గ్రూప్ 10 మూలకం
గ్రూపు 10, ఆవర్తన పట్టికలోని రసాయన మూలకాల గ్రూపు. ఇందులో నికెల్ (Ni), పల్లాడియం (Pd), ప్లాటినం (Pt), బహుశా రసాయనికంగా ఇంకా నిర్దేశించని డార్మ్‌స్టాడియం (Ds) కూడా ఉంటాయి. ఇవన్నీ d-బ్లాక్ పరివర్తన లోహాలే. డార్మ్‌స్టాడియం ఐసోటోప్‌లన్నీ రేడియోధార్మికతను కలిగి ఉంటాయి, అవి స్వల్ప అర్ధ-జీవితాన్ని కలిగి ఉంటాయి, ప్రాకృతికంగా లభించవు; ప్రయోగశాలలలో చాలా కొద్ది పరిమాణాల్లో మాత్రమే సంశ్లేషణ చేయబడ్డాయి.
ఆవర్తన పట్టికలో గ్రూప్ 10 మూలకం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
↓ Period | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
4 | Nickel (Ni) 28 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
5 | Palladium (Pd) 46 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
6 | Platinum (Pt) 78 Transition metal | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
7 | Darmstadtium (Ds) 110 unknown chemical properties | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Legend
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఇతర గ్రూపుల మాదిరిగానే, ఈ గ్రూపులోని మూలకాలు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్‌లో, ప్రత్యేకించి బయటి షెల్‌లలో, ఒక ధోరణిని చూపుతాయి.
రసాయన ధర్మాలు
మార్చుZ | మూలకం | ప్రతి షెల్‌కు ఎలక్ట్రాన్‌ల సంఖ్య | ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ |
---|---|---|---|
28 | నికెల్ | 2, 8, 16, 2 | |
46 | పల్లాడియం | 2, 8, 18, 18 | |
78 | ప్లాటినం | 2, 8, 18, 32, 17, 1 | |
110 | డార్మ్‌స్టేడియం | 2, 8, 18, 32, 32, 16, 2 (అంచనా) | (అంచనా) [1] |
డార్మ్‌స్టాటియమ్‌ను స్వచ్ఛమైన రూపంలో వేరుచేయలేదు. దాని లక్షణాలు నిశ్చయంగా గమనించలేదు; నికెల్, పల్లాడియం, ప్లాటినంల లక్షణాలను మాత్రమే ప్రయోగాత్మకంగా నిర్ధారించారు. ఈ మూడు మూలకాలూ వెండి-లాంటి తెలుపు రంగులో ఉండే పరివర్తన లోహాలు. దృఢంగా, ఉష్ణనిరోధకంగా, అధిక ద్రవీభవన బిందువు, అధిక మరిగే బిందువులతో ఉంటాయి.
లక్షణాలు
మార్చుభౌతిక లక్షణాలు
మార్చుగ్రూపు 10 లోహాలు తెలుపు నుండి లేత బూడిద రంగులో ఉంటాయి. అధిక మెరుపును కలిగి ఉంటాయి, STP వద్ద తుప్పు పట్టకుండా (ఆక్సీకరణం) నిరోధకతను కలిగి ఉంటాయి. బాగా సాగే గుణం కలిగి, +2, +4 యొక్క ఆక్సీకరణ స్థితుల్లో చర్యలు జరుపుతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో +1 కూడా కనిపిస్తుంది. +3 ఉనికి చర్చనీయాంశమైంది, ఎందుకంటే ఇది +2 +4 స్థితులు సృష్టించిన మిథ్యా స్థితి కావచ్చు. గ్రూపు 10 లోహాలు కచ్చితమైన పరిస్థితులలో +6 ఆక్సీకరణ స్థితిని ఉత్పత్తి చేయవచ్చని సిద్ధాంతం సూచిస్తుంది, అయితే ఇది ప్లాటినం కాకుండా మిగతావాటికి ఇంకా ప్రయోగశాలలో నిశ్చయంగా నిరూపించలేదు.
Z | మూలకం | భౌతిక రూపం | పరమాణు బరువు | సాంద్రత (గ్రా/సెం 3 ) | ద్రవీభవన స్థానం (°C) | మరిగే స్థానం (°C) | ఉష్ణ సామర్థ్యం/C p (c)
(J mol -1 K -1 ) |
ఎలక్ట్రాన్ అనుబంధం (eV) | అయనీకరణ శక్తి (eV) |
---|---|---|---|---|---|---|---|---|---|
28 | నికెల్ | తెలుపు మెటల్; క్యూబిక్ | 58.693
|
8.90
|
1455
|
2913
|
26.1
|
1.156
|
7.6399
|
46 | పల్లాడియం | వెండి-తెలుపు మెటల్; క్యూబిక్ | 106.42
|
12.0
|
1554.8
|
2963
|
26.0
|
0.562
|
8.3369
|
78 | ప్లాటినం | వెండి-బూడిద మెటల్; క్యూబిక్ | 195.048
|
21.5
|
1768.2
|
3825
|
25.9
|
2.128
|
8.9588
|
లభ్యత, ఉత్పత్తి
మార్చునికెల్ సహజంగా ఖనిజాలలో లభిస్తుంది. ఇది భూమి పై అత్యధిక సమృద్ధి కలిగిన మూలకాల్లో 22వది. లేటరైట్‌లు, సల్ఫైడ్ ధాతువులు దీని ప్రముఖ ఖనిజాలు. [3] ఇండోనేషియాలో ప్రపంచంలోనే అతిపెద్ద నికెల్ నిల్వలున్నాయి. అతిపెద్ద ఉత్పత్తిదారు కూడా ఇండోనేషియాయే. [4]
ఉపయోగాలు
మార్చుగ్రూపు 10 లోహాల వలన అనేక ఉపయోగాలున్నాయి. వీటిలో కొన్ని ఇవి:
- అలంకార ప్రయోజనాల కోసం, నగల రూపంలో, ఎలక్ట్రోప్లేటింగ్ .
- వివిధ రకాల రసాయన ప్రతిచర్యలలో ఉత్ప్రేరకాలుగా .
- మెటల్ మిశ్రమాలు.
- ఉష్ణోగ్రతను బట్టి వీటి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీలో వచ్చే మార్పుల గురించి తెలుసు కాబట్టి వీటిని ఎలక్ట్రికల్ భాగాల్లో వాడతారు.
- ఇతర లోహాలతో కలిపి ఏర్పరచే మిశ్రమలోహాలను సూపర్ కండక్టర్స్గా వాడతారు.
జీవ పాత్ర, విషప్రభావం
మార్చుఎంజైమ్ల క్రియాశీలక కేంద్రంలో భాగంగా జీవుల జీవరసాయన శాస్త్రంలో నికెల్‌కు ముఖ్యమైన పాత్ర ఉంది. ఇతర గ్రూపు 10 మూలకాలలో దేనికీ జీవసంబంధమైన పాత్ర లేదు, అయితే ప్లాటినం సమ్మేళనాలను యాంటీకాన్సర్ మందులుగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
మూలాలు
మార్చు- ↑ Hoffman, Darleane C.; Lee, Diana M.; Pershina, Valeria, "Transactinide Elements and Future Elements", The Chemistry of the Actinide and Transactinide Elements, Dordrecht: Springer Netherlands, pp. 1652–1752, ISBN 978-1-4020-3555-5, retrieved 2022-10-09
- ↑ CRC handbook of chemistry and physics : a ready-reference book of chemical and physical data. William M. Haynes, David R. Lide, Thomas J. Bruno (97th ed.). Boca Raton, Florida. 2017. ISBN 978-1-4987-5429-3. OCLC 957751024.
{{cite book}}
: CS1 maint: location missing publisher (link) CS1 maint: others (link) - ↑ Lancashire, Robert J. "Chemistry of Nickel". LibreTexts. LibreTexts. Retrieved 16 January 2022.
- ↑ "Reserves of nickel worldwide as of 2020, by country (in million metric tons)". Statista. Statista. Retrieved 16 January 2022.