మేంగనీస్

(Manganese నుండి దారిమార్పు చెందింది)

మేంగనీస్ Mn అనే చిహ్నం, 25 పరమాణు సంఖ్య గల రసాయన మూలకం. తరచుగా ఇనుము ధాతువుతో కలిసి లభిస్తుంది. దీనిని పరిశ్రమలలో వివిధ రకాలుగా, ప్రత్యేకంగా స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తిలో వాడతారు.

మాంగనీస్,  25Mn
మూస:Infobox element/symbol-to-top-image-alt
సాధారణ ధర్మములు
ఉచ్ఛారణ/ˈmæŋɡənz/ (MANG--neez)
కనిపించే తీరుsilvery metallic
ఆవర్తన పట్టికలో మాంగనీస్
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
-

Mn

Tc
క్రోమియంమాంగనీస్ఇనుము
పరమాణు సంఖ్య (Z)25
గ్రూపుగ్రూపు 7
పీరియడ్పీరియడ్ 4
బ్లాక్d-బ్లాక్
ఎలక్ట్రాన్ విన్యాసం[Ar] 3d5 4s2
ప్రతీ కక్ష్యలో ఎలక్ట్రానులు
2, 8, 13, 2
భౌతిక ధర్మములు
STP వద్ద స్థితిsolid
ద్రవీభవన స్థానం1519 K ​(1246 °C, ​2275 °F)
మరుగు స్థానం2334 K ​(2061 °C, ​3742 °F)
సాంద్రత (గ.ఉ వద్ద)7.21 g/cm3
(ద్ర.స్థా వద్ద) ద్రవస్థితిలో ఉన్నప్పుడు5.95 g/cm3
ద్రవీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ ఫ్యూజన్)
12.91 kJ/mol
భాష్పీభవన ఉష్ణం
(హీట్ ఆఫ్ వేపొరైజేషన్)
221 kJ/mol
మోలార్ హీట్ కెపాసిటీ26.32 J/(mol·K)
బాష్ప పీడనం
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1228 1347 1493 1691 1955 2333
పరమాణు ధర్మములు
ఆక్సీకరణ స్థితులు7, 6, 5, 4, 3, 2, 1, -1, -2, -3 ​oxides: acidic, basic or amphoteric; depending on the oxidation state
ఋణవిద్యుదాత్మకతPauling scale: 1.55
అయనీకరణ శక్తులు
పరమాణు వ్యాసార్థంempirical: 127 pm
సమయోజనీయ వ్యాసార్థం139±5 (low spin), 161±8 (high spin) pm
ఇతరములు
స్ఫటిక నిర్మాణంbody-centered cubic (bcc)
Body-centered cubic crystal structure for మాంగనీస్
Speed of sound thin rod5150 m/s (at 20 °C)
ఉష్ణ వ్యాకోచం21.7 µm/(m·K) (at 25 °C)
ఉష్ణ వాహకత7.81 W/(m·K)
విద్యుత్ విశిష్ట నిరోధం1.44 µ Ω·m (at 20 °C)
అయస్కాంత క్రమంparamagnetic
యంగ్ గుణకం198 GPa
బల్క్ గుణకం120 GPa
మోహ్స్ కఠినత్వం6.0
బ్రినెల్ కఠినత్వం196 MPa
CAS సంఖ్య7439-96-5
చరిత్ర
ఆవిష్కరణTorbern Olof Bergman (1770)
మొదటి సారి వేరుపరచుటJohann Gottlieb Gahn (1774)
మాంగనీస్ ముఖ్య ఐసోటోపులు
ఐసో­టోపు సమృద్ధి అర్ధ జీవితం (t1/2) క్షయం ఉత్పత్తి
52Mn syn 5.591 d ε - 52Cr
β+ 0.575 52Cr
γ 0.7, 0.9, 1.4 -
53Mn trace 3.74×106 y ε - 53Cr
54Mn syn 312.3 d ε 1.377 54Cr
γ 0.834 -
55Mn 100% Mn, 30 న్యూట్రాన్లతో స్థిరంగా ఉన్నది.
| మూలాలు | in Wikidata

1774 లో తొలిసారి వేరుపరచిన తర్వాత, ఉక్కు ఉత్పత్తిలో ప్రధానంగా వాడారు. ముదురు వంగపండు రంగులో వుండే పొటాసియం పర్మాంగనేట్ అనే లవణం రూపంలో ప్రయోగశాలవారికి పరిచితం. కొన్ని ఎంజైములలో కూడా వుంటుంది.[1] మొక్కలు ఆక్సిజన్ ఉత్పత్తిలో "Mn-O" అనే రూపంలో కూడా దీని పాత్ర వుంది.

పేరు మార్చు

మేంగనీసు, మెగ్నీసియం - ఈ రెండు పేర్లలోను ఉన్న పోలిక వల్ల ఒకదానికొకటి అనుకుని పొరపడే సావకాశం ఉంది. పూర్వం ఈ రెండింటితోపాటు ఇనప ఖనిజం మేగ్నటైట్ గ్రీసు దేశంలోని మెగ్నీసియా అనే ప్రాంతంలో దొరికేవి కనుక ఈ పేర్లలో పోలిక అలా వచ్చింది.

ఆవర్తన పట్టికలో మార్చు

మేంగనీస్‌ ఆవర్తన పట్టికలో, 4 వ పీరియడ్‌లో, అణుసంఖ్య 21 నుండి 30 వరకు ఉన్న అంతర్యాన లోహాల (transition metals) వరుసలో మధ్యస్థంగా ఉంది. దీని అణుసంఖ్య 25. దీని ఎడం పక్క గదిలో క్రోమియం, కుడి పక్క ఇనుము ఉన్నాయి. కనుక ఇనిము లాగే దీనికీ తుప్పు పట్టే గుణం ఉంది. పూర్వపు రోజులలో దీని దిగువన ఉన్న గది ఖాళీగా ఉంటే ఆ ఖాళీ గదికి "ఏక మేంగనీస్" అని పేరు పెట్టేరు మెండలియెవ్. తరువాత ఆ ఖాళీ గదిలో టెక్నీటియం ఉండాలని నిర్ధారణ చేసేరు. మేంగనీస్‌ సమస్థానులు (ఐసోటోపులు) లో ముఖ్యమైనది 55Mn.

దీని అణువులో స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న d-ఎలక్‌ట్రానులు (free electrons in d-orbital) 5 ఉన్నాయి కనుక ఇది చురుకైన మూలకమే! ఉక్కు తయారీలో మేంగనీస్‌ కీలకమైన పాత్ర వహిస్తోంది.

పరిశ్రమలలో మార్చు

  • మేంగనీస్ పాలు 1.5 శాతం ఉన్న అల్లూమినం తుప్పు పట్టదు కనుక కలిపితే అటువంటి అల్లూమినంని కోకాకోలా, బీరు వంటి పానీయాలని అమ్మడానికి వినియోగొస్తారు.
  • మేంగనీస్ డైఆక్సైడ్ (మంగన భస్మం) పొడి బేటరీల రుణ ధ్రువాల (కేథోడ్‌ల) తయారీలో వాడతారు.
  • మేంగనీస్‌తో కలిసిన మిశ్రమ ధాతువులు ("కాంపౌండ్"లు) గాజు సామానులకి రంగులద్దడంలో విరివిగా వాడతారు.
  • ముడి చమురులో ఉండే జైలీన్ (Xylene) ని ఆమ్లజని సమక్షంలో భస్మీకరించినప్పుడు మేంగనీస్‌ని కేటలిస్ట్‌గా వాడతారు. ఈ ప్రక్రియ ప్లేస్టిక్‌ నీళ్ళ సీసాలు తయారు చేసే పరిశ్రమలో విరివిగా వాడతారు.

పోషక విలువ మార్చు

  • అతి చిన్న మోతాదులలో మేంగనీస్ అత్యవసరమైన పోషక పదార్థం. మోతాదు మించితే విషం.
  • ఎదిగిన యువకుడుకి, రోజుకి 2.3 మిల్లీగ్రాముల మేంగనీస్ అవసరం ఉంటుంది.
  • ఇది శరీరంలోని ఎంజైములు (కేటలిస్టులు) సరిగ్గా పని చెయ్యడానికి అత్యవసరం.
  • ఆకుకూరలు, పళ్లు, గింజలు, దినుసులలో మేంగనీస్‌ లభిస్తుంది కాని ఇనుము, ఖటికము, మెగ్నీసియం మోతాదు మించి తింటే తిన్న మేంగనీస్‌ ఒంటబట్టదు. అందుకనే మంచి చేస్తుంది కదా ఏ పదార్థాన్ని అతిగా తినకూడదు.

వైద్యంలో మార్చు

మూలాలు మార్చు

  1. Roth, Jerome; Ponzoni, Silvia; Aschner, Michael (2013). "Chapter 6 Manganese Homeostasis and Transport". In Banci, Lucia (ed.). Metallomics and the Cell. Metal Ions in Life Sciences. Vol. 12. Springer. pp. 169–201. doi:10.1007/978-94-007-5561-1_6. ISBN 978-94-007-5560-4. PMC 6542352. PMID 23595673. Electronic-book ISBN 978-94-007-5561-1.

Kies C. Bioavailability of manganese. In: Klimis-Tavantzis DL, ed. Manganese in health and disease. Boca Raton: CRC Press, Inc; 1994:39-58.

Organic supplements review

"https://te.wikipedia.org/w/index.php?title=మేంగనీస్&oldid=3849799" నుండి వెలికితీశారు