ఎం.జి.రామచంద్రన్
ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ చలనచిత్ర నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు.[1] 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.
ఎం. జి. రామచంద్రన్ | |||
| |||
3వ తమిళనాడు ముఖ్యమంత్రి
| |||
గవర్నరు | సుందర్ లాల్ ఖురానా | ||
---|---|---|---|
నియోజకవర్గం | అండిపట్టి | ||
గవర్నరు | ప్రభుదాస్ పట్వారీ, ఎం.ఎం.ఇస్మాయిల్ (మధ్యంతర), సాదిక్ అలీ, సుందర్ లాల్ ఖురానా | ||
నియోజకవర్గం | మదురై పశ్చిమం | ||
గవర్నరు | ప్రభుదాస్ పట్వారీ | ||
నియోజకవర్గం | అరుప్పుకొట్టై | ||
తమిళనాడు శాసన సభ్యుడు
| |||
నియోజకవర్గం | సెయింట్ థామస్ మౌంట్ | ||
మద్రాసు రాష్ట్ర శాసన సభ్యుడు
| |||
నియోజకవర్గం | సెయింట్ థామస్ మౌంట్ | ||
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం అధ్యక్షుడు
| |||
అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధాన కార్యదర్శి
| |||
దక్షిణ భారత కళాకారుల సంఘం అధ్యక్షుడు
| |||
వ్యక్తిగత వివరాలు
|
|||
విశ్రాంతి స్థలం | ఎంజిఆర్ మెమోరియల్ | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | అన్నాడీఎంకే | ||
ఇతర రాజకీయ పార్టీలు | డీఎంకే (1953-1972), భారత జాతీయ కాంగ్రెస్ (1935-1945) | ||
జీవిత భాగస్వామి |
| ||
బంధువులు | ఎం. జి. చక్రపాణి (సోదరుడు) | ||
నివాసం | ఎంజిఆర్ గార్డెన్ రామాపురం, చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
వృత్తి |
| ||
పురస్కారాలు | * భారత రత్న (1988) (మరణానంతరం)
|
తన యవ్వనంలో ఎంజిఆర్, అతని అన్నయ్య ఎంజి చక్రపాణి తమ కుటుంబాన్ని పోషించడానికి ఒక నాటక బృందంలో సభ్యులయ్యారు. గాంధేయ ఆదర్శాల ప్రభావంతో ఎంజిఆర్ భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. కొన్ని సంవత్సరాల పాటు నాటకాల్లో నటించిన తరువాత 1936లో సతీ లీలావతి చిత్రంలో ఒక సహాయ పాత్రలో చలనచిత్రరంగ ప్రవేశం చేశాడు. 1940 దశకం చివరికల్లా అతను కథానాయక పాత్రలు సంపాదించాడు. తరువాత మూడు దశాబ్దాల పాటు తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకునిగా ఆధిపత్యం సంపాదించాడు.
సిఎన్ అన్నదురై నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె పార్టీ)లో ఎం.జి.ఆర్. సభ్యుడయ్యాడు. నటుడిగా తనకున్న అపారమైన ప్రజాదరణను భారీ రాజకీయ బలం పెంపొందించడానికి ఉపయోగించాడు. తద్వారా డీఎంకెలో తన స్థానాన్ని వేగంగా పెంచుకుంటూ పోయాడు. అన్నాదురై మరణించాకా పార్టీ నాయకత్వం చేపట్టిన తన ఒకప్పటి స్నేహితుడు కరుణానిధితో ఎం.జి.ఆర్.కు రాజకీయ విరోధం ఏర్పడింది. 1972లో అన్నాదురై మరణించిన మూడేళ్ళకు డిఎంకెను విడిచిపెట్టి, తన సొంత పార్టీ- ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట కళగం (ఎఐఎడిఎంకె) ను ఏర్పాటు చేశాడు. ఐదు సంవత్సరాల తరువాత, 1977 తమిళనాడు శాసన సభ ఎన్నికల్లో ఎం.జి.ఆర్. తన నేతృత్వంలోని ఏఐఎడిఎంకె కూటమిని విజయం వైపుకు నడిపించాడు. అలా అతను తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో భారతదేశంలో మొట్టమొదట ముఖ్యమంత్రి పదవి సాధించిన సినీ నటుడిగా చరిత్ర సృష్టించాడు. ఆయన నేతృత్వంలో ఏఐఏడిఎంకె 1980లోనూ, 1984లోనూ మరో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 1980లో కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వాన్ని కూలదోసి రాష్ట్రపతి పాలన విధించిన ఆరు నెలలు మినహాయిస్తే, 1987లో మరణించేవరకూ తమిళనాడు ముఖ్యమంత్రి పదవిలోనే కొనసాగాడు.
నటించిన సినిమాలు
మార్చుఎం.జి.ఆర్. నటించిన తెలుగు డబ్బింగ్ సినిమాల పాక్షిక జాబితా:
- సర్వాధికారి (1951)
- ఆలీబాబా 40 దొంగలు (1956)
- సాహస వీరుడు (1956)
- రాజపుత్రి రహస్యము (1957)
- మహాదేవి (1958)
- వీరఖడ్గం (1958)
- అనగనగా ఒక రాజు (1959)
- దేసింగురాజు కథ (1960)
- బాగ్దాద్ గజదొంగ (1960)
- కత్తిపట్టిన రైతు (1961)
- జేబు దొంగ (1961)
- ఇద్దరు కొడుకులు (1962)
- ఏకైక వీరుడు (1962)
- భాగ్యవంతులు (1962)
- వీరపుత్రుడు (1962)
- అదృష్టవతి (1963)
- రాణీ సంయుక్త (1963)
- ఇంటి దొంగ (1964)
- దొంగనోట్లు (1964)
- దొంగ బంగారం (1964)
- దొంగను పట్టిన దొర (1964)
- హంతకుడెవరు? (1964)
- కథానాయకుడు కథ (1965)
- కాలం మారింది (1965)
- ఘరానా హంతకుడు (1965)
- ముగ్గురమ్మాయిలు మూడు హత్యలు (1965)
- ఎవరాస్త్రీ? (1966)
- ఎవరి పాపాయి (1966)
- కాలచక్రం (1967)
- ధనమే ప్రపంచలీల (1967)
- పెళ్ళంటే భయం (1967)
- శభాష్ రంగ (1967)
- అంతులేని హంతకుడు (1968)
- అగ్గిరవ్వ (1968)
- దెబ్బకు దెబ్బ (1968)
- దోపిడీ దొంగలు (1968)
- కొండవీటి సింహం (1969)
- డ్రైవర్ మోహన్ (1969)
- నా మాటంటే హడల్ (1969)
- ప్రేమ మనసులు (1969)
- సికింద్రాబాద్ సి.ఐ.డి. (1971)
- బందిపోటు భయంకర్ (1972)
- రిక్షా రాముడు (1972)
- లోకం చుట్టిన వీరుడు (1973)
- కాశ్మీరు బుల్లోడు (1975)
- మంచి కోసం (1976)
మూలాలు
మార్చు- ↑ Kantha, Sachi Sri (8 April 2015). "MGR Remembered – Part 26". Sangam.org. Archived from the original on 16 ఆగస్టు 2017. Retrieved 19 May 2017.