సుత్తివేలు

ప్రముఖ హాస్య నటుడు
(కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు నుండి దారిమార్పు చెందింది)

సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు (ఆగస్టు 7, 1947 - సెప్టెంబర్ 16, 2012) తెలుగు హాస్య నటుడు. ఈయన సుమారు 200 [1] చిత్రాలలో నటించాడు.అలాగే కొన్ని టెలివిజన్ ధారావాహికలలో కూడా నటించాడు.[2]

సుత్తివేలు

జన్మ నామంకురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు
జననం (1947-08-07)1947 ఆగస్టు 7
భోగిరెడ్డిపల్లి, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా
మరణం 2012 సెప్టెంబరు 16(2012-09-16) (వయసు 65)
India మద్రాసు, భారతదేశం
భార్య/భర్త లక్ష్మీరాజ్యం
ప్రముఖ పాత్రలు నాలుగు స్తంభాలాట (1982)
వందేమాతరం (1985)
ప్రతిఘటన(1988)
సుత్తివేలు కుటుంబము, ఎడమ నుండి కుడికి, కుమార్తెలు శ్రీదేవి, భువనేశ్వరి, భార్య లక్ష్మీ రాజ్యం, కుమారుడు జగన్నాథ ఫణి కుమార్

నేపధ్యము

మార్చు

సుత్తివేలు అసలు పేరు కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు. ఈయన చిన్నతనంలో చాలా అల్లరి చేసేవాడు. అలాగే ఈయన చిన్నతనంలో చాలా సన్నగా ఉండేవాడు. దానితో ఈయన పక్కంటి పిన్ని జానకాంబ ఈయనను వేలు అని పిలిచేవారు.ఈయన నటించిన నాలుగు స్తంభాలాటలో ఈయన పాత్ర పేరు 'సుత్తి'. ఆ చిత్ర విజయం తరువాత అందరూ ఈయనను సుత్తివేలు అని పిలవడం ప్రారంభింఛారు. సుత్తివేలు తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. బాల్యం నుండి ఈయనకు నాటకాల పట్ల ఆసక్తి ఎక్కువ. దానితో ఏడవ తరగతి తప్పి, తండ్రితో చీవాట్లు తిన్నాడు.

నట ప్రస్థానం

మార్చు

ఈయనకు చిన్నప్పటి నుండి నాటకాలంటే ప్రత్యేక ఆసక్తి. 1966లో పి.యు.సి చదివిన అనంతరం, హైదరాబాదుకు చేరుకున్నాడు. అక్కడ తాత్కాలిక ఉద్యోగం చేసేవాడు. 1967లో ఉద్యోగం మారి బాపట్ల చేరుకున్నాడు. ఉద్యోగం మానేసి స్నేహితులతో నాటకాలు వేసేవాడు.

1981లో విశాఖపట్నం డాక్ యార్డులో శాశ్వత ఉద్యోగం రావడంతో అక్కడికి మకాం మార్చాడు. భమిడిపాటి అంతా ఇంతే నాటకం ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. మనిషి నూతిలో పడితే అనే నాటకంలో ఆయన పాత్రను చూసిన హాస్యబ్రహ్మ జంధ్యాల తన చిత్రం ముద్ద మందారంలో అయనకు రిసెప్షనిష్టుగా చిన్న పాత్రను ఇచ్చాడు. ఇలా 1981 లో సుత్తివేలు సినీరంగ ప్రస్థానం జరిగింది. అటు పిమ్మట జంధ్యాల, తన వరుస చిత్రాలైన మల్లె పందిరి, నాలుగు స్తంభాలాట లలో కూడా సుత్తివేలుకు అవకాశాలనిచ్చాడు. ఈ చిత్రం విడుదల ఆలస్యం కావడంతో సుత్తివేలు ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

ఉద్యోగం పోయిన తర్వాత నటననే తన వృత్తిగా స్వీకరించాడు. ఆనంద భైరవి, రెండుజెళ్ళ సీత, శ్రీవారికి ప్రేమలేఖ, చంటబ్బాయి వంటి పలు విజయవంతమైన చిత్రాలలో హాస్యపాత్రలను పోషించాడు. త్రిశూలం చిత్రం తర్వాత అవకాశాలు సన్నగిల్లడంతో కొద్దిరోజులు కష్టాలను అనుభవిందాడు. తర్వాత టి. కృష్ణ వరుసగా ఐదు చిత్రాలలో అవకాశాలిచ్చాడు. అప్పటి వరకు హాస్య పాత్రలనే పోషిస్తూ వచ్చిన సుత్తివేలుకు, ఈ చిత్రాలలో తన నటనలోని మరో పార్శ్వాన్ని ఆవిర్భవించే అవకాశం చిక్కింది. వందేమాతరం, ప్రతిఘటన, కలికాలం, ఒసేయ్ రాములమ్మ చిత్రాలలో ఆయన పోషించిన పాత్రలు మరపురానివి. వందేమాతరం చిత్రానికి గాను 1984లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నాడు.

ఈయన తన స్థిర నివాసం మద్రాసులో ఏర్పరుచుకున్నాడు. చిత్రపరిశ్రమ హైదరాబాదుకు తరలడంతో తగినన్ని అవకాశాలు దక్కించుకోలేక పోయాడు. దీనితో పలు టెలివిజన్ ధారావాహికలలో నటించాడు. ఆనందోబ్రహ్మ, మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు, భమిడిపాడి రామగోపాల్ కథలు ఈయనకు మంచిపేరు తీసుకువచ్చాయి. చివరి రోజులలో తన మకాంను హైదరాబాదుకు మార్చాడు.

వ్యక్తిగత జీవితము

మార్చు

సుత్తివేలు వివాహము లక్ష్మీరాజ్యంతో జరిగింది. వీరికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి సంతానము.(భువనేశ్వరి, శ్రీదేవి, జగన్నాథ ఫణికుమార్, సత్యవాణి)

ఆయనకు ఆంగ్ల రచయిత షేక్స్పియర్ అంటే అభిమానం.[3]

నటించిన చిత్రాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు
2008 అందరికీ వందనాలు బాలల చిత్రం
2006 మొదటి సినిమా
వీరభద్ర
2005 ఆ నలుగురు
శ్లోకం
2004 Xట్రా
మాణిక్యం
చిల్లర మొగుడు అల్లరి కొడుకు న్యాయవాది
2000 అడవిచుక్క
1998 పవిత్ర ప్రేమ
తెలుగోడు
1997 పెళ్ళి చేసుకుందాం శాంతి తండ్రి
Osey Ramulamma
చిన్నబ్బాయి[4]
1996 సాహసవీరుడు - సాగరకన్య
1992 కిల్లర్
చిట్టెమ్మ మొగుడు
1991 ఆదిత్య 369 రక్షక భటుడు
చైతన్య
భార్గవ్
1990 జయసింహ
1989 అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
విజయ్
1988 ఇన్స్‌పెక్టర్ ప్రతాప్
ఖైదీ నెంబరు.786
చిక్కడు దొరకడు
యముడికి మొగుడు
1987 అజేయుడు
దొంగ మొగుడు
1986 చంటబ్బాయి గణపతి
అపూర్వ సహోదరులు
1985 ప్రతిఘటన రక్షక భటుడు
1984 ఆనంద భైరవి
1983 ఖైది
1982 నాలుగు స్తంభాలాట సుత్తి
ముద్దమందారం తొలి చిత్రం

పురస్కారాలు

మార్చు

అనారోగ్యంతో బాధపడుతూ 2012, సెప్టెంబరు 16మద్రాసు లోని ఒక ఆసుపత్రిలో మరణించాడు[1][5][6].

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 http://timesofindia.indiatimes.com/entertainment/regional/telugu/news-interviews/Suthi-Velu-passes-away/articleshow/16419124.cms
  2. Sakshi (27 June 2021). "ఆ రోజు ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లొచ్చాడు, కానీ సడన్‌గా." Sakshi. Archived from the original on 27 జూన్ 2021. Retrieved 27 June 2021.
  3. http://ishtapadi.blogspot.in/2014/08/blog-post_9.html[permanent dead link]
  4. "Chinnabbaayi Cast and Crew | Star Cast | Telugu Movie | Chinnabbaayi Actor | Actress | Director | Music | Oneindia.in". Popcorn.oneindia.in. Archived from the original on 12 July 2012. Retrieved 2020-06-16.
  5. http://www.thehindu.com/news/states/andhra-pradesh/article3904844.ece Archived 2012-09-17 at the Wayback Machine.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-09-16. Retrieved 2012-09-16.

బయటి లింకులు

మార్చు