వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 42
← పాత చర్చ 41 | పాత చర్చ 42 | పాత చర్చ 43 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2015 మే 1 - 2015 జూన్ 3
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
వర్గము - వ్యాసము
మార్చుఒకనాడు కనీసం అయిదు వ్యాసములు ఉంటేనే కొత్తగా వర్గము తయారు చేయాలని నాకు కొత్తలో ఆనాటి పెద్దలు హితోపదేశము చేశారు. మరి ఈనాడు ఒక వ్యాసము ఉన్నా లేదా అసలు వ్యాసము అనేది లేకపోయినా వర్గము ముందుగా తయారు చేస్తున్నారు. అసలు ఒక వర్గం కొత్తగా సృష్టించాలంటే ప్రస్తుతమున్న అధికార నియమ నిబంధనలు దయచేసి తెలియ జేయండి. JVRKPRASAD (చర్చ) 05:30, 1 మే 2015 (UTC)
- @JVRKPRASAD, ఒక వ్యాసంతోనే వర్గం ప్రారంభించకూడదని ఎక్కడా లేదు. అన్ని సందర్భాలలో అన్నింటికీ నిబంధనలు ఉండవండి. తార్కికంగా ఆలోచిస్తే, ఒకే వ్యాసం ఉండగలిగే (ఉన్న కాదు, ఉండగలిగే) వర్గాలు అనవసరం, అసలు వర్గీకరణ అంటేనే ఒకటికంటే ఎక్కువ టాపిక్లను కొన్ని సమూహాలుగా జతచేయటం. కామన్ సెన్సుతో ఆలోచిస్తే ప్రస్తుతం ఒక వర్గంలో ఒక వ్యాసం ఉందా, వంద వ్యాసాలున్నాయా అన్నది కాదు ముఖ్యం. దీనిలో పది, వంద, వెయ్యి వ్యాసాలు చేరే అవకాశమున్నదా? ఇలాంటి వర్గీకరిణకు కొంత తార్కికత ఉన్నదా? అన్నది మాత్రమే సరైన హేతువు. ఉదా:ప్రపంచాన్ని వందసార్లు చుట్టిన వ్యక్తులు, రెండు కాళ్ళున్న మనుషులు, క్రీ.పూ.5425 జననాలు వివిధ కారణాలకు సరైన వర్గాలు కావు. ప్రస్తుతానికి అందులో వ్యాసాలు చేరుతాయో లేదో అన్న అనుమానం ఉన్న ఖాళీ వర్గాలు సృశ్టించవద్దని "పెద్దలు" వారించి ఉంటారు (ఉదా: క్రీ.పూ.5425 జననాలు అన్న వర్గం సృష్టిస్తే నేను వెంటనే తీసేస్తారు). en:Wikipedia:Categorization చదవండి --వైజాసత్య (చర్చ) 21:10, 1 మే 2015 (UTC)
- వైజాసత్య గారు, మీలాగానే నేను కూడా వాదించాను ఒకనాడు. నాకు హితోపదేశము చేసిన వారు ప్రస్తుతము క్రియాశీలకంగా లేరు. మీరు సూచించిన ఉదాహరణలు తెలియని తనంతో ఇంకా నేను ఉన్నానని దయచేసి అనుకోవద్దు. రైల్వే వ్యాసములు, హిందూ మతము లాంటి పెద్ద వర్గాలలో ఇది జరిగింది. తదుపరి తొలగించాను, వారు కూడా తొలగించారు. తిరిగి మరల వర్గాలు చేర్చాను. నేను ఊహలు మాత్రము వ్రాయలేదు. వర్గాలు తయారు చేసుకొని వ్యాసాలు వ్రాద్దామనే ఆనాడు అనుకున్నాను. ఇప్పటికీ ఇలాంటి పెద్ద పెద్ద వర్గాలలో వివిధ వర్గాలు చేర్చవచ్చు, ఆ కొత్త వర్గాలలో అనేక వ్యాసాలు తప్పకుండా వస్తాయి. కానీ ఆనాటి పెద్దల సలహాతో ఈ నాటికి కొత్త వర్గాలు తయారు చేయాలంటే కొంచెం తటపటాయించాల్సి వస్తోంది. దయచేసి గమనించండి. ప్రస్తుతము మీ సలహా పాటిస్తాను. JVRKPRASAD (చర్చ) 01:48, 2 మే 2015 (UTC)
- ఏదైనా వ్యాసం వర్గీకరణ జరగలేదంటే దానిని సరియైన వర్గంలో చేర్చాలి. వర్గీకరణ అనేది ప్రధానమైన పని. నేను వర్గీకరించని వ్యాసములను కొన్ని వేల సంఖ్యలో వర్గీకరణలు చేసాను. కొన్ని సందర్భాలలో ఒక వర్గంలో అనేక వ్యాసాలున్నా ఆ వర్గం సృష్టింపబడదు. "ప్రత్యేక పేజీలు" లో వర్గీకరించని వర్గాలను కూడా వర్గీకరించాలి. వ్యాసం ఉంటే దానికి వర్గం కానీ వ్యాసాలు లేనపుడు ఖాళీ వర్గం సృష్టించడం సరైన పని కాదు.-- కె.వెంకటరమణ⇒✉ 04:52, 7 మే 2015 (UTC)
వికీ - ఈర్ష్య
మార్చుఈ మధ్యన రచ్చబండ చర్చలు చదివి చూస్తుంటే ప్రస్తుతం వికీ నందు ఈర్ష్య అసూయ ద్వేషం లాంటి వాటితో అగ్నిపర్వతంలా ఉండి, ఊహలు అందని భూకంపంలా, ఏనాడు ఎలా లావా విరజిమ్ముతుందోనని అనుమానముగా ఉంది. సునామీలు వచ్చి పని చేసుకునే వాళ్ళు కొట్టుకు పోకుండా, కొన్నాళ్ళు ప్రారంభంలో వికీలా లేదా గత నాలుగు అయిదు సంవత్సరాలు పూర్వములా, ఎవరి పనులు వారు ప్రశాంతముగా చేసుకుంటుంటే ఉపద్రవాలను ఉప్పెనలు కొంత వరకైనా ఎదుర్కొన వచ్చును. (గమనిక:కేవలం హాస్యానుభూతి మాత్రమే. దీని మీద పాలసీ చర్చలు మాత్రం వద్దండి) JVRKPRASAD (చర్చ) 05:56, 1 మే 2015 (UTC)
గూగుల్ యాంత్రికానువాద వ్యాసాల ఆదరణ 1000 అధిక వీక్షణలలో 2శాతం (201304, 201403 గణాంకాలు)
మార్చుగూగుల్ అనువాద వ్యాసాల పేజీ అభ్యర్ధనలలో ఏ స్థాయిలో వున్నవో తెలుసుకుందామన్న ఆలోచన నేటికి ఫలించింది. గూగుల్ దాదాపు వెయ్యి వ్యాసాలు అనువాదం చేయిస్తే 1000అధిక అభ్యర్ధనలు కల వ్యాసాల జాబితాలో 201304,201403నెలలలో కనిపించినవి 20అనగా 2 శాతం మాత్రమే. 201403లో కనబడేవి చూస్తే 34వ్యాసాలు సగటు న రోజుకి 8 వీక్షణఅభ్యర్ధనలు కలిగున్నాయి. ఆంగ్లంలో బాగా ఆదరణ పొందిన చాలావరకు మంచివైన వ్యాసాలను గూగుల్ కనీసం రెండున్నర సంవత్సరాలు కృషి చేస్తే ఇదన్మమాట ఫలితం. 2011జూలైలో అంతమైన ఈ ప్రాజెక్టు వ్యాసాలను మన సముదాయం ఇప్పటికీ సవరించలేకపోయింది.ఇంకా ఆ ప్రాజెక్టు సముదాయం పై కలిగించిన దుష్ప్రరిణామాలు సరిగా లెక్కించలేదు. అందుకని రాసికంటె వాసిపై ధ్యాస పెట్టటమే మంచిదనిపిస్తోంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:గూగుల్_అనువాద_వ్యాసాలు చూడండి. స్పందించండి మరియు సందేహాలుంటే తెలపండి. --అర్జున (చర్చ) 15:54, 1 మే 2015 (UTC)
- తెలుగు వికీపీడియాపై గూగుల్ అనువాద వ్యాసాల ప్రభావం గురించి నేను చేసిన ఆంగ్లవిశ్లేషణ పత్రం పై మీ స్పందనలు తెలియచేయండి. ఇది త్వరలో వికీమీడియా పత్రిక సైన్ పోస్ట్ లో రానుంది. --అర్జున (చర్చ) 13:15, 30 మే 2015 (UTC)
- Small impact of the large Google Translation Project on Telugu Wikipedia " అనే పేరుతో నా వ్యాసం 2015-06-24 నాటి వికీపీడియా సైన్ పోస్ట్ పత్రికలో ముద్రించబడింది. దీనిలో గ్రామాల పేజీవీక్షణలతో గూగుల్ అనువాద వ్యాసాల పేజీవీక్షణల పోలిక కూడా వుంది. దీనిపై మీ వ్యాఖ్యలు సైన్ పోస్ట్ లో కాని ఇక్కడ కాని తెలియచేయండి. --అర్జున (చర్చ) 05:58, 26 జూన్ 2015 (UTC)
నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pavan santhosh.s
మార్చుతెవికీ ప్రగతి కొరకు విశేష కృషిచేస్తున్న పవన్ సంతోష్ గారిని నిర్వాహకునిగా ప్రతిపాదన చేస్తున్నాను. మీ మద్దతును ఇక్కడ తెలియజేయండి.-- కె.వెంకటరమణ⇒✉ 06:53, 2 మే 2015 (UTC)
- పవన్ సంతోష్ నిర్వాహకునిగా మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తారని భావిస్తున్నాను. [[భాస్కరనాయుడు (చర్చ) 15:51, 2 మే 2015 (UTC)]]
తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు నివేదిక పుస్తకం.నెట్ పత్రికలో
మార్చుతొలి తెలుగు ఐఈజీ సహకారంతో నిర్వహించిన తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తైన విషయం తెలిసిందే. తెవికీలో జరిగిన ఈ విభిన్నమైన కార్యక్రమాన్ని నాపరంగా విశ్లేషిస్తూ తయారుచేసిన నివేదికలో సామాన్య పాఠకులకు ఆసక్తికలిగించే విషయాలను మాత్రం ఉంచి ఓ వ్యాసాన్ని పుస్తకం.నెట్ పత్రికకు సంపాదకురాలు వి.బి.సౌమ్య గారి సూచన మేరకు పంపాను. అది ఇలా గత వారం ప్రచురితమైంది. తెవికీ గురించి, ఇందులో మాత్రమే చేయగల అపురూపమైన కృషిని గురించి ఇతర సాహిత్యాభిలాషులకు తెలిపేందుకు ఈ ప్రయత్నం చేశాను. గతంలో భాస్కరనాయుడు గారు బహుశా ఇలాంటి నివేదికనే అడిగారనుకుంటాను. ఐతే ఇది showcasing our effort కోణంలో సాగిన వ్యాసం అని ముందుగానే హెచ్చిరిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 07:30, 3 మే 2015 (UTC)
- పవన్ సంతోష్ గారి వ్యాసం బాగుంది.--అర్జున (చర్చ) 05:19, 4 మే 2015 (UTC)
This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.
Voting has begun for eligible voters in the 2015 elections for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson. Questions and discussion with the candidates for the Funds Dissemination Committee (FDC) and FDC Ombudsperson will continue during the voting. Nominations for the Board of Trustees will be accepted until 23:59 UTC May 5.
The Funds Dissemination Committee (FDC) makes recommendations about how to allocate Wikimedia movement funds to eligible entities. There are five positions on the committee being filled.
The FDC Ombudsperson receives complaints and feedback about the FDC process, investigates complaints at the request of the Board of Trustees, and summarizes the investigations and feedback for the Board of Trustees on an annual basis. One position is being filled.
The voting phase lasts from 00:00 UTC May 3 to 23:59 UTC May 10. Click here to vote. Questions and discussion with the candidates will continue during that time. Click here to ask the FDC candidates a question. Click here to ask the FDC Ombudsperson candidates a question. More information on the candidates and the elections can be found on the 2015 FDC election page, the 2015 FDC Ombudsperson election page, and the 2015 Board election page on Meta-Wiki.
On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee
Posted by the MediaWiki message delivery 03:45, 4 May 2015 (UTC) • Translate • Get help
New Wikipedia Library Accounts Available Now (May 2015)
మార్చుApologies for writing in English, please help translate this into your local language. Hello Wikimedians!
Today The Wikipedia Library announces signups for more free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:
- MIT Press Journals — scholarly journals in the humanities, sciences, and social sciences (200 accounts)
- Loeb Classical Library — Harvard University Press versions of Classical Greek and Latin literature with commentary and annotation (25 accounts)
- RIPM — music periodicals published between 1760 and 1966 (20 accounts)
- Sage Stats — social science data for geographies within the United States (10 accounts)
- HeinOnline — an extensive legal research database, including 2000 law-related journals as well as international legal history materials (25 accounts)
Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, JSTOR, DeGruyter, Newspapers.com and British Newspaper Archive. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 22:12, 4 మే 2015 (UTC)
- We need your help! Help coordinate Wikipedia Library's account distribution and global development! Please join our team at Global our new coordinator signup.
- This message was delivered via the Mass Message tool to The Wikipedia Library Global Delivery List
టాపిక్ అనే కొత్త పేరుబరి.
మార్చుWARNING: Missing namespace in family file wikipedia: namespace['te'][2600] (it is set to 'Topic')
పైన తెలిపిన వార్నింగ్ నాకు వచ్చింది. ఇది ఫ్లో ను వాడేందుకు ఆంగ్ల వికీలో వాడబడుతున్న పేరుబరి. దీనిని ఇప్పటికే స్థానికీకరించినా, ఇంకా ఈ పదం అనువాదానికి నోచుకోలేదు. సభ్యులు మీ సూచనలు తెలుపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 07:20, 5 మే 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ ! అనువాదం అవసరమైన పదం ఏమిటి?--t.sujatha (చర్చ) 13:54, 5 మే 2015 (UTC)
- Topic అన్న పదానికి అనువాదం అవసరం, దీనికి సముదాయ ఆమోదమూ కావాలి. --106.51.138.118 03:36, 6 మే 2015 (UTC)
- టాపిక్ = అంశం. అని ఉండచ్చేమో ఆలోచించండి.--t.sujatha (చర్చ) 07:44, 6 మే 2015 (UTC)
- ఇక్కడ వాళ్ళు చర్చించే అంశం అన్ని అర్ధంలో వాడుతున్నారు కాబట్టి చర్చాంశం అని వాడితే బాగుంటుందేమో? --వైజాసత్య (చర్చ) 02:05, 7 మే 2015 (UTC)
- రహ్మానుద్దీన్ గారూ ! అనువాదం అవసరమైన పదం ఏమిటి?--t.sujatha (చర్చ) 13:54, 5 మే 2015 (UTC)
సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు
మార్చుసభ్యుల పేజీలో సమాచారపెట్టెలు ఈ కారణాల వళ్ళ చేర్చకూడదని నా అభిప్రాయం
- ఒక వాడుకరి ఎక్కడ పుట్టారు, ఏమి చేశారు, ఆయన/ఆవిడ అసలు పేరేంటి, పెళ్ళైందా? లేదా? అన్ని విషయాలు మిగిలిన వారికి అనవసరం. ఆయా వాడుకరులు స్వఛ్ఛందంగా తెలియజేసుకుంటే అది వేరే విషయం. ఆయా వాడుకరుల ప్రైవెసీని గౌరవించాలి
- ఒక వాడుకరి పేజీలో ఇంకొకరు వ్రాయటాన్ని దురుసు ప్రవర్తనగా వికీలో భావిస్తారు. అందుకే పతకాలిచ్చినప్పుడు కూడా చర్చాపేజీలో అంటించి, అది వాడుకరి పేజీలో పెట్టుకోవలసిందిగా కోరతారు.
- ఇలాంటి రొటీన్ పనులు బాటుతో చేయించాలి. ఇలాంటి మార్పులతో ఇటీవలమార్పులను నింపేస్తే ఇటీవలిమార్పులను గస్తీచేసేవారికి కష్టమౌతుంది
--వైజాసత్య (చర్చ) 02:59, 7 మే 2015 (UTC)
- ఈ సూచనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అలాగే ఏప్పుడో సభ్యులుగా నమోదు చేసుకొని,ఒకసారికూడా వికీ వైపు చూడని వారికి స్వాగతం మూసలు పెట్టడం కూడాఅనవసరమని భావిస్తున్నాను. Palagiri (చర్చ) 03:38, 7 మే 2015 (UTC)
- ఖచ్చింతగా అది అనవసరమైన కృషి, వాటిని అంటించడం ఒక అలవాటుగా మారక మునుపే, వాటిలో వాడూకరులు మార్పులు చేయక మునుపే వాటిని తొలగించాలి. వాడుకరుల పేజీలు ఎవరికిష్టమైనట్టుగా వారు తయారు చేసుకోగలరు...--విశ్వనాధ్ (చర్చ) 04:31, 7 మే 2015 (UTC)
- వాడుకరుల పేజీలను సృష్టించడం అనవసరమైన పని. వికీలో భాషాభిమానంతో చేరే వాడుకరులు కొందరైతే యితర వికీల నుండి భాష తెలియకపోయినా ఆటోమేటిక్ గా వచ్చే వాడుకరులు కోకొల్లలు. వారికి చర్చాపేజీలో తెలుగులో స్వాగత సందేశమిచ్చినా అనవసరమే. వాడుకరుల ప్రైవసీని గౌరవించాలి. వారి వాడుకరి పేజీలలో వాడుకరి సమాచారపెట్టెను చేర్చడం అనవసరమైన పని. అందువలన వాటికి బాటు ద్వారా తొలగించాలి. లేదా యిప్పటి నుండి చేర్చకుండా ఉంటే మంచిది. తెవికీలో అనేక వేలమందికి వాడుకరుల సమాచారపెట్టెలను చేర్చారు. వాటిలో ఎంతమంది విషయాలను పూరించారో చేర్చిన వాడుకరులే పరిశీలించాలి. ఈ మధ్య కొత్త వ్యాసాల కంటే కొత్త వాడుకరుల పేజీలే ఎక్కువైనాయని గమనించాలి. -- కె.వెంకటరమణ⇒✉ 04:43, 7 మే 2015 (UTC)
- ఈ సూచనతో నేను కూడా ఏకీభవిస్తున్నాను.అలాగే ఏప్పుడో సభ్యులుగా నమోదు చేసుకొని,ఒకసారికూడా వికీ వైపు చూడని వారికి స్వాగతం మూసలు పెట్టడం కూడాఅనవసరమని భావిస్తున్నాను. Palagiri (చర్చ) 03:38, 7 మే 2015 (UTC)
- వికీలో పెద్దగా నియమాలు వర్తించకుండా ఎవరికి వారు తీర్చిదిద్దుకోగలిగే పేజీలు వాడుకరి పేజీలే మన వీరన్న లాంటి వారు మూసలతో సరదాగా ప్రయోగాలు కూడా చేస్తూంటారు. అన్నింటిలోనూ సమాచారపెట్టెలు చేర్చుకుంటూ పోతే ఒక మూస ధోరణిలో పేజీలు తయారుచేయాలేమోనని సభ్యులు భావించి ఆ fun miss అయ్యే ప్రమాదం కూడా వుంది. కనుక వైజాసత్య గారితో నేను అంగీకరిస్తూ ఈ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 04:46, 7 మే 2015 (UTC)
- పైన చెప్పిన కారణాలు సరైనవి ఆలోచించతగినవి. సభ్యులపేజీని సభ్యులే వ్రాసుకోవడం సరైన విధానం. సభ్యులపేజీలో వాడుకరి పెట్టెలను పెట్టే ఈ విధానం వికీపీడియాకు అవసరం లేదని భావిస్తున్నాను. --t.sujatha (చర్చ) 05:52, 7 మే 2015 (UTC)
- ప్రస్తుతం వాడుకరి పేజీలలో విషయాలను తొలగించే పని ప్రారంభమైనది. వికీలో అనవసర విషయాలు అనేకమైనవి చేర్చడానికి దిద్దుబాట్లు, ఆ విషయాలను తొలగించడానికి అనేక మైన దిద్దుబాట్లు. వృధా ప్రయాస. తెవికీ నాణ్యత పెంచే చర్యకాదు. వ్యక్తిగత దిద్దుబాట్లు సంఖ్యను పెంచుకునే కృషి మాత్రమే. యిప్పటికి జరిగిన వాడుకర్లపేజీలను వదిలి. యికనుండి కొత్తవి సృష్టించకుండా ఉండటమే మంచిది. అవి వెంటనే తొలగించకపోతే తెవికీకి వచ్చిన ప్రమాదమేమీ లేదు. -- కె.వెంకటరమణ⇒✉ 06:09, 7 మే 2015 (UTC)
- పైన చెప్పిన కారణాలు సరైనవి ఆలోచించతగినవి. సభ్యులపేజీని సభ్యులే వ్రాసుకోవడం సరైన విధానం. సభ్యులపేజీలో వాడుకరి పెట్టెలను పెట్టే ఈ విధానం వికీపీడియాకు అవసరం లేదని భావిస్తున్నాను. --t.sujatha (చర్చ) 05:52, 7 మే 2015 (UTC)
- ఇదే విషయం గత కొంతకాలంగా చర్చల్లో తచ్చాడుతోంది. అయినా ఇలాంటి విషయాలను అర్థం చేసుకోలేరు. నేను ఇటీవల ప్రతిపాదించిన తెవికీ అభివృద్ధికి సూచనలులో దీనికే అగ్రస్థానం ఇచ్చిననూ సభ్యులు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పసివారికి చెప్పినట్టు డైరెక్టుగా చెబితే తప్ప మనవారు అర్థంచేసుకోలేరని మరోసారి రుజువుకావడం శోచనీయమైన విషయం. సి. చంద్ర కాంత రావు- చర్చ 13:43, 7 మే 2015 (UTC)
- చంద్రకాంత రావుగారూ ! సునిశిత విమర్శగా చెప్పినా, చూచాయగా చెప్పినా విషయం వివరంగా అర్ధం ఔతూనే ఉంటుంది. అయినప్పటికీ సూటిగా ఉండే ప్రశ్నకు మాత్రమే సూటిగా స్పందించడం బాగుంటుంది. --t.sujatha (చర్చ) 16:51, 7 మే 2015 (UTC)
- ఈ వ్యాఖ్య అందరికీ ఉద్దేశించి చెప్పలేను, పరోక్షంగా చెప్పిననూ అర్థంచేసుకొనక మరీ రెచ్చిపోయి దిద్దుబాట్లు చేసినవారికి మాత్రమేనండి. సి. చంద్ర కాంత రావు- చర్చ
- చంద్రకాంత రావుగారూ ! మీరన్నా మీ అభిప్రాయలన్నా నాకు చాలా గౌరవం ఉంది. మీరు చేసే సునిశిత విమర్శ చాలా బాగుంది. అది సభ్యులలో కొంత మార్పు తీసుకు రావచ్చని భావిస్తున్నాను. అయినా సూటిగా స్పందనలు రావాలంటే ప్రశ్నలు కూడా సూటిగా ఉండాలన్నదే నా అభిప్రాయం. --t.sujatha (చర్చ) 00:53, 8 మే 2015 (UTC)
- చంద్రకాంత రావుగారూ ! సునిశిత విమర్శగా చెప్పినా, చూచాయగా చెప్పినా విషయం వివరంగా అర్ధం ఔతూనే ఉంటుంది. అయినప్పటికీ సూటిగా ఉండే ప్రశ్నకు మాత్రమే సూటిగా స్పందించడం బాగుంటుంది. --t.sujatha (చర్చ) 16:51, 7 మే 2015 (UTC)
సభ్యుల పేజీలో సమాచారపెట్టెలు తొలగింపు
మార్చుసభ్యుల పేజీలో సమాచారపెట్టెలు తొలగింపు పని చేయుటకు మీ మద్దతు ఉంటే తొలగిస్తాను. JVRKPRASAD (చర్చ) 06:21, 7 మే 2015 (UTC)
వికీకి ప్రస్తుతం తీరువారు దేనిలో ఉందో ?
మార్చుమీరందరూ సూచించిన వాటికంటే ఎక్కువే అనేక తప్పులు తడకలు ఉన్నవి వ్రాస్తాను, సరిదిద్దుకోగలవారు, సరిదిద్ద గలవారు ఎవరైనా ఉన్నారా ? కొత్త వాడుకరులకు కేవలం చర్చాపేజీలో స్వాగతం పలికేవారము. వాడుకరి పేజీలో ఎవరికి వారు కావల్సినవి వ్రాసుకునే వారు. ఈ మధ్యన కొత్త విధానం మొదలు పెట్టారు. ఎవరూ ఇంత వరకూ అభ్యంతరము పెట్టలేదు. ఇప్పుడు మొదలు పెట్టారు. ఇప్పుడు అభ్యంతరము చెప్పే వారు కూడా వాడుకరి పేజీలో కొత్త మూసలు తగిలించిన వారే. ఒక విధంగా అనవసరమయిన విషయము. అందరూ చేస్తున్నారు, మనము కూడా చేయకపోతే ఆ పనులు చేసే వారికి మద్ధతు ఇవ్వలేదని, విమర్శలు చేసేవారమని అపనిందలు భరించాల్సి వస్తుందని నలుగురితో నారాయణ అని మాలాంటి వారము కూడా ఇష్టం లేక పోయినా కొన్ని పనులు చేయాల్సి వస్తోంది. ఇక్కడ స్వేచ్చా స్వతంత్ర్యాలు కొరవడి, కరవవుతున్నట్లు దాఖాలాలు మొదలవుతున్నాయి, అవుతున్నాయి కూడా. ఇంత బానిస బ్రతుకు కంచి గరుడ సేవ పని అవసరమా అనే రోజులు ముందు ముందు రానున్నాయి. వైజాసత్య గారు అన్ని పనులకు బాటు(లు) అంటారు. ఎంతమందికి బాటులు నడపటం వచ్చును ? వారు చెప్పిన ఏ ఏ పనులకు ఎన్ని బాటులు వేశారో, వేస్తున్నారో వారే చెప్పాలి. ఏ వాడుకరి అయినా చేయాలనుకున్న ప్రతి పని బాటు అంటుంటే, బాటు అన్న పని ఏదైనా ఆగిపోతుంది. ఆ పనులు పురోగతి తెలియడము లేదు. నేను రచ్చబండలో అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఉన్నాను. వాటిని ఎటువంటి సమాధానములు పొందుపరచకుండా పాతచర్చల భోషాణంలోకి ఎక్కించారు. మన వాడుకరులు తెలుగు భాష యాసలు కూడా తెలుసుకోవల్సిన అవసరము ఉంది. కేవలము కోస్తా పదాలు వాడిన వాటికే జవాబులు మాత్రమే ఉంటాయి, ఇస్తాము, వస్తాయి అనే ధోరణి ఎందుకు ? ఇంతవరకు ప్రస్తుతానికి చాల్లెండి. JVRKPRASAD (చర్చ) 05:11, 7 మే 2015 (UTC)
- @JVRKPRASAD అయ్యా, మీ వ్యంగ్యాస్త్రాలతో పొగుడుతున్నారో, తెగుడుతున్నారో అసలు అర్ధం చేసుకోలేక, ఎటూ సమాధానం చెప్పలేకపోతున్నాము. కొన్నింటికి సమాధానం ఇవ్వలేదంటే అవి సరిగా అర్ధం కాలేదనో, అందులో చెప్పడానికి ఏమీ లేదనో మతలబు అయ్యింటుందండీ. ఉదాహరణికి "కేవలము కోస్తా పదాలు వాడిన వాటికే జవాబులు మాత్రమే ఉంటాయి" ఏవీ అర్ధం కాలేదు. అంటే కోస్తా పక్షపాతమనా మీ అర్ధం? నేనక్షరాల సీమబిడ్డను. అంతోకొంత ఉంటే నాకు తెలంగాణా పక్షపాతమున్నదని అనుకోవచ్చు. ఇక బాటుల విషయానికొస్తే నా ఎజెండాలో ప్రస్తుతం నడుస్తున్నవి మూడు పనులు 1) బొమ్మలు లేని వ్యాసాలను గుర్తించి మూస అంటించడం వర్గం:బొమ్మలు కావలసిన వ్యాసాలు ఇవి దాదాపు ముఫ్ఫై వేల వ్యాసాలుంటే దాదాపు పదిహేను వేల వ్యాసాలకు అంటించడం జరిగింది. అంటే 45-50% అయినట్టే 2) వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ జిల్లాలు#ముఖ్యపట్టణాలను జిల్లా వ్యాసాల నుండి వేరుచేయటం - వివిధ గ్రామాల్లో జిల్లా పేరు లింకు ముఖ్య పట్టణానికి కాకుండా జిల్లా వ్యాసానికి వెళ్ళేట్టు మార్పులు చెయ్యటం - 23లో 12 జిల్లాలు అయ్యాయి. అంటే ఇది కూడ సగంలో ఉంది. 3) గ్రామాల్లో ఖాళీ వర్గాలును తీసెయ్యటం. కేవలం విశాఖపట్నం గ్రామాలు మాత్రమే నడపటం జరిగింది. పవన్‌సంతోష్ అందులో పొరపాటు ఎత్తిచూపడంతో సరిచేసేదాకా కొనసాగించట్లేదు. ఈ మూడు పనుల్లోనూ 95% పని ఆటోవికీబ్రౌజరుతో చేసినదే. ఇవి కాక చిన్నచితకా పనులు కొన్ని చేశాను (ఇటీవల చేసినవి) ఉదా: {{DEFAULTSORT}} మూసలు తీసెయ్యటం లాంటివి. --వైజాసత్య (చర్చ) 05:45, 7 మే 2015 (UTC)
- ఇంకా నేను చేస్తున్న పనులు చూపించాలంటే వర్గం:వికీపీడియా నిర్వహణ మూసలు వర్గంలో అన్ని వాడుకర్ల పేజీలు జతయ్యాయి, ఇలాంటి ఒక నాలుగువేలు తొలగించి ఉంటాను. ఇంకా నాలుగువేలు ఉన్నాయి. ఇది కొందరు వాడుకరులు తప్పుతో కూడిన స్వాగతం మూసలు అంటించడం వళ్ళ జరిగింది/జరుగుతుంది --వైజాసత్య (చర్చ) 05:50, 7 మే 2015 (UTC)
- వైజాసత్య గారు ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు అని కాదండి. నేను అందరిలొ ఒకడిగానే ఎప్పుడూ వ్రాస్తాను. ముందు అది అందరూ ఒక కుటుంబ సభ్యుల మాదిరి అర్థం చేసుకోవాలి. తప్పులు అందరం ఎత్తి చూపుతాము, కానీ ఎవరు సరిదిద్దుతారు, మంచి సలహాలు ఇస్తాము ఎవరు పాటిస్తారు, మంచి చర్చలకి ఎవరు ముందుకు వస్తారు అని సంశయము.లు. చేయవలసిన, చేయదగిన పనుల చిట్టా మీరు ఒకటి తయారు చేయవచ్చు. నేను ప్రస్తుతానికి (నా) మొలకలు, బొమ్మలు, నాకు సంబంధించిన లోటుపాట్లు పనులు సరిచేసుకుంటున్నాను. AWB గురించి చాలామంది నుంచి విచిత్ర సలహాలు, సూచనలు వచ్చాయి. వాడదామంటే అన్ని అడ్డకుంలే. పని తేలిక మార్గం ఇప్పుడు అవసరము లేదనుకుంటా. రైల్వేలో మొట్టమొదటగా కంప్యూటరు ద్వారా అనేక పనులు 1999-2000 లో ప్రారంభించాను, అప్పుడు అక్కడ ఇలాంటి ఇబ్బందులే. ఆ తరువాత ఇప్పుడు అందరూ అది లేకుండా బ్రతక లేకుండా ఉన్నారు. మీరు లేదా ఎవరు ఏం పనులు చేస్తున్నారు అనేదానికంటే ఎవరు ఏమేమి పనులు చేయవచ్చునో, ఇక్కడకు వచ్చి పనులు చేసే అతికొద్దిమందిలోని వారికి కూడా అర్థం కాకుండా ఉన్నది అనుకోవాల్సి వస్తోంది. మీ బాటులు గురించి చెప్పారు, కాబట్టి ఆ పనులు జోలికి వెళ్ళకూడదని అర్థం అయినది. తెలంగాణ గ్రామాలలోని పేజీలలో ఇంకా తొలగించ వలసినవి ఉన్నాయి. వాటిని మీరు చేసిన సరే లేదా నన్ను AWB వేసి తొలగించమంటే తొలగిస్తాను. నేను వికీ సమూహము గురించి చర్చిస్తాను. ఎటువంటి వ్యక్తిగత లేదా సమూహ విమర్శలు నేను చేయను, ఎవరు చేసినా మంచిది కాదు అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 06:09, 7 మే 2015 (UTC)
- @JVRKPRASAD ఒకే, చాలా సంతోషం. బొమ్మలు లేని వ్యాసాలను గుర్తించి మూస అంటించడం సులువుగా ఇతర వాడుకరులు కూడా చేయగలరు. కాకపోతే ప్రస్తుతం అర్జున గారు, రహ్మానుద్దీన్ గారికి తప్పితే మిగిలిన ఎవరికీ బాటు ఖాతాలు ఉన్నట్టు లేవు. బాటు ఖాతాలు లేకుండా AWB వాడినా, పైన నేను ఇటీవలి మార్పులు సమస్య కలుగుతుంది. కాబట్టి ఇతరులకు బాటు ఖాత వచ్చేవరకు నేనే వీటిని కొనసాగించాలనుకుంటా. బాటులు చెయ్యలేని పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణకు సుజాత గారు చేస్తున్నట్టు ఎన్నో మంచి మంచి ఆంగ్ల వికీలోని వ్యాసాలు తెలుగులోకి అనువదించవచ్చు. లేదా ఇప్పటికే ఉన్న గూగుల్ అనువాద వ్యాసాలు సంస్కరించవచ్చు. పనికేమి తక్కువండి --వైజాసత్య (చర్చ) 06:26, 7 మే 2015 (UTC)
- వైజాసత్య గారు, మీరు సూచించిన పనులు, [1] నేను కూడా ఇంకా కొన్ని మంచి పనులు చేస్తున్నాను. AWB వాడితే "ఇటీవలి మార్పులు సమస్య కలుగుతుంది" అని అంటున్నారు, ఎవరూ ఏ పనీ ఇక్కడ చేయని సమయములలో వాడమంటారా ? అస్సలు మాలాంటి వాళ్ళము దేనికీ కూడా వాడకూడదంటారా ? AWB వాడుకకు అటువంటి మార్గదర్శకాలు ఉన్నాయంటారా ? JVRKPRASAD (చర్చ) 00:33, 8 మే 2015 (UTC)
2015 లక్ష్యాలు
మార్చుతెవికీ మిత్రులారా, మనకంటూ కొన్ని లక్ష్యాలున్నాయి అన్నాం. అవి ఏమిటో గుర్తుచేసుకొని తిరిగి మన అమ్మభాష తెలుగులో దీటైన విజ్ఞానసర్వస్వాన్ని తయారుచేసేందుకు తిరిగి అంకితభావంతో పనిచేద్దాం. అందుకు నాందిగా వికీపీడియా:2015 లక్ష్యాలు అనే పేజీని ప్రారంభించాను. అందరం కలిసి చర్చించి కొన్ని లక్ష్యాలను నిర్ణయించుకుందాం. అందరమూ తెలుగు కోసమే కదా పనిచేస్తున్నది? సముదాయంగా మనం మన లక్ష్యాలు నిర్ణయించుకొని అవి తప్పకుండా సాధించగలమన్న గట్టి నమ్మకం నాకున్నది. లక్ష్యాలు నిర్ణయించడంలోనూ, అవి సాకారం చేయటంలోనూ అందిరి సహకారం కావాలి. ఒకసారి రాశిలో తెలుగుకేతనాన్ని పైకి ఎగరవేశాం. వాసిలో కూడా తెలుగోడే మిన్న అని నిరూపిద్దాం. ఈ లక్ష్యాలపై చర్చ వికీపీడియా చర్చ:2015 లక్ష్యాలులో కొనసాగించండి --వైజాసత్య (చర్చ) 07:17, 7 మే 2015 (UTC)
- తప్పకుండా పని చేద్దాము.JVRKPRASAD (చర్చ) 11:15, 7 మే 2015 (UTC)
- నా అభిప్రాయాలు ఇక్కడ తెలియజేశాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:59, 8 మే 2015 (UTC)
- తప్పకుండా పని చేద్దాము.JVRKPRASAD (చర్చ) 11:15, 7 మే 2015 (UTC)
సర్పంచ్, ఎం.పి.టి.సి వ్యాసాలు
మార్చుతెవికీలో ప్రముఖుల వ్యాసాలను చేర్చుటకు ఏ స్థాయి నుండి చేర్చవలసి ఉంటుందో తెలియజేయగలరు. ఈ మధ్య నోముల ప్రభాకర్ గౌడ్ అనే వాడుకరి పెద్దగాని సోమయ్య అనే సర్పంచ్ వ్యాసాన్ని, ఇమ్మడి లక్ష్మయ్య అనే జడ్.పి.టి.సి వ్యాసాలను చేర్చారు. ఆయన వాడుకరి పేజీ ఆధారంగా చూస్తే వారి యొక్క స్నేహితుల వ్యాసాలను చేర్చుతున్నట్లుంది. ఇలా సర్పంచ్, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి స్థాయిలో గల వ్యక్తుల వ్యాసాలను చేర్చడానికి మనం ఆమోదిస్తే అనేక వేల వ్యాసాలు చేరే అవకాశాలు లేక పోలేదు. అవికూడా గ్రామవ్యాసాల వలె మొలకలుగా చేర్చేవారుంటారు. అందువల్ల ఇటువంటి వ్యాసాలను తెవికీకి చేర్చవచ్చా? సముదాయం చర్చించగలరు.-- కె.వెంకటరమణ⇒✉ 17:31, 7 మే 2015 (UTC)
- ఎలాంటి వ్యాసాలను చేర్చాలనే విషయంపై ఖచ్చితమైన నిబంధనలు ఏమీ లేవు, కాని ఉన్న నిబంధనల ప్రకారం చెప్పాలంటే- సర్పంచిలకు సంబంధించిన వ్యాసాలలో సమాచారం లభ్యంకావడం చాలా అరుదు. అందులోనూ ఈ వ్యాసాలలో ఎలాంటి మూలాలు లేవు కాబట్టి ఇవి పరిశోధన వ్యాసాలుగా పేర్కొనవచ్చు. మూలాలు లేకపోవడం, పరిశోధన వ్యాసాలు, ప్రచార వ్యాసాలు, చిన్నవ్యాసాలు తదితర కారణాలతో ఇలాంటి వ్యాసాలను అభ్యంతరపర్చవచ్చు. మూలాలు పెట్టాలంటే ఎన్నికల ఫలితాల తర్వాత వార్తాపత్రికలలో వచ్చిన మూలాలు పెట్టవచ్చు కాని ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం మాత్రం లభించదు. ఇలాంటి మూలాలున్న సమాచారం అవసరమైన కొంతవరకు ఆయా గ్రామాలలో చేరిస్తే సరిపోతుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:22, 7 మే 2015 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారి పేజీలో నేను వ్యాఖ్య వ్రాశాను. ఆయన చూశారని నిర్ధారించుకున్న తర్వాత తొలగిద్దాం --వైజాసత్య (చర్చ) 10:08, 9 మే 2015 (UTC)
- ఇలాంటి విషయాలపై తెవికీలో పాలసీలు లేకపోవడం ఇబ్బందికరమే. మూలసూత్రాలను అన్వయించి చంద్రకాంతరావు గారు చక్కగా విషయాన్ని నిర్ధారించినా పాలసీ ఉండడం ఓ స్పష్టతకు దారితీస్తుంది. గతంలో వైజాసత్య గారు విస్తృత చర్చానంతరం పుస్తకాల నోటబిలిటీ విషయంలో థర్డ్ పార్టీ రిఫరెన్సులు ఉండడం అనే మూలసూత్రాన్నే వర్తింపజేశారు. చాలా వ్యాసాలను తదనంతరం ఏం చేయాలో నిర్ధారణ జరిగింది, కానీ ఇప్పటికీ ఈ విషయంలో స్పష్టమైన నోటబిలిటీ మార్గదర్శకాలు లేకపోవడం సమస్యే. ఇలాంటివి పరిష్కరించే ప్రయత్నమేదైనా ప్రారంభిస్తే బావుంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 9 మే 2015 (UTC)
- సాధారాణ సర్పంచ్ ల గురించి వికీలో ఉండటం అనవసరం అని నా అభిప్రాయం. ఒకవేళ సదరు వ్యక్తి బాగా పేరు తెచ్చుకుని వార్తల్లోని వ్యక్తి అయితే రాయవచ్చు. --రవిచంద్ర (చర్చ) 17:14, 9 మే 2015 (UTC)
- అందరికీ, నా ధర్మసందేహం. ఒక రాజకీయ పార్టీకి సంబంధించి రాష్ట్ర, జాతీయ నాయకులు ఆయా పార్టీలలో ఉంటూ ఉంటారు. మరి వారి గురించి కూడా వ్యాసములు వ్రాయవచ్చా ? JVRKPRASAD (చర్చ) 06:03, 10 మే 2015 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారి పేజీలో నేను వ్యాఖ్య వ్రాశాను. ఆయన చూశారని నిర్ధారించుకున్న తర్వాత తొలగిద్దాం --వైజాసత్య (చర్చ) 10:08, 9 మే 2015 (UTC)
- తెవికీలో వ్యాసాలు ఉండడానికి పదవులకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఇదివరకే చెప్పినట్లు ఇతర నియమాలు సంతృప్తికరంగా లేనప్పుడు మాత్రమే వ్యాసాన్ని అభ్యంతరపర్చవచ్చు. కేవలం సాధారణ సర్పంచి పదవులు మాత్రమే చేపట్టారనీ, అవి చిన్న పదవులనీ, కేవలం అలాంటి పదవులు మాత్రమే చేపట్టిన వారి వ్యాసాలు తెవికీలో ఉండరాదనీ అనడం అలాంటి పదవులను హేళనపర్చడమే అవుతుంది. కాబట్టి అలాంటి పదవులు చేపట్టినవారి వ్యాసాలను అభ్యంతరపర్చడం సమంజసం కాదనిపిస్తుంది. అసలు ఆ పదవులు కూడా చేపట్టని, వార్డు సభ్యులుగా కూడా ఎన్నికకాని రౌడీలు, గుండాలు, దొంగలకు సంబంధించిన వ్యాసాలు వ్రాసిననూ ప్రస్తుతమున్న నియమాల ప్రకారం మనం అభ్యంతరపర్చడానికి అవకాశం లేదు. ఆ వ్యక్తికి సంబంధించిన సమాచారం లభ్యం అవుతున్నదా, దానికి తగిన మూలాలు ఉన్నవా లాంటి ఇతర అంశాలపైనే ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 09:20, 10 మే 2015 (UTC)
- చంద్రకాంతరావు గారూ ఏ పదవినీ అవమానించాల్సిన పనిలేదు. ఒక వ్యక్తి సర్పంచి అయివుండీ వేర్వేరు రంగాల్లో అత్యంత ప్రముఖమైన వ్యక్తి అయివున్నా, లేదంటే అదే రంగంలో చాలా విశిష్టమైన స్థాయి పొందినా వారి వ్యాసం వికీలో ఉండవచ్చు అని నా అవగాహన. కానీ సర్పంచి అవడాన్నే ముఖ్యకారణం చేసుకుని వికీలో వ్యాసం వ్రాయవచ్చా? నోటబిలిటీ అంటూంటారు కదా దాని సంగతి ఏమిటి? --పవన్ సంతోష్ (చర్చ) 15:23, 11 మే 2015 (UTC)
- నా ఉద్దేశ్యం వ్యాసాలకు పదవులతో సంబంధం లేదని చెప్పడం మాత్రమే. కాని సర్పంచి అవడాన్నే ముఖ్యకారణం చేసుకుని వికీలో వ్యాసం వ్రాయడాన్ని చెప్పడం లేదు. ఒక సర్పంచికి సంబంధించిన మూలాలు లభ్యం అవుతున్నాయంటే ఆ వ్యక్తి పేరుపొందినవాడే అనుకోవచ్చు. ఒక వ్యక్తి ఎంత ప్రసిద్ధుడైననూ మూలాలు లభ్యం కాకపోవచ్చు, మరో సామాన్యునికి సంబంధించిన మూలాలు అందుబాటులో ఉండవచ్చు. మూలాలు అందుబాటులో ఉన్నవారికే మనం వ్యాసాలు సృష్టిస్తాం. ప్రతీదానికి నియమాలను స్పష్టంగా అపాదించలేము. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:17, 11 మే 2015 (UTC)
- చంద్రకాంతరావు గారూ ఏ పదవినీ అవమానించాల్సిన పనిలేదు. ఒక వ్యక్తి సర్పంచి అయివుండీ వేర్వేరు రంగాల్లో అత్యంత ప్రముఖమైన వ్యక్తి అయివున్నా, లేదంటే అదే రంగంలో చాలా విశిష్టమైన స్థాయి పొందినా వారి వ్యాసం వికీలో ఉండవచ్చు అని నా అవగాహన. కానీ సర్పంచి అవడాన్నే ముఖ్యకారణం చేసుకుని వికీలో వ్యాసం వ్రాయవచ్చా? నోటబిలిటీ అంటూంటారు కదా దాని సంగతి ఏమిటి? --పవన్ సంతోష్ (చర్చ) 15:23, 11 మే 2015 (UTC)
ఎక్కడో పెళ్ళి - ఇక్కడ హడావిడి
మార్చుఎక్కడో తుఫాను, భూకంపం ఇక్కడ ఎగిరి పోతాయి అన్నట్లు, ఎవరో ఎక్కడో వికీలోకి వస్తారు. వారు ఆటోలో వచ్చేస్తారు. మనము వారికి యధాలాపంగానో, యాదృచ్చికంగానో, అనాయాసంగా రండి రండి దయచేయండి అంటూ ఒక మూసతో స్వాగతం ఎక్కువమందిమి పలుకుతాము. ఇది ఒక ప్రాజెక్టులా మనము ఎక్కువమంది చేస్తున్న చిన్న తప్పిదము ఏమో అనిపిస్తుంది. ఒక కొత్త వాడుకరి, కనీసం నెలలో ఒక మార్పు కూడా చేయని వారికి స్వాగతాలు అవసరము లేదనిపిస్తుంది. అది ఒక ప్రత్యేక పనిలా మనకు అయ్యింది. మనము స్వాగతాలు నెలలో ఒక మార్పు పనిచేసిన వారికి చెబితే బావుంటుందని నా అభిప్రాయము. దయచేసి వాడుకరులందరూ స్పందించ గలరు. JVRKPRASAD (చర్చ) 05:59, 10 మే 2015 (UTC)
- మార్పులు చేయనీ, చేయకపోనీ.. ఆహ్వానం పలకడంలో తప్పేముంది? నేను చేరిన కొత్తలో ఇలాంటి సందేశం రాగానే సంతోషంగా ఫీలయ్యాను. దాని వల్ల నాకు ఒకింత ఆశ్చర్యం, అరే ఇంతమంది తెలుగు భాషకోసం నిస్వార్థంగా పని చేస్తున్నారా? మనం కూడా కొంచెం సమయం కేటాయిద్దాం. అనే అభిప్రాయం కలిగింది. ఇక మంచి మార్పులు చేసే వారిని అనుక్షణం ఎవరో ఒకరు ఒక సందేశం రూపంలో వెన్నుతడూతూనే ఉన్నాం. --రవిచంద్ర (చర్చ) 08:43, 10 మే 2015 (UTC)
- రవిచంద్ర ఏగూటి చిలుక ఆ గూటి పలుకులే పలుకుతుంది అన్నట్లుగా ఉంది. అసలు తెలుగు భాష కూడా రాని, తెలియని, చదవని, పేర్లు కూడా లేని వారి సంగతేమిటి ? అనే దానికి జవాబు కావాలి. ఇక్కడ తెలుగు వారి గురించి కాదు నేను వ్రాసింది. ఇతర వికీలనుంచి ఆటోలో వస్తున్న వాడుకరుల గురించి అని ముందు అర్థం చేసుకుంటే దానికి సమాధానము వ్రాయవచ్చును.JVRKPRASAD (చర్చ) 09:30, 10 మే 2015 (UTC)
తెలుగు చొప్పింతకు మరిన్ని పద్ధతుల అందుబాటు
మార్చుతెలుగులో టైప్ చేసేందుకు (తెలుగు అక్షరాలను చొప్పించేందుకు) వాడే ఆపిల్, మాడ్యులార్ పద్ధతులు తెవికీలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణయ్ సీఐఎస్ -ఏ2కే కు అభ్యర్థన చేసారు. ఆ ప్రకారంగా ఈ అభ్యర్థనకు తగిన మార్పులు చేస్తూ ప్రవీణ్ ఇళ్ళ మాడ్యులార్, ఆపిల్ పద్ధతులను అందుబాటులోకి తెచ్చారు. డిసెంబర్ 31 నాటికి ఇది ఇంజనీరింగ్ టీం వారికి యూఎలెస్ లో చేర్చేందుకు అభ్యర్థన వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. --రహ్మానుద్దీన్ (చర్చ) 08:45, 16 మే 2015 (UTC)
- ధన్యవాదాలు రహ్మానుద్దీన్ గారు. --Pranayraj1985 (చర్చ) 12:33, 16 మే 2015 (UTC)
- ఈ అవసరాన్ని ఎత్తిచూపిన ప్రణయ్ రాజ్ గార్కి ధన్యవాదాలు. ఎన్నాళ్ళ నుంచో దీన్ని గురించి నేను ఆసక్తిగా వేచివున్నాను. లిప్యంతరీకరణ, యాపిల్ రెండు విధానాల్లోనూ నేను వేగంగా టైప్ చేయగలిగినా నాకు యాపిల్ లో ఉన్న సౌలభ్యం లిప్యంతరీకరణలో దొరకలేదు. అందుకే ప్రణయ్ రాజ్ రెక్వెస్ట్ చేసిన నెలలుగా ప్రోగ్రస్ తెలియకపోవడంతో ప్రణయ్ రిక్వెస్ట్ పెట్టిన సిఐఎస్ రెక్వెస్టుల పేజీలోనే ఆ విషయాన్ని నమోదు చేసి ప్రక్రియ ఎంతవరకూ వచ్చిందీ తెలపాలనీ వ్రాశాను. ఆపైన ఇటీవల డెబియన్ కొత్త వెర్షన్ జెస్సీ విడుదల అయినప్పుడు హైదరాబాద్ థియేటర్ అవుట్రీచ్ యూనిట్లో పరిమిత ఔత్సాహికులు, కార్యకర్తల నడుమ ప్రవీణ్ ఇళ్ళ ఆ వెర్షన్ విడుదల చేసి కార్యక్రమం చేశారు. దానికి వికీమీడియన్లలో నేనూ, ప్రణయ్, వీవెన్, నిర్వాహకునిగా ప్రవీణ్ హాజరయ్యాము. అప్పుడు ఈ యాపిల్ పద్ధతిని గురించి కృషిచేయాలని అప్పటికే దీనిని వికీలో చేర్చేందుకు కృషిచేస్తున్న వీవెన్ నీ, సాంకేతికంగా అవగాహన కలిగిన ప్రవీణ్ నీ కోరాను. మొత్తానికి యాపిల్ మాడ్యులర్ ఇందరు సముదాయ సభ్యుల కృషితో అందుబాటులోకి రావడం సంతోషకరం. ప్రవీణ్ ఇళ్ళ, వీవెన్ గార్లు తెలుగు, సాంకేతికతలపై సమానమైన ఆసక్తి నైపుణ్యం కలిగిన సభ్యులు. వారి కృషికి మరీమరీ ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 05:23, 20 మే 2015 (UTC)
This is a message from the 2015 Wikimedia Foundation Elections Committee. Translations are available.
Voting has begun for eligible voters in the 2015 elections for the Wikimedia Foundation Board of Trustees. Questions and discussion with the candidates for the Board will continue during the voting.
The Wikimedia Foundation Board of Trustees is the ultimate governing authority of the Wikimedia Foundation, a 501(c)(3) non-profit organization registered in the United States. The Wikimedia Foundation manages many diverse projects such as Wikipedia and Commons.
The voting phase lasts from 00:00 UTC May 17 to 23:59 UTC May 31. Click here to vote. More information on the candidates and the elections can be found on the 2015 Board election page on Meta-Wiki.
On behalf of the Elections Committee,
-Gregory Varnum (User:Varnent)
Volunteer Coordinator, 2015 Wikimedia Foundation Elections Committee
Posted by the MediaWiki message delivery 17:20, 17 May 2015 (UTC) • Translate • Get help
మొదటి పేజీ నిర్వహణ సహాయం
మార్చుమొదటి పేజీ నిర్వహణలో భాగంగా గత కొన్నాళ్ళుగా "ఈ వారం వ్యాసం" , "మీకు తెలుసా!" మరియు "చరిత్రలో ఈ రోజు" శీర్షికలను నిర్వహించే కార్యక్రమంలో నా సహకారం అందిస్తూ ఉన్నాను. " ఈ వారపు బొమ్మ" శీర్షికను ఇంత వరకు ఆదిత్యమాథవ్ నిర్వహించే వారు. ప్రస్తుతం 22 వ వారం ఆ తదుపరి వారాలకు ఈ వారపు బొమ్మ పేజీలు సృష్టింపబడలేదు. వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2015 22వ వారం నుండి ఔత్సాహిక వికీపీడియనులు నిర్వహించి మొదటిపేజీ నిర్వహణకు సహాయపడగలరని కోరుకుంటున్నాను.-- కె.వెంకటరమణ⇒✉ 13:02, 19 మే 2015 (UTC)
- కె.వెంకటరమణ గారూ నా వరకూ ఈ వారం బొమ్మలో మీకు సహాయం అందిస్తాను. వీలైనన్ని ఫిల్ చేస్తాను...--విశ్వనాధ్ (చర్చ) 06:05, 21 మే 2015 (UTC)
- ఈ వారం బొమ్మలు చేర్చినందుకు విశ్వనాధ్ గారికి ధన్యవాదాలు-- కె.వెంకటరమణ⇒✉ 06:08, 21 మే 2015 (UTC)
లా ప్రవేశ పరీక్షలో వికీపీడియా గురించి వచ్చిన ఒక ప్రశ్న
మార్చు19 మే 2015 న తెలంగాణ లాసెట్ పరీక్ష పత్రంలో 25వ ప్రశ్న ఈ విధంగా వున్నది. 25. who is the founder of ' wikipedia '/ వికీపీడియా ను స్థాపించినది ఎవరు?
- 1. Peer Scheider 2. Byron Looper 3. Rickard Eriksson 4. Jimmy Wales
- 1.పీర్ స్చెడర్ 2.బైరాన్ లూపర్ 3.రికార్డ్ ఎరిక్ సన్ 5.జిమ్మి వేయిల్స్
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మే 24, 2015 సమావేశం
మార్చుఅందరికి నమస్కారం... తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం మే 24, 2015 నాడు మధ్యాహ్నం 3 గం.ల నుండి సాయంత్రం 6 గం.ల వరకూ హైదరాబాద్, అబిడ్స్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో జరుగుతుంది. సమావేశానంతరం/ముందు మినీ వికీపీడియా వర్కుషాపు ఉంటుంది. సమావేశ పేజి కొరకు ఇక్కడ చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 05:55, 20 మే 2015 (UTC)
- ప్రణయ్ గారూ మినీ వికీపీడియా వర్కుషాప్ అంటే ఏమిటి? అది ఎవరు ఎలా నిర్వహిస్తారు? --పవన్ సంతోష్ (చర్చ) 06:00, 20 మే 2015 (UTC)
- పవన్ సంతోష్ గారు... వికీపీడియాపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వస్తే వారికి వికీపీడియాపై అవగాహన కలిగించడం జరుగుతుంది. --Pranayraj1985 (చర్చ) 06:07, 20 మే 2015 (UTC)
- బావుంది. పదం బరువుగా కనిపిస్తే అడిగాను :) --పవన్ సంతోష్ (చర్చ) 06:12, 20 మే 2015 (UTC)
- 24న తెలుగు వికీపీడియా నెలవారీ ముఖాముఖీ సమావేశం జరుపుకోవాలనుకున్న విషయం అందరి తెలిసిందే... అయితే ఎండలు తీవ్రంగా ఉండండం, కొంతమంది సభ్యులు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ నెల సమావేశాన్ని రద్దుచేయడమైనది. సభ్యులు సహకరించగలరు. --Pranayraj1985 (చర్చ) 07:14, 24 మే 2015 (UTC)
- బావుంది. పదం బరువుగా కనిపిస్తే అడిగాను :) --పవన్ సంతోష్ (చర్చ) 06:12, 20 మే 2015 (UTC)
- పవన్ సంతోష్ గారు... వికీపీడియాపై ఆసక్తి ఉన్నవారు ఎవరైనా వస్తే వారికి వికీపీడియాపై అవగాహన కలిగించడం జరుగుతుంది. --Pranayraj1985 (చర్చ) 06:07, 20 మే 2015 (UTC)
తెవికీ గ్రంథాలయం
మార్చువికీసభ్యులకు పుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలన్న సదుద్దేశంతో ఐఈజీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా లైబ్రరీ లాంటి కృషి సాగుతోంది. ఐతే తెవికీలో ఈ భావనను రహ్మానుద్దీన్ గారు ప్రవేశపెడుతున్నారు. వికీపీడియా ఫ్లో చర్చ పేజీలో ఈ విషయాన్ని వివరించారు. క్లుప్తంగా చెప్పాలంటే రెహ్మానుద్దీన్ గారు ఇక్కడ ఇచ్చిన లిస్టులోని పుస్తకాలు తెవికీపీడియన్లు అడిగి తీసుకుని చదివి వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగువారు అధికంగా నివసిస్తున్న మెట్రోపాలిటన్ నగరాలు హైదరాబాద్, బెంగళూరుల్లో ఆయన వేర్వేరు పుస్తకాలు ఉంచారు. ఎక్కడి వారు అక్కడ తమకు ఆసక్తివున్న పుస్తకాలు తీసుకుని వాడుకోవచ్చు.(ఐతే వాటిని ఎప్పుడు, ఎలా తిరిగి ఇవ్వాలో ఆయన చెప్పలేదు, ఫోన్ ద్వారా అడగవచ్చు లెండి అలాంటీవి). తెవికీ సభ్యుల దృష్టికి ఈ సత్ ప్రయత్నం తీసుకురావాలని ఇక్కడ పెడుతున్నాను. అలానే ఆలోచన నాక్కూడా చాలా నచ్చింది. నా దగ్గర ఉన్న వందలాది పుస్తకాలు స్కాన్లుగానో లేక, ఇలాగేనో పెట్టేందుకూ ప్రయత్నిస్తాను. ఆనో భద్రా క్రతవో యంతు విశ్వత:(విశ్వం నలువైపుల నుంచీ మంచి ఆలోచనలు మనల్ని చేరుకొనుగాక). --పవన్ సంతోష్ (చర్చ) 06:21, 20 మే 2015 (UTC)
- మంచి అలోచన - అభినందనలు ---విశ్వనాధ్ (చర్చ) 13:17, 20 మే 2015 (UTC)
అన్నీ కూడా కాపీ హక్కులు లేని పుస్తకాలే కదా , లేక వీలయినంత వరకు ప్రచురణ కర్తలకు , ఆయా పుస్త్కక హాక్కుదారులకు వికీ లైబ్రరీ గురించి తెలిపి, వారి సమ్మతి మీద పుస్తకాలు అందుబాటులోకి తీసుకుకొన వలసినదిగా సూచన --కశ్యప్ (చర్చ) 13:31, 20 మే 2015 (UTC)
- స్కాన్లుగా పెట్టేప్పుడైతే అనుమతి, కాపీహక్కుల సమస్య వంటివి ఎదురవుతాయి కానీ హార్డుకాపీలు చేతులు మార్చుకునేప్పుడు ఆ సమస్య ఉండదనుకుంటా. ఏమంటారు కశ్యప్ గారూ..? --పవన్ సంతోష్ (చర్చ) 10:27, 22 మే 2015 (UTC)
వికీ సోర్సు వ్యాసాలు
మార్చుతెవికీలో వికీసోర్సు లో ఉన్న వ్యాసాలు యదాతథంగా ఉన్నవి. యధాతథంగా చేర్చినవారు కొత్తవాడుకరులు కాదు. అనుభవమున్న వాడుకరులే. ట్యాగులు, మూసలు పెడితే వారిని అవమానిస్తున్నట్లు భావిస్తారు. వికీసోర్సులో ఉన్న పేజీలను తెవికీ లోనికి చేర్చినపుడు భాష, శైలి వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉండాలని తమకు తెలియనిది కాదు. దయచేసి వాటిని వ్యాసాలుగా తీర్చిదిద్దండి. ఆంధ్ర దేశము వంటి వ్యాసాలు వికీసోర్సు నుండి యదాతథంగా వచ్చిన వ్యాసం. తిరువేంగడం వ్యాసం కూడా వికీ సోర్సులో ":DivyaDesaPrakasika.djvu/210.211.212..." మొదలగు పేజీలలో యదాతథ కాపీ వ్యాసంగా ఉంది. సదరు వ్యాసాలు ఎవరు చదవాలన్నా భాష గానీ , భావం గానీ చదువరులకు అర్థం కాని స్థితి. వాటిని ఒక వ్యాసాలుగా తీర్చిదిద్దండి, లేదా తొలగించండి. -- కె.వెంకటరమణ⇒✉ 06:58, 21 మే 2015 (UTC)
- మొత్తం అదే వ్యాసమైతే తొలగించండి. వ్యాసంలో కొంత భాగమైతే, ఆ భాగాన్ని చర్చా పేజీలో అతికించి, వ్యాసం నుండి తొలగించండి. వికీసోర్సు పేజీలు యధాతథంగా అంటిస్తే అవి వికీపీడియా వ్యాసాలు కావని గమనించాలి. అలాంటి మూల సమాచారాన్ని ఎంతో మధించి, సారం పిండి వ్రాస్తేనే కానీ వికీవ్యాసాలు కావు --వైజాసత్య (చర్చ) 07:45, 21 మే 2015 (UTC)
- ఇది మరో ఉదాహరణ శాతవాహనవంశము. --వైజాసత్య (చర్చ) 07:49, 21 మే 2015 (UTC)
- మొత్తం అదే వ్యాసమైతే తొలగించండి. వ్యాసంలో కొంత భాగమైతే, ఆ భాగాన్ని చర్చా పేజీలో అతికించి, వ్యాసం నుండి తొలగించండి. వికీసోర్సు పేజీలు యధాతథంగా అంటిస్తే అవి వికీపీడియా వ్యాసాలు కావని గమనించాలి. అలాంటి మూల సమాచారాన్ని ఎంతో మధించి, సారం పిండి వ్రాస్తేనే కానీ వికీవ్యాసాలు కావు --వైజాసత్య (చర్చ) 07:45, 21 మే 2015 (UTC)
- * ఇటువంటి వ్యాసాలకు విలీనం మూసలు తగిలిస్తున్నారు. అది సరికాదని నా అభిప్రాయం, తత్సంబంధిత సమాచారపు ముద్ద దొరికింది కదాని దాన్ని ఇప్పటికే మంచి స్థితికి చేరిన వ్యాసానికి చేర్చడం భావ్యం కాదు. వికీకరణ పొందని ఈ వ్యాసాలు మంచి వ్యాసాల స్థితి చెడగొడతాయి.--పవన్ సంతోష్ (చర్చ) 14:10, 24 మే 2015 (UTC)
- పవన్ సంతోష్ , అవును. మీ అభిప్రాయంతో నేను అంగీకరిస్తున్నాను. విలీనం చేసే కంటే, వీటిని తొలగించడమే నయం --వైజాసత్య (చర్చ) 06:45, 25 మే 2015 (UTC)
వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు
మార్చువికీపీడియా:తొలగింపు_చర్చలు#వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు లో 2015-05-30 లోపల స్పందించండి.--అర్జున (చర్చ) 17:15, 23 మే 2015 (UTC)
- చర్చాఫలితం ప్రకారం, సమాచార పెట్టెలను వికీపీడియా:బాటు_సహాయానికి_అభ్యర్ధనలు#వాడుకరి పేజీలలో ఖాళీగా వున్న Infobox person మూస తొలగించు లో తెలిపినట్లు తొలగించబడింది. తొలి తొలగింపు ఆధారమైన క్వెరీలో చిన్న దోషముండడంతో ఒకటి రెండు చోట్ల, వాడుకరి మార్పు చేసిన పేజీలలో సమాచారపెట్టెలు తొలగించబడివుండవచ్చు. పొరబాటుకి చింతిస్తున్నాను. ఈ పనికి దాదాపు రెండు రోజులు పట్టింది. పదేపదేమార్పులు చేసేవారు ఇకముందు కాస్త అటువంటి మార్పుల ఉపయోగం, వికీనియామాలకు అనుగుణంగా వుండడం ధృవీకరించుకొని చేస్తే క్రియాశీలంగా వున్న కొద్ది వికీపీడియన్ల పని మరింత మెరుగుగా వినియోగించుకోవడానికి వీలవుతుంది. ఈపనికి సహకరించిన సభ్యులందరికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 13:34, 9 జూన్ 2015 (UTC)
బాటు ద్వారా మాత్రమే తొలగింపు చేయాలనే శాశనం
మార్చు- వాడుకరి సభ్య పేజీలలో సభ్యుడు మార్చని సమాచార పెట్టెలు తొలగించు [2] అనే చర్చ మరియు అభిప్రాయముల స్పందనలలో, ఆయా తొలగింపు చేయవలసిన వాటిని తొలగించుటకు బాటు ద్వారా మాత్రమే తొలగింపు చేయాలనే శాశనంలా తమ అభిప్రాయములు తెలియజేసారు.
- అసలు బాటు ద్వారా మాత్రమే తొలగించాలన్న (అంటే బాటు ఉన్న వారు మాత్రమే ఆ పని చేయాలి, మిగతా వారు ఎవరు ఆ పని చేయకూడదు.
- బాటులు ఉన్నవి ఇక్కడ కేవలం ఇద్దరికి మాత్రమే) డిమాండులా ఈ మధ్యన అధిక తొలగింపులు లేదా పనులు వద్ద వినిపిస్తున్న మాట. ఈ చెప్పేవారు ఎందుకు చెబుతున్నారో వివరంగా తెలియజేస్తే కొంతవరకు తెలుసుకొని ఆ తదుపరి చర్చలు చేయవచ్చును. JVRKPRASAD (చర్చ) 01:17, 27 మే 2015 (UTC)
- ఆ సూచన చేసినవారిలో నేనూ ఉన్నాను కనుక నా కారణాలు చెప్తున్నాను. మొదటిది: సభ్యుల సమయం ఇలాంటివాటికే కేటాయించడం వల్ల వ్యాసరచన, సరిదిద్దడాలు, కొత్తవారిని ప్రోత్సహించడం, పాలసీ చర్చలు, నిర్వహణ వంటివాటిలో పాల్గొనేందుకు గల సమయం తగ్గుతుంది. బాటు చేయగలిగినప్పుడు వారి శ్రమ దీనిపై కేటాయించమనడం సరికాదు. రెండవది: ఇటీవలి మార్పులను గస్తీకాస్తూ నిర్వహణ బాధ్యతలు చూసేవారికి ఇటువంటి రిపిటేటెడ్ మార్పుల వల్ల ఇబ్బంది కలుగుతుంది. మూడవది: ఇటువంటివి వ్యక్తులు చేస్తూపోతే పెరిగే దిద్దుబాట్ల సంఖ్య గతంలో చాలా సమస్యలే సృష్టించింది. ఈ కారణాలు అటుంచితే బాటులో సమస్యలు ఉంటే ఎలా దిద్దుకుంటామంటే - నావంటివారు ఎలానూ వీక్షణజాబితాలో మార్పులు చూసి (నా వీక్షణ జాబితాలో బాటుమార్పులు కూడా కనిపిస్తాయి) బాటు నడుపుతున్నవారికి చెప్తాను. ఇతర సభ్యులూ ఇదే పనిచేసినా సరిపోతుంది. బాటు నడపనున్న పేజీల్లో నాలుగైదింటిని వీక్షణజాబితాలోకి పెట్టుకుని చూస్తే సరి.--పవన్ సంతోష్ (చర్చ) 03:02, 27 మే 2015 (UTC)
- (JVRKPRASAD జవాబు) -
- నేను ఎప్పుడు చర్చలు చేసినా స్తబ్దుగా ఉన్నది వికీ అని అనుకున్నప్పుడు కూడా చేస్తూ ఉంటాను.
- కేవలం సభ్యుల నుండి స్తబ్దత పోగొట్టవచ్చును అని ఒక ఉద్దేశ్యం.
- ఇక్కడ ఎవరి మనసులు నొప్పించాలని చర్చలు ఎప్పుడు చేయను.
- వికీ దేశానికి ప్రతి వారు ప్రథమ వాడుకరి కనుక, ఇందులో అందరూ సమానమే.
- తదుపరి, పవన్ యొక్క మనసులోని మాటలు గురించి చూస్తే: ఏవేవే పనులలో ఎవరెవరికో సమయము, శ్రమ తగ్గుతుంది అంటున్నారు, దానిలో అర్థం లేదు.
- నేను చేస్తాను. నాకేంటి బాధో మీరు చెప్పగలరా ?
- గస్తీ నిర్వహణ అంటారు. 24 గంటలు కూడా గస్తీ నిఘాలో ఉంటారా ?
- అనేక మార్పుల వల్ల ఇబ్బంది కలుగుతుందా ? హాస్యం కాకపోతే ఏమిటీ ?
- ఏమిటో ఏదో ఎవరి తోచినది వారు చెబుతూ ఉంటారు. ఇవి పాలసీలో ఉన్నాయా ?
- బాటులు ఎంత మందికి ఉన్నాయి ? కేవలం తెలిసిన ఒక వాడుకరి బాటు మాత్రమే కొద్దిగా చేతనంగా ఉంది. ఆ ఒక్కళ్ళే ఏ పని అయినా చేయాలి.
- అందరి (ఏడుపు అని అనాలి లేదా గోల అనాలి) బాధ, నొప్పి, ఇత్యాదివి కేవలం ఎదుటివారు సాంకేతికంగానో, ఎక్కువ సమయము కేటాయించో తమ తోచినది, సభ్యతగల పనులు ఎక్కువగా చేస్తూ ఉన్నారని అక్కసుతో మాత్రమే అనుకోవాలి.
- వాళ్ళు చేయరు ఎదుటి వారిని చేయనివ్వరు.
- అసలు ఈ దిద్దుబాట్లు సంఖ్య (పెంట) గోల తీసేస్తే వికీ చాలా బాగుపడుతుంది.
- మనిషికి పనులు అప్పజెప్పే సంస్థ అని అనుకుంటున్నారు కాబోలు.
- ఎవరికీ ఇక్కడ బానిసలు, కింద పనిచేసే వారు కారు.
- ఏ ఒకరి గురించో ఎందుకు ? నేను నా కావల్సిన సభ్యత గల పని నేను చేస్తాను.
- వికీ ఉద్దేశ్యం కూడా అదే.
- నన్ను ఫలనా పని మీరు చేయవద్దు అని చెప్పే ఆవశ్యకత, అవసరం ఎంత వరకు ఉంది ?
- ఈ పని చేయి ఆ పని చేయ వద్దు అనే ధోరణి ఎక్కువయింది.
- ఉన్న కొద్ది మంది పని మానేసి, పెత్తనం లేదా బొక్కలు కెలకడం మాత్రమే ఒక పనిగా పెట్టుకున్నారు.
- (మీ బుర్రకి పని మాత్రమే. మీ మనసులు చెడగొట్టుకోకండి)
- ఉచిత పనిలో ఆంక్షలు ఏమిటి ? [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD] (చర్చ) 03:26, 27 మే 2015 (UTC)
- (JVRKPRASAD జవాబు) -
- కొత్త వాడుకరులకు మానవ తాకిడితో స్వాగతం పలకాలని తీర్మానాలు చేస్తారు.
- మన వాళ్ళు పెట్టిన వాడుకరి డబ్బాలను తొలగించటానికి మాత్రము యాత్రికంగా వాడాలంటారు.
- వాడుకరిని అవమానం పరిచినట్లు అప్పుడు అవదా ?
- ఎందుకు తొలగించారో వాళ్ళకు ఎలా తెలుస్తుంది ? JVRKPRASAD (చర్చ) 04:43, 27 మే 2015 (UTC)
- JVRKPRASAD గారికి. ఇటీవలి మార్పులు లో బాటు మార్పులు దాచే ఎంపిక వుండడంతో , బాటు ఖాతాతో ఎక్కువ మార్పులు జరిగినప్పుడు వాటిని దాచి, సాధారణ సభ్యులు చేసే మార్పులు గమనించడం సులువవుతుంది. సాధారణ ఖాతాతో ఒక రోజు 500 మార్పులు చేశారనుకుంటే , సులభంగా , ఆమార్పులను వదిలేసి ఇతర మార్పులు చూడడం కష్టం. AWB ని సమర్ధవంతంగా వాడగల వారు, అలాగే బాట్ స్క్రిప్టులను కూడా సమర్ధవంతంగా వాడగలిగేవారంతా బాట్ ఖాతా తెరిచి పదేపదే చేయవలసిన మార్పులు చేయడానికి బాట్ ఖాతా వాడవచ్చు. దానికొరకై వికీపీడియా:Bot/Requests for approvals లో అభ్యర్ధించండి.--అర్జున (చర్చ) 12:41, 27 మే 2015 (UTC)
- అర్జున గారు, AWB కూడా బాటు కిందకే వస్తుందా ? JVRKPRASAD (చర్చ) 04:09, 28 మే 2015 (UTC)
- JVRKPRASAD గారికి, సాధారణంగా అయితే అవసరం లేదు. కాని ఆంగ్ల AWB పేజీ గమనించితే వేగంగా ఎక్కువ మార్పులు చేసే వారికి బాట్ ఖాతా వాడమని కోరారు. అందువలన తెలుగు వికీలో కూడా మీ లాంటి వారు AWB తో ఎక్కువ పనులు చేయదలిస్తే , బాట్ ఖాతా వాడి చేయడం ఎవరికి ఇబ్బందిలేకుండా వుంటుంది. --అర్జున (చర్చ) 04:27, 28 మే 2015 (UTC)
- (JVRKPRASAD జవాబు) - :అర్జున గారు,
- మనకి ఇక్కడ AWB తో ఎక్కువ పనులు చేసే అవసరము పెద్దగా ఉండదనే అనుకుంటున్నాను.
- నాకోసమే బాటు అంటే ఎందుకో అయిష్టంగానే ఉంది. ఎవరయినా అడిగితే తప్పకుండా నేను కూడా అడుగుతాను.
- AWB దానికి రోజుకి కొంత వరకు అవకాశం ప్రస్తుతం ఇవ్వవచ్చు.
- పెద్దగా పని చేసే వారు కూడా అంతగా లేరు.
- ఒకవిధంగా AWB కంటే, మామూలుగా చేసుకునే మార్పులు తేలికగా చేసుకోవచ్చు.
- కేవలం ఒక వర్గంగా ఏదయినా కావాలంటే AWB చాలా బాగా ఉపయోగం ఉంది. తక్కువ సమయములో ఎక్కువ వివరాలు పొందవచ్చు.
- నాకు బాటులు గురించి అవగాహన ఏ మాత్రం లేదు. కొత్త సమస్యలు వస్తాయోమోనని కాస్త భయం కూడా ఉంది. JVRKPRASAD (చర్చ) 04:43, 28 మే 2015 (UTC)
- ప్రసాద్ గారూ మీరు అడిగారు ఎందుకు ఇలా బాట్ వాడాలని కోరారని, నేను దానికి సమాధానం చెప్పాను ఇదిగో ఇందుకు అని ఈ మాత్రానికి అక్కసు అనాల్సిన పని ఏముంది? సమాధానం చెప్పకుంటే బావుండేదంటారా చాలామందిలాగా? మీరు చేస్తానంటే మీకేం బాధా లేదని తెలుస్తోంది, కానీ నాకు అక్కడ సంతకం పెట్టే సమయానికి ఇవన్నీ ఎలా తెలుస్తాయి. ఈమెయిల్ పంపుతున్నాం ఇవాళ, మనిషిని పంపి కబురు చెప్పకూడదా అంటే ఏం చెప్పగలం? చెప్పవచ్చు. కానీ మానవశ్రమ అవసరం లేకుండా సాంకేతికంగా చేసుకునే వీలుంది కాబట్టి చేస్తున్నాము. ఇదే చిన్న సూత్రం ఇక్కడా అన్వయించి బాట్ నడపమన్నాము. మీరు స్వయంగా చేస్తామంటే ఎవరైనా అడ్డుకున్నారా? కేవలం అక్కడ సూచన రాసిన కారణంగా అక్కసు, ఏడుపు, గోల, బాధ, నొప్పి అనడం సమంజసమా? బాట్ ప్రస్తావన అయినా ఎందుకు వచ్చిందంటే అక్కడ బాటు వినియోగించి చేయగలవారున్నారు కనుక వారు పూనుకుంటారేమోనని, అంతేగానీ పెత్తనాలంటూ అవమానకరమైన మాటలు అనాల్సిన పని ఏముంది? రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో ఖాళీవిభాగాలు చేరాయి తొలగించాలని ఇప్పుడు అంటున్నారు, అలానే సభ్యుల పేజీల్లో సమాచారపెట్టెలు పెట్టారు ఇప్పుడు తొలగించాల్సివస్తోంది. అవన్నీ మనలో కొందరు పెట్టినవే కదా - ఈ పని చేయి, ఇది చేయొద్దు అనే ధోరణులే ఇక్కడ ఉంటే పరిస్థితులు ఇంతదాకా వచ్చేవా? మనవాళ్ళే మీరు చెప్పిన వాలంటీరిజాన్నే వినియోగించుకుని చేశారు కాదా? దయచేసి దురుద్దేశాన్ని ఆపాదించవద్దు, నేనన్న మాటలు సరళంగా, సూటిగా ఉన్నాయి. మీరు చెప్పినంత కుతంత్రమేమీ చేయలేదు. అయినా మీరలానే భావించేట్టయితే నేను చెప్పగలిగింది ఏమీ లేదు.
--పవన్ సంతోష్ (చర్చ) 18:18, 27 మే 2015 (UTC)
- (JVRKPRASAD జవాబు) -
- పవన్ సంతోష్ , నేను వ్రాసిన దాంట్లో అక్కసు ఏముంది ?
- అర్థం చేసుకోవడములో చాలా పొరపాటు ఉంది.
- మళ్ళీ మళ్ళీ నేను వ్రాసినది అనేక కోణాల్లో చదువుకోండి లేదా కొత్త వారితో ( మీకు అర్థమయిన అభిప్రాయము చెప్పకుండా మాత్రమే) చదివించుకోండి.
- ఎక్కడ నా పదాలు కక్కసులా మీకు అక్కసు కలిగించాయో సూచిస్తే వివరిస్తాను.
- మీరు వ్రాసినది కూడా మరీ మరీ చదవండి.
- మీ తప్పులు మీకే తెలుస్తాయి.
- వ్యక్తి గతంగా అనవసరముగా తీసుకోవడము, ఆరోపించడము మంచిది కాదు.
- ప్రశ్నావళి వ్రాసుకుందాము ఒక్కొక్క వాక్యం. (సశేషం) JVRKPRASAD (చర్చ) 03:44, 28 మే 2015 (UTC)
- మనిషితో చేస్తామంటే యంత్రముతో చెయ్యమంటారు లేదా మరో పని ఏదైనా చూసుకోమంటారు.
- యంత్రముతో చెస్తామంటే మానవ తాకిడి ఉండాలంటారు. JVRKPRASAD (చర్చ) 04:14, 28 మే 2015 (UTC)
- ప్రసాద్ గారూ మీరు రాసినదాంట్లో అక్కసు ఉందని నేనన్నానా? లేదే. మీరే మొదట అక్కసు, ఏడుపు, గోల, బాధ, నొప్పి అన్న పదాలు వాడారు.(మీరు పైనెక్కడో రాసినదాంట్లో 11వ పాయింట్ చూడండి) ఇది దురదృష్టకరం. మళ్ళీ చదవండి నా సమాధానం. సగౌరవంగా..--
పవన్ సంతోష్ (చర్చ) 06:10, 28 మే 2015 (UTC)
- (JVRKPRASAD జవాబు) -
- పవన్ సంతోష్ మీరు ముందుగా నా చివరన ఉన్న 21వ & 22 వ పాయింట్స్ చదివి, ఆ తర్వాత 1వ దానికి రండి. ఆలోచించండి, ఆవేశము వద్దు. మనందరికీ అనర్థము.
- అది ఒకరికి వ్రాసిన జవాబు కాదు ఎందరికో అని ముందుగా అర్థం చేసుకోవాలి.
- మీరన్నట్లు ఈ పాయింట్స్ అనేక సార్లు అన్నాను. మీకు కొత్త కాబోలు.
- ఎవరి బుర్ర మరియు మనసు పాడుచేసుకోకండి.
- నేను వ్రాసేవి ఏ ఒక్కరికో వ్రాయను.
- అంత తీక్షణతో తీసుకోవాల్సినవి కూడా కాదు.
- నేను ఏవీ నిర్ణయించ(లే)ను. JVRKPRASAD (చర్చ) 06:44, 28 మే 2015 (UTC)
- ప్రసాద్ గారూ నిజానికి బాటుతో చెయ్యగల పనులు చాలా తక్కువ. మనుషులే చెయ్యగల పనులు సవాలక్ష ఉన్నాయి. వందల కొద్ది గూగుల్ అనువాద వ్యాసాలున్నాయి. వాటిని శుద్ధి చెయ్యటం బాటు తరమౌనా? అలాంటి పనులమీద దృష్టి సారించి పుణ్యంకట్టుకోగలరు. --వైజాసత్య (చర్చ) 02:53, 28 మే 2015 (UTC)
వికీలో శాసనాలు లాంటివి కూడా ఉంటాయా. ఎవరు శాసనం చేస్తారు. ఎక్కువమంది సభ్యులు ఏది మంచిది అంటే అది చేయడం మామూలుగా జరిగే పద్దతి, కొత్తగా ఏమీ ప్రవేశపెట్టబడలేదు. బాటుద్వారా జరపవలసిన పనులు సభ్యులు చేసినందు వలనే ఇన్ని ఇబ్బందులు వచ్చినపుడు తిరిగి బాటు ద్వారానే జరగాలా అని ప్రశ్నించడం ఏమంత బాగాలేదు. అలాంటి మార్పులు ఖచ్చితంగా బాటు ద్వారానే జరగాలి. వికీ సభ్యులకు చేయడానికి అనేక పనులు ఉన్నాయి. కొన్ని చేయవలసిన పనులు కూడా మురిగిపోతున్నాయి. ప్రత్యేకపేజీలకు వెళితే ఎన్ని పనులు చేయవలసినవి ఉన్నాయో తెలుస్తుంది. వాటిని పూర్తిచేయగలిగితే ఆనందమే. ఇంకా ఇక్కడ బాటు మార్పులు అనే దానిపై మరింత చర్చ అనవసరం. వీటిపై చర్చలను ఏవైనా మార్పులకు వినియోగిస్తే మరీ మంచిది....--విశ్వనాధ్ (చర్చ) 07:02, 28 మే 2015 (UTC)
- ::::::::ప్రతి వాడుకరికి ఏదో విషయము మీద తనకి ఇక్కడ అసంతృప్తి ఎప్పుడో ఒకప్పుడు కలగవచ్చును. దానిని ఏదో రూపంలో అయినా బయట పెట్టకపోతే తను మనసు కుదుట పడదు.
- ఇక్కడ అటువంటి వారి ఆవేశం, బాధ పోగొట్టుటకు మనకు చాటింగ్‌లు లేవు.
- చర్చ రూపమే మార్గము కొందరికి లేదా చాలా మందికి.
- ఇప్పుడు కొంతవరకు ఏ రూపములో ఉన్న అసంతృప్తి ఈ రకంగా పోయిందనుకుంటున్నాను.
- ఎవరో ఒకరు కుటుంబంలో పెద్దరికంతో అక్షింతలు వేయించుకోక తప్పదు. అప్పుడు మిగతా వారు ఆనందంగా ఎవరి పనులు వారు చేసుకుంటారు.
- స్థబ్తత కొంత తొలగింది. కొంత మార్పు వచ్చింది.
- కొన్ని పద్దతులు అందరికీ ఎలాగూ నచ్చవు. (నా పద్దతులే అనుకోండి పోనీ !)
- ఈ మధ్యన వాడుకరులు నందు పనిలో ఉత్సాహం ప్రకృతి కారణాల వల్ల కావచ్చు, కొంత తగ్గింది. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి అనుకోండి.
- ఈ మధ్యన నేను కొద్దిసేపు కూర్చుండము కూడా , కొన్ని ఆరోగ్య విషయాలలో కూడా కష్టముగా ఉంటోంది. కాస్తకోలుకుంటే మరికొంత పని అప్పుడు చేస్తాను. ప్రస్తుతము మాత్రము కాస్త కష్టం.
- మీరు అందరూ చెప్పినవి నాకు తెలిసినవి, పాతవే అయినా, మీ ప్రతి స్పందనలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున (కుడి చెయ్యి ఇబ్బంది పెడుతోంది) ధన్యవాదములు. ఇలాగే మీ సహాయసహకారములు అందరూ వికీకి అందిస్తారని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 08:45, 28 మే 2015 (UTC)
- చిన్న/సునాయాస దిద్దుబాట్లపై చర్చలు చేసీ చేసీ అలసిపోయి ఇలాంటి చర్చలలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని భావించి దూరంగా ఉండిపోయాను. కాని ఈ చర్చ చూసి చర్చలలో వ్యక్తమైన రెండు పాయింట్లపై వివరణ ఇవ్వదలుచుకున్నాను.
1) నాకోసమే బాటు అంటే ఎందుకో అయిష్టంగానే ఉంది.→ ఇలాంటి భావాలు సభ్యుల నుంచి రావడానికి కారణం ఆలోచించాలి. గులపలి లాంటి వారు చిన్న/సునాయాస దిద్దుబాట్లు చేస్తున్ననూ ఏమీ నిరోధించలేకపోతున్నాం. ముందుగా అలాంటి వారికి ఉపదేశం ఇస్తే బాగుంటుంది. ఈ విషయంపై చర్చలు జరిగిననూ సునాయాస దిద్దుబాట్లను ఆపలేకపోయాము.
2) మనిషితో చేస్తామంటే యంత్రముతో చెయ్యమంటారు, యంత్రముతో చెస్తామంటే మానవ తాకిడి ఉండాలంటారు.→ ఇటీవల యాంత్రిక స్వాగతానికి మెజారిటీ సభ్యులు మద్దతు ఇచ్చిననూ ఫలితం లేకుండా పోయింది. ప్రజాస్వామ్య విధానాలపై ఆధారపడే వికీపీడియాకు మెజారిటీ నిర్ణయాలే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో ఏ ప్రతిపాదనకైనా 100% మద్దతు ఉండాలనుకోవడం భావ్యం కాదు కదా! ఇలాంటి నిర్ణయాలు భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందిపెట్టే అవకాశాలుంటాయి. కాబట్టి ఆ ప్రతిపాదనను అమలులో పెట్టాలి. సభ్యుల అనధికార "వీటో" అధికారాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇక ముందు ఏ నిర్ణయమూ తీసుకోలేని పరిస్థితి రావచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:38, 28 మే 2015 (UTC)- నేను ఈ చర్చంతా చదవలేదు. చాలా గజబిజిగా చదవటానికి కష్టంగా ఉంది. ఓపికున్నప్పుడు చదువుతాను. కేవలం చంద్రకాంతరావు గారి వ్యాఖ్యకు మాత్రమే సమాధానిమిస్తున్నాను. ఏకాభిప్రాయం అనగా ఏకగ్రీవం కాదు (వికీపీడియా:ఏకాభిప్రాయం పేజీ నుండి). వంద శాతం మద్దతు ఉండాలనుకోవట్లేదు. కానీ యాంత్రిక స్వాగతపు చర్చలో కొందరు సభ్యులు బలంగా వ్యతిరేకించినప్పుడు, మద్దతు పలుకుతున్న సభ్యులు బలంగా స్పందించలేదు. అంగీకారం, అంగీకారం అని చాలామంది సభ్యులు సంతకం చేశారు, కానీ అదే చేత్తో ఆయా సభ్యులు వాదించినప్పుడు, మద్దతు పలికినవారు ప్రతివాదనలు వినిపించి ఉంటే, ఈ పాటికి అది అమలులోకి వచ్చేది. నేనే ప్రతిపాదించి, నేనే దాని తరఫున వాదించి, నేనే ఆ చర్చలో ఏకాభిప్రాయం కుదిరిందని నిర్ణయించుకోవటం ఏమాత్రం సమంజసం కాదు. అలాచేయటం నిష్పాక్షితకే సిగ్గుచేటు. ఇవన్నీ చెప్పకుండా అర్ధంచేసుకుంటారనుకోవటం నా పొరపాటు. అదండి సంగతి. ఇప్పటికీ మునిగిపోయిందేమీ లేదు, దాన్ని తిరగదోడి, అమలులోకి తీసుకురావచ్చు. ఇక నియమాలు ఎంత చెప్పినా పట్టించుకోని సభ్యులంటారా? వాళ్ళ పేజీలో సూటిగా ఏం చెయ్యకూడదు, ఎందుకు చెయ్యకూడదు అన్న విషయం వివరిస్తూ, కొన్ని హెచ్చరికలు వ్రాయాలి. ఇలా రెండు, మూడు హెచ్చరికల తర్వాత వాళ్ళపై నిరోధం విధించవచ్చు. కానీ నేరుగా, సూటిగా వారిని ఉద్దేశించే, వారి చర్చా పేజీలో కొన్ని సార్లు వారించామని చూపించగలగాలి. ఫలాన చోట, ఫలానా చర్చలో వ్యంగాస్త్రాలు వేశాము లాంటివి సరిపోవు. --వైజాసత్య (చర్చ) 05:36, 30 మే 2015 (UTC)
- ఈ చర్చలో పాల్గొనరాదని అనుకున్ననూ చివరికి ఎంపిక చేస్కున్న 2 పాయింట్లపై మాత్రమే నా అభిప్రాయం చెప్పాను. అంతేకాని నాకు ఎవరినీ నిరోధించాలనే ఉదేశ్యం కాని, వ్యంగాస్త్రాల ఆధారంగా ఎవరైనా నిరోధించండి అని చెప్పడం కాని నా ఉద్దేశ్యం కాదు. నియమాలు నాకు తెలియక కాదు కాని ఇదివరకు సదరు సభ్యులకు సూటిగా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి కూడా సరాసరిగా ఏమీ చెప్పే అవసరం నాకు లేదు. "ఎవరికీ ఇబ్బంది లేనప్పుడు నాకూ ఇబ్బందిగా లేనట్టుగానే భావిస్తా"నని చెప్పినప్పటి నుంచి ప్రత్యక్షంగా నేనేమీ చెప్పడం లేదు. కాని చెప్పేవారికి ఒకే తప్పు చేసే వారందరినీ ఒకేలా చూడమని చెప్పడమే నా ఉద్దేశ్యం. చిన్న దిద్దుబాట్లు చేసేవారు కూడా తెవికీ కోసం చాలా కష్టపడుతున్నట్టు ఇప్పుడిప్పుడే నేను తెలుసుకుంటున్నాను. వారికి నేనెలా సహాయపడగలనో నిర్ణయించి సహాయసహకారాలు అందించే విషయం కూడా ఆలోచిస్తాను. ఇక మొదటి విషయానికి వస్తే చర్చలలో పాల్గొనడం వల్ల ఫలితం లేనట్టు మునుముందు ఓటింగులలో కూడా ఇదే ప్రభావం కనిపించే అవకాశం ఉండవచ్చు. సాంకేతిక విషయాలలో ప్రతి ఒక్కరికి అంతగా అవగాహన లేనందువల్ల ప్రతి ఓటింగ్ నిర్ణయాన్ని అందరూ అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉండకపోవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 14:29, 31 మే 2015 (UTC)
- చిన్న/సునాయాస దిద్దుబాట్లపై చర్చలు చేసీ చేసీ అలసిపోయి ఇలాంటి చర్చలలో పాల్గొనడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని భావించి దూరంగా ఉండిపోయాను. కాని ఈ చర్చ చూసి చర్చలలో వ్యక్తమైన రెండు పాయింట్లపై వివరణ ఇవ్వదలుచుకున్నాను.
- @ వైజాసత్య, వికీలో నిర్ణయాలు చేయటానికి చాలా సమస్యలు ఎదురైన తరువాత సభ్యుల సహకారంతో వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి రూపొందించాము. దీనిని వాడినట్లైతే 'యాంత్రిక స్వాగతం వోటుకి ' అందరికి ఆమోదయోగ్యమైన ముగింపు దొరికేది. ఇకముందైనా ఆ విధానం అమలు చేయడం మంచిది. --అర్జున (చర్చ) 04:36, 2 జూన్ 2015 (UTC)
నిర్ణయాలు - చర్చలు
మార్చురచ్చబండలో చర్చలు పెద్దగా సహలీకృతం కావటము లేదని, నెలవారీ సమావేశాలలో, ఆఫ్‌లైన్ చర్చలు, స్కైప్, ముఖాముఖీ, ఫోనుసంభాషణల ద్వారా, ఇత్యాది మార్గములుతో ఎక్కువ ఫలితాలు సాధించవచ్చుననే అభిప్రాయములు వచ్చినవి. కావున అటువంటివి జరిగినప్పుడు, ఒక ప్రత్యేక వ్యాసపేజీ కేటాయించి, వివిధ నిర్ణయ విషయములు పొందుపరచి ముందు పేజీలో ఉంచిదే మంచిది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 01:23, 27 మే 2015 (UTC)
- ఆన్లైన్ చర్చల్లో వ్యక్తులు పాల్గొనడం ఉత్తమం. అలాంటి సంస్కృతి అభివృద్ధి చెందాలి. అలానే రచ్చబండలోని ప్రతి చర్చ సారవంతమై, ఫలప్రదమైనదే కావాలి. దానితోపాటుగా చేసిన చర్చకు ఫలితంగా చర్యలు కూడా చేపట్టాలి. ఇవన్నీ చేస్తే ఆన్లైన్ చర్చలతో సమస్య ఏమీ లేదు. అలానే ఆఫ్ లైన్ చర్చలు నమోదుచేసేందుకు గతంలో నేనూ, వైజాసత్య గారూ చేసిన ప్రయత్నం ఇది. ఇక రచ్చబండ సమర్థతను గురించి ఓ చిరు విశ్లేషణ. పాతచర్చల్లోకి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న రచ్చబండను పరిగణిస్తే- గ్రామవ్యాసాల్లో ఖాళీవిభాగాలు అంటూ విశ్వనాధ్ గారు రాసిన శీర్షికకు ఫలితంగా వైజాసత్య గారు బాటు నడిపి తొలగిస్తున్నారు, శాశ్వతంగా ఉండని తెలుగు మాధ్యమాలను వెబ్ పేజీలుగా ఎలావాడాలో అర్జున గారు చెప్పగా దాన్ని నావరకూ నేను వాడుకుంటున్నాను-ఈనాడు పేపర్ నుంచి మూలాలు ఇచ్చినప్పుడల్లా, తెవికీ అభివృద్ధికి సూచనలు అంటూ చంద్రకాంతరావు గారు రాసిన వ్యంగ్య విలసిత సూచనల సంపుటి కొందరు సభ్యులకైనా చురుక్కుమనిపించి ఆలోచింపజేసింది, ప్రాధాన్యత కలిగిన పుస్తకాల జాబితా గురించి నేను రాసిన విషయం వికీసోర్సుకు సంబంధించిన కావాల్సిన పుస్తకాల జాబితా అయినా దాన్ని కొందరు సభ్యులు సవరించారంటే వికీపీడియా రచ్చబండలో రాయడమే కారణమేమో, నిషేధం ఎందుకు విధించకూడదంటూ మీరు లేవనెత్తిన ప్రశ్న వల్ల కంటోన్మెంట్ అన్న నామవాచకాన్ని ఓ సభ్యుడు దండు అని మారుస్తున్నట్టు తెలిసింది తత్సంబంధిత పేజీల్లో మేమంతా వచ్చి రాయడానికి ఆయనకు వికీశైలి తెలియజెప్పడానికి మీరు రచ్చబండలో రాయడమే కారణం - ఇదే విషయంపై మరో శీర్షికా తర్వాతికాలంలో రాశారు ఏదేమైనా తెవికీ పాలసీ స్థాయిలో వివరణ ఆ సభ్యునికి ఇచ్చారు వైజాసత్య గారు, ఎక్కడో వేరే వికీపీడియా నుంచి వచ్చి సెబ్రెనిత్స, జెప పతనం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఆ విషయంపై వ్యాసాన్ని రాయమని ఓ వికీపీడియన్ అడిగితే వైజాసత్య గారు అది తెవికీ పరిధిలో లేదని జవాబిచ్చారు, ఇక రచ్చబండను సమర్థమైన చర్చల కొరకే వాడమని అర్జున గారు చేసిన సూచనలకు ఫలితం వచ్చిందో లేదో ఆయనే చెప్పాలి, పైన పేర్కొన్న హైదరాబాద్ సమావేశం నివేదికను వీలైనంతవరకూ రాసి రచ్చబండలో లింక్ చేస్తే ప్రణయ్ గారు కాబోలు నాతోపాటు చేయివేసి పూర్తిచేశారు, చంద్రబాబు నాయుడుని వికీశైలికి విరుద్ధంగా వ్యాసంలో విమర్శించడాన్ని ఎవరో చూపితే ప్రణయ్ వచ్చి రచ్చబండలో రాశారు ఆ వ్యాసం చర్చపేజీలో చర్చించి తదనుగుణమైన మార్పులు చేశాము, తెవికీకి సిగ్గుచేటు అంటూ మీరు ఆంగ్లాన్ని యధాతథంగా పేజీల్లో అనువదించకండా పెట్టడం గురించి రాస్తే అటువంటివి తొలగించాలని నిర్ణయమైంది, మూస కోసం వ్యాసాలు కొంతవరకూ వివాదాస్పదమైనా అది అటు ఎన్నో వ్యాసాల అభివృద్ధి వికీకరణలోనూ ఇటు నిర్వహణ వ్యవహారాల్లోనూ చక్కని మార్పులకు నాంది అయింది, ఆంగ్లం ఉన్న వ్యాసాల తొలగింపు గురించీ చర్చ జరిగి ఆ ఆంగ్ల భాగం కొంతభాగమే ఉంటే దాన్ని దాచాలని - లేక మొత్తంగా ఆంగ్లమే ఉన్న వ్యాసమైతే తొలగించాలని నిర్ణయించారు మూసలు కూడా పెట్టడానికి నిర్ణయించారు, పాత పెద్ద వాళ్ళను భయపెట్టకండి-మారుపేరు వ్యాసము అవసరము వంటి శీర్షికలు ఎందుకు రాశారో దాని ఫలితమేమైందో నాకు సరిగా అర్థంకాలేదు, నేను ప్రారంభించిన విశేష వ్యాసాల పునస్సమీక్షకు చాలా మంచి స్పందన వచ్చింది-విశేష వ్యాసం స్థాయి లేని వ్యాసాలకు ఆ హోదా తొలగించాలని కొన్ని కనీసం మంచి వ్యాసాల స్థాయిలోనైనా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు - అలానే నేను తద్వారా విశేష వ్యాసం, మంచి వ్యాసాలకు సంబంధించిన నిబంధనల వ్యాసాలు ఆంగ్లం నుంచి అనువదించాను - పై ప్రతిపాదనలు సముదాయం నిర్దేశించుకున్న 2015 ప్రణాళికలో కూడా చోటుచేసుకోవడం విశేషం, తెవికీ సభ్యుని అకాల మరణానికి చింతిస్తూ సంతాపంతో కూడిన ఓ శీర్షిక ఉంది, వర్గము - వ్యాసము అంటూ మీరు రాసిన విషయంపై వైజాసత్య గారు సరియైన సమాధానం ఇవ్వడం - దాన్ని మీరు పాటిస్తాననడం కూడా జరిగింది, వికీ-ఈర్ష్య కేవలం హాస్యానికేనని పాలసీ చర్చలు వద్దని మీరే అన్నారు, గూగుల్ యాంత్రికానువాదం గురించి అర్జున గారు, నా నిర్వాహక హోదా గురించి వెంకటరమణ గారూ, పుస్తకం.నెట్లో నా ప్రాజెక్టు వివరాల వ్యాసం గురించి నేను, 2015 లక్ష్యాల పేజీ గురించి వైజాసత్య గారూ, యాపిల్ కీబోర్డు తెవికీలో చేరిక గురించి రహ్మాన్ గారూ రాసినవీ ప్రకటనలు ఆయా వివరాలు పదిమందీ చూడడమే వాటికి సార్థకత, టాపిక్ పేరుబరి గురించి రహ్మానుద్దీన్ గారు ఏర్పరిచిన శీర్షికకు మంచి సూచనలు వచ్చాయి, సభ్యుల పేజీల్లో సమాచారపెట్టెల గురించి వైజాసత్యగారు రాసిన శీర్షిక చాలా ఫలప్రదమైంది - దాని విషయమై చర్చ నిర్ణయం కూడా నడుస్తున్నాయి, వికీతీరువారు గురించి మీరు ఏం వ్రాశారో, దానికి ఏం ఫలితం వచ్చిందో నాకు సరిగా అవగాహన కాలేదు, సర్పంచ్ ఎంపిటిసి వ్యాసాల గురించి మంచి చర్చ జరిగింది వాటినెలా పరిగణించాలో నిర్వాహకులకు స్పష్టత ఏర్పడింది, మన భాషకు సంబంధం లేనివారికీ స్వాగతం చెప్పడం గురించి మీరు లేవనెత్తిన అంశం బావుంది - ఫలితం ఇటీవల నేను కొంత వికీకి ఆవల ఉండడంతో తెలియలేదు, మొదటిపేజీ నిర్వహణ కోసం సహాయం వెంకటరమణ గారు అడగగా విశ్వనాథ్ గారు వీలైనంతవరకూ చేశారు, తెవికీ గ్రంథాలయం గురించి నేను చేసిన ప్రకటన-సూచన ఫలితాలివ్వాలంటే ఇంకొంత సమయం కావాలి, వికీసోర్సులో ఉండాల్సిన వ్యాసాల గురించి కూడా ప్రస్తుతం నిర్వాహకుల వైపు నుంచీ, వ్యాసకర్తల వైపునుంచీ పని నడుస్తోంది, బాటు ద్వారానే ఎందుకు మార్పులు చేయాలన్న మీ ప్రశ్నకు నేను ఇవేళే సమాధానం ఇచ్చాను, ఇక ఈ శీర్షికకూ ఇంత పొడుగు భారతం రాశాను. ఐతే ఈ చర్చల్లో కొందరు సభ్యులు పాల్గొనడం లేదన్నదీ నిజమే. రచ్చబండ చర్చలంటే ఏవో గొడవ పడుతూంటారన్న అపోహే అందుకు కారణమని నా నమ్మిక. దాన్ని తొలగించడానికి మనమంతా సుహృద్భావ వాతారవరణంలో చర్చించడం, వ్యక్తి నిందలు, రెచ్చగొట్టే శీర్షికలు పెట్టకపోవడం సరైన పరిష్కారం. ఇదండీ సంగతి, రచ్చబండ చర్చలు ఫలప్రదమే కదా! --పవన్ సంతోష్ (చర్చ) 03:42, 27 మే 2015 (UTC)
- @పవన్ సంతోష్ తో నేనంగీకరిస్తున్నాను. ఒక్కసారే పెనుమార్పులు కోరుకోవటం మంచిది కాదు. ఏకాభిప్రాయ సాధన అనేది ఊరకేలేదు. నేనిటీవల చేసిన కొన్ని ప్రతిపాదనలకు కొంతమంది కీలక సభ్యులు సమ్మతించలేదు. నేను మెజారిటీ నావైపు ఉందని వాటితో ముందుకు వెళ్ళి ఉండవచ్చు. కానీ అది మంచి సాంప్రదాయం కాదు. సవ్యదిశలలో పెనుమార్పులు జరిగే అవకాశాన్నిస్తే, అపసవ్య దిశలో కూడా పెనుమార్పులు జరిగేందుకు అవకాశం కల్పిస్తామని మరచిపోకూడదు. మన ప్రతిపాదనలకు ఏకాభిప్రాయం కుదరనప్పుడు మనకు నచ్చకపోవచ్చు. కానీ వికీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఏకాభిప్రాయమనేది చాలా ముఖ్యం. ఏ అభిప్రాయం అక్కర్లేకుండా కొందరు ముందుకెళతారనుకోండి, అలాంటి మార్పులు దీర్ఘకాలికంగా మనలేవు. --వైజాసత్య (చర్చ) 02:33, 28 మే 2015 (UTC)
- నేను వ్రాశినది సరిగా ఎవరికీ అర్థం అయినట్లు లేదు. ఏవైనా పాలసీ నిర్ణయాలు జరిగితే మొదటి పేజీలోని రచ్చబండ క్రింద ఒక విభాగం కొత్త నిర్ణయాలు అని పెట్టి దాంట్లో సారాంశం పొందు పరచితే అందరికీ అందుబాటులో ఉండి కొత్తవి అన్నీ తెలుస్తాయి కదా అని నా అభిప్రాయము చెప్పాను. JVRKPRASAD (చర్చ) 03:50, 28 మే 2015 (UTC)
నోటీసు బోర్డు
మార్చునోటీసు బోర్డు మెదటి పేజీలో ఒక విభాగం ఏర్పాటు చేస్తే బావుంటుందని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 01:25, 27 మే 2015 (UTC)
చెప్పుకోండి చూద్దాం
మార్చుఎప్పుడూ తెవికీలో దిద్దుబాట్లు చేస్తూ ఎంతో శ్రమపడుతున్న సభ్యులకు కొంత ఆటవిడుపుగా "చెప్పుకోండి చూద్దాం" ప్రశ్నలు వేస్తున్నాను. ఇది తెవికీ సభ్యులకే ప్రత్యేకం. ఎందుకంటే బయటివారు తలపండిన మేధావులైననూ ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వరు, ఇవ్వలేరు, ఇవ్వజాలరు కూడా. తెవికీ వ్యాసాలను ఎవరు ఏ విధంగా పరిశీలిస్తున్నారో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు ఉపయోగపడగలవని భావిస్తున్నాను.
1) భారతదేశ వైశాల్యం 32.27 లక్షల చకిమీ అని మనందరికీ తెలిసిందే. అయితే ఈ విస్తీర్ణంలో మూడో వంతు పైగా (40%+) ఉన్న జిల్లా ఏది?
2) భూమండలం యొక్క గరిష్ట ఉత్తర అక్షాంశం 90° అని మనందరికి తెలుసు. అయితే ఆ ఉత్తర ధృవంకంటే ఎంతో పైబడి ఉన్న భారతదేశ జిల్లా ఏది?
3) ఉత్తర భారతదేశంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మైనస్‌లోకి రావడం మనందరికి తెలిసిందే. మైనస్ కాకున్నా చాలా ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10° లోపే ఉంటాయి. అయితే కనిష్ట ఉష్ణోగ్రత 34° పైగా కలిగిన ఉత్తర భారతదేశ జిల్లా ఒకటుంది. అదేజిల్లా?
4) ఉత్తరకొరియా తప్ప ఆసియాలో పూర్తి అక్ష్యరాస్యత కలిగిన దేశం మరొకటి లేదని మనకు తెలుసు. అయినా దక్షిణాసియాలో పూర్తి అక్ష్యరాస్యత కలిగిన దేశం ఒకటుంది! అదేమిటో చెప్పగలరా?
5) మహారాష్ట్ర అనగానే బాగా నగరీకరణ చెందిన రాష్ట్రమనీ, పలు నగరాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాలున్నాయనీ గుర్తుకు వస్తాయి. అయితే మనకు తెలిసిన విషయాలు ప్రక్కకు పెట్టి మహారాష్ట్రలో ఉన్న ఒకేఒక యూనివర్శిటి ఏదో చెప్పండి చూద్దాం?
పై వాటికి తెలిస్తే జవాబివ్వండి లేదా 2, 3 రోజుల అనంతరం నేనే చెప్తాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:28, 28 మే 2015 (UTC)
- మెల్లిగా ఒక్కొటొక్కటిగా చెప్తాను. ప్రస్తుతానికి ఉత్తరాన 90 డిగ్రీల అక్షాంశానికన్నా దూరంలో ఉన్న భారతదేశ జిల్లా గురుదాస్‌పూర్ జిల్లా (సరదా విషయాలు పక్కనపెడితే ఈ జిల్లా గురించి మొదట గాంధీ అనంతర భారతదేశంలో చదివాను. ఉపఖండాన్ని విభజించి పాక్ ఏర్పాటుచేసినప్పుడు అహమ్మదీయ ముస్లిముల పవిత్రక్షేత్రం ఉన్న ఈ జిల్లాతో సరిగ్గా భారత్ ప్రారంభం కావడం, పాకిస్తానుకి దక్కకపోవడం అప్పట్లో వారిని తీవ్రంగా కలవరపరిచింది-ఎన్నో వివాదాలకు కేంద్రబిందువైంది), ఇది ఏకంగా 310-36' అక్షాంశంలో నెలకొనివుంది. :) అలాగే పాపం నానా తంటాలు పడి శ్రీలంక 99శాతం ప్రాథమిక పాఠశాల నమోదు రేటును దాదాపు 98 శాతం వరకూ అక్షరాస్యతనీ సాధించి ఒకపక్క అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అత్యంత అక్షరాస్యత సాధించిన దేశంగా నిలిస్తే హఠాత్తుగా ఇవేమీ అవసరం లేకుండానే దాదాపుగా 56.5%తోనే బంగ్లాదేశ్ పూర్తి అక్షరాస్యతను సాధించేసింది. :) ఈశాన్య రాష్ట్రాల్లోని సేనాపతి జిల్లా 34 డిగ్రీల సెల్షియస్ కనిష్ట ఉష్ణోగ్రత కలిగివుంది. కాకుంటే గరిష్ట ఉష్ణోగ్రత మాత్రం 38 డిగ్రీల సెల్షియస్, అంటే సంవత్సరం పొడవునా ఆ ప్రాంతంలో 4 డిగ్రీలకు మించి మార్పుండదన్నమాట. --పవన్ సంతోష్ (చర్చ) 03:47, 29 మే 2015 (UTC)
- బాగుంది. నలభై శాతం జిల్లా ఉండటమేంటి?? అతి పెద్ద జిల్లా లడఖ్ అనుకుంటాను. మహారాష్ట్రలో ఒకే ఒక విశ్వవిద్యాలయముందా?? నాకు తెలిసినది మరాట్వాడా విశ్వవిద్యాలయం. అయినా కూడా నమ్మబుద్ధి కావడం లేదు --వైజాసత్య (చర్చ) 05:07, 30 మే 2015 (UTC)
- ఓహో ఈ చర్చలో మొదటి వాక్యం చదవలేదు, ఇప్పుడు అర్ధమైంది తిరకాసేంటో...హ్హహ్హహ --వైజాసత్య (చర్చ) 05:11, 30 మే 2015 (UTC)
- స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. మెజారిటీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన పవన్ సంతోష్ గారికి అభినందనలు. తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచే దిశగా ఇది మరో కొత్త ప్రయోగం. ఇక సమాధానాలు చూద్దామా!
1) భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంతో ఉన్న జిల్లా దేవస్. ఇది ఏకంగా 1,306,617 చ.కి.మీ. వైశాల్యంతో దేశ విస్తీర్ణంలో 40.47% కలిగియుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 51 జిల్లాలలో ఒకటైన ఈ జిల్లా ఆ రాష్ట్ర వైశాల్యం కంటె 4.2 రెట్లు అధిక విస్తీర్ణతను కలిగి తన ప్రత్యేకతను చాటుకుంటోంది! ఈ జిల్లా కాకుండా ఇంకా అనేక జిల్లాలుకూడా ఆయా రాష్ట్ర వైశాల్యాలను మించి ఉండటం గమనార్హం!
2) రెండో ప్రశ్నకు మొదట నేను గ్రహించిన సమాచారం ప్రకారం కోలారు జిల్లా 130°ఉత్తర అక్షాంశం వరకు ఉంది. పవన్ గారు చెప్పిన 310-36 సమాధానం ఇంతకంటె పైగా ఉంది. (310-36' మరియు 320-34' అక్షాంశంలో అలాగే తూర్పుగా 740-56' మరియు 750-24' డిగ్రీల రేఖాంశంలో ఉంది) ఇక్కడ డిగ్రీ (°) గుర్తుకు బదులు సున్నాగా వాడబడింది. అక్షాంశరేఖాంశాలలో పొరపాట్లు చాలా వ్యాసాలలో ఉన్నాయి. కొన్ని వ్యాసాలలో అక్షాంశ-రేఖాంశాల విలువ వేలలో ఉంది!
3) మూడవ ప్రశ్నకు పవన్ గారిచ్చిన సమాధానం సరిగ్గా సరిపోయింది. అలాగే కనిష్ట మరియు గరిష్ట ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్న జిల్లా కూడా ఉంది! ఎవరైనా చెప్పగలరా? (మరిన్ని విశేషాలకై ఇక్కడ చూడండి)
4) 4వ ప్రశ్నకు సమాధానం కూడా పవన్ గారు తెలిపినది కరెక్టుగా ఉంది. వ్యాస అనువాదంలో పొరపాటు వల్ల ఇలాంటి తప్పులు చాలా వస్తున్నాయి. ఆంగ్లంలో Bangladesh conforms fully to the Education For All అనేదాన్ని "బంగ్లాదేశ్ పూర్తి ఆక్షరాస్యత కలిగిన దేశంగా నిర్ణయించబడింది"గా అనువాదం జరిగింది. విశేషమేమిటంటే అదే ప్రధాన విభాగంలో బంగ్లాదేశ్ అక్షరాస్యత చాలా తక్కువ అనే వాక్యం కూడా ఉంది. బంగ్లాదేశ్ వ్యాసంలో విద్య విభాగం చూడండి.
5) ఇక చివరి ప్రశ్న సమాధానానికి వస్తే ఏదో విశ్వవిద్యాలయం వ్యాసంలో ఉన్నట్టుగా అనుకుంటారు కాని ఇది రాయిగఢ్ జిల్లా వ్యాసంలోని యూనివర్శిటీ విభాగంలో ఉంది.
ఇవి కేవలం అక్కడక్కడా గమనించిన పొరపాట్లు మాత్రమే. అనువాదం సమయంలో చాల జాగ్రత్తగా వహించాలన్న విషయాన్ని సభ్యుల దృష్టికి తీసుకురావడానికి చేసిన ప్రయోగం మాత్రమేనని భావిస్తారని, ఇక నుంచైనా రచనా సమయంలో శ్రద్ధ వహించాలనే విషయాన్ని సభ్యులు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:28, 2 జూన్ 2015 (UTC)
- స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు. మెజారిటీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన పవన్ సంతోష్ గారికి అభినందనలు. తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచే దిశగా ఇది మరో కొత్త ప్రయోగం. ఇక సమాధానాలు చూద్దామా!
- ఓహో ఈ చర్చలో మొదటి వాక్యం చదవలేదు, ఇప్పుడు అర్ధమైంది తిరకాసేంటో...హ్హహ్హహ --వైజాసత్య (చర్చ) 05:11, 30 మే 2015 (UTC)
- బాగుంది. నలభై శాతం జిల్లా ఉండటమేంటి?? అతి పెద్ద జిల్లా లడఖ్ అనుకుంటాను. మహారాష్ట్రలో ఒకే ఒక విశ్వవిద్యాలయముందా?? నాకు తెలిసినది మరాట్వాడా విశ్వవిద్యాలయం. అయినా కూడా నమ్మబుద్ధి కావడం లేదు --వైజాసత్య (చర్చ) 05:07, 30 మే 2015 (UTC)
సముదాయేతర సంస్థలకు అనుమతి లేదు
మార్చుసముదాయేతర సంస్థలు మీ కృషిని, తమ కృషి ఫలితంగా చూపించుకోకుండా ఉండటానికి {{అనుమతి లేదు}} మూసను మీ వాడుకరి పేజీలో అంంటించుకోగలరు --వైజాసత్య (చర్చ) 06:13, 30 మే 2015 (UTC)
- అలాగే, గూగుల్ యాంత్రిక అనువాదాలతోనూ, సి.ఐ.ఎస్ తోనూ ఎదురైన అనుభవాల దృష్ట్యా, తెలుగు వికీలో సముదాయేతర సంస్థలను అనుమతించే విధివిధానాలపై పాలసీలను తయారు చేసుకోవాలి. అందుకు వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో కొన్ని సూచనలు వ్రాసుకొని చర్చిద్దాము --వైజాసత్య (చర్చ) 06:18, 30 మే 2015 (UTC)
- వైజాసత్య గారికి, నిబద్ధత గల సంస్థల నిర్వాహకులు గుర్తింపునివ్వకుండా వారు తోడ్పడని కృషిని వారి నివేదికలలో వేసుకోరు. కావున ఈ హెచ్చరిక మూసకు అంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదేమో. ఇక సముదాయేతర సంస్థల పని నియంత్రణకు మంచి పేజీ ప్రారంభించారు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 13:20, 30 మే 2015 (UTC)
- అర్జున గారూ, ఇటీవలి సముదాయంలో, సముదాయేతర సంస్థలు తమ కృషిని వాడుకొంటున్నాయని కొందరు సభ్యులు కృషిని తగ్గించారని విన్నాము. అలాంటి సభ్యులకు భరోసా కలిగించడానికే ఈ మూస. ఇక వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో నేను చేసిన ప్రతిపాదనలను మీరు కూడా సమీక్షించి, చర్చించి దాన్ని సముదాయపు పాలసీగా తీర్చిదిద్దటంలో సహయపడాలని కోరుకుంటున్నాను. --వైజాసత్య (చర్చ) 01:15, 2 జూన్ 2015 (UTC)
- వ్యాసానికి ప్రారంభకులుగా తమ పేరు గురించే తపన పడుతున్న వాడుకరులు ప్రస్తుతం బాగానే ఉందనే విషయము అందరికీ తెలుసు. మరి ఎవరో మొదలు పెట్టినవాటిని తిరిగి శుద్ధి చేయడము ప్రస్తుతము మాత్రము జరగక పోవచ్చును. నేను కొత్తలో ప్రయత్నము చేసి, విరమించుకున్నాను. అనువాదము చేయడము కన్నా కొత్త వ్యాసము వ్రాయడము కొంత తేలిక. భవిష్యత్తులో కూడా ఎవరూ ముందుకు రారు. అసలు గూగుల్ అనువాద వ్యాసములలో ఎక్కువ భాగము శాస్త్ర, సాంకేతిక వ్యాసములు మాత్రమే. ఎంతమందికి ఆయా శాస్త్రముల మీద పట్టు ఉంటుంది. మామూలు వాటి మీదనే అనువాదము అవగాహన తక్కువ. అసలు ఈ గూగుల్ అనువాద వ్యాసములలో చాలా వాటిని తొలగించుట మంచిది. కొద్ది పాటి వ్యాసములతో నయినా వికీకి నాణ్యత నిలబడుతుంది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 11:31, 2 జూన్ 2015 (UTC)
- @ప్రసాద్ గారూ, అలాగే తప్పకుండా ఈ వ్యాసాలను తొలగించే విషయమై కాస్త పరిస్థితులు కుదుటపడిన తర్వాత చర్చించి, నిర్ణయం తీసుకుందాం --వైజాసత్య (చర్చ) 05:23, 3 జూన్ 2015 (UTC)
- వ్యాసానికి ప్రారంభకులుగా తమ పేరు గురించే తపన పడుతున్న వాడుకరులు ప్రస్తుతం బాగానే ఉందనే విషయము అందరికీ తెలుసు. మరి ఎవరో మొదలు పెట్టినవాటిని తిరిగి శుద్ధి చేయడము ప్రస్తుతము మాత్రము జరగక పోవచ్చును. నేను కొత్తలో ప్రయత్నము చేసి, విరమించుకున్నాను. అనువాదము చేయడము కన్నా కొత్త వ్యాసము వ్రాయడము కొంత తేలిక. భవిష్యత్తులో కూడా ఎవరూ ముందుకు రారు. అసలు గూగుల్ అనువాద వ్యాసములలో ఎక్కువ భాగము శాస్త్ర, సాంకేతిక వ్యాసములు మాత్రమే. ఎంతమందికి ఆయా శాస్త్రముల మీద పట్టు ఉంటుంది. మామూలు వాటి మీదనే అనువాదము అవగాహన తక్కువ. అసలు ఈ గూగుల్ అనువాద వ్యాసములలో చాలా వాటిని తొలగించుట మంచిది. కొద్ది పాటి వ్యాసములతో నయినా వికీకి నాణ్యత నిలబడుతుంది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 11:31, 2 జూన్ 2015 (UTC)
- అర్జున గారూ, ఇటీవలి సముదాయంలో, సముదాయేతర సంస్థలు తమ కృషిని వాడుకొంటున్నాయని కొందరు సభ్యులు కృషిని తగ్గించారని విన్నాము. అలాంటి సభ్యులకు భరోసా కలిగించడానికే ఈ మూస. ఇక వికీపీడియా:సముదాయేతర సంస్థలు పేజీలో నేను చేసిన ప్రతిపాదనలను మీరు కూడా సమీక్షించి, చర్చించి దాన్ని సముదాయపు పాలసీగా తీర్చిదిద్దటంలో సహయపడాలని కోరుకుంటున్నాను. --వైజాసత్య (చర్చ) 01:15, 2 జూన్ 2015 (UTC)
- వైజాసత్య గారికి, నిబద్ధత గల సంస్థల నిర్వాహకులు గుర్తింపునివ్వకుండా వారు తోడ్పడని కృషిని వారి నివేదికలలో వేసుకోరు. కావున ఈ హెచ్చరిక మూసకు అంత ప్రాధాన్యం ఇవ్వడం మంచిది కాదేమో. ఇక సముదాయేతర సంస్థల పని నియంత్రణకు మంచి పేజీ ప్రారంభించారు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 13:20, 30 మే 2015 (UTC)