వీటూరి

(వీటూరి సూర్యనారాయణ మూర్తి నుండి దారిమార్పు చెందింది)

వీటూరి నాటకాల రచయిత. ఇతని పూర్తిపేరు వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి. "కల్పన" అనే నాటకము ద్వారా నాటక రంగానికి పరిచయమయ్యాడు.ఇంటి పేరుతో నాటక రచయితగా, పద్య రచయితగా ప్రసిద్ధుడు. తాత, తండ్రుల దగ్గర్నుంచి వారసత్వంగా పుచ్చుకున్న భాషా సాంగత్యంతో ఆయన ఛందస్సు, వ్యాకరణాన్ని అభ్యసించి, గ్రంథాలు చదివి, తానుగా పద్యాలు రాయడం ఆరంభించారు. తన పద్యాల్ని పత్రికలకు పంపడం, కవి సమ్మేళనాల్లో వినిపించడం చేసేవారు. పౌరాణికాలతో ఆగకుండా, సాంఘిక నాటకాలు కూడా రాశారు. తను రాసిన పురాణ నాటకాలకు తనే, హార్మోనీ వాయించేవారని అనేవారు. ఆయన వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు. పాఠశాలల్లో తెలుగు బోధించేవారు.

వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
దస్త్రం:Vituri Suryanarayana murty- cine song writer.jpeg
వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
జననంవీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తి
(1934-01-03)1934 జనవరి 3
India ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామం
మరణం1985, సెప్టెంబరు 21
మద్రాసు
ఇతర పేర్లువీటూరి
ప్రసిద్ధినాటకాల రచయిత, సినీగేయరచయిత

బాల్యం

మార్చు

ఇతడు 1934,జనవరి 3వ తేదీన జన్మించాడు. ఇతని జన్మస్థలం విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం, రెల్లివలస గ్రామం[1]. తన 12వ ఏట నుండే కవితలు రాయడం మొదలుపెట్టాడు వీటూరి. భీమిలిలో ఉపాధ్యాయశిక్షణ పూర్తిచేసి కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. స్వయంకృషితో తెలుగు భాషపై ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేవాడు. ఈ ఉత్సాహమే అతనిచేత నాటకాలు రాయించింది. పగ, కరుణాశ్రమం, కల్పన, ఆరాధన, చంద్రిక మొదలైన నాటకాలు రాశాడు వీటూరి. ఆయనే సొంతంగా నాటక సంస్థను స్థాపించి చాలా నాటకాలు వేశాడు. ఆ సమయంలోనే విజయనగరంలో జరిగిన సన్మానసభలో వీటూరిని ‘తరుణ కవి’ అని బిరుదునిచ్చి సత్కరించారు. వీటూరి పేరుతోనే కాకుండా జ్యోతిర్మయి, జ్యోతికుమార్ అనే మారుపేర్లతో ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ మొదలైన పత్రికల్లో కథలు రాశాడు.

సినీ రచయితగా

మార్చు

సినిమాలపై ఆసక్తి ఉండటంతో 1958లో మద్రాసు పయనమయ్యాడు వీటూరి. సదాశివబ్రహ్మం, పాలగుమ్మి పద్మరాజుగార్ల దగ్గర లవకుశ, ఇంటిగుట్టు, కృష్ణలీలలు, భక్తశబరి వంటి చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసి సినిమా స్క్రిప్టు, దానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాడు. ‘భక్తశబరి’లో కొన్ని పాటలు, పద్యాలు రాశాడు. హెచ్.ఎమ్. రెడ్డిగారితో పరిచయం కలగడంతో ‘గజదొంగ’ చిత్రానికి వీటూరి మాటలు రాశాడు.

వీటూరి ‘స్వర్ణగౌరి (1962)’ చిత్రానికి కథ, మాటలు, పాటలు రాశాడు. అలా ఆయనకు తొలిసారిగా పూర్తిస్థాయి అవకాశం వచ్చింది. తర్వాత వీటూరి రాసిన తొలి సాంఘిక చిత్రం ‘దేవత (1965)’. ఇందులో రాసిన పాటలు వీటూరికి మంచిపేరు తెచ్చాయి. నిర్మాత భావనారాయణ, జానపదబ్రహ్మ బి.విఠలాచార్యల ప్రోత్సాహంతో దాదాపు 42 చిత్రాలకు రచన చేశాడు. వందకు పైగా పాటలు రాశాడు.

వీటూరి ‘విజయలలిత పిక్చర్స్’ సంస్థను స్థాపించి ‘అదృష్టదేవత (1972)’ సినిమా నిర్మించాడు. వీటూరి రాసిన ‘భారతి’ కథను స్వీయ దర్శకత్వంలో ‘భారతి (1975)’ చిత్రంగా తెరకెక్కించాడు. దానికి మాటలు, పాటలు కూడా వీటూరివే. ‘శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న (1967)’ చిత్రంలోని వీటూరి పాటతోనే ఎస్.పి.బాలు గాయకునిగా సినిమారంగ ప్రవేశం చేశాడు. 1984లో మద్రాసులో కన్నుమూశాడు.

సినిమాలు

మార్చు

సినిమా పాటల జాబితా

మార్చు
క్రమసంఖ్య సినిమా పేరు పాట పల్లవి గాయకుడు సంగీత దర్శకుడు సినిమా విడుదలైన సంవత్సరం
1 శ్రీకృష్ణ లీలలు మురళీధరా కృష్ణయ్య నిన్నే నమ్ముకొంటినయ్యా కరుణించి రావదేల ఎస్. ఎల్. మర్చంటు
ఎం. ఎస్. శ్రీరాం
1958
2 మహారథి కర్ణ జోజో వీరా జోజో యేధాజో జోజో జోజో ఎస్. జానకి డి. బాబూరావు 1960
3 మహారథి కర్ణ మనసా అంతా మాయేలే కనుమా జ్యోతిర్మయు లీలా పి.బి. శ్రీనివాస్ డి. బాబూరావు 1960
4 జగదేక సుందరి 1961
5 ఏకైక వీరుడు న్యాయం ధర్మం మరువకురా ఏనాడు ఎవరికి వెరువకురా ఘంటసాల ఎస్.పి. కోదండపాణి 1962
6 ఏకైక వీరుడు అందాల రాణి మా యువరాణి జగతికే మోహిని కె. రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.పి. కోదండపాణి 1962
7 ఏకైక వీరుడు ఆంధ్రుల ప్రతిభను చాటండి గోదావరి తల్లిని మాధవపెద్ది, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.పి. కోదండపాణి 1962
8 ఏకైక వీరుడు ఎవరో ఎవరో ఇరువురిలో నచ్చిన మెచ్చిన కె. రాణి, ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.పి. కోదండపాణి 1962
9 ఏకైక వీరుడు కలిత లలిత మద మరాళ గామినీ మదిలోన ప్రణయ ఘంటసాల,పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1962
10 ఏకైక వీరుడు కళ్యాణ తిలకమ్ము కళలు వీడగలేదు గారాల ముద్రిక మాధవపెద్ది ఎస్.పి. కోదండపాణి 1962
11 ఏకైక వీరుడు కావగరాదా కథ వినరాదా కరుణను పతిజాడ కె. జమునారాణి ఎస్.పి. కోదండపాణి 1962
12 ఏకైక వీరుడు ననుకోర తగదిది వినుమా నా దరి చేర తగదిది ఎం.ఎల్. వసంత కుమారి ఎస్.పి. కోదండపాణి 1962
13 ఏకైక వీరుడు నాట్యం ఆడు వయారి మయూరి సరిగ మ స్వరముల ఎస్.పి. కోదండపాణి ఎస్.పి. కోదండపాణి 1962
14 ఏకైక వీరుడు హృదయములు పులకించవో ఎం. ఎల్. వసంతకుమారి,శీర్గాళి గోవిందరాజన్ ఎస్.పి. కోదండపాణి 1962
15 స్వర్ణగౌరి ఆశలన్నీకలబోసి నేను కలలు కన్నాను నాలో ఎస్.జానకి యం. వెంకట్రాజు 1962
16 స్వర్ణగౌరి జయమీవే జగదీశ్వరీ కావ్యగాన కళా సాగరీ ఎస్. జానకి, చిత్తరంజన్ యం. వెంకట్రాజు 1962
17 స్వర్ణగౌరి రసమయ జీవన దీనావనా త్రిభువన పాలన పి.బి. శ్రీనివాస్, పి. సుశీల యం. వెంకట్రాజు 1962
18 స్వర్ణగౌరి రావే నా చెలియా నీ తళుకు బెళుకు కులుకులతో పి.బి. శ్రీనివాస్ యం. వెంకట్రాజు 1962
19 స్వర్ణగౌరి రావో జాబిలీ చిన్నారి కన్నెనోయి కన్నారా చూడవోయి ఎస్.జానకి, పి.బి. శ్రీనివాస్ యం. వెంకట్రాజు 1962
20 స్వర్ణగౌరి కరకు ఱాగుండె కాలుని కరుగ జేసి (పద్యం) యం. వెంకట్రాజు 1962
21 స్వర్ణగౌరి జయ జయ నారాయణ ప్రభో పావన హే లీలా వినోదా మంగళంపల్లి యం. వెంకట్రాజు 1962
22 స్వర్ణగౌరి తన మగని నత్తమామల జననీ జనకులను (పద్యం) యం. వెంకట్రాజు 1962
23 స్వర్ణగౌరి దయగనుమా మొర వినుమా పతిని కాపాడవమ్మా యం. వెంకట్రాజు 1962
24 స్వర్ణగౌరి న్యాయం మారిందా జగతిని ధర్మం మీరిందా ఎస్.జానకి బృందం యం. వెంకట్రాజు 1962
25 స్వర్ణగౌరి పాలించు ప్రభువుల పసిపాపాలను జేసి (పద్యం) మంగళంపల్లి యం. వెంకట్రాజు 1962
26 స్వర్ణగౌరి మనసేలా ఈ వేళా రాగాలా తేలేను ఆ వంనేకాని - ఎస్.జానకి యం. వెంకట్రాజు 1962
27 స్వర్ణగౌరి రష్వ చాలించరా ఓ హౌసుకాడా నవ్వు నవ్వించరా ఎస్.జానకి బృందం యం. వెంకట్రాజు 1962
28 బంగారు తిమ్మరాజు ఈవింత పులకింత నోలోన కలిగేను నిను కనినంత ఎస్.జానకి జి. విశ్వనాథం 1964
29 బంగారు తిమ్మరాజు కోడెకారు చినవాడా కొంటెచూపుల మొనగాడా ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ జి. విశ్వనాథం 1964
30 బంగారు తిమ్మరాజు నాగమల్లి కోనలోన నక్కింది లేడికూన ఎర ఏసి గురిచూసి కె.జమునారాణి జి. విశ్వనాథం 1964
31 బంగారు తిమ్మరాజు బలే బలే బలే బాగుంది అలా అలా ఒళ్ళు తేలిపోతోంది కె.జమునారాణి జి. విశ్వనాథం 1964
32 బంగారు తిమ్మరాజు రాగభోగాల తేలించు దొరవని కోరి పిలిచేనురా పి.సుశీల బృందం జి. విశ్వనాథం 1964
33 బంగారు తిమ్మరాజు లేడిని సీత చూడకపోతే మాధవపెద్ది,స్వర్ణలత,శర్మ,పట్టాభి జి. విశ్వనాథం 1964
34 బంగారు తిమ్మరాజు బలదర్పమున దుర్జనుల్ ప్రబలి నీ భక్తాళి భాదింపగా (పద్యం) పి.బి. శ్రీనివాస్ జి. విశ్వనాథం 1964
35 బంగారు తిమ్మరాజు స్దిరమై ముక్తికి మార్గదర్శకరమై శ్రీమన్మహాలక్ష్మి (పద్యం) మాధవపెద్ది జి. విశ్వనాథం 1964
36 దేవత అందములోల్కు మోముపై హాసవిలాస మనోజ్ఞరేఖలే (పద్యం) పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1965
37 దేవత ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జ్యోతి ఘంటసాల ఎస్.పి.కోదండపాణి 1965
38 దేవత ఈతడే ట్రాజెడీ యాక్టింగులో కింగ్ హిందీ ఫీల్డ్ (పద్యం) మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి 1965
39 దేవత కన్నుల్లో మిసమిసలు కనిపించనీ గుండెల్లో గుసగుసలు ఘంటసాల,పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1965
40 దేవత జగమెల్ల పరికించు చల్లని జాబిల్లి సుదతి సీతని నీవు (పద్యం) ఘంటసాల ఎస్.పి.కోదండపాణి 1965
41 దేవత తొలి వలపే పదే పదే పిలిచే ఎదలో సందడి చేసే ఘంటసాల,పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1965
42 ఆకాశరామన్న ఎగరాలి ఎగరాలి రామదండు బావుటా అందరిదీ ఒకే మాట ఎస్.జానకి, సత్యారావు బృందం ఎస్.పి.కోదండపాణి 1965
43 ఆకాశరామన్న ఓ చిన్నవాడా ఒక్కమాట ఉన్నాను చూడవోయి నీ ఎదుట ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్ ఎస్.పి.కోదండపాణి 1965
44 ఆకాశరామన్న చల్ల చల్లగా సోకింది మెల్ల మెల్లగా తాకింది జువ్వుమని నరాలన్నీ ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1965
45 ఆకాశరామన్న జలగలా పురషుల జవసత్వములు పీల్చి వేదించి (పద్యం) మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి 1965
46 ఆకాశరామన్న డుంకు డుంకు ఓ పిల్లా డుంకవె డుంకవె ఇల్లాలా మాధవపెద్ది,ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1965
47 ఆకాశరామన్న తళుకు బెళుకులు చూపించి ధర్మరాజువంటి రాజును (పద్యం) బి. గోపాలం ఎస్.పి.కోదండపాణి 1965
48 ఆకాశరామన్న తేనె పూసిన కత్తి నీ దేశభక్తి వంచనలపుట్ట నీ పొట్ట (పద్యం) బి. గోపాలం ఎస్.పి.కోదండపాణి 1965
49 ఆకాశరామన్న దాగవులే దాగవులే దాగవులే ఉబికి ఉబికి ఉరికి ఉరికి పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి ఎస్.పి.కోదండపాణి 1965
50 ఆకాశరామన్న నవ్వు నవ్వు నవ్వు నవ్వు నవ్వే బ్రతుకున వరము కన్ను కన్ను ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1965
51 ఆకాశరామన్న నీకోసం ఏమైనా ఐపోని నా నాట్యం నా గానం నా సర్వం నీకే వశమోయీ ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1965
52 ఆకాశరామన్న మంచిగా నిధిని కాజేయ కాచుకున్నకొంగ గజదొంగ (పద్యం) ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1965
53 ఆకాశరామన్న ముత్యమంటి చిన్నదాని మొగలిరేకు వన్నెదాని మొగమాటం ఎస్.జానకి బృందం ఎస్.పి.కోదండపాణి 1965
54 శ్రీమతి మన్నించవే ఇవేళా హలో మై డార్లింగ్ పిఠాపురం, స్వర్ణలత ఎస్.పి.కోదండపాణి 1966
55 లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఆవోరెమియ్యా దేఖోరెజియ్యా జరా ఠైరో ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1966
56 లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఇలాగే ఇలాగే ఉండనీ హృదయములే పరవశమై పి.సుశీల,ఘంటసాల ఎస్.పి.కోదండపాణి 1966
57 లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఓ పిల్లా నీ మనసేమన్నది బ్రతుకంతా నవ్వాలంటూ ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1966
58 లోగుట్టు పెరుమాళ్ళకెరుక చూశావా నాన్న కను మూశావా నాన్నా నిన్న నమ్మిన ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1966
59 లోగుట్టు పెరుమాళ్ళకెరుక దారికాచి వీలుచూచి కాచు పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి, పిఠాపురం, మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి 1966
60 లోగుట్టు పెరుమాళ్ళకెరుక దొరలా తిరుగుతూ దొరకని దొంగలు మనలో పిఠాపురం, మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి 1966
61 లోగుట్టు పెరుమాళ్ళకెరుక పందొమ్మిదొందల యాభై మోడల్ అమ్మాయీ ఎస్.జానకి, ఘంటసాల ఎస్.పి.కోదండపాణి 1966
62 లోగుట్టు పెరుమాళ్ళకెరుక యైరా ఎంకన్న దొర ఎస్.జానకి,శీర్గాళి గోవిందరాజన్,పిఠాపురం,పట్టాభి ఎస్.పి.కోదండపాణి 1966
63 లోగుట్టు పెరుమాళ్ళకెరుక ఓ బంగారు పంజరంలో చిక్కావే పి.బి.శ్రీనివాస్,మాధవపెద్ది బృందం ఎస్.పి.కోదండపాణి 1966
64 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ఆకారమిచ్చిన ఆశిల్పి సూరన్నతలపగా (పద్యం) పిఠాపురం ఎస్.పి.కోదండపాణి 1967
65 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ఓ ఏమి ఈ వింత మొహం ఏమి కె.రఘురామయ్య,పి.సుశీల, పి.బి.శ్రీనివాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి.కోదండపాణి 1967
66 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న ఓహో అందాల చిలకుంది అందర్ని రమ్మంది కులికీ పలికింది ఎస్.జానకి ఎస్.పి.కోదండపాణి 1967
67 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చఱ్ఱున చఱ్ఱు చఱ్ఱుమని సాగిలి కోయగ పుట్టెనంట (పద్యం) పిఠాపురం ఎస్.పి.కోదండపాణి 1967
68 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న నీవే నీవే నా దైవము నీవే నీవే నా భాగ్యము పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1967
69 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న భోగిని యోగిచేయు సురభోగములు చవిచూసి (పద్యం) మాధవపెద్ది ఎస్.పి.కోదండపాణి 1967
70 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న మంగిడీలు మంగిడీలు ఓ పూలభామ సిన్నారి సిలకమ్మ పిఠాపురం,పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1967
71 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న విశ్వమ్ము కంటెను విపులమైనది ఏది (సంవాద పద్యాలు ) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1967
72 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న వెన్నెల ఉందీ వేడిమి ఉందీ మరులు రేగెను నాలోన కే.జే. యేసుదాస్, పి.సుశీల ఎస్.పి.కోదండపాణి 1967
73 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న శ్రీకరుడు హరుడు శ్రితజన వరదుడు కరుణతో నినుసదా (పద్యం) కె. రఘురామయ్య ఎస్.పి.కోదండపాణి 1967
74 శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సెబితే శానా ఉంది యింటే ఎంతో ఉంది సెబుతా ఇనుకోరా టి.ఎం. సౌందర్ రాజన్ ఎస్.పి.కోదండపాణి 1967
75 చిక్కడు దొరకడు కన్నెపిల్ల అనగానే అందరికి అలుసే కన్నుగీటి అయ్యో పి.సుశీల టి.వి.రాజు 1967
76 రాజయోగం ఈ సమయం ఏమిటో ఈ మైకం వనకీ చిలిపితనం పి.బి.శ్రీనివాస్,ఎస్.జానకి సత్యం 1968
77 రాజయోగం ఏలోకాన ఎవరైనా జవదాటలేరు విధివ్రాత ఏ నిముసాన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1968
78 రాజయోగం కాదులే కల కాదులే ఔనులే నిజమౌనులే ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1968
79 రాజయోగం తాళం వేయాలి లోకం ఊగాలి కవ్వించే నా ఆటలో నా రూపులో ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం 1968
80 రాజయోగం నచ్చినవాడు మనసిచ్చినవాడు నీ చెంతచేరి లాలిస్తే ఎస్.జానకి,లత సత్యం 1968
81 రాజయోగం రావోయి నిన్నే పిలిచాను నీకై వేచాను యుగయుగాల లత సత్యం 1968
82 రాజయోగం లక్ష్మీమహీతదనురూపా నిజానుభావా నీలాది దివ్య (శ్లోకం) పి.సుశీల సత్యం 1968
83 రాజయోగం సురుచిర సుందరహాసా సుమధుర గానవిలాసా రారా ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం 1968
84 వీర పూజ కొనుమా సరాగమాల నిలిచేను నీదు మ్రోల పి.సుశీల, ఘంటసాల ఘంటసాల 1968
85 వీర పూజ ఠింగు బటాణీ చెయ్యవె బోణీ కొత్త రకం సరుకు ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి ఘంటసాల 1968
86 వీర పూజ ప్రియమైన ప్రేమ పూజారి పెనుచీకటైన నా ఆలయాన పి.సుశీల ఘంటసాల 1968
87 కదలడు వదలడు ఎండా వానా గాలి వెన్నెల ఏమన్నాయిరా పరోపకారం ఘంటసాల బృందం టి.వి.రాజు 1969
88 కదలడు వదలడు బుల్లెమ్మా సౌఖ్యమేనా ఏం బుల్లెమ్మా సౌఖ్యమేనా ఘంటసాల, పి.సుశీల టి.వి.రాజు 1969
89 సప్తస్వరాలు జయ జయ మహా రుద్ర ( దండకం ) ఎ.వి.ఎన్.మూర్తి బృందం టి.వి.రాజు 1969
90 సప్తస్వరాలు యదుబాల శ్రితజనపాల దరిశనమీవయ గోపాల ఘంటసాల బృందం టి.వి.రాజు 1969
91 సప్తస్వరాలు సా సకల ధర్మాలలో ( సంవాద పద్యాలు) విజయలక్ష్మి కన్నారావు, ఘంటసాల టి.వి.రాజు 1969
92 సప్తస్వరాలు హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జేజేలు పి.బి.శ్రీనివాస్, ఘంటసాల టి.వి.రాజు 1969
93 రాజసింహ అందుకో జాబిలీ రాగకుసుమాంజలి నీపాలనలో జగాలన్నీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి సత్యం 1969
94 రాజసింహ ఏటేట జాతరచేసి ఏడుపుట్ల కుంభం పోసి మాధవపెద్ది, రఘురాం,మూర్తి బృందం సత్యం 1969
95 రాజసింహ ఓ సింకిరిబంకిరి సిన్నోడా ఓ వంకర టింకర వన్నెకాడా స్వర్ణలత బృందం సత్యం 1969
96 రాజసింహ కోరికల గువ్వ మొహాల మువ్వ బంగారుగవ్వ రంగేళి రవ్వ ఎస్.జానకి సత్యం 1969
97 రాజసింహ నాగుండెల్లోన ఘుమ ఘుమలాడె ఏదో తెలియని వేడి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి సత్యం 1969
98 రాజసింహ నిదుర కన్నెలు నీతో ఆటాడే వేళ నీతల్లి పాడేరా కన్నీటి జోల ఎస్.జానకి సత్యం 1969
99 శ్రీరామకథ ఒద్దికతో ఉన్నది చాలక భూదేవి కూడె నీ బుద్ధిశాలి (పద్యం) ఘంటసాల ఎస్.పి. కోదండపాణి 1969
100 శ్రీరామకథ ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఎస్.పి. కోదండపాణి 1969
101 శ్రీరామకథ జయజయ వైకుంఠధామా సుధామా (దండకం) ఘంటసాల ఎస్.పి. కోదండపాణి 1969
102 శ్రీరామకథ టింగురంగా పి.సుశీల,పిఠాపురం,మాధవపెద్ది,పద్మనాభం,రామకృష్ణ ఎస్.పి. కోదండపాణి 1969
103 శ్రీరామకథ మాధవా మాధవా నను లాలించరా నీ లీల కేళి ఘంటసాల,పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
104 శ్రీరామకథ రావేల కరుణాలవాల దరిశనమీయగ రావేల నతజనపాల పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
105 శ్రీరామకథ శౌరిపై గల నాప్రేమ సత్యమేని కలను సైతము అన్యుల (పద్యం) పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
106 శ్రీరామకథ సర్వకళాసారము నాట్యము నయన మనోహరము పి.సుశీల, ఎస్.జానకి, లహరి ఎస్.పి. కోదండపాణి 1969
107 శ్రీరామకథ ఓం మదనాయ శృంగార సదనాయ (శ్లోకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.పి. కోదండపాణి 1969
108 శ్రీరామకథ చక్కనివాడు మాధవుడు చల్లని కన్నులవాడు (పద్యం) పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
109 శ్రీరామకథ యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టిస్తతో మన: (శ్లోకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
110 శ్రీరామకథ రాగమయం అనురాగమయం యీ జగమే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
111 శ్రీరామకథ శృంగార రస సందోహమ్ శ్రితకల్ప మహీరుహుమ్ (శ్లోకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల ఎస్.పి. కోదండపాణి 1969
112 పగసాధిస్తా ఈబిగువు ఈ తగవు కొత్తది కాదయ్యా మగువల మనసు పి.సుశీల సత్యం 1970
113 పిల్లా? పిడుగా? జమ్మాలకిడి జమ్మా ఇది గుమ్మాలకిడి గుమ్మా ఎల్. ఆర్. ఈశ్వరి సత్యం 1972
114 మావూరి మొనగాళ్ళు పెగ్గు వేసుకో నిగ్గు చూసుకో మత్తులోనే మజా చేసుకో ఎల్. ఆర్. ఈశ్వరి సత్యం 1972
115 మావూరి మొనగాళ్ళు వెలిగించు క్రాంతి జ్యోతి పలికించు విరహగీతి పి.సుశీల సత్యం 1972
116 మావూరి మొనగాళ్ళు హై నా జిలిబిలి తళుకుల పొంకం హే కావాలా ఎల్. ఆర్. ఈశ్వరి సత్యం 1972
117 భక్త తుకారాం చిందులు వేయకురా శ్రీరంగ నీతులు చెప్పకురా తెలిసి ఘంటసాల బృందం పి.ఆదినారాయణ రావు 1973
118 భక్త తుకారాం బలే బలే అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఘంటసాల పి.ఆదినారాయణ రావు 1973
119 భక్త తుకారాం రంగని సేవ జేయుచు విరాగిగా నుండెడు విప్రదాసు (పద్యం) ఘంటసాల పి.ఆదినారాయణ రావు 1973
120 భక్త తుకారాం వనిత కవితయు వలచిరావలెనె గాని తంత్రములు పన్ని (పద్యం) ఘంటసాల పి.ఆదినారాయణ రావు 1973
121 భక్త తుకారాం వన్నె తరుగని వజ్రాలు ఎన్నరాని విలువ కనలేని రతనాలు (పద్యం) ఘంటసాల పి.ఆదినారాయణ రావు 1973
122 ఇదాలోకం గుడిలోన నా స్వామి కొలువై ఉన్నాడు ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి చక్రవర్తి 1973
123 గుండెలు తీసిన మొనగాడు ఆరని జ్వాలా నా తాపము సుడిగాలి జోల నా గానమూ ఎస్.జానకి చక్రవర్తి 1974
124 మన్మథలీల కుశలమేనా కుర్రదానా నీ హృదయం శాంతించెనా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల చక్రవర్తి 1976
125 మన్మథలీల ఫట్ ఫట్ ఛట్ ఛట్ నిన్నొక మేనక నేడొక ఊర్వశి ఏరా తమ్ముడూ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి 1976
126 మన్మథలీల మన్మధలీలా మధురము కాదా మనస్సునరేపే తీయని బాధ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి 1976
127 మన్మథలీల హల్లో మైడియర్ రాంగ్ నెంబర్ గొంతుకే వింటే ఎంత మధురం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎల్.ఆర్.ఈశ్వరి చక్రవర్తి 1976
128 యమగోల గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు పి.సుశీల చక్రవర్తి 1977
129 వయసు పిలిచింది మబ్బే మసకేసిందిలే.. పొగమంచే తెరగా నిలిచిందిలే.. ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా 1978
130 మల్లెపూవు చక చక సాగే చక్కని బుల్లెమ్మ మిస మిసలాడే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల చక్రవర్తి 1978
131 మల్లెపూవు నువ్వు వస్తావని బృందావని ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా వాణి జయరాం బృందం చక్రవర్తి 1978
132 దేవదాసు మళ్ళీ పుట్టాడు దిక్కులు కలిసే సమయం ఇది సూర్యుడు చూడని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం చక్రవర్తి 1978
133 చిరంజీవి రాంబాబు అమ్మ అన్నమాట కమ్మనైన పాట పి.సుశీల జె.వి.రాఘవులు 1978
134 చిరంజీవి రాంబాబు ఏడనో పుట్టింది ఏడనో తిరిగింది ఏడనో కలిసింది గోదారి జె.వి.రాఘవులు జె.వి.రాఘవులు 1978
135 చిరంజీవి రాంబాబు నీనామమెంతో మధురము కాదా పావనమైనది నీ గాధా పి.సుశీల జె.వి.రాఘవులు 1978
136 ఎర్ర గులాబీలు ఎదలో తొలి వలపే విరహం జత కలిసే, మధురం ఆ తలుపే నీ పిలుపే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి ఇళయరాజా 1979
137 అమర గీతం నెలరాజా! పరుగిడకు.. చెలి వేచే నా కొరకూ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఇళయరాజా 1979
138 పట్నం పిల్ల పయనించే చిరుగాలి నా చెలి సన్నిధికే చేరి నా పిలుపే వినిపించాలి చక్రవర్తి 1980
139 జగద్గురు ఆది శంకరాచార్య త్రిపుర సుందరీ,దర్శన లహరీ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వి.దక్షిణామూర్తి, జె.వి.రాఘవులు 1981

140. విజయం మనదే . ఏలుకొరా

నిర్మాతగా

మార్చు

దర్శకుడుగా

మార్చు

మూలాలు

మార్చు
  1. పైడిపాల (2015-01-03). "రాగాలతోట వీటూరిపాట". ఆంధ్రజ్యోతి దినపత్రిక. Retrieved 3 January 2015.[permanent dead link]

యితర లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=వీటూరి&oldid=4176010" నుండి వెలికితీశారు