పీరియడ్ 3 మూలకం
ఆవర్తన పట్టికలో పీరియడ్ 3 |
పీరియడ్ 3 మూలకం అనేది రసాయన మూలకాల ఆవర్తన పట్టికలోని మూడవ అడ్డు వరుస (పీరియడ్) లోని రసాయన మూలకాలలో ఒకటి. మూలకాల పరమాణు సంఖ్య పెరిగేకొద్దీ వాటి రసాయన ప్రవర్తనలో పునరావృతమయ్యే (ఆవర్తన) ధోరణులను వివరించడానికి ఆవర్తన పట్టికను అడ్డు వరుసలలో రూపొందించారు. రసాయన ప్రవర్తన పునరావృతం కావడం మొదలైనప్పుడు కొత్త వరుస ప్రారంభమవుతుంది. అంటే ఒకే విధమైన ప్రవర్తన కలిగిన మూలకాలు ఒకే నిలువు వరుసలో వస్తాయి.
మూడవ పీరియడ్లో సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, భాస్వరం, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్ అనే ఎనిమిది మూలకాలున్నాయి. సోడియం మెగ్నీషియంలు ఆవర్తన పట్టిక లోని s-బ్లాక్‌లో సభ్యులు కాగా, మిగిలినవి p-బ్లాక్‌లో సభ్యులు. పీరియడ్ 3 మూలకాలన్నీ ప్రాకృతికంగా లభించేవే. వీటన్నిటికీ కనీసం ఒక స్థిరమైన ఐసోటోప్ ఉంది. [1]
పరమాణు నిర్మాణం
మార్చుపరమాణు నిర్మాణపు క్వాంటం మెకానికల్ వివరణలో, ఈ పీరియడ్ మూడవ (n = 3) షెల్‌లోని ఎలక్ట్రాన్‌ల నిర్మాణానికి అనుగుణంగా ఉంటుంది. మరింత ప్రత్యేకంగా దాని 3s, 3p సబ్‌షెల్‌లను నిండుతాయి. ఒక 3d సబ్‌షెల్ ఉంది గానీ, Aufbau సూత్రానికి అనుగుణంగా ఇది పీరియడ్ 4 వచ్చే వరకు నిండదు. పీరియడ్ 2 మూలకాల లాగానే ఇందులోనూ 8 మూలకాలు, అదే ఖచ్చితమైన క్రమంలో ఉంటాయి. పీరియడ్ 2 మాదిరిగానే ఈ పీరియడ్‌కు కూడా ఆక్టెట్ నియమం సాధారణంగా వర్తిస్తుంది.
మూలకాలు
మార్చుమూలకం | # | చిహ్నం | బ్లాక్ | ఎలక్ట్రాన్ కాన్ఫిహ్గరేషను |
---|---|---|---|---|
సోడియం | 11 | Na | s-బ్లాక్ | [Ne] 3s1 |
మెగ్నీషియం | 12 | Mg | s-బ్లాక్ | [Ne] 3s2 |
అల్యూమినియమ్ | 13 | Al | p-బ్లాక్ | [Ne] 3s2 3p1 |
సిలికాన్ | 14 | Si | p-బ్లాక్ | [Ne] 3s2 3p2 |
భాస్వరం | 15 | P | p-బ్లాక్ | [Ne] 3s2 3p3 |
గంధకం | 16 | S | p-బ్లాక్ | [Ne] 3s2 3p4 |
క్లోరిన్ | 17 | Cl | p-బ్లాక్ | [Ne] 3s2 3p5 |
ఆర్గాన్ | 18 | Ar | p-బ్లాక్ | [Ne] 3s2 3p6 |
సోడియం
మార్చుసోడియం (చిహ్నం Na ) ఒక మృదువైన, వెండి లాంటి తెలుపు రంగులో, అత్యంత రియాక్టివుగా ఉండే లోహం. ఇది క్షార లోహాలలో ఒకటి; దాని ఏకైక స్థిరమైన ఐసోటోప్ 23Na. ఇది ఫెల్డ్‌స్పార్స్, సోడలైట్, రాక్ సాల్ట్ వంటి అనేక ఖనిజాలలో సమృద్ధిగా ఉండే మూలకం. సోడియం యొక్క అనేక లవణాలు నీటిలో బాగా కరుగుతాయి. అందువల్ల భూమి పైని నీటి వనరుల్లో గణనీయమైన పరిమాణంలో ఉంటుంది. మహాసముద్రాలలో సోడియం క్లోరైడ్ రూపంలో ఎక్కువగా ఉంటుంది.
మెగ్నీషియం
మార్చుమెగ్నీషియం (చిహ్నం Mg ) క్షార మృత్తిక లోహం. దీని సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి పైపెంకులో అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో ఎనిమిదవది, [2] విశ్వంలో తొమ్మిదవది. మెగ్నీషియం మొత్తం భూగ్రహంలో నాల్గవ అత్యంత సాధారణ మూలకం (ఇనుము, ఆక్సిజన్, సిలికాన్ ల తరువాత). ఇది గ్రహం ద్రవ్యరాశిలో 13%, గ్రహం యొక్క మాంటిల్‌లో ఎక్కువ భాగం ఉంటుంది. మూడు హీలియం కేంద్రకాలను కార్బన్‌కు (స్వయంగా కార్బన్ కూడా మూడు హీలియం కేంద్రకాల నుండే తయారవుతుంది) చేర్చి సూపర్నోవాలలో ఇది సులభంగా ఏర్పడుతుంది కాబట్టి ఇది సాపేక్షంగా సమృద్ధిగా ఉంటుంది. నీటిలో మెగ్నీషియం అయాన్ యొక్క అధిక ద్రావణీయత కారణంగా, ఇది సముద్రపు నీటిలో అత్యధికంగా కరిగి ఉండే మూలకాల్లో మూడవది. [3]
అల్యూమినియం
మార్చుఅల్యూమినియం (చిహ్నం అల్ ) రసాయన మూలకాల పట్టికలో బోరాన్ సమూహంలో, వెండి రంగులో, p-బ్లాక్ లో ఉండే మూలకం. కొంతమంది రసాయన శాస్త్రవేత్తలు దీన్ని పోస్ట్-ట్రాన్సిషన్ మెటల్‌గా వర్గీకరించారు. [4] సాధారణ పరిస్థితుల్లో ఇది నీటిలో కరగదు. అల్యూమినియం భూమి పైపెంకులో అత్యంత సమృద్ధిగా లభించే మూలకాల్లో ఇది మూడవది (ఆక్సిజన్, సిలికాన్ తర్వాత). ఇది భూమి ఉపరితలంలో ఘన భాగపు బరువులో 8% ఉంటుంది. అల్యూమినియం లోహం రసాయనికంగా చాలా రియాక్టివ్‌గా ఉంటుంది. అంచేత ఇది స్వస్వరూపంలో కాక, 270కి పైగా ఖనిజాలుగా లభిస్తుంది. [5] అల్యూమినియపు ప్రధాన ఖనిజం బాక్సైట్.
సిలికాన్
మార్చుసిలికాన్ (చిహ్నం Si ) ఒక గ్రూప్ 14 మెటాలాయిడ్. ఇది ఆవర్తన పట్టికలో దాని పైన ఉన్న అలోహం కార్బన్ కంటే తక్కువ రియాక్టివ్‌గా ఉంటుంది. కానీ దాని క్రింద ఉన్న మెటాలాయిడ్ జెర్మేనియం కంటే ఎక్కువ రియాక్టివుగా ఉంటుంది. సిలికాన్ పాత్ర గురించి వివాదాలు దాని ఆవిష్కరణ నుండి ప్రారంభమయ్యాయి: సిలికాన్‌ను మొదటిసారిగా 1824లో స్వచ్ఛమైన రూపంలో తయారు చేసారు. దానికి సిలీషియమ్ అనే పేరు పెట్టారు. -ium అనే పదంతొ ముగిస్తూ ఇదొక లోహం అని సూచించారు. అయితే, 1831లో పెట్టిన ప్రస్తుత పేరు కార్బన్, బోరాన్ వంటి రసాయనికంగా సారూప్య మూలకాలను ప్రతిబింబిస్తుంది.
భాస్వరం
మార్చుభాస్వరం (చిహ్నం P) అనేది నైట్రోజన్ సమూహం లోని మల్టీవాలెంట్ అలోహం. ఖనిజంగా భాస్వరం దాదాపు ఎల్లప్పుడూ గరిష్టంగా ఆక్సీకరణం చెందిన (పెంటావాలెంట్) స్థితిలో అకర్బన ఫాస్ఫేట్ శిలల రూపంలో ఉంటుంది. ఎలిమెంటల్ ఫాస్పరస్ రెండు ప్రధాన రూపాల్లో ఉంటుంది- తెల్ల భాస్వరం, ఎరుపు భాస్వరం. కానీ దాని అధిక రియాక్టివిటీ కారణంగా, భాస్వరం భూమిపై ఎప్పుడూ స్వేచ్ఛా మూలకం లాగా కనబడలేదు.
గంధకం (సల్ఫర్)
మార్చుగంధకం (చిహ్నం S) సమృద్ధిగా లభించే మల్టీవాలెంట్ అలోహం. ఇది చాల్‌కోజెన్‌లలో ఒకటి. సాధారణ పరిస్థితుల్లో, సల్ఫర్ పరమాణువులు రసాయన ఫార్ములా S8 తో చక్రీయ ఆక్టాటోమిక్ అణువులను ఏర్పరుస్తాయి. ఎలిమెంటల్ సల్ఫర్ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు ప్రకాశవంతమైన పసుపు స్ఫటికాకారంలో ఉంటుంది. రసాయనికంగా, సల్ఫర్ ఆక్సిడెంట్ లేదా రెడ్యూసింగ్ ఏజెంట్‌గా చర్య తీసుకోవచ్చు. ఇది కార్బన్‌తో సహా చాలా లోహాలు అనేక అలోహాలను ఆక్సీకరణం చేస్తుంది. ఇది చాలా ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలలో ప్రతికూల చార్జ్‌కు దారితీస్తుంది. అయితే ఇది ఆక్సిజన్, ఫ్లోరిన్ వంటి అనేక బలమైన ఆక్సిడెంట్‌లను తగ్గిస్తుంది.
ప్రకృతిలో, సల్ఫర్ స్వచ్ఛమైన మూలకం గాను, సల్ఫైడ్, సల్ఫేట్ ఖనిజాలుగానూ లభిస్తుంది. స్వస్వరూపంలో సమృద్ధిగా ఉన్నందున, గంధకానికి పురాతన కాలం నుండీ ప్రసిద్ధి ఉంది. పురాతన గ్రీస్, చైనా, ఈజిప్టులో దాన్ని ఉపయోగించేవారు. సల్ఫర్ పొగలను ఫ్యూమిగెంట్‌లుగా ఉపయోగించారు. సల్ఫర్-కలిగిన ఔషధ మిశ్రమాలను నొప్పి నివారణగా ఉపయోగించారు. [6] 1777లో, ఆంటోయిన్ లావోసియర్ సల్ఫర్ సమ్మేళనం కాదనీ, ప్రాథమిక మూలకం అనీ శాస్త్రీయ సమాజాన్ని ఒప్పించాడు.
క్లోరిన్
మార్చుక్లోరిన్ (సింబల్ Cl ) రెండవ-తేలికపాటి హాలోజన్. ప్రామాణిక పరిస్థితులలో ఇది డైక్లోరిన్ అనే డయాటోమిక్ అణువులను ఏర్పరుస్తుంది. ఇది అత్యధిక ఎలక్ట్రాన్ అనుబంధాన్ని కలిగి ఉంది. మూలకాలన్నిటి లోకీ క్లోరిన్‌కు అత్యధిక ఎలక్ట్రోనెగటివిటీని ఉంది; అందువలన క్లోరిన్ ఒక బలమైన ఆక్సీకరణ కారకం.
ఆర్గాన్
మార్చుఆర్గాన్ (చిహ్నం Ar ) ఉత్కృష్ట వాయువులు ఉండే గ్రూపు 18లోని మూడవ మూలకం. భూమి వాతావరణంలో 0.93% తో ఆర్గాన్, మూడవ అత్యంత సాధారణ వాయువు, ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ సాధారణంగా ఉంటుంది. దాదాపు ఈ ఆర్గాన్ అంతా రేడియోజెనిక్ ఆర్గాన్-40 రూపం లోనే ఉంటుంది. ఇది భూమి పై పెంకు లోని పొటాషియం-40 క్షయం అవడంతో ఉద్భవించింది. విశ్వంలో, ఆర్గాన్-36 అనేది అత్యంత సాధారణ ఆర్గాన్ ఐసోటోప్, ఇది నక్షత్రాల్లో జరిగే న్యూక్లియోసింథసిస్ ద్వారా ఉత్పత్తి అయిన ఐసోటోప్.
మూలకాల పట్టిక
మార్చు1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Group → | ||||||||||||||||||
↓ Period | ||||||||||||||||||
3 | ||||||||||||||||||
గమనికలు
మార్చుమూలాలు
మార్చు- ↑ Period 3 Element Archived 2012-07-29 at the Wayback Machine from Scienceaid.co.uk
- ↑ Railsback, L. Bruce. "Abundance and form of the most abundant elements in Earth's continental crust" (PDF). Some Fundamentals of Mineralogy and Geochemistry. Archived (PDF) from the original on 2011-09-27. Retrieved 2008-02-15.
- ↑ Anthoni, J Floor (2006). "The chemical composition of seawater".
- ↑ Huheey JE, Keiter EA & Keiter RL 1993, Principles of Structure & Reactivity, 4th ed., HarperCollins College Publishers, ISBN 0-06-042995-X, p. 28
- ↑ Shakhashiri, Bassam Z. "Chemical of the Week: Aluminum". Science is Fun. Archived from the original on 2007-09-06. Retrieved 2007-08-28.
- ↑ Greenwood, N. N.; & Earnshaw, A. (1997). Chemistry of the Elements (2nd Edn.), Oxford:Butterworth-Heinemann. ISBN 0-7506-3365-4.