వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 76
← పాత చర్చ 75 | పాత చర్చ 76 | పాత చర్చ 77 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2020 సెప్టెంబరు 1 - 2020 సెప్టెంబరు 30
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
మొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు ముగిసింది
మార్చుమొలకల విస్తరణ ఋతువు ప్రాజెక్టు ఆగస్టు 31 తో ముగిసింది. 2020 జూన్ 1 న మొదలై మూణ్ణెల్ల పాటు ఈ ప్రాజెక్టు సాగింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ప్రాజెక్టు తుది నివేదికను వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020/ప్రాజెక్టు తుది నివేదిక పేజీలో ఉంచాను. పరిశీలించి తమ అభిప్రాయాలు తెలుపవలసినదిగా సముదాయానికి వినతి. __చదువరి (చర్చ • రచనలు) 08:08, 1 సెప్టెంబరు 2020 (UTC)
- అలాగేనండి చదువరి గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (చర్చ • రచనలు) 08:34, 1 సెప్టెంబరు 2020 (UTC)
- 2000 పైగా మొలకలను విస్తరించిన కార్యక్రమంలో పాల్గొన్న వాడుకరులందరికీ ధన్యవాదాలు. ఇలాంటి చర్యలు మన ఐకమత్యతకు, నాణ్యతకు మనం ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. మరిన్ని ఇలాంటి కార్యక్రమాలను నడిపించడం భాషాభివృద్ధిలో భాగంగా తెలుగువారందరికీ ఎంతైనా ఉపయోగం.--Rajasekhar1961 (చర్చ) 07:06, 5 సెప్టెంబరు 2020 (UTC)
నిరోధ నిర్ణయాల సమీక్షా విధానంపై నిర్ణయం
మార్చుతెవికీలో నిర్వాహకులు చేసే నిరోధ నిర్ణయాలపై ఒక సమీక్షా సంఘం ఉండాలని ప్రతిపాదించగా 9-1 మెజారిటీతో (ఇద్దరు తటస్థులు) సముదాయం ఆమోదించింది. ఆ చర్చను ఇక్కడ చూడవచ్చు. సమీక్షా సంఘం ఉండాలి అనేది నిశ్చయమైపోయింది కాబట్టి ఇక విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంది. అందుకోసం విధి విధానాలతో ఒక ప్రతిపాదన మూణ్ణెల్ల క్రితం సముదాయం ముందుకు వచ్చింది. దానిపై కొందరు స్పందించారు. అక్కడ వచ్చిన సూచనలకు అనుగుణంగా గడువులో మార్పులు చేసాను. నిర్వాహకులెవరైనా దాన్ని పరిశీలించి విధానానికి తుది రూపం ఇచ్చేలా ఒక నిర్ణయం తిసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. __చదువరి (చర్చ • రచనలు) 04:11, 2 సెప్టెంబరు 2020 (UTC)
వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి లో ఒకటికంటే ఎక్కువ ప్రతిపాదనలకు ఫలితం నిర్ణయం
మార్చువికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి లో స్పష్టత అవసరమైంది. సంబంధిత చర్చ లో స్పందించండి.--అర్జున (చర్చ) 23:45, 2 సెప్టెంబరు 2020 (UTC)
New Wikipedia Library Collections Now Available (September 2020)
మార్చుHello Wikimedians!
The Wikipedia Library is announcing new free, full-access, accounts to reliable sources as part of our research access program. You can sign up for new accounts and research materials on the Library Card platform:
- Al Manhal – Arabic journals and ebooks
- Ancestry.com – Genealogical and historical records
- RILM – Music encyclopedias
Many other partnerships are listed on our partners page, including Adam Matthew, EBSCO, Gale and JSTOR.
A significant portion of our collection now no longer requires individual applications to access! Read more in our recent blog post.
Do better research and help expand the use of high quality references across Wikipedia projects!
--The Wikipedia Library Team 09:49, 3 సెప్టెంబరు 2020 (UTC)
- This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.
సంప్రదింపు పేజీ లింకు తొలగింపు పేజీకి
మార్చుసంప్రదింపు పేజీ లింకు తొలగించిన పేజీకి వెలుతుంది.అర్జునరావు గారూ మీరు ఈ పేజీని 2020.07.19 న తొలగించినట్లుగా తెలుస్తుంది.సవరించగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:00, 5 సెప్టెంబరు 2020 (UTC)
- యర్రా రామారావు గారు, మీ గమనింపుకి ధన్యవాదాలు. ప్రధానంగా ఆంగ్ల శీర్షిక కావున తొలగించి సవరణలు చేశాను. మరిన్ని వివరాలు చర్చలో తెలిపాను. వికీపీడియా:2012 లక్ష్యాలు లో ఇప్పుడు సవరించాను. దానికి లింకున్న మిగతావి వీక్షణ గణాంకాల జాబితాలు కావున వాటిని సవరించనవసరంలేదు. --అర్జున (చర్చ) 01:43, 6 సెప్టెంబరు 2020 (UTC)
- పేజీ ఎడమపట్టీలోగల 'సంప్రదింపు పేజీ'కి కూడా లింకు తాజాపరిచాను.--అర్జున (చర్చ) 22:51, 6 సెప్టెంబరు 2020 (UTC)
కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ
మార్చుచర్చల ఫలితంగా కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. 2020-06-30 నాటికి తెవికీలో ఏవైనా 100 మార్పులు చేసినవారు ఓటు చేయటానికి అర్హులు. మరిన్ని వివరాలకు వికీపీడియా:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2 చూసి మీ ఓటు 2020-09-21 05:29 (IST) లోగా వేయండి. ఎక్కువ మంది పాల్గొనటానికి ఈ పద్ధతి వాడబడుతున్నది కావున అర్హులైన అందరూ పాల్గొనాలని కోరుతున్నాను. ఏవైనా సందేహాలుంటే తెలపండి. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:29, 6 సెప్టెంబరు 2020 (UTC)
ఈ వోటు ప్రక్రియ పద్ధతిగా లేదు
మార్చు- చర్చలో ప్రతిపాదన చేసినదేంటి? "ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి." అని. అక్కడ దాన్ని మాత్రమే చర్చకు పెట్టారు.
- వోటింగుకు పెట్టిందేంటి? పై అంశంతో పాటు, "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని కూడా చేర్చారు. ఈ అంశాన్ని చర్చకు పెట్టలేదు. జరుగుతున్న చర్చలో మధ్యలో ఎక్కడో ఇరికించారంతే.
ఇదేం పద్ధతి అసలు? రెండు వేరువేరు అంశాలను వోటింగుకు పెట్టి ఒకే వోటు ఎలా వేస్తారు? చర్చలో దేన్ని ప్రతిపాదించారో దాన్ని మాత్రమే వోటింగుకు పెట్టాలి. చర్చ జరుగుతూండగా మధ్యలో అంశాన్ని చేరిస్తే లేదా మారిస్తే దానిపై మళ్ళీ చర్చకు పెట్టాలి కదా. చర్చ పేజీలో ఎప్పటికప్పుడు మార్పు చేర్పులు చేసేస్తూ ఏమీ అర్థం కాకుండా గందరగోళం చేసెయ్యడం, వోటింగులో కొత్త అంశాలను కలిపేసి అసలు ప్రతిపాదనను పలచన చెయ్యడం అంతా ఏదో గందరగోళంగా ఉంది. ఏమాత్రం పారదర్శకంగా లేదు. ఈ వోటింగు వ్యవహారాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. వోటింగుకు పెట్టిన రెండు అంశాల్లో మొదటిదాన్ని మాత్రమే ఉంచాలి. రెండోదాన్ని వోటింగు లోంచి తీసెయ్యాలి. రెండో దాన్ని కూడా వోటింగుకు తోసుకోవాలంటే, దానిపై చర్చ జరగాలి. __చదువరి (చర్చ • రచనలు) 02:01, 6 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. విధానపేజీలో చేర్చిన పై వ్యాఖ్యను పోలిన వ్యాఖ్యను దాని చర్చాపేజీలోకి మార్చాను గమనించండి. చర్చను దయచేసి అక్కడే కొనసాగనివ్వండి.--అర్జున (చర్చ) 02:34, 6 సెప్టెంబరు 2020 (UTC)
ఈ ఓటింగ్ ప్రక్రియను నిలుపుదల చేసి, ఏకాభిప్రాయాన్ని నిర్ణయంగా వెలువరించాలి
మార్చుఅర్జున రావు గారు ప్రారంభించిన ఓటింగ్ ప్రక్రియ చాలా స్థాయిల్లో తప్పు:
- చర్చ ఏకాభిప్రాయానికి వచ్చింది: చర్చలో భాగంగా మొత్తంగా పదిమంది సభ్యుల వరకూ తమ తమ అభిప్రాయాలను, అనుభవాలను సవివరంగా వెల్లడించారు. మొక్కుబడిగా జరిగిన చర్చ కాదిది. అంత లోతుగా విశ్లేషించి చేసిన చర్చ ఏకాభిప్రాయానికి కూడా వచ్చింది. పాల్గొన్నవారిలో అత్యధికులు ప్రతిపాదనను తిరస్కరించారు. 70% యాంత్రిక అనువాద విధాన సమీక్షలో సభ్యులు, కొత్త సభ్యుల యాంత్రిక అనువాదాలపై నియంత్రణ వుండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు అని అర్జున రావు గారే అంగీకరించాల్సి వచ్చింది.
- వికీపీడియాలో ఓటింగ్ చిట్టచివరి ఆప్షన్ మాత్రమే: తెలుగు వికీపీడియాలో విధానాలు మార్గదర్శకాలను నిర్ణయించడానికి ఏకాభిప్రాయం ప్రాతిపదిక ముఖ్యమైనది. ఏకాభిప్రాయం అంటే పూర్తి సమ్మతి కాదు. - ఈ ముక్క నా పైత్యం కాదు. స్వయానా అర్జున రావుగారే 2013, 14 ప్రాంతాల్లో రూపొందించిన వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ఇదే చెప్తోంది. ఏకాభిప్రాయం వచ్చిన చర్చను తీసుకుపోయి ఓటింగ్‌కు పెట్టడం బేసబబు
- ప్రాతిపదిక లేని ప్రతిపాదనలు: ఈ ప్రతిపాదనకు మొదట అర్జున రావు గారు చెప్పిన ప్రాతిపదికల్లో ముఖ్యమైనవి ఆయన మాటల్లోనే చెప్పాలంటే "తెవికీ ఏర్పడ్డ ప్రధాన నియమం , ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని గౌరవించడం జరుగుతుంది.", "అనువాద వ్యాసాలు సృష్టించే సభ్యులపై ప్రస్తుతం వున్న వివక్ష పోతుంది" - ఎవరైనా పాల్గొనగలిగే వీలున్న నియమాన్ని గౌరవించడం అన్నది ఆయన నొక్కి వక్కాణించారు బోల్డ్ చేసి మరీ. అటువంటిది - ఆయన ప్రస్తుతం అనువాద ఉపకరణంలో ఉన్న నియంత్రణలు తొలగించనక్కరలేదని సభ్యులు అనుభవాలు, అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పగానే ఆగస్టు 30న "కొత్త సభ్యులు నమోదై నెల రోజులు గడిచేవరకు మరియు 500 మార్పులు చేసేవరకు ప్రధానపేరుబరిలో ఉపకరణ అనువాద వ్యాసాలు ముద్రించకుండా దుశ్చర్యల వడపోత అమలు." అని ఓ కొత్త సవరణ తెచ్చిపెట్టారు. ఓటింగులో ఇది కూడా పెట్టేశారు. ఈ కొత్త సవరణ వల్ల కొత్త సభ్యుల మీద "వివక్ష", "ఎవరైనా పాల్గొనగలిగే వీలును తిరస్కరించడమూ" నిజంగానే జరుగుతాయి. ఈ యాంత్రికానువాదం సరిగా ఉండదు. నువ్వు కనీసం 70 శాతం మార్చితే తప్ప ప్రచురించనివ్వం అన్నది అందరి మీద సమానంగా వర్తించే నిబంధన. 500 మార్పులు చేయని కొత్త సభ్యుల మీదకి తెచ్చిపెట్టబోయిన ఈ నిబంధనే అసలు, అకారణమైన వివక్ష. ఇది కాక అర్జున గారి వ్యాసాలపై నేను చేసిన పరిశీలనలో అంత అనుభవం ఉన్నవారు కూడా నియంత్రణ లేనప్పుడు కనీసం మార్పులు కూడా చేయకుండా దోషభూయిష్టంగా వ్యాసాలు ప్రచురించేశారని నిరూపించాను. కనుక కొత్తవారు చెడ్డ అనువాదాలు చేస్తారనీ లేదు, అనుభవజ్ఞులు అంతా బాగా చేస్తారనీ చెప్పలేం. చర్చలోనే ఇది వీగిపోయింది.
- చర్చ చేసినవారి సమయానికి విలువ లేదు: వ్యక్తిగతంగా నేను ప్రతిపాదకులైన అర్జున రావు గారే యాంత్రికానువాదాలపై పరిశీలన చేసి ఈ నిబంధనలు ఎందుకు ఉండాలన్నదానిపై ఓ పరిశీలన సాధికారికంగా ప్రచురించాను. దీనికి నేను చాలా సమయమే వెచ్చించాల్సి వచ్చింది. సభ్యుల్లో చాలామంది సుదీర్ఘంగానూ, తమ అనుభవాలు గుర్తుకుతెచ్చుకుని చక్కటి చర్చ చేశారు. చివరకు ఒక ఏకాభిప్రాయం వచ్చింది. ఆయనకే విషయం అర్థమై నియంత్రణ ఉండాలని అభిప్రాయపడ్డారన్నారు. అంటే నియంత్రణ తొలగించాలన్న ఆలోచనను తిరస్కరించారన్నమాట. అంత చేసినా చివరకు అర్జున గారు పేజీలో ప్రతిపాదన 1 బరిలో నిలిచిందని ఏ ఆధారంతో రాశారన్నది అంతుచిక్కదు.
చివరకు చూస్తే ఇదంతా ఒక ఆటలా ఉంది. మనల్ని అభిప్రాయాలు, అనుభవాలు చెప్పమంటారు. చెప్పాకా వాటికి విలువ ఉండదు. తనకు తోచిన కంక్లూజన్‌కి తాను వచ్చి అది నిర్ణయం అంటారు. అస్సలు బాగోలేదు. కాబట్టి, నేను ప్రతిపాదించేదేమంటే:
- అక్కరలేని, సరిగాని ఈ ఓటింగ్ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా నిలుపుదల చేయాలి.
- ప్రతిపాదకుడు, చర్చలో పాల్గొన్న వారు కాక వేరెవరైనా నిర్వాహకులు వచ్చి యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణపై అర్జునరావు గారు ప్రవేశ పెట్టిన ప్రతిపాదనలపై చర్చను వికీపీడియా విధానాలకు అనుగుణంగా ముగిస్తూ నిర్ణయం తీసుకోవాలి.
ఈ విషయాలను నేనిప్పటికే వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం-2లో చెప్పాను. మరో ముగ్గురు నిర్వాహకులు కూడా అలాంటి అభిప్రాయాలే వ్యక్తం చేశారు. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 04:53, 7 సెప్టెంబరు 2020 (UTC)
- అర్జున రావు గారికి ప్రత్యేక విన్నపం. మీరు చర్చల్లో ఇటీవల సభ్యులు చెప్పిన అభిప్రాయాలను సరైన చోటికి తరలిస్తున్నానంటూ ఉప విభాగాల్లోకి పంపించడం, వివరణ అంటూ ఒకరు సుదీర్ఘ ఖండికగా రాసిన అభిప్రాయాల మధ్యలో ప్రశ్నలు చేర్చడం వంటివి చేస్తున్నారు. దయచేసి నేనిక్కడ రాసింది మాత్రం అలా ఎక్కడికీ పంపవద్దు, సముదాయ సభ్యులు చూసేందుకు వీలుగా ఇక్కడే రచ్చబండలో ఉంచండి. అలానే భవిష్యత్తులో నేను మరెక్కడైనా రాసేవాటిలో మాత్రం అలాంటి మార్పుచేర్పులు చేయడం నాకు ఒప్పుదల కాదని గమనించగలరు. మీకు అంతగా ఉపవిభాగాల్లోకి వెళ్ళాలి అనిపిస్తే సూచనా మాత్రంగా నాకు చెప్పండి, సబబు అనిపిస్తే చేస్తాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 04:56, 7 సెప్టెంబరు 2020 (UTC)
ఈమధ్య కాలంలో అనువాద పరికరం ద్వారా ఎవరెవరు ఏయే అనువాదాలు చేసారు మొదలైన వివరాలు
మార్చుగత 30 రోజుల్లో అనువాద పరికరం ద్వారా ప్రచురించిన అనువాదాల వివరాలు ఇలా ఉన్నాయి:
సం | తేదీ | పేజీ పేరు | బైట్లు | వాడుకరి | మానవిక
అనువాద స్థాయి |
---|---|---|---|---|---|
1 | 2020 సెప్టెంబరు 10 | సెర్గీ బుబ్కా | 31,287 | Chaduvari | 39.39% |
2 | 2020 సెప్టెంబరు 9 | మెడిసిటి వైద్య విజ్ఞాన సంస్థ | 3,226 | Pranayraj1985 | 53.42% |
3 | 2020 సెప్టెంబరు 8 | హీరో (2008 సినిమా) | 6,696 | Pranayraj1985 | 39.40% |
4 | 2020 సెప్టెంబరు 8 | గజలక్ష్మి | 6,973 | K.Venkataramana | 55.98% |
5 | 2020 సెప్టెంబరు 7 | కౌసల్య (నటి) | 13,037 | K.Venkataramana | 52.50% |
6 | 2020 సెప్టెంబరు 7 | గంగవ్వ | 10,707 | K.Venkataramana | 46.15% |
7 | 2020 సెప్టెంబరు 7 | నోయెల్ సీన్ | 18,162 | K.Venkataramana | 30.09% |
8 | 2020 సెప్టెంబరు 6 | బిగ్ బాస్ తెలుగు 4 | 4,426 | Pranayraj1985 | 35.80% |
9 | 2020 సెప్టెంబరు 5 | సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల | 3,454 | Pranayraj1985 | 36.00% |
10 | 2020 సెప్టెంబరు 4 | నిజామాబాదు ప్రభుత్వ వైద్య కళాశాల | 3,264 | Pranayraj1985 | 30.15% |
11 | 2020 సెప్టెంబరు 1 | నిజామాబాదు ప్రభుత్వ ఆసుపత్రి | 5,345 | Pranayraj1985 | 30.00% |
12 | 2020 ఆగస్టు 31 | మహబూబ్‌నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల | 3,039 | Pranayraj1985 | 32.20% |
13 | 2020 ఆగస్టు 30 | అదిరే అభి | 4,851 | Pranayraj1985 | 62.30% |
14 | 2020 ఆగస్టు 30 | రాజగోపాల కృష్ణ యాచేంద్ర | 4,584 | Viggu | 32.30% |
15 | 2020 ఆగస్టు 29 | అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం | 6,282 | Pranayraj1985 | 32.20% |
16 | 2020 ఆగస్టు 28 | మూలా వెంకటరంగయ్య | 2,269 | Pranayraj1985 | 31.99% |
17 | 2020 ఆగస్టు 27 | సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (హైదరాబాదు) | 4,131 | Pranayraj1985 | 38.18% |
18 | 2020 ఆగస్టు 26 | శాతవాహన విశ్వవిద్యాలయం | 8,627 | Pranayraj1985 | 32.19% |
19 | 2020 ఆగస్టు 25 | డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) | 6,137 | Pranayraj1985 | 32.43% |
20 | 2020 ఆగస్టు 24 | తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి | 5,129 | Pranayraj1985 | 37.90% |
21 | 2020 ఆగస్టు 23 | తెలంగాణ వైద్య విధాన పరిషత్తు | 3,060 | Pranayraj1985 | 48.80% |
22 | 2020 ఆగస్టు 22 | తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ | 4,777 | Pranayraj1985 | 33.33% |
23 | 2020 ఆగస్టు 21 | నందిత శ్వేత | 13,207 | Pranayraj1985 | 41.30% |
24 | 2020 ఆగస్టు 20 | సైబరాబాద్ మెట్రోపాలిటన్ పోలీస్ | 4,839 | Pranayraj1985 | 31.03% |
25 | 2020 ఆగస్టు 20 | మెగాజాపిక్స్ (Megajapyx) | 1,077 | Dollyrajupslp | 66.66% |
26 | 2020 ఆగస్టు 19 | ఆటాడుకుందాం రా | 1,501 | Pranayraj1985 | 27.47% |
27 | 2020 ఆగస్టు 15 | భూటాన్ - భారత దేశ సంబంధాలు | 6,612 | Pavan santhosh.s | 30.66% |
మొత్తం బైట్లు | 1,86,699 | సగటు మానవిక అనువాద స్థాయి | 39.25% |
వాడుకరుల గణాంకాలు
వాడుకరి | వ్యాసాల
సంఖ్య |
---|---|
Pranayraj1985 | 19 |
K.Venkataramana | 4 |
Pavan santhosh.s | 1 |
Dollyrajupslp | 1 |
Viggu | 1 |
Chaduvari | 1 |
__చదువరి (చర్చ • రచనలు) 10:25, 10 సెప్టెంబరు 2020 (UTC)
- పై జాబితాను గమనిస్తే సరాసరి మానవిక అనువాద స్థాయి 39.25% వచ్చినది. ఇక్కడ గూగుల్ అనువాద పరికరంతో వందల సంఖ్యలో వ్యాసాలను మానవీయ అనువాదాలు చేసి, నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదద్దిన క్రియాశీల వాడుకరులు వారు తమ అనుభవాలను చర్చలలో ఎంత చెప్పినా వినేవాడు లేడు. తమకు అనుకూలంగా ఓటింగ్ ప్రక్రియ చేస్తూ 70% ను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఓటింగ్ చేసే వారెవరూ ఈ పరికరం ప్రయోగాత్మకంగా ఉపయోగించి వారికి గల అనుభవాలను చర్చించలేదు. ఇపుడు అనువాద స్థాయి తొలగిస్తే శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసాలు విపరీతంగా వికీలోకి చేరతాయి. వాటిని శుద్ధి చేయడం గానీ, వాడుకరులకు హెచ్చరికలు చేయడం గానీ, సూచనలు చేయడం గానీ ఈ ఓటింగ్ లో పాల్గొనిన వాడుకరులెవరూ చేయరు. ఆ వ్యాసాలకు తొలగింపు మూసలు, చర్చలు, తొలగింపులూ సర్వసాధారణమే. నిర్వాహకులకు మరింత పని కల్పించడానికే ఈ విధానాన్ని తేవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఆ గూగుల్ అనువాద పరికరంతో పనిచేసిన అనుభవజ్ఞులైన వాడుకరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి. ఇప్పటికి ఉన్న 30% మానవీయ అనువాదాల స్థాయిని అలానే ఉంచండి. తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషిచేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 05:15, 12 సెప్టెంబరు 2020 (UTC)
- అనువాద ఉపకరణం వాడడంలో మెళకువలు నాకు తెలియకపోడవం వల్ల గతంలో ఈ అనువాద ఉపకరణం ఉపయోగించి 3 వ్యాసాలకంటే ఎక్కువ అనువాదాలు చేయలేకపోయాను. గత నెల చదువరి గారు, పవన్ సంతోష్ గారు, యర్రా రామారావు గారు అనువాద ఉపకరణంతో వ్యాసాలను రాయడంవల్ల ఉన్న సౌలభ్యాన్ని నాకు చెప్పారు. దాంతో అప్పటినుండి అనువాద ఉపకరణం ఉపయోగించి 22 కొత్త వ్యాసాలను సృష్టించాను, మరికొన్ని వ్యాసాలలో సమాచారాన్ని చేర్చాను. మరి ఇప్పుడున్న 70% పరిమితి వల్ల నాకెప్పుడు ఇబ్బందులు కలగలేదు సరికదా, వ్యాస నాణ్యతను పెంచేందుకు ఆ పరిమితి ఎంతగానో ఉపయోగపడింది. అనువాద ఉపకరణం అనేది వ్యాస నాణ్యతను పెంచేలా ఉండాలికానీ,నాణ్యతను తగ్గించేలా ఉండకూడదని నా అభిప్రాయం. ఆ విషయం ఎప్పుడో చెప్పేసాం. అయినా దాన్ని కాదని ఓటింగ్ ప్రక్రియకు రావడమేది సమంజసం కాదు. ఇక ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నవారి గురించి కె.వెంకటరమణ గారు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను. తరచి చూస్తే ఎటొచ్చి చురుకైన వికీపీడియన్లకు పనిభారం పెంచేందుకే ఇది జరుగుతోందని అర్థమవుతోంది. ఇలా ఉపయోగంలేని ప్రతిపాదనలు తెచ్చి సమయం వృధా చేసేకంటే, ఆ సమయాన్ని వికీ వ్యాసాల అభివృద్ధికి ఉపయోగిస్తే వికీపీడియాకి, మనందరికి మంచిది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:28, 12 సెప్టెంబరు 2020 (UTC)
- అందరికంటే ఎక్కువగా అనువాద ఉపకరణం వాడిన/వాడుతున్న వారు 70% ఉండాలని కోరుతున్నారు
- ఇప్పటి వరకు కేవలం 11 మాత్రమే అనువాదాలు చేసిన వ్యక్తి మాత్రం, అబ్బే లేదు ఈ పరిమితి తీసెయ్యాలని పట్టుబడుతున్నారు.
- అనువాద ఉపకరణం ద్వారా వికీలోకి దొర్లుకొచ్చిన అనేక వ్యాసాల్లోని భాషా దోషాలను శ్రమకోర్చి, సరిదిద్ది, చర్చించి, విమర్శలెన్నొచ్చినా తొలగింపులు ప్రతిపాదిస్తూ తొలగిస్తూ ఉన్నవారు ఈ పరిమితి ఉండాల్సిందేనని అంటున్నారు.
- అసలు ఈ అనువాద దోషాలను ఓరకంట కూడా చూడని వ్యక్తి, చర్చలో వెల్లడైన అభిప్రాయాలను త్రోసిరాజని వోటింగు తెచ్చారు
- అనుభవమున్నంత మాత్రాన అనువాదాలు వచ్చినట్టు కాదు, మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని భావిస్తున్న వారు ఈ పరిమితి ఇలాగే ఉండాలని బలంగా కోరుతున్నారు
- నాకింత అనుభవముంది నన్నే ప్రచురించనివ్వదా అని హుంకరించినవారు, తాను ప్రచురించినన అనువాదం లోని దోషాలను ఎత్తిచూపిన తరువాత కూడా, పరిమితి తగ్గించాల్సిందే అని పట్టుపడుతున్నారు.
- నేను తొలిజాబితాలో ఉన్నందుకు సంతోషిస్తున్నాను. ఆ జాబితా లోనే ఇకముందూ ఉంటాను. __చదువరి (చర్చ • రచనలు) 05:09, 14 సెప్టెంబరు 2020 (UTC)
- పై జాబితాను గమనిస్తే సరాసరి మానవిక అనువాద స్థాయి 39.25% వచ్చినది. ఇక్కడ గూగుల్ అనువాద పరికరంతో వందల సంఖ్యలో వ్యాసాలను మానవీయ అనువాదాలు చేసి, నాణ్యమైన వ్యాసాలుగా తీర్చిదద్దిన క్రియాశీల వాడుకరులు వారు తమ అనుభవాలను చర్చలలో ఎంత చెప్పినా వినేవాడు లేడు. తమకు అనుకూలంగా ఓటింగ్ ప్రక్రియ చేస్తూ 70% ను తొలగించాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఓటింగ్ చేసే వారెవరూ ఈ పరికరం ప్రయోగాత్మకంగా ఉపయోగించి వారికి గల అనుభవాలను చర్చించలేదు. ఇపుడు అనువాద స్థాయి తొలగిస్తే శుద్ధి చేయబడని గూగుల్ అనువాద వ్యాసాలు విపరీతంగా వికీలోకి చేరతాయి. వాటిని శుద్ధి చేయడం గానీ, వాడుకరులకు హెచ్చరికలు చేయడం గానీ, సూచనలు చేయడం గానీ ఈ ఓటింగ్ లో పాల్గొనిన వాడుకరులెవరూ చేయరు. ఆ వ్యాసాలకు తొలగింపు మూసలు, చర్చలు, తొలగింపులూ సర్వసాధారణమే. నిర్వాహకులకు మరింత పని కల్పించడానికే ఈ విధానాన్ని తేవడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికైనా ఆ గూగుల్ అనువాద పరికరంతో పనిచేసిన అనుభవజ్ఞులైన వాడుకరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వండి. ఇప్పటికి ఉన్న 30% మానవీయ అనువాదాల స్థాయిని అలానే ఉంచండి. తెవికీ వ్యాసాల నాణ్యతను పెంచడానికి కృషిచేయండి.--కె.వెంకటరమణ⇒చర్చ 05:15, 12 సెప్టెంబరు 2020 (UTC)
వికీసోర్సులో ప్రూఫ్‌రీడథాన్
మార్చుభారతీయ వికీసోర్సులలో అక్టోబరు నెలలో 1-15 తేదీల మధ్య ప్రూఫ్ రీడ్ తాన్ నిర్వహించబడుతున్నది. దీనికోసం మీ అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతున్నాను. లింకు చూడండి: https://meta.wikimedia.org/wiki/Indic_Wikisource_Proofreadthon_2020 విజయవంతంగా చేయడానికి కొన్ని మంచి క్వాలిటీ స్కాన్ చేయబడిన పుస్తకాలు అవసరం మీరెవరైనా దీనికి సహాయం చేయగలరా.--Rajasekhar1961 (చర్చ) 12:18, 10 సెప్టెంబరు 2020 (UTC)
రాజశేఖర్ గారూ [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961] ఆర్చివ్ నుండి ఎమన్నా తీసుకోగలమా achive.org ఇందులో నాకే తెలిసి కాపీ హక్కులు ముగిసిపోయిన పుస్తకాలు 16,000 పైన వున్నాయి , ఒక వేళ మన దగ్గర అచ్చు పుస్తకం ఉంటే నాకు తెలిసినవారి దగ్గర HP Sheet-feed Desktop ఉన్నది దీని వలన చాలా తక్కువ సమయంలో పుస్తకాన్ని డిజిటలైజ్ చేయవచ్చు కానీ పుస్తకాన్ని పేజీలుగా విడదీసి మళ్ళా బైడు చేసుకోవాలి, అంతేకాక సుందరయ్య విజ్ణాన కేంద్రం వారి వద్ద కూడా కొన్ని పాత పుస్తకాల స్కాన్ లు ఉన్నాయి, నేను ఈ విషయంలో మీకు తోర్పాటును అందించగలను, నన్ను ఏమి చేయమంటారో చెప్పండి Kasyap (చర్చ) 05:06, 18 సెప్టెంబరు 2020 (UTC)
Invitation to participate in the conversation
మార్చునమస్తే. Apologies for cross-posting, and that you may not be reading this message in your native language: translations of the following announcement may be available on Meta. Please help translate to your language. కృతజ్ఞతలు!
We are excited to share a draft of the Universal Code of Conduct, which the Wikimedia Foundation Board of Trustees called for earlier this year, for your review and feedback. The discussion will be open until October 6, 2020.
The UCoC Drafting Committee wants to learn which parts of the draft would present challenges for you or your work. What is missing from this draft? What do you like, and what could be improved?
Please join the conversation and share this invitation with others who may be interested to join, too.
To reduce language barriers during the process, you are welcomed to translate this message and the Universal Code of Conduct/Draft review. You and your community may choose to provide your opinions/feedback using your local languages.
To learn more about the UCoC project, see the Universal Code of Conduct page, and the FAQ, on Meta.
Thanks in advance for your attention and contributions, The Trust and Safety team at Wikimedia Foundation, 17:55, 10 సెప్టెంబరు 2020 (UTC)"అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు" ప్రారంభించుకుందాం
మార్చుతెలుగు వికీపీడియా అభివృద్ధి, కొత్త వ్యాసాల రచన వంటి విషయాల్లో అనువాద ఉపకరణానికి ఉన్న ప్రాధాన్యత కాదనలేనిది. ఇంగ్లీష్ నుంచి అనువదించగల సామర్థ్యం ఉన్నవారికి, అరకోటికి పైగా ఉన్న ఇంగ్లీష్ వికీపీడియా వ్యాసాలను అనువదించేందుకు ఇది చేసే సాయం చాలా బావుంటుంది. ఇటీవల తెలుగు సముదాయంలో విజయవంతంగా నడిచి ముగిసిన "మొలకల విస్తరణ ఋతువు" స్ఫూర్తిగా "అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు" చేసుకుందామని ప్రతిపాదిస్తున్నాను.
దీనివల్ల:
- ఇంగ్లీష్ నుంచి చక్కని వ్యాసాలను తెలుగులోకి అనువదించవచ్చు. కొత్త వ్యాసాలు, ఎక్కువ సమాచారం చేరుతుంది తెవికీలో.
- అనువాద ఉపకరణం వాడకంలో మన నైపుణ్యం పెరుగుతుంది. అనువాద రచనలోనూ మన సామర్థ్యం పెరుగుతుంది. ఒకరి నైపుణ్యాలు మరొకరితో పంచుకోవచ్చు. ఇప్పటిదాకా అనుభవజ్ఞులైనవారు ఇతరులకు ఉపయోగపడేలా అనువాద రచనలోనూ, ఉపకరణం వాడకంలోనూ మెళకువలు రికార్డు చేసి తోటివారికి అందించవచ్చు.
- ఇప్పటిదాకా పలు కారణాలతో అనువాద ఉపకరణానికి దూరంగా ఉండి, మంచి అనువాదం చేయగల సభ్యులు కానీ, అనువాదాలు బాగా చేయగల కొత్తవారు కానీ ఈ గాండీవాన్ని చేబూని వ్యాస వర్షం కురిపించే అవకాశమూ లేకపోలేదు.
ఎలా చేద్దామంటే:
- అక్టోబరు 1 నుంచి డిసెంబరు 10 వరకూ చేసుకుందాం. డిసెంబరులో తెలుగు వికీపీడియా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇది కూడా ఇంకొన్ని మంచి కారణాలు, విజయాలు ఇవ్వాలని ఆశయం.
- అనువాద ఉపకరణం ఉపయోగించి అందులో మార్పులు చేసి దాన్ని వాడి ప్రచురిస్తేనే ఈ ఋతువులోకి వ్యాసాలు లెక్కకు వచ్చేలా ఖచ్చితమైన నిబంధన పెట్టుకుందాం. అనువాదం ఉపకరణంలో చేసి బయట ప్రచురించాం అంటే చెల్లదు. అలానే కొత్త వ్యాసాలే సృష్టించాలని కూడా కాదు. ఏదైనా వ్యాసం మరీ 5 వేల బైట్ల కన్నా చిన్నదిగా ఉంటే, మనం మరో పది వేల బైట్లు పెంచి రాసేట్టయితే ఈ పరిధిలోకి వచ్చేట్టు పెట్టుకుందాం.
- వ్యాసాలు ఎన్ని రాశామన్నదాని కన్నా ఎంత బాగా రాశాం, ఎంత గొప్ప నాణ్యతా ప్రమాణాలు సృష్టించాం అన్నదే ముఖ్యం. దీనికోసం ముందు ఆంగ్ల వ్యాసం సరైనది ఎంపిక చేసుకోవడం, ఆపైన వ్యాసం రాశాకా ఒకరిది మరొకరు సమీక్షించడం, సాధ్యమైనంత వరకూ దోషరహితంగా వ్యాసాలను తయారుచేసేందుకు కృషిచేయడం వంటివి చేద్దాం. అంటే - ఒక వ్యక్తి - వ్యాసం అనువదించడం, వేరేవారి వ్యాసం సమీక్షించడం కూడా చేస్తారు. ఆ కారణంగా నెమ్మదిగానే పనిచేస్తే నెమ్మదిగానే సాగుతుంది. అందుకే రెండు నెలలా పది రోజుల సమయం పెట్టుకుంటున్నాం.
- ఈ పనిలో పోటీ కూడా పెట్టుకుందాం. అంటే- ఇంత నాణ్యతా పాటిస్తూ మంచి నాణ్యతతో కూడిన అనువాదాలు చేసి, తోటి వారివి రివ్యూ చేయడంలో చురుగా పనిచేస్తూ పోటీలో ముందున్నవారిని గుర్తించి చాలా చిరు బహుమానాలు ఇచ్చుకుందాం.
- ఈ క్రమంలో మనం నేర్చుకునేవాటిని, మరీ ముఖ్యంగా బహుళంగా అనువాద వ్యాసాలు ఆ ఉపకరణంలో రాసినవారు, పంచుకునేందుకు పేజీ పెట్టుకుని అనువాదం చేయడంలో, ఉపకరణాన్ని వాడడంలో చిట్కాలు, సూచనలు పంచుకుందాం. అవసరం అనుకుంటే ఏ నెలకో ఒకసారి చిన్నపాటి ప్రోత్సాహకర/శిక్షణ సమావేశాన్ని ఆన్‌లైన్ వీడియో కాల్ ద్వారానో, మరో రూపంలోనో నిర్వహించుకుందాం.
మొత్తానికి
చేయిచేయి కలిపి అనువాద ఉపకరణాన్ని, మన అనువాద నైపుణ్యాలను, తెవికీలో వ్యాసాలను మెరుగుపరుచుకుందాం. తెవికీ పుట్టినరోజు నాటికి మనకు మనమే మంచి నాణ్యమైన వ్యాసాలను, ఇంకొక మంచి ప్రయత్నాన్ని బహుమానం ఇచ్చుకుందాం. ఏమంటారూ? --పవన్ సంతోష్ (చర్చ) 09:09, 12 సెప్టెంబరు 2020 (UTC)
- ఆలోచన బాగుంది, నాకు నచ్చింది. నేను ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు సిద్ధం. ఒక సూచన:
- పైన రాజశేఖర్ గారు ప్రూఫ్‌రీడథాన్ ప్రకటించారు. మనకున్న సముదాయం పరిమాణం రీత్యా ఈ రెండూ ఏక కాలంలో నిర్వహించేదాని కంటే వేరువేరు సమాయాల్లో నిర్వహిస్తే బాగుంటుంది. అంచేత అక్టోబరు 15 తరువాత దీన్ని మొదలెట్టవచ్చేమో ఆలోచించండి. రెంటి లోనూ పాల్గొనే వారికి ఇది వీలు కలిగిస్తుంది.
- ఇక ప్రాజెక్టు విధివిధానాలను రూపొందించండి, పవన్ సంతోష్ గారూ. __చదువరి (చర్చ • రచనలు) 04:51, 14 సెప్టెంబరు 2020 (UTC)
- మంచి ఆలోచన.నేనూ పాల్గొంటాను.చదువరి గారూ పైన సూచించిన పై అభిప్రాయం రీత్యా, అక్టోబరు 15 తరువాత మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం .--యర్రా రామారావు (చర్చ) 05:50, 14 సెప్టెంబరు 2020 (UTC)
- రెండు కార్యక్రమాలనూ ఒకటి తర్వాత మరొకటి నడిపిస్తే రెంటికి సఫలం చేయగలం. ఒకసారి ఆలోచించి; సరైన ప్రణాళిక తో ముందుకుపోదాం. వికీపీడియాకు అనువాద పరికరం ఉన్నది; వికీసోర్సుకు మంచి స్పష్టమైన కాపీలు చాలా అవసరం; వానిలో OCR తర్వాత తప్పులు తక్కువగా వస్తాయి. గురజాడలు, అడివి బాపిరాజు గారి పుస్తకాలు ఇందుకు మంచి ఉదాహరణ. ఎవరికైనా ఇతర ఆలోచనలు వస్తే దయచేసి తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:33, 14 సెప్టెంబరు 2020 (UTC)
- నేను కూడా సిద్ధమే. మరీ ఎక్కువరోజులు కాకుండా నవంబరు 1 నుండి డిసెంబరు 10 వరకు పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 03:03, 15 సెప్టెంబరు 2020 (UTC)
- మంచి ఆలోచన అయితే కొన్ని వర్గాలే వుంటే మరింత దృష్టి పెట్టగలం, నా వికీ వందరోజుల పండుగలో కూడా కలసి వస్తుంది :) 49.204.180.20 18:02, 18 సెప్టెంబరు 2020 (UTC)
- రెండు కార్యక్రమాలనూ ఒకటి తర్వాత మరొకటి నడిపిస్తే రెంటికి సఫలం చేయగలం. ఒకసారి ఆలోచించి; సరైన ప్రణాళిక తో ముందుకుపోదాం. వికీపీడియాకు అనువాద పరికరం ఉన్నది; వికీసోర్సుకు మంచి స్పష్టమైన కాపీలు చాలా అవసరం; వానిలో OCR తర్వాత తప్పులు తక్కువగా వస్తాయి. గురజాడలు, అడివి బాపిరాజు గారి పుస్తకాలు ఇందుకు మంచి ఉదాహరణ. ఎవరికైనా ఇతర ఆలోచనలు వస్తే దయచేసి తెలియజేయండి. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 08:33, 14 సెప్టెంబరు 2020 (UTC)
- మంచి ఆలోచన.నేనూ పాల్గొంటాను.చదువరి గారూ పైన సూచించిన పై అభిప్రాయం రీత్యా, అక్టోబరు 15 తరువాత మొదలు పెడితే బాగుంటుందని నా అభిప్రాయం .--యర్రా రామారావు (చర్చ) 05:50, 14 సెప్టెంబరు 2020 (UTC)
- కార్యక్రమం నిర్వహించే తేదీల గురించి ఓటింగ్ జరుగుతున్నది. దయచేసి [[1]] చూడండి.Rajasekhar1961 (చర్చ) 06:00, 19 సెప్టెంబరు 2020 (UTC)
- ఆలోచనకు స్పందించిన వారందరికీ ధన్యవాదాలు. తోటి సభ్యులు పేర్కొన్నట్టుగా దీన్ని మరీ నెలల పాటు కాకుండా, నవంబరు 1 నుంచి 30 వరకూ నెలరోజుల పాటు చేసుకుందాం. వారం పదిరోజుల సమయం ఉంటుంది కాబట్టి ఫలితాలు విశ్లేషించుకుని, తెలుగు వికీపీడియా పుట్టినరోజు లోపే ఫలితాలు వెల్లడించుకుని చక్కగా చేసుకునేందుకు వీలుంటుంది. సానుకూలంగా స్పందించి, మంచి ఆలోచనలు పంచుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు! --పవన్ సంతోష్ (చర్చ) 07:34, 19 సెప్టెంబరు 2020 (UTC)
- వికీసోర్సు లో ఇండిక్ ప్రూఫ్ రీడథాన్ తేదీలు ఓటింగు అనంతరం ప్రకటించారు. వారు కార్యక్రమాన్ని నవంబరు 1 నుండి 15 తేదీల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబటి అనువాద ఉపకరణాన్ని ఉపయోగించి వ్యాసాల సృష్టి కార్యక్రమానికి తెలుగు వికీపీడియా జన్మదిన ఉత్సవాల నిర్వహణకు అది ఏమీ అడ్డుగా లేదు. కాబట్టి పవన్ సంతోష్ ప్రతిపాదించిన కార్యక్రమాల ప్రణాళికను మార్చాల్సిన అవసరం లేదు.Rajasekhar1961 (చర్చ) 09:54, 26 సెప్టెంబరు 2020 (UTC)
వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది
మార్చునేను 2012 లో తీగ వ్యాసం సృష్టించాను. ఆ వ్యాసంలో 3000 బైట్ల వరకు తెలుగులో సమాచారం ఉన్నది. ఆంగ్లంలో ఉన్న ఇతర సమాచారాన్ని తొలగించి ఈ వ్యాసాన్ని రక్షించవచ్చు. కానీ ప్రణయ్‌రాజ్ వంగరి గారు ఈ వ్యాసాన్ని తొలగించాలని తీర్మానం చేశారు. కావున నేను సృష్టించిన మరియు ఇతరులు సృష్టించిన ఇటువంటి వ్యాసాలను రక్షించుటకు
- ఈ వ్యాసంలో ఎక్కువగా ఆంగ్ల పాఠ్యం ఉంది. వారం రోజులు (సెప్టెబరు 17) లోపు సవరించకుంటే తొలగించాలి.-- ప్రణయ్‌రాజ్ వంగరి
ప్రస్తుగత 15:11, 18 నవంబర్ 2012 YVSREDDY చర్చ రచనలు 20,314 బైట్లు +17,208 దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 15:04, 18 నవంబర్ 2012 YVSREDDY చర్చ రచనలు 3,106 బైట్లు +224 దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 14:52, 18 నవంబర్ 2012 YVSREDDY చర్చ రచనలు 2,882 బైట్లు +30 దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 14:48, 18 నవంబర్ 2012 YVSREDDY చర్చ రచనలు 2,852 బైట్లు +2,045 దిద్దుబాటు రద్దుచెయ్యి ప్రస్తుగత 16:21, 17 నవంబర్ 2012 YVSREDDY చర్చ రచనలు 807 బైట్లు +807 కొత్త పేజీ: తీగను ఆంగ్లంలో వైర్ అంటారు.
ఈ వ్యాసంలో ముఖ్యంగా అవసరమైన తెలుగు వారు సులభంగా అర్థం చేసుకోగల Wire Abbreviation లకు సంబంధించిన సమాచారాన్ని ఆంగ్లంలో ఉన్నది ఉన్నట్టుగా అదనంగా 17 వేల బైట్లు ఈ వ్యాసంలో చేర్చడం జరిగింది. ఒక వ్యాసానికి 2000 బైట్ల సమాచారం ఉండాలని నియమం 2012 లో లేదు. నేను ఎక్కువగా చిన్న వ్యాసాలను సృష్టిస్తున్నానని ఒక వ్యాసానికి కనీసం 2000 బైట్ల సమాచారం ఉండాలనే నియమమును తరువాత కాలంలో తీర్మానించారు. నేను సృష్టించిన ప్రతి వ్యాసంలో 2000 బైట్లకు మించి తెలుగు సమాచారాన్ని చేరుస్తానన్ని తెలియజేయడం జరిగింది. నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ సమాచారం ఉన్న వ్యాసాలకు అదనపు సమాచారం చేరుస్తున్నాను. నేను సృష్టించిన వ్యాసాలలో 2000 బైట్ల కంటే తక్కువ సమాచారం ఉన్నవి తొలగించినా, తొలగించిన వ్యాసానికి 2000 బైట్లకు మించి సమాచారం చేర్చి వాటిని తిరిగి సృష్టిస్తున్నాను. 2016లో రోజుకు ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టించిన నేను, 2020లో కూడా 2016లో లాగే రోజుకు ఒకటి లేదా అంతకుమించి వ్యాసాలను సృష్టించాలనుకున్నాను, కానీ తక్కువ సమాచారం ఉన్న వ్యాసాల తొలగింపును వ్యతిరేకించడంతో నన్ను 2020లో నిరోధించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల అక్షాంశ రేఖాంశాలు మరియు చిత్రపటంలో ఆ ఊరిని గుర్తించి ఆ లింకు ద్వారా గూగుల్ మ్యాప్ లోకి నేరుగా చేరుకోగలగేలా చేసిన నేను, నేను సృష్టించిన వ్యాసాలు తొలగింపుకు గురికాకుండా చేసుకోగలను. కానీ ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు నేను ప్రారంభించిన వ్యాసాల తొలగింపే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందువలన నేను ప్రారంభించిన వ్యాసాలను ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు తప్ప మరెవరైనా తొలగించేలా చేయవలసిందిగా వైజాసత్య గారిని, చంద్రకాంతరావు గారిని, చదువరి గారిని, అర్జున్ గారిని, సుజాత గారిని, రవిచంద్ర గారిని, రామారావు గారిని మరియు ఇతర నిర్వాహకులను కోరుచున్నాను. YVSREDDY (చర్చ) 09:53, 14 సెప్టెంబరు 2020 (UTC)
- YVSREDDY గారూ, వారిద్దరిపై మీ విమర్శ అసంబద్ధం, అసంగతం. వ్యాసాల తొలగింపే లక్ష్యంగానా..!!?? 900 మొలకలు, 250 మొలకలనూ విస్తరించిన వాళ్ళది వ్యాసాల తొలగింపే లక్ష్యమా!!? మీ దురుసు తనాన్ని నేను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నాను. వాళ్ళు చేసిన విస్తరణలను మీరు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలా దురుసుగా మాట్టాడినందుగ్గాను, నిజాన్ని గ్రహించి, పునరాలోచన చేసుకుంటే హుందాగా ఉంటది. ఎంచేతంటే...
- మొలకలకు సంబంధించి జరుగుతున్న తొలగింపు చర్చల పట్ల గాని, వాటిపై మీరు పేర్కొన్న ఇద్దరు వాడుకరులు చేసిన, చేస్తున్న పని పట్ల గాని ఏమాత్రం తెలిసినట్టుగా లేదు మీకు. తొలగించిన మొలకలను 2 కెబిల స్థాయిని దాటిస్తూ తిరిగి సృష్టిస్తున్నట్టు మీరే చెప్పుకున్నారు. కానీ తొలగించే ముందే విస్తరించాలనే సంగతిని విస్మరించారు. పునఃసృష్గ్టి చేసిన కొన్ని వ్యాసాలను చూస్తే తొలగించిన వాటిని యథాతథంగా సృష్టించారు. మీరు చేస్తున్న పని పట్ల నేను చాలా నిరుత్సాహపడ్డాను. మొలకలపై పనిచేస్తున్న వాళ్ళంతా నిరుత్సాహపడి ఉంటారు. విశేషించి మీరు తెలుసుకోవాల్సినదీ, ఇప్పటివరకూ బహుశా మీరు గ్రహించనిదీ ఏంటంటే.. ఎవరి పైనైతే మీ వ్యాసాలను తొలగిస్తున్నారంటూ మీరు కత్తిగట్టారో వాళ్ళే మీరు సృష్టించిన అనేక మొలకలను విస్తరించారు. వాళ్లంతా మీతో కలిసి పనిచేసేందుకు చాలా సందర్భాల్లో ముందుకొచ్చారు. అందులో నేనూ ఒకణ్ణి. కానీ మీరే దూరంగా ఉండిపోయారు. వాళ్లకు కొత్త కొత్త పేర్లు పెట్టి నానా మాటలూ అన్నారు. (అనుభవజ్ఞులమని చెప్పుకుంటున్నవాళ్ళు ఆ సందర్భాల్లో నోరు మెదపలేదు. వాళ్ల కంటే మీరు చాలా నయం, అది వేరే విషయం). మీరు గాని, మీరు తిడుతూంటే మౌనంగా ఉండిపోయిన వాళ్ళు గానీ మొలకల విస్తరణ పనిని ఏనాడూ ముట్టుకోలేదు. కానీ ఇప్పుడు పైన మీరు విమర్శించిన ఇద్దరూ ఏం చేసారో తెలుసా..? 2,800 మొలకలను విస్తరించిన ఉద్యమానికి నడుం కట్టారు. స్వయంగా తామే వందల కొద్దీ వ్యాసాలను విస్తరించారు (వెంకటరమణ గారు 900 వ్యాసాలు, ప్రణయ్ రాజ్ గారు 250 వ్యాసాలనూ విస్తరించారు). వాళ్ళేమీ ఈ సంగతిని ఊరంతా చెప్పుకోలేదు, డప్పేసుకోలేదు. (ఈ సంగతి చెప్పమని నన్ను వాళ్ళేమీ అడగలేదండీ... మీరు ఇన్నేసి మాటలన్నాక కూడా నేను ఈ ముక్క చెప్పకపోతే, వాళ్ళ పట్ల తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది, నేనూ అనుభవజ్ఞుల జాబితా లోకి చేరిపోతాను. అందుకే రాస్తున్నాను.)
- కింది జాబితా చూడండి.. ఇవన్నీ మీరు సృష్టించిన మొలకలే. ఇవన్నీ ఈ మధ్య జరిగిన మొలకల విస్తరణ ఋతువులో విస్తరించినవే. వీటిలో సింహభాగాన్ని విస్తరించినది మీ చేత ఇప్పుడు విమర్శా సత్కారం పొందిన పై ఇద్దరూ, గతంలో మీ చేత పేర్లు పెట్టించుకుని తిట్టించుకున్న వాళ్ళూను. ఏదో మొక్కుబడిగా 2 కెబిలు దాటిద్దామని మీరు అనుకున్నట్టు వీళ్ళు అనుకోలా. 5 కెబి, 10 కెబి, 13 కెబి, 15 కెబి లు కూడా ఉన్నాయి ఈ పేజీల్లో. వికీపీడియా పట్ల వీళ్ళకున్న నిబద్ధత గురించి కనీసమాత్రపు గ్రహింపు ఉంటే మీరు గాని మరెవరు గానీ "ఇలా" విమర్శించ కూడదు. లేదూ నేను ఇలాగే ఉంటాను అంటారా.. ఇక మీ ఇష్టం.
1 | అలకలతోపు | 26 | స్టీమ్‌బోట్ వేడినీటి బుగ్గ | 51 | మకర తోరణం |
2 | నిమ్మకాయల చిన్న రాజప్ప | 27 | గ్రేట్ మొగల్ డైమండ్ | 52 | ఎడారి టేకు |
3 | గంగుల ప్రతాపరెడ్డి | 28 | ఫర్బిడెన్ సిటీ | 53 | హరిద్ర |
4 | పతివాడ నారాయణస్వామి నాయుడు | 29 | హెర్మన్ స్నెల్లెన్ | 54 | అలంకార మొక్క |
5 | వై.యస్.రాజారెడ్డి | 30 | స్నెల్లెన్ చార్ట్ | 55 | ఊట మొక్క |
6 | 24 (సంఖ్య) | 31 | ప్రపంచ జల దినోత్సవం | 56 | కనప |
7 | తిరుమల ఆర్జిత వసంతోత్సవం | 32 | 1742 | 57 | రాళ్లమొక్క |
8 | నరసింహ సరస్వతి | 33 | కావనల్ కొండ | 58 | కాకిచెరకు |
9 | బొల్లినేని వెంకట రామారావు | 34 | నూరెక్ ఆనకట్ట | 59 | కణుపు |
10 | రావి నాగలక్ష్మి | 35 | తిరుమల ఆర్జిత బ్రహ్మోత్సవం | 60 | ఎర్ర వండ పూలు |
11 | మత్ గుత్‌మిల్లర్ | 36 | తిరుమల సహస్ర దీపాలంకరణ | 61 | పందిరి |
12 | 42 (సంఖ్య) | 37 | కోచింగ్ | 62 | ఆవారాగాడు |
13 | పసుపు కాంచనం | 38 | క్యాంపస్ | 63 | మిత్రవింద |
14 | మెగా | 39 | జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష | 64 | ప్రపంచ హృదయ దినోత్సవం |
15 | తెల్ల బంగారం చెట్టు | 40 | జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ | 65 | ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం |
16 | నవ్యాంధ్ర | 41 | ప్రభుత్వ విశ్వవిద్యాలయం | 66 | జాతీయ వృద్ధుల దినోత్సవం |
17 | మహా సరస్సులు | 42 | యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ | 67 | ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం |
18 | తిరుమల శిలాతోరణం | 43 | లేడీ హార్డింజ్ వైద్య కళాశాల | 68 | ప్రపంచ ఇంటిపంటల దినోత్సవం |
19 | సన్ రైజ్ కంట్రీ | 44 | డీమ్యాట్ ఖాతా | 69 | నిరృతి |
20 | పద్మ నది | 45 | ద్రవ్యం | 70 | భద్రాదేవి |
21 | వోల్గా నది | 46 | రాండమ్ ఏక్సెస్ మెమరీ | 71 | తల్లివేరు |
22 | ఓబ్ నది | 47 | రీడ్ ఓన్లీ మెమరీ | 72 | ఆల్టర్నేటర్ |
23 | యెనిసెయి నది | 48 | చిటిక | 73 | ఎలక్ట్రిక్ జనరేటర్ |
24 | ఆమ్‌స్టర్‌డ్యామ్ | 49 | ఎకరం | 74 | ఇన్‌ఫ్రాసౌండ్ |
25 | మిస్సోరి నది | 50 | సెంటెనియల్ లైట్ | 75 | అవుట్పుట్ డివైస్ |
ఇక, ఇంగ్లీషు భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని ఉంచాలని మీరిచ్చిన సలహా.. మేం ఈసరికే ఆ పని చేస్తున్నాం. మీరూ ఆ పని చెయ్యడం మొదలుపెట్టండి. కనీసం మీరు తయారు చేసిన మొలకలను విస్తరించడం, ఇంగ్లీషు తీసెయ్యడం/అనువదించడం వగైరాలు చెయ్యండి. వికీ అభివృద్ధికి తోడుపడండి. నమస్కారం.__చదువరి (చర్చ • రచనలు) 11:18, 14 సెప్టెంబరు 2020 (UTC)
- వై వి ఎస్ రెడ్డి గారు, నమస్తే వికీపీడియాలో మీరు సృష్టించిన వ్యాసాల సంఖ్య చాలా సమయం వెచ్చించారు, అన్ని వ్యాసాలు సృష్టించడం మామూలు విషయం కాదు, అభినందించాలి, గ్రామాల అక్షాంశ రేఖాంశాలు ఆ ఊరిని గూర్చి గుర్తించేలా లింక్ తయారు చేయడం చాలా గొప్ప విషయం నేను మీకు అభిమాని, ఇటీవల మొలకల వ్యాసాలను విస్తరించడం జరిగింది గమనించే ఉంటారు. అలాంటి మొలకలు సృష్టించడం కొత్త వాడుకరులకు తెలియక సమాచారం, లేక అయి ఉంటుంది. కానీ ఎంతో అనుభవం ఉన్న మీలాంటి వాళ్లు కావాలని వదిలేయడం చాలా బాధాకరం, దానికి నిర్వాహకులు ఇతర సభ్యులు నెలల కొద్దీ సమయం వెచ్చించి వాటిని అభివృద్ధి చేయడం అంటే వారి విలువైన సమయానికి మీలాంటివారు బాధ్యులు అవుతారు, అది గుర్తించండి. మొలక వ్యాసాలకు నేను చాలా వ్యతిరేకిని ఎంతో ఆశగా నాలాంటి వారు గూగుల్ లో ఒక వ్యాసం గురించి వెతికితే దానిలో నాలుగు ఐదు లైన్లు వ్యాసం మొలకగా ఉంటే వారు ఎంత నిరుత్సాహ పడతారు నేను నీకు చెప్పకరలేదు, అది సృష్టించిన వారిని మనసులో ఏమనుకుంటారో కూడా మీరే ఊహించండి. మొలకల విస్తీర్ణం లో కూడా నేను వెయ్యి రెండు వేలు బైట్లు ఇస్తే సరిపోతుంది. పైన చెప్పిన ఈ విధంగా సమాచారం లేకపోతే ఆ వ్యాసం మీద తెలుగు వికీపీడియా మీద అందులో ఏమీ కావలసిన సమాచారం లేకపోతే తెలుగు వికీపీడియాపైన తప్పుడు అభిప్రాయం పడుతోంది. కాబట్టి దయచేసి మీ అభిమానిగా నేను కోరుకునేది మీరు రాసిన అన్ని మొలకలు విస్తరించండి. నిర్వాహకులైన వెంకటరమణ గారు, ప్రణయ్ గారు మీకు శత్రువులు కాదు, వారు చేసే పని చేస్తున్నారు గాని మీ మీద వారికి మీకు వారికి ఆస్తి తగాదాలు, భూ తగాదాలు లేవు కదా మరెవరైనా తొలగిస్తే లేని అభ్యంతరం వారు తొలగిస్తే ఎందుకు అనేది నాకు అర్థం కాని విషయం ఒక వాడుకరిగా ఇంతకంటే ఎక్కువ ఎంతో అనుభవం మీకు చెప్పడం బాగోదు. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల 11:44, 14 సెప్టెంబరు 2020 (UTC)
- వై వి ఎస్ రెడ్డి గారూ, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గారు చేస్తున్న పనిలో నాకు తప్పేమీ కనిపించడంలేదు. మొలకల విస్తరణ ఉద్యమం దృష్ట్యా వారు చిన్న వ్యాసాలన్నింటి మీదా దృష్టి పెడుతున్నారు. అందులో మీ వ్యాసాలు ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. అవి మీకు సాధ్యమైనంతమేరకు విస్తరించడం మాని, వారిపైన ఆరోపణలు చేయడం తగదు. - రవిచంద్ర (చర్చ) 13:11, 14 సెప్టెంబరు 2020 (UTC)
- వై వి ఎస్ రెడ్డి గారూ తోటి గౌరవ వికీపీడియన్లుపై ఇలాంటి ఈ చర్చను పెట్టి మీస్థాయిని మరింతదిగజార్చుకున్నారు.వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/తీగ వ్యాసం చర్చాపేజీలో ఎటువంటి స్పందన తెలియజేయలేదు.తొలగింపు చర్చాపేజీలలో స్పందించకుండా, తొలగించిన తరువాత వాటిని తిరిగి అదే పద్దతిలో సృష్టించటంలాంటి అలవాటులో ఎటువంటి మార్పురాలేదు.మీరు ఒకటి ఆలోచించండి.మీవి మాత్రమే తొలగిస్తున్నారనే మాట వాస్తవం కాదు.ఒక వేళ అదే నిజమని మీరు భావిస్తే మీ వ్యాసాలన్నింటిలో ఆలోపాలు ఉన్నందుననే తొలగింపుకు గురౌతున్నాయి.మీ వ్యాసాలు మాత్రమే ఎందుకు తొలగింపుగురౌతున్నాయి అనే దాని మీద దృష్టిసారించి, వాటిని సవరించకుండా, అసందర్బ చర్చలు, లేదా నిర్వాహకుల మీద అనుచిత వాఖ్యలు చేసి కాలయాపన చేస్తున్నారేగానీ, చాలెంజ్ గా తీసుకుని వీళ్లా నా వ్యాసాలు తొలగించేది, వాళ్లకు ఒక్క వ్యాసం కూడా తొలగించటానికి అవకాశం ఇవ్వను అనే ప్రయత్నం గురించి మీరు ఆలోచిస్తున్నట్లు లేదు. ఇటువంటి చర్చలు వికీనియమాలకు విరుద్దంగా ఉన్న వ్యాసాల తొలగింపు చర్యలకు మినహాయింపు కాజాలవు.ఒకప్పుడు చదువరి, వెంకటరమణ, ప్రణయరాజ్ నాతో సహాకలిపి నలుగురిమీద ద్వజం ఎత్తావు.మరలా ఈ రోజు కొత్త పంథా ఎంచుకున్నావు.అవసరాలకు తగ్గట్టుగా ప్రవర్తించటం మంచిదికాదు.ఇంకొకరోజు చదువరి గారు, రామారావు గారు నావ్యాసాలు తొలగించకుండా వెంకటరమణ గారూ, ప్రణయరాజ్ గారు తొలగించేటట్లు చర్యలు తీసుకోండని మరొక చర్చను ప్రవేశపెట్టే కొత్త పంథా ఎన్నుకోవని నమ్మకమేంటి?ఏది ఏమైనా ఇది హర్శించదగ్గ విషయం కాదు.ఇప్పటికైనా తోటి వాడుకరులు, నిర్వాహకులపై నిందలు, అనుచిత వాఖ్యలు మానుకుని, సీనియర్ వాడుకరి అనే పదానికి గౌరవం చేకూరేట్లు మసలుకుంటే బాగుంటుందని మీ శ్రేయస్సు కోరి చెపుతున్నాను.ఇది హెచ్తరిక కాదు.తోటి వాడుకరిగా మంచిమనస్సుతో చెపుతున్నాను.2013 ఏప్రిల్ నుండి మొలకల నియంత్రణ విధానం అమలులోకి వచ్చింది.ఆ విషయం మీకు తెలుసు.మీ వ్యాసాలన్నీ 2012లోనే సృష్టించబడలేదు కదా?మొలకల నియంత్రణ విధానం అమలులోకి వచ్చిన తరువాతకూడా వందల వ్యాసాలు 2000 బైట్లులోపు ఉన్నవి.మీరు ఇది ఒక సాకుగా చెప్పినా సందర్బానికి సరిపోవాలగదా?అలాంటిదేమీ లేదు.పొనీ సృష్టించారు,ఆ తరువాత అయినా మీరు విస్తరించి, మూలాలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అదీ లేదు.ఇంక ముందైనా మీ వ్యాసాలు తొలగింపులకు గురికాకుండా చూసుకుంటారని ఆశిస్తూ....--యర్రా రామారావు (చర్చ) 13:33, 14 సెప్టెంబరు 2020 (UTC)
- వై వి ఎస్ రెడ్డి గారూ, వెంకటరమణ, ప్రణయ్ రాజ్ గారు చేస్తున్న పనిలో నాకు తప్పేమీ కనిపించడంలేదు. మొలకల విస్తరణ ఉద్యమం దృష్ట్యా వారు చిన్న వ్యాసాలన్నింటి మీదా దృష్టి పెడుతున్నారు. అందులో మీ వ్యాసాలు ఎక్కువగా ఉండటం దురదృష్టకరం. అవి మీకు సాధ్యమైనంతమేరకు విస్తరించడం మాని, వారిపైన ఆరోపణలు చేయడం తగదు. - రవిచంద్ర (చర్చ) 13:11, 14 సెప్టెంబరు 2020 (UTC)
ఆరోపణలు నిరూపించుకోలేకపోతే వైవిఎస్ రెడ్డి గారిపై చర్యలు
మార్చు"వ్యాసాలను తొలగించుట కన్నా అనువాదం జరగని విభాగాలను తొలగించడం మంచిది" - అన్నారు, బావుంది. అయితే, ఆ ముక్క చెప్పిన వైవియస్ రెడ్డి గారే చేయడం బావుంటుంది. అదే కాదు, ఆ వ్యాసాన్ని మెరుగుపరచడం ఇంకా మంచిది. వైవియస్ రెడ్డి గారికి 2012 నుంచి ఆ వ్యాసం అలానే ఉండగా, ఈనాడు వేరెవరో గుర్తించి తొలగిస్తూంటే ఈ నీతి గుర్తుకురావడం బావోలేదు. YVSREDDY గారూ! వికీపీడియా నాలుగవ మూలస్తంభమైన "వికీపీడియా తోటి సభ్యులను - వారితో మీరు ఏకీభవించకపోయినా - గౌరవించండి" అన్నది చదువుకుని ఇక నుంచి చర్చలో పాల్గొనవలసిందిగా మీకు సూచన చేస్తున్నాను. దాదాపు దశాబ్ద కాలం వదిలివేసిన వ్యాసాల మీద నిర్వాహకులు చర్య తీసుకోబోతుంటే వారి మీద కారణం లేకుండా దాడి చేయడం వేధింపు కిందికి వస్తుంది. "నిబద్ధతతో ఉండండి. ఇతరులు కూడా అంతే నిబద్ధతతో ఉన్నారని భావించండి - అలా లేరనేందుకు మీదగ్గర తిరుగులేని సాక్ష్యం ఉంటే తప్ప." అని నాలుగో మూలస్తంభం చెప్తోంది. ఇప్పుడు - ప్రణయ్ రాజ్, వెంకట రమణ గార్లు నిబద్ధతతో లేరని, మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి. ఈ రెండిటిలో ఏదీ ఒక వారంలోగా జరగకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే ఇప్పుడు మీకు వ్యతిరేక స్పందనలు తెలిపిన చదువరి, ప్రభాకర్ గౌడ్ గార్లపై కానీ, ఈ హెచ్చరిక చేస్తున్న నాపై కానీ దురుసుగా, అనుచితంగా వ్యక్తిగతమైన దాడికి దిగే పక్షంలో ఆ వారం గడువు రద్దయి తక్షణ చర్యలు జరుగుతాయని తెలియజేస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 12:25, 14 సెప్టెంబరు 2020 (UTC)
గమనిక: పైన వైవియస్ రెడ్డి గారు రాసిన దానిలో "ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు నేను ప్రారంభించిన వ్యాసాల తొలగింపే లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. అందువలన నేను ప్రారంభించిన వ్యాసాలను ప్రణయ్‌రాజ్ వంగరి, కే.వెంకటరమణ గార్లు తప్ప మరెవరైనా తొలగించేలా చేయవలసిందిగా వైజాసత్య గారిని, చంద్రకాంతరావు గారిని, చదువరి గారిని, అర్జున్ గారిని, సుజాత గారిని, రవిచంద్ర గారిని, రామారావు గారిని మరియు ఇతర నిర్వాహకులను కోరుచున్నాను." అన్న భాగంలో మొదటిది ప్రణయ్ రాజ్, వెంకటరమణ గార్ల నిబద్ధతపై ప్రత్యక్ష దాడి. రెండవది, వారిపై చర్యలు తీసుకొమ్మంటూ ఈ వ్యవహారంలో కలగజేసుకొమ్మని వారిద్దరూ మినహా ఇతర నిర్వాహకులందరినీ కోరుతూ పిలుపు. మొదటి భాగంలో వైవియస్ రెడ్డి గారు ప్రణయ్, రమణ గార్ల నిబద్ధతపై చేసిన వ్యాఖ్యలను నిరూపించుకోగలిగినంత పాటి ఆధారాలు ఇవ్వలేదు. ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలు చేసేప్పుడు ఆధారాలు ఇవ్వక్కర లేదనుకోవడం సరికాకపోగా వికీపీడియా మూలస్తంభమైన "తిరుగులేని సాక్ష్యం ఉన్నంతవరకూ ఎదుటివారికి మీ అంత నిబద్ధత ఉందని నమ్మడాన్ని" వమ్ము చేస్తోంది. కాబట్టే పిలుపును అందుకున్న నిర్వాహకుల్లో ఒకనిగా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. గమనించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 14 సెప్టెంబరు 2020 (UTC)
- గాలి ఉంటేనే ఏ జీవి అయినా సంతోషంగా జీవించగలదు, గాలి అనేది లేదు, ఉంటే నాకు చూపించు అంటే ఎవరు చూపించలేరు. నిద్రపోతున్న వారిని లేపగలము గాని, నిద్ర నటిస్తున్న వారిని లేపలేము. సృష్టించబడిన రోజే తీగ వ్యాసంలో 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉంది. అదనంగా చేర్చబడిన ఆంగ్ల సమాచారం అందరికి అర్థమయ్యే వైర్ అబ్రివేషన్ లకు సంబంధించిన ఒక పెట్టె. పవన్ సంతోష్ గారు మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని నన్ను అడిగే బదులు, 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉన్న వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారు, తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి అని వ్యాసాలను తొలగిస్తున్న వారిని అడగవచ్చు కదా. YVSREDDY (చర్చ) 16:55, 15 సెప్టెంబరు 2020 (UTC)
- YVSREDDY గారూ, వికీపీడియాలో వ్యాసాలపై తొలగింపు నోటీసులు పెట్టడం, దానిపై చర్చ జరిగి ఉండాలనో, అక్కర లేదనో నిర్ణయం కావడం అన్నది వ్యాసం సృష్టించడం ఎంత సహజమో, అంత సహజమైన ప్రక్రియ. తీగ వ్యాసంలో అనువదించని ఇంగ్లీష్ వాక్యాలున్నాయి వారు నోటీసు పెట్టారు. అబ్బే ఇది మంచి వ్యాసమే, ఆకాస్త ఇంగ్లీష్ తీసేస్తే పోతుందని మీరు ఆ చర్చలో చెప్పవచ్చు, లేదూ మీరే తీసేయవచ్చు. ఇదంతా కూడా సరైన పద్ధతే! నిర్వహణ మీద శ్రద్ధ ఉన్న వ్యక్తులుగా వెంకటరమణ, ప్రణయ్‌రాజ్‌లు తమ పని తాము చేసినట్లు అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆమాటకు వస్తే, వారిద్దరూ - తెవికీలోకి వచ్చే ప్రతీ వ్యాసాన్ని తరచి చూసి అందులో సమస్యాత్మకమైన వ్యాసాలపై నోటీసులు పెట్టి, చర్చ చేసి తొలగింపు నిర్ణయాలు తీసుకోవడానికి బోలెడు కృషిచేస్తున్నట్టు వారి వాడుకరి రచనలు చూస్తే తెలుస్తోంది. ఈ తీగ సంగతి పక్కన పెట్టండి - వివాహ వార్షికోత్సవం అని మీ వ్యాసం ఇంకొకటి ఉంది. దీనిలోనూ అలానే అనువదించని ఇంగ్లీష్ పాఠ్యం బోలెడు ఉంది. దీనికీ ప్రణయ్ నోటీస్‌లు పెట్టారు. వెంకటరమణ గారు, మరొక నిర్వాహకులు గతంలో నా వ్యాసాల్లో నాణ్యత తక్కువైన వాటినీ తొలగింపు నోటీసులు పెట్టారు, నేను కృతజ్ఞతలు చెప్పి తొలగించమన్నాను. నిర్వాహకులు రాజశేఖర్ గారు తొలి దశలో చాలా చిన్న చిన్నవీ, విస్తరించే వీలు లేనివీ అయిన వ్యాసాలు రాస్తే, తర్వాతి కాలంలో ఆ వ్యాసాలు అపరిపక్వ దశలో రాశాననీ తొలగించమనీ ఇలాంటి నోటీసులకే చాలా హుందాగా స్పందించారు. మీరు మాత్రం నిర్వహణ పనులు చేసేవారి నైతిక ధైర్యాన్ని దెబ్బతీసేలాంటి వ్యాఖ్యలు నిరాధారంగా చేస్తున్నారని నేను గమనించాను. ఇది కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత, అంటే అవతలి వ్యక్తులు నిర్ద్వంద్వంగా మీ ఒక్కరి మీదే లక్ష్యం చేసుకుని పనిచేస్తున్నారనీ, వారు చేస్తున్నది లక్ష్యం చేసుకోవడమే తప్ప వికీ నిర్వహణ కాదనీ నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మాటల వల్ల మీమీద పడింది. గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించుకునేందుకు అవకాశంగా వారం రోజులు ఇచ్చాను. ఇంకో రెండు మూడు రోజులు మిగిలాయి ఆ గడువులో. ఈలోగా మీరు నిరూపించుకోవడమో, క్షమాపణలు కోరడమో, చర్యకు సిద్ధం కావడమో జరగాల్సి ఉంది. ఏ పనిచేసే ముందైనా నాలుగో మూలస్తంభం మరొక్కసారి చదివి చూడండి, అందుకు తగ్గట్టుగా కనీసం భవిష్యత్తులోనైనా వ్యవహరిస్తారని, పొరబాటు దిద్దుకుంటారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు --పవన్ సంతోష్ (చర్చ) 05:56, 19 సెప్టెంబరు 2020 (UTC)
- 3000 బైట్లకు మించి తెలుగులో సమాచారం ఉన్న వ్యాసాలను ఎందుకు తొలగిస్తున్నారని నిర్వాహకులను అడుగుతుంటే దానికి సమాధానం చెప్పకపోవడం చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే వుంది. సాక్ష్యం ఎదురుగా కనబడుతున్నా నిరూపించుకోవాలని కోరడం చిత్రవిచిత్రంగా వుంది. ఒక వ్యాసం ఏదైనా తొలగింపబడితే దాని యొక్క గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించేందుకు అవకాశాలు నిర్వాహకులకు మాత్రమే వున్నాయిగాని వాడుకరులకు లేవు. ఒక వాడుకరి ఒక వ్యాసాన్ని సృష్టించి, దానిని ఒక మంచి వ్యాసంగా విస్తరించినా ఆ వ్యాసం తొలగింపబడితే, ఆ వ్యాసం వ్రాసిన వ్యక్తికి కూడా ఆ వ్యాసం గురించిన ఎటువంటి సమాచారం అతనికి లభించదు. ఉదాహరణకు వివాహ వార్షికోత్సవం అనే తొలగింపబడిన వ్యాసంను పరిశీలిస్తే "06:21, 19 సెప్టెంబరు 2020 Pavan santhosh.s చర్చ రచనలు వివాహ వార్షికోత్సవం పేజీని తొలగించారు" అని మాత్రమే వుంటుంది తప్ప, ఆ వ్యాసాన్ని ఎవరు సృష్టించారు, ఎప్పుడు సృష్టించారు, అందులో ఏమి సమాచారం వుంది అనే విషయాలు ఆ వ్యాసాన్ని సృష్టించిన వాడుకరికి గాని, ఇతర వాడుకరుల గాని తెలియవు. కావున తొలగించబడిన వ్యాసాల గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించేందుకు అవకాశాలు వున్న నిర్వాహకులు తొలగించబడిన వ్యాసాల గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించవలసిందిగా మనవి.YVSREDDY (చర్చ) 16:47, 21 సెప్టెంబరు 2020 (UTC)
- వైవియస్ రెడ్డి గారు, మీరు అడిగిన ప్రశ్న చిన్న గందరగోళం ఉంది. చివరి లైను మీరు అడిగిన ప్రశ్న తొలగించబడిన వ్యాసాల గత చరిత్రలు తవ్వి తీసి నిరూపించవలసిందిగా మనవి
అన్నారు నాది అనే పదం చేర్చిన బావుండు. లేకపోతే 2005 నుండి తొలగించబడిన వ్యాసాలు అనుకునే అవకాశం ఉంది. మా లాంటి వారు ఎందుకంటే వివరణ లేకపోతే రజనీకాంత్ సినిమా రోబో మాదిరి టీవీపెట్టి పడియె... అంటే అలాగే చేసే అవకాశం ఉంది. మనది వికీపీడియా ఇది కోర్టు కాదు కదా తొలగించిన కేసు మళ్లీ చూడటానికి... ఒక వ్యాసం తొలగించే ముందు చర్చించి తొలగిస్తారు... అదే ఫైనల్ మీకు తెలుసు కదా ... వైవియస్ రెడ్డి గారు, మీరు ప్రారంభించిన వ్యాసాలు...మూడవ సారి చెబుతున్న బంగారం లాంటి విలువైనవి. ఎటొచ్చీ వికీనియమాలకు సరిపోవడం లేదు. ఎర్ర రామారావు గారు అన్నట్లు వీళ్ళా నాకు చెప్పేది. అనుకుని వ్యాసాలు తయారు చేయండి ... ధన్యవాదాలు. Prabhakargoudnomula 19:12, 21 సెప్టెంబరు 2020 (UTC)
- నిషేధం "ప్రణయ్ రాజ్, వెంకట రమణ గార్లు నిబద్ధతతో లేరని, మీ ఆరోపణలు నిజమని మీరు తిరుగులేని సాక్ష్యంతో నిరూపించనన్నా నిరూపించాలి లేదంటే క్షమాపణలు చెప్పాలి. ఈ రెండిటిలో ఏదీ ఒక వారంలోగా జరగకపోతే మీపై చర్యలు తీసుకోవాల్సి వస్తుంది." అని వారం క్రితం ఇదే చర్చలో YVSREDDY గారిని అడిగి, ఆయన నిరూపణ కానీ, క్షమాపణ కానీ చేయకపోవడం కారణంగా ఒకరోజు నిషేధం విధిస్తూ, నిరోధ విధించాను. భవిష్యత్తులో ఇలా ప్రవర్తించరని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:15, 22 సెప్టెంబరు 2020 (UTC)
యాంత్రికానువాదాలు ఉడికాయో లేదో.. ఇదుగో పది మెతుకులు చూడండి
మార్చుఅనువాద ఉపకరణంలో మానవిక అనువాద శాతాన్ని ప్రస్తుతమున్న 30% నుండి యథా పూర్వ స్థితికి తీసుకెళ్ళాలని అర్జున గారు పట్టుబట్టారు. 30% కు మార్చకముందు ప్రచురించిన కొన్ని అనువాదాలను చాలా ర్యాండమ్‌గా తీసుకుని తయారు చేసిన పట్టిక కింద ఉంది. వీటిలో ఒక వ్యాసం ఈ వాక్యంతో మొదలౌతుంది: "ఈ సందర్భంలో సాధారణంగా కాకి కి సంబందించిన పక్షులు రెండు జాతులు ఉన్నాయి". మచ్చుకు ఈ పేజీల్లోని మరికొన్ని వాక్యాలు:
- రోటీని సాంప్రదాయకంగా ఆటా అని పిలుస్తారట.
- "చదువులపై ఆసక్తి లేకపోవడం మరియు కబడ్డీపై అతనికున్న ప్రేమకు నిరంతరం అతన్ని చితకబాదారు. దీనికి విరుద్ధంగా, అతని తల్లి అతనిపై చుక్కలు చూపిస్తుంది, మరియు అతని చెల్లెలు భువన , పదునైన మరియు పరిశోధనాత్మక పాఠశాల విద్యార్థి, వేలును వారి తండ్రితో నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తుంది , అయినప్పటికీ అతను ఆరాధిస్తాడు."
- "రెండు జాతులు జీవితానికి జత చేస్తాయి, వాటి సంతానోత్పత్తి ప్రదేశాలకు విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి, ఇవి సాధారణంగా ఒక గుట్ట ముఖంలో గుహలు లేదా పగుళ్ళు. వారు ఒక చెట్లతో కూడిన గూడును నిర్మించి, మూడు నుండి ఐదు గుడ్లు పెడతారు."
- "1948 నుంచి వినియోగంలో సైతం భాష్పీభవన ఉత్సర్జనం తోపాటు ఉష్ణోగ్రత మరియు అవపాతం సమాచారం చేపడుతుంది మరియు దీనిని జీవ వైవిధ్యం అధ్యయనంలో ఉపయోగిస్తారు మరియు వాతావరణ మార్పుని ఇది ప్రభావితం చేస్తుంది. వాయు ద్రవ్యరాశి యొక్క మూలం బెర్గెరాన్ మరియు ప్రాదేశిక సినోప్టిక్ వర్గీకరణ వ్యవస్థలు ఒక ప్రాంతం యొక్క వాతావరణాన్ని నిర్వచించే దృష్టి పెడతాయి."
- "తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్య యొక్క ప్రారంభ దశలలో, గతంలో ఒక నిర్దిష్ట ప్రోటీన్ లేదా ప్రోటీన్ భిన్నానికి సున్నితత్వం కలిగిన లింఫోసైట్లు స్రవింపబడిన IgE (sIgE) అని పిలువబడే ఒక నిర్దిష్ట రకం యాంటీబాడీని త్వరగా ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతిస్పందిస్తాయి, ఇది రక్తంలో తిరుగుతుంది మరియు IgE- నిర్దిష్ట గ్రాహకాలతో బంధిస్తుంది మాస్ట్ కణాలు మరియు బాసోఫిల్స్ అని పిలువబడే ఇతర రకాల రోగనిరోధక కణాల ఉపరితలం. ఈ రెండూ తీవ్రమైన తాపజనక ప్రతిస్పందనలో పాల్గొంటాయి."
- "దంతాలలో రత్నాలను చొప్పించడం హిప్ హాప్ సంస్కృతిలో ముందే ఉంది. ఇప్పుడు మెక్సికోలో సంపన్న మాయన్లు వారి దంతాలలోకి రంధ్రం చేసినప్పుడు జాడే ముక్కలను అమర్చుకోవడం ప్రారంభమైంది." - ఈ వాక్యాల మూలాన్ని చూస్తే తెలుస్తుంది, ఈ అనువాదంలో ఎంత దోషముందో, "జాడే" ముక్కలంటే ఏంటో.
ప్రచురించే ముందు ఒక్కసారి వాటి వంక చూస్తే చాలా దోషాలను పరిహరించ గలిగే వాళ్ళు. దోషాలేంటో తెలియక కాదు.
ఈ జాబితా లోని వ్యాసాల్లో లక్షా ఇరవై రెండు వేల బైట్లున్న ఒక వ్యాసాన్ని కేవలం మూడున్నర గంటల్లో అనువదించి ప్రచురించేసారు. దానిలో మానవిక అనువాదం 1%
సం. | తొలి ప్రచురణ కూర్పు | పేజీ పేరు | మానవిక అనువాద శాతం |
---|---|---|---|
1 | [2] | పాలు_అలెర్జీ | 1.00% |
2 | [3] | గ్రిల్_(ఆభరణాలు_) | 1.57% |
3 | [4] | రెండు రకాల కాకిజాతులు | 1.66% |
4 | [5] | అర్జెన్_రోబెన్ | 15% |
5 | [6] | గినియా పిగ్ | 12.99% |
6 | [7] | రోటి | 19.30% |
7 | [8] | కథియావారి_గుర్రం | 8.74% |
8 | [9] | శీతోష్ణస్థితి | 14.28% |
9 | [10] | ఘిల్లి | 7.19% |
10 | [11] | శ్వేతా_బసు_ప్రసాద్ | 9.36% |
అర్జున గారూ, పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 10:05, 15 సెప్టెంబరు 2020 (UTC)
వికీపీడియా పైన బారం పడుతుందా
మార్చునిర్వాహకుల అందరికీ నమస్కారం, ప్రతిరోజు కొత్త వాడుకరులు అజ్ఞాత వ్యక్తులు నియమాలు తెలిసి తెలియక కొత్త పేజీలను సృష్టిస్తూనే ఉంటారు ... యాంత్రిక భాష ఉన్న పేజీలు కూడా సృష్టిస్తారు. సుమారు ఐదువేల బైట్లల తో ఒక వ్యాసం సృష్టిస్తే... కొత్త పేజీల వలన వికీపైన భారం ఎంత మేర నష్టం, అలాగే కొన్ని పేజీలను తొలగిస్తాం... ఆ నష్టాన్ని తగ్గించుకోవచ్చా ఉదా. 05.02.2020 రోజున సుమారు 1700 పైగా పేజీలను నిర్వాహకులైన మీరు తొలగించారు. ఈ తొలగింపుల వలన వికీ కి కొంతం అయినా జరిగిన నష్టం తిరిగి వికీ కి పుడ్చుకోవస్తూందా?. ఎందుకు అడిగాను అంటే ప్రయోగశాలలో అనువాదాలు చేసి మరల ప్రయోగశాలలో తొలగించి వ్యాసాంగా కొత్త పేజీలు రాస్తాం కదా... దాని గురించి ఈ ప్రశ్న.... దయచేసి వివరించగలరు. ప్రభాకర్ గౌడ్ నోముల 15:56, 15 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారూ, మీరు అడిగే ప్రశ్నలు నాకు కొంత అయోమయాన్ని కలిగిస్తున్నాయి. 1700 పేజీల అసహజమైన అనువాదాలు తొలగించడం వల్ల వికీకి నష్టం లేకపోగా లాభం అని తెలుగు వికీపీడియా సముదాయ నిర్ణయించి తొలగించింది. ఐతే, ఏమిటి ఇప్పుడు సమస్య? --పవన్ సంతోష్ (చర్చ) 05:12, 17 సెప్టెంబరు 2020 (UTC)
- పవన్ సంతోష్ గారు, ప్రయోగశాలలో అనువాదాలు చేసి మరల ప్రయోగశాలలో తొలగించి వ్యాసాంగా కొత్త పేజీలు రాస్తాం కదా...వికీపీడియా పైన బారం పడుతుందా లేదా అని అడిగాను గురువా. అయోమయాన్ని కలిగిస్తే వదిలేయండి. ధన్యవాదాలు. Prabhakargoudnomula 05:23, 18 సెప్టెంబరు 2020 (UTC)
- మీరు ఇప్పుడు చెప్పింది కూడా అర్థం కావట్లేదు. ముఖ్య కారణాలు ఏమంటే- మీరు నేపథ్యం చెప్పలేదు. అలాగే, భారం అన్న పదానికి అనేక అర్థాలు వస్తాయి. (పేజీల సంఖ్యను భారమంటున్నారా? నిర్వహణా భారమా? మొత్తం బైట్ల సంఖ్య వ్యర్థంగా పెరిగి ఇ-వేస్ట్ అంటున్నారా? -ఇలా) మీరు ముఖ్యమైన అంశమనీ, సమాధానం రావడం ప్రయోజనకరమనీ భావిస్తే కాస్త వివరణ ఇవ్వండి, అక్కరలేదు అనిపిస్తే సరే. --పవన్ సంతోష్ (చర్చ) 05:40, 19 సెప్టెంబరు 2020 (UTC)
కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ముగింపు 2020-09-20 23:59(UTC)
మార్చుకొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానానికి ఓటు ప్రక్రియ ముగింపు 2020-09-20 23:59(UTC) అనగా ఇంకా నాలుగు రోజులలో. ఇప్పటికే 12 మంది ఓటు ప్రక్రియలో పాల్గొన్నారు. వారందరికి ధన్యవాదాలు. అర్హులైన సభ్యులందరు తమ అభిప్రాయాన్ని సులభంగా అనుకూలం, తటస్థం లేక వ్యతిరేకం విభాగాలలో వికీసంతకంచేయటం ద్వారా తెలియచేయవచ్చు. కావున వెనువెంటనే ఓటు వేయవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సహకారానికి ముందస్తు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 23:36, 16 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ ఓటింగ్ ప్రక్రియలో మీరు పెట్టిన ప్రతిపాదనలు పరస్పర విరుద్ధమైన ప్రాతిపదికలతో వచ్చినవీ, చర్చలో తిరస్కరణ పొందినవీ అని చర్చలో పాల్గొన్నవారిలో అత్యధికులు, అనువాద ఉపకరణం ఎంతగానో వాడి కృషిచేసినవారూ అంటూ ఉంటే, మరోపక్క ఇప్పటికే ఓటు వేసినవారిలో ఒకరిద్దరు చర్చ చూసి నిరుత్సాహపడుతూ ఉంటే - ఈ ప్రచారం ఏమిటీ? --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 17 సెప్టెంబరు 2020 (UTC)
కొత్తగా సృష్టించే పేజీలకు ఎన్వికీ లింకులు
మార్చుకొత్తగా సృష్టించే పేజీలకు ఎన్వికీ లింకులు ఇవ్వాలి. కొన్ని సందర్భాల్లో ఆ లింకులు ఉండడం లేదు. వాటిని చేరిస్తే కింది ప్రయోజనాలుంటాయి.
- తెలుగు వ్యాసం చదివిన పాఠకుడికి ఇంగ్లీషు వ్యాసం కూడా చదివి అందులో మరింత సమాచారం ఉంటే తెలుసుకునే వీలు కలుగుతుంది.
- నేరుగా ఇంగ్లీషు వ్యాసానికి వెళ్ళిన తెలుగు పాఠకుడికి తెలుగు వ్యాసపు లింకు తెలిసిపోతుంది. ఇక్కడికి వచ్చి ఈ వ్యాసం చదవవచ్చు. అసలు తెలుగు వికీపీడియా అనేది ఒకటి ఉంది అనే సంగతి కూడా
- సాధారణంగా ఎన్వికీ పేజీకి వికీడేటాలో పేజీ ఉండే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎన్వికీ లింకు చేర్చగానే సంబంధిత వికీడేటా పేజీలో తెవికీ పేజీ లింకు ఆటోమాటిగా చేరిపోతుంది. ఇదొక సౌకర్యం.
- చివరిగా.. అలా ఎన్వికీ లింకు ఉండని పేజీల కోసం వికీడేటాలో ఓ కొత్త పేజీని సృష్టిస్తారు. ఇది ఒక బాటు ద్వారా జరుగుతుంది. అంటే అవసరం లేని ఓ పేజీ తయారౌతుందన్నమాట. దీన్ని నివారించవచ్చు.
ఈ విషయం తెలియని సముదాయ సభ్యులకు ప్రయోజనకరంగా ఉంటుందని రాస్తున్నాను. మరో సంగతి.. అనువాద పరికరం ద్వారా అనువాదం చేస్తే ఈ లింకు దానంతటదే చేరిపోతుంది. __చదువరి (చర్చ • రచనలు) 04:51, 18 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, మంచి పాయింటు. నేను ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే ఇది. కానీ నాకు తెలుసు కాబట్టి అందరికీ తెలియాలని నియమమేమీ లేదు. ఇలా మనకు తెలిసిన విషయాలు, అందరికీ తెలిసుంటుందిలే అనుకోకుండా ఇలా పంచుకుంటే తెలియని కొద్ది వాళ్ళకి కూడా మన ట్రిక్కులు తెలియజేసినట్లుంటుంది. నేను కూడా ఇలాంటి విషయాలన్నీ గుర్తు చేసుకుని రాస్తాను. ముఖ్యంగా వికీ డేటా, వికీపీడియా పేజీలకు ఉన్న సంబంధం గురించి. - రవిచంద్ర (చర్చ) 06:00, 18 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారూ, రవిచంద్ర గారూ మీకు తెలియవని కాదు.తెలియని వారు తెలుసుకుంటారు అనే భావనతో నేను చేస్తున్నవి, నాకు తెలిసినవి చెపుతున్నాను.వికీ డేటాకు లింకు లేని లేదా ఇవ్వని పేజీలు నేను ఎక్కువుగా మొలకలు విస్తరణలో గమనించాను.నేను విస్తరించిన వ్యాసాలుకు లింకులు కలపటమే కాకుండా, కొన్ని పేజీలుకు ఒక పనిగా పెట్టుకుని ఆంగ్ల వ్యాసాల వికీడేటాకు లింకులు కలిపాను.ఇందులో ఏ రకాలు ఏ విధంగా ఏర్పడుతున్నవి అనేదానిని నాకు తెలిసినంతవరకు వివరిస్తున్నాను.
- ఆంగ్ల వ్యాసంతో సంబంధం లేకుండా కొత్త వాడుకరులు కొత్తగా సృష్టించే వ్యాసాలుకు ఎక్కువుగా ఉంటున్నవి.
- కొద్దిగా అవగాహన ఉన్నవారు ఆంగ్ల వ్యాసం ఎంచుకుని, అందులో ఆంగ్లసమాచారంను గోగుల్ ట్రాన్సులేట్, లేదా డైరెక్టుగా సృష్టించిన పేజీలో ఆంగ్ల సమాచారం నింపి, అనువాదం చేసి ఆంగ్ల పాఠ్యం తొలగించి, ఆంగ్ల వ్యాసానికి వికీ డేటా లింకు కలుపకుండా దీనికి కొత్త వికీడేటా లింకు ఇవ్వటం, లేదా ఎటువంటి లింకు ఇవ్వకుండా వదిలి వేస్తున్నారు.
- మరి కొన్ని సందర్బాలలో తెవికీలో సవరణలు చేసేటప్పుడు వికీ డేటా లింకు లేని వ్యాసాలు గమనించి, ఆంగ్ల వ్యాసం ఉందా, లేదా అని గమనించకుండా కొత్తగా వికీ డేటా లింకు ఇస్తున్నారు. దాని వలన వికీ డేటాలో రెండు లింకులు ఉంటున్నవి.
పై వాటికి ఎలా పరిష్కరించాలి అనే దానికి వస్తే గౌరవ వికీపీడియన్లు వికీ డేటాకు లింకు కలపటం తెవికీలో ఇదొక భాగం అని ముందుగా గుర్తించాలి.వ్యాసం ఎడిట్ చేసేటప్పుడు వ్యాసానికి ఎడమ వైపు వికీ డేటా లింకు ఉన్నదో లేదో పరిశీలించాలి. పరిశీలించి నప్పుడు ఆంగ్ల వ్యాసానికి, తెలుగు వ్యాసం లింకు ఉంటే అది 'ఒకెే' అని భావించ వచ్చు.లేకపోతే లింకు కలపాలి.కేవలం తెలుగు పేజీకి మాత్రమే ఉన్నదని గమనిస్తే, అదే పేరుతో ఆంగ్ల శీర్షికతో సమయస్పూర్తిగా, కొద్దిగా వికీడేడేటాలో వెతకాలి.(సెర్చి).ఒకవేళ మరొక వికీ డేటా సంఖ్యతో ఆంగ్ల పేజీ ఉన్నదనుకోండి,ఈ రెండిటిని Merge చేయాలి.చాలా ఈజీగా చేయవచ్చు.మొదటిసారి అడిగి తెలుసుకొని, ఆ తర్వాత ఎవరితో పని లేకుండా చేయవచ్చు.ఇంకొక విషయం.వికీ డేటా లింకులు కలపటం ఎంత ముఖ్యమో, ఒక్కో సందర్బంలో తొలగించుటకూడా అంతే ముఖ్యం.అది ఏ సందర్బంలో జరుగుతుంది అనే దానికి వస్తే. ఇది ఎక్కువుగా తొలగించిన పేజీల సందర్బంలో జరుగుతుంటుంది.ఏదైనా ఒక పేజీని తొలగించిన సంధర్బంలో, దీనికి వికీ డేటా లింకు ఉన్నది.దానికి వెళ్లి సవరించండి అని తెలుపుతుంది.తొలగించిన పేజీకి లింకు అవసరంలేదు కనుక ఇది కూడా అదే సమయంలో సరిచేస్తే తొలగింపు పని పరిపూర్ణమవుతుంది. పైన వివరించిన అన్ని రకాలు సవరణలు వికీడేటాలో ఈరోజువరకు నేను 4969 సవరణలు చేసాను.మనకు తెలియనిదానిలో తెలుసుకోవాలని తపన మనలో ఉన్నప్పుడు, అదే మనల్ని తెలుసుకునేటట్లు అవకాశం కల్పిస్తుందని నాఅనుభవరీత్యా చెపుతున్నానుకానీ, ఇక్కడ నా గొప్పతనం గురించి చెప్పానని భావించవద్దు.కొంత మందికి అయినా అవగాహన కలిగితే సంతోషిష్తాను.--యర్రా రామారావు (చర్చ) 07:22, 18 సెప్టెంబరు 2020 (UTC)
- నేను ఏదన్న కొత్త వ్యాసం రాసేముందు ఆ వ్యాసం ఇంగ్లీషు వికీపీడియాలో ఉందోలేదో, ఉంటే ఆ వ్యాసంకి తెవికీ వ్యాసం లింకు ఉందోలేదో పరిశీలుస్తూ ఉంటాను. చాలావాటికి లింక్స్ ఇవ్వడంలేదు. అలా ఇవ్వకపోవడం వల్ల ఆ వ్యాసం తెవికీలో లేదనుకుంటాం. వికీ ఛాలెంజ్ లో భాగంగా రెండుమూడుసార్లు వ్యాసాలు రాసి, ఆ వ్యాసాలకు సంబంధించిన పేజీల్లో లింక్స్ ఇచ్చే సమయంలో అక్షర బేధాలతో ఆయా వ్యాసాలు కనిపించాయి. అప్పుడు ఆ పేజీ తొలగించి మళ్ళీ మరో వ్యాసం రాయాల్సివచ్చింది. చాలామంది వ్యాసం రాయగానే పని అయిపోయిందని అనుకుంటున్నారు. కానీ, వ్యాసం రాయడంతోపాటు వ్యాసానికి సంబంధించిన ఇతర పనులు చేయడం (ఎన్వికీ లింకులు, అంతర్వికి లింకులు, వర్గాలు, మూలాలు, సమాచారపెట్టె, ఫోటో) కూడా చాలా ముఖ్యం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
తెలుగుకు లేదా మన ప్రాంతాలకు సంబంధించిన ఇంగ్లీష్ వ్యాసాలలో పూర్తి సమాచారం లేకపోవటం, అనవసరం అయిన సమాచారం ఉండటం నేను గమనించాను, ప్రస్తుతానికి అంతర్జాలంలో తెలుగులో ఉన్న వనరులతో లేదా ఆయా వ్యాసము మూలం లో ఇంగ్లీష్ వచనం తెలుగులోని అనువదించి రాస్తున్నాను, భవిషత్తులో యాత్రిక అనువాదాలు జరిగి వ్యాసం విలీనం అయినా మనము ఇక్కడ బిన్నంగా రాసింది ఇతరులకు ఉపయోగ పడుతుందేమో అన్న ఆలోచన , ఆంగ్ల వ్యాసానికి నకలు గా తెలుగులోను వ్యాసం ఉండాలన్న నింబంధన నా దృష్టికి రాలేదు ఆయితే దీని మీద తెలుగులో కూడా ఒక మార్గదర్శకం ఉంటే బాగుంటుంది అని నా విన్నపము , శీర్షికలకు వికీడేటా లో సవరణలు / బాట్ లు బాగానే చేరుస్తున్నాయి Kasyap (చర్చ) 17:52, 18 సెప్టెంబరు 2020 (UTC)
- ఇంగ్లీషు వ్యాసంలో ఉన్న సమాచారం "అంతా" తెలుగు వ్యాసంలో "ఉండి తీరాలన్న" నియమం ఏదీ లేదు. అక్కడ లేని సమాచారం ఇక్కడా ఉండకూడదు అనే నియమం కూడా లేదు. ఇంగ్లీషు వ్యాసానికి తెలుగు వ్యాసానికి నకాలు లాగా ఉండాలన్న నియమం నాకు తెలిసి ఎక్కడా లేదు. ఇక్కడ ఎవరూ రాయనూ లేదు. వ్యాస విషయం ఒకటేనా కాదా అనేది చూసుకుని లింకు ఇస్తే సరిపోతుంది. __చదువరి (చర్చ • రచనలు) 03:59, 19 సెప్టెంబరు 2020 (UTC)
- Kasyap గారూ, ఎన్వికీ వ్యాసపు లింకు ఎందుకు ఉండాలి అనేదానికి భూమి తిరగడం ఆపివేస్తే అనే వ్యాసం చక్కటి ఉదాహరణ. వ్యాసం నిండా అనువాద, భాషా దోషాలే. దీన్ని సరిచెయ్యాలంటే మూల వ్యాసమేంటో తెలియాలి. లేదా మనం చేసే సవరణల్లో కొన్ని కొత్త తప్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం రాసే వ్యాసాలకు దగ్గరగా ఉన్న ఎన్వికీ వ్యాసపు లింకు ఇవ్వాలి. పరిశీలించగలరు. __చదువరి (చర్చ • రచనలు) 09:05, 23 సెప్టెంబరు 2020 (UTC)
చదువరి గారూ మీరు అన్నట్లు ఖచ్చితంగా ఎన్ వికీ మూలాలు అవసరం ఆయన ప్రతివ్యాసానికీ ఉండాలి ,ఆయితే నిన్న ఒక ఓపెన్ బుక్ పరీక్షా విధానం మీద వ్యాసం రాసాను దానికి ఏ ఇంగ్లీష్ వ్యాసానికి లింక్ ఇవ్వాలో తెలియ లేదు , ఇలాంటప్పుడు ఒక మార్గ దర్సకం ఉంటే బాగుంటుందని నా విన్నపం .Kasyap (చర్చ) 16:38, 24 సెప్టెంబరు 2020 (UTC)
- @Kasyap: గారూ! ఇక్కడ మనం చేస్తున్నదేమిటో తెలిస్తే మీకు స్పష్టత వస్తుంది. ఇందులో కొన్ని విషయాలు లేదా అన్ని విషయాలు మీకు తెలిసివుండొచ్చు, తెలియకా పోవచ్చు. మీకే కాక చర్చలో పాల్గొంటున్న ఇతరులకు స్పష్టత వస్తుందని చెప్తున్నాను.
- ఈ ఉపకరణం వాడి ఇంగ్లీష్-తెలుగు మొదలు అనేక భాషల్లో ఉన్న వికీపీడియా పేజీలను లింక్ చేయడం అన్నది ఎక్కడ జరుగుతోంది? వికీడేటాలో.
- ఉదాహరణకు సితార (సినిమా) వ్యాసం చూడండి. అక్కడ మరో రెండు భాషల్లోని (ఇంగ్లీష్, రష్యన్) అదే అంశానికి (1984 నాటి తెలుగు సినిమా సితార) సంబంధించిన వ్యాసాలను కలుపుతున్నాం. ఎక్కడ? ఈ లింకులో చూస్తే వికీడేటాలో సంబంధిత ఐటమ్ ఉంటుంది. (మనకి వికీపీడియాలో వ్యాసం ఎలానో, వికీడేటాలో ఐటమ్ అలాగ)
- ఇప్పుడు మీ ఉదాహరణ చూద్దాం. మీరు ఒక వ్యాసం సృష్టించారు. ఓపెన్ బుక్ పరీక్షా విధానం గురించి ఆ వ్యాసం. ఇంగ్లీషులో సంబంధిత వ్యాసం లేదు ఏం చేయాలి అని అంటున్నారు. ఇంగ్లీష్‌లో వ్యాసం ఉన్నా లేకున్నా దీనికంటూ వికీడేటాలో ఒక ఐటమ్ ఉంటుంది, ఆటోమేటిక్‌గా కొద్దిరోజుల్లో ఏర్పడుతుంది. ఈ లింకులో వెతుక్కోవచ్చు దానికై. ఒకవేళ లేకపోతే అక్కడే సృష్టించే వీలు ఉంటుంది. ఇంగ్లీషులో సంబంధిత వ్యాసం లేకపోతే
- ప్రపంచంలో ఎన్నో వందల వికీపీడియాలు ఉన్నాయి కానీ అందులో ఉన్నాయా లేదా అని వెతకడానికి ఆ భాషల జ్ఞానం లేకపోయింది మనలో చాలామందికి, లేకుంటే వెతికి లింక్ చేయవచ్చు. ఉదాహరణకు మీకు తమిళమో, హిందీనో బాగా వస్తే ఆయా భాషల్లో వ్యాసం వెతికి ఉంటే లింక్ చేసుకోవచ్చు. ఇంగ్లీషే శిష్టాది గురువు కాదు. కానీ, మనకు రాకపోయినా, వచ్చిన ఆ ఒక్క ఇంగ్లీషులోనూ లేకపోయినా నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళిపోండి.
- నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే- వికీడేటా ఐటమ్ చక్కగా సృష్టించి లేదంటే ఇప్పటికే ఉంటే పట్టుకుని, దాని వివరాలు తెలుగులో రాసి చక్కా వచ్చెయ్యండి.
- ఇంతే. మనకు అంతకన్నా తల బద్దలుకొట్టుకోవాల్సిన అవసరం లేదు. --పవన్ సంతోష్ (చర్చ) 05:52, 26 సెప్టెంబరు 2020 (UTC)
- @Kasyap: గారూ! ఇక్కడ మనం చేస్తున్నదేమిటో తెలిస్తే మీకు స్పష్టత వస్తుంది. ఇందులో కొన్ని విషయాలు లేదా అన్ని విషయాలు మీకు తెలిసివుండొచ్చు, తెలియకా పోవచ్చు. మీకే కాక చర్చలో పాల్గొంటున్న ఇతరులకు స్పష్టత వస్తుందని చెప్తున్నాను.
Indic Wikisource Proofreadthon II and Central Notice
మార్చుSorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successful first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Please comment on CentralNotice banner proposal for Indic Wikisource Proofreadthon 2020 for the Indic Wikisource contest. (1 Oct2020 - 15 Oct, all IPs from India, Bangladesh, Srilanka, all project). Thank you.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
- రాజశేఖర్ గారు ప్రకటించినట్టుగా అక్టోబరు 1-15 కు వోటేసాను. ఎక్కువమంది __చదువరి (చర్చ • రచనలు) 04:01, 19 సెప్టెంబరు 2020 (UTC)
- నేను కూడా అక్టోబరు 1-15 కు వోటేసాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:37, 19 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ ఓటింగ్ లో చిత్రణం (విజువలైజేషన్) బాగానే ఉన్నా ఇంకా వికీయేతర జాలగూడు లో ఇలా ఓటింగ్ ప్రకియ పెట్టటం నాకు నచ్చలేదు, జయంత గారు Jayanta (CIS-A2K) ఇది గమనించాలి Kasyap (చర్చ) 18:43, 22 సెప్టెంబరు 2020 (UTC)
- Hello, @Jayanta (CIS-A2K): would like to bring above concern to your notice. @Kasyap: expressed his concern on conducting this voting in off-wiki online space (like strawpoll) and I also believe it can happen on-wiki in meta-wiki sub page of the proposed proofread-a-thon. Hope A2K would take this as a feedback on process and consider while doing something similar in future. Thanks. --పవన్ సంతోష్ (చర్చ) 05:22, 26 సెప్టెంబరు 2020 (UTC)
- ఈ ఓటింగ్ లో చిత్రణం (విజువలైజేషన్) బాగానే ఉన్నా ఇంకా వికీయేతర జాలగూడు లో ఇలా ఓటింగ్ ప్రకియ పెట్టటం నాకు నచ్చలేదు, జయంత గారు Jayanta (CIS-A2K) ఇది గమనించాలి Kasyap (చర్చ) 18:43, 22 సెప్టెంబరు 2020 (UTC)
మార్పుల సంఖ్య ముఖ్యమా
మార్చువాడుకరి చర్చ:Yciyc8yf8ycy8dt7dfyociyciyciyciycigc మార్పుల సంఖ్య ముఖ్యమా, ఇలాంటి అర్థం పర్థం లేని పేర్లతో కొత్త ఖాతాలు తెలుగు వికీపీడియాలో తెరవడానికి ప్రయత్నిస్తే వారికి స్వాగతం పేజీ నిలుపుదల చేసే అవసరం ఎంతైనా ఉంది... కానీ వికీపీడియాలో మార్పుల సంఖ్య వాడుకరికి ప్రాముఖ్యత ఇవ్వడం ఇలాంటి తప్పులకు ఆస్కారం అవుతుంది. గతంలో ఈ విషయం ప్రస్తావించగా పెద్దలు శ్రీరామ్ మూర్తి గారు, అర్థవంతమైన పేర్లతో ఖాతాలు సృష్టించిన వారికి మాత్రమే స్వాగతం పలుకుతున్నారు. వారికి ధన్యవాదములు... నా ప్రతిపాదన ఏమిటంటే ఆంగ్ల వికీపీడియా సాంప్రదాయం తెలుగులో కూడా పాటించాలని అనగా ఖాతా సృష్టించి వాడుకరి ఏదో ఒక పేజీలో సదరు వాడుకరి మార్పుచేర్పులు ప్రారంభిస్తేనే ఆ వాడుకరికి స్వాగతం పలుకుతారు. తెవిలో కూడా అలాంటి రోజు రావాలని నా ఆశ ధన్యవాదాలు. Prabhakargoudnomula 15:42, 19 సెప్టెంబరు 2020 (UTC)
- కొత్త వాడుకరులకు స్వాగతం చెప్పే విషయమై నేనే చర్చకు పెడుదామని ఎప్పటినుండో అనుకుంటున్నాను. Prabhakargoudnomula గారు చెప్పింది వాస్తవం. తెవికీలో ఖాతా సృష్టించుకున్న వాడకరులకేకాకుండా, ఇతర భాషలనుండి అటోమేటిక్‌గా తెవికీకి వచ్చిన వారికి కూడా స్వాగతం చెబుతున్నారు. అయితే, అటోమేటిక్‌గా తెవికీకి వచ్చిన వారికి కూడా తెలుగులోనే స్వాగత సందేశం పంపడం ఇందులో గమనించదగ్గ విషయం. కాబట్టి ప్రభాకర్ గౌడ్ గారు చెప్పినట్టు, 'ఖాతా సృష్టించిన వాడుకరి ఏదో ఒక పేజీలో మార్పుచేర్పులు చేసిన తరువాత ఆ వాడుకరికి స్వాగతం పంపడం' చేస్తేనే మంచింది. అది కూడా 'వికీ సభ్యుని ప్రమేయం లేకుండా అటోమేటిక్‌గా స్వాగత సందేశం పంపించేలా' చేస్తే ఇంకా మంచిది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:13, 20 సెప్టెంబరు 2020 (UTC)
- అంతేగాదు తెవికీలో వాడుకరులు సృష్టించుకునే ఖాతాలు తెలుగులోనే ఉండాలి.వాడుకరి ఖాతాలో ఉండే అక్షరాలకు తగిన పరిమితి ఉండాలి.మానవీయంగా స్వాగతం చేప్పేపనికి స్వస్తిపలకాలి.సవరణలు పరిమితి పెట్టి ఆటోమాటిక్ గాస్వాగతం (చర్చా) పేజీ వచ్చే సదుపాయం ఉండాలి.వాడుకరిపేజీలో కేవలం వాళ్ల బయోగ్రఫీ రాసుకోవటానికి మాత్రమే ఈ మధ్య కాలంలో ఎక్కువ ఖాతాలు సృష్టింపు జరుగుతుంది.పైన ప్రభాకర్ గౌడ్ గారి ఉదహరించిన ఖాతా చూస్తుంటే నేను సూచించిన సూచనలు అవసరమని భావిస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:34, 20 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ నోముల గారూ, భేషైన ఆలోచన. గతంలో ఒక కొత్త సభ్యుడు ఆలా స్వాగతించిన సభ్యునికి ఎదురు సందేశం పెట్టారు - ఎందుకిలా మీ భాష రానివారిని కూడా స్వాగతిస్తున్నారు, అని. అయినా ఇది సాగుతూనే ఉంది. చొరవ తీసుకుని మీరు ఆ పద్ధతిని మార్చండి. ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టండి. తెవికీలో ఒకటైనా రచన చేసిన వాళ్లకే స్వాగత సందేశం పడదామని స్వాగతిస్తున్న ఇతర (ఇద్దరేననుకుంటాను) సభ్యుల చర్చా పేజీల్లో కూడా ఈ ప్రతిపాదన రాయండి. __చదువరి (చర్చ • రచనలు) 07:30, 20 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, బాటు రాస్తే పనౌతుంది. కానీ ఆ పని చెయ్యగలవారు లేరు. ఏమైనప్పటికీ మీ ప్రతిపాదనను వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో రాయండి. ఆ పని చెయ్యగలవారు ముందుముందు ఎవరైనా వస్తే వారికి మన ఆవశ్యకత తెలుస్తుంది.
- యర్రా రామారావు గారూ బూతులు, అశ్లీల పదాలు, రోత పదాలను వాడుకరిపేరులో పెట్టకుండా వికీ నిబంధనలున్నాయి. కానీ తెలుగు మాత్రమే ఉండాలి అనే నిబంధన కుదరదనుకుంటాను. సింగిల్ సైనాన్ ఉంది కాబట్టి వివిధ వికీల్లో రాసే వాడుకరులు తమ వాడుకరిపేరు ఇంగ్లీషులోనే ఉంటేనే బాగుంటుందని (సింగిల్ సైనాన్ ఉన్నంత మాత్రాన తెలుగులో ఉండకూడదనేమీ లేదు) అనుకునే అవకాశం ఉంది. పైగా ఇలాంటి నిబంధనలు యావద్వికీ వ్యాప్తంగా ఒకేలా ఉంటుంది గానీ, స్థానికంగా ఒక్కో వికీలో ఒక్కో రకంగా ఉండవు. మీరూ పరిశోధించండి. __చదువరి (చర్చ • రచనలు) 07:40, 20 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గౌడ్ గారు మీ ఆలోచన బావుంది, ప్రణయ్ చెప్పింది కూడా బావుంది, వాడుకరి కనీసం ఒక్క మార్పు చేసిన్ అతరువాత స్వాగత సందేశం చేర్చడం మంచిది. అలాగే రామారావు గారి సలహా మునుపు నేను అనుసరించినదే.. కాని తెలుగు వాడుకరి నామంతో ఇబ్బంది పడి మళ్ళీ ఆంగ్లంలోకి మార్పు చేయించుకున్నాను. కనుక అది మినహాయించి మిగతావి అమలు చేస్తే బావుంటుంది..B.K.Viswanadh (చర్చ) 08:15, 20 సెప్టెంబరు 2020 (UTC)
- యర్రా రామారావు గారూ బూతులు, అశ్లీల పదాలు, రోత పదాలను వాడుకరిపేరులో పెట్టకుండా వికీ నిబంధనలున్నాయి. కానీ తెలుగు మాత్రమే ఉండాలి అనే నిబంధన కుదరదనుకుంటాను. సింగిల్ సైనాన్ ఉంది కాబట్టి వివిధ వికీల్లో రాసే వాడుకరులు తమ వాడుకరిపేరు ఇంగ్లీషులోనే ఉంటేనే బాగుంటుందని (సింగిల్ సైనాన్ ఉన్నంత మాత్రాన తెలుగులో ఉండకూడదనేమీ లేదు) అనుకునే అవకాశం ఉంది. పైగా ఇలాంటి నిబంధనలు యావద్వికీ వ్యాప్తంగా ఒకేలా ఉంటుంది గానీ, స్థానికంగా ఒక్కో వికీలో ఒక్కో రకంగా ఉండవు. మీరూ పరిశోధించండి. __చదువరి (చర్చ • రచనలు) 07:40, 20 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ వంగరి గారూ, బాటు రాస్తే పనౌతుంది. కానీ ఆ పని చెయ్యగలవారు లేరు. ఏమైనప్పటికీ మీ ప్రతిపాదనను వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో రాయండి. ఆ పని చెయ్యగలవారు ముందుముందు ఎవరైనా వస్తే వారికి మన ఆవశ్యకత తెలుస్తుంది.
ఇలా అర్ధం లేకుండా లాగిన్ అవ్వటం తరువాత మిన్నకుండి పోవటం అన్ని భాషల వికీలో ఉన్న ఇబ్బందే !, అందుకనే కాబోలు ఈమధ్య వస్తున్న మొబైల్ ఆప్ లో మరియు ఇంటరుఫేసు లో లాగిన్ కు తక్కువ ప్రాధాన్యం వివ్వబడినది, చాలా మంది లాగింన్ అవ్వగానే , వారి పేరు ఎర్ర రంగులో ఉండటం వలన మొదట వారి వాడుకరి పేజీలొ వివరాలు రాసుకోవటం మెదలు పెడతారు, ఇలా వారు వాడుకరి పేజీ సృష్టించే మునుపే కొన్ని ఇలాంటి ప్రాధమిక విధానాలు ఒక పాప్ ఆప్ గానో లేదా యాంత్రిక మెసేజు గానో చూపిస్తే బాగుంటుంది ఇంకా అలా స్వాగత సందేశాలు ఇచ్చే వారికి మంచి మూస ( మెసేజ్ టెంప్లేట్ ) తయారు చేసి ఇచ్చినా బాగుటుంది ఇంకా మనకు ఇంగ్లీష్ లో వచ్చే "SuggestBot నుండి మీరు సవరించడానికి ఇష్టపడే కథనాలు" వంటి వి కూడా ఒక లక్షాన్ని నిర్దేశిస్తాయి . Kasyap (చర్చ) 16:48, 20 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రణయ్‌రాజ్ గారు, చదువరి గారు,బి.కె.విశ్వనాధ్ గారు, యర్రా రామారావు గారు, Kasyap గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఇది మీ మనసు లో ఎప్పటినుండో ఉండిన అంశమే... ఆంగ్ల వికీపీడియాలో పాటించే అంశం. కొత్తగా తెవిలో ఈ మార్పు మొదలవ్వాలని నా ప్రయత్నం... దీనిలో ప్రస్తుతం చురుగ్గా ఉన్న వారు గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీరామమూర్తి గారు, మూర్తి గారు వీరు ఇప్పటికే వారి దృష్టికి వచ్చినట్లు ఉంది. ఎక్కడ చర్చలలో చెప్పకపోయినా ఆచరణలో కొంత ఈ పద్ధతిలో స్వాగతం పలుకుతున్నారు. వారికి ధన్యవాదములు... ఇక ఈ కొత్త పద్ధతిని మొదలుపెట్టండి. తెవికీలో ఒకటైనా రచన చేసిన వాళ్లకే స్వాగత సందేశం పెడదామని వారి చర్చాపేజీలో ఈ అంశం పెడతాను.
ఇక చదువరి గారు, వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు ఆ పని చెయ్యగలవారు ముందు పెద్దలు గుళ్ళపల్లి నాగేశ్వరరావు గారు, శ్రీరామమూర్తి గారు, ఎంతో అనుభవం ఉన్న వారు బాటు అంశం చాలా పెద్ద వ్యవహారం కాబట్టి మీరు వీలైతే ఆ బాధ్యత తీసుకోవాలని నా అభ్యర్థన... ఒకవేళ వారికి అంత ఆసక్తి లేకపోతే నేను ఆ బాధ్యత స్వీకరించడానికి ఎలాంటి అభ్యంతరం లేదు... నా అనుభవం సరిపోతుందా అనే విషయం పెద్దలు మీరు నిర్ణయించండి, మీ అందరి స్పందనకు మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. Prabhakargoudnomula 08:05, 21 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, వికీపీడియా:బాటు సహాయానికి అభ్యర్ధనలు పేజీలో రాయమని చెప్పడంలో నా ఉద్దేశం, స్వాగతించే పని కోసం ఒక బాటు రాయాలని. (అలాంటి బాటు అసలు సంభవమైతే, మానవికంగా కాకుండా బాటే మన కోసం స్వాగతించే పని చేస్తుంది) అది మనకు చేతనైతే మనమే రాయవచ్చు. లేదంటే రాయమని అభ్యర్ధిస్తూ పైన నేను చూపిన పేజీలో రాయవచ్చు. బాటు రాయడం చేతనైన వారు అక్కడి మన అభ్యర్ధనను పరిశీలించి బాటు రాస్తారు. పై పేజీని అభ్యర్ధనలు రాసేందుకే సృష్టించారు. మీకు ఆ పేజీలో గత అభ్యర్ధనలు చూస్తే అర్థమౌతుంది. అంతేతప్ప బాటు రాయమని ఎవరినీ వ్యక్తిగతంగా అభ్యర్ధించమని నా ఉద్దేశం కానే కాదు. __చదువరి (చర్చ • రచనలు) 04:09, 30 సెప్టెంబరు 2020 (UTC)
మన అనువాదాల్లో మానవిక శాతమెంతో తెలుసుకోవడం ఎలా?
మార్చుఅనువాద పరికరం ద్వారా మనం చేసే అనువాదంలో మానవిక శాతమెంత, యాంత్రికానువాద శాతమెంత అని తెలుసుకునేందుకు కింది లింకును వాడవచ్చు. [12] మనం అనువాదం చేస్తూండగానే ఇది ఎప్పటికప్పుడు తాజా అవుతూ ఉంటుంది. ఈ లింకు గురించి తెలియని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశీలించండి. నేను ఈ రచ్చబండలో, పైన వివిధ విభాగాల్లో చూపిన గణాంకాలను ఈ లింకు నుండే తెచ్చాను. __చదువరి (చర్చ • రచనలు) 07:26, 21 సెప్టెంబరు 2020 (UTC)
- మరిన్ని వివరాలు:
- --> పైన చూపిన url కు వెళ్తే అక్కడ కింది తెరపట్టులో చూపిన ఫారం కనిపిస్తుంది.
- --> ఈ ఫారములో Source language వద్ద en అని ఇవ్వాలి (english అని పూర్తిగా ఇవ్వరాదు). Target language వద్ద te అనీ (telugu అని పూర్తిగా ఇవ్వరాదు), Source title వద్ద ఇంగ్లీషు వ్యాసం పేరునూ కింద చూపిన విధంగా ఇచ్చి, Find బొత్తాన్నినొక్కాలి. కింది తెరపట్టు చూడండి
- --> అప్పుడు కింద చూపిన విధంగా ఫలితం వస్తుంది.
- --> పై తెరపట్టులో అడుగున ఉన్న Progress లైనులో మనకు అవసరమైన సమాచారాన్ని కనిపిస్తుంది. any అంటే ఇంగ్లీషు వ్యాసాంలో మనం అనువదించిన భాగం (పై తెరపట్టులో 0.8446. అంటే 84.46%), mt అంటే అనువదించిన దానిలో యాంత్రికానువాద భాగం (పై తెరపట్టులో 0.5565. అంటే 55.65%), human అంటే అనువదించిన దానిలో మానవిక అనువాద భాగం (పై తెరపట్టులో 0.4434. అంటే 44.34%).
- అనువాద శాతాలకు సంబంధించినంత వరకూ మనకు అవసరమైనది ఇంతవరకే. ఇక ఆ పేజీ లోని మిగతా అంశాలను తీరుబడిగా మీ ఆసక్తి మేరకు పరిశోధించి చూడండి. __చదువరి (చర్చ • రచనలు) 14:10, 21 సెప్టెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు చదువరి గారు. చాలా ముఖ్యమైన, ఉపయోగకరమైన విషయాన్ని తెలియజేశారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:42, 21 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, మంచి useful tool ని పరిచయం చేసారు. అయితే కొత్త అనువాద వ్యాసాలకు 24 గంటలు గడిచిన తరువాత పై వివరాలు లభించవచ్చు అనుకుంటున్నాను. అనువాదం మీద సందేహాలను ఏ పేజీలో అడగవచ్చు. ఇవి specific doubts కాబట్టి రచ్చబండలో అడగడం బాగుండదేమో! (సంబంధిత వ్యాసం యొక్క చర్చా పేజీలోనా, సహాయ కేంద్రం లేదా ప్రత్యేకంగా అనువాద సందేహాల కోసం ఏదైనా పేజీ). ఓ నాలుగు పేరాల వ్యాసం భారతదేశంలో ఫ్లూ మహమ్మారి (1918) తీసుకొని అనువాదం ప్రారంభించాను. మొదటి పేరా correct చేసాను. భద్రపరిచింది. ప్రచురించబడింది కూడా. అయితే మిగిలిన 3 పేరాలను అనువాద టూల్ తో తిరిగి ప్రారంభించడం ఎలా? --Vmakumar (చర్చ) 10:13, 22 సెప్టెంబరు 2020 (UTC)
- Vmakumar గారూ, తొలి అనువాదాన్ని ప్రచురించినందుకు అభినందనలు. 24 గంటలు కాదండీ.. ఈ టూలు మనం అనువాదాలు చేసుకుంటూ పోతూంటే, అనువాద శాతాలను అప్పటికప్పుడే చూపించేస్తూంటుందండి. ప్రస్తుతం మీరు చేసిన అనువాదంలో 57.77% మానవిక అనువాదం ఉందని చూపిస్తోంది (ఆ పేజీలోని భాష నాణ్యతలో ఆ సంగతి కనబడుతూనే ఉంది లెండి. అనువాదమని చెబితే తప్ప తెలియదది). ఇక పోతే, ఒక సారి ప్రచురించేసిన తరువాత కూడా, మిగిలిపోయిన పేరాలను అనువదించి ప్రచురించేందుకు మూడు పద్ధతులున్నాయి..
- ఆ పేరాలను అనువదించి, మొదటిసారి చేసినట్టుగానే మళ్ళీ మళ్ళీ ప్రచురించవచ్చు. అయితే ఇందులో ఒక సమస్యుంది. అదేంటంటే.. మళ్ళీ ప్రచురించేటపుడు, పేజీలో నేరుగా చేసిన మార్పులేమైనా ఉంటే అవి పోతాయి. పరికరం నుండి వచ్చే కొత్త అనువాదంతో పేజీ మొత్తం తాజా అయిపోతుంది. ఈ సమస్య గురించి ఆ డెవలపరుతో మాట్లాడగా, ఆయన "అనువదించిన పేరాలను మాత్రమే ప్రచురించి, మిగతా పేరాలను ప్రచురించకుండా ఉండేలా పరికరంలో మార్పులు చేస్తామ"ని చెప్పారు. ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ, అది వస్తే మనకు గొప్ప మేలు చేకూరుతుంది. అసలు అర్జున గారు అడుగుతున్న మానవిక అనువాద శాతం తగ్గింపూ దానిపై నా అభ్యంతరమూ - ఈ వివాదమంతా అప్పుడు టీకప్పులో తుపానై పోతుందని నా ఉద్దేశం.
- ఇక రెండో పద్ధతి.. నేను సాధారణంగా ఈ పద్ధతినే అనుసరిస్తాను. అదేంటంటే అనువాదం చేసేసి, దాన్ని కాపీ చేసి పేజీలో పేస్టించడం.
- పోతే మూడో పద్ధతొకటుంది. అది పైన నేను చూపిన పరికరంలో ఉంది. ఆ పరికరం అప్పటి వరకూ మనం చేసిన అనువాదాన్ని యాంత్రిక/మానవిక అనువాదాలు విడివిడిగాను, వ్యాసం మునుజూపు గాను, వికీటెక్స్టు గానూ కూడా చూపిస్తుంది. వాటిలో మనకు అనువైన దాన్ని కాపీ చేసుకుని పేజీలో పేస్టించుకోవచ్చు.
- పరిశీలించండి సార్. __చదువరి (చర్చ • రచనలు) 10:44, 22 సెప్టెంబరు 2020 (UTC)
- @Vmakumar: గారూ నా మార్పులు అన్న దగ్గర కర్సర్ ఉంచితే >> డ్రాప్‌డౌన్ మెనూ వస్తే దానిలో అనువాదాల మీద క్లిక్ చేస్తాం కదా >> మీకు అనువాద ఉపకరణం ఓపెన్ అవుతుంది. >> పైన కాస్త ఎడమచేతివైపుకు "పురోగతిలో ఉన్నవి" అన్న టాబ్‌లో మీకు మీరు అనువదిస్తున్న ఈ వ్యాసం కనిపిస్తుంది. క్లిక్ చేస్తే >> అనువాద ఉపకరణంలో మీరు అనువదిస్తున్న వ్యాసం ఎంతవరకూ అనువదించారో అక్కడిదాకా కనిపిస్తుంది. >> కిందకి వెళ్ళి కావాల్సిన పేరా ఉండాల్సిన చోట క్లిక్ చేస్తే >> మీకు అనువాద పాఠ్యం వస్తుంది. ఇంకేముంది అనువదించెయ్యడమే. --పవన్ సంతోష్ (చర్చ) 10:51, 22 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, పవన్ సంతోష్ గార్లకు కృతజ్ఞతలు. మిగిలిన 3 పేరాలు కాపీ చేసి పేజీలో పేస్ట్ చేసుకొంటే సింపుల్. అయితే అలా టూల్ బయట చేసిన అనువాదాన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తే అటువంటి వ్యాసానికి సంబందించిన మానవీయ అనువాద స్థాయి స్టాటిస్టిక్స్ కరెక్టుగా ప్రతిఫలించకపోవచ్చేమో అనిపిస్తుంది. పవన్ సంతోష్ గారి సలహా ప్రకారం పాత అనువాదాన్ని టూల్ తోనే కంటిన్యూ చేద్దామని ప్రయత్నిస్తున్నాను. అయితే ఇంతకుముందు మెషిన్ చేసిన రెండవ పేరా యొక్క అనువాదాన్ని పొరపాటుగా నేను delete చేసాను. దానితో ఇప్పుడు రెండవ పేరాను అనువాద కంటిన్యూ చేద్దామంటే +అనువదించండి బాక్స్ లో బ్లాంక్ గా వస్తుంది. (పొరపాటున ఇంతకుముందు ప్రచురించిన అనువాదంలో రెండవ పేరా పూర్తిగా బ్లాంక్ గా ప్రచురితమైంది కావచ్చు.) అందుకే మళ్ళీ రెండవ పేరాను బయట అనువాదం చేసేసి, దాన్ని కాపీ చేసి పేజీలో పేస్ట్ చేస్తున్నాను. తిరిగి 3, 4 పేరాలను పవన్ సంతోష్ గారి పద్దతిలో చూడాలి. కృతజ్ఞతలు. ఈ రోజులోపల ఏదో ఒక టైంలో సెట్ రైట్ చేయగలనని నమ్మకంతో --Vmakumar (చర్చ) 12:13, 22 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, మంచి మంచి విషయాలను పరిచయం చేస్తున్నారు, ధన్యవాదాలు వ్యాసాలను ఇంకా తొందరగా వ్రాయడానికి అవసరమైన మరిన్ని ఇలాంటి పరికరాలు ఇంతకుముందు మీరు చెప్పి ఉన్న... మరొక సారి నాలాంటి వారి కోసం అప్పుడు 1, అప్పుడు 1 వివరించగలరు. ధన్యవాదాలు... Prabhakargoudnomula 14:38, 22 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, మనకు తెలిసిన సంగతులు సాధారణంగా చాలామందికి తెలిసే సంగతులే అయినప్పటికీ, కొత్తవారికీ తెలియనివరెవరైనా ఉంటే వారికీ అవి పనికొస్తాయేమోనని నేను భావిస్తాను. అందుకే నాకు తెలిసిన సంగతులను అప్పుడప్పుడూ ఇక్కడ రాస్తూనే ఉంటానండి. ఇకముందూ రాస్తాను. అసలు మనం ఒక నాలెడ్జి బేస్ పేజీ పెట్టుకుని ఇలాంటి కిటుకులు, చిట్కాలన్నిటినీ అందులో రాస్తూ పోతే బాగుంటుందేమో కదా.. అన్నీ ఒక్కచోటే ఉంటాయి. అవసరమనుకుంటే పెద్ద అంశాలకు ప్రత్యేకంగా ఒక పేజీ పెట్టుకోవచ్చు. అలాగే ఆయా అంశాలను ఇప్పటికే "వికీపీడియా" పేరుబరిలో ఉన్న నాలెడ్జి బేస్ వ్యాసాల్లో చేర్చవచ్చు. చేద్దాం, అందరం కలిసి ఆ పని చేద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 02:34, 23 సెప్టెంబరు 2020 (UTC)
- "అసలు మనం ఒక నాలెడ్జి బేస్ పేజీ పెట్టుకుని ఇలాంటి కిటుకులు, చిట్కాలన్నిటినీ అందులో రాస్తూ పోతే బాగుంటుందేమో కదా.. అన్నీ ఒక్కచోటే ఉంటాయి."చదువరి గారూ, ఈ ఆలోచన బాగుంది. ఇది అమలు చేద్దాం. మా బోటివాళ్ళు ఎక్కువ మంది సులభంగా తెలుసుకోవటానికి వీలుపడుతుంది.దీనితోటే అలాంటి తెవికీ చిట్కాలు, మెళుకువలు పేజీ నొకదానిని మొదలుపెట్టగలరు.--యర్రా రామారావు (చర్చ) 03:20, 23 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, మనకు తెలిసిన సంగతులు సాధారణంగా చాలామందికి తెలిసే సంగతులే అయినప్పటికీ, కొత్తవారికీ తెలియనివరెవరైనా ఉంటే వారికీ అవి పనికొస్తాయేమోనని నేను భావిస్తాను. అందుకే నాకు తెలిసిన సంగతులను అప్పుడప్పుడూ ఇక్కడ రాస్తూనే ఉంటానండి. ఇకముందూ రాస్తాను. అసలు మనం ఒక నాలెడ్జి బేస్ పేజీ పెట్టుకుని ఇలాంటి కిటుకులు, చిట్కాలన్నిటినీ అందులో రాస్తూ పోతే బాగుంటుందేమో కదా.. అన్నీ ఒక్కచోటే ఉంటాయి. అవసరమనుకుంటే పెద్ద అంశాలకు ప్రత్యేకంగా ఒక పేజీ పెట్టుకోవచ్చు. అలాగే ఆయా అంశాలను ఇప్పటికే "వికీపీడియా" పేరుబరిలో ఉన్న నాలెడ్జి బేస్ వ్యాసాల్లో చేర్చవచ్చు. చేద్దాం, అందరం కలిసి ఆ పని చేద్దాం. __చదువరి (చర్చ • రచనలు) 02:34, 23 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, యర్రా రామారావు గారు, మెళుకువల పేజీ ప్రతిపాదన వెంటనే అమలు చేయండి... ధన్యవాదాలు... Prabhakargoudnomula 09:19, 23 సెప్టెంబరు 2020 (UTC)
కొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం ఓటు ఫలితం, తదనంతర క్రియలు
మార్చుకొత్త యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ విధానం ఓటు ఫలితం వెలువడింది. 610 మంది అర్హులైన సభ్యులలో 34 మంది (చెల్లిన ఓట్లు వేసినవారు) అనగా 5.5 శాతం ఓటు ప్రక్రియలో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు వికీ విధాన నిర్ణయాలలో ఇది ఒక రికార్డు అని భావిస్తాను. వారందరికి నా ధన్యవాదాలు. దీనిపై తదనంతర క్రియలు అనగా ఫలితంపై అభ్యంతరాలు మూడు రోజులలో, ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకో దగినివి వారం రోజులలో స్పందనల ద్వారా తెలపండి. విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి రెండవ సారి వాడినందున దానిపై సందేహాలు లేక దానిని మెరుగు పరచటం గురించి చర్చించవలసినవి దాని చర్చాపేజీలో చేర్చవలసినది.-- అర్జున (చర్చ) 09:28, 21 సెప్టెంబరు 2020 (UTC)
- పైన తెలిపిన తదనంతర క్రియల చర్చలలో గతం చర్చలలో,లేక ఓటు ప్రక్రియలో పాల్గొన్న వారిలో కొద్ది మందే పాల్గొంటున్నారు. మీరు గత చర్చలలో, ఓటు ప్రక్రియలో పాల్గొనినా, పాల్గొనకపోయినా, అన్ని అభిప్రాయాలు విలువైనవే., కావున పాల్గొనమని వినతి. --అర్జున (చర్చ) 23:17, 24 సెప్టెంబరు 2020 (UTC)
- పై చర్చలు ముగిసాయి. అభ్యంతరాలను పరిశీలించి ఫలితం ఖరారు చేశాను. భాష పరంగా వున్న ప్రస్తుత యాంత్రిక అనువాద స్థాయి పరిమితి 70 శాతాన్ని తొలగించాలి అనే ప్రధానాంశం గల ప్రతిపాదన తిరస్కరించబడింది. కావున ప్రస్తుత నియంత్రణ విధానం కొనసాగుతుంది. 60 రోజుల తర్వాత ఈ విధానం మార్పుపై ఆసక్తిగల సభ్యులు కొత్త విధానానికి చర్చను ప్రారంభించవచ్చు.
- ప్రక్రియ నుండి సముదాయం నేర్చుకో దగినివి విభాగాన్ని చర్చలో పాల్గొనని నిర్వాహకుడు సారాంశాన్ని {{Discussion top}} తో చర్చ పై భాగంలో, {{Discussion bottom}} క్రింది భాగంలో చేర్చితే ముందు కాలంలో ఈ చర్చలు చదివేవారికి ఉపయోగంగా వుంటుంది.
- విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి చర్చాపేజీలో పద్ధతిని మెరుగుపరచటానికి అంశాలు చేర్చబడినాయి. వాటిని చర్చించండి.
- సుదీర్ఘంగా జరిగిన చర్చలు, ఓటు ప్రక్రియ, తదనంతర చర్చలు కొందరికి విసుగు కల్పించినట్లు తెలిపారు, కొందరి సమయాన్ని వృధాచేస్తున్నట్లుగా కూడా తెలిపారు. నా దృష్టిలో వ్యాసపేజీల మార్పులకు ఎంతవిలువుందో చర్చలకు కూడా అంతే విలువుంది. అయితే చర్చలు సామరస్యంగా జరగకపోతే పై అభిప్రాయాలు ఏర్పడవచ్చు. చర్చలలో పాల్గొన్నప్పుడే మనం వ్యక్తిగతంగా మెరుగుపడతామని, తెవికీ అభివృద్ధి దిశగా పయనిస్తుందని నేను గాఢంగా నమ్ముతాను. గతంలోకూడా వాడి వేడి చర్చలు జరిగిన తర్వాత నేను చేసిన పని కాని, ఇతరులు చేసిన పని చూస్తే వికీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నదనే నాకు అనిపిస్తున్నది.
- ఈ ప్రక్రియ వలన ఇబ్బంది కలిగినట్లు అనిపించిన వారికి నా క్షమాపణలు. నా కృషిపై గాని, ఈ ప్రక్రియలో నా పనితీరుపై గాని మీరు వ్యక్తిగతంగా స్పందించదలచుకుంటే నా వాడుకరిపేజీలో వ్యాఖ్య ద్వారా గాని లేక వాడుకరిపేజీ ద్వారా ఈ మెయిల్ పంపించటం గాని చేయండి. ఇది వికీలో మరింత మెరుగుగా పనిచేయడానికి నాకు సహకరిస్తుంది. మీ సహకారానికి ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 08:56, 29 సెప్టెంబరు 2020 (UTC)
కొత్త సూచనల పేజీ
మార్చువికీపీడియాలో మనం గమనించిన కొత్త, పాత విశేషాల గురించి తోటి వాడుకరులతో పంచుకునేందుకు వికీపీడియా:వాడుకరులకు సూచనలు ఒక కొత్త పేజీని సృష్టించాను. దీనికి స్ఫూర్తి, పైన మన అనువాదాల్లో మానవిక శాతమెంతో తెలుసుకోవడం ఎలా? విభాగంలో జరిగిన ఈ చర్చ. ఇక్కడ మనం తెలుసుకున్న విషయాల గురించి రాయవచ్చు. ఆ విశేషం పాతదైనా, ఎక్కువ మంది వాడుకరులకు తెలియకపోవచ్చు అనిపించినపుడు అక్కడ రాయవచ్చు. ఎక్కడ ఎవరైనా రాయవచ్చు. రాసిన విషయం గురించి రచ్చబండలో లింకు ఇస్తూ ఒక చిన్న నోటిఫికేషను ఇస్తే వాడుకరులందరికీ తెలుస్తుంది. అక్కడ రాసే విశేషం మిగతా "వికీపీడియా:", "సహాయం:" పేరుబరి లోని పేజీల్లాగా ఫార్మల్ గా ఉండనక్కర్లేదు. కొంత చర్చా ధోరణిలో, ఇన్‌ఫార్మల్ గా ఉన్నా పరవాలేదు. పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 08:53, 24 సెప్టెంబరు 2020 (UTC)
మహాత్మాగాంధీ 2020 ఎడిట్-ఎ-థాన్
మార్చుఒక సూచన - మహాత్మాగాంధీ 2020 ఎడిట్-ఎ-థాన్ , ఈ సంవత్సరం అక్టోబర్ 2, 3 తేదీల్లో నిర్వహించబడుతున్న మినీ ఎడిట్-ఎ-థాన్. ఏదైనా వికీమీడియా ప్రాజెక్ట్ లో మహాత్మాగాంధీకి సంబంధించిన కంటెంట్ ను మెరుగుపరచడమే ఈ ఎడిట్-ఎ-థాన్ యొక్క లక్ష్యం. రిజిస్టర్డ్ వికీమీడియా అకౌంట్ తో ఉన్న ఏ వికీమీడియన్ అయినా ఈ వికీ ఈవెంట్ లో పాల్గొనవచ్చు. వాడుకదారులు దయచేసి https://meta.wikimedia.org/wiki/Mahatma_Gandhi_2020_edit-a-thon ఇక్కడ నమోదు చేసుకోగలరు. Kasyap (చర్చ) 14:47, 27 సెప్టెంబరు 2020 (UTC)
Mahatma Gandhi edit-a-thon on 2 and 3 October 2020
మార్చుPlease feel free to translate the message.
Hello,
Hope this message finds you well. We want to inform you that CIS-A2K is going to organise a mini edit-a-thon for two days on 2 and 3 October 2020 during Mahatma Gandhi's birth anniversary. This is not related to a particular project rather participants can contribute to any Wikimedia project (such as Wikipedia, Wikidata, Wikimedia Commons, Wikiquote). The topic of the edit-a-thon is: Mahatma Gandhi and his works and contribution. Please participate in this event. For more information and details please visit the event page here. Thank you. — User:Nitesh (CIS-A2K) Sent using MediaWiki message delivery (చర్చ) 11:24, 28 సెప్టెంబరు 2020 (UTC)
|
(సహాయం ఎలా కోరాలో చూడండి)
|
అంతర్వికీ లింకుల గురించి..
మార్చుఅంతర్వికీ లింకుల గురించి కొంత సమాచారాన్ని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో చేర్చాను. పరిశీలించి, మార్పుచేర్పులేమైనా అవసరమైతే చేసెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 04:58, 29 సెప్టెంబరు 2020 (UTC)
- చదువరి గారు, సార్ నేను కూడ -మరియు, -యొక్క తొలగింపుల విదానం గురించి కొంత సమాచారాన్ని వికీపీడియా:వాడుకరులకు సూచనలు పేజీలో చేర్చాను. మీరు చూసి ఉంటారు కాని వాడలేదు, అందుకే మీ అభిప్రాయం చెప్పలేదు, అనుకుంటున్నా పరిశీలించి, మార్పుచేర్పులేమైనా అవసరమైతే చేసెయ్యండి. కొత్త వాడుకరులకు ఏమైనా ఉపయోగపడుతుంది ఆటో విక్కీ బ్రౌజర్ ఇంకా వాడని నాలాంటి వారి కోసం ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నేను వాడే పద్ధతి ఇదే ఒకసారి దాన్ని పరిశీలించండి, నాకు చెప్పడం రాలేదు అని నా అనుమానం. ఎవరైనా ఈ పద్ధతి వాడి చూడండి ... ఎర్ర రామారావు గారు మీరు లేదా ఎవరైనా వాడి చూడగలరు. మీ అనుభవం చెప్పాల్సిందిగా మనవి. అర్థం కాకపోతే అడగండి చెప్తా. ధన్యవాదాలు. ప్రభాకర్ గౌడ్ నోముల(చర్చ)• 07:33, 29 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రభాకర్ గారూ, ఇక్కడ మీరు నాకు పంపిన నోటిఫికేషన్ను చూసాను. తరువాత సమాధానం ఇద్దామనుకుని మర్చిపోయాను... సారీ. దానిపై నా అభిప్రాయాలివి:
- నిజానికి "మరియు" వర్జితమే గానీ, "యొక్క" అనేది కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుందని నాకు అనిపిస్తోంది. అంచేత మీరన్నట్లు "మరియు" ను మూకుమ్మడిగా వెతికి, మార్చవచ్చు (అది కూడా కొన్ని పరిమితులతో). "యొక్క"ను మార్చలేం.
- "మరియు" స్థానంలో ఏం పెట్టాలో మీరు రాయలేదు. చాలా సందర్భాల్లో సింపులుగా ఏమీ పెట్టకుండా వదిలెయ్యలేం. అలాగే "మరియు" కు ముందొక స్పేసు, తరువాతొక స్పేసూ ఉంటాయి. సింపులుగా "మరియు" అనే మాటను తీసేస్తే ఆ తరువాత ఆ స్థానంలో "రెండు స్పేసులు" మిగుల్తాయి. అంచేత " మరియు" ("ఒక స్పేసు"+"మరియు") ను వెతికి తీసేస్తే బాగుంటుంది.
- "మరియు"ను మూకుమ్మడిగా మార్చేటపుడు కొన్ని ఇబ్బందులున్నాయి. అవేంటంటే ఒక జాబితాలో చివరి పదానికీ దాని ముందు పదానికీ మధ్య ఉన్న "మరియు"ను తీసేసి కామా పెట్టెయ్యొచ్చు. ఇది మూకుమ్మడిగా చెయ్యొచ్చు. కానీ ఇంగ్లీషులో కంజంక్షనుగా "అండ్" ను వాడిన సందర్భంలో దాని స్థానంలో అనువాద పరికరం పెట్టే "మరియు" ను అలా మార్చరాదు. వాక్య నిర్మాణాన్ని మార్చాల్సి ఉంటుంది. ఉదాహరణ పూర్వకంగా చెబుతాను
- రాముడు, సీత మరియు లక్ష్మణుడు అడవికి బయల్దేరారు. అనే దాన్ని రాముడు, సీత, లక్ష్మణుడు అడవికి బయల్దేరారు అని రాసెయ్యొచ్చు.
- భారత దళాలు పాకిస్తాను ప్రతిఘటనను అణచివేసాయి మరియు లాహోర్‌ను ముట్టడించాయి అనేదాన్ని భారత దళాలు పాకిస్తాను ప్రతిఘటనను అణచివేసి, లాహోర్‌ను ముట్టడించాయి అని రాస్తాం గానీ పై ఉదాహరణలో లాగా రాయం. కదా? పరిశీలించండి. అలాగే "మరియు"తో మొదలయ్యే వాక్యాల విషయం లోను, ఇతర సందర్భాల్లో వాడినపుడూ ఏం చెయ్యాలో కూడా పరిశీలించండి.
- చివరిగా.., ఫైండ్ - రీప్లేస్ అనేది దిద్దుబాటు సమయంలో సాధారణంగా చేసే సెమీ ఆటోమేటెడ్ చర్య. దాన్ని ప్రత్యేకించి "మరియు" కోసం ఇలా వాడాలి అని చెప్పనక్కర్లేదు అని నా అభిప్రాయం.
- పరిశీలించండి. __చదువరి (చర్చ • రచనలు) 06:36, 1 అక్టోబరు 2020 (UTC)
- ప్రభాకర్ గారి పరిశీలనార్థం __చదువరి (చర్చ • రచనలు) 06:37, 1 అక్టోబరు 2020 (UTC)
అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు అక్టోబర్ 1 నుంచి 30 వరకూ
మార్చు"అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు" ప్రారంభించుకుందాం అన్న విభాగంలో ఈ ఋతువును అక్టోబర్ 1 నుంచి ప్రారంభించుకుని నవంబరు 30 వరకూ కొనసాగిద్దామని ప్రతిపాదించగా, చదువరి గారు, రాజశేఖర్ గారు అక్టోబర్ 1 నుంచి 15 వరకూ వికీసోర్స్ ప్రూఫ్‌రీడథాన్ ఉంటుందని కాబట్టి ముందుకు జరపమనగా నవంబర్ 1 నుంచి 30 వరకూ చేసుకుందామని ముందు అనుకున్నాం. ఐతే, సీఐఎస్-ఎ2కె వారు తుదకు నవంబరు 1 నుంచి 15 వరకూ దీన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి, అనువాద ఉపకరణంతో వ్యాస రచన ఋతువు అన్నది ఈ అక్టోబర్ 1 నుంచి 31 వరకూ నిర్వహించుకుందాం.
దీని ప్రధాన నియమాలు:
- ప్రధానంగా వ్యాసాలను అనువాద ఉపకరణం వాడి తెలుగులో ప్రచురించాలి. కనీసం 10 వేల బైట్ల పైచిలుకు వ్యాసం రూపొందించాలి. అందులో 8 వేల బైట్లు అనువాద ఉపకరణంలోనే అనువదించి తయారుచేసినదై ఉండాలి.
- అక్టోబర్ 1 నుంచి 30 వరకూ అనువదించిన వ్యాసాలను (కొత్తగా సృష్టించినా, ఉన్న మొలకలు విస్తరిస్తూ ప్రచురించినా) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం.
- వ్యాసాల్లో అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు, అనువాద దోషాలు ఉండకూడదు. ఈ ప్రాతిపదికల మీదే నవంబరులో సమీక్ష జరుగుతుంది. ఆ సమీక్షలో నిలబడిన వ్యాసాలే ఈ ఎడిటథాన్ వ్యాసాల్లో ఉంటాయి.
ఎన్ని వ్యాసాలు ఎవరెవరు రాశామన్న దానిపై ఏదైనా గుర్తింపు/ప్రోత్సాహం ఇచ్చుకోవడంపై ఆలోచించవచ్చు. అలాగే, దీనిపై ప్రాజెక్టు పేజీ ఈ ఉన్న ఒక్కరోజులోనే చేద్దాం, ఇక్కడే పంచుకుంటే ఆసక్తి ఉన్నవారందరూ సంతకం చేసి పాల్గొనడం మొదలుపెట్టవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 14:37, 29 సెప్టెంబరు 2020 (UTC)
- వికీసోర్సులో @Rajasekhar1961: గారు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ప్రూఫ్‌రీడథాన్ అన్నది చాలా ఉపయోగకరమైన పని. కాబట్టి, దానికి మరో మంచి పని అడ్డుగా రాకూడదని ఈ మార్పుచేస్తున్నాను --పవన్ సంతోష్ (చర్చ) 14:39, 29 సెప్టెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:51, 29 సెప్టెంబరు 2020 (UTC)
- నేను సిద్ధం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:03, 29 సెప్టెంబరు 2020 (UTC)
- ప్రాజెక్టు పేజీ తయారుచేయండి. సమిష్టి కృషితో వ్యాసాలను రాయడానికి నేను సిద్ధం. – K.Venkataramana – ☎ 15:17, 29 సెప్టెంబరు 2020 (UTC)
- నేనూ సిద్ధమే.--యర్రా రామారావు (చర్చ) 07:22, 30 సెప్టెంబరు 2020 (UTC)
- ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 14:51, 29 సెప్టెంబరు 2020 (UTC)
@K.Venkataramana:, @యర్రా రామారావు:, @Pranayraj1985: గార్లకు ధన్యవాదాలు. ఇలా ఉత్సాహంగా ముందుకు రావడం ఎంతో సంతోషదాయకం. ఐతే, ఇది ఇప్పటికిప్పుడు అనుకున్నది కాబట్టి ప్రాజెక్టు పేజీ ఈ వారాంతంలోపుగా ప్రారంభిస్తాను. ఐతే అక్టోబర్ 1 (అంటే నిన్న) నాటి నుంచి అనువాద ఉపకరణంతో చేసిన అనువాద వ్యాసాలన్నీ పరిగణించవచ్చు కాబట్టి మీరు ఇంతలో రాస్తూ ఉండండి. ఈ అసౌకర్యానికి క్షమించమని కోరుతున్నాను. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి ప్రాజెక్టు పేజీ సముదాయం ముందుంచుతాము. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 16:37, 2 అక్టోబరు 2020 (UTC)
- నేను ఈ ప్రాజెక్టులో భాగంగా అక్టోబర్ 1 (మొన్నటి) నుండి ఆ పనిలోనే ఉన్నాను.--యర్రా రామారావు (చర్చ) 04:09, 3 అక్టోబరు 2020 (UTC)
- నేగూడా! :) __చదువరి (చర్చ • రచనలు) 04:35, 3 అక్టోబరు 2020 (UTC)
- ప్రాజెక్టు పేజీ తయారు చేశాను. ఇదిగోండి: వికీపీడియా:వికీప్రాజెక్టు/అనువాద ఉపకరణంతో వ్యాసరచన ఋతువు 2020 ఆసక్తి గలవారందరూ వచ్చి పాల్గొనవలసిందిగా, మెరుగుపరచవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:02, 3 అక్టోబరు 2020 (UTC)
Wiki of functions naming contest
మార్చుPlease help translate to your language
నమస్తే. Please help pick a name for the new Wikimedia wiki project. This project will be a wiki where the community can work together on a library of functions. The community can create new functions, read about them, discuss them, and share them. Some of these functions will be used to help create language-independent Wikipedia articles that can be displayed in any language, as part of the Abstract Wikipedia project. But functions will also be usable in many other situations.
There will be two rounds of voting, each followed by legal review of candidates, with voting beginning on 29 September and 27 October. Our goal is to have a final project name selected on 8 December. If you would like to participate, then please learn more and vote now at meta-wiki. కృతజ్ఞతలు! --Quiddity (WMF)21:22, 29 సెప్టెంబరు 2020 (UTC)
వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష
మార్చువాడుకరులపై విధించే నిరోధాలపై సమీక్షకు వెళ్ళే అవకాశాన్ని కల్పిస్తూ ప్రతిపాదించిన విధానం ఆమోదం పొందింది. రదనుగుణంగా వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష విధానం ఏర్పాటైంది. వాడుకరులు పరిశీలించవలసినది. ఈ విధానాన్ని ఒకటి ఉండాలని ఈ చర్చ ద్వారా సముదాయం నిర్ణయించింది. ఆ మేరకు తరువాత జరిగిన ఈ విధాన చర్చలో విధివిధానాలను ఆమోదించింది. పర్యవసానంగా ఈ విధానం అమల్లోకి వచ్చింది.
ఇక, తదుపరి చర్యగా ఈ విధానాన్ని అనుసరించి సమీక్షా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అందులో ఉండే ముగ్గురు సభ్యుల కొరకు పేర్లను ఈ విధానపు చర్చాపేజీలో ప్రతిపాదించవలసినదిగా వాడుకరులను కోరుతున్నాను. ఎందరి పేర్లనైనా ప్రతిపాదించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 05:35, 30 సెప్టెంబరు 2020 (UTC)