మే 14
తేదీ
(14 మే నుండి దారిమార్పు చెందింది)
మే 14, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 134వ రోజు (లీపు సంవత్సరములో 135వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 231 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
మార్చు- 1607: జేమ్స్‌టౌన్ (వర్జీనియా), అమెరికా లోని ఆంగ్లేయుల మొట్టమొదటి శాశ్వత నివాస కేంద్రం.
- 1638: అడ్మిరల్ ఆడం వెస్టెర్‌వోల్ట్, శ్రీలంక లోని బట్టికలోవ్ను జయించాడు.
- 1643: లూయిస్ XIV (4), ఫ్రాన్స్ రాజు అయ్యాడు.
- 1759: సలాబత్ జంగ్ ఆంగ్లేయులతో సంధి చేసుకొని గుంటూరు తప్ప ఉత్తర సర్కారు జిల్లాలన్నింటిని ఆంగ్లేయుల పరం చేశాడు.
- 1796: ఎడ్వర్డ్ జెన్నర్ తను కనిపెట్టిన ఆటలమ్మ అని, అమ్మవారు అని పిలవబడే స్మాల్‌పాక్స్కి మందును, మొదటిసారిగా ప్రజలకు వేయటం మొదలుపెట్టాడు.
- 1811: స్పెయిన్ దేశం నుంచి పరాగ్వే దేశం స్వాతంత్ర్యం పొందింది. (పరాగ్వే జాతీయదినం).
- 1835: ఛార్లెస్ డార్విన్ ఉత్తర చిలీ దేశంలోని, కొక్వింబొ అనే చోటుకి చేరాడు.
- 1842: 'లండన్ ఇల్లస్ట్రేటెడ్ న్యూస్' మొదటి సంచిక విడుదలయ్యింది.
- 1845: 'ఉట్రెచ్ట్-అర్నెం' రైల్వే ప్ర్రారంభమయ్యింది.
- 1853: 'గెయిల్ బోర్డెన్' తను కనిపెట్టిన 'కండెన్స్‌డ్ మిల్క్' చేసే పధ్ధతిని పేటెంట్ గా పొందాడు.
- 1862: స్విట్జర్లాండ్కి చెందిన 'అడాల్ఫ్ నికోలె' 'క్రోనొగ్రాఫ్' ని పేటెంట్ గా పొందాడు.
- 1878: వేసెలిన్ని మొదటిసారిగా అమ్మిన రోజు (పెట్రోలియం జెల్లీకి 'వేసెలిన్', రెజిస్టర్డ్ ట్రేడ్‌మార్క్).
- 1896: అమెరికాలో, 'మే' నెలలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన రోజు (-10º ఫారిన్‌హీట్ - క్లైమాక్స్ సి.ఒ).
- 1900: రెండవ ఒలింపిక్ క్రీడలు ఫ్రాన్సు రాజధాని పారిస్లో ప్రారంభమయ్యాయి.
- 1904: మూడవ ఒలింపిక్ క్రీడలు అమెరికా లోని 'సెయింట్ లూయిస్' నగరంలో జరిగింది. (అమెరికా లో, ఇవే మొదటి ఒలింపిక్ క్రీడలు
- 1908: ప్రయాణీకులతో మొదటి విమానం ఎగిరిన రోజు
- 1910: కెనడా వెండితో తయారుచేసిన 'డాలర్ నాణెము' లను అధికారికంగా విడుదల చేసింది.
- 1921: ఫ్లోరెన్స్ అల్లెన్, మొదటి మహిళా న్యాయమూర్తి, ఒక మనిషికి మరణ శిక్ష విధించింది (అమెరికా).
- 1935: లాస్ ఏంజెల్స్ నగరంలో 'గ్రిఫిత్ నక్షత్రశాల (ప్లానెటోరియం]' ను ప్రారంబించారు. (ఇది అమెరికాలో మూడవద్).
- 1940: నెదర్లాండ్స్ లోని రోటర్‌డాం నగరం మీద నాజీలు బాంబులు వేయగా 600 నుంచి 900 మంది ప్రజలు మరణించారు. నెదర్లాండ్స్ జర్మనీకి లొంగి పోయింది.
- 1948: ప్రత్యేక దేశంగా ఇజ్రాయెల్ ఏర్పడింది. 'డేవిడ్ బెన్ గురియన్' ప్రధానమంత్రి.
- 1948: ఇజ్రాయెల్ రేడియో స్టేషను 'కోల్ ఇజ్రాయెల్' మొదటిసారిగా తన ప్రసారాలను మొదలుపెట్టింది.
- 1948: ఇజ్రాయెల్ దేశాన్ని, అమెరికా గుర్తించింది.
- 1948: అమెరికా, అణుబాంబును 'ఎన్వెటక్' అనే చోట, వాతావరణంలో పేల్చి పరీక్షించింది.
- 1955: అమెరికా అణుబాంబును పసిఫిక్ మహా సముద్రంలో పేల్చి పరీక్షించింది.
- 1955: కమ్యూనిష్టు దేశాల మధ్య వార్సా ఒప్పందం కుదిరింది. (కమ్యూనిష్టు దేశాలంటే - సోవియాట్ యూనియన్, అల్బేనియా, బల్గేరియా, చెకొస్లొవాకియా, తూర్పు జర్మనీ, హంగరీ, పోలాండ్, రుమేనియాలు)
- 1960: మనుషులు లేని రోదసీ నౌకను రష్యా దేశం (పాత యునైటెడ్ సోవియట్ సోషలిస్టు రష్యా) రోదసీ లోకి పంపింది.
- 1962 అమెరికా అణుబాంబును క్రిస్ట్‌మస్ దీవులలోని, వాతావరణంలో పేల్చి, పరీక్షించింది.
- 1965: ఛైనా తన రెండవ అణుబాంబును పేల్చి పరీక్షించింది.
- 1965: అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
- 1968: చెకొస్లావేకియా ప్రభుత్వం, 'అలెగ్జాండర్ డుబ్‌సెక్' నాయకత్వంలో, సరళీ కరణ సంస్కరణలు మొదలు పెట్టింది.
- 1968 : 60వ దశకములో చైనా, పాకిస్తాన్ లతో యుద్ధాల తర్వాత సైనికులేకాక సామాన్య పౌరులు కూడా సుశిక్షితులై అప్రమత్తంగా ఉండటం అవసరమని గ్రహించి, భారత ప్రభుత్వం పౌర రక్షణ సంస్థను చట్టబద్ధం చేసింది.
- 1969: 'గర్భస్రావం', 'గర్భనిరోధం' కెనడా దేశంలో చట్టబద్ధమయ్యాయి.
- 1973: లండన్లో బంగారం ఔన్సు ధర 102.50 అమెరికన్ డాలర్లకు పెరిగి, రికార్డు స్థాపించింది.
- 1973: మొదటి రోదసీ కేంద్రం, స్కైలాబ్ను రోదసీలోకి ప్రయోగించారు.
- 1973: అమెరికా సుప్రీం కోర్టు అమెరికా సైన్యంలోని మహిళ లకు సమాన హక్కులు కల్పించింది.
- 1975: అమెరికా అణుబాంబును నెవడా పరీక్షా కేంద్రంలో పేల్చి, పరీక్షించింది.
- 1981: 'నాసా' రోదసీ నౌక 'ఎస్-192' ని రోదసీ లోకి ప్రయోగించింది.
- 1982: 'గినియా' దేశం తన రాజ్యాంగాన్ని అమలు చేసింది.
- 1986: నాజీ ల పాలనలో క్షణక్షణం అనుభవించిన, భయంకరమైన, బాధాకరమైన రోజులను 'అన్నే ఫ్రాంక్' అనేబాలిక రాసిన దినచర్య పుస్తకం'అన్నే ఫ్రాంక్ డైరీ' ని 'ఇన్‌స్టిట్యూట్ ఫర్ వార్ డాక్యుమెంట్స్' పూర్తిగా ప్రచురించింది.
- 1989: ఛైనా లోని 'తియాన్మెన్ స్వేర్' లో 'ప్రజాస్వామ్యహక్కుల' కోసం ప్రదర్శన జరిగింది.
- 1990: 'డౌ జోన్స్' 2821.53 స్థాయిని తాకి, రికార్డ్ ను నెలకొల్పింది.
- 1995: 14వ దలైలామా 6 సంవత్సరాల 'గెధున్ చోక్యి నీమా' (జననం :1989 ఏప్రిల్ 25) ను 'పంచన్‌లామా' 11వ అవతారంగా ప్రకటించాడు.
- 2004: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.యస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాడు.
- 2012: డాలరుతో రూపాయి మారకం విలువ అతి తక్కువగా రూ 53.96 కి పడిపోయింది. 2012 మే 18 నాడు, రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 54.91 స్థాయికి పడిపోయింది. రూపాయి – డాలరు మారకం విలువ చరిత్రలో, ఇది, అత్యంత తక్కువ స్థాయి.
జననాలు
మార్చు- 1900: హాలహర్వి సీతారామరెడ్డి, రాయలసీమకు చెందిన రాజకీయనాయకుడు, స్వాతంత్ర్యసమరయోధుడు
- 1926 : నూతి విశ్వామిత్ర, నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు .
- 1946: అప్పాసాహెబ్ ధర్మాధికారి, మహారాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
- 1987: మధురిమ, తెలుగు, మలయాళ, హిందీ చిత్రాల నటి
మరణాలు
మార్చు- 1574: గురు అమర్ దాస్ సిక్కుల మూడవ గురువు (జ. 1479).
- 1956: చందాల కేశవదాసు, గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు,, నాటకకర్త. (జ.1876)
- 1991: జియాంగ్ క్వింగ్, చైనా నాయకుడు మావొ సే తుంగ్ భార్య ఆత్మహత్య చేసుకుంది.
- 1998: పాటగాడు (గాయకుడు), నటుడు ఫ్రాంక్ సినట్రా 82వ ఏట మరణించాడు (జ. 1915)
- 2022: ఆండ్రూ సైమండ్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. (జ.1975)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- -
బయటి లింకులు
మార్చు- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 14[permanent dead link]
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
మే 13 - మే 15 - ఏప్రిల్ 14 - జూన్ 14 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |