వికీపీడియా:ఈ వారపు వ్యాసం జాబితా

(వికీపీడియా:ఈ వారం వ్యాసం నుండి దారిమార్పు చెందింది)

వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను ఏరి వాటిని అందరికీ ప్రదర్శించటమే ఈ వారం వ్యాసం లక్ష్యం.

ఈ వారపు వ్యాసం

2025 26వ వారం

సింధూ నది
 

సింధూ నది భారత ఉపఖండంలో ప్రసిద్ధమయిన నది. ఇది హిమాలయాలలోని మానస సరోవరం బోకర్చు వద్ద టిబెట్దేశంలో పుట్టి కాశ్మీర్, పంజాబ్, సింధు రాష్ట్రాలలో ప్రవహించి పాకిస్తాన్‍ లోని కరాచీ సమీపంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. పాకిస్థాన్లోని అతిపెద్ద, జాతీయ నది సింధు. సింధు నదికి జీలం, చీనాబ్, రావీ, బియాస్, సట్లెజ్ ఉపనదులుగా ఉన్నాయి. ఇది ప్రవహించే ప్రాంతం అంతా అత్యంత సారవంతమైన భూమి. ఈ నదుల మీద పాకిస్తాన్ ప్రభుత్వం మంగళా ఆనకట్ట, సుక్కూలారు వంతెన, భారతదేశంలోని పంజాబులో సట్లెజ్ నది మీద భాక్రానంగల్ ఆనకట్ట వంటి భారీ ఆనకట్టలు కట్టి వ్యవసాయక్షేత్రాలకు నీటిని అందించి గోధుమ, వరి, చెరకు విరివిగా పండించడమేకాక జలవిద్యుత్తును ఉత్పత్తి చేసి పరిశ్రమలకు సరఫరా చేస్తుంది. సింధు నది పొడవు 2880 కి.మీ. సింధు నదీ లోయలో సుమారు 5,000 సంవత్సరాల ఉజ్జ్వలమైన సింధు నాగరికత వెలసి వర్ధిల్లింది. సింధూ నది టిబెట్టులోని మానస సరోవరం, కైలాస పర్వతాలనుంచి జమ్ము కశ్మీరులోని లడాఖు మీదుగా- గిల్గిట్‌, బాల్టిస్థాను నుండి పాకిస్థానులోని పంజాబు రాష్ట్రం గుండా ఆ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రవహించి కరాచీ ద్వారా అరేబియా మహా సముద్రంలో కలుస్తోంది. సింధూ నదికి సంబంధించిన అనేక ఉపనదులు భారతులోని జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌ల మీదుగా ప్రవహించి పాకిస్తాన్‌లో ప్రవేశిస్తాయి. 3,180 కిలోమీటర్ల పొడవునా ప్రవహించే సింధూనది వార్షిక నీటిప్రవాహం ప్రాతిపదికన ప్రపంచంలో 21వ అతి పెద్ద నదిగా గుర్తింపు పొందింది. చైనా, భారత్‌, ఆఫ్ఘనిస్థాన్‌, పాకిస్థాన్‌ల మీదుగా ప్రవహించే ఈ జీవనది పరీవాహక ప్రాంతం మొత్తం 11,65,000 చదరపు కిలోమీటర్లు. వార్షిక ప్రవాహ లెక్కల ప్రకారం సింధు నది ప్రపంచంలో కెల్లా 21వ అతిపెద్ద నదిగా రికార్డు నమోదు చేసింది. భారత పాకిస్తానులు సింధు నదీ జలాలను వినియోగించుకునేందుకు ఒక అంతర్జాతీయ నీటి పంపక ఒడంబడికను కుదుర్చుకున్నాయి.
(ఇంకా…)




ప్రతిపాదించడం

క్రింద ఇవ్వబడిన సూచనలు గమనించి, మీరు ప్రతిపాదించ దలచుకొన్న వ్యాస చర్చాపేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} అన్న మూసను ఉంచండి. ఏదైనా వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా మొదటిపేజీలో ప్రదర్శించాలంటే, దానికి కింది అర్హతలుండాలి

  • వ్యాసం కనీసం ఐదు కిలోబైట్లకు మించి ఉండాలి. 10 కిలోబైట్లకు మించి ఉంటే ఇంకా మంచిది.
  • వ్యాసం గతంలో ఎపుడైనా విశేష వ్యాసముగాగానీ, ఈ వారం వ్యాసంగా కానీ ప్రదర్శింపబడి ఉండరాదు (ఇదివరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడినా, ఆ తరువాత కాలములో వ్యాసపు నాణ్యత గణనీయంగా పెరిగి ఉన్నా, లేదా విశేష వ్యాసం స్థాయికి చేరుకొని ఉన్నా, ఈ నియమానికి వెసులుబాటు ఇవ్వవచ్చు).
  • వ్యాసంలో అనువదించవలసిన భాగాలు ఉండరాదు. ఒకవేళ కొన్ని చిన్న చిన్న అనువాదాలు చేయవలసి ఉండీ పరిగణనలో చేర్చినా, మొత్తం వ్యాసం అనువదించే వరకు ఈ వారం వ్యాసంగా ప్రదర్శింపబడదు. సాధారణంగా అనువాదం చేయవలసిన భాగాలున్న వ్యాసాలను జాబితాలో చేర్చకండి.
  • వ్యాసంలో కనీసం ఒక సంబంధిత బొమ్మ అయినా ఉండాలి.

తెలుగు వికీపీడియా రాశి, వాసి పెరిగే కొలది సభ్యులు చర్చించి అదనపు నియమాలను ప్రకటించవచ్చు.


వ్యాసం వార నిర్ణయం

పండగలు, చారిత్రాత్మక రోజులు, ప్రస్తుత ఘటనలకు సంబంధించిన విషయాలను బట్టి వారం వ్యాసాన్ని నిర్ణయించండి. /2025 ISO కేలండర్ వారం సంఖ్య ను చూడండి. వారం వ్యాసం ప్రపంచ ప్రామాణిక కాలం (UTC/GMT) ప్రకారం మారుతుందని (అంటే భారతదేశంలో సోమవారం ఉదయం 05:30 గంటలకు) గమనించండి. వారం వ్యాసం పేరు, వారంతో ప్రత్యేక సంబంధము వివరాలు ఉన్నప్పుడు రాయండి. ఎంపికకు వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గాన్ని చూడండి. యాంత్రిక అనువాద వ్యాసాలుగా గుర్తించినవాటి నాణ్యత పెంపొందించటంలో (ఎరుపు లింకులు తొలగించటం, స్థానికత దగ్గరైన వివరాలు చేర్చటం లాంటివి) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని గమనించండి.

నిశ్చయమైన వ్యాసం చర్చా పేజీలో {{ఈ వారం వ్యాసం పరిగణన}} ను చెరిపేసి {{ఈ వారం వ్యాసం|సంవత్సరం=????|వారం=??}} అన్న మూసను ఉంచండి.

వ్యాస పరిచయ రూపం సృష్టించడం

"ఈ వారం వ్యాసం" పరిచయ రూపంలో దీనిలో స్వేచ్ఛానకలుహక్కుల బొమ్మలు మాత్రమే వాడాలి.

2025 జాబితా

2025 సంవత్సరానికి గాను వీలయినంతవరకు ఈ జాబితా ప్రకారం "ఈ వారం వ్యాసం" పరిచయ రూపాన్ని (వ్యాస ప్రవేశికలో మొదటి కొన్ని పేరాలు)(కనీసం వారం రోజుల ముందుగా) తయారు చేయాలి. క్రింద నున్న పట్టికలో సంబంధిత వారం అంకెను నొక్కితే "ఈ వారం వ్యాసం - ఫలాని వారం" అనే ఖాళీ పేజీ {{ఈ వారపు వ్యాసం/preload}} కోడ్ తో తెరుచుకొంటుంది. ఎంపిక చేసిన వ్యాసం పేరు, వ్యాసం బొమ్మ పేరు, వ్యాసం పరిచయంనుండి కొంతభాగం ఆ పేజీలో చేర్చాలి. ఆ వ్యాసపు పేరుని క్రింది పట్టికలో లింకుగా పేర్కొనాలి.

ఈ వ్యాసాలు ప్రదర్శనకు ముందు కొంత మెరుగు పరచవలసిన అవుసరం ఉందని గమనించగలరు. పరిచయం, అక్షర దోషాలు, అంతర్వికీ లింకులు, కాపీ హక్కులు, తటస్థత వంటి విషయాలను తప్పక పరిశీలించండి.

ఇవి కూడా చూడండి

సంవత్సరం వారీగా సాధారణ జాబితా, కంప్యూటర్ ద్వారా విశ్లేషణకు ఉపయోగం

వ్యాసాల చర్చాపేజీల వర్గాలు

ప్రదర్శిత సంవత్సరం వారీగా

ప్రదర్శిత వారం వారీగా

వ్యాస పరిచయపేజీలు

వ్యాస పరిగణనలు

ఇతరాలు