కొత్తవలస రైల్వే స్టేషను

}} కొత్తవలస రైల్వే స్టేషను భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస పనిచేస్తుంది. ఇది ఇనుము ధాతువు రేక్స్‌ల (అరల) ద్వారా రవాణా చేసే ఒక ప్రధాన సరుకు రవాణా క్షేత్రంగా ఉంది. ఈ రవాణా ఛత్తీస్‌గఢ్లో రాష్ట్రంలోని కిరండల్, బైలడిల్లా చుట్టూ గనుల నుండి ప్రయాణిస్తూ విశాఖపట్నం పోర్ట్‌ వరకు ప్రయాణిస్తూ జరుగుతుంది. ఇది దేశంలో 964 వ రద్దీగా ఉండే స్టేషను.[1]

కొత్తవలస
Kothavalasa
జంక్షన్ స్టేషను
ఒక ప్లాట్‌ఫారం చూడండి
సాధారణ సమాచారం
Locationవిశాఖపట్నం-అరకు రోడ్, కొత్తవలస, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°53′30″N 83°11′09″E / 17.8917°N 83.1859°E / 17.8917; 83.1859
Elevation209 m (686 ft)
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము యొక్క ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము విభాగంలో
కొత్తవలస-కిరండల్ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలుబ్రాడ్ గేజ్ 1,676 mm (5 ft 6 in)
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషన్) ప్రామాణికం
పార్కింగ్ఉంది
Disabled accessఅవును
ఇతర సమాచారం
Statusపని చేస్తున్నది
స్టేషను కోడుKTV
జోన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
డివిజన్లు విశాఖపట్నం
History
Opened1896; 128 సంవత్సరాల క్రితం (1896)
Previous namesఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
బెంగాల్ నాగపూర్ రైల్వే
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

చరిత్ర మార్చు

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1, 288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్ల) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[2][3] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[4] తదుపరి కాలంలో 79 కిమీ (49 మైళ్ళు) విజయనగరం-పార్వతీపురం రైలు మార్గము 1908-09 సం.లో ప్రారంభించబడింది, సాలూర్ వరకు పొడిగింపును 1913 సం.లో నిర్మించారు.. పార్వతీపురం-రాయ్‌పూర్ రైలు మార్గము 1931 సం.లో పూర్తయింది.[4]

1960 సం.లో, భారతీయ రైల్వేలు మూడు ప్రాజెక్టులు చేపట్టారు:

 1. కొత్తవలస - అరకు - కోరాపుట్ - జయపూర్ - జగదల్‌పూర్ - దంతేవార - కిరండల్ రైలు మార్గము
 2. ఝార్సుగూడ - సంబల్‌పూర్ - బార్‌ఘర్- బలంగీర్ - టిట్లఘర్ ప్రాజెక్ట్,
 3. భిరమిత్రపూర్ - రూర్కెలా - భిమ్లఘర్ - కిరిబురు ప్రాజెక్ట్.

ఈ మొత్తం మూడు ప్రాజెక్టులు కలిసి ప్రముఖంగా డిబికే ప్రాజెక్ట్ లేదా దండకారణ్య బొలంగిర్ కిరిబురు ప్రాజెక్ట్ (దండకారణ్య ప్రాజెక్టు కింద) గా పిలిచేవారు.[5] కొత్తవలస-కిరండల్ రైలు మార్గము 1966-67 సం.లో ప్రారంభించబడింది.[6]

విద్యుద్దీకరణ (ఎలక్ట్రిఫికేషన్) మార్చు

విశాఖపట్నం - కొత్తవలస - అరకు - కోరాపుట్ - జయపూర్ - జగదల్‌పూర్ - దంతేవారా- కిరండుల్ విభాగం 1980-83 సంవత్సరంలో వీటి విద్యుద్దీకరణ జరిగింది.[7]

రైల్వే పునర్వినియోగం మార్చు

బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే 1944 సం.లో జాతీయీకరణ చేశారు.[8] ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ యొక్క మొఘల్సరాయ్ తూర్పు భాగం, బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే లతో కలిసి, తూర్పు రైల్వే 1952 ఏప్రిల్ 14 న ఏర్పడింది.[9] 1955 సం.లో, దక్షిణ తూర్పు రైల్వేను ఈస్టర్న్ రైల్వే నుండి ఏర్పరచారు. ఇందులో ఎక్కువగా అంతకు ముందు బెంగాల్ నాగ్‌పూర్ రైల్వేచే నిర్వహించబడుతున్న రైలు మార్గములు ఉన్నాయి.[9][10]

కొత్తగా రైల్వే మండలాలు ఏప్రిల్ 2003 సం.లో ప్రారంభించారు, వాటిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులను నార్త్ ఈస్టర్న్ రైల్వే నుండి మలిచారు.

మూలాలు మార్చు

 1. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
 2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
 3. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
 4. 4.0 4.1 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
 5. Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 2012-11-27.
 6. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
 7. "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
 8. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
 9. 9.0 9.1 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
 10. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.

బయటి లింకులు మార్చు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్
ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్Terminus