి కదమ్ 2022, డిసెంబరు 25
32 2400వ రోజు
33 2500వ రోజు
34 2556వ రోజు (7వ వికీవత్సర వ్యాసం: 4455వ వ్యాసం) వల్మిడి సీతారామచంద్రస్వామి దేవాలయం 2023, సెప్టెంబరు 7
35 2600వ రోజు
36 2700వ రోజు
37 2800వ రోజు
38 2900వ రోజు
39 2922వ రోజు (8వ వికీవత్సర వ్యాసం: 7330వ వ్యాసం)[1][2] చంద్రదేవుడు 2024, సెప్టెంబరు 7

మూలాలు

మార్చు
  1. "భాషా సైనికులు.. భాషా పోషకులు". EENADU. 2024-08-29. Archived from the original on 2024-08-31. Retrieved 2024-09-13.
  2. "రాత ఇంపు.. పలుకు వినసొంపు". EENADU. 2024-08-29. Archived from the original on 2024-08-29. Retrieved 2024-09-13.