వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 2014 జూన్‌ 2 న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విభజించిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో కొనసాగుతుంది.విభజన తరువాత మొదటిసారిగా 13 జిల్లాలతో కొనసాగుచున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2022 ఏప్రిల్ 4 నుండి 26 జిల్లాలతో పరిపాలనసాగిస్తుంది.ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, సెక్షన్ 3(5) ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ -2022 లో ప్రధానంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అదనంగా కొత్త జిల్లాలు ఏర్పాటైనవి. అయితే అరకు లోక్‌సభ నియోజకవర్గం విస్తృత భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకుని రెండు జిల్లాలుగా ఏర్పడినవి.2022 ఏప్రిల్ 4 నాటినుండి కొత్త జిల్లాల ప్రారంభానికి గెజిట్ విడుదలైంది.ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ పేజీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా దాని ప్రకారం అనుగుణంగా ఏఏ వ్యాసాలు, మూసలు, ఇంకా ఏఏ వర్గాలలోని వ్యాసాలు తాజాగా సవరించాల్సింది గుర్తించి, వాటిలో ఏమేమిసవరణలు ఎలా చేయాలి? అనే దానికి రూపొందించటమైంది.వీటిలో వాటిని పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో వివరించగలరు.సాధ్యమైనంతవరకు జిల్లాల పునర్వ్యవస్థీకరణలో పనిచేయువారు ఈ ప్రాజెక్టుపేజీ ప్రకారం సవరణలు, అభివృద్ధి చేయగలరు.

చేయవలసిన సవరణలు

పాత జిల్లా పేజీలు సవరణ

మార్చు

ఐటం 1: పాత జిల్లాల పేజీల సవరణలలో ముఖ్యంగా "జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి" అనే కోణంలో సవరిస్తేనే జిల్లా గత చరిత్ర తెలిసేది.అలా కాకుండా పునర్వ్యవస్థీకరణ తరువాత స్థితి రాస్తే పునర్వ్యవస్థీకరణ ముందు సమాచారం మరుగున పడింది.దానిని తిరిగి తెలుసుకొనుట చాలాకష్టం.కాస్త శ్రమపడ్డా ఇది అవసరం.ఇదే పద్దతిని శ్రీ కాకుళం జిల్లా పేజీలో పాటించాను.ఆ విభాగాలు ఈ దిగువ వివరించాను.ఇదే పద్దతిని మిగిలిన 12 జిల్లాలలో సవరణలు చేయాలి.ఆ విభాగాలు ఒకసారి పరిశీలించండి.

జిల్లాల పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత జిల్లా స్థితి

  • 5.1 పాలనా విభాగాలు
  • 5.1.1 జిల్లా కీలక అధికారులు
  • 5.1.2 రెవెన్యూ డివిజన్లు
  • 5.1.3 మండలాలు
  • 5.1.4 శ్రీకాకుళం జిల్లా లోని మండలాలు
  • 5.1.5 పార్వతీపురం మన్యం జిల్లాలో చేరిన మండలాలు
  • 5.1.6 విజయనగరం జిల్లాలో చేరిన మండలాలు
  • 5.1.7 గ్రామాలు
  • 5.2 జిల్లాలో పట్టణ ప్రాంతాలు
  • 5.3 నియోజకవర్గాలు
  • 5.3.1 లోక్‌సభ నియోజకవర్గాలు
  • 5.3.2 శాసనసభ నియోజకవర్గాలు

ఐటం 2:పాత జిల్లాల పేజీలలో పరిశ్రమలు, విద్యాసంస్థలు పర్యాటక ప్రాంతాలు, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, జిల్లాలోని ప్రముఖులు ఇంకా ఉదహరించని కొన్ని పునర్వ్యవస్థీకరణ సందర్బంగా ఏర్పడిన వేరే కొత్త లేదా పాత జిల్లాకు చెందినవి ఉండటానికి అవకాశం ఉంది.ఇవి ఆ వ్యాసం పేజీ ఒకసారి పూర్తిగా చదివితేనే తెలుస్తుంది. ఒకసారి ఓపికతో చదివి సవరించాల్సి ఉంది.

కొత్త జిల్లా పేజీలు సృష్టింపు, అభివృద్ధి

మార్చు

కొత్త జిల్లా పేజీలు 13 సృష్టింపు, ప్రతి జిల్లా పేజీలో కొంత విషయసంగ్రహం చేర్చుట జరిగింది.బాపట్ల జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా పేజీలు ప్రాతిపదికగా తీసుకుని , మిగిలిన 11 జిల్లాల ఆ జిల్లాల నైసర్గిక స్వరూపం ప్రకారం సవరించే వారి ఆలోచనకు వచ్చే ఇతర విషయాలతో అభివృద్ధి చేయాలి.వాటితో పాటు జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు సంఖ్య, మండలాల సంఖ్య, వైశాల్యం, జనాభా, జిల్లా ప్రధాన కార్యాలయం వివరాలు, కొత్త జిల్లా పరిపాలన చేపట్టిన మొదటి ప్రధాన అధికారులు అనగా జిల్లా కలెక్టరు, జాయంటు కలెక్టరు, ఎస్.పి.వారితోపాటు ఇతర ముఖ్యమైన కీలక అధికారులు వివరాలు చేర్చాలి.కొత్త జిల్లా ఒకటి లేదా రెండు పాత జిల్లాల నుండి కొన్ని మండలాలు విడగాట్టుటద్వారా ఏర్పడినవి.ఆ మండలాలకు చెందిన పాత జిల్లా పేజీలోని విషయాలు ఈ కొత్తజిల్లాల పేజీలో చేర్చాలి. ఈ విభాగాల ప్రకారం సమాచారం ఉండేట్లు చూడాలి.

కొత్త జిల్లా స్థితి

  • చరిత్ర
  • భౌగోళిక స్వరూపం
  • పరిపాలనా విభాగాలు
    • జిల్లా లోని రెవెన్యూ డివిజన్లు
    • జిల్లా లోని మండలాలు
  • రాజకీయ విభాగాలు
    • శాసనసభ నియోజకవర్గాలు
    • లోక్‌సభ నియోజకవర్గాలు
  • జిల్లా మొదటి కీలక అధికారులు
  • జిల్లా లోని ప్రముఖ పట్టణాలు
  • వాతావరణం
  • మౌలిక వసతులు
    • రవాణా సౌకర్యాలు
    • విద్యా సౌకర్యాలు
    • వైద్య సౌకర్యాలు
  • వ్యవసాయం
  • పరిశ్రమలు
  • దర్శనీయ ప్రదేశాలు

కొత్త జిల్లా ప్రధాన కార్యాలయాల వ్యాసాల సవరణ

మార్చు
  • కొత్త జిల్లా ముఖ్య పట్టణ వ్యాసాల ప్రవేశికలో పాత జిల్లా స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.
  • ఇది పలానా జిల్లా ముఖ్యపట్టణం కూర్పు చేయాలి.
  • ఆ పట్టణం 2022 లో జిల్లాల పునర్వ్యస్థీకరణకు ముందు ఏ జిల్లాలో భాగంగా ఉండేది వివరం రాయాలి.
  • ఆ పట్టణం కొత్త జిల్లాలోని ఏరెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.
  • ఆ పట్టణ వ్యాసానికి ఉన్న ఇతర జిల్లాలకు చెందిన మూసలు ఉంటే తొలగించాలి.
  • ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి లేదా ఆ పట్టణం నుండి రాష్ట్ర రాజధాని ఎంత దూరంలో ఉండేది వివరాలు రాయాలి.
  • వర్గీకరణ పునర్వ్యస్థీకరణకు అనుగుణంగా ఉందా అనేది పరిశీలించి అవసరమైతే తగిన మార్పులు చేయాలి.

పాత జిల్లా ప్రధాన కార్యాలయాల వ్యాసాల సవరణ

మార్చు

పాత జిల్లా ముఖ్య పట్టణాల వ్యాసాలు పునర్వ్యస్థీకరణకు అనుగుణంగా పరిశీలించి తగిన సనరణలు చేయాలి.వర్గాలు సవరించాలి.

మండల వ్యాసాల సవరణ

మార్చు

కొత్త జిల్లా మండల వ్యాసాలలో ప్రవేశికలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.

గ్రామ వ్యాసాల సవరణ

మార్చు

కొత్త జిల్లా మండలాలలోని గ్రామ వ్యాసాల ప్రవేశికలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.

సమాచార పెట్టెలు సవరణ

మార్చు
  • జిల్లా ముఖ్య పట్టణాల వ్యాసాల సమాచారపెట్టెలలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.వర్గాలు సవరించాలి.
  • కొత్త జిల్లాల లోని మండలాల సమాచారపెట్టెలలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.
  • కొత్త జిల్లా మండలాల లోని గ్రామ వ్యాసాల సమాచారపెట్టెలలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.

జిల్లా లోని మండలాల మూసలు సవరణ

మార్చు

పునర్వ్యస్థీకరణకు అనుగుణంగా 13 పాత జిల్లాలకు జిల్లాలోని మండలాల మూసలు సవరించబడ్డాయి.అలాగే 13 కొత్త జిల్లాలకు జిల్లాలోని మండలాలు మూసలు పునర్వ్యస్థీకరణకు అనుగుణంగా సృష్టించబడినవి.వీటిని కొన్ని మండలాలుకు మానవీయంగా కూర్పు చేయబడగా, వీటిని బాటు ద్వారా అర్జునరావుగారు కూర్పు చేస్తామన్నారు, కావున దీనిని గురించి ఆలోచించాల్సిన పనిలేదు.

పాత జిల్లా పేరుతో క్వాలిఫై చేసిన కొత్త జిల్లాలోని మండల వ్యాసాల సవరణ

మార్చు
  • ఒకే శీర్షిక కలిగిన కొన్ని మండల వ్యాసాలు వాటిని జిల్లా పేరుతో క్వాలిఫై చేసిఉండవచ్చు. అటువంటి వాటిని కొత్త జిల్లా పేరుతో క్వాలిఫై చేయుచూ తరలించి, దానికి లింకున్న అన్ని పేజీలు పరిశీలించి సరియైన లింకు కలపాలి.
  • కొత్త జిల్లాలోని మండలాల వికీడేటా పేజీలో వివరణలో పాత జిల్లాపేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.

రెవెన్యూ డివిజన్లు సవరణ

మార్చు

కొత్త జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు ప్రవేశికలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.వర్గాలు సవరించాలి.

పురపాలక సంఘాలు సవరణ

మార్చు

కొత్త జిల్లాలోని పురపాలక సంఘాలు ప్రవేశికలో పాత జిల్లా పేరు స్థానంలో కొత్త జిల్లా పేరు చేర్చాలి.వర్గాలు సవరించాలి.

పునర్వ్యవస్థీకరణ ప్రభావం ఉన్న మరి కొన్ని పేజీలు, వర్గాలు

మార్చు

పై వాటిలో జిల్లా పేరు మారటానికి అవకాశం ఉంది, అలాగే వర్గాలు సవరించాల్సిన ఉంటుంది. అయితే వాటిలో పునర్వ్యవస్థీకరణ ముందు, తరువాత స్థితి అనే పద్ధతిలో సవరించాలి.

పునర్వ్యస్థీకరణలో ఏర్పడిన పాతజిల్లాలు

మార్చు
వ.సంఖ్య జిల్లా ప్రధాన

కార్యాలయం

మండలాలు

సంఖ్య ( 2022లో)

వైశాల్యం

(కి.మీ2)

జనాభా

(2011 ) లక్షలలో [1]

జనసాంద్రత

(/కి.మీ2)

పాత జిల్లా లోని రెవెన్యూ గ్రామాలు కొత్త జిల్లా లోని రెవెన్యూ గ్రామాలు రిమార్కులు
1 అనంతపురం అనంతపురం 31 10,205 22.411
2 చిత్తూరు చిత్తూరు 31 6,855 18.730
3 తూర్పు గోదావరి రాజమహేంద్రవరం 19 2,561 18.323
4 గుంటూరు గుంటూరు 18 2,443 20.91 727 [2]
5 వైఎస్ఆర్ కడప 36 11,228 20.607 983 [3]
6 కృష్ణా మచిలీపట్నం 25 3,775 17.35
7 కర్నూలు కర్నూలు 26 7,980 22.717
8 ప్రకాశం ఒంగోలు 38 14,322 22.88
9 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నెల్లూరు 38 10,441 24.697
10 శ్రీకాకుళం శ్రీకాకుళం 30 4,591 21.914 1865 [4]
11 విశాఖపట్నం విశాఖపట్నం 11 1,048 19.595
12 విజయనగరం విజయనగరం 27 4,122 19.308 1582 [5]
13 పశ్చిమ గోదావరి భీమవరం 19 2,178 17.80

పునర్వ్యస్థీకరణలో ఏర్పడిన కొత్త జిల్లాలు

మార్చు
వ.సంఖ్య జిల్లా ప్రధాన

కార్యాలయం

మండలాలు

సంఖ్య ( 2022 లో )

వైశాల్యం

(కి.మీ2)

జనాభా

(2011 ) లక్షలలో [1]

జనసాంద్రత

(/కి.మీ2)

కొత్త జిల్లా లోని రెవెన్యూ గ్రామాలు పాత జిల్లానుండి చేరిన మండలాలు రిమార్కులు
14 పార్వతీపురం మన్యం పార్వతీపురం 15 3,659 9.253
15 అల్లూరి సీతారామరాజు పాడేరు 22 12,251 9.54
16 అనకాపల్లి అనకాపల్లి 24 4,292 17.270
17 కోనసీమ అమలాపురం 22 2,083 17.191
18 ఏలూరు ఏలూరు 21 6,679 20.717
19 కాకినాడ కాకినాడ 27 3,019 20.923
20 ఎన్టీఆర్ విజయవాడ 20 3,316 22.19
21 బాపట్ల బాపట్ల 25 3,829 15.87
22 పల్నాడు నరసరావుపేట 28 7,298 20.42
23 నంద్యాల నంద్యాల 29 9,682 17.818
24 శ్రీ సత్యసాయి పుట్టపర్తి 32 8,925 18,400
25 అన్నమయ్య రాయచోటి 30 7,954 16973
26 తిరుపతి తిరుపతి 34 8,231 21.970

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Population of AP districts(2011)" (PDF). ap.gov.in. p. 14. Archived from the original (pdf) on 2013-05-16. Retrieved 25 May 2014.
  2. "Villages | Guntur District, Government of Andhra Pradesh | India". Retrieved 2022-04-14.
  3. "Revenue Villages | District YSR(Kadapa), Government of Andhra Pradesh | India". Retrieved 2022-04-14.
  4. "రెవెన్యూ గ్రామాలు | శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | భారతదేశం". Retrieved 2022-04-14.
  5. "మండలం లో గ్రామాలు | విజయనగరం జిల్లా | India". Retrieved 2022-04-15.