వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 47

పాత చర్చ 46 | పాత చర్చ 47 | పాత చర్చ 48

alt text=2016 ఫిబ్రవరి 27 - 2016 మార్చి 31 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 ఫిబ్రవరి 27 - 2016 మార్చి 31

"వికీపీడియా-కాపీహక్కులు" అంశంపై సెషన్ మార్చు

"వికీపీడియా-కాపీహక్కులు" అంశంపై తెలుగు వికీపీడియన్లకు సెషన్ నిర్వహించనున్నాము. వికీపీడియా రచ్చబండ(కాపీహక్కుల గురించి చేపుస్తకం, వర్క్ షాప్ అన్న శీర్షికతో)లో జరిగిన చర్చను, పలుమార్లు వికీపీడియన్ల ఈ అంశంపై ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ సెషన్ నిర్వహించనున్నాము. ఈ సెషన్లో రీసోర్సు పర్సన్ గా సీఐఎస్ కు చెందిన అనుభా సిన్హా వ్యవహరిస్తారు. ఆమె డా.ఆర్ఎంఎల్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో లాయర్ గా శిక్షణ పొందిన వ్యక్తి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ చట్టం మరియు ఓపెన్ నెస్ అంశాలలో కృషిచేస్తున్నారు. ఈ సెషన్ హైదరాబాద్ లోని అబిడ్స్ కు చెందిన గోల్డెన్ థ్రెషోల్డ్ లో మార్చి 6, 2016న జరుగనుంది. కార్యక్రమ నిర్వహణకు సంబంధించి, ఈ కార్యక్రమం నుంచి ఆశిస్తున్న అంశాలకు సంబంధించి ఇప్పటికే వికీపీడియన్లతో కొంతవరకూ హైదరాబాద్ నెలవారీ సమావేశంలో చర్చించాము. దీనిపై మరింత విపులమైన చర్చను జరిపి వికీపీడియన్లు ప్రత్యేకించి ఈ కాపీహక్కుల సెషన్ లో ఏం నేర్చుకోవాలనుకుంటున్నారన్న అంశాన్ని ప్రస్తావిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:40, 27 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కార్యక్రమానికి హైదరాబాద్ నగరం నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి హాజరవదలుచుకున్న వికీపీడియన్లు దయచేసి ఇక్కడ తమ వివరాలను, ఎక్కడ నుంచి హాజరుకాదలిచారన్న అంశాన్ని సమావేశం పేజీలో తెలియజేయగలరు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:08, 28 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వేరే పేజీలో వివరాలు ఇవ్వమని పెట్టవలసింది. ఎలాగూ సెషన్ పేజీ ఉండాలిగా ..--Viswanadh (చర్చ) 13:27, 28 ఫిబ్రవరి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండీ. సమావేశం పేజీ లింక్ ఇచ్చాను చూడండి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:31, 28 ఫిబ్రవరి 2016 (UTC)`[ప్రత్యుత్తరం]
మంచి కార్యక్రమం. పక్కాగా ప్రణాలిక తయారుచేయండి. తెవికీ మనకున్న సమస్యలు ఏమిటి అని గుర్తించాలి. నాకు తెలిసిన వరకు డిజిటల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాల మరియు పత్రికల కాపీహక్కుల గురించి చర్చించాలి. ఇవి కాకుండా చాలా కాలంగా సినిమా సాహిత్యం (పాటలు మరియు బొమ్మలు) గురించి స్పష్టంగా చర్చించాలి. జీవించియున్న వ్యక్తులు కాపీహక్కులు వికీపీడియాకి ఇవ్వాలన్నప్పుడు తదనంతరం సమస్యలు రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఏమైనా సమస్యలను సభ్యులు ఇక్కడ తెలియజేయవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 07:03, 1 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 మార్చు

అందరికి నమస్కారం. వికీకాన్ఫరెన్స్ ఇండియా 2016 గురించి మీకు అందరికి తెలిసే ఉంటుంది. 2011 తరువాత మళ్ళీ ఇంత పెద్ద వికీపీడియన్ల సమావేశం మన దేశం లో నిర్వహించడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడానీకి మీ అందరి సహకారం ఎంతో అవసరం. Team Roles (జట్టులు) నమోదు కార్యక్రమం ప్రారంభమయ్యింది. మీకు నచ్చిన జట్టులో పేరు నమోదు చేసుకోగలరు అని నా మనవి. ఇక్కడ నమోదు చేస్కోండి. ధన్యవాదాలు, శ్రీకర్ కాశ్యప్ (వికీమీడియా ఇండియా) 16:40, 2 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కె. వెంకటరమణ మార్చు

నాకు అవసరం వచ్చినప్పుడల్లా సహాయం అందించిన శ్రీ కె. వెంకటరమణ గారి పేరు చూసి నెల దాటుతోంది. ఆయన క్షేమసమాచారాలు తెలియజెయ్యండి. Vemurione (చర్చ) 22:34, 4 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రమణగారు ఆరోగ్యంగా ఉన్నారు. వికీలో చురుకుగా పాల్గొంటున్న అతి ముఖ్యమైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. --Rajasekhar1961 (చర్చ) 03:11, 5 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మిత్రులు Vemurione గారికి, నేను క్షేమంగా ఉన్నాను. సమయం దొరకనందున ఎక్కువ సమయం వికీలో పనిచేయలేకపోతున్నాను. కానీ నా పని కొనసాగిస్తున్నాను. వాడుకరులకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 16:36, 5 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం వ్యాసం మార్చు

మిత్రులారా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సునీతా కృష్ణన్ వ్యాసాన్ని ఈ వారం వ్యాసంగా ఉంచితే బాగుంటుందని నా ప్రతిపాదన. సభ్యులు తమ అభిప్రాయాలు తెలుపగలరు.--రవిచంద్ర (చర్చ) 11:44, 6 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రవిచంద్ర గారూ మీరన్నట్లు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ వారంలో సునీతా కృష్ణన్ వ్యాసాన్ని మొదటిపేజీలో ఉంచాలన్న ప్రతిపాదన బాగుంది. దానిని మొదటి పేజీలో 10వ వారంలో చేర్చాను. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణచర్చ 12:21, 6 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Completion suggestor మార్చు

- User:CKoerner (WMF) (talk) 22:09, 7 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రోగ్రాం అసోసియేట్ ఉద్యోగం గురించి మార్చు

ప్రోగ్రాం అసోసియేట్ గా నేను పని ప్రారంభించి ఫిబ్రవరి నాటికి మూడు నెలల కాలం ముగిసింది. గత మూడు నెలలో నేను చేసిన పనికి సంబంధించిన వివరాలు ఈ లంకెలో పొందుపరిచాను. ఈ పనిలో కొనసాగించి మరిన్ని కార్యకలాపాలు చేపట్టేందుకు చాలా ఆసక్తితో ఉన్నాను. సముదాయం నేను ఈ పనిలో కొనసాగేందుకు, ఆదరించి ప్రోత్సహిస్తుందని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:57, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అనుకూలం మార్చు

  1.   ' : పవన్ సంతోష్ గారు ! ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను. --టి. సుజాత (చర్చ) 15:20, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2.   ' : ప్రోగ్రాం అసోసియేట్‌గా అతి కొద్ది కాలంలోనే పలు అభివృద్ది కార్యక్రమాలను రూపొందించి తెవికీ అభివృద్దికి విశేష కృషి చేస్తున్న పవన్ సంతోష్ గారు ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగాలని, వారికి నా మద్దతు తెలియజేసుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:50, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3.   ' :ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను. ' కె.వెంకటరమణచర్చ 17:41, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4.   ' :ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను. గోకుల్ ఎల్లంకి (చర్చ) 02:22, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5.   ' :ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను. భాస్కరనాయుడు (చర్చ) 02:24, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6.   ' :ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను.--రాజశేఖర్1961 (చర్చ) 03:30, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7.   ' : మద్దతు --బ్రహ్మరాక్షసుడు (చర్చ) 04:38, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  8.   ' :ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను.--గుళ్ళపల్లి నాగేశ్వరరావు (చర్చ) 12:16, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  9.   ' : మద్దతు ఇస్తున్నాను.--నాయుడుగారి జయన్న (చర్చ) 14:07, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  10.   ' : నా మద్దతు..--విశ్వనాధ్.బి.కె. (చర్చ) 15:11, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  11.   ' : పవన్ సంతోష్ గారు ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడానికి నేను మద్దతు ఇస్తున్నాను... --పణయ్ రాజ్ వంగరి (చర్చ) 04:31, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  12.   ' : నా మద్దతు ----శ్రీరామమూర్తి (చర్చ) 07:17, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  13.   ' : వై.వి.ఎస్. రెడ్డి (చర్చ) 15:27, 11 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకం మార్చు

తటస్థం మార్చు


కశ్యప్ (చర్చ) 11:55, 24 మార్చి 2016 (UTC) తన పేరుకు తగ్గట్టు తన బలం ఏమిటో తనకు తెల్వదు, చేయ్యాలసినది చాలా వున్నది[ప్రత్యుత్తరం]

అభిప్రాయాలు మార్చు

  • పవన్ సంతోష్ గారు ! మూడు మాసాలు చురుకుగా పనిచేసారు. అందరినీ కలుపుకుంటూ అందరితో అవగాహన పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. సామాజిక మాధ్యమాలలో మరియు వార్తా మాధ్యమాలలో తెవికీకి తగిన గుర్తింపు రావడానికి కృషిచేసారు. సముదాయేతర సంస్థలతో విజయవంతంగా సంప్రదింపులు జరిపారు. సభ్యులను ఉత్సాహవంతం చేస్తూ తగినన్ని కార్యక్రమాలకు నాయకత్వం వహించారు. కనుక వీరు ప్రోగ్రాం అసోసియేట్‌గా కొనసాగడం తేవికి అభివృద్ధికి సహకరిస్తుందని నా అభిప్రాయం.--t.sujatha (చర్చ) 15:29, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • పవన్ చాలా బాగా తెవికీ అభివృద్ధికి కృషిచేస్తున్నారు. చురుకైన వాడుకరులు వారి ప్రతిపాదనలను ముందుకు తీసుకొని వెళ్లమని కోరుతున్నాను. వీరు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాల్ని రూపొందించి, తెవికీని అభివృద్ధిపథంలో నాణ్యమైన వ్యాసాలను అభివృద్ధి చేసి తెలుగుభాషకు సేవ చేస్తారని భావిస్తున్నాను. వారికి నా సహాయసహకారాలను ఎల్లప్పుడు అందిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 03:42, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • పవన్ చాలా మంచివారు. విసుగు చెందకుండా కొత్తవాడుకరుల యక్ష ప్రశ్నలకు ఓపికగా జవాబు ఇస్తారు. తనలోని ఈ సహన గుణమే తన విజయానికి మూల స్తంభం. కొత్త పాత్రలో మెరుగ్గా రాణిస్తారని కోరుచున్నాను.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 14:41, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • నేర్చుకోవాలనే తపన ఎవరినీ నొప్పించకుండా పని చేసుకుపోయే తత్వం కల పవన్ ఈ ఉద్యోగానికి న్యాయం చేయగలరు..--Viswanadh (చర్చ) 15:13, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చర్చ మార్చు

ప్రపంచ మహిళా మాసం సందర్భంగా ఎడిట్-అ-థాన్ మార్చు

మార్చి 8 తేదీ నుంచి ఏప్రిల్ 7 వరకూ ప్రపంచ మహిళల మాసంగా జరుపుకుంటూ మహిళల గురించి తెవికీలో సమాచారం అభివృద్ధి చేసేందుకు, తెవికీలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు కృషిచేయడం అన్న సత్ సంప్రదాయం గురించి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కూడా మహిళల మాసం జరుపుకునేందుకు గాను ఎడిట్-అ-థాన్ నిర్వహించుకోవాలని, మార్చి 4వ ఆదివారం మహిళలను వికీపీడియన్లుగా చేసేందుకు ఓ చక్కని అవుట్-రీచ్ కార్యక్రమం చేసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను. ఎడిట్-అ-థాన్ థీమ్ గా ప్రపంచ శాంతి, వైద్యం, భౌతికశాస్త్రం, సాహిత్యం, ఆర్థిక రంగాల్లో కృషిచేసి నోబెల్ బహుమతి పొందిన మహిళల గురించిన వ్యాసాలు సృష్టించడం, ఇప్పటికే ఉన్నవాటిని అభివృద్ధి చేయడం చేయాలని ప్రతిపాదిస్తున్నాను. ఇప్పటికే తెలుగులో సాహిత్య రచనలు, వ్యాసరచనలు చేసే కొందరు మహిళలను సంప్రదించాను. వారు కూడా మనతో కలసి ఈ వ్యాసాలపై కృషిచేస్తారని భావిస్తున్నాను. దీనికి సభ్యులు వీలైనంత త్వరగా ఆమోదం తెలిపితే ముందుకువెళ్ళవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:38, 8 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

  1.   ' ఆమోదం తెలుపుతున్నాను.--Nrgullapalli (చర్చ) 12:18, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2.   ' : ఆమోదం తెలుపుతున్నాను.--బ్రహ్మరాక్షసుడు (చర్చ) 14:39, 9 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3.   ' ఆమోదం తెలుపుతున్నాను.--Pranayraj1985 (చర్చ) 04:32, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4.   ' ఆమోదం తెలుపుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 07:15, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5.   ' ఆమోదం తెలుపుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 05:52, 12 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు పేజీ తయారీ మార్చు

స్పందించిన వాడుకరులకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ నేపథ్యంలో ఎడిటథాన్ థీమ్ ను అనుసరించి ప్రాజెక్టు పేజీని సృష్టించాను. దయచేసి ఈ ప్రాజెక్టు పేజీ సందర్శించి సభ్యులు, ఈ అంశంపై కృషిచేస్తారని భావిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:23, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె తెలుగు కార్య ప్రణాళిక 2016-17 రూపకల్పన విషయంలో సంప్రదింపులకై ఐఆర్సీ మార్చు

అందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె 2016-17 తెలుగు కార్యప్రణాళిక రూపకల్పనలో తెవికీమీడియన్ల సూచనలు, సలహాలు, అవసరాలు వంటివి పరిగణనలోకి తీసుకునేందుకు ప్రస్తుతం సముదాయంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ నేపథ్యంలో కొందరు వికీపీడియన్లను టెలిఫోన్ ద్వారా, మరికొందరిని మెయిల్ ద్వారా, కొందరిని గూగుల్ హ్యాంగవుట్స్ ద్వారా విడివిడిగా మాట్లాడి వారి స్పందన ఆన్-వికీ నమోదుచేస్తున్నాం. మెయిల్ ద్వారా సూచనలు, సలహాలు, అవసరాలు వంటివి చెబుదాం అని భావించేవారు నా మెయిల్ ఐడీకి రాయగలరు. టెలిఫోన్ ద్వారా తెలపదలుచుకుంటే వికీపీడియా మెయిల్ సౌకర్యం వినియోగించుకుని తమ ఫోన్ నెంబరు నాకు పంపగలరు. ఆన్ వికీ స్పందన తెలియజేద్దామని భావించేట్టయితే ఇక్కడ కొత్త విభాగం ప్రారంభించి రాసి సంతకం చేయగలరు. ఐతే ఈ మాధ్యమాల్లోకి వచ్చేందుకు ఆసక్తి లేనివారికి, పలువురితో కలసి చర్చిస్తూ స్పందన తెలియజేద్దాం అని భావించేవారికి ఐఆర్సీ కానీ, గూగుల్ హ్యాంగవుట్స్ కానీ చేద్దామని భావిస్తున్నాం. ఇందుకు మార్చి 11 తేదీ ఉదయం 10 గంటల నుంచి గంటపాటుగా చేసేందుకు సూచిస్తున్నాను. వేగవంతంగా ఏ మాధ్యమంలో చేద్దామో సూచించి, ఇక్కడ నమోదుచేసుకుంటారని ఆశిస్తున్నాను.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:17, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పైన ప్రస్తావించిన ఐఆర్సీకి కార్యక్రమ పేజీ ఇక్కడ ఉంది, పైన ప్రస్తావించిన విధంగానే 11 మార్చి 2016 ఉదయం 10 నుంచి 11 వరకూ జరుగుతుంది, పాల్గొనదలిచినవారు దయచేసి నమోదుచేసుకోగలరు.--పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:52, 10 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఎన్టీఆర్ ట్రస్ట్ తో భాగస్వామ్యానికి ప్రతిపాదనలు మార్చు

అందరికీ నమస్కారం,
ఇటీవల ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ గారితో సీఐఎస్-ఎ2కె జరిపిన చర్చల్లో భాగంగా ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం, తెవికీకి ఉపకరించే కొన్ని ప్రతిపాదనలు చర్చించాము. ఆయా ప్రతిపాదనలను ఇక్కడ సముదాయ సభ్యుల పరిశీలనార్థం ఉంచి వాటిపై ఏకాభిప్రాయం కుదిరితే ముందుకువెళ్లేందుకు నిశ్చయించుకున్నాం. దయచేసి సముదాయ సభ్యులు ఈ అంశాలను పరిశీలించి స్పందించాలని కోరుతున్నాం:

  1. ఎన్టీఆర్ ట్రస్టు వారు నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలెప్మెంట్ చేసి ఉద్యోగాల కల్పనకు కృషిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రతినెలా ఒక్కో బ్యాచ్ చొప్పున నిరుద్యోగ యువతకు అనేకాంశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు వికీపీడియా, స్వేచ్ఛా విజ్ఞానం, యూనీకోడ్, పాఠ్యీకరణ ప్రయత్నాలు మొదలైన అంశాలతో చిన్న మాడ్యూల్ తయారు చేసి, కోర్సులో భాగంగా వారిని తెవికీని పరిచయం చేసి, తెవికీపీడియన్లుగా మలచడం. (ఇది కోర్సులో చిన్న భాగంగా ఉంటుంది)
  2. హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతంలో కనీసం 30-40మంది కంప్యూటర్లపై అంతర్జాలంలో పనిచేయగల సౌకర్యం కలిగిన ఎన్టీఆర్ ట్రస్టు వారి స్పేస్ ను తెలుగు వికీపీడియన్ల అవసరాలకు ఆదివారాల్లో వాడుకునేందుకు ఇవ్వడం. దీనిని వినియోగించుకుని సంస్థాగతమైన కంప్యూటర్ ల్యాబులు లేని (విద్యాసంస్థలకు మాత్రమే సాధారణంగా అలాంటి వసతి ఉంటుంది) సాంస్కృతిక సమూహాలకు కార్యశాలలు ఏర్పాటుచేసుకోవచ్చు.
  3. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే మహిళా కళాశాలలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (జూన్, జూలై నెలల్లో ప్రారంభమవుతుంది) వికీపీడియా విద్యా కార్యక్రమం (WEP-Wikipedia Education Programme) చేపట్టడం.

ఈ అంశాలపై వికీపీడియన్లు సూచనలు, సందేహాలు, ఆమోదం వంటివి తెలుపుతారని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:14, 11 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి కార్యక్రమం. విష్ణుగారికి తెవికీ గురించి మంచి అవగాహన ఉన్నది కనుక ఏవే మాడ్యుల్స్ వారికి అందించాలో ప్రణాలిక సిద్ధం చేసుకొని ముందుకు వెళ్ళండి. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 11:05, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గోల్డెన్ థ్రెషోల్డ్ వేదికగా కార్యక్రమాలకు ఇబ్బంది మార్చు

హైదరాబాద్ వికీపీడియన్లు నెలవారీ సమావేశాలే కాక పలు కార్యశాలలు, అవగాహన సదస్సులు గత కొన్ని సంవత్సరాలుగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్, గోల్డెన్ థ్రెషోల్డ్ లో కార్యక్రమాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఐతే HCUలో సంస్థాగతమైన వ్యవహారాల కారణంగా గోల్డెన్ థ్రెషోల్డ్ వేదికగా తెవికీ కార్యక్రమాలు చేసుకునేందుకు తాత్కాలికంగా కొన్ని నెలల పాటు అవకాశం లేకపోవచ్చు. ముందస్తుగా ఈ సమస్యను ఊహించి, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం చాలా మంచి విషయం. ఈ భాగస్వామ్యం ఇకముందు తెవికీకి చాలా పనికివస్తుంది. కాబట్టి దీన్ని సమర్థిస్తున్నాను. --Pranayraj1985 (చర్చ) 09:20, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పటికే నెలవారీ సమావేశాలు, కార్యశాలలు ఎన్టీఆర్ ట్రస్టు రీసోర్సు సెంటర్లో నిర్వహించుకుందుకు అవకాశం దొరికింది. కనుక 20న జరగబోయే కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్టు సెంటర్లో చేయవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:25, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఎన్టీఆర్ ట్రస్టు చాలాదూరం అందరికీ అందుబాటులో లేదు గనుక అందరూ రాగలిగిన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే ప్రత్నము చేయవలనదిగా ప్రతిపాదించడమైనది. సుదూరప్రాంతమేకాకుండా మూడు గంటల కార్యక్రమమైనా రోజంతా వృధాచేయవలసి వస్తుంది. తగినంతమంది వికీపీడియన్లు రాలేరు. నేను యీరొజు ఇద్దరు తెలుగు రచయితలను కలుసుకోవడం జరిగింది. వారు శ్రీమతి షహనజ్ బీగం షైక్ మరియు వారి బర్త వీరువురు తెలుగుబాషాబివృద్దికి చాలా కృషిచేస్తున్నారు. వికీపీడియాగురించి తెలుసుకొని చాలా ఆనందించారు. నెలవారీ సమావేశాలకు హాజరుకావాలని బలమైన కోర్కె వుంది. సమావేశం జరిగే ప్రాంతం పేరువిని కొంత నిరుత్సాహపడ్డారు. వీరి నివాసం ఎల్ బి నగర్ వద్ద, మంసూరాబాద్. అందరికీ అందుబాటులోవుండే ప్రదేశాన్ని ఎంపికచేసుకున్నట్లయితే తెలుగుబాష పట్ల మమకారం వున్న చాలా మంది పాల్గొనే అవకాశం వుంది. ----Nrgullapalli (చర్చ) 12:18, 21 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక వ్యాస పేజీల సృష్టిని అరికట్టేందుకు నిరోధం మార్చు

ఒక వారం రోజుల పాటు మొలక పేజీలు సృష్టించడాన్ని అరికట్టే ప్రతిబంధాన్ని సృష్టిస్తున్నాను. ఇది సముదాయ ఆమోదంతో మరిన్ని రోజులు పొడిగించవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 19:40, 12 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అభ్యంతరాలు తెలపండి.
  1. ఇది దారిమార్పు పేజీల సృషిని నిరోధిస్తుంది. అయినా ఇది ప్రజాస్వామికమైన పద్ధతి కాదు. ఈ ప్రతిబంధాన్ని వెంటనే తొలగించాలి.--Rajasekhar1961 (చర్చ) 05:21, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. ఈ ప్రతిబంధకాన్ని తొలగించ మనవి. కొత్త సభ్యుల కృషిని ఇది అడ్డుకొంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:51, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3. మహిళామాసం సందర్భంగా " నోబెల్ బహుమతి అందుకున్న మహిళలు " ప్రాజెక్టు వంటి ఎడిట్ థాన్‌లలో కొత్త వ్యాసాలు సృష్టించడానికి ఇది ఆటంకం ఔతుంది. ప్రతి వ్యాసం ఆరంభించేసమయంలో మొలక వ్యాసమే కదా! ఎడిట్‌థాన్ ప్రకటించడం మొలకల నిరోధం పరస్పర విరుద్ధమైనవని గమనించగలరు. అంతేకాక ఇది ప్రజాస్వామ్య విరుద్ధం. దీనికి బదులుగా అప్పుడప్పుడూ మొలకవ్యాసాల అభివృద్ధి వంటి ఎడిట్‌థాన్ నిర్వహించవచ్చు. --t.sujatha (చర్చ) 14:24, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ ప్రతిబంధం ఉండగా 22 సార్లు వివిధ వ్యక్తులకు ఈ ప్రతిబంధం ఎదురయింది. మొదటి రెండు ఈ నిబంధనను పరీక్షించడానికి చేసినవి. ఆపైన ఈ పేజీలో ఉన్న ప్రకారం పాలగిరి గారు రెండు సార్లు వ్యాసరచనను చేయబోయి నిడివి సరిపోక, మళ్ళీ సరైన నిడివితో సృష్టించగలిగారు. ఆపైన పృథ్వీరాజ్ ప్రయత్నించి విరమించుకున్నారు. ఆపైన పవన్ సంతోష్ త్రిభువన్ దాస్ పటేల్ వ్యాసాన్ని మూడు సార్లు ప్రయత్నించి నాలుగవ సారి భద్రపరచగలిగారు. రాజశేఖర్ గారు నాలుగు సార్లు ప్రయత్నించి కూడా వ్యాస నిడివి పెంచలేకపోయారు, విరమించుకున్నారు. స్వరలాసిక మురళి గారి ఐదవ ప్రయత్నంలో వ్యాసాన్ని సృష్టించగలిగారు. వైవీఎస్ రెడ్డి గారు మూడో ప్రయత్నంలో కంప్యూటర్ కేస్ వ్యాసం సృష్టించారు. మరలా రాజశేఖర్ ఇంకో రెండు వ్యాసాలు సృష్టించబోయి వెనుదిరిగారు. సుల్తాన్ ఖాదర్ కూడా ఒక సారి ప్రయత్నించి విరమించుకున్నారు. వెంకటరమణ గారు రెండవ సారికే వ్యాసాన్ని మొలక స్థాయి దాటించగలిగారు. సుజాత గారు ప్రయత్నించలేదు.
ఇక ఈ ప్రతిబంధం ఒక టూల్ ను పరీక్షించడానికి చేసిన ప్రయత్నం. ఇది ఆంగ్ల వికీలో స్పీడీ డిలీషన్ కు జరుగుతున్న వెతుకులాటకి సహాయపడుతుంది. కన్నడ వికీపీడియాను శుద్ధి చేయటంలో అక్కడ నిర్వాహకులకు చాలా బాగా పని చేస్తున్నది. కొత్త వాడుకరులు వ్యాసాలు వారి ప్రయోగశాలలో చేసేలా చూస్తున్నది. తెవికీలో రెండు నాణ్యతలేని వ్యాసాల సృష్టిని నిరోధించడానికి మాత్రమే ఇది. తొలగిస్తున్నాను. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:55, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, మీరు ఇక్కడ చేసే కొత్త ప్రయోగాలు అంతగా ఫలితాన్ని ఇవ్వవు. ఇక్కడ వ్యాసాలు వ్రాసేవారే బహుకొద్దిమంది. ఈ మధ్యన మీరు మొలకలు అని చాలా వ్యాసాలు తొలగించారు. వాటిలో ప్రాజెక్టుగా చేపట్టినవి కూడా ఉన్నాయి. ప్రాజెక్టులుగా చేపట్టిన వాటిలో సహజంగానే చాలా వ్యాసాలు మొలకలుగానే ఉంటాయి. మరి మీరు గ్రామవ్యాసాలు జోలికి ఎందుకు వెళ్లలేదో అర్థం కాలేదు. అవి కూడా తొలగిస్తారని అనుకున్నాను, కానీ ఆ పని కూడా చేసే ఉద్దేశ్యము ఏమైనా ఉందా ? ప్రస్తుతము అసలు మీరు ఈ వికీపీడియాకు ఒక బంధువు లాంటి వారు, స్వతంత్రించి సంప్రదించకుండా ఇప్పుడు మీకుగా మీరు తొలగించే నిర్ణయాలు చేయవచ్చునా ? మీరు తొలగించాలనుకుంటే తెవికీ వారితో సంప్రదించాలి లేదా తొలగింపు మూస పెట్టాలి. మీరు స్వేచ్చా ఉచిత సేవ చేసే వికీపీడియను కాదు కదా ! విష్ణుగారు సిఐఎస్ వదలిన తదుపరి ఆ సంస్థ దూకుడు వికీపీడియనుల మీద ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇదివరకు ఇంతలా సిఐఎస్ యొక్క ప్రభావం వికీపీడియా స్వంతంత్రత మీద పెద్దగా ఉండేది కాదు. అన్ని వికీపీడియనులే చర్చించుకునే వారు. ఒక విధంగా ఈ సిఐఎస్ దూకుడు వల్ల వికీపీడియనుల మధ్య స్నేహ సంబంధాలు చాలా బాగా దెబ్బతిన్నాయేమోనని అనిపిస్తున్నది. ప్రతి వికీపీడియనుతో సిఐఎస్ వారే చర్చిస్తున్నారు. ఇది వికీకి ఆరోగ్యకర పరిణామం మాత్రం కాదు. పెద్ద నిర్ణయాలు చేసేముందు ఆలోచించి సంప్రదించి ఏ పని అయినా ముందు ముందు చేస్తారని ఆశిస్తాను. JVRKPRASAD (చర్చ) 15:41, 14 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, ఇతరులకి, పవన్ సంతోష్ సీఐఎస్ లో చేరిన మరుక్షణం నుండే నా పనితనం మామూలు ఐపోయింది. నేను సీఐఎస్ ఉద్యోగిగా ఏ పనీ చేపట్టడంలేదు. ఇక మీరు చెప్పినట్టు గ్రామ వ్యాసాలు నేను తొలగించలేదన్న అంశంలో నిజం లేదు. దాదాపు పది దాకా గ్రామ వ్యాసాలూ తొలగించబడ్డాయి, గమనించగలరు. నేను తెవికీలో సభ్యుణ్ణి, మీరనుకుంటున్నట్టు బంధువును కాదు. ఈ అపార్ధం ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో తెలపగలరు. --రహ్మానుద్దీన్ (చర్చ) 11:16, 15 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, మీరు ఇంతకీ ఏ సంస్థ ఉద్యోగి ? ప్రాజెక్టులలోని వ్యాసాలను కూడా మొలకలు అని తొలగించ వచ్చునా ? కొలమానం ఏమిటీ ? మీరు సిఐఎస్‌లో ఉంటే బంధువు కాక మరేమవుతారు ? నేనే అంటున్నాను. మీరు సిఐఎస్ లాంటి వాటి సంస్థలలో ఉద్యోగం చేయడము లేదని మాకు తెలియదు. JVRKPRASAD (చర్చ) 11:57, 15 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, సీఐఎస్ లో నా ప్రస్తుత ఉద్యోగం తెలుగు వికీకి నేరుగా సంబంధం లేనిది. డిసెంబర్ వరకు తెలుగు ఆంకర్ గా పని చేసాను. ఆపైన ఆ బాధ్యతలు పవన్ సంతోష్ తీసుకున్న వెంటనే నేను అందరిలా ఇక్కడ మామూలు వికీపీడియన్నే! అంటే పని సమయాల్లో తెవికీలో వ్యాస పేరుబరిలో పని చేయరాదు అన్న నిబంధన పవన్ సంతోష్ కి వర్తిస్తుందేమో కానీ, నాకు కాదని నాకు తెలుసు. ఇక మొలకలు ఏదైనా ప్రాజెక్టులో భాగమైనా, ప్రాజెక్టు కాలవ్యవధి పూర్తయ్యాక కూడా అవి మొలకలుగా ఉండిపోయాయంటే అవి అయితే ఉన్న వ్యాసాలలో విభాగాలుగా చేర్చాలి లేదా తొలగించాలి - అలాంటి పాలిసీ తెవికీలో ఇప్పటికే లేకపోతే ఆ పాలిసీ చర్చ చేయవచ్చు. ప్రాజెక్టు సమయం మించిపోయాక ప్రాజెక్టులో భాగమైన వ్యాసాలన్నీ తెవికీలో భాగమే కదా. ఐనా మొలక వ్యాసాల పాలిసీ గురించి మీకు తెలిసే ఉంటుంది - ఎలాంటి మొలక వ్యాసాలైనా (నిడివి రెండువేల బైట్లకన్నా తక్కువ ఉంటే) వారం-నెల వ్యవధితో వ్యాస విస్తరణకు సందేశం చేర్చి తొలగించాలి. ఇప్పుడు నేను చేస్తున్నది అదే. ముందుగా సూచన చేర్చుతున్నాను,ఆపై వారం-నెల తరువాత తొలగిస్తున్నాను. నేను తొలగించిన వ్యాసాల నిడివి ౪౦౦ బైట్లకన్నా తక్కువ అనగా ఒక్క లైను కూడా పూర్తిగా లేని వ్యాసాలు. ఇవి తెవికీలో ఉండి తెవికీ నాణ్యతకు దోహదపడతాయా? లేక తొలగించాలా? కొలమానం ఇక్కడ ఉంది, దాన్ని మరింత అభివృద్ధి పరచవచ్చు. --రహ్మానుద్దీన్ (చర్చ) 14:12, 15 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, మీరు సిఐఎస్ నందు ఉద్యోగ విధికి మరో మెట్టుకు వెళ్ళారు. ఏదైనా మీరు సిఐఎస్ ఉద్యోగి. మీకు జీతం ఎవరిస్తున్నారు ? మీరు మామూలు వికీపీడియను అనుకుంటే సరిపోతుందని వికీపీడియనులు కూడా అనుకున్నారా ? ప్రాజెక్టులలోని మొలక వ్యాసాలను తొలగించాలనే నిబంధన ఏదైనా ఎక్కడయినా ఉందా ? ప్రాజెక్టు పూర్తి అయినా కాకపోయినా వాటిలోని వ్యాసాలు మొలకలుగానే ఎంతోకాలంగా ఉంచుతున్నారు. మీరు ఇప్పుడు కొత్త నిబంధనతో మామూలు వ్యాసాలతో పోల్చుతున్నారు. మరి ప్రాజెక్టులకు మరియు మామూలు వ్యాసాలకు ఇంక ప్రత్యేకత ఏముంది ? చర్చ చేయాలి అని మీరే అంటూ ఎకాఎకీగా మీరే తొలగిస్తున్నారు. ఏమైనా అర్థం ఉందంటారా ? అసలు పని చేసే వాళ్ళు ఇక్కడ ఎంత మంది ఉన్నారు. మీరైనా అంత గొప్పగా ఇప్పుడు పని చేయడము లేదు కదా ! ఉన్నవాటిని కూడా అలా ఎప్పుడో జన్మకో శివరాత్రి అన్నట్లు వచ్చేవారు మీలాగనే తొలగిస్తే ఇంక ఇక్కడ వ్యాసాలనేవి ఏమీ మిగలవు పెద్దగా అని మీకు తెలియదా ? కొంతమంది తొలగింపుల కొరకు మాత్రమే హాజరుకు వస్తున్నట్లుగా ఉంటుంది. ఎంతో అభివృద్ధి జరగాల్సి ఉంది. మీలాంటి వాళ్ళు తొలగింపులు ప్రక్రియలు ఆపేసి, వ్యాసాలు వ్రాస్తే లేదా మొలకలు విస్తరిస్తే వికీ మరికొంత బాగు పడుతుంది అని ఆలోచన బావుండదంటారా ? తెవికీ నాణ్యత గురించి మాట్లడే ప్రతివారు వాళ్ళు ఏం అభివృద్ధి పనులు చేస్తున్నారు ? మీలా ఉన్నవి తొలగించటమా ? అలా చేస్తే వెంటనే నాణ్యత పెరిగి పోతుందా ? ఎవరి బుర్రకు తోచిన పనికి ఎదుటివారు భజన చేయాలనే ధోరణి కూడా బాగా ఎక్కువయి పోయింది. కొలమానాలు గురించి ప్రస్తావన అనవసరం. మీరు మొలకలు అభివృద్ధికి ఏం చేయాలి అని ఆలోచనతో ఉంటే బావుంటుందేమో ? అంతేకాని, ఉన్నవి కూల్చడం పెద్ద అభివృద్ధి ప్రక్రియ కాదుగా. --JVRKPRASAD (చర్చ) 22:51, 15 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారూ, సీఐఎస్ కు తెవికీలో వ్యాసాలు వ్రాయమని కాదు కదా ఫండింగ్ ఇచ్చేది. ఐనా సరే ఇక్కడి బుధజనులు నా ఉద్యోగానికి తెవికీలో వ్రాసే వ్యాసాలకి లంకె కట్టి నన్ను వ్యాసాలు వ్రాయకూడదు అన్నారు. డిసెంబర్ తో ఆ పని పవన్ సంతోష్ కి మారటంతో నేను తిరిగి నా పని చేసుకుంటున్నాను. వ్యాసం పూర్తి చేసే అవకాశమున్న చోట సరి చేస్తున్నాను. అవకాశం లేని చోట కొన్ని వ్యాసాలలో వారం రోజులు, కొన్ని వ్యాసాలలో నెల రోజులు సూచన చేర్చి, ఆ తరువాతే తొలగిస్తున్నాను. అభివృద్ధి చేయదగిన వాటికి వికీకరణ, విస్తరణ మూసలు చేర్చుతున్నాను. అవి సరి చేసి మొలక స్థాయి దాటిస్తున్నాను కూడా. ముందు నేను గ్రామ వ్యాసాలు తొలగించలేదన్నారు, ఇప్పుడు ప్రాజెక్టులోవి తొలగిస్తున్నాను అంటున్నారు. సూచన తీసివేసి అభివృద్ధి పరిచే బాధ్యత అందరిదీ అని మరిచిపోవద్దు. నెల రోజుల తరువాత కూడా సూచన ను పట్టించుకోకపోవటం అంటే అర్ధం ఏమిటి? నాణ్యత పెరగటానికి కావాల్సింది కొలమానల నిర్ధారణ, అది లేనిదే ఎలా మొలకలను అభివృద్ధి చేయాలో కాస్త చెప్పండి. కొలమానాలు నిర్ధారణ అయి, ఆపైన ఆయా కొలమానాలు చేర్చీ మొలకలను అభివృద్ధి పరచాలి, కాదంటారా? ఉన్నవి కూల్చడం లేదు. ఒక వెయ్యి వ్యాసాల దాకా విస్తరణ సూచన చేర్చాను. అవన్నీ ఎవరూ చేయకపోతే విస్తరణ చేయాలనుకున్నదీ నేనే. తొలగించిన వ్యాసాలలో హెచ్చుభాగం అర్ధం లేని వ్యాసాలే, ఇక్కడ తొలగించిన వ్యాసాల చిట్టా ఉంది, అక్కడ ఏవేవి నేను తొలగించినవి సబబు కాదనుకున్నారో, అవి పునఃస్థాపించవచ్చు. ఇంతకు ముందు పొరపాటులో ఒకటి రెండు వ్యాసాలు తొలగించినవి నేను పునఃస్థాపించాను, మీరు కూడా తిరిగి ఆ వ్యాసాలని చేర్చవచ్చు. మనకు స్థూలంగా కనిపించే అరవైఐదువేల పైచిలుకు వ్యాసాలలో ఎన్నిటికి బొమ్మలు కావాలి? ఎన్ని వ్యాసాలలో మూలాలు చేర్చాలి? ఎన్ని వ్యాసాలలో అసలు వికీలింకులు లేవు(అలాంటి పరిస్థితిలో అవి వ్యాసాల కింద పరిగణన లోకి రావు)? ఇవన్నీ గమనిస్తూ సరి చేస్తున్నాను. డెడ్ఎండ్ పేజీలు అసలు వ్యాసాల లెక్క లోకి రావట్లేదని గుర్తించి వాటిలో వికీలింకులు చేర్చుతున్నది నేను కాదా? తెవికీ లో వ్యాసాలు చేర్చే ముందు అవి విశ్వసనీయమైనవా? తెవికీకి ఉపయోగపడేవా అన్న బేరీజు వేసుకోవాలి కదా? నోటెబిలిటీకి గౌరవం ఇవ్వాలి కదా! --రహ్మానుద్దీన్ (చర్చ) 04:08, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రహ్మానుద్దీన్ గారు, సీఐఎస్ వాళ్ళు మిమ్మల్ని వ్యాసాలు తొలగించమని ఫండింగ్ ఇస్తున్నారా ? మీ సిఐఎస్ వాళ్ళు క్యాంప్లు పెట్టి ఎన్నో మొలకలు సృష్టించారు. మరి అవి మీ దృష్టికి రాలేదా ? మీరు తొలగింపులకు కోసమే ఇక్కడికి వస్తున్నారా ? చాలా సార్లు చూసాను కేవలం మీరు తొలగింపులు మాత్రమే చేస్తున్నారు. మీరు సూచన పెట్టి ఎవరూ స్పందించకపోతే తొలగించెస్తారన్న మాట. నేను మొలకలు గురించి ఒకడికి చెప్పేదేమిటి ? నేను అడిగిన దానికి సమాదానం కోరతాను. ఒకడికి పని ఎలా చేయాలో చెప్పాల్సినది అనవసర విషయం. ఎవడు ఎలా పని చేస్తే నాకెందుకు ? సూచనలు, మూసలు, పెట్టిన, ఇతరమైన వాటికి ఎవడు వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు, మీకు అర్థం లేనివి అయితే మరొకరికి అర్థం ఉండవచ్చును. తొలగించడము ఎందుకు ? తిరిగి వ్రాయడము ఎందుకు ? వ్యాసాలు క్రింద పరిగణనలోకి రాకపోతే వచ్చే నష్టం ఏమిటి ? ప్రతి వాళ్ళు ఎదో ఘనకార్యం చేస్తున్నాము అని ఎంతో భ్రమ పడుతున్నారు. నాకు ఏదో వ్రాసి, నాకు నేర్పవలసిన పని లేదు. మరో విషయం, సిఐఎస్ వాళ్ళు అంటే మాకు బంధువులు లాంటి వాళ్ళు మాత్రమే. వాళ్ళు సిఐఎస్ జీతాలు తీసుకుంటున్నారు. మీకు జీతం ఇచ్చేది సిఐఎస్ వాళ్ళు. . మీ సిఐఎస్ కోరికలు, కావల్సిన పద్దతులు ఇక్కడ రుద్దకండి. ఇది వికీపీడియా అని గుర్తుంచుకోండి. ఇక్కడ ఎవడి కోసం ఎవరూ పని చేయరు. చేసిన పనికి ఎవరూ సర్టిఫికేట్స్ ఇవ్వరు. అందుకు ఇష్టమైన వారు చేస్తారు. ఏదో చేస్తున్నాము ఇక్కడ సేవలు అని మన ఇష్టం వచ్చినట్లు వికీకి సొంత నియమాలు రుద్దకూడదు. అనవసర చర్చలు చేయవద్దు. ఇలా చెత్త రాతలు వ్రాస్తే మర్యాద పోగొట్టుకోవద్దు. ఇది సలహా, సూచన. మూర్ఖపు చర్చలు చేయవద్దు అని నా మనవి.--JVRKPRASAD (చర్చ) 06:06, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నట్టుగా తొలగించదం సముచితమే అయినా మొలకవ్యాసం రాసిన వాడుకరి కొంతకాల్ం తెవికీకి దూరంగా ఉండి తరువాత తన వ్యాసం మెరుగుపరచాలనుకొంటే అప్పటికే అది తొలగించబడి ఉంటుంది - మీరు అంటించిన తొలగింపు నోటీసు చూడకపోవచ్చు. ప్రస్తుతం సభ్యులు కొన్ని ప్రాజెక్టుపనుల్లో ఉన్నారు కనుక వాటి పని పూర్తి అయ్యాక వీటిపై చర్చించి సభ్యులు వీటిని విస్తరించే ప్రణాళీకలు ఏవైనా తయారు చేసుకోవచ్చు. అందరు సభ్యులు ఏక కాలంలో వీటిపై కృషి చేస్తే సగం మొలకలు తొలగించవచ్చు. ఆ పై సి.ఐ.ఎస్ ద్వారా 2016 కు ఇచ్చిన ప్రణళికలో గ్రామ వ్యాసాల అభివృద్ది గురించి బొమ్మల గురించి పవన్ సంతోష్‌కు తెలియచేసాను. వాటి విస్తరణకు ప్రణాళికలో కొన్ని కార్యక్రమాలు రాసాడు, అవి పూర్తి అయితే చాలా వ్యాసాలు మొలకల స్థాయి దాటుతాయి. కనుక దయచేసి మీ ప్రయత్నం కొంతకాలం వాయిదా వేయకోరుతున్నాను.--Viswanadh (చర్చ) 06:09, 16 మార్చి 2016 (UTC).[ప్రత్యుత్తరం]
మొలకలను తొలగించడానికి నేను వ్యతిరేకం కాదు. ఎడిథాన్ మరియు ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న సమయంలో సభ్యులకు ఇబ్బంది కలుగుతుందన్నది మాత్రమే నా అభిప్రాయం. వ్యాసం సృష్టించి దానిని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండీ పనిజరగని వ్యాసాలను తొలగించవచ్చు. అందుకు మెజారిటీ సభ్యుల అభిప్రాయం అనుసరించి వ్యాసం ప్రారంభించిన తరువాత 1,2,3 మాసాల గడువును నిర్ణయించి తరువాత తొలగించవచ్చు. వాస్తవానికి మొలకల నిరోధం కారణంగా నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. రహమానుద్దీన్ గారి దిద్దుబాట్లకు నేను వ్యతిరేకం కాదు. వికీపీడియన్‌గా అందరిలా ఆయన దిద్దుబాట్లు చేయడానికి అభ్యతరం ఏముంటుంది. వ్యక్తిగతమైన విమర్శలు సంస్థాగతమైన విమర్శలు వికీస్పూర్తిని దెబ్బతీస్తాయి. వీకీపీడియన్లు ఐకమత్యంతో పనిచేయడానికి ఇది ఆటకం ఔతుంది. వివాదాలకు స్వస్తిచెప్పి ఎప్పటిలా పని కొనసాగిస్తాం. t.sujatha (చర్చ) 17:56, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
t.sujatha గారు, నమస్కారము. మీరు చెప్పినవి పాలసీ విషయాలు, అన్నీ పాతకాలం మామూలు మనుషులు, వినేవారికి చెప్పవచ్చండి. మీరు చెప్పినవి నిజమే. ఈ నాటి గొడ్డుకు చంకలో బిడ్డలా చూసుకొని చెప్పాలి అని అంటే మాత్రం సమంజసం కాదు. (నేను వాడినది సామెత మాత్రమే.....అది కూడా నా సొంత సామెత మాత్రమే, గూగుల్ నందు వెతికితే దొరకదు) మొలకలు తొలగించటానికి రోజూ వచ్చేవారికి బాగా తెలుసును. నేను చెపుతున్నది ఏదైనా వాటిలో సమాచారం జోడించండి అని మాత్రమే. ఆ రకంగా అయినా వాళ్ళకు ఉచిత సేవ చేయాలనే సంకల్పం వస్తుంది. పని చేయటము లేదండి, చాలామంది ఎదుటి వారి మీద పెత్తనాలు చేస్తున్నారు. ఈ విషయములోనూ అంతేనండి. దాని వల్ల ఎన్నో ఇబ్బందులు చాలామంది పడుతున్నారు. సిఐఎస్ వాళ్ళ వలన వికీపీడియనుల మధ్య స్నేహ సామరస్య వాతావరణం చాలా బాగా దెబ్బతింది. అసలు వికీపీడియనులకు ఒక ప్రణాళిక అంటూ, చర్చ అనేది ఏవీ లేకుండా, వీళ్ళే అన్నీ అన్నట్లు .................కేవలం వికీ అంటేనే సిఐఎస్ అనే ధోరణి కొత్త వారికి మనసులలో నాటుకు పోతోంది. అంతా నాశనం అయిపోయాక, అప్పుడు దిద్దుబాటు చర్యలను చేపట్టడం అంత ఫలితాన్ని ఇవ్వవు. ఆ సంస్థ తప్పు కాదు అందులోని వారి పని చర్యల వలన మాత్రమే. వారి యొక్క లోపలి ఎజెండా వేరుగా ఉంటుంది. వికీ ఇల్లుని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలో వికీపీడియను చర్చ చేసుకుంటారు, నిర్ణయించు కుంటారు. ఒక వ్యక్తి ఏదైనా పని చేయవద్దు, దాని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అని చెబితే, మూర్ఖత్వంతోటి ఎంతైనా వాదిస్తారు. దాని వలన అందరికీ సమయము వృథా, మనస్పర్థలు. మామూలు చెబితే విననప్పుడు, కఠినంగానే చెప్పాలి. రహమానుద్దీన్ పైన వ్రాశినవి బాగా లోతుగా మరోసారి చదివి మీరు ఆలోచించండి. మరికొంత అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థ గురించి క్రమశిక్షణలోని భాగమే వ్యక్తిగత విమర్శలు వస్తూ ఉంటాయి. విమర్శలు వలన వికీస్పూర్తి దెబ్బతింటుందని భావిస్తే అసలు వ్యవస్థే కుప్పకూలి పోతుందండి. వ్యక్తి కంటే వ్యవస్థను కాపాడుకోవాలి. JVRKPRASAD (చర్చ) 22:51, 16 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]
JVRKPRASAD గారు చెప్పిన వాటిలో ఒకటి సత్యం. అది మొలకలు తొలగించేపని చేసే సమయం వాట్ని విస్తరించడానికి ఉపయోగిస్తే కొంత మేలు జరుగుతుంది. తరువాత కొరుకుడు పడని లేదా ఇక సమాచారం విస్తరించలేని మొలకలను ఎలాగూ తొలగించవచ్చు, కాబట్టి వీలూన్న వాడూకరులు దయచేసి మొలకలు విస్తరణ కొరకు ప్రయత్నించమని ప్రార్ధన.--Viswanadh (చర్చ) 06:34, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె తెలుగు కార్య ప్రణాళిక (2016-17) ముసాయిదాపై చర్చ మార్చు

అందరికీ నమస్తే,
సీఐఎస్-ఎ2కె జూలై 2016- జూన్ 2017 తెలుగు కార్యప్రణాళిక చిత్తుప్రతి (ముసాయిదా) వికీపీడియా సముదాయ సభ్యులతో సంప్రదింపులు మరియు ఇతర అంశాల ఆధారంగా రూపొందించాము. ప్రస్తుతం దీనిని తెవికీపీడియన్లు పరిశీలించి, పేజీ యొక్క చర్చపేజీలో చర్చించవలసిందిగా కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:50, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం మార్చు

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం… మార్చి 20, 2016 (మూడవ ఆదివారం) నాడు బంజారాహిల్స్ రోడ్ నెం. 2 లో ఉన్న ఎన్టీయార్ ట్రస్ట్ లో జరుపబడుతుంది. HCUలో సంస్థాగతమైన వ్యవహారాల కారణంగా గోల్డెన్ థ్రెషోల్డ్ వేదికగా తెవికీ కార్యక్రమాలు చేసుకునేందుకు తాత్కాలికంగా కొన్ని నెలల పాటు అవకాశం లేకపోవడంచే, ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సభ్యులు గమనించగలరు.

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • తెలుగు వికీపీడియన్ల అవసరాలపై చర్చ, తెవికీ అభివృద్ధికి సూచనలు
  • ప్రస్తుతం జరుగుతున్న వికీ ప్రాజెక్ట్ పై సమీక్ష
  • వికీ శిక్షణా శిబిరాల నిర్వాహణ పై చర్చ
  • భవిష్యత్ ప్రణాళిక

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మార్చి 20, 2016 సమావేశం లో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 08:17, 17 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Accounts Available Now (March 2016) మార్చు

Apologies for writing in English. Please help translate to your language

Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for access to research materials from:

  • Cambridge University Press - a major publisher of academic journals and e-books in a variety of subject areas. Access includes both Cambridge Journals Online and Cambridge Books. 25 accounts.
  • Alexander Street Academic Video Online - a large academic video collection good for a wide range of subjects, including news programs (such as PBS and BBC), music and theatre, lectures and demonstrations, and documentaries. 25 accounts.
  • Baylor University Press - a publisher of academic e-books primarily in religious studies and the humanities. 50 accounts.
  • Future Science Group - a publisher of medical, biotechnological and scientific research. 30 accounts.
  • Annual Reviews - a publisher of review articles in the biomedical sciences. 100 accounts.
  • Miramar Ship Index - an index to ships and their histories since the early 19th century. 30 accounts.

Non-English

  • Noormags - Farsi-language aggregator of academic and professional journals and magazines. 30 accounts.
  • Kotobna - Arabic-language ebook publishing platform. 20 accounts.

Expansions

  • Gale - aggregator of newspapers, magazines and journals. 50 accounts.
  • Elsevier ScienceDirect - an academic publishing company that publishes medical and scientific literature. 100 accounts.

Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, De Gruyter, EBSCO, Newspapers.com and British Newspaper Archive. Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 20:30, 17 మార్చి 2016 (UTC)


You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

20న కవిసంగమం కవులతో తెవికీ కార్యశాల మార్చు

అందరికీ నమస్కారం,
మార్చి 20, 2016న కవుల దినోత్సవం సందర్భంగా కవిసంగమం సంస్థకు సంబంధించిన కవులతో కార్యశాల జరగనుంది. కార్యక్రమాన్ని స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ లో జరుగుతుంది. అదేరోజు జరిగే తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంతో కార్యక్రమంలో భాగం పంచుకుంటుంది. ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందే జరిగిన చర్చల ఫలితంగా, గత ప్రణాళికల ఫలితంగా ఏర్పాటుచేశాం. ఆసక్తికలిగిన వికీపీడియన్లు పాలుపంచుకుని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:42, 18 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 2016 లో వికీపీడియా:సమావేశం ఎప్పుడు? ఎక్కడ? --Nrgullapalli (చర్చ) 02:26, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గుళ్ళపల్లి గారూ వికీపీడియన్ల సౌకర్యార్థం తిరిగి థియేటర్ అవుట్ రీచ్ యూనిట్, గోల్డెన్ థ్రెషోల్డ్, అబిడ్స్ లోనే నెలవారీ సమావేశాలు నిర్వహించుకునేందుకు ప్రతిపాదనలు, ప్రయత్నాలు సాగించాము. ప్రధానంగా ప్రణయ్ రాజ్ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి గతంలోని భాగస్వామ్యం ఆధారంగానే నెలవారీ సముదాయ సమావేశాలకు మాత్రం అభ్యంతరం లేదన్న స్పష్టత తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో మళ్ళీ గోల్డెన్ థ్రెషోల్డ్ లోనే జరుపుకోవచ్చు. ఐతే ఈసారి ఆఖరి ఆదివారం నిర్వహించడం వీలుపడుతుందని ప్రణయ్ తెలిపారు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:24, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా సంతోషకరమైన వార్త. --Nrgullapalli (చర్చ) 10:34, 15 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సీఐఎస్-ఎ2కె జూలై 2016 - జూన్ 2017 తెలుగు కార్యప్రణాళిక మార్చు

సీఐఎస్-ఎ2కె జూలై 2016- జూన్ 2017 తెలుగు కార్యప్రణాళిక చిత్తుప్రతి (ముసాయిదా)ను సముదాయ సభ్యులతో సంప్రదింపుల ద్వారా రూపొందించాము. దీని ఆంగ్ల ప్రతి ఇక్కడ ఉంది. దయచేసి దీనిపై చర్చించి సముదాయ సభ్యులు తమ సూచనలు తెలియజేయ కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:18, 20 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Policy discussions మార్చు

 
Click to read/download the book

A couple of months ago CIS-A2K published an Indic Wikipedia policies and guidelines handbook in order to support Indic Wikipedians to improve their policy portals. Before and after the publication of the handbook we talked to Indic Wikipedians and asked how should we go ahead with this works and these are the suggestions we have received so far:

  1. Core content and other important policy pages should be created;
  2. Regular policy discussions should take place which will help to collaborate understand a community's needs.

If you have any suggestion or idea, or if you want to prioritize any particular policy, please let us know. Thanks for your support. --Titodutta (చర్చ) 10:21, 24 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Open Call for Individual Engagement Grants మార్చు

 

Please help translate to your language:

Greetings! The Individual Engagement Grants (IEG) program is accepting proposals until April 12th to fund new tools, research, outreach efforts, and other experiments that enhance the work of Wikimedia volunteers. Whether you need a small or large amount of funds (up to $30,000 USD), IEGs can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.

With thanks, I JethroBT (WMF) 15:47, 31 మార్చి 2016 (UTC)[ప్రత్యుత్తరం]