సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాటల జాబితా
సిరివెన్నెల సీతారామశాస్త్రి (1955-2021)గా సుపరిచితుడైన చెంబోలు సీతారామశాస్త్రి ఒక తెలుగు సినిమా గేయరచయిత. ఇతడు 3000కు పైగా సినిమా పాటలను వ్రాశాడు. ఇతని సినిమా పాటలకు ఉత్తమ గేయ రచయితగా 11 నంది పురస్కారాలు, 4 ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు అనేక ఇతర అవార్డులు లభించాయి. 2019లో భారత ప్రభుత్వం ఇతడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.[1]
సినిమా పాటల జాబితా
మార్చుసీతారామశాస్త్రి 3000కు పైగా తెలుగు సినిమా పాటలు వ్రాశాడు. వాటి జాబితా సంవత్సరం వారీ ఈ క్రింది లంకెలలో చూడవచ్చు.
|
ఇతడు వ్రాసిన సినిమా పాటలలో ఇతనికి ఉత్తమ గేయ రచయితగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత నంది పురస్కారం తెచ్చిపెట్టిన పాటల వివరాలు ఈ క్రింది పట్టికలో.
సంవత్సరం | సినిమా | పాట | సంగీత దర్శకుడు | గాయకులు |
---|---|---|---|---|
1986 | సిరివెన్నెల | "విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం" [2] | కె.వి.మహదేవన్ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల |
1987 | శ్రుతిలయలు | "తెలవారదేమో స్వామీ తెలవారదేమో స్వామీ నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలుమంగకూ" | కె.వి.మహదేవన్ | కె. జె. ఏసుదాసు/పి.సుశీల |
1988 | స్వర్ణకమలం | "అందెల రవమిది పదములదా అంబరమంటిన హృదయముదా అమృతగానమిది పెదవులదా అమితానందపు ఎదసడిదా" [3] | ఇళయరాజా | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్ |
1993 | గాయం | "సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకనీ సుఖాన మనలేని వికాసమెందుకనీ" [4] | శ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
1994 | శుభలగ్నం | "చిలకా ఏ తోడు లేక ఎటేపమ్మా ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక" [5] | ఎస్.వి.కృష్ణారెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
1996 | శ్రీకారం | "మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు కనుల నీరు తుడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు" [6] | ఇళయరాజా | కె. జె. ఏసుదాసు |
1997 | సింధూరం | "అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా ? స్వర్ణోత్సవాలు చేద్దామా?" [7] | శ్రీ | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
1999 | ప్రేమకథ | "దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు" [8] | సందీప్ చౌతా | అనురాధ శ్రీరామ్, రాజేష్ |
2005 | చక్రం | "జగమంత కుటుంబం నాది… ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే.. సన్యాసం శూన్యం నావే" [9] | చక్రి | శ్రీ |
2008 | గమ్యం | "ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అని అడక్కు గమనమే నీ గమ్యమైతే బాటలోనే బ్రతుకు దొరుకు" [10] | అనిల్, ఇ.ఎస్.మూర్తి | రంజిత్ |
2013 | సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు | "మరీ అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా పనేం తోచక పారేశానుగా గడబిడ పడకు అలా" [11] | మిక్కీ జె. మేయర్ | శ్రీరామచంద్ర |
మూలాలు
మార్చు- ↑ సనా షకీల్ (26 January 2019). "Here is the complete list of Padma awardees 2019". The New Indian Express. Archived from the original on 19 డిసెంబరు 2021. Retrieved 19 December 2021.
- ↑ కొల్లూరి భాస్కరరావు. "సిరివెన్నెల - 1986". ఘంటసాల గళామృతము. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "స్వర్ణకమలం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 18 డిసెంబరు 2021. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "గాయం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "శుభలగ్నం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.[permanent dead link]
- ↑ వెబ్ మాస్టర్. "మనసు కాస్త కలత పడితే". 10to5. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "సింధూరం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 1 January 2022.
- ↑ వెబ్ మాస్టర్. "Prema Katha". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "చక్రం". సిరివెన్నెల భావలహరి. Archived from the original on 12 డిసెంబరు 2021. Retrieved 1 January 2022.
- ↑ నాగార్జున. "గమ్యం". సిరివెన్నెల భావలహరి. Retrieved 1 January 2022.[permanent dead link]
- ↑ వెబ్ మాస్టర్. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు". లిరిక్స్ టేప్. Retrieved 1 January 2022.