వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2024
|
01 వ వారం
మార్చు- ... కార్త్యాయని అమ్మ 96 ఏళ్ళ వయసులో అక్షరాస్యత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిందనీ!
- ... విజాగపటం తిరుగుబాటు 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం కంటే 77 ఏళ్ళ ముందే జరిగిందనీ!
- ... తమిళ సినిమా కథానాయిక డా. విద్యా ప్రదీప్ అమెరికాలో శాస్త్రవేత్త అనీ!
02 వ వారం
మార్చు- ... బెర్నార్డో బెర్టోలుచి ఇటాలియన్ సినిమా గొప్ప దర్శకుల్లో ఒకడిగా పరిగణించబడుతున్నాడనీ!
- ... ఉవ్వటుడు యుజుర్వేద వ్యాఖ్యాన రచయితల్లో ప్రముఖుడనీ!
- ... అరవిందన్ పురస్కారం కేరళ చలనచిత్ర పరిశ్రమలో కొత్త సినిమా దర్శకులకు ఇచ్చే పురస్కారమనీ!
- ... 5 సంవత్సరాల లోపు పిల్లలకు గుర్తింపు కోసం భారత ప్రభుత్వం బాల్ ఆధార్ ప్రారంభించిందనీ!
- ... పోలమాంబ దేవాలయం విశాఖపట్నంలో పెదవాల్తేరులో ఉన్న ప్రాచీన దేవాలయమనీ!
03 వ వారం
మార్చు- ... డాక్టర్ అనితా భరద్వాజ్ ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వైద్య సహాయంం అందించడంలో నిపుణురాలు అనీ!
- ... ఆనంద్ అమృతరాజ్ తన తమ్ముడు విజయ్ అమృత రాజ్ లానే టెన్నిస్ ఆటగాడనీ!
- ... ఐఎన్ఎస్ విశాఖపట్నం భారత నావికా దళానికి చెందిన క్షిపణి విధ్వంసక నౌక అనీ!
- ... సాయణాచార్య వేదాలకు విస్తృతంగా వ్యాఖ్యానాలు రాసిన రచయిత అనీ!
- ... డీప్ ఫేక్ సాంకేతికత సహాయంతో డిజిటల్ మాధ్యమాలలో ఒకరికి బదులు మరొకరితో మార్చడానికి సహాయపడుతుందనీ!
04 వ వారం
మార్చు- ... జైన సన్యాసి సమంతభద్ర దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని వ్యాప్తి చేశాడనీ!
- ... వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన టెన్నిస్ టోర్నమెంటు అనీ!
- ... ఎక్స్‌పోశాట్ కాస్మిక్ ఎక్స్-కిరణాలను అధ్యయనం చేయడానికి ఇస్రో తయారు చేసిన కృత్రిమ ఉపగ్రహమనీ!
- ... వయోలిన్ వాసు త్యాగరాజ శిష్య పరంపరలో ఆరవ తరానికి చెందినవాడనీ!
- ... విశాఖపట్నంలోని సేక్రేడ్ హార్ట్ చర్చి ఆంగ్లో ఇండియన్ సైనికుల కోసం 1932లో నిర్మించబడిందనీ!
05 వ వారం
మార్చు- ... ఎన్నికల ఏడాదిలో ఫిబ్రవరి 1న కొద్ది కాలానికి మాత్రమే ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ ను మధ్యంతర బడ్జెట్ అని అంటారనీ!
- ... తిరుమలై కృష్ణమాచార్య ని ఆధునిక యోగా పితామహుడిగా భావిస్తారనీ!
- ... కాకినాడ ఓడరేవు కు శతాబ్దాల చరిత్ర ఉందనీ!
- ... జైహింద్ టీవీ ని కాంగ్రెస్ పార్టీ ప్రవాస భారతీయుల మద్ధతుతో నిర్వహిస్తోందనీ!
- ... భారతదేశంలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రారంభించిన మొదటి కళాశాల ఆంధ్రా విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్ కళాశాల అనీ!
- ... పర్లాకిమిడి రైల్వే స్టేషన్ ఒడిషా రాష్ట్రపు మొట్టమొదటి రైల్వేస్టేషను అనీ!
06 వ వారం
మార్చు- ... వల్లభదేవ ను కాళిదాసు కావ్యాలపై మొదటి వ్యాఖ్యాతగా పరిగణిస్తారనీ!
- ... దుగరాజపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్ లో భారతకేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఓడరేవు అనీ!
- ... డిఎండికె తమిళనాడులో నటుడు విజయకాంత్ స్థాపించిన రాజకీయ పార్టీ అనీ!
- ... పద్మాపురం గార్డెన్స్ అరకు లోయలో ఒక పర్యాటక ఆకర్షణ కేంద్రమనీ!
- ... థామస్ సువార్త క్రైస్తవ బైబిల్లో చేరని సాంప్రదాయేతర సువార్త అనీ!
07 వ వారం
మార్చు- ... ఉమాస్వాతి జైన తత్వానికి సంబంధించి మొదటి సంస్కృత రచన చేశాడనీ!
- ... ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ సముద్ర విజ్ఞానంలో బోధన చేసేందుకు భారత ప్రభుత్వం స్థాపించిన విశ్వవిద్యాలయమనీ!
- ... ముడసర్లోవ రిజర్వాయర్ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తేలియాడే సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించిందనీ!
- ... 18వ శతాబ్దం నుండి ఇప్పటి వరకు జరిగిన చారిత్రిక మ్యాచ్‌లు, ఆటగాళ్ల డేటాబేస్ ఇఎస్పిఎన్క్రిక్ఇన్ఫో లో ఉంటాయనీ!
- ... ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరాల్లో ఫిన్లాండ్ లోని హెల్సింకి నగరం ఒకటనీ!
08 వ వారం
మార్చు- ... నటుడు గుఫీ పెయింటల్ మహాభారతం ధారావాహికలో శకుని పాత్రకు పేరు పొందిన వాడనీ!
- ... హిప్హాప్ తమిళ భారతదేశపు మొట్టమొదటి తమిళ హిప్ హాప్ ఆల్బం విడుదల చేసిన వాడనీ!
- ... రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మిత్ర రాజ్యాలు బెర్లిన్ నగరాన్ని విడగొట్టడం వల్ల తూర్పు బెర్లిన్ ఏర్పడిందనీ!
- ... సామాన్య ప్రజానీకానికి సూపర్ ఫాస్ట్ రైలు సేవలు అందుబాటులోకి తేవడానికి భారతీయ రైల్వేలు కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ప్రారంభించారనీ!
- ... ఆదిశంకరాచార్యులు శివానంద లహరి స్తోత్రాన్ని శ్రీశైల క్షేత్రంలో రాశాడనీ!
09 వ వారం
మార్చు- ... సిల్వియో బెర్లుస్కోనీ నాలుగు పర్యాయాలు ఇటలీ ప్రధానమంత్రిగా పని చేశాడనీ!
- ... పశ్చిమ బెంగాల్ లో ప్రవహించే అట్రాయ్ నది ప్రస్తావన మహాభారతంలో ఉందనీ!
- ... ఫ్లూయెంట్‌గ్రిడ్ నిత్యావసరాల సరఫరా పంపిణీ సంస్థలకు డిజిటల్ సేవలు అందించే సంస్థ అనీ!
- ... కృష్ణ ఫలం అనేది దక్షిణ బ్రెజిల్ కు చెందిన బహుళజాతి ఫలం అనీ!
- ... భారత తొలి ఫీల్డ్ మార్షల్ సాం మానెక్ షా జీవితం ఆధారంగా వచ్చిన చిత్రం సామ్ బహదూర్ అనీ!
10 వ వారం
మార్చు- ... హెచ్. జి. వెల్స్ వైజ్ఞానిక కల్పన రచనలకు ప్రసిద్ధి పొందిన వాడనీ!
- ... అన్ని రంగాలలోని భారతీయ శాస్త్రవేత్తలను ఒకే వేదిక మీదకు తీసుకురావడానికి ఏర్పడిన సంస్థ ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అనీ!
- ... వ్యక్తుల డిజిటల్ సమాచార భద్రత కోసం భారత ప్రభుత్వం డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, 2023 అమల్లోకి తెచ్చిందనీ!
- ... నల్లమల అటవీప్రాంతంలో పుట్టి మాచర్ల వైపు ప్రవహించే నాగులేరు కృష్ణానదికి ఉపనది అనీ!
- ... అల్లం కుటుంబానికి చెందిన కర్కుమిన్ సౌందర్య సాధనాల్లోనూ, ఆహారంలోనూ ఎక్కువగా ఉపయోగిస్తారనీ!
11 వ వారం
మార్చు- ... ఫ్రాన్సిస్ బేకన్ అనుభవ వాదానికి ఆద్యుడిగా భావిస్తారనీ!
- ... దీక్షభూమి కొత్తపల్లి తెలంగాణా రాష్ట్రంలో లంబాడీలు, బంజారాల పుణ్యక్షేత్రమనీ!
- ... భారతదేశంలో సినిమాల ప్రదర్శన నియంత్రణకు ఏర్పాటు చేసిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సంస్థకు దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయనీ!
- ... ద్రావణిగా ఎక్కువగా ఉపయోగించే ఇథైల్ అసిటెట్ తీపి, ఫల వాసన కలిగి ఉంటుందనీ!
- ... మహిళా కళాకారులతో కూడిన కడక్ కలెక్టివ్ వివిధ రకాలైన గ్రాఫిక్ ఆర్ట్ ప్రాజెక్టులపై పనిచేస్తుందనీ!
12 వ వారం
మార్చు- ... పామర్తి వెంకటేశ్వరరావు ఎక్కువగా డబ్బింగ్ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడనీ!
- ... 1518 డ్యాన్స్ ప్లేగు లో బాధితులు కొన్ని వారాలపాటు నృత్యాలు చేశారనీ!
- ... మిరియాలకు ఘాటైన వాసన, రుచి పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ వలన కలుగుతుందనీ!
- ... సినీనటుడు విజయ్ తమిళనాడులో కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం అనీ!
- ... హిందూ, బౌద్ధ పురాణాలలో ఎక్కువగా కనిపించే మణిమేఖల అనే దేవత నౌకాప్రమాదాల నుంచి రక్షించే దేవతగా భావిస్తారనీ!
13 వ వారం
మార్చు- ... మహారాష్ట్ర తొలి ముస్లిం ముఖ్యమంత్రి అబ్దుల్ రెహమాన్ అనీ!
- ... ఆదివాసుల దేవాలయమైన జంగుబాయి పుణ్యక్షేత్రం తెలంగాణా, మహారాష్ట్ర సరిహద్దు అటవీప్రాంతంలో ఉందనీ!
- ... గైర్ నృత్యం రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ జానపద నృత్యం అనీ!
- ... ఉత్తరాంధ్రలో కాటమరాజు కథను చెబుతూ కులగోత్రాలను పొగిడేవారిని పొడపోతలవారు అంటారనీ!
- ... ప్రముఖ చిత్రకారుడు ఎం. ఎఫ్. హుస్సేన్ రచించి దర్శకత్వం వహించిన చిత్రం గజ గామిని అనీ!
14 వ వారం
మార్చు- ... షెర్లాక్ హోమ్స్ ఆంగ్ల రచయిత ఆర్థర్ కోనన్ డోయల్ సృష్టించిన ప్రముఖ డిటెక్టివ్ పాత్ర అనీ!
- ... ప్రముఖ రచయిత విక్టర్ హ్యూగో రాసిన లెస్ మిజరబుల్స్ ఆధారంగా తెలుగులో బీదల పాట్లు అనే సినిమా తీశారనీ!
- ... క్లోరో ఫామ్ ని మొదట్లో శస్త్రచికిత్స చేసేటపుడు మత్తుమందుగా వాడేవారనీ!
- ... హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రి నిలుఫర్ హనీంసుల్తాన్ పేరు మీదుగా ప్రారంభించినదనీ!
- ... ప్రపంచంలో అత్యంత సుదీర్ఘకాలం ఇప్పటికీ ఉనికిలో ఉన్న విజ్ఞాన సమాజం రాయల్ సొసైటీ అనీ!
15 వ వారం
మార్చు- ... మరాఠీ సాహిత్యంలో మొదటి స్త్రీవాద రచయిత్రి మాలతీ బేడేకర్ అనీ!
- ... ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ట్వెల్త్ ఫెయిల్ సినిమా పలు విభాగాల్లో 69వ ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను దక్కించుకుందనీ!
- ... పొగాకులో సహజంగా లభించే నికోటిన్ మానవునిలో తాత్కాలికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని సృష్టించగలదనీ!
- ... ప్రముఖ బాలివుడ్ నటి మాధురీ దీక్షిత్ ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం గజ గామిని అనీ!
- ... ఆస్ట్రేలియా స్థానిక సాంప్రదాయ కథల్లో నల్ల తలల కొండచిలువ ఎక్కువగా కనిపిస్తుందనీ!
- ... సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కెరీర్ కోసం ఆయన తండ్రి ముత్యాల రెడ్డి ఏకంగా ఉద్యోగమే మానేసాడినీ!
16 వ వారం
మార్చు- ... అమోఘవజ్ర బౌద్ధమతానికి చెందిన వజ్రయాన తంత్ర విద్వాంసుడనీ!
- ... చౌ నృత్యం పశ్చిమ బెంగాల్, ఒడిషా, ఝార్ఖండ్ లో ఎక్కువగా ప్రదర్శించబడే శాస్త్రీయ నృత్యమనీ!
- ... కృత్రిమ దారాలు తయారు చేసే రేయాన్ సహజ పట్టు, నూలు లాంటి స్పర్శ, అల్లికను ప్రదర్శించగలదనీ!
- ... డెర్మటోమయోసైటిస్ చర్మాన్ని, కండరాలని ప్రభావితం చేసే దీర్ఘకాలిక రుగ్మత అనీ!
- ... రాష్ట్రీయ లోక్ దళ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వమనీ!
17 వ వారం
మార్చు- ... అనితా గుహ ఎక్కువగా పౌరాణిక పాత్రలు పోషించిన భారతీయ నటి అనీ!
- ... గిరిజన కళలను ప్రోత్సహించడం కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంస్థ ఆదివాసీ లోక్ కళా అకాడమీ అనీ!
- ... పత్తి, పాలియెస్టర్ తో కలిపి తయారు చేసిన వస్త్రాలు గట్టిగా, ముడతలు పడకుండా ఉంటాయనీ!
- ... క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ను మలేరియా వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారనీ!
- ... బ్రెడ్, సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల కోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తుందనీ!
18 వ వారం
మార్చు- ... తెలుగు నటుడు రామ్మోహన్ ను ఆంధ్రా దేవానంద్ అని పిలిచేవారనీ!
- ... పంచవాద్యం కేరళ రాష్ట్రంలో ప్రాచుర్యమైన ఆలయ కళారూపం అనీ!
- ... దుస్తులు, కార్ల విడిభాగాలు, తివాచీలు లాంటి వివిధ వస్తువుల తయారీలో నైలాన్ ఉపయోగిస్తారనీ!
- ... కుక్కకాటు వల్ల రేబీస్ వ్యాధికి గురైన వారిలో జలభయం ఉంటుందనీ!
- ... ప్రపంచ విద్యారంగంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కొన్ని శతాబ్దాలుగా ప్రముఖ స్థానాన్ని కలిగి ఉందనీ!
19 వ వారం
మార్చు- ... తెలంగాణాకు చెందిన నాయకురాలు జివి వెన్నెల ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె అనీ!
- ... పానియా ప్రజలు కేరళ రాష్ట్రంలో కనిపించే అతిపెద్ద షెడ్యూల్డ్ తెగల్లో ఒకరు అనీ!
- ... పెక్టిన్ను జెల్లీలు, జామ్‌లు లాంటి ఆహార పదార్థాల తయారీలో ఎక్కువగా వాడతారనీ!
- ... 2017-18 సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన ఎలక్టోరల్ బాండ్ రాజ్యాంగ విరుద్ధమని 2024 లో సుప్రీంకోర్టు కొట్టివేసిందనీ!
- ... అడిలైడ్ నగరం ఆస్ట్రేలియాలో అత్యధిక జనాభా కలిగిన నగరాల్లో ఐదో స్థానంలో ఉందనీ!
20 వ వారం
మార్చు- ... భారతీయ సినీ నిర్మాత, వ్యాపారవేత్త రోనీ స్క్రూవాలా 2008 లో టైమ్ పత్రికలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకడిగా నిలిచాడనీ!
- ... ఉత్తర భారతదేశంలో భాయ్ దూజ్ పండుగను దీపావళి తర్వాత జరుపుకుంటారనీ!
- ... సెన్నోసైడు అనే పదార్థాన్ని విరేచనకారి మందుల్లో వాడతారనీ!
- ... ఆంధ్రభాషకు మూలపదాలను వివరించే ఆంధ్ర ధాతుమాల ను 1820కి మునుపే వేదం పట్టాభిరామశాస్త్రులు రాశాడనీ!
- ... రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును రూపొందించడానికి అమెరికా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టు పేరు మాన్‌హట్టన్ ప్రాజెక్టు అనీ!
21 వ వారం
మార్చు- ... మతాంగిని హజ్రా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలనీ!
- ... ఎనిమిది ప్రధాన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలలో మణిపురి రాస్ లీలా నృత్యం ఒకటి అనీ!
- ... జనుము మొక్కను 50 వేల ఏళ్ళ నుంచే వివిధ అవసరాలకు వాడుతూ వస్తున్నారనీ!
- ... కర్ణాటలోకి చారిత్రాత్మక బసవకల్యాణ్ నగరంలో ప్రపంచంలోకెల్లా ఎత్తైన బసవేశ్వరుని విగ్రహం ఉందనీ!
- ... అంతరించిపోతున్న పులులను కాపాడటానికి భారతప్రభుత్వం ప్రాజెక్ట్ టైగర్ అనే పథకాన్ని ప్రారంభించిదనీ!
22 వ వారం
మార్చు- ... శంకర్-ఎహసాన్-లాయ్ పలు భారతీయ భాషల్లో 50కి పైగా సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారనీ!
- ... ఒడిషాలో జరిగే ధను జాతర ప్రపంచంలో అతిపెద్ద ఓపెన్ అయిర్ థియేటర్లో జరిగే ప్రదర్శనగా గిన్నిస్ రికార్డులో స్థానం పొందినదనీ!
- ... కర్ణాటకలోని బనవాసి నగరం పురాతన కన్నడ రాజవంశమైన కదంబులకు రాజధాని అనీ!
- ... భారతదేశంలో పశ్చిమం వైపుకు ప్రవహించే అతి కొద్ది నదుల్లో మహీ నది ఒకటనీ!
- ... 1962 భారత్ చైనా యుద్ధం తర్వాత భారత ప్రభుత్వం స్థాపించిన ఏడు కేంద్ర సాయుధ బలగాల్లో ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ ఒకటనీ!
23 వ వారం
మార్చు- ... మెథిల్ దేవిక బధిరుల కోసం సరికొత్త భారతీయ శాస్త్రీయ నృత్యశైలిని సృష్టించిందనీ!
- ... పువ్వులలో సహజంగా లభించే పైరెథ్రిన్ పురుగుల మందుల్లో వాడతారనీ!
- ... అళుప వంశం కోస్తా కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన పురాతన రాజవంశమనీ!
- ... త్రిపుర రాష్ట్రానికి ఆ పేరు త్రిపుర సుందరి ఆలయంలోని అమ్మవారు పేరు మీదుగా వచ్చిందనీ!
- ... మద్రాసు క్రైస్తవ కళాశాల ఆసియాలోనే అత్యంత పురాతన కళాశాలల్లో ఒకటనీ!
24 వ వారం
మార్చు- ... బాబర్ చక్రవర్తి కుమార్తె గుల్బదన్ బేగం హుమయూన్ నామా గ్రంథకర్తగా ప్రసిద్ధి గాంచిందనీ!
- ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లంబాడీ ప్రజల కోసం బంజారా భవన్ ఏర్పాటు చేసిందనీ!
- ... పొగాకు, మద్యం సేవించే వారిలో నోటి కాన్సర్ వచ్చే అవకాశం 15 రెట్లు ఎక్కువనీ!
- ... భారతదేశంలోని పలు ప్రాంతాల్లో అరటిదూట ను వంటల్లో వాడతారనీ!
- ... అమెరికాలోని బెల్ ల్యాబ్స్ లో జరిగిన పరిశోధనలకు పది నోబెల్ బహుమతులు వచ్చాయనీ!
25 వ వారం
మార్చు- ... ప్రొఫెసర్ జ్ఞాన్ ప్రకాష్ శాస్త్రి వేదాలు, ఉపనిషత్తులు, మహాభారతం వంటి సంస్కృత గ్రంథాలకు నిఘంటువులు రాశాడనీ!
- ... జనతాదళ్ పార్టీ వ్యవస్థాపకుడు వి. పి. సింగ్ అనీ!
- ... గుర్రపు పందెం ప్రపంచంలో అత్యంత ప్రాచీన క్రీడల్లో ఒకటనీ!
- ... ఇథిలీన్ ఒక ముఖ్యమైన పారిశ్రామిక సేంద్రియ రసాయనాల్లో ఒకటనీ!
- ... ముత్తులక్ష్మి రెడ్డి భారతదేశపు మొట్టమొదటి శాసనసభ్యురాలనీ!
26 వ వారం
మార్చు- ... ప్రముఖ జర్నలిస్టు సాగరిక ఘోష్ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పాయ్ జీవిత చరిత్ర రచయిత్రి అనీ!
- ... మత్తును కలిగించే కొకైన్ వ్యసనం కావడానికి అవకాశం ఉన్నందున వైద్యులు కేవలం పరిమిత చికిత్సలకే ఉపయోగిస్తున్నారనీ!
- ... మాహారాష్ట్రలోని పోహ్రాదేవి తీర్థ క్షేత్రం బంజారా కాశీ క్షేత్రంగా వ్యవహరించబడుతుందనీ!
- ... సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ సన్ నెట్ వర్క్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అనీ!
27 వ వారం
మార్చు- ... శాస్త్రీయ సంగీత కళాకారిణులు ప్రియా సిస్టర్స్ జన్మస్థలం చిత్తూరు అనీ!
- ... ట్యూబోకురరిన్ దేశీయులైన దక్షిణ అమెరికా వాసులు వేట బాణాలకు, బల్లేలకు పూసే విషపూరిత మందు అనీ!
- ... రక్త హీనతతో బాధపడే గర్భిణులు, పిల్లలకు ఇప్పపువ్వు లడ్డూలు మంచి పోషకాహార పదార్థం అనీ!
- ... కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటిగా గెలుపొందిన మొదటి భారతీయురాలు అనసూయ సేన్‌గుప్తా అనీ!
- ... భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్న కవయిత్రి సత్యవతీ దేవి పేరు మీదుగా ఢిల్లీలో సత్యవతి కళాశాల ప్రారంభించారనీ!
28 వ వారం
మార్చు- ... ఆంథోని వాన్ లీవెన్‌హుక్ సూక్ష్మజీవుల అధ్యయన శాస్త్రానికి ఆద్యుడనీ!
- ... ప్రాంతీయ భాష అయిన కన్నడ భాషను అధికారిక భాషగా ఉపయోగించిన మొదటి వంశం కదంబ రాజవంశం అనీ!
- ... 2013లో ఒకే సంవత్సరం మూడు ప్రధాన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఎంపికైన ఏకైక భారతీయ నటి తనిష్టా ఛటర్జీ అనీ!
- ... రాధికా సేన్, ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న రెండవ భారతీయ శాంతి పరిరక్షకురాలు అనీ!
- ... స్త్రీల క్యాన్సర్ మరణాలలో గర్భాశయ క్యాన్సర్ ప్రధాన పాత్ర అనీ!
29 వ వారం
మార్చు- ... తర్ల దలాల్ వంటల రంగంలో పద్మశ్రీ పొందిన ఏకైక మహిళ అనీ!
- ... భారత ప్రభుత్వానికి చెందిన సంసద్ టీవీ పార్లమెంటు ఉభయ సభల కార్యక్రమాలను ప్రసారం చేస్తుందనీ!
- ... భారత జాతీయ మహిళ కమిషన్ మాజీ అధ్యక్షురాలు గిరిజా వ్యాస్, హిందీ, ఉర్దూ, ఆంగ్లంలో మూడు కవితా సంపుటాలను ప్రచురించిన గొప్ప కవయిత్రి అనీ!
- ... హిందీ సినిమా నటి శ్రేయా నారాయణ్, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్ర ప్రసాద్ మునిమనువరాలు అనీ!
- ... ది కైట్ రన్నర్ నవల ఆఫ్ఘనిస్థాన్ చరిత్ర, సమాజం నేపథ్యంలో ఖలీద్ హొస్సేనీ రాసిన నవల అనీ!
30 వ వారం
మార్చు- ... తిరుమల రాజమ్మ కన్నడ భాషలో పేరొందిన దేశభక్తి గీతాలు రాసిన కవయిత్రి అనీ!
- ... సామాజికవేత్త రుఖ్సానా సుల్తానా భారత అత్యవసర స్థితి సమయంలో సంజయ్ గాంధీ సన్నిహిత సహచరులలో ఒకరు అనీ!
- ... శరీర కణజాలానికి సరైన రక్తసరఫరా లేకపోవడం వలన ఇస్కీమియా అనే వ్యాధి కలుగుతుందనీ!
- ... భారత కమ్యూనిస్ట్ పార్టీలోని చేతన నాట్య మంచ్ ఒక సాంస్కృతిక బృందమనీ!
- ... భారతదేశంలో అంతరిక్ష సాంకేతికతలో కృషి చేసిన వారికి ఆర్యభట్ట అవార్డు పురస్కారం ఇస్తారనీ!
31 వ వారం
మార్చు- ... ఆస్ట్రియా దేశానికి చెందిన కిట్టి శివ రావు భారతదేశానికి దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలిగా వచ్చి ఇక్కడే స్థిరపడిందనీ!
- ... సింగరేణి కార్మిక సమాఖ్య మావోయిస్టులతో సంబంధం ఉన్నదనే ఆరోపణలతో నిషేధించబడిందనీ!
- ... రెండవ ప్రపంచ యుద్ధ సమయం నుంచి భారతదేశంలో మాంటిస్సోరి విద్య ఉనికిలోకి వచ్చిందనీ!
- ... రంగబతి సంబల్పురి ఒడియా భాషలో వచ్చిన బహుళ ప్రజాదరణ పొందిన పాట అనీ!
- ... జీర్ణాశయానికి సంబంధించిన క్రోన్స్ వ్యాధి క్యాన్సర్ కు దారి తీసీ వీలుందనీ!
32 వ వారం
మార్చు- ... అనితా బోర్గ్ సాంకేతిక రంగాల్లో మహిళల ప్రాతినిథ్యం కోసం కృషి చేసిందనీ!
- ... క్లెయిర్‌వాయెన్స్ అనేది శాస్త్రవిజ్ఞానానికి లోబడని అతీంద్రియ శక్తి అనీ!
- ... బెంగాలో భాషకు అధికారిక హోదా కోసం 1952లో తూర్పు పాకిస్థాన్ లో బెంగాలీ భాషా ఉద్యమం జరిగిందనీ!
- ... భారతదేశంలోని 550 జిల్లా ప్రధాన కార్యాలయాలను కనీసం నాలుగు వరుసల రహదారులు ఏర్పాటు చేయడానికి భారతమాల ప్రాజెక్టు ఏర్పడిందనీ!
- ... జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సహాయ ప్రొఫెసర్ల నియామకం కోసం యూజీసీ-నెట్ పరీక్ష నిర్వహిస్తారనీ!
33 వ వారం
మార్చు- ... పీటోంగ్‌టార్న్ షినవత్రా థాయ్‌లాండ్ చరిత్రలో అతి పిన్న వయసురాలైన ప్రధాని, దేశంలో రెండో మహిళా ప్రధాని అనీ!
- ... ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అగాథా క్రిస్టీ నవలలు సుమారు 200 కోట్లకు పైగా ప్రతులు అమ్ముడయ్యాయనీ!
- ... డిఫ్తీరియా వ్యాధిలో మెడ పెద్దగా వాపు వచ్చి శ్వాస నాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉందనీ!
- ... మిల్లెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా చిరుధాన్యాల రైతులకు సహాయపడే సంస్థ అనీ!
- ... మహమూద్ ఖిల్జీ సేనపై సాధించిన విజయానికి గుర్తుగా రాజస్థాన్ రాజపుత్రులు విజయ స్తంభను స్థాపించారనీ!
- ... భారతదేశంలో రహదారి సుంకాల చెల్లింపు కోసం వాడే ఫాస్టాగ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) సాంకేతికత ద్వారా పని చేస్తుందనీ!
34 వ వారం
మార్చు- ... డిజిటల్ కంప్యూటర్ కు ఆధారమైన కీలకమైన గణిత పరిశోధనలు చేసింది జాన్ వాన్ నాయ్‌మన్ అనీ!
- ... మహాత్మా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారతదేశంలో మొట్టమొదటి గ్రామీణ వైద్య కళాశాల అనీ!
- ... బనిహాల్ కనుమ జమ్మూ కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయను బయటి హిమాలయాలకు, దక్షిణాన ఉన్న మైదాన ప్రాంతాలకూ కలుపుతుందనీ!
- ... తమిళనాడులోని దయానిధీశ్వర ఆలయం లో మహిళలు సుఖప్రసవం కోసం ప్రార్థనలు చేస్తారనీ!
- ... భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కేంద్రమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యాడనీ!
35 వ వారం
మార్చు- ... చరిత్రలో మొదటిసారిగా మహిళా సైన్యాన్ని నిర్మించిన ఘనత బెలవాడి మల్లమ్మదనీ!
- ... ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ మొదటి పాఠశాల 1949లో సర్వేపల్లి రాధాకృష్ణన్ చేతుల మీదుగా ప్రారంభమైందనీ!
- ... ఆర్. రామచంద్ర విశ్వనాథ్ వార్దేకర్ ను భారతదేశంలో "కుష్టు నియంత్రణ పితామహుడు" గా పరిగణిస్తారనీ!
- ... మరాఠా రాజ్య పతనంలో బస్సెయిన్ ఒప్పందం కీలక పాత్ర పోషించిందనీ!
- ... ప్రపంచవ్యాప్తంగా డబ్బు చెల్లింపులకు క్రెడిట్ కార్డులను విరివిగా వాడుతున్నారనీ!
36 వ వారం
మార్చు- ... బీజాపూర్ సుల్తాన్ కి చెందిన చాంద్ బీబీ అక్బర్ సేనలను ఎదిరించి అహ్మద్ నగర్ ను రక్షించిన యోధురాలనీ!
- ... యశోదా హాస్పిటల్స్ లో 2015లో ర్యాపిడ్ ఆర్క్ సాంకేతికను ఉపయోగించి పది వేలమందికి పైగా చికిత్స చేసిందనీ!
- ... బ్రిటిష్ ఇండియాలో మూడు అతిపెద్ద సంస్థానాల్లో ఒకటైన మైసూర్ రాష్ట్రం కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలన్నింటినీ కలుపుకుని కర్ణాటక రాష్ట్రంగా ఏర్పడిందనీ!
- ... క్యాబినెట్ సెక్రటరీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లో అత్యంత ఉన్నత స్థాయి పదవి అనీ!
- ... భారతదేశంలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీని ప్రవేశపెట్టిన మొదటి కళాశాల ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్ అనీ!
37 వ వారం
మార్చు- ... క్రొయేషియాకు చెందిన గోరన్ ఇవనీసెవిచ్ వైల్డ్ కార్డుతో ప్రవేశించి వింబుల్డన్ సింగిల్స్ గెలుచుకున్న ఏకైక ఆటగాడనీ!
- ... ఆమ్నీసియా సోకిన వారు క్రమంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారనీ!
- ... తీరాంధ్ర జమీందారీ సంస్థానమైన చుండి సంస్థానం ముఖ్యపట్టణం నెల్లూరు జిల్లా, వోలేటివారిపాలెం మండలంలో ఉందనీ!
- ... ప్రపంచంలో అతిపెద్ద కణభౌతికశాస్త్ర పరిశోధనాలయాన్ని నిర్వహించేది సెర్న్ అనీ!
- ... అమరావతి కళ పురాతన ఆంధ్రప్రదేశ్ లో ధాన్యకటకంలో విలసిల్లిన భారతీయ కళా శైలి అనీ!
38 వ వారం
మార్చు- ... వ్యక్తిత్వ వికాస నిపుణుడు, నాయకుడు శివ్ ఖేరా నోటా విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేశాడనీ!
- ... కర్ణాటకలోని మణిపాల్ విశ్వవిద్యాలయ పట్టణం ప్రతి సంవత్సరం ఇరవై ఐదు వేలమందికి పైగా విద్యార్థులను ఆకర్షిస్తుందనీ!
- ... పాకిస్తాన్ లొంగుబాటు పత్రం 1971 నాటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి ముగింపుకు గుర్తుగా పరిగణించబడుతుందనీ!
- ... రోల్స్ రాయిస్ కారును సొంతం చేసుకున్న మొదటి భారతీయ నటి నదీరా అనీ!
- ... హైదరాబాదులోని శిల్పకళా వేదిక టెర్రకోటతో తయారైన నిర్మాణమనీ!
39 వ వారం
మార్చు- ... అడా లవ్లేస్ ఛార్లెస్ బాబేజి రూపొందించిన మొదటి గణన యంత్రం మీద కృషి చేసిన మహిళ అనీ!
- ... భారతదేశంలోని బలహీన వర్గాల కోసం భారత ప్రభుత్వం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయలను నిర్వహిస్తుందనీ!
- ... అలహాబాద్ కోట అక్బర్ నిర్మించిన అతిపెద్ద కోట అనీ!
- ... అత్యాచారం, హత్య కేసులో భారతదేశంలో 21వ శతాబ్దం ఉరితీయబడిన మొదటి వ్యక్తి ధనంజయ్ ఛటర్జీ అనీ!
- ... హిమాలయాల్లోని కాళింది కనుమ గంగానదికి జన్మస్థానమనీ!