పాత చర్చ 49 | పాత చర్చ 50 | పాత చర్చ 51

మన చరిత్ర - మన తెవికీ ఫోటోల సద్వినియోగంసవరించు

అందరికీ నమస్తే,
గత డిసెంబరులో తెలుగు వికీపీడియా దినోత్సవం సందర్భంగా తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు (లేక మన చరిత్ర-మన తెవికీ) పేరిట ఫోటోవాక్ నిర్వహించుకున్న విషయం తెలిసిందే. సభ్యులు కార్యక్రమంలో ఆసక్తిగా పాల్గొన్నారు. స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియంలో తీసిన ఈ ఛాయాచిత్రాల్లో వివిధ గ్రామాల్లో లభించిన చారిత్రిక శిల్పాలు, వస్తువుల ఛాయాచిత్రాలు చాలానే ఉన్నాయి. పద్ధతి ప్రకారం ఎక్కించడంలో చారిత్రిక వస్తువుల వివరాన్ని, ఏ గ్రామానికి చెందిందన్న విషయాన్ని పేరులో కానీ, వివరణ(డిస్క్రిప్షన్)లో కానీ వచ్చేలా జాగ్రత్త తీసుకుని వికీమీడియా కామన్స్ లో చేర్చడం జరిగింది. ఇవి ప్రస్తుతం Our history our tewiki photowalk, Telugu wikipedia day -2015 అన్న రెండు కేటగిరీల్లోనూ వర్గీకరించి ఉన్నాయి.
గ్రామాల వ్యాసాల్లో చరిత్ర అన్న విభాగంలో ఆయా ఫోటోలు చేర్చడం వల్లనూ, కొన్ని చారిత్రిక అంశాల గురించిన వ్యాసాల్లో ఫోటోలు చేర్చడం వల్లనూ ప్రయోజనం ఉండవచ్చు. ఇది కేవలం సూచన మాత్రమే, ఆ ఛాయాచిత్రాలను దయచేసి సముదాయ సభ్యులు పరిశీలించి ఉపయుక్తమైన ఛాయాచిత్రాలను తెవికీ వ్యాసాల్లో చేర్చి వినియోగం కల్పించడాన్ని పరిశీలించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 13:47, 9 జూన్ 2016 (UTC)

పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు చెప్పింది బాగుంది. ప్రతిసారి ఏదోఒక కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఫోటోలు తీస్తున్నాము. వాటిని కామన్స్ లో ఎక్కించి ఊరుకుంటున్నాము. ఫోటోవాక్ లో తీసిన ఫోటోలను గ్రామాల వ్యాసాల్లో మరియు కొన్ని చారిత్రిక అంశాల గురించిన వ్యాసాల్లో ఫోటోలు చేర్చడానికి ప్రయత్నిస్తాను. --Pranayraj1985 (చర్చ) 12:39, 26 జూన్ 2016 (UTC)

గ్రామ వ్యాసాలలో మార్పులుసవరించు

గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు నేను ఎంత చెప్పినా వ్యాసంలో ఒకే మూలాన్ని పలు మార్లు ఇస్తున్నారు. ఇలా <ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli|accessdate=10 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli}}</ref> . ఇలాంటి మూలాలను ఒకసారి ఇవ్వాలి అని చెబితే వినడం లేదు. మిగతా సభ్యులు స్పందించండి. --రవిచంద్ర (చర్చ) 01:21, 10 జూన్ 2016 (UTC)

ఆ మూలంలో క్రింద ఆ గ్రామానికి సంభదించిన సమాచారం ఉందిగా, అందుకే ఆయన ఇస్తున్నట్టున్నారు. --Viswanadh (చర్చ) 04:13, 10 జూన్ 2016 (UTC)
గుళ్ళపల్లి నాగేశ్వరరావు అనుమంచిపల్లి వ్యాసంలో ఒకే మూలాన్ని అనేక సార్లు యిస్తున్నారు. ఒక మూలాన్ని అనేక సార్లు ఒక వ్యాసంలో ఉపయోగించాలనుకున్నప్పుడు. మొదటి సారి ఉపయోగించినపుడు <ref name="anumanchipalli">{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli|url=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli|accessdate=10 June 2016|ref=http://www.onefivenine.com/india/villages/Krishna/Jaggayyapeta/Anumanchipalli}}</ref> అని మూలం చేర్చి, తరువాత ఆ మూలం మరలా ఉపయోగిస్తున్నప్పుడు ఎన్నిసార్లైనా <ref name="anumanchipalli"/> అని ఉపయోగించాలి. లేనిపక్షంలో ఆ వ్యాసం యొక్క మూలాల జాబితాలో ఒకే మూలం అనేకసార్లు కనిపిస్తుంది. గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు సదరు విషయాన్ని అవగాహన చేసుకొని వ్యాసాలలో మూలాలను చేర్చాలని మనవి.-- కె.వెంకటరమణచర్చ 04:38, 10 జూన్ 2016 (UTC)

ఒకేసారి ఇస్తున్నాను ఇప్పుడు --Nrgullapalli (చర్చ) 12:16, 11 జూన్ 2016 (UTC)

గ్రామవ్యాసాలలోని ఖాళీగావున్న హెడ్డింగ్స్ తొలగించడం మంచిదికాదు. అవిచూస్తేనేగాని ఎవరికైనా స్పురణకు వచ్చి తగిన చమాచారం ఇవ్వగలందులకు ఎంతో వుపయోగ పడుతుంది. లేనియెడల ఆ గ్రామానికి సంబందించిన సమాచారం పూర్తిఅయినది అనుకునే అవకాశంవుంది --Nrgullapalli (చర్చ) 00:30, 12 జూన్ 2016 (UTC)

Nrgullapalli గారూ, అన్ని గ్రామ వ్యాసాలలో ఖాళీ హెడ్డింగులు అలా ఉంచటం సరికాదని నా అభిప్రాయం. గ్రామ వ్యాసాలు వికీ మొదలు పెట్టినప్పటి ఎవరో అడపా దడపా రాసేవారు తప్ప అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. అసలు వ్యాసాల సంఖ్య పెంచుకోవడానికి బాటు ద్వారా పెద్దమొత్తంలో గ్రామ వ్యాసాలు సృష్టించడం మనం చేసిన చారిత్రక తప్పిదం. ఈ విషయం చాలా మంది సభ్యులు అంగీకరించారు కూడా. ఇప్పుడు వాటిని కేవలం ఖాళీ హెడ్డింగులతో వదిలేస్తే చాలా ఎబ్బెట్టుగా ఉంది చూడ్డానికి. అందుకనే నాకు వీలైనన్ని సరిచేశాను. ఇంకో విషయం ఏమిటంటే మూస పద్ధతిలో మార్పులు చేయడానికి బాట్లు తయారు చేసుకోవచ్చు. దానివల్ల సభ్యులు తమ దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోగలరేమోకానీ తెవికీ నాణ్యతను ఏమాత్రం పెంచలేరు. ఈ విషయం సభ్యులందరూ గమనించి నాణ్యమైన వ్యాసాల మీద దృష్టి పెడితే మంచిది. --రవిచంద్ర (చర్చ) 07:23, 14 జూన్ 2016 (UTC)

బాటు అంటే ఏమిటో ఎలా చేస్తారో నాకు తెలియని విషయం. హెడ్డింగులు లేనియెడల గ్రామవ్యాసాలు పూర్తిఅయినవి అనే అభిప్రాయం ఏర్పడుతుంది. ఇతరవివరాలు తెలిసిన సబ్యులు చాలామంది వున్నారు. వాటిని ఈ ఖాళీలలోచేర్చడానికి ప్రయత్నిస్తున్నారు. సమాచారం లేదని తీసివెయ్యడం సరికాదు నాణ్యతకు ఏమాత్రం తగ్గదు. సబ్యులు స్పందించవలసిందిగా కోరుచున్నాను. --Nrgullapalli (చర్చ) 07:35, 14 జూన్ 2016 (UTC)

వికీపీడియాలో ఏ వ్యాసం కూడా పూర్తి అయింది అనలేము. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా మార్పులు చేయవచ్చు కాబట్టి. ఒక వ్యాసం పూర్తి అయిందా లేదా అనడానికి హెడ్డింగులు కొలమానం కాదు. అందులో ఉన్న సమాచారమే కొలమానం. గ్రామాల వ్యాసాల్లో మార్పు చేయదలిచిన సభ్యులు ఏ గ్రామ వ్యాసంలో మార్పులు చేస్తారో అక్కడే హెడ్డింగులు పెట్టి పూర్తి చేయాలి. అంతే కానీ ముందుగా అన్ని గ్రామ వ్యాసాలలో ముందుగా హెడ్డింగులు పెట్టి ఎవరో వచ్చి మార్పులు చేస్తారని ఎదురుచూడడం సరికాదు. బాట్లు అనేవి ఒక రకమైన ప్రోగ్రాములు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవారు రాయగలరు. ఏదైనా ఒకే రకమైన మార్పులు చాలా వ్యాసాలలో చేయవలసి వస్తే అందుకు బాటు వాడవచ్చు. ఉదాహరణకు గ్రామ వ్యాసాలన్నింటిలో ఒక మూస చేర్చడం, వగైరాలు. ఇది సముదాయ సభ్యులు అందరూ ముందుగా నిర్ణయించి తరువాత బాటు నడుపుతారు. --రవిచంద్ర (చర్చ) 09:16, 14 జూన్ 2016 (UTC)

Wikipedia to the Moon: voting has begunసవరించు

Hello, after six weeks of community discussion about Wikipedia to the Moon, there are now 10 different proposals for content for the mission. Starting today, you can vote for them on Meta-Wiki, and decide what we will work on: a Wikipedia canon, different lists, the Moon in 300 languages, an astronomy editathon, featured articles, articles about technology, endangered things, or DNA-related topics. You can even vote against community involvement. Voting is open until 24 June. Sorry that this message is again in English only, but we are using village pumps to reach as many communities as possible, so that everyone knows they can vote. Best, Moon team at Wikimedia Deutschland 15:31, 10 జూన్ 2016 (UTC)

1930-50 నాటి తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ఎడిట్-అ-థాన్సవరించు

అందరికీ నమస్కారం,
గత నెలలో నిర్వహించిన సంఘటనలు, పరిణామాలు ఎడిటథాన్ విజయవంతం కావడం, అటువంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టేందుకు పాల్గొన్న సభ్యుల నుంచి ప్రోత్సాహం లభించడం తెలిసిందే. అలాగే తెలుగు సినిమాల వ్యాసాలు అనేకం విస్తరణ లేక మొలక స్థాయిలోనూ, మూలాలు లేని స్థాయిలోనూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 1930, 40, 50 దశకాల్లో విడుదలైన సినిమాల వ్యాసాల విస్తరణకు ప్రత్యేకించి ఎడిటథాన్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నాను. ఇందుకు అవసరమైన లభ్య మూలాలను సభ్యులతో పంచుకోగలము. అలానే ఇప్పటికే చిన్న మోడల్ వ్యాసం తయారుచేయడం, ప్రయోగాత్మకంగా రాజశేఖర్ గారు దీక్ష సినిమా వ్యాసాన్ని, పై నమూనా వ్యాసాన్ని అనుసరించి తిరుపతి రావు గారు ఆడజన్మ సినిమా వ్యాసాన్ని సినిమా పాటల పుస్తకం మూలంగా అభివృద్ధి చేశారు. సభ్యుల ఆసక్తిమేరకు జూన్ 15 నుంచి 25 వరకూ నిర్వహించుకోవచ్చని ప్రతిపాదిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 02:10, 14 జూన్ 2016 (UTC)

ఇంతకు ముందు నిర్వహించిన కార్యక్రమం ప్రోత్సాహంతో ప్రారంభించిన కార్యక్రమం బాగున్నది. పవన్ అందిస్తున్న సమాచారంతో సుళువుగా పాత సినిమా వ్యాసాల్ని విస్తరించవచ్చును. నేను కూడా పాల్గొని మరిన్ని వ్యాసాలను అభివృద్ధి చేస్తాను. సభ్యులు చురుకుగా పాల్గొనమని మనవి.--Rajasekhar1961 (చర్చ) 10:51, 14 జూన్ 2016 (UTC)
ధన్యవాదాలు. ఇక్కడ సంబంధిత కార్యక్రమం పేజీని చూడవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 01:54, 15 జూన్ 2016 (UTC)

రైల్వే వ్యాసములు - సమయ పట్టికలు - మళ్ళీ చర్చలుసవరించు

అయ్యా ! రైల్వే వ్యాసములు నందు సమయ పట్టికలు అసలు ఉండాలా లేక వద్దా ? మళ్ళీ మళ్ళీ చర్చలు ఎంతకాలం సాగుతాయి ? ఒక పాలసీ నిర్ణయం అంటూ ఈ మేధావి పెద్దలు చెయ్యలేరా ? వ్రాసే వాళ్ళను ఎంతకాలం వెధవలుగా చేస్తారు ? ఒకసారి ఉండాలని మరోసారి ఉండకూడదని ఈ దరిద్రం ఎన్నాళ్ళు ? ఈ పిచ్చ పాలాసీలు అసలు ఏ సమూహం తయారు చేస్తోంది ? మాట అంటే ఒక్కొక్కళ్ళకు బాగా పొడుచుకు వస్తుంది. కానీ చేసేది మాత్రం కనబడదనుకుంటాను వీళ్ళకి. దయచేసి మీ సమాధానం ఏమిటో చెప్పండి, వింటాం. 06:29, 14 జూన్ 2016 (UTC) JVRKPRASAD (చర్చ) 06:32, 14 జూన్ 2016 (UTC)

Entha maryadaga sahanamga adigaru sir👍👍-15:41, 14 జూన్ 2016‎ 119.235.52.22

అయినా వీళ్ళ కంటికి నేనడిగింది ఆనలేదుగా..........JVRKPRASAD (చర్చ) 00:56, 15 జూన్ 2016 (UTC)

సమయ పట్టికలు అవసరం లేదు. ఇప్పటికే రైల్వే వెబ్ సైట్లతో సహా అనేక సైట్లు, బ్లాగులు వీటిని అందిస్తున్నాయి కనుక అవసరం లెదని నా అభిప్రాయం..--Viswanadh (చర్చ) 02:52, 15 జూన్ 2016 (UTC)

అవసరం లేదని నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 06:49, 15 జూన్ 2016 (UTC)
నా అభిప్రాయం ప్రకారం సమయ పట్టికను పూర్తిగా తొలగించకుండా సమయానికి సంబంధించిన కాలం లను తొలగించినచో అవి ఆయా స్టేషన్లలో ఆగే రైళ్ల గురించి తెలియజేస్తుంది. ఇలాంటి జాబితా పట్టికలు ఆంగ్ల వికీ పేజీలలో ఉన్నాయి.--Rajasekhar1961 (చర్చ) 08:15, 15 జూన్ 2016 (UTC)
ఆంగ్ల వికీలో కూడా కొన్ని రైల్వే వ్యాసాలలో సమయ పట్టికలు ఉన్నాయి. Sealdah Rajdhani Express మరియు Jabalpur–Jammu Tawi Express వ్యాసాలు చూడండి. సమయపట్టికలలో రైలు ఆగే స్థానాల వివరాలు తెలుస్తాయి. సమయాలు కాలానుగుణంగా మారితే వాటిని మార్చవలసి యుంటుంది. కనుక సమయ పట్టికలు ఉన్నా ఫరవాలేదనిపిస్తుంది.-- కె.వెంకటరమణచర్చ 15:40, 15 జూన్ 2016 (UTC)

వికీ వ్యాసములంటే అర్థం ఏమిటి మరియు ఎంతమందికి తెలుసుసవరించు

అయ్యా ! మేధావులనబడే పెద్దలు వీటిని [1] వ్యాసములు అంటారా ? మీ సమూహాలకు కనిపించడము లేదా ? నిర్ణయాలు చెయ్యలేరా ? దయచేసి తెలియజేయండి. మీరు చెయ్యలేమని చెప్పండి మొలకలు అన్నీ నేనే తొలగిస్తాను. JVRKPRASAD (చర్చ) 02:54, 15 జూన్ 2016 (UTC)

మొలకలంటే 2500 బైట్లకంటే తక్కువ ఉన్నవి. సదరు వ్యాసానికి విషయ ప్రాముఖ్యత లేకపోయినా, లేక వాటిలో కొద్దికాలం పాటు మూస ఉంచిన తరువాత ఎవరూ వాటిని విస్తరించడానికి ఎవరూ ముందుకు రాకపోతే తొలగించవచ్చును. --రవిచంద్ర (చర్చ) 06:53, 15 జూన్ 2016 (UTC)
JVRKPRASAD దయచేసి మీరంత పని చేయవద్దు. మీ వ్యాసల వరకూ మీరు విస్తరించు వెళ్ళిపొండీ. వాటిని నెమ్మదిమీద విస్తరిద్దాం. అందులో చాలావరకూ ఉందవల్సిన వ్యాసాలే. కాకుంటే విస్తరణకు కావలసిన సమాచారం దొరకక వదిలెసినవి ఎక్కువ. కనుక మూస పెట్టినా కొన్ని తొలగించరానివి గమనించాలి..--Viswanadh (చర్చ) 07:44, 15 జూన్ 2016 (UTC)
Viswanadh ఏకవాక్యం మరియు బొమ్మలు పెట్టినవి ఎంతకాలం చూడాలంటారు ? నేను ఉండాలన్న వ్యాసాలు, నేనే విస్తరిస్తాను అన్నవి ఉండకూడదని నిర్ణయాలు చేసి ఎవరెవరినో పట్టుకువచ్చి అభిప్రాయాలు మరీ వ్రాయించి తొలగించాలన్నారు. మనిషికొక పాలసీ ఉంటుందా ? JVRKPRASAD (చర్చ) 07:56, 15 జూన్ 2016 (UTC)
చాలా సంవత్సరాలపాటు ఎటువంటి విస్తరణ లేని మొలక వ్యాసాలను తొలగించడం సబబు,మంచిది.కొత్త వాడుకరులకు,కొత్త వ్యాసాలు వ్రాయటానికి ఈ మొలకలు అడ్దంకి.Palagiri (చర్చ) 09:59, 15 జూన్ 2016 (UTC
చాలాకాలంగా ఏకవాక్య వ్యాసాలు తెవికీలో ఉన్నాయి. వాటిని ఎవరూ విస్తరణ చేయడంలేదు. మొలక స్థాయి దాటాలంటే వ్యాస పరిమాణం 2 కె.బి దాటాలనే నిబంధన ఓటింగు పద్ధతి ద్వారా చేసుకున్నాము. కానీ ఏ వ్యాసం విస్తరణకు నోచుకోపోగా అనుభవమున్నవారు కూడా మొలకలను సృష్టించారు. కనుక అటువంటి వాటిని తొలగించడమే మంచిది. పూర్తి ఆంగ్ల వ్యాసాలుకూడా ఉన్నాయి. వాటిని ఎవరూ అనువాదం చేయరు. అటువంటి వ్యాసాలను కూడా తొలగించాలి. ఈ మొలక వ్యాసాలలో సరియైన మూలాలుగానీ, లింకులు గానీ ఏవీ లేవు. కనుక వాటిని తొలగించాలి. -- కె.వెంకటరమణచర్చ 15:46, 15 జూన్ 2016 (UTC)
JVRKPRASAD గారికి ఏక వాఖ్యం ఉన్న మొలకలకు నేను వ్యతిరేకం కాదు. కాని మొలకలపేజీలో సగానికి సగం మొలకలు కాదు. కొన్ని విస్తరింపబడి ఉన్నాయి కనుక అలా చెప్పాను. క్రీంద నేను ఓటింగ్ పెట్టీనదానిని చదవండి. మరొక విషయం. మీరు ప్రతి చర్చా విష్యంలో తొటి సభ్యులను సంభోదించే క్రమంలో వ్యంగ్యం, లేదా వెటకారం జతచేస్తూ రాస్తున్నారు. మీతో ప్రత్యక్షంగా చర్చలలో రాయలేకపోయినా చాలామంది పరోక్ష అభిప్రాయం అదే. మీ వ్యాసాలను తోలగించమన్నారనో మరేదో కారణాలను పట్టుకొని ఇలా రాయటం ఏమంత సమంజసంగా లేదు. ఇది ఇలా సాగితే మీరు ఏది రాసినా సభ్యులు స్పందించడం మానేస్తారు. కనుక గమనించప్రార్ధన. నాపై దాడికి దిగరని ఆశిస్తాను (నీతులు చెపుతున్నారు, నాకు సలహాలు ఇస్తున్నారు, నా విషయంలోనే ఎందుకు చెపుతారు, నా వ్యాసాలనే ఎందుకు వ్యతిరేకిస్తారు, నాకు తెలీదనుకున్నారా వంటివి పాతబడీపోయినవి అని నా నిచ్చిత అభిప్రాయం).. మీ ---Viswanadh (చర్చ) 17:10, 15 జూన్ 2016 (UTC
అయ్యా ! Viswanadh గారు, మీకు ఎలా అనిపిస్తే అలా అనుకోండి. నాకవసరం లేదు కదా ! నేను ఎవరినీ పేరు పెట్టి వ్రాయడం లేదు. ఒకరి అభిప్రాయాలతో నాకేమీ సంబంధం లేదు. చర్చలు చేయడం చేతకాదేమో మరి. నేను ప్రస్తుతం కొత్తగా ఏమీ వ్రాయడం లేదు.. నేను వ్రాశినవి సరిచేయడం, మేధావులు చెప్పిన, ఇచ్చిన తీర్పులకు సవాలు చేయడం, బొక్కలు వెతకడమే నాపని. ఒకరి స్పందనలు కోసం నేను వ్రాయడము లేదు. పిచ్చ నిర్ణయాలు ఎలా చేస్తున్నారో తెలియజేస్తున్నాను. ఏం సమంజసంగా లేదు. నేను వ్రాసిన వ్యాసాలు మొత్తం అన్ని విభాగాలలోనివి తొలగించమంటే వెంటనే తొలగిస్తాను. నాకు ఏంటి బాధ. ఇప్పుడు తొలగించనా ? మీ లాంటి వాళ్ళకి అర్థమయింది ఆంతే అనుకోవాలి. నేను అడిగిన దానికి సమధానము చెప్పడము చాతకాదని చెప్పితే మంచిది. నేను ఒకళ్ళతో నీతులు చెప్పడానికి నేను రాయలేదు. ఇందులో ఎవరో నాకు నీతులు చెప్పాల్సినది ఏముంది ? అడిగిన దానికి నిర్ణయాలు చేసిన తెరవెనుక ఉన్నవారు, తెరముందు నాటకం ఆడినవారు, ఇంకా పాత్రధారులు మరియు సమూహము (లు) సమధానము ఖచ్చితంగా చెప్పాలి. నేను మీ అందరి పెంట(పను)లన్నీ కెలికి తీస్తునే ఉంటాను. నాకు చేతనయినది ప్రస్తుతం ఇదే. పని. చాతనయితే సమాధానము వస్తుంది. లేకపోతే నేను రాసినది నిజం అని జనం నమ్ముతారు. అది తెలుసుకుంటే మంచిదేమో, ఆలోచిస్తే మంచిది. బ్రాకెట్టు పెట్టి రాసిన పెంట రాతలు ఏమంటారు ? ఎవడైనా పిల్లని చూసి అభిప్రాయము చెబుతాడు. అంతేకాని, కాపురం చేసి పిల్లల్ని కన్నాక చెప్పడు. నాకు ఎన్ని నెలలకి తీర్మానం చేసి చెప్పటము జరిగింది. ఇలాంటి పెంట పనులు చేయవద్దని అంటున్నాను. నేను అసలు అడిగింది మొలకలు గురించి, నాకు ఈ సోది సొద ఎందుకు ? ఇక్కడ అభిప్రాయాలు కావాలా ? సమస్య పరిష్కారము పొందాలా ? ఏ విత్తనానికి ఆ కాయలే కాస్తాయి అన్నట్లు మీ తెలిసింది ఇంతే. అంతే.JVRKPRASAD (చర్చ) 17:43, 15 జూన్ 2016 (UTC)
JVRKPRASAD గారూ వికీ సముదాయాలు లేవు, ఒకటే సముదాయం. మీరు బయట మీటింగులకూ వాటికీ రారు కనుక అలా అని ఉండవచ్చు. మీటింగులలో పాల్గొనే సభ్యులు అన్ని విషయాలు చర్చించుకొంటారు. అందరి సభ్యుల గురించి కూడా మాట్లాడుకొంటారు. అక్కడ మాట్లాడుకొనే సమయాల్లో మీలాంటి కష్యప్ గారు,బాస్కరనాయుడు గారు,నాగేశ్వరరావు గారు,రాజశేఖర్ గారు వంటి సీనియర్లు ఉంటారు. చర్చల్లో ఇలాంటి సున్నిత విషయాలలో మా అందరి అభిమతం ఏ ఒక్క సభ్యుడిని కోల్పోయేలా నిర్నయాలు ఉండకూడదనేది. ఎవరు ఎలా వ్యవహరించినా, వ్యక్తిగతంగా ఏవైనా దురుసుగా రాసినా దానిపై ఎక్కువగా స్పందించకూదదని. మీరు చాలా కాలంగా మిగతా వికీపీడియన్లపై కొంత దురుసుగా వ్యవహరిస్తున్నారు. దీనిపై అనేక చర్చలు జరిగినా మీ వయసుకు గౌరవం ఇచ్చి ఇప్పటి దాకా మీరు ఎలా రాసినా వాటిపై ఎవరూ మీకు దురుసుగ సమాధానం ఇవ్వలేదు. ఇలాంటి సమావేశాల్లో ప్రత్యక్షంగా పాల్గొనని వెంకటరమణ గారు, రవి చంద్ర గార్లు మీతో వాదించి కొంత మనస్తాపం చెందారు. ఇప్పుడు మీరు నేను మీ అందరి పెంట(పను)లన్నీ కెలికి తీస్తునే ఉంటాను. నాకు చేతనయినది ప్రస్తుతం ఇదే. పని. అంటే ఉన్న గౌరవం కూడా కోల్పోవలసి వస్తుంది. తెగేదాకా లాగకూడదని పాత సామెత. కొమ్మ పాడైతే దాన్నే తొలగించాలి కాని చెట్టును కాదు కదా. మా ప్రయత్నం దాన్నీ బాగుచేయాలనే. మీ వయసులోనే ఉన్న బాస్కరనాయుడు గారు,నాగేశ్వరరావు గారు, మురళీమోహన్ గార్లు మీ వయసువారే కాని ఇప్పటి వరకూ ఎవరినీ నొప్పించే విధంగా ఒక్క కామెంట్ కూడా పెట్టినట్టు నాకు గుర్తులేదు. మీరు వికీలో క్రియాశీలకంగా ఉండటం మాకు ఆనందమే కాని అది వ్యాసమార్పులలో ఉంటే చాలా ఆనందిస్తాము. మిగతా వాళ్ళు ఎలా తమ పని తాము చేసుకెళుతున్నారో అలానే మీరు చేసుకెళుతుంటే ఇక్కడ ఇంత చర్చలు, రాసుకోవల్సిన అవసరం ఎందుకండీ, మీరు పైన రాసినది మరొక్కసారి చదివి మీ విజ్నత ఎంత అనేది ఆవేశపడకుండా నిర్ణయించుకొండి.--Viswanadh (చర్చ) 03:22, 16 జూన్ 2016 (UTC)
నేను అడిగిన వాటికి సరి అయిన సమాధానములు రాకపోగా, నాకు ప్రతి వాళ్ళు పాఠాలు చెబుతారు ఎందుకు ? నేను ఎవరితో ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఒకరితో చెప్పించుకోవల్సిన అవసరము లేదు. వాళ్ళేవరో బాధ పడ్డారు అంటే ఆ సందర్భములో వాళ్ళు ఏ చర్చలలో ఏ సమాధానం బట్టి ప్రతి సమాధానము ఉంటుంది. ఖాళీగా కూర్చుని ప్రతి వాళ్ళని కెలకటం నా పని అనుకుంటున్నారా ? ఎదుటి వారిని బట్టి, సందర్భాన్ని బట్టి స్పందనలు ఉంటాయి. మీ లాంటి వాళ్ళు ఇచ్చే గౌరవం అనేది తుమ్ముతే ఊడిపోయేది అయితే నాకవసరము లేదు. ఎవడి పద్దతి వాడిది కాదా ? మీ భజన బృందంలో నేను చేరను. మీ కేంటి నొప్పి మరియు బాధ. మీ వయసు వాళ్ళు అందరూ మీలాగానే ఉన్నారా దేశం మీద ? ఎవరి మీద ఊరికే దురుసుగా వ్రాసినది ఒకటి బయటకు తీస్తే సమాధానము చెప్తాను. నాకు కావల్సింది నేనడిగిన దానికి సమాధానము మాత్రమే. అంతే కాని ఇలాంటి నీతులు కాదు. JVRKPRASAD (చర్చ) 04:20, 16 జూన్ 2016 (UTC)
మీకు ప్రతి వాళ్ళూ పాఠాలు చెపుతున్నరంటే దానర్ధం మీరు చెప్పించుకొనేలా చేస్తున్నారేమో..ఆలోచించండి..--Viswanadh (చర్చ) 04:29, 16 జూన్ 2016 (UTC)
చర్చలు చేతకాని మీ లాంటి వాళ్ళు మాత్రమే పాఠాలు చెబుతున్నారు. మీలాంటి వారితో చెప్పించుకునే స్థితి పరిస్థితి నాకు మాత్రం లేదు. JVRKPRASAD (చర్చ) 05:13, 16 జూన్ 2016 (UTC)

వికీకి క్యాబరే డ్యానర్ గురించి, రౌడీలు, గూండాలు, రేపిస్ట్లు వ్యాసాలు మక్కువ ?సవరించు

ప్రపంచంలో ఎక్కడో క్యాబరే డ్యానర్ గురించి, రౌడీలు, గూండాలు, రేపిస్ట్లు లాంటి సంఘవిద్రోహులు గురించి, అనేక రంగాలలోని నాకనిపించే చెత్త వ్యాసాలు వికీలో ఉండవచ్చును, కానీ మన దేశానికి సంబంధించిన రవాణా గురించి ఉండకూడదు అని మన మేధావులు నిర్ణయం. వీళ్ళు అసలు ఎంతమంది ఎన్ని రాష్ట్రాలు తిరిగారు ? వేరే ప్రాంతాల్లో అక్కడ తెలుగు అస్సలు ఎక్కడా ఉండదు. తెలుగు లేని దాని వల్ల ఎన్ని బాధలు పడ్డామో మాకు బాగా అనుభవం. తెలుగు అక్షరాలు రాని వారు కూడా సమూహాంలో చేరి నిర్ణయాలు చేసేస్తారు. JVRKPRASAD (చర్చ) 08:09, 15 జూన్ 2016 (UTC)

తెవికీలో ప్రముఖులు, స్వాతంత్ర్యసమరయోధులే కాకుండా క్యాబరే డాన్సర్లు, రౌడీలు, గూండాలు, బందిపోటు దొంగలు వ్యాసాలు కూడా ఉన్నాయి. అవి చెత్త వ్యాసాలు అని ఎలా నిర్ణయించగలం. తెవికీలో ప్రముఖుల వ్యాసాలే ఉండాలనే నియమమీదీ లేదు కదా! నోటబిలిటీ, ఆధారాలు ఉన్నప్పుడు ఏ వ్యాసమైనా తెవికీలో ఉండవచ్చును. రైల్వే వ్యాసాల విషయానికొస్తే మన రాష్ట్రంలో రవాణా కు సంబంధించిన రైళ్ళ వివరాలను ముందుగా వివరంగా వ్యాసాలుంటే బాగుంటుంది. తరువాత దేశంలో ప్రముఖమైన రైళ్లకు సంబంధించిన వ్యాసాలుండాలనేది నా అభిప్రాయం. మన తెవికీలో మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల వ్యాసాలు అనేకం ఉన్నాయి. అందులో స్వాతంత్ర్య సమరయోధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలైన వారున్నారు. మన దేశంలో ఎక్కడో అరుణాచల ప్రదేశ్ లో ఉన్న నాయకుల గురించి వ్యాసాలు లేవు కదా. నోటబిలిటీ ముఖ్యంగా చూడాలని మనవి.-- కె.వెంకటరమణచర్చ 16:05, 15 జూన్ 2016 (UTC)
రమణగారు, మీరు ఏదైనా ఒక విషయము మీద మీ అభిప్రాయము వ్రాసేటప్పుడు అది అభిప్రాయమో లేక నిర్ణయమో తెలియజేయండి. తదుపరి, మీరు పైన ఇచ్చిన సమాధానములో చాలా అసంబద్ధత ఉంది మరియు నిజం కూడా తక్కువే.. అయినా మీకు సువాసన అనిపించేది నాకు గబ్బుగా అనిపించ కూడదంటారా ? ఒకసారి అన్ని వ్యాసాలు వర్గీకరించండి. మీరు చెప్పినది ఎంత వరకు నిజం లేక సబబుగా ఉందో తెలుస్తుంది. JVRKPRASAD (చర్చ) 16:34, 15 జూన్ 2016 (UTC)
రైల్వే వ్యాసాల విషయంలో పైన నేను తెలిపిన విషయాలు నా వ్యక్తిగత అభిప్రాయాలు. వీటిపై రచ్చబండలో చర్చ కూడా జరిగింది. నిర్ణయం కూడా చేయడం జరిగింది. మంచి వ్యాసం నిర్ణయంపై ఒక్కొక్కరికీ ఒక్కొక్క అభిప్రాయం ఉండవచ్చు. కానీ తెవికీ విజ్ఞాన సర్వస్వం కనుక అన్నిరకాల వ్యాసాలు ఉంటాయి. వ్యక్తుల మంచి చెడుల ఆధారంగా వ్యాసాలు వ్రాస్తామా? మంచి వ్యాసం అంటే వ్యాస పరిమాణం, అంతర్గత లింకులు, మూలాలు, చిత్రాలు, శైలి, వికీకరణ వంటి అంశాలన్నీ సక్రమంగా ఉండి తెవికీ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నదని నా అభిప్రాయం. అంతే గానీ గాంధీ గురించి వ్రాస్తే మంచివ్యాసం అని గాడ్సే గురించి వ్రాస్తే చెత్త వ్యాసమంటారని నాకు తెలియదు.-- కె.వెంకటరమణచర్చ 01:43, 16 జూన్ 2016 (UTC)

మీకు తెలిసింది అంతే. JVRKPRASAD (చర్చ) 16:34, 15 జూన్ 2016 (UTC)

మొలక - ప్రమాణంసవరించు

అయ్యా ! చాలామంది మనిషికొక రకంగా మొలక యొక్క ప్రమాణం నిర్వచించుతున్నారు. మేధావులయిన పెద్దలు ఒక ప్రమాణం నిర్ణయించినట్లయితే దానిని ఒక పాలసీగా చేసి ముందు పేజీలో ప్రకటితమవుతుంటే కనీసం తెలియని వారు తెలుసుకుంటారు. దయచేసి అధికారులు మరియు సమూహాలు స్పందించండి. JVRKPRASAD (చర్చ) 07:03, 15 జూన్ 2016 (UTC)

వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం లో 1 ఏప్రిల్ 2013 న విధానాన్ని నిర్ణయించడం జరిగినది. తెవికీలో అనుభవంగడించినవారు (అనగా 25 మార్పులైన చేసినవారు) ప్రారంభించిన మొలక వ్యాసాలు, ప్రారంభించిన నెలరోజులలోగా కనీస స్థాయికి అనగా వ్యాస పరిమాణం 2000బైట్ల మరియు కనీసం ఒక అంతర్గత లింకు) ఎదగకపోతే వాటిని వీలైతే ఇతర వ్యాసాలలో విలీనం చేసి తొలగించవలెను. అనే నిర్ణయం చేయడం జరిగినది.-- కె.వెంకటరమణచర్చ 15:50, 15 జూన్ 2016 (UTC)
రమణ గారు, మీరు 2000 అంటూ మరొకరు 2500 అంటూ, రహ్మనుద్దీన్ 4000 అంటూ ఏమిటి ఈ గోల ? అసలు మొలకకు ప్రమాణం ఇంత అని ఎవరూ (భజన బృందాలు, సమూహాలు) ఖచ్చితంగా నిర్ణయం చెయ్యలేరా ? చెప్పలేరా ? JVRKPRASAD (చర్చ) 01:20, 16 జూన్ 2016 (UTC)
నాకు తెలిసినంతవరకు పైన సూచించిన వికీపీడియా:మొలకపేజీల నియంత్రణ విధానం సముదాయం చర్చద్వారానే నిర్ణయం తీసుకొనబడింది. ఆ నిర్ణయాన్నే తెలియజేసాను. మిగతా వారు సూచించిన మొలక స్థాయి పరిమాణాల గూర్చి నాకు ఏ విధమైన ఆధారాలు లభ్యమవ్వలేదు. ఉంటే వారే లింకులు తెలియజేయాలి. ఇంకా మొలక స్థాయి పెంచాలంటె మరల సముదాయం చర్చించి నిర్ణయించాలి.-- కె.వెంకటరమణచర్చ 01:37, 16 జూన్ 2016 (UTC)

అభిప్రాయాలా - నిర్ణయాలాసవరించు

అయ్యా ! చాలామంది ఏదో మేము కూడా వ్రాశాము మరియు స్పందించాము అని వ్రాస్తున్నారు. మరి వ్రాసే సమాధానములు అవి అభిప్రాయలా లేక నిర్ణయాలా అర్థమయ్యేలా ఉంటే మంచిది. JVRKPRASAD (చర్చ) 07:49, 15 జూన్ 2016 (UTC)

పైన తెలిపినవన్నీ వాడుకరుల వ్యక్తిగత అభిప్రాయాలు. నిర్ణయాలు సముదాయం చర్చలద్వారా నిర్ణయించాలి. -- కె.వెంకటరమణచర్చ 15:52, 15 జూన్ 2016 (UTC)

అంతర్జాలం - వికీ సమాచారంసవరించు

అయ్యా ! చాలామంది వారి అభిప్రాయాలో లేక నిర్ణయాలో తెలియదు కాని, అంతర్జాలం నందు దొరికే సమాచర ముండగా ఇంక వికీలో ఎందుకు దండగ అనే విధముగా సమాధానములు చాలాసార్లు వ్రాయడము నేను గమనించాను. అసలు అంతర్జాలం నందు దొరికే సమాచారము వికీలో వ్రాయకూడదా ? మరి కొంతమంది వ్రాయాలంటారు. దీనికి మేధావులు అయిన పెద్దలు ఒక పాలసీ నిర్ణయము చేయలేరా. దయచేసి స్పందించండి. JVRKPRASAD (చర్చ) 07:52, 15 జూన్ 2016 (UTC)

తెవికీలో ఎవరికి నచ్చినట్లు స్వంత అభిప్రాయాలతో వ్యాసాలు వ్రాయరాదు. ఒక రచయిత అయినా తన రచనలు చేయరాదు. తెవికీలో వ్యాసానికి సరియైన మూలాలు లభిస్తే వ్రాస్తాము. అంతర్జాలంలో విషయమంతా ఉన్నా తెవికీలో వాటిని మూలాలుగా చేసుకొని వ్యాసముండాలి. అంతర్జాలంలో ఉన్న విషయాన్ని యధాతథంగా చేర్చడం కాపీహక్కుల ఉల్లంఘనకు వస్తుంది. కనుక అంతర్జాలంలో లభించే వనరులలో కొన్ని వాక్యాలను తీసుకొని మూలాలుగా చేర్చి వ్యాసం వ్రాయాలి. కనుక వికీ వ్యాసానికి మూలాలే ఆధారం. కనుక అంతర్జాలంలో విషయముందని వికీలో ఉండకూడదు అనే భావన సరికాదు. కొంత మంది ప్రముఖుల గూర్చి అంతర్జాల పత్రికలలో వ్యాసాలు కాలానుగుణంగా డెడ్ లింకులుగా మారి వారి గూర్చి సమాచారం లభించదు. అదే సదరు వ్యాస విషయాలను తెవికీలో చేర్చితే చిరస్థాయిగా నిలుస్తాయి. కనుక అంతర్జాలంలో వ్యాస విషయం లభ్యమవుతున్నా తెవికీలో వ్యాసాలు ఉండాలని నా అభిప్రాయం. -- కె.వెంకటరమణచర్చ 15:59, 15 జూన్ 2016 (UTC)

WikiConference India 2016 Surveyసవరించు

Hi,

Greetings from Wiki Conference India 2016 Team. Sorry for writing in English. Please feel free to translate the message in your language to help other community members.

Everyone is requested to participate in this short survey to help us learn more about WikiConference India 2016 participants' capabilities, needs, interests and expectations regarding conference programs.

How we’ll use this data: We will collect responses to assess whether and what type of conference programs would be most beneficial for the Wikimedia community in India. Individual responses or comments will not be made publicly available unless in anonymized or aggregate form.

In legalese: Your privacy is important to us. As allowed by law, we will only share your responses with WCI 2016 helping on this survey. We may, however, publicly share anonymous statistics about the responses in aggregate form. Wikimedia is a worldwide organization. By answering these questions, you permit us to record and transfer your responses to the United States and other places as may be necessary to carry out the objectives of this project. You also agree to refrain from incorporating your personal information in response to a question that doesn’t ask for it and to donate your responses to the public domain. For terms and privacy considerations related to Google Forms, consult the Privacy Policy (https://www.google.com/policies/privacy/) and Terms of Use (http://www.google.com/intl/en/policies/terms/) of Google.

Survey link - https://docs.google.com/forms/d/1Tn5TCFE4DkrAhIVmXk_Hx--upllCRU5pQlz6G_7Qb5M/edit?ts=575ad1a7

Regards,

WikiConference India Team

మొలకల్లోసవరించు

ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని వివరించాను. మొలకలల్లో కొన్ని ముఖ్యమైన ఉండవలసిన వ్యాసాలు ఉన్నాయి. ముందొకసారి అందరికీ మెసేజ్ పెట్టాను. తరువాత ఫేస్‌బుక్ మెసెంజర్ లోనూ ఇదే రాసాను. ప్రస్తుతం ఎవరి ప్రాధాన్యత క్రంమంలో వాళ్ళు చేసుకు వెళుతున్నారు. ఒక సముదాయంగా కొన్ని పనులు చేసుకు వెళితే బావుంటుంది అని. కాని ఒక్కొక్కళ్ళు ఒక్కోపని, దానిపైనే గుర్తింపు లేదా మార్పుల సంఖ్య కొరకో, మరెందుకో కాని వారనుకున్నవి తప్ప మరేం చేయరు. దానికి ఎవరినీ తప్పు పట్టలేం. అయితే మొలకలను గురించి ఇపుడున్న సభ్యులు ఒక్కవారం కృషిచేస్తే సగానికి సగం అయిపోతాయి. అలవాటయిన పనులు వాటిని వదిలి రావాలంటే ఇబ్బందే,ఎవరి పని ఎవరు వదులుకుంటారు. అయితే ఉండవలసిన వ్యాసాలను తొలగించాలని అందరికీ ఉత్సాహంగానే ఉంది. పాలసీ ప్రకారం తొలగించవలసినదే కాని దీనికి నేనూ వంతపాడటం ఇష్టం లేదు. మీలో నాతో ఎందరు కలుస్తారు. రేపటీకి ఎందరు సమాధానం ఇస్తారో చూద్దాం. మొలకల పేజీలో ఎన్ని వ్యాసాలను ఆ స్థాయి దాటీయవచ్చు. మొలక మూసను తొలగించవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ రెండు అభిప్రాయాలకు మీ ఇష్టానికి వదులుతున్నాను. కనీసం సగం సభ్యులు మొలకలపై పని చేస్తాం అంటే మూడవరోజు నుండి మొదలు పెట్టవచ్చు. నాకు మద్దతు లేకపోతే మీరన్నట్టు ఒకే వేటుతో మొత్తం లేపేయచ్చు. --Viswanadh (చర్చ) 17:22, 15 జూన్ 2016 (UTC)

మొలక మూస ఉన్న వ్యాసాలలో కొన్ని విస్తరించబడినవి ఉన్నాయి. వాటిని ముందుగా పరిశీలించాలి. బాటు ద్వారా తాజాగా మొలకల జాబితాను తయారు చేయాలి. ఆ జాబితాలో ఉన్న వ్యాసాలకు సంబంధించిన విషయాలు మూలాలతో కూడా లభ్యమయ్యే అవకాశం ప్రస్తుతం ఎక్కువగా ఉన్నది. కనుక వాటిని ఒకేసారి తొలగించడం కన్నా వాటి విస్తరణ కొరకు కృషిచేస్తే మందిది. మొలక వ్యాసాల విస్తరణా కార్యక్రమానికి కృషిచేయదలచిన Viswanadh గారికి అభినందనలు. మొలకల విస్తరణకు నా తోడ్పాటు ఉంటుంది.-- కె.వెంకటరమణచర్చ 00:54, 16 జూన్ 2016 (UTC)

మొలకలపై పనిచేస్తాను, తరువాత మిగిలినవి తొలగించవచ్చుసవరించు

 1. నేను పని చేస్తాను. --రవిచంద్ర (చర్చ) 18:51, 15 జూన్ 2016 (UTC)
 2. కనీసం నేను సృష్టించిన మొలకలనైనా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాను --స్వరలాసిక (చర్చ) 00:45, 16 జూన్ 2016 (UTC)
 3. నేను పని చేస్తాను. -- కె.వెంకటరమణచర్చ 00:54, 16 జూన్ 2016 (UTC)
 4. నేను విస్తరించగలిగే మొలకల పైన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:24, 16 జూన్ 2016 (UTC)

నాకు ఇష్టం లేదు, మొలకలు తొలగించాలిసవరించు

 1. నాకు ఇష్టం లేదు మరియు నేను ఏ పని చేయను. JVRKPRASAD (చర్చ) 17:46, 15 జూన్ 2016 (UTC)
విస్తరణకు అవకాశము లేని మొలకలను తొలిగించ వచ్చు. ప్రస్తుతమున్న మొలకల జాబితాలో మొలక స్థాయి దాటినవి ఉన్నవి. వాటిని గమనించండి. నేను సృష్టించిన మొలకలు కొన్ని వున్నాయి. అవి ముఖ్యంగా సంఖ్యానుగుణ వ్యాసములు. ఉదా: దశదిశలు మొదలగునవి. తొలినాళ్లలొ అవగాహన లోపంతో, అత్యుత్సాహంతో వాటిని వ్రాశాను. ఎవరైనా వాటిని ఇంకా అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువ. కనుక అటువంటి వాటిని తొలిగించ వచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 12:59, 17 జూన్ 2016 (UTC)

మొలకల విస్తరణసవరించు

మొలకల పేజీ

కేవలం మద్దతు మాత్రమే కాక ఇప్పటికే విస్తరణ మొదలుపెట్టిన మిత్రులకు ధన్యవాదాలు, అయితే నాదొక విన్నపం. ఒకరు చేసే వ్యాసంలో మరొకరు మార్పులు చేయకూడదని, ఒకరు చేస్తున్నపుడు మరొకరు చేయకూడదని, ఒక వ్యాసంలో ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు చేయరాదు వంటి విష్యాలు మరిచిపొమ్మని మనవి. ప్రస్తుతం "అ" కారం మొదలెట్టి వాటిలో ఒకరు చేస్తున్నా ఆవ్యాసంలో ఏదో ఒక విభాగం లేదా మొత్తం మార్పు చేయవచ్చు. ఒకరు మెదలెట్టిన దాంట్లో మిగతా వారూ తరువాత మార్పులు చేయవచ్చు. అందరూ అవే వ్యాసాలను తిప్పి తిప్పి మార్పులు చేస్తూ సాధ్యమైనంత విస్తరణ చేయాలని నా మనవి. ఇది కొద్ది రోజులు సమూహంగా కొన్ని వ్యాసాలను అందరూ కలసి చేయడం చేయాలని మిత్రులకు నా మనవి..--Viswanadh (చర్చ) 08:33, 16 జూన్ 2016 (UTC)

మీరన్నట్టే మొలకల పని మొదలు పెట్టాను. నా మొదటి లక్ష్యం కనీస సమాచారం చేర్చడం. నాకు ఇంటరెస్టు ఉంటే ఇంకా పెద్దవిగా కూడా రాస్తాను. ఎవరు ఎలా చేసినా నాకేమీ అభ్యంతరం లేదు. నాకు కావలసిందల్లా వాటి శాతం తగ్గుముఖం పట్టడమే. --రవిచంద్ర (చర్చ) 09:03, 16 జూన్ 2016 (UTC)
మొలక మూస ఉన్న వ్యాసాలలో చాలా వరకు విస్తరించబడినవి ఉన్నాయి. యిదివరకు బాటు ద్వారా వికీపీడియా:మొలకల జాబితా/1.5 ను తయారుచేయడం జరిగినది. రహ్మానుద్దీన్ గారు ఆ పేజీని తాజాకరిస్తే అందులోని మొలకలను కూడా విస్తరించవచ్చు.-- కె.వెంకటరమణచర్చ 14:14, 16 జూన్ 2016 (UTC)
మొలక జాబితాను సుళువాగా చేరుకోవడానికి TOC template చేర్చితే నాకు క అక్షరం నుండి ప్రారంభించాలని వున్నది.--Rajasekhar1961 (చర్చ) 15:13, 16 జూన్ 2016 (UTC)
అలా అయితే అర్జున, రహమాన్ గార్లకు తెలియచేద్దాం.వికీపీడియా:మొలకల జాబితా/1.5 ఎప్పటికప్పుడు తాజాకరిస్తుంది అని రాసారు కనుక అదే లిస్ట్ తీసుకొని విస్తరించుకొంటే సరిపోతుందేమో. Rajasekhar1961 గారు నేను చూస్తున్నపుడు జీవ, వృక్ష జంతు శరీర నిర్మాణ వైద్య శాస్త్ర వ్యాసాలలో మార్పులు చేయలేకపోయా, వాటిపై మీరు కొంత శ్రద్ద తీసుకోగలిగితే కొన్ని మొలకలు తగ్గుతాయి. అలాగే భాస్కరనాయుడు గారు జానపద, పురాతన వాడుక వస్తువులపై రాసిన వ్యాసాలను కూడా కొంత మెరుగుపర్చగలిగితే కొన్ని తగ్గుతాయి.ఇలాంటి వాటిపై మాకు అవగాహన తక్కువ కనుక మార్పులు చేయుట కొంత కష్టం--Viswanadh (చర్చ) 06:04, 17 జూన్ 2016 (UTC)

మొలకల పేజీలో వ్యాసం నుండి మొలక మూసను తొలగిస్తే అక్కడ లిస్ట్ నుండి ఆ వ్యాసం తొలగిపోతున్నది. మిగిలిన మొలకలు మాత్రమే కనిపిస్తున్నవి.కనుక మొలకల పేజీలో నుణ్డి తీసుకొని చేయుట ఉత్తమం అనుకుంటా..--Viswanadh (చర్చ) 06:19, 17 జూన్ 2016 (UTC)

వికీపీడియా:మొలకల జాబితా/1.5 ను తాజాకరిస్తే చాలా వ్యాసాలు 2 కె.బి.కన్నా పెద్దవి జాబితా నుండి పోతాయి. ఎవరైనా ఆ పని చేయగలరా.--Rajasekhar1961 (చర్చ) 13:34, 17 జూన్ 2016 (UTC)
వికీపీడియా:మొలకల జాబితా/1.5 తాజాకరణ అయింది. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:56, 19 జూన్ 2016 (UTC)

మినహాయింపుసవరించు

గ్రామ వ్యాసాల్లా మొలకలుగా ఉన్న తెలుగు అచ్చులు వ్యాసాలను కూడా మినహాయించాలని నా అభిప్రాయం. సభ్యులు స్పందించగలరు..--Viswanadh (చర్చ) 04:57, 20 జూన్ 2016 (UTC)

కొన్ని మొలకలను ఉంచాలనుకొంతే వాటిని అనుభంద వ్యాసాలో విలీనం చేయడం చేయాలని అనుకొని నేను అలా కొన్ని కొత్త వ్యాసాలను సృష్టిస్తున్నాను (ఉదా మానవ సంబంధాలలో కొన్ని వరసలు).తొలగించడం తప్పని సరి అయితే వాటిని ఒకే వ్యాసంగా మార్పు చేద్దాం. సమాచారం అంతా ఒకే వ్యాసంలో లభిస్తుంది.మరొక విషయం ఏమంటే అంత ఇబ్బందిగా ఉన్న సభ్యులు కొత్త వ్యాసాల సృష్టిలోనో మరో పనిలోనో కాక మొలకల విస్తరణలో కృషిచేయుట ద్వారా వాటిని వ్యాసాలుగా మార్పుచేయవచ్చు.--Viswanadh (చర్చ) 06:23, 20 జూన్ 2016 (UTC)
రాజశేఖర్ గారు, నాకు ఈ మధ్య కొన్ని నెలల కాలంలో సరిగా పాలసీ విషయములు తెలిసీ తెలియని వారు నాకు సూచనలు సలహాలు ఇచ్చి అనేక విలువైన నా పని గంటలు ఎంతో వృథా చేసేశారు, ఆ విలువైన సమయము మంచి పనులు చేయుటకు ఉపయోగ పడేది. అందుకే నేను ఈ మధ్యన ఇక్కడ గుంభనంగా, నిగూఢంగా, నేను రచ్చబండలో కాని మరి ఎక్కడైనా కానీ వ్రాసిన పదాలు నిశితంగా పరిశీలించే వారు ఉంటారని అనుకున్నాను. కానీ పైపైన మాటలకు నాకు అనవసర సలహాలు, చర్చలు చేస్తున్నారు. కేవలం మీ నుండి మాత్రమే అడిగిన దానికి సూటిగా సమాధానం వస్తున్నది. దయచేసి మీరు కూడా గమనించారనుకుంటాను. ఈ నా విషయములలో ఇతరులకు సరి అయిన సూచనలు ఇస్తూ, మీ లాంటి వారు నాకు సలహాలు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 06:52, 20 జూన్ 2016 (UTC)
ఇది పాలసీలకు సంభదించినది కాదు. నేను మొలకలు తొలగించుటకు వ్యతిరేకం అంటూ ఇక్కడ చర్చకు తెర తీసాను. వాటిని విస్తరించాలనే ప్రయత్నం. చేయ సాద్యం కాని వాటిని తొలగించాలని నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతున్నాం. తెలుగు అచ్చులు, తెలుగు వికీలో ఉండతగ్గ వ్యాసాలు. అవే తెలుగుకు మూలాధారాలు. అవి మొలకలుగా ఉన్నా అవి ఉండవలసిన అవసరం ఉన్నదని అలా మినహాయింపు కొరకు స్పందించమని విజ్నప్తి చేసాను. కాని ఇది పాలసీ కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే దీనికి పాలసీలకు సంభందం లేదు.ఇక్కడ మీతోపాటుగా చాలా మంది అమూలయమైన సమయం వృదా అయింది, అవుతున్నది.అయితే వారంతా మొదటి దశలో మొలకలపై అవగాహన లేక కొంత, అవసరం అనుకొని కొంత చేసి ఉండవచ్చు. :) --Viswanadh (చర్చ) 08:07, 20 జూన్ 2016 (UTC)
జ్యోతిష శాస్త్ర మొలకలను రాజశేఖర్ గారు విస్తరించే ఉద్దేశ్యంలో ఉన్నారని తెలియక ముందుగా కనీసం ఆయనకు తెలియబరచకుండా అత్యుత్సాహంతో వాటిని తొలగించ బూనటం నా పొరపాటే. రాజశేఖర్ గారి సమయం వృధా చేసినందుకు నేను బాధ పడుతునున్నాను. కానీ నా ఉద్దేశ్యం మాత్రం వాటిని తొలగించాలనే. పెద్దమొత్తంలో వ్యాసాలు రాయదలుచుకుంటే ముందుకు అన్నీ మొలకలు సృష్టించడం నాకు ఇష్టం లేని పని. ఒక్కో వ్యాసం విస్తరించుకుంటూ పోతే బాగుంటుంది. పెద్ద మొత్తంలో మొలకలు సృష్టించేటపుడు ఖచ్చితంగా మనకు ఒక పాలసీ ఉండాలి. అది అందరూ సముదాయ సభ్యులు గమనిస్తే మంచిది.--రవిచంద్ర (చర్చ) 09:21, 20 జూన్ 2016 (UTC)
అసలు రాజశేఖర్ గారు వ్రాశిన స్పందన ఏది ? నాది ఒకటే ఉందేమిటి ? నేను వ్రాసేది ఒకటి అయితే పిచ్చి ఆలోచనలతో సమాధానములు మరొక రకంగా వస్తున్నాయి. నేను ఇక్కడ మొలకల గురించి కాదు రాజశేఖర్ గారికి తెలియజేసింది. సమయం వృథా గురించి నా సమాధానము చెప్పాను. నాతో పిచ్చ చర్చలు చేస్తే చర్చలకు జీవితకాలం చాలదు ఎవరైనా గుర్తుంచుకుంటే మంచిది. మొత్తం వికీలో జరుగుతున్న అవగాహన లేమి గురించి అని తెలుసుకుంటే మంచిది. ఎవరు ఎట్ట్లా ఉంచుకుంటేమి, ఊడబీక్కుంటే నాకేంటీ. నేను ఒకరికి వ్రాస్తే మరొకరికి వేడి వస్తుంది ఎందుకో మరి ? JVRKPRASAD (చర్చ) 13:17, 20 జూన్ 2016 (UTC)
వావ్ వాటే కామిడీ..నాకు నిజ్జంగా నవ్వు వచ్చి ఉన్నది. పగులవడి నవ్వితిని. అయిననూ ఇటూల వ్రాసుకొన్న యెడల నిజముగ పిచ్చి యున్నదని జమకట్టెదరు - హుష్ గప్ చుప్..--Viswanadh (చర్చ) 13:25, 20 జూన్ 2016 (UTC)
నిజంగా పిచ్చోళ్ళూ ఎవరో రాజశేఖర్ గారు వ్రాశిన పేరా బయట పెడితే అసలు పిచ్చోళ్ళందరూ బయట పడతారు. పిచ్చోడు ఎవరో ముందు రవిచంద్రని అడిగితే తెలుస్తుంది. JVRKPRASAD (చర్చ) 13:29, 20 జూన్ 2016 (UTC)
JVRKPRASADగారూ మీరు మరీను. సరదా సరదాగా తీసుకోవాలి గాని అలా నిజ్జం సీరియస్సు అయితే ఎలాగండి..ఇవన్నీ చర్చల్లో చిలిపిరాతలు అంతే--Viswanadh (చర్చ) 13:33, 20 జూన్ 2016 (UTC)
అయ్యా ! ఏ దొంగనాకొడుకు ఈ క్రింద పేరాలను తొలగించాడు. రాజశేఖర్ గారు కాదు, ఇక్కడ వాళ్ళూ కాదు. ఎందుకు ఆ వెధవ తొలగించాడు. (మంచివాళ్ళు అయితే ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వండి, నన్ను మన్నించండి)
===================సవరించు
నేను తెలుగు పంచాంగాన్ని అభివృద్ధిచేద్దామని ఉద్దేశంతో తయారుచేసిన చైత్ర శుద్ధ త్రయోదశి వంటి చాలా వ్యాసాలను తొలగిస్తున్నారు. అన్ని మొలకలను తొలగించాలని నిర్ణయం తెవికీ సమూహం తీసుకొన్నదా. లేదు కదా. రవిచంద్ర గారు వాటిని దయచేసి తిరిగి స్థాపించండి. అలా కాకపోతే రోమన్ సంఖ్యలలో నున్న 1506 వంటి చాలా కాలెండర్ వ్యాసాలను తొలగించాలి.--Rajasekhar1961 (చర్చ) 05:14, 20 జూన్ 2016 (UTC)
విలుంటే వాటి విస్తరణలో సహాయం చేయండి. దయచేసి తొలగించవద్దు. నేను వాటిని తిరిగి స్థాపిస్తున్నాను. కొన్ని గంటలు నా సమయం వృధా చేసుకొని మరీ. (ఈమధ్య తెవికీలో ఇలాంటి పనులే ఎక్కువగా చేయాల్సి వస్తుంది) లేకుంటే మొలకలన్నింటినీ బాటు ద్వారా తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:20, 20 జూన్ 2016 (UTC)
విలుంటే వాటి విస్తరణలో సహాయం చేయండి. దయచేసి తొలగించవద్దు. నేను వాటిని తిరిగి స్థాపిస్తున్నాను. కొన్ని గంటలు నా సమయం వృధా చేసుకొని మరీ. (ఈమధ్య తెవికీలో ఇలాంటి పనులే ఎక్కువగా చేయాల్సి వస్తుంది) లేకుంటే మొలకలన్నింటినీ బాటు ద్వారా తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:20, 20 జూన్ 2016 (UTC)
=============================సవరించు
ఏ దరిద్రుడు ఈ పేరాలను తొలగించాడు. JVRKPRASAD (చర్చ) 13:37, 20 జూన్ 2016 (UTC)
రాజశేఖర్ గారి రాసిన స్పందన, దానికి నేను రాసిన సమాధానం ఆయనే తొలగించారు. ఎందుకో తెలియదు. ఫ్రూఫు కావాలా ఇది చూడండి --రవిచంద్ర (చర్చ) 13:40, 20 జూన్ 2016 (UTC)
ఈ విశ్వనాథ నా మీదెందుకు ప్రతిసారి మీదకు రావడము ఏదో నీతి సూత్రాలు, ఎకసెక్కాలు, రెచ్చగొట్టటాలు, రెచ్చిపోవటాలు, అసలు విషయాన్ని వదలి ఏవేవో సంబంధంలేని చర్చలు, మంటెక్కేదాకా కెలకడం, మంటెక్కి ఏదైనా అంటే దానికి రాద్ధాంతం జీవితాంతం చేయడం, ఇంకా ఇంకా రెచ్చగొట్టడం, ఏమిటి ఈ అబద్ధపు చేష్టలు, ఇలాంటి వారిని అరికట్టలేరా ? లేక ఇలాంటి వారి చేష్టలవల్ల వికీకి ఎంతో ప్రయోజనకరంగా ఉందంటే కొనసాగించడం మీకు మంచిదే, కాని నా లాంటి వారికి కాదు. మనిషికి చదువుతో పాటు అనేకం ఉండాలి అవి చాలమందిలో కొరవడుతున్నాయి మరియు వికీకి ఏమంత శ్రేయస్కరము కాదు. JVRKPRASAD (చర్చ) 13:49, 20 జూన్ 2016 (UTC).

సురేష్ ప్రొడక్షన్స్, సాహిత్య అకాడమీలతో భాగస్వామ్య ప్రతిపాదనలుసవరించు

అందరికీ నమస్తే, సీఐఎస్-ఎ2కె ఏర్పరుచుకునేందుకు ప్రయత్నిస్తున్న భాగస్వామ్యాలు, వాటి ఫలితాలు ఈ క్రింద అందజేస్తున్నాం. వాటిపై స్పందించగలరు.

సురేష్ ప్రొడక్షన్స్సవరించు

సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులోనూ, ఇతర భారతీయ భాషల్లోనూ వందలాది సినిమాలు నిర్మించిన నిర్మాణ సంస్థ. సంస్థతో భాగస్వామ్యం ద్వారా వారి కాపీహక్కుల పరిధిలో ఉన్న సినిమా పోస్టర్లు, వర్కింగ్ స్టిల్స్, సినిమా స్టిల్స్ వంటివి సీసీ-బై-ఎస్ఎ లైసెన్సు ద్వారా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రధానంగా ఈ ఫోటోలు సినిమాల వ్యాసాల్లోకి, సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటివారి వ్యాసాల్లో చేర్చేందుకు ఉపకరిస్తాయి. ఈ భాగస్వామ్యం గురించి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు అందజేయగలరు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:20, 17 జూన్ 2016 (UTC)

అభిప్రాయాలు, సూచనలుసవరించు

మంచిది. వీటి ఆధారంగా చాలా సినిమా వ్యాసాలు సమగ్రంగా తయారవుతాయి. --రవిచంద్ర (చర్చ) 11:11, 17 జూన్ 2016 (UTC)

మంచి వార్త. నేను కూడా ఇందులో పాల్గొంటాను.--Pranayraj1985 (చర్చ) 12:32, 26 జూన్ 2016 (UTC)


కేంద్ర సాహిత్య అకాడమీసవరించు

కేంద్ర సాహిత్య అకాడమీ దక్షిణాసియాలో అత్యధిక ప్రచురణలు చేస్తున్న సంస్థగానే కాక భారతీయ భాషల్లో సాహిత్యాన్ని పురస్కారాలు, ఫెలోషిప్స్, ప్రచురణలు, అనువాదాలు వంటి ఎన్నో ప్రయత్నాలతో అభివృద్ధి చేయ ప్రయత్నిస్తున్న సంస్థగా కూడా ప్రాచుర్యం పొందింది. సంస్థ కార్యదర్శిని సంప్రదించి ఇప్పటి వరకూ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్న రచయితల, కనీసం తెలుగు సాహిత్యం నుంచి అందుకున్న కవి రచయితల, ఫోటోలు, చిన్నపాటి జీవిత చిత్రణ సీసీ-బై-ఎస్ఎలో విడుదల చేయించమని కోరదలిచాం. ఈ భాగస్వామ్యం గురించి సూచనలు, సలహాలు, అభిప్రాయాలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:20, 17 జూన్ 2016 (UTC)

అభిప్రాయాలు, సూచనలుసవరించు

పవన్ గారు, మరికొంత వివరంగా వ్రాసే అవకాశం ఉంటే వ్రాయండి. మాలాంటి వారికి మరికొంత అర్థం అవుతుంది. ఈ ప్రయత్నం మంచిదే అని నా అభిప్రాయం.JVRKPRASAD (చర్చ) 06:56, 20 జూన్ 2016 (UTC)

సూటిగా చెప్పాలంటే కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శితో సీఐఎస్-ఎ2కెకి కలిగిన పరిచయాన్ని పురస్కరించుకుని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలైన రచయితల ఫోటోలు, వారి చిరు జీవిత చరిత్ర సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులో ప్రచురించమని కోరదలిచాం. ఛాయాచిత్రాలు, సమాచారం వారి వ్యాసాలను తేలికగా అభివృద్ధి చేసేలా చేస్తాయి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:17, 22 జూన్ 2016 (UTC)
ధన్యవాదములు JVRKPRASAD (చర్చ) 04:47, 22 జూన్ 2016 (UTC)

Wiki Loves Earth India 2016సవరించు

Greetings from Wikimedia India
Wiki Loves Earth (WLE) is an international photography competition on Wikimedia Commons for use on Wikipedia and other project websites of the Wikimedia Foundation. Wikimedia India is running this competition in India. We are delighted to share our early success, within 15 days we have received more than 15000 images, averaging a thousand images per-day. Some of the images received have helped us improve the picture quality of India’s flora and fauna, which are then being shared on Wikipedia and its sister projects.

India’s natural diversity remains incredible your support and suggestions would help us record images of India’s unique eco-systems. We seek your support to make this event reach new heights. India has a vibrant photography community and we hope to significantly increase Indian Natural heritage related photographs on Commons through this contest campaign.

We seek your community support in spreading awareness about this competition amongst your family and friends who aren’t Wikimedia’s, contribution yourself and at last using images for your respective languages to build Wikipedia and its sister projects richer and exemplified.

Please find more details on this link: Wiki Loves Earth 2016 in India.

For any doubts, please feel free to email us at wikilovesearth2016@gmail.com and you may follow us on Facebook here. -- User:Abhinav619 via MediaWiki message delivery (చర్చ) 11:34, 18 జూన్ 2016 (UTC)

తెలుగు వికీపీడియా నుంచి దిగుమతిసవరించు

తెలుగు వికీపీడియా నుంచి విక్ష్నరీకి కొన్ని పేజీలు దిగుమతి చేయాల్సి వుండగా ప్రత్యేక:దిగుమతి ద్వారా జరగట్లేదు. దిగుమతి పద్ధతిలో చేయగలిగితే ఇక్కడి నుంచి చరిత్ర కూడా దిగుమతి అవుతుంది. అయితే ఇది తెలుగు విక్ష్నరీలో స్థాపితం అయిలేనట్టు చూపిస్తోంది. సముదాయంలో ఈ అంశంపై చర్చించి ఆమోదించుకోగలిగితే స్థాపించుకునేందుకు వీలవుతుంది.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:28, 19 జూన్ 2016 (UTC)

విశ్వనాథ తొలగించిన పేరాకు నాసమాధానంసవరించు

(విశ్వనాథ తొలగించిన పేరాకు నాసమాధానం)

నీతో నేను చేశానా ? నీకు పిచ్చెక్కి ఇలా రాస్తున్నావు. ఎవరితో ఈ రాతలు రాశాను చెప్పు. నీకు నచ్చినట్లు నా వాక్యాలు జత చేస్తున్నావు. నాకు నువ్వెందుకు సలహాలు ఇస్తావు. ఇవ్వవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు నన్ను వ్యక్తిగతంగా దాడిచేస్తున్నావు. ఇంకా ఇతరుల నుండి నీకు అభిప్రాయాలు కావాలి. ముందు నీ గురించి అభిప్రాయాలు అడుగు. నువ్వు అనవసరంగా చాలా రకాలుగా హింస పెట్టావు, పెడుతున్నావు. నువ్వు నీ సంగతి చూసుకో ముందు. నా గురించి నీకెందుకు . నేను ఎవరితో ఇన్నాళ్ళుగా నువ్వు చెప్పి రాసినట్లు నేను మాట్లాడలేదు, ఋజువు చూపమంటే చూపలేదు నువ్వు. నువ్వు నన్ను సహిస్తున్నావా ? అసలు నువ్వు నా గురించి పట్టించుకోకుంటే మంచిది. నువ్వు నీ పని చూసుకుంటే మంచిది. ముందు నిన్నే వెలి వేయాలి. JVRKPRASAD (చర్చ) 14:01, 20 జూన్ 2016 (UTC)

మొలకల అభివృద్ధి నిర్ణయం - తొలగింపు కార్యక్రమాలుసవరించు

ఆయ్యా పై చర్చలలో మొలకలను కొంతకాలం పాటు అభివృద్ధి చేద్దామనే ప్రణాళిక చేసారు. దానికి మద్దతు తీసుకున్నారు. అందరూ కృషిచేయాలన్నారు. దాని ప్రాప్తికి నేను అనేక మొలకలను విస్తరించాను. అటువంటి కృషిచేయకుండా తొలగింపులను ఎందుకు చేస్తున్నారు. కొంతకాలం కొన్ని వ్యాసాలను వృద్ధి చేసిన పిదప అందరూ తొలగింపులపై ఒక నిర్ణయం తీసుకోవాలి. ఒక వ్యాసం తొలగించాలంటె అందులో తొలగింపు మూసను ఉంచాలని మీకు తెలిసిన విషయమే కదా. దానిపై చర్చ జరగాలి. తరువాత తొలగింపు నిర్ణయం చేయాలి. మనం పైన నిర్ణయించిన ప్రకారం వ్యాసాల అభివృద్ధిపై కంటే తొలగింపులపై ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారో తెలియజేయగలరు. ఒకవేళ చిన్న వ్యాసాలున్నచో వాటిని సరైన వ్యాసాలలో విలీనం చేయవలసి ఉంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి వ్యాసం సంగ్రహంగా మొలకగా ఉండి విస్తరించడానికి ఏ విధమైన వనరులు లేవనుకుందాం. దానిని అతడి స్వగ్రామం వ్యాసంలో ఒక విభాగంగా విలీనం చేయవచ్చు. ఎటువంటి చర్చలు లేకుండా తొలగింపులు చేయడం మంచిది కాదని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణచర్చ 14:52, 20 జూన్ 2016 (UTC)
తొలగింపు చేసేవి ఏక వాఖ్య వ్యాసాలు వాటిని ఒకే వ్యాసంలో పొందుపరచుచున్నాను. ఇలా (సమాచార లభ్యత లేని కొందరు రచయితలు)వాటిని ఏమేరకు విస్తరించాలన్నా కొంత గూగుల్లోనో మరే విధంగానో వెదికి దొరకపోతే ఆపై వాటిని తొలగిస్తున్నాను. వ్యాసంలో ఉన్న ఒకటి రెండు లైన్లు ఎలాగూ ఇక్కడే ఉన్నాయి మీకు గాని మరెవరికి గాని ఎక్కువ సమాచారం దొరికితే వాటిని మీరు పునస్థాపించవచ్చు. కొన్ని వ్యాసాలను విస్తరించే అవకాశం ఉన్నదిగా అనిపిస్తే వాటిని వదిలేస్తున్నాను. తరువాత వాటి సంగతి చూడవచ్చు అని.అలాంటి కొన్ని వదిలేసి ముందు తొలగిస్తున్న వ్యాసాలు ఎక్కువగా ఉన్నయని మీరనుకోవడం జరిగింది.నేననుకొన్న కారణం మొలకల్లో తక్కువ మొలకలు ఉంటే వాటి విస్తరణ సులభతరంగా ఉంటుంది అని. అలాక్కాక అన్ని వ్యాసాలలో మూసలు అంటించమంటే నాకూ సరదానే, మార్పుల సంఖ్య పెంచుకోవచ్చు..--Viswanadh (చర్చ) 15:34, 20 జూన్ 2016 (UTC)
సమాచార లభ్యత లేని ప్రముఖుల వ్యాసాలను వారి స్వగ్రామంలో ఒక విభాగంగా చేర్చితే బాగుంటుంది.-- కె.వెంకటరమణచర్చ 15:42, 20 జూన్ 2016 (UTC)

ఈబాంబ్ కూడా తుస్సుమన్నది అనిపిస్తున్నది - పైన జరిగిన చర్చల వలన- అది వికీపీడియా గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదేమో అని. ఎప్పుడో ఉన్నట్టుగా కలిసి చేద్దాం, కలగలిపి చేద్దాం లా ఇప్పుడు పరిస్థితి ఉండాలనుకోవడం అత్యాసే అవుతుంది. నేను అనేక విలువైన ఫొటోలను అప్లోడ్ చేసాను, వాటిలో అనేకం డిలేట్ అయ్యాయి. మరికొన్ని మార్పులు చేసాక మరొకరు అప్లోడ్ చేసారు. అలాంటి వాటిపై అప్పట్లో, లేదా ఇప్పట్లో నాకు స్పందించాలి అనిపించలేదు. అది ఎవరు చేసినా ఒకటే వికీమెరుగు కొరకు అనిపించేది - పైన చర్చలు మొలెట్టినపుడు నేను ఇచ్చిన లైన్లు ఇస్తున్నాను

నాదొక విన్నపం. ఒకరు చేసే వ్యాసంలో మరొకరు మార్పులు చేయకూడదని, ఒకరు చేస్తున్నపుడు మరొకరు చేయకూడదని, ఒక వ్యాసంలో ఒకే సమయంలో ఇద్దరు ముగ్గురు చేయరాదు వంటి విష్యాలు మరిచిపొమ్మని మనవి. ప్రస్తుతం "అ" కారం మొదలెట్టి వాటిలో ఒకరు చేస్తున్నా ఆవ్యాసంలో ఏదో ఒక విభాగం లేదా మొత్తం మార్పు చేయవచ్చు. ఒకరు మెదలెట్టిన దాంట్లో మిగతా వారూ తరువాత మార్పులు చేయవచ్చు. అందరూ అవే వ్యాసాలను తిప్పి తిప్పి మార్పులు చేస్తూ సాధ్యమైనంత విస్తరణ చేయాలని నా మనవి. ఇది కొద్ది రోజులు సమూహంగా కొన్ని వ్యాసాలను అందరూ కలసి చేయడం చేయాలని మిత్రులకు నా మనవి"

ఇలా రాసాను, కాని ఎవరు చేస్తున్నారు. ఒకరిద్దరు తప్ప. సమూహంగా కలిసి చేసేవి కేవలం చర్చలే తప్ప మార్పులు కాదు. అలా ఆశించి నేను ఇబ్బంది పడటం తప్ప మరేం జరగదు అనిపిస్తుంది. మిగతా వారిలా ఏదో ఒక విభాగాన్ని పట్టుకొనో లేక చిన్న మార్పులో, లేక కాపీపేస్టులో చెసుకొంటే లక్షల మార్పులు చేసాం అని చెప్పుకోవచ్చు..గొప్పగా.. --Viswanadh (చర్చ) 15:49, 20 జూన్ 2016 (UTC)

అయ్యా , వికీపీడియాలో వ్యాసాలు వ్రాసేవారెందరున్నారు? ఉత్సాహంగా పనిచేసేవారెందరు? కొందరైనా వ్యాసాలను అభివృద్ధి చేస్తున్నారు కదా. ఎవరు చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఒకరిద్దరు కొంత కృషిచేస్తే కొన్ని వ్యాసాలు అభివృద్ధి చెందవా! సమూహంగా అంటే ఒకే వ్యాసంలో అందరూ పనిచేయాలా? ప్రతి ఒక్కరూ కొన్ని వీలైనన్ని వ్యాసాలను అభివృద్ధి చేయవచ్చు కదా. ఒక ప్రతిపాదన చేసి దాని ఫలితం వెంటనే పొందాలనుకోవడం పొరపాటు. కొంతకాలం వేచి చూడాలి. మీరు పైన కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి వ్యాసానికి అంతర్జాలంలో సమాచారం లేని కారణంగా తొలగించారని తెలిపారు. ఇపుడు ఆ వ్యాసాన్ని నేను పునఃస్థాపించి మొలక స్థాయి దాటించలేదా. కనుక అందరూ కొన్ని మొలకలనైనా అభివృద్ధి చేయడానికి కృషిచేయాలని మనవి.-- కె.వెంకటరమణచర్చ 16:35, 20 జూన్ 2016 (UTC)

అయ్యా మీరు చివరన చెప్పిన ముక్కలే నేను ముందు నుండి చెప్తున్నాను. మీరు నేను ఒకరికొకరు చెప్పుకొని చెయ్యాలి తప్ప మరెవరు వస్తారు. ఇలా చర్చుంచుకొంటే కనీసం ఇలా చూసి అయినా మీరన్న ట్టు కొన్ని మొలకలు అవుతాయని నా తాపత్రయం. .వెంటనే ఫలితం రాకపోతే ఇక్కడ మరొక ప్రతిపాధన వస్తుంది. మళ్ళీ దానికి చర్చలు అంతే తప్ప వీటిపైనే నెలల తరబడి ఎవరు చేస్తారు..--Viswanadh (చర్చ) 16:57, 20 జూన్ 2016 (UTC)

విశ్వనాథ్ గారూ, నిరాశ వద్దు. వెంకట రమణ గారూ తొందరపాటేం లేదు. కృషి చేయకుండా మొలకలు తొలగించట్లేదు. విశ్వనాథ్ గారు సమాచారం లభ్యత లేనివాటినే వేరే వాటితో విలీనం చేసి మరీ తొలగించారు. నేను కొన్ని వ్యాసాలు విస్తరించి కూడా కొన్ని వ్యాసాలు (జ్యోతిషశాస్త్ర వ్యాసాలు) తొలిగించాను. అయిందేదో అయ్యింది. ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకుందాం. తొలగించదలుచుకున్న వ్యాసాలకు తొలగింపు మూస పెట్టి ఒక వారం లేదా నెల ఎదురు చూద్దాం. ఎవరూ వచ్చి ఆ మూస తొలగించి విస్తరించకుండా ఉంటే లేకపోతే ఎవరూ స్పందించకుండా ఉంటే మాత్రమే వాటిని తొలగిద్దాం. ఎవరైనా వచ్చి నేను ఎప్పుడో ఒకప్పుడు ఈ వ్యాసం అభివృద్ధి చేస్తామన్నా దానిని అలాగే వదిలేద్దాం. ఇవన్నీ ఏక వాక్యం లేదా రెండు మూడు వాక్య వ్యాసాలకే సుమా. ఏమంటారు?--రవిచంద్ర (చర్చ) 17:03, 20 జూన్ 2016 (UTC)
ఏక వాక్య వ్యాసాలకు {{చాలా కొద్ది సమాచారం}} మూసను చేర్చండి. ఒక వారం వ్యవథిలో ఎవరైనా విస్తరిస్తే మందిదే. ఏ విధమైన చర్చలు, స్పందనలు లేనప్పుడు తొలగించవచ్చు. సమాచారం కొంచెం ఎక్కువ స్థాయి 1కె.బి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దానిని మొలక స్థాయి దాటించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.-- కె.వెంకటరమణచర్చ 17:14, 20 జూన్ 2016 (UTC)
నేను లెక్కపెట్టలేదు కాని కనీసం 100 మొలకలు పొడిగించి ఉంటాను. నేను ఒక పక్కనుండి వాటిని "నరుక్కు వస్తూ ఉంటే" అవి ఆంజనేయుడి తోకలా పెరుగుతున్నాయి. చివరికి మొలకలని పొడిగించడం అనేది అంతూ, దరీ లేని వ్యాపకంలా అనిపించి ప్రత్యేకించి ఆ పని చేయడం మానుకున్నాను; అవసరం వెంబడి చేస్తున్నాను, అంతే! Vemurione (చర్చ) 17:08, 21 జూన్ 2016 (UTC)
మొలకలను పూర్తిగా లేకుండా చేయడం కానిపని. ఎందుకంటే పాతవి తొలగించినా/ అభివృద్ధి చేసినా కొత్తవి పుట్టుకొస్తుంటాయి.--Rajasekhar1961 (చర్చ) 04:10, 26 జూన్ 2016 (UTC)

WikiConference India 2016 - Call for papers/abstractsసవరించు

Hello,
Here is an important update from WikiConference India 2016. The call for abstracts/proposals for WikiConference India opens today. If you are interested to submit your paper, please do so. To know more details please check this page. If you have question(s), please ask us here. Thanks and regards. -- WikiConference India 2016 organizing team sent using MediaWiki message delivery (చర్చ) 18:49, 22 జూన్ 2016 (UTC)

జూన్ నెల సమావేశం అనిశ్చితిసవరించు

అందరికీ నమస్కారం,
నెలవారీ సమావేశాల్లో జూన్ 2016 నెలవారీ సమావేశం నిర్వహణ విషయమై నిర్వహణాపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ నెలలో కొన్నిమార్లు ప్రణయ్ రాజ్ తో ఈ అంశాన్ని చర్చించగా ఆయన తనకు కుదరకపోవడంతో గోల్డెన్ థ్రెషోల్డ్ వేదికగా ఈ నెల సమావేశ నిర్వహణ సాధ్యపడకపోవచ్చని తెలియజేశారు. మనకున్న మరో వేదిక ఎన్టీఆర్ ట్రస్టు విషయమై సభ్యులు గతంలో బాగా దూరమౌతున్నందున వీలుకాదని రచ్చబండలో రాశారు. ఈ నేపథ్యంలో వచ్చేనెల మొదటి వారంలోనే నిర్వహించుకునేలా ప్రణాళిక వేసుకుంటే ఎలావుంటుంది, తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 15:00, 25 జూన్ 2016 (UTC)

జూలై నెల మొదటివారం నిర్వహిద్దాము. అప్పటికి ప్రణయ్ రాజ్ ఇటలీ నుండి తిరిగివస్తాడు. ఆ విశేషాలు వికీసోర్స్ కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చిద్దాము.--Rajasekhar1961 (చర్చ) 04:08, 26 జూన్ 2016 (UTC)
జూన్ 2016 నెలవారీ సమావేశం నిర్వహణ విషయమై పవన్ సంతోష్ నాతో చర్చించారు. అయితే నేను వికీమేనియా కోసం ఇటలీ వెలుతుండడంవల్ల నేను నిర్వహించలేనని చెప్పాను. దాంతో పవన్ వేదిక ఎన్టీఆర్ ట్రస్టులో నిర్వహించడంపై సభ్యులతో చర్చిస్తానని చెప్పారు. Rajasekhar1961 గారు చెప్పినట్టు జూలై నెల మొదటివారం నిర్వహించుకోవచ్చు. --Pranayraj1985 (చర్చ) 12:23, 26 జూన్ 2016 (UTC)

విశ్వనాథ్ తొలగించిన పేరాకు నాసమాధానంసవరించు

మొదటి భాగముసవరించు

"విశ్వనాథ తొలగించిన పేరాకు నాసమాధానం" అంటూ వాడుకరి:JVRKPRASAD రాసిన విభాగాన్ని తొలగించాలి. కొత్త సభ్యులు, లేక తదుపరి పాత చర్చలను చూసేవారు దీనిని చదివి నేను తప్పుగా వ్రాస్తానని అనుకొనే అవకాశం ఉంది. ఎవరు తొలగించారో తెలుసుకోకుండా నాపేరుతో ఇలాంటి రాతలు రాసిన వాడుకరి:JVRKPRASAD యొక్క మానసిక స్థితిని అర్ధం చేసుకొని నేను క్షమించగలను కాని, ఆ రాతలు అలాగే ఉండకూడదు. దానితో పాటు వీటినీ తొలగించాలని నా మనవి..--Viswanadh (చర్చ) 03:36, 26 జూన్ 2016 (UTC)

దేనికి తొలగించాలి బాబు. నువ్వు వ్రాసిన పేరా నేనే అతికిస్తాను. నువ్వు ఏమి వ్రాసావో నీకు తెలియదా ? నువ్వు చాలా తప్పులు వ్రాసావు, చేస్తున్నావు. నువ్వు రాసిన తొలగించిన పేరాకు నా సమాధానము వ్రాసాను కానీ నువ్వు ఇక్కడ నీ వంకర బుద్దితో వేరే దానికి వ్రాసాను అంటున్నావు. నువ్వు నన్ను తప్పుపట్టి, క్షమించగలను అంటావా ? నిన్ను వదిలే సమస్య లేదు. నాలోని తప్పుని చూపటానికి నీ జీవితం చాలదు. నువ్వు ముందు నీ తప్పులు అన్నీ ఒప్పుకో. ముందు నీ పిచ్చి తగ్గించుకో. నువ్వు ఒక పిచ్చోడివి. నీ మానసిక స్థితి బాగోలేదు, పిచ్చివాడివి కాబట్టి ఇలాంటి వ్రాతలు వ్రాస్తున్నావు. నీలాంటి వాడు రాతలు ఎందుకు ఇంకా రాయాలనుకుంటున్నాడు. తొలగించే సమస్యే లేదు. ఎవడికి పిచ్చో తేలాలి . నీ ఉడుత ఊపులు ఇక్కడ ఊపకు మరో చోట చూసుకో, నువ్వు చెప్పినట్ట్లు నీ వాళ్ళే వినరు, ఇక్కడ మాలాంటి వారిని ఏం ఉద్దరించాలనుకుంటావు ? మా దగ్గర నువ్వు ఎలాగూ నేర్చుకోవు, జీవితంలో అసలు నీకు బాగుపడాలన్న ఉద్దేశ్యం లేదేమో. అందుకే ఈ పిచ్చిరాతలు రాస్తున్నావు. నీలాంటి వారికి ఇంకా సమాధానం ఇస్తున్నాను.JVRKPRASAD (చర్చ) 03:46, 26 జూన్ 2016 (UTC)
అందుకే మీ మానసిక స్థితి బాలేదు అన్నది. తొలగించినది ఎవరో వాడుకరి:రవిచంద్ర పైన పేర్కొన్నాడు. వాడుకరి:Rajasekhar1961 గారు వ్రాసినవి ఆయన తొలగించుకొంటే మద్యలో దూరి అర్ధం పర్ధం లేకుండా కంగాళీ రాతలు రాసినది మీరు. పెడర్ధాలు ద్వందార్ధాలతో రచ్చబండను చచ్చుబండలా మారుస్తున్నది మీరే. రచ్చబండలో అర్ధవంతమైన చర్చలకు బదులు మీ తిట్లు శాపనార్ధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మిగతా సభ్యులు కూడా దీనిని అంత సీరియస్‌గా తీసుకోకపోవడం వలన మీరు సింహాసనం మీద కూర్చున్నట్టుగా భావిస్తున్నారు. రచ్చబండను అందరూ చూస్తారు కనుక కొంత అందంగా ఉండాలని పైన చర్చలను తొలగించమని అడిగాను..అంతే. --Viswanadh (చర్చ) 05:58, 26 జూన్ 2016 (UTC)
నువ్వు బుర్ర చెడి మాట్లాడుతున్నావు. పిచ్చోడిలా రాస్తున్నావు. అసలు జరిగినది నీకు ఏం తెలుసు ? వరుసగా వ్రాస్తాను, ఏ మాత్రం నీకు బుద్ది ఉంటే వేరే వాళ్ళచేత చదివించుకో.
 • రాజశేఖర్ గారు ముందు వ్రాశారు.
 • నేను సమాధానము వ్రాశాను.
 • రాజశేఖర్ గారు వ్రాసింది తొలగించ బడ్డది.
 • కానీ నేను వ్రాశినది అలాగే ఉంది.
 • నువ్వు తెలియక నీ సమాధానము నా దానికి వ్రాశావు.
 • ఈలోగా రవిచంద్ర ఎవరు తొలగించారో స్పష్టం చేయడం జరిగింది.
 • నువ్వు అతిగా స్పందించావు.
 • నేను ఎవరినీ ఏ పేరు పెట్టి వ్రాయక పోయినా నువ్వు నేను వాడుకరులను దూషించానని అన్నావు.
 • నా మీద నీ దరిద్రపు ఆలోచనలతో నీకు తోచిన ఒకే ఒక పద్దతి అందరి అభిప్రాయాల కోసం నా మీద లేనిపోని నిందలు, బురద జల్లడం చేశావు.
 • నేను నా స్పందన వ్రాశాను, నిన్ని ముందు వెలి వేయాలి అని.
 • ఈ లోగా నీవు వ్రాశిన పేరా నువ్వే తొలగించు కున్నావు.
 • నేను వ్రాశిన పేరాకు తిరిగి ఈ రోజు వారం తరువాత మళ్ళీ ఏదో మెదలు పెట్టి సంబంధం లేకుండా వ్రాస్తున్నావు.
 • నేను వ్రాశినది నీ పేరాకు సమాధానం. ఆ పేరా ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

@@@@@@@@@@@@@@

== వికీలో సహ సభ్యులపై అసభ్య అభ్యంతరకర రాతలు == ::

అయ్యా ఇటీవల వాడుకరి:‎JVRKPRASAD గారు శ్రుతి మించి అసభ్య పదజాలంతో తొటి సభ్యులతో చర్చలు చేస్తున్నారు. వయసు రీత్యా, లేదా అనుభవం అని కొంత వరకూ ఆయన్ను సహిస్తూ వస్తున్నా అది చెడు పరిణామాలకు దారితీస్తున్నట్టుగా తొస్తున్నది. దీనిపై సహ సభ్యులు స్పందించి మీ అభిప్రాయాలు రాస్తే దానిపై ఒక నిర్నయం తీసుకోవచ్చు. ఆయన ప్రవర్తన ఇలాగే కొనసాగాలా లేక ఏదైనా చర్య తీసుకోవాలా అనేది నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను..--Viswanadh (చర్చ) 13:49, 20 జూన్ 2016 (UTC) @@@@@@@@@@@@@@@@@@@@@@@@

 • నేను మనిషి మనిషికి నా నిజ జీవిత పద్ధతులు మార్చుకోను. నేను ఎప్పుడూ అంతర్జాలంలో అయినా, నిజ జీవితంలో అయినా ఒకేలా ఉంటాను. నువ్వు చెప్పే ఆ బోడి సింహాసనం ఏమిటో, ఏదో అది నువ్వే ఉంచుకో. నీకు అర్థం అయ్యింది అంతే.
 • నువ్వు ఎంత తప్పుడు రాతలు వ్రాసినా అవి నిజం కావు. నీవే కంగాళీ వ్రాతలు. నువ్వే ఒకసారి సీరియస్ అంటావు తరువాత ఎకసెక్కాలు అంటావు.నీలాంటి వాడికి సమాధానాలు అలాగే ఉంటాయి. నువ్వు ఇక్కడ నన్ను ఏదో చేయాలనుకోవడం నీ భ్రమ. నాలోని తప్పుల్ని పట్టడం నీ జీవితం సరిపోదు. నువ్వు ఇక్కడ ఒక హీరో అనుకోకు. ఇది ఒక వ్యాపకం మాత్రమే. నీ వల్ల ఇక్కడ నేను చేయవలసిన పనులు మొత్తం మూలనపడ్డాయి. నువ్వు మానసిక హింస పెడుతున్నావు. నీకు బుద్ది చెప్పేవారు కరువయ్యారు. అందుకే పేట్రేగి పోతున్నావు. సమాజంలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న నన్ను వ్యక్తిగతంగా నామీద ఎటువంటి మానసిక హింస రాతలు వ్రాసినా నీ మీద ఖచ్చితంగా తీవ్రమైన విషయముగా పరిగణించి కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నీకు చేతనయితే ఇక్కడ కాదు నిజజీవితంలోకి రా. ఈ దొంగచాటు వ్యవహారాలు ఎందుకు ? JVRKPRASAD (చర్చ) 06:14, 26 జూన్ 2016 (UTC)
తెలుగు వికీలో ప్రస్తుతం అర్థవంతమైన, వ్యాసాలకు సంబంధించిన చర్చల కన్నా ఇటువంటి వ్యక్తిగత దూషణకు ఎక్కువైపోయాయి. ఈ వ్యవహారం చాలా బాధాకరం. వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు. దయచేసి వికీపీడియా:వ్యక్తిగత దాడులు కూడదు చదవండి.-- కె.వెంకటరమణచర్చ 06:21, 26 జూన్ 2016 (UTC)
వికీపీడియా సంపాదకులు అనేక ప్రాంతాలకు, అనేక దేశాలకు చెందినవారు. ప్రతి ఒక్కరికీ విభిన్న ఆలోచనా ధోరణులు, భిన్న అభిప్రాయాలు, దృష్టికోణాలు ఉండవచ్చు. ఇతర సంపాదకులను, సభ్యులను గౌరవించడము, ఆదరించడం, కలసికట్టుగా సమన్వయముగా తెలుగులో ఇలాంటి మహోన్నత విజ్ఞాన సర్వస్వము రూపొందించుటకు ఒక కీలకాంశము. వికీపీడియా:వికీ సాంప్రదాయం వ్యాసం చదవండి.-- కె.వెంకటరమణచర్చ 06:23, 26 జూన్ 2016 (UTC)
పరిణితి చెందిన వికీపీడియన్లు, కొత్త వాడుకరులకు వికీనియమాలూ చెప్పవలసినవాళ్ళు, కొత్తవారు యిలా దూషించుకుంటుంటే వాళ్ళకు సరియైన మార్గంలో పెట్టవలసిన గౌరవ సభ్యులు యిలా దూషణలకు దిగకుండా వికీ అభివృద్ధి కోసం కృషిచేయాలని మనవి.-- కె.వెంకటరమణచర్చ 06:25, 26 జూన్ 2016 (UTC)
కె.వెంకటరమణ గారు, వ్యక్తిగత దాడులు చేసేవారికి మంచిగా చెబితే ఎందుకు వింటారండీ ! వాళ్ళు పని చేయరు. పనిచేసే వాళ్ళ బుర్ర చెడగొడతారు మరియు తిరిగి మాలాంటి వాళ్ళదే తప్పు అంటారు. ఇది ఏమైనా వ్యాపారమా ? ఉద్యోగమా ? ఏమైనా లాభం ఉందా ? ఇక్కడా పనిచేస్తే వ్యక్తిగతంగా ఏమి లాభం ఉంది ? ఏమీ లేకపోగా, ఇలాంటి పనికిరాని వాళ్ళు మానసిక హింస దాడులు. నా పని నేను చేసుకుంటున్నాను, ఎవడో వాడికి ఏమి అవసరం నామీద పనిగట్టుకొని వచ్చి దాడి చేయడం అవసరమా ? అలా ఉంది ఇప్పుడు నాకు ఒక వాడుకరి పెడుతున్న సమస్య. ఇది ఏమాత్రం సహించరానిది, భరించరానిది, ఉపేక్షించరానిది, నా విషయంలో నేను అంత తేలికగా ఊరుకోనండి. ఇక్కడ ఇలాంటి సమస్యలు తేలవు.JVRKPRASAD (చర్చ) 06:29, 26 జూన్ 2016 (UTC)
ఇతర సహచర సభ్యులపై అనవసరంగా రెచ్చగొట్టే వ్యక్తిగత దూషణలకు దిగటం మంచిదికాదు.ఇటువంటి వాటిపై ఇతర సభ్యులు అందరు స్పదించి ఖండించవలసిన అవసరం ఎంతైన ఉన్నది.Palagiri (చర్చ) 06:33, 26 జూన్ 2016 (UTC)
Palagiri గారు, చదువుకున్న వాళ్ళకి సంస్కారములు ఉండటము లేదండి. మొదటి నుండి దయచేసి మీకు వీలయితే చూడండి. మనలాంటి వారిని ఒక చిన్నమాట అన్నా భరించడం చాలా కష్టం. నిజ జీవితంలో కూడా ఒక మాట నన్ను అనాలన్నా ఎవరూ సాహసించరు. నిజ జీవితంతో పోలిస్తే మనము అన్ని విషయములలో అందనంత ఎత్తులో ఉంటాము. తదుపరి వివరంగా వ్రాస్తాను. ధన్యవాదములు.--JVRKPRASAD (చర్చ) 06:38, 26 జూన్ 2016 (UTC)

Palagiri, కె.వెంకటరమణ గార్లకు స్పందించినందులకు ధన్యవాదాలు. నేను పైన కోరినది రచ్చబండలో ఉన్న కొన్ని అభ్యంతరకరమైన లేదా నన్నువ్యక్తిగతంగా మిగతా వారికి చెడుగా చూపించేవిగా ఉన్న రాతలను తొలగించుట ద్వారా కొత్త సభ్యులకు రచ్చబండపై మంచి అభిప్రాయం కలగగలదని. తద్వారా రచ్చబండలో మంచి చర్చలను చేయమని....కాని ఇక్కడ నడుస్తున్న రాతలు నాకు కొద్దిగా తికమకగా ఉన్నాయి. మీరు అనేది కూడా అర్ధం కావడం లేదు. నేను వ్యక్తిగత దూషణలను చేస్తే, ఎవరిపై చేసానో తెలియచేస్తే వారిని క్షమించమని అడుగుతాను. అంతే కాదు వికీ నుండి కూడా సెలవు తీసుకుంటాను...దయచేసి తెలియచేయగలరు......(ప్రసాద్ గారిప్రవర్తన పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సభ్యులను అడిగి, మళ్ళీ తొందరపాటు తగదని దానిని వెంటనే తొలగించాను..దానికి ఆయన స్పందన, ఆపై సభ్యుల స్పందన చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది) --Viswanadh (చర్చ) 07:20, 26 జూన్ 2016 (UTC)

మీరన్నట్లు రచ్చబండలో చర్చలలో దూషణలు, తిట్లు చూస్తే తెవికీలో కొత్త సభ్యులకు వికీలో చర్చలు అంటే వ్యక్తిగత దూషణలుగా సాగుతాయని అనిపించేలా ఉంది. పైన గల చర్చలలో రాజశేఖర్ గారు తాను వ్రాసి ఎందుకో తానే తొలగించారు. ఆ మార్పు ఎవరు చేసారో కొత్తగా వికీలో చేరిన సభ్యునికి తెలియక పోవచ్చు. కానీ అనుభవమున్న సభ్యులలు తెలియదా. దానికి "ఏ దొంగనాకొడుకు ఈ క్రింద పేరాలను తొలగించాడు", "ఏ దరిద్రుడు ఈ పేరాలను తొలగించాడు" అనే వాక్యాలతో అడిగితేనే గౌరవంగా ఉంటుందా? ఒకవేళ తెలుసుకోలేకపోతే మామూలుగా రచ్చబండలో అడిగితే ఎవరూ చెప్పరా? ఆ పనిచేసేవారు ఎవరో నిర్వాహకులుగా తెలుసుకోలేమా. అందుకోసం పరుష పదాలను వాడాలా? మన భాషను మార్చుకోవాలని మనవి. విశ్వనాథ్ గారు ఒక ప్రతిపాదన చేసి తొందర తగదని తానే తొలగించు కున్నాడు. దానిలో తప్పేముంది. దీనికి ఇంత చర్చ అవసరమా అనిపిస్తుంది. చర్చలలో వ్యక్తిగత దూషణలు ఉండరాదని కోరుకుంటున్నాను.-- కె.వెంకటరమణచర్చ 08:05, 26 జూన్ 2016 (UTC)

రెండవ భాగముసవరించు

కె.వెంకటరమణ గారు, మీరు మొత్తం విషయాన్ని చాలా తప్పుగా తీర్చి దిద్దుతున్నారు. నన్ను విశ్వనాథ్ దూషించిన తదుపరి, నేను "ఏ దొంగ." ఈ వాక్యము వ్రాయుట జరిగినదని గమనించినట్లు లేదు. నన్ను తిడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా ? మీకు అర్థమయినది, నాది తప్పని చెప్పటానికి మీ ప్రయత్నానికి మిక్కిలి ధన్యవాదములు. జరిగిన చర్చలు వరుసగా పెడతాను చదవండి.:

(1)రాజశేఖర్ గారి పేరా:

    నేను తెలుగు పంచాంగాన్ని అభివృద్ధిచేద్దామని ఉద్దేశంతో తయారుచేసిన చైత్ర శుద్ధ త్రయోదశి వంటి చాలా వ్యాసాలను తొలగిస్తున్నారు. అన్ని మొలకలను తొలగించాలని నిర్ణయం తెవికీ సమూహం తీసుకొన్నదా. లేదు కదా. రవిచంద్ర గారు వాటిని దయచేసి తిరిగి స్థాపించండి. అలా కాకపోతే రోమన్ సంఖ్యలలో నున్న 1506 వంటి చాలా కాలెండర్ వ్యాసాలను తొలగించాలి.--Rajasekhar1961 (చర్చ) 05:14, 20 జూన్ 2016 (UTC)
    విలుంటే వాటి విస్తరణలో సహాయం చేయండి. దయచేసి తొలగించవద్దు. నేను వాటిని తిరిగి స్థాపిస్తున్నాను. కొన్ని గంటలు నా సమయం వృధా చేసుకొని మరీ. (ఈమధ్య తెవికీలో ఇలాంటి పనులే ఎక్కువగా చేయాల్సి వస్తుంది) లేకుంటే మొలకలన్నింటినీ బాటు ద్వారా తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:20, 20 జూన్ 2016 (UTC)
    విలుంటే వాటి విస్తరణలో సహాయం చేయండి. దయచేసి తొలగించవద్దు. నేను వాటిని తిరిగి స్థాపిస్తున్నాను. కొన్ని గంటలు నా సమయం వృధా చేసుకొని మరీ. (ఈమధ్య తెవికీలో ఇలాంటి పనులే ఎక్కువగా చేయాల్సి వస్తుంది) లేకుంటే మొలకలన్నింటినీ బాటు ద్వారా తొలగించేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:20, 20 జూన్ 2016 (UTC)

(2) నా సమాధానం: రాజశేఖర్ గారు, నాకు ఈ మధ్య కొన్ని నెలల కాలంలో సరిగా పాలసీ విషయములు తెలిసీ తెలియని వారు నాకు సూచనలు సలహాలు ఇచ్చి అనేక విలువైన నా పని గంటలు ఎంతో వృథా చేసేశారు, ఆ విలువైన సమయము మంచి పనులు చేయుటకు ఉపయోగ పడేది. అందుకే నేను ఈ మధ్యన ఇక్కడ గుంభనంగా, నిగూఢంగా, నేను రచ్చబండలో కాని మరి ఎక్కడైనా కానీ వ్రాసిన పదాలు నిశితంగా పరిశీలించే వారు ఉంటారని అనుకున్నాను. కానీ పైపైన మాటలకు నాకు అనవసర సలహాలు, చర్చలు చేస్తున్నారు. కేవలం మీ నుండి మాత్రమే అడిగిన దానికి సూటిగా సమాధానం వస్తున్నది. దయచేసి మీరు కూడా గమనించారనుకుంటాను. ఈ నా విషయములలో ఇతరులకు సరి అయిన సూచనలు ఇస్తూ, మీ లాంటి వారు నాకు సలహాలు ఇవ్వవలసినదిగా కోరుతున్నాను. ధన్యవాదములు.JVRKPRASAD (చర్చ) 06:52, 20 జూన్ 2016 (UTC)

(3) విశ్వనాథ్ నాకు ఇచ్చిన సమాధానం: ఇది పాలసీలకు సంభదించినది కాదు. నేను మొలకలు తొలగించుటకు వ్యతిరేకం అంటూ ఇక్కడ చర్చకు తెర తీసాను. వాటిని విస్తరించాలనే ప్రయత్నం. చేయ సాద్యం కాని వాటిని తొలగించాలని నిర్ణయం తీసుకొని ముందుకు వెళుతున్నాం. తెలుగు అచ్చులు, తెలుగు వికీలో ఉండతగ్గ వ్యాసాలు. అవే తెలుగుకు మూలాధారాలు. అవి మొలకలుగా ఉన్నా అవి ఉండవలసిన అవసరం ఉన్నదని అలా మినహాయింపు కొరకు స్పందించమని విజ్నప్తి చేసాను. కాని ఇది పాలసీ కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే దీనికి పాలసీలకు సంభందం లేదు.ఇక్కడ మీతోపాటుగా చాలా మంది అమూలయమైన సమయం వృదా అయింది, అవుతున్నది.అయితే వారంతా మొదటి దశలో మొలకలపై అవగాహన లేక కొంత, అవసరం అనుకొని కొంత చేసి ఉండవచ్చు. :) --Viswanadh (చర్చ) 08:07, 20 జూన్ 2016 (UTC)

(4) విశ్వనాథ్ కు నేను ఇచ్చిన సమాధానం: అసలు రాజశేఖర్ గారు వ్రాశిన స్పందన ఏది ? నాది ఒకటే ఉందేమిటి ? నేను వ్రాసేది ఒకటి అయితే పిచ్చి ఆలోచనలతో సమాధానములు మరొక రకంగా వస్తున్నాయి. నేను ఇక్కడ మొలకల గురించి కాదు రాజశేఖర్ గారికి తెలియజేసింది. సమయం వృథా గురించి నా సమాధానము చెప్పాను. నాతో పిచ్చ చర్చలు చేస్తే చర్చలకు జీవితకాలం చాలదు ఎవరైనా గుర్తుంచుకుంటే మంచిది. మొత్తం వికీలో జరుగుతున్న అవగాహన లేమి గురించి అని తెలుసుకుంటే మంచిది. ఎవరు ఎట్ట్లా ఉంచుకుంటేమి, ఊడబీక్కుంటే నాకేంటీ. నేను ఒకరికి వ్రాస్తే మరొకరికి వేడి వస్తుంది ఎందుకో మరి ? JVRKPRASAD (చర్చ) 13:17, 20 జూన్ 2016 (UTC)

(5) విశ్వనాథ్ నాకు ఇచ్చిన సమాధానం: వావ్ వాటే కామిడీ..నాకు నిజ్జంగా నవ్వు వచ్చి ఉన్నది. పగులవడి నవ్వితిని. అయిననూ ఇటూల వ్రాసుకొన్న యెడల నిజముగ పిచ్చి యున్నదని జమకట్టెదరు - హుష్ గప్ చుప్..--Viswanadh (చర్చ) 13:25, 20 జూన్ 2016 (UTC)

(6) విశ్వనాథ్ కు నేను ఇచ్చిన సమాధానం:

      నిజంగా పిచ్చోళ్ళూ ఎవరో రాజశేఖర్ గారు వ్రాశిన పేరా బయట పెడితే అసలు పిచ్చోళ్ళందరూ బయట పడతారు. పిచ్చోడు ఎవరో ముందు రవిచంద్రని అడిగితే తెలుస్తుంది. JVRKPRASAD (చర్చ) 13:29, 20 జూన్ 2016 (UTC)

(7) విశ్వనాథ్ నాకు ఇచ్చిన సమాధానం: JVRKPRASADగారూ మీరు మరీను. సరదా సరదాగా తీసుకోవాలి గాని అలా నిజ్జం సీరియస్సు అయితే ఎలాగండి..ఇవన్నీ చర్చల్లో చిలిపిరాతలు అంతే--Viswanadh (చర్చ) 13:33, 20 జూన్ 2016 (UTC)

(8) విశ్వనాథ్ కు నేను ఇచ్చిన సమాధానం: అయ్యా ! ఏ దొంగనాకొడుకు ఈ క్రింద పేరాలను తొలగించాడు. రాజశేఖర్ గారు కాదు, ఇక్కడ వాళ్ళూ కాదు. ఎందుకు ఆ వెధవ తొలగించాడు. (మంచివాళ్ళు అయితే ఎందుకు తొలగించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వండి, నన్ను మన్నించండి) ఏ దరిద్రుడు ఈ పేరాలను తొలగించాడు. JVRKPRASAD (చర్చ) 13:37, 20 జూన్ 2016 (UTC)

(9) రవిచంద్ర స్పందన: రాజశేఖర్ గారి రాసిన స్పందన, దానికి నేను రాసిన సమాధానం ఆయనే తొలగించారు. ఎందుకో తెలియదు. ఫ్రూఫు కావాలా ఇది చూడండి --రవిచంద్ర (చర్చ) 13:40, 20 జూన్ 2016 (UTC)

(10) రవిచంద్ర స్పందనకు నా స్పందన: ఈ విశ్వనాథ నా మీదెందుకు ప్రతిసారి మీదకు రావడము ఏదో నీతి సూత్రాలు, ఎకసెక్కాలు, రెచ్చగొట్టటాలు, రెచ్చిపోవటాలు, అసలు విషయాన్ని వదలి ఏవేవో సంబంధంలేని చర్చలు, మంటెక్కేదాకా కెలకడం, మంటెక్కి ఏదైనా అంటే దానికి రాద్ధాంతం జీవితాంతం చేయడం, ఇంకా ఇంకా రెచ్చగొట్టడం, ఏమిటి ఈ అబద్ధపు చేష్టలు, ఇలాంటి వారిని అరికట్టలేరా ? లేక ఇలాంటి వారి చేష్టలవల్ల వికీకి ఎంతో ప్రయోజనకరంగా ఉందంటే కొనసాగించడం మీకు మంచిదే, కాని నా లాంటి వారికి కాదు. మనిషికి చదువుతో పాటు అనేకం ఉండాలి అవి చాలమందిలో కొరవడుతున్నాయి మరియు వికీకి ఏమంత శ్రేయస్కరము కాదు. JVRKPRASAD (చర్చ) 13:49, 20 జూన్ 2016 (UTC).

(11) విశ్వనాథ్ ప్రతిపాదనలు:

 • == వికీలో సహ సభ్యులపై అసభ్య అభ్యంతరకర రాతలు == ::

అయ్యా ఇటీవల వాడుకరి:‎JVRKPRASAD గారు శ్రుతి మించి అసభ్య పదజాలంతో తొటి సభ్యులతో చర్చలు చేస్తున్నారు. వయసు రీత్యా, లేదా అనుభవం అని కొంత వరకూ ఆయన్ను సహిస్తూ వస్తున్నా అది చెడు పరిణామాలకు దారితీస్తున్నట్టుగా తొస్తున్నది. దీనిపై సహ సభ్యులు స్పందించి మీ అభిప్రాయాలు రాస్తే దానిపై ఒక నిర్నయం తీసుకోవచ్చు. ఆయన ప్రవర్తన ఇలాగే కొనసాగాలా లేక ఏదైనా చర్య తీసుకోవాలా అనేది నిర్ణయించవలసిందిగా కోరుతున్నాను..--Viswanadh (చర్చ) 13:49, 20 జూన్ 2016 (UTC)

(12) ప్రతిపాదనలకు నా సమాధానం: (విశ్వనాథ తొలగించిన పేరాకు నాసమాధానం) నీతో నేను చేశానా ? నీకు పిచ్చెక్కి ఇలా రాస్తున్నావు. ఎవరితో ఈ రాతలు రాశాను చెప్పు. నీకు నచ్చినట్లు నా వాక్యాలు జత చేస్తున్నావు. నాకు నువ్వెందుకు సలహాలు ఇస్తావు. ఇవ్వవద్దని ఎన్నోసార్లు చెప్పాను. నువ్వు నన్ను వ్యక్తిగతంగా దాడిచేస్తున్నావు. ఇంకా ఇతరుల నుండి నీకు అభిప్రాయాలు కావాలి. ముందు నీ గురించి అభిప్రాయాలు అడుగు. నువ్వు అనవసరంగా చాలా రకాలుగా హింస పెట్టావు, పెడుతున్నావు. నువ్వు నీ సంగతి చూసుకో ముందు. నా గురించి నీకెందుకు . నేను ఎవరితో ఇన్నాళ్ళుగా నువ్వు చెప్పి రాసినట్లు నేను మాట్లాడలేదు, ఋజువు చూపమంటే చూపలేదు నువ్వు. నువ్వు నన్ను సహిస్తున్నావా ? అసలు నువ్వు నా గురించి పట్టించుకోకుంటే మంచిది. నువ్వు నీ పని చూసుకుంటే మంచిది. ముందు నిన్నే వెలి వేయాలి. JVRKPRASAD (చర్చ) 14:01, 20 జూన్ 2016 (UTC)

(13) విశ్వనాథ్ సమాధానం వారం తదుపరి: "విశ్వనాథ తొలగించిన పేరాకు నాసమాధానం" అంటూ వాడుకరి:JVRKPRASAD రాసిన విభాగాన్ని తొలగించాలి. కొత్త సభ్యులు, లేక తదుపరి పాత చర్చలను చూసేవారు దీనిని చదివి నేను తప్పుగా వ్రాస్తానని అనుకొనే అవకాశం ఉంది. ఎవరు తొలగించారో తెలుసుకోకుండా నాపేరుతో ఇలాంటి రాతలు రాసిన వాడుకరి:JVRKPRASAD యొక్క మానసిక స్థితిని అర్ధం చేసుకొని నేను క్షమించగలను కాని, ఆ రాతలు అలాగే ఉండకూడదు. దానితో పాటు వీటినీ తొలగించాలని నా మనవి..--Viswanadh (చర్చ) 03:36, 26 జూన్ 2016 (UTC)

తదుపరి సమాధానా చర్చలు వాడుకరులు ఈ రోజు రచ్చబండలో చదువ వచ్చును. నేను కూడా ఒకడి గురించి దొరికిన బూతులతో ఒక ప్రతిపాదన పెట్టి తిరిగి దానిని తొలగిస్తే వాడు ఊరుకుంటాడా ? చెప్పండి దీనికి సమాధానం. నా గురించి వ్రాసేదంతా వ్రాసి తొలగించితే సరిపోతుందా ?ఇదీ జరిగిన సంగతి. జరిగిన విషయములు మనిషికొకరకంగా అర్థమయి అందుకు అనుగుణంగానే స్పందిస్తారు. తదుపరి ఇంతకాలం విశ్వనాథ్ నాతో చేసిన చర్చలు వరుసగా ఇస్తాను, మీకు అర్థమయినట్లు ఆలోచించుకోండి. నాకు అర్థమయిన రీతిలో నా స్పందనలు నాకు ఇలాగే ఉంటాయి. ఇంకా దరిద్రంగా ఉంటాయి అని చెప్పాను కూడా చాలాసార్లు. నేను ఎంతోకాలం నుండి చెబుతునే ఉన్నాను. నన్ను అనవసరంగ కెలకవద్దు అని. నన్ను అనవసరంగా ఎందుకు కెలకడం అతను అని ఒక్కళ్ళు కూడా అడగరేమిటి ? ఒక జడ్జిలా ఆలోచించండి. JVRKPRASAD (చర్చ) 08:40, 26 జూన్ 2016 (UTC)

చర్చలు మొత్తం బయటకు తీసి,ఇంతకాలం ఈ విషనాథ నాకు పెట్టిన మానసిక హింసకు కారకులు, ప్రేరేపించి, ఉసిగొలిపినవారు ఎవరైనా ఉన్ననూ చక్కగా చట్టము, న్యాయము ముందు మనము సమాధానము చెప్పుకుంటే దీనికి పరిష్కారము దొరుకుతుంది. ఇక్కడ ఎలాగూ అటువంటివి ఉండవు. ఈ విషయములో నా ఆరోగ్య, మర్యాద, గౌరవములకు భంగకరమైనందున, నన్నే బయట చట్టము, న్యాయము ద్వారా ప్రయత్నించినా సరే మీలో ఎవరైనా సరే ఆ పని చేసినా మంచిది. JVRKPRASAD (చర్చ) 12:07, 26 జూన్ 2016 (UTC)

మూడవ భాగముసవరించు

వికీపీడియా సమగ్రతను దెబ్బతీసే విధంగా పేజీల్లో అవాంఛనీయమైన మార్పులు, చేర్పులు, తొలగింపులు చేయడాన్ని దుశ్చర్య అంటారు. పేజీల్లో అసభ్యకరమైన రాతల్ని చేర్చడం, పేజీలో మొత్తం విషయాన్ని తీసివెయ్యడం (వెల్ల వెయ్యడం), ఏ మాత్రం సంబంధం లేని విషయాన్ని చేర్చడం వంటివి సాధారణంగా జరిగే దుశ్చర్యలు అని "వికీపీడియా:దుశ్చర్య" వ్యాసంలో గమనించాను. అవి చేసేవాళ్ళను నిషేధించంచండి. ఎవరైనా సరే....Nagendra405 (చర్చ)
    గత కొద్దికాలంగా సాగుతున్న ఈ ప్రహసనాన్ని చూడలేకున్నాను. వాడుకరి:JVRKPRASAD మరియు వాడుకరి:విశ్వనాధ్.బి.కె. ల పై ఇతర తెవికీ సభ్యుల అభిప్రాయాలను చదవలేకున్నాను. ఇక ఆగలేక దీనిని రాస్తున్నాను. పిల్లి మెడలో గంట కట్టడానికి పూనుకున్నాను. వాడుకరి:JVRKPRASAD మరియు వాడుకరి:విశ్వనాధ్.బి.కె. , ఇద్దరూ తెవికీ దిగ్గజాలే. ఒక తెవికీ మూలస్థంభమైతే మరొకరు తెవికీని పరుగులు పెట్టిస్తున్న మత్తేభము. మీరిద్దరూ సమన్వయం కోల్పోయి నవ్వులపాలు అవుతున్నారు. అన్నీ తెలిసిన మీకు ఎవరు చెప్పగలరు మరియు ఏమని చెప్పగలరు. వాడుకరి:JVRKPRASAD గారు పరుష పదజాలం వాడుట ఆపివేయడం మంచిది. వీరిపై పలు సభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వీరి వయసు రీత్యా వీరికి చెప్పే సాహసం చేయకున్నారు. వీరు దయచేసి తమ వైఖరి మార్చుకోవడం మంచిది. గతంలో ఆంగ్ల వికీపీడియాలో వీరిపై నిషేధం విధించడం జరిగింది. వాడుకరి:విశ్వనాధ్.బి.కె. చేసింది కూడా తప్పే. పెద్దలైన వాడుకరి:JVRKPRASAD పట్ల అలా వ్యంగంగా మాట్లాడి ఉండకూడదు. అధికారి అయిన వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారు ఇలా రాయడం శోచనీయం. మరియు వారి శ్రేయోభిలాషులు కూడా గుడ్డిగా వీరికి వంతపాడటం సరైనదికాదు. ఈ చర్చను ఇక్కడితో ఆపివేసి ఇరువురూ వికీ అభివృద్ది కోసం కృషిచేయడం కొనసాగించి మాలాంటి కొత్తవారికి మార్గదర్శనం వహించాలి. వాడుకరి:JVRKPRASAD మరియు వాడుకరి:విశ్వనాధ్.బి.కె. దయచేసి గమనించండి. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. తెవికీలో చాలామంది అభిప్రాయం కూడా ఇదే. వాడుకరి:JVRKPRASAD గారూ, మీరు మీ రచనల వలన గుర్తింపు తెచ్చుకోవాలి. దయచేసి వేరే వాటివలన కాదు. వయసులో పెద్దవారైన మీగురించి ఇలా రాస్తున్నందులకు మన్నించండి. మీరు నాను పితృ సమానులు. దయచేసి దీనిని పాజిటివ్ గా తీసుకొని మీ రచనలపై దృష్టి పెట్టండి. వాడుకరి:విశ్వనాధ్.బి.కె. గారూ, ఈ విషయంపై ఇక వాడుకరి:JVRKPRASAD గారిని కెలకవద్దు. ప్లీజ్. విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. దండాలతో .. మీ --తెగించినోడు (చర్చ) 09:59, 27 జూన్ 2016 (UTC)
తెగించినోడు గారికి నమస్కారము. మీరు పాతవాడుకరి కానీ కొత్త పేరు పెట్టుకున్నారు. సంతోషం. మీరు అన్నది నిజం. నన్ను మొదటగా తూలనాడింది, పరుషపదజాలం వాడింది ఎవరో చూడండి. చిన్నవాడు అని ఎంతకాలం సహించమంటారు ? వారంవారం ఒకచోట కలుసుకునే వారు ఈ విధంగా నాతో మాట్లాడినట్లు వాళ్ళతో మాట్లాడటం కుదరదు. వాళ్ళకి ఒక బకరా కావాలి. అది నేను అని భ్రమ పడటం జరిగింది. నేను ఎన్నో నెలలుగా చెబుతున్నాను, నాతో సభ్యత సంస్కారములతో మాట్లాడమని, అలా నాతో మాట్లాడటము కుదరని వారికి అసలు నా ఏ వాక్యములకు స్పందించ వద్దని కూడా మనవి ఎన్నోసార్లు చేశాను. కానీ నన్ను తప్పు పట్టి, వ్యక్తిగతంగా దూషించితే ఎంతవాళ్ళనయినా నేను ఊరుకోను. మాకు ఒక ఉన్నత వ్యక్తిగత కుటుంబ నేపథ్యం ఉంది. తప్పు చేసినవాడు నేనే తప్పుచేశాను అంటాడు. అతని వ్రాతలు నా విషయములో వాశినవి మొత్తం బయటకు తీయండి. అసలు ఎందుకు నా విషయములో అతిగా స్పందిస్తాడు ? అతన్ని ముందుగా వారించండి. నాకు అతను ఏ విషయములోను ఏమీ చెప్పనక్కరలేదు, స్పందించనవసరము లేదు. నేను అలాగే ఉంటాను. ఇది అతను ఎందుకు చేయడు. మీరెవరూ చెప్పలేరా ? ఎందుకు చెప్పలేరు. తదుపరి, గతంలో ఆంగ్ల వికీపీడియాలో నాపై నిషేధం విధించడం జరిగింది ఎందుకో మీకు తెలియదా ? ఆ నిషేధానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా ? ఇలాంటివి నాకు ఉద్రేకాన్ని తెప్పిస్తాయి. మీకు తెలియకపోతే తెలుసుకోండి మరియు వీలయితే లింకు కూడా ఇస్తాను. నాకు తెలిసినంత వరకు ఆంగ్ల వికీలో నేను తెలుగు అర్థం ఒక దానికి వ్రాయడంలో కొత్తలో తెలియక లింకు సరిగా ఇవ్వలేకపోయాను లేదా AWB బ్రౌజర్ మొదటిసారిగా ఉత్సాహం కొద్దీ వాడినందుకు (దీనికి వివరణ ఇచ్చాను. ఇక ముందు వాడను అని.) కావచ్చును. దానికి ఒక రోజు నిషేధం విధించారు. అందుకు నేను ఆడగటం జరిగింది. వాళ్ళు సమాధానము ఇవ్వకుండా దానిని మూడు రోజుల పాటు నిషేధము పొడిగించడం జరిగింది. ఈ దాష్టీకానికి నేను అక్కడ చాలాకాలం పని విరమించుకోవడం జరిగింది. ఇదీ జరిగిన సంగతి. మరి ఇంక ఏమైనా జరిగింది అని మీకు తెలిస్తే తప్పకుండా ఇక్కడ తెలియజేయ వచ్చును. నేను వివరించడానికి నా గత చరిత్ర కూడా అక్కడ లేదు. మీ దగ్గర ఆ నిషేధం లింకు ఉంటే వెంటనే ఇక్కడ ఇవ్వండి. అసలు నిషేధం ఎందుకు విధించారో అక్కడ, ఆ లింకు చూస్తే కానీ నాకు గుర్తుకు రాదు. ఆ నిషేధం కేవలం వ్యాసాలు విషయములోనే. నేను మనిషి మనిషికి నా పద్ధతి మార్చుకోను. నా మానాన నన్ను వదిలేస్తే మీ అందరికీ ఏ నెప్పి ఉండదు కదా ! నా మీద కొందరు ఎవరికి తోచినట్లు వారు ఎందుకు మానసిక దాడి చేస్తారు ? మాకు సంఘంలో మాకుండే గౌరవ మర్యాదలు మాకుంటాయి. మాకు కూడా మాకుండే అన్నిరకాల వనరులు ఉంటాయి. అసలు నేను వికీపీడియాకు ఏ పనులు చేయలేదా ? నావేవో తప్పులు ఉన్నాయని ఆంటారు అవి ఎంత శాతం ? నష్టశాతం ఎంత ? కేవలం మంచిని తక్కువ చూపడం కూడా ఒక విధంగా చిన్నతనమే మనిషికి, మరో విధంగా కూడా ఆలోచించండి. ప్రతి మనిషికి ఎన్నో సంస్కారములు ఉండాలి కదండి. ఇక్కడ కుదిరినట్లు బయట ప్రపంచంలో ఈ రూల్స్ తోటి కుదురుతుందా ఏ విషయములోనయినా అని ఆలోచించండి. చిన్నపిల్లలతో నీతులు చెప్పించుకునేందుకోసమో, ఒకరితో దొబ్బులు పెట్టించుకోవడం కోసమో కాదు కదా ఇక్కడికి వచ్చేది. ఇక్కడికి అసలు ఎందుకు మాలాంటి వారము వస్తాము ? ముందుగా అతను తప్పు చేశాడు, అందుకే నేను అతని విషయములో అయినా మరెవరి విషయములోనయినా నేను చాలా తీవ్రంగా స్పందించాను, స్పందిస్తాను కూడా. నాతో జాగ్రత్తగా మాట్లాడండి అని ఎన్నోసార్లు చెబుతున్నాను. నేను చాలా సున్నితమైన మనసున్న మనిషిని. అర్థం చేసుకోలేక పోతున్నారెందుకో కొందరు. దయచేసి నాకు ఏదైనా తోచిన పనిని నన్ను అందరూ చేసుకోనివ్వండి. నేను ఎవరిని వ్యక్తిగతంగా బాధించని వారి మనసులు నా మీద మీకున్న అభిమానానికి నా వ్రాతల వలన కల్మషమయితే దయచేసి నన్ను మన్నించండి. JVRKPRASAD (చర్చ) 12:05, 27 జూన్ 2016 (UTC)
వాడుకరి:JVRKPRASAD గారూ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నచో క్షమించగలరు. మిమ్ములను బాధపెట్టడం నా ఉద్దేశ్యము కాదు. మిమ్మల్ని కించపరచడం ఏమాత్రమూ కాదు. మీ గురించి ఇతరులు రాసిన వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపే హక్కు మీకు ఉన్నది. అందులో ఎలాంటి సందేహము లేదు. సమస్యల్లా మీరు వాడుతున్న భాష మాత్రమే. పెద్దవారు, గౌరవనీయులైన మీరు ఇలాంటి భాష వాడటంపైనే సభ్యులందరూ అభ్యంతరం తెలుపుచున్నారు. ఇది నా ఒక్కడి మాట కాదు. మీ గురించి దాదాపు అందరి సభ్యుల అభిప్రాయము ఇదే. మీ భాష గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. నేను కేవలము సభ్యుల అభిప్రాయాలు తెలుపుచున్నాను. మీరు ఇలాంటి భాష వాడటం వలన సభ్యుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితి ఎంతవరకు వెళ్ళినదంటే.. సభ్యులు మీ నిషేధం గురించి ప్రతిపాదిస్తున్నారు. కేవలం తను వాడే భాష కారణంగా అత్యంత విలువైన మరియు గౌరవనీయుడైన ఒక సీనియర్ సభ్యుడు తెవికీకి దూరం కావడంకంటే దురదృష్టం మరేదీ లేదు. దొంగ నా***, ముం***** లాంటి పదాలు సహ సభ్యులను ఎంత బాధపెడుతాయో మాటలలో చెప్పలేము.కావున మీరు ఇకనుండి అలాంటి పదప్రయోగాలు చేయకుండా మీరు చెప్పదలసుకొన్నది ఇతరుల మనసు నొప్పించకుండా రాయడానికి ప్రయత్నించగలరు.మీరు రాసిన వ్యాసాలు చూడండి. అందులో మీ పదప్రయోగము అద్భుతము.మరి అందరూ చదివే రచ్చబండ చర్చల్లో మీరు వేరే భాష ఎందుకు వాడుతున్నారో అర్థంకావడం లేదు. బహుశా మీపై వేరే సభ్యులు చేసిన వ్యాఖ్యలు మిమ్ములను బాధించి ఉండి, ఆ ప్రభావం చేత వీరు ఇలాంటి పదాలు వాడుతున్నారేమో? మిమ్ములని నొప్పించిఉన్నచో మరొక్కసారి క్షమాపణము తెలియజేస్తున్నాను. విషయాన్ని గ్రహించగలరు.--తెగించినోడు (చర్చ) 08:50, 28 జూన్ 2016 (UTC)
తెగించినోడు గారు, నాకు వ్యక్తిగతంగా ఎటువంటి హాని జరుగుతున్ననూ బండ బూతులు వాడతాను అని ముందుగానే ఎన్నోసార్లు హెచ్చరించాను. నేను ఎవరినీ ఏమీ అననప్పుడు నేనెందుకు మాటలు పడాలి. పైసలు కోసం హత్యలు జరుగుతున్నాయి. దేనికోసం. అంతా అయిపోయాక నీతి మాటలు కోసం తీరుబడిగా మునులు, స్వాములు, సర్వసంగ పరిత్యాగులు వచ్చి ఇంక చేసేదేముంటుంది ? ఆవేశ పరిచిన తదుపరి ఆలోచనలు కూడా రావు. అదే జరిగి నేను దొంగ నాకొడుకు పదాలు వాడాను, ఇంక బూతులు వ్రాయలేదు సంతోషించండి. నా నైజం అంతే. నన్ను అనవసరంగా ఎవడు మాట అన్నా పడను. నేను అనను. ఎంతటి వాడు అన్నా వాడిని అంత తేలికగా వదలను. నేను ఎవరెవరిని నొప్పించాను. నన్ను కెలికిన వాడుతోనే నేను పరుషంగానే ఉంటాను. కొంపలో దొంగలు పడితే అన్నీ పట్టికెళ్ళు బాబూ అని మీరు చెప్పండి. ఇన్ని నాకు చెబుతారు. మీ అడ్రసు పేరు కూడా లేని నాకు మీరు ఏంటో చెబుతారు. మీ వివరాలు ఇవ్వండి. మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కెలికికెలికి వదులుతాను. మీకు ఎంత స్థిమితమైన మనసు ఉంటుందో చూస్తాను. ఆనొప్పి అప్పుడు తెలుస్తుంది. నన్ను అనవసరంగా కెలికి, ప్రశ్నలు అడిగితే నాకేదో పాఠాలు చెబుతూ నాకు ఎందుకొచ్చిన పెంట ఇది. నా పరిస్థితి ఎగేస్తే బ్రాహ్మణ హత్య, దిగేస్తే గోహత్యలా ఉండి, ఇక్కడ నేను నేర్చుకునేది తక్కువ, అనవసరము మాటలు వలన వెళ్ళిపోదాము అనుకుంటే, వికీ కొరకు ఆగుతున్నాను. సంస్థలు ఎప్పుడూ మంచివే, కానీ అందులోని కొందరి వల్ల అంతా దరిద్రం చుట్టుకుంటుంది. ఇక్కడ కాకపోతే ఎక్కడయినా చేసుకుంటాను అంటే, అక్కడ ఇదే సమస్య ఉండదని గ్యారంటీ ఏమిటి అని ఓ వాడుకరి సందేహం. ఇక్కడ వాళ్ళే అన్ని చోట్ల ఉండరని అతనికి తెలియదనుకుంటా. నేను ఎవరిని కించ పరచే మాటలు వ్రాయను. మీకు వీలయితే ఫేస్‌బుక్ లోకి రండి నా చరిత్ర కొంతయినా తెలుసుకుందురు గానీ ! ఇదే పేరుతోనే ఉంటాను చాలా చోట్ల. నాపై నిషేధం అనే మాట వస్తోందంటే వాళ్ళు మానసికంగా దిగజారిపోయినట్లే. ఎందుకంటే ఎవడికోసమో వాళ్ళూ ఇరుక్కుంటున్నారు. ఏం చేస్తారో చూద్దాం. తర్వాత ఏ జరుగుతుందో వాళ్ళకేం తెలియదనుకుంటా. ఒక్కొక్కళ్ళను ఆ తర్వాత నేను ఎక్కడ ఎలా కడగాలో వాళ్ళ పరువులు ఎలా తీయాలో, వాళ్ళకి నేను ఇదే విధంగా మానసిక హింస పెట్టించగలను. వాళ్ళు నాతో పోటిగా పని చేయమని ఎన్నోసార్లు చెప్పాను. కానీ పని చేయలేరు. పైపెచ్చు పని చేసే వాళ్ళకి ఏదో మానసిక హింస పెట్టి, బయటకు గెంటుతారు. వీళ్ళకి తెలిసినది ఇంతే. నేను ఎవడినో దొంగ నాడుకు అంటే వీళ్ళ కెందుకు అంత నొప్పో అర్థం కాదు. నేను చట్టం, మీడియా, న్యాయం, వ్యక్తిగతంగా వీళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాను. ముందు నన్ను అన్నవాడికి బుద్ది చెప్పండి. లేదా నన్ను అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి మీ ఇళ్ళలోని వారందరినీ అంటాను. అప్పుడు నేను ఏమీ అనను. ఏదో ఒక పరిష్కారము ఉండాలిగా. మీ ఇళ్ళకి వచ్చి ఆ రాతలు అన్నీ చూపిస్తా బాధ పడే వారందరి ఇంటిలోని వారందరికీ, అప్పుడు వాళ్ళ అభిప్రాయము తీసుకుందాము. నాకు కుడి చేయి పని చేయదు. అయినా వ్రాస్తున్నాను. ఇంకా వ్రాయలని ఉంది. ఇంక వ్రాయలేను. ఎమైనా ఉంటే తర్వాత వ్రాస్తాను. నన్ను ఎందుకో ఏదో ఎక్కడో బ్లాక్ చేశారు అని అంటే దానికి సమాధానము ఇచ్చాను. దానికి మీ సమాధానము లేదు. JVRKPRASAD (చర్చ) 09:22, 28 జూన్ 2016 (UTC)
JVRKPRASAD గారూ, ఆంగ్లవికీలో మిమ్ములను నిరోధించారనే విషయం తెలుసు కానీ ఎందులకు అనునది మీరు చెప్పిన పిదప తెలిసినది. కావున నాకు అడగటానికి ఎలాంటి విషయం మిగిలి లేదు. మీకు కుడిచేయి పని చేయలేదు అని రాశారు. ఇది బాధాకరం. నేను సూటిగా చెప్పేదేమిటంటే మీరు రాసే పదజాలం వలన మీరు చులకన అవుతున్నారు... అందరూ మీ వెనక మిమ్ములను శాపనార్థాలు పెడుతుంటే చూడలేక మీకు తెలియజేశాను. నాకు మీతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరము లేదు. దయచేసి గమనించగలరు. అలాగే మీ కృషిని వ్యాసాలలో ఇలాగే కొనసాగించగలరు. మీరు చెప్పిన విషయాలు సమంజసమే కానీ చెప్పే విధానమే సరిగా లేదు. మీరు పెద్దలు మరియు ఈ వయసులో కూడా వికీలో చురుగ్గా రాస్తున్నారు. మీ జోలికి అనవసరంగా వచ్చిన వారిని కడిగేయండి. కానీ అందరినీ అదే గాటన కడితే ఎలా? వికీ అనునది ఒక టీం వర్క్. మీకు ఇది చెప్పనవసరం లేదు. ఐకమత్యమే మన బలం. మనలో మనం పోట్లాడి చులకన ఐపోతే ఎలా? గతంలో మీరు ఇతర సభ్యులపట్ల కూడా దురుసుగా వ్యవహరించారు. మీ వయసు రీత్యా వారు మీకు ఎదురు చెప్పనప్పటికీ , వ్యక్తిగతంగా బాధపడ్డారు.ఇది మీకు తగునా?నిర్ణయాధికారం మీకే వదిలివేస్తున్నాను. మీ ధోరణి దయచేసి మార్చుకోండి. లేనిచో చులకన అయిపోగలరు. అది మీ శ్రేయోభిలాషులైన మాలాంటివారికి శరాఘాతము. --తెగించినోడు (చర్చ) 10:09, 28 జూన్ 2016 (UTC)
తెగించినోడు గారు, మీ స్పందనలకు ధన్యవాదములు. ఆ నిరోధానికి ఇప్పుడు జరుగుతున్న చర్చలో జత చేయడం ఏమైనా సంబంధం ఉందా లేదా సమంజసమేనా ? నేను ఎప్పుడూ ఒకేలా రాస్తాను అనుకుంటే అది చాలా తప్పు. ఇప్పుడు నేను మీరందరూ అనుకున్నట్లు వ్రాస్తున్నానా ? సంధర్భాన్ని బట్టీ మన జీవితాలలో మన నడవడి, ప్రవర్తన ఉంటాయి. మీరు తాగేవాళ్ళ దగ్గర కెళ్ళి తాగొద్దని నీతి మాటలు చెప్పండి. ఎంత మంది వింటారు ? నా జీవితం ఒక మిలటరీ పరిపాలన సూత్రాలు, ఇలా అనేక విధములుగా పద్దతులలో సాగింది. నా కంటే అన్ని విషయములలో సలక్షణాలున్న వారు నాకు తెలియనివి చెప్పటానికి ప్రయత్నిస్తే మంచిగానే ఆలోచిస్తాను. అయినా, ఎటువంటి వారు ఏమి చెప్పినా కూడా వింటాను. కానీ, అదే పనిగా నా ప్రశ్నలకు సమాధానము ఇవ్వకుండా ప్రస్తుతము వారు నాకు నీతిబోధనలు చేస్తారు. నాకు ఎవరితోనూ వైరము లేదు. నాది దొంగచాటుగా ప్రాణాలు తీసే మనసు కాదు, ఏదైనా చెప్తాను. తదుపరి నన్ను వ్యక్తిగతంగా దూషించేవారు ఎవరైనా ఆ ఖర్మ ఫలం ఏదో వాళ్ళే ప్రకృతి వల్ల అనుభవిస్తారు. నాది తప్పు అయితే నేను అనుభవిస్తాను. నాకు నమ్మకము తప్పకుండా ఉంది. నాకు కష్టము మరియు నా స్పందన అంత వరకే పరిమితము. ముందుగా తప్పు చేసిన వాడిని వెలి వేయాలి. ఈ సందర్భంగానే నేను వేసిన దొంగ......................అన్న పోస్టింగ్ వేసే ముందు చరిత్ర చూసుకొని వేయాలి అని ఒక వాడుకరి సలహాతో అభిప్రాయం. ఒక ఉపద్రవం ముంచుకొచ్చి, మనమీద దాడి చేస్తున్నప్పుడు ఆ దాడిని ఎదుర్కొంటాము కానీ ఆ సమయములో చరిత్ర చూడాలి అని అనుకోము. మీరు ఈ పోస్టింగ్ వేసినప్పుడి నేను వికీలో లేను. ఇప్పుడు చూశాను, వ్రాస్తున్నాను. ఇంత ముందు ఏ జరిగింది అని చరిత్ర జోలికి ఎందుకు వెళ్ళతాము ? నేను అందరినీ ఒకే గాటన కట్టడము లేదండి. నేను కొన్ని వాడుక పదాలు, ఒక వ్యక్తికే బహువచనాలు, ఇలా ఇలా నా తెలుగు భాష చిత్రంగా వాడటం జరుగుతుంది. నన్ను బాధా పెట్టిన వారు తప్ప, ఏ ఒక్కరికి సంబంధం లేదు. డా. రాజశేఖర్ గారు వారు వ్రాసిన పేరా వారే తొలగించారన్న సంగతి నాకు ముందుగా తెలియదు. సామాన్యంగా వారు అలా చేయడము బహు అరుదు, అలాంటి దాఖలాలు కూడా తక్కువే. ఎవరో ఆ పని చేశారు అని అపోహ పడి నేను అలా వ్రాశాను. తదుపరి తెలిసాక చాలా బాధపడ్డాను. తొందరపడి వ్రాసి, వారి మనసు నొప్పించానేమోనని. నిజానికి అదే జరిగి ఉండి వచ్చును. అందుకు వారిని ఈ సందర్భముగా నేను తెలియక జేసిన పొరపాటుగా ప్రాచ్యపుకాని పదాలు వాడినందులకు మన్నించగలరని విన్నవించుకుంటున్నాను. నేను మనసులో కూడా ఎవరినీ ఎకసెక్కంగానైనా తలచుకోను. ఎవరితోనైనా ఫోను సంభాషణలో కూడా చెప్పల్సినవి చెప్పి అంతటితో అయిపోతుంది. ప్రతి దానికి మనకున్న మంచి లక్షణాలతో సంపాదించుకున్న సుగుణాలు చిన్న చిన్న వాటికి వాడి పోవు. నేను విజయవాడలోని మా కాలనీకి నన్ను రెండవసారి కూడా అసోషియేషన్ నందు కోశాధికారిగా కావాలనుకొని ఎన్నుకొన్నారు, వారి మనసులో నేను బ్రతికున్నంత కాలం నన్నే కావాలనుకుంటున్నారు. నాకు హైదరబాదు (ఇళ్ళూ, బళ్ళూ), విజయవాడ, గుడివాడ (ఇళ్ళూ,బళ్ళూ) ......ఇలా ఏ ఊరు అయినా నాకు ఒకటేలా ఉంటుంది. పిల్లలు విదేశాలు. మొత్తం నాది ప్రశాంత జీవితం. నాకు నిజజీవితంలో కాలక్షేపానికి అనేక పనులున్నాయి. నేను చాలా సంతోషంగా ఉంటాను. కాకపోతే నా స్వభావం మరియు వయసు రీత్యా, నా ప్రమేయం లేకపోయినా చిన్నవాళ్ళు ఏదో అంటూంటే మొదటి నుంచి నేను సహించను. మేము 10 మందిలో నేను పెద్దను. తదుపరి, గతంలో కూడా ఇతర సభ్యులు నాతో ఏం మాట్లాడారో తీయండి. ముందు వాళ్ళదే తప్పు ఉంటుంది. నా భాష నిదానంగా మారిపోతుంది. వాళ్ళు అర్థం చేసుకోరు, ఎంత చెప్పినా.. ఇప్పుడు ఇంతా రాస్తున్నాను. దేనికోసం. నా మీద ఒకవేళ జీవితకాలం నిషేధం ఎలా విధిస్తారు. ఇద్దరి మధ్యగొడవకు ఇద్దరినీ లేదా నాతో గొడవపడ్డ అందరినీ వెలివేయాలి. అలా కాకపోతే వాళ్ళని ఇంతకాలం నా మీదకు ఉసిగొలిపినట్లు అవుతుంది, అదే నిజం అవుతుంది. జీవితకాలం నిషేధించే తప్పులు ఏమున్నాయి ? దీనికి ఒకటే పరిష్కారము. ఇక ముందు నేను ఎటువంటి చర్చలు చేయను, అభిప్రాయములు చెప్పను. నాతో మాటలు సరిపడక గొడవలు పడే వారితో ఎక్కువకాలం (వీలయితే జీవితకాలం కూడా) వాళ్ళతో మాట్లాడకుండా ఉండటం మంచిది. నా మీద సదభిప్రాయమున్న వాళ్ళే నాతో మాట్లాడండి. ఇలా కొన్ని నియమాలు పెట్టుకుంటే సరిపోతుంది. అసలు నేను ఇక్కడ ఉండాలా లేదా ? నిషేధం మొదలయితే అది ఎంతకాలం ? జీవితకాలం అయితే మాత్రం ఆలోచించుకుంటాను. నేను ఇప్పటి నుండి పనిచేయాలో లేక వద్దో తెలియజేస్తే ఇంతటితో ఆపివేస్తాను. ఇటువైపుకు పిలిచే వరకు రాను. మీ అందరికి నేను అందించే ఇదే దీర్ఘకాలపు శలవు చీటీగా దయచేసి అందరూ గమనించగలరు. అందరికీ ధన్యవాదములు మరియు నమస్కారములు. JVRKPRASAD (చర్చ) 12:16, 28 జూన్ 2016 (UTC)