వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 60
← పాత చర్చ 59 | పాత చర్చ 60 | పాత చర్చ 61 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2018 జూన్ 1 - 2018 జూన్ 26
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
వికీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ (డబ్ల్యుఏటీ) 2018
మార్చువికీ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లేక డబ్ల్యుఏటీ అన్నది ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జూన్ 29 నుంచి జూలై 1 (శుక్ర, శని, ఆదివారాలు) వరకు నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమం. పాల్గొనేవారు 2018 జూన్ 28 సాయంత్రానికల్లా వేదికకు చేరుకోవాల్సివుంటుంది.
కార్యక్రమ లక్ష్యాలు ఇవి:
- భారతీయ వికీపీడియన్ల నైపుణ్యాలు వారి కృషికి అవసరమైనంతగా పెంపొందించడం
- భారతీయ భాషల వికీపీడియాల్లో ప్రపంచవ్యాప్త ప్రాజెక్టుల ఉత్తమ పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసులు) ప్రవేశపెట్టడం.
- #1Lib1Ref, ద వికీపీడియా లైబ్రరీ వంటి కార్యక్రమాల గురించిన అవగాహన, స్క్రిప్టులు, గాడ్జెట్లు, వికీమీడియా ఉపకరణాలు వంటివాటి వాడకం పెంపొందించడం.
- గ్లోబల్ హాకథాన్, వికీడాటాకాన్ వంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి తగ్గ విధంగా బారతీయ వికీమీడియన్లలో సామర్థ్యం పెంపొందించడం.
కార్యశాల గురించి, పాల్గొనడానికి అవసరమైన ఇతర అంశాల గురించి మరింత తెలుసుకోవడానికి ఈ లంకెను సందర్శించండి: https://meta.wikimedia.org/wiki/CIS-A2K/Events/Wiki_Advanced_Training
జూన్ 9 తేదీ దరఖాస్తులకు ఆఖరు తేదీ. ఏదైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే దయచేసి అడగగలరు.
ధన్యవాదాలతో,
పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:03, 1 జూన్ 2018 (UTC)
- రాంచీ స్థానికుడు, వికీపీడియన్ బదాని ఇటీవల మరణించారు. ఆయన వికీమీడియా ప్రాజెక్టులకు అద్భుతమైన కృషి చేసిన వ్యక్తి. కార్యశాల అనంతరం సాయంత్రం పూట ఆయనకు నివాళి అర్పిస్తారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:35, 1 జూన్ 2018 (UTC)
తెలుగు వికీపీడియా నాణ్యతాభివృద్ధి కార్యశాల
మార్చుఅందరికీ నమస్కారం,
తెలుగు వికీపీడియాలో ఇప్పటికే విపులమైన చర్చల ఆధారంగా రూపొందించుకున్న విధానాలు, మార్గదర్శకాల అమలు కోసం, వ్యాసరచనలో వికీశైలి, ఆధునిక తెలుగు భాషా శైలి ప్రతిఫలించేందుకు ప్రత్యేకించి ఒక కార్యశాల నిర్వహించాలని ప్రతిపాదన. ఇప్పటికే ఉన్న శైలీ మార్గదర్శకాలు, విధానాలను పాల్గొన్న సభ్యులకు వివరిస్తూ, వాటి అమలులోని లోటుపాట్లు, వాటిని సవరించేందుకు అవసరమైన ఉపకరణాలు వంటి అంశాలు వివరించడం, పూర్తిస్థాయి శైలి రూపొందించుకునేందుకు లోటుగా ఉన్నదేమిటన్నది చర్చించడం, సభ్యుల్లో ఒక్కొకరూ 10-15 ప్రదర్శిత వ్యాసాల్లో నాణ్యతాపరంగా సమీక్షించి లోటుంటే నిర్వహణా మూసలు చేర్చడం, లేకుంటే వ్యాసం చర్చలో ఆ మేరకు రాయడం, ఆయా వ్యాసాలలో గట్టి కృషిచేసినవారి దృష్టికి నాణ్యతాలోపాలు తీసుకుపోవడం వంటి కార్యకలాపాలు దీనిలో ప్రతిపాదిస్తున్నాం. దయచేసి కార్యక్రమ పేజీని సందర్శించి అభిప్రాయాలు, సూచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:47, 4 జూన్ 2018 (UTC)
ప్రాజెక్టు టైగర్ పోటీ
మార్చుఇది అనువదించిన పోస్టు
ఈ ఫాం ఇంకా నింపని ప్రాజెక్టు టైగర్ పోటీ విజేతలు, దయచేసి 15 జూన్ 2018 నాటికి నింపగలరు. ఆ తర్వాత బహుమతి పంపడానికి వీలుండదు. ఇప్పటికే నింపినవారు, మరోసారి నింపనక్కరలేదు. ధన్యవాదాలతో --Gopala Krishna A (చర్చ) 05:42, 8 జూన్ 2018 (UTC)
విజేతల వివరాలు, సూచనలు
మార్చుగత మూడు నెలలుగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రాజెక్టు టైగర్ పోటీలో భాగంగా తెలుగులో గెలుపొందిన వారి వివరాలు ఇక్కడ ప్రకటించాం. తెలుగు వికీపీడియా వ్యాసాలను, శైలిని మెరుగుపరిచిన ఈ ప్రయత్నంలో పాల్గొన్నవారికి, గెలుపొందినవారికి అభినందనలు. ఈ పోటీల్లో గెలుపొందినవారు దయచేసి పైన ఇచ్చిన ఫాం నింపగలరు. తెలుగులో క్యాష్ ప్రైజ్ బదులుగా పుస్తకాలు ఉండాలని సూచించడం తెలిసిందే కనుక ఫాంలో సూచించినట్టు అమెజాన్‌లో మీరు ఆశించే పుస్తకాలు ఉంటే సరి, లేదూ క్యాష్ ప్రైజ్ రూపంలో తీసుకుని మీకు నచ్చిన పుస్తకాలు బయటే కొనుక్కోవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 13:41, 12 జూన్ 2018 (UTC)
Wikigraphists Bootcamp (2018 India): Applications are open
మార్చుWikigraphists Bootcamp (2018 India) to be tentatively held in the last weekend of September 2018. This is going to be a three-day training workshop to equip the participants with the skills to create illustrations and digital drawings in SVG format, using software like Inkscape.
Minimum eligibility criteria to participate is as below:
- Active Wikimedians from India contributing to any Indic language Wikimedia projects.
- At least 1,500 global edits till 30 May 2018.
- At least 500 edits to home-Wikipedia (excluding User-space).
Please apply at the following link before 16th June 2018: Wikigraphists Bootcamp (2018 India) Scholarships.
Wiki Loves Yerevan International edit-a-thon
మార్చుFor the purpose of increasing the number of Yerevan related content in the Internet, Wikimedia Armenia announces international one-month edit-a-thon from June 15 – July 15, 2018. You are kindly invited to get involved and start editing and improving articles about Yerevan.
Hope you'll enjoy editing and have fun during this interesting process.
One participant from the first 15 most written language Wikipedias with the most points will be invited to Yerevan to join the events organized in the frames of Yerevan 2800th anniversary. For more details please visit the edit-a-thon page on Meta.
See you soon in sunny Yerevan!--Lilit (WM AM) (చర్చ) 12:04, 14 జూన్ 2018 (UTC)
- ఈ పోటీలో నాకు ఎవరైనా సహాయము చేయగలరా? నేను ఇప్పటివరకు 30 వ్యాసాలను అనువధించాను, వ్యక్తిగతంగా ప్రపంచంలో 2/3 స్థానాలలో ఉన్నా వికీ-కమ్యునిటీల ప్రకారం చూస్తే తెలుగు వికీపీడియా వెనుకబడి ఉన్నది. మిగతా సభ్యులు రోజుకు ఒక్క వ్యసాన్ని తయారు చేసినా ఎంతో ఉపయోగపడుతుంది. వివరాలను [1] ఇక్కడ చూడవచ్చు. 15:44, 26 జూన్ 2018 IM3847 (చర్చ | రచనలు | నిరోధించు)