సత్యం రాజేష్

సినీ నటుడు
(సత్యం రాజేశ్ నుండి దారిమార్పు చెందింది)

సత్యం రాజేశ్ ఒక తెలుగు సినీ హాస్యనటుడు. సుమారు 350కి పైగా సినిమాల్లో నటించాడు.[1] సుమంత్ నటించిన సత్యం సినిమాలో నటించి ఆ సినిమా పేరును తన పేరులో చేర్చుకున్నాడు. ఒక దశాబ్దం పాటు హాస్యపాత్రలలో నటించిన రాజేశ్ క్షణం సినిమాలో సీరియస్ పోలీసు ఆఫీసరు పాత్రలో నటించాడు. త్రిష ప్రధాన పాత్రలో నటించిన నాయకి సినిమాలో హీరోగా నటించాడు.[2] 2021 లో రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన మా ఊరి పొలిమేర, 2023 లో దానికి కొనసాగింపుగా వచ్చిన మా ఊరి పొలిమేర - 2 చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందాడు.[3]

సత్యం రాజేశ్
జననం
రాజేశ్ బాబు

విద్యఎంబీయే
వృత్తినటుడు
తల్లిదండ్రులు
  • రాజేంద్ర ప్రసాద్ (తండ్రి)
  • మణి కుమారి (తల్లి)

జీవిత విశేషాలు

మార్చు

రాజేశ్ అసలు పేరు రాజేశ్ బాబు. అతని స్వస్థలం విశాఖపట్నం. వారిది మధ్యతరగతి కుటుంబం. తండ్రి రాజేంద్ర ప్రసాద్ టెలికాం ఉద్యోగి. అమ్మ మణి కుమారి గృహిణి. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. నటుడు చిరంజీవి స్పూర్తితో సినిమాల్లో నటించాలనుకున్నాడు. ఎంబీయే చదువుకున్నాడు. వైజాగ్ మహీంద్రా కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా అతనికి హైదరాబాదుకు బదిలీ అయింది. తరువాత సినిమా అవకాశాలు అందిపుచ్చుకున్నాడు.[4]

సినిమాలు

మార్చు

ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన నీ స్నేహం రాజేశ్ నటించిన మొదటి సినిమా. ఈ సినిమాలో రాజేశ్ హీరో స్నేహితుడిగా నటించాడు. రాజేశ్ రెండో సినిమా నూతన దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో సుమంత్ నటించిన సత్యం. ఆ సినిమాలో తనది ప్రాముఖ్యమున్న హీరో స్నేహితుడి పాత్ర, మంచి విజయం సాధించడంతో ఆ సినిమా పేరునే తన పేరును సత్యం రాజేశ్ గా మార్చుకున్నాడు. ఆ సినిమాలో పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా అనే డైలాగుతో ప్రాచుర్యం పొందాడు. తరువాత 250 కి పైగా సినిమాల్లో నటించాడు. హాస్యనటుడిగా గుర్తింపు పొందిన రాజేశ్ కు క్షణం సినిమాతో సీరియస్ నటుడిగా కూడా మంచి గుర్తింపు వచ్చింది.[5] నిజానికి మొదట్లో ఈ పాత్రలో నటుడు సంపత్ రాజ్ ను నటింపజేయాలనుకున్నారు. కానీ చివరికి రాజేశ్ కు ఆ పాత్ర దక్కింది. ఈ సినిమా తర్వాత రాజేశ్ కు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. త్రిష ప్రధాన పాత్రలో వచ్చిన నాయకి సినిమాతో కథా నాయకుడిగా మారాడు. కానీ ఆ సినిమానే తాను హీరో మొదటి, చివరి చిత్రమని ప్రకటించాడు.[6] 2021 లో రాజేష్ ప్రధాన పాత్రలో వచ్చిన మా ఊరి పొలిమేర, 2024లో దానికి కొనసాగింపుగా వచ్చిన పొలిమేర - 2 క్షుద్ర మాంత్రికుడి పాత్రలో గంభీరమైన నటన ఇతనికి ప్రత్యేక గుర్తింపు సాధించి పెట్టాయి.

నటించిన చిత్రాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. పాలపర్తి, శ్రీవిద్య. "Nayaki will be my first and last movie as a hero: Satyam Rajesh". timesofindia.indiatimes.com. Times of India. Archived from the original on 1 January 2017. Retrieved 9 November 2016.
  2. "Comedian Turns Hero With Trisha's Film". gulte.com. Archived from the original on 27 April 2016. Retrieved 9 November 2016.
  3. Telugu, ntv (2024-04-29). "Maa Oori Polimera 2 : అరుదైన ఘనత సాధించిన "పొలిమేర 2"." NTV Telugu. Retrieved 2024-08-23.
  4. విలేకరి. "'నీ స్నేహం'తో తెరంగేట్రం". sakshi.com. సాక్షి. Archived from the original on 9 November 2016. Retrieved 9 November 2016.
  5. "'Kshanam' has given me confidence to experiment: Satyam Rajesh". indianexpress.com. Indian Express. Archived from the original on 16 July 2016. Retrieved 9 November 2016.
  6. "Satyam Rajesh's last film as." indiaglitz.com. Archived from the original on 27 May 2016. Retrieved 9 November 2016.
  7. The Hindu, Reviews (7 November 2014). "Joru: Slapstick merry go round". Sangeetha Devi Dundoo. Archived from the original on 9 July 2018. Retrieved 20 June 2019.
  8. 123 తెలుగు, సినిమా రివ్యూ (5 December 2014). "Lakshmi Raave Maa Intiki Telugu Movie Review". www.123telugu.com. Archived from the original on 23 March 2018. Retrieved 8 August 2020.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  9. మన తెలంగాణ, వార్తలు (25 October 2015). "అనుబంధాలు, ఆప్యాయతల సౌఖ్యం". Archived from the original on 2020-06-12. Retrieved 12 June 2020.
  10. సాక్షి, సినిమా (14 April 2019). "ఊహకు అందని విషయాలతో..." Archived from the original on 14 April 2019. Retrieved 10 February 2020.
  11. సాక్షి, సినిమా (16 February 2019). "సృష్టిలో ఏదైనా సాధ్యమే". Archived from the original on 16 February 2019. Retrieved 10 February 2020.
  12. సాక్షి, సినిమా (24 January 2020). "'డిస్కో రాజా' మూవీ రివ్యూ". సంతోష్‌ యాంసాని. Archived from the original on 2020-01-24. Retrieved 24 January 2020.
  13. ఈనాడు, సినిమా (24 January 2020). "రివ్యూ: డిస్కోరాజా". Archived from the original on 24 January 2020. Retrieved 24 January 2020.

బయటి లింకులు

మార్చు