ఒక ప్రత్యేక ఆశయంతో ఉద్యమ రూపంలో గ్రంథాలను ప్రచురించి పాఠకులకు అందించే ఉద్దేశంతో గ్రంథమాలలు ప్రారంభించబడ్డాయి. చాలామటుకు ఈ గ్రంథమాలలు దాతల విరాళాలతో, పాఠకుల చందాలతో లాభాపేక్ష లేకుండా నడిచాయి. ఈ గ్రంథమాలల్లో ప్రచురించిన గ్రంథాలను చాలామంది ప్రచురణ కర్తలు పుష్పాలు లేదా కుసుమాలతో పోల్చేవారు. మొదట వెలువడ్డ పుస్తకాన్ని మొదటిపుష్పం అని, రెండవ గ్రంథాన్ని రెండవ పుష్పం అనీ పేర్కొనేవారు.

కొన్ని గ్రంథమాలలు:

అణా గ్రంథమాలసవరించు

కె.సి.గుప్త, వెల్దుర్తి మాణిక్యరావులు ఈ గ్రంథమాలను నడిపారు.1938లో స్థాపించబడింది. ప్రతి పుస్తకం పాఠకుడికి ఒక అణాకే అందించాలనేది ఈ గ్రంథమాల ఆశయం.

 1. రైతు - వెల్దుర్తి మాణిక్యరావు
 2. కాంగ్రెసు చరిత్ర - మొదటిభాగం - జానపాటి సత్యనారయణ
 3. కాంగ్రెసు చరిత్ర - రెండవభాగం - జానపాటి సత్యనారయణ
 4. మొగలాయి కథలు - సురవరం ప్రతాపరెడ్డి
 5. సోషలిజం - గొబ్బూరు రామచంద్రరావు
 6. యం.యన్.రాయ్ - గుండవరము హనుమంతరావు
 7. నా కొడుకు - ధనికొండ హనుమంతరావు
 8. పండిత జవహర్‌లాల్ నెహ్రూ - కె.రంగదాసు
 9. జాగీరులు - ఉమ్మెంతల కేశవరావు, సురవరం ప్రతాపరెడ్డి
 10. కాళోజీ కథలు (1943)- కాళోజీ నారాయణరావు
 11. అణాకథలు (1949)
 12. సావర్కర్ - కె.రంగదాసు
 13. ఎల్లోరా-అజంతా తీర్థయాత్ర - అడవి బాపిరాజు
 14. దయానంద సరస్వతి - వెల్దుర్తి మాణిక్యరావు
 15. హైదరాబాదు రాజ్యాంగసంస్కరణలు - వెల్దుర్తి మాణిక్యరావు
 16. మణిమేఖల - పులవర్తి కమలావతీదేవి
 17. మాలతీగుచ్ఛము - మాడపాటి హనుమంతరావు

అభినవాంధ్ర గ్రంథమాలసవరించు

రాజమండ్రి. శ్రీపాద కామేశ్వరరావు దీనిని ప్రారంభించాడు.

అరుణశ్రీ గ్రంథమాలసవరించు

సికందరాబాదు. మడిపడగ బలరామాచార్యులు, రామమూర్తి గోపాలాచార్యులు ఈ గ్రంథమాల సంచాలకులు. తెలంగాణాలోని ప్రఖ్యాతరచయితల రచనలను ముద్రితరూపంలో అందించడం ఈ గ్రంథమాల ముఖ్యోద్దేశము.

 1. జలపాతం - సి.నారాయణరెడ్డి
 2. అజంతాసుందరి (గేయనాటికల సంపుటి) - సి.నారాయణరెడ్డి

అంతర భారతీయ గ్రంథమాలసవరించు

నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు భారతదేశంలోని ఒక్కో భాషలో ఉన్న అపురూపమైన సాహిత్యం మరో భాష వారికి అందాలనే ఉద్దేశంతో నిర్వహించిన గ్రంథమాల ఇది. దీని ద్వారా భారత రాజ్యాంగం గుర్తించిన ప్రధానమైన భాషల సాహిత్యాన్ని ఆయా భాషల్లో ఒకదానిలోకి మరొకటి అనువాదం చేసి ప్రచురించారు.

ఆంధ్ర ఆయుర్వేద గ్రంథమాలసవరించు

రాజమండ్రి

 1. రసేంద్రసార సంగ్రహము - గోపాలకృష్ణ భట్టసూరి

ఆంధ్ర గ్రంథమాలసవరించు

కాశీనాథుని నాగేశ్వరరావు మద్రాసులో 1921లో దీనిని స్థాపించాడు.

 1. భగవద్గీత
 2. బసవపురాణం
 3. పండితారాధ్యచరిత్ర
 4. ఆంధ్రశబ్దచింతామణి
 5. శతకమంజరి
 6. ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము
 7. మహాఋషి నిఘంటిత యోగశాస్త్రము
 8. పారిభాషిక పదకోశము
 9. శ్యామాసుందరము - ఒం.సత్యనాథము
 10. ఆంధ్రవాజ్మయ సూచిక
 11. ఆంధ్ర భారతకవితావిమర్శనము - కోరాడ రామకృష్ణయ్య
 12. భీష్ముడు (నాటకము) - పొ.పిచ్చిరెడ్డి
 13. భారతీయ చిత్రకళ - తలిశెట్టి రామారావు
 14. అవిమారకము (నాటకము) - మానవల్లి రామకృష్ణ కవి
 15. కృషీవల విజయము
 16. మేఘదూత - దీపాల పిచ్చయ్యశాస్త్రి
 17. జీవనప్రభాతము (కె.యస్.వెంకటరమణి వ్రాసిన ఆంగ్లనవల Murugan the Tillerకు ఆంధ్రీకరణం)- అనువాదకుడు: పోలవరపు రామబ్రహ్మం
 18. వివాహతత్త్వము - బంకుపల్లె మల్లయ్యశాస్త్రి
 19. నిరుద్ధభారతము - మం.వెంకటశర్మ
 20. శ్రీరామ విజయము (నాటకము)
 21. ఆరోగ్యసాధనము - గాంధిమహాత్ముడు
 22. నందనారు చరితము - శ్రీకృష్ణకౌండిన్య
 23. ఆత్మచరిత్రము - రాయసం వెంకట శివుడు
 24. గీతాబోధ
 25. ప్రార్థనా గీతావళి
 26. హాలికోద్ధారము -ప్ర.శేషాద్రిశర్మ
 27. మానవస్వత్వములు - థామస్ పెయిన్
 28. టామ్‌ సాయర్ ప్రపంచ యాత్ర -మూలం: మార్క్ ట్వెయిన్ -అనువాదం: నండూరి రామమోహనరావు
 29. మాలపల్లి - ఉన్నవ లక్ష్మీనారాయణ

ఆంధ్రకేసరి గ్రంథమాలసవరించు

హైదరాబాదు కేంద్రంగా గుండువరపు హనుమంతరావు 1939లో దీనిని ప్రారంభించాడు. ఆంధ్రకేసరిగా పేరొందిన గొప్ప జాతీయోద్యమ నాయకుడు టంగుటూరి ప్రకాశం పంతులుకి గౌరవంగా దీనికి ఆంధ్రకేసరి గ్రంథమాల అనే పేరు పెట్టారు.

 1. రెండో ప్రపంచ యుద్ధమా? (మొదటి భాగం)
 2. రెండో ప్రపంచ యుద్ధమా? (రెండో భాగం)

ఆంధ్ర చంద్రికా గ్రంథమాలసవరించు

ఆంధ్ర జాతీయ గ్రంథమాలసవరించు

కర్నూలు కార్యస్థానంగా నడిచిన సంస్థ.

 1. చింతాదేవి - అనుముల వేంకటశేషకవి
 2. భారతోపన్యాసములు - అనుముల వేంకటశేషకవి

ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాలసవరించు

దీనిని అయ్యగారి నారాయణమూర్తి, నిడదవోలు రామచంద్రారెడ్డి మొదలైనవారు స్థాపించారు. వేంకటపార్వతీశ కవుల రచనలను, వివిధ అనువాదాలను ప్రచురించింది. సుమారు 150 పుస్తకాలను ప్రకటించింది. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు

 1. సమానప్రతిభ (అపరాధ పరిశోధక నవల) - సుబ్రహ్మణ్యశాస్త్రి
 2. సాధన - వేంకటపార్వతీశ కవులు
 3. ఏకాంతసేవ - వేంకటపార్వతీశ కవులు
 4. కావ్యకుసుమావళి - వేంకటపార్వతీశ కవులు
 5. మాయావి - పాంచకడీదేవు నవలకు తెలుగు అనువాదం
 6. మాయావిని - పాంచకడీదేవు నవలకు తెలుగు అనువాదం
 7. మనోరమ - పాంచకడీదేవు నవలకు తెలుగు అనువాదం
 8. భూతగృహము - గుంటి సుబ్రహ్మణ్యశర్మ
 9. నీకే జయము - ప్రథమ భాగము -75 వ పుష్పము - కైప సుబ్బరామయ్య
 10. ఛత్రసాలుడు (అనువాద నవల) రెండు భాగములు - ప్రతివాది భయంకర రంగాచార్యులు, కొంపెల్ల జనార్దనరావు
 11. ప్రణయ చాంచల్యము (సాంఘిక నవల) - టేకుమళ్ల రామచంద్రరావు
 12. సీమంతిని (నవల) - ఓలేటి పార్వతీశం
 13. విషవాహిని (నవల) - సోమరాజు రామానుజరావు

ఆంధ్ర ప్రబంధ గ్రంథమాలసవరించు

తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం నుండి నడిచింది. దీనిలో ప్రాచీన కవులచే ప్రచురింపబడి ఇంతవరకు ముద్రితములు కానట్టివి, ముద్రితములైనప్పటికిని ప్రచారములో లేనట్టి అత్యుత్తమ ప్రబంధాలను, పురాణాలను ప్రచురించే ఆశయంతో స్థాపించబడింది.

 1. రాధామాధవము - చింతలపూడి ఎల్లయ

ఆంధ్ర భాషాభివర్ధినీ గ్రంథమాలసవరించు

1908లో స్థాపించబడింది.

ఆంధ్రసంజీవనీ గ్రంథమాలసవరించు

 1. బక్సారు యుద్ధము - నెమలికంటి సంజీవరావు

ఆంధ్ర సారస్వత గ్రంథమాలసవరించు

సూర్యాపేట

ఆత్రేయాశ్రమ గ్రంథమాలసవరించు

అనంతపురంలో స్థాపించబడింది.

 1. కురాను షరీఫు - చిలుకూరి నారాయణరావు
 2. అశోకుని ధర్మశాస్త్రములు - చిలుకూరి నారాయణరావు
 3. సంస్కృతలోకోక్తులు - చిలుకూరి నారాయణరావు
 4. ఉపనిషత్తులు - చిలుకూరి నారాయణరావు
 5. ఉమర్ ఖయాం రుబాయతు - చిలుకూరి నారాయణరావు
 6. ముసలమ్మ (ఒక వీరకాపుపడుచు) - చిలుకూరి నారాయణరావు
 7. అశ్వత్థామ (సంస్కృత నాటకం) - చిలుకూరి నారాయణరావు
 8. అశ్వత్థామ (తెలుగు నాటకం) - చిలుకూరి నారాయణరావు
 9. అంబ (మొండి శిఖండి) (నాటకం) - చిలుకూరి నారాయణరావు
 10. ఆచ్చి (కాపువలపు) (నాటకం) - చిలుకూరి నారాయణరావు
 11. పెళ్ళి (హాస్యము) - చిలుకూరి నారాయణరావు
 12. నాటకనాటకము - చిలుకూరి నారాయణరావు
 13. నందుడు (మాలభక్తుడు) (నాటకం) - చిలుకూరి నారాయణరావు
 14. Songs of Tyagaraja - చిలుకూరి నారాయణరావు

ఆదర్శగ్రంథమాలసవరించు

ఎలమర్రు, కృష్ణాజిల్లా

 1. బ్రహ్మచర్యము - పాలడుగు శేషాచలార్య, ఆరికపూడి వేంకటరామచౌదరి
 2. కమ్యూనిజానికే జయం - నవయుగ తాంతియా
 3. తిరుగుబాటు - మునిమాణిక్యం నరసింహారావు
 4. మాలపిల్ల - గద్దేలింగయ్య
 5. మనసంపద - గద్దేలింగయ్య

ఆయుర్వేదాశ్రమ గ్రంథమాలసవరించు

దీవి గోపాలాచార్యులు మద్రాసు నుండి నడిపిన గ్రంథామాల. సుమారు 22 విలువైన వైద్యశాస్త్ర గంథాలు ప్రకటించింది.

ఆర్యభారతీ గ్రంథమాలసవరించు

ఇతిహాసతరంగిణీ గ్రంథమాలసవరించు

కొవ్వూరు

 1. మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ కల్లూరి వేంకటరామశాస్త్రి జీవితచరిత్ర - చిలుకూరి వీరభద్రరావు

కలానిధి గ్రంథమాలసవరించు

నెల్లూరు

 1. ఉన్మత్తరాఘవము - ఆకిలి శ్రీరామశర్మ

కల్లోలినీ గ్రంథమాలసవరించు

గుంటూరు నుండి నడిచింది.

 1. రాజతరంగిణి - రెండుచింతల లక్ష్మీనరసింహశాస్త్రి
 2. ప్రతీక్ష (ఖండకావ్యసంపుటి) - రెండుచింతల లక్ష్మీనరసింహశాస్త్రి

కవికోకిల గ్రంథమాలసవరించు

నెల్లూరు నుండి దువ్వూరి రామిరెడ్డి దీనిని నడిపినాడు. కవికోకిల అనేది దువ్వూరి రామిరెడ్డి బిరుదు కావడంతో ఈ గ్రంథమాలకు ఆ పేరే పెట్టారు.

కవిచంద్ర గ్రంథమాలసవరించు

కనిగిరి

 1. ఆంధ్రప్రదేశలక్ష్మి - కోట సోదరకవులు
 2. మల్లెమొగ్గలు - కోట సోదరకవులు
 3. శ్రీ వేంకటేశ్వర నీరాజనము - కోట సోదరకవులు
 4. శ్రీ కన్యకాపరమేశ్వరీ శతకము - కోట సోదరకవులు

కవితిలక గ్రంథమాలసవరించు

మద్రాసు కార్యస్థానంగా 1936లో ప్రారంభమైనది. కాంచనపల్లి కనకమ్మ దీనిని నడిపింది.

 1. అమృతానందము - శ్రీపాదకృష్ణమూర్తి
 2. తులసీదాస చరిత్ర (1వ భాగము) - దంటు శ్రీనివాసశర్మ

కవిరాజు గ్రంథమాలసవరించు

కొల్లూరు

 1. రారాజు - కొల్లా శ్రీకృష్ణారావు

కాకతీయ గ్రంథమాలసవరించు

వరంగల్లు - 1936

కాత్యాయనీ గ్రంథమాలసవరించు

కాకినాడ

 1. కలగూరగంప - తిరుపతి వేంకట కవులు

కామ గ్రంథమాలసవరించు

 1. రతిరహస్యము - కొక్కోకుడు

కామేశ్వరీ గ్రంథమాలసవరించు

తిరుపతి

 1. Lectures on Indian Philosophy (Introductory)-కె.భాస్కరరావు

కృషిప్రచారిణీ గ్రంథమాలసవరించు

సూర్యాపేట

కౌశిక గ్రంథమాలసవరించు

విజయవాడ

 1. కోకిల - ప్రథమపుష్పము - సంపాదకుడు: నండూరు శేషాచార్యులు

గౌతమీ కోకిల గ్రంథమాలసవరించు

దీనిని గౌతమీ కోకిల బిరుదాంకితులైన వేదుల సత్యనారాయణ శాస్త్రి రచనలను ప్రచురించారు. దీన్ని శిలిగం జగన్నాథం స్థాపించారు.

 1. వేదులవారి కథలు
 2. ముక్తఝరి (ఖండకావ్యం)

చిదంబర గ్రంథమాలసవరించు

కాకినాడ

 1. శ్రీరత్నపాంచాలిక (నాటిక) - పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి

చేనేత గ్రంథమాలసవరించు

చీరాల

 1. (ప్రథమ ప్రసూనము) చేనేత భజనావళి - సంపాదకులు: పెండెం కృష్ణారావు, సూర్యనారాయణరావు

జాతీయ గ్రంథమాలసవరించు

పిఠాపురం

 1. ప్రభుత్వధనము - మన బీదతనము - అనువాదం: శనివారపు సుబ్బారావు, బాలాంత్రపు సత్యనారాయణరావు
 2. గాంధీమహాత్ముని లండను ఉపన్యాసములు - అనువాదం: తిమ్మరాజు సత్యనారాయణరావు

జాతీయ జీవిత చరిత్ర గ్రంథమాలసవరించు

జాతికి ఉత్తేజం కలిగించే నాయకులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, తదితరుల జీవిత చరిత్రలను సంక్షిప్తీకరించి దాదాపు రాజ్యాంగం గుర్తించిన అన్ని ప్రధాన భారతీయ భాషల్లోనూ (తెలుగు సహా) అందించారు. నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు చేసిన ఈ ప్రచురణల్లో ఎక్కువ భాగం అప్పటికే ఉన్న మహనీయుల జీవిత చరిత్రల సంక్షిప్తీకరణలు కాగా మిగిలినవి అవసరం మేరకు కొందరిచే వ్రాయించి అనువదించారు.

జ్ఞానోదయ గ్రంథమాలసవరించు

 1. వ్యవసాయము - పింగళి వెంకన్న

జ్యోతి గ్రంథమాలసవరించు

తెలంగాణా గ్రంథమాలసవరించు

 1. జైలు (కథల సంపుటి) - పొట్లపల్లి రామారావు

దేశబంధు గ్రంథమాలసవరించు

మహాత్మునకు కన్నీటికానుక

దేశహిత గ్రంథమాలసవరించు

దీనిని వోలేటి సుబ్రహ్మణ్యశర్మ తెనాలిలో నడిపారు.

దేశోద్ధారక గ్రంథమాలసవరించు

వట్టికోట ఆళ్వారుస్వామి ఈ గ్రంథమాలను నిర్వహించాడు. దేశీయుల ఆకాంక్షలను, హక్కులను బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని ఉత్తమ గ్రంథాలను ప్రచురించే ఆశయంతో ఈ గ్రంథమాల స్థాపించబడింది. 1938లో ప్రారంభమై 1961వరకు 33 అత్యంత విలువైన గ్రంథాలను ప్రకటించింది. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు

 1. హైందవధర్మవీరులు - సురవరం ప్రతాపరెడ్డి
 2. ప్ర్రాథమిక స్వత్వములు - సురవరం ప్రతాపరెడ్డి
 3. కమాల్ పాషా జీవితము - మొదటి భాగం - ఖండవల్లి బాలేందు శేఖరం
 4. కమాల్ పాషా జీవితము - రెండవ భాగం - ఖండవల్లి బాలేందు శేఖరం
 5. ఔంధు సంస్థానము - పులిగడ్డ వెంకటసుబ్బారావు
 6. ప్రజలు-ప్రభుత్వం - అనువాదం జానపాటి సత్యనారాయణ
 7. గ్రంథాలయోద్యమం - సురవరం ప్రతాపరెడ్డి
 8. కాంగ్రెసు - సంస్థానాలు - భోగరాజు పట్టాభిసీతారామయ్య
 9. సంస్థాన సమస్యలు - భోగరాజు పట్టాభిసీతారామయ్య
 10. నా భారతదేశయాత్ర - హెచ్.ఎస్.బెయిల్ ఫర్డ్ (అనువాదం - కాళోజీ నారాయణరావు)
 11. గాంధిమహాత్ముడు - మొదటి భాగం - విష్ణుచక్రం
 12. గాంధిమహాత్ముడు - రెండవ భాగం - విష్ణుచక్రం
 13. జైలు లోపల (కథల సంపుటి) - వట్టికోట ఆళ్వారుస్వామి
 14. నా గొడవ - కాళోజీ నారాయణరావు
 15. ఉదయఘంటలు (అఖిలాంధ్ర కవులగేయసంపుటి)[1]
 16. జీవనరంగం - మొదటిభాగం (8 ఏకాంక దృశ్యనాటికల సంకలనం)[2]
 17. జీవనరంగం - రెండవభాగం
 18. ప్రజల మనిషి (నవల) - వట్టికోట ఆళ్వారుస్వామి
 19. పగ (నాటిక) - పొట్లపల్లి రామారావు
 20. మాయరోగం (నాటిక) - పల్లా దుర్గయ్య
 21. అనుమానము (నాటిక) - దివాకర్ల వేంకటావధాని
 22. పునర్నవం (గేయసంపుటి) - దాశరథి కృష్ణమాచార్య
 23. తెలంగాణ (వ్యాస సంకలనం) 1వ భాగము
 24. తెలంగాణ (వ్యాస సంకలనం) 2వ భాగము
 25. ప్రభాస (ప్రసంగవ్యాసాల సంకలనం)
 26. ఆత్మవేదన (గేయసంపుటి) - పొట్లపల్లి రామారావు
 27. ఆహ్వానము (పద్య-గేయకవితాసంపుటి) - వానమామలై వరదాచార్యులు
 28. పరిసరాలు (కథా సంకలనం)
 29. బ్రతుకు బాటలు (కథల సంపుటి) - హీరాలాల్ మోరియా

దైవజ్ఞ గ్రంథమాలసవరించు

తెనాలి

 1. జాతకరాజము - అనువాదకులు: శ్రీధర వెంకయ్య సిద్ధాంతి, శ్రీధర విశ్వనాథశాస్త్రి

నరేంద్ర గంథమాలసవరించు

ముళ్ళపూడి తిమ్మరాజు తణుకు నుండి దీనిని నిర్వహించాడు.

నవజీవన్ గ్రంథమాలసవరించు

తెనాలి కార్యస్థానం.

 1. శాస్త్రదాస్యము - కొప్పరపు సుబ్బారావు

నవరచనావళి గ్రంథమాలసవరించు

మద్రాసులో స్థాపించబడింది.

 1. కూలిజనం (కథలసంపుటి) - పాలగుమ్మి పద్మరాజు

నవరస గ్రంథమాలసవరించు

మంగళగిరి

 1. స్నేహితుడు (కథలసంపుటి) - అందే నారాయణస్వామి

నవశిక్షిత గ్రంథమాలసవరించు

వయోజన విద్య ద్వారా కొత్తగా అక్షరాలు నేర్చుకున్న పెద్దలు చదువుకునేందుకు అవసరమైన పుస్తకాలకు ప్రత్యేకమైన లక్షణాలు కావాల్సివుంటుంది. కథాంశం ప్రౌఢమైనది, విజ్ఞానదాయకమైనదీ కావాలి, కథనం ఆసక్తికరంగా, వేగంగా ఉండాలి ఐతే భాష మాత్రం బాలల సాహిత్యం వలె తేలికగా చదివి అర్థం చేసుకునేందుకు పనికి రావాలి. ఇటువంటు లక్షణాలతో నవశిక్షితుల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా వారు నవశిక్షిత గ్రంథమాలను నిర్వహించారు.

నాట్యభారతి గ్రంథమాలసవరించు

విజయనగరం

 1. జాతీయాంతర్జాతీయ నాటికలు - మూడవ గ్రంథం - మల్లాది అవధాని

నృసింహశాస్త్రి గ్రంథమాలసవరించు

కాకినాడ

 1. కల్పవల్లికా - బొమ్మకంటి నృసింహశాస్త్రి

పద్మనాయక గ్రంథమాలసవరించు

రాజాం

 1. జడగంటలు - చెలికాని సత్యనారాయణ

పూలతోట గ్రంథమాలసవరించు

హనుమకొండ వరంగల్ జిల్లా

 1. మల్లికార్జునరావు (సాంఘిక నవల) - కంభంపాటి అప్పన్నశాస్త్రి

ప్రాక్ ప్రతీచీ గ్రంథమాలసవరించు

రాజమండ్రి

 1. పాశ్చాత్య భావప్రపంచము - ఎం.బి.ఎస్.సుబ్బారావు
 2. హిందూ జీవనపథము - అనువాదకుడు:కామరాజు హనుమంతరావు

భారతీయ గ్రంథమాలసవరించు

1931లో కర్నూలు నుండి డా.ఎస్.సుబ్బారావు ఈ గ్రంథమాలను నడిపాడు. మూడు నెలలకు ఒక నవల ప్రచురించాలని ఈ గ్రంథమాల భావించింది. మొదటి ప్రచురణగా ఆర్.బి.సింగ్ వ్రాసిన నూటపదునాఱు అనే అపరాధ పరిశోధక నవల ప్రకటించారు. ఇది ఎడ్‌గార్డ్ వాలెస్ నవలకు అనువాదం.

భాషాసంజీవనీ గ్రంథమాలసవరించు

అమృతలూరు

 1. కేనోపనిషత్ - వ్యాఖ్యానం: ముమ్మన్నేని లక్ష్మీనారాయణచౌదరి

మదరాసు విశ్వవిద్యాలయాంధ్ర గ్రంథమాలసవరించు

మద్రాసు విశ్వవిద్యాలయం అనేక తెలుగు గ్రంథాలను వెలువరించింది.

మానవసేవా గ్రంథమాలసవరించు

ఈ గ్రంథమాల ద్వారా సుమారు 22 పుస్తకములు ముద్రించబడినవి.[3]

 1. కబీరు - అత్తిలి సూర్యనారాయణ
 2. బంగాళాదుంప - నిడుదవోలు వేంకటరావు
 3. అగ్గిపెట్టెల యంత్రశాల - కందుల శ్రీమన్నారాయణ
 4. లోకపావన శతకము - ఆదిపూడి సోమనాధరావు
 5. కోటిలింగ శతకము - సత్యవోలు అప్పారావు
 6. స్త్రీలయెడ మనము గావించు పంచమహాపాతకములు - నాళము కృష్ణారావు
 7. వీరమతి - వీరరస ప్రధానమైన నాటకము - మంగిపూడి వేంకటశర్మ
 8. భారతీయ సందేశము
 9. భక్తి తరంగిణి
 10. దేవేంద్రనాధ చరిత్రము - అత్తిలి సూర్యనారాయణ
 11. అనాధాభ్యుదయము
 12. క్రొవ్వువత్తులు చేయువిధము
 13. బాబా గురు నానకు చరిత్రము - ఇ. సుబ్బుకృష్ణయ్య
 14. ఆనంద శతకము - సూరాబత్తుల సూర్యనారాయణ
 15. ఉత్తమ వివాహము - పాలపర్తి నరసింహము
 16. పున్నాబాయి - సత్యవోలు అప్పారావు
 17. హేలావతి - తల్లాప్రగడ సూర్యనారాయణరావు
 18. ప్రభావతి - సూరాబత్తుల సూర్యనారాయణ
 19. మీరాబాయి - రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ
 20. కురుపాండదాయభాగవిమర్శనము - శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రి
 21. బ్రాహ్మమతము - పాలపర్తి నరసింహము
 22. ఆర్యసూక్తిముక్తావళి - సత్యవోలు అప్పారావు
 23. కర్ణభారము

మైత్రీ గ్రంథమాలసవరించు

విజయవాడ

 1. రవీంద్ర గీతాంజలి - చలం

రసతరంగిణి గ్రంథమాలసవరించు

 • సౌభద్రుని ప్రణయయాత్ర - నాయని సుబ్బారావు

రైతాంగ గ్రంథమాలసవరించు

గుడివాడ నుండి నడిచింది.

 1. విద్యార్థి - శెట్టిపల్లి
 2. ఆంధ్ర సారస్వత విప్లవం (ఇంగ్లీషు) - ఆచార్య రంగా
 3. శెట్టిపల్లి గీతాలు - ఆచార్య రంగా (సంపాదకుడు)

లీలావతీ గ్రంథమాలసవరించు

రాజమండ్రి

 1. కేసరి - నిష్టల వేంకట సోమయాజులు

లోకమాన్య గ్రంథమాలసవరించు

కానూరులో స్థాపితము.

 1. స్త్రీస్వాతంత్ర్యము - చెళ్లపిళ్ల వెంకటేశ్వరకవి

వాగ్వల్లీ గ్రంథమాలసవరించు

నెల్లూరు నుండి కొమాండూరు వేంకటరామానుజాచార్యులు దీనిని ప్రారంభించాడు. ఈ గ్రంథమాల ప్రచురించిన గ్రంథాలు

 1. సముద్రమథనము (విష్ణుమాయావిలాసము) - 8వకుసుమము - చిల్కపాటి సీతాంబ
 2. సుగ్రీవ పట్టాభిషేకము - 9వకుసుమము - వరిగొండ సత్యనారాయణ

వాజ్మయ వినోదినీ గ్రంథమాలసవరించు

1931లో దోమా వేంకటస్వామిగుప్త స్థాపించాడు.

వాఙ్మయోల్లాసినీ గ్రంథమాలసవరించు

మదనపల్లె

 1. భక్తిపథము - నరసింహశర్మ

విఘ్నేశ్వర గ్రంథమాలసవరించు

అంగలూరు

 1. ఆంధ్రరాష్ట్రము 1వభాగము-కోగంటి దుర్వాసులు

విచిత్ర నవలా గ్రంథమాలసవరించు

 1. లవంగలత (సాంఘిక నవల) - కోసూరి రంగయ్య

విజ్ఞాన గ్రంథమాలసవరించు

అడ్లూరి అయోధ్యరామకవి స్థాపించి పది పుస్తకాలు ముద్రించాడు.

 1. దీపావళి - అడ్లూరి అయోధ్యరామకవి

విజ్ఞానచంద్రికా గ్రంథమాలసవరించు

కొమర్రాజు వేంకటలక్ష్మణరావు నెలకొల్పాడు. దేశాభివృద్ధికి ఆవశ్యకములైన గ్రంథములు ప్రచురించి భాషాభివృద్ధి చేయుటయే ఈ గ్రంథమాల యొక్క యుద్దేశ్యము.దేశదేశముల చరిత్రములును, పదార్థవిజ్ఞాన, రసాయన, జీవ, వృక్ష, మొదలగు ప్ర్రకృతిశాస్త్రములును, దేశోపకారులగు, కొందరు మహనీయుల చరిత్రములును, ఇంగ్లీషు లోని ఉద్గ్రంథముల భాషాంతరీకరణములును ప్రచురించింది. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు

 1. స్వీయచరిత్రము ప్రథమభాగము - కందుకూరి వీరేశలింగం
 2. స్వీయచరిత్రము ద్వితీయభాగము - కందుకూరి వీరేశలింగం
 3. వృక్షశాస్త్రము - వి.శ్రీనివాసరావు
 4. అంటువ్యాధులు - ఆచంట లక్ష్మీపతి
 5. రాయచూరు యుద్ధము - భోగరాజు నారాయణమూర్తి
 6. విమలాదేవి - కేతవరపు వెంకటశాస్త్రి
 7. విజయనగర సామ్రాజ్యము
 8. పాతాళభైరవి - ఎ.వి.నరసింహంపంతులు
 9. అమెరికా సంయుక్తరాష్ట్రములు - అయ్యదేవర కాళేశ్వరరావు
 10. ఫ్రెంచి స్వాతంత్ర్యవిజయము - అయ్యదేవర కాళేశ్వరరావు
 11. పాహియాన్ భారతవర్షయాత్ర - వేలూరు సత్యనారాయణ
 12. బౌద్ధ మహాయాగము - వేలూరు సత్యనారాయణ

విజ్ఞానప్రచారిణీ గ్రంథమాలసవరించు

వొద్దిరాజు సోదరులు ఈ గ్రంథమాలను ప్రారంభించారు. ఇనుగుర్తిలో ప్రారంభమై ఆ తరువాత కరీంనగర్ జిల్లా నెమలికొండకు తరలి వెళ్లింది. 1932 వరకు 21 గ్రంథాలను ప్రచురించింది.

విజ్ఞానవల్లికా గ్రంథమాలసవరించు

శీరిపి ఆంజనేయులు స్థాపించాడు. శారద (డిటెక్టివ్ నవలం, జీర్ణవిద్యానగర చరిత్ర ఈ గ్రంథమాల ద్వారా వెలువడ్డాయి.

విద్యావినోదినీ గ్రంథమాలసవరించు

చిత్తూరు

 1. నీతిపదవి (ప్రథమభాగము)- గొల్లపూడి శ్రీరామశాస్త్రి
 2. నీతిపదవి (ద్వితీయభాగము)- గొల్లపూడి శ్రీరామశాస్త్రి
 3. సన్మార్గ దర్శిని (మొదటిభాగము)- గొల్లపూడి శ్రీరామశాస్త్రి
 4. సన్మార్గ దర్శిని (రెండవభాగము)- గొల్లపూడి శ్రీరామశాస్త్రి
 5. సన్మార్గ దర్శిని (మూడవభాగము)- గొల్లపూడి శ్రీరామశాస్త్రి
 6. నవ్యసూక్తిముక్తావళి

వినోద గ్రంథమాలసవరించు

తెనాలి నుండి నడిచింది.

 1. గర్వభంగం (కథాసంపుటి) - ధనికొండ హనుమంతరావు

వినోదినీ గ్రంథమాలసవరించు

కాకినాడ నుండి అన్నంభొట్ల సూర్యనారాయణమూర్తి దీనిని 1939లో ప్రారంభించాడు.

 1. మోడరన్ విద్య - మంచికంటి రాజారావు

విశ్వసాహిత్యమాలసవరించు

1935లో ముంగండలో ప్రారంభమైనది.

 1. నాడు - నేడు : మూలం-ఎ.అడయంకో, అనువాదం- రామ్మోహన్
 2. విప్లవ సందేశం : మూలం - క్రొపాట్కిన్, అనువాదం - మహీధర జగన్మోహనరావు
 3. కమ్యూనిష్టులతో : మూలం - కార్ల్ మార్క్స్, అనువాదం - రామ్మోహన్
 4. రాజ్యాంగయంత్రం: మూలం - వి.ఐ.లెనిన్, అనువాదం - మహీధర జగన్మోహనరావు

వేగుజుక్క గ్రంథమాలసవరించు

1911లో స్థాపించబడింది.దేవరాజు వేంకటకృష్ణారావు కార్యదర్శిగా తాపీధర్మారావు, మండపాక పార్వతీశ్వరశాస్త్రి, న్యాయపతి రామానుజస్వామి సంపాదకులుగా బరంపురం నుండి ఇది నడపబడింది. ఈ సంస్థ ప్రచురించిన గ్రంథాలు

 1. వాడే వీడు (తెలుగులో మొట్టమొదటి అపరాధ పరిశోధక నవల) (1912)- దేవరాజు వేంకటకృష్ణారావు
 2. కాలూ రాయీ - దేవరాజు వేంకటకృష్ణారావు
 3. కోటీశు తనయ - తాతా కృష్ణారావు
 4. విజ్ఞాన కంద శతకము - మద్రాసు రాజారావు
 5. వామన చరిత్రము - పోతన (1943)
 6. ప్రేమము
 7. ఊహాః కాలము
 8. పెద్ద ఇల్లు
 9. తేనెపట్టు

శాంతినిలయ గ్రంథమాలసవరించు

కాకినాడ కార్యస్థానం.

 1. విశ్వకవి - రవిబాబు - అపరాతి చలమయ్య

శివధర్మ గ్రంథమాలసవరించు

సికిందరాబాదులో స్థాపించబడింది.

 1. సిద్ధాంత శిఖామణి - శివయోగి శివాచార్యులు
 2. మఠములు - మందిరములు -చిదిరెమఠం వీరభద్రశర్మ
 3. వీరశైవమహాత్ములు - కన్నడమూలం:కాశీనాథశాస్త్రి, తెలుగుసేత: మఠం సిద్ధి వీరయ్య
 4. సంక్షిప్త శివపూజావిధి - చిదిరెమఠం వీరభద్రశర్మ
 5. బ్రహ్మమీమాంస సూత్ర శ్రీకర భాష్యం - చిదిరెమఠం వీరభద్రశర్మ (పరిష్కర్త)
 6. రేణుక విజయము - సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి
 7. శ్రీజగద్గురు విశ్వారాధ్యోష్టోత్తర శతనామావళి - వీరభద్రశివాచార్య

శృంగార గ్రంథమాలసవరించు

రాజమండ్రి కార్యస్థానంగా శృంగారభరితమైన ప్రబంధాల ప్రచురణ చేపట్టి కొనసాగించారు. శృంగారభరితమైన గ్రంథాలను విక్టోరియన్ విలువల కారణంగా 19వ శతాబ్ది మధ్యకాలం నుంచి 20వ శతాబ్ది తొలినాళ్ల దాకా కూడా పలువురు ఆంగ్లేయులు, పాశ్చాత్య విద్యావ్యవస్థలోని భారతీయులు నిషేధింపజేశారు. ఈ ఉరవడి తగ్గాకా తిరిగి అటువంటి గ్రంథాల ప్రచురణ ప్రారంభమైంది. ఆ కొత్త ఒరవడిలో ఏకంగా శృంగార గ్రంథమాల పేరుతో ఓ గ్రంథమాలే రూపొందింది.

శైవప్రచారిణీ గ్రంథమాలసవరించు

వరంగల్లు.

 1. శ్రీస్కాందమహాపురాణము : యుద్ధకాండము - కోడూరి వేంకటాచలకవి

శ్రీ అన్నపూర్ణాదేవి గ్రంథమాలసవరించు

 1. అన్నపూర్ణాదేవి జీవితము - అట్లూరి వెంకటసీతమ్మ

శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాలసవరించు

రాయలసీమలోని కవిపండితుల గ్రంథాలను ప్రచురించి వాటిని వెలుగులోకి తెచ్చే ప్రధాన ఆశయంతో ఈ గ్రంథమాల ఘూళీ కృష్ణమూర్తి, హెచ్.దేవదానము, కల్లూరు అహోబలరావులచే 1931లో బళ్లారి పట్టణంలో స్థాపించబడింది. ఆ పట్టణ ప్రముఖులు ఈ గ్రంథమాలకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించారు. అప్పట్లో సంవత్సరానికి మూడు పుస్తకాలను ప్రచురించి ఒక రూపాయి చందాకే ఆ పుస్తకాలను అందించేవారు. 1934లో కల్లూరు అహోబలరావు అనంతపురానికి బదిలీ కావడంతో ఈ గ్రంథమాల కూడా అనంతపురానికి మారింది. 1957లో హిందూపురానికి మారింది. ఈ గ్రంథమాల ప్రకటించిన పుస్తకాలు ఈ విధంగా ఉన్నాయి.

క్రమ సంఖ్య గ్రంథము పేరు భాగము ప్రక్రియ రచయిత
1వ పుష్పము స్వార్థత్యాగము నవల ఘూళీ కృష్ణమూర్తి
2వ పుష్పము భావతరంగములు ఖండికలు కల్లూరు అహోబలరావు
3వ పుష్పము ప్రేమసుందరి 1వభాగము నవల హెచ్.దేవదానము
4వ పుష్పము ప్రేమసుందరి 2వభాగము నవల హెచ్.దేవదానము
5వ పుష్పము వేమభూపాలవిజయము రావాడ వేంకటరామాశాస్త్రులు
6వ పుష్పము విప్రనారాయణ నాటకము రూపనగుడి నారాయణరావు
7వ పుష్పము మాధవాశ్రమము 1వ భాగము నవల గుంటి సుబ్రహ్మణ్యశర్మ
8వ పుష్పము మాధవాశ్రమము 2వ భాగము నవల గుంటి సుబ్రహ్మణ్యశర్మ
9వ పుష్పము కుముదవల్లి నాటకము శీరిపి ఆంజనేయులు
10వ పుష్పము పూదోట పద్యఖండికలు కల్లూరు అహోబలరావు
11వ పుష్పము రాయలసీమ రత్నరాశి కవితా సంకలనము కల్లూరు అహోబలరావు (సంపాదకుడు)
12వ పుష్పము స్వప్నవల్లభుడు పద్యకావ్యము హెచ్.దేవదానము
13వ పుష్పము జ్ఞానవాశిష్ట రత్నములు పద్యములు కిరికెర భీమరావు
14వ పుష్పము భక్తమందారము ద్విశతి కల్లూరు అహోబలరావు
15వ పుష్పము అమృతాభిషేకము పద్యఖండికలు బెళ్లూరి శ్రీనివాసమూర్తి
16వ పుష్పము షాజహాన్ పద్యకావ్యము కల్లూరు వేంకట నారాయణ రావు
17వ పుష్పము తపోవనము పద్యఖండికలు బెళ్లూరి శ్రీనివాసమూర్తి
18వ పుష్పము మఐరోపారహసనము హాస్యము డి.బాబన్న
19వ పుష్పము భక్త పోతరాజీయము నాటకము మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ
20వ పుష్పము వివేకానందము ద్విపదకావ్యము బెళ్లూరి శ్రీనివాసమూర్తి
21వ పుష్పము ఉగాది స్వర్ణభారతి పద్యసంపుటి కల్లూరు అహోబలరావు
22వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 1వ సంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
23వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 2వ సంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
24వ పుష్పము భగవద్గీతాసందేశము డి.బాబన్న
25వ పుష్పము
26వ పుష్పము
27వ పుష్పము
28వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 3వ సంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు
29వ పుష్పము
30వ పుష్పము రాయలసీమ రచయితల చరిత్ర 4వ సంపుటి చరిత్ర కల్లూరు అహోబలరావు

శ్రీగోదా గ్రంథమాలసవరించు

ముసునూరు (కృష్ణాజిల్లా)

 1. పెరియాళ్వార్ తిరుమొళి మూడవ పత్తు - తెలుగు టీక: శ్రీచరణ రేణువు
 2. తత్త్వ త్రయము - కొండూరి తిరుమల జగన్నాథాచార్యులు
 3. శ్రీ భగవద్గీతామృతము - కె.ఎస్.రామానుజాచార్యులు

శ్రీలక్ష్మీనారాయణ గ్రంథమాలసవరించు

మద్రాసు

 1. గీతాసప్తశతి - చల్లా లక్ష్మీనారాయణశాస్త్రి (16వ పుష్పము)

శ్రీవాణీ గ్రంథమాలసవరించు

తెనాలి

 1. విజయజ్యోతి - ధనకుధరం లక్ష్మీనరసింహాచార్యులు

శ్రీవేంకటరమణ గ్రంథమాలసవరించు

 1. ఆంధ్ర పుష్పబాణ విలాసము - దేవగుప్తాపు వేంకటరమణకవి

శ్రీ శారదా గ్రంథమాలసవరించు

దీనిని గరిమెళ్ల సత్యనారాయణ నడిపి 12 పుస్తకాలను అచ్చొత్తించాడు.

శ్రీ శారదా విలాస గ్రంథమాలసవరించు

 1. సౌందర్యచక్రధరీయము (సాంఘిక నాటకము) - చక్రాల నృసింహకవి

శ్రీ సనాతన గ్రంథమాలసవరించు

 1. ఆత్మదర్పణము (అనువాదము) - తత్వానందస్వామి
 2. జగము (అనువాదము) - తత్వానందస్వామి

సంగీత గ్రంథమాలసవరించు

 1. శ్రీ దీక్షితుల చరిత్రము - వింజమూరి వరాహనరసింహాచార్యులు

సరస్వతీ గ్రంథమాలసవరించు

కాకరపర్రు, పశ్చిమగోదావరి జిల్లా

 1. కనకాంగి (షేక్‌స్పియర్ ఒథెల్లోకు అనువాదం)
 2. మదనసుందరీ పరిణయము (ఆరంకముల నాటకము)
 3. పీష్వా నారాయణరావు వధ (విషాదాంత నవల)
 4. సరోజినీ భాస్కరము (రోమియో జూలియట్ కు అనుసరణ)
 5. కీచకవధ
 6. ప్రహ్లాద
 7. ఆనందమయి (అపరాధ పరిశోధక నవల రెండు భాగాలు) - పోడూరి రామచంద్రరావు
 8. పతిత నళిని (అపరాధ పరిశోధక నవల) - పోడూరి రామచంద్రరావు
 9. అకాలీల సత్యాగ్రహము (ఆత్మబలి) - శనివారపు సుబ్బారావు
 10. ప్రేమచందు కథలు - దినవహి సత్యనారాయణ
 11. మొగలాయీ దర్బారు (నాలుగు భాగములు) - మొసలికంటి సంజీవరావు
 12. గృహవిచ్ఛిత్తి (నవల) - రాయసం కృష్ణమూర్తి
 13. ఠాకూర్ దుర్గాదాస్ (చారిత్రక నవల) - ఎస్.ఆర్.రావు
 14. పిచ్చిపిల్ల (డిటెక్టివ్ నవల) - ధరణీప్రగడ వేంకట శ్రీరామమూర్తి
 15. ప్రాచీనభారత విద్యావిధానము - యద్దనపూడి వెంకటరత్నం
 16. జీవనసంధ్య (సాంఘిక నవల) - వినోదుడు
 17. చితోడు పతనము - కోటమర్తి చిన రఘుపతి

సర్వోదయ గ్రంథమాలసవరించు

విజయవాడ

 1. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర (1952)

సాగర గ్రంథమాలసవరించు

విశాఖపట్నం

 1. కాళీపట్నం రామారావు కథలు - కాళీపట్నం రామారావు
 2. ఎన్నెస్ కథలు - ఎన్.ఎస్.ప్రకాశరావు

సాహిత్యలతా గ్రంథమాలసవరించు

గుంటూరు

 1. గూఢచారులు (ప్రథమభాగము)[4] - కొమరవోలు నాగభూషణరావు

సీతారత్నం గ్రంథమాలసవరించు

విజయవాడ నుండి పనిచేసింది. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి వ్రాసిన నటరత్నాలు ఈ గ్రంథమాల నుండి ప్రచురించబడింది.

సుబోధినీ గ్రంథమాలసవరించు

 1. జగన్మోహిని (నవల) - 1915 - సోమరాజు రామానుజరావు
 2. రంగ శతకము - 1916-కాంచనపల్లి కనకమ్మ
 3. అమృతవల్లి (నవల) - 1917-కాంచనపల్లి కనకమ్మ

సూతాశ్రమ గ్రంథమాలసవరించు

తెనాలి కార్యక్షేత్రంగా పనిచేసిన బ్రాహ్మణవ్యతిరేకోద్యమ కారుడు, హేతువాది త్రిపురనేని రామస్వామిచౌదరి దీనిని నడిపించారు. ఈ గ్రంథమాల ద్వారా ప్రచురితమైన గ్రంథాలు కూడా పురాణ వ్యతిరేకత, హేతువాదం, బ్రాహ్మణ వ్యతిరేకత వంటి మౌలిక లక్షణాలు కలిగినవే.

 1. సూత పురాణము (మూడు ఆశ్వాశాలు) - త్రిపురనేని రామస్వామిచౌదరి
 2. కురుక్షేత్ర సంగ్రామము - త్రిపురనేని రామస్వామిచౌదరి
 3. సూతాశ్రమ గీతాలు - త్రిపురనేని రామస్వామిచౌదరి
 4. ధూర్తమానవా - త్రిపురనేని రామస్వామిచౌదరి
 5. వివాహవిధి - త్రిపురనేని రామస్వామిచౌదరి
 6. దేవుని జీవితం - త్రిపురనేని గోపీచంద్
 7. భార్యల్లోనేవుంది - త్రిపురనేని గోపీచంద్
 8. ఆడమలయాళం - త్రిపురనేని గోపీచంద్
 9. సోషలిస్టు ఉద్యమచరిత్ర - త్రిపురనేని గోపీచంద్
 10. ప్రజాసాహిత్యం - త్రిపురనేని గోపీచంద్
 11. కావ్యజగత్తు - జి.వి.కృష్ణారావు
 12. వర్గసంబంధాలు - జి.వి.కృష్ణారావు
 13. వరూధిని - జి.వి.కృష్ణారావు
 14. ఇండియా భవిష్యత్తు - రాధాకృష్ణమూర్తి

సేవాశ్రమ గ్రంథమాలసవరించు

ఈ గ్రంథమాల ప్రచురించిన పుస్తకాలు

 1. బ్రిటిష్ మహాయుగము - మొదటి సంపుటి - రెండవ కుసుమము - మానికొండ సత్యనారాయణశాస్త్రి
 2. బ్రిటిష్ మహాయుగము - రెండవ సంపుటి - మూడవ కుసుమము - మానికొండ సత్యనారాయణశాస్త్రి

స్వర్ణలతా గ్రంథమాలసవరించు

కాకినాడ నుండి ప్రారంభమైనది.

 1. దొరబాబు (కథాసంపుటి) - మునిమాణిక్యం నరసింహారావు
 2. కమలం కథలు - యలమర్తి రామమోహనరావు
 3. కృపణజీవి - పాలెపు వెంకటరత్నం
 4. ఆ రాత్రి - కాజ వెంకటపద్మనాభరావు

హరిజన గ్రంథమాలసవరించు

రాజమండ్రి

 1. అరుంధతి - జాలా రంగస్వామి
 2. అస్పృశ్యత - జాలా రంగస్వామి

మూలాలుసవరించు

 1. [https://archive.org/details/in.ernet.dli.2015.371743 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
 2. [https://archive.org/details/in.ernet.dli.2015.372061 డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో
 3. మానవసేవ మే 1913 మాసపత్రికలో పేర్కొన్న పుస్తకాల జాబితా.
 4. కొమరవోలు, నాగభూషణరావు (1952). గూఢచారులు (1 సంపాదకులు.). గుంటూరు: సాహిత్యలతాగ్రంథమాల. Retrieved 16 January 2015.
"https://te.wikipedia.org/w/index.php?title=గ్రంథమాల&oldid=2887031" నుండి వెలికితీశారు