పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు
(పవన్‌ కల్యాణ్ నుండి దారిమార్పు చెందింది)

కొణిదెల పవన్ కళ్యాణ్[n 1] (జననం:కొణిదెల కళ్యాణ్ బాబు;1968 సెప్టెంబరు 2) తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, దర్శకుడు, జనసేన రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడు.[4][6] అతను 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[7] ప్రస్థుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్


ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 12

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2024 జూన్ 4
ముందు పెండెం దొరబాబు
నియోజకవర్గం పిఠాపురం

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 సెప్టెంబరు 14

వ్యక్తిగత వివరాలు

జననం 2 సెప్టెంబర్ 1968[n 1]
బాపట్ల, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ జనసేన పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజా రాజ్యం పార్టీ (2008 నుండి 2014 వరకు)
జీవిత భాగస్వామి
బంధువులు చిరంజీవి, నాగేంద్రబాబు, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్
సంతానం అకీరానందన్, ఆధ్యా, మార్క్ శంకర్ పవనోవిచ్, పొలెనా అంజనా పవనోవా
వృత్తి

అతని సోదరులు చిరంజీవి, కొణిదెల నాగేంద్రబాబు కూడా సినిమా నటులు. అతను 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. 1998లో అతను నటించిన తొలిప్రేమ సినిమా ఆ సంవత్సరం తెలుగు భాషా ఉత్తమ సినిమాగా జాతీయ ఫిలిం పురస్కారాన్ని పొందింది. తన అభిమానులు "పవర్ స్టార్"గా పిలుచుకునే పవన్ కళ్యాణ్ సుస్వాగతం (1998). తమ్ముడు (1999), బద్రి (2000), ఖుషి (2001), జల్సా (2008), గబ్బర్ సింగ్ (2012), అత్తారింటికి దారేది (2013), భీమ్లా నాయక్ (2022) మొదలైన సినిమాలలో నటించాడు.[8]

అతను గబ్బర్ సింగ్ సినిమాలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది.[9][10] అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై అతను సినిమాలను నిర్మిస్తున్నాడు.[11]

2008లో పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ప్రవేశించాడు. తన సోదరుడు స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీకి యువ విభాగానికి అధ్యక్షునిగా ఉన్నాడు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తరువాత అతను పార్టీని విడిచి పెట్టాడు. 2014 మార్చిలో అతను జనసేన పార్టీ స్థాపించాడు. .[12][13] ఆ కాలంలో అతను గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన భారతీయ సెలబ్రిటీ రాజకీయ నాయకునిగా గూగుల్ జాబితాలో చేరాడు.[14] అతను దాతృత్య కార్యక్రమాలు చేసేవ్యక్తిగా గుర్తింపబడ్డాడు.[18] ఆంధ్రప్రదేశ్‌లోని పేద ప్రజలకు సహాయం చేయడానికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ (CMPF) అనే స్వచ్ఛంద ట్రస్ట్‌ను స్థాపించాడు.[19][20]

అతను కరాటేలో బ్లాక్ బెల్ట్ కలిగి ఉన్నాడు. అతనికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉంది. ముఖ్యంగా నిత్యం పుస్తక పఠనం చేస్తారు.మంచి వాక్ ధాఠి కలిగినవారు

బాల్య జీవితం-కుటుంబం

పవన్ కళ్యాణ్ 1968 లేదా 1971 సెప్టెంబరు 2 న[n 1] కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లలో జన్మించాడు.[25][26] ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.[27] అతను తన పబ్లిక్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శనలలోని ఒకదానిలో "పవన్" పురస్కారాన్ని అందుకున్నాడు.[28] అతనికి కరాటేలో బ్లాక్ బెల్ట్ ఉంది.[29] అతను సినిమా నటులైన రాం చరణ్ తేజ్[30], వరుణ్ తేజ్ [31] లకు చిన్నాన్న. సాయి ధరం తేజ్, అల్లు అర్జున్ లకు మామయ్య.[32]

నట జీవితం

కళ్యాణ్ 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా నటించాడు. అతని రెండవ చిత్రం గోకులంలో సీత తరువాత సంవత్సరం విడుదలైంది. అతను తరువాత ఎ. కరుణాకరన్ దర్శకత్వం వహించిన తొలి ప్రేమ (1999) చిత్రంలో కనిపించాడు. ఇది ఆ సంవత్సరం జాతీయ అవార్డుతో పాటు ఆరు నంది అవార్డులను గెలుచుకుంది[33]. తొలి ప్రేమ సినిమా తర్వాత కళ్యాణ్ తమ్ముడు సినిమాలో కిక్ బాక్సర్‌గా నటించాడు. తమ్ముడు సినిమా 1999 జూలై 15 న విడుదలైంది. పి.ఎ. అరుణ్ ప్రసాద్ రచన, దర్శకత్వం వహించారు. 2000 ఏప్రిల్ 20న, అతను పూరి జగన్నాధ్ మొదటి దర్శకత్వం వహించిన బద్రిలో నటించాడు. ఈ సినిమాను టి. త్రివిక్రమరావు నిర్మించగా, రమణ గోగుల సంగీతం సమకూర్చాడు.

2001లో ఖుషి చిత్రంలో నటించాడు. ఈ చిత్రం 2001 ఏప్రిల్ 27న విడుదలైంది. దీనికి ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించాడు. ఇది ఆ సంవత్సరం భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది[34]. 2001లో అతని సోదరుడు చిరంజీవి కోకాకోలా పానీయాన్ని ప్రమోట్ చేస్తున్న సమయంలో అతను పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు[35]. అతని తదుపరి చిత్రం జానీని తాను స్వయంగా రచించి, దర్శకత్వం వహించాడు. అది 2003 ఏప్రిల్ 26న విడుదలైంది. అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో అతను రేణు దేశాయ్‌తో నటించగా, రమణ గోగుల సంగీతం అందించాడు.

2004లో అతని చిత్రం గుడుంబా శంకర్‌ విడుదలైంది. ఈ సినిమాకి వీర శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను తన సోదరుడు నాగేంద్రబాబు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఈ చిత్రానికి స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేని కళ్యాణ్ రాశాడు. ఈ చిత్రంలో మూడు పాటలకు కొరియోగ్రఫీ కూడా అందించాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలను ఆతను రూపొందించాడు. దీనికి కొరియోగ్రఫీ కూడా చేశాడు. 2005లో ఎ. కరుణాకరన్ దర్శకత్వంలో బాలు సినిమా విడుదలైంది. తొలిప్రేమ తర్వాత కళ్యాణ్‌తో కరుణాకరన్‌కి ఇది రెండో సినిమా. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్విని దత్ నిర్మించాడు.

2006లో తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వం వహించిన బంగారం చిత్రం విడుదలైంది. 2006 మార్చిలో, కళ్యాణ్ తన రెండవ దర్శకత్వ వెంచర్ సత్యాగ్రహిని ప్రారంభించాడు, ఈ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మించాడు. ఇది సమాజంలోని దురాగతాలను ప్రశ్నించే కథ. పి.సి. శ్రీరాం, ఎ.ఆర్. రెహమాన్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ప్రీ-ప్రొడక్షన్‌పై కొన్ని నెలలు గడిచిన తరువాత, ఈ చిత్రం అకస్మాత్తుగా నిలిపివేయబడింది[36]. ఆ సంవత్సరం తరువాత, భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన అన్నవరంలో నటించాడు. ఈ చిత్రంలో కళ్యాణ్‌తో పాటు అసిన్, సంధ్యలు నటించారు. ఈ చిత్రాన్ని సూపర్ గుడ్ ఫిలింస్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రం 2006 డిసెంబరు 29 న విడుదలైంది[37]. ఈ చిత్రం 3 వారాల్లో ₹23 కోట్లు (US$2.9 మిలియన్), 70 రోజుల్లో ₹300 మిలియన్లు (US$3.8 మిలియన్) వసూలు చేసింది. ఈ చిత్రం తమిళ చిత్రం తిరుపాచికి రీమేక్. ఈ సినిమాలో నీవల్లే నీవల్లే అనే పాటకు కూడా కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశాడు.

2008లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన జల్సా ఏప్రిల్ 2న విడుదలైంది. ఈ చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో అత్యధిక మొదటి-రోజు వసూళ్లు సాధించింది. ఆ సమయానికి దక్షిణ భారతదేశంలోని ఏ ప్రాంతీయ చిత్రాలలో ఒకే రాష్ట్రంలో అత్యధిక మొదటి రోజు వసూళ్ళు చేసిన చిత్రాలలో మొదటిది.[38] జల్సా 2008లో తెలుగు చిత్రసీమలో అత్యధిక వసూళ్లు రాబట్టింది[39]. 2010లో ఎస్.జె. సూర్య దర్శకత్వం వహించిన పులి సినిమా విడుదలైంది. అదే సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన జీసస్ క్రీస్త్ సినిమాలో కళ్యాణ్ చిన్న పాత్రలో నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది.[40] 2011లో, అతను జయంత్ సి. పరాన్జీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్ కల్ రీమేక్ అయిన తీన్ మార్‌లో కనిపించాడు[41]. అతను విష్ణువర్ధన్ గ్యాంగ్‌స్టర్ చిత్రం పంజాలో కూడా కనిపించాడు.[42][43]

2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో దబాంగ్ రీమేక్ అయిన గబ్బర్ సింగ్‌లో కనిపించాడు. ఈ చిత్రం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకుంది[44]. ఆ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ తెలుగు చిత్రంగా నిలిచింది[45][46]. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పనిచేశాడు.

2013లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్తారింటికి దారేదిలో కనిపించాడు. 2013 సెప్టెంబరు 27న విడుదలైన ఈ చిత్రం, విడుదలకు ముందే సగం సినిమా ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో పైరసీ సమస్యలను ఎదుర్కొంది[47]. అయితే ఈ సినిమా 2013లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం 33 థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఆ సమయానికి టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది, ఇది మగధీర యొక్క మునుపటి రికార్డును అధిగమించింది[48]. తర్వాత దాన్ని బాహుబలి: ది బిగినింగ్‌ అధిగమించింది.

2014లో, స్టార్ ఇండియా సర్వే కళ్యాణ్‌ను భారతదేశంలోని టాప్ 5 హీరోలలో ఒకరిగా పేర్కొంది[49]. 2015లో, అతను "ఓ.మై.జి - ఓ మై గాడ్"[50] తెలుగు రీమేక్ అయిన గోపాల గోపాలలో నటించాడు. వెంకటేష్‌తో కలిసి కళ్యాణ్ నటించిన ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పర్దసాని దర్శకత్వం వహించాడు. 2016లో, కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్, 2012 చిత్రం గబ్బర్ సింగ్‌కి సీక్వెల్ విమర్శకుల నుండి పేలవమైన సమీక్షలను అందుకుంది. తమిళ చిత్రం "వీరం"కు రీమేక్ చిత్రం కాటమరాయుడు (2017). ఇది, కిషోర్ కుమార్ పార్ధసానితో అతని రెండవ సినిమా. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి సినిమాలో నటించాడు. ఇది కళ్యాణ్ 25వ చిత్రం.

2021లో, అతను వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన వకీల్ సాబ్‌లో కనిపించడం ద్వారా సినిమాలకు తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరి హర వీర మల్లు సినిమా చేస్తున్నాడు. ఇది ప్రస్తుతం 2023లో విడుదలకు షెడ్యూల్ చేయబడింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో కళ్యాణ్‌తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్‌ను కూడా మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.[51] ఒరిజినల్ సినిమాకు దర్శకత్వం వహించిన సముద్రకని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్‌తో కలిసి వినోదయ సితం, బ్రో సినిమాల రీమేక్‌లో కూడా అతను నటిస్తున్నాడు. మరో చిత్రం, OG సినిమా సుజీత్‌తో దర్శకుడిగా ప్రకటించబడింది. ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మించనున్నారు.

రాజకీయ జీవితం

పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు

ఉపముఖ్యమంత్రి

2024 ఎన్నికలలో 100 శాతం స్ట్రైక్రేట్ విజయం సాధించారు. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ కు పంచాయితీ రాజ్ , గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యాటకం, అటవీ,సైన్సు అండ్ టెక్నాలజీ శాఖలకు భాద్యతలు స్వీకరించారు. [52]

ప్రజారాజ్యం పార్టీ

2008లో తన అన్నయ్య చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీ లోని యువజన విభాగం అయిన యువరాజ్యం[53] నకు అధ్యక్షుడిగా కళ్యాణ్ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు[54]. ప్రజారాజ్యం పార్టీలో ఉన్న రోజుల్లో అతను ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఏ రాజ్యాంగబద్ధమైన పదవిని చేపట్టలేదు. అతను పార్టీ కోసం చురుగ్గా ప్రచారం చేస్తూన్నప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడ్డాడు. 2009 ఏప్రిల్ 19న వైజాగ్‌లో రోడ్‌షో సందర్భంగా వడదెబ్బ తగిలి కళ్యాణ్‌కు వాంతులు వచ్చాయి.[55] తర్వాత, 2011లో, చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో[56] విలీనం చేసినప్పుడు, కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజకీయ జీవితం నుండి విరామం తీసుకున్నాడు[57][58]. పార్టీని విలీనం చేయాలనే తన సోదరుడి నిర్ణయంతో విభేదించిన అతను 2014లో జనసేన పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.2019 లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2024 లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 70 వేలు పైచిలుకు మెజారిటీ తో గెలుపొంది, ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ అటవీ పర్యావరణ మంత్రి గా జూన్ 12,2024 వ తేదిన ప్రమాణస్వీకారం చేసారు.

జనసేన పార్టీ

 
నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్

పవన్ కళ్యాణ్ 2014 మార్చి 14న జనసేన పార్టీ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించాడు[59]. అతను ఇజం అనే పుస్తకాన్ని రాశాడు. ఇది జనసేన పార్టీ సిద్ధాంతం కూడా[60]. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు అప్పటి భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీతో సమావేశమై మద్దతు తెలిపాడు[61]. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ), బీజేపీ కూటమి కోసం అతను విస్తృతంగా ప్రచారం చేశాడు. కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో (హిందీలో 'కాంగ్రెస్‌ను ఆపండి, దేశాన్ని రక్షించండి') నినాదాన్ని పేర్కొంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ పాలనను వ్యతిరేకించాడు[62]. అతని ర్యాలీలను దక్కన్-జర్నల్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో "భారీ గుంపులు" అని పిలిచాయి[63]. 2017 ఆగస్టులో, అతను తన సినిమా కమిట్‌మెంట్‌లను పూర్తి చేసిన తర్వాత 2017 అక్టోబరు నుండి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాలని భావిస్తున్నట్లు ప్రకటించాడు.[64]

"Pawan Kalyan's talk touched my heart. My soul said that if there are youth like Pawan Kalyan, the Telugu spirit can never die. Telangana and Seemandhra can both prosper under someone like him."

—Prime Minister Narendra Modi about Kalyan[65]

ఉద్దానం కిడ్నీ వ్యాధి సంక్షోభం గూర్చి అతను నిరసనలు, నిరాహార దీక్షలు చేపట్టడం ద్వారా ఆ సమస్యను మీడియా, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాడు. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి గ్రామంలో డయాలసిస్ కేంద్రాలను నిర్మించి పలు పథకాలను అమలు చేసింది[66][67]. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పోటీ చేస్తుందని 2016 నవంబరులో కళ్యాణ్ ప్రకటించాడు[68]. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 175 శాసనసభా స్థానాల నుంచి పొత్తు లేకుండా పోటీ చేయాలని యోచిస్తున్నట్లు అతను తెలిపాడు.[69] డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ చర్యను అతను వ్యతిరేకించాడు[70][71]. కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ నుండి వలసలు వెళ్లి ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సంతాపంగా కళ్యాణ్ నిరసన పాదయాత్రకు నాయకత్వం వహించాడు.[72]

ల్యాండ్ పూలింగ్‌పై టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకించాడు[73]. రాజకీయ జవాబుదారీతనాన్ని కోరుతూ కళ్యాణ్ రాజమండ్రిలోని చారిత్రక ధవళేశ్వరం ఆనకట్టపై కవాతు నిర్వహించాడు[74]. తూర్పుగోదావరి జిల్లా లోని ప్రత్తిపాడు మండలానికి చెందిన వంతాడ గ్రామంలో రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ను అతను బయటపెట్టాడు[75].

రాజమండ్రి బహిరంగ సభలో రైతులు, రైతు కూలీలు, మహిళలు, యువత, విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచేందుకు[76] అనేక చర్యలతో కూడిన "జనసేన పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టో"ను కళ్యాణ్ ప్రకటించాడు[77]. రాబోయే 2019 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో వామపక్ష పార్టీలైన[78] కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్), బహుజన్ సమాజ్ పార్టీ[79] లతో కలిసి ఆయన పార్టీ పోటీ చేసింది. అదే సమయంలో అతను రాబోయే ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ అంతటా చురుకుగా ప్రచారం చేస్తున్నప్పుడు, అతను అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని ఆరోగ్య సమస్యలలో బాధపడ్డాడు. అతను సత్తెనపల్లెలో తన తదుపరి రౌండ్ ప్రచారానికి సిద్ధమవుతున్నప్పుడు, అతనికి తల తిరగడంతో పాటు వికారంగా అనిపించింది. గన్నవరం విమానాశ్రయంలో రీఫిల్లింగ్ కోసం ఛాపర్ డౌన్ అయినప్పుడు, పవన్ కళ్యాణ్ వాంతులు, డీహైడ్రేషన్ తో పాటు మగతతో పడిపోయాడు. వెంటనే విజయవాడలో ఆసుపత్రిలో చేరి చికిత్స అందించారు. అతను కోలుకున్న తర్వాత మళ్లీ ప్రచారం మొదలైంది.[80][81]

2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ 140 నియోజక వర్గాల నుండి పోటీ చేసింది. అతను గాజువాక[82], భీమవరం[83] నియోజక వర్గాల నుండి పోటీ చేసాడు. రెండు స్థానాలలోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో ఓడిపోయాడు[84]. అతని పార్టీ ఈ ఎన్నికలలో ఒక్క రాజోలు నియోజకవర్గం నుండి మాత్రమే గెలుపొందింది[85].

అదే సంవత్సరం 2019 నవంబరు 3న, అతను యై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక సరఫరా కొరత కారణంగా నిరుద్యోగాన్ని ఎదుర్కొంటున్న భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖపట్నంలో లాంగ్ మార్చి‌కు నాయకత్వం వహించాడు[86].[87]

2020 జనవరి 16 న, కళ్యాణ్ తన పార్టీతో బిజెపికి గల పొత్తును ప్రకటించాడు. 2024లో జరగబోయే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి పోరాడుతాయని ప్రకటించాడు. 2020 ఫిబ్రవరి 12 న కర్నూలు‌లో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన 15 ఏళ్ల బాలిక సుగాలీ ప్రీతికి న్యాయం కోసం ర్యాలీకి నాయకత్వం వహించాడు[88]. ఈ ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు.

ఎన్నికలలో పోటీ

పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో ప్రచారకర్తగా విస్తృతస్థాయిలో ప్రచారం చేశాడు. కానీ ప్రజారాజ్యం పార్టీకి అధికారం దక్కకపోవడంతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో, పవన్ రాజకీయాలకు దూరం అయ్యాడు. ఆయన తిరిగి 2014లో జనసేన పార్టీని స్థాపించి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేయలేదు కానీ, టీడీపీకి తన సంపూర్ణ మద్దతు తెలిపాడు. ఆ తరువాత 2019లో టీడీపీ నుంచి విడిపోయి జనసేన ఒంటరిగా పోటీ చేయగా ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు స్థానాల్లో పోటీ చేయగా రెండింటిలోనూ ఓడిపోగా, జనసేన ఒక్క సీటునే గెలిచింది.

పవన్ కళ్యాణ్ ఆ తరువాత 2024లో శాసనసభ ఎన్నికలలో టీడీపీ, బీజేపీతో పొత్తు పెట్టుకొని  పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి 72,279 ఓట్ల మోజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై జూన్ 12న మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.[89]

ఇతర సేవలు

బ్రాండ్ అంబాసిడర్

  • 2001 ఏప్రిల్ లో శీతల పానీయం పెప్సీ కంపెనీ అతనిని బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. ప్రసిద్ధ శీతల పానీయాన్ని ఆమోదించిన మొదటి దక్షిణ భారతీయునిగా గుర్తింపబడ్డాడు.[90]
  • 2017 జనవరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని హ్యాండ్ లూమ్ నేత కార్మికులకు బ్రాండ్ అంబాసిడర్ పాత్రను చేపట్టేందుకు కళ్యాణ్ అంగీకరించారు.[91]
  • 2017 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవ దానం కోసం ప్రారంభించిన జీవన్ దాన్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కళ్యాణ్‌ను కోరారు.[92]

హార్వార్డ్ విశ్వవిద్యాలయం

14వ ఎడిషన్ ఇండియా కాన్ఫరెన్స్ 2017లో మాధవన్‌తో కలిసి ప్రసంగించడానికి కళ్యాణ్‌ను హార్వర్డ్ యూనివర్సిటీకి ఆహ్వానించారు.[93]

వ్యక్తిగత జీవితం

పవన్ కళ్యాణ్ 2006లో సినిమాలలో ప్రవేశించిన తరువాత, మే 1997లో నందీనితో పవన్ కు వివాహం జరిగింది. 2001లో అతను సినిమా నటి రేణూదేశాయ్తో సహజీవనం ప్రారంభించాడు. 2004లో వారికి అకీరానందన్ అనే కుమారుడు జన్మించాడు.[94][95] 2007 జూలైలో నందిన తనకు విడాకులు ఇవ్వకుండా వేరొక మహిళను వివాహం చేసుకున్నాడని బైగమీ (చట్టబద్ధంగా భార్యకు విడాకులు ఇవ్వకుండా వేరొకరిని వివాహం చేసుకొనుట) కేసు దాఖలు చేసింది. రేణూ దేశాయ్తో పవన్ అక్రమ సంబంధం నెరపుతున్నాడని వారిద్దరికీ అప్పటికే ఒక కుమారుడు కూడా జన్మించి ఉన్నాడనీ ఆమె కోర్టులో కేసు వేసింది.[96] చిరంజీవి కుటుంబంలోని 14 మందిపై ఆరోపణలు చేసింది. పవన్ కళ్యాన్ రేణూదేశాయ్ ను వివాహం చేసుకోలేదని కోర్టులో తెలియజేయగా ఈ పిటిషన్‌కు సరైన సాక్ష్యాలు లేవని విశాఖపట్నం లోని కోర్టు కొట్టివేసింది[97]. దీనిపై నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా కొట్టివేతపై కొర్టు స్టే ఇచ్టింది.

తదనంతరం, 2007 జూలైలో, కళ్యాణ్ విశాఖపట్నంలోని కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం కేసును దాఖలు చేశాడు. వారి వివాహం జరిగిన వెంటనే నందిని తనను విడిచిపెట్టిందని ఆరోపించాడు. దానిని ఆమె న్యాయవాది తిరస్కరించాడు. నందిని భరణం కోరింది. తాత్కాలిక భరణంగా నెలకు ఐదు లక్షలు ఇప్పించాలన్న ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేయగా, ఈ తీర్పుపై కూడా నందిని ఉన్నత న్యాయస్థానం నుండి స్టే పొందింది. ఐదు కోట్ల రూపాయలకు రాజీ కుదరగా నందిని అన్ని కేసులను ఉపసంహరించుకుంది. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నం లోని ఫ్యామిలీ కోర్టు వీరిద్దరకి విడాకులు మంజూరు చేసింది.[98][99]

ఎనిమిది సంవత్సరాల సహజీవనం తరువాత అతను నటిగా మారిన మోడల్ రేణూ దేశాయ్ని 2009 జనవరి 28 న వివాహం చేసుకున్నాడు.[99] వీరికి 2010లో కలిగిన కుమార్తె పేరు ఆద్య. [100] ఈ జంట 2012లో అధికారికంగా విడాకులు తీసుకుని విడిపోయారు. 2018 లో ఒక ఇంటర్వ్యూలో, దేశాయ్ కళ్యాణ్ "ఆమె మొదట నిరసన తెలియజేసినప్పటికీ విడాకుల కోసం పట్టుబట్టారు" అని పేర్కొంది. తమ విడాకుల గురించి బహిరంగ ప్రకటన చేయాలన్న తన అభ్యర్థనను కళ్యాణ్ తిరస్కరించారని ఆమె తెలిపింది.[101] తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యా భర్తలుగా విడిపోయినా, తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణూ దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది.[102] విడిపోయే సమయంలోఆమె పవన్ వద్ద నుండి పెద్ద ఎత్తున భరణం తీసుకొన్నాననే వార్తలలో నిజం లేదని, తాను స్వయంకృషితోనే తనకు కావలసినవన్నీ సమకూర్చుకొంటున్నానని స్పష్టం చేసింది.

కళ్యాణ్ 2011లో తీన్ మార్ సినిమా షూటింగ్ సందర్భంగా తన మూడవ భార్య అయిన రష్యా నటి అన్నా లెజెనేవాను కలుసుకున్నాడు.[94] 2013 సెప్టెంబరు 30న హైదరాబాదు లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది.[95][103] వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్, కుమార్తె పేరు పొలెనా అంజనా పవనోవా.[104][105][106]

ఫిల్మోగ్రఫీ

పురస్కారాలు

  • 2017 నవంబరులో ఇండో-యూరపియన్ బిజినెస్ ఫోరమ్ నుండి గ్లోబల్ ఎక్సెలెన్స్ పురస్కారం అందుకొన్నాడు.[107] నటుడిగా, రాజకీయవేత్తగా, రాజకీయ నాయకుడిగా, సమాజ సేవకుడిగా ఆయనను గుర్తించి ఈ అవార్డు ఇచ్చారు.[108]

సైమా అవార్డులు

మూలాలు

  1. 1.0 1.1 "From Pawan Kalyan to Vijay Deverakonda: Tollywood stars who got listed in Forbes top 100 richest Indians". The New Indian Express. Archived from the original on 9 December 2018. Retrieved 21 December 2018.
  2. 2.0 2.1 "Pawan Kalyan – Forbes India Magazine". Archived from the original on 24 September 2014. Retrieved 29 April 2014.
  3. "2017 Celebrity 100 – Forbes India Magazine". Archived from the original on 11 July 2018. Retrieved 9 September 2018.
  4. [1][2][3]
  5. "2017 Celebrity 100 – Forbes India Magazine". Archived from the original on 11 July 2018. Retrieved 9 September 2018.
  6. [1][2][5]
  7. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Pithapuram". Archived from the original on 27 June 2024. Retrieved 27 June 2024.
  8. Pagadala, Rishika (2 September 2016). "What makes Power Star Pawan Kalyan so popular? Birthday Special". The Hans India. Retrieved 11 April 2021.
  9. Filmfare Awards (South): The complete list of Winners Archived 10 మే 2015 at the Wayback Machine. CNN-IBN.in.com (21 July 2013). Retrieved 14 May 2014.
  10. "Nitya, Nag bag awards on star-studded night". The Hindu. Chennai, India. 16 June 2013. Archived from the original on 11 January 2016. Retrieved 16 June 2013.
  11. Sabyasachi, Dasgupta; Kumar, Biswal, Santosh; Anil, Ramesh, M. (2017-12-15). Holistic Approaches to Brand Culture and Communication Across Industries (in ఇంగ్లీష్). IGI Global. p. 7. ISBN 978-1-5225-3151-7.{{cite book}}: CS1 maint: multiple names: authors list (link)
  12. "Pawan Kalyan's political outfit named as 'Jana Sena' Party". The Times of India. Archived from the original on 13 March 2014. Retrieved 13 March 2014.
  13. "Telugu Actor Pawan Kalyan Launches New Party". The New Indian Express. 14 March 2014. Archived from the original on 14 March 2014. Retrieved 14 March 2014.
  14. "Pawan Kalyan most searched celebrity candidate on Google". NDTV.com. Retrieved 2023-05-05.
  15. "Pawan to be awarded for his philanthropic work". The Hans India (in ఇంగ్లీష్). 2017-09-26. Retrieved 2023-05-05.
  16. "Pawan Kalyan Turns 51: Did You Know Why the Actor is Called the 'Power Star' of Telugu Cinema?". News18 (in ఇంగ్లీష్). 2022-09-02. Retrieved 2023-05-05.
  17. "Happy Birthday Pawan Kalyan: Larger-than-life actor to young blood politician, a true hero on and off screen". Pinkvilla (in ఇంగ్లీష్). 2022-09-02. Archived from the original on 2023-05-05. Retrieved 2023-05-05.
  18. [15][16][17]
  19. R G Vijayasarathy (2 November 2007). "Chiru's brother lends a hand to common man". Rediff.com. Retrieved 2023-05-05.
  20. "Pawan moots JAC of displaced farmers". The Hindu. 7 July 2018. ISSN 0971-751X. Archived from the original on 10 July 2018. Retrieved 30 January 2019.
  21. K., Janani (2 September 2021). "Pawan Kalyan turns 50. Allu Arjun to Rakul Preet, celebs wish him on his birthday". India Today.{{cite web}}: CS1 maint: url-status (link)
  22. "'Bheemla Nayak' title song for Pawan Kalyan's birthday". The Hindu. 2 September 2021. ISSN 0971-751X.
  23. "Happy Birthday Pawan Kalyan: Chiranjeevi, Ravi Teja, Allu Arjun and others wish Bheemla Nayak actor". The Indian Express. 2 September 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  24. "Pawan kalyan 2019 election affidavit". Election Commission of India. 22 March 2019.{{cite web}}: CS1 maint: url-status (link)
  25. "Leaders console Chiranjeevi". The Hindu. Chennai, India. 25 December 2007. Archived from the original on 7 June 2012. Retrieved 27 September 2021.
  26. "Pawan Kalyan for end to caste culture". The Hans India. 19 March 2018.
  27. "రేపటి తరాల కోసమే...నా ఆరాటం". ఈనాడు.నెట్. హైదరాబాదు: ఈనాడు. Archived from the original on 22 March 2017. Retrieved 22 March 2017.
  28. "Happy Birthday 'Power Star' Pawan Kalyan – Telugu Movie News". IndiaGlitz. Archived from the original on 3 February 2012. Retrieved 18 October 2011.
  29. "Pawan Kalyan – Forbes India Magazine". Forbes. 31 October 2013. Archived from the original on 24 September 2014. Retrieved 20 July 2014.
  30. "Ram Charan Teja says he will campaign for uncle Pawan Kalyan in 2019". 25 May 2018. Archived from the original on 13 August 2018. Retrieved 13 August 2018.
  31. "Varun Tej does a Pawan Kalyan". 2 September 2017. Archived from the original on 13 August 2018. Retrieved 13 August 2018.
  32. "Sai Dharam Tej credits uncle Pawan Kalyan for making him understand fan power". The Times of India. Archived from the original on 21 October 2018. Retrieved 21 October 2018.
  33. "Nandi Awards Nandi Awards – 1998". Chithr.com. Archived from the original on 7 July 2012. Retrieved 18 October 2011.
  34. "Pawan Kalyan's Kushi completes 19 years of release; trending big-time on social media". The Times of India. 2020-04-27. ISSN 0971-8257. Retrieved 2023-05-05.
  35. Staff (18 April 2001). "Colas take war into Telugu film home". The Hindu. Archived from the original on 27 July 2014. Retrieved 18 July 2014.
  36. "Satyagrahi film launch – Telugu Cinema – Pawan Kalyan". idlebrain.com. Archived from the original on 6 January 2019. Retrieved 10 December 2015.
  37. "Annavaram – Power Star proves his might again". IndiaGlitz. 29 December 2006. Archived from the original on 9 January 2019. Retrieved 2 October 2012.
  38. "Jalsa breaks all the records". IndiaGlitz. 4 April 2008. Archived from the original on 6 January 2019. Retrieved 12 March 2016.
  39. "'GS 2' to Become Pawan-Devi's 4th Mega Hit!". Cinejosh. 19 December 2013. Archived from the original on 6 January 2019. Retrieved 12 March 2016.
  40. The Guardian.Pawan Kalyan to star in Bollywood film of Christ's life Archived 26 ఏప్రిల్ 2017 at the Wayback Machine
  41. "Pawan's 'LAK' remake titled 'Teenmaar' – Telugu Movie News". IndiaGlitz. 31 August 2005. Archived from the original on 6 January 2019. Retrieved 4 February 2011.
  42. Vishnuvardhan's double dhamaka – Times Of India Archived 8 జూలై 2013 at the Wayback Machine. The Times of India. (2 February 2011). Retrieved 6 December 2011.
  43. Pawan-Vishnu flick in March Archived 23 డిసెంబరు 2011 at the Wayback Machine. Sify.com (1 February 2011). Retrieved 6 December 2011.
  44. Gabbar Singh begins shoot Archived 5 సెప్టెంబరు 2013 at the Wayback Machine. Sify.com (12 September 2011). Retrieved 14 May 2014.
  45. Gabbar Singh completes 100 days at the box office – IBNLive Archived 21 ఆగస్టు 2012 at the Wayback Machine. CNN-IBN.in.com (18 August 2012). Retrieved 14 May 2014.
  46. Gabbar Singh on a roll at the box office. Business Standard (2 June 2012). Retrieved 14 May 2014.
  47. "Celebs condemn the piracy act of Attarintiki Daredi – Times of India". The Times of India. Archived from the original on 2 October 2017. Retrieved 16 April 2020.
  48. Pawan's Attarintiki Daredi completes 100 days – The Times of India Archived 2 ఫిబ్రవరి 2014 at the Wayback Machine The Times of India. (4 January 2014). Retrieved 14 May 2014.
  49. "Pawan Kalyan in Top 5 Heroes of India". Deccan-Journal. Archived from the original on 6 January 2019. Retrieved 9 June 2014.
  50. "Pawan Kalyan to play Krishna in Telugu remake of Oh My God". The Hindustan Times. 22 July 2014. Archived from the original on 5 February 2016. Retrieved 28 March 2021.
  51. "#PSPK28: Pawan Kalyan to play lecturer in Harish Shankar's next? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 27 August 2021.
  52. https://x.com/JSPShatagniTeam?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
  53. "Chiranjeevi's brother Pavan Kalyan to head Praja Rajyam's youth wing". Rediff.com. Archived from the original on 17 January 2018. Retrieved 27 February 2019.
  54. "Pawan Kalyan to head Yuva Rajyam". The New Indian Express. Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.
  55. " Gopi-Gopika-Godavari music set for April release – Telugu News – India". IndiaGlitz.com. 22 April 2009.
  56. "Chiranjeevi announces merger of PRP with Congress in AP". The Economic Times. economictimes.indiatimes.com.com. 7 February 2011. Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019.
  57. Balaji, J. (6 February 2011). "Praja Rajyam Party merges with congress". The Hindu. Archived from the original on 11 October 2020. Retrieved 6 February 2011.
  58. "Will actor Pawan Kalyan grow political wings?". The Times of India. 2013-10-19. ISSN 0971-8257. Retrieved 2023-05-05. The fact that his brother merged the PRP with the Congress did not go down quite well with Pawan Kalyan and this was a well-known thing. Chiru's younger brother stopped associating himself with politics or the political ambitions of his brother once the PRP was merged with Congress.
  59. "Telugu actor Pawan Kalyan launches new party – indtoday". indtoday.com. Archived from the original on 14 March 2014. Retrieved 14 March 2014.
  60. "Pawan's ISM book: A summary". The Hans India. April 2014. Archived from the original on 26 July 2016. Retrieved 5 July 2016.
  61. Pawan Flies to Ahmedabad Archived 8 మే 2014 at the Wayback Machine. Deccan-journal.com. Retrieved 14 May 2014.
  62. "'Congress Hatao, Desh Bachao'". The New Indian Express. 15 March 2014. Archived from the original on 3 April 2021. Retrieved 28 March 2021.
  63. Pawan draws huge crowds in Karnataka Archived 8 మే 2014 at the Wayback Machine. Deccan-journal.com. Retrieved 14 May 2014.
  64. "Pawan Kalyan bids adieu to movies, will be a full-time politician from October". The Indian Express. 1 August 2017. Archived from the original on 3 April 2021. Retrieved 28 March 2021.
  65. "In Narendra Modi's speech, Pawan Kalyan is hero, no mention of Chandrababu Naidu". ndtv.com. 9 March 2016. Archived from the original on 9 March 2016. Retrieved 22 April 2014.
  66. "Left Out in the Cold by KCR and Jagan Reddy, Pawan Kalyan May Warm Up to Chandrababu Naidu". News18. 19 January 2019. Archived from the original on 9 February 2019. Retrieved 7 February 2019.
  67. "Pawan Kalyan begins fast to over 'Uddanam' kidney ailment". Business Standard. 25 May 2018. Archived from the original on 25 May 2018. Retrieved 28 March 2021.
  68. "Jana Sena will contest 2019 polls". The Hindu. 11 November 2016. ISSN 0971-751X. Archived from the original on 11 October 2020. Retrieved 11 November 2016.
  69. "No tie-ups, Jana Sena to contest all 175 seats in Andhra, says Pawan Kalyan". Hindusthan Times. 3 January 2019. Archived from the original on 2 February 2019. Retrieved 7 February 2019.
  70. "Pawan Kalyan dredges up row, DCI sale sends workers in tizzy". The Times of India. 7 December 2017. Archived from the original on 9 February 2019. Retrieved 8 February 2019.
  71. Sarma, Ch R. S. (6 December 2017). "Pawan Kalyan backs Dredging Corpn staff stir against privatisation". @businessline. Archived from the original on 10 March 2021. Retrieved 8 February 2019.
  72. "Pawan Kalyan leads protest over drought in Andhra's Rayalaseema region". thenewsminute.com. 5 December 2018. Archived from the original on 9 February 2019. Retrieved 8 February 2019.
  73. Staff Reporter (28 July 2018). "The Hindu : Pawan questions State's 'strong-arm tactics' in acquisition of lands". The Hindu. Archived from the original on 11 October 2020. Retrieved 28 July 2018.
  74. Staff Reporter (15 October 2018). "The Hindu : Top priority to job generation: Pawan". The Hindu. Archived from the original on 9 November 2020. Retrieved 16 October 2018.
  75. "Pawan Kalyan alleges hand of ruling, Opposition leaders in 'illegal' Vanthada mining". The New Indian Express. Archived from the original on 25 February 2019. Retrieved 25 February 2019.
  76. Staff Reporter (15 March 2019). "JSP manifesto focuses on youth and farmers". The Hindu. Archived from the original on 11 October 2020. Retrieved 15 March 2019.
  77. "Jana Sena Party releases manifesto for 2019 elections". The Hans India. 14 March 2019. Archived from the original on 21 March 2019. Retrieved 17 March 2019.
  78. "Left parties, Janasena to contest together in AP Assembly elections: CPI Narayana". The Hans India. 3 January 2019. Archived from the original on 3 April 2021. Retrieved 28 March 2021.
  79. "Janasena-BSP alliance for AP elections,Mayawati wants to see Pawan Kalyan as CM". The Hans India. 15 March 2019. Archived from the original on 11 October 2020. Retrieved 17 March 2019.
  80. "Pawan Kalyan hospitalized, suffers sunstroke". The New Indian Express. 6 April 2019.
  81. "Pawan Kalyan fell ill due to sunstroke". The Hand India. 6 April 2019.
  82. "Andhra Pradesh assembly elections: Pawan Kalyan to contest from Gajuwaka and Bhimavaram". The Times of India. 19 March 2019. Archived from the original on 11 October 2020. Retrieved 19 March 2019.
  83. "AP Assembly:Jana Sena chief Pawan Kalyan to contest from Bhimavaram and Gajuwaka". thenewsminute.com. 19 March 2019. Archived from the original on 11 October 2020. Retrieved 19 March 2019.
  84. "Embarrassing loss for Pawan Kalyan". The Hindu. 24 May 2019. Archived from the original on 2 April 2021. Retrieved 28 March 2021.
  85. "Pawan Kalyan loses both seats, Jana Sena wins one". Deccan Chronicle. 24 May 2019. Archived from the original on 8 November 2020. Retrieved 28 March 2021.
  86. Reddy, Jahnavi (4 November 2019). "'Compensate workers in 2 weeks':Pawan Kalyan holds rally in Vizag over sand shortage". The News Minute. Archived from the original on 4 November 2019. Retrieved 28 March 2021.
  87. Bandari, Pavan Kumar (19 February 2020). "Jana Sena chief Pawan Kalyan welcomes Jagan's move over CBI inquiry on Sugali Preethi's case". The Hans India (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2021. Retrieved 28 March 2021.
  88. "Pawan Kalyan to protest against Kurnool rape-murder, faces student opposition". thenewsminute.com. 10 February 2020. Archived from the original on 25 February 2020. Retrieved 10 February 2020.
  89. Eenadu (12 June 2024). "చంద్రబాబు టీమ్‌ ఇదే.. కొత్త మంత్రుల వివరాలు ఇలా." Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  90. "A mouthful of bitter pill(s)". The Hindu. Archived from the original on 15 July 2003. Retrieved 22 December 2018.
  91. "Pawan Kalyan turns brand ambassador for handloom weavers in AP, Telangana". 18 January 2017. Archived from the original on 20 January 2017. Retrieved 18 January 2017.
  92. "Pawan Kalyan appointed as 'Jeevan Dhaan' brand ambassador". The Times of India. 31 July 2017. Archived from the original on 29 August 2018. Retrieved 13 August 2018.
  93. "Madhavan, Pawan Kalyan to speak at India Conference at Harvard". Business Standard India. Press Trust of India. 16 January 2017. Archived from the original on 22 December 2018. Retrieved 21 December 2018.
  94. 94.0 94.1 Rhode, Shruti (20 December 2020). "All you need to know about Pawan Kalyan's roller-coaster love life". Times Now. Retrieved 14 July 2021.
  95. 95.0 95.1 U. Sudhakar Reddy (29 December 2013). "Pawan Kalyan is married to Russian Anna Lezhneva". Deccan Chronicle. Archived from the original on 1 January 2014. Retrieved 15 January 2014.
  96. పవన్ కళ్యాణ్ నందినిల విడాకులు మంజూరు
  97. "Actor cleared of bigamy charge". Mumbai Mirror (in ఇంగ్లీష్). 8 January 2008. Retrieved 18 July 2021.
  98. Kumar, G. Arun (26 July 2007). "Telugu actor Pawan files for divorce". The Times of India. Retrieved 14 July 2021.
  99. 99.0 99.1 "Pavan Kalyan gets married". The Times of India (in ఇంగ్లీష్). 29 January 2009. Retrieved 14 July 2021.
  100. Hooli, Shekhar H. (23 March 2015). "Pawan Kalyan Celebrates Daughter Aadya's Birthday in Pune; Renu Desai Thanks Mega Family Fans for Wishes". IB Times. Retrieved 14 July 2021.
  101. "Pawan Kalyan's ex-wife Renu Desai reveals he insisted on divorce despite her protests". India Today (in ఇంగ్లీష్). 8 July 2018. Retrieved 14 July 2021.
  102. పవన్ వ్యక్తిగత స్వేచ్ఛను నేను ఆక్రమించదలచుకోలేదు - రేణు దేశాయ్
  103. గాద్గి హరీష్ నివాసం జహీరాబాద్ కల్యాన్ గారి ముఖ్య అనుచరుడు Pawan Kalyan is married to Russian Anna Lezhneva
  104. [1]
  105. "Pawan Kalyan's son with Anna Lezhneva named Mark Shankar Pawanovich?". India Today. Archived from the original on 20 April 2018. Retrieved 19 April 2018.
  106. "Spotted: Pawan Kalyan's wife Anna Lezhneva clicked with children at Hyderabad Airport". The Times of India (in ఇంగ్లీష్). 17 December 2020. Archived from the original on 30 April 2021. Retrieved 15 July 2021.
  107. ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం నుండి ఎక్సెలెన్స్ అవార్డ్
  108. [2]

గమనికలు

  1. 1.0 1.1 1.2 While several reliable sources report Kalyan's birth year as 1971,[21][22][23] his 2019 election affidavit indicates that he was born in 1968.[24]

వెలుపలి లంకెలు