తెలంగాణ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు (2021-2022)
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన గ్రామ పంచాయతీలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులను అందజేస్తుంది. అందులో భాగంగా 2021-2022 సంవత్సరానికి రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థలకు కూడా ఉత్తమ అవార్డులు వచ్చాయి.[1][2]
తెలంగాణ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డులు (2021-2022) | ||
![]() | ||
పురస్కారం గురించి | ||
---|---|---|
విభాగం | ఉత్తమ గ్రామ పంచాయతీ | |
మొత్తం బహూకరణలు | 47 గ్రామాలు | |
బహూకరించేవారు | తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ |
అవార్డు కేటగిరీలు సవరించు
కేంద్రం ప్రభుత్వం 2021-2022 సంవత్సరంలో ఉత్తమ పంచాయతీల ఎంపిక విధానాల్లో భాగంగా తొమ్మిది క్యాటగిరీల్లో అవార్డులు ఇవ్వాలని సూచించింది. ఆ సూచనలను అనుసరించి ప్రతి గ్రామం ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ఆధారంగా ప్రతి దశలోనూ ప్రత్యేక బృందాలచే తనిఖీలు నిర్వహించి, సమగ్ర పరిశీలన జరిపి అవార్డులకు ఎంపికచేసింది.[3]
అవార్డుల ప్రదానోత్సవం సవరించు
2023 మార్చి 31న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాదు రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందించాడు.[4] ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక శాఖామయంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు అనంద్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులు, జిల్లాస్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల సర్పంచ్‌లు పాల్గొన్నారు.[5]
ఎంపికైన గ్రామ పంచాయతీలు సవరించు
పేదరికం లేని, మెరుగైన జీవనోపాధులు ఉన్న గ్రామాలు సవరించు
- మర్లవాయి (జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా)
- మనుదొడ్డి (రాజోలి మండలం, గద్వాల జిల్లా)
- సోలిపూర్ (ఘన్‌పూర్ మండలం, వనపర్తి జిల్లా)
ఆరోగ్యకరమైన గ్రామాలు సవరించు
- మరియపురం (గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా)
- గౌతమ్‌పూర్ (చుంచుపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా)
- ముజ్గి (నిర్మల్ గ్రామీణ మండలం, నిర్మల్ జిల్లా)
చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామాలు సవరించు
- అల్లాపూర్ (తాడూరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా)
- హరిదాస్‌పూర్ (కొండాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా)
- శ్రీనివాస్‌నగర్ (మిర్యాలగూడ మండలం, నల్లగొండ జిల్లా)
నీరు సమృద్ధిగా ఉన్న గ్రామాలు సవరించు
- కుకునూర్ (వేల్పూర్ మండలం, నిజామాబాద్ జిల్లా)[6]
- మజీద్‌పూర్ (అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా)
- నెల్లుట్ల (లింగాలఘన్‌పూర్ మండలం, జనగామ జిల్లా)
చాపలతండా (డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా)
వెల్చాల (రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా)
కామారెడ్డిగూడెం (దేవరుప్పల మండలం, జనగామ జిల్లా)
క్లీన్ అండ్ గ్రీన్ గ్రామాలు సవరించు
- ముఖరా కే (ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
- పర్లపల్లి (తిమ్మాపూర్(ఎల్ఎండీ) మండలం, కరీంనగర్ జిల్లా)
- సుల్తాన్‌పూర్ (ఎలిగేడ్ మండలం, పెద్దపల్లి జిల్లా)
స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాలున్న గ్రామాలు సవరించు
- గంభీరావుపేట (గంభీరావుపేట మండలం, సిరిసిల్ల జిల్లా)
- ఎల్లంకి (రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా)
- మూడుచింతలపల్లి (మూడుచింతలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా)
మల్లంపల్లి (ములుగు మండలం, ములుగు జిల్లా)
దొంగల ధర్మారం (రామాయంపేట మండలం, మెదక్ జిల్లా)
తిమ్మాపూర్ (తిమ్మాపూర్(ఎల్ఎండీ) మండలం, కరీంనగర్ జిల్లా)
సామాజిక భద్రత ఉన్న గ్రామాలు సవరించు
- కొంగట్‌పల్లి (హన్వాడ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా)
- రైతునగర్ (బిర్కూర్ మండలం, కామారెడ్డి జిల్లా)
- గొల్లపల్లి (నెన్నల్ మండలం, మంచిర్యాల జిల్లా)
ముక్నూర్ (పలిమెల మండలం, భూపాలపల్లి జిల్లా)
సుపరిపాలన గ్రామాలు సవరించు
- చీమలదరి (మోమిన్‌పేట్ మండలం, వికారాబాద్ జిల్లా)
- పాలేరు (కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా)
- చిప్పలతుర్తి (నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా)
ఖానాపూర్ (మక్తల్ మండలం, నారాయణ్‌పేట్ జిల్లా)
మహిళా స్నేహపూర్వక గ్రామాలు సవరించు
స్పెషల్ కేటగిరి అవార్డులు సవరించు
కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్ సవరించు
- కన్హా (నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా)
- ముఖరా కే (ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
- ఇబ్రహీంపూర్ (నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా)
నవాబ్‌పేట్ (చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా)
మరియపురం (గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా)
గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కార్ సవరించు
- కన్హా (నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా)
- ఎర్రవెల్లి (మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా)
- ముఖరా కే (ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
పంతంగి (చౌటుప్పల్ మండలం, భువనగిరి జిల్లా)
బంజరుపల్లి (నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా)
పంచాయతీ కమత్ నిర్మాణ్ హైదరాబాద్ సర్వోత్తమ్ సంస్థాన్ పురస్కార్ సవరించు
- తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐఆర్డీ), రాజేంద్రనగర్, హైదరాబాద్
- ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ), రాజేంద్రనగర్
- ఎక్స్‌టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ), హసన్‌పర్తి
జాతీయస్థాయి అవార్డులు సవరించు
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ 2023 సంవత్సరానికి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ప్రదానం చేసిన మొత్తం 46 జాతీయ అవార్డుల్లో కూడా తెలంగాణకు 13 అవార్డులు దక్కాయి. దీన్‌దయాల్ ఉపాధ్యాయ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు 27 అవార్డులకు 8 అవార్డులు, నానాజీ దేశ్ ముఖ్ సర్వోత్తమ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాల్లో 8 అవార్డులు తెలంగాణ గ్రామాలకు వచ్చాయి. మొత్తం 9 కేటగిరీలు ఉండగా.. అందులో 4 విభాగాల్లో తెలంగాణదే మొదటి స్థానం. మరోవైపు.. నానాజీ దేశముఖ్ సర్వోత్తం పంచాయతీ సతత్ వికాస్ పురస్కారంలో ములుగు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.[7]
నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 సవరించు
- ఉత్తమ బ్లాక్ (మండల) పంచాయతీ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఎల్.ఎం.డి (రెండవ స్థానం)
- ఉత్తమ జిల్లా పంచాయతీలు: ములుగు జిల్లా (రెండవ స్థానం)
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ): ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కె. (మూడవ స్థానం)
- కార్బన్ న్యూట్రల్ విశేష్ పంచాయతీ పురస్కార్: రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా (రెండవ స్థానం)
- గ్రామ ఊర్జా స్వరాజ్ విశేష్ పంచాయత్ పురస్కార్ (స్పెషల్ కేటగిరీ–నాన్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్–సర్టిఫికెట్): సిద్దిపేట జిల్లా మార్కూక్ ఎర్రవెల్లి (మొదటి స్థానం)
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్–2023 సవరించు
- ఆరోగ్యవంతమైన పంచాయతీ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెంచుపల్లి మండలం గౌతంపూర్ (మొదటి స్థానం)
- తాగునీరు సమృద్ధిగా ఉన్న పంచాయతీ: జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం నెల్లుట్ల (మొదటి స్థానం)
- సామాజిక భద్రతగల పంచాయతీ: మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం కొంగట్‌పల్లి (మొదటి స్థానం)
- స్నేహపూర్వక మహిళా పంచాయతీ: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) మండలం ఏపూరు (మొదటి స్థానం)
- పేదరికరహిత, జీవనోపాధి పెంచిన పంచాయతీ: గద్వాల జిల్లా రాజోలి మండలం మందొండి గ్రామం (రెండవ స్థానం)
- సుపరిపాలనగల పంచాయతీ: వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం చీమల్‌దారి (రెండవ స్థానం)
- క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ: పెద్దపల్లి జిల్లా ఎలిగాడ్ మండలం సుల్తాన్‌పూర్ (మూడవ స్థానం)
- స్వయం సమృద్ధ మౌలిక సదుపాయాలుగల పంచాయతీ: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్‌రావుపేట మండలం గంభీర్‌రావుపేట (మూడవ స్థానం)
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 2023 ఏప్రిల్ 17న జరిగిన "పంచాయతీల ప్రోత్సాహకంపై జాతీయ సదస్సు – అవార్డుల ప్రదానోత్సవం" కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందజేయబడ్డాయి.[8]
మూలాలు సవరించు
- ↑ "రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే". EENADU. 2023-03-31. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-04.
- ↑ "LIVE: జాతీయ పంచాయతీరాజ్ అవార్డుల ప్రదానోత్సవంలో కేటీఆర్". ETV Bharat News. Archived from the original on 2023-04-04. Retrieved 2023-04-04.
- ↑ telugu, NT News (2023-03-30). "Telangana | 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. 31న హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-04.
- ↑ "డప్పు కొట్టిన కెటిఆర్ - పల్లెల బతుకు కెసిఆర్ కు ఎరుకన్న మంత్రి". Prabha News. 2023-04-01. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-04.
- ↑ telugu, NT News (2023-04-01). "పల్లెల ప్రగతికి పురస్కారాలు". www.ntnews.com. Archived from the original on 2023-04-01. Retrieved 2023-04-04.
- ↑ "ఉత్తమ గ్రామ పంచాయతీగా కుకునూరుకు అవార్డు". EENADU. 2023-04-01. Archived from the original on 2023-04-04. Retrieved 2023-04-04.
- ↑ "National Panchayat Awards: తెలంగాణ పల్లెలకు 13 జాతీయ అవార్డులు". Sakshi Education. 2023-04-08. Archived from the original on 2023-04-17. Retrieved 2023-04-17.
- ↑ "మరోసారి సత్తాచాటిన తెలంగాణ పల్లెలు.. దేశంలో 46 అవార్డుల్లో 13 మనకే..!". Samayam Telugu. Archived from the original on 2023-04-17. Retrieved 2023-04-17.