వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2008

2008 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

1వ వారం
తెలుగు ఫాంటుల నమూనాలు

'ఖతి' అనే పదం ఉన్నా గాని, 'ఫాంటు' అనే ఆంగ్ల పదాన్నే తెలుగు అక్షరాల రూప కల్పనను వర్ణించడానికి సాధారణంగా వాడుతున్నారు. అన్ని భాషలలాగానే తెలుగు భాషలో కూడా అనేక ఫాంటులు వెలువడుతున్నాయి. వీటి పేర్లు 'పోతన', 'వేమన', 'గౌతమి', 'శ్రీ', 'సూరి' - ఇలా ఉంటున్నాయి. ముఖ్యంగా యూనికోడ్‌కు అనుగుణంగా ఇటీవల ఫాంటుల అభివృద్ధి జరుగుతుండడం వలన కంప్యూటరులో తెలుగు భాష వినియోగం మరింత సులభతరం అవుతున్నది.

ఫోటో సౌజన్యం: వీవెన్
2వ వారం
ఉండవల్లిలోని గుహాలయం

గుంటూరు జిల్లా, తాడేపల్లి మండలానికి చెందిన ఉండవల్లిలోని ఈ గుహాలయం ఒక పర్వత సముదాయం అంచున ఉంది. పర్వత ముందు భాగమునుండి లోపలికి తొలచుకుంటూ వెళ్ళడం చేసారు. ఇది నాలుగు అంతస్తులుగా నిర్మించబడింది. మద్యలో స్థంబాలు వాటిపై చెక్కిన అందమైన లతలు, గుహాంతర్భాగాలలో గోడలపై చెక్కిన దేవతా ప్రతిమలు మెదలైన వాటితో విశాలంగా ఉంటుంది. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి. అనంత పద్మనాభ స్వామి, నరసింహ స్వామి ఇక్కడ కొలువైన దేవుళ్ళు.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
3వ వారం
సైకిల్‌కు గాలి కొట్టే పంపు

సైకిల్ పంపు అనే సాధనాన్ని సైకిల్‌చక్రాల ట్యూబులలో గాలి నింపడానికి ఉపయోగిస్తారు. కవాటాలు (వాల్వులు) ద్వారా పని చేసే ఈ ఉపకరణం జీవితంలో ఎంతో ఉపయోగకరమైన వస్తువులలో ఒకటి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
4వ వారం
తిరుమలలోని శిలాతోరణం

తిరుమల కొండలలో సహజంగా ఏర్పడిన శిలాతోరణాన్ని ఈ బొమ్మలో చూడవచ్చును. లక్షల సంవత్సరాల క్రిందనుండి రాతి భాగాలు కొంత ఒరవడికి గురై తొలుచుకుపోగా ఈ శిలాతోరణం రూపుదిద్దుకుంది.

ఫోటో సౌజన్యం: చావా కిరణ్
5వ వారం
కోణార్క ఆలయంలో రధ చక్రం

కోణార్క్‌లోని సూర్య దేవాలయం శిల్ప కళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం రధాకారము కలిగి ఉంటుంది. రధానికి పన్నెండు చక్రాలు, సంవత్సరానికి పన్నెండు మాసాలు, పన్నెండు రాసులు వీటి అనుగుణంగా సూర్యగమనం ఒక్కొక్క చక్రంలో ద్యోతకమౌతుంతుంది.

ఫోటో సౌజన్యం: Sarvagnya
6వ వారం
దేవాలయ దర్శనంలో ఆచారాలు

హిందూ మతం ఆచారాలలో దేవాలయ దర్శనం ఒక ముఖ్యమైన అంశం. ఆలయానికి వెళ్ళేవారు పాటించే కొన్ని ముఖ్యమైన ఆచార క్రమాలు ఈ బొమ్మలో చిత్రీకరింపబడినవి. నమస్కారం చేయడం, స్నానం, కొబ్బరికాయలు కొట్టడం, మ్రొక్కుకోవడం, యాచకులకు దానం చేయడం, పూజాది కార్యక్రమాలు వంటి వివిధ ఆచారాలు గమనించవచ్చును.

ఫోటో సౌజన్యం: హిమాలయన్ అకాడమీ
7వ వారం
జిల్లాల సమాచారం ఉన్న ఆంధ్ర ప్రదేశ్ పటము

1956లో ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడినప్పుడు కేవలం 20జిల్లాలు ఉన్నాయి. ఆ తరువాత ప్రకాశం, రంగారెడ్డి మరియు విజయనగరం జిల్లాల ఏర్పాటుతో మొత్తం 23 జిల్లాలు అయ్యాయి.

ఫోటో సౌజన్యం: మాకినేని ప్రదీపు
8వ వారం
దుకాణాల్లో అమ్మే తెలుగు పత్రికలు

దుకాణాల్లో అమ్మే తెలుగు పత్రికలు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
9వ వారం
గుటుపల్లిలోని పురాతన బౌద్ధస్తూపాలు

పశ్చిమగోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలో గుంటుపల్లి వద్ద కొండపైని బౌద్ధ స్తూపాలు. క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్యకాలానికి చెందిన ఈ స్తూపాలు బౌద్ధమతం ఆరంభకాలం నుండి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో వర్ధిల్లిందని చెప్పే అనేక చిహ్నాలలో ఒకటి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
10వ వారం
గుటుపల్లిలోని పురాతన బౌద్ధస్తూపాలు

పశ్చిమగోదావరి జిల్లా, కామవరపుకోట మండలంలో గుంటుపల్లి వద్ద కొండపైని బౌద్ధ స్తూపాలు. క్రీ.పూ.200 నుండి క్రీ.శ.300 మధ్యకాలానికి చెందిన ఈ స్తూపాలు బౌద్ధమతం ఆరంభకాలం నుండి ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో వర్ధిల్లిందని చెప్పే అనేక చిహ్నాలలో ఒకటి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
11వ వారం
భారతీయ చీర కట్టు

ఆధునిక వస్త్ర విధానాలు ఎన్ని వచ్చినా ఇప్పటికీ చీర భారతీయ వనితల దుస్తులలో ప్రధానమైన పాత్ర వహిస్తున్నది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్ స్వంత చిత్రం
12వ వారం
యళ్ళాయపాలెంలో బజారు

యల్లాయపాళెం, నెల్లూరు జిల్లా, కొడవలూరు మండలానికి చెందిన గ్రామము.
ఆ వూరిలోని బజారు ఈ బొమ్మలో చూపబడింది.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)

ఫోటో సౌజన్యం: జితేష్ కుమార్ డేగా
13వ వారం
మహానంది దేవాలయం

మహానంది, కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము.
ఇక్కడి స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి.
ఈ ఆలయం 7వ శతాబ్ధి నాటిది.

ఫోటో సౌజన్యం: వంగా వేణుగోపాల రెడ్డి
14వ వారం
మెక్ కామెట్ తోక చుక్క

తోకచుక్కలు ఆకాశంలోని చిన్నచిన్న విచిత్రాలు.
ఇప్పటికి ఇంచుమించు 600 తోకచుక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వీటిలో 513 చాలా దీర్ఘకాలికమైనవి.

ఫోటో సౌజన్యం: ఆంగ్ల వికీ వాడుకరి Fir0002
15వ వారం
సునామీ

2004 లో సంభవించిన సునామి ఉత్పాతం అపారమైన జన, ధన నష్టాన్ని కలిగించింది. ఈ చిత్రం థాయిలాండ్‌లో తీయబడింది.

ఫోటో సౌజన్యం: డేవిడ్ రైడెవిక్ (David Rydevik)
16వ వారం
సినీ నటుడు చిరంజీవి

చిరంజీవి గా ప్రసిద్ధి చెందిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తెలుగు సినిమా రంగంలో ఒక ప్రముఖ కధానాయకుడు. అంచెలంచెలుగా ఎదిగి మెగాస్టార్గా ఆంధ్ర ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.

ఫోటో సౌజన్యం: బుసాని పృథ్వీరాజ్ వర్మ
17వ వారం
నిండు చందమామ (భూమి నుండి)

నిండు చందమామ - బెల్జియం నుండి తీసిన ఛాయాచిత్రం. చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం.

ఫోటో సౌజన్యం: లూక్ వయాటర్
18వ వారం
కాలబిలం (సిమ్యులేటెడ్) చిత్రం

కాలబిలాలు - లేదా "బ్లాక్ హోల్స్" లేదా "కృష్ణ బిలాలు" విశ్వంలో అత్యధిక ద్రవ్యరాశి మరియు గురుత్వ బలం కలిగిన స్థానాలు. సూర్యునికి పది రెట్లు ద్రవ్యరాశి కలిగిన ఒక కాలబిలం "సిమ్యులేటెడ్" చిత్రం [1]

ఫోటో సౌజన్యం: యూటె క్రావుస్
19వ వారం
పిల్లలమర్రి ఎఱకేశ్వరాలయం

చరిత్రాత్మకమైన గ్రామం పిల్లలమర్రి లోని ఎఱకేశ్వరాలయం. ఇంకా ఈ వూరిలో నామేశ్వర, త్రికూటేశ్వర ఆలయాలున్నాయి.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)

ఫోటో సౌజన్యం: చావా కిరణ్
20వ వారం
పాలపుంత అంతర్భాగంలో ఉన్న లక్షలాది నక్షత్రాలు. నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌నుండి తీసిన ఇన్‌ఫ్రారెడ్ చిత్రం.

పాలపుంత అంతర్భాగంలో ఉన్న లక్షలాది నక్షత్రాలు. నాసా వారి స్పిట్జర్ స్పేస్ టెలిస్కోప్‌నుండి తీసిన ఇన్‌ఫ్రారెడ్ చిత్రం. [2]

ఫోటో సౌజన్యం: NASA/JPL-Caltech/S. Stolovy (SSC/Caltech)
21వ వారం
మహబూబ్‌నగర్ బస్‌స్టేషన్‌లోని దృశ్యం.

మహబూబ్ నగర్ బస్‌స్టేషన్‌లోని దృశ్యం.
(ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని గురించీ ఒకో వ్యాసాన్ని, కొన్ని బొమ్మలను తెలుగు వికీలో కూర్చే ప్రయత్నం జరుగుతున్నది. దయచేసి సహకరించండి.)

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
22వ వారం
నీలి రంగు ఆకాశంలో మబ్బులు

ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం. భూమి ఉపరితలంపై ఉండే మేఘాలు, నీటియావిరితో కూడిన వాయు ఆవరణాలపై పడిన సూర్యకాంతి పరావర్తనం చెందడం వలన ఆకాశం మనకు నీలిరంగులో కనబడుతుంది.

ఫోటో సౌజన్యం: Omniii
23వ వారం
హైదరాబాదు ఎక్సిబిషన్‌లో

హైదరాబాదు ఎగ్జిబిషన్‌లో రైలు ప్రయాణంతో వినోదం.

ఫోటో సౌజన్యం: చంద్రకాంత్
24వ వారం
వరంగల్ వేయి స్తంభాల గుడి

వరంగల్‌లో వేయి స్తంభాల గుడి 11 వ శతాబ్దంలో కాకతీయులచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి నాటి కళా వైభవానికి మచ్చుతునకగా నిలచింది.

ఫోటో సౌజన్యం: దేవదాస్ కృష్ణన్, పూర్ణిమ
25వ వారం
మెరుపు

మెరుపు అనేది వాతావరణంలో విద్యుత్తు ప్రసారం వల్ల జరిగే ప్రక్రియ.

ఫోటో సౌజన్యం: Fir0002
26వ వారం
జటప్రోలు సంస్థానము‌నకు చెందిన రధం.

జటప్రోలు సంస్థానము‌నకు చెందిన రధం. జటప్రోలు సంస్థానము ఒక చారిత్రక సంస్థానము. పిల్లలమర్రి బేతల రెడ్డి / నాయుడు జటప్రోలు సంస్థానము యొక్క స్థాపకుడు.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
27వ వారం
సంపూర్ణ చంద్ర గ్రహణం.

ఆగస్టు 28, 2007న
స్విఫ్ట్‌క్రీక్, విక్టోరియా (ఆస్ట్రేలియా) నుండి కనుపించిన
సంపూర్ణ చంద్ర గ్రహణం ఛాయాచిత్రం.

ఫోటో సౌజన్యం: పీటర్, ఆస్ట్రేలియా[3]
28వ వారం
పిల్లలమర్రిలో కాకతీయుల శాసనం.

నల్గొండ జిల్లా, సూర్యాపేట మండలం
పిల్లలమర్రి గ్రామంలో కాకతీయుల నాటి శాసనం.
ఇది తెలుగు, కన్నడ భాషలలో ఉన్నది.

ఫోటో సౌజన్యం: చావాకిరణ్
29వ వారం
తడికలపూడిలో గ్రామదేవత గుడి

పశ్చిమ గోదావరి జిల్లా, తడికలపూడి గ్రామంలో గ్రామదేవత గుడి. గుమ్మంపై "ఆంకాలమ్మ, గంగానమ్మ 101 దేవతలు ఉండు ఆలయం" అని వ్రాసి ఉన్నది

ఫోటో సౌజన్యం: కాసుబాబు
30వ వారం
వాలి వధ

రామాయణం కిష్కింధ కాండలోని కధా దృశ్యం. - రాముని శరాఘాతుడై మరణిస్తున్న వాలి రామునితో భాషించుట - 1595 మొఘల్ కాలం నాటి చిత్రం (LACMA [4] సేకరణ)

ఫోటో సౌజన్యం: Redtigerxyz
31వ వారం
మేడారం సమ్మక్క సారక్క జాతర

వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలం
మేడారంలో జరిగే
సమ్మక్క సారక్క జాతరలోని ఒక దృశ్యం.

ఫోటో సౌజన్యం: డా.శేషగిరిరావు
32వ వారం
33వ వారం
కేదారనాధ్ క్షేత్రంలో బుట్టలలో యాత్రికులను తీసికొని వెళ్ళడం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాథ్ ఒక పుణ్యక్షేత్రం.
ఈ ఆలయానికి వెళ్లే కష్టతరమైన మార్గంలో
యాత్రికులను బుట్టలలో మోసుకెళతారు.

ఫోటో సౌజన్యం: సుజాత
34వ వారం
పోడూరు గ్రామంలో కాలువ, పొలాలు

పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు గ్రామంలో కాలువలు, పొలాలు.
పల్లె అందాలు, ప్రకృతి రమణీయత కారణంగా పోడూరులో
పలు తెలుగు సినిమా షూటింగులు జరిగాయి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
35వ వారం
రాజోలి కోట ముఖద్వారం

మహబూబ్ నగర్ జిల్లా, వడ్డేపల్లి మండలానికి చెందిన గ్రామము అయిన రాజోలిలోని పాతకాలపు కోట ముఖద్వారం. ఈ గ్రామం తుంగభద్ర నది పైని సుంకేశుల డ్యాం ప్రక్కనే ఉంది

ఫోటో సౌజన్యం: సి.చంద్రకాంతరావు
36వ వారం
శాయపురం విద్యార్ధులు

శాయపురం, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి పాఠశాలలో విద్యాబోధనకు రేడియో వసతి ఉంది. విద్యార్ధులు రేడియోలో పాఠాలు వినడం చిత్రంలో చూడవచ్చును.

ఫోటో సౌజన్యం: కప్పగంతు శివరామప్రసాదు
37వ వారం
కొందరు తెలుగు సినిమా వ్యక్తులు

తెలుగు సినిమాకు చెందిన కొందరు వ్యక్తులు. హరిప్రసాద్ (నటుడు, నిర్మాత), ఎం.వి.రఘు (ఛాయాగ్రాహకుడు), చిరంజీవి (నటుడు, రాజకీయ నాయకుడు), సుధాకర్ (హాస్య నటుడు)

ఫోటో సౌజన్యం: బొజ్జా వాసు
38వ వారం
కొలనుపాకలోని జైన మందిరం.

కొలనుపాక , నల్గొండ జిల్లా, ఆలేరు మండలానికి చెందిన చరిత్రాత్మకమైన గ్రామము. కొద్దికాలం క్రితమే ఒక జైన శ్వేతాంబరాలయం పునరుద్ధరించబడింది. నలుపు రంగులో శ్రేష్టమైన రత్నంతో నిర్మించబడిన మాణిక్య దేవ ఋషభ దేవ విగ్రహము, ఫిరోజా రాతితో నిర్మించబడిన భగవాన్ మహావీర్ విగ్రహము ఇక్కడ ప్రత్యేకమైనవి.

ఫోటో సౌజన్యం: దేవదాస్ కృష్ణన్
39వ వారం
రామలక్ష్మణులను సేవించే శబరి.

తూర్పు యడవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి సీతారామచంద్రస్వామి ఆలయం ఆవరణలో శబరిచే సేవలందుకొంటున్న రామలక్ష్మణుల నిలువెత్తు విగ్రహాలున్నాయి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
40వ వారం
లేపాక్షి బసవన్న.

లేపాక్షి, అనంతపురం జిల్లాకు చెందిన ఒక చారిత్రక పట్టణము. పట్టణ ప్రవేశంలో ఉన్న ఒక తోటలో ఉన్న అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహం ఠీవిగా కూర్చున్న భంగిమలో ఉంటుంది. నంది విగ్రహం పరిమాణాన్ని, శిల్పకళానైపుణ్యాన్ని ఈ చిత్రంలో గమనించవచ్చును.

ఫోటో సౌజన్యం: దీపశిఖ
41వ వారం
కవిటం గ్రామం.

కవిటం, పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరు మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామంలో ఆలయం, వెనుక కళ్యాణ మంటపం ఈ చిత్రంలో కనుపిస్తున్నాయి.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
42వ వారం
మేడారం జాతర.

సమ్మక్క సారక్క జాతర అనేది వరంగల్ జిల్లా, తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఈ జాతరకు పెద్దయెత్తున జనం వస్తారు.

ఫోటో సౌజన్యం: డా.శేషగిరి రావు
43వ వారం
శ్రీశైలం పాతాళ గంగం

శ్రీశైలం ప్రక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది. చాలా మెట్లు దిగి కృష్ణానదిలో స్నానం చెయ్యాలి. ఈ కృష్ణానదినే ఇక్కడ పాతాళగంగ అని వ్యవహరిస్తారు. పాతాళ గంగ వద్ద బండలపై నాచు నిలచి సూర్య కిరణాల వెలుగు వలన పచ్చగా కానవస్తుంది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
44వ వారం
హైదరాబాదు బస్ స్టేషన్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వారి హైదరాబాదు బస్ స్టేషన్ ఆసియాలో అతిపెద్ద బస్‌స్టేషనులలో ఒకటి . దీనికి ఇమ్ల్లిబన్ అనే పేరు కూడా ఉంది. అసలు పేరు ఎం.జి.బి.యస్.

ఫోటో సౌజన్యం: చంద్రకాంతరావు
45వ వారం
అభిమాన సంఘాల పోస్టర్

పశ్చిమ గోదావరి జిల్లా, జీలకర్రగూడెంలో యమదొంగ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల పోస్టర్. అభిమాన సంఘాల పోస్టరులు ఆంధ్రప్రదేశ్ లో సాధారణం అయ్యాయి.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
46వ వారం
పావగఢ్ కోట

గుజరాత్‌లో పంచ్‌మహల్ జిల్లాలో హలోల్ వద్ద ఉన్న చంపానేర్-పావగఢ్ ప్రాంతంలో ఎన్నో పురాతనమైన కోటలు, రాజప్రసాదాలు, మతపరమైన కట్టడాలు ఉన్నాయి. ఈ ప్రాంతం క్రీ.శ.16వ శతాబ్దంలో గుజరాత్‌కు రాజధానిగా ఉండేది.

ఫోటో సౌజన్యం: చంద్రకాంత్
47వ వారం
తణుకులో నన్నయ విగ్రహం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో ఆదికవి నన్నయ విగ్రహం. గోస్తని నది తీరాన ఈ ప్రాంతంలోనే మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ యజ్ఞం చేసినట్టుగా చారిత్రక ప్రశస్తి ఉంది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్.బి.కె.
48వ వారం

[[బొమ్మ:|250px|center|alt=అడోబీ ఫొటోషాపు ఉపకరణాలు]] అడోబీ ఫోటోషాప్, ఛాయా చిత్రాలను మార్పులు-చేర్పులు చేసుకోవడానికి వీలుకల్పించే ఒక రాస్టేర్ గ్రాఫిక్స్ ఎడిటింగ్ సాఫ్టువేరు. తెలుగులోకి మార్చిన ఈ ఫోటోషాప్ పరికరాల పెట్టె ద్వారా ఆ సాఫ్ట్‌వేర్‌ను వాడుకునే విధానం తెలుసుకోవచ్చును.

ఫోటో సౌజన్యం: బొజ్జా వాసు
49వ వారం
ముదిగొండ కాల్పులలో మృతులు

ముదిగొండ, ఖమ్మం జిల్లాలో ఒక గ్రామము. ఇళ్ళ స్థలాల కోసం వామపక్షాల ఉద్యమం సమయంలో 2007 జూలై 28న పోలీసు కాల్పులలో ఏడుగురు మరణించారు. వారి స్మృతి సూచకంగా జనవరి 2008లో ప్రగతి నగర్, హైదరాబాదులో సి.పి.ఐ-ఎమ్. రాష్ట్ర మహాసభలలో ఉంచిన పోస్టర్ ఇది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు
50వ వారం
అతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి మందిరం

అంతర్వేది, తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలానికి చెందిన గ్రామము. ఇక్కడి దీవి పై ప్రసిద్ది చెందిన లక్ష్మీనరసింహస్వామివారి పురాతన దేవాలయం ఉంది.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
51వ వారం
ఆలమూరులో వేపచెట్టు

ఆలమూరు, పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమంట్ర మండలానికి చెందిన గ్రామము. ఆలమూరు-మార్టేరు రహదారిలో ఒక చెట్టుపై ఒక భాగము కలువ మాదిరిగా విస్తరించబడి ఉన్నది. ఇది ఊరిలో ఒక ఆకర్షణ.

ఫోటో సౌజన్యం: విశ్వనాధ్
52వ వారం
చందవరం బౌద్ధచైత్యం శిల్పం

చందవరం, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలానికి చెందిన గ్రామము. అనేక ఆంధ్ర ప్రదేశ్ బౌద్ధ క్షేత్రాలలో ఇది ఒకటి. చైత్యారామం ప్రాకారంపైనిచైత్యం నమూనా శిల్పంలో నాగారాధన చూడవచ్చును. ఈ శిల్పం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మ్యూజియంలో ఉంది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు