2008 సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన వార్తలు, సంఘటనలు, పరిణామాలు.

జాతీయ పతాకం

జనవరి

మార్చు

ఫిబ్రవరి

మార్చు

మార్చి

మార్చు
  • మార్చి 2: కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
  • మార్చి 4: ఆస్ట్రేలియాలో జరిగిన సిబి సీరీస్ రెండో ఫైనల్లో కూడా భారత్ విజయం సాధించి సీరీస్ గెల్చుకుంది.
  • మార్చి 5: 60 నియోజకవర్గాలు కల నాగాలాండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి.
  • మార్చి 6: మహారాష్ట్ర గవర్నరు పదవికి ఎస్.ఎం.కృష్ణ రాజీనామా.
  • మార్చి 7: మేఘాలయ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పొందినది. శాసనసభలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ చేకూరలేదు.
  • మార్చి 7: త్రిపుర శాసనసభ ఎన్నికలలో లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా నాలుగవ సారి విజయం సాధించింది. 60 స్థానాలు కల శాసనసభలో లెఫ్ట్ ఫ్రంట్ 49 స్థానాలలో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలు పొందినది.
  • మార్చి 8: భారత ప్రముఖ చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మొరెలియా-లైనర్స్ టోర్నమెంటును రెండోసారి కైవసం చేసుకున్నాడు
  • మార్చి 8: కొత్తగా ఎన్నికలు జరిగిన మేఘాలయ శాసనసభకు కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా డి.డి.లపాంగ్ ఏకగ్రీవ ఎన్నికయ్యాడు.
  • మార్చి 10: త్రిపుర ముఖ్యమంత్రిగా మూడవసారి మణిశంకర్ బాధ్యతలు చేపట్టాడు.
  • మార్చి 11: అమెరికాకు చెందిన ఉడ్రోవిల్సన్ అవార్డునకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ చైర్మెన్ నారాయణ మూర్తి ఎంపికయ్యారు.
  • మార్చి 12: మేఘాలయలో ముఖ్యమంత్రి డి.డి.లపాంగ్ నేతృత్వంలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం.
  • మార్చి 14: 2007 సంవత్సరపు ఇందిరాగాంధీ శాంతి బహుమతికై బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఎంపికయింది.
  • మార్చి 14: హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీచే ప్రారంభోత్సవం జరిగింది.
  • మార్చి 19: మేఘాలయ ముఖ్యమంత్రి పదవికి డి.డి.లపాంగ్ రాజీనామా చేశాడు.
  • మార్చి 23: ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది.
  • మార్చి 23: హైదరాబాదులో కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 22 అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి.
  • మార్చి 28: చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ ‌లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ.
  • మార్చి 31: ప్రముఖ హిందీ నటి వహీదా రెహమాన్ కు 2006 సంవత్సరపు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది.

ఏప్రిల్

మార్చు
  • మే 1: ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్ పాండే మృతి.
  • మే 2: భారత హాకీ జట్టు సారథిగా తుషార్ ఖండేకర్ నియామకం.
  • మే 3: భారత తొలి ఫార్మూలావన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్ తొలిసారి పోల్ పొజిషన్ సంపాదించి రికార్డు సృష్టించాడు.
  • మే 6: చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు
  • మే 7: ఒరిస్సాలోని వీలర్ దీవి నుంచి అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
  • మే 8: వైద్యరంగంలో ప్రధానం చేసే 2006 సంవత్సరపు బి.సి.రాయ్ జాతీయ అవార్డును రాయపు రమేష్‌బాబుకు ప్రకటించారు.
  • మే 8: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మెన్ పదవికి సునీల్ గవాస్కర్ రాజీనామా చేశాడు.
  • మే 8: శ్రీలంకలో జరుగుతున్నమహిళల ఆసియాకప్ వన్డే క్రికెట్ టోర్నమెంటులో భారత్ కు చెందిన జులన్ గోస్వామి 100 వికెట్ల మైలురాయిని అధికమించి ఈ ఘనత సాధించిన నాలుగవ బౌలర్‌గా, రెండో భారతీయురాలిగా అవతరించింది.
  • మే 11: మహిళల ఆసియా కప్ క్రికెట్ ను భారత్ వరుసగా నాల్గవసారి కైవసం చేసుకుంది. కొలంబోలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను 177 పరుగుల తేడాతో ఓడించింది
  • మే 12: జలాంతర్గామి నుంచి ప్రయోగించే అణు క్షిపణి వ్యవస్థ "కె-15"ను అభివృద్ధి చేసినట్లు భారత్ ప్రకటన. ఈ వ్యవస్థ ఉన్న ఐదవ దేశంగా భారత్ అవతరించింది.
  • మే 13: పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
  • మే 14: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ చే కీర్తిచక్ర (6 గురికి), శౌర్యచక్ర (20 మందికి), పరమ విశిష్ట (17 మందికి), అతి విశిష్ట (27 మందికి) పతకాలను రాష్ట్రపతి భవన్‌లో బహుకరణ.
  • మే 25: కర్ణాటక శాసనసభ ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. 224 స్థానాలు కల శాసనసభలో మెజారిటీకి 110 నియోజకవర్గాలలో గెలిచింది.
  • మే 30: కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం.
  • జూలై 1: ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
  • జూలై 1: జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అమర్‌నాథ్ ఆలయమండలికి 39.88 హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
  • జూలై 1: ప్రముఖ బాలివుడ్ నటి శిల్పాశెట్టి బ్రిటన్ ప్రధానంచేసే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ డైవర్సిటీ అవార్డుకు ఎన్నికైంది.
  • జూలై 4: ప్రపంచంలో 20మంది మహామేధావుల జాబితాలో అమెరికాలో నివసిస్తున్న ఇద్దరు భారతీయులకు (అమర్త్యాసేన్, పరీద్ జకారియా) చోటుదక్కింది.
  • జూలై 7: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పదవికి రాజానామా చేశాడు.
  • జూలై 8: మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
  • జూలై 8: 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రభారావు, మణిపూర్ గవర్నర్‌గా గురుబచన్‌సింగ్ జగత్, గోవా గవర్నర్‌గా శివేందర్‌సింగ్ సిద్ధూ, మహారాష్ట్ర గవర్నర్‌గా ఎస్.సి.జమీర్ లుగా వ్యవహరిస్తారు.
  • జూలై 8: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
  • జూలై 9: కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి మద్దతుగా సమాజ్‌వాది పార్టీ రాష్ట్రపతికి లేఖను సమర్పించింది.
  • జూలై 10: జమ్ము కాశ్మీర్ లో గవర్నర్ పాలన విధించబడింది.
  • జూలై 10: ప్రపంచ యువ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ స్విమ్మర్‌గా విర్థావల్ ఖడే రికార్డు సృష్టించాడు.

ఆగష్టు

మార్చు

---నమోదు కాలేదు --

సెప్టెంబర్

మార్చు
 
దువ్వూరి సుబ్బారావు
  • సెప్టెంబర్ 1: హైదరాబాదులోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇస్రో పరిధిలోకి తీసుకువచ్చారు. ఇదివరకు ఎన్.ఆర్.ఎస్.ఏ.అంతరిక్ష విభాగం అధీనంలో ఉండేది.
  • సెప్టెంబర్ 2: ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా 54వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానం జరిగింది. ఉత్తమ నటీనటుల పురస్కారాలను ప్రియమణి, సౌమిత్ర చటర్జీలు అందుకున్నారు.
  • సెప్టెంబర్ 3: అగ్రవర్ణ పేదలకు ఉన్నత విద్యలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
  • సెప్టెంబర్ 4: లియాండర్ పేస్ అమెరికన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ టైటిట్ కైవసం చేసుకున్నాడు. కారా బ్లాక్ (జింబాబ్వే) తో జతకట్టిన పేస్ ఫైనల్లో 7-6 (8-6), 6-4 స్కోరుతో లీజెల్ హ్యూబెర్, జేమీ ముర్రేలపై విజయం సాధించాడు.
  • సెప్టెంబర్ 5: బెంగుళూరులో జరిగిన ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ కు చెందిన పంకజ్ అద్వానీ విజయం సాధించాడు.
  • సెప్టెంబర్ 17: భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా ఎం.కె.కౌశిక్ నియమితుడైనాడు.
  • సెప్టెంబర్ 18: విదేశీ వార్తామేగజైన్లు భారత్‌లో తమ సంచికలను ప్రచురించుకోవడానికి అనుమతిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
  • సెప్టెంబర్ 18: ఆసియా మహిళల కబడ్డీ టోర్నమెంటు పోటీలు మధురైలో ప్రారంభమయ్యాయి.
  • సెప్టెంబర్ 19: భారతీయ వార్తాపత్రికల సంఘం అధ్యక్షుడిగా బాంబే సమాచార్ వీక్లీ పత్రికకు చెందిన హోర్మస్‌జీ కామా ఎన్నికయ్యాడు.
  • సెప్టెంబర్ 27: ఢిల్లీలో మళ్ళి బాంబుపేలుళ్ళు జరిగి ఇద్దరు మృతిచెందారు, 20 మందికిపైగా గాయపడ్డారు.
  • సెప్టెంబర్ 27: వదోదరలో జరిగిన ఇరానీ ట్రోఫి క్రికెట్‌ను రెస్టాఫ్ ఇండియా విజయం సాధించింది. ఈ ట్రోఫీ రెస్టాఫ్ ఇండియా చేజిక్కించుకోవడం ఇది 21వ సారి.
  • సెప్టెంబర్ 27: ప్రముఖ సినీగాయకుడు మహేంద్ర కపూర్ ముంబాయిలో మరణించాడు.
  • సెప్టెంబర్ 27; భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కొత్త అధ్యక్షుడిగా శశాంక్ మనోహర్ నియమితులైనాడు. కార్యదర్శి పదవి ఎన్.శ్రీనివాసన్‌కు దక్కింది.
  • సెప్టెంబర్ 27: భారత క్రికెట్ జట్టు సెలెక్షన్ కమిటీ చైర్మెన్‌గా కృష్ణమాచారి శ్రీకాంత్ ఎన్నికయ్యాడు.
  • సెప్టెంబర్ 27; భారత మహిళల క్రికెట్ జట్టు సెలెక్టర్‌గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన పూర్ణిమారావు ఎంపికైంది.
  • సెప్టెంబర్ 28: అమెరికా ప్రతినిధుల సభ భారత్-అమెరికా అణుఒప్పందపు బిల్లును ఆమోదించింది.
  • సెప్టెంబర్ 28; 6 దశాబ్దాల నిరీక్షణ అనంతరం సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఐఎన్‌ఏలో కెప్టెన్‌గా వ్యవహరించిన లక్ష్మీ పండాకు స్వాతంత్ర్య సమరయోధురాలిగా గుర్తింపు లభించింది.
  • సెప్టెంబర్ 29: చేతన్ ఆనంద్ చెక్ ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ విజేతగా నిలిచాడు.
  • సెప్టెంబర్ 30: రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో చాముండా దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో సుమారు 150 పైగా భక్తులు మరణించారు. 60కి పైగా గాయపడ్డారు
  • సెప్టెంబర్ 30: భారతదేశంతో ఫ్రాన్స్ అణు ద్వైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అణువ్యాపారానికి ఎన్.ఎస్.జి. దేశాల ఆమోదం అనంతరం ఇది తొలి ఒప్పందం.

అక్టోబర్

మార్చు
  • అక్టోబర్ 1: భారత్‌కు చెందిన కృష్ణమ్మాళ్, శంకరలింగంజగన్నాథన్ దంపతులకు ప్రత్యమ్నాయ నోబెల్ బహుమతిగా పేరుపొందిన రైట్ లివ్లీహుడ్ అవార్డు లభించింది.
  • అక్టోబర్ 1: ఢిల్లీ మెట్రో రైల్వే కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధరన్‌కు లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పురస్కారం లభించింది.
  • అక్టోబర్ 2: భారత్-అమెరికా అణుఒప్పందానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.
  • అక్టోబర్ 3: ప్రముఖ చార్టర్డ్ అక్కౌంటెట్, బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి వారసుడైన ఆర్.ఎస్.లోధా లండన్లో మరణించాడు.
  • అక్టోబర్ 5: జర్మనీలో జరిగిన బిట్‌బర్గర్ గ్రాండ్ ప్రి బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో చేతన్ ఆనంద్ టైటిల్ సాధించాడు. చేతన్ ఆనంద్ భార్య గుత్తా జ్వాల మిక్స్‌డ్ డబుల్స్‌లో విజయం సాధించింది.
  • అక్టోబర్ 6: పర్యావరణ పరిరక్షణకై కృషిచేసిన వారికి ప్రధానం చేసే హీరోస్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు పంజాబ్కు చెందిన బల్ బీర్‌సింగ్‌కు లభించింది.

నవంబరు

మార్చు

---- నమోదు కాలేదు ----

డిసెంబరు

మార్చు

---- నమోదు కాలేదు ----

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు