వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 21

పాత చర్చ 20 | పాత చర్చ 21 | పాత చర్చ 22

alt text=2013 మే 1 - 2013 మే 29 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2013 మే 1 - 2013 మే 29

అధికార, నిర్వాహక ధృవీకరణ పత్రం

మార్చు

అధికారి, నిర్వాహకుడు ఇలాంటి హోదాలకు వాడుకరులు ఎవరయిననూ కావాలనుకునేవారు, ఒక వర్గంగానో లేదా ఏదోవిధముగా ప్రయత్నాల ద్వారా వాడుకరులకు తెలియజేసుకునే కంటే, ఎవరికి వారు ఆయా హోదాకు జతగా అనేక ఆంశాలు పొందు పరచిన ఒక అనుమతి ధృవీకరణ పత్రంలోని ఆంశాలు, వాటి అన్నింటిని తనకు తానే ధృవీకరిస్తూ సంతకం చేసి తన అనుమతిని తెలియజేస్తే, ఎన్నికలలో పాల్గొనలేని వాడుకరులు సరి అయిన అవగాహన పొందుతారు. అటువంటి నకలు ధృవీకరణ పత్రం మనందరము తయారు చేసుకోవల్సిన అవసరము ఎంతయినా ఉంది. దీనికి ఈ లింకులు [1]

 
అధికారి (బ్యూరోక్రాట్‌ లోగో) బొమ్మ

, [2]

 
నిర్వాహకుని లోగో (బొమ్మ)

లోనివి కొంత ఉపయోగ పడతాయి. సభ్యుల స్పందనలు ఈ విషయములో తెలుసుకోవలిసిన అవసరము కూడా ఉంది. (సశేషం)

జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:37, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రసాదుగారు! మీరిచ్చిన లింకులను ఎవ్వరైన తెలుగులోనికి అనువాదం చేసిన సభ్యులకు అందుబాటులో వుండినచో, అవగాహన కలుగుతుంది.పాలగిరి (చర్చ) 02:25, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పాలగిరి గారు తప్పకుండా చేద్దాం. అసలు ముందు అధికారి, నిర్వాహకుడు అనే హోదాలు కావాలనుకునే వారు ఎలాగూ ఓటు కోసము మనకు తెలుగులోనే తర్జుమా చేస్తారు. ఒక ప్రమాణ పత్రము జత చేద్దాము. అధికారి, నిర్వాహకుడు అనే పదవులు వరిష్టులయిన వాడుకరులకు వారు చేసిన సేవలకు గుర్తింపుగా శాశ్వత ప్రాతిపదికన ఇక్కడ అటువంటి వారికి ఇస్తే మంచిది అని కొందరి ప్రతిపాదనలు విన్నాము. నేను 10, 11.4.2013 తేదీలలో వికీపీడియా సభలో అధికారి, నిర్వాహకుడు, బాట్, ............అనేకం గురించి ప్రస్తావించాను. మీకు తెలిసే ఉంటుంది. ప్రస్తుతము అధికారి, నిర్వాహకుడు అనే హోదాలు పొందిన వారికి విశ్రాంతి (retirement) అనేది ఇక్కడే ఉండదు. మీరు కూడా అభిప్రాయాలు.....ఇంకా ఏమైనా...... తప్పకుండా పొందు పరచండి. (సశేషం) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:47, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు

మార్చు

తెలుగు వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని నిర్విఘ్నంగా జరిపిన పిదప అందరూ కొంతకాలం సేదతీరివుంటారని భావిస్తాను. ఈ మధ్యకాలంలో నేను వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు ప్రముఖులు మొదలుపెట్టాను. ఇందులో ప్రస్తుతం కొన్ని వందలమంది తెలుగువారి వ్యాసాలున్నాయి. వాటినన్నింటిని ఒకదగ్గరకు తీసుకొనిరావడానికి ప్రయత్నిస్తున్నాను. తెలుగు వికీలో మాదిరిగానే వీనిలో చాలా వ్యాసాలు చిన్నవిగానే వున్నాయి. చాలా వ్యాసాలు విస్తరించవలసివున్నవి. ఇది మనమందరం కలిసి చేయాల్సిన పని. ఇప్పటికే కొంతమంది సభ్యులుగా చేరారు. వారితో ఈనెల కొంచెం కేంద్రీకరించి ఈ ప్రాజెక్టును కొంత అభివృద్ధి చేద్దామని నా ఉద్దేశం.Rajasekhar1961 (చర్చ) 08:53, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టులో చేయాల్సిన పనులను కొన్ని భాగాలుగా చేశాను. ఆయా సభ్యుల అభిరుచులను బట్టి వారు ఆయా పనికి సంబంధించిన దానిలో వారివారి పేర్లను చేర్చమని మనవి. ఏవైనా కొత్త విభాగాలు చేయాలంటే తెలియజేయండి.Rajasekhar1961 (చర్చ) 15:52, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ప్రయత్నం. రహ్మానుద్దీన్ (చర్చ) 16:18, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం తరువాత తొలగించాలా

మార్చు

నేను ప్రారంభించిన శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానం, అహోబిలం విలీనం తరువాత తొలగించారు. విలీనం తరువాత తొలగించడం వలన లాభాలేమిటి, నష్టాలేమిటి తెలియజేయగలరు. YVSREDDY (చర్చ) 22:07, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు తెలిసింది చెప్పమంటే నా చర్చా పేజీలో సందేహం వ్రాయండి. ఇది రచ్చబండ. ఎంతోమంది సలహాలు ఇచ్చోట మీకు దొరుకుతాయి. ఇక్కడ అనేక మందికి తెలుసు. వాళ్ళ స్పందన(లే)లు శిరోధార్యం. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:05, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • విలీనం తరువాత ఆ విషయం అవసరంలేదు కాబట్టి తొలగించుతారు. అవసరమైతే దారిమార్పు కూడా చేయవచ్చు. ఇక్కడ దేవస్థానం వ్యాసాన్ని గ్రామ వ్యాసంలో విలీనం చేశారు కాబట్టి దారిమార్పు సరియైనదనుకుంటాను. --అర్జున (చర్చ) 05:46, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా మంచి ప్రశ్న. నేను సాయంత్రం ఆఫీసునుండి తిరిగివచ్చిన తర్వాత వివరణతో సమాధానమిస్తాను. --వైజాసత్య (చర్చ) 11:51, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అహోబిలం వ్యాసంలో మూడు విధాలైన సమాచారాన్ని ఆశించవచ్చు గ్రామం గురించి, అహోబిల క్షేత్రం గురించి, ప్రధాన ఆలయం గురించి. తొలగించిన శ్రీ లక్ష్మీ నృసింహ దేవస్థానం, అహోబిలం వ్యాసంలో చాలామటుకు క్షేత్రం గురించే ఉంది. వీటిని పరస్పరం విడదీసి వ్రాయగలమా అని మీరు అడగవచ్చు. కొంత redundancy ఉండటం సమంజసమే. వికీపీడియా దాన్ని ప్రోత్సహిస్తుంది కూడా. క్షేత్ర సమాచారం అహోబిలం వ్యాసంలో లేదు. అందుకే ఆ సమాచారాన్ని అహోబిలం వ్యాసంలో చేర్చాను. సమాచారాన్ని వెతికే వాళ్ళు సాధారణంగా అహోబిలం వ్యాసానికే ముందు చేరుకునే అవకాశం ఉంది కాబట్టి దారిమార్పు అవసరం అనుకోలేదు. అయినా ఇలాంటి విలీనాలు, విభజించడాలు వ్యాసంలోని సమాచారం పరిణితి చెంది పెరుగుతున్న కొద్ది సహజంగా వికీప్రక్రియలో భాగంగా జరుగుతుంటాయి. అహోబిలం వ్యాసంలో దేవస్థానం యొక్క సమాచారం చాలా పెరిగిపోయి వ్యాసంలో దేవస్థానం గురించిన సమాచారం మిగిలిన విషయాలతో పోల్చుకుంటే అసమతుల్యంగా ఉందనిపిస్తే మళ్ళీ లక్ష్మీ నృసింహ దేవస్థానం వ్యాసం సృష్టించవచ్చు. మీరు చేసిన మార్పులు ఎక్కడికీ పోవు. వికీలో ఏ మార్పులైన శాశ్వతంగా భద్రపరచబడి ఉంటాయి. అర్జున గారన్నట్టు దారిమార్పు కూడా సమంజసం గానే ఉంటుంది. దీన్ని ప్రతిస్థాపించి దారిమార్పు చేస్తాను. --వైజాసత్య (చర్చ) 04:07, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మరో మాట. విలీనం చేసే సందర్భంలో ఆ విలీనం అయిన వ్యాసం యొక్క చరిత్రను భద్రపరిచి ఉంచాలి. ఉదాహరణకు చర్చ:అహోబిలం చూడండి. ఈ వ్యాసం తెలుగు వికీ సీడీలో పొందుపరచినప్పుడు మీ పేరు కూడా ఒక రచయితగా పొందుపరచబడుతుంది. నేను ఆంగ్ల వికీలో చాలా ఏళ్ల క్రితం వ్రాసిన ఒకట్రెండు వ్యాసాలు సీడి మొదటి సంచికలో పొందుపరచడం వళ్ళ నా పేరు అందులో ఒక రచయితగా వచ్చింది. --వైజాసత్య (చర్చ) 04:13, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విధవ విక్షనరీ

మార్చు

విధవ విక్షనరీ అనే పేరును చూసి అసలు చర్చ చేయకండి. ఇప్పుడు విధవ విక్షనరీ కాదు అంత కంటే ఘోరమయిన పరిస్థితులు రాబోతున్నాయి. కనీసం జరిగినది నాకు తెలిసింది (కనీసం ఎప్పుడయినా అబద్ధాలు చెప్పడము నేర్చుకోమంటారు చాలాసార్లు, చాలామంది. అవసరము వచ్చినా చేత కావడము లేదు. అటివంటి ప్రయత్నాలలో ఆ కష్ట నష్టాలు నేనే పడుతున్నాను) తోటి సభ్యులకు చెప్పాలని ఉంది. వ్యాసానికి కొన్ని పేర్లు సూచించండి. నేను పేరు పెట్టిన తదుపరి మరెవరయిన ఎప్పటికయినా తొలగించడానికి అవకాశముంటుంది. అది మరుగున పడిపోతుంది. లేదా విలీనము అవుతుంది. అప్పుడు వ్రాసింది ఎవరో, ఆ వ్యాసము ఎక్కడ ఉందో, ఇలాంటి చాలా విషయాలు మరుగున పడి పోతాయి. నన్ను పేర్లు సూచించ మంటే కొన్ని ఇస్తాను. నాకు అందుబాటులో అధికారి హోదా వారే ఆ పేరు నిర్ణయించండి. ఎందుకంటే పదవులు పొందుతున్నవారు, పొందాలనుకున్నవారు ముందుగా అన్ని వికీల్లో కొంతకాలము కొంత పనిచేస్తారు. ఆ తరువాత అనేక కారణాల వల్ల అందుబాటులో ఉండరు. కొత్త వారిని వారి "కోటరీ"లోకి తీసుకోరు. అసలు అధికారి, నిర్వాహకుడు ఇలా అనేక పదవులు వాటి గురించి ముందు తెలుగులో వివరంగా తర్జుమా చేయాలి. అవి సభ్యుల అందరకు అందుబాటులోకి తెచ్చి (వీలయితే ఈ-మెయిల్ చేసి), అన్ని వికీల్లోకి సభ్యులను ఆహ్వానించి, ఒక సంవత్సర కాలము సమయమిచ్చి, ఆకాలములో ఎవరెవరు ఎంతెంత పని (వివిధ పనులు, ముద్ద పని,..........అనేకం) చేశారో టెక్నికల్‌ మరియు నాన్‌టెక్నికల్‌గా నిర్ణయించాలి. మందస్తు ప్రమాణ ధృవీకరణ పత్రం తయారు చేయాలి. వివిధ హోదాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలను కుంటున్నారో కొన్ని నెలల ముందే సభ్యులందరకూ తెలియాలి. అది సైట్ నోటీస్‌లలో ఉండాలి. చెప్పాలంటే చాలా ఉంది. ఇన్నాళ్ళూ ఎక్కడున్నారు, ఏమయిపోయారు ? ఇన్ని సంవత్సరాల తర్వాత, విక్షనరీలోని ప్రతిదీ ఇది పనికి రాదు అది పనికి రాదు అంటూ రోజుకో రకంగా పంచపాండవుల ముందు ద్రౌపది వస్త్రాపహరణంలా ఒక్కొక్కరు సలహాలు లేదా పని చేస్తున్నారు. ఇప్పుడు అసలు పనిచేస్తున్న పాత వారు పనికి రారు వీరికి. ఎకాఎకీగా అధికారులు అవ్వాలన్న దుగ్ద్ధ ఉందేమో అని అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలగా చేస్తున్న పని మీద ఎవరయినా చర్చలు చేశారా ? చర్చలు సఫలీకృతం ఎక్కడయినా జరిగాయా ? అంత పనితెలిసినవారు ఇన్నాళ్ళుగా ఎందుకు చెప్పలేదు. అసలు వీరికి ముందు పని తెలుసా ? లేదా ఇప్పుడే నేర్చుకున్నారా ? విక్షనరీలో అవకతవకలుగా ఎందుకూ పనికి రాకుండా నాశనం అయిన కొన్ని వేల పేజీలు సరి చేయాలంటే చాలా సమయము పడుతుంది. నేను ఇన్ని సంవత్సరాలుగా చేసిన పని వృధా. పని తెలిసిన వారే అధికారులు, నిర్వాకులుగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. నేను కొంతకాలము విక్షనరీలో నిర్వాహకునిగా పని చేశాను కాబట్టి, నా బాధ్యతగా కనీసము నేను ఇన్నేళ్ళూ చేసిన పనులు, ఈ రోజు వికీకి పనికి రావని తెలుసుకున్నవారు తెలియ చెప్పటము వలన, అటువంటి వంటివి నాకుగా నేనే తొలగించి, వాటికి సంబందించిన వందలు లేదా వేల పేజీలు సరి చేస్తున్నాను. ఇది మానసిక క్షోభ. ఎంత నరకం. అదే ఒక సభ్యుడిని మాత్రమే అయితే "తప్పకుండా తొలగించండి. నాకు తెలియదు " అని ఒక వాక్యం వ్రాసి, వారి మానాన వారికి ఆ చాకిరీ మొత్తం వదలి వేసి ఉండేవాడిని. మొత్తానికి మొత్తంగా నన్ను వెలి వేశే ప్రయత్నంలో ఉన్నారు. వెళ్ళగొట్టాలని ప్రయత్నాలు. నేను వెళ్ళను. ఎవరినీ వదలను. చేతనయితే చర్చలు చేయండి. ఒకనాడు, ఆనాడు, మొదట్లో అధికారి అయినవారు ఎందుకు ఈ నెలలోనే వారు అధికారాన్ని వదులుకున్నారో తెలియదు. కనీసం నిర్వాకునిగా అయిన పదవి చేయని ఒక వ్యక్తిని ఎకాఎకీన అధికారిని చేయాలని కోటరీ ప్రయత్నం చేస్తున్నది. ఏమిటీ ఈ రాజకీయాలు ? ఇదేనా మన వికీ సంస్కృతి, సంప్రదాయం ? ఇలా చేస్తే మనం ఎక్కడికి పోతాం ? రాబోయే అధికారి కూడా ఎంత కాలం ఉంటారో తెలియదు. వారు కొంత మందిని నిర్వాహకులను వారికి నచ్చిన వారిని నియమించుకోవచ్చు. ఆ తదుపరి కొంతకాలనికి వారి అధికారాన్ని వదులుకుని, ఆ అధికారే వారికి నచ్చిన వారిని కొత్త అధికారిగా ప్రతిపాదించ వచ్చును. ఇలాంటి పనులు ప్రయత్నాలు ఇక్కడ కూడా ఉన్నాయి, సాగుతున్నాయి అంటే అసహ్యంగా అనిపించటము లేదా ? బయట అన్నిచోట్ల ఇలాంటి రాజకీయాలు, అనేక విధాలయిన రాగింగ్‌లు (మానసిక రాగింగ్, శారీరక రాగింగ్, రాజకీయ రాగింగ్, ఆఫీస్ రాజకీయ, మానసిక శారీరక రాగింగ్) ఇక్కడ కూడానా. ఇది పైసా యాచించని పరమ పవిత్రమయిన ఒక దేశసేవా కార్యక్రమం. ఆ సంగతి ఏందుకు గుర్తుకు రావడము లేదు. ఈ మూలాలు పట్టుకునే రాబోయే భవిష్యత్తులో ప్రాంతీయ భావాలు వస్తాయి. చదువరులకు ఓపిక ఉంటే చరిత్ర వ్రాస్తాను. చర్చలు చేయాలనుకునే వారు న్యాయస్థానములో ఉన్నామనే భావనతోనే చర్చ చేయండి. విక్షనరీలో ఒకరు ఓ రకమయిన పని చెబుతారు. ఆ తదుపరి కొన్ని నెలల తరువాత అసలు వారు వచ్చి ఇది మొత్తం తొలగించాల్సిందే అని అంటారు. కొన్ని మచ్చుకకు తీసివేస్తారు. అ తరువాత ఆ పని మొత్తం మనం చేశాము కాబట్టి తొలగించాల్సిందే. లేకపోతే కోటరీలోని వారే అనవసర ప్రచారాలు, వెంటాడు, వేటాడు అనే వివిధ పద్ధతులు ప్రయోగిస్తారు. అలా చేశారు, చేస్తున్నారు. ఇలాంటివి నాకు కొత్త కాదు. ఒకరిని ఇబ్బందుల్లో పెట్టాలనుకుంటే మీరెంత లోతుల్లో ఊబిలోకి కూరుకు పోతారో తోటి సభ్యులు ఒకసారి ఊహించుకోండి. నేను ఎంతగానో అభిమానించే నా తల్లి లాంటి విక్షనరీ ఈ రోజు విధవ విక్షనరీ అయింది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:18, 2 మే 2013 (UTC) ఉదా: ఈ క్రింద ఒక చర్చ చూడండి.[ప్రత్యుత్తరం]

క్రియా పదాలు

మార్చు

విక్షనరీలో ఎక్కువగా నామవాచకాలు ఉన్నాయి. క్రియా పదాలను అభివృద్ధి చేద్దామనుకుంటున్నాను. సుమారు 150 పైగా క్రియా పదాలుగా వర్గీకరించబడ్డాయి. వర్గం:తెలుగు క్రియలు చూడండి. ఇంకా ఎక్కువగా వర్గీకరించాల్సినవి ఉండేవుంటాయి. ప్రతి క్రియా పదానికి క్రియా ప్రత్యయాలను మూడు కాలాలలో ఒక పట్టికగా తయారుచేస్తున్నాను. ఉదా: ఆడు చూడండి. మీ సలహాలను అందించండి. [:head|te|verb form] మూస తెలుగులో పనిచేయునట్లు చేయాలి. గమనించండి.Rajasekhar1961 (చర్చ) 11:46, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా బగుంది. దీనిని కొనసాగించి క్రియా పదాలను అభివృద్ధి చేస్తే బాగుంటుంది. --T.sujatha (చర్చ) 13:06, 1 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]


చర్చ చదివారు-----------సంతోషం--------------తేడా తెలుసుకోవాలి ఇప్పుడు------------

సభ్యులకు, విక్షనరీ చర్చ సంఖ్య(69) క్రియా పదాలు: ఇప్పుడు, "మూస:te-verbtable" అనే మూస [3] విక్షనరీకోసం తయారు చేసింది 7.11.2012 లో నేను. కానీ ఇప్పుడు 1.5.2013 జరుగుతున్న చర్చలో [4] సంభాషణలు ఏవిధంగా ఉన్నాయి, సరి అయిన రీతిలో స్పందించక, పుట చరిత్రలు తెలుసుకొనక అధికారుల (వీక్షణ జాబితా చూడకుండా) ఇచ్చే సమాధానాలు గమమించండి. ఎలా ఉన్నాయో ? తమరు చేస్తున్నాము అని చెప్పుకోవటము ఇదేమి విడ్డూరం ? ఇదేం పద్ధతి ?.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:58, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను మూసను తయారుచేయలేదు. ఆ మూసను ఉపయోగించి విక్షనరీలొనున్న క్రియా పదాలకు పట్టికలను తయారుచేస్తానన్నాను. గమనించండి. ప్రసాద్ గారు. మీరు విక్షనరీలొ సీనియర్ సభ్యులు. నేను గత కొన్ని రోజులుగా రైల్వేలకు చెందిన విభాగాలకు చెందిన వ్యాసాలకు తొలగింపు మూస చేర్చాను; తొలగించలేదు. తొలగించే అధికారం నాకు లేదు. కానీ సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితానుండి కొందరు వ్యక్తుల వ్యాసాలకు కూడా తొలగింపు మూసను చెర్చాను. కొన్నింటిని సుజాతగారు తొలగించారు. మీరు అభివృద్ధిచేసిన విక్షనరీని ఇంకా బాగుచేద్దామని మా ఆలొచన; పాడు చేద్దామని కాదు. మీ మనస్తాపానికి నేనే కారణం అయితే క్షమించండి. సభ్యుల కోసం ఇది నేను రాస్తున్నాను. ఈ చర్చను సాగదీసి మీ సమయాన్ని వృధా చేయవద్దు. మనం చేయాల్సింది చాలా ఉంది. దాని మిద దృష్టి పెడదాము.Rajasekhar1961 (చర్చ) 04:39, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, నమస్కారం. మీరు వాడిన భాష అర్థము అదే వస్తున్నది. అయినా మూస ఎవరు చేశారన్నది కాదు సమస్య. ఆమూస పద్దతిలో అనేక పదాలు చేర్చాము. ఉదా: [5] చేర్చాను/చేర్చాము. ప్రస్తుతము అసలు ఆ మూస ఉండాలో లేదో అనేది మనము అధికారులని అడగాలి. తర్వాత నేని విక్షనరీలో నిర్వాహకుడిని కాదు. ఆ విషయము మీ అందరకూ తెలుసు. అందువల్ల మీరు తొలగింపు మూసలు పెట్టినా నేను తొలగించలేని పరిస్థితి. అందుకనే తొలగించలేదు. సుప్రసిద్ధ ఆంధ్రుల జాబితా విషములో అవి నేను పొందు పరచలేదు. తొలగించే అధికారం నాకు లేదు. మండలాలు, ఇంటిపేర్లు, పురుషుల పేర్లు, స్తీల పేర్లు కూడా మీరు సూచించి పొందు పరచినవే. మనము వాటి గురించి కూడా చర్చ చేయాలి అధికారులతో ఇప్పటికయినా. తిరిగి వారు ఎప్పటికి అందుబాటులోకి వస్తారో లేక రారో తెలియని పరిస్థితి. మనము అన్నింటి గురించి ఇప్పుడే అడిగి తెలుసుకుందాము. నేను, మీరు, అందరూ తప్పకుండా కలిసి పని కోసమే పాటు పడుతున్నాము, అలాగే ముందు ముందు కలిసి పనిచేద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:20, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రసాద్ గారు విక్షనరీలో మీరు చాలాకృషిచేశారు. దానిలో వస్తున్న మార్పులు మీకు చాలా మనస్తాపంకలిగించినట్లున్నాయి. మీ కృషి అంతా కొత్తవారికి తెలియకపోవచ్చు. అలాగే ఏ పదాలు విక్షనరీకి తగినవి అనేదానిలో భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. ఒక్కోసారి ఇంగ్లీషు వికీలో చేస్తున్నారుగదాఅని మనం తెలుగు వికీలో చేర్చినా అందరికి అది నచ్చకపోవచ్చు. ఇంగ్లీషు వికీలో ఎందుకుచేర్చారు అని విశ్లేషించినప్పుడే దానికి తగిన కారణాలు తెలుగు వికీకి సరిపడతాయో లేదో తెలియవచ్చు. వికీలలో పనిచేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మనము చేసిన మార్పులన్నీ శాశ్వతంగా ప్రదర్శితమవ్వవు. వికీప్రాజెక్టు మూల సూత్రాలకు దగ్గరిగావుండి చాలా ఎక్కువమందికి ఆమోదయోగ్యమైనమార్పులు స్థిరపడతాయి. వికీ అభివృద్ధి నిరంతరప్రవాహం లాంటిది. భిన్నాభిప్రాయలను సామరస్యపూర్వకమైనచర్చలద్వారా పరిష్కరించుకొని సాధ్యమైనంత ఎక్కువమందికి ఆమోదయోగ్యమైన విధానాలను అమలులోకి తెచ్చుకొన్నప్పుడే అభివృద్ధి సాధ్యం. అందుకని ముందు మీరు చేసిన మార్పులను మీరు స్వంతంగా రద్దుచేయవద్దు. విక్షనరీ గురించిన మూలసూత్రాలగురించి మీ అభిప్రాయాలను దానికి సంబంధించిన మీ కృషిని విక్షనరీ ప్రాజెక్టు పేజీలలో తెలియపరచండి. భిన్నాభిప్రాయాలపై చర్చలు చేయండి. వాటి ప్రకారం తదుపరి మార్పులకు సహాయం చేయండి. ఇంకో సలహా ఏమిటంటే వికీసోర్స్ ప్రాజెక్టులో ముద్రితమైన పుస్తకాలను పాఠ్యీకరణ చేయడం ప్రధాన లక్ష్యం కాబట్టి భిన్నాభిప్రాయలకు అవకాశం పెద్దలేదు. ఆసక్తి వుంటే కొన్నాళ్లు ఆ ప్రాజెక్టు పై దృష్టి పెట్టండి. అన్నట్లు విక్షనరీకి సంబంధించిన చర్చలను విక్షనరీ రచ్చబండలో లేక ప్రాజెక్టుపేజీలలో చేసి ఎక్కువమందికి తెలియాలనుకున్నప్పుడు వికీపీడియా రచ్చబండలో వార్తగా రాస్తే బాగుంటుంది. --అర్జున (చర్చ) 05:24, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, నిజానికి ఈ నిర్వాహకత్వంపై చర్చలు మీ అభ్యర్ధనతోనే రచ్చబండలోనే ప్రారంభమయ్యాయి. నేను సుజాత గారిని మొదట అధికారిగా ప్రతిపాదించటం కూడా ఆవిడ అధికారి అవగానే మీ నిర్వాహకత్వాన్ని శాశ్వత ప్రాతిపాదికన పునరుద్ధరించగలరని ఉద్దేశ్యంతోనే. మీరు నిర్వాహకత్వానికి, అధికారి హోదాకు అక్కరలేని వెయిటేజి ఇస్తున్నారు. వాటి వళ్ళ వచ్చే స్వలాభమేమీ లేదు. అవి ఇంతకు ముందు నేను చర్చలో చెప్పినట్టు అవి కృషికి గుర్తింపులు కాదు. అలా అయితే వికీపీడియాలో యాభై వేలకు పైగా మార్పులు చేర్పులు చేసి గణనీయమైన కృషి చేసిన రాజశేఖర్ గారు అందరికంటే ముందు అధికారులుగా ఉండేవారు. అవి కేవలం access levels మాత్రమే తెలుగులో వాటిని పిలవటానికి సరైన పదం దొరక్క హోదాలన్నామే కానీ నిజానికి అవి హోదాలు కావు. --వైజాసత్య (చర్చ) 04:44, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

పని నేర్పే వాళ్ళు కావాలి

మార్చు

వైజాసత్య గారు, నేను ఏ పనికి అనవసర హోదా కల్పించుట లేదు. ఆ పదవులు ఏమిటో ఒక మాజీ నిర్వాహకునిగా నాకు కొంత అవగాహన ఉంది. ఎవరు ఏ పదవులలో ఉన్నా వారి నాణ్యమైన సేవలు ఎంతవరకు సభ్యులకు అందుబాటులో ఉంటాయి అని నేను వాదించేది. ఎంతో ఆసక్తి గల ఒక వాడుకరి తను చేయు పని గురించి వికీ పద్ధతులలో సరి అయిన మార్గములో పదవులలో ఉన్నవారు దారి చూపించితే, ఆ వాడుకరి మరికొంత మెరుగైన సేవలు (కొత్త పనులు) అందించటానికి ఆస్కారము ఉంటుంది. అలా కాకుండా కొన్ని సంవత్సరాల తదుపరి ఎప్పుడో మొదటగా మొదలు పెట్టి పొందుపరచినవి వికీ నియమాలకు విరుద్ధము అని పదవులలో ఉన్నవారు చెప్పి, ఆ పని అంతా తొలగిస్తే ఆ వాడుకరి మానసిక పరిస్థితి, స్థితి ఎలా ఉంటుంది ? ఉదా: భాస్కర నాయుడు గారు పొందు పరచిన వేల పేజీలు వికీ (విక్షనరీ) పద్ధతులకు అనుగుణంగా ఖచ్చితంగా లేవు. ఆ లోపాలు గురించి ప్రతి పేజీలో వ్రాయమంటే వ్రాస్తాను. మరి ఎవరూ ఆ విషయము ఈ రోజువరకు వారికి ఎలా చేయాలో తెలియ చెప్పరు. నేను నాయుడుగారికి చెప్పాను. సమాధానము అడగలేదు. నేనే ఆయనకు చెప్తానంటే ఆయన అడగరు. నిర్వాహకత్వం అనే పదవి వాడుక భాష తెలుగులో ఇంట్లో పనిమనిషిని పెట్టుకున్నట్లే అని ఆర్థం. (నేను సంస్థను కాని ఎవరిని కించపరచినట్లు కాదని గ్రహించ వలయును) అందుకని administrators, bureaucrats గురించి ఇదివరకు ఆంగ్లములో చదివాను, కొంత తెలుసుకున్నాను. నేను ఇక్కడ ఇంకా ఎంతో పని నేర్చుకోవాల్సినది ఉంది. అది కూడా కొంతమంది అనుభవము ఉన్నవారి దగ్గర నేర్చుకోవాలి. నేను నిరంతర విద్యార్థిని. నాకు పని చెప్పి నేర్పేవాళ్ళూ ఉంటే చాలా సంతోషిస్తాను. ఎటువంటి విషయానికి అయినా త్వరిత గతిన జవాబులు/పరిష్కారాలు ఉంటే వాడుకరు లందరకు ఉపయుక్తంగా ఉంటుంది. నేను పదవులు పంచటము అనేది కొంతకాలము వాయిదా వేయమని ప్రతిపాదించాను, అడుగుతున్నాను. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద వ్యతిరేకత లేదు. మరో విషయం, వారు వారు వివిధ పదవులకు (నిర్వాహకుడు,..) సమర్పించిన దరఖాస్తు ఆహ్వానపత్రికలో అనవసర చర్చలు ఎందుకని నా మనసుకు అనిపించి మానుకున్నాను. అక్కడే మీరు వ్రాయమని అడిగినా వ్రాయలేదు. నా అభిప్రాయాలు రచ్చబండ వివిధ శీర్షికలో (విభాగాలలో) మీకు చాలా అంశాలు, వాక్యాలు దొరుకుతాయి. వికీ పద్ధతులకు అనుగుణంగా, అక్కడ పొందు పరచడానికి, మీకు ఏవి బావున్నవి అనిపిస్తే, వాటిని కాపీ, పేస్ట్ చేస్తే నేను తప్పకుండా సరిచూసి సంతకము చేస్తాను. ఇప్పటి వరకు తప్పుల తడకగా సాగుతున్న విక్షనరీ పేజీలను ప్రస్తుతము అందుబాటులో ఉన్నవారి ద్వారా సరిచేయాల్సిన అవసరం ఉంది. లేదా ఎవరు తప్పులు చేశారో వారే సరిద్దిద్ద వలసి ఉంది. ఈ పని చాలా ముఖ్యం. లేకపోతే ఇంక ముందు ముందు పనికిరాని పేజీలు పెరిగిపోతూ ఉంటాయి. ఇక్కడ మనకు గౌరవ అధికారులు, నిర్వాహకులు అనే పదవులు లేవు. ఉంటే మీరన్నట్లు సుజాతగారు, డా.రాజశేఖర్ గారు మరికొంత మంది అనేక హోదాలలో ఉండేవారు. ఇప్పుడు ఈ నెలలోనే (మహోత్సవం జరిగిన నెల) పదవులు పందేరం చేస్తే తోటి వాడుకరులలో వేరే చెడు వ్యతిరేక అభిప్రాయము వారి వారి మనసులలో నాటు కుంటుందని కొంతకాలము వాయిదా వేయమని అడుగుతున్నాను. కేవలం పనిని పెంచి పైసా రాని పదవుల కోసం కాదు నా వాదన. నా గురించి ఈ విషయం (నేను విక్షనరీలో ఒక మాజీ నిర్వాహకుడిని అని తోటి వాడుకరులు కొంతమందికి నా అభ్యర్థన పంపి ఉన్నాను) అసలు మొదలయిందని అందరికీ తెలుసు కాబట్టి, మీరు లేదా మరొకరురో ఏదో పదవి నాకే ప్రతిపాదించి ఇస్తే తీసుకునేందుకు నాకు ఇది సరి అయిన సమయము కాదని నా అభిప్రాయము. మరి కొంతకాలము విక్షనరీ పద్ధతులకు అనుగుణంగా అందరం పనిచేస్తాము. లేదంటే మీ అభిప్రాయము ప్రకారం ఓటింగ్ ప్రక్రియ 5.5.13న ముగించండి. ఎలాగూ వాడుకరు లందరూ ఎన్నికలలో ఓటు వేయరు. అంతమాత్రము చేత వారు విద్వేషులు ఎవరికీ కారు. నేను ముందుగా అన్నట్లు ఎవరు ఏ ఏ అధికారులవుతారో వారందరికి సహకరిస్తాను, కలిసి పని చేస్తాను అని తెలియజేసాను. అలాగే ఉంటాను.జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:23, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు విక్షనరీ పరిధి ఎంతవరకు? ఎంతవరకు సాధ్యం? ఏం సాధించగలం? అన్న ప్రశ్నలు నాకు మొదటి నుండి ఉండేవి. ఇప్పటికీ నాకు అంత అవగాహన లేదు. వ్యక్తిగతంగా నాకు విక్షనరీలో ఆసక్తి లేదు. కాస్త బండి ముందుకు కదల్చటానికి మాత్రమే నిర్వాహకత్వాన్ని తీసుకున్నాను. ఇప్పుడు మీలాంటి ఐదారుమంది క్రియాశీలక సభ్యులు పనిచేస్తున్న తరుణంలో మీకు ఎవరి సహాయం అవసరం లేదు. నాలాంటి అవగాహన లేని వాళ్ళు అక్కడ సముదాయాన్ని నిర్దేశించడం సమంజసమైన పని కాదు. వికీలో అన్ని నిర్ణయాలు సముదాయం మూకుమ్మడిగా తీసుకునేవే. ఏకాభిప్రాయ సాధన ఫలితంగా తీసుకున్న నిర్ణయం అందరికీ పూర్తిగా రూచించకపోవచ్చు. అది సహజమే. విక్షనరీలో చాలా ప్రధాన విషయాలు కూలంకషంగా చర్చించలేదు. ఎందుకంటే మునుపెన్నడూ ఇప్పుడున్నంత సందడి లేదు. మీరు అంటున్న విక్షనరీ మూస, అప్పటికి సభ్యులకున్న అరకొర అవగాహనతో అప్పటికి పని జరిగేందుకు తయారుచేయబడింది. చర్చించాలనుకుంటే తప్పకుండా చర్చింవచ్చు. చర్చల ఫలితంగా పద్ధతులు మారవని ఖచ్చితంగా చెప్పలేము. ఈ రోజు ఒక పద్ధతి నిర్ణయించినా, కొన్నేళ్ళ తర్వాత మరో కొత్త పద్ధతి రాదు / రాకూడదని లేదు. మూసలు ఎన్ని మారినా, అసలు విషయం పదిలంగా ఉంటుందని మాత్రం చెప్పగలను. ఇక ఈ చర్చ విక్షనరీలోనే కొనసాగిస్తే బాగుంటుందేమో? --వైజాసత్య (చర్చ) 07:18, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు మీ త్వరిత స్పందనకు ముందుగా ధన్యవాదములు. అక్కడకు ఈ చర్చ మొత్తం పొందుపరచాను. ప్రస్తుతము నేను చురుకుగా ఉన్న వాడుకరిని. నేను చేసిన పని సరి అయిన పద్ధతిలో లేదు అని వెంటనే చెప్పితే తప్పు సరిద్దిద్దు కుంటాను. అంతేకాని, కొన్ని నెలలకో, సంవత్సరాలకో తెలియజేస్తే ఎంతవరకు సబబు, సమంజసము ? నేను కొంతకాలానికి వీటి నుంచి దూరంగా ఏ కారణాల వల్లనో అందరికీ ఓ మాజీగా దూరం అవ్వవచ్చును. అప్పుడు ఏ సంస్థ ఎలా ఏవిధంగా ఉన్నా, ఉంటే నేను చూడను (చూడలేను) నాకనవసరం అవుతుంది. మీరు చెప్పే పద్ధతి వల్ల చర్చలు చాలా ఆసక్తికరంగా చాలా ఆశాజనకంగా అన్నిచోట్ల ఉంటాయి. పాతవారు ఎప్పుడూ మాలాంటి (కొత్త)వారికి మార్గదర్శకులే. పునాదులను మరచిపోము. ఎప్పటికీ ఎవరూ మరచి పోకూడదు అని నా భావన. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:24, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
భాస్కరనాయుడుగారు 8 నెలలు శ్రమించి 30,000 వేల విక్షనరీ పేజీలను యాంత్రికంగా తయారుచేస్తే (ప్రదీప్ గారు బాటును ఉపయోగించి మాత్రమే ఇంతటి పనిచేయగలిగారు) ప్రసాద్ గారిలాంటి సీనియర్ సభ్యులు అవి నిరుపయోగం అనడం చాలా తప్పు. ఆయనికి ఆ పని చేయమని చెప్పింది నేను కాబట్టి ఆ ? తప్పు ఏదైనా వుంటే అది నాదేనని భావిస్తున్నాను. ఎవరో నేర్పించాలి, ఏదో ఎవరో చేయాలి అనడం కన్నా మీరే ఆ పని చేయవచ్చును కదా. మీరు చేసిన చిన్న తప్పులకు గుర్తించి వాటిని సరిచేయడానికి ప్రయత్నించడం కూడా తప్పంటారేమో.Rajasekhar1961 (చర్చ) 13:14, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 గారు, మీరు అసలు విషయాల్ని సరిగా అర్థం చేసుకోవడము లేదనే అనిపిస్తున్నది. మీరే చెబుతున్నారు అవి యాంత్రికంగా తయారు చేసినవి, మీరు ఆ పని చేయమని చెప్పాను అని అంటున్నారు. యాంత్రికంగా చేసినవి అవి సరిగా లేవనే నేను చెప్పేది. అది తప్పు ఎలా అవుతుంది. అసలు ఆ పేజీలు ఎలా ఉండాలో ఒకసారి కొన్ని పేజీలలో చర్చలు చేద్దాము. ఒకరిని పని చేయమని చెప్పలేము. ఎవరు చెప్పినా చేయనవసరము లేదు ఎవరికి. కాని ఎవరైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఎలా చేయాలో అప్పుడే చెబితే చేసిన పని మరల మరలా చేయనవసరముండదు అని నేను చెబుతున్నాను. తప్పులు ఎవరయిన సరిదిద్ద వచ్చును. మీకు తెలియదేమో నాయుడు గారు చేసిన పేజీలలో నేను సరిదిద్దుతున్నాను. ఆయన గమనించటము లేదు. మీరు గమనించి ఆయనకు చెప్పండి. ఎలా చేయాలో. అందరికీ శ్రమ తగ్గుతుంది. నాకు తెలిసినది అసలు పదాలు ఎలా పొందు పరచాలో, నేను వ్రాసినవి చూడండి. ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేదే లేదు. మీరు సరిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 16:42, 3 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీసోర్స్ లో తెలుగు కురాన్

మార్చు

తెలుగులో కురాన్ అనువాదం, కురాన్ భావామృతంని వికీసోర్స్ లో చేర్చేదుకు గత సంవత్సరమ్నర కాలం నుండి కృషి జరుగుతుంది. ఐతే చాలా తక్కువ ఫలితం వచ్చింది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏకబిగిన రెండు రోజులపాటు పూణేలో నిర్వహిస్తున్నాం. నేనూ, ఫజ్లుర్ రహ్మాన్ కలిసి ఈ కృషిని పూర్తి చేయబోతున్నాం. ఇది 10, 11 తారీకుల్లో పూణేలో జరుగుతుంది. ఆసక్తిగలవారు పాల్గొనగలరు. ఇప్పటి వరకూ జరిగిన కృషిని ఇక్కడ చూడవచ్చు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:44, 2 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇక్కడ తెలుగు కురాన్ పాఠ్యం చేర్చడం పూర్తయింది. ఇక ప్రూఫ్ రీడింగ్ ఇంకా ప్రదర్శన, చదవడానికి అనువుగా ఈ పాఠ్యాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. మీ సూచనలు ఆ వ్యాసపు చర్చ పేజీలో తెలుపగలరు. రహ్మానుద్దీన్ (చర్చ) 16:42, 6 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీలో కురాను సూరాల ఎర్రలింకులకు వికీసోర్స్-కురాన్ భావామృతం లో గల సూరాలకు లింకులు ఎలా ఇవ్వాలో తెలిపేది. అహ్మద్ నిసార్ (చర్చ) 17:49, 13 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రతి సూరా కు ఒక ప్రత్యేక వ్యాసాన్ని చేర్చి{{మూస:Wikisource}} ను చేర్చడం సరియైన పద్ధతి. కానీ ప్రస్తుతానికి బయటి లింకుగా వదిలివేయండి. బయటి లింకుగా వికీసోర్స్ లింక్ ఇచ్చి, పాఠ్యం సూరా పేరు ఉంచేయటం మేలు. రహ్మానుద్దీన్ (చర్చ) 19:51, 13 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు గణాంకాలు

మార్చు

ప్రాజెక్టు గణాంకాలలో పరిభాషను సవరించాలని అనుకుంటున్నాను. ముఖ్యత అనే పదం తెలుగులో ఉందోలేదో నాకు తెలియదు కానీ అది కాస్త ఎబ్బెట్టుగా మాత్రం ఉంది. ప్రాముఖ్యత మరింత మెరుగైన పదం. అలాగే అతిముఖ్యం, చాలాముఖ్యం ఫర్వాలేదు కానీ కొంచెం ముఖ్యం, తక్కువ ముఖ్యం అన్నపదాలు సరిగా ధ్వనించట్లేదు. విశేషంఅయ్యేది, మంచి‌అయ్యేది కూడా ప్రత్యామ్నాయాలను సూచిస్తే బాగుంటుంది --వైజాసత్య (చర్చ) 05:36, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

భాషపరంగా అవి సరైనవో కాదో నాకు తెలియదు. అంతకు ముందు జిల్లాల ప్రాజెక్టులోనుండి తీసుకొని వాడుతున్నాను. మీకు తప్పనిపిస్తే మార్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 18:20, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అవి ప్రదీపు గారు తయారుచేశారు. నేనూ వాటిని ఇతర ప్రాజెక్టుల్లో ఉపయోగించాను. కానీ అప్పుడు మూసలను కదిలించడం ఎందుకులే అని వాటికి జోలికి వెళ్ళలేదు. ఇప్పుడిప్పుడే మార్చాలని కాదు. ఆ దిశగా ఒక ఆలోచన అంతే --వైజాసత్య (చర్చ) 03:00, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాటు చేసే పనికి ...

మార్చు

తెలుగు ప్రముఖుల జాబితాలో వ్యాసాల పేర్లను చేర్చడం, చర్చాపేజీలలో మొలక, ఆరంభ విషయాన్ని చేర్చడం బాటుద్వారా సునాయాసంగా చేసే పనికి మానవప్రయత్నం అవసరమా! ఇటీవల కొందరు ఇలాంటి పనిచేసే బదులు వ్యాస నాణ్యత మెరుగుపరిస్తే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:44, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసాన్ని చూడకుండా సెకనుకు నాలుగైదు దిద్దుబాట్లు చేస్తూ పెద్ద వ్యాసాలలో కూడా మొలక స్థాయిలను చేర్చడం ఎంతవరకు సమంజసం. ఉదా.కు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చూడండి.దీన్నీ మొలకగా నిర్థారించారు. మానవప్రయత్నంగా చేసిననూ ఒక్కో వ్యాసాన్ని పరిశీలించి స్థాయిని నిర్థాలించాలి కాని దిద్దుబాట్లు పెంచుకోవడానికి ఇలా చేయడం సమంజసం కాదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:52, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు, జిల్లాలకు చెందిన ప్రముఖుల వర్గాలలో ఇలా వేల వ్యాసాలలో కేవలం వ్యాసస్థాయి మూసపెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? (సభ్యులకు కాదు, తెవికీకి). ఇది రెండో దశలో బాటు చేయాల్సిన పని. అలాగే చురుకైన సభ్యులు అధికసంఖ్యలో ఉన్నప్పుడు చేయాల్సిన పనిది. అసలు అంతపెద్ద ప్రాజెక్టు పని తీసుకోవడం కూడా ఇబ్బందే. తెలుగు ప్రముఖులలో ఏదేని ఒక రంగానికి చెందిన ప్రముఖులను తీసుకొని పూర్తిచేసి మరో రంగ ప్రముఖుల పని చేస్తూంటే ఫర్వాలేదు. వేలాది వ్యాసాలుంటే పెద్ద ప్రాజెక్టు పని త్వరలో పూర్తి కావడం చాలా ఇబ్బంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:20, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సినిమాలకు చెందిన వ్యాసాలలో ప్రదీప్ గారు వేలాది వ్యాసపు చర్చాపేజీలలో బాటుద్వారా ప్రాజెక్టు మూసను చేర్చారు చూడండి=> వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతీయ సినిమా. ఈ ప్రాజెక్టు మూసను కూడా బాటుద్వారా చేయవచ్చుకదా! సి. చంద్ర కాంత రావు- చర్చ 17:28, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతా, ఇక్కడ ఎవరూ దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటానికి అలా చేస్తున్నారని అనుకోను. కాబట్టి మీరా వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలి. మొదట ప్రాజెక్టు పరిధిలో ఉన్న వ్యాసాలన్నీ గుర్తించడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ పనిని తొందరగా ముందుకు సాగించే క్రమంలో ఒక్కో వ్యాసాన్ని బేరీజు వేసి మూస చేర్చటం లేదని మాత్రం తెలుస్తుంది. బాటు నిడివిని అంచనా వేసి మొలక అని తేల్చగలదు కానీ నాణ్యత అంచనా వేయటం కష్టమే. మీరన్నట్టే చిన్న చిన్న అంచెలలో ఈ ప్రాజెక్టు పట్టు పట్టు పట్టాలని ఈ ప్రాజెక్టు చర్చా పేజీలో గుర్తించడమైనది. --వైజాసత్య (చర్చ) 17:29, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సునాయాస పనికే ప్రాధాన్యత ఇస్తూంటే అలా అనుకోవాల్సి వస్తుంది. ఇది కేవలం ఇప్పటి విషయము కాదు. కొందరు సీనియర్ సభ్యులు సంవత్సరాల తరబడి ఇలాగే చేస్తున్నారు. ఒక్క దిద్దుబాటు చేసేచోట కూడా పదేసి దిద్దుబాట్లు చేసిన సంగతి నేను గతంలో కూడా బాగా గమనించాను. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:34, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకే వేళ అదే నిజమనుకున్నా, దాన్ని వాళ్ళకు ఒనగూడే లాభమేమీ లేదు. వికీకి వచ్చిన నష్టమేమీ లేదు కదా. కాబట్టి దాన్ని వదిలెయ్యండి. ఇది సదుద్దేశంతో ప్రారంభించిన ఒక మంచి ప్రాజెక్టు. కాబట్టి ఇలాంటి చిన్న విషయాలు పక్కన పెట్టి కలిసి పనిచేద్దాం. నేను సభ్యుల దృష్టికి అందని తెలుగు ప్రముఖుల వ్యాసాలను వెలికి తీసేందుకు ఒక బాటు స్క్రిప్టు వ్రాస్తున్నాను. రాజశేఖర్ గారు బాటుతో ప్రాజెక్టు మూసలు చెయ్యమని అడిగారు కానీ సమయం తీరలేదు. త్వరలోనే చేస్తాను --వైజాసత్య (చర్చ) 17:41, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
లాభంలేదని మనం అనుకుంటున్నాం, మనదృష్టిలో లాభం లేకపోవచ్చు గాక, ఇక దాన్ని వదిలేద్దాం, కాని ఇతర సభ్యుల అభిప్రాయాలను మాత్రం ఇక్కడ ఎవరూ అంగీకరించడం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 17:56, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ నమస్కారం. నా దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవడానికి చేయడం లేదు. మరో త్రోవ నాకు తెలియకనే యాంత్రికంగా చేస్తున్నాను. మీరు, రహ్మానుద్దీన్, వైజాసత్య, అర్జునరావు లాంటివారు; బాటుతో చేయాల్సిన పనుల్ని స్వీకరిస్తే నేను సంతోషిస్తాను. నేను మరికొందరు నాలాంటి చిన్నవాల్లు వ్యాసాల్ని విస్తరించడం మీద దృష్టిసారిస్తాము. మీలో ఎవరు ఈ బాధ్యతను స్వీకరిస్తారో చూడండి. నాకేదో వికీలో లాభం వస్తుందని మాత్రం నేను పనిచేయడం లేదు. తెలుగువారికి; భారతీయులకు చెందిన చాలా జాబితాలు ఉన్నాయి. కాని అందరు తెలుగువారిని ఒకే వేదికమీదకు తెద్దామని మాస్టర్ జాబితాగా దీనిని తయారుచేస్తున్నాను. దయచేసి అర్ధం చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 18:27, 4 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, మీరు ఈ వ్యాఖ్యలకు స్పందిస్తారనుకోలేదు. ఇక్కడ చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరూ లేరు. సభ్యులందరూ సమానమే. తెవికీలో మీరు చేసిన కృషి ఘనమైనది. అయినా వికీలో పెద్ద పెద్ద మార్పులే చెయ్యాలని ఎక్కడా లేదు. మీరు తోచినది మీరు చేస్తున్నారని నాకు అర్ధమైంది. అందుకే వెంకటరమణ గారు తదితరులు మీకు సహాయం చెయ్యటానికి ముందుకు వచ్చారు. నేనూ కొన్ని పేజీలలో ప్రాజెక్టు మూసలు అతికించాను. చొరవ తీసుకొని మార్పులు చెయ్యటం వికీ మార్గదర్శకాలలో ఒకటి. పెద్ద పెద్ద మార్పులే చెయ్యాలన్నిది వికీ మార్గదర్శకం కాదు. --వైజాసత్య (చర్చ) 02:56, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రారంభంలో నేను కొత్త సభ్యుడిగా ఉన్నప్పుడు మరి నాకెందుకు చెప్పారు? ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా? మహబూబ్‌నగర్ జిల్లా గ్రామవ్యాసాలలో జనాభా వివరాలు చేరుస్తున్నప్పుడు ఎందుకు వారించారు? ప్రారంభంలో గ్రామవ్యాసాలలో మూసలు అతికించేటప్పుడు ఎందుకు చెప్పారు? ఇప్పుడు ఈ పని నేను కొనసాగిస్తాను. ఇక్కడ ఎవరి సూచనను మరెవరూ పాటించే అవసరం లేదని కొత్త ఒరవడిని లేవనెత్తారు! అలాగే కొనసాగిద్దాం. ఇక నాకు చెప్పే అవసరం లేదు. సి. చంద్ర కాంత రావు- చర్చ 08:00, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ మహోత్సవం జరిగినపుడు హెచ్.ఎం.టివి. సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ రామచంద్రరావుగారు. కొన్ని ప్రశ్నలు అడిగారు వాటిలో ముఖ్యమైనది. తెలుగు ప్రముఖులలో చాలా మందిని గురించిన వ్యాసాలు వికీలో లేవు అనేది. ఆ సమయంలో ఆయనకు మాట ఇవ్వడం జరిగింది. మీరే చూడండి గడిచే కొన్ని రోజులలో ఎందరి ప్రముఖులు తెవికీలో కనిపిస్తారో అని. తెవికీలో ఉన్న, లేని అందరి జాబితా వెంటనే సిద్దం చేస్తే క్లారిటీ వస్తుందని అనుకొన్నాం అప్పుడు. రాజశేఖర్ గారు అది చేస్తున్నరు. కనుక సంతోషం. వికీలో ప్రతి ఒక్కరూ వారి సమయాన్ని, వెచ్చించడం ద్వారా డబ్బు, సమయం. నెట్ వినియోగం ద్వారా డబ్బును, ఆరోగ్యాన్ని చాలా కోల్పోతున్నారనేది నిజం. అలాంటప్పుడు వారు చేసే మార్పు చిన్నదైనా, పెద్దదైనా చెయ్యనివ్వడం ఉత్తమం. కొత్త సభ్యులకు లేదా కొందరు పాత సభ్యులకు కూడా బాట్ వినియోగం తెలియదు. వారు పాత వ్యాసాలను చూసి అలా మార్పులు చేస్తుంటారు. ఆ మార్పులను బాట్ ద్వారా మాత్రమే చేయాలి. మానవ ప్రయత్నం ద్వారా చేయకూడదు అని నిర్ధారించలేం. అందరి కోసం చేసే మంచిపని గురించి అందరినీ ప్రోత్సహించాలి కాని నిరుత్సాహపరచకూడదు..విశ్వనాధ్ (చర్చ) 14:41, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషం. ఇదివరకు నాకూ అప్పటి సీనియర్ సభ్యులు ఇచ్చిన సూచనలు పాటించాను. నేనూ అదే సూచనలు చాల సభ్యులకు తెలియజేశాను. అలా మంచి సూచనలు ఒకరినుంచి మరొకరికి తెలియజేయడం మంచి పద్దతి అని ఇన్నాళ్ళు అనుకున్నాను. అలా మంచి సూచనలు చెప్పడం తప్పని ఇప్పుడు తెలుస్తోంది. సరే నేనూ అదే పద్దతిని పాటిస్తాను మరి. బాటుద్వారా చేయాల్సిన దిద్దుబాట్లను చేసిననూ తప్పుపట్టరాదని, పెద్ద దిద్దుబాట్లే చేయాల్సిన అవసరం లేదని మన పేద్ద అధికారి వైజాసత్య ఇచ్చిన విలువైన సూచనను పాటిద్దాం. కొసమెరుపు ఏమిటంటే ఇప్పుడు చిన్నదిద్దుబాట్లు తప్పుకాదని ఎవరు చెప్పారో ఆ సీనియర్ సభ్యుడే ఐదారేళ్ళక్రితం నేను కొత్త సభ్యుడిగా ఉన్నప్పుడు బాటుద్వారా చేయాల్సిన దిద్దుబాట్లు వద్దని నాకు వారించారు. ఇప్పుడు అదే సూచనను నేను చెప్పడం పెద్ద తప్పయింది. రేపు ఎవరో ఎల్లయ్య వచ్చి అక్షరానికో దిద్దుబాట్లు చేస్తున్ననూ మనం ఏమీ చెప్పరాదేమో! తెవికీలో నాణ్యతేప్రధానం కాని దిద్దుబాట్లు ప్రధానం కాదని నేను అనుకోవడం కూడా తప్పేనేమో! సి. చంద్ర కాంత రావు- చర్చ 15:36, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చంద్రకాంతరావు గారూ, నేను బాటు ద్వారా చేసే పనులను చేత్తో చేసి సమయం వృధా చేసుకోవద్దని చాలాసార్లు చాలామందిని వారించాను. మిమ్మల్ని కూడా అలాగే వారించి ఉంటాను. మీరు అలాగే రాజశేఖర్ గారిని, వెంకటరమణ గారిని వారించడాన్ని నేను తప్పు పట్టలేదని గ్రహించాలి. మీరు దిద్దుబాట్ల సంఖ్య పెంచుకోవటం కోసమే మూసలు అంటిస్తున్నారన్న అభియోగాన్ని మాత్రమే అభ్యంతరపెట్టాను. ఇలా ఉద్దేశంపై అభియోగాలు నిరూపించడం కష్టం. ఇలాంటి పరిస్థితి "అవతలి వాళ్ళు సదుద్దేశంతో వ్యవహరిస్తున్నారని అనుకోవాలి" అనే నియమాన్ని పాటించకపోవటం వళ్లనే వచ్చింది. ఇంకా నేను ద్వంద్వ వైఖరితో వ్యవహరించినట్టు మీకనిపిస్తే నన్ను క్షమించగలరు. సమయం వృధా చేసుకోవద్దని నేను వారించటం కేవలం సభ్యుల శ్రమ మీద గౌరవం వళ్ళనే. ఇది ఏ వికీ నియమానికి సంబంధించినది కాదు. మీకు గ్రామాల వ్యాసాల్లో గణాంకాలు చేర్చాలని అనిపిస్తే, దానికి అడ్డుచెప్పగల నియమమేమి లేదు. --వైజాసత్య (చర్చ) 01:06, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మండలాల ప్రాజెక్టులో ప్రగతి

మార్చు

ఇప్పటి వరకూ, సెన్సస్ వారి సైటు నుండి జనాభా లెక్కలు చేర్చడం పూర్తయింది. అనుకున్న విధంగా కృష్ణా జిల్లాలోని అన్ని మండలాలలో జనాభా వివరాలు చేర్చాను. ఇక ప్రత్యేక మండలం చేపట్టి ఆ మండలంలో ఉన్న పుణ్య క్షేత్రాలు భౌగోళిక స్థితి లాంటి సమాచారాలు చేర్చుతున్నాను. ఇంకా ఏమయినా సూచనలు ఉంటే తెలుపగలరు. కృశ్హ్ణా జిల్లా వరకు మాత్రమే ఇది చేయాలనుకుంటున్నాను. రహ్మానుద్దీన్ (చర్చ) 15:00, 5 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శాసనసభ నియోజక వర్గాలు

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని శాసనసభ నియోజక వర్గాలకు చెందిన 1956నుండి ఎన్నికల ఫలితాలు పి.డి.ఎఫ్. ఫార్మాటులో ఉన్నాయి. ఎవరైనా చిన్న బాటును ఉపయోగించి ఒక పట్టికలాగా చేస్తే బాగుంటుంది. నాకు బాట్లు వాడటం రాదు. దయచేసి చెప్పండి.Rajasekhar1961 (చర్చ) 12:33, 6 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను ప్రయత్నించగలను. పీడిఎఫ్ ఇక్కడ ఎక్కించండి. వివరాలు ఆంగ్లంలో ఉంటే బాటు పట్టిక తయారు చేయగలదు కానీ ఆ తర్వాత అందరం కలిసి పేర్లను తెలుగులోకి మార్చాల్సి వస్తుంది. --వైజాసత్య (చర్చ) 11:16, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ స్పందనకు ధన్యవాదాలు. నేను అన్ని పీడిఎఫ్ లను ఇక్కడ ఇస్తాను. బాటుతో తయారుచేసి; అందరం కలిసి అనువాదం చేద్దాము. దీనిని ఆంగ్ల వికీపీడియాలో కూడా ఉపయోగించవచ్చునా?Rajasekhar1961 (చర్చ) 17:16, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకసారి పట్టికలు చేసిన తర్వాత అవి ఆంగ్ల వికీలో కూడా అంటించవచ్చు. --వైజాసత్య (చర్చ) 22:29, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ జాబితాలు భారత ఎన్నికల సంఘం వెబ్‌సైటు [6] లో ఉన్నాయి. 1955 శాసనసభ ఎన్నికల ఫలితాలు [7], 1957 ఫలితాలు [8], 1962 ఫలితాలు [9], 1967 ఫలితాలు [10], 1972 ఫలితాలు [11], 1978 ఫలితాలు [12], 1983 ఫలితాలు [13], 1985 ఫలితాలు [[14], 1989 ఫలితాలు [[15], 1994 ఫలితాలు [16], 1999 ఫలితాలు [17], 2004 ఫలితాలు [18] ఇక్కడ వున్నాయి. దయచేసి అన్ని శాసనసభ నియోజక వర్గాలకు పట్టికలను తయారుచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 03:47, 12 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సందేశం చూశాను. ఈ పని మీదే ఉన్నాను --వైజాసత్య (చర్చ) 02:10, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర్ గారు, మీరు ఇక్కడ లింకు ఇచ్చిన ఫైల్లలో పూర్తి ఫలితాలు లేవు. కానీ అదే వెబ్‌సైట్లో మరో విభాగంలో పూర్తి ఫలితాలు ఉన్నాయి. తొలిప్రయత్నంగా 2009 ఎన్నికల ఫలితాల ఫైలును తీసుకోని దానిలో సమాచారాన్ని ఒక స్క్రిప్టు ద్వారా వికీ పట్టికగా తయారుచేశాను. అది ఇక్కడ చూడండి. ఇందులో అన్ని నియోజకవర్గాల సమాచారం ఒకే పట్టికలో ఉన్నా చివరన అన్ని సంవత్సరాల పట్టికలను క్రోడికరించి నియోజకవర్గాల వారిగా పట్టికలు చేస్తాను. ఈ పట్టికకు ఏమైనా సూచనలు ఉంటే చేయగలరు --వైజాసత్య (చర్చ) 05:23, 13 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
పని మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు. ఈ పట్టికలొని విభాగాలు సరిపొతాయి. ఇలాంటి వికి పట్టికల్ను అన్ని ఎన్నికల సంవత్సరాలకు తయారుచేసి; తర్వాత వాటిని అన్నిటిని కలిపి వేరువేరు నియోజకవర్గాల వారిగా పట్టికలను తయారుచేస్తామనుకుంటున్నారు కదా. బాగుంది. ఈ సమాచారం సరిపోతుంది. దీనిలో మీకు చిన్న సమస్య రావచ్చు. అదేమంటే కొన్ని నియోజకవర్గాలు మధ్యలో మార్చబడ్డాయి. అందువలన అన్ని నియోజకవర్గాలు 1955 నుండి 2009లో వరకు ఒకే విధంగా ఉండవు. కాబట్టి జాబితాలు ఉన్న నియోజకవర్గాల కంటె ఎక్కువగా తయారు అవుతాయి.Rajasekhar1961 (చర్చ) 05:43, 15 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త అధికార ప్రతిపాదనలు

మార్చు

తెవికీ సభ్యులందరికీ నమస్కారం, తెవికీని మరింతగా ముందుకు నడిపేందుకు రాజశేఖర్ గారిని, చంద్రకాంతరావు గారిని అధికారులుగా ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదనలకు ఇక్కడ మద్దతును ప్రకటించమని విజ్ఞప్తి

--వైజాసత్య (చర్చ) 22:34, 7 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • వికీపీడియాకు నిర్వాహకులు ఎంతమంది అయినా ఉండవచ్చు. అధికారులు తక్కువగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. అధికారికి నేర్పు, ఓర్పు, సహనం , అందరినీ కలుపుకు పోగలిగిన తత్వం కావాలి అప్పుడే సభ్యులు తమ పనులు సక్రమంగా చేసుకుని పోగలరు. ఇందుకు వైజాసత్య గారు చాలు. వారి మార్గదర్శకత్వంలో అందరం చక్కగా పనిచేసుకు పోగలము. అందరికీ అందుబాటులో ఉండేవారు చురుకుగా క్రియాశీలకంగా ఉండే అర్జునరావుగారు ఉన్నారు. ప్రస్థుతం వారిద్దరి మార్గనిర్దేశకత్వం చాలన్నది నా అభిప్రాయం. రాజశేఖర్ గారు, చంద్రకాంత్ రావు గారూ ఇద్దరి మీద నాకు గౌరవాభిమానాలు ఉన్నప్పటికీ ఈ ప్రతిపాదన నాకు అంగీకారం కాదు అని తెలియజేస్తున్నాను.--t.sujatha (చర్చ) 02:52, 8 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఏ హోదాకు ఇంతమంది అని పరిమితి లేనప్పటికి,ఆ హోదాలలో క్రియాశీలంగా వున్న వారి సంఖ్య ఆ ప్రాజెక్టు పురోగతికి దృష్టాంతంగా నిలుస్తుంది. హోదాలో వున్న వారు ఎప్పుడు చురుకుదనం తగ్గించుకుంటారో తెలియదు కాబట్టి, అర్హత,ఆసక్తివున్నవారికి అధికారికహోదా ఇవ్వటం మంచిదేననుకుంటాను. --అర్జున (చర్చ) 04:12, 9 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:StatusLeastConcern

మార్చు

మూస:StatusLeastConcern ఈ మూస అనేక వృక్ష సంబంధిత వ్యాసాలలో ఎర్ర లింకుగా కనిపిస్తుంది. ఈ మూస వృక్ష స్టేటస్ ను చూపించే మూస, ఈ మూసను పనిచేసేలా చేయవలెనని మనవి. YVSREDDY (చర్చ) 15:28, 17 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మూస:టాక్సానమీ పెట్టె ద్వారా పై మూస వాడబడుతున్నది. ఇంగ్లీషులో పోలిన మూస చాలా మార్పులకు లోనయ్యింది. దీనిని సరిచేయటానికి మొదట ఆ మూసని తెలుగులో ప్రవేశపెట్టి మార్పులు చేసిన వైజాసత్యగారే సరిఅనుకుంటాను. --అర్జున (చర్చ) 05:41, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
రెడ్డి గారు, మూసలు తాజాగా ఆంగ్ల వికీ నుండి దిగుమతి చేశాను. ఇప్పుడున్న పద్ధతిలో ఆ స్టేటస్ మూసల అవసరం లేదు. ఏదైనా మొక్క యొక్క సంరక్షణా స్థాయిని తెలిపేవిధానానికి మూస:టాక్సానమీ పెట్టె చూడండి. ఇంకా ఎక్కడైనా ఈ టాక్సానమీ పెట్టెలు చెదిరినట్టు మీకు కనిపిస్తే తెలియజేయగలరు. నేను వాటిని సరిచేస్తాను --వైజాసత్య (చర్చ) 09:21, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మహోత్సవం 2013 లో జరగకుండా ఆగిపోయిన చర్చలు

మార్చు

వికీపీడియా:రచ్చబండ (ఇతరత్రా) వద్ద తెవికీ మహోత్సవం 2013 లో చర్చకు వచ్చీ, చర్చించబడని విషయాలను చేర్చాను. వీటిలో చర్చాయోగ్యమయినవి విడిగా ఒక విషయంగా చర్చిద్దాం, కానివాటికి సమాధానం అక్కడే చేర్చండి. రహ్మానుద్దీన్ (చర్చ) 15:18, 18 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నంది పురస్కారాలు

మార్చు

మూస:భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు తయారుచేసినట్లుగానే; నంది పురస్కారాలు లోని అన్ని వర్గాలకూ కలిపి ఒక మూస తయారుచేస్తే బాగుంటుంది. నంది పురస్కారాలు పొందిన వ్యక్తులు మరియు సినిమాలన్నింటినీ ఒక దగ్గరకు తీసుకొనిరావచ్చును.Rajasekhar1961 (చర్చ) 08:48, 19 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఎలాంటి మూస అంటున్నారు? en:Template:NandiAwardBestActor ఇలాంటిదా? లేక en:Template:National Film Awards ఇలాంటిదా? --వైజాసత్య (చర్చ) 05:16, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
Like the Template:National Film Awards. Thank you.05:58, 20 మే 2013 (UTC)

Tech newsletter: Subscribe to receive the next editions

మార్చు
Tech news prepared by tech ambassadors and posted by Global message deliveryContributeTranslateGet helpGive feedbackUnsubscribe • 21:15, 20 మే 2013 (UTC)
Important note: This is the first edition of the Tech News weekly summaries, which help you monitor recent software changes likely to impact you and your fellow Wikimedians.

If you want to continue to receive the next issues every week, please subscribe to the newsletter. You can subscribe your personal talk page and a community page like this one. The newsletter can be translated into your language.

You can also become a tech ambassador, help us write the next newsletter and tell us what to improve. Your feedback is greatly appreciated. guillom 21:15, 20 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న మార్పు చెయ్యాలి

మార్చు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ప్రకటన లో 'సంబందించిన' బదులు 'సంబంధించిన' అని ఉండాలి. దీనికి బాధ్యులైన వారు సరిచేయగోరుచున్నాను.కంపశాస్త్రి 00:27, 24 మే 2013 (UTC)

దోషాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సైట్ నోటీసు లోను మరియు ప్రాజెక్టు మూసలోను దాన్ని సవరించాను. సరేనా.Rajasekhar1961 (చర్చ) 02:34, 24 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]


న్యాయమూర్తి సమాచార పెట్టె

మార్చు

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాబితా ను చేర్చాను. వారి వ్యాసాలు ఆంగ్లంలో ఉన్నాయి. ఆంగ్ల సమాచార పెట్టెను తెవికీలోకి చేర్చితే వారి వ్యాసాల్ని అనువదిస్తాను.Rajasekhar1961 (చర్చ) 10:31, 22 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

చిన్న మార్పు

మార్చు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ప్రకటనలో 'సంబంధించిన ' అని ఉండాలి, 'సంబందించిన ' అని కాదు.కంపశాస్త్రి 02:32, 24 మే 2013 (UTC)
దోషాన్ని సరిచేసినందుకు ధన్య వాదాలు. కంపశాస్త్రి 09:09, 24 మే 2013 (UTC)

ఇదేమి చోద్యం!

మార్చు

ఈ రోజు మే 24 విశేషాలు లో ఉన్న బ్రిటన్ రాణి విక్టోరియా పైన క్లిక్ చేస్తే ఈ పేజీ లేనేలేదు, సృష్టించండి అని వస్తోంది. కాని వెతుకు పెట్టె లో బ్రిటన్ రాణి విక్టోరియా ను వెతుకమంటే, ఆ పేజీ తెరుచుకుంటోంది. ఇదేమి చోద్యం! నేనేమైనా తప్పు చేస్తున్నానా? కంపశాస్త్రి 09:06, 24 మే 2013 (UTC)

శాస్త్రి గారు, నేను వ్యాసం పేరును సూక్ష్మంగా పరిశీలిస్తే బ్రిటన్ లోని నకారం తర్వాత ఖాళీ స్థలంతో పాటు en:Zero-width non-joiner అనే character ఉంది. మే 24 విశేషాలలో ఇచ్చిన లింకులో మాత్రం అలా లేదు. వ్యాసం పేరు సరిచేస్తాను. అప్పుడు లింకు సరిగా కుదురుతుంది. యూనికోడ్ డెసిమల్ కోడ్లలో వ్యాసం పేరు (3116 3149 3120 3135 3103 3112 3149 8204 32 3120 3134 3107 3135 32 3125 3135 3093 3149 3103 3147 3120 3135 3119 3134) - 32 అంటే స్పేసు, 8204 - ZWNJ --వైజాసత్య (చర్చ) 09:30, 24 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
మీ సహాయానికి ధన్యవాదాలు. కంపశాస్త్రి 10:49, 24 మే 2013 (UTC)

మొలకల జాబితా సహాయం

మార్చు

సభ్యులందరికీ నమస్కారం. గత నెలలో చేర్చబడిన మొలకలలో (వికీపీడియా:మొలకల జాబితా/2013 ఏప్రిల్) ఇంకా 70 మొలకలు మిగిలిపోయాయి. మే చివరి వారానికి వచ్చేస్తున్నాం. ఏడు మంది సభ్యులు తలా ఒక పది మొలకలు విస్తరిస్తే మనం మొలకలను ఆదిలోనే అరికట్టే ప్రయత్నానికి శుభారంభమౌతుంది. నా వంతు నేను ఒక పది మొలకలని విస్తరిస్తాను --వైజాసత్య (చర్చ) 02:17, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేనొక పదింటిని విస్తరిస్తాను. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 04:44, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా మొలకల విస్తరణకు కృషిచేస్తాను.--  కె.వెంకటరమణ చర్చ 05:24, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
19 మొలకలను వాటి మొలకస్థాయి దాటునట్లు విస్తరించితిని.--  కె.వెంకటరమణ చర్చ 07:07, 26 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు చక్కని ఆలోచన. మీరు మొలకల జాబితా పెట్టిన 5 రోజులకే మన వాళ్ళు చాలా చురుకుగా దాదాపుగా అన్ని వ్యాసాలను విస్తరించారు. ఇది ఇలాగే ప్రతి నెలా కొనసాగాలని ఆకాంక్షిస్తూ! విష్ణు (చర్చ)03:40, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సింహభాగాన్ని పూర్తి చేసిన వెంకటరమణ గారికి ధన్యవాదాలు. కొన్ని విలీనాలు, తుడిచివేతలు జరగ్గా ఇంకా ఒక ఇరవై దాకా మిగిలిపోయాయి. ఈ మొలకల విస్తరణ కార్యక్రమం వళ్ల వ్యాసం మొదలుపెడితే కనీసం ఒక రెండు కేబీల పొడవన్నా ఉండాలన్న స్పృహ వచ్చిందనుకుంటున్నాను. మే నెల మొలకల జాబితా తయారుచేశాను. అది ఏప్రిల్ నెల జాబితా కంటే చాలా చిన్నదిగా ఉండటం గమనించదగిన విషయం. --వైజాసత్య (చర్చ) 04:05, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

zwnj కీ తెలుపేది

మార్చు

ము అజ్జిన్ (muazzin) తెలుగులో వ్రాయుటకు 'ము ' తరువాత 'అ ' వ్రాయుటకు కీ తెలుపగోరుతున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 10:23, 25 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

  • ము అ, ము^ అ, ము^అ, ముఅ, ము అజ్జిన్, ము^ అజ్జిన్, ము^అజ్జిన్, ముఅజ్జిన్ : ఇదీ నాకు తెలిసిన క్రమం. ^ = zwnj . కంపశాస్త్రి 10:25, 26 మే 2013 (UTC)

కంచి పేజీ లో సాయం కావాలి

మార్చు

కంచి పేజీ లో మామిడి చెట్టు కాండాన్ని అద్దాల పెట్టె లో ఉంచిన బొమ్మ లో క్రింద వివరణ లేదు; అసలు బొమ్మలో ఉంది. ఇక్కడ కూడా వచ్చేలా చూస్తారా. నాకు అది ఎలాచేయాలో తెలియలేదు. కంపశాస్త్రి 01:46, 28 మే 2013 (UTC)

బొమ్మను thumbnail గా సూచిస్తే కానీ వ్రాసిన వివరణ బొమ్మ క్రింద ప్రదర్శింపబడదు. నేను కంచి వ్యాసంలో సరిచేశాను --వైజాసత్య (చర్చ) 03:33, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. నాకు ఆ విషయం తెలియలేదు. కంపశాస్త్రి 16:14, 28 మే 2013 (UTC)

మిత్రులకు శుభవార్త --- HMTV లో తెలుగు వికీపీడియా

మార్చు

తెలుగు వికీపీడియా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలియజేసే శుభ సమయం విచ్చేసింది. జూన్ 1 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 11 గంటల నుంచి 12 గంటల వరకూ HMTV లో ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం కానున్నదని తెయజేయుటకు చాలా సంతోషం గా ఉంది. ఈ కార్యక్రమం లో తెలుగు వికీపీడియా తరఫున విష్ణువర్ధన్, డా. రాజశేఖర్, రహ్మానుద్దీన్, మరియు నేను పాల్గొననున్నాము. తెలుగు వికీపీడియా గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ తెలియజేసేందుకు, వికీపీడియా గురించి ప్రజలలో ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు, తద్వారా వికీపీడియా మరింత అభివృద్ధి సాధించేందుకు మార్గం సుగమం కాగలదని విశ్వసిస్తున్నాం. తెలుగు వికీపీడియాకు పూర్తి సహాయ సహకారాలందిస్తున్న HMTV ప్రధాన సంపాదకులు శ్రీ రామచంద్రమూర్తి గారికి మన మిత్రులందరి తరఫునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

తెలుగు వికీపీడియా ఉగాది ఉత్సవాలు సందర్భంగా మనందరితో కలసి ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం మే నెల 30,31 తేదీలలో ప్రసారం కానున్నది. ప్రసారవేళల వివరాలు రేపు (బుధవారం) సాయంత్రం తెలుస్తాయి. ఆ వివరాలు అందగానే రచ్చబండ ద్వారా తెలియజేయగలనని మనవి చేసుకుంటున్నాను.Malladi kameswara rao (చర్చ) 07:46, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగా ఇది హర్షించతగిన విషయం. ఇది సాధించిన ఘనత మల్లాదిగారికే చెందుతుంది.t.sujatha (చర్చ) 08:12, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
నిజంగా శుభవార్తే. మల్లాది,విష్ణువర్ధన్,రాజశేఖర్,రహ్మనుద్దీన్ గార్లకు అభినంధనలు. ఇరగదీసేయండి :) (వీలైతే వీడియో స్ట్రీం చేసి గూగుల్ గ్రూప్ మెయిల్లో పెట్టగలరు)....విశ్వనాధ్ (చర్చ) 15:23, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యులు, నిర్వాహకులు, అధికారులు కన్న కలలు ఒక్కటొక్కటీ సాకారం కాబోతున్నాయి. తెలుగంటే, తెవికీ అనే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఆంధ్ర తెలుగు సాహిత్య దిగ్గజ సంస్థల సరసన తెలుగు వికీపీడియా నిలబడాలని మనసారా కోరుకుంటున్నాను. విశ్వనాధ్ గారి స్టెయిల్ మరియు ఆలోచన నచ్చాయి. అందరికీ అభినందనలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:16, 28 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
శుభం. కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుతున్నాను.--అర్జున (చర్చ) 03:31, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

శుభవార్తల పరంపర --- మే 30న 2-00pm నుంచి 2-30pmవరకూ HMTV లో తెలుగు వికీపీడియా

మార్చు

ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడే తెలిసింది. తెలుగు వికీపీడియా ఉగాది ఉత్సవాలు సందర్భంగా మనందరితో కలసి HMTVలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం
మే 30న (గురువారం) 2-00pm నుంచి 2-30pmవరకూ శభాష్ వికీ ప్రసారం కానున్నది.
ఇదే కార్యక్రమం తిరిగి మే 31వ తేదీ శుక్రవారం నాడు ప్రసారమవుతుంది. శనివారం ఫోన్ ఇన్ కార్యక్రమం యధాతధం. ---Malladi kameswara rao (చర్చ) 05:54, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెలికీ చరిత్రలో ఇది ఒక మైలురాయి. ఈ కలను సాకారం చేసిన మాల్లాదిగారికి, వికీపీడియన్ల కోరికను మన్నించి నెరవేర్చిన HMTV అధినేతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.--t.sujatha (చర్చ) 06:34, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
చాలా బాగుంది. ఇది సాకారం చేసిన మల్లాది గారికి, విష్ణువర్ధన్ గారికి, రాజశేఖర్ గారికి, రహ్మనుద్దీన్ గారికి, శుభాభివందనాలు. ఇలాంటిదే ఇదివరకు నాకొక కొంటె అలోచన వచ్చింది. ఏదైనా తెలుగు సినిమాలో, హీరో చే తెవికీ కూల్ గురూ అన్నట్టు ఏదో ఒక సందర్భంలో చెప్పిస్తే బాగుంటుందేమోనని. నవ్వబాకండి --వైజాసత్య (చర్చ) 03:57, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
వైజాసత్య గారు అమెరికాలో మీ ఇంటి పైనే తథాస్తు దేవతలు తిరుగుతున్నట్టుగా ఉందండీ, మీరన్నారో లేదో మల్లాది గారు ఇప్పటికే హీరోను పట్టేసినట్టుగా ఉన్నారు :) --విష్ణు (చర్చ)07:42, 31 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
ఔను ముందు ముందు అది కుడా జరవచ్చు. --t.sujatha (చర్చ) 04:58, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ మిత్రులు, మొదటీ 15 నిమిషాల కార్యక్రమం డిజిటల్ కాపీ ఈ లింకులో చూడండి. http://www.hmtvlive.com/web/guest-public/38?title=_HomePageVideo_WAR_VideoSection_INSTANCE_sQgv_%E0%B0%B6%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B7%E0%B1%8D%20%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80&path=Vaarthalu/2013-05-30_14-00PM.xml&catId=9# -- విష్ణు (చర్చ)14:22, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు

మార్చు
  • ఈ రోజున 2-00pm నుంచి 2-30pmవరకు HMTV లో వచ్చిన "శభాష్ వికీ" కార్యక్రమము అంతా చూశాను. సహ సభ్యుల స్పందనలు గురించి ఎదురు చూసి, చివరికి ఇప్పుడు ఇంక ఉండబట్టలేక చాలా చాలా బాగుంది అని నా స్పందన తెలియజేస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:18, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • మీ స్పందనకు ధన్యవాదాలు జెవిఆర్కె ప్రసాద్ గారు . నాకు చూడటానికి అవకాశం లేదు నా డిటిహెచ్ లో ఆ ఛానల్ రాదు. డిజిటల్ కాపీ లింకు కోసం వేచి చూస్తున్నాను.--అర్జున (చర్చ) 13:22, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఇప్పుడే కార్యక్రమం లైవ్ స్ట్రీమింగ్ చూసాను. చాలా బాగుంది. వికీపీడియా పుట్టుపూర్వోత్తరాలతో పాటు కీలకమైన తెవికీ సభ్యులు వారి కృషి గురించి చాలా చక్కగా చూపించారు. తెలుగు వికీ మహోత్సవం వళ్ళ అనుకున్నదాని కంటే ఎక్కువే సాధించామని నేననుకుంటున్నాను. మల్లాది, రాజశేఖర, రహీమానుద్దీన్ గార్ల కృషికి ధన్యవాదాలు. మల్లాది గారి ఈ కృషి వళ్ళ మన తెవికీ ఒకేసారి పదిమెట్లు ఎక్కేసినట్టు నాకనిపిస్తుంది.
  • ఇలాంటివి ఇంకా కొన్ని కార్యక్రమాల ద్వారా తెవికీ గురించి ప్రతీ తెలుగు వాడికి తెలియచేయడానికి మల్లాదిగారితో పాటు మనందరం కృషి చేస్తే అధ్భుతంగా ఉంటుంది. ప్రతీ తెలుగు వికీపిడియను వారికి తెలిసిన ఇంకో పది మందికి తెవికీ గురుంచి తెలియజేయాలి. ఈ సంవత్సర కాలంలో మనం ప్రతి ఒక్కరం ఇంకో ఇద్దరు చురుకైన వికీపీడియనులను తయారు చేయగలిగితే మన తెవికీని అత్యధ్భుతమైన స్థాయికి తీసుకు వెళ్ళవచ్చు. ఏమంటారు!! బెంగుళూరులో వీరశశిధర గారు మరియు అర్జున గారు ఇప్పటికే ఈ దిశలో కృషి కోసం కంకణం కట్టారూ :) --విష్ణు (చర్చ)06:58, 31 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • ఈ రోజున హెచ్.ఎం.టీవీ లో 11.30 am నుండి 12.00 noon వరకు ప్రసారమైన "శభాష్ వికీ" కార్యక్రమం చాలా బాగుంది. తెవికీ చరిత్ర, దాని అభివృద్ధికి కృషిచేసిన వ్యక్తుల గూర్చి, తెవికీ ఔన్నత్యం గూర్చి అది వివిధ వర్గాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వంటి ఆంశాలను చక్కగా వివరించారు. సహ సభ్యులు విష్ణు,రాజశేఖర్, అర్జున, పాలగిరి,కామేశ్వరరావు వంటి వారి స్పందనల వీడియోలను కూడా చూపించారు.ఈ కార్యక్రమం తెవికీ అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని భావిస్తాను. ఈ కార్యక్రమం ప్రసారంకావడానికి దోహదపడిన మాల్లాది గార్కి, హెచ్.ఎమ్‌టీవీ సంపాదకులు రామచంద్రరావు గారికి ధన్యవాదాలు.--  కె.వెంకటరమణ చర్చ 07:01, 31 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇదీ శుభవార్తే --- మే 31న 11-30am నుంచి 12-00amవరకూ HMTV లో తెలుగు వికీపీడియా (రిపీట్ ప్రోగ్రాం)

మార్చు

తెలుగు వికీపీడియన్లు అందరికీ ఇకనుంచి అంతా శుభవార్తా శ్రవణమే....!
మే 30 (గురువారం)న HMTV లో ప్రసారమైన 'శభాష్ వికీ శుక్రవారం పునః ప్రసారమవుతున్నది.
మే 31న (శుక్రవారం) 11-30am నుంచి 12-00amవరకూ HMTV లో తెలుగు వికీపీడియా - శభాష్ వికీ (రిపీట్ ప్రోగ్రాం)
గురువారం మిస్సయిన మిత్రులంతా శుక్రవారం తప్పక చూడవలసిందిగా విన్నపం. అలాగే మిగిలిన మన మిత్రులకు sms, twitter, FBల ద్వారా తెలియజేయవలసిందిగా ప్రార్థన.

ఇకపోతే... వైజాసత్య గారి ఆలోచన ఆచరణ సాధ్యమే...! అసాధ్యం మాత్రం అస్సలు కాదు...! మనకు తెసిన కొందరు సినిమా మిత్రులతో మాట్లాడుతున్నాను.

అతి త్వరలోనే వైజాసత్య గారి కొంటె ఆలోచన తెలుగు తెరపై సాకారం అయ్యేందుకు శక్తీ వంచన లేకుండా కృషి చేస్తాను. తెవికీ కూల్ గురూ ఆనది ఒక వాడుక పదం అయ్యేందుకు అందరం కలసి కృషి చేద్దాం...! ---Malladi kameswara rao (చర్చ) 09:51, 30 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:బెంగుళూరు తెవికీ సమావేశం : 2 జూన్ 2013

మార్చు

శశిధర్ గారి చొరవతో ఏర్పాటు చేయుచున్న వికీపీడియా:బెంగుళూరు తెవికీ సమావేశం : 2 జూన్ 2013 సమావేశానికి బెంగుళూరులో వున్న వారు తప్పకహాజరవ్వాలని కోరుచున్నాను.--అర్జున (చర్చ) 12:27, 29 మే 2013 (UTC)[ప్రత్యుత్తరం]