ఇతర వెనుకబడిన తరగతుల జాబితా

భారతదేశంలో సామాజికంగా లేదా విద్యాపరంగా వెనుకబడిన వ్యక్తుల సమూహం కోసం పదం
(వెనకబడిన కులము నుండి దారిమార్పు చెందింది)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2005లో 93 కులాలున్న బీసీ కులాల జాబితా ఇప్పుడు 140 కి చేరింది. 'గ్రూప్ ఏలో 54', 'గ్రూప్ బిలో 28', 'గ్రూప్ సిలో 1', 'గ్రూప్ డిలో 47', గ్రూప్ ఇలో 14 కులాలున్నాయి. వెనుకబడిన కులాలకు మొత్తం ఉన్న 25% రిజర్వేషన్లలో గ్రూపు-ఏకు 7శాతం, గ్రూ పు-బీకి 10 శాతం, గ్రూపు-సీకి 1శాతం, గ్రూపు-డీకి 7శాతం రిజర్వేషన్లుంటాయి..

వెనుకబడిన వర్గాలు

తాజా పరిణామాలు

మార్చు
  • 18.1.2024 నుండి కుల గణన చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఉత్తర్వులు ఇచ్చింది.
  • 23.7.2019 న ఏపీలో అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ ఏర్పాటుకు చట్టం చేసి బిల్లును ఆమోదించారు.
  • చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది.
  • ప్రస్తుతం బీసీ జాబితాలో ఉన్న రజక, వడ్డెర, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసింది.
  • కులాంతర వివాహం చేసుకునే బీసీలకు ప్రోత్సాహకాన్ని రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచేందుకు ఆమోదించింది.
  • 1. బేరికోమటి, 2. కరణం, కరునీగర్, కన్నక్క, పిల్లాయి 3. చిట్టెపుకాపు, కుల్లకడిగి 4. మోరుసుకాపు, కాపుగౌడ 5. తెలుగు, తెలుగోళ్ళు 6. వీరశైవలింగాయతు 7. తోలుబొమ్మలాటవాళ్ళు 8. కుంటిమల్లారెడ్డి 9. తేలి కులాలను వెనుకబడిన తరగతుల్లో చేర్చటానికి బీ.సి.కమిషన్ విచారణ చేపట్టింది (నోటిఫికేషన్ తేదీ 3.1.2009)
  • పూసల, బలిజ, వాల్మీకి, బోయ, సగర (ఉప్పర), భట్రాజు లకు ప్రత్యేక ఫెడరేషన్ల ఏర్పాటుకు రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది (13.2.2009)
  • వెనుకబడిన కులాల జాభితాలో చేర్చాలని 75 కులాల నుంచి అందిన పత్రాలు పరిశీలనలో ఉన్నాయని వెనుకబడిన తరగతుల కమిషను తన నివేదికలో తెలిపింది.
  • ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల కమిషను 2008-09 ఆర్థిక సంవత్సరం వార్షిక నివేదికను 2010 జూలై 15 నాడు శాసన సభకు సమర్పించింది.
  • ఆం.ప్ర.వె.త.కమిషనుకు గత రెండేళ్ళ కాలంలో 107 కులాలను వె.త. జాబితాలో చేర్చాలని పత్రాలు వచ్చాయి. ఇందులో 32 కులాలను వె.త. కమిషను సిఫార్సు మేరకు ఆం.ప్ర. ప్రభుత్వము వె.త. జాబితాలో చేర్చింది.
  • బీసీ - ఎ జాబితాలో 'వంశ్ రాజ్', 'పిచ్చిగుంట్ల' ను కలిపింది. తూర్పు కాపులు, గాజుల కాపులకు సంబంధించి కొన్ని జిల్లాలలో మాత్రమే బీసీ జాబితాలో ఉన్నరు. జిల్లాల పరిమితిని తొలగించాలని, ఆ కులాల నుంచి వచ్చిన కోరిక మేరకు, వె.త. కమిషను పరిశీలించి సిఫార్సు చేసింది. ఈ విషయం ఆం.ప్ర. ప్రభుత్వ పరిశీలనలో ఉంది.
  • వె.త కులాల జాబితాలోని ఒక గ్రూపు నుంచి మరో గ్రూపులోకి మార్చాలని 35 పత్రాలు వె.త.కమిషనుకి అందాయి.
  • బీసీ-డి జాబిగాలో ఉన్న 'ముదిరాజ్', 'ముతరాసి', 'తెనుగోళ్ళ', 'పూసల ' కులాలను 'బీసీ - ఎ' జాబితాలో చేర్చాలని సిప్ఫార్సు చేయడంతో ఆం.ప్ర. ప్రభుత్వము ఆదేశాలు ఇచ్చింది. ఈ అంశం 'ఉన్నత న్యాయస్థానం (సుప్రీం కోర్టు)లో పెండింగ్ లో ఉంది.
  • 'బీసీ-డి' జాబితాలో ఉన్న 'మాలి' కులానికి సమానమైన అర్ధం ఇచ్చే 'బారె', 'బరాయి', 'మరార్', 'తంబోలి'లను ఒకే క్రమ సంఖ్యలో చేర్చింది.
  • వె.త. కమిషను సిఫార్సు చేసినా,'కళింగ కోమటి' కులాన్ని, ప్రభుత్వం వె.త.జాభితాలో చేర్చలేదు.
  • 'మురళీధర రావు కమిషను' ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వె.బ. తరగతుల బాగోగుల గురించి వేసింది. ఈ కమిషను వె.బ. తరగతుల గురించి పూర్తిగా పరిశీలించి ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
  • 'మండల్ కమిషన్' ను కేంద్ర ప్రభుత్వము (ఆనాటి జనతా ప్రభుత్వం) భారతదేశంలోని వెనుక బడిన కులాల రిజర్వేషన్లు గురించి పరిశిలించమని నియమించింది. మండల్ కమిషను, ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
  • విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ ప్రభుత్వ ఉద్యోగాలలో మండల్ కమిషన్ నివేదిక ప్రకారం వెనుకబడినకులాలకు 27% రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించిన ప్రధాని.
  • అరుణ్ శౌరీ (ఒ.బి.సి)లకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలనే మండల్ కమిషన్ నివేదికను అమలు చేయడాన్ని శౌరీ వ్యతిరేకించడం పత్రిక సంపాదక వర్గంలో .
  • రిజర్వేషన్లు 50 శాతం కోటా పరిమితికి మించి అమలు చేయాలంటే, మండల్‌ కమిషన్‌ తీర్పు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం పొందుపర్చిన నిర్ణీత ప్రమాణాలను వెనకబడిన వర్గాల కమిషన్‌ పరిగణనలోకి తీసుకోవాలని, తాజా జనాభా గణాంకాల ఆధారంగా వాటిని పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడులో 69 శాతం, కర్ణాటకలో 73 శాతం కోటా అమల్లో ఉంది.
  • కాళింగులు. 2011 మార్చి 8 నాటికి పలు వెనుకబడిన కులాలను ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర జాబితాలో వేర్వేరుగా ఉన్న కులాలను తాజాగా ఒకే కేటగిరిలోకి చేర్చారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళింగ కులస్తులు ఒకే గొడుగు కిందకు రానున్నారు. వీరందరినీ ఒకే తరగతిగా పరిగణిస్తారు. దీని ప్రకారం పందిర కాళింగ, కింతలి కాళింగ, బోరగాన కాళింగ కులస్తులు కాళింగులుగా కొనసాగుతారు. జిల్లాలో 1.44 లక్షల మంది కింతలి కాళింగ, 38 వేల మంది బోరగాన కాళింగులు, ఓటర్లుగా ఉన్నారు . కింతలి కాళింగులు అత్యధికంగా ఆమదాలవలస, పొందూరు, టెక్కలి, సంతబొమ్మాలి, నందిగాం, పలాస, సరుబుజ్జిలి, తదితర ప్రాంతాల్లో ఉన్నారు. బోరగాన కాళింగులు కవిటి, ఇచ్చాపురం, సోంపేట, గార, వజ్రపు కొత్తూరు, మందస తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల ఉప కులాల వారు కూడా రిజర్వేషన్ల పరంగా ప్రయోజనం పొందుతారు. కేంద్రం నిర్ణయంతో 1.82 లక్షల మందికి ప్రయోజనం ఉంటుంది.
  • చాకలి. 2011 మార్చి 8 నాటికి పలు వెనుకబడిన కులాలను ఉమ్మడి జాబితాలోకి చేరుస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది . కేంద్ర జాబితాలో వేర్వేరుగా ఉన్న కులాలను తాజాగా ఒకే కేటగిరిలోకి చేర్చారు. 2011 మార్చి 8 శ్రీకాకుళం జిల్లాల్లో 32 వేల మంది చాకలి కులస్తులు ఓటర్లుగా ఉన్నారు చాకలి కులస్తులు రజిత జాబితాలో ఉంటారు.

గ్రూప్. ఏ (ఆదిమ తెగలు, విముక్త జాతి, సంచార, సెమీ సంచార తెగలు

మార్చు

గ్రూప్. బి (వృత్తిపరమైన కులాలు)

మార్చు

గ్రూప్. సి

మార్చు

గ్రూప్. డి (ఇతర కులాలు)

మార్చు

కులాలు: 48

గ్రూప్. ఇ

మార్చు

14 రకాల ముస్లింలను సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన బీసీల్లో చేర్చాలని ప్రభుత్వం 2007లోనే నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లోనూ ముస్లింలను బీసీ-ఈలుగా పరిగణించటానికి ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు