బ్రాహ్మణులు

ఒక హిందూ వర్ణము
(బ్రాహ్మణుడు నుండి దారిమార్పు చెందింది)

బ్రహ్మజ్ఞాన వాంస్తు బ్రాహ్మణః అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన మన పూర్వీకులు. <poem> పాప వతనుండు బ్రాహ్మణుండయ్యును నిజము శూద్రు కంటె నీచతముడు సత్య శౌచధర్మ శాలి శూద్రుండయ్యు నతడు సద్ద్విజుండ యనిరి మునులు. శ్రీ మహా భారతం. సార్వ జన హితం, సార్వ జన సుఖం బ్రాహ్మణుని లక్ష్యం.

ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు
హిందూధర్మశాస్త్రాలు
aum symbol
వేదములు (శ్రుతులు)
ఋగ్వేదం · యజుర్వేదం
సామవేదము · అధర్వణవేదము
వేదభాగాలు
సంహిత · బ్రాహ్మణము
అరణ్యకము  · ఉపనిషత్తులు
ఉపనిషత్తులు
ఐతరేయ  · బృహదారణ్యక
ఈశ  · తైత్తిరీయ · ఛాందోగ్య
కఠ  · కేన  · ముండక
మాండూక్య  ·ప్రశ్న
శ్వేతాశ్వర
వేదాంగములు (సూత్రములు)
శిక్ష · ఛందస్సు
వ్యాకరణము · నిరుక్తము
జ్యోతిషము · కల్పము
స్మృతులు
ఇతిహాసములు
మహాభారతము · రామాయణము
పురాణములు
ధర్మశాస్త్రములు
ఆగమములు
శైవ · వైఖానసము ·పాంచరాత్రము
దర్శనములు
సాంఖ్య · యోగ
వైశేషిక · న్యాయ
పూర్వమీమాంస · ఉత్తరమీమాంస
ఇతర గ్రంథాలు
భగవద్గీత · భాగవతం
విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు
లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు
శివ సహస్రనామ స్తోత్రము
త్రిమూర్తులు · తిరుమల తిరుపతి
పండుగలు · పుణ్యక్షేత్రాలు
... · ...
ఇంకా చూడండి
మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం
ఒక గుర్ఖా బ్రాహ్మణుడు ఇంకా శూద్రుడు, 1868లో తీసిన చిత్రం

పంచ మహాపాతకాలలో బ్రాహ్మణ హత్య ఒకటి. బ్రాహ్మణులు తెలుపు రంగులో ఉండి చూడగానే గుర్తించే విధంగా ఉంటారు. వీరు చతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్ణం వారు. మడి విధానాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని ఆచరిస్తారు. మద్యపానం, మాంసాహారం వంటి దూరలవాట్లను వీరు పాటించరు.

  • సనాతన హిందూ సాంప్రదాయంలో చాతుర్వర్ణ వ్యవస్థ యందు ఉన్నతమైన వర్గం బ్రాహ్మణులు. బ్రాహ్మణులు లేదా బ్రాహ్మలు అనగా బ్రహ్మ ముఖము నుండి పుట్టిన వారు. బ్రాహ్మలు అని వాడుకలో పిలిచినప్పటికీ "బ్రాహ్మణులు" అనడం సముచితం. యజనం యాజనం దానం బ్రాహ్మణస్యప్రతిగ్రహః అధ్యాపనం చాధ్యయనం షట్కకర్మాణి ద్విజోత్తమాః. మునుల వలన ఏ జాతి స్త్రీకి జన్మించిన వారైనను బ్రాహ్మణులుగా గుర్తించబడతారు. భారతీయ మసుస్మృతి ప్రకారం క్షత్రియులు (యోధులు, చట్టం అమలు, పరిపాలకులు), బ్రాహ్మణులు (పండితులు, ఉపాధ్యాయులు, అగ్ని పూజారులు), వైశ్యులు (వ్యవసాయదారులు, పశువులు రైజర్స్, వ్యాపారులు, బ్యాంకర్లు), శూద్రులు (సేవకులు) అను నాలుగు "వర్ణాలు" లేదా తరగతులు ఉన్నాయి.
  • హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం బ్రాహ్మణుల ప్రధాన కర్తవ్యం సమాజోన్నతికి పాటుపడటం. నిరంతరం జ్ఞానార్జన చేస్తూ, వేదములయందు ప్రావీణ్యం కలవారై, సత్యనిరతిని, ధర్మ వర్తనను సమాజానికి బోధిస్తూ సమాజ అభ్యున్నతికి పాటుపడాలి. దైవ విశ్వాసాన్ని, భక్తిని పెంపొందించి సమాజాన్ని ఉత్తమ మార్గంలో నడపడం వలన వారికి సమాజంలో సముచిత గౌరవం లభించుతున్నది. వారు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి వేద, పౌరాణిక ఆధ్యాత్మిక సంబంధ విషయాలపై మంచి అవగాహనను కలిగి ఉంటారు.
  • బ్రాహ్మణులను ""విప్ర"" ("ప్రేరణ"), లేదా ""ద్విజ"" ("రెండుసార్లు జన్మించిన") అని కూడా పిలుస్తారు. ఆధునిక వాడుక భాషలో అందరూ "" బ్రాహ్మణులు"" అయినప్పటికీ, ప్రాంతీయ మత ఆచార సాంప్రదాయ వ్యవహారములు, వేద పాఠశాలలు (శాఖలు) వలన వారు ఇంకా వివిధ ఉప కులాల వారీగా విభజించబడ్డారు. బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా ఆలయం పూజారులు అయిననూ బ్రాహ్మణులు అందరూ అగ్ని (హోత్ర) పూజారులు కారు. నేడు చాలా కొద్ది మంది బ్రాహ్మణులు మాత్రం వేద విద్య నేర్చుకోవడం, సన్యాస, నిరాడంబరంగా దేశంలో పురోహితుల విధులు నిర్వర్తించుతున్నారు. పురాతన భారత సామాజిక నిర్మాణం పతనం కారణంగా, వివిధ వృత్తులు, ఉద్యోగాలకు (బ్రిటిష్ వారి ద్వారా తేబడినవి) బ్రాహ్మణులు అవకాశములు వెతుక్కున్నారు. వారి బోధన, జ్ఞానము నకు గుర్తింపుగా ఉపకారవేతనాలు, బహుమతుల ద్వారా వారికి మద్దతు లభించింది. అప్పటి నుండి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు బ్రాహ్మణుల వలసలు ఉన్నాయి.

చరిత్ర

మార్చు
  • పురాణాల ప్రకారం, బ్రాహ్మణ వర్గం బ్రాహ్మణి యొక్క భర్త అయిన బ్రహ్మ సృష్టి. ఆధునిక బ్రాహ్మణులు పలు (మత) సంప్రదాయాలకు వేదాల నుండి ప్రేరణ పొందామని పేర్కొంటున్నారు. వేదాలు బ్రాహ్మణులకు జ్ఞానం యొక్క ప్రధాన వనరుగా చెబుతారు. హిందూ మత సాంప్రదాయం ప్రకారం, వేదాలు అపౌరుషేయాలు, అనాది (ప్రారంభం-లేనివి).
  • బ్రాహ్మణుల చరిత్ర చూడుము

జెనెటిక్స్

మార్చు
 
Distribution of R1a (purple) and R1b (red).
  • ద్రావిడ మాట్లాడే వారి యొక్క సహా తెగలు అయిన చెంచు, వాల్మీకి వారిది ఆంధ్ర ప్రదేశ్.
  • R1a వివిధ సంబంధం ఉంది:
  • . లేట్ గ్లేషియల్ మాగ్జిమం సమయంలో యురేషియా యొక్క మళ్లీ వలసలు;
  • కుర్‌గాంవ్ పరికల్పన|కుర్‌గాంవ్ విస్తరణలో యొక్క భాగంగా అప్పటి నుండి పొంటిక్-కాస్పియన్ స్టేప్పే ప్రజలకు, ఇది ఇండో యూరోపియన్ భాషల యొక్క వ్యాప్తికి సంబంధం ఏర్పడింది.
  • R1a1 (M17) కోసం ఆధునిక అధ్యయనాలు తదుపరి ఇది దక్షిణ ఆసియాలో ఉద్భవించింది అయి ఉండవచ్చని సూచించారు. ప్రారంభంలో దాని మార్గం దొరకపోయి ఉండవచ్చు.
  • మొదటిసారిగా పశ్చిమ భారతదేశం లోని గుజరాత్ నుండి పాకిస్తాన్, కాశ్మీర్ ద్వారా దారిలో మధ్య ఆసియా, రష్యా, నుండి చివరకు ఐరోపా వచ్చినట్లుగా, 30,000 సంవత్సరాల క్రితం తూర్పు నుండి పడమరకు ఒక తేదీన పురావస్తు ప్రాచీన శిలా యుగము యొక్క ఉద్యమం లోని భాగంగా తెలుస్తున్నది.

బ్రాహ్మణ శాఖలు

మార్చు
  • బ్రాహ్మణ కులాలు విస్తారంగా రెండు ప్రాంతీయ సమూహాలుగా విభజించవచ్చు:
कर्णाटकाश्च तैलंगा द्राविडा महाराष्ट्रकाः,
गुर्जराश्चेति पञ्चैव द्राविडा विन्ध्यदक्षिणे ||
सारस्वताः कान्यकुब्जा गौडा उत्कलमैथिलाः,
पन्चगौडा इति ख्याता विन्ध्स्योत्तरवासिनः ||
  • ఈ పై శ్లోకం ద్వారా, ఉత్తర భారతదేశం, ఉత్తర వింధ్య పర్వతాలుకు చెందిన వారిని స్మార్త పంచ గౌడ సరస్వతి గౌడ బ్రాహ్మణులు గా, దక్షిణ వింధ్య పర్వతాలు చెందిన వారిని పాంచ ద్రావిడ బ్రాహ్మణులు గా భావించారు. అయితే, ఈ శ్లోకం మాత్రం కల్హణ లోని రాజతరంగిణికి సంబందిచినది, ఇది 11 వ శతాబ్దం CE లో రచించిన, కూర్చింది.
  • అనువాదం: కర్ణాటక (కన్నడ), తెలుగు (ఆంధ్ర), ద్రావిడ (తమిళ్, కేరళ), మహారాష్ట్ర, గుజరాత్ అను ఐదు దక్షిణాది (పాంచ ద్రావిడ)లు ఉన్నారు. అలాగే సారస్వత, కన్యాకుబ్జము, గవుడ, ఉత్కళ్ (ఒడిషా), మైథిలి అను ఐదు ఉత్తరాది (పాంచ గౌడ)లు ఉన్నారు. ఈ వర్గీకరణ రాజతరంగిణి యొక్క కల్హణలో లేదా దానికి ముందువి ఉన్న కొన్ని శాసనాలలో జరుగుతుంది

పంచగౌడ

మార్చు
  • ఉత్తరప్రాంతీయులు (""ఆర్యావర్తులు"") అనగా (ఉత్తర భారత దేశం/ఉత్తరాది, తూర్పు భారతదేశం) నుండి వలస వచ్చిన వారు. కౌండిన్యుడు ఒక గొప్ప వేద పండితుడు. ఇతను వశిష్టుడి వంశంలో జన్మించినవాడు. ఇతని పేరు మీద గోత్రం పుట్టింది. కౌండిన్య గోత్రోద్భవులు ఇప్పుడు చెప్పబడుతున్న గౌడులు, వీరు నిజానికి వైదిక బ్రాహ్మణులు వీరికి ఉపనయన సంస్కారాలు ఉండేవి. ఇప్పటికి కూడా ఉత్తరభారతావనిలో గౌడ సారస్వత బ్రాహ్మణులుగా పిలువబడుతారు. వీరు చరిత్రలో గల కొన్ని అనివార్య కారణాల వలన వీరు దక్షిణాదికి వలస వెళ్లి వారి బ్రాహ్మణత్వాన్ని విడిచి కొందరు, విడువక కొందరు ద్రావిడ బ్రాహ్మణులుగా ఉన్నారు. బ్రాహ్మణత్వాన్ని విడిచిన వారు తెలంగాణా, ఆంధ్రా ప్రాంతాల్లో సురాపానం తీసే పనిలో ఉన్నారు. కొందరు ఉపనయనముల గావించుకొని పౌరోహిత్యాన్ని ఆచరిస్తున్నారు.'
  • ఉత్కళ్ బ్రాహ్మణులు
  • పండిట్ హరికృష్ణ శాస్త్రి రచించిన ""బ్రాహ్మణోత్పత్తి-మార్తాండ"" అనే సంస్కృత మూలమైన గ్రంథ పుస్తకము నందు పేర్కొన్న ప్రకారం, ఉత్కళ దేశపు రాజు కొంతమంది గంగానది తీర ప్రాంతము బ్రాహ్మణులను ఒక యజ్ఞము, పూరి జగన్నాథ్, ఒడిషా నందు నిర్వహించేందుకు ఆహ్వానించటము; ఆహ్వానింపబడ్డ బ్రాహ్మణులు ఆ యజ్ఞము పూర్తి చేసిన పిదప, వారే అక్కడ దైవ పూరి జగన్నాథుడుకు సంబందించిన పునాది వేయడము, వలస వచ్చిన బ్రాహ్మణులు (వారు) దైవ పూరి జగన్నాథుడుకు, ఒడిషా, జార్ఖండ్, మేదినీపూర్ చుట్టుపక్కల దైవ సేవలు చేసుకుంటూ అక్కడే స్థిర పడి పోవడము జరిగింది అని తెలుస్తున్నది.
  • ఉత్కళ బ్రాహ్మణులు ""స్తోత్రీయ (వైదిక) బ్రాహ్మణులు"", ""అస్తోత్రీయ లేదా సేవయత బ్రాహ్మణులు"", ""హలూవ బ్రాహ్మణులు"" అను మూడు శాఖలు (తరగతులు)గా ఉన్నారు. మళ్ళీ ఈ మూడు శాఖలు (తరగతులు) లో ఉప శాఖ (తరగతులు)లు ఉన్నాయి.

బ్రాహ్మణ (మిథిల)

మార్చు
  • మైథిలి బ్రాహ్మణులు

పంచ-ద్రావిడ (ఫైవ్ దక్షిణ)

మార్చు
  • ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణులు విస్తారంగా 2 సమూహాలుగా వర్గీకృతమయి ఉన్నాయి:
  • వైదీక బ్రాహ్మణులు/వైదిక బ్రాహ్మణులు (వేదాలు అభ్యసించడము, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు ,(విష్ణుమూర్తి ఆలయ పూజారులు), నియోగీ/నియోగి బ్రాహ్మణులు ( కరణీకం వంటి లౌకిక ఉద్యోగం చేస్తూన్న వారు మాత్రమే ). వీరందరూ మరింత ఉప కులాలగా అనేకంగా విభజించబడ్డారు. అయితే, బ్రాహ్మణులలో ఎక్కువమంది, వైదీకులు, నియోగి/కరణాలు, అనే రెండు శాఖలు మాత్రమే లౌకిక వృత్తులలో పాల్గంటూ ఆచరించుతూ ఉన్నారు[ఆధారం చూపాలి].
  • అలానె "శివార్చకులు" అనే శాఖ ముఖ్యముగా శివాలయాలలో పూజారులుగా శివార్ఛనా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు.
  • వైదీకీ బ్రాహ్మణులు తదుపరి మరింతగా వైదికి వెలనాడు/వెలనాట్లు, వేంగినాడు/వేంగినాడ్లు, ములకనాడు/ములకనాట్లు, కోసలనాడు/కోసలనాట్లు తదితర బ్రాహ్మణులు, ఉపశాఖలుగా విభజించబడ్డారు.
  • "ద్రావిడ" అనే మరొక ఉప శాఖ ఆంధ్రప్రదేశ్‌నకు వలస వచ్చిన తమిళ బ్రాహ్మణులు ద్వారా ఏర్పడినది.
  • గుజరాత్ బ్రహ్మణులు, వీరిలో రెండు ఉపశాఖలు సెంట్రల్ ప్రావిన్సెస్ గుర్తించవచ్చు. మొదటి శాఖ పేరు ఖేద్‌వాలా బ్రాహ్మణులు, ఖేద అనేది గుజరాత్ లో ఒక గ్రామం పేరు కలిగి ఉంది. ఈ శాఖలోని వీరు, ఒక కచ్చితమైన, ఆచారబద్ధమైన తరగతి వారే కాక ఒక మంచి ఉన్నత స్థానమును పొంది ఉన్నారు. రెండ శాఖ వారు నాగర్ బ్రాహ్మణులు. వీరు నిమార్, చుట్టు ప్రక్కల ప్రాంతాలలో గ్రామ పూజారులుగాను, జ్యోతిష్కులుగానూ అనాది (ఎంతోకాలం)గా స్థిర పడ్డవారు. వీరి సాంఘిక స్థితి మాత్రం ఏవిధముగా నయిననూ కొంత లేదా కొద్దిగా తక్కువ స్థాయిలో ఉంటుంది.
  • దేశస్థ బ్రాహ్మణులు
  • చిత్‌పవన బ్రాహ్మణులు (కొంకణస్థ)
  • కర్‌హద బ్రాహ్మణులు
  • దేవరుఖీ బ్రాహ్మణులు
  • దైవజ్ఞ బ్రాహ్మణులు
  • సరస్వత బ్రాహ్మణులు
  • deshastha viswabrahmins
  • అయ్యంగార్లు శాఖ తదుపరి (వడకళ్ళై, టెన్‌కాల్లై లోకి ఉప శాఖలుగా విభజించబడింది)
  • పండితులు లేదా అయ్యర్లు లేదా అయ్యర్ శాఖ (వడమ, వత్తిమ, బ్రహచరణం, అష్టసహస్రం, గురుకల్ బ్రాహ్మణులు/గురుకల్ దీక్షితార్, కనియలార్, ప్రథమశాఖి, ద్రావిడ బ్రాహ్మణులు) లోకి మరింత ఉప శాఖలుగా విభజించబడింది,
  • నంబూద్రి బ్రాహ్మణులు
  • కేరళ పండితులు
  • కేరళ శ్రీవల్లీ తుళు బ్రాహ్మణులు/ఎంబ్రాన్‌త్రి
  • పుష్పక బ్రాహ్మణులు (అంబలవాసులు)
  • శారద బ్రాహ్మణులు
  • deshastha viswabrahmins
  • నాగరిక బ్రాహ్మణులు లేదా ఉత్తర భారతదేశం నుండి బ్రాహ్మణ వలసదారులు

గోత్రములు, ప్రవరలు

మార్చు
  • సాధారణంగా వీరిలోని ఏ వ్యక్తి గోత్రము అయిననూ వారి పూర్వీకులు మగవారి వంశానుక్రమం, వంశము, మగ సంతతి, తరము, జన్మము, ఇత్యాదులను ఎఱుక చేస్తూన్న వంశ పరంపరలో ఒక సముదాయ ఉమ్మడి పూర్వీకుని ఆధారముగా తెలియఁజేస్తూ సూచించుతుంది. వీరిలోని ఏ వ్యక్తి అయిననూ ""నాది "'భారద్వాజస"' గోత్రం"" అని చెప్పిన, వంశానుక్రమం, వంశము, ఉత్పత్తి, జన్మము, ఇత్యాదులయిన "'వంశవృక్షం"' పరిశీలిస్తే అతను భరద్వాజుడు అనే ఋషి వారసుడు, వంశ పరంపర సంతతి అని అర్ధం. ఈ గోత్రాలు నేరుగా ప్రజాపతి లేదా తరువాతి బ్రహ్మకు సంబంధము లేదు.

శాఖలు, ఋషులు

మార్చు

బ్రాహ్మణులలో చాలా శాఖలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆంధ్ర ప్రదేశ్కు సంబంధించినవి.

  1. ద్రావిడులు - పూర్వం ద్రవిడ దేశం (తమిళనాడు) నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు.
  2. వైదికులు, శివార్చకులు - వీరు అసలైన స్థానికులు. వైదికులు అనగా వైదిక విద్యనభ్యసించి, వైదిక వృత్తినే తమ కులవృత్తిగా చేసుకొని జీవించేవారు. సాధారణంగా పురోహితులు, గుళ్ళల్లో పూజారులు మొదలగు వారు. మరలా పురోహితులలో రెండు రకాలవారు ఉంటారు. శుభ కార్యాలు చేయించే వారు (పెళ్ళిళ్ళు, వ్రతాలు, పూజలు మొదలగునవి చేయించే వారు), తరువాత అపరం చేయించే వారు (శ్రాద్ధ కర్మలు, తద్దినాలు చేయించేవారు).
  3. నియోగులు - నియోగులలో మరలా మూడు రకాలు - ఆరు వేల నియోగులు (కరణాలు), ప్రథమ శాఖ వారు, శిష్ట కరణాలు. ఇక ఆరువేల నియోగుల విషయానికి వస్తే, శ్రీ కృష్ణ దేవరాయల (?) కాలంలో వారి రాజ్య పరిపాలన సులభం అవడం కొరకు ఒక రాత్రికి రాత్రే ఆరు వేల మందిని గ్రామాధికారులుగా నియమింఛడం జరిగింది. అప్పుడు అలా గ్రామాధికారులుగా నియోగించబడిన వారు ఆరు వేల నియోగులుగాను, ఇంకా మిగిలిపోయిన ఆ శాఖలోని వారందరూ ప్రథమ శాఖ గానూ పిలువబడుతున్నారని వినికిడి. ఇక కళింగాంద్రలో ఉన్న కరణాలు శిష్ట కరణాలుగా, శిష్ట కరణ బ్రాహ్మనులుగా వ్యవహారం. వీరిలో ఉత్కళ ఆచార వ్యవహారాలు (మాంసాహారులు గా) కనిపిస్తుంటాయి. వీరి పేరు చివర పాత్రో, మహంతి, పట్నాయక్ అని బిరుదులూ ఉన్నాయి.
  4. వీరేగాక బ్రాహ్మణులలో ఇంకా ఆంధ్రులు', తెలగాణ్యులు, వెలనాట్లు, వేగినాట్లు, కాసనాట్లు, బడగల కరణాలు, కరణకమ్ములు, గోల్కొండ వ్యాపార్లు మొదలగు ఉప శాఖలు చాలా ఉన్నాయి. శ్రీ వైష్ణవులు, చాతాన వైష్ణవులు, వైష్ణవులు, శైవులు, లింగదారులు బ్రాహ్మణులలోని శాఖలే.

ఇతర విధులు తీసుకొనిన బ్రాహ్మణులు

మార్చు

బ్రాహ్మణులు అనగా కేవలం పురోహితం చేయువారు అనే భావన ఉన్నది కాని అది ఏ మాత్రం నిజము కాదు.ఉపాధ్యాయులు, పండితులు,పురోహితులు,మంత్రులు,ఆచార్యులు ఇలా చాలా వృత్తులు ఉన్నాయి.

పధ్ధతులు

మార్చు
 
పురాణములను భొధిస్తున్న బ్రాహ్మణుడు

బ్రాహ్మణులు పౌరోహిత్యము,అర్చకత్వం, హోమం లేక యజ్ఞాలు నిర్వహించడం, అపర కర్మలు చేయించడం,బ్రాహ్మణ మడి వంటలు వండడం,ఇంకా వ్యవసాయం, ఉద్యోగం మొదలైన పనులు చేస్తూ జీవనం సాగిస్తారు.

సంప్రదాయములు

మార్చు

నాలుగు సంప్రదాయములు ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. అవి (1) "వైఖానస " (2)"స్మార్త" సంప్రదాయము, (3) "శ్రీవైష్ణవ" సంప్రదాయము, (3). "మధ్వ" సంప్రదాయము అని మూడు రకములైన బ్రహ్మణ సంప్రదాయములు ఉన్నాయి.

1.వైఖానసం: వీరిని ఆదివైష్ణవులు..అని వ్యవహరిస్తారు. వీరి ప్రస్తావన పద్మపురాణంలో ఉంది.వైఖానస సాంప్రదాయం ప్రకారం ఋషి విఖనసుడు మహావిష్ణువు యొక్క అంశతో జన్మించారు. బ్రహ్మతో పాటుగానే ఇతనికి ఉపనయనం జరిగింది. మహావిష్ణువే గురువుగా సమస్త వేదాలు, భగవత్ శాస్త్రాన్ని అభ్యసిస్తాడు. ఆపై భూమి మీదకి నైమిశారణ్యం వద్దకు వస్తాడు. అక్కడ వైఖానస కల్పసూత్రాన్ని రచించి తన నలుగురు శిష్యులైన అత్రి, భృగువు, కశ్యపుడు, మరీచికి ఉపదేశిస్తాడు. అత్రికి సమూర్తార్చన, భృగువుకి అమూర్తార్చన, కశ్యపుడికి తర్కం-జపం,, మరీచికి అగ్ని హుతం పై ఉపదేశాలు చేస్తాడు. వైఖానసుల ప్రకారం వైదిక హవిస్సు క్రతువునే వీరు కొనసాగిస్తున్నారు. యాగం చేస్తూ అగ్నిలో హవిస్సులు పోస్తే వచ్చే ఫలితమే వైష్ణవారాధాన ద్వారా వస్తుందని నమ్ముతారు. విష్ణువు యొక్క ఐదు రూపాలను వీరు కొలుసారు -

విష్ణువు - సర్వాంతార్యామియైన దేవాదిదేవుడు పురుషుడు - జీవితం యొక్క సూత్రము సత్యము - దైవం యొక్క మారని అంశం అచ్యుతుడు - మార్పు చెందని వాడు అనిరుద్ధుడు - ఎన్నటికీ తరగని వాడు. శ్రీరాముని కళ్యాణం వైఖానస విధిగా జరిగింది అని రామాయణం చెబుతోంది..

స్మార్తులు

మార్చు
  • స్మార్త సంప్రదాయము, స్మార్త ఆచారం, అనేది సంస్కృతం నుండి ఉద్భవించింది. ఒక ఆధునిక లేదా శాఖలు లేని హిందూ మతము లోని మతసాంప్రదాయంగా, విలువ కలిగిన వారు. వీరు దాదాపుగా అందరు హిందూ దేవతలను పూజిస్తారు అంగీకరిస్తారు. వేదాలు, శాస్త్రాలు అనుసరించే అనుచరులుగా స్మార్త అనే పదము సూచిస్తుంది.వీరు శ్రీ ఆదిశంకరాచార్యులవారిచేత ప్రతిపాదిపబడిన అద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తారు.

శ్రీ వైష్ణవ సంప్రదాయం

మార్చు
  • దక్షిణ భారతదేశంలో శ్రీమద్ రామానుజాచార్యులు వారు ఇచ్చిన భక్తి మార్గం,పన్నిద్రాళ్వార్ లు అనగా, 12 మంది సన్యాసించిన (పీఠాధిపతులు) వారి ప్రబోధనల ద్వారా శ్రీవైష్ణవ సంప్రదాయము వృద్ధి జరిగింది.శ్రీ వైష్ణవులు భగవద్రామానుజుల చేత ప్రతిపాదింపబడిన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తారు!వీరు శ్రీ మహా విష్ణువును, వారి అవతారాలను పరమాత్మగా భావిస్తారు.ఇతర దేవతలను విష్ణువు యొక్క వివిధ రూపాలుగా భావించి కొలుస్తారు. పాంచరాత్ర, ఆళ్వార్ ల ఆరాధన ముఖ్యమైనవి. "శ్రీ" అంటే లక్ష్మిదేవి, వైష్ణవ అంటే "విష్ణువు" !శ్రీరంగం, తిరుమల,భద్రాచలం,సింహాద్రి మదలైనవి శ్రీ వైష్ణవుల క్షేత్రాలు!!వీరు ఊర్థ్వ పుండ్రాలను అనగా నామాలను అనగా నిలువు బొట్టును నుదుటిన ధరిస్తారు. వీరిలో శ్రీవైష్ణవ, వైఖానస,చాత్తాది శ్రీవైష్ణవ మదలైన ఉపశాఖకు కూడా ఉన్నాయి.

మధ్వ సంప్రదాయం

మార్చు
  • దక్షిణ భారతదేశంలో శ్రీమద్ మధ్వాచార్యులు వారు ఇచ్చిన భక్తి మార్గం, సన్యాసించిన (పీఠాధిపతులు) వారి ప్రబోధనల ద్వారా మధ్వ సంప్రదాయము లేదా సద్ వైష్ణవ సంప్రదాయం వృద్ధి జరిగింది. దీనినే బ్రహ్మ సంప్రదాయం అని కూడా అంటారు.వీరు ద్వైత సిద్ధాంతాన్ని పాటిస్తారు.

శైవులు

మార్చు
  • శైవత్వం (కొన్నిసార్లు ""శివత్వం"" అని కూడా పిలుస్తారు) అనేది ఒక నమ్మకం ఉన్న వ్యవస్థ. ఎక్కడ సర్వశ్రేష్టమైన, ముఖ్యమైన, పరమమైన భగవంతుడు అయిన శివ కొలువ బడతాడో అక్కడ వీరు ఉంటారు. వీరికి, హృదయ, మధ్య భాగము అయిన వేద సంప్రదాయం యొక్క ఒక ఉత్పన్న విశ్వాసం ఉంది. ఇటువంటి శైవ శాఖలు, పలు ఉప శాఖలు అయిన రుద్ర శైవులు, వీర శైవులు, పరమ శైవులు, ఇతర ఉప శాఖలుగా విస్తరించింది.
  • హిందూ పురాణాలలోని రామాయణం కావ్యం ఆధారముగా, లంకను పాలించిన రావణాసురుడు దైవజ్ఞ బ్రాహ్మణుడు, పండితుఁడు, వివేకి, ముని, బుధజనుఁడు, జ్ఞాని,ఋషి అయిన విశ్రవసువు యొక్క కుమారుడు, పండితుడు, మహా తెలివైనవాడు, ముని, బుద్ధిమంతుడైన. విజ్ఞాని. జ్ఞానంగల పులస్త్య మహర్షి యొక్క మనవడు.

ఇతరాలు వర్గములు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

ఇతర పఠనాలు

మార్చు
  • Swami Sahajanand Saraswati Rachnawali (Selected works of Swami Sahajanand Saraswati), Prakashan Sansthan, Delhi, 2003.
  • Baldev Upadhyaya, Kashi Ki Panditya Parampara, Sharda Sansthan, Varanasi, 1985.
  • M.A. Sherring, Hindu Tribes and Castes as Reproduced in Benaras, Asian Educational Services, New Delhi, First ed 1872, new ed 2008.
  • Jogendra Nath Bhattacharya, Hindu Castes and Sects, Munshiram Manoharlal, Delhi, first edition 1896, new edition 1995.
  • E.A.H.Blunt, The Caste System of North India, S.Chand Publishers, 1969.
  • Christopher Alan Bayly, Rulers, Townsmen, and Bazaars: North Indian Society in the Age of British Expansion, 1770–1870, Cambridge University Press, 1983.
  • Anand A. Yang, Bazaar India: Markets, Society, and the Colonial State in Bihar, University of California Press, 1999.
  • Acharya Hazari Prasad Dwivedi Rachnawali, Rajkamal Prakashan, Delhi.
  • Bibha Jha's PhD thesis Bhumihar Brahmins: A Sociological Study submitted to the Patna University.
  • M. N. Srinivas, Social Change in Modern India, Orient Longman, Delhi, 1995.
  • Mahavir Prasad Dwivedi essays.

మూలాలు

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బ్రాహ్మణులు వారి పూర్వం వారు ఉండే పద్ధతులు మరియూ వారి ఆచారములు మున్నగు ప్రాచీన విషయములు గురించి మీకు తెలిసిన వాటిని ఇక్కడ భద్రపరచండి. వేణుగోపాల్ నండూరి.