వాడుకరి:రాకేశ్వర/ఛందస్సు
అంగజాస్త్ర వృత్తము
గణములు - భ, మ, స, గ 1,2 పాదములకు మరియు మ, స, జ, గ-3,4 పాదములకు
యతిస్థానము - ఆఱవ అక్షరము
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
దానబలేంద్రోదారభమంబుల్
పూనిసగా ప్తిం బొంపిరివోవన్
జానార న్మసజంబు గస్థితం
బై నీజంజను నంగజాస్త్ర మై
అంతరాక్కర
గణములు - 1సూర్యగణము, 2ఇంద్రగణములు, 1చంద్రగణము
యతిస్థానము - నాల్గవ గణాధ్యక్షరం
ప్రాసనియమము - కలదు
కమలమిత్రుండు సురరాజగణ యుగంబు
కమలశత్రునితోఁ జెంది కందళింప
నమరుఁ బ్రావళ్ళు నర్థంబు నతిశయిల్ల
నమల మగు నంతరాక్కర మబ్ధిసంఖ్య
అంబుజ వృత్తము
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
గణములు - భ, వ
ఇంబగు భకా
రంబును వకా
రంబును జుమీ
యంబుజ మగున్
అంబురుహము
గణములు - భ, భ, భ, భ, ర , స, వ
యతిస్థానము - 13
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భాభభరంబులపై సవలొందుచు భానువిశ్రమయుక్తమై
యీభువి నంబురుహంబనఁగాఁ జను నిందువంశనృపాగ్రణీ
శ్రీ రమణీప్రియ మల్లియరేచ విశిష్టకల్పమహీజ భా,
భా,ర, స, నంబుల భాను విరామము వల్కనంబురుహంబగున్.
అజిత ప్రతాపము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - స, జ, స, స, బేసి పాదములకు,న, భ, జ, భ సరిపాదములకు
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సజసాగణావలిఁ బ్రసన్న నభా
గ్రజరపంక్తి నభిరామరూపమై
యజితప్రతాపచెలువారుఁ గృతి
న్విజయవిక్రమణ విశ్వభూవరా
అపరాజితము
గణములు - న, న, ర, స, వ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ననరసలగముల్ దనర్చిన సత్కృతిం
దనరఁగ నపరాజితంబు కవిస్తుతిన్
అర్కుటము
గణములు - న, జ, భ, జ, జ, వ
అలసగతి
అల్పాక్కర
గణములు - 3 గణములు,2 ఇంద్రగణములు,1 చంద్రగణము
యతిస్థానము - 3వ గణాద్యక్షరము
సుమనఃపతియుగము సోముండును
నెమకంగఁ బ్రావళ్ళు నిండిమీఱ
గమనీయవిభవంబుగాంచునెప్డు
రమణీయ మల్పాక్కరము కృతుల
గమనిక - ఇది గీత పద్యము వలె నున్నది
అశ్వగతి
గణములు - భ,భ,భ,భ,భ,గ
యతిస్థానము - 10
అశ్వలలితము
గణములు - న, జ, భ, జ, భ, జ, భ, వ
యతిస్థానము - 12
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
నజభజము ల్భజంబులకు నచ్చి భస్థలగయుక్తమై రవియతిం
బ్రజనితమైన నశ్వలలితంబు రాజకులదీప ధీజననుతా
అశ్వవిలసితము
అష్టమూర్తి
గణములు - మ, న, త, స, ర, భ, జ, య
అసంబాధ
గణములు - మ, త, న, స, గ, గ
యతిస్థానము - 12
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ఆటవెలది
గణములు - బేసి పాదములలో3 సూర్యగణములు,2 ఇంద్ర గణములు, సరిపాదములలో 5సూర్యగణములు
యతిస్థానము - నాల్గవ గణాద్యక్షరం
ప్రాసయతి - చెల్లును
ప్రాస - లేదు .
ఇనగణత్రయంబు నింద్ర ద్వయంబును
హంస పంచకంబు నాటవెలది
ఆపాతలిక
ఆర్య (వృత్తము)
ఆలోల
గణములు - మ, స, మ, భ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ఇందువదన
గణములు - భ, జ, స, న, గ,
ఛందము - అతి జగతి
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 9
ఇంద్రవంశము
గణములు - త, త, జ, ర
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
ఈ తా జ రా కల్పన నింద్రవంశకా
ఖ్యాతాఖ్య మయ్యెన్ బరగండభైరవా
సన్మానధారీ ! తతజంబు రేఫతో
విన్మింద్రవంశాహ్వయ వృత్తమై చనున్.
ఇంద్రవజ్రము
గణములు - త, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
ఈతాజగానిర్మితి నింద్రవజ్రా
నీతాఖ్య వర్తించు వినిర్మలోక్తిన్
ఇత్తా, జ, గా సంగతి నింద్రవజ్రా
వృత్తంబగున్ సన్నుత - వృత్తరేచా !
ఇల
ఉత్కలిక
ఉత్పలమాల
గణములు - భ, ర, న, భ, భ, ర, ల, గ
యతిస్థానము - 10
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
భానుసమాన విన్ బరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్
ప'ద్మజయుగ్యతిన్ భరనభారలగంబులఁ జెంది సన్మనః
ప'ద్మవికాస హేతువగు పద్యము నుత్పలమాలయం డ్రిలన్
ఉత్సాహము
గీ
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి
ఓసరించుఁ బజ్జ లజ్జ లుజ్జుగించు రాజులన్
వేసరించు గర్వపర్వవేషభూషితారులన్
వాసవానుకార వీరవర్య విశ్వభూప నీ
భాసురాసిధేనుకానుభావ మాహవంబులన్
ఉత్సుకము
గణములు - భ, భ, ర
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
ఉత్సుక మౌ భభరంబులన్
మత్సరి మాన విమర్థనా
ఉపజాతి
గణములు - ఒక పాదం త, త, జ, గ, గ (ఇంద్రవజ్రము) మరియు ఒకపాదం జ, త, త, గ, గ (ఉపేంద్రవజ్రం)
ఛందము -త్రిష్టుప్ ఛందము
యతిస్థానము - 8
ఈయింద్రవజ్రాఖ్య ముపేంద్రవజ్ర
శ్రయంబు గాఁగా నుపజాతి మయ్యెన్
ఈ రెండు వృత్తంబులు నిందుఁగూడన్
సరోజనేత్రా ! యుపజాతి యయ్యెన్.
1, 3 పాదములు ఇంద్రవజ్ర మరియు 2,4 పాదములు ఉపేంద్రవజ్ర ఉండును.
ఉపేంద్రవజ్రము
గణములు - జ, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
ఉపేంద్రవజ్రాహ్వయ మొప్పునిం పై
యుపేంద్రపుత్త్రా జతజోక్తగాలన్
సపద్మ పద్మా ! జత జల్గగంబున్
ఉపేంద్ర వజ్రాఖ్యము నొప్పు జెప్పన్.
ఉష్టిక్
ఊర్వశి
గణములు - న, త, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
ఏకరూప
కందము
క..
కందము త్రిశర గణంబుల
నందము గా భ జ స నలము లటవడి మూటన్
బొందును నలజల నాఱిట
నొందుం దుద గురువు జగణ ముండదు బేసిన్
క.
అందును గందంబులు నా
నందంబులు భజసనలగాఖ్యలచే వా
నిం దగు నెఱుగం బ్రాసము
ముందుగ నిడి మూఁడు నైదు మూడున్నైదున్
క.
ఆదిమ వర్ణము వళి నిడు
పై దొరకినఁ గుఱుచయైన నట్టుల తత్త
త్పాదాదుల నిలుపందగు
గాదిలిగాఁ జెప్పఁ దలఁచు కందంబులన్
క.
నిడుదలగు పాదములకును
వడి నాలవగణము మొదల వలయు నిలుప న
క్కడలను గురువును మూఁడవ
యెడ నలజలలోన నొకటి నిడ బెడఁగడరున్
క.
\*ఇందు పుర బాణనగముల
కందువ జగణంబు నిలుపఁగా గా దెపుడుం
గందములకు నార్యాదుల
చందం బధికంబు వానిఁ జనుఁ దెలియంగన్
\*ఇందు=1, పుర=3, బాణ=5, నగములు=7
క.
కందము నర్థంబులతుద
నందినగురు వుడుపఁ బథ్య యగు నాఱవచోఁ
జెందిన జగణము లత్వముఁ
బొందిన నది యార్యయనఁగఁ బొసఁగుంగృతులన్
క.
క్రమమునఁ బథ్యార్యార్థము
లమరంగా వీడుపడిన నది గాథాభే
దముగాఁగం బరఁగు ప్రపం
చము తెనుఁగునఁ జెప్పరండ్రు చతురులు కృతులన్
కన్యావృత్తము
ఛందము - ప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 4
ప్రాస నియమము - కలదు
పొత్తై మాగా
వృత్తిం గన్యా
వృత్తం బయ్యెన్
జిత్తం బారన్
కపాలి
కమలనగీతి
కమల విలసితము
గణములు - న, న, న, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
కరిబృంహితము
గణములు - భ, న, భ, న, ర
యతిస్థానము - 13
ఛందము - అతిశక్వరి ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
కర్ణాటచతుష్పదము
కలరవము
గణములు - స, న, న, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
కలహంసి
గణములు - త, య, స, భ, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
కలితాంతము
గణములు - త, ర, జ, వ
యతిస్థానము - 8
పాదమునకు 11 అక్షరాలు
కవికంఠభూషణము
కవిరాజవిరాజితము
గణములు - న, జ, జ, జ, జ, జ, జ, ల,గ
యతిస్థానము - 8,7,7 మఱియు ఇంకొక పక్షమున 8, 14
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
క్రమమున నొక్క నకారము నాఱుజకారములున్ బరగంగ వకా
రమును నొడంబడి రా గవిరాజ విరాజిత మన్నది రామ నిభా
కిరీటము
కుటజగతి
గణములు - న, జ, మ, త, గ
యతిస్థానము -
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
కుమారలలిత
గణములు - జ, న, గ
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 7
ప్రాసనియమము - కలదు
కుమార లలితకున్ - సమగ్రజనగముల్
కుమారి
గణములు - న, జ, భ, జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
కుసుమవిచిత్రము
కుసుమితలతావేల్లి తావృత్తము
గణములు - మ, త, న, య, య, య
యతిస్థానము - 11
ఛందము - ధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 18
ప్రాసనియమము - కలదు
స్వశ్రేయస్సిద్ధిన్ మతనయయయవ్యాప్తిచేఁ జర్మవాసో
విశ్రామం బొప్పగుం గుసుమితలతావేల్లితా వృత్తమయ్యెన్
కోమల వృత్తము
గణములు - న, జ, జ, య, -బేసి పాదములకు, జ, భ, స, జ,గ - సరిపాదములకు
సలలితరీతి నజాయగణంబుల్
చళుక్యభూప జభసజస్థగస్థితిన్
మలయుచు నర్థసమర్థతచేత
న్వెలుంగఁ గోమల మను వృత్త మొప్పగున్
కౌముది
క్రౌంచపదము
గణములు - భ, మ, స, భ, న, న, న, య
యతిస్థానము - 18
ఛందము - సంకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 24
ప్రాసనియమము - కలదు
ప్రాంచిత తేజఃకుంచితవైరీ భమసభనననయ పరిచిత రీతిన్
అంచితమయ్యెం గ్రౌంచపదాఖ్యం బరుగతహరిదిభయతి నభివృత్తిన్
క్షమ
మారుపేరు - క్షప
గణములు - స, న, త, త, గ
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 8
ప్రాస నియమము - కలదు
క్ష్మాహారము
ఖచరప్లుతము
గణములు - స, భ, భ, మ, స, స, వ
యతిస్థానము - 12
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
నభభముల్ మససంబు లగాప్తి న్నాగవిభూషణయుగ్యతిన్
శుభదమై ఖచరప్లుత మొప్పు న్సోమకులార్ణవచంద్రమా
గజవిలసితము
గీతాలంబనము
గణములు - త,జ,జ,న
ఛందము - త్రిష్టుప్ ఛందము
పాదాక్షరసంఖ్య -11
గోవృష
గణములు - మ, త, య, స, గ, గ
యతిస్థానము - 5
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
గౌరి
గణములు - న, న, న, స, గ
ఛందము - అతి జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7
చంచరీకావళి
గణములు - మ, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
చంచరీకాతతి
గణములు - య, మ, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
చంద్రకళ
గణములు - ర, స, స, త, జ, జ, గ
యతిస్థానము - 11
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
వ్యక్తరీతి రసాతజజగ్రాయత్త గకారనిరూఢిచే
సక్త దిగ్విరమంబన నొప్పుం జంద్రకళాహ్వయమై ధరన్
చంద్రరేఖ
చంద్రలేఖ
గణములు - న, స, ర, ర, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
చంద్రవర్త్మ
చంద్రశ్రీ
గణములు - య, మ, న, స, ర, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
అగుం జంద్రశ్రీదా హారవిరమణాయత్తనమైనం
బ్రగాఢంబై యొప్పున్ య మ న స ర బద్ధాగ్రగాప్తిన్
చంద్రిక
గణములు - న, న, త, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
చంద్రిక
గణములు - న, న, ర, వ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
సలలితముగఁ జంద్రికాహ్వయం
బలరు ననరవాంక మై కృతిన్
చంపకమాల
గణములు - న, జ, భ, జ, జ, జ, ర
యతిస్థానము - 11
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
నజభజజ్జలరేఫలు పెనంగి దిశాయతి తోడ గూడినన్
త్రిజగదభిష్టుతా బుధనిధీ విను చంపకమాలయై చనున్
చతుష్పద
చపల
చామరము
చిత్రపదము
గణములు - భ, భ, గ, గ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
చిత్రపదం బన భాగా
చిత్రయతిప్రతిపత్తిన్
చౌపది
భ స గానల ములపైని గరంబు
న్నెసఁగఁగ మూఁడవయెడ విరమంబుం
బొసఁగినఁ జౌపదిఁబొలుచు రసంబుం
గసవరముగఁ దగుఁ ప్రాసంబున్
జఘనచపల
జలంధరము
గణములు - భ, భ, భ, జ, వ
యతిస్థానము - 11
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
జలదము
గణములు - భ, ర, న, భ, గ
యతిస్థానము - 10
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
ఈ భ ర నంబుల న్భగురు లెక్కుచు నిం
పై భజియించె నేని జలదాహ్వయ మౌ
జలధరమాల
గణములు - మ, భ, స, మ
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
మాద్యత్ప్రీతిం జలధరమాలాభిఖ్యం
బ్రద్యోతించున్ మ భ స మ భద్రాప్తిన్
జలోద్ధతగతి
గణములు - జ,స, జ,స
ఛందము - జగతీ ఛందము
పాదాక్షర సంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
తనుమధ్యావృత్తము
గణములు - త, య
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
ప్రాసనియమము - కలదు
ఒప్పున్ తయ యుక్తిం
జెప్పం దనుమధ్యన్
తన్వి
తరలము
మారుపేరు - ధృవకోకిల
గణములు - న, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 12
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
నభరసంబులు జాగవర్గము నచ్చి యీశ్వరవిశ్రమ
ప్రభవమై తరలం బనంజను రాజవంశశిఖామణీ
తరళము
గణములు - భ, స, న, జ, న, ర
యతిస్థానము - 11
చారుభసన భూరి జన రసాంద్రగణములన్ దిగా
సార విరతినందముగ నిజంబు వరలి చెన్నగున్
తరువోజ
నలనామకంబులు నగణాంతములుగ నాలుగంఘ్రులయందు నాలుగుఁగూర్చి
వళులు మూఁడెడలను వరుసతో నిల్ప వలయు మూఁడవగణవర్ణంబు మొదల
నిలుపంగ నివ్విధి నిర్మించి విశ్వనృపతికి నిచ్చిన నింపుసొంపారుఁ
దలకొని తగఁబ్రాలు దంపెడిచోటఁ దరుణులచే సొంపుదనరుఁ దర్వోజ
తురగము
తురగవల్గితవృత్తము
గణములు - న, న, న, న, స, జ, జ, గ
యతిస్థానము - 15
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
మెఱయు న న న న స జ జ గములను మేలుగా రచియించినన్
వఱలు మనుయతి వలనను దురగవల్గితంబను వృత్తమై
తేటగీతి
గణములు - 1సూర్యగణము, 2 ఇంద్రగణములు, 2 సూర్యగణములు
ప్రాసనియమము - లేదు
యతిస్థానము - నాల్గవగణాద్యక్షరము
ప్రాసయతి - చెల్లును
సూర్యుడొక్కరుండు సురరాజులిద్దరు
దినకరద్వయంబు తేటగీతి
తోటకము
గణములు - స, స, స, స
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సరసం బయి సాసససంభృతంమై
విరచించినఁ దోటకవృత్తమగున్
తుదిదాఁక సకార చతుష్కముగా
విదితంబుగఁ దోటక వృత్తమగున్.
పాదపము
గణములు - భ,భ,భ,గ,గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
కామితభత్రయ గాయుత మై వి
శ్రామపుఁ దోదక సంజ్ఞతఁ జెందున్
పాదపవృత్తము భా భగగంబుల్
మోదముతో నిరు మూఁడవిరామన్
తోదకము
గణములు - న, జ, జ, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
సలలిత మైన నజాయగణంబుల్
విలసిత తోదకవృత్తముఁ జెప్పున్
జలరుహవక్త్ర ! న, జా, య గణంబుల్
వెలయఁగఁ దోదక వృత్తముఁ జెప్పున్.
తోవకము
గణములు - భ, భ, భ, గ, గ
యతిస్థానము - 7
ఛందము - జగతీ ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
శ్రీయుత భ త్రయ సేవ్యగగంబుల్
తోయజలోచన తోవకమయ్యెన్.
తామరసము
త్రిపద
త్రిపది
గణములు - 1వ పాదము 4 ఇంద్రగణములు మరియు2 వపాదము 2ఇంద్రగణములు, 2 సూర్యగణములు మరియు 3వపాదం
2ఇంద్రగణములు,1 సూర్యగణము
త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల
త్రిభంగి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న, న, న, న, న, న, స, స, భ, మ, స, గ
పాదమునకు మాత్రలు - చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
పాదాక్షరసంఖ్య - 34
లలి న న న న స న ములు ససభమములు నతిసగయుక్తిఁ జరింపం బ్రసరింపం బాటివహింపం
జెలువుగనవకలి నిలుపఁగదగునెడ వెలయుఁద్రిభంగి సురక్తిం బదభక్తిం బ్రాసనియుక్తిన్
త్వరితపదగతి
గణములు - న, న, న, న, న, గ, గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
త్వరితపదగతి యనఁగఁ ద గు న న న నాగా
విరచితయు దశమయతి విలసితయు నైనన్
దండకము
హ-న-స-త వీనిలో ఏదో ఒక గణముతో దండకాన్ని పూర్తిచేసి చివర ఒక గురువుతో ముగించాలి
విద్వాంసు లెల్లన్ హ కారంబె కానీ న కారంబెకానీ స కారంబె కానీ వచింపం దగున్ముందుగా నిందు గాదేని యాదిం దకారంబు గల్పించి
యామీది వెల్లన్ దకారంబులే మెండుగా నిచ్చకు న్వచ్చు నందాక నిర్మించి గుర్వంతముం జేసినన్ దండకంబండ్రు కాదంబినీ నీలగోపాల బాలా
నమస్తే పునస్తేనమః
దుర్మిలా
దృతవిలంబితము
గణములు - న, భ, భ, ర
యతిస్థానము - 7
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
ద్రుతవిలంబితరూపితవృత్తిచేన్
బ్రతతమయ్యె నభారగణంబులన్
దోధకము
ద్విపద
ఇంద్ర గణములు మూఁ డిన గణంబొకటి
చంద్రాస్య ! ద్విపదకుఁ జను చెప్పరేచ
ద్విపదకు ద్విపదకుఁ దెగ జెప్పవలయు
నెపుడు సంస్కృతమున నితర భాషలను
యతుల లోపలఁ బ్రాసయతి దక్క సకల
యతులు చెల్లును బ్రయో గాతి సారమున
ద్విపద తో ద్విపద సంధిల నేకశబ్ద
మపుడు రెంటను గూర్ప నది యయుక్తంబు
ద్విపది మంజరి
గణములు - 3 ఇంద్రగణములు, 1 సూర్యగణము
అన్యవివరములు - ద్విపదికి వళి,ప్రాస రెండూ ఉంటాయి. మంజరికి ప్రాస ఉండదు
శక్రత్రయంబును సవితృండుఁ బాద
విక్రీడితులు మృదుద్విపదికి నెపుడు
వళియుఁ బ్రాసంబును వలయు దీనికిని
వలదు ప్రాసంబండ్రు వరుస మంజరికి
ద్విరదగతి
ధరణి
ధరణిధరగతి
ధృతమధ్య
ధృవకోకిల
గణములు - న, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 12
శుభవిలాస ముకుంద కేశవ శూలిభవ్య విరామమున్
నభరసంబులు జాగముల్ దగు నవ్యమై ధృవకోకిలన్
నది
గణములు - న, న, త, జ, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
నదీప్రఘోషము
గణములు - ర, ర, ర, ర, మొదటి పాదము మరియు జ, త, జ, ర మిగిలిన 3 పాదములు
ఛందము - స్వస్థాన విషమ వృత్తము
భారరంబుల్మొగిం బ్రాగుపేతంబులై
చరించుచుండం జతజస్థరేఫలం
బరత్రిపాదంబులఁ బర్వునొప్పుఁగన్
దిరంబుగా మూఁట నదీప్రఘోషమై
నరేంద్ర
నర్కుటము
గణములు - న, జ, భ, జ, జ, వ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
నజభజముల్ జవంబులఁ దనర్చిన నర్కుటక
ప్రజననమొప్పు దిగ్యతిని రాజకులాబ్ధిశశీ
నవనందిని
గణములు - స, జ, స, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య -14
ప్రాసనియమము - కలదు
నాందీముఖి
గణములు - న, స, త, త, గ, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
నాగరము
నారాచము
నారీనుతము
నారీప్లుతవృత్తము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - 1,3 పాదములు ఒకవిధంగా మ, త, త, గ, గ, అలానే 2,4 పాదములొకవిధంగా త, త, జ, గ, గ ఉంటాయి
యతి స్థానము - 1, 3 పాదములకు 7 వఅక్షరము, 2,4 పాదములకు 8 వ అక్షరము
దానోదార శ్రీమతా గానియుక్తిం
గానంగఁదాజస్థ గగప్రసక్తిన్
మానై' చాళుక్యక్షమాపాలరమ్య
స్థానంబునారీప్లుత సంజ్ఞమయ్యెన్
నారీ వృత్తము
ఛందము - మధ్యాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 3
నారీవృ
త్తారంభం
బారు న్మా
కారం బై
నియోగిని
నిశా
పంక్తి
ఛందము - సుప్రతిష్ఠా చ్ఛందము
పాదాక్షర సంఖ్య -5
పంచచామరము
గణములు - జ, ర, జ, ర, జ, గ
యతిస్థానము - 10
త్వరాస దృగ్విధీయమాన దానతోయ శోషితాం
బురాశి వర్ధనాతి కృత్ప్రభూత కీర్తి మండల
స్ఫురత్సుధా మయూఖ వైరి భూమి భృచ్చిరోల్లస
త్కిరీట రత్న రాజితకాంతి దీపితాంఘ్రి పంకజా
పంచపది
ప్రణవము
గణములు - మ,న,య,గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
అందంబై మనయుగముల్ సొంపిం
పం దప్పొందక పణవం బయ్యెన్
పథ్య
పద్మకము
గణములు - న, భ, జ, జ, జ, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
న భ జ జద్వయ గకార సనాతన విశ్రుతిం
బ్రభవమై పరఁగు సత్కృతిఁ బద్మకకృత్తమై
పద్మనాభము
గణములు - త, త, త, త, త, త, త, గ, గ
పరావతి
పాలాశదళము
గణములు - న, న, న, న, న, గ, గ
పృథివీవృత్తము
గణములు - జ, స, జ, స, య, వ
యతిస్థానము - 12
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
జసంబులు జసంబులున్ యవనిషక్త రూపంబులై
పొసంగఁ బృథివీసమాఖ్యయగుఁ భూషవిశ్రాంతితోన్
ప్రగుణ వృత్తము
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
గణములు - స, గ, గ
ప్రాసనియమము - కలదు
సగణాసక్తిం
గగసంయుక్తిన్
బ్రగుణాఖ్యంబై
తగు నింపారన్
ప్రభాతము
గణములు - న, జ, జ, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాస నియమము - కలదు
మొదల నజారగము ల్ప్రభాతసంజ్ఞం
బొదవఁగ జేయు నపూర్వకల్పనోక్తిన్
ప్రమాణి
గణములు - జ, ర, వ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
జకారమున్ రకారమున్
వకారముం బ్రమాణికిన్
ప్రమితాక్షరము
గణములు - స, జ, స, స
యతిస్థానము - 9
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
అమలక్రియాప్తిఁ బ్రమితాక్షర మై
యమరున్ సజస్థ స స యంత్రిత మై
ప్రహరణకలిత
గణములు - న, న, భ, న, వ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ప్రహరణకలితంబయి న స భ స వల్
బహువిధయతులం బ్రథఁ జెలు వడరున్
ప్రహరణకలిత
గణములు - న, న, భ, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ప్రహర్షిణి
గణములు - మ, న, జ, ర, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
ప్రావీణ్యప్రదయొనరం బ్రహర్షిణిందాఁ
గావించున్ మ న జ ర గ వ్రజంబుధాత్రిన్
ప్రహేయము
ప్రియంవద
గణములు - స, భ, జ, ర
ఛందము - జగతీ ఛందము
పాదాక్షరసంఖ్య -12
ప్రాసనియమము - కలదు
ప్రియకాంత
గణములు - న, య, న, య, న, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
న య న యయుక్తిం దగ సగణంబున్ గురువొందున్
నియతము దిగ్విశ్రమమును నించుం బ్రియకాంతన్
ఫలసదనము
గణములు - న, న, న, న, స, గ
ప్రాసనియమము - కలదు
బంధురము
గణములు - న, న, స, స, స, భ, భ, గ
ప్రాసనియమము - కలదు
బలభిన్మణి
గణములు - భ, స, న, న, గ
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
యతిస్థానము - 7
ప్రాసనియమము - కలదు
బింబము
చందము - ప్రతిష్ఠా చ్ఛందము
ప3దాక్షర సంఖ్య 0 4
ప్రాసనియమము - కలదు
భంభరగానము
గణములు - న, న, భ, భ, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
భద్రకము
గణములు - భ, ర, న, ర, న, ర, న, గ
భద్రకము
గణములు - ర, న, ర
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
భద్రకంబు రనరంబులన్
భద్ర విశ్వనృపమన్మథా
భద్రిణీవృత్తము
గణములు - భ, ర, న, ర, న, ర, న, గ
యతిస్థానము - 12
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
భాదిరనత్రయంబు గురు యుక్తమై గిరిశవిశ్రమప్రకటమై
మేదిని నొప్పు భద్రిణికి నందు మేరునగధీర విశ్వనృపతీ
భాస్కరవిలసితము
గణములు - భ, న, జ, య, భ, న, న, స, గ, గ
యతిస్థానము - 13
ఛందము - అభికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
సారసహితయతి సంగతవృత్తి స్సంచిత భ న జ య భ న న స గం బుల్
పౌరవకులజలరాశిమృగాంకా భాస్కరవిలసిత మన విలసిల్లున్
భుజంగప్రయాతము
గణములు - య, య, య, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
భుజంగప్రయాతంబు పొం దారు నందం
బజస్రంబుగా నయ్యయాయంబు లొందన్
భుజంగవిజృంభితము
గణములు - మ, మ, త, న, న, న, ర, స, వ
యతిస్థానము - 10
ఛందము - ఉత్కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 26
ప్రాసనియమము - కలదు
ధీవైదగ్ధ్య శ్రీవిక్రాంతా దిగిభదశమపదవిరతిన్ భుజంగవిజృంభితం
బై విశ్రాంతుల్ దైవాఱం జెన్నగు మ మ త న న ర స హారియై లగసంయుతిన్
భుజగశిశిరుతము
గణములు - న, న, య
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
భుజగశిశురుత మయ్యెన్
ఋజు ననయ ములచేతన్
భూతిలకము
గణములు - భ, భ, ర, స, జ, జ, గ
యతిస్థానము - 10
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
భూతిలకం బగు భా ర సంబులఁ బొంది జా గ ము లుండినన్
భూతపతిస్ఫుట విశ్రమంబున భూప విశ్వనరేశ్వరా
భూనుతము
గణములు - ర, న, న, భ, గ, గ
యతిస్థానము - 10
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
అందమై ర న న భ తతి నంది గగంబుల్
పొందఁగా బదగతిఁగని భూనుతమయ్యెన్
భోగినివిలసితము
భ్రమరవిలసితము
మంగళమహాశ్రీ
గణములు - భ, జ, స,న, భ, జ, స, న, గ, గ
యతిస్థానము - 9,17
ఛందము - ఉత్కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 26
ప్రాసనియమము - కలదు
సత్తుగను రత్నముల సప్తదశమంబునను సద్యతులు మంగళమహాశ్రీ
వృత్తమున కౌభజసవృత్తిన భజల్మనలపై గురులురంగనృపధీరా
మంజరి
మంజుభాషిణి
గణములు - స, జ, న జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
సలయంబుగాఁగఁ సజసంబుతో జగం
బులు మంజుభాషిణికిఁ బొందు నందమై
మందాక్రాంత
గణములు - మ, భ, న, త, త, గ,గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
కాంతా కాంతా మభనతతగా క్రాంత సంక్రాంత మందా
క్రాంతంబయ్యెన్ విరమదశమాక్రాంతి విశ్రాంత మైనన్
మణికమలవిలసితము
గణములు - స, స, స, స, గ, గ
మణిగణనికరము
గణములు - న, న, న, న, స
యతిస్థానము - 9
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
సరసత న న న న సగణము లెసఁగం
గరియతిఁ గని మణిగణనికర మగున్
మణిభూషణము
గణములు - ర, న, భ, భ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
విశ్వభూప మణిభూషణవృత్త మనంజనున్
శశ్వదుక్త ర న భా ర దిశాయతిఁగూడినన్
మణిమాల
గణములు - స, జ, స, జ, స, జ, స
యతిస్థానము - 10
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
వరుసన్ సజత్రితయము న్బ్రసక్త సగణంబుతోడ నొనరం
బరఁగున్ దిగంతవిరతిం బ్రధానపదమై చళుక్యమదనా
మణిరంగము
గణములు - ర,స,స,గ
పాదాక్షరసంఖ్య -10
యతిస్థానము - 6
మత్త
గణములు - భ, మ, స, గ
యతిస్థానము - 7
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
శైలశ్రాంతిన్ మభసగలోలిం
గ్రాలన్ మత్తాఖ్యను గనుపట్టున్
మత్తకోకిల
గణములు - ర, స, జ, జ, భ, ర
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
సత్తయౌ రసజాభరల్ భవసంఖ్య విశ్రమ మొప్పినన్
మత్తకోకిల వృత్తమౌన సమానరంగనృపాలకా
మత్త మయూరము
గణములు - మ, త, య, స, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
సంబోదార్థంబై వలసన్మత్త మయూరా
ఖ్యం బింపొప్పారున్ మతయాగ్య్రాత్త సగాప్తిన్
మత్తమయూరము
గణములు - న, న, భ, భ, గ
ఛందము - అతి జగతి
పాదాక్షర సంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
యతిస్థానము - 8
మత్తహంసిని
గణములు - జ, త, స, జ, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
మత్తాక్రీడ
మత్తేభవిక్రీడితము
గణములు - స, భ, ర, న, మ, య, వ
యతిస్థానము - 14
ఛందము - కృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
నలువొందన్ సభరల్ నమల్యవల తోనంగూడి మత్తేభ మిం
పలరారున్ బదునాలు గౌ విరతి చే నానందరంగా ధిపా
మథ్యాక్కర
మదనదర్పణము
మదనము
గణములు - త, భ, జ, జ, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరి చ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
దైతేయ భంజన ! హరీ ! త, భ, జా, గగంబుల్
మాతంగ విశ్రమమున్ మదనాఖ్య యొప్పున్.
మదన విలసితము
గణములు - న, న, గ
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 7
ప్రాసనియమము - కలదు
మదనవిలసిత
ప్రదముల్ ననగల్
మదనార్త
గణములు - త, య, స, భ, గ, గ
యతిస్థానము -
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
మదరేఖ
ఛందము - ఉష్టిక్ చ్ఛందము
పాదాక్షరసంఖ్య -7
మద్రకము
మధుమతి
మారుపేరు - మదనవిలసితము
ఛందము - ఉష్టిక్ చ్ఛందము
పాదాక్షరసంఖ్య -7
మధురగతిరగడ
నాలుగు మాత్రలు నాటిన గణములు
నాలుగు రెంటికి నలి విరమణలు
గలసి మధురగతి కనలును జగణము
తొలగిన ధృతకౌస్తుభ కవిరమణము
మధురాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 5 గణములు ఉంటాయి,3 ఇంద్ర గణములు,2 సూర్యగణములు,
యతిస్థానము - నాల్గవ గణాద్యక్షరము
తరణి వాసవ త్రితయంబు ధవళ భానుయుతి నొంద
నిరతి విశ్రాంతి నాలవనెలవున నింపుమీఱ
సరసమధురార్ధములఁ జెప్పఁ జను మధురాక్కరంబు
వరుసఁ బంచగణములను వాలి కృతుల వెలయు
మధ్యాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 6 గణములు ఉంటాయి, 2 ఇంద్ర గణములు,1 సూర్యగణము,2 ఇంద్ర గణములు,
1 సూర్యగణము
యతిస్థనము - నాల్గవ గణాద్యక్షరము
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి యుండి
సురరాజ యుగముతోగూడి సూర్యుతో నొడబడి వెండి
కరమొప్ప నీపాట నాఱు గణముల మధ్యాక్కరంబు
విరచింప బ్రావళ్ళు నిట్లు వెలయఁ గవిజనాశ్రయుండ
\*నన్నయ గారు 5వగణాద్యక్షరం యతి వేసిరి
మనోజ్ఞము
గణములు - న, జ, జ, భ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
వరుస మనోజ్ఞమనంగ వచ్చు నజాభర
స్థిరగతిఁ బంకజభూయతిం బ్రతిపన్నమై
మనోరమ
మనోహర
మయూరసారి
గణములు - ర, జ, ర, గ
యతిస్థానము - 7
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
పర్వు నీరజంబు పైరగంబుల్
సర్వదా మయూరసారిఁ జెప్పన్
మారుపేరు - మయూరభాషిణి
మలయజము
గణములు - న, జ, న, స, న, న, భ, న ల
యతిస్థానము - 8, 15, 22
నళిన విలోచన నజనసనంబులునభనగణంబులు నటలగమున్
మలసి గిరిత్రయమహితయతుల్ తగిమలయజ వృత్తము మహివెలయున్
మహాక్కర
గణములు - రవీంద్రచంద్రాఖ్య గణాలలో 7 గణముల�� ఉంటాయి, 1 ఇనగణము,5 ఇంద్రగణములు, 1చంద్రగణము
వారిజాప్తుండు పంచేంద్రగణములు వనజారియును గూడి వెలయుచుండ
నారయ రెండవ నాలవచోట్ల నర్కుండయిననుం దనర్చుచుండఁ
గోరి యవ్వడిపంచమగణమునఁ గూడి మొదల నిలుపంగ నగు
సారమై ప్రాసవడి సప్తగణములు సాఁగ మహాక్కర యతిశయిల్లు
మహాస్రగ్ధర
గణములు - స, త, త, న, స, ర, ర, గ
యతిస్థానము - 9,16
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
రహిఖండగ్లౌకళా విశ్రమములను మహాస్రగ్ధరా వృత్తమౌ శ్రీ
సహితౌ దార్యాసతానల్ సరర గురువులున్ శ్రీరంగ రంగభూపా
లసదుత్యత్కీర్తి వల్లీ లలిత గుణగణా లంకృతాంగా స, తా, న
స్థ, స, రా, గంబు ల్మహాస్రగ్ధరకు వసుముని స్థానవిశ్రాంతులొప్పున్.
మానిని
గణములు - భ, భ, భ, భ, భ, భ, భ, గ
యతిస్థానము - 7,13 ,19
ఛందము - ఆకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 22
ప్రాసనియమము - కలదు
కారము లున్క్రియ గన్గొన నేడు భ కారములొక్క గకారముతో
గారవమై చన గావళు లన్నియు గల్గిన మానిని కామ నిభా
మాలిని
గణములు - న, న, మ, య, య
యతిస్థానము - 9
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
నవ విరమణ యుక్తిన్ నామయాసంగతం బై
యవని దగును మాలిన్యాఖ్య చేరంగ ధీరం
ముఖచపల
మేఘవిలసితము
మేఘవిస్ఫూర్జితము
గణములు - య, మ, న, స, ర, ర, గ
యతిస్థానము - 13
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
మృదున్యస్తార్థంబై దినకరయతి న్మేఘవిస్ఫూరితాఖ్యం
బుదాత్తశ్రీఁ జేర్చున్ యమనసర రప్రోత గప్రాప్తిచేతన్
మేదిని
గణములు - న, జ, భ, జ, ర, గ
యతిస్థానము - 11
ఛందము - అష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 16
ప్రాసనియమము - కలదు
న జ భ జ రేఫగంబునఁ దనర్చు మేదినీవృ
త్తజనికి మూలమై దిగుదితస్థ విశ్రమం బై
మేలనగీతి
గలము రెండునగణములును గలసి ప్రాస మెఱయుఁ
జెలువు దోఁప నెత్తుగీతి వెలయుఁ గృతులయందు
నోలి నగణమొండె హగణమొండె నేడుచేసి
నాలుగడుగులందు నిలిపి నళుపుదోఁప విరతి
వాలి పంచమస్థ యగుచు వచ్చెనేని యొప్పు
మేలనాభిదాన మైన మేలుగీతి కృతుల
మోహ ప్రలాపము
గణములు - భ, భ, త, ర, గ
యతిస్థానము - 5
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య -13
ప్రాసనియమము - కలదు
రతి
గణములు - స, భ, న, స, గ
యతిస్థానము - 5
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
రతిప్రియవృత్తము
స్వస్థానార్థసమ వృత్తము
గణములు - 1,3 పాదములు మ, న, జ, ర, గ, 2,4 పాదములు జ, భ, స, జ, గ
ప్రాసనియమము - కలదు
ఖ్యాతశ్రీ మనజరగంబులుండఁగాఁ ద
ద్గతంబులై జభసజగంబు లొందగా
వీతాఘప్రముదితవిశ్వభూపా
ధృతిం దలంప నిది రతిప్రియం బగున్
రథగమన మనోహరము
రథోద్ధతము
మారుపేరు - నరాంతికము
గణములు - ర, న, ర, ల, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
రక్తిఁ బేర్చి రనరంబు పై లగం
బుక్త మైనను రథోద్ధతం బగున్
రమణకము
గణములు - 9 నగణములు, 1 వగణము
యతిస్థానము - 1,9,17,25
మనసిజ జనకసమద రిపు గజహరిమదగజవసు విరమణములతో
నననననననననలగము లెనయగ నరవరనుత రమణక మమరున్
రసాలి
రాజహంస
గణములు - త,త,త,త,త,త,త,త,గ
యతిస్థానము - 13
ప్రాసనియమము - కలదు
రుగ్మవతి
గణములు - భ,మ,స,గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
రుగ్మవతిం జేరున్ భమసంబుల్
తిగ్మరుచిద్యుద్దీప్త గయుక్తిన్
రుచిరము
గణములు - జ, భ, స, జ, గ
యతిస్థానము - 9
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
క్రమంబుతో జభసజగమ్ము లిమ్ముగా
నమర్పఁగా రుచిరసమాహ్వయం బగున్
లత
గణములు - న, య, న, న, గ
యతిస్థానము - 7
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
లయగ్రాహి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - భ, జ, స, న, భ, జ, స, న, భ, య
పాదమునకు 30 అక్షరములు
పాదమునకు మాత్రలు - 24
ప్రాసయతి - 2, 10, 18, 26
ఎ'మ్మె' వెలయన్ భజసన'మ్ము'లు మఱిన్ భజసన'మ్ము'ల పయిన్ భయగణ'మ్ము'లు లయగ్రా
హి'మ్మ'ఱయు రంగనృప యి'మ్మ'హిని బ్రాసయతులె'మ్మె'ఱపి నాల్గు చరణ'మ్ము'లను వేడ్కన్
పంబినయతిన్ భజసనంబులఁ బునర్భజసనంబుల భయంబుల కదంబము లయగ్రా
హిం బెనుపునం బుధమతిం బరఁగుఁబ్రాసనికురుంబకము పాదముల నింబడరు చూడన్.
బిందుపూర్వక బకారముగా గ్రహించవలెను.
లయవిభాతి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న,స,న,న,స,న,న,న,స,న,న,స,గ
పాదాక్షరసంఖ్య - 34
పాదమునకు మాత్రలు - 24మాత్రాగర్భితపాదము
ప్రాసయతి - 2, 11, 20, 29
న స న న స నా కలితన స న న స గం బుల విలసితతర పాదములఁ బొసఁగు నలు వ్రాలం
బ్రసరితములై యలరుఁ బసలయవిభాతి యన రసికులకు వీనులకు నొసఁగు జవు లింపై
లయహారి
ఉద్ధురమాలా వృత్తము
గణములు - న, న, న, న, న, న, న, న, న, న, న, స, గ
ప్రాసయతి - 2, 22
పాదాక్షరసంఖ్య - 37
పాదమునకు మాత్రలు - చత్వారింశన్మాత్రాగర్భితపాదంబు
పదునొకఁడు నగణములఁ బొదలి సగణము గురువు మృదులపదరచనఁ దగి యొదవి మితివ్రాలన్
ముదమొసఁగు సభల నని చదువుదురు కవివరులు హృదయములఁ జతురతలుగదుర లయహారిన్
లాటీవిటము
గణములు - స, స, స, స, మ, త, య
యతిస్థానము - 13
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
స స సా మత యంబులు భానుయతి న్సాకంబై లాటీవిటవృత్తం
బెసకంబెసగున్ విరచించిన విశ్వేశా, చాళుక్యక్షితిపాలా
వంశము
గణములు - జ, త, జ, ర
వంశస్థము
గణములు - జ, త, జ, ర
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
జతంబులం జెందిన జంబు రేభయున్
నుతింప వంశస్థ మనుక్రమక్రియన్
వనమంజరి
గణములు - న, జ, జ, జ, జ, భ, ర
యతిస్థానము - 13
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
తనర న జా జ జ భా గ్భకారయుత త్రయోదశయుగ్యతిన్
వినుత మగు న్వనమంజరినాఁ దగువృత్త మింపెసలారఁగన్
వనమయూరము
గణములు - భ, జ, స, న, గ, గ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
ఉన్నతములై వనమయూర కృతిలోలిన్
ఎన్నగ భజంబుల పయిన్ సనగగం బుల్
చెన్నొదవ దంతి యతి చెంది యలరారున్
వెన్నుని నుతింతురు వివేకు లతి భక్తిన్
వరాహము
వసంత తిలకము
గణములు - త, భ, జ, జ, గ,గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
స్థాపించినం ద భ జ జంబు చళుక్య విశ్వ
క్ష్మాపా వసంతతిలకంబగు గా నియుక్తిన్
వసంత మంజరి
గణములు - న, భ, భ, న, ర, స, వ
యతిస్థానము - 13
ఛందము - కృతి ఛందము
పాదాక్షరసంఖ్య - 20
ప్రాసనియమము - కలదు
వాతోర్మి
గణములు - మ, భ, త, ల, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
తద్వాతోర్మిన్ మభతంబుల్ లగమున్
సద్విశ్రామస్థితి సంధిల్లుచుండున్
వారాంగి వృత్తము
గణములు - జ, త, జ, గ, గ 1,2 పాదములకు మరియు త, త, జ, గ, గ 3,4 పాదములకు
చళుక్యవంశాజతజల్ గగంబుల్
చెలంగి యర్థంబునఁ జెంది రీతిం
గ్రాలంగఁ దాయత్తజగానియుక్తిన్
మేలయ్యె వారాంగి సమీహితాఖ్యన్
వాసంతి
గణములు - మ, త, న, మ, గ, గ
యతిస్థానము -
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
విచికిలితము
విచిత్రము
విచిత్ర వృత్తము
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
గణములు - య, య
ప్రాసనియమము - కలదు
విచిత్రంబునందున్
రుచించున్ యయంబుల్
విజయభద్రము
విజయమంగళము
వితానము
వితాళచతుష్పద
విద్యున్మాల
గణములు - మ, మ, గ, గ
యతిస్థానము - 5
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ఉద్యున్మాగా యుక్తం బైనన్
విద్యున్మాలా వృత్తం బయ్యెన్
విద్రుమలత
గణములు - న, జ, న, న, ల, గ
యతిస్థానము - 8
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
వినయము
ఛందము - మధ్యాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 3
విపుల
విభూతి వృత్తము
గణములు - ర, జ, గ
పాదాక్షరసంఖ్య - 7
ఛందము - ఉష్ణిక్కుచ్ఛందము
ప్రాసనియమము - కలదు
స్వస్థ సద్విభూతి దా
రస్థ జస్థగంబునన్
విమానము
వియోగిని
విశ్వదేవి
గణములు - మ, మ, య, య
యతిస్థానము - 8
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
మాయావర్ణం బొప్పం గ్రమన్యాసవృత్తిన్
జేయున్ భూభృ ద్విశ్రాంతిచే విశ్వదేవిన్
విషమసీసము
వీణారచన వృత్తము
ఛందము - స్వపరస్థాన విషమ వృత్తము
చాణక్యనయజ్ఞాత యనస్థసగంబుల్
వీణారచనకొందు భువిందససావంబుల్
శ్రేణీందజనస్థితభససేవిత నియతిన్
రాణలనెలవై భస నజరంబు లోలిగన్
వృంత
వృషభగతి
వేగవతి
వైతాళీయము
వ్రీడ
శంభువృత్తము
శరభక్రీడా వృత్తము
గణములు - య, మ, న, స, ర, గ- 1,2 పాదములు మరియు మ, భ, న, య, య -3,4
పాదములు
ఛందము - పరస్థాన విషమ వృత్తము
చతుర్వర్ణాధారా య మ న స ర గ వ్యాప్తి నాద్య
ద్వితీయాం త్యాంఘ్రి ప్రస్తుతగతి నతిస్పష్టమైనన్
ఖ్యాతాసక్తిన్ మ భ న య య తృతీయాంఘ్రినొప్పన్
బ్రతిప్రేమోత్పత్తిం బరఁగి శరభక్రీడ యయ్యెన్
శార్దూలవిక్రీడితము
గణములు - మ, స, జ, స, త, త, గ
యతిస్థానము - 13
ఛందము - అతిధృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 19
ప్రాసనియమము - కలదు
సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా
కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్
శాలిని
గణములు - మ, త, త, గ, గ
యతిస్థానము - 6
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
రాకాధీశాకార రాజన్మ తా గా
నీకప్రాప్తిన్ శాలినీవృత్తమయ్యెన్
శాలూరము
శిఖరిణి
గణములు - య, మ, న, స, భ, వ
యతిస్థానము - 12
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
వివస్వ ద్విశ్రాంతి న్య న స భ వా విష్కృతగతిం
గవిశ్రేణీరక్తిన్ శిఖరిణియనంగాఁ దగుఁబ్రథన్
శుద్ధవిరాటి
గణములు - మ, స, జ, గ
యతిస్థానము - 6
ఛందము - పంక్తిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 10
ప్రాసనియమము - కలదు
స క్తం బై మసజస్థగ ప్రథా
రక్తిన్ శుద్ధవిరాట నాఁ జనున్
శ్యేని
గణములు - ర, జ, ర, వ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
శ్యేనికై రవంబు చెప్పి పైరవం
బూనఁజేయు టెల్ల నొప్పు నెప్పుడున్
శ్రీరమణము
గణములు - భ,మ,త,గ మెదటిపాదము ఉపక్రాంత మరియు భ, భ, భ, గ,గ నికటము తరువాతి 3
పాదములు
ఛందము - పరస్థాన విషమ వృత్తము
ఆరభమవ్యాయత్తసగవ్యా
పారము నాదిమ పాదము సెందన్
జారు భభాగగసంగతిచేతన్
శ్రీరమణంబని చెప్పిరి మూఁటన్
శ్రీ వృత్తము
ఛందము - ఉక్తా ఛందము
పాదాక్షరసంఖ్య - 1
శ్రీ
శ్రీం
జే
యున్
షట్పద
షట్పది
గణములు - 6 ఇంద్రగణములు,1 చంద్రగణము
సురపతులిరువురు సురపతులిద్దఱు
సురపయుగమ్ముతో సోముండును
బరువడిఁబెనఁగొన నదురుగ షట్పది
సరిబ్రాసంబులు దనరారంగను
సమాని
గణములు - ర,జ,వ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
ఈ సమానికిన్ ర జ వ
వ్యాస మొప్పగుం గృతులన్
సరసాంకవృత్తము
గణములు - స, జ, స, స, య
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
సరసాంక వృత్తమమరున్ స, జ, సా, య లొందన్
సరసీజ సంభవయతిన్ జలజాత నేత్రా
సాధ్వీ వృత్తము
గణములు - భ, న, జ, న, స, న, న, భ, గ
యతి స్థానము - 8, 15, 22
ఛందము - అభికృతి ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
నారద సనక సనందన వినుత సనాథ ? భ, న, జ, న, స, నా, భ గురుల్
చారు శిఖరియతి శైల విరమణము క్ష్మాధర విరతియు సాధ్వి యగున్.
సరసిజము
గణములు - మ, త, య, న, న, న, న, స
యతిస్థానము - 10
ఛందము - వికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 23
ప్రాసనియమము - కలదు
చాళుక్యక్ష్మాపాలవరేణ్యా శ్రయమతయనననిచయయుతననసల్
చాలై యింపై వ్రాలఁ దనర్పన్ సరసిజమగు నిలఁజవులకుఁ గుదురై
సింధురవృత్తము
గణములు - న, న, న, న, స, భ, భ, భ, గ
యతిస్థానము - 12
ఛందము - అభికృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 25
ప్రాసనియమము - కలదు
క్రమమున న న న న స భ భ భ గ గణ క్రాంతిదినాధిపవిశ్రమమై
ప్రమదధలసలయభరితవిరచనన్ బంధురసింధురవృత్తమగున్
సింహరేఖ
గణములు - ర, జ, గ, గ
ఛందము - అనుష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 8
ప్రాసనియమము - కలదు
ఈరజాగ్రగా నియుక్తిన్
గోరి సింహరేఖ యొప్పున్
సీసము
నల నగ సల భ ర త ల లో
పల నాఱిటి మీఁద రెండుఁ బద్మాప్త గణం
బులఁ దగి నాలుగు పదములఁ
జెలువగు నొక గీతి తోడ సీసము కృష్ణా !
ఇంద్రగణములారు ఇనగణంబులు రెండు
పాదపాదమందు పల్కుచుండు
ఆటవెలదినైన తేటగీతియు నైన
చెప్పవలయు మీద సీసమునకు
క
అమరంగ విషమసీసము
సమసీసము లనఁగఁ రెండుచందము లందున్
బ్రమితమగు విషమసీస
క్రమ మెఱుఁగఁగవలయుఁ జతురకవిజనములకున్
గీ
హగణనగణంబు లేడు గుర్వంతమగుచు
వి స్తరిల్లిన నుత్సాహవృత్తమయ్యె
దీనితుద గీతియొకఁడు సంధింప విషమ
సీస మిత్తెఱఁగెఱుఁగుట చెలువుమతికి
విషమ సీసము
గీ
వడి దనర్పఁ బ్రాసవైభవం బలరార
నిట్ల గణనిరూఢి నెసక మెసఁగఁ
గీ ర్తితాతిమధురగీతియుఁ బైగల్గ
నదియ విషమసీసమండ్రు కృతుల
సమసీసము
గీ
వెలయు సమసీసములు పంచ విధములయ్యె
నరయ నవకలిసీ సాహ్వయంబుఁ, బ్రాస
సీస, మక్కిలిప్రాససీసాఖ్యసీస
ము,వడిసీస, మక్కిలివడిసీసమును ననంగ
క
తన పాదంబులు నాలుగు
మొనసిన పై గీతిపాదములు రెండును గా
నినుమూఁడై సీసమునకు
జను నడుగులు వ్రాలు వళ్ళు సరి యిన్నిటికిన్
అవకలి సీసము
క
అలవడిసీసము పాదము
నలుతునుకలు చేసి మూఁట నలనామగణం
బుల రెంటి నిడి య
వ్వలితునుక నహంబు లిడఁగవలయు న్వరుసన్
సీ
సామంబుచేఁ దుల్యభూమీశ్వరులు దన, తోడిమిత్రతకు నఱ్ఱాడుచుండ,
దానంబుచే నతిమానమానవనాథు లేర్పడ నక్కఱఁ దీర్చుచుండ,
ఖేదంబుచేత దుర్మోదమహీశు లందంద సంక్షిప్తత నొందుచుండ,
దండంబుచేత నుద్దండమాండలికు లాజ్ఞాచక్ర మౌదల మోచియుండ
గీ
శశ్వదనురక్తిఁ జాళుక్యవిశ్వనిభుఁడు
వాలి వసుమతి లీలమై నేలుననుచుఁ
జెప్ప నవకలిసీస మిట్లొప్పునండ్రు,
పూని గావ్యకళావేదులైనకవులు
ప్రాస సీసము
క
సీసమునకు నాఱడుగులఁ
బ్రాసము లిడి యోలి సర్వపదఖండములన్
భాసురముగ వళ్ళలవడఁ
జేసిన నది కృతులఁ బ్రాససీసంబయ్యెన్
సీ
చక్రవాళాచల చంద్రకాంతములకు సంతతార్ద్రత్వంబు జరపి జరపి,
చక్రీశలోక సంచర దురు సంతమసంబుల వడిఁ బాఱఁ జదిపి చదిపి,
శక్రేభశంకరశంకరాచలశశి చారుదీధుతులపైఁ జాఁగిచాఁగి,
చక్ర స్తనీకుచ సాంద్ర చంద్రనరసచర్చలపైఁ గేలి సలిపి సలిపి,
గీ
విక్రమప్రతాప విశ్రుతమూర్తియై
విశ్వభూమివిభుని విశదకీర్తి
ప్రక్రమప్రసక్తిఁ బ్రసరించు నని చెప్పఁ
బ్రాససీస మనఁగ బరఁగు నెందు
అక్కిలిప్రాససీసము
క తుదిగీతి నాలుగడుగులు
వదలక ప్రాసంబు నిలిపి వళ్ళింపారం
గదిరినఁ గదురకయున్న
న్నది యక్కిలి ప్రాససీస మనఁగాఁ బరఁగున్
సీ
క్రమయుక్తి విద్యల కందువ యెఱుఁగుచుఁ, గవులనే ర్పారసి గారవించి,
సమరసంక్రీడనక్షమసుభటాటోప సంచారములకు నుత్సాహమూఁది,
నమితాహితక్షమానాథులరాజ్యంబు నాననాఁటి కొనర నున్నుచేసి,
ప్రముదితారాతుల భంజించి వేలుపుం బడఁతుల కిపారుపతులఁ జేసి,
గీ
విమలకీర్తుల దిక్కులు విప్పనేర్చు
శమితవినుతుండు విశ్వేశచక్రవర్తి
సముచితంబుగ నని చాల సన్నుతింప
నమరు నక్కిలిప్రాససీసాహ్వయంబు
వడిసీసము
క
ఏపాదమునకు నే వడి
యాపాదింపంగఁబడియె నది ఖండములం
బ్రాపింపఁ జెప్పఁగ వళిని
రూపితసీసంబు నాఁగ రూఢికినెక్కున్
సీ
గ్రహదంష్ట్ర సోఁకని గ్రహరాజు, ప్రియవచః కథనంబు నేర్చినకల్పభూజ,
మలరుఁదూపులు కేల నంటని కందర్పు, డమ్ముచే నింకని యంబురాశి,
కన్నులు పెక్కులు గల్గని యింద్రుండు, కఱకేది వంగని కనకనగము,
తనువెత్తి క్రాలెడు ధర్మదేవత, రూపుఁ దాల్చిన రాజవిద్యావిభూతి,
గీ
నయవిదుండు రాజనారాయణుఁడు విశ్వ
నాథుఁ - డనుచు వర్ణనములుసేయ
వరుస నిట్లు కృతుల వళిసీస మన నొప్పు
వసుధ వైభవాలవాల మగుచు
అక్కిలి వడిసీసము
గీ
సీసఖండంబు వళ్లిట్లు చెప్పి గీతి
ఖండవళి రెంటి కొక్కఁడుగా నొనర్ప
నదియ యక్కిలివడిసీసమండ్రు కృతుల
లక్ష్యములు చూచి యెఱుఁగుఁ డీలాగు లెల్ల
క
సీసములకు గీతులకుం
బ్రాసములును వళ్ళుఁ గలయఁబడి కవితల ను
ద్భాసిల్లఁ దఱచు నియమ
వ్యాసక్తియుఁ గలుగుఁ జెప్పవలసినచోటన్
సుందరి
గణములు - భ, భ, ర, స, వ
యతిస్థానము - 9
ఛందము - శక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 14
ప్రాసనియమము - కలదు
భార స వంబుల నొప్పుఁ బద్మజవిశ్రమం
బారఁగ సుందరవృత్తమై బుధవర్ణ్యమై
సుందరీ వృత్తము
గణములు - భ, గ, గ
ఛందము - సుప్రతిష్ఠాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 5
ప్రాసనియమము - కలదు
సుందరి యొప్పుం
జెంది భగా నిం
పొంద నియుక్తిన్
గందుకలీలన్
సుకాంతి
ఛందము - ప్రతిష్ఠాచ్ఛదము
పాదాక్షరసంఖ్య - 4
గణములు - జ, గ
ప్రాసనియమము - కలదు
జగంబులం
దగున్ సుకాం
తి గల్పిత
ప్రగల్భతన్
సుకేసరము
గణములు - న, జ, భ, జ, ర
యతిస్థానము - 10
ఛందము - అతిశక్వరీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 15
ప్రాసనియమము - కలదు
నజభజరేఫలం గదియ వచ్చి దిగ్యతిన్
సుజనమతి న్సు కేసరము శోభితంబగున్
సుగంధి
గణములు - ర, జ, ర, జ, ర
యతిస్థానము - 9
ప్రాసనియమము - లేదు
దంబుజం బురంబు జంబు రంబు చెన్నుమీరగా
దొమ్మిదింట విశ్రమంబు తోరమై సుగంధికిన్
సుమంగలి
గణములు - స, జ, స, స, గ
యతిస్థానము - 8
ఛందము - అతిజగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 13
ప్రాసనియమము - కలదు
సుముఖి
సురలత
గణములు - న, య
ఛందము - గాయత్రీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 6
ప్రాసనియమము - కలదు
సురలతఁ జెప్పన్
సొరిది నయంబుల్
స్త్రీ వృత్తము
ఛందము - అత్యుక్తాచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 2
స్త్రీరూ
పారుం
గారూ
పారున్
స్రగ్ధర
గణములు - మ, ర, భ, న, య, య, య,
యతిస్థానము - 8,15
ఛందము - ప్రకృతిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 21
ప్రాసనియమము - కలదు
సారెస్ నాగాధి రాట్పంచదశ విరమతన్ స్రగ్ధరా వృత్తమౌ గాం
తారాజీవాస్త్ర యుద్యన్మరభనయయయోద్భాసి యై రంగభూపా
శ్రీమన్మూర్తీ మకారా శ్రిత ర, భ, న, య, యా సేవ్యమై సానుమద్వి
శ్రామంబున్ సానుమద్వి శ్రమము నమరఁగా స్రగ్ధరా వృత్తమయ్యెన్
స్రగ్విణి
గణములు - ర, ర, ర, ర
యతిస్థానము - 7
ఛందము - జగతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 12
ప్రాసనియమము - కలదు
స్ఫారితంబై యకూపా ర ర శ్రేణితో
సార మై స్రగ్విణీచారువృత్తం బగున్
స్వాగతము
గణములు - ర, స, భ, గ, గ
యతిస్థానము - 7
ఛందము - త్రిష్టుప్ఛందము
పాదాక్షరసంఖ్య - 11
ప్రాసనియమము - కలదు
స్వాగతంబు రనభంబు గగాస్తిన్
సాగు విశ్వనృపచంద్రకులాఢ్యా
హంసరుతము
హంసి
హయప్రచారము
హరనర్తనము
హరిగతి
హరిణగతి
హరిణి
గణములు - న, స, మ, ర, స, ల, గ
యతిస్థానము - 11
ఛందము - అత్యష్టిచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 17
ప్రాసనియమము - కలదు
హరిణి యనువృత్తంబయ్యెన్ శంకరాత్తయతిప్రథన్
స రి న స మ రే ఫావక్రాంతోపేత సస్థలంగంబులన్
హలముఖి
గణములు - ర, న, స
ఛందము - బృహతీచ్ఛందము
పాదాక్షరసంఖ్య - 9
ప్రాసనియమము - కలదు
కామితక్రియ హలముఖీ
నామ మొప్పు రనసలచేన్