దక్షిణ తీర రైల్వే జోన్

(దక్షిణ తీరం రైల్వే జోన్ నుండి దారిమార్పు చెందింది)

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం కేంద్రంగా భారత ప్రభుత్వం భారతీయ రైల్వేలలో ప్రకటించిన కొత్త రైల్వే జోన్.[1][2] 2019 ఫిబ్రవరి 27 న భారత ప్రభుత్వం ఈ జోన్‌ ఏర్పాటును ప్రకటించింది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ రైల్వే డివిజన్లు ఇందులో భాగంగా ఉంటాయి.[3][4][5] వాల్తేరు రైల్వే డివిజన్‌ను రెండు భాగాలు చేసి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని భాగం దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉంటుంది.[6] దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కొంతమేరకు తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉంటుంది.[7]

దక్షిణ తీర రైల్వే జోన్
రిపోర్టింగ్ మార్క్SCoR
లొకేల్ఆంధ్రప్రదేశ్
ట్రాక్ గేజ్5 ft 6 in (1,676 mm)
ఎలక్ట్రిఫికేషన్25 kV
ప్రధానకార్యాలయంవిశాఖపట్నం

ప్రకటన

మార్చు

2014 నాటి ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ ఏర్పాటులో సాధ్యాసాధ్యాలను పరిశిలించి ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లోని అత్యధికశాతం రైల్వే మార్గం సికిందరాబాదు కేంద్రంగా పనిజేసే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉండేది. దువ్వాడ మొదలు విశాఖపట్టణం, శ్రీకాకుళం మీదుగా ఇచ్ఛాపురము వరకు, విజయనగరం మొదలు పార్వతీపురము మీదుగా కూనేరు వరకు, కొత్తవలస మొదలు అరకు మీదుగా గోరాపుర్ వరకు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతపు రైల్వే మార్గం తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలో ఉండేది. ఇది భువనేశ్వర్ కేంద్రంగా పనిచేసేది. విశాఖపట్టణం వరకు ఉన్న రైళ్ళను భువనేశ్వర్ వరకూ తరలించడం వంటి చర్యలతో భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ పక్షపాతంతో పనిచేస్తున్నదన్న అభిప్రాయం కలిగింది.[8][9] విశాఖపట్టణం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కావాలన్న కోరిక ప్రజల్లో బలంగా ఉండేది.[10] ఈ నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27 న భారత ప్రభుత్వ రైల్వే శాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటును ప్రకటించింది.

ప్రజల స్పందనలు

మార్చు

వైఎస్‌ఆర్ కాంగ్రెసు పార్టీ, భారతీయ జనతా పార్టీలు ప్రభుత్వ ప్రకటనను స్వాగతించగా, డివిజను కోసం పోరాటం చేస్తున్న రైల్వే జోన్ సాధన సమితి వంటి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు,[11] తెలుగు దేశం పార్టీ, భారత జాతీయ కాంగ్రెసు పార్టీ,[12] కమ్యూనిస్టు పార్టీలు దీన్ని విమర్శించాయి.[13] వాల్తేరు డివిజన్ను ఎత్తివేయడం, ఆ డివిజను లోని ప్రధాన ఆదాయ వనరైన సరుకు రవాణా మార్గాన్ని రాయగడ డివిజనుకు తరలించడాన్ని వీరు వ్యతిరేకించారు. రైల్వే ఉద్యోగ నియామక కేంద్రం (రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు) విశాఖపట్నంలో ఉంటుందో లేదో నన్న ఆందోళనను కూడా వీరు వ్యక్తం చేసారు.

పరిధి

మార్చు

దక్షిణ కోస్తా రైల్వే పరిధి మూడు విభాగాలుగా నుండును.

విజయవాడ విభాగం

మార్చు

ఈ రైల్వే మండల ఏర్పాటునకు పూర్వము తూర్పు కోస్తా రైల్వే పరిధిలోనున్న వాల్తేరు రైల్వే విభాగము రెండుగా విభజింపబడి ఒక భాగము విజయవాడ విభాగములో విలీనము చేయబడును. మిగిలిన మార్గముతో రాయగడ కేంద్రముగా క్రొత్త విభాగము ఏర్పరచబడును. రాయగడ విభాగము తూర్పు కోస్తా రైల్వే మండలంలో భాగముగానుండును.

  • గూడూరు జంక్షన్-విజయవాడ జంక్షన్
  • విజయవాడ జంక్షన్-విశాఖపట్టణము జంక్షన్- నౌపడ జంక్షన్ (స్టేషను కాకుండగ)
    • సామర్లకోట జంక్షన్- కాకినాడ రేవు (పోర్టు)
      • కాకినాడ టౌను జంక్షన్- కోటిపల్లి
  • విజయవాడ జంక్షన్- కొండపల్లి
  • విజయవాడ జంక్షన్- గుడివాడ జంక్షన్
    • గుడివాడ జంక్షన్- మచిలీపట్టణము
  • గుడివాడ జంక్షన్- భీమవరము జంక్షన్- నరసాపురము
  • భీమవరము జంక్షన్- నిడదవోలు జంక్షన్
  • కాకినాడ టౌను జంక్షన్- కోటిపల్లి
  • కొత్తవలస జంక్షన్- అరకు

గుంతకల్లు విభాగము

మార్చు
  • రేణిగుంట జంక్షన్-గూడూరు జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • రేణిగుంట జంక్షన్- తిరుపతి- పాకాల జంక్షన్-కాట్పాడి జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • రేణిగుంట జంక్షన్-గుత్తి జంక్షన్-గుంతకల్లు జంక్షన్
    • కడప-పెండ్లిమర్రి
    • యర్రగుంట్ల జంక్షన్-నంద్యాల జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • గుత్తి జంక్షన్- ధర్మవరము జంక్షన్
  • పాకాల జంక్షన్-ధర్మవరము జంక్షన్
  • గుత్తి జంక్షన్- పెండేకల్లు జంక్షన్
  • గుంతకల్లు జంక్షన్- పెండేకల్లు జంక్షన్- డోన్ జంక్షన్-నంద్యాల జంక్షన్
  • గుంతకల్లు జంక్షన్- మంత్రాలయము రోడ్- రాయచూరు- వాడి జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • గుంతకల్లు జంక్షన్- బళ్ళారి జంక్షన్ (స్టేషను కాకుండగ)

గుంటూరు విభాగము

మార్చు
  • గుంటూరు జంక్షన్- కృష్ణా కెనాల్ జంక్షన్ (స్టేషను కాకుండగ)
  • గుంటూరు జంక్షన్- తెనాలి జంక్షన్ (స్టేషను కాకుండగ)- రేపల్లె
  • గుంటూరు జంక్షన్-నల్లపాడు జంక్షన్
    • నల్లపాడు జంక్షన్- నంద్యాల జంక్షన్
    • నల్లపాడు జంక్షన్- నడుకుడి జంక్షన్
      • నడికుడి జంక్షన్- పగిడిపల్లి జంక్షన్ (స్టేషను కాకుండగ)
      • నడికుడి జంక్షన్- మాచెర్ల

ప్రధానమైన స్టేషన్లు

మార్చు

ఈ జాబితాలో దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఉండనున్న స్టేషన్లు, వాటి కేటగిరీలు ఉంటాయి.[14]

స్టేషన్లు, విభాగాలు

మార్చు
స్టేషన్ కేటగిరీ స్టేషన్ల సంఖ్య స్టేషన్ల పేర్లు
ఎ-1 కేటగిరీ 3 విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి
కేటగిరీ 21 శ్రీకాకుళం రోడ్డు, విజయనగరం, అనకాపల్లి, తుని, సామర్లకోట, కాకినాడ టౌన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, భీమవరం టౌన్,ఏలూరు, తెనాలి, గుంటూరు, ఒంగోలు,చీరాల, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, గుంతకల్లు జంక్షన్, అనంతపురం, కడప, రాయచూరు, నల్గొండ, యాదగిరి
B Category 22 పాలకొల్లు, భీమవరం జంక్షన్, ఆదోని, చిత్తూరు, ధర్మవరం జంక్షన్, గుత్తి జంక్షన్, డోన్, నంద్యాల జంక్షన్, మంత్రాలయం, పాకాల డివిజన్, శ్రీకాళహస్తి, అన్నవరం, బాపట్ల†, గుడివాడ, కాకినాడ పోర్ట్, కావలి, మచిలీపట్నం†, నరసాపురం, మిర్యాలగూడ, నిదాదవోలు జంక్షన్, సింగరాయకొండ, తణుకు
C Category

(Suburban station)

దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, సింహాచలం
D Category [15] 14 వేదాయపాలెం, నిడుబ్రోలు, పవర్ పేట, కొవ్వూరు, గోదావరి, ద్వారపూడి, అనపర్తి,పిఠాపురం, నర్సీపట్నం రోడ్, ఎలమంచిలి, వీరవాసరం, ఆకివీడు, కైకలూరు,పెడన.
E Category [16] 77 Other than the above & halt stations
F Category

Halt Station

46 మర్రిపాలెం, సింహాచలం ఉత్తరం, ఇతర నిలుపు స్టేషన్లు.
Total - -


మూలాలు

మార్చు
  1. "Press Information Bureau". pib.nic.in. Retrieved 2019-02-28.
  2. "Cabinet approves South Coast Railway zone". Press Information Bureau.
  3. "గుడ్‌న్యూస్‌: విశాఖకు రైల్వే జోన్‌ (New South Coastal Railway Zone with Vizag as HQ) - Railway Enquiry". indiarailinfo.com. Retrieved 2019-02-27.
  4. "Vizag Railway Zone: Finally some good news from the centre". Visakhapatnam News, Vizag Breaking News, Andhra Pradesh, India News, Entertainment, Movies, Magazine & More... (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-12-23. Retrieved 2019-02-27.
  5. "South coast railway zone press release". Pib.nic.in. 28 February 2019.
  6. "కల ఫలించింది కానీ..!". సాక్షి. 28 Feb 2019. Archived from the original on 2019-02-28.
  7. "Guntakal Railway Division | Railway Station in Guntakal Division". www.totaltraininfo.com (in ఇంగ్లీష్). Retrieved 2019-02-27.
  8. "Visakha Express to be extended up to Paradip in Odisha?". May 21, 2014.
  9. "Vizagites oppose extension of two key trains to Palasa". 12 March 2013.
  10. "RTI activist sees red over train extension proposal". 24 September 2018.
  11. "డివిజన్‌ పోయె... ఆస్తులూ పాయె". ఆంధ్రజ్యోతి. 1 Mar 2019. Archived from the original on 2 Mar 2019.
  12. "జోన్‌ నష్టాలను సరిచేశాకే విశాఖ రండి". ఆంధ్రజ్యోతి. 1 Mar 2019. Archived from the original on 2019-03-02.
  13. "విశాఖ రైల్వే జోన్‌ సాధించాం". ఈనాడు. 28 Feb 2019. Archived from the original on 1 Mar 2019.
  14. "Statement showing Category-wise No.of stations" (PDF). Retrieved 18 January 2016.
  15. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original on 2016-01-28. Retrieved 2019-03-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  16. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original on 2016-01-28. Retrieved 2019-03-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)