వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 91
← పాత చర్చ 90 | పాత చర్చ 91 | పాత చర్చ 92 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2024-01-19 : 2024-05-13
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92, 93 |
తెవికీ 20 వ వార్షికోత్సవ కార్యక్రమం
మార్చు26-28 జనవరి 2024 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే తెవికీ 20వ వార్షికోత్సవ కార్యక్రమ వివరాలు కార్యక్రమ ప్రణాళిక పేజీ లో స్థూలంగా తెలియచేయడమైనది. సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలు.
- తెవికి ప్రోగ్రాం కమిటీ - VJS (చర్చ) 09:18, 19 జనవరి 2024 (UTC)
- అలాగేనండీ @Vjsuseela గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:19, 19 జనవరి 2024 (UTC)
కార్యక్రమం వివరాలు
మార్చు26-28 జనవరి 2024 తేదీలలో విశాఖపట్నంలో జరగబోయే తెవికీ 20వ వార్షికోత్సవ కార్యక్రమం పూర్తి వివరాలు కార్యక్రమ ప్రణాళిక పేజీ లో తెలియచేయడమైనది. సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలు.
- తెవికి ప్రోగ్రాం కమిటీ -
- అలాగేనండీ @Vjsuseela గారు, ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:58, 24 జనవరి 2024 (UTC)
Vote on the Charter for the Universal Code of Conduct Coordinating Committee
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Hello all,
I am reaching out to you today to announce that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) Charter is now open. Community members may cast their vote and provide comments about the charter via SecurePoll now through 2 February 2024. Those of you who voiced your opinions during the development of the UCoC Enforcement Guidelines will find this process familiar.
The current version of the U4C Charter is on Meta-wiki with translations available.
Read the charter, go vote and share this note with others in your community. I can confidently say the U4C Building Committee looks forward to your participation.
On behalf of the UCoC Project team,
ఐపీ అడ్రసుల నిరోధం గురించి
మార్చుకొన్ని రోజుల క్రితం జరిగిన తెవికీ వార్షికోత్సవాల్లో కొన్ని ఐపీ అడ్రసులు నిరోధించడం వలన, లాగిన్ కాలేకవడం, కొత్త ఖాతాలు సృష్టించుకోలేకపోవడం, వ్యాసాలు రాయలేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన సమస్య అని నేను భావిస్తున్నాను. ఈ సమస్య ఎదుర్కొన్న వారు ముందుకు వచ్చి ఆ ఐపీ అడ్రసులు ఏమిటో ఇక్కడ తెలియజేస్తే, నిర్వహక హోదాలో వాటిని పరిశీలించి అవి ఎందుకు నిరోధించబడ్డాయో, ఇప్పుడు వాటిని అలాగే ఉంచాల్సిన అవసరం ఉందా లేదా అని పరిశీలించి ఒకవేళ నిరోధం అవసరం లేకపోతే వెంటనే నిరోధం తొలగించడానికి ప్రయత్నిస్తాను. ఈ సమస్య మనకు హెచ్చరిస్తున్న మరో విషయం ఏమిటంటే ఐపీ అడ్రసుల నిరోధం విధించేటపుడు, మనం కొంత ఓపికగా వ్యవహరించాలి. ముఖ్యంగా నిరవధికంగా నిషేధం, ఐపీ అడ్రసుల రేంజిని నిషేధం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎవరైనా ఆకతాయిలు, ట్రోల్స్ చేసే పనికి నిజమైన కంట్రిబ్యూటర్లు ఇబ్బందిని ఎదుర్కొనే ఆస్కారం ఉంది. నిర్వహకులందరూ ఇది గమనించాలి. ఐపీఅడ్రసు నిరోధం విధించే ముందు రచ్చబండలోనూ, నిర్వాహకుల నోటీసు బోర్డులోనూ ఒక సందేశం ఉంచండి. - రవిచంద్ర (చర్చ) 14:22, 29 జనవరి 2024 (UTC)
- ఐపీ అడ్రస్ స్థాయిలో కన్నా, వాడుకరి స్థాయిలో నిరోధాన్ని సడలిస్తే, ఆ వాడుకరి వరకూ వికీపీడియా దిద్దుబాట్లకు అడ్డంకి ఉండదు. ఐపీ నిరోధం కేవలం తెవికీ పై చేసిన చర్యల వల్లే కాదు, ఇతర వికీల్లో ఆ ఐపీ నుంచి ఏ ఆకతాయి వాండలిజం చేసినా, మళ్ళీ నిరోధం వచ్చి, కథ మొదటికి వస్తుంది. ఆయా వాడుకరులు తాము ముబైల్ నుంచి లాగిన్ అయ్యి ఆంగ్ల వికీలో ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ (ఇందుకు మనం ఎవరైనా ఖాతా కోసం ఉన్న పేజీ లాంటి అభ్యర్థన పేజీని తెవికీలో తయారు చేయాల్సి ఉంది) ముబైల్ డేటా వాడి ఆ పేజీలో అభ్యర్థన చేసుకుంటే, వాడుకరి స్థాయిలో మనం సడలింపు ఇవ్వవచ్చు. ఐపీ అడ్రస్ స్థాయిలో ఇస్తే, ఇంతకు మునుపు ఏ కారణాల వలన ఐపీ అడ్రస్ నిరోధించారో(ఆ యూనివర్సీటీ లోని ఇతర విద్యార్థులు ఆంగ్ల వికీ లేదా కామన్స్ లేదా వేరే ప్రాజెక్టుల్లో చేసిన వాండలిజం) అది పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. -- రహ్మానుద్దీన్ (చర్చ) 14:42, 29 జనవరి 2024 (UTC)
- మనం సమస్య ఇంకా పూర్తి అర్థం చేసుకోలేదనుకుంటున్నా. వాడుకరిని నిరోధించామంటే వారు ఏదో ఒక దుశ్చర్యలు చేసినదానివల్లే అయిఉంటుంది. కాబట్టి ఆ వాడుకరిపై నిరోధాన్ని సరైన చర్చలేకుండా సడలించలేము. సమస్య ఎదుర్కొన్న వారు ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమ సమస్యను ఇక్కడ ఏకరువు పెడితే ఈ సమస్యను మూలం ఏమిటో తెలుసుకునే వీలుంటుంది. అప్పటిదాకా మనం చేసేది ఊహాగానాలే అవుతాయి. - రవిచంద్ర (చర్చ) 16:21, 29 జనవరి 2024 (UTC)
- సమస్య ఇది - వాడుకరులు యూనివర్సిటీ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అవుతున్నారు. ఆ ఐపీ అడ్రస్ పై నిరోధం ఉండటం వలన వారు ఎడిట్ చేయలేకపోతున్నారు. అందుకు కారణం, ఎక్కువ మంది ఉండే ప్రదేశాలలో, పబ్లిక్ నెట్వర్క్‌లలో ఒకే ఐపీ అడ్రస్ నుంచి వందలు, వేలు సంఖ్యలో వికీపీడియా చూస్తారు, అదే సంఖ్యలో ఎడిట్లు చేస్తారు. అందులో కొన్ని ఎడిట్లు ఆకతాయి ఎడిట్లుంటాయి. మరొక విషయం- కొన్ని సార్లు ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఎక్కువ ఎడిట్లు, ఖాతా సృష్టి అధిక సంఖ్యలో జరిగినా ఆ ఐపి అడ్రస్ పై (తక్కువ నిడివి- ఒక రోజు అలా) ఐపీ నిరోధం ఉంటుంది. నేను వర్క్‌షాపులకు వెళ్ళిన ప్రతీ చోటా ఇలాంటి అనుభవం నాకు విదితమే. ఈ విషయమై నేను ఆ రోజుల్లో అధికారి హోదాకు అభ్యర్థన కూడా చేసుకున్నాను. ఒకవేళ నిరోధం వ్యక్తి స్థాయి అయినా పైన చెప్పుకున్న మార్గదర్శకాల ప్రకారమే ఆ వ్యక్తి తాను ఇక మీదట ఐపీ నిరోధానికి గురి చేసిన చర్యలు చేయనని చెప్పి సడలింపు కోరవచ్చు. -- రహ్మానుద్దీన్ (చర్చ) 20:52, 29 జనవరి 2024 (UTC)
- అంటే ప్రస్తుతానికి లాగిన్ సమస్య లేనట్లేనా? సభ్యనామంపై నిరోధం లేని సభ్యులు నిరోధం విధించిన ఐపీ అడ్రసు నుంచి లాగిన్ అయితే అవగలరు కానీ మార్పులు చేయలేరు. ఎక్కడెక్కడ (వ్యాసాలు, చర్చలు, వగైరా) మార్పులు చేయలేరు అన్నది నిరోధం విధించిన తీరు మీద ఆధారపడి ఉంటుంది అనుకుంటున్నా. నేను ఇప్పటి దాకా సభ్యనామంపై నిరోధం లేకపోతే వారు నిరోధించిన ఐపీ అడ్రసు నుంచి అయినా మార్పులు చేయగలరేమో అనుకున్నా. అది తప్పు అని మీ మాటల వల్ల అర్థం అవుతుంది.
- సమస్య ఇది - వాడుకరులు యూనివర్సిటీ ఐపీ అడ్రస్ నుంచి లాగిన్ అవుతున్నారు. ఆ ఐపీ అడ్రస్ పై నిరోధం ఉండటం వలన వారు ఎడిట్ చేయలేకపోతున్నారు. అందుకు కారణం, ఎక్కువ మంది ఉండే ప్రదేశాలలో, పబ్లిక్ నెట్వర్క్‌లలో ఒకే ఐపీ అడ్రస్ నుంచి వందలు, వేలు సంఖ్యలో వికీపీడియా చూస్తారు, అదే సంఖ్యలో ఎడిట్లు చేస్తారు. అందులో కొన్ని ఎడిట్లు ఆకతాయి ఎడిట్లుంటాయి. మరొక విషయం- కొన్ని సార్లు ఒకే ఐపీ అడ్రస్ నుంచి ఎక్కువ ఎడిట్లు, ఖాతా సృష్టి అధిక సంఖ్యలో జరిగినా ఆ ఐపి అడ్రస్ పై (తక్కువ నిడివి- ఒక రోజు అలా) ఐపీ నిరోధం ఉంటుంది. నేను వర్క్‌షాపులకు వెళ్ళిన ప్రతీ చోటా ఇలాంటి అనుభవం నాకు విదితమే. ఈ విషయమై నేను ఆ రోజుల్లో అధికారి హోదాకు అభ్యర్థన కూడా చేసుకున్నాను. ఒకవేళ నిరోధం వ్యక్తి స్థాయి అయినా పైన చెప్పుకున్న మార్గదర్శకాల ప్రకారమే ఆ వ్యక్తి తాను ఇక మీదట ఐపీ నిరోధానికి గురి చేసిన చర్యలు చేయనని చెప్పి సడలింపు కోరవచ్చు. -- రహ్మానుద్దీన్ (చర్చ) 20:52, 29 జనవరి 2024 (UTC)
- మనం సమస్య ఇంకా పూర్తి అర్థం చేసుకోలేదనుకుంటున్నా. వాడుకరిని నిరోధించామంటే వారు ఏదో ఒక దుశ్చర్యలు చేసినదానివల్లే అయిఉంటుంది. కాబట్టి ఆ వాడుకరిపై నిరోధాన్ని సరైన చర్చలేకుండా సడలించలేము. సమస్య ఎదుర్కొన్న వారు ఒక్కొక్కరు ముందుకు వచ్చి తమ సమస్యను ఇక్కడ ఏకరువు పెడితే ఈ సమస్యను మూలం ఏమిటో తెలుసుకునే వీలుంటుంది. అప్పటిదాకా మనం చేసేది ఊహాగానాలే అవుతాయి. - రవిచంద్ర (చర్చ) 16:21, 29 జనవరి 2024 (UTC)
అయితే సమస్య ఎదుర్కొంటున్న వారు నన్ను సంప్రదిస్తే అధికారి హోదాలో నేనేమైనా చేయగలనా? అభిలాష్ గారూ మీ సమస్య చెప్పండి. - రవిచంద్ర (చర్చ) 07:50, 30 జనవరి 2024 (UTC)
- ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో మాత్రమే నిరోధం విధించినట్లు అగుపిస్తోంది. సమస్యను ముందుకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు రవిచంద్ర గారూ! రహ్మనుద్దీన్ గారు చెప్పిందీ సరైనదే. -అభిలాష్ మ్యాడం (చర్చ) 05:24, 31 జనవరి 2024 (UTC)
- ఈ సమస్యను పరిష్కరించడంలో ఇప్పటికే ఆలస్యం చేశామేమో. ఎవరెవరు సభ్యులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారో చెబితే రహ్మాన్ చెప్పినట్లు వారికి ఇది ఎందుకు జరుగుతుందో వివరించి ఐపీ నిరోధం నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. - రవిచంద్ర (చర్చ) 06:59, 31 జనవరి 2024 (UTC)
- వాడుకరి హక్కుల మార్పు పేజీలో మీరు అధికారిగా/నిర్వాహకుడిగా ఐపీ నిరోధం నుంచి వాడుకరికి సడలింపు ఇవ్వవచ్చు. -- రహ్మానుద్దీన్ (చర్చ) 05:59, 31 జనవరి 2024 (UTC)
- వాడుకరులకు ఇబ్బందిలేకుండా నిరోధం తొలగించవచ్చును. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో ఏదో లోపం జరిగినట్లుగా భావించాల్సివస్తుంది. యర్రా రామారావు (చర్చ) 07:00, 31 జనవరి 2024 (UTC)
ప్రతి ఆదివారం ఉదయం వికీపీడియా వాడుకరుల సమావేశం, ఆన్లైన్‌లో ప్రత్యక్ష శిక్షణ, సహాయ-సహకార చర్చ గురించి.
మార్చు@ప్రణయ్ తెవికీ ద్విశతాబ్ది పండగ కార్యక్రమంలో భాగంగా జరిగిన వికీపీడియా భవిష్యత్తు చర్చలో(చర్చ గురించిన నివేదిక, చర్చలో వచ్చిన ప్రతిపాదనలు, సూచనల గురించి @చదువరి గారు త్వరలో వివరాలు అందిస్తారు.) పలు అంశాలను సూచిస్తూ ఆన్‌లైన్‌లో ప్రత్యక్ష శిక్షణ, పరస్పర సహకారంపై చర్చ గురించి ప్రస్తావించారు. ఈ సమావేశానికి అనువైన వేదిక ఏది ఉంటే బావుంటుంది?(గూగుల్ మీట్, జిట్సి మీట్, వాట్సాప్ గ్రూప్ చాట్, టెలిగ్రాము గ్రూపు చాట్, వగైరా.) మొదటి సమావేశం ఎప్పుడు పెట్టుకోవచ్చు(ఈ వచ్చే ఆదివారమే మొదలుపెట్టుకోవచ్చని నా అభిప్రాయం)? వచ్చే రెండు నెలలలో నేను కాస్త తీరికగా ఉంటాను కనుక, నేను ఈ విషయంలో చొరవ తీసుకోగలను. ఇందుకు కావాల్సిన వికీ పేజీలను, నిబంధనలను రూపొందించేందుకు ఇతర సభ్యుల సహాయం కావాలి. -- రహ్మానుద్దీన్ (చర్చ) 14:30, 29 జనవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @రహ్మానుద్దీన్ గారు. తెవికీలో ఒక పేజీని ఏర్పాటుచేసి అందులో ఆ శిక్షణ వివరాలు చేర్చి, దాని చర్చాపేజీలో వాడుకరులు రాసిన శిక్షణ అంశాలను పరిశీలించి ఒక్కోవారం ఒక్కో అంశంమీద శిక్షణ అందించాలన్నది ఈ ఆన్లైన్‌లో శిక్షణ ఉద్దేశ్యం. గతంలో నాణ్యతాభివృద్ధి-ఆన్‌లైన్ శిక్షణా తరగతులు అనే వికీప్రాజెక్టు పేజీ ఉంది. దానికే ఒక ఉపపేజీ పెట్టాలా లేక ఈ శిక్షణల కోసం మరో కొత్తపేజీ పెట్టాలా అన్నది చర్చించుకొని నిర్ణయించుకుందాం. అయితే, ఆన్లైన్‌లో శిక్షణ తరగతుల నిర్వహణలో ఇప్పటికే ఆలస్యమైంది. అందరికీ అంగీకారమైతే వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 4) నాడు ప్రారంభించుకుందాం. ఈ విషయంలో ఇతర సభ్యులు తమ అభిప్రాయాలను తెలుపగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:53, 31 జనవరి 2024 (UTC)
- కొత్త పేజీయే పెడదాం. -- రహ్మానుద్దీన్ (చర్చ) 05:18, 31 జనవరి 2024 (UTC)
- ప్రత్వేకపేజీ అవసరంలేదు అనుకుంటాను.ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వివరించగలరు.అలాంటి ఇబ్బందులు ఉంటే కొత్తపేజీ పెట్టుకుందాం.మంచికార్యక్రమం.అవసరం కూడా.వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 4) నాడు ప్రారంభించుకుందాం. యర్రా రామారావు (చర్చ) 15:33, 31 జనవరి 2024 (UTC)
- కొత్త పేజీయే పెడదాం. -- రహ్మానుద్దీన్ (చర్చ) 05:18, 31 జనవరి 2024 (UTC)
- మంచిదండి. మొదలుపెట్టండి.ధన్యవాదాలు.--VJS (చర్చ) 15:24, 31 జనవరి 2024 (UTC)
- శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకూ ఆసక్తి ఉంది. ఆదివారం మధ్యాహ్నం కానీ, సాయంత్రాలు అయితే నాకు మరింత వీలుగా ఉంటుంది. అందరికీ ఆమోదయోగ్యమైన సమయం చూసి నిర్ణయించగలిగితే మంచిది. - రవిచంద్ర (చర్చ) 16:54, 31 జనవరి 2024 (UTC)
- సాయంత్రం అయితేనే బాగుంటుంది.ఆదివారం కాబట్టి వేరేపనులు చూసుకోవటానికి పగలు ఎక్కడికైనా వెళ్యటానికి అవకాశం ఉంది. యర్రా రామారావు (చర్చ) 04:40, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- నా ప్రాధాన్యత కూడా సాయంత్రం అండి. వెసులుబాటుగా ఉంటుంది. --VJS (చర్చ) 05:17, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- అందరూ చురుకుగా పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నందున, ఈవారంలోనే ప్రారంభం శుభసూచకం. సాయంత్రం సమయమైతే నాకు అనుకూలం. వేరు పేజీ అవసరం లేదనుకుంటాను. నేను కొందరికి నేర్పడం మొదలుపెట్టాను.Rajasekhar1961 (చర్చ) 06:31, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఆసక్తి ఉంది. ఆదివారం సాయంత్రం అయితే బాగుంటుందని నా అభిప్రాయం.--Tmamatha (చర్చ) 08:33, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకూ ఆసక్తిగా ఉంది. శనివారం సాయంత్రం సమయమైతే బాగుంటుంది. ఆదివారం అయితే వాళ్ళ పనులు చూసుకోవటానికి, ఎక్కడికైనా వెళ్లడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు--Divya4232 (చర్చ) 08:37, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @రహ్మానుద్దీన్ గారు. ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరం. ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులను రికార్డు చేసి అందరికి అందుబాటులో ఉంచితే బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా ఈ ఆన్లైన్ శిక్షణ తరగతులు సమయం లో హాజరు కాలేకపోయినా తర్వాత చూడవచ్చు. నాకు కూడా సాయంత్రం సమయం వీలుగా ఉంటుంది (శనివారం, ఆదివారం) ఎపుడైనా పర్లేదు. ధన్యవాదాలు. V Bhavya (చర్చ) 09:35, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- ఈ చర్చలో పాల్గొన్న రహ్మానుద్దీన్, యర్రా రామారావు, VJS, రవిచంద్ర, Rajasekhar1961, Tmamatha, Divya4232, V Bhavya గార్లకు ధన్యవాదాలు. ఆన్లైన్ శిక్షణ తరగతుల పేజీ ఏర్పాటు, శిక్షణ వివరాలు, అంశాలు, సమయం వంటివి చర్చించడానికి ముందస్తుగా ఈ ఆదివారం (ఫిబ్రవరి 4) మధ్యాహ్నం 2 గం.ల నుండి 3 గం.ల వరకు గూగుల్ మీట్ ద్వారా ఒక చిన్న సమావేశాన్ని నిర్వహించకుందాం, తమ అభిప్రాయాలను తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:17, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- అలాగే అండి V Bhavya (చర్చ) 17:01, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- ఈ చర్చలో పాల్గొన్న రహ్మానుద్దీన్, యర్రా రామారావు, VJS, రవిచంద్ర, Rajasekhar1961, Tmamatha, Divya4232, V Bhavya గార్లకు ధన్యవాదాలు. ఆన్లైన్ శిక్షణ తరగతుల పేజీ ఏర్పాటు, శిక్షణ వివరాలు, అంశాలు, సమయం వంటివి చర్చించడానికి ముందస్తుగా ఈ ఆదివారం (ఫిబ్రవరి 4) మధ్యాహ్నం 2 గం.ల నుండి 3 గం.ల వరకు గూగుల్ మీట్ ద్వారా ఒక చిన్న సమావేశాన్ని నిర్వహించకుందాం, తమ అభిప్రాయాలను తెలుపగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:17, 2 ఫిబ్రవరి 2024 (UTC)
ఎందరో వికీమీడియన్లలో(పుస్తకం) - ఎన్నో తప్పులు
మార్చుమొదటగా నాకూ ఒక సందేహం ఉండేది, అసలు వంద రోజుల్లో వంద వ్యాసాలూ అంటే ఏంటి అని.. ఆ అంశానికి సంబందించిన వికీపీడియా:రోజుకో వ్యాసం ఈ పేజీ చూస్తే నాకు అవగతమైనది రోజుకో వ్యాసం చొప్పున వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాయాలని.
అయితే ఎందరో వికీమీడియన్లు పుస్తకంలో ఈ వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాసిన తొలి మహిళగా మీనా గాయత్రి గారిని ప్రస్తావించడం జరిగింది, అయితే పైన ప్రస్తావించిన రోజుకో వ్యాసం పేజీలో గమనిస్తే ఆమె రాసిన వ్యాసాల జాబితాను పొందు పరచలేదు. ఆ జాబితాని నేను చేరుద్దామని చూడగా గ్రహించిన విషయం ఏమిటంటే ఆమె పూర్తిగా రోజుకో వ్యాసం చొప్పున వంద రోజుల్లో వంద వ్యాసాలూ రాసిన జాబితా నాకు దొరకలేదు. దాన్ని వెతకగా నేను గమనించింది ఆమె అసలు ఈ ఛాలెంజి ని పూర్తి చేయలేదు.
ఆలా వంద రోజుల పోటీ పూర్తి చేయకుండానే ఆమెని తెలుగు వికీలో ఛాలెంజి పూర్తి చేసిన మొదటి మహిళగా అభివర్ణించండం తప్పు అని నా అభిప్రాయం. ఇంకా లెక్కకు చూస్తే ఆ ఛాలెంజి పూర్తి చేసిన నేను మొదటి మహిళను అవుతాను.
ఇంకా విషయానికి వస్తే పవన్ సంతోష్ గారు కూడా ఈ వంద రోజుల ఛాలెంజిని పూర్తి చేయలేదు అన్నట్లు తోస్తుంది, ఒకవేళ చేసుంటే వారి జాబితాని వందరోజల్లో రోజుకో వ్యాసం పేజీలో చేర్చాల్సిందిగా కోరుతున్నాను.
నిర్వాహకులు వాడుకరి:Arjunaraoc , వాడుకరి:B.K.Viswanadh, User:K.Venkataramana, వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Rajasekhar1961, వాడుకరి:T.sujatha, వాడుకరి:Veeven, వాడుకరి:యర్రా రామారావు, వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:రహ్మానుద్దీన్ ఇతర చురుకైన వికీమీడియన్లు అందరు ఈ విషయంపై స్పందించాలని కోరుతున్నాను.--Tmamatha (చర్చ) 13:51, 31 జనవరి 2024 (UTC)
- 2016, ఆగస్టు 25 నుండి 2016, డిసెంబరు 2 వరకు @మీనా గాయత్రి గారు వంద రోజుల్లో వంద వ్యాసాలు పూర్తిచేశారు. అందుకు సంబంధించిన వివరాలు వికీపీడియా:రోజుకో వ్యాసం పేజీలో చేర్చాను. @Tmamatha గారు గమనించగలరు. ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:51, 31 జనవరి 2024 (UTC)
- రోజుకో వ్యాసం అంటే ప్రతి రోజు ఉండాలి కదా ప్రణయ్ గారు. 2016 నవంబరు 12 న ఆ లెక్క తప్పినది.... ఆ ప్రకారం ఆమె పూర్తి చేయనట్లే.. గమనించగలరు Tmamatha (చర్చ) 15:14, 31 జనవరి 2024 (UTC)
- @Tmamatha గారూ, మీనాగాయత్రి గారు సృష్టించిన వ్యాసాల జాబితాలో 2016 నవంబరు 11న రాయబడినట్లు చూపిస్తున్న కరీనా కపూర్ సినిమాల జాబితా పేజీ చరిత్రను ఒకసారి పరిశీలించండి. 04:31, నవంబరు 12, 2016 Meena gayathri.s చర్చ రచనలు నిరోధించు 231 బైట్లు +231 "Kareena Kapoor filmography" పేజీని అనువదించి సృష్టించారు అని ఉంటుంది. మీనాగాయత్రి గారు 2016 నవంబరు 12 తేదీనే ఆ వ్యాసాన్ని సృషించారు. కానీ వికీపీడియా సర్వరులో ఉదయం 5.30 దాటిన తరువాతనే మరో రోజుగా లెక్కించబడుతుంది. కాబట్టి సృష్టించిన వ్యాసాల జాబితాలో 2016 నవంబరు 11 అని చూపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:23, 31 జనవరి 2024 (UTC)
- 2016, మార్చి 21 నుండి 2016, జూన్ 28 వరకు పవన్ సంతోష్ గారు వంద రోజుల్లో వంద వ్యాసాలు పూర్తిచేశారు. అయితే, 2016-03-30 నాడు రాసిన శివరంజని రాగం, 2016-06-18 నాడు రాసిన భారత రాజ్యాంగ రచన, 2016-06-28 నాడు రాసిన రాదుగ పబ్లికేషన్స్ వ్యాసాలు దారిమార్పు చేయడం వల్ల, పవన్ గారు సృషించిన వ్యాసాల జాబితాలో ఆ వ్యాసాలు కనిపించడంలేదు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:25, 31 జనవరి 2024 (UTC)
- @Tmamatha గారూ, మీనాగాయత్రి గారు సృష్టించిన వ్యాసాల జాబితాలో 2016 నవంబరు 11న రాయబడినట్లు చూపిస్తున్న కరీనా కపూర్ సినిమాల జాబితా పేజీ చరిత్రను ఒకసారి పరిశీలించండి. 04:31, నవంబరు 12, 2016 Meena gayathri.s చర్చ రచనలు నిరోధించు 231 బైట్లు +231 "Kareena Kapoor filmography" పేజీని అనువదించి సృష్టించారు అని ఉంటుంది. మీనాగాయత్రి గారు 2016 నవంబరు 12 తేదీనే ఆ వ్యాసాన్ని సృషించారు. కానీ వికీపీడియా సర్వరులో ఉదయం 5.30 దాటిన తరువాతనే మరో రోజుగా లెక్కించబడుతుంది. కాబట్టి సృష్టించిన వ్యాసాల జాబితాలో 2016 నవంబరు 11 అని చూపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:23, 31 జనవరి 2024 (UTC)
- చాలా చాలా ధన్యవాదాలు @Pranayraj1985 గారు. నేను రాయడం అయితే రాసేశాను కానీ, ఆ పేజీలో చేర్చడం మర్చిపోయాను. నా బదులు శ్రమ తీసుకుని, ఆ పేజీలో వ్యాసాలన్నిటినీ చేర్చినందుకు ధన్యవాదాలు. ఇక మీదట నేను ఈ 100రోజుల్లో 100వ్యాసాల ఛాలెంజ్ ను చేస్తే, తప్పకుండా ఈ పేజీలో లిస్ట్ చేరుస్తాను. ఎందుకంటే, అక్కడ లిస్ట్ లేకపోతే అస్సలు ఆ ఛాలెంజ్ పూర్తి చేయలేదు అని అనుకునే ప్రమాదం ఉందని నాకిప్పుడే తెలిసింది. ఇకపై ఎవరికీ నా విషయంలో ఇంత వెతుక్కుని, నిజానిజాలు తేల్చుకోవాల్సిన అవసరం లేకుండా చేస్తాను. అసలు ప్రశ్న లేవనెత్తి, భవిష్యత్తులో ఎవరికీ ఈ సందేహం రాకుండా ఉండేలా ప్రణయ రాజ్ గారు ఈ లిస్ట్ తయారు చేసేలా చేసినందుకు @Tmamathaగారికి చాలా చాలా ధన్యవాదాలు. Meena gayathri.s (చర్చ) 05:35, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- రోజుకో వ్యాసం అంటే ప్రతి రోజు ఉండాలి కదా ప్రణయ్ గారు. 2016 నవంబరు 12 న ఆ లెక్క తప్పినది.... ఆ ప్రకారం ఆమె పూర్తి చేయనట్లే.. గమనించగలరు Tmamatha (చర్చ) 15:14, 31 జనవరి 2024 (UTC)
- మమత గారూ, ముందుగా మీకు అనిపించిన అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చినందుకు అభినందనలు. ప్రణయ్ రాజ్ గారు ఇచ్చిన సమాధానం మీ అనుమానాలను తీర్చింది అనుకుంటున్నాను. ఇండియా టైం జోన్, వికీపీడియా టైం జోన్ తేడా వల్ల మీకు అనుమానం రావడం సహజం. దాన్ని చక్కగా వివరించిన ప్రణయ్ కు ధన్యవాదాలు. పుస్తకంలో ఇంకా తప్పులున్నాయని అన్నారు. అవి కూడా రాయగలరు. - రవిచంద్ర (చర్చ) 16:38, 31 జనవరి 2024 (UTC)
- మమత గారూ ముందుగా మీకు పరిశీలించాలి అనే అభిప్రాయం కలిగినందుకు ధన్యవాదాలు.మీరు పరిశీలించి, నిర్భయంగా వెలిబుచ్చటం చర్చలు చురుకుగా సాగటానికి శుభసూచికం. నేనూ పరిశీలనకు పెద్దపీట వేస్తాను. అయితే మనం పరిశీలించినవి ఒక్కోసారి మనకు అవగాహన లేకనో, లేక ఒక్కోసారి మన కళ్లు మనల్ని మోసం చేస్తుంటాయి.అలాంటి పరిస్థితిలో మనం ఇది ఒకసారి పరిశీలించండి, నాకు అర్థం కావటంలేదు అనే ధోరణిలో మృదువుగా చెప్పటానికి అవకాశం ఉంది. ఏమీ పర్వాలేదు.మరిన్ని చర్చలలో మీరు పాల్గొనాలి.తరువాత రవిచంద్ర గారు అన్నట్లు ప్రణయ్ రాజ్ గారు ఇచ్చిన సమాధానం మీ అనుమానాలను తీర్చింది అనుకుంటున్నాను.పుస్తకంలో ఇంకా ఏమైనా తప్పులున్నాయని అన్నారు. అవి కూడా రాస్తే ముందు ముందు ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడదాం.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:35, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- మమత గారూ, పుస్తకంలో ఎన్నో తప్పులున్నాయన్నారు గదా.. ఆ తప్పులేవో చెబుతారని పైన రవిచంద్ర గారు, యర్రా రామారావు గార్లతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. దయచేసి చెప్పవలసినది. __చదువరి (చర్చ • రచనలు) 16:36, 7 ఫిబ్రవరి 2024 (UTC)
Last days to vote on the Charter for the Universal Code of Conduct Coordinating Committee
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Hello all,
I am reaching out to you today to remind you that the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) charter will close on 2 February 2024. Community members may cast their vote and provide comments about the charter via SecurePoll. Those of you who voiced your opinions during the development of the UCoC Enforcement Guidelines will find this process familiar.
The current version of the U4C charter is on Meta-wiki with translations available.
Read the charter, go vote and share this note with others in your community. I can confidently say the U4C Building Committee looks forward to your participation.
On behalf of the UCoC Project team,
ఫెమినిజం, ఫోక్‌లోర్ - 2024 ప్రాజెక్టు
మార్చుతెలుగు వికీలో ఇటీవల మహిళల భాగస్వామ్యం పెరగడంపై నాకు చాల ఆనందంగా ఉంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లే ప్రయ్నతంలో నేను పాలుపంచుకోవాలనుకుంటున్నాను. దీనిలో భాగంగాలోనే కశ్యప్ గారు వాట్సాప్ లో పెట్టిన ఫెమినిజం, ఫోక్‌లోర్ - 2024 ప్రాజెక్టు నేను చేయాలనుకుంటున్నాను. నాకు ఎవరైనా సహాయం అందించగలరా...--Tmamatha (చర్చ) 08:12, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @మమత గారూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రాజెక్టు రూపొందించి,దానిని సాగించటానికి ముందుకువచ్చినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసినంతవరకు నేను సాయపడగలను. యర్రా రామారావు (చర్చ) 08:17, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు ముందుగా ఫెమినిజం, ఫోక్‌లోర్ - 2024 ప్రాజెక్టు చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో నా వంతు సహాయ సహకారాలు అందించగలను. Divya4232 (చర్చ) 08:25, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు, ముందుగా ఇలాంటి ప్రాజెక్టు రూపొందించటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టులో నా వంతు సహాయ సహకారాలు నేను అందించగలను. V Bhavya (చర్చ) 09:38, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు ముందుగా మీకు అభినందనలు ఇలాంటి ప్రాజెక్టు నిర్వహించడం చాలా సంతోషదాయకం,నేను ఈ ప్రాజెక్ట్ లో నావంతు సహాయ సహకారాలు అందించగలను.Thirumalgoud (చర్చ) 11:19, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @మమత గారూ చూడగానే మంచి కార్యక్రమం అనిపిస్తుంది,దానిని సాగించటానికి ముందుకువచ్చినందుకు అభినందనలు. నాకు తెలిసినంతవరకు నేను సాయపడగలను. ప్రభాకర్ గౌడ్చర్చ 11:35, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారూ తెవికీ లో మహిళా సాధికారతను పెంచే దిశగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ ప్రాజెక్టులో నా వంతు సహాయం చేయగలను.-అభిలాష్ మ్యాడం (చర్చ) 04:55, 4 ఫిబ్రవరి 2024 (UTC)
- నమస్కారం :@Tmamatha గారు, ముందుగా ఈ ప్రాజెక్టుని చేపట్టేందుకు ఆసక్తి చూపినందుకు అభినందనలు. ప్రాజెక్టు నిర్వహణ, రూపకల్పన వగైరాలకు సంబందించిన పూర్తి సహాయం తెవికీ యువ నుండి మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
తెవికీ యువ ప్రాజెక్టు తెలుగు వికీలో యువత, మహిళలు, అన్య లింగాల భాగస్వామ్యం అలాగే అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని స్థాపించిన ఒక ప్రాజెక్టు. మరిన్ని వివరాలకు తెవికీ యువ చర్చా పేజీ ద్వారా సంప్రదించగలరు. నేతి సాయి కిరణ్ (చర్చ) 09:44, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @మమత గారూ ముందుకువచ్చినందుకు ధన్యవాదములు ఇందులో సమ్మక్క సారక్క జాతర జాతరను కవర్ చేసేందుకు ఏదైనా గ్రాంటు అవకాశాలు ఉన్నాయో WMF Grants , CIS A2K పరిశీలించగలరు,నేను ఈ ప్రాజెక్ట్ లో నావంతు సహాయ సహకారాలు అందించగలను. --Kasyap (చర్చ) 11:47, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు, ఈ ప్రాజెక్టులో నా వంతు సహాయ సహకారాలు నేను అందించగలను.Pravallika16 (చర్చ) 20:02, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- అందరికి నమస్కారం, తెవికీ యువ సహకారంతో స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు పేజీ సృష్టించడం జరిగినది . అందరు వ్యాసాలు రాయడం మొదలు పెట్టవచ్చు. ఇతర వివరాలను ప్రాజెక్టు చర్చ పేజీ ద్వారా తెలియజేస్తాము.--Tmamatha (చర్చ) 14:48, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- ఫెమినిజం, ఫోక్‌లోర్ - 2024 ప్రాజెక్టు నిర్వహించడానికి ముందుకువచ్చిన Tmamatha గారికి ధన్యవాదాలు. నేను ఈ ప్రాజెక్టులో నా వంతు సహాయ సహకారాలు అందించగలను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:31, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు సరేనండి, మొదలుపెడతాను. Divya4232 (చర్చ) 05:34, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- మమత గారు నీకు ఇందులో వ్యాసాలు రాస్తాను. Bethi.rameesh (చర్చ) 15:35, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- అందరికి నమస్కారం, తెవికీ యువ సహకారంతో స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు పేజీ సృష్టించడం జరిగినది . అందరు వ్యాసాలు రాయడం మొదలు పెట్టవచ్చు. ఇతర వివరాలను ప్రాజెక్టు చర్చ పేజీ ద్వారా తెలియజేస్తాము.--Tmamatha (చర్చ) 14:48, 1 ఫిబ్రవరి 2024 (UTC)
- సరేనండి @Tmamatha గారు, ఈ ప్రాజెక్టులో పాల్గొంటాను --VJS (చర్చ) 04:58, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- @Tmamatha గారు, మీకు అభినందనలు..!Muralikrishna m (చర్చ) 07:12, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- మమత గారు మీకు అభినందనలు Bethi.rameesh (చర్చ) 15:30, 2 ఫిబ్రవరి 2024 (UTC)
- మమతగారికి అభినందనలు. మీకు తోడ్పాటు అందిస్తానికి వచ్చిన వాడుకరులను చూస్తే ముచ్చటగా ఉన్నది. కాశీ మజిలీ కథలు కొన్ని వందలు ఉన్నాయి. ఇవి తెలుగు వికీసోర్స్ లో సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయి. మరియు అవసరాల అనసూయమ్మ సంకలనం చేసిన జానపద గేయాలు కూడా స్వరాలతో సహా లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోమని నా మనవి. సహాయం చేయగలను.Rajasekhar1961 (చర్చ) 06:20, 3 ఫిబ్రవరి 2024 (UTC)
- మమత గారికి అభినందనలు.ఇంగ్లీష్ లో ఉన్న Hindu Feasts Fasts and ceremonies , Castes and Tribes of Southern India పుస్తకాలు మీకు ఉపయోగపడతాయని భావిస్తున్నాను A.Murali (చర్చ) 13:00, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- మమతగారికి అభినందనలు. మీకు తోడ్పాటు అందిస్తానికి వచ్చిన వాడుకరులను చూస్తే ముచ్చటగా ఉన్నది. కాశీ మజిలీ కథలు కొన్ని వందలు ఉన్నాయి. ఇవి తెలుగు వికీసోర్స్ లో సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయి. మరియు అవసరాల అనసూయమ్మ సంకలనం చేసిన జానపద గేయాలు కూడా స్వరాలతో సహా లభిస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోమని నా మనవి. సహాయం చేయగలను.Rajasekhar1961 (చర్చ) 06:20, 3 ఫిబ్రవరి 2024 (UTC)
- మమత గారు మీకు అభినందనలు Bethi.rameesh (చర్చ) 15:30, 2 ఫిబ్రవరి 2024 (UTC)
వికీ లవ్స్ ఫోక్లోర్ ప్రాజెక్టు పేజీ తెలుగు అనువాదం
మార్చుఅందరికీ నమస్కారం, నేను వికీ లవ్స్ ఫోక్లోర్ ప్రాజెక్టు పేజీని తెలుగులోకి అనువాదించాను, దానిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఏమైన తప్పులు ఉంటే సరిచేయగలరు. --IM3847 (చర్చ) 14:35, 5 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @IM3847 గారు, చూస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:28, 6 ఫిబ్రవరి 2024 (UTC)
హైదరాబాదు బుక్ ఫెయిర్ తెవికీ స్టాల్-సభ్యుల భాగస్వామ్యం
మార్చుతెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు నమస్కారం. తెలుగు వికీపీడియా గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, తెలుగులో సమాచారం పెంపొందిపచేయడంలో మరింత ఎక్కువమందిని భాగస్వాములుగా చేయడమనే లక్ష్యాలతో తెలుగు వికీపీడియా సముదాయం తరపున గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో తెలుగు వికీపీడియా కోసం ప్రత్యేకంగా ఒక స్టాల్ ఏర్పాటుచేసి, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించడం జరిగుతోంది.
గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం ఫిబ్రవరి 9 నుండి 19 వరకు జరుగబోతున్న 36వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో కూడా తెలుగు వికీపీడియా కోసం ఒక స్టాల్ అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ గారు ముందుకొచ్చారు. అలాగే, స్టాల్ నిర్వహణకు కావాల్సిన ఇతర (ప్రచార సామగ్రి) అవసరాల కోసం సిఐఎస్ (సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ) వారు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు.
పుస్తక ప్రదర్శనకి వచ్చేవారిలో చదివే ఆసక్తి ఉన్నవారు ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి, స్టాలులో ఉండటానికి ఔత్సాహికులు కావాలి. ఈ బృహత్తర కార్యక్రమంలో సముదాయ సభ్యులు పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈ బుక్ ఫెయిర్ సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8.30 వరకు, శని-ఆదివారాల్లో మధ్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. అన్ని రోజులు పూర్తి సమయం ఉండాలన్న నియమమేది లేదు. ఎవరికి వీలున్న రోజులలో, వీలున్న సమయంలో తెవికీ స్టాల్ నిర్వహణలో పాల్గొనవచ్చు. సభ్యులు తమ వీలును తెలియజేయగలరు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:49, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- నేను 9 వ తేదీన హాజరు అవుతాను. ఎక్కడ అవుతుందో పెట్టండి. A.Murali (చర్చ) 08:21, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @A.Murali గారు. లోయర్ ట్యాంక్ బండ్ లోని తెలంగాణ కళాభారతి మైదానం (ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 09:07, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- @Pranayraj1985 గారు నేను పాల్గొంటాను. ధన్యవాదాలు Batthini Vinay Kumar Goud (చర్చ) 05:43, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @Batthini Vinay Kumar Goud గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:04, 11 ఫిబ్రవరి 2024 (UTC)
ఎన్నికల సంబంధిత వ్యాసాల సృష్టింపు-2024
మార్చుభారత సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్- మే లో జరుగునున్నవి. అలాగే కొన్ని రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికలు జరుగనున్నవి. తెవికీనందు గతంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలుకు, మరికొన్ని ఇతర వ్యాసాలు మాత్రమే ఉన్నవి.వినయ్ కుమార్ గౌడ్ గారు దాదాపుగా అన్ని రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాలకు, లోకసభ నియోజకవర్గాలకు పేజీలు సృష్టించే పనిలో ఉన్నారు. అయితే ఇంకా భారత ఎన్నికల వ్యవస్థకింద తెవికీలో ఉండాల్సిన అనేక వ్యాసాలుకు పేజీలు సృష్టించాల్సిఉంది. అలాంటి ముఖ్యమైన అన్ని వ్యాసాలును ఈ ప్రాజెక్టులో గుర్తించి వ్యాసాలు సృష్టించటం, అలాగే గతంలో సృష్టించిన వ్యాసాలు అభివృద్ధి, తాజా పర్చటం, అవసరమైనమేరకు సవరణలు చేయటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. ఈ విషయం గతంలో భారత సార్వత్రిక ఎన్నికల వ్యాసాల ప్రాజెక్టు - 2024 అనే విభాగంలో 2023 డిసెంబరు 21 చర్చకు ప్రవేశపెట్టబడింది.వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎన్నికలు ప్రాజెక్టులో భాగంగా సృష్టించవలసిన వ్యాసాలు జాబితా -2024 అనే పేజీ నొకదానిని తయారుచేయబడింది. ఈ ప్రాజెక్టులో ఆసక్టి ఉన్న వాడుకరులు ఆ పేజీలో సంతకం చేసి మరిన్ని వ్యాసాలు సృష్టించగలరని ఆశించుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:29, 6 ఫిబ్రవరి 2024 (UTC) రోజు
- అలాగేనండీ @యర్రా రామారావు గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:32, 6 ఫిబ్రవరి 2024 (UTC)
- @యర్రా రామారావు గారు నా వంతు కృషి చేస్తాను. ధన్యవాదాలు. Batthini Vinay Kumar Goud (చర్చ) 05:42, 9 ఫిబ్రవరి 2024 (UTC)
- అలాగేనండీ @యర్రా రామారావు గారు. V Bhavya (చర్చ) 13:55, 13 ఫిబ్రవరి 2024 (UTC)
- @సరేనండి. @యర్రా రామారావు గారు పాల్గొంటాను. ధన్యవాదాలు. VJS
- RATHOD SRAVAN (చర్చ) 06:39, 8 మార్చి 2024 (UTC)--RATHOD SRAVAN (చర్చ) 06:39, 8 మార్చి 2024 (UTC) సరే సర్ నా వంతు ప్రయత్నం చేస్తాను
A2K Monthly Report for January 2024
మార్చు
Feel free to translate into your language.
Dear Wikimedians,
In January, CIS-A2K successfully concluded several initiatives, and we are pleased to present a comprehensive monthly newsletter summarizing the events and activities of the past month. This newsletter provides an extensive overview of key information, highlighting our diverse range of endeavors.
- Conducted Events
- Roundtable on Digital Cultures
- Discussion on Disinformation and Misinformation in Wikimedia Projects
- Roundtable on Digital Access
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 19:17, 9 ఫిబ్రవరి 2024 (UTC)
Announcing the results of the UCoC Coordinating Committee Charter ratification vote
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Dear all,
Thank you everyone for following the progress of the Universal Code of Conduct. I am writing to you today to announce the outcome of the ratification vote on the Universal Code of Conduct Coordinating Committee Charter. 1746 contributors voted in this ratification vote with 1249 voters supporting the Charter and 420 voters not. The ratification vote process allowed for voters to provide comments about the Charter.
A report of voting statistics and a summary of voter comments will be published on Meta-wiki in the coming weeks.
Please look forward to hearing about the next steps soon.
On behalf of the UCoC Project team,
తెవికీ పండగ - 2024
మార్చుసభ్యులకు నమస్కారం
తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం సందర్భంగా కొంత సమాచారంతో మెటావికీలో పేజీ ఏర్పరచడం జరిగింది. దీనిని వికీపీడియా:తెవికీ 20 వ వార్షికోత్సవం ప్రాజెక్ట్ పేజీకి లింక్ చేయడమైనది పరిశీలించగలరు.
కామన్స్ లో ఈ కార్యక్రమం సందర్భంగా తీసిన ఫోటోలు అప్లోడ్ చేయడానికి ఒక వర్గం చేర్చడమైనది. సభ్యులు తాము తీసిన ఫోటోలు ఇక్కడ అప్లోడ్ చేయగలరు. - ధన్యవాదాలు VJS (చర్చ) 15:58, 14 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు VJSగారు. ఎంపరర్ అనిల్ (చర్చ) 17:15, 14 ఫిబ్రవరి 2024 (UTC)
- ధన్యవాదాలు @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:48, 14 ఫిబ్రవరి 2024 (UTC)
- వికీ పండగ 2014 ఫొటోలు ఎక్కడ అప్లొడ్ చెసారు. లింక్ ఇవ్వగలరా..? --B.K.Viswanadh (చర్చ) 16:25, 15 ఫిబ్రవరి 2024 (UTC)
మూస:documentని మూస:Cite journal నుండి దారిమార్పు తొలగించగలరు
మార్చునమస్కారం, మూస:documentని మూస:Cite journal నుండి దారిమార్పు తొలగించగలరు. యునెస్కో వారి వెబ్ సైట్లొ మూలాలుగ వాడటానికి చాల డాక్యుమెంట్లు వాడవచును. మూసాల జాబిత ఎకడ లభిస్తాయి? Id,Ik'+(&sZP4^m (చర్చ) 13:53, 16 ఫిబ్రవరి 2024 (UTC)
వికీ లవ్స్ ఉమెన్/షీ సెడ్ 2023
మార్చుసభ్యులకు నమస్కారం
వికీవ్యాఖ్య కు సంబంధించి 2023 అక్టోబర్-జనవరి 15, 2024 వరకు "వికీ లవ్స్ ఉమెన్/#ఆమె చెప్పింది (షీ సెడ్ 2023)ప్రాజెక్ట్" క్రింద వివిధ రంగాలకు చెందిన 166 మహిళల వ్యాఖ్యలు తెలుగులో చేర్చడమైనది. పాల్గొన్న 15 భాషలలో తెలుగు వికీవ్యాఖ్య 7వ స్థానంలో నిలిచింది. వికీకోట్ గణాంకాల ప్రకారం ఒక సంవత్సరంలో 4% నుండి 32 % వరకు ఈ పెరుగుదల కనిపించింది. వికీడేటా లింకులు పూర్తిగా ఇస్తే ఈపెరుగుదల ఇంకొంత కనిపించవచ్చు అనుకుంటున్నాను, ఆ పని జరుగుతోంది. పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చాను వికీ లవ్స్ ఉమెన్/#షీసెడ్ 2023 (#ఆమె చెప్పింది 2023). ధన్యవాదాలు. VJS (చర్చ) 10:02, 23 ఫిబ్రవరి 2024 (UTC)
ఆంధ్రప్రదేశ్ మండల పేజీలలో మూలాల లోపాలు సవరణ
మార్చు23 జూన్ 2023 నాడు @యర్రా రామారావు గారు గుర్తించి చర్చించిన మండలపేజీ మూలాల దోషాలు చాలావరకు పరిష్కరించాను. అలాగే ప్రస్తుత మండలాల జాబితాలు, క్వెరీలు తాజాపరచాను. (చూడండి పాతచర్చ :వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_88#ఆంధ్రప్రదేశ్_736_మండల_పేజీలలో_మూలాలు_లోపాలు) దీనికొరకు వికీడేటాలో సమాచారం చేర్చటంలో జరిగిన దోషాలు (నేను చేసినవే) సరిదిద్దాను. కొన్ని చోట్ల దోషానికి సంబంధించి ఆంగ్లవికీలో చర్చ (పేజీ శాశ్వతలింకు) ప్రారంభించాను. మీకు ఇంకా దోషాలు కనబడితే తెలియచేయండి.-- అర్జున (చర్చ) 13:16, 25 ఫిబ్రవరి 2024 (UTC)
- @అర్జనరావు గారూ మీరు శ్రమ తీసుకుని అన్ని లోపాలు సవరించినందుకు ముందుగా ధన్యవాదాలు. కానీ ముందు ముందు ఇలాంటి సమస్యలు వస్తే ఎలాచేయాలో వికీపీడియా: వాడుకరులకు సూచనలు లో వివరిస్తే బాగంటుందని నా అభిప్రాయం. ఇలాంటి లోపాలు వచ్చినప్పుడు మనమే కాకుండా ఇతరులు ఎవరైనా చేసేటట్లు ఉండాలగదా నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 13:33, 25 ఫిబ్రవరి 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, నేను కేవలం మూసలు, వికీడేటా పరిజ్ఞానంతో మండలాలకు సమాచారపెట్టె తయారుచేశాను. ఏమైనా దోషాలు కనబడితే ఆ పరిజ్ఞానం కలవారెవరైనా సరిచేయవచ్చు. వేచివున్నా అలా జరగనప్పుడు, m:Indic-TechCom లో నివేదించి సహాయం పొందడం మంచిది. అంతకు మించి దీని గురించి వికీపీడియా:వాడుకరులకు సూచనలు లో తెలపవలసినవేవి లేవని నా అభిప్రాయం. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 06:43, 28 ఫిబ్రవరి 2024 (UTC)
- మీ స్పందనకు ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:58, 28 ఫిబ్రవరి 2024 (UTC)
- @యర్రా రామారావు గారు, నేను కేవలం మూసలు, వికీడేటా పరిజ్ఞానంతో మండలాలకు సమాచారపెట్టె తయారుచేశాను. ఏమైనా దోషాలు కనబడితే ఆ పరిజ్ఞానం కలవారెవరైనా సరిచేయవచ్చు. వేచివున్నా అలా జరగనప్పుడు, m:Indic-TechCom లో నివేదించి సహాయం పొందడం మంచిది. అంతకు మించి దీని గురించి వికీపీడియా:వాడుకరులకు సూచనలు లో తెలపవలసినవేవి లేవని నా అభిప్రాయం. ధన్యవాదాలు. అర్జున (చర్చ) 06:43, 28 ఫిబ్రవరి 2024 (UTC)
ఆన్లైన్లో ప్రత్యక్ష శిక్షణకు తెవికీ బడి పేజీ ఏర్పాటు
మార్చుసభ్యులకు నమస్కారం, ఈ సరికే తెవికీలో కృషి చేస్తూ కొంత అనుభవం సంపాదించిన వాడుకరుల కోసం కూడా కొన్ని ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఉండాలని పలువురు సభ్యులు కోరిన విధంగా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు తరపున ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణ అందించే కార్యక్రమానికి తెవికీ బడి అని నామకరణం చేసి, ఒక ప్రత్యేక పేజీని పెట్టాము.
- ఈ తెవికీ బడిలో భాగంగా ప్రాథమిక, మాధ్యమిక, నిర్వాహణ, నిపుణత స్థాయిలలో వికీపీడియా శిక్షణకు సంబంధించి కొన్ని పాఠ్యాంశాలు, వాటి ప్రశ్నావళిని ఆ పేజీలో చేర్చాము. వాటిని శిక్షణాంశాలు విభాగంలో చూడవచ్చు.
- సముదాయ సభ్యులు వాటిని పరిశీలించి వారికి ఏ అంశంలో శిక్షణ కావలసివుందో ఆ అంశం కింద పేరు రాయడంగాని, సంతకంగాని చేయగలరు. ఇందుకు సభ్యుల సంతకాలు విభాగాన్ని ఉపయోగించగలరు.
- ఆ తరువాత శిక్షణ అందించే బృందం వీటిని పరిశీలించి శిక్షణను అందిస్తుంది.
- అలాగే ఈ జాబితాలో లేని అంశాలను ఇతర శిక్షణాంశాలు అనే విభాగంలో చేర్చవచ్చు.
- ఆన్లైన్ ద్వారా వికీపాఠాల శిక్షణకు సంబంధించి ఏవైనా సలహాలు/సూచనలు/చర్చలు చేయాలనుకుంటే తెవికీ బడి చర్చాపేజీలో రాయగలరు.
ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:41, 28 ఫిబ్రవరి 2024 (UTC)
ఒక క్యాలెండరు నెలలో అత్యధిక వ్యాసాలు
మార్చుఅత్యధికంగా కొత్త వ్యాసాలు వచ్చిన మొదటి 10 నెలల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు. ఇవ్వాళ్టితో ముగియనున్న ఫిబ్రవరి, ప్రస్తుతం 6 వ స్థానంలో ఉంది. ఇవ్వాళ ఇంకో 43 వ్యాసాలు రాస్తే 2000 కు చేరతాం. మరో రెండు రాస్తే 5 వ స్థానానికి చేరుతుంది. అది ఎలాగూ జరుగుతుంది. అయితే ఇక్కడొక విశేషం ఉంది:
- మొదటి 5 స్థానాల్లో ఉన్న నెలల్లో రాసిన మొత్తం వ్యాసాల సంఖ్య: 25,986
- వాటిలో బాట్‌లు రాసిన వ్యాసాలు: 24,351
- అంటే మొత్తం ఆ ఐదు నెలల్లో రాసిన వ్యాసాలన్నిటినీ కలిపి మానవ వాడుకరులు సృష్టించిన వ్యాసాలు: 1635
ఈ ఫిబ్రవరిలో ఆ ఐదింటికంటే ఎక్కువ ఈసరికే రాసేసాం. ఒక రకంగా 2024 ఫిబ్రవరి నెల, వ్యాసాల విప్లవం వచ్చిన నెల. మార్చి దాన్ని మించుతుందా..?
సం. | నెల | కొత్త వ్యాసాల
సంఖ్య |
---|---|---|
1 | 2006-09 | 10127 |
2 | 2006-10 | 6652 |
3 | 2007-06 | 4714 |
4 | 2007-08 | 2492 |
5 | 2006-11 | 2001 |
6 | 2024-02 | 1957 |
7 | 2006-08 | 1928 |
8 | 2023-08 | 1364 |
9 | 2023-09 | 1118 |
10 | 2006-12 | 1111 |
__ చదువరి (చర్చ • రచనలు) 04:26, 29 ఫిబ్రవరి 2024 (UTC)
- మంచి గణాంకాలు, కొత్త విషయం వెలుగులోకి తీసుకొచ్చినందుకు @చదువరి గార్కి ధన్యవాదాలు.ఈ ఫిబ్రవరి నెలకు ఇంకో విశేషం ఉంది.నాలుగేళ్ళ కోసారి వచ్చే లీపు సంవత్సరానికి చెందిన నెల.ఏది ఏమైనా వికీ గణాంకాలలో ఒక స్థానం సంపాదించింది. యర్రా రామారావు (చర్చ) 04:43, 29 ఫిబ్రవరి 2024 (UTC)
Ukraine's Cultural Diplomacy Month 2024: We are back!
మార్చుPlease help translate to your language
Hello, dear Wikipedians!
Wikimedia Ukraine, in cooperation with the MFA of Ukraine and Ukrainian Institute, has launched the forth edition of writing challenge "Ukraine's Cultural Diplomacy Month", which lasts from 1st until 31st March 2024. The campaign is dedicated to famous Ukrainian artists of cinema, music, literature, architecture, design and cultural phenomena of Ukraine that are now part of world heritage. We accept contribution in every language! The most active contesters will receive prizes.
We invite you to take part and help us improve the coverage of Ukrainian culture on Wikipedia in your language! Also, we plan to set up a banner to notify users of the possibility to participate in such a challenge! ValentynNefedov (WMUA) (talk)
మహిళా సభ్యుల కోసం CIS/A2K వారి సందేశం (She Leads)
మార్చుమహిళా సభ్యులకు CIS/A2K వారి ప్రత్యేక ఆహ్వానం, ఇతరులు కూడా పరిశీలించండి, మద్దతు ఇవ్వండి.
మార్చి నెలలోకి వచ్చిన సందర్భంగా మహిళా సభ్యులందరికి అభినందనలు ఈ సందర్భంగా మహిళా సభ్యుల కోసం CIS/A2K నుంచి ఈ రోజు అందిన 'టెలిగ్రామ్' సందేశం ఈ క్రింద ఇస్తున్నాను
మహిళా వికీమీడియన్లు నాయకత్వం వహించేందుకు, వారి ఆలోచనలకు జీవం పోయడానికి, వారికి సాధికారత కల్పించే లక్ష్యంతో "షీ లీడ్స్" అనే కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. "షీ లీడ్స్"తో మా కమ్యూనిటీలో అభివృద్ధి చెందుతున్న మహిళా నాయకులకు బలమైన మద్దతు అందిస్తున్నాము. మీ సంఘాల్లోని నాయకత్వ సామర్థ్యాన్ని ప్రదర్శించే మహిళా వికీమీడియన్‌లకు సహాయక వాతావరణాన్ని పెంపొందించడానికి మాతో చేరండి. "షీ లీడ్స్" అనేది కేవలం ఆరంభం కాదు; మహిళలకు నాయకత్వం వహించడానికి, సాధికారత కల్పించడానికి ఇది ఒక ప్రయాణానికి ప్రారంభం మాత్రమే.
"షీ లీడ్స్" మద్దతు మార్చి 1న ప్రారంభమై మే15 వరకు కొనసాగుతుంది.
మీరు CIS-A2K రూపొందించిన మెటాపేజీ లింక్ సందర్శించడం ద్వారా మరిన్ని వివరాలు తాజాగా తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ఉత్సాహం, సృజనాత్మకత తో ముందుకు వచ్చే మహిళా నాయకుల మద్దతు కోసం ఎదురుచూస్తున్నాము.
- CIS-A2K
ధన్యవాదాలు VJS (చర్చ) 09:33, 2 మార్చి 2024 (UTC)
వికీ లవ్స్ వైజాగ్ కామన్స్ Edit-a-Thon
మార్చుఅందరికీ శుభోదయం, వికీ లవ్స్ వైజాగ్ పోటీ ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఈ పోటీలో విశాఖపట్నం, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 1200కు పైగా ఫోటోలు వచ్చాయి. కానీ వాటిలో చాలా వాటికి వర్గాలు చేర్చలేదు, ఒకవేళ చేర్చినా అవి సబబుగా లేవు. మనమంతా కలిసి ఫోటోకు తగిన వర్గాలను చేరిస్తే ఈ పని చాలా సులువుగా అయిపొతుంది. అంతేకాకుండా ఉన్న చిత్రాలు అన్నీటిని 5 వర్గాలుగా విభజించాలి:
పోటీ పేజీలో మనం పేర్కొన్నట్లు ఇక్కడ ఉన్న చిత్రాలకు Images from Wiki Loves Vizag 2024 (to review) వర్గాన్ని తీసేసి, పైన ఉన్న 5 వర్గాలలో ఏదో ఒకటి జోడించాలి. ఇది పూర్తయిన తరువాతే ఈ కార్యక్రమానికి Jury మొదలుపెడతారు. కావున ఒక పది రోజులలో మనం ఈ పనిని పూర్తిచేస్తే 15వ తేదీ తరువాత నుంచి Jury Members వారి పనిని ప్రారంభిస్తారు. దీనిలో పాల్గొనేవారు క్రింద వారి సంతకాన్ని చేర్చండి.--IM3847 (చర్చ) 03:06, 5 మార్చి 2024 (UTC)
కొన్ని సందేహాలు
మార్చుIM3847 గారూ, స్పష్టత కోసం కొన్ని ప్రశ్నలు సార్..
- commons:Category:Images from Wiki Loves Vizag 2024 (to review) అనే వర్గంలో ఉన్న ఫొటోలలోనే పైన చెప్పిన పని చెయ్యాలి. అవునా?
- ఆ దస్త్రంలో commons:Category:Images from Wiki Loves Vizag 2024 (to review) వర్గాన్ని తీసేసి పైన సూచించిన ఐదు వర్గాల్లో ఏదో ఒకదాన్ని చేచ్చాలి. (అందులో ఉన్న మిగతా వర్గాలను కదిలించకూడదు) అవునా?
- ఏదైనా దస్త్రంలో పై ఐదింటిలో ఒకటి కంటే ఎక్కువ వర్గాలను చేర్చవచ్చనిపిస్తే చేర్చవచ్చా? ఉదాహరణకు File:A beautiful Evening at Simhachalam.jpg ను Nature, Transportation అనే రెండు వర్గాల్లోనూ చేర్చవచ్చా?
- పై ఐదింటిలో దేనికీ చెందదు అని అనిపిస్తే ఆ దస్త్రంలో ఏ వర్గాన్నీ చేర్చకుండా, రివ్యూ వర్గాన్ని తీసెయ్యకుండా (అంటే, మార్పులేమీ చెయ్యకూండా) అలాగే వదిలెయ్యాలి, అంతేగానీ కొత్త వర్గాన్ని సృష్టించకూడదు. అంతేనా?
- విశాఖ నగరానికి చెందనిదీ, జిల్లాలో మరెక్కడికైనా చెందినదో వేరే ప్రాంతానికి చెందినదో అయితే ఏం చెయ్యాలి?
__చదువరి (చర్చ • రచనలు) 10:43, 5 మార్చి 2024 (UTC)
- @Chaduvari: గారూ, పాత విశాఖపట్నం జిల్లకు చెందిన అన్ని చిత్రాలను ఈసారికి మనం పరిగణంలోకి తీసుకోవచ్చు. వేరే ప్రాంతాల వాటిని Images from Wiki Loves Vizag 2024 (to review) వర్గంలోనే వదిలేయవచ్చు. --IM3847 (చర్చ) 14:50, 5 మార్చి 2024 (UTC)
- మరికొన్ని వర్గాలుంటే బాగుంటుందనిపిస్తోంది ఉదా: Lifestyle/people, streets,వగైరా.__ చదువరి (చర్చ • రచనలు) 12:07, 5 మార్చి 2024 (UTC)
- @Chaduvari: గారూ, File:A beautiful Evening at Simhachalam.jpgకు Nature, Transportation వంటి రెండు వర్గాలు వర్తిస్తాయి, కానీ ఆ చిత్రంలో బాగా ఆకట్టుకుని Focusలో ఉన్నది రైలు కావున, Transportationలోకి వెళ్తుంది. --IM3847 (చర్చ) 14:50, 5 మార్చి 2024 (UTC)
- మరికొన్ని వర్గాలుంటే బాగుంటుందనిపిస్తోంది ఉదా: Lifestyle/people, streets,వగైరా.__ చదువరి (చర్చ • రచనలు) 12:07, 5 మార్చి 2024 (UTC)
- దర్శనీయ స్థలాలు అనే వర్గం చేర్చితే లో ఈ రాస్ హిల్స్, చర్చ్ లు లైట్ హౌసులు, సింహాచలం లాంటివి చేర్చవచ్చు నెమో పరిశీలించండి. --VJS (చర్చ) 13:38, 5 మార్చి 2024 (UTC)
- @Vjsuseela: గారూ, దర్శనీయ స్థలాలకు పైన ఉన్న 5లో పోటీకు చైందిన Constructions in Vizagతో పాటు Religious buildings in Visakhapatnamలో ఉన్న ఉపవర్గాలను వాడాలి. --IM3847 (చర్చ) 16:24, 5 మార్చి 2024 (UTC)
- @Chaduvari: గారూ & @Vjsuseela: గారూ, మీరు అన్నది కరక్టే అండి, చాలా వర్గాలులో చేర్చొచ్చు, ఉదా: Roads in Visakhapatnam, Tourism in Visakhapatnam, అంటే ఈ వర్గం లాగా తయారు చేయాలి. నేను పైన చెప్పిన 5 వర్గాలు, కేవలం పోటీలో విభజించడానికి మాత్రమే కానీ అవి ముఖ్యమైనవి కావు, అందుకే వాటిని Hidden Categoryలో ఉంచాను. విశాఖపట్నానికి చెందిన వర్గాలు ఎన్ని అయినా ఈ చిత్రాలకు జోడించవచ్చు. --IM3847 (చర్చ) 14:50, 5 మార్చి 2024 (UTC)
- అర్థమైంది.__ చదువరి (చర్చ • రచనలు) 15:52, 5 మార్చి 2024 (UTC)
- @Chaduvari: గారూ & @Vjsuseela: గారూ, మీరు అన్నది కరక్టే అండి, చాలా వర్గాలులో చేర్చొచ్చు, ఉదా: Roads in Visakhapatnam, Tourism in Visakhapatnam, అంటే ఈ వర్గం లాగా తయారు చేయాలి. నేను పైన చెప్పిన 5 వర్గాలు, కేవలం పోటీలో విభజించడానికి మాత్రమే కానీ అవి ముఖ్యమైనవి కావు, అందుకే వాటిని Hidden Categoryలో ఉంచాను. విశాఖపట్నానికి చెందిన వర్గాలు ఎన్ని అయినా ఈ చిత్రాలకు జోడించవచ్చు. --IM3847 (చర్చ) 14:50, 5 మార్చి 2024 (UTC)
Report of the U4C Charter ratification and U4C Call for Candidates now available
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Hello all,
I am writing to you today with two important pieces of information. First, the report of the comments from the Universal Code of Conduct Coordinating Committee (U4C) Charter ratification is now available. Secondly, the call for candidates for the U4C is open now through April 1, 2024.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members are invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.
Per the charter, there are 16 seats on the U4C: eight community-at-large seats and eight regional seats to ensure the U4C represents the diversity of the movement.
Read more and submit your application on Meta-wiki.
On behalf of the UCoC project team,
ఆవశ్యక పేజీలు (ఇన్‌కమింగు లింకులు ఉండి కూడా ఉనికిలో లేని పేజీలు)
మార్చుఉనికిలోనే లేని పేజీలకు లింకులు ఇస్తే అవి ఎర్రలింకులు అవుతాయని మనకు తెలుసు. అలా ఇవ్వడానికి కొన్ని కారణాలు:
- పేజీ పేరు తప్పుగా రాయడం
- పేజీ ఉంటుందిలే అనుకుని లింకు ఇవ్వడం
- గతంలో ఉన్న పేజీకి లింకు ఇచ్చాక ఆ పేజీని తొలగించడం
- ఇంగ్లీషు నుండి నేరుగా అనువాదం చేసినపుడు, మూలంలో ఉన్న లింకులను అదే పేరుతోనో లేదా తెలుగీకరించో లింకులు ఇచ్చెయ్యడాం - పేజీ ఉనికిలో ఉన్నదో లేదో చూసుకోకుండా
- అనువాదాలు చేసినపుడు మూలాలలో (ఉల్లేఖనల్లో) ఉండే లింకులను అలాగే ఉంచెయ్యడం
ఇలా అనేకానేక కారణాలుంటై.
ఇలా, ఇన్‌కమింగు లింకులు ఉండి, అసలు ఉనికిలో లేని పేజీలను వికీపీడియా "ఆవశ్యక పేజీలు" అంటుంది. వీటిని ప్రత్యేక పేజీల్లో ప్రత్యేక:అవసరమైనపేజీలు అనే పేజీలో చూపిస్తుంది. అయితే ఇక్కడ, అన్ని పేరుబరుల్లోని పేజీలనూ చూపిస్తుంది. పైగా 5 వేలు మాత్రమే చూపిస్తుంది. అసలు అలాంటి - ఇన్‌కమింగు లింకులు ఉండీ ఉనికిలో లేని వ్యాస శీర్షికలు తెవికీలో మొత్తం ఎన్ని ఉన్నాయి అని డేటాబేసులో చూస్తే -
- అవి మొత్తం 1,66,000 (లక్షా అరవయ్యారు వేలు) కు పైబడి ఉన్నాయని చూపించింది. ఇవన్నీ ప్రధానబరి లోని పేజీల నుండి ప్రధానబరి లోని పేజీలకు ఇచ్చిన లింకులన్నమాట. వాటిలో -
- ఒక్క ఇన్‌కమింగు లింకు మాత్రమే ఉన్న వ్యాస శీర్షికలు: 1,35,300
- 2 ఇన్‌కమింగు లింకులున్న వ్యాస శీర్షికలు: 14,746
- 3-10 మధ్య ఇన్‌కమింగు లింకులున్న వ్యాస శీర్షికలు: 11,464
- 11-25 మధ్య ఇన్‌కమింగు లింకులున్న వ్యాస శీర్షికలు: 2763
- 26, ఆ పైబడిన ఇన్‌కమింగు లింకులున్న వ్యాస శీర్షికలు: 1694
2 కంటే ఎక్కువ లింకులున్న పేజీల జాబితాను క్వారీలో చూడవచ్చు (క్వెరీ నడవడానికి కాస్త సమయం తీసుకుంటుంది.). అన్ని పేజీల జాబితా కావాలంటే ఈ క్వెరీ చూడవచ్చు (క్వెరీ నడవడానికి చాలాసేపు తీసుకుంటుంది.)
(పై క్వెరీలను సవరించి వాటిని మరింత ఎఫిషియెంట్‌గా చేస్తే, వారికి ముందుగా ధన్యవాదాలు)
కొత్తవ్యాసాలు సృష్టించేవారికి పై లింకులు ఒక ఉపయోగకరమైన వనరు. అయితే ఈ ఆవశ్యక పేజీలన్నీ ఆవశ్యకమైనవి కావు. ఎంచేతంటే:
- . పేజీ పేరు తప్పేమో..
- దారిమార్పు పేజీ సృష్టిస్తే సరిపోతుందేమో
- అసలు తప్పు లింకును సవరించేస్తే సరిపోతుందేమో (ఏదో ఒక మూసలో మాత్రమే సవరణ్స చేస్తే సరిపోవచ్చు.)
- ఆ లింకులన్నీ మూలాల నుండి వచ్చాయేమో. ముఖ్యంగా పేజీపేర్లు ఇంగ్లీషులో ఉంటే అవి మూలాల నుండి వచ్చి ఉండవచ్చు. అలాంటి వాటిని వదిలెయ్యవచ్చు
అంచేత ఆవశ్యక పేజీలను సృష్టించే ముందు మనం పై అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
మరొక సంగతి ఏంటంటే-
- వీటిలో శీర్షిక పేరులో "ఎన్నికలు" అనే పేరున్న వ్యాసాలు: 857
- వీటిలో శీర్షిక పేరులో "నియోజకవర్గం" అనే పేరున్న వ్యాసాలు: 986
వీటిలో ఎక్కువ శాతం బహుశా మూసల (సమాచారపెట్టె, నేవిగేషను మూసలు వగైరా) నుండే వచ్చి ఉంటాయి. ఎన్నికలు 2024 ప్రాజెక్టు ముగిసేసరికి బహుశా చాలావరకు ఈ పేజీలు ఉనికి లోకి వస్తాయి. __ చదువరి (చర్చ • రచనలు) 11:21, 8 మార్చి 2024 (UTC)
- @చదువరి గారూ దీనిమీద నాకూ ఆందోళన ఉంది.ఈ ప్రాజెక్టులో ఎక్కువుగా ఎర్రలింకులు వస్తున్నట్లు ఉంది అనే విభాగంలో ఆ అభిప్రాయం వెలిబుచ్చాను.విశాఖలో జరిగిన తెవికీ పండగలో కూడా ప్రత్యేక పేజీలపై నా అభిప్రాయం వెలిబుచ్చాను.నా ప్రధాన లక్ష్యం కూడా నాణ్యతకే పెద్ద పీట.దీనికి మీరు గతంలోనే ఎర్ర లింకులపై తగ్గింపుపై ఒక ప్రాజెక్టుకు రూపకల్పనచేసి, దానిలో మీరు చాలా కృషి చేసారు.మరలా ప్రాజెక్టు వేసి పూర్తిగా సాధ్యమైనంతవరకు పరిష్కరించటానికి నా వంతు కృషి చేయటానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను. యర్రా రామారావు (చర్చ) 05:19, 9 మార్చి 2024 (UTC)
- ధన్యవాదాలు @Chaduvari గారు, ఆవశ్యక పేజీలపై నేను కూడా దృష్టి సారిస్తాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:42, 10 మార్చి 2024 (UTC)
19000 వ్యాసాల తెలుగు వికీసోర్సు
మార్చు2024 మార్చి నెలలో మనం 19,000 వ్యాసాలను చేరుకున్న శుభ సందర్భంలో ఇందులో పనిచేస్తున్న వికీసోర్సు వాడుకరులకు అందరికీ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు. ముఖ్యంగా దేవీశ్రీప్రసాద్, శ్రీరామమూర్తి, రామేశం, అర్జునరావు, సుశీలమ్మ, మురళీకృష్ణ గార్లకు నాయొక్క విశేషమైన శుభాకాంక్షలు. మనం చేయాల్సిన మరెంతో కృషికి ఇది మంచి పునాది. ఇండిక్ భాషలలో మొదటిస్థానానికి మనం చేరాలను కాంక్షిద్దాము. Rajasekhar1961 (చర్చ) 19:01, 9 మార్చి 2024 (UTC)
- తెలుగు వికీసోర్సులో 19000 వ్యాసాలు దాటిన శుభ సందర్భంలో వికీసోర్సు వాడుకరులందరికీ శుభాకాంక్షలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:40, 10 మార్చి 2024 (UTC)
- @Rajasekhar1961ధన్యవాదాలు అండి VJS (చర్చ) 13:33, 10 మార్చి 2024 (UTC)
- వికీసోర్సు వాడుకరులకు అందరికీ శుభాకాంక్షలు యర్రా రామారావు (చర్చ) 13:59, 10 మార్చి 2024 (UTC)
తెవికీ పండగ ఫొటోలు
మార్చుజనవరి 26,27,28 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన తెవికీ పండగలో తీసిన ఫొటోలను కామన్సులో TeWiki Pandaga 2024 అనే వర్గంలో చేర్చారు. అన్నీ కలిపి 60 కి మించి ఫొటోల్లేవక్కడ. చివరి రోజుది ఒకే ఒక్క ఫొటో ఉంది. అక్కడ హాజరైన వాడుకరుల్లో ఎవరైనా ఫొటోలు ఎక్కించనివారుంటే వాటిని ఎక్కించవలసినది. @Pavan santhosh.s గారూ, మీ సంస్థ ప్రతినిధులు తీసిన ఫొటోలు, ఇంకా ఎక్కించవలసినవి ఉంటే అవి కూడా ఎక్కించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:04, 10 మార్చి 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:39, 10 మార్చి 2024 (UTC)
విక్షనరీ - మొదటి పేజీ
మార్చువిక్షనరీ - మొదటి పేజీ చెదిరినట్లుగా అనిపించింది. సరిచేయగలరు. సాంకేతికంలో 2 రోజుల క్రితమే ఈ ప్రస్తావన పెట్టాను. ధన్యవాదాలు VJS (చర్చ) 14:29, 10 మార్చి 2024 (UTC)
- కొత్త వెక్టరు రూపులో, పేజీ లోని పెట్టెలు కుడి వైపుకు ఓవర్‌ఫ్లో అయ్యాయి. అయితే ఇది కొత్తగా తలెత్తిన దోషం కాదనుకుంటాను. కొత్త రూపుకు అనుగుణంగా పేజీని మళ్ళీ రూపొందించాల్సిన అవసరం ఉన్నట్టుంది. __ చదువరి (చర్చ • రచనలు) 05:37, 16 మార్చి 2024 (UTC)
- @Chaduvari గారు సాంకేతిక నిపుణులు పరిశీలిస్తే బావుంటుందండి. VJS (చర్చ) 17:17, 28 మార్చి 2024 (UTC)
మహిళల జీవితచరిత్ర వ్యాసాలు
మార్చుతెవికీలో మహిళల జీవిత చరిత్ర వ్యాసాలు మామూలు గానే తక్కువగా ఉంటాయి. అయితే ఈమధ్య కాలంలో వివిధ వాడుకరులు తెవికీలో మహిళల వ్యాసాలపై శ్రద్ధ పెడుతున్నందున, వివిధ ప్రాజెక్టుల ద్వారానూ వీటి సంఖ్య బాగా పెరిగింది. ఒక సంవత్సరం కిందట మహిళా జీవిత చరిత్ర వ్యాసాలు మొత్తం జీవిత చరిత్ర వ్యాసాల్లో సుమారు 11% మాత్రమే ఉండేవి. ఈ వ్యాసాలను ఇవ్వాళ పరిశీలించాను.
- ఈరోజు మహిళల వ్యాసాలు ఎన్ని ఉన్నాయో చూస్తే అది 3030 (వర్గం:మహిళలు) అని చూపించింది. మొత్తం వ్యాసాలు 17250 (వర్గం:ప్రజలు) అంటే మహిళా వ్యాసాలు మొత్తం జీవిత చరిత్ర వ్యాసాల్లో 17.6% ఉన్నాయన్న మాట.
- అయితే, అసలు వ్యాసాల సంఖ్య సరిగా లెక్క వేసామో లేదో చూసేందుకు అనేక వర్గాలను పరిశీలించాను.
- శీర్షికలో "మహిళా" అనే పేరున్న వర్గాలు మొత్తం 475 ఉన్నాయి. వీటిలో ఉండేవన్నీ మహిళల వ్యాసాలే అనిఅనుకోవచ్చు. ఈ వర్గాలన్నీ "వర్గం:మహిళలు" అనే వర్గ వృక్షం కింద ఉంటే అ వర్గాల్లోని పేజీలన్నీ మహిళల వ్యాసాలే అనే లెక్క లోకి వస్తాయి.
- కానీ ఆ వర్గాల్లో కొన్ని ఆ వర్గవృక్షంలో లేవు. అంటే వ్యాసాలు మహిళల గురించేగానీ, అవి ఆ లెక్కలోకి రావడం లేదు.
- ఆ వర్గాల్లో కొన్నిటిని "మహిళలు" వర్గవృక్షం లోకి తీసుకెళ్ళాను (ఇంకా అన్నిటినీ పరిశీలించలేదు). దానితో మహిళల వ్యాసాల సంఖ్య 3,650 కి పెరిగింది. ఒక్క "వర్గం:మహిళా క్రికెట్ క్రీడాకారులు" అనే వర్గాన్ని కలిపితేనే ఈ సంఖ్య 400 పెరిగింది. ప్రస్తుతం మహిళా వ్యాసాలు మొత్తం జీవిత చరిత్ర వ్యాసాల్లో 21.1% ఉన్నాయి.
- పోతే, 2024 లో ఇప్పటి దాకా 3200 కొత్త వ్యాసాలు వస్తే వాటిలో దాదాపు 2000, స్త్రీల గురించి రాసిన వ్యాసాలే. వాటిలో ఒక 190 వ్యాసాలను చూడగా, 88 వ్యాసాలను (45% పైచిలుకు) మహిళల వర్గం లోకి చేర్చలేదు. అంటే అవి మహిళల వ్యాసాల లెక్కలోకి రావడం లేదు. మరి ఈ 2 వేల వ్యాసాల్లో అలాంటివి ఎన్నున్నాయో తెలీదు. ఇదే శాతం ఉంటాయనుకుంటే అవి దాదాపు 900 ఉంటాయి. అంత కాకపోయినా 500 వరకూ ఉండొచ్చేమో! అవి కూడా "మహిళలు" వర్గవృక్షం లోకి వస్తే, పై శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
మహిళలపై వ్యాసాలు రాయడం ఒక ఎత్తైతే, రాసే వ్యాసాలను మహిళ వర్గం లోకి వర్గీకరించడం మరొక ఎత్తు. అలాగే పాత వ్యాసాల్లో మహిళలుగా వర్గీకరించని వ్యాసాలు ఇంకా అనేకం ఉంటాయి; వాటన్నిటినీ కూడా సరిగ్గా వర్గీకరించుకోవాలి. అసలు "ప్రజలు" వ్యాసాలుగా వర్గీకరణ కాని వ్యాసాలను కూడా వెతికి పట్టుకుని వాటిని కూడా సరిగ్గా వర్గీకరించాలి.__చదువరి (చర్చ • రచనలు) 10:51, 12 మార్చి 2024 (UTC)
- నిజమేనండి. అసలు అన్ని వ్యాసాలకు వర్గాలున్నాయా? ఉంటే అవి అన్ని సరిఅయినవేనా? చూడాలి. మహిళలకు సంబంధించి ఇటీవల వికీ వ్యాఖ్యలో కొంతవరకు మాత్రమే ఇలాంటి పనే చేశాను. డేటా సరిగ్గా రావాలన్నా, విషయానికి సంబంధించి ఏ వ్యాసాలు లేవో చూడాలన్నా ఒక వర్గాల పునర్వ్యవస్తీకరణ అవసరం.--VJS (చర్చ) 14:38, 12 మార్చి 2024 (UTC)
Wikimedia Foundation Board of Trustees 2024 Selection
మార్చుDear all,
This year, the term of 4 (four) Community- and Affiliate-selected Trustees on the Wikimedia Foundation Board of Trustees will come to an end [1]. The Board invites the whole movement to participate in this year’s selection process and vote to fill those seats.
The Elections Committee will oversee this process with support from Foundation staff [2]. The Board Governance Committee created a Board Selection Working Group from Trustees who cannot be candidates in the 2024 community- and affiliate-selected trustee selection process composed of Dariusz Jemielniak, Nataliia Tymkiv, Esra'a Al Shafei, Kathy Collins, and Shani Evenstein Sigalov [3]. The group is tasked with providing Board oversight for the 2024 trustee selection process, and for keeping the Board informed. More details on the roles of the Elections Committee, Board, and staff are here [4].
Here are the key planned dates:
- May 2024: Call for candidates and call for questions
- June 2024: Affiliates vote to shortlist 12 candidates (no shortlisting if 15 or less candidates apply) [5]
- June-August 2024: Campaign period
- End of August / beginning of September 2024: Two-week community voting period
- October–November 2024: Background check of selected candidates
- Board's Meeting in December 2024: New trustees seated
Learn more about the 2024 selection process - including the detailed timeline, the candidacy process, the campaign rules, and the voter eligibility criteria - on this Meta-wiki page, and make your plan.
Election Volunteers
Another way to be involved with the 2024 selection process is to be an Election Volunteer. Election Volunteers are a bridge between the Elections Committee and their respective community. They help ensure their community is represented and mobilize them to vote. Learn more about the program and how to join on this Meta-wiki page.
Best regards,
Dariusz Jemielniak (Governance Committee Chair, Board Selection Working Group)
[2] https://foundation.wikimedia.org/wiki/Committee:Elections_Committee_Charter
[3] https://foundation.wikimedia.org/wiki/Minutes:2023-08-15#Governance_Committee
[4] https://meta.wikimedia.org/wiki/Wikimedia_Foundation_elections_committee/Roles
[5] Even though the ideal number is 12 candidates for 4 open seats, the shortlisting process will be triggered if there are more than 15 candidates because the 1-3 candidates that are removed might feel ostracized and it would be a lot of work for affiliates to carry out the shortlisting process to only eliminate 1-3 candidates from the candidate list.
Global ban proposal for Slowking4
మార్చుHello. This is to notify the community that there is an ongoing global ban proposal for User:Slowking4 who has been active on this wiki. You are invited to participate at m:Requests for comment/Global ban for Slowking4 (2). Thank you. Seawolf35 (చర్చ) 04:27, 15 మార్చి 2024 (UTC)
విశాఖపట్నంలో వికీమీడియా కామన్స్ పరిచయం
మార్చువిశాఖపట్నంలో జరిగిన ఫోటోగ్రఫీ పోటీ అందరికి తెలిసినదే, దానిలో జరిగిన Photo-Walkలో నేను Vizag Photowalkers Club ప్రెసిడెంటును కలిసాను. ఆయనతో వికీమీడియా కామన్స్ ఎలాగ పనిచేస్తుంది, ఫోటోగ్రఫీ మీద ఆసక్తి ఉన్నవారు వికీపీడియాకు ఏ విధంగా సహాయపడగలరని మాట్లాడుకున్నాం. అంతేకాక వికీమీడియా కామన్స్ ద్వారా వివిధ దేశాల వికీమీడియన్ల నుంచి ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని నేర్చుకునే అవకాశాలను, వికీపీడియాలో చిత్రాలను చేర్చడం ద్వారా వాటిని ఎంతమంది చూస్తారు అని చర్చించాము. దీనికి ఆయన సుముఖంగా అంగీకరించి వచ్చే శనివారం, ఆదివారం (మార్చి 23 & 24) వైజాగ్లో ఒక ఫోటోగ్రాఫీ ప్రదర్శన ఉందని, అక్కడకు ఫోటోగ్రఫీ నేర్చుకునే కాలేజీ పిల్లలు వస్తున్నారని, మనం అక్కడకు వచ్చిన వారికి కామన్స్ గురించి తెలియజేయవచ్చు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రణాలిక (Draft 01):
- వికీమీడియా కామన్స్ పరిచయం
- కామన్స్ లోని Photography critiques
- ఫోటోగ్రఫీలోని ముఖ్యమైన అంశాలను కామన్స్ నుంచి ఎలాగ నేర్చుకోవచ్చు
- Featured pictures
- Quality images
- ఫోటోగ్రఫర్లలో స్త్రీల కొరత (Wiki Loves Vizagకు వచ్చిన 1400 చిత్రాలలో 10-15 మాత్రమే వారు తీసినవి)
తెలుగు వికీపీడియా నుంచి కూడా ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజారయ్యి మన వ్యాసాలకు చిత్రాల అవసరం ఎంత ఉన్నది, కామన్స్ ఫోటోగ్రఫీలో భారతదేశం ఎంత వెనుకబడిపోయింది అని చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ కార్యక్రమం, దాని ప్రణాలికపై మీ విలువైన సూచనలు, సలహాలు ఉంటే తెలియజేయగలరు. --IM3847 (చర్చ) 15:55, 17 మార్చి 2024 (UTC)
- విశాఖపట్నం ఫోటోగ్రఫీ పోటీని విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు @IM3847 గారు. వైజాగ్ ఫోటోగ్రాఫీ ప్రదర్శనలో కామన్స్ గురించి తెలియజేసే కార్యక్రమం చేపట్టబోతున్నందుకు ధన్యవాదాలు. ఆసక్తి గల సభ్యులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:27, 19 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమం.మహేశ్ గారికి ముందుగా అభినందనలు. వైజాగ్ రావాలంటే ఎవ్వరూ రాలేకపోవచ్చు.అవకాశం ఉంటే మీట్ ద్వారా ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందని నా అభిప్రాయం. లేదంటే కార్యక్రమం జరిగిన తరువాత నివేదికను సముదాయంలో పెట్టినా కొంత అవగాహన కలుగవచ్చు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:30, 19 మార్చి 2024 (UTC)
- అందరికీ నమస్తారం, కొన్ని లాజిష్టిక్ కారణాల వలన, వైజాగ్లో జరగబోయే ఫోటోగ్రాఫీ ప్రదర్శన వాయిదా అయిందని ఆంధ్రా విశ్వవిధ్యాలయం సభ్యులు తెలియజేశారు. త్వరలో ఈ కార్యక్రమం ఎప్పటికి వాయిదా అయ్యిందని తెలియజేస్తాము. --IM3847 (చర్చ) 06:12, 21 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమం.మహేశ్ గారికి ముందుగా అభినందనలు. వైజాగ్ రావాలంటే ఎవ్వరూ రాలేకపోవచ్చు.అవకాశం ఉంటే మీట్ ద్వారా ఆన్లైన్ సమావేశం నిర్వహిస్తే ఆసక్తి ఉన్నవారు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉందని నా అభిప్రాయం. లేదంటే కార్యక్రమం జరిగిన తరువాత నివేదికను సముదాయంలో పెట్టినా కొంత అవగాహన కలుగవచ్చు. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 07:30, 19 మార్చి 2024 (UTC)
A2K Monthly Report for February 2024
మార్చు
Feel free to translate into your language.
Dear Wikimedians,
In February, CIS-A2K effectively completed numerous initiatives, and we are delighted to share a detailed monthly newsletter encapsulating the events and activities from the previous month. This newsletter offers a thorough glimpse into significant updates, showcasing the breadth of our varied undertakings.
- Collaborative Activities and Engagement
- Telugu Community Conference 2024
- International Mother Language Day 2024 Virtual Meet
- Wiki Loves Vizag 2024
- Reports
- Using the Wikimedia sphere for the revitalization of small and underrepresented languages in India
- Open Movement in India (2013-23): The Idea and Its Expressions Open Movement in India 2013-2023 by Soni
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 14:12, 18 మార్చి 2024 (UTC)
CIS-A2K announcing Community Collaborations program
మార్చుPlease feel free to translate this into your preferred language.
Dear Wikimedians,
Exciting news from A2K! We're thrilled to announce that CIS-A2K is now seeking proposals for collaborative projects and activities to advance Indic Wikimedia projects. If you've got some interesting ideas and are keen on co-organizing projects or activities with A2K, we'd love to hear from you.
Check out all the details about requirements, process, timelines, and proposal drafting guidelines right here.
We're looking forward to seeing your proposals and collaborating to boost Indic Wikimedia projects and contribute even more to the open knowledge movement.
Regards MediaWiki message delivery (చర్చ) 14:25, 18 మార్చి 2024 (UTC)
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రభుత్వ తెలుగు అధ్యాపకులకు తెవికీ శిక్షణ
మార్చుతెలుగు వికీపీడియా గురించి ఆంధ్రప్రదేశ్‌లో డిగ్రీ స్థాయిలో తెలుగు పాఠ్యపుస్తకంలోని "తెలుగు - సాంకేతిక" అన్న అంశంలో భాగంగా కొంత పాఠం ఉంది. విద్యార్థులకు ఈ పాఠాన్ని బోధించే తెలుగు అధ్యాపకులకు తెలుగు వికీపీడియా గురించి సవివరంగా తెలియజేయడమూ, తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో ఈ అధ్యాపకుల్లో కొందరు వాడుకరులుగా పాల్గొనేందుకు ఉత్సాహం చూపిస్తారేమో ప్రయత్నించేందుకు ప్రయోగాత్మకంగా ఒక శిక్షణా శిబిరాన్ని నిర్వహించదలిచాము. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడుకు చెందిన డి.ఆర్.గోయెంకా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపక బృందం ఈ అంశంపై ఉత్సాహం చూపించడంతో ఆ కళాశాలతో కలసి సీఐఎస్-ఎ2కె ఆధ్వర్యంలో రెండు రోజుల తెలుగు వికీపీడియా శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నాము. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ అధ్యాపకులందిరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి నిర్వహిస్తున్నాము. కళాశాలతో చర్చించిన మీదట ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించాలని ప్రణాళిక. ఈ కార్యక్రమంలో బోధించే అంశాల గురించి, పాల్గొనే శిక్షకుల గురించి మరిన్ని వివరాలను త్వరలో తెలియజేస్తాము. దీనిపై మీ సలహా, సూచనలు ఏమైనా ఉంటే తెలియజేయగలరు. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:39, 21 మార్చి 2024 (UTC)
- ఇదో కొత్త ప్రయోగం.మంచి కార్యక్రమం.ఈ కార్యక్రమం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.సక్సెస్ అయితే మరిన్ని జిల్లాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఈ సందర్బంగా సీఐఎస్-ఎ2కె వార్కి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:18, 26 మార్చి 2024 (UTC)
- మంచి అలోచన. స్వేచ్ఛా నుండి కొంత మంది వాలంటీర్లు సహాయంగా రావచ్చా? Saiphani02 (చర్చ) 19:58, 27 మార్చి 2024 (UTC)
- ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు నాకు వికీమీడియా ఇమెయిల్ సర్వీస్ ద్వారా ఇమెయిల్ పంపండి. దీనిపై తదుపరి వివరాలు చర్చిద్దాం. (నా వాడుకరి పేజీకి వెళ్ళి అక్కడ ఈ వాడుకరికి ఇమెయిల్ పంపండి అన్న ఆప్షన్ ఎంచుకోండి) పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:43, 2 ఏప్రిల్ 2024 (UTC)
- తెలుగు అధ్యాపకులకు వికీ శిక్షణా శిబిర నిర్వహణ అనేది మంచి ఆలోచన @Pavan (CIS-A2K) గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:31, 31 మార్చి 2024 (UTC)
- ఈ కార్యక్రమం వచ్చేవారమే జరగబోతోంది. పైన ఆసక్తి కనబరచిన సాయిఫణీంద్ర గారికి వీలు పడకపోవచ్చునని చెప్పారు. అయితే, ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు, కొత్త వికీమీడియన్లకు శిక్షణనివ్వడంలో సాయంచేసేందుకు ఇక్కడ స్పందించిన @యర్రా రామారావు, @Pranayraj1985 గార్లు కానీ, గతంలోనూ, ఇప్పుడూ శిక్షణా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న/కుంటున్న @ప్రభాకర్ గౌడ్ నోముల, @Chaduvari వంటివారు కానీ తాడేపల్లిగూడెం వచ్చి పాల్గొంటే బావుంటుందని భావిస్తున్నాను. ఇందుకు రానూపోనూ, వసతి, భోజనం వంటివన్నీ ఏర్పాటుచేయగలము. ముందస్తు ధన్యవాదాలతో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:45, 13 ఏప్రిల్ 2024 (UTC)
- పవన సంతోష్ గారు, ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యాపకులకు శిక్షణ శిబిరం అనేది చాలా అభినందించదగ్గ విషయం అందుకు మీకు ముందుగా అభినందనలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి... వికీపీడియాలో ఇలాంటి ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి సమర్ధులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమము అధ్యాపకులకు బోధన చేయడం, రెండు రోజుల శిక్షణ శిబిరం కాబట్టి నాలుగైదు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా (ఆఫ్లైన్, ఆన్లైన్లో) చాలా అనుభవం ఉన్న పలివేల కశ్యప్ గారు సమర్థులు వారికి వీలుంటే వారిని ఆహ్వానించవలసిందిగా మీకు గుర్తు చేస్తున్నాను. చదువరి గారు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే సంతోషం... తాడేపల్లిగూడెంనకు నేను శిక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా వస్తున్నాను అని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... ప్రభాకర్ గౌడ్చర్చ 16:39, 14 ఏప్రిల్ 2024 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, థాంక్సండీ. పవన్ సంతోష్ (చర్చ) 06:03, 15 ఏప్రిల్ 2024 (UTC)
- @Pavan (CIS-A2K) గారూ, నాకు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొనే వీలు లేదు. కానీ నేపథ్యంలో ఏదైనా పని అవసరమైతే నా చేతనైనంతలో తోడ్పడగలను. ఈ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 00:29, 15 ఏప్రిల్ 2024 (UTC)
- @Chaduvari గారూ, ధన్యవాదాలండీ. పవన్ సంతోష్ (చర్చ) 06:03, 15 ఏప్రిల్ 2024 (UTC)
- @పవన్] సంతోష్ గారూ ఈ ఎండలకు రాలేకపోయినందుకు క్షమించాలి. రాద్దామనుకుంటూనే మర్చిపాయాను. మీ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:56, 19 ఏప్రిల్ 2024 (UTC)
- @యర్రా రామారావు గారూ, ఎండలు మహా దారుణంగానే ఉన్నాయి. దీనికితోడు కళాశాల ఉన్నది తాడేపల్లిగూడేనికి దగ్గరలోని పెంటపాడు రూరల్ ప్రాంతం కావడం వల్లనో ఏమో రెండు రోజులూ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కరెంట్ తీసేశారు. తగిన విధమైన ఏర్పాట్లు చేయడం, కార్యక్రమ ప్రణాళికలోనూ ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో ఇది అభాసు అవలేదనుకోండి. కానీ, ఎండల వల్ల ఇబ్బందులైతే తప్పలేదు. కనుక, మీ వంటి పెద్దల సహకారాన్ని ఈ ఎండాకాలంలో ఆన్లైన్లోనే తీసుకోవడం మంచిది. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:15, 22 ఏప్రిల్ 2024 (UTC)
- @Pavan (CIS-A2K) గారూ ఇబ్బందిని గుర్తించారు.ఆ ఇబ్బందులలోనూ కార్యక్రమం జయప్రదంగా నిర్వర్తించినందుకు మీకూ, ప్రభాకర్ గౌడ్ నోముల గార్కి ధన్యవాదాలు. కొత్త వాడుకరులు చేరి, నిలబడటానికి ఇది చాలా మంచి ప్రయత్నం.అవసరమైతే వాళ్లకు తరచూ ఆన్లైన్లో ప్రత్వేక క్లాసులు ఇవ్వవచ్చు. యర్రా రామారావు (చర్చ) 16:23, 22 ఏప్రిల్ 2024 (UTC)
- @యర్రా రామారావు గారూ, ఎండలు మహా దారుణంగానే ఉన్నాయి. దీనికితోడు కళాశాల ఉన్నది తాడేపల్లిగూడేనికి దగ్గరలోని పెంటపాడు రూరల్ ప్రాంతం కావడం వల్లనో ఏమో రెండు రోజులూ ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కరెంట్ తీసేశారు. తగిన విధమైన ఏర్పాట్లు చేయడం, కార్యక్రమ ప్రణాళికలోనూ ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవడంతో ఇది అభాసు అవలేదనుకోండి. కానీ, ఎండల వల్ల ఇబ్బందులైతే తప్పలేదు. కనుక, మీ వంటి పెద్దల సహకారాన్ని ఈ ఎండాకాలంలో ఆన్లైన్లోనే తీసుకోవడం మంచిది. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:15, 22 ఏప్రిల్ 2024 (UTC)
- @పవన్] సంతోష్ గారూ ఈ ఎండలకు రాలేకపోయినందుకు క్షమించాలి. రాద్దామనుకుంటూనే మర్చిపాయాను. మీ కార్యక్రమం జయప్రదం కావాలని కోరుకుంటూ అందరికి శుభాకాంక్షలు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:56, 19 ఏప్రిల్ 2024 (UTC)
- @Chaduvari గారూ, ధన్యవాదాలండీ. పవన్ సంతోష్ (చర్చ) 06:03, 15 ఏప్రిల్ 2024 (UTC)
- @Pavan (CIS-A2K) గారూ, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా మీకు అభినందనలు, ప్రత్యేకంగా నా పేరు కుటంకిస్తూ ఆహ్వానించినందుకు, అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనేలా అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ వర్క్ షాప్ గురించి నేను ఒక సమీక్ష లగా మొత్తం కార్యక్రమం పూర్తి వివరాలు రాయాలి అప్పుడే ఈ కార్యక్రమానికి న్యాయం చేసినట్లు అవుతుంది దీనికి ఒక ప్రత్యేక పేజీని సృష్టించి సమగ్ర విషయాలు అందులో పొందుపరచాలి. భవిష్యత్తులో జరగబోయే ఇలాంటి కార్యక్రమాలకు ఏమైనా పనికొస్తుంది అనుకుంటున్నా, ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్చర్చ 15:19, 22 ఏప్రిల్ 2024 (UTC)
- @ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, ధన్యవాదాలండీ. మనం చర్చించుకున్నట్టు కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న మీరు మీ పరిశీలనను రాసేందుకు ఈ పేజీలో ఒక ఉపవిభాగం పెట్టాను. దాని కింద రాయండి. పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:12, 22 ఏప్రిల్ 2024 (UTC)
- పవన సంతోష్ గారు, ఉమ్మడి గోదావరి జిల్లాల అధ్యాపకులకు శిక్షణ శిబిరం అనేది చాలా అభినందించదగ్గ విషయం అందుకు మీకు ముందుగా అభినందనలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలో ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయండి... వికీపీడియాలో ఇలాంటి ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి సమర్ధులు చాలా మంది ఉన్నారు. ఈ కార్యక్రమము అధ్యాపకులకు బోధన చేయడం, రెండు రోజుల శిక్షణ శిబిరం కాబట్టి నాలుగైదు వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా (ఆఫ్లైన్, ఆన్లైన్లో) చాలా అనుభవం ఉన్న పలివేల కశ్యప్ గారు సమర్థులు వారికి వీలుంటే వారిని ఆహ్వానించవలసిందిగా మీకు గుర్తు చేస్తున్నాను. చదువరి గారు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే సంతోషం... తాడేపల్లిగూడెంనకు నేను శిక్షణ ఇవ్వడానికి సంసిద్ధంగా వస్తున్నాను అని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు... ప్రభాకర్ గౌడ్చర్చ 16:39, 14 ఏప్రిల్ 2024 (UTC)
- ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వర్క్ షాప్ విజయవంతంగా నిర్వహించినందుకు ముందుగా @Pavan (CIS-A2K) గారికి, @ప్రభాకర్ గౌడ్ నోముల గారికి అభినందనలు, మిగతా జిల్లాలలో కూడా ఇటువంటి శిక్షణా / అవగాహనా కార్యక్రమాలు నిర్వహించవలసినదనే సూచనలు పరిగణించతగినవి. ఈ సందర్భంగా CIS-A2K వారు రూపొందించిన She Leads తరపున కనీసం కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాలలో ఉన్న మన ఔత్సాహిక మహిళా తెలుగు వికీమీడియన్లు ఇటువంటి కార్యక్రమాలు చేయడము గురించి పరిశీలించవలసినది. ఇంకా 15 మే 2024 వరకు సమయమున్నది. ధన్యవాదాలు. --వి.జె.సుశీల (చర్చ) 17:58, 22 ఏప్రిల్ 2024 (UTC)
రవీంద్రభారతి వీడియోలు, ఫోటోలు కామన్స్‌లోకి విడుదల, సంబంధిత భాగస్వామ్యం
మార్చుసభ్యులకు నమస్కారం, గత ఎనిమిదేళ్ళుగా తెలుగు వికీపీడియా అభివృద్ధికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ అందిస్తున్న సహకారం గురించి, సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. మామిడి హరికృష్ణ గారి సహకారంతో నిర్వహించిన పలు తెవికీ కార్యక్రమాల గురించి సభ్యులందరికి తెలిసిందే. అంతేకాకుండా రవీంద్రభారతితో నాకున్న అనుబంధం రీత్యా భాషా సాంస్కృతిక శాఖ నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నప్పుడు వ్యక్తిగతంగా నేను తీసిన ఫోటోలు-వీడియోలను వికీకామన్స్ లో కూడా ఎక్కించి వాటిని తెవికీలోని పలు వ్యాసాలలో చేర్చాను. అయితే, ఇలా కొన్ని ఫోటోలు మాత్రమే కాకుండా రవీంద్రభారతి కార్యక్రమాల్లో భాషా సాంస్కృతిక శాఖ తీసిన వీలైనన్ని ఎక్కువ ఫోటోలు-వీడియోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేయించాలని 2017 సుండి పవన్ సంతోష్ గారు, నేను ప్రయత్నం చేస్తున్నాం.
రవీంద్రభారతి హైదరాబాద్‌కి సాంస్కృతిక కేంద్రం కావడంతో అక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లే కాక భారతదేశంలోనూ, కొన్ని సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగానూ ప్రసిద్ధి చెందిన కళాకారులు, కళారూపాలు, ప్రముఖులు పాల్గొన్న కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి వికీమీడియా ప్రాజెక్టులకు చాలా విలువైన ఫోటోలు, వీడియోలు ఉంటాయి. ఈ ఫోటోలను కామన్స్‌లోకి విడుదల చేయడం వల్ల వికీమీడియా ప్రాజెక్టులకు చాలా ప్రయోజనం ఉంటుందని మా ఆలోచన.
గత సంవత్సరం వికీ కాన్ఫిరెన్స్ ఇండియా కార్యక్రమం జరిగినపుడు నేను, వికీమీడియా ఫౌండేషన్ సీనియర్ ప్రోగ్రామ్స్ మేనేజర్ ప్రవీణ్ దాస్, సీఐస్-ఎ2కె ప్రోగ్రాం మేనేజర్ పవన్ సంతోష్, వికీమీడియా ఫౌండేషన్ పార్టనర్‌షిప్స్ డైరెక్టర్ హొర్గే వర్గేస్ రవీంద్రభారతిలోని శాఖ కార్యాలయంలో హరికృష్ణ గారిని కలిసి, ఫోటోలు-వీడియోల విడుదల గురించి ప్రస్తావించగా ఆయన సుముఖత వ్యక్తం చేశారు. కాని, కొన్ని కారణాల వల్ల ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చలేదు.
ఈ మార్చి రెండవ వారంలో పవన్ సంతోష్ హైదరాబాద్‌లో మామిడి హరికృష్ణ గారిని కలసినప్పుడు ఈ అంశాన్ని తిరిగి లేవనెత్తగా హరికృష్ణ గారు తమ మద్దతును, ఈ ప్రాజెక్టు విషయమై తమ సుముఖతను తిరిగి వ్యక్తం చేశారు. ఈ ఫోటోలను, వీడియోలను సీసీ-బై-ఎస్‌ఎ లైసెన్సులోకి విడుదల చేసి, కామన్స్‌లోకి అప్‌లోడ్ చేయడం విషయమై సాంకేతికంగా, కాపీహక్కుల పరంగా ఎలా చేయాలి, అది భాషా సాంస్కృతిక శాఖలో దీనిపై ప్రాసెస్ ఎలా రూపొందించాలి వంటివి ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె, వికీమీడియా ఫౌండేషన్ల సహకారంతో ఏర్పాటుచేస్తున్నాం. దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి వికీమీడియన్ ఆఫ్ ద రెసిడెన్స్‌గా నేను పనిచేయనున్నాను.
ఈ అంశంపై ఇంతకుముందు పలుమార్లు రచ్చబండలో చర్చకు పెట్టాము. ఇక దీన్ని కార్యరూపంలోకి తీసుకురావడానికి కృషిచేస్తున్నాం. మార్చి 28వ తేదీన మధ్యాహ్నం రవీంద్రభారతిలోని శాఖ కార్యాలయంలో వికీపీడియా ఫౌండేషన్, సిఐస్-ఎ2కె ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ఆసక్తి, అవకాశం ఉన్న సభ్యులు ఈ కార్యక్రమానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:02, 25 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమం.దీని వలన వికీ కామన్స్ లో అపూర్వ ఫొటోలు, విడియోలు చేరగలవు. ఈ కార్యక్రమం ముందుకు తీసుకువెళుతున్న సిఐస్-ఎ2కె ప్రతినిధులకు, @ప్రణయ్ రాజ్ గార్కి , తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరుపున మామిడి హరికృష్ణ గారికి ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 16:44, 25 మార్చి 2024 (UTC)
- ధన్యవాదాలు @యర్రా రామారావు-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:56, 29 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమం ప్రణయ్ గారు. కొన్ని వేల ఫొటోలు చేరతాయని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 11:59, 31 మార్చి 2024 (UTC)
- చాలా మంచి బొమ్మలు, తెలంగాణ, ఆంధ్ర సంస్కృతి, ప్రాంతానికి చెందిన వ్యక్తుల, కార్యక్రమాల బొమ్మలు చాలా ఎక్కించగా విశ్వవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి వస్తాయి. మంచి కార్యక్రమం. దూసుకొని పొండి.Rajasekhar1961 (చర్చ) 06:31, 1 ఏప్రిల్ 2024 (UTC)
భద్రాచలంలో జరిగే శ్రీరామ నవమి డాక్యుమెంటరీ
మార్చుఅందరికీ నమస్కారం, ఈ సంవత్సరం జరిగే శ్రీరామ నవమి కార్యక్రమాలను CISతో కలిసి వికీమీడియాలో డాక్యుమెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మొన్న జరిగిన శివరాత్రి సంభరాలను విజయవాడ, అమరావతిలో నేను చిత్రీకరించాను, వాటి నుంచి చాలా Quality Images వచ్చాయి. వాటిని మీరు ఈ వర్గాలలో చూడవచ్చు: Shivaratri in Vijayawada, Sri Amaralingeswara Swamy Rath Yatra. కేవలం శివరాత్రికి చేసినట్లు చిత్రాలు మాత్రమే కాకుండా; శ్రీరామ నవమికి ఒకటి, రెండు రోజుల ముందు నుంచే, అక్కడ జరిగే ఏర్పాట్లను, ఆ ప్రాంతం చుట్టుపక్కల ఉన్న సందర్శక స్థలాలను కూడా చిత్రీకరిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దీనికి తగిన అనుమతులను తెలంగాణ ప్రభుత్వం నుంచి ఏవిధంగా తీసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రణయ్‌రాజ్ వంగరి గారితో చెర్చించాను. ఈ కార్యక్రమ ప్రణాళిక తయారు చేయడానికి, చిత్రీకరణలో పాలుపంచుకోవడానికి ఎవరైనా సభ్యులు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నారు. ఈ అంశం మీ సలహాలు సూచనలు ఉంటే తెలియజేయండి. --IM3847 (చర్చ) 15:13, 30 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమం @IM3847 గారు, ఆసక్తి గల సభ్యులు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:27, 31 మార్చి 2024 (UTC)
- మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు మహేష్ గారు. ధన్యవాదాలు. ఈ ఏడు ఈసరికే విశాఖ వార్షికోత్సవ ఫొటోలు, శివరాత్రి, రథయాత్ర ఇలా మూడు సందర్భాల ఫొటోలను వికీ లోకి చేర్చారు. ఈ మూడింటి లోనూ విజ్ఞానసర్వస్వ విలువ పరంగా రథయాత్ర, శివరాత్రి లలో ఎక్కువ శాతం ఫొటోలు ఉన్నాయనిపించింది. నవమి తరువాత జరిగే తెప్పోత్సవం, భద్రాచలం చుట్టుపక్కల పర్ణశాల, దుమ్ముగూడెం, కూనవరం, పాల్వంచలలో కూడా ఫొటోలు తీయవచ్చు. __ చదువరి (చర్చ • రచనలు) 11:58, 31 మార్చి 2024 (UTC)
నిర్వాహక గణాంకాలు, కొత్త వాడుకరిగుంపులు
మార్చుగత 365 రోజుల్లో నిర్వహణ పరంగా జరిగిన పనుల వివరాలను వికీపీడియా:భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు/2023-24 నిర్వహణ గణాంకాలు పేజీలో చూపించాను. దాన్లోనే ఇతర భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలను కూడా చూపించాను.
నిర్వాహకత్వ హోదా లేకుండానే నాణ్యత పరంగా చేపట్టగలిగే కొన్ని నిర్వాహక చర్యలు ఉన్నాయి. అలాంటి పనులు చేసేందుకు ప్రత్యేకించిన వాడుకరిగుంపులు కూడా ఉన్నాయి. అలాంటి వాడుకరి గుంపులను తెవికీలో స్థాపించమని కోరుతూ నిర్వాహకుల నోటీసుబోర్డులో అభ్యర్థించాను.
వాడుకరులు పరిశీలించవలసినది.__ చదువరి (చర్చ • రచనలు) 06:18, 31 మార్చి 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు, ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:34, 31 మార్చి 2024 (UTC)
విలీనం చేయవలసిన వ్యాసాలు
మార్చువిలీనం చేయవలసిన వ్యాసాలు వర్గంలో 116 పేజీలు ఉన్నాయి. వీటిలో కొన్ని చాలాకాలంగా అలాగే ఉన్నాయి. నిర్వాహకులెవరైనా వీటిపై దృష్టి సారించగలరు. - స్వరలాసిక (చర్చ) 02:34, 1 ఏప్రిల్ 2024 (UTC)
- @స్వరలాసిక ఈ అంశాన్ని దృష్టికి తెచ్చినందుకు ధన్యవాదాలండీ. నేనిది చేపట్టి సాధ్యమైనంతవరకూ పనిచేస్తానండీ. పవన్ సంతోష్ (చర్చ) 07:30, 7 ఏప్రిల్ 2024 (UTC)
మొదటి పేజీ మార్గదర్శి విభాగంలో అదనపు ఉప విభాగాలు కూర్పు గురించి
మార్చుభారతదేశంలో ఎన్నికల సంఘం 2024లో సార్వత్రిక ఎన్నికలు జరపటానికి తగిన షెడ్యూలు ప్రకటించినది. ఈ సందర్బంగా వీక్షకులు ఎన్నికల సమాచారం కొరకు వెతుకుట సహజం. అయితే మొదటి పేజీలో ఎన్నికలు, రాజకీయాలకు సమాచారానికి సంబంధించిన వర్గాలకు అంత ప్రాతినిద్యం లేదు.కేవలం భాష, సమాజం అనే ఉపవిభాగంలో రాజకీయాలు వర్గం గురించి మాత్రమే ఉంది.దానిలో అన్నీ ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులలో విపులంగా సమాచారం విస్తరించిఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. కావున మార్గదర్శి విభాగంలో రాజకీయాలు, ఎన్నికలు అనే రెండు ఉప విభాగాలుచేర్చి, రాజకీయాలు ఉపవిభాగంలో రాజకీయ నాయకులు , రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజ్యసభ సభ్యులు , రాష్ట్ర శాసనసభలు, లోక్‌సభ సభ్యులు, రాజకీయ పార్టీలు చేర్చుటకు, అలాగే ఎన్నికలు ఉప విభాగం కింద సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు లోక్‌సభ నియోజకవర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు, రాష్ట్ర శాసనసభల సభ్యులు కూర్పు చేయుటకు సముదాయసభ్యుల అభిప్రాయాలు తెలుపగలందులకు కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:47, 1 ఏప్రిల్ 2024 (UTC)
- ముఖ్యంగా మొదటి పేజీ నిర్వహకులు @ రవిచంద్ర గారిని, వెంకటరమణ గారిని దీని విషయంలో సాధ్యా అసాధ్యాలుపై పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. యర్రా రామారావు (చర్చ) 05:51, 2 ఏప్రిల్ 2024 (UTC)
- రామారావు గారూ, భారతదేశం విభాగం కింద రాజకీయాలు అనే ఉప విభాగం చేర్చవచ్చు అనుకుంటున్నాను. మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలు చెబితే దాన్ని చేరుద్దాము. మనకు ఒక వర్గీకరణ కావాలి. భారతదేశ రాజకీయాలు, దాని కింద రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల కింద రాష్ట్రాల వారీ శాసనసభ వ్యాసాలు... ఇలా. దీని మీద మనం ఒక ఏకాభిప్రాయానికి వస్తే మొదటి పేజీలో చేర్చవచ్చు. రవిచంద్ర (చర్చ) 06:53, 2 ఏప్రిల్ 2024 (UTC)
- క్షమించాలి. నేను గమనించలేదు కానీ వర్గం:భారత రాజకీయాలు అనే పేరుతో ఇది వరకే వర్గం ఉంది. ఇందులో మీరు పేర్కొన్న వర్గాలన్నీ చేరాయి అనుకుంటున్నా. ఇది ఒకటి భారతదేశం విభాగం కింద చేరిస్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఈ వర్గీకరణ తిరగదోడాలంటే మాత్రం కొంచెం సమయంతో కూడుకున్న పనే. - రవిచంద్ర (చర్చ) 07:03, 2 ఏప్రిల్ 2024 (UTC)
- ఎలా అవకాశం ఉంటే అలా చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 07:38, 2 ఏప్రిల్ 2024 (UTC)
- భారత రాజకీయాలు వర్గాన్ని మార్గదర్శిలో భారతదేశం విభాగం కింద చేరుస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 10:44, 2 ఏప్రిల్ 2024 (UTC)
- రవిచంద్ర గారూ, మొదటి పేజీలో రెండు పెట్టెలు (వికీపీడియాకు స్వాగతం! కీంద ఉండే పెట్టె, సోదర ప్రాజెక్టులు పెట్టె) కుడివైపున ఓవర్‌ఫ్లో అయ్యాయండి (వెక్టర్ 2022 రూపులో). మీకు అవకాశం ఉంటే వాటిని సరిచేసే వీలుందేమో పరిశీలించగలరు.__ చదువరి (చర్చ • రచనలు) 10:22, 2 ఏప్రిల్ 2024 (UTC)
- కింది పెట్టెను సవరించాను. పైపెట్టెను సవరించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 10:43, 2 ఏప్రిల్ 2024 (UTC)
- భాష, సమాజం ఉప విభాగంలో రాజకీయం అవసరం లేదనుకుంటాను. యర్రా రామారావు (చర్చ) 10:53, 2 ఏప్రిల్ 2024 (UTC)
- కింది పెట్టెను సవరించాను. పైపెట్టెను సవరించాలి. __ చదువరి (చర్చ • రచనలు) 10:43, 2 ఏప్రిల్ 2024 (UTC)
- ఎలా అవకాశం ఉంటే అలా చేయగలరు. యర్రా రామారావు (చర్చ) 07:38, 2 ఏప్రిల్ 2024 (UTC)
- క్షమించాలి. నేను గమనించలేదు కానీ వర్గం:భారత రాజకీయాలు అనే పేరుతో ఇది వరకే వర్గం ఉంది. ఇందులో మీరు పేర్కొన్న వర్గాలన్నీ చేరాయి అనుకుంటున్నా. ఇది ఒకటి భారతదేశం విభాగం కింద చేరిస్తే సరిపోతుంది అనుకుంటున్నా. ఈ వర్గీకరణ తిరగదోడాలంటే మాత్రం కొంచెం సమయంతో కూడుకున్న పనే. - రవిచంద్ర (చర్చ) 07:03, 2 ఏప్రిల్ 2024 (UTC)
- రామారావు గారూ, భారతదేశం విభాగం కింద రాజకీయాలు అనే ఉప విభాగం చేర్చవచ్చు అనుకుంటున్నాను. మిగతా సభ్యులు కూడా తమ అభిప్రాయాలు చెబితే దాన్ని చేరుద్దాము. మనకు ఒక వర్గీకరణ కావాలి. భారతదేశ రాజకీయాలు, దాని కింద రాష్ట్ర రాజకీయాలు, కేంద్ర రాజకీయాలు, రాష్ట్ర రాజకీయాల కింద రాష్ట్రాల వారీ శాసనసభ వ్యాసాలు... ఇలా. దీని మీద మనం ఒక ఏకాభిప్రాయానికి వస్తే మొదటి పేజీలో చేర్చవచ్చు. రవిచంద్ర (చర్చ) 06:53, 2 ఏప్రిల్ 2024 (UTC)
తెవికీ బడి - శిక్షణా కార్యక్రమాలు
మార్చుసభ్యులందరకు నమస్కారం
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు ద్వారా నిర్వహిస్తున్న వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలకు స్వాగతం. ఇది తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూపు మొదటి కార్యక్రమం.
శిక్షణా కార్యక్రమం-1
తేదీ: 07.04.2024 ఆదివారం. సమయం: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు
శిక్షణాంశం: "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు"
జనవరి 26-28 మధ్య మనం విశాఖపట్నంలో జరుపుకున్న తెవికీ పండగ 2024 సందర్భంగా CIS/A2K ఇంకా తెలుగు కోరా బృందంవారు నిర్వహించి నివేదించిన సమీక్షలతో మన తెలుగు వికీమీడియన్లు తెవికీ వ్యాసాలలో నాణ్యత మెరుగుపరచాలనేది పూర్తిగా ఏకీభవించిన అంశం. ఈ నేపథ్యంలో మొదటగా "తెలుగు వికీపీడియా వ్యాసానికి ఉండవలసిన హంగులు" అనే విషయాన్ని శిక్షణాంశాలలో చేర్చడం జరిగింది. అందుకని సభ్యులందరు పాల్గొని తమ సందేహాలు తీర్చుకొని, తమ అనుభవాల నేపధ్యంలో చర్చించి అందరకు అవగాహన పెంపొందించాలని కోరుతున్నాము.
పాల్గొను సభ్యులు ఇక్కడ నమోదు చేసికోవలసినది. ధన్యవాదాలు. VJS (చర్చ) 18:52, 2 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు @Vjsuseela గారు, నేను నమోదు చేసుకున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 19:34, 2 ఏప్రిల్ 2024 (UTC)
మొదటి త్రైమాసిక గణాంకాలు
మార్చుఈ ఏడు తొలి త్రైమాసికంలో తెవికీలో కొత్త వ్యాసాల గణాంకాలు ఇలా ఉన్నాయి:
జనవరి | ఫిబ్రవరి | మార్చి | మూడు నెలలకు | |
---|---|---|---|---|
వ్యాసాల సంఖ్య | 800 | 1,999 | 1,200 | 3,999 |
సగటున రోజుకు | 25.8 | 68.9 | 38.7 | 43.9 |
మూణ్ణెల్లలో 4 వేలు! స్త్రీవాదము - జానపదము, 2024 ఎన్నికల వ్యాసాలు ప్రాజెక్టుల పాత్ర ఇందులో ప్రధానంగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులలోనూ కలిపి 2500 పైచిలుకు వ్యాసాలు వచ్చాయి.
మరికొన్ని గణాంకాలు:
- ఈ 3,999 వ్యాసాలను సృష్టించినది - 81 మంది
- వాటిలో కేవలం 9 మంది 3,541 వ్యాసాలు రాసారు.
- మరో 14 మంది 359 వ్యాసాలు రాసారు.
- మిగతా 99 వ్యాసాలను 58 మంది రాసారు
ఇందులో పాలుపంచుకున్న వాడుకరులందరికీ అభినందనలు!
ఇంకొక 6200 వ్యాసాలు రాస్తే లక్ష వ్యాసాలకు చేరతాం. ఈ ఏటి వార్షికోత్సవం నాటికి అక్షరాలా లక్ష ఖాయం! __ చదువరి (చర్చ • రచనలు) 12:13, 3 ఏప్రిల్ 2024 (UTC)
- మొదటి త్రైమాసిక గణాంకాలు అందించినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:31, 9 ఏప్రిల్ 2024 (UTC)
B.K.Viswanadh గారి నిర్వాహకత్వ సమీక్ష
మార్చు2023 అక్టోబరు 1 నుండి 2024 మార్చి 31 తో ముగిసిన 6 నెలల కాలంలో నిర్వాహకులైన B.K.Viswanadh గారు చేసిన నిర్బ్వాహక కృషిని నేణు సమీక్షించాను. ఆ సమీక్షను వికీపీడియా:నిర్వాహకుల చురుకుదనపు సమీక్ష/B.K.Viswanadh వద్ద చూడవచ్చు.
వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం ప్రకారం, 6 నెలల కాలంలో తెవికీలో కనీసం ఒక్కటైనా (1) దిద్దుబాటు చేసి ఉండి, కనీసం 20 నిర్వాహక దిద్దుబాట్లు చేసి ఉండకపోతే, వారిని నిర్వాహకత్వం నుండి తొలగించవచ్చు. నా సమీక్షలో, విశ్వనాధ్ గారు 20 నిర్వాహక దిద్దుబాట్లు చెయ్యలేదని తేలింది. అందుచేత, ఆ విధానం ప్రకారం, ఆయన్ను నిర్వాహకత్వం నుండి తొలగించేందుకు స్టీవార్డులను అభ్యర్థించవలసి ఉంది. ఒక వారం రోజుల తరువాత - 2014 ఏప్రిల్ 11 న - స్టీవార్డులను అభ్యర్థించాలను నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ లోగా ఈ అంశంపై అభిప్రాయాలేమైనా ఉంటే పై సమీక్షా పేజీలో రాయవలసినదిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. __ చదువరి (చర్చ • రచనలు) 03:20, 4 ఏప్రిల్ 2024 (UTC)
- ఇలాగే ఇంకా మిగిలివారిపై కూడా సమీక్షించాలని నా అభిప్రాయం.వాస్తవంగా ఇది అసలు మరెవరో సమీక్షించేదికాదు.ఎవరికి వారు సమీక్షించుకుని వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం ప్రకారం నడుచుకోవాలి.అలా చేయనప్పుడు ఈ పద్దతి పాటించవలసివస్తుంది. యర్రా రామారావు (చర్చ) 03:34, 4 ఏప్రిల్ 2024 (UTC)
- వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ విధానం ప్రకారం, మిగిలిన వారి నిర్వాహకత్వ చర్యలు కూడా సమీక్షించాలని నా అభిప్రాయం.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:04, 4 ఏప్రిల్ 2024 (UTC)
- అలాగేనండీ చదువరి గారు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:37, 9 ఏప్రిల్ 2024 (UTC)
- చదువరి గారు మంచి విషయం. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 02:25, 10 ఏప్రిల్ 2024 (UTC)
చదువరి గారు. "విశ్వనాధ్ గారు నిర్వాహకత్వంలో గత కొన్నేళ్ళుగా నిష్క్రియగా ఉన్నారు కాబట్టి ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు" అన్నారు. రాస్తూ ఉంటేనే ఎక్టివ్ గా ఉన్నట్టు అనుకొనే మీ ఆలోచన సరైనదేనా ?, ఇక్కడ లేదా మరెక్కడైనా మీ అభిప్రాయానికి వ్యతిరేకంగా లేదా ఒక సమూహానికి వ్యతిరేకంగా ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్త పరిస్తే వారిపై ఎక్కువ ఆసక్తి కనబరచడం (లేదా వారిపై ఫోకస్ చేయడం) దేని కిందికి వస్తుందని అనుకుంటారు?, కొత్త వాడుకరులకు అనూకూలంగా మీ నిర్ణయాలు లేదా పాలసీలు లేవు, సులభతరంగా చేయడం కాక కష్టతరంగా మారుస్తున్నారు అని ఎవరైనా అంటే మీకెమైనా ఇబ్బంది అనిపిస్తుందా?, ఇప్పుడు ఎక్టివ్ గా ఉన్న వాడుకరులు వంద మంది ఉన్నారా?, ఉన్న 20 మంది వాడూకరుల ద్వారా పాలసీల రూప కల్పన కాక, వాడుకరులను పెంచుకొనే పాలసీలు, పధకాలు, వర్క్ షాప్స్, ప్రాజెక్టులు పై పని తీరు సమీక్షిస్తున్నారా?, అసలు అలాంటి ప్రాజెక్టూల రూప కల్పన ఎమైనా జరిగిందా?, దీనిపై ఒకపేజీ చేసి చర్చను ప్రారంభించగలమా?.. అక్కడ అసలు అభిప్రాయాలను దాడి లేకుండా, ఇబ్బంది లేకుండా నిర్భయంగా వ్యక్తపరచగలమా?, వాటీ ద్వారా మూస దోరణి నుండి బయటాకు వచ్చే ప్రయత్నం చేయగలమా?,. నిర్వహణా పరమైన అన్ని సమస్యలు ఇక్కడ ఎలా తెలుస్తాయి. అవి తెలియాలంటే ఒక కొత్త విధ్యార్ధి సమూహం వద్ద మన వికీ ఎంత వరకూ వాళ్ళకు అర్ధం అయ్యింది చూడాలి. మనం కూర్చుండాం. మీకు ఎప్పుడు సాధ్యమో తెలియచేయండి. ఇద్దరం వెళదాం. అప్పుడైనా అసలు విషయాలు మీకు తెలుస్తాయేమో బహూశా.. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 06:36, 10 ఏప్రిల్ 2024 (UTC)
- విశ్వనాథ్ గారు మీరు వికీనియమాలప్రకారం తప్పుకోవాలనే అభిప్రాయం ఒక్క చదువరి గార్కి మాత్రమో కాదు.దానిని మరికొంత మంది బలపర్చారు. పాలసీలు అనేవి మీకైనా, నాకైనా ఎవరికైనా ఒకటే, అని మీరు సహృదయంతో అర్థం చేసుకోవాలి. స్టీవార్డులతో పని లేకుండా మీరు పెద్దమనసుతో తప్పుకోవలసిందిపోయి దీనిని యాగీ చేయటం భావ్యంగా లేదు.మరొకసారి ప్రశాంతంగా ఆలోచించగలరు.ఇంతక ముందు 14 మంది నిర్వీహకులు వివిధకారణాలవలన తప్పుకున్నవారు, తప్పించినవారు ఉన్నారు. గమనించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 06:57, 10 ఏప్రిల్ 2024 (UTC)
- యర్రా రామారావుగారు మనిషికి ఆత్రానికి మించిన వ్యసనం మరొకటిలేడు. అదే ఆత్రంతో ప్రస్తుతం వికీ, వికీపీడియన్లు పనిచేస్తున్నారు. దానికి వయసు అనుభవంతో పనిలేదు. అది ఇక్కడ నిరూపించబడింది. ఎవరిని ఉద్దేశించి రాస్తామో వారు స్పందించరు.. ఎవరికో ఆత్రం. పైన నేను వాడుకరి ని ఉద్దేశించి పెట్టిన మెసెజ్ "చదువరి గారు మంచి విషయం, ధన్యవాదాలు". తర్వాత నా అభిప్రాయం తెలియపరచాను. దానికి మీరు ఆవేశపడ్డారని అనను. కానీ మీ వయసుకు అనుభవానికి తగినట్టుగా మాట్లాడలేకపోయారు అంటాను. ఏదైనా విషయం రచ్చబండలో రాయనక్కరలేకుడా ముందుగా ఒకసారి వాడుకరి పేజీలో "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని తెలియచేస్తే అయిపోయేదానికి ఎప్పుడో కొందరి మీద అప్లై చేసిన అదే ప్రాపగండా నా మీద ఎందుకు. ఆయన్ని ఎన్నో తిట్టారు. ఎంతో కృషి చేసిన వారు సైతం వికీ నుండి అవమానకరంగా తప్పుకున్నారు. అలాంటి పద్దతులు వికీలో ఎందుకు, సహనం లేని అనుభవం వయసు అవసరమా...--B.K.Viswanadh (చర్చ) 06:35, 13 ఏప్రిల్ 2024 (UTC)
- @విశ్వనాథ్ గారూ మీ భాదను నేను అర్థం చేసుకున్నాను.నేను ఆత్రుతతో రాసిన వ్యాఖ్యలు మీకు భాధ కలిగించినందుకు క్షమించగలరు. యర్రా రామారావు (చర్చ) 09:13, 13 ఏప్రిల్ 2024 (UTC)
- యర్రా రామారావుగారు మనిషికి ఆత్రానికి మించిన వ్యసనం మరొకటిలేడు. అదే ఆత్రంతో ప్రస్తుతం వికీ, వికీపీడియన్లు పనిచేస్తున్నారు. దానికి వయసు అనుభవంతో పనిలేదు. అది ఇక్కడ నిరూపించబడింది. ఎవరిని ఉద్దేశించి రాస్తామో వారు స్పందించరు.. ఎవరికో ఆత్రం. పైన నేను వాడుకరి ని ఉద్దేశించి పెట్టిన మెసెజ్ "చదువరి గారు మంచి విషయం, ధన్యవాదాలు". తర్వాత నా అభిప్రాయం తెలియపరచాను. దానికి మీరు ఆవేశపడ్డారని అనను. కానీ మీ వయసుకు అనుభవానికి తగినట్టుగా మాట్లాడలేకపోయారు అంటాను. ఏదైనా విషయం రచ్చబండలో రాయనక్కరలేకుడా ముందుగా ఒకసారి వాడుకరి పేజీలో "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని తెలియచేస్తే అయిపోయేదానికి ఎప్పుడో కొందరి మీద అప్లై చేసిన అదే ప్రాపగండా నా మీద ఎందుకు. ఆయన్ని ఎన్నో తిట్టారు. ఎంతో కృషి చేసిన వారు సైతం వికీ నుండి అవమానకరంగా తప్పుకున్నారు. అలాంటి పద్దతులు వికీలో ఎందుకు, సహనం లేని అనుభవం వయసు అవసరమా...--B.K.Viswanadh (చర్చ) 06:35, 13 ఏప్రిల్ 2024 (UTC)
- @B.K.Viswanadh గారూ, చాలా ప్రశ్నలు అడిగారు. వీలైనంతలో సమాధానం ఇస్తాను.
- "రాస్తూ ఉంటేనే ఎక్టివ్ గా ఉన్నట్టు అనుకొనే మీ ఆలోచన సరైనదేనా?" అన్నారు. సరైనదే! నూటికి నూరు పాళ్ళు సరైనదే. ఒకవేళ అది సరికాదని మీరు అనుకుంటే, అది నూటికి నూరు పాళ్ళు తప్పే. కావాలంటే ఋజువు చేస్తా.
- "సులభతరంగా చేయడం కాక కష్టతరంగా మారుస్తున్నారు అంటే మీకెమైనా ఇబ్బంది ఉందా?" అన్నారు. అస్సలు లేదండి. పైగా సంతోషం కూడా. చర్చ అంటేనే అన్ని కోణాలూ వస్తాయి. నిర్ణయం కూడా మంచిది వస్తుంది. అందుకే చర్చలు బాగా జరగాలి. కాకపోతే, ఇందులో తప్పుంది, అందులో దోషముంది అని వేలెత్తి చూపటం మాత్రమే చేసి, ఆ లోపం ఏమిటి, దాన్ని సవరించేందుకు ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనే ఆలోచన చెయ్యనట్లైతే, ఇక ఆ వేలుకున్న విలువ సున్నా కంటే ఎన్ని వేలు ఎక్కువో పెద్దలు, మీకు తెలియనిదేమీ కాదు.
- "ఒకపేజీ చేసి చర్చను ప్రారంభించగలమా.." మీరు ప్రారంభించ గలరనే నేను అనుకుంటున్నాను.
- "అక్కడ అసలు అభిప్రయాలను దాడి లేకుండా, ఇబ్బంది లేకుండా వ్యక్తపరచగలమా" - మీ సంగతి నాకు తెలియదు. నావరకు నేను స్పష్టంగా, డొంకతిరుగుడు లేకుండా, సూటి గానే చెప్పగలను, చెబుతాను కూడా. ఇంకో సంగతి.. సూటిగా చెప్పేందుకు తార్కికమైన విషయం లేనపుడు కొందరు దాడి చేస్తారు, నిందలు వేస్తారు అనేది నా అభిప్రాయం. మళ్ళీ, మీ సంగతి నాకు తెలియదు.
- "మూస దోరణి నుండి బయటాకు వచ్చే ప్రయత్నం ఉందా?,. నిర్వహణా పరమైన అన్ని సమస్యలు తెలుస్తాయి." - నిర్వహణ పరమైన సమస్యలు మీకు తెలియటానికి ఇంకోళ్ళతో చర్చ చెయ్యాల్సిన అవసరమేముంది?
- "కానీ అది ఇక్కడ కాదు. మనం కూర్చుందాం." ఇక్కడ కాదా!? ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చర్చిస్తాం? తెవికీలో చర్చకైతే, నేన్రెడీ. దీని గురించి తెవికీలో కాకుండా ఇంకెక్కడా చర్చించన్నేను. కూచోటాల్లేవ్.
- "అసలు విషయాలు మీకు తెలుస్తాయేమో బహూశా..." - "నీకు తెలీదు,. నాకు తెలుసు" అని చెప్పడం మీ ఉద్దేశమా? అదే అయితే మీతో వెంటనే ఏకీభవిస్తున్నాను. అందులో నాకు అభ్యంతర మేమీ లేదు, భేషజం అంతకంటే లేదు. నాకు బోల్డంత తెలుసు అనే భ్రమ నాకు అస్సలు లేదు. అలాగే మీకు నాకంటే బాగా తెలుసు అనే విషయమ్మీద కూడా నాకు భిన్నాభిప్రాయం లేదు. మనకు తెలిసిన దాని వలన తెవికీకి కలిగిన ప్రయోజనం ఏంటి అనేది మాత్రం నేను సదా ఆలోచిస్తాను. ఆ దిశగా కృషి చేస్తాను.
- పోతే..
- "ముందుగా ఒకసారి వాడుకరి పేజీలో "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని తెలియచేస్తే అయిపోయేదానికి,," అన్నారు. ఓ మూణ్ణాలుగేళ్ళ కిందట జరిగిన ఒక చర్చలో నిర్వాహకత్వ ఉపసంహరణ విధానాన్ని మీరు వ్యతిరేకించారు. మీ నిర్వాహక కృషి ఆ విధానానికి లోబడి లేకపోతే ఎవరైనా మిమ్మల్ని తొలగించవచ్చుననీ చెప్పారు. పైగా, ఈ మూణ్ణాలుగేళ్ళుగా ఆ విధానంలో ఉన్న తొలి సూత్రమైన స్వచ్ఛంద ఉపసంహరణను మీరు పాటించనేలేదు. మీకు స్వచ్ఛందంగా తప్పుకోవడం ఇష్టం లేదని తెలిసాక కూడా ఇప్పుడు నేనొచ్చి, "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని మీ చర్చ పేజీలో ఎలా రాయగలను?
- మరి, అప్పటి నుండి నేను నిష్క్రియ గానే ఉన్నాను గదా.. ఇన్నాళ్ళుగా ఎందుకు తీసెయ్యలేదు అని మీరు నన్నడగవచ్చు. దానికి నా సమాధానం - మీరు మారతారని అనుకున్నా, నా జడ్జిమెంటును వాడాను. అందుకే ఈ ప్రతిపాదన చెయ్యలేదు.
- ఇప్పటికైనా మించిపోయింది లేదు.. మీరు స్వచ్ఛందంగా తప్పుకుంటానంటే, ఆ సంగతే ప్రకటించండి. నా ప్రతిపాదనను వెనక్కి తీసేసుకోడానికి నాకేమీ అభ్యంతరం లేదు. మిమ్మల్ని చిన్నబుచ్చాలనేది నా ఉద్దేశం కానే కాదు. __ చదువరి (చర్చ • రచనలు) 16:24, 13 ఏప్రిల్ 2024 (UTC)
- చదువరి గారు పైన తెల్పిన అనేక విషయాలపై చర్చ చేయాలని ఉన్నా అనవసరం అనిపించింది. అయితే ఒకటి ఇన్ని ప్రోగ్రాంస్ ఫొటోగ్రఫీ అనో, కాలేజీల్లో శిక్షణ అనో రకరకాల ప్రోగ్రాములు ఎందుకు చెస్తున్నారు. వారి దగ్గర నుండి చేస్తేనే వారు ఎలా నేర్చుకుంటారు తెలుస్తుంది అనేగా..?, అన్నీ అన్న్లైన్ లొనే తెలిసిపోతే ఇవన్నీ ఎందుకు. ఒక కొత్త వ్యక్తి దగ్గర కూర్చుని చూస్తె తెలుస్తుంది అతడూ ఎలా వెళుతున్నాడు. ఎలా ఎడిట్ చెస్తున్నాడు, ఏయే ఇబ్బందులు పేస్ చెస్తున్నాడు అనేది. ఇక "స్వచ్ఛందంగా తప్పుకోవడం ఇష్టం లేదని తెలిసాక కూడా ఇప్పుడు నేనొచ్చి, "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని మీ చర్చ పేజీలో ఎలా రాయగలను?" అని రాసారు. మీకు ఎలా తెలిసింది నాకు ఇష్టం లేదని, నాలుగేల్లుగా ఎదురు చూసారా ? అంత గొప్ప సంవత్సరాల ఎదురు చూపులో ఒకసారి ఒకేసారి నా పేజీలో హెచ్చరిక ఇవ్వలేక పోయారా?. నాకు చెప్పలేకపోయారా ?, ఇన్ని సంవత్సరాలుగ కలిసి పని చేస్తున్న వికీ మిత్రులకు ఒకసారి గుర్తు చేయడం కష్టం అనుకున్నారా ?. వికీలో మీ ప్రస్థానం గమనించారా..?, ఎందరో మనతో కలిసి పని చేసిన వారిలో కొందరు అవమానకరంగా బయటికి వెళ్ళిపోయారు. అదీ వెళుతూ వెళుతూ విమర్శలు తిట్లు అనేకం జరిగాయి. ఎక్కువగా మీమీదే దాడి జరిగింది. అయితే అంత కాలంగా ఉన్న వారికి ఇలా తిట్టడం కాని భయంకర విమర్శలు చేయడం కానీ తప్పు అని తెలియదా ?, తెలుసు. వారు అనేక చర్చలలో పాల్గొన్న వారే, వికీలో మార్గదర్శకులే, అనేక పాలసీల రూప కల్పనలో పాలుపంచుకున్నవారే, కానీ వికీలొ ఉన్న నియమాల ప్రకారం ఆధారంలేని అరోపణ చేయడం తప్పు కనుక ఏమీ చెయలేని అసహయతతో అలా చేసి ఉంటారు అనుకున్నాను. అందరూ మీ పై విమర్శలు చేస్తున్నారు అంటే దానిపై ఆలోచించుకోవలసిన అవసరం మీకే ఉందని అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరైనా ఒక వ్యవస్థలో సమయం, డబ్బు(నెట్, కరెంట్) ఖర్చుచేసుకొని పని చెస్తున్నారంటే వారికి సేవాభావం ఉందనేగా, పదవుల కోసమో, డబ్బు కోసమో కాదుగా. మరి అలాంటి ఇన్ని సంవత్సరాల కృషిని, కలిసి, తెలిసిన వ్యక్తిని హెచ్చరించడానికి మీకున్న ఇబ్బంది ఏమిటి ?, వాళ్లను మీరు మిత్రులుగా అనుకోలేకపోతున్నారా?, ఆర్ధిక, సామాజిక, అధికారిక తారతమ్యాలు వికీ మిత్రుల మధ్యలో ఉన్నాయని మీ భావనా ?, ఈ విషయంలో నాలుగు సంవత్సరాలుగా మీరు ఎదురు చూసారు కరెక్టే, కాని వాళ్ళు అది మరిచిపోయి ఉండవచ్చు. ఎలాగూ ఏక్టివ్ గా లేరుగా, గమనించకపొయి ఉండవచ్చు. వాళ్ళకు అది అసలు ఒక విషయంగానే అనిపించకపొయి ఉండొచ్చు. మీ వైపుగా ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి చూసి చేయాలని తహ తహలాడే విషయం మీకు ముఖ్యమైనదే అయి ఉండవచ్చు. మీరు దాన్ని ఒక అధికారంగా లేదా మీకు మాత్రమే ఉన్న భాధ్యతగా అనుకుంటూ ఉండవచు. తప్పేలేదు. ఇక దీనిపై మీరు ఇపుడు ఉపసంహరించుకోవాలనుకున్నా అది సరిఐనదే కాదు. ఒకసారి మొదలు పెట్టాక పూర్తిచేయడం మంచిది. కొనసాగించండి. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 10:29, 18 ఏప్రిల్ 2024 (UTC)
- B.K.Viswanadh గారూ, నాక్కూడా చర్చించాలని లేదండి. రెండు ముక్కలు చెప్పి ఈ చర్చను ముగిస్తాను.
- గతంలో రచ్చబండలో జరిగిన చర్చలో మీరు "నా వైపుగా నిర్వహక మార్పులు ఏమీ లేవు. ఆరు నెలల్లో నిర్వహక మార్పులు చేయకపోతే నిర్వహకత్వం తొలగింపు అనేదానికి నేను వ్యతిరేకంగానే చర్చల్లో నా అభిప్రాయాలు వెలబుచ్చాను. ఇది ఉద్యోగభాద్యతకాదు, వీటికి టార్గెట్స్ ఉండరాదని. అయినా సముదాయపు నియమ నిబందలను గౌరవిస్తూ... నానిర్వహక మార్పులు పాలసీకి అనుగుణంగా లేకపోతే నిర్వహక భద్యతలను తొలగించవచ్చు" అని రాసారు.
- సముదాయపు నియమ నిబంధనలను గౌరవిస్తానని చెప్పారు. స్వచ్ఛందంగా తప్పుకోవడం ఆ విధానంలో ఒక భాగం. నియమ నిబంధనలపై గౌరవం ఉంది అన్నారు కాబట్టి స్వచ్ఛందంగా తప్పుకుంటారనుకున్నాను.
- ఈ చర్చలో కూడా "మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని తెలియచేస్తే సరిపోయేది అని మీరే అన్నారు.
- అంచేతనే నేను నా ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటానని రాసాను.
- మీ మాటలే అవి. వాటిని బట్టే ఆగాను. __ చదువరి (చర్చ • రచనలు) 11:19, 18 ఏప్రిల్ 2024 (UTC)
- B.K.Viswanadh గారూ, నాక్కూడా చర్చించాలని లేదండి. రెండు ముక్కలు చెప్పి ఈ చర్చను ముగిస్తాను.
- చదువరి గారు పైన తెల్పిన అనేక విషయాలపై చర్చ చేయాలని ఉన్నా అనవసరం అనిపించింది. అయితే ఒకటి ఇన్ని ప్రోగ్రాంస్ ఫొటోగ్రఫీ అనో, కాలేజీల్లో శిక్షణ అనో రకరకాల ప్రోగ్రాములు ఎందుకు చెస్తున్నారు. వారి దగ్గర నుండి చేస్తేనే వారు ఎలా నేర్చుకుంటారు తెలుస్తుంది అనేగా..?, అన్నీ అన్న్లైన్ లొనే తెలిసిపోతే ఇవన్నీ ఎందుకు. ఒక కొత్త వ్యక్తి దగ్గర కూర్చుని చూస్తె తెలుస్తుంది అతడూ ఎలా వెళుతున్నాడు. ఎలా ఎడిట్ చెస్తున్నాడు, ఏయే ఇబ్బందులు పేస్ చెస్తున్నాడు అనేది. ఇక "స్వచ్ఛందంగా తప్పుకోవడం ఇష్టం లేదని తెలిసాక కూడా ఇప్పుడు నేనొచ్చి, "విశ్వనాధ్ గారు మీ నిర్వహక మార్పులు తగ్గినాయి. మీరు నిర్వహకత్వం స్వచ్చందంగా వదిలేయడం మంచిది" అని మీ చర్చ పేజీలో ఎలా రాయగలను?" అని రాసారు. మీకు ఎలా తెలిసింది నాకు ఇష్టం లేదని, నాలుగేల్లుగా ఎదురు చూసారా ? అంత గొప్ప సంవత్సరాల ఎదురు చూపులో ఒకసారి ఒకేసారి నా పేజీలో హెచ్చరిక ఇవ్వలేక పోయారా?. నాకు చెప్పలేకపోయారా ?, ఇన్ని సంవత్సరాలుగ కలిసి పని చేస్తున్న వికీ మిత్రులకు ఒకసారి గుర్తు చేయడం కష్టం అనుకున్నారా ?. వికీలో మీ ప్రస్థానం గమనించారా..?, ఎందరో మనతో కలిసి పని చేసిన వారిలో కొందరు అవమానకరంగా బయటికి వెళ్ళిపోయారు. అదీ వెళుతూ వెళుతూ విమర్శలు తిట్లు అనేకం జరిగాయి. ఎక్కువగా మీమీదే దాడి జరిగింది. అయితే అంత కాలంగా ఉన్న వారికి ఇలా తిట్టడం కాని భయంకర విమర్శలు చేయడం కానీ తప్పు అని తెలియదా ?, తెలుసు. వారు అనేక చర్చలలో పాల్గొన్న వారే, వికీలో మార్గదర్శకులే, అనేక పాలసీల రూప కల్పనలో పాలుపంచుకున్నవారే, కానీ వికీలొ ఉన్న నియమాల ప్రకారం ఆధారంలేని అరోపణ చేయడం తప్పు కనుక ఏమీ చెయలేని అసహయతతో అలా చేసి ఉంటారు అనుకున్నాను. అందరూ మీ పై విమర్శలు చేస్తున్నారు అంటే దానిపై ఆలోచించుకోవలసిన అవసరం మీకే ఉందని అనుకుంటాను. ఇన్ని సంవత్సరాలుగా ఎవరైనా ఒక వ్యవస్థలో సమయం, డబ్బు(నెట్, కరెంట్) ఖర్చుచేసుకొని పని చెస్తున్నారంటే వారికి సేవాభావం ఉందనేగా, పదవుల కోసమో, డబ్బు కోసమో కాదుగా. మరి అలాంటి ఇన్ని సంవత్సరాల కృషిని, కలిసి, తెలిసిన వ్యక్తిని హెచ్చరించడానికి మీకున్న ఇబ్బంది ఏమిటి ?, వాళ్లను మీరు మిత్రులుగా అనుకోలేకపోతున్నారా?, ఆర్ధిక, సామాజిక, అధికారిక తారతమ్యాలు వికీ మిత్రుల మధ్యలో ఉన్నాయని మీ భావనా ?, ఈ విషయంలో నాలుగు సంవత్సరాలుగా మీరు ఎదురు చూసారు కరెక్టే, కాని వాళ్ళు అది మరిచిపోయి ఉండవచ్చు. ఎలాగూ ఏక్టివ్ గా లేరుగా, గమనించకపొయి ఉండవచ్చు. వాళ్ళకు అది అసలు ఒక విషయంగానే అనిపించకపొయి ఉండొచ్చు. మీ వైపుగా ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసి చూసి చేయాలని తహ తహలాడే విషయం మీకు ముఖ్యమైనదే అయి ఉండవచ్చు. మీరు దాన్ని ఒక అధికారంగా లేదా మీకు మాత్రమే ఉన్న భాధ్యతగా అనుకుంటూ ఉండవచు. తప్పేలేదు. ఇక దీనిపై మీరు ఇపుడు ఉపసంహరించుకోవాలనుకున్నా అది సరిఐనదే కాదు. ఒకసారి మొదలు పెట్టాక పూర్తిచేయడం మంచిది. కొనసాగించండి. ధన్యవాదాలు..--B.K.Viswanadh (చర్చ) 10:29, 18 ఏప్రిల్ 2024 (UTC)
2024 లో సృష్టించిన వ్యాసాల్లో అనాథలు
మార్చుపైన మొదటి త్రైమాసిక గణాంకాలకు కొనసాగింపు ఇది. దీన్ని చూడడం ఎవరూ మిస్సవకూడదని విడిగా రాస్తున్నాను. ఈ మూడునెలల్లో మనం సృష్టించిన వ్యాసాల్లో 1779 వ్యాసాలు (44%) అనాథలే. వెబ్‌లో "లీంకు" ప్రాశస్త్యం మనకు తెలియనిదేమీ కాదు. ఈ వ్యాసాల కిప్పుడు ఇన్‌కమింగు లింకులు ఇస్తూ వీటిని వికీ జీవన స్రవంతి లోకి తీసుకురావాలి. వాడుకరులు ఆలోచించవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 12:17, 4 ఏప్రిల్ 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:30, 9 ఏప్రిల్ 2024 (UTC)
తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌కు వికీమీడియా ఫౌండేషన్ నుంచి గుర్తింపు
మార్చుతెలుగు వికీమీడియా ప్రాజెక్టులు, సముదాయాలు అభివృద్ధి చేసే కార్యకలాపాలు చేపట్టేందుకు పలు చర్చల అనంతరం గత ఏడాది ఏర్పడిన తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్‌ను వికీమీడియా ఫౌండేషన్ వారి అఫ్లియేషన్స్ కమిటీ (AffCom) ఇటీవల వికీమీడియా ఫౌండేషన్‌కు అఫ్లియేట్ (అనుబంధ సమూహం)గా గుర్తించింది. ఈ మేరకు గత మార్చిలో అంతర్గతంగా తీర్మానం చేయగా, నిన్న (ఏప్రిల్ 5న) బహిరంగంగా ప్రకటన వెలువడింది. గత ఏడాది ఆగస్టులో మనం ఈ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాం. AffCom వారి అంతర్గత కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యం అయినా మొత్తానికి గుర్తింపు లభించింది. ఈ అంశంపై నాతో కలసి పనిచేసిన @రవిచంద్ర, @Vjsuseela గార్లకు అనేక ధన్యవాదాలు.
ప్రస్తుత పాలసీ ప్రకారం ఈ గుర్తింపు తిరిగి ప్రతీ ఏడాది పునస్సమీక్షిస్తూ ఉంటారు. మన కార్యకలాపాలను గురించి వికీమీడియా సముదాయానికి ఏడాదికొక నివేదిక చొప్పున సమర్పించాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వికీమీడియాలో జరిగే పరిపాలనా సంబంధమైన వివిధ కార్యక్రమాల గురించి ప్రపంచంలోని అనేక యూజర్ గ్రూపులతో పాటుగా మన గ్రూపును కూడా సంప్రదిస్తూ, ఆలోచనలు స్వీకరిస్తూ ఉండే అవకాశం ఉంటుంది.
తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల విస్తరణ, నాణ్యత, వైవిధ్యం, సముదాయ అభివృద్ధి, నాయకత్వం, వనరులు వంటి అనేక అంశాలపై మనం యూజర్ గ్రూప్ ద్వారా చురుకుగా పనిచేసి వికీమీడియా ప్రపంచంలోనూ, తెలుగు సమాజంలోనూ విశిష్టమైన స్థానాన్ని సంపాదిస్తామని నమ్ముతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 09:34, 6 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు @Pavan santhosh.s గారు. తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ కు ఏర్పాటుకు మద్దతు తెలిపిన సముదాయ సభ్యులకు, వికీమీడియా ఫౌండేషన్ తో సంప్రదింపులు జరిపిన పవన్ సంతోష్, రవిచంద్ర, సుశీల గార్లకు కృతజ్ఞతలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:50, 6 ఏప్రిల్ 2024 (UTC)
- మంచి కబురు. దీనికోసం కృషి చేసిన Pavan santhosh.s, రవిచంద్ర, Vjsuseela గార్లకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 14:57, 6 ఏప్రిల్ 2024 (UTC)
- ఎన్నోరోజుల నుండి ఎదురు చూస్తున్న మంచి కబురు.దీనికోసం కృషి చేసిన పవన్ సంతోష్, సుశీల, వాడుకరి:రవిచంద్ర గార్లకు ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 15:06, 6 ఏప్రిల్ 2024 (UTC)
- నిజమేనండి. ఇది తెలుగు వికీమీడియన్లన్దరికి సంతోషం కలిగించే వార్త. 20సంవత్సరాలు లాగానే ఇది ఒక మైలు రాయి. తెలుగు వికీమీడియన్లన్దరి మద్దత్తుతో Pavan santhosh.s చాలా కృషి చేసారు. అందరికి ధన్యవాదాలు. --VJS (చర్చ) 16:29, 6 ఏప్రిల్ 2024 (UTC)
- నేను కేవలం పవన్ గారికి కేవలం మాటసాయంగా ఉన్నాను అంతే, మిగతా ఫార్మాలిటీస్ అంతా తనే చూసుకున్నారు. ఈ యూజర్ గ్రూపు వేదికగా మనం మరిన్ని కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేయాలని ఆశిస్తున్నాము. - రవిచంద్ర (చర్చ) 09:46, 7 ఏప్రిల్ 2024 (UTC)
UCoC - Policy, Enforcement guidelines తెలుగులో
మార్చుసభ్యులకు నమస్కారం
వికీమీడియా ఫౌండేషన్ వారు అన్ని వికీమీడియా ప్రాజెక్టులు, ప్రదేశాలకు ఇంకా ఫౌండేషన్ కార్యకలాపాలకు వర్తించే విధంగా సార్వత్రిక ప్రవర్తనా నియమావళి విధానం, మార్గదర్శకాల అమలు ప్రక్రియలను ఆంగ్లం లో రూపొందించారు. తెలుగుతో సహా అనేక ఇతర భాషలలో అనువదించే అవకాశాన్ని కలిగించారు. తెవికీ పండగ సందర్భంలో వీటి గురించి కొంత తెలుసుకోవడము జరిగింది. మనకు ఉపయోగపడుతుందని వీలయినంతవరకు అనువాదం చేసి లింకులు ఈ క్రింద ఇచ్చాను. తప్పులుండవచ్చు. సూచించండి లేదా సరిచేయండి.
- ఆంగ్లం: Wikimedia Foundation:Universal Code of Conduct(UCoC):/Policy. Link https://w.wiki/6tW3
- తెలుగు అనువాదం: వికీమీడియా ఫౌండేషన్-సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/విధానం. LINK https://w.wiki/9gbo
- ఆంగ్లం: Wikimedia Foundation: Universal Code of Conduct(UCoC Policy)/Enforcement guidelines Link https://w.wiki/937j
- తెలుగు అనువాదం - వికీమీడియా_ఫౌండేషన్-సార్వత్రిక ప్రవర్తనా నియమావళి/మార్గదర్శకాల అమలు. Link https://w.wiki/9gat
ఇప్పటికే మనకు ఉన్న వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలు పేజీలో ఈ లింకులను చేర్చాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 14:49, 6 ఏప్రిల్ 2024 (UTC)
- @Vjsuseela గారూ, ధన్యవాదాలు. ఈ UCoC గురించి నాకు తెలియదు. అదసలు ప్రాజెక్టులకు సంబంధించినదేనా లేక బయట జరిగే వికీమీడియా కార్యక్రమాల్లో ప్రవర్తన గురించి బోధిస్తుందా అనేది నాకు సందేహం. ఇప్పటికే మనకున్న మార్గదర్శకాలకూ దీనికీ తేడా ఏమిటో తెలుసుకోవాలి. నేను వాటిని చదూతాను. అయితే తెలిసిన మీవంటి వారి వద్ద నేర్చుకుంటే గబుక్కున అర్థమౌతుంది, సమయం కలిసొస్తుంది, అందరికీ తెలుస్తుంది అని నా అభ్యర్థన.__ చదువరి (చర్చ • రచనలు) 15:07, 6 ఏప్రిల్ 2024 (UTC)
- ఇది చాల విస్తృతంగానే ఉందండి. ఇంతకుముందు మీరు చేసిన వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలు పేజీకి అవసరమైన సమయాలలో ఇది రిఫరెన్స్ గా ఉంటుందేమో. మీరు చదివితే తెవికీకి ప్రయోజనం. ధన్యవాదాలు. VJS (చర్చ) 16:39, 6 ఏప్రిల్ 2024 (UTC)
- @Vjsuseela గారూ, విధానాలు మార్గదర్శకాల్లో ఎక్కడా UCoC ప్రసక్తి వచ్చిన గుర్తు లేదు. అంచేతనే నాకు సందేహం వచ్చింది - దీని ప్రత్యేకత ఏంటో అని. అసలు దీన్ని మార్గదర్శకాలలో ఒకటిగా భావించవచ్చా, ఆయా పేజీల్లో లింకు ఇవ్వవచ్చా అనే సందేహం కూడా కలిగింది. __ చదువరి (చర్చ • రచనలు) 01:20, 7 ఏప్రిల్ 2024 (UTC)
- మీరు దీనిని చదివిన తరువాత ఉచితం అనిపిస్తే లింక్ లు ఉంచండి. వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం ఫుటర్ లో ఆంగ్ల వెర్షన్ బదులు తెలుగు వెర్షన్ కి లింక్ ఇవ్వచ్చేమో పరిశీలించండి.ధన్యవాదాలు. VJS (చర్చ) 09:05, 7 ఏప్రిల్ 2024 (UTC)
- సరేనండి Vjsuseela గారు. __ చదువరి (చర్చ • రచనలు) 04:52, 8 ఏప్రిల్ 2024 (UTC)
- మీరు దీనిని చదివిన తరువాత ఉచితం అనిపిస్తే లింక్ లు ఉంచండి. వాళ్ళ మార్గదర్శకాల ప్రకారం ఫుటర్ లో ఆంగ్ల వెర్షన్ బదులు తెలుగు వెర్షన్ కి లింక్ ఇవ్వచ్చేమో పరిశీలించండి.ధన్యవాదాలు. VJS (చర్చ) 09:05, 7 ఏప్రిల్ 2024 (UTC)
- @Vjsuseela గారూ, విధానాలు మార్గదర్శకాల్లో ఎక్కడా UCoC ప్రసక్తి వచ్చిన గుర్తు లేదు. అంచేతనే నాకు సందేహం వచ్చింది - దీని ప్రత్యేకత ఏంటో అని. అసలు దీన్ని మార్గదర్శకాలలో ఒకటిగా భావించవచ్చా, ఆయా పేజీల్లో లింకు ఇవ్వవచ్చా అనే సందేహం కూడా కలిగింది. __ చదువరి (చర్చ • రచనలు) 01:20, 7 ఏప్రిల్ 2024 (UTC)
- ఇది చాల విస్తృతంగానే ఉందండి. ఇంతకుముందు మీరు చేసిన వికీపీడియా:విధానాలు,_మార్గదర్శకాలు పేజీకి అవసరమైన సమయాలలో ఇది రిఫరెన్స్ గా ఉంటుందేమో. మీరు చదివితే తెవికీకి ప్రయోజనం. ధన్యవాదాలు. VJS (చర్చ) 16:39, 6 ఏప్రిల్ 2024 (UTC)
సమాచారపెట్టె లేని పేజీలు
మార్చుసమాచారపెట్టె లేని పేజీలు 4 వేలకు పైబడి ఉన్నాయి. వాటిని సమాచారపెట్టె లేని పేజీలు వర్గంలో చూడొచ్చు.__ చదువరి (చర్చ • రచనలు) 01:17, 7 ఏప్రిల్ 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:15, 7 ఏప్రిల్ 2024 (UTC)
తప్పుడు అక్షాంశ రేఖాంశ వివరాలు
మార్చుఅనేక పేజీల్లో అక్షాంశ-రేఖాంశ వివరాలు తప్పుగా ఉన్నాయి. ఉదాహరణకు ఈ కింది వ్యాసాలన్నిటికీ ఒకే అక్షాంశ రేఖాంశ వివరాలు ఉన్నాయి:
ఆ అక్షాంశ రేఖాంశాలు వాస్తవానికి దేనికి సంబంధించినవయ్యా అని మ్యాపులో వెతికి చూస్తే అది నిజానికి విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను ఉన్న స్థలానికి చెందినది. ఈ విధమైన సమస్యలు మన వ్యాసాల్లో ఉన్నాయి.
అసలు ఈ సమస్య ఏ ఎడిట్ల వల్ల వచ్చిందో గమనించి చెప్పగలరా? నేను అనుకోవడం ఎవరో ఒకరో, లేక ఒక బాటో ఒక పొరబాటు సోర్సును బట్టి ఈ పనిచేసి ఉండాలి. అది తెలిస్తే ఆ సోర్సేమిటో, ఆ పని ఎలా జరుగుతోందో గమనించి భవిష్యత్తులో జరగకుండా చూసుకోవచ్చు. ఆ వాడుకరికి తదనుగుణంగా సూచించవచ్చు.
అలాగే, క్వైరీ వాడి ఒకే అక్షాంశ రేఖాంశాలున్న పేజీలన్నిటినీ జాబితాలు వేయొచ్చు కదా? ఎవరైనా ఆ విషయంలో సాయం చేయగలరా?
ఒకసారి అలా క్వైరీ వాడి చేశాకా సులువుగా దీన్ని సరిదిద్దడానికి ఏమైనా మార్గాలున్నాయోమో వెతుకుదామా? పవన్ సంతోష్ (చర్చ) 07:26, 7 ఏప్రిల్ 2024 (UTC)
- వాటి ఇంగ్లీషు పేజీలను, వాటి చరిత్రనూ చూడగా అర్థమైనదిది - ఆ మూడూ ఇంగ్లీషు నుండి తెచ్చిన తప్పులే. తరువాతి కాలంలో అక్కడ, రెండు పేజీల్లో సవరించారు. మొదటి దానిలో ఇంకా సవరించలేదు. __ చదువరి (చర్చ • రచనలు) 04:51, 8 ఏప్రిల్ 2024 (UTC)
- @Chaduvari అయ్యో. మరైతే ఏం చేద్దాం. ఎలా కనిపెట్టేది ఎన్నేసి పేజీల్లో ఈ తప్పులున్నాయో? పవన్ సంతోష్ (చర్చ) 15:28, 13 ఏప్రిల్ 2024 (UTC)
- వికీడేటాలో క్వెరీ చెయ్యాలి -
- నిర్దేశాంకాలు ఉండి, సైట్ లింకుల్లో తెవికీ ఉన్న అంశాలలో
- ఒకే నిర్దేశాంకాల జంటతో ఒకటి కంటే ఎక్కువ పేజీలు ఉంటే..
- ఆ తెవికీ పేజీల జాబితా తెచ్చుకోవాలి. ఆపై వాటిని సవరించవచ్చు. చెయ్యగలమో లేదో గానీ (నాకు చేతకాదు) .., ఇది ఒక పద్ధతి. ఇంకా వేరే పద్ధతులున్నాయేమో తెలియదండి.__ చదువరి (చర్చ • రచనలు) 16:34, 13 ఏప్రిల్ 2024 (UTC)
- వికీడేటాలో క్వెరీ చెయ్యాలి -
- @Chaduvari అయ్యో. మరైతే ఏం చేద్దాం. ఎలా కనిపెట్టేది ఎన్నేసి పేజీల్లో ఈ తప్పులున్నాయో? పవన్ సంతోష్ (చర్చ) 15:28, 13 ఏప్రిల్ 2024 (UTC)
మోడల్ - మోడల్స్ / మోడళ్ళు
మార్చు"మోడల్" అనే పేరుతో ఉన్న విషయాల పేజీలకు (కళాకారులు కార్లు వగైరాలు) వర్గాలను సృష్టించేందుకు ఏ పేర్లను వాడాలనేది చర్చకు తెస్తున్నాను. మోడల్స్/మోడళ్ళు - వీటిలో ఏది వాడాలనేది చర్చ.
"మోడల్" అనే నామవాచకాన్ని ఇంగ్లీషు నుండి తెచ్చుకున్నాం. మనకు లేని మాటలను ఇతర భాషల నుండి తెచ్చుకోవడం మామూలే. ఏ భాషకైనా అది మామూలే. కానీ బహువచన రూపాన్ని కూడా తెచ్చుకోవాల్క్సిన అవసరం లేదు. పందికొక్కును బండికూట్ అని ఇంగ్లీషు లోకి తీసుకెళ్ళారు. పందికొక్కులు అనేది తీసుకుపోలేదు, బాండికూట్స్ అని వాడుతున్నారు. మనం కూడా బస్, బసెస్ లను బస్సు బస్సులు అని వాడుతున్నాం, కార్ కార్స్ లను కారు కార్లు అని వాడుతున్నాం.
ఇది భాష రూపానికి, నిర్మాణానికీ సంబంధించిన సంగతి, వాడుకలో ఎలా ఉంది అనేది కాదు.
అలాగే, మోడల్ అనే మాటకు మోడళ్ళు అని తెలుక్కు సహజమైన బహువచనాన్ని చేర్చాలి. అంచేత "భారతీయ మోడళ్ళు", "హైదరాబాదు మోడళ్ళు", "20 వ శతాబ్దపు కారు మోడళ్ళు" అనే పేర్లను వర్గాలకు వాడాలి అని నా అభిప్రాయం. మీమీ అభిప్రాయాలు చెప్పగలరు. __ చదువరి (చర్చ • రచనలు) 04:20, 8 ఏప్రిల్ 2024 (UTC)
- భారతీయ మోడలిస్టులు సరియైన పదం అని నాఅభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 04:46, 8 ఏప్రిల్ 2024 (UTC)
- మోడలిస్టు లంటే మోడళ్ళను (కారు వగైరా మోడళ్ళు) తయారుచేసేవారు అని అర్థం. __ చదువరి (చర్చ • రచనలు) 05:25, 8 ఏప్రిల్ 2024 (UTC)
- ఓహో అలానా, మెడలిస్ఠులు అని ఉంది కదా, ఆ భావనలో ఈ పదం సూచించాను.అయితే దీనిలో నిష్ణాతులు ఇంకా ఎవరైనా స్పందించాలి. యర్రా రామారావు (చర్చ) 05:39, 8 ఏప్రిల్ 2024 (UTC)
- ఆధునిక ప్రచారకర్తలు ఇది సరిపోతుందో లేదో యర్రా రామారావు (చర్చ) 05:44, 8 ఏప్రిల్ 2024 (UTC)
- మోడల్ అనే మాటకు మోడళ్ళు అనేది వాడాలన్న చదువరి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:28, 9 ఏప్రిల్ 2024 (UTC)
- @చదువరి, ప్రణయ్ రాజ్ గారల అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:01, 10 ఏప్రిల్ 2024 (UTC)
- మోడల్ అనే మాటకు మోడళ్ళు అనేది వాడాలన్న చదువరి గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:28, 9 ఏప్రిల్ 2024 (UTC)
- ఆధునిక ప్రచారకర్తలు ఇది సరిపోతుందో లేదో యర్రా రామారావు (చర్చ) 05:44, 8 ఏప్రిల్ 2024 (UTC)
- ఓహో అలానా, మెడలిస్ఠులు అని ఉంది కదా, ఆ భావనలో ఈ పదం సూచించాను.అయితే దీనిలో నిష్ణాతులు ఇంకా ఎవరైనా స్పందించాలి. యర్రా రామారావు (చర్చ) 05:39, 8 ఏప్రిల్ 2024 (UTC)
- మోడళ్ళు లేదా మోడళ్లు అనేది సరైనది.--Rajasekhar1961 (చర్చ) 17:47, 10 ఏప్రిల్ 2024 (UTC)
- మోడలిస్టు లంటే మోడళ్ళను (కారు వగైరా మోడళ్ళు) తయారుచేసేవారు అని అర్థం. __ చదువరి (చర్చ • రచనలు) 05:25, 8 ఏప్రిల్ 2024 (UTC)
New Bot Request
మార్చుHi, sorry if it is not appropriate page because the community portal was in Telugu and it was very much difficult to navigate for non-Telugu Speaker like me. I have applied for a new bot here. Please have a look at it. Nokib Sarkar (చర్చ) 20:30, 8 ఏప్రిల్ 2024 (UTC)
- అలాగేనండీ @Nokib Sarkar గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:29, 9 ఏప్రిల్ 2024 (UTC)
A2K Monthly Report for March 2024
మార్చుDear Wikimedians,
A2K is pleased to present its monthly newsletter for March, highlighting the impactful initiatives undertaken by CIS-A2K during the month. This newsletter provides a comprehensive overview of the events and activities conducted, giving you insight into our collaborative efforts and engagements.
- Collaborative Activities and Engagement
- Monthly Recap
- She Leads Program (Support)
- WikiHour: Amplifying Women's Voices (Virtual)
- Wikimedia India Summit 2024
- Department of Language and Culture, Government of Telangana
- From the Team- Editorial
- Comic
You can access the newsletter here.
To subscribe or unsubscribe to this newsletter, click here.
Regards MediaWiki message delivery (చర్చ) 12:17, 11 ఏప్రిల్ 2024 (UTC)
Vote now to select members of the first U4C
మార్చు- You can find this message translated into additional languages on Meta-wiki. Please help translate to your language
Dear all,
I am writing to you to let you know the voting period for the Universal Code of Conduct Coordinating Committee (U4C) is open now through May 9, 2024. Read the information on the voting page on Meta-wiki to learn more about voting and voter eligibility.
The Universal Code of Conduct Coordinating Committee (U4C) is a global group dedicated to providing an equitable and consistent implementation of the UCoC. Community members were invited to submit their applications for the U4C. For more information and the responsibilities of the U4C, please review the U4C Charter.
Please share this message with members of your community so they can participate as well.
On behalf of the UCoC project team,
ఈనాడు పత్రిక వ్యాసానికి అత్యధిక వీక్షణలు
మార్చుఅందరికీ నమస్కారం. ఇటీవలి కాలంలో పత్రికలకు సంబంధించిన వ్యాసాలకు వీక్షణలు పెరిగాయి. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రిక వ్యాసాలకు వీక్షణలు పెరిగాయి. ఈనాడు పత్రికకు అత్యధికంగా నాలుగు లక్షల వీక్షణలు ఉన్నాయి. తెలుగు వికీపీడియాలో నే అత్యధిక వీక్షణలు ఈనాడు పత్రిక వ్యాసానికి ఉన్నాయి. ఏ ఒక్క వ్యాసానికి కూడా ఇన్ని వీక్షణలు లేవు. ప్రజలు ఎక్కువగా ఈనాడు ఆంధ్రజ్యోతి వ్యాసాలను చదవడానికి కారణం ఏంటో తెలియటం లేదు. వీక్షణలు పెరగడం తెలుగు వికీపీడియాకు కలిసి వచ్చే అంశం. దీనిపై సభ్యులు నిర్వాహకులు స్పందించగలరు. ఉదయ్ కిరణ్ (చర్చ) 08:11, 26 ఏప్రిల్ 2024 (UTC)
- @ఉదయ్ కిరణ్ గారూ మంచి విషయాలు గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు.బహుశా ఎన్నికల హడావుడి ఉన్నందున ఆన్లైన్ల్ లో దినపత్రికల కోసం వెదుకుతూ వీటిని గురించి క్లిక్ చేసి వీక్షించుటం అయి ఉండవచ్చు.ఇది వికీపీడియా తరుపున మనమందరం గర్వించతగ్గ విషయం. యర్రా రామారావు (చర్చ) 08:31, 26 ఏప్రిల్ 2024 (UTC)
ధన్యవాదాలు @యర్రా రామారావు గారు ఉదయ్ కిరణ్ (చర్చ) 11:57, 26 ఏప్రిల్ 2024 (UTC)
రోజుకో వ్యాసం.. ఒక యజ్ఞం..!
మార్చుఎందరో వికీపీడియన్లు అందరికి నమస్కారం..! రెండు సంవత్సరాలు - రోజుకో వ్యాసం (2022 ఏప్రిల్ 25 నుంచి 2024 ఏప్రిల్ 24; 731 రోజులు) పూర్తిచేసాను. ధన్యవాదాలు. Muralikrishna m (చర్చ) 02:23, 27 ఏప్రిల్ 2024 (UTC)
- @మురళీకృష్ణ గారూ రోజుకో వ్యాసం, రెండు సంవత్సరాల యజ్ఞం పూర్తిచేసినందుకు శుభాకాంక్షలు.మీ కృషి వికీలో మరువలేనిది.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 04:02, 27 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు..! గురువుగారు. Muralikrishna m (చర్చ) 04:16, 27 ఏప్రిల్ 2024 (UTC)
- రోజుకో వ్యాసం చొప్పున రెండు సంవత్సరాల యజ్ఞం పూర్తిచేసి, స్ఫూర్తిదాయకంగా నిలిచినందుకు ధన్యవాదాలు @Muralikrishna m గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:56, 27 ఏప్రిల్ 2024 (UTC)
- Muralikrishna m గారు అభినందనలు..--B.K.Viswanadh (చర్చ) 05:10, 27 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 02:03, 28 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 02:03, 28 ఏప్రిల్ 2024 (UTC)
- Muralikrishna m గారు అభినందనలు..--B.K.Viswanadh (చర్చ) 05:10, 27 ఏప్రిల్ 2024 (UTC)
- @మురళీకృష్ణ గారూ రోజుకో వ్యాసం, రెండు సంవత్సరాలు పూర్తిచేసినందుకు శుభాకాంక్షలు. V Bhavya (చర్చ) 14:58, 30 ఏప్రిల్ 2024 (UTC)
- ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 15:20, 30 ఏప్రిల్ 2024 (UTC)
- మురళీకృష్ణ గారు అభినందనలు.KINNERA ARAVIND (చర్చ) 01:36, 2 మే 2024 (UTC)
- ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 02:54, 2 మే 2024 (UTC)
Coordinate Me 2024 లో పాల్గొనండి, బహుమతులు గెల్చుకోండి
మార్చుమే నెలలో జరిగే Coordinate Me 2024 లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గ్రామాలకు భౌగోళిక అక్షాంశ రేఖాంశాలు చేర్చే పోటీలో పాల్గొని బహుమతులు గెల్చుకోండి, వికీపీడియా, ఓపెన్ స్ట్రీట్ మేప్ లో భౌగోళిక ప్రదేశాల మెరుగుకు తోడ్పడండి. తొలి ప్రాధాన్యతగా తెలుగు వికీపీడియాలో రెవెన్యూ గ్రామాలకు సంబంధించిన వికీడేటాలో ఇప్పటికీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GIS portal మాత్రమే ఉపయోగించి తెలుసుకొని, వాటిని చేర్చండి. ఇది చాలా సులభం. అవసరమైన గ్రామాలలో (ఉదాహరణ గుంటూరు జిల్లా క్వెరీ ) ఒక్కో గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర GIS portal లో Geocode locator లో గ్రామం పేరు, అవసరమైతే మండల పేరు లేక జిల్లా పేరుతో వెతికి, Measurement menu చేతనం చేసి, మౌజ్ గ్రామం పై నుంచితే వచ్చే అక్షాంశ రేఖాంశాలను, వికీడేటా పేజీలో Coordinates విభాగంలో చేర్చి, మూలంగా stated in కు APSGISP విలువతో చేర్చండి. (ఉదాహరణ చేర్పు , చేర్చేటప్పుడు పోర్టల్ లో గల అక్షాంశ రేఖాంశాలు క్రమం మార్చాలని, వాటి మధ్య కామా చేర్చి, పాఠ్యంలాంటివి తొలగించాలని గమనించండి) గతంలో తెలుగు వికీపీడియాలో గూగుల్ ఇతరత్రా నుండి చేర్చారు, అవి CC-0 లైసెన్స్ కాదుకావున, వాటిని పరికరాల ద్వారా వికీడేటాలో చేర్చకూడదు. దాదాపు ఆంధ్రప్రదేశ్ వరకే లెక్కిస్తే 16000 రెవెన్యూ గ్రామాలకు ప్రస్తుతం 5000 2957 మాత్రమే అక్షాంశ రేఖాంశాలు వికీడేటాలో వున్నాయి, వాటిలో చాలావరకు దోషాలున్నాయి. ఈ కృషి తెలుగు భౌగోళిక పటాలు వినియోగంలోకి తెచ్చుటకు చాలా ఉపయోగం. మరింత సమాచారానికి Improving geodata accuracy on OSM and Wikidata అనే నా OSM డైరీ అంశం చూడండి. పోటీలో పాల్గొనటానికి నమోదు పేజీలో మీ వికీపీడియా వాడుకరిపేరుతో చేయండి. సందేహాలను en:Wikipedia talk:WikiProject Andhra Pradesh/Coordinate Me 2024 లో చర్చించండి.-- అర్జున (చర్చ) 12:15, 28 ఏప్రిల్ 2024 (UTC)
- @Arjunaraoc గారూ, తెలంగాణ రాష్ట్ర గ్రామాల్లో అక్షాంశ రేఖాంశాలు చేర్చడానికి తెలంగాణ జీఐఎస్ పోర్టల్ నుంచి తీసుకోవాలి కదా.. కానీ దాన్ని మూలాల్లో చేర్చుదామంటే వికీడేటాలో లేదు. మీరు APGIS పోర్టల్‌ని చేర్చారు కదా, సరిగ్గా అలాగే ఇప్పుడు నేను తెలంగాణ పోర్టల్‌ని చేర్చాను - https://www.wikidata.org/wiki/Q125918173 . అయితే, దీన్ని మూలంగా చేర్చడానికి పేరుతో వెతికితే డ్రాప్‌డౌన్ లిస్ట్‌లో రావట్లేదు. వికీడేటా ఇటం పేరుతో (Q125918173 అని) వెతికితే వస్తుంది. అలా కాకుండా దాని పేరుతో వెతికినప్పుడే రావాలంటే ఏం చెయ్యాలి? Kimeerat (చర్చ) 18:09, 13 మే 2024 (UTC)
- @Kimeerat, నేను ప్రయత్నించాను కాని సమస్య అర్ధం కాలేదు. వికీడేటా సాంకేతిక సమస్య చర్చలో మీ పేరును పేర్కొంటూ నివేదించాను. ఎవరైనా స్పందిస్తారేమో వేచిచూడండి. అర్జున (చర్చ) 00:24, 14 మే 2024 (UTC)
- @Arjunaraoc గారు, thank you! Kimeerat (చర్చ) 05:09, 14 మే 2024 (UTC)
- @Kimeerat, నేను ప్రయత్నించాను కాని సమస్య అర్ధం కాలేదు. వికీడేటా సాంకేతిక సమస్య చర్చలో మీ పేరును పేర్కొంటూ నివేదించాను. ఎవరైనా స్పందిస్తారేమో వేచిచూడండి. అర్జున (చర్చ) 00:24, 14 మే 2024 (UTC)
వర్గాలపై చర్చ
మార్చువర్గాల విషయమై చర్చలు జరిపేందుకు మనకు వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు అనే పేజీ ఉంది. వర్గాల తొలగింపులు, పేరు మార్పులు వగైరా చర్చలను జరిపే స్థలం ఇది. ఏదైనా వర్గం/వర్గాల గురించి చర్చించేందుకు,
- పై పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ చర్చ జరపాలి - వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/భారతదేశపు వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ ఇలాగ.
- ఆ తరువాత వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో "ప్రస్తుత చర్చలు" అనే విభాగంలో ఈ కొత్త ఉపపేజికి లింకు ఇవ్వాలి.
ప్రస్తుతం చర్చకొరకు ఎదురు చూస్తున్నఅంశాలు
- వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/భారతదేశపు రాష్ట్రాల వర్గాల పేర్ల క్రమబద్ధీకరణ
- వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు/చర్చించాల్సిన వర్గాల జాబితా
అనే రెండు ఉపపేజీలలో కొన్ని వర్గాలు చర్చ కొరకు ఎదురు చూస్తున్నాయి. పరిశీలించి, అభిప్రాయాలు తెలుపవలసినది. __ చదువరి (చర్చ • రచనలు) 03:13, 29 ఏప్రిల్ 2024 (UTC)
- అలాగేనండీ @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:57, 30 ఏప్రిల్ 2024 (UTC)
- సరేనండి @Chaduvari గారు. వి.జె.సుశీల (చర్చ) 10:01, 1 మే 2024 (UTC)
లాప్ టాప్ కొరకు దరఖాస్తు - సభ్యుల సహకారం
మార్చునా లాప్ టాప్ పనిచేయక పోవడంతో, ఎక్కువ టాబ్ లు తెరచి వాడవలసిన పనులలో ఇబ్బంది అవుతుండటం వలన నేను లాప్ టాప్ కొరకు వికీమీడియా వారి Hardware donation program కి దరఖాస్తు చేశాను. ఇక్కడ తెవికీ సభ్యుల మద్దత్తు కూడా అవసరం. కాబట్టి ఈ దరఖాస్తు ఫారంలో తమ మద్దత్తు తెలియచేసి సహకరించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. వి.జె.సుశీల (చర్చ) 11:18, 1 మే 2024 (UTC)
- చేశానండీ @Vjsuseela గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:22, 1 మే 2024 (UTC)
- @ ప్రణయ్‌రాజ్ వంగరి గారు ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 08:51, 2 మే 2024 (UTC)
- నా మద్దతు తెలియచేసాను. --Muralikrishna m (చర్చ) 02:58, 2 మే 2024 (UTC)
- మురళీకృష్ణగారు ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 08:51, 2 మే 2024 (UTC)
- Vjsuseela గారు నా మద్దతు తెలియజేశాను.KINNERA ARAVIND (చర్చ) 03:05, 2 మే 2024 (UTC)
- @ అరవింద్ గారు ధన్యవాదాలు వి.జె.సుశీల (చర్చ) 08:52, 2 మే 2024 (UTC)
స్కాలర్‌షిప్పు - మేధావేతనం
మార్చుపాత రచ్చబండలు చదూతోంటే, ఒకచోట "మేధావేతనాలు" అనే మాట కనబడింది. స్కాలర్‌షిప్పు అనే మాటకు గాను దీన్ని ప్రయోగించారు, అర్జున గారు. ఈ మాట కోసం గూగిలించాను గానీ, ఎక్కడా కనిపించలేదు. వికీపీడియాలో ఈ ఒక్క చోట తప్ప, ఇంకెక్కడా ఈ మాట ఉనికి కనబడలేదు.. ఈ మాట నాకు నచ్చింది. ప్రధానబరిలో వాడను గానీ, ఇతర పేరుబరుల్లో నేను ఈ మాట వాడతాను. "మేధా వేతనం" కాదు, "మేధావేతనం".
"స్కాలర్‌షిప్" అనే మాటను ఇంగ్లీషులో "పాండిత్యం" అనే మాట కోసం కూడా వాడతారు గానీ, ఎక్కువగా వాడే అర్థం "మేధావేతన"మే. __ చదువరి (చర్చ • రచనలు) 03:29, 5 మే 2024 (UTC)
- @Chaduvari బావుందండీ ఈ పదం. పవన్ సంతోష్ (చర్చ) 10:46, 8 మే 2024 (UTC)
అనువాద పరికరం క్లాసు మొదలైంది
మార్చుఅనువాద పరికరం గురించి తెవికీ బడిలో క్లాసు మొదలైంది. వివరాలకు - వికీపీడియా:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/5 __ చదువరి (చర్చ • రచనలు) 08:49, 5 మే 2024 (UTC)
క్వారీలో కొన్ని డేటా క్వెరీలు
మార్చుక్వారీలో రాసిన క్వెరీల ద్వారా తెవికీకి సంబంధించిన్గణాంకాలను చూడవచ్చు. వాటిలో కొన్ని ముఖ్యమైన క్వెరీలు ఇవి. మన ప్రగతి ఎలా ఉంది, మన వ్యాసాల్లో నిర్వహణా పరంగా చెయ్యాల్సిన పనులేమిటి, సృష్టించాలసిన వ్యాసాలేమిటి వగైరా విశేషాలను ్ఇవిచూపిిస్తాయి.:
- 2024 లో రోజువారీగా వచ్చిన కొత్త వ్యాసాల సంఖ్య
- 2024 లో సృష్టించిన వ్యాసాల జాబితా
- వాడుకరులు, వారు సృష్టించిన అనాథ పేజల- జాబితా
- అనువాద పరికరం ద్వారా, నెల వారీగా, ఒక్కో వాడుకరి ప్రచురించిన అనువాద వ్యాసాల సంఖ్య, బైట్ల సంఖ్య
- చర్చ మొదలై, అక్కడే ఆగిపోయి"ల చర:"్చేరుబరి లోని ప పేజీల జాబితా
- ఎర్రలింకుల గణాంకాలు - ఈ పేజీలకు వేరే పేజీల నుండి లింకులున్నాయి గానీ, ఇవి అసలు ఉనికి లోనే లేవు, ఏ వ్యాసం రాయాలి అని తెలుసుకునేందుకు ఈ జాబితాలు ఉపకరిస్తాయి. అయితే ఈ ఎర్రలింకులన్నిటికీ వ్యాసాలు సృష్టించాల్సిన అవసరం ఉండదు. కొన్నిటికి దారిమార్పులు సృష్టిస్తే సరిపోతుంది. కొన్ని లింకులను తప్పుగా ఇచ్చి ఉంటారు - వాటిని సరిచేస్తే సరిపోతుందికొన్ని అసలు అనవసరమైన లింకులు కావచ్చు (అలాంటి లింకులను తీసెయ్యాలి), . మిగిలినవాటికి వ్యాసాలు రాయాల్సి ఉంటుంది(ఇవన్నీ పెద్ద క్వెరీలు - నడవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాయి) . ్
- ఉనికిలో లేని వ్యాసం, వివిధ పేజీల నుండి దానికి ఉన్న ఎర్రలింకుల సంఖ్య (కనీసం 3) - 15,918 వ్యాసాలున్నాయి
- ఉనికిలో లేని వ్యాసం, వివిధ పేజీల నుండి దానికి ఉన్న ఎర్రలింకుల సంఖ్య (మొత్తం అన్నీ) - 1,66,009 వ్యాసాలున్నాయి
- [https://quarry.wmcloud.org/query/81031 ఉనికిలో లేని వ్యాసం, ఏయే పేజీల నుండి దానికి ఎర్రలింకులు ఉన్నాయ
- వ్యాసాలు, వాటిలో ఉన్న ఎర్రలింకుల సంఖ్య
- వాడుకరుల వారీగా తొలగించిన పేజీలు/దిద్దుబాట్ల సంఖ్య
ఈ క్వెరీలను నడిపి తాజా డేటాను చూడాలనుకుంటే వీటిని ఫోర్కు చేసి (ఆ పేజీలో పైన ఉన్న Fork అనే లింకును నొక్కాలి) నడుపుకోవచ్చు. వివరాలకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో "వికీ డేటాబేసు నుండి ముడి డేటాను తెచ్చుకోవడం" అనే విభాగం చూడండి. __ చదువరి (చర్చ • రచనలు) 12:21, 6 మే 2024 (UTC)
- చాలా మంచి సమాచారం అందించారు, ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 13:32, 7 మే 2024 (UTC)
- మంచి సూచన అండి. ధన్యవాదాలు ''వి.జె.సుశీల'' (చర్చ) 12:28, 8 మే 2024 (UTC)
Finalists announced for Wiki Loves Vizag 2024
మార్చుఅందరికీ నమస్కారం, ఫిబ్రవరీ నెలలో జరిగిన Wiki Loves Vizag మొదటి విడత విజేతలను ప్రకటించాం. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన చిత్రాల నుంచి ఇప్పటివరకు 10కి పైగా (0.7%) Quality Images and Valued Images వచ్చాయి, ఇంకా చాలా చిత్రాలు సమీక్షలో ఉన్నాయి. ఇది Wikimedia Commons సగటు నిష్పత్తి 0.33% కి రెండింతలు ఉంది. రెండవ విడత విజేతలను (మూడు చిత్రాలను) ఇంకో వారంలోగా ప్రకటించవచ్చు.
Nature
మార్చుHistorical and Cultural buildings
మార్చుBuilt forms (Post Independence)
మార్చుTransportation
మార్చుMiscellaneous
మార్చు-- IM3847 (చర్చ) 13:38, 6 మే 2024 (UTC)
- @IM3847 గారూ, తెవికీ పండుగ సందర్భంగా మనం విశాఖకు ఇద్దామనుకున్న బహుమతిని మీరిచ్చేశారు. చాలా అద్భుతమైన ఫోటోలు వచ్చాయి. మంచి ఫోటోగ్రాఫర్లు కూడా కామన్సుకు దొరికినట్టున్నారు. కార్యక్రమం ద్వారా వచ్చిన ఫోటోల్లో మిగిలినవాటిని కూడా ప్రతిపాదిస్తే ఇంకా చాలా క్వాలిటీ ఇమేజెస్, వాల్యూడ్ ఇమేజెస్ బయటపడవచ్చు. శుభాకాంక్షలు మీకు. పవన్ సంతోష్ (చర్చ) 10:45, 8 మే 2024 (UTC)
- @IM3847 గారూ, ఈ పోటిని విజయవంతంగా నిర్వహించినందుకు, మీకు ధన్యవాదాలు. __ చదువరి (చర్చ • రచనలు) 03:35, 9 మే 2024 (UTC)
- అభినందనలు @IM3847 గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:19, 13 మే 2024 (UTC)