రమేష్ నాయుడు
పసుపులేటి రమేష్ నాయుడు (జూన్ 27, 1933 - సెప్టెంబర్ 3, 1987) 1970వ, 80వ దశకములో సుప్రసిద్ద తెలుగు సినీ సంగీత దర్శకుడు. ఆయన సృష్టించిన పాటలు రాశి తక్కువైనా వాసి ఎక్కువ. ఆయన సంగీతము సమకూర్చిన మేఘసందేశం చిత్రంలోని పాటలు సంగీతపరంగా చాలా ప్రసిద్ధి గాంచినవి.
రమేష్ నాయుడు | |
జన్మ నామం | పసుపులేటి రమేష్ నాయుడు |
జననం | కొండపల్లి, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1933 జూన్ 27
మరణం | 1987 సెప్టెంబరు 3 | (వయసు 54)
క్రియాశీలక సంవత్సరాలు | 1933–1987 |
జననం
మార్చుపసుపులేటి రమేష్ నాయుడు1933జూన్,27న కృష్ణా జిల్లా, కొండపల్లిలో జన్మించాడు. యుక్తవయసులో ఇల్లు వదిలి బొంబాయికి పారిపోయి ఒక సంగీత వాయిద్యాలమ్మే దుకాణములో పనిచేశాడు. అక్కడ ఆయనకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు వాయించే అవకాశం దొరికింది. అక్కడే ఆ అంగడికి వచ్చే వివిధ హిందీ సంగీత దర్శకులతో పరిచయాలు ఏర్పరచుకొనే అవకాశం కూడా కలిగింది. ఈయన 16యేళ్ళ వయసులో సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రంబంద్వల్ పహీజా అనే మరాఠీ చిత్రం.
ఈయన తెలుగు చిత్రరంగానికి సి.కృష్ణవేణి నిర్మించిన దాంపత్యం చిత్రంతో పరిచయం అయ్యారు. ఆ చిత్రం తరువాత మనోరమ (ఈ చిత్రంలో ప్రముఖ హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో రెండు పాటలు పాడించారు) లాంటి ఒకటి రెండు తెలుగు చిత్రాలలో పనిచేసి 60వ దశకము ప్రారంభము కళ్ళా తిరిగి బొంబాయి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కలకత్తాకు మారి అనేక బెంగాళీ చిత్రాలకు పనిచేసి అక్కడే ఒక బెంగాళీ యువతిని పెళ్ళిచేసుకున్నాడు. 10 సంవత్సరాల పాటు అనేక బెంగాళీ, నేపాలీ, ఒరియా చిత్రాలకు సంగీతము అందించాడు.
తెలుగులో రమేష్ నాయుని పునఃప్రవేశం 1972లో విడుదలైన శోభన్ బాబు చిత్రం అమ్మమాటతో జరిగింది. ఆ తరువాత ఆయన తెలుగు చిత్రరంగంలో కొనసాగాడు. 1970, 80లలో ఈయన ప్రతిభను పూర్తి స్థాయిలో వినియోగించుకొని తెలుగు చిత్ర రంగానికి కొన్ని అత్యుత్తమ మధురగీతాలను అందించిన దర్శకులలో దాసరి నారాయణరావు, విజయ నిర్మల, జంధ్యాల ప్రధానమైన వారు.
రమేష్ నాయుడు గీతాలను తీసుకొని వాటికి మధురమైన బాణీలు కట్టేవాడు. ఇలాంటి శైలిలో పనిచేసే అతికొద్ది సంగీత దర్శకులలో కె.వి.మహదేవన్తో పాటు ఈయనా ఒకడు. వేటూరి సుందరరామ్మూర్తి తెలుగు చిత్ర సంగీతదర్శకులు, దర్శకులతో తన అనుబంధము గురించి రచించిన కొమ్మ కొమ్మకో సన్నాయి పుస్తకంలో కె.వి.మహదేవన్, ఎన్టీ రామారావు, ఆత్రేయ, బాలు, ఇళయరాజా వంటి వారికి ఒక్కొక్క అధ్యాయము కేటాయించగా రమేష్ నాయుడు ఒక్కనికే రెండు అధ్యాయములు కేటాయించాడు.
రమేష్ నాయుడు హిందీ చిత్రరంగానికి లక్ష్మీకాంత్-ప్యారేలాల్ను పరిచయం చేశాడు. మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ రమేష్ నాయుని సంగీత బృందంలో శాశ్వత సభ్యుడు. ఈయన చివరి చిత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన స్వయంకృషి. ఈ చిత్రం విడుదలయ్యే ముందు రోజే 1987, సెప్టెంబర్ 3 న మరణించాడు.
చిత్రమాలిక
మార్చు- స్వయంప్రభ (1957)
- దాంపత్యం (1957) : నడివీధిలో జీవితం
- వేగుచుక్క (డబ్బింగ్) (1957)
- కూతురు కాపురం (1959)
- మనోరమ (1959) : చందమామ రావే జాబిల్లి రావే
- శాంత (1961)
- గుళ్లో పెళ్లి (1961)
- మాస్టారమ్మాయి (1964)
- అమ్మమాట (1972) : ఎప్పుడూ మీ పాఠాలంటే ఎలాగండి సార్
- తాతా మనవడు (1972) : అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
- జీవితం (1973)
- గంగ మంగ (1973)
- మీనా (1973) : శ్రీరామ నామాలు శతకోటి
- దేవుడు చేసిన మనుషులు (1973) : దేవుడు చేసిన మనుషుల్లారా
- సంసారం-సాగరం (1974)
- చందన (సినిమా) (1974)
- బంట్రోతు భార్య (1974)
- రాధమ్మ పెళ్లి (1974) : ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు
- ఇంటింటి కథ (1974)
- దేవదాసు (1974)
- చదువు సంస్కారం (1975) : దీపానికి కిరణం ఆభరణం
- కవిత (1976)
- దేవుడే గెలిచాడు (1976) : ఈ కాలం పదికాలాలు బ్రతకాలని
- ముద్దబంతి పువ్వు (1976)
- తూర్పు పడమర (1976) : స్వరములు ఏడైనా రాగాలెన్నో
- చిల్లరకొట్టు చిట్టెమ్మ (1977) : చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు
- జీవితమే ఒక నాటకం (1977)
- ఓ మనిషి తిరిగి చూడు (1977)
- అనుకున్నది సాధిస్తా (1978)
- శివరంజని (1978) : జోరుమీదున్నావు తుమ్మెదా
- సూర్యచంద్రులు (1978)
- రౌడీ రంగమ్మ (1979)
- నీడ (1979)
- కల్యాణి (1979) : గుబులు పుట్టిస్తావు ఓ మల్లికా
- కుడి ఎడమైతే (1979)
- అంతులేని వింతకథ (1979)
- హేమా హేమీలు (1979)
- మంగళ తోరణాలు (1979)
- వజ్రాల జలపాతం (విడుదల కాలేదు) (1979)
- జయసుధ (1980) : ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తిలో
- అందాలరాశి (1980)
- పసుపు పారాణి (1980)
- సుజాత (1980) : ఉంగరం పడిపోయింది పోతే పోనీ
- సంఘం చెక్కిన శిల్పాలు (1980)
- ముద్ద మందారం (1981) : అలివేణీ ఆణిముత్యమా, ముద్దుకే ముద్దొచ్చే మందారం
- భోగిమంటలు (1981)
- ఆశాజ్యోతి (1981)
- అమృతకలశం (1981)
- అంతం కాదిది ఆరంభం (1981)
- మేఘ సందేశం (సినిమా) (1982) : ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
- ప్రేమ సంకెళ్ళు (1982)
- చలాకీ చెల్లెమ్మ (1982)
- కొత్తనీరు (1982)
- మల్లె పందిరి (1982)
- నెలవంక (1983)
- రెండుజెళ్ళ సీత (1983)
- గాజు బొమ్మలు (1983)
- గ్రహణం విడిచింది (1983)
- శ్రీవారికి ప్రేమలేఖ (1984) : తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, మనసా తుళ్ళిపడకే
- ఆనంద భైరవి (1984) : కొలువైతివా రంగశాయి
- కురుక్షేత్రంలో సీత (1984)
- జస్టిస్ చక్రవర్తి (1984)
- సంగీత సామ్రాట్ (1984)
- రావు - గోపాలరావు (1984)
- ఓ ఇంటి కాపురం (1984)
- మొగుడు పెళ్ళాలు (1985)
- శ్రీవారి శోభనం (1985)
- సువర్ణ సుందరి (1985)
- మాకు స్వతంత్రం కావాలి (1985)
- ఈ సమాజం మాకొద్దు (1985)
- పెళ్ళి నీకు అక్షింతలు నాకు (1985)
- మల్లె మొగ్గలు (1986)
- అహ! నా పెళ్ళంట ! (1987)
- సత్యాగ్రహం (1987)
- తల్లి గోదావరి (1987)
- స్వయంకృషి (1987) : సిగ్గూ పూబంతి విసిరే సీతామాలచ్చి
- తాతయ్య ప్రేమలేఖలు
- వయ్యారి భామలు వగలమారి భర్తలు
- వీణ
- ప్రణయ గీతం
- నాగమల్లి
- ధైర్యవంతుడు
- ఇల్లే స్వర్గం
- భారతంలో ఒకమ్మాయి
- భోళా శంకరుడు
- కలెక్టర్ విజయ
- మహాలక్ష్మి
- దేవదాసు మళ్లీ పుట్టాడు
- ఖైదీ కృష్ణుడు
- బంగారక్క
- భద్రకాళి
- అద్దాలమేడ
- అల్లరి బావ
బయటి లింకులు
మార్చు- చిమట మ్యూజిక్‌లో రమేష్ నాయుడు సంగీతం సమకూర్చిన పాటలు Archived 2007-10-14 at the Wayback Machine
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రమేష్ నాయుడు పేజీ