వాడుకరి చర్చ:రవిచంద్ర/పాత చర్చ 5

మీ సహాయం కావాలి మార్చు

రవిచంద్ర గారూ, మూసలతో ఇబ్బంది పడుతున్నాను.

  1. మూస:భారతీయ క్షిపణులు‎ ఇది చూడండి, దీన్ని నేను ఎన్వికీ నుండి తెచ్చి కొంత అనువదించాను. అనువాదం చెయ్యకముందు బానే ఉంది, చెయ్యగానే ఇలా మారిపోయింది. ఎక్కడో తప్పు చెసాను, కానీ తెలవడం లేదు.
  2. నా చర్చా పేజీలో పునస్వాగతం విభాగం లోనూ అంతే.., అంతకు ముందు పెట్టిన స్వాగతం పెట్టె నుండి బయటికి రావడం కుదరడం లేదు. మీసాల బ్రాకెట్లతో ఇబ్బందేమైనా ఉందేమో తెలవదంలేదు.

కాస్త చూస్తారా? __చదువరి (చర్చరచనలు)

చదువరి గారూ, రెండూ సరి చేశాను చూడండి. మీ చర్చా పేజీలో సమస్య మీరనుకున్నట్టుగా మీసాల బ్రాకెట్టు క్లోజ్ చేయకపోవడం. క్షిపణి మూసలో సమస్య ఒకే ఒకచోట లింకులకు వాడే చతురస్ర బ్రాకెట్లు క్లోజ్ చేయలేదంతే. ఈ మూసలతో వచ్చిన తంటా ఇదే. నేను నా ప్రయోగ శాల వాడి మీ మార్పులు ఒకదాని తరువాత ఒకటి కాపీ పేస్టే చేస్తూ మునుజూపు చూస్తూ పోతే ఈ విషయం తెలియవచ్చింది. :-) --రవిచంద్ర (చర్చ) 05:43, 26 జూలై 2016 (UTC)Reply
ఆహ! నా చర్చాపేజిలో ఆ మీసాలను సరిచెయ్యడానికి నేనూ ప్రయత్నించాను. ఎందుకో సరికాలేదు. ఫటాఫట్ తేల్చేసారు, థాంక్సండీ! __చదువరి (చర్చరచనలు) 05:47, 26 జూలై 2016 (UTC)Reply

రవిచంద్ర గారూ నాకు మీ సహయం కావాలి. నేను వ్రాసిన వ్యాసాల్లో ఫోలోలు ఎక్కించాలి అనుకుంటున్నా. ఎలాగో నాకు అర్థం కావడం లేదు. మీరు వివరంగా చెప్పండి.

Ch Maheswara Raju (చర్చ) 03:39, 24 ఫిబ్రవరి 2019 (UTC)Reply

చివరి తేదీ పొడిగింపు మార్చు

వికీ మిత్రులకు, పంజాబ్ ఎడిటథాన్ 6 ఆగష్టు 2016 వరకు పొడగించారు. మీరు వ్యాసాలు మార్పులు/సృష్టించడానికి 6 ఆగష్టు వరకు వ్యాసాలు విస్తరించవచ్చు. చూడండి JVRKPRASAD (చర్చ) 07:47, 30 జూలై 2016 (UTC)Reply

ఉచిత సలహా మార్చు

"నా అభిరుచులు"లో ఉపకరణాలులో, విహరణా ఉపకరణాలులో ⧼gadget-Navigation_popups⧽ ఆన్ చేసుకుంటే వ్యాసం లింకుపై కర్సర్ పెట్టగానే దాన్లో ఉన్న అసలు సమాచారం ఎన్ని కెబిలో తెలిసిపోతుంది. చరిత్రను చూడండిలో 3,000 బైట్ల ఉంటే మొలక వ్యాసం దాటినట్టుగా మీరు భావిస్తున్నారని నేను గమనించాను. అందుకే ఈ ఉచిత సలహా.. తప్పుగా అనుకోకండి..:)--Meena gayathri.s (చర్చ) 14:33, 3 ఆగష్టు 2016 (UTC)

Meena gayathri.s గారూ, నిజం చెప్పాలంటే అసలు మొలకకు సరైన నిర్వచనం ఇంకా నాకు తెలియదు :-). బైట్లతో సంబంధం లేకుండా వ్యాసంలో కనీస సమాచారం, ఒక వర్గం, అవసరమైన చోట అంతర్గత లింకులు ఉంటే చాలని నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 04:59, 4 ఆగష్టు 2016 (UTC)
ఇప్పటివరకు తెవికీలో 2కేబిలు దాటని వ్యాసాన్ని మొలక వ్యాసంగా పరిగణిస్తున్నారు. అయితే చరిత్రను చూడండిలో 2వేల బైట్లు దాటితే సరిపోదు. ఎందుకంటే ఆ లెక్కలోకి ఫోటోల కెబిలు, వ్యాసంలోని ఇతర సమాచారానికి చెందిన కేబిలు లెక్కకొచ్చేస్తాయి. కాబట్టీ నేను పైన చెప్పిన విధంగా అయితే కరెక్టుగా ఎన్ని కెబిలో తెలిసిపోతుంది. నాకు తెలిసింది చెప్పాను, ఏం అనుకోకండి.--Meena gayathri.s (చర్చ) 05:07, 4 ఆగష్టు 2016 (UTC)
ఓకే, నావిగేషన్ పాపప్స్ లో చూపించే పరిమాణం రెండు కేబీలు దాటితే మొలక స్థాయి దాటితే చాలంటున్నారు అంతే కదా. ఇక నుంచి నేను కూడా దాన్ని ప్రమాణంగా తీసుకుంటాను. --రవిచంద్ర (చర్చ) 05:26, 4 ఆగష్టు 2016 (UTC)

పంజాబ్ ఎడిటథాన్ విజయం చేసినందుకు ఓ పతకం మార్చు

  పంజాబ్ ఎడిటథాన్ విజయ పతకం
పంజాబ్ ఎడిటథాన్ లో భాగంగా ఎన్నో మంచి వ్యాసాలను రాయడమే కాకుండా, వాటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధతో కృషిచేసి తెవికీ పంజాబ్ ఎడిటథాన్ లో గెలిచేందుకు ముఖ్య పాత్ర పోషించినందుకు ఈ సందర్భంగా మీకు ఓ విజయ పతకం.

పంజాబ్ ఎడిట్-అ-థాన్ నిర్వహణ సమన్వయకర్తలు తరఫున
పవన్ సంతోష్ (చర్చ) 15:03, 10 ఆగష్టు 2016 (UTC)

Rio Olympics Edit-a-thon మార్చు

Dear Friends & Wikipedians, Celebrate the world's biggest sporting festival on Wikipedia. The Rio Olympics Edit-a-thon aims to pay tribute to Indian athletes and sportsperson who represent India at Olympics. Please find more details here. The Athlete who represent their country at Olympics, often fail to attain their due recognition. They bring glory to the nation. Let's write articles on them, as a mark of tribute.

For every 20 articles created collectively, a tree will be planted. Similarly, when an editor completes 20 articles, a book will be awarded to him/her. Check the main page for more details. Thank you. Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 16:54, 16 ఆగష్టు 2016 (UTC), subscribe/unsubscribe)

తెలుగు టైపింగ్ మార్చు

మీరు చెప్పిన ఆప్ డౌన్లోడ్ చేసాను. మంచి ఆప్ ను సూచించినందుకు ధన్యవాదాలు.PhysicsScientist (చర్చ) 05:41, 28 ఆగష్టు 2016 (UTC)

PhysicsScientist గారూ అద్భుతం! మనం మొబైళ్ళలో కూడా తెలుగులో టైపు చేయవచ్చని అందరికీ తెలియజేయాలి. --రవిచంద్ర (చర్చ) 04:19, 29 ఆగష్టు 2016 (UTC)
రవిచంద్ర అవునుPhysicsScientist (చర్చ) 13:34, 29 ఆగష్టు 2016 (UTC)

విజ్ఞప్తి మార్చు

రవిచంద్ర గారు, ఇలా అడుగుతునందుకు తప్పు గా అనుకోకండి. నాకు తెవికీ లో నిర్వాహకుడిగా చేయాలని ఆసక్తి ఉంది. దయచేసి ఇప్పటిదాకా నా పని ని పరిశీలించి, ఇంకా నేనే విధాలుగా ముందుకు సాగాలో, న అవకాశాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో సూచించగలరని నా విజ్ఞప్తి. ధన్యవాదాలు. KingDiggi (చర్చ) 05:58, 1 నవంబర్ 2016 (UTC)

KingDiggi గారూ, నిర్వాహకుడు అంటే సాధారణ సభ్యులకన్నా స్వచ్చందంగా అదనపు బాధ్యతలు స్వీకరించేవారే. నిర్వాహకులకు వికీ విధివిధానాలు, నియమాలపై అవగాహన కలిగి ఉండాలి. కొత్త వాడుకరులకు సహాయం చేయగలిగేలా ఉండాలి. వికీ చర్చల్లో తరచుగా పాల్గొంటూ ఉండాలి. మీరు వ్యాస రచనలో బాగా పాల్గొంటున్నారు. మూసలు, వర్గాలు లాంటి సాంకేతిక అంశాలు కూడా బాగా నేర్చుకోండి. అవసరమైన చోట చర్చల్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీరు ఇటువంటి అంశాల్లో ప్రావీణ్యత కనబరిస్తే వేరే సభ్యులే మిమ్మల్ని నిర్వాహకుడిగా ప్రతిపాదిస్తారు. ఆల్ ది బెస్ట్. --రవిచంద్ర (చర్చ) 15:40, 7 నవంబర్ 2016 (UTC)

ధన్యవాదాలు రవిచంద్ర గారు, మంచి స్పూర్థి నిచ్చరు! KingDiggi (చర్చ) 15:57, 7 నవంబర్ 2016 (UTC)

మెరుగుపరచాల్సిన వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాల జాబితా మార్చు

రవిచంద్ర గారూ, వికీపీడియా ఏషియన్ నెలలో భాగంగా మీరు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. మీరు అడిగిన ప్రకారం వికీపీడియా ఏషియన్ మంత్ లో భాగంగా సమర్పించిన వ్యాసాల్లో మరింత అభివృద్ధి చేయాల్సిన వ్యాసాలను జాబితా వేశాను. గమనించగలరు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:30, 28 నవంబర్ 2016 (UTC)

-పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) పవన్ నేను అభివృద్ధి చేస్తున్న వ్యాసాలు నా ప్రయోగ శాలలో 200 పదాలకు మించి అభివృద్ధి చేసినవి విభాగంలో చూడగలరు. --రవిచంద్ర (చర్చ) 10:39, 28 నవంబర్ 2016 (UTC)
ఓకేనండీ. చూస్తా. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:28, 28 నవంబర్ 2016 (UTC)

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించేందుకు గడువు పెంపు మార్చు

వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలు సమర్పించడానికి గడువు నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. నవంబరు నెలలో, మిగతా ప్రమాణాలను అనుసరిస్తూ వ్రాసిన వ్యాసాలను సమర్పించేందుకు మరో రెండు రోజుల పాటు అవకాశం కల్పించారు. ఈ లంకె అనుసరించి వెళ్ళి అక్కడ సమర్పించవచ్చు, గమనించగలరు. అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:58, 1 డిసెంబరు 2016 (UTC)Reply


Hi ravichandra, Please accept kudos. In Kn-wiki, we could submit in single digits, while you alone has submitted 80 articles.....we need an hour to type out 3500 bytes with markup & citations, but you seem to be way ahead. Kindly share some tips on how to write so much & so better. Any preferences in editor, citations, tools, methods that you use? We look forward to your inputs. -Kudos again. Mallikarjunasj (చర్చ) 05:46, 1 డిసెంబరు 2016 (UTC)Reply

Hi Mallikarjunasj, thank you very much for your compliments. Here are some of the tips that I followed.
  • Most of the articles submitted by me are related to films including movies, artists, and technicians for which there are enough web references and also easily accessible to me.
  • I chose popular topics which are missing in Te-wiki.
  • Whenever I found an article to be written, I prepared a list in my sandbox, so that I would not forget them.
  • I searched for the references both in English as well as Telugu which gave me enough information to fill 3500 bytes.
  • Most of the people look for the references just in the first page of search results. I used to navigate to 5-10 pages depends on the article.
  • I translated a few articles from English. I browsed en-wiki to look for my favorite topics, wherever there is no inter-wiki link,
  • Most of the times I used source editor instead of visual editor because I am comfortable with that. I used visual editor whenever I need to extensively type the content.
  • Because this is an edit-a-thon, I mostly concentrated on the number of articles but with quality information. I could have expanded some articles more with elaborate information, but I postponed them for a later point of time.

Hope this is helpful--రవిచంద్ర (చర్చ) 06:32, 1 డిసెంబరు 2016 (UTC)Reply

Address Collection మార్చు

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your mailing address (not the email) via this google form. This form is only accessed by me and your username will not distribute to the local community to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. Best, Addis Wang, sent by MediaWiki message delivery (చర్చ) 07:58, 3 డిసెంబరు 2016 (UTC)Reply

తొలగించాల్సిన వర్గంలో]] సినిమా పేజీలు మార్చు

స్వరలాసిక, రవిచంద్ర గార్లకు,

తొలగించాల్సిన వర్గంలో సినిమా పేజీలు చాలానే ఉన్నాయి. మీరిద్దరూ సినిమా పేజీలపై పనిచేస్తున్నారు కాబట్టి, మీ వీలువెంబడి వాటిని చూసి తగు చర్య తీసుకోగలరు. __చదువరి (చర్చరచనలు) 04:37, 24 డిసెంబరు 2016 (UTC)Reply

చదువరి గారూ ఈ జాబితాలో చాలా వరకు యాంత్రికంగా సృష్టించిన ఖాళీ వ్యాసాలే. వాటి గురించిన సమాచారం పెద్దగా లభించడం లేదు. అందునా తొలగింపు మూస పెట్టి సంవత్సరం కావస్తున్నా పురోగతి లేని వాటిని తొలగించడం మొదలుపెట్టాను.--రవిచంద్ర (చర్చ) 00:14, 27 డిసెంబరు 2016 (UTC)Reply

ఆంగ్ల వికీలో కల్పనా రాయ్ బొమ్మ గురించి మార్చు

రవిచంద్ర గారూ,
మీరు ఆంగ్ల వికీలో File:KalpanaRaiTeluguActress.png బొమ్మను క్రియేటివ్ కామన్స్ లైసెన్స్ క్రింద విడుదల చేశారు. దీనిని మీ స్వంత కృతిగా పేర్కొన్నారు. బొమ్మను చూసినచో అది ఏదేని వీడియోలోని సన్నివేశంలా ఉన్నది. వికీ నియమాలకు అనుగుణంగా ఇలా ఏదైనా బొమ్మను స్వంత కృతిగా ఎక్కించే విధానమును తెలుపగలరు. ఇది నాకు సహాయకరంగా ఉంటుంది.
భవదీయుడు,
సుల్తాన్ ఖాదర్ (చర్చ) 11:23, 3 జనవరి 2017 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారూ, మీరనుకుంటున్నట్లుగా అవి బయట దొరికే బొమ్మలే :-). నేను ఫైలును యదాతథంగా డౌన్లోడు చేసుకుండా వాటిని ఓపెన్ చేసి నాకు కావలసినంత మేర స్క్రీన్ షాట్ తీసుకుని అప్లోడ్ చేస్తున్నానంతే. ఇది తప్పు కూడా అయ్యుండవచ్చు. కానీ ఇప్పటి దాకా దాని గురించి నోటీసు ఏమీ లేదు. యధాతథంగా ఫైలు బయటి వెబ్ సైట్ల నుంచి కాపీ చేస్తే వికీ వాళ్ళకి దాన్ని సిగ్నేచర్ ఆధారంగా పసిగట్టేస్తుంది. అదే నేను స్క్రీన్ షాట్ తీస్తే అది నా కంప్యూటర్ లో జనరేట్ అయిన ప్రత్యేకమైన ఫైలు, దాని సిగ్నేచరు ఆన్ లైన్ లో మరెక్కడా కనిపించదు. బహుశా అందుకనే ఎవరూ నాకు నోటీసు పంపి ఉండకపోవచ్చు. ఎటూ బొమ్మలు దొరకని పేజీల కోసం ఈ పద్ధతిని పాటిస్తున్నాను కానీ లేకపోతే స్వయంగా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తున్నా.--రవిచంద్ర (చర్చ) 12:33, 3 జనవరి 2017 (UTC)Reply
రవిచంద్ర గారూ ధన్యవాదములు. గతంలో నేను మిర్చి చిత్రానికి ఇలాగే చేస్తే నాకు నోటీసులు వచ్చాయి. నేను పోస్టరును ఫోటో తీసి దానిని నా కంప్యూటర్ నుండి ఎగుమతి చేస్తే వచ్చాయి.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:31, 4 జనవరి 2017 (UTC)Reply
అయితే నేను చేసింది కూడా కాపీరైట్ ఉల్లంఘన అవుతుంది. ఇక నుంచి నేను అలా చేయడం ఆపేస్తాను. --రవిచంద్ర (చర్చ) 05:08, 5 జనవరి 2017 (UTC)Reply

తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను మార్చు

పెద్దగాని సోమయ్య ఈ వ్యాసాన్నీ

నేను తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను.నేను అనుకుంటున్నట్లుగా ఈ పెద్దగాని సోమయ్యకూ పెద్దగా ప్రాముఖ్యత లేదు నాకు తెలియని పొరపాటే ఈ వ్యాసాన్నీ వికీపీడియా నుంచి తొలగించాలని ప్రతిపాదిస్తున్నాను. --ప్రభాకర్ గౌడ నోముల (చర్చ) 13:32, 29 ఏప్రిల్ 2017 (UTC)Reply

Body donation FAQ మార్చు

Sir, I found tht frequently asked questions on body donation were removed by you.y so

ఈ వ్యాసం మీరు సొంతంగా రాసిందా లేక ఎక్కడి నుంచైనా చూసి రాశారా? ఈ వ్యాసం ఎక్కడి నుంచో కాపీ పేస్టు చేశారనిపించింది. అంతే కాకుండా వ్యాసం వికీ శైలిలో లేదు. వికీలో వ్యాసం రాయాలంటే మూలాలు పేర్కొనాలి. అందుకని ఈ వ్యాసం తొలగించాను. అయినా మీరు భయపడాల్సిన పని లేదు. మీరు రాసింది ఎక్కడికీ పోదు. దాన్ని తిరిగి ఒక్క నొక్కుతో పునఃస్థాపించగలం. కానీ వ్యాస సృష్టిలో మనకు కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని అనుసరిస్తూ వ్యాసం రాస్తే బాగుంటుంది. ఉదాహరణకు మీరు రాయదలుచుకున్న వ్యాసం అవయవ దానం అనే పేరుతో రాస్తే బాగుంటుంది. ఇందులో బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా పేరాలుగా విభజించి రాస్తే బాగుంటుంది. మీకు ఆసక్తి ఉంటే ఈ వ్యాసం ప్రారంభించండి. మీకు సహాయపడగలము. --రవిచంద్ర (చర్చ) 19:57, 30 జూలై 2017 (UTC)Reply

Ogran donations FAQ, Body donations FAQ మార్చు

My insertion is on organ donation FAQ, AND Body Donation FAQ, But its my 1st time of editing.....due to this same content was edited and same matter was inserted. Later entire content was edited by someone.... So..kindly help me option to add the both the content....

ప్రసాద్ గారూ, మీరు రాయదలుచుకున్న విషయాన్ని అవయవ దానం అనే వ్యాసంలో రాయండి. వికీలో రాసేటప్పుడు తరచూ అడిగే ప్రశ్నల రూపంలో రాయకూడదు. ఒక వ్యాసం అవయవ దానం పేరుతో ఉన్నప్పుడు అందులోనే చేర్చాలి. ఇంకొక చిన్న విషయం, చర్చా పేజీల్లో రాసేటప్పుడు మీ సంతకం చేయండి. ~~~~ ఇలా నాలుగు టిల్డే గుర్తులు పెడితే మీ సంతకం పెట్టినట్లే. --రవిచంద్ర (చర్చ) 10:31, 31 జూలై 2017 (UTC)Reply

Smjalageri (చర్చ) 14:23, 3 సెప్టెంబరు 2017 (UTC) Hi, I need help. I got your link from Wiki Asia Ambassador page... I was adding info Rajkumar's https://en.wikipedia.org/wiki/Veera_Kesari movie, which was made in Telugu together. Bandipotu, the Senior NTR's 1963 movie directed by B Vitalacharya isn't found in EN-wiki, the 2015 movie has no redirect to old movie. I'm creating the page right now. Would you be interested to create annagaaru movie list, in Telugu/English?Reply

Svagitam dear రవిచంద్ర! Can you make an article about actor en:Jackie Shroff in Telugu? If you make this article, i will be grateful! Thank u! --178.66.102.158 15:52, 21 సెప్టెంబరు 2017 (UTC)Reply

నా యెక్క పేజీ తోలగించారు ఎందుకు ? మార్చు

అయ్యా, నా పేరు. బాహుల్య నేను రాసిన Actorsekharmalla పేజీ ఎందుకు తోలగించారు. తెలుసుకోవచ్చా. అవును నేను కొత్త సభ్యుడుని. దయచేసి తిరిగి రాయటంలో సహాయం చేస్తారా. Bahulyapentakoti (చర్చ) 17:16, 11 అక్టోబరు 2017 (UTC)Reply

Bahulyapentakoti బాహుల్య గారు, దీనికి ముఖ్యంగా రెండు కారణాలున్నాయి. ఒకటి తెలుగు వికీలో వ్యాసం తెలుగులోనే ఉండాలి. రెండోది మీర రాయబోయే వ్యాసానికి ప్రాముఖ్యత ఉండాలి. శేఖర్ మల్ల నాకు ప్రముఖ వ్యక్తి అయినట్టు తోచలేదు. అందుకనే తొలగించాను. ఏమన్నా అభ్యంతరం ఉంటే తెలపండి.--రవిచంద్ర (చర్చ) 14:45, 12 అక్టోబరు 2017 (UTC)Reply

శేఖర్ మళ్ల విశాఖపట్నం లో చాలా ప్రముఖుడు. అతని గురించి పత్రికలో కూడా వచ్చింది. కావాలి అంటే నేను ఎలా రుజువు చేయాలో తెలపండి. ధన్యవాదాలు. Bahulyapentakoti (చర్చ) 15:23, 12 అక్టోబరు 2017 (UTC)Reply

సదరు వ్యక్తి గురించి కేవలం విశాఖపట్నంలో మాత్రం తెలిస్తే చాలదు. కనీసం రాష్ట్రమంతటా తెలియాలి. అప్పుడే వారిని ప్రముఖులుగా పరిగణిస్తాం. పేరొందిన వార్తా పత్రికల్లో కనీసం ఆయన గురించి, ఆయన పని గురించి రాసి ఉండాలి. --రవిచంద్ర (చర్చ) 00:26, 13 అక్టోబరు 2017 (UTC)Reply

భువనేశ్వర్ ఎడిటథాన్ లో కృషికి ఆహ్వానం మార్చు

నమస్తే సర్,
మీతో చర్లో భాగంగా భువనేశ్వర్ ఎడిటథాన్ గురించి ప్రస్తావనకు రావడం మీకు గుర్తుండే వుంటుంది. ఈ నేపథ్యంలో మీకు భువనేశ్వర్ హెరిటేజ్ ఎడిటథాన్ లింకు ఇస్తున్నాను. మీ ఆసక్తి మేరకు కృషిచేస్తారని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:21, 2 నవంబర్ 2017 (UTC)

ప్రశ్నా భండాగారం మార్చు

ప్రశ్నా భండాగారానికి సమాధానం ఎలా వ్రాయాలి?

Is there any Google Group for Telugu Wikipedians? మార్చు

Bro,

I am new to Wikipedia. But by God's grace, I somehow edited some articles too. I am happy for that. And I am happy to find Telugu Wikipedians like you and many other people.

I would like to be a part of Association of Telugu Wikipedians. If there is any Google Group for Telugu Wikipedians; please suggest me.

I have created a Wikipedian Google Group for Indians. Please check the link: Wikipedians (India). I request you to join in this group and gather all our Telugu Wikipedians there.

I hope there will be more good days to come for Telugu Wikipedians to feel proud and happy for what we are doing now.

Thank you,

--కృప వర ప్రసాద్ (చర్చ) 03:46, 21 డిసెంబరు 2017 (UTC)Reply

కృప వర ప్రసాద్ గారూ, గూగుల్ గ్రూపు ఉన్నా అందులోకి రావడానికి సభ్యులు పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. అది ఇప్పుడు జనాలకు పాతబడిపోయింది. నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్నది ఫేస్ బుక్ లోని తెవికీ గ్రూపు. మీకు ఆసక్తి ఉంటే అందులో మిమ్మల్ని చేర్చగలను. నిజం చెప్పాలంటే వికీపీడియా బయటి మాధ్యమాలను ప్రోత్సహించదు. మీరు చర్చించాల్సిన విషయాలను రచ్చబండ లో ప్రచురించవచ్చు. --రవిచంద్ర (చర్చ) 05:28, 22 డిసెంబరు 2017 (UTC)Reply


రవిచంద్ర గారు, నా మాటకు స్పందించినందుకు మీకు దన్యవాదములు.ఫేస్ బుక్ లోని తెవికీ గ్రూపు లో నేను కూడా చేరాలి అని అనుకుంటున్నాను. దయచేసి అందులో నన్ను కూడా చేర్చమని మనవి. --కృప వర ప్రసాద్ (చర్చ) 14:42, 28 డిసెంబరు 2017 (UTC)Reply

మీ ఫేస్ బుక్ ఐడీ చెప్పండి. చేరుస్తాను.--రవిచంద్ర (చర్చ) 15:09, 28 డిసెంబరు 2017 (UTC)Reply

WAM Address Collection మార్చు

Congratulations! You have more than 4 accepted articles in Wikipedia Asian Month! Please submit your postal mailing address via Google form or email me about that on erick@asianmonth.wiki before the end of Janauary, 2018. The Wikimedia Asian Month team only has access to this form, and we will only share your address with local affiliates to send postcards. All personal data will be destroyed immediately after postcards are sent. Please contact your local organizers if you have any question. We apologize for the delay in sending this form to you, this year we will make sure that you will receive your postcard from WAM. If you've not received a postcard from last year's WAM, Please let us know. All ambassadors will receive an electronic certificate from the team. Be sure to fill out your email if you are enlisted Ambassadors list.

Best, Erick Guan (talk)

WAM Address Collection - 1st reminder మార్చు

Hi there. This is a reminder to fill the address collection. Sorry for the inconvenience if you did submit the form before. If you still wish to receive the postcard from Wikipedia Asian Month, please submit your postal mailing address via this Google form. This form is only accessed by WAM international team. All personal data will be destroyed immediately after postcards are sent. If you have problems in accessing the google form, you can use Email This User to send your address to my Email.

If you do not wish to share your personal information and do not want to receive the postcard, please let us know at WAM talk page so I will not keep sending reminders to you. Best, Sailesh Patnaik

Confusion in the previous message- WAM మార్చు

Hello again, I believe the earlier message has created some confusion. If you have already submitted the details in the Google form, it has been accepted, you don't need to submit it again. The earlier reminder is for those who haven't yet submitted their Google form or if they any alternate way to provide their address. I apologize for creating the confusion. Thanks-Sailesh Patnaik

గీతాంజలి కావ్యం మార్చు

రవిచంద్ర గారూ పై వ్యాసంలో (అనువాదం: ఇ.ఎన్.వి.రవి) అనే వాక్యాన్ని మీరు "రచయితల పేర్లు వ్యాసంలో ఉండకూడదు" అనే వ్యాఖ్యానంతో తొలగించారు. మంచిదే. అయితే దాని పైన ఉన్న పద్యంలో (అనువాదం: చలం) అనే వాక్యాన్ని మాత్రం తొలగించలేదు. కారణం తెలుసుకోవచ్చా?--స్వరలాసిక (చర్చ) 07:50, 23 మార్చి 2018 (UTC)Reply

స్వరలాసిక గారూ, చలం కి ఇ. ఎన్. వి. రవి కి ప్రాముఖ్యతలో తేడా ఉంది కదా అనే ఉద్దేశ్యం నాది. అసలు రవి గారు రాసిన అనువాదాన్నంతా తీసేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? రవిచంద్ర (చర్చ) 08:37, 23 మార్చి 2018 (UTC)Reply
రవిచంద్ర గారూ ప్రాముఖ్యత ఇవ్వాల్సింది రచనకు గానీ రచయితకు కాదని నా అభిప్రాయం. ఇ.ఎన్.వి.రవి చేసిన స్వేచ్ఛానువాదంలో మీకు "అనువాదాన్నంతా తీసేస్తే ఇంకా బాగుంటుందని" అనిపించిన కారణం ఏమిటి? నిజానికి గీతాంజలిపై 100కు పైగా తెలుగు అనువాదాలున్నాయి. కొన్ని పద్యాలు శీర్షికలో కనీసము మూడు వేర్వేరు పద్యాలు/గీతాలను వేర్వేరు అనువాదకులవి ఉంటే బాగుంటుందని నేను భావించాను. నాకు అంతర్జాలంలో సులభంగా యూనీకోడులో దొరికి నచ్చిన రెండింటిని ఈ వ్యాసంలో చేర్చాను. మూడవ దానికోసం వెదుకుతున్నాను. మీరు సరైన కారణం చూపి ఇ.ఎన్.వి.రవి అనువాదాన్ని తొలగిస్తే స్వాగతిస్తాను. --స్వరలాసిక (చర్చ) 08:56, 23 మార్చి 2018 (UTC)Reply
స్వరలాసిక గారూ "అనువాదాన్నంతా తీసేస్తే ఇంకా బాగుంటుందని" నాకు అనిపించిన కారణం ఒక ప్రాథమిక నియమం. మనం వ్యాసం రాస్తుంది గీతాంజలి కావ్యాన్ని గురించి కానీ గీతాంజలి లో ఉన్న సారాంశాన్ని కాదు అని. కావ్యాన్ని గురించి రాయడం కూడా వీలైనన్ని తక్కువ పదాల్లో రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అనువాదాల గురించి మరో వ్యాసం రాయచ్చేమో. అంతకు మించి ఏమీ లేదు.ఇదే నియమం చలం అనువాదానికి కూడా వర్తిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం నేను రచయితల పేర్లు వ్యాసంలో ఉండకూడదని చెప్పాను కానో మూలాల్లో కాదు. గీతాంజలి లో పద్యం తెలుగు అనువాదం అని రాసి పక్కనే రవి గారు రాసిన వ్యాసం మూలంగా ఇవ్వవచ్చు అని అనుకుంటున్నాను. రవిచంద్ర (చర్చ) 09:07, 23 మార్చి 2018 (UTC)Reply
రవిచంద్ర గారూ ఒక పుస్తకాన్ని గురించి వ్రాస్తూ ఆ పుస్తకంలోని సారాంశాన్ని చూచాయగా అయినా చెప్పకుండా ఎలా ఉంటాం? ఇక ఈ పుస్తకం అనువాదాల గురించి వేరే సమగ్ర వ్యాసం ఎవరైనా వ్రాస్తే వ్రాయవచ్చు కానీ ఈ వ్యాసంలో ఒక పేరా ఉంటే తప్పులేదు. ఇక రచయితల పేర్లు మూలాలలో పేర్కొనవచ్చనే మీ సూచన నేను మీరు సూచించకముందే పాటించాను. గమనించండి. "కావ్యాన్ని గురించి రాయడం కూడా వీలైనన్ని తక్కువ పదాల్లో రాస్తే బాగుంటుందని నా అభిప్రాయం." ఒక వైపు కనీసం 300 పదాలుండాలని "పాజెక్టు టైగర్ వ్యాసాల" నియమం ఉంటే మీరేమో పదాలను కుదించమంటున్నారు. :-) --స్వరలాసిక (చర్చ) 09:26, 23 మార్చి 2018 (UTC)Reply
స్వరలాసిక గారూ, పుస్తకంలోని సారాంశాన్ని చూచాయగా అయినా చెప్పకుండా ఎలా ఉంటాం? తప్పకుండా చెప్పాలి. ఇక రచయితల పేర్లు మూలాలలో పేర్కొనవచ్చనే మీ సూచన నేను మీరు సూచించకముందే పాటించాను. అవును మీరు ముందే రాసి ఉన్నారు. నేను తర్వాత గమనించాను. ఇక వ్యాసం సైజు గురించి అంటారా. ఒక్కోక్కరిది ఒక్కో శైలి. నాకు క్లుప్తంగా ఉంటే ఇష్టం. అలా అని మిమ్మల్ని కూడా నాలాగే రాయమనకూడదనుకోండి. :-)రవిచంద్ర (చర్చ) 09:32, 23 మార్చి 2018 (UTC)Reply

Share your experience and feedback as a Wikimedian in this global survey మార్చు

WMF Surveys, 18:19, 29 మార్చి 2018 (UTC)Reply

Reminder: Share your feedback in this Wikimedia survey మార్చు

WMF Surveys, 01:17, 13 ఏప్రిల్ 2018 (UTC)Reply

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey మార్చు

WMF Surveys, 00:27, 20 ఏప్రిల్ 2018 (UTC)Reply

కార్టూన్స్ కు సంభందించిన పేజీలను తొలగించుడం గురించి మార్చు

నేను ఏలూరు వాసిని, గత మూడు సంవత్సరములుగా నేను ఆంగ్ల వికీపీడియాను ఎడిట్ చేస్తున్నాను. నేను ఇటీవల తయారు చేసిన కొన్ని కార్టూన్ మరియు ఏనిమె పేజిలను మీరు Speedy Deletion కు Tag చేశారు. అందుకు కారణం వాటికి తెలుగులో తగిన తెలుగులో విషయ ప్రాముఖ్యత లేకపోవడమే అన్నారు. కాని వాటిని రోజూ కొన్ని చానళ్ళలో తెలుగులో ప్రదర్శిస్తారు, కావున మన తెలుగు సీరియల్స్ కు ఎంత ప్రాముక్యత అయితే ఉందో వీటికి కూడ అంత ఉన్నట్లే కదా. అన్ని వాటిని కాకుండా కేవలం ప్రజాధరణ ఉన్నటువంటి వాటినే నేను తయారు చేస్తున్నాను, అందుకు నిదర్శనం వీటికి సంబందించిన వీడియోలు యూట్యూబ్ లో ఉండడం. యూట్యూబ్ మూలంగా వాడకపోయినా వాటి యొక్క పాపులారిటిను తెలియజేయడానికి ఉపయోగపడుతుంది. [1] ఈ జాబితాలో ఏనిమె కూడా ఉన్నది.--IM3847 (చర్చ) 13:15, 27 మే 2018 (UTC)Reply

టివి షోలు విషయ ప్రాముఖ్యతకు కొలమానాలు కావు. ప్రాముఖ్యత అంటే ఏదైనా విషయం గూర్చి వాళ్ళు కాకుండా వేరేవాళ్ళు వాటిని గురించి రాయడం. అంటే పుస్తకాలు, వార్తా వ్యాసాలు లాంటివి. అలాంటి మూలాలు చూపించిన తర్వాత మిగతావి సెకండరీ మూలాలుగా చూపవచ్చు. రవిచంద్ర (చర్చ) 05:17, 28 మే 2018 (UTC)Reply
అంటే వాటికి వార్తా వ్యాసాలు ఉంటాయి కాని తెలుగులో ఉండవు.—IM3847 (చర్చ) 06:09, 28 మే 2018 (UTC)Reply
తెలుగులో లేకపోయినా పరవాలేదు. వాటినే మూలాలుగా చూపించండి. నేను తొలగింపు తీసివేస్తాను. అందరితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుందాము. అలాగే మీ వ్యాసాల గురించి ఇతర నిర్వాహకులు చేర్చిన శుద్ధి మూస ను గురించి కూడా కృషి చేయండి.రవిచంద్ర (చర్చ) 06:14, 28 మే 2018 (UTC)Reply
నేను ఒక ఆంగ్ల వికీపిడియన్ను, గ్రామరు తప్పులు లేకుండా చేయడం నాకు చాలా కష్టము.—IM3847 (చర్చ) 06:28, 28 మే 2018 (UTC)Reply
గ్రామరు తప్పులు పరవాలేదు. కానీ మిగతా సభ్యులు వచ్చి సరి చేసినప్పుడు వాక్య నిర్మాణం, పదాలు ఎలా వాడుతున్నారో తెలుసుకోండి. రవిచంద్ర (చర్చ) 06:32, 28 మే 2018 (UTC)Reply
నేను తయారు చేసిన వ్యాసాల రోజువారి పాఠకుల సంఖ్య [2]లో ఉన్నది.--IM3847 (చర్చ) 09:47, 28 మే 2018 (UTC)Reply

భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాల్లో చేయదగ్గ మార్పులు మార్చు

భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్‌లో పాల్గొంటున్నందుకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ ఎడిటథాన్ ద్వారా మరింత కృషి జరిగేందుకు వీలుగా కొన్ని పనులు చేశాను. అవేమిటో రాస్తున్నాను, మీ కృషిలో ఉపయోగపడతాయేమో పరిశీలించండి, ఇప్పటికే ఆంగ్లంలో ఉన్న భారత స్వాతంత్ర్యోద్యమ వ్యాసాలు జాబితా వేయడం కాకుండా చేసినవి:

  1. వనరులు: రాయడానికి అవసరమైన వనరులు కొన్ని అంతర్జాలంలో అందుబాటులో ఉన్న మేరకు జాబితా వేశాం. దీనిని ఉపయోగించుకుని వ్యాసాల్లో సమాచారం చేర్చవచ్చు. అలానే మీకు ఏదైనా మంచి వనరులు తెలిస్తే (భాషల వారీగా రాయండి, ఆంగ్లం విడిగా ఓ ఉపవిభాగంలో) అక్కడ చేర్చవచ్చు.
  2. చేయదగ్గ పనులు: భారత స్వాతంత్ర్యోద్యమం వర్గానికి చెందిన వ్యాసాల్లో మొలకలు, విస్తరించదగ్గ వ్యాసాలు, కామన్సులో బొమ్మలు ఉండి ఇక్కడ బొమ్మలు లేని వ్యాసాలు ఇలా జాబితా వేసుకుంటూ వెళ్తున్నాం. మీకు వీటిలో ఏదైనా ఒక అంశాన్ని అభివృద్ధి చేసే ఆసక్తి ఉంటే అది తీసుకుని నాణ్యత మెరుగుపరచవచ్చు.

ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:53, 14 ఆగస్టు 2018 (UTC)Reply

భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వికీడేటా లేబులథాన్ మార్చు

భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలుగు సహా వివిధ భారతీయ భాషల వికీమీడియా సముదాయాల్లో ఎడిటథాన్ నిర్వహిస్తున్నట్టే వికీడేటాలో వికీప్రాజెక్టు ఇండియా వారు భారతదేశానికి సంబంధించిన లేబులథాన్ నిర్వహిస్తున్నారు. ఆ పేజీ ఇదిగో ఇక్కడ చూడవచ్చు. సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు, భారత స్వాతంత్ర్యోద్యమం, భారత స్వాతంత్ర్య సమరయోధులు, వగైరా కేటగిరీలకు చెందిన లేబుళ్ళు, డిస్క్రిప్షన్లు వివిధ భారతీయ భాషల్లో చేరుస్తున్నారు. ఒక సారి సదరు పేజీ సందర్శించి, ఆసక్తి మేరకు పాల్గొంటారని ఆశిస్తున్నాను. అదే నేపథ్యంలో మన వికీపీడియా:వికీప్రాజెక్టు/భారత స్వాతంత్ర్య ఉద్యమం ఎడిటథాన్ పేజీలో చేయదగ్గ పనులు ఉప విభాగంలో వికీడేటా ఐటంలో వివరణ (డిస్క్రిప్షన్) లేనివి, తెలుగులో స్వాతంత్ర్యోద్యమం గురించి ఉన్నవీ వ్యాసాలు, వాటి వికీడేటా ఐటంలు జాబితా వేశాను. వికీడేటా పేజీలో పేరు నమోదుచేసుకుని, నేను అందించిన పట్టిక ఉపయోగించి కృషి ప్రారంభించవచ్చు.--పవన్ సంతోష్ (చర్చ) 05:45, 15 ఆగస్టు 2018 (UTC)Reply


కాపుల ఇంటి పేర్లు వ్యాసం తొలగించారు మరి కమ్మ వారి ఇంటి పేర్లు రెడ్డి ఇంటి పేర్లు వ్యాసం ఎందుకు తొలగించా లేదు మార్చు

నమస్కారం రవి చంద్ర గారు కాపుల ఇంటి పేర్లు అనే వ్యాసం మీరు తొలగించారు సంతోషం మరి కమ్మ వారి ఇంటి పేర్లు మరియు రెడ్డి ఇంటి పేర్లు వ్యాసం ఎందుకు తొలగించా లేదు? ఆ వ్యాసాలకు ఎలాంటి మూలాలు లేవు https://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE_%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81

https://te.wikipedia.org/wiki/%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%B2_%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81

Jeevan naidu (చర్చ) 15:36, 30 నవంబర్ 2018 (UTC)

Jeevan naidu, అవి కూడా తొలగించాను. రవిచంద్ర (చర్చ) 00:15, 1 డిసెంబరు 2018 (UTC)Reply

మూలాలు చేర్చినా, అనేకం బయటి లింకులు చేర్చినా ఇంకా ,"మూలాలు లేవనే అభ్యర్థణ్ " న్ఇా ప్కుట లో అలానే ఉంది. మార్చు

రవిచంద్ర గారు దయచేసి గమనించ గలరు.

వాడుకరి:Sudhakarbira గారూ, ఏ పేజీలో? రవిచంద్ర (చర్చ) 17:00, 4 డిసెంబరు 2018 (UTC)Reply

మహ చక్కని వ్యాసాలు మార్చు

రవిచంద్రుడి విజృంభణతో ఇంచక్కగా తయారైన రేలంగి వెంకట్రామయ్య, ఎస్.వి. రంగారావు వ్యాసాలు చూశాను. రేలంగి మా ఊరి వాడే, ఆ రేలంగి చిత్ర మందిర్ పాపం ఇప్పుడు పాడుబడిపోయిందనుకోండి. ఏదేమైనా గత వైభవం. చదివి చాలా సంతోషించాను. నా చేతనైన దిద్దుబాట్లు నేనూ చేస్తాను. రంగారావు ఘటోత్కచుడిగా నిలువెత్తు విగ్రహం కడియం పరిసరాల్లో చూశాను ఒకసారి. ఈ పట్టు ఫోటో ఎలాగైనా పట్టుకొస్తాను. ఇక రేలంగి చిత్ర మందిర్ మా ఊళ్ళోనే ఉంది కాబట్టి ఆ ఫోటో కూడా తెస్తాను. మంచి వ్యాసంగా వీటిని ప్రతిపాదించండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:41, 28 డిసెంబరు 2018 (UTC)Reply

రవిచంద్ర గారూ.. భలే సంగతి. ట్విట్టర్లో నేను ఆ ఫోటో కావాలని ట్వీటాను. వాడుకరి:Kkmohan73 అనే భాషాభిమాని ఒకరు తాను తీసిన ఫోటో కామన్సుకు ఎక్కించేశారు. :-) --పవన్ సంతోష్ (చర్చ) 18:06, 28 డిసెంబరు 2018 (UTC)Reply
పవన్ సంతోష్ మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు. ఎంత రాసినా ఇంకా అందంగా రాస్తే ఉంటే బాగుణ్ణు అనిపిస్తున్నాయి. అందుకనే వాటిని ఇంకా మంచి వ్యాసాలకు ప్రతిపాదించలేదు. మీరు ఓ సారి సమీక్ష చేసి మార్పులు చేస్తే ఇంకా బాగా తయారవుతాయి.రవిచంద్ర (చర్చ) 06:59, 31 డిసెంబరు 2018 (UTC)Reply

మధ్యాహ్న భోజన పథకము మార్చు

రవిచంద్ర గారూ, మధ్యాహ్న భోజన పథకము వ్యాసం బాగుంది. మంచి వ్యాసం అయ్యే లక్షణాలు దానికి పుష్కలంగా ఉన్నాయనిపించింది. వ్యాసాన్ని మొదలుపెట్టి, ఎక్కువ పాఠ్యం చేర్చినది మీరే. మీకు అభినందనలు. ఈ వ్యాసాన్ని మరింత అభివృద్ధి చేసి మంచి వ్యాసం స్థాయికి తీసుకుపోదామా? మీకు ఆసక్తి ఉంటే మీతో కలిసి నేనూ పనిచేస్తా. __చదువరి (చర్చరచనలు) 09:14, 2 మార్చి 2019 (UTC)Reply

చదువరి గారూ, తప్పకుండా అభివృద్ధి చేద్దాము. ముందుగా ఆంగ్ల వికీ చూసి అందులో మూలాలు పరిశీలిస్తాను. మీరు మరికొన్ని మూలాలు ఇవ్వగలిగితే నాకు సాయంగా ఉంటుంది. రవిచంద్ర (చర్చ) 05:24, 7 మార్చి 2019 (UTC)Reply
సరేనండి, నేన్రెడీ. __చదువరి (చర్చరచనలు) 05:40, 7 మార్చి 2019 (UTC)Reply

నమస్కారములు మార్చు

నమస్కారములు

ఒక ఆర్టికల్ రిమూవ్ చేయడానికి,Afd ట్యాగ్ తగ్గిస్తాం కదా ఆ ఆర్టికల్ ఓనర్ ఆ ట్యాగ్ ని రిమూవ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తారా? అలా రిమూవ్ చేస్తే పనిష్మెంట్ ఏమిటి?

అంటే నా ఉద్దేశ్యం డిస్కషన్ జరక్కుండా Afd Tag తీసేయడం తప్పా కాదా?


వాళ్ళని బ్లాక్ చేస్తారా?

Shilpika342 (చర్చ) 04:07, 3 మే 2019 (UTC)Reply

నమస్కారములు మార్చు

నమస్కారములు

ఒక ఆర్టికల్ రిమూవ్ చేయడానికి,Afd ట్యాగ్ తగ్గిస్తాం కదా ఆ ఆర్టికల్ ఓనర్ ఆ ట్యాగ్ ని రిమూవ్ చేస్తే వాళ్ళని బ్లాక్ చేస్తారా? అలా రిమూవ్ చేస్తే పనిష్మెంట్ ఏమిటి?

అంటే నా ఉద్దేశ్యం డిస్కషన్ జరక్కుండా Afd Tag తీసేయడం తప్పా కాదా?


వాళ్ళని బ్లాక్ చేస్తారా?

Shilpika342 గారూ, కొంచెం సందర్భం వివరించండి. ఇది ఎక్కడ జరిగింది? ఎవరు చేశారు? ఎప్పుడు చేశారు. చర్చ లేకుండా Afd Tag తీసేయడం తప్పే. అందుకు వెంటనే నిరోధించడానికి ఒక పద్ధతి ఉంది. సదరు సభ్యుడు పలుమార్లు హెచ్చరించినా అదే పని చేస్తుంటేనో, లేదా మారుపేర్లు సృష్టించి అదే పని చేస్తుంటేనో వెంటనే నిరోధిస్తాం. వ్యాసాల తొలగింపులో, సభ్యుల నిరోధం విధింపులో సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి అంత స్పష్టమైన పాలసీలు తెలుగు వికీలో లేవు. చాలా వరకు ఉల్లంఘన పరిశీలించిన పిదప జరుగుతాయి. అసలు ఏం జరిగిందో చెబితే మీకు మరింత వివరంగా సమాధానం ఇవ్వగలను. రవిచంద్ర (చర్చ) 05:30, 3 మే 2019 (UTC)Reply

Shilpika342 (చర్చ) 04:10, 3 మే 2019 (UTC)Reply

Please see this link...Namaskaram

Thanq for reply


https://te.m.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2651115


(Shilpika342 (చర్చ) 05:43, 3 మే 2019 (UTC)).Reply


https://te.m.wikipedia.org/wiki/వికీపీడియా:Miscellany_for_deletion/వాడుకరి:Bonadea

I opened above discussion

Bonadea disruption in other wiki...i think Sweden wiki block


https://m.mediawiki.org/wiki/Topic:Uys55dxth3cnxq93


(Shilpika342 (చర్చ) 05:45, 3 మే 2019 (UTC)).Reply

Shilpika342 గారూ, సదరు వాడుకరిని గ్లోబల్ గా నిరోధించారు. ఇక్కడ మేము చేయాలసినది ఏమీ లేదు. పైగా అతను ఏ వ్యాసాలలోనూ మార్పులు చేయలేదు. ఒక వేళ ఏదైనా వ్యాసాల్లో వాండలిజానికి పాల్పడ్డట్టు తెలిస్తే చెప్పండి. మేము చర్యలు తీసుకుంటాము.రవిచంద్ర (చర్చ) 06:57, 3 మే 2019 (UTC)Reply
Ok admin,User:Bonadea is Globaly blocked.So using other accounts for disruption pages.

తెలుగు వికీపీడియా ఎక్కువగా చదువుతాను.తెలుగు వికీపీడియాలో మీ సేవలకు ధన్యవాదాలు.నిన్న నిర్వాహకుల నోటీసు బోర్డు చూశాను. అక్కడ నాకు కొన్ని డౌట్స్ వచ్చెయ్ .దాని ఆధారంగాకొన్ని విషయాలు తెలిసాయి

Bonadea ,Bonodeav Bonadeau,BO3NADEA9 all are created by this Bonadea

మీరు ఒక హెల్ప్ చేయండి. నేను నోటీసు బోర్డు loo ఒక కంప్లైంట్ పెడతాను ఈ కంప్లైంట్ వారు రివర్s చేయకుండా చూడండి.

ఈ క్రింది పేజీలో కూడా డిస్కషన్ జరుగుతుంది దాన్ని కూడా Reverse చేయకుండా చూడగలరు ప్లీజ్.

https://te.m.wikipedia.org/wiki/వికీపీడియా:Miscellany_for_deletion/వాడుకరి:Bonadea

మీరు అనుమతిస్తే నోటీస్ బోర్డ్ లో కంప్లైంట్ పెడతాను.దయవుంచి రిప్లై ఇవ్వండి ప్లీజ్


(Shilpika342 (చర్చ) 07:05, 3 మే 2019 (UTC)).Reply

నిర్వాహకత్వానికి గుర్తింపు మార్చు

  చురుకైన నిర్వాహకులు
వికీనిర్వహణలో నిరంతరాయంగా భాగం పంచుకుంటున్నందులకు అభివందనలు.--అర్జున (చర్చ) 04:43, 3 ఆగస్టు 2019 (UTC)Reply


Community Insights Survey మార్చు

RMaung (WMF) 14:33, 6 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 15:09, 20 సెప్టెంబరు 2019 (UTC)Reply

Reminder: Community Insights Survey మార్చు

RMaung (WMF) 19:01, 3 అక్టోబరు 2019 (UTC)Reply

అమ్మ ఒడి పథకం గురించి మార్చు

రవిచంద్ర గారు అమ్మ ఒడి పథకం మూలాలు ఇచ్చాను.మీరు పరిశీలించి మూసను తొలిగించండి. ఇంకా ఈ వ్యాసం లో ఏమైనా మార్పులు చేయాలి అంటే నాకు తెలియజేయండి. ధన్యవాదములు. Ch Maheswara Raju (చర్చ) 15:20, 30 నవంబర్ 2019 (UTC)

నందకం వ్యాసం అభివృద్ధి గురించి మార్చు

రవిచంద్ర గారు క్షమించాలి.వృత్తిరీత్యా మీరు పనివత్తిడిలో ఉండారనుకుంటాను.నందకం వ్యాసం 2008 లో మీచే ఈ సృష్టించబడింది.హిందూ పురాణాల ప్రకారం ఇది మంచి వ్యాసం అని నేను భావిస్తున్నాను.ఆంగ్లవ్యాసం nandaka ఉంది.దీని ఆధారంగా అభివృద్ధి చేయగలరని ఆశించుచున్నాను.--యర్రా రామారావు (చర్చ) 06:41, 21 జనవరి 2020 (UTC)Reply

యర్రా రామారావు గారూ, ఈ వ్యాసాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నేను అభివృద్ధి చేస్తాను. రవిచంద్ర (చర్చ) 11:42, 22 జనవరి 2020 (UTC)Reply

Possibly unfree దస్త్రం:Election2009.JPG మార్చు

A file that you uploaded or altered, దస్త్రం:Election2009.JPG, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. IM3847 (చర్చ) 17:16, 12 మార్చి 2020 (UTC)Reply

IM3847, నాకు కాపీరైటు గురించి పూర్తిగా తెలియనపుడు నేను ఎక్కించిన ఫోటోలవి. ఫోటో మాత్రం ఖచ్చితంగా నేను తీసినదే. అప్పటికి నాకు తెలిసిందేంటంటే మన స్వంత కెమెరాతో తీసిన ఏ ఫోటోనైనా పబ్లిక్ డొమైనులో విడుదల చేయవచ్చని. ఇప్పటికి కొంత అర్థం అయింది. ఈ ఫోటో కాపీరైటు ఉల్లంఘిస్తుంటే అలాగే తొలగించి వేయండి. రవిచంద్ర (చర్చ) 08:06, 13 మార్చి 2020 (UTC)Reply
రవిచంద్ర గారూ, మీరు అన్నట్లుగానే మన స్వంత కెమెరాతో తీసిన ఏ ఫోటోనైనా పబ్లిక్ డొమైనులో విడుదల చేయవచ్చు కానీ వాటిలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. Freedom of Panorama అనే ఒక నియమంలో వీటి గుర్తించి క్లుప్తంగా ఉంది. వేరొకరు తయారుచేసిన ఫ్లెక్సీలు, చిత్రలేఖనాల కాపీరైట్లు పుస్తకాల వలే రచయితపై ఆధారపడి ఉంటుని. OTRS పద్ధతిలో మాత్రమే వీటిని వికీప్రాజెక్టులలో చేర్చగలము.--IM3847 (చర్చ) 15:21, 13 మార్చి 2020 (UTC)Reply

wiki లో ఆర్టికల్ ఏవిధముగా రాయాలి ఒక బుక్ రాయాలి అంటే ఎలా మార్చు

wiki లో ఆర్టికల్ ఏవిధముగా రాయాలి ఒక బుక్ రాయాలి అంటే ఎలా Bharathwaj.komarraju @ gmail

 

ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2008 నుండి మొలక. ఏకవ్యాస వ్యాసం, దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 10:51, 13 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 10:51, 13 ఏప్రిల్ 2020 (UTC)Reply

కె.వెంకటరమణ గారూ, ఈ వ్యాసం అప్పట్లో ఆంగ్లవికీలో ఉన్న ఒక వ్యాసం ఆధారంగా రాయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ పేరుతో అసలు వ్యాసమే లేకుండా m:en:Energy development అనే వ్యాసానికి దారి మళ్ళించి ఉన్నారు. కాబట్టి ఈ వ్యాసం తొలగించివేయవచ్చును. రవిచంద్ర (చర్చ) 15:24, 13 ఏప్రిల్ 2020 (UTC)Reply

థామస్ బేయిస్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన మార్చు

 

థామస్ బేయిస్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

2008-03-04 నుండి ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. వికీ నియమాల ప్రకారం ఈ వ్యాసం తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 10:39, 15 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణచర్చ 10:39, 15 ఏప్రిల్ 2020 (UTC)Reply

దత్తత వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన మార్చు

 

దత్తత వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము. వికీ నియమాల ప్రకారం తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. కె.వెంకటరమణ (చర్చ) 13:01, 21 ఏప్రిల్ 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 13:01, 21 ఏప్రిల్ 2020 (UTC)Reply

మతిమరపు వ్యాధి వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

మతిమరపు వ్యాధి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2011 నుండి మొలక. దీనిని వ్యాసంగా పరిగణించలేము. వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/మతిమరపు వ్యాధి పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 10:23, 17 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 10:23, 17 మే 2020 (UTC)Reply

రీ-మార్చు మార్చు

పేజీని తిరిగి సవరించినందుకు క్షమించండి Susenaes (చర్చ) 10:40, 31 మే 2020 (UTC)Reply

Susenaes do you know how to read and write Telugu? I have just reverted your changes on a page where it removes some of the existing content. Please don't do that. - రవిచంద్ర (చర్చ) 10:42, 31 మే 2020 (UTC)Reply

మీరు వికీమీడియాలో చిత్రాలను అప్‌లోడ్ చేస్తున్నారా?Susenaes (చర్చ) Susenaes (చర్చ) 10:45, 31 మే 2020 (UTC)Reply

Are you upload the pictures in Wikimedia Susenaes (చర్చ) 10:47, 31 మే 2020 (UTC)Reply

Susenaes, Yes I do upload picture in Wikimedia. Let me know how can I help. - రవిచంద్ర (చర్చ) 10:49, 31 మే 2020 (UTC)Reply

Can you upload the picture in Vani Bhojan Wikipedia page. There is an one but she has more Wikipedia's so that you upload the pictures. Please Susenaes (చర్చ) 10:51, 31 మే 2020 (UTC)Reply

She has one picture but another one picture for Vani Bhojan Wikipedia's page Susenaes (చర్చ) 10:52, 31 మే 2020 (UTC)Reply

Please upload the pictures. Please I hope you upload the pictures in Vani Bhojan Wikipedia page Susenaes (చర్చ) 10:55, 31 మే 2020 (UTC)Reply

Susenaes , I don't have any pictures of Vani Bhojan top upload. Wikimedia does not accept pictures that are downloaded somewhere from the internet. They violate copyrights. So if you have a picture of her that you own, or you know that it is not copied from any other source, then only you can upload. I see that her Engligh wikipedia page has one image, but it is not correctly licensed. so it can't be uploaded. - రవిచంద్ర (చర్చ) 10:56, 31 మే 2020 (UTC)Reply

When you have the picture in Vani Bhojan Susenaes (చర్చ) 10:59, 31 మే 2020 (UTC)Reply

Susenaes, I don't have any pictures of Vani Bhojan, because I never took her photos. I can't take her photos. Sorry I can't help. Please spend some time understanding the copy right policies of wiki before contributing. - రవిచంద్ర (చర్చ) 11:02, 31 మే 2020 (UTC)Reply

When you have Vani Bhojan pictures you upload Susenaes (చర్చ) 11:02, 31 మే 2020 (UTC)Reply

I also don't have any pictures of her. Only Freely licensed image want to upload. Susenaes (చర్చ) 11:05, 31 మే 2020 (UTC)Reply

Susenaes, It seems that you don't understand English properly. If somebody uploads a picture of her, which confirms to the copyright rules of wikimedia, then this picture can be updated here. Until that time, you can't have her picture here. So I don't upload. it is not my job. - రవిచంద్ర (చర్చ) 11:02, 31 మే 2020 (UTC)Reply

Another one help Susenaes (చర్చ) 11:05, 31 మే 2020 (UTC)Reply

You will do Susenaes (చర్చ) 11:06, 31 మే 2020 (UTC)Reply

Susenaes What is that? - రవిచంద్ర (చర్చ) 11:08, 31 మే 2020 (UTC)Reply

You having English Wikipedia account Susenaes (చర్చ) 11:09, 31 మే 2020 (UTC)Reply

Yes I do have, if I can guess what you want, you will ask me to upload the picture on English wikipedia to wikimedia, It is not possible because the picture violates the copyrights. it can't be done. - రవిచంద్ర (చర్చ) 11:12, 31 మే 2020 (UTC)Reply

Please say Susenaes (చర్చ) 11:12, 31 మే 2020 (UTC)Reply

Unless you tell me clearly what you want, everything at a time, I can't help you. Tell me clearly what you want,I will give you one more chance. If you are not clear, I won't reply. You are simply wasting my time. - రవిచంద్ర (చర్చ) 11:16, 31 మే 2020 (UTC)Reply

Can you expand Vani Bhojan enwiki page including early life, career, filmography and reference. Please

Susenaes (చర్చ) 11:17, 31 మే 2020 (UTC)Reply

Sorry I wasting your time. Sorry this alone please Susenaes (చర్చ) 11:19, 31 మే 2020 (UTC)Reply

Please Susenaes (చర్చ) 11:20, 31 మే 2020 (UTC)Reply

I am not interested in that article. So I can't help adding to that. Sorry.- రవిచంద్ర (చర్చ) 11:22, 31 మే 2020 (UTC)Reply

Please add. Susenaes (చర్చ) 11:25, 31 మే 2020 (UTC)Reply

Please Susenaes (చర్చ) 13:27, 1 జూన్ 2020 (UTC)Reply


సూచించండి మార్చు

రవిచంద్ర గారు, ఇలాంటి నెదర్లాండ్స్ తెలుగు సంఘం కొత్త పేజీకి ఎలాంటి మూస వాడాలో సూచించ గలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 10:45, 5 జూలై 2020 (UTC)Reply

మాధవయ్యగారి మనవడు మార్చు

మాధవయ్యగారి మనవడు ను మొలక స్థాయిని దాటించారు. పేజీ సైజు మరీ మొలక సరిహద్దు లోనే ఉంది కదా అని సందేహించారేమో తెలియదు గానీ, మూస తీసెయ్యలేదు. మూస తిసెయ్యొచ్చునని, దీన్ని మీ కృషిలో చేర్చుకోవచ్చుననీ నా అభిప్రాయం. పరిశీలించండి. __చదువరి (చర్చరచనలు) 06:05, 17 ఆగస్టు 2020 (UTC)Reply

చదువరి గారూ మూస తీసేయడం మరిచిపోయాను. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. నా కృషిలో చేర్చుకుంటాను. - రవిచంద్ర (చర్చ) 09:52, 17 ఆగస్టు 2020 (UTC)Reply

మొలకల విస్తరణ ఋతువు 2020 ప్రాజెక్టు విజయవంతమైనందుకు అభినందిస్తూ... మార్చు

 
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టులో భాగంగా మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి - స్వరలాసిక
స్వరలాసిక గారు ధన్యవాదాలు. - రవిచంద్ర (చర్చ) 18:06, 3 సెప్టెంబరు 2020 (UTC)Reply

పరమాణువు మార్చు

రవిచంద్రగారూ పరమాణువుకి సంబంధించిన ఆంగ్ల వ్యాసాన్ని అనువదిస్తున్నాను. 70 శాతం పూర్తయింది. – K.Venkataramana  – 13:47, 8 అక్టోబరు 2020 (UTC)Reply

వెంకటరమణ గారూ, నేను మానవీయంగా చేసిన అనువాదం చూడండి. రెండింటినీ ఎలా విలీనం చేయాలో చూద్దాం. - రవిచంద్ర (చర్చ) 16:25, 8 అక్టోబరు 2020 (UTC)Reply

ఆవు పులి కథ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

ఆవు పులి కథ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

కథలు యధాతధంగా వ్రాయటానికి వికీపీడియా సరైన స్థలం కాదు. దీనిని వ్యాసంగా పరిగణించలేము.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఆవు పులి కథ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి.  – K.Venkataramana  – 04:10, 15 డిసెంబరు 2020 (UTC)  – K.Venkataramana  – 04:10, 15 డిసెంబరు 2020 (UTC)Reply

వెంకటరమణ గారూ, ఈ వ్యాసం నేను వికీకి వచ్చిన మొదట్లో వికీ విధి విధానాలు తెలియని రోజుల్లో రాసినది. కాబట్టి ఈ వ్యాసాన్ని తొలగించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. రవిచంద్ర (చర్చ) 04:15, 15 డిసెంబరు 2020 (UTC)Reply

థియోడర్ రూజ్‌వెల్ట్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన మార్చు

 

థియోడర్ రూజ్‌వెల్ట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2011 లో సృష్టించబడింది. అప్పటినుండి కేవలం మూడు లైన్లుతో కూడిన సమాచారం మాత్రమే ఉంది. 2020 డిసెంబరు 31 లోపు వ్యాసాన్ని విస్తరించి, తగిన మూలాలు కూర్పు చేయనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/థియోడర్ రూజ్‌వెల్ట్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 16:36, 24 డిసెంబరు 2020 (UTC) యర్రా రామారావు (చర్చ) 16:36, 24 డిసెంబరు 2020 (UTC)Reply

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు మార్చు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)Reply

యర్రా రామారావు అడుగుతున్న ప్రశ్న (06:47, 19 మార్చి 2021) మార్చు

హలో రవిచంద్ర గారూ, ఇది ఒక పరీక్షా సందేశం. --యర్రా రామారావు (చర్చ) 06:47, 19 మార్చి 2021 (UTC)Reply

రామారావు గారూ, సమాధానాలు శిష్యుల హోంపేజీలో కనిపిస్తున్నాయా లేదా అని మరోసారి పరీక్షిద్దాం. ఈ సమాధానం మీ హోం పేజీలో వచ్చిందా లేదా ఒకసారి చూడండి. రవిచంద్ర (చర్చ) 07:03, 19 మార్చి 2021 (UTC)Reply
Return to the user page of "రవిచంద్ర/పాత చర్చ 5".