పాత చర్చ 87 | పాత చర్చ 88 | పాత చర్చ 89

alt text=కేలండర్ రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2022-06-01 : 2023-07-31

ఛాట్ జిపిటిలో వచ్చే సమాచారం

మార్చు

ప్రస్తుతం ఛాట్ జిపిట్ అనే కృత్రిమ మేధస్సు సంబంధించిన ఒక సౌకర్యం, ఇంటర్‌నెట్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఛాట్‌జిపిట్ ఇస్తున్న అనేక సౌకర్యాలలో, వాడుకరి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఆ కృత్రిమ మేధస్సు (పేరు ఛాట్ జిపిటి) ఇవ్వటం. ఈ జవాబులు చాలా వివరంగానూ, ఎంతో ప్రామాణింకంగానూ ఉంటున్నాయని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఇప్పుడు వికీపీడియాలో ఛాట్ జిపిటిలో తెలుసుకున్న/సంపాయించిన సమాచారం వ్యాసాల్లో వ్రాయవచ్చా? వ్రాస్తుంటే, ఛాట్ జిపిటిని ఒక "సోర్స్" కింద ఉట్టంగించటం తప్పనిసరి అని నా అభిప్రాయం.

ఇప్పటికే ఈ విషయం మీద చర్చ జరిగి ఉండకపోతే, తగిన విధంగా చర్చించి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవచ్చని ఇక్కడ ఈ శీర్షిక ఉంచటం జరిగింది. 115.98.112.58 00:11, 2 జూన్ 2023 (UTC)Reply

సోర్స్ అనేది ఆ విషయం మీద ధృవీకరణతో పాటు మరింత సమాచారం తెలుసుకోవడానికి వీలు కలిపిస్తుంది అది వ్యక్తిగత డైనమిక్ లింక్ కాబట్టి ఛాట్ జిపిటిని ఒక "సోర్స్ గా ఇవ్వలేము, నా అభిప్రాయం ప్రకారం కృత్రిమ మేధస్సు ద్వారా వ్యాస పాఠ్యం తయారుచేసుకొన్నా అందులో దృవీకరించవలసిన మూలాలను ఆయా స్తోర్సులు వెతికి ఇవ్వాలి --Kasyap (చర్చ) 09:05, 2 జూన్ 2023 (UTC)Reply
ఏదో ఒక దిన/వార/మాస/త్రైమాశిక పత్రికలో వచ్చే సమాచారం ఎంతవరకూ నమ్మతగినది? వికీపీడియాలో చాలా చోట్ల సోర్స్ అని చూపిన వాటిల్లో ఎక్కువగా పత్రికల్లో వచ్చిన వ్యాసాలే కదా.ఆ వ్యాసం వ్రాసిన రచయిత ఎక్కడనుంచి ఆ వివరాలు కలెక్ట్ చేశారు?  ఆపైన ఆయా సోర్సులను ఎవరైనా ఎప్పుడైనా వెరిఫై చేసే అవకాశం ఉన్నదా? ఆ వ్యాసం ప్రచురించబడ్డ పత్రిక కాపీ దొరికినవారు మాత్రమే వెరిఫై చెయ్యగలరు. అటువంటి వాటిని కూడా  నమ్మతగిన సోర్స్ కింద మనం వ్రాయగలిగినప్పుడు, ఒక వ్యవస్థగా, కృత్రిమ ఇంటిలిజెన్స్ ప్లాట్‌ఫాం లోకి తగిన పరిశోధన, వెరిఫికేషన్ తరువాత వచ్చిన సమాచారం,  సోర్స్ కింద చాట్‌జిపిటి లో వచ్చిన సమాచారం, ఎవరికి వారు ఎప్పుడైనా ఎక్కడనుంచైనా వెరిఫై చేసే అవకాశం ఉన్నది కాబట్టి  వికీపీడియాలో ఉదహరించవచ్చని నా అభిప్రాయం. 115.98.112.64 02:34, 4 జూన్ 2023 (UTC)Reply
చాట్ జీపీటీ ఇచ్చే సమాచారం "తగిన పరిశోధన, వెరిఫికేషన్ తరువాత వచ్చిన సమాచారం" కాదు. సరికదా, చాట్ జీపీటీ తనకు తెలియని విషయాలపై తరచు అబద్ధాలు చెప్తుందని, ఊహలు కల్పించి చెప్తుందని నిరూపణ అయింది: ఈ ముక్క చాలా పత్రికలు, పరిశోధనలు చెప్పాయి. అవన్నీ పక్కన పెడితే మీరు ఇంతగా విశ్వసిస్తున్న చాట్ జీపీటీయే. ఆ సంగతి చెప్తుంది, ఇదిగోండి లంకె: How reliable chat gpt information is? అని నేనడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానం చూడండి. మీరడిగినా అదే సమాధానం చెప్పొచ్చు.
"మోడల్ (చాట్ జీపీటీ) ఇచ్చే ప్రతిస్పందనలు ఖచ్చితమైనవిగా ఉండేలా చూసేందుకు కృషి జరుగుతున్నప్పటికీ ఇది అప్పుడప్పుడు తప్పుడు సమాచారాన్ని, నమ్మదగని సమాచారాన్ని ఇవ్వగలదు." అని చాట్ జీపీటీయే చెప్తోంది. కనుక మనం చాట్ జీపీటీని ప్రస్తుతం మూలంగా ఉదహరించడం ఆమోదయోగ్యం కాదు. పవన్ సంతోష్ (చర్చ) 10:31, 9 జూన్ 2023 (UTC)Reply

నిర్వాహకత్వ, అధికారి బాధ్యతల నుండి వైదొలగుతున్నాను

మార్చు

గత రెణ్ణెల్లుగా నేను వికీలో చురుగ్గా లేను. మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పనిచేసే అవకాశం లేదు. ఈ కారణంగా నాకున్న నిర్వాహకుడు, అధికారి అనే రెండు బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నాను. అంచేత ఈ రెండు బాధ్యతల నుండి తప్పించమని స్టీవార్డులను అభ్యర్థించాను. ఒక రోజులో వాళ్ళు తమ పని చేస్తారు.

బాధ్యతలను నిర్వహించలేని పరిస్థితిలో ఉన్న నిర్వాహకుల పట్ల వికీపీడియా:నిర్వాహకత్వ హక్కుల ఉపసంహరణ మార్గదర్శకం ఉంది మనకు. ఆ విధానం ప్రకారం కొన్నాళ్ళ తరవాతైనా ఈ నిర్ణయం తీసుకోవాలి. కానీ మరి కొన్నాళ్ళ పాటు ఇక్కడ పని చేసే వీలు నాకు ఉండదని ఎలాగూ తెలుసు కాబట్టి అప్పటి వరకు ఆగదలచుకోలేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

సముదాయం లోని సహచరులందరికీ నమస్కారాలు. ఉంటాను. __చదువరి (చర్చరచనలు) 13:30, 2 జూన్ 2023 (UTC)Reply

మీరు గత రెండు మాసాలు నుండి వికీలో ఆక్టివ్ గా లేని లోటు బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ నిర్ణయం ఇంకా వికీకి తీరని లోటు అని నా అభిప్రాయం.సాధ్యమైనంత త్వరలో శలవు నుండి మరలా మీరు వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుతూ, గతంలో మీరు వికీలో ఎవరూ ఊహించని స్థాయిలో అభివృధ్ధి చేసినందుకు, అవసరమైనవారికి తగిన సలహాలూ సూచనలూ అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:12, 2 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారూ, రామారావు గారు చెప్పినట్టు మీరు లేని వికీ నిర్వహణ కొంచెం కష్టమైనదే. మీకు కుదిరినపుడల్లా ఒక వాడుకరిగానైనా వికీలో మీ సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:58, 3 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారూ, మీ కృషిలాగానే నిబద్ధత కూడా సాటిలేనదని మరోసారి నిరూపణ అయింది. మీరు మళ్ళీ త్వరలోనే తిరిగి తెలుగు వికీపీడియాలో సచేతనం అవుతారని మీతో కలసి పనిచేసే అవకాశం మళ్ళీ కల్పిస్తారని ఆశిస్తున్నాను. మీ పునరాగమనం కోసం వేచిచూస్తూ పవన్ సంతోష్ (చర్చ) 10:16, 9 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారు, తెలుగు వికీకి మీ మార్గదర్శకత్వం చాలా అవసరం. నేను వికీలో చేరిన నాటి నుండి మీ నిర్వహణ శైలి, మీ నుండి నేర్చుకున్న విషయాలు నన్ను ముందుకు నడిపాయి. వికీలో మీరు త్వరలోనే తిరిగి సచేతనం అవుతారని ఆశిస్తూ. NskJnv 13:40, 14 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారు వ్యక్తిగత కారణాల వల్ల నిర్వహణ భాద్యతల నుండి తప్పుకోవడం వికీకి తీరని లోటు. అతని సారథ్యంలో అనేక ప్రాజెక్టులను, వికీ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. వికీపీడియా వ్యాసాల నాణ్యత కోసం అతను విశేషమైన కృషి చేసారు. వారికి కుదిరినపుడల్లా ఒక వాడుకరిగానైనా వికీలో తన సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. వీలైనప్పుడు సరైన సూచనలు ఇచ్చి తెలుగు వికీపీడియా అభివృద్ధికి పాటుపడతారని కోరుకుంటున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 02:20, 25 జూన్ 2023 (UTC)Reply

CIS-A2K Newsletter May 2023

మార్చు


Please feel free to translate it into your language.

 

Dear Wikimedians,

Greetings! We are pleased to inform you that CIS-A2K has successfully completed several activities during the month of May. As a result, our monthly newsletter, which covers the highlights of the previous month, is now ready to be shared. The newsletter includes updates on the conducted events and ongoing activities, providing a comprehensive overview of A2K's recent endeavours. We have taken care to mention both the conducted and ongoing events/activities in this newsletter, ensuring that all relevant information is captured.

Conducted events
  • Preparatory Call for June Month Activity
  • Update on status of A2K's grant proposal
Ongoing activity
Upcoming Events
  • Support to Punjabi Community Proofread-a-thon

Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.

Thank you MediaWiki message delivery (చర్చ)

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో భాగస్వామ్య ప్రతిపాదన

మార్చు

అందరికీ నమస్కారం,

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారు తెలుగు వికీపీడియా కార్యకలాపాలకు చాలాకాలంగా ఉచితంగా వేదికను ఇవ్వడం, స్వయంగా తామే ఖర్చుచేసి కార్యక్రమాలు నిర్వహించడం, ఇతరత్రా సాయం చేయడం తెలిసిందే. ఈ క్రమంలో ఒక కార్యక్రమంలో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారు సంస్థ ప్రచురించిన, వారికి కాపీహక్కులున్న పలు విజ్ఞానదాయకమైన పుస్తకాలను, రవీంద్ర భారతిలో వారు నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాల ఫోటోలను, వీడియోలను స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేయడానికి అంగీకరించారు.

ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గాను మామిడి హరికృష్ణ గారిని మే నెలలో వికీమీడియా ఫౌండేషన్‌కు చెందిన Jorge Vargas, ప్రవీణ్ దాస్, భాషా సాంస్కృతిక శాఖతో కలసి పనిచేయడంలో తెలుగు వికీపీడియాకు ఉపకరిస్తున్న తెలుగు వికీపీడియన్లు వాడుకరి:Pranayraj1985, వాడుకరి:Adithya pakide గార్లు, ప్రస్తుతం సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్న నేను రవీంద్రభారతిలో కలిశాము. ఈ సందర్భంగా గతంలో అనుకున్న విధంగా తెలంగాణ సంస్కృతితో పాటుగా భారతదేశంలో అనేక ప్రాంతాల సాంస్కృతిక కార్యక్రమాలను పొందుపరిచిన ఫోటోలు, వీడియోలను, భాషా సాంస్కృతిక శాఖ ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి రూపకల్పన చేసి, ప్రచురించిన అనేక పుస్తకాలను స్వేచ్ఛా లైసెన్సుల్లో విడుదల చేస్తామని, వికీపీడియా పట్ల అవగాహన పెంపొందించే కార్యక్రమాలకు రవీంద్రభారతిలో భాగమైన పైడి జైరాజ్ థియేటర్‌ని ఉచితంగా ఇవ్వడం కొనసాగిస్తామని, ఇతరత్రా ఏదైనా వికీపీడియా అభివృద్ధి కోసం కావాలంటే అడగవచ్చునని మామిడి హరికృష్ణ తెలియజేశారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో ఈ ఆలోచనలు చేశాము:

  • తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ విలువైన సాంస్కృతిక ఛాయాచిత్రాలు, వీడియోలు, పుస్తకాలను రీలైసెన్సు చేస్తుంది.
  • ఆ ఫోటోలను, వీడియోలను, పుస్తకాలను ఒక క్రమ పద్ధతిలో కాపీరైట్ రీలైసెన్సింగ్ చేయించి, వికీమీడియా కామన్సులో ఎక్కించి ఉపయోగకరం చేయడానికి, డిపార్టుమెంటులో అవగాహన కల్పించడం ఒక వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్‌ చేస్తారు. వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ అన్నది ఇలాంటి డిజిటల్ రీసోర్సులను సంస్థలు (మరీ ముఖ్యంగా గ్యాలరీలు, లైబ్రెరీలు, ఆర్కైవులు, మ్యూజియంలు) రీలైసెన్స్ చేయదలచినప్పుడు వికీమీడియా ప్రపంచంలో చాలాచోట్ల ఏర్పాటుచేస్తున్న ఒక వేతనంతో కూడిన పొజిషన్. మరింత చదవదలుచుకుంటే ఇక్కడ చూడండి.
  • తెలుగు వికీపీడియా సముదాయం, సీఐఎస్-ఎ2కె, భాషా సాంస్కృతిక శాఖ ఏర్పరిచే బృందం సంయుక్తంగా నియమించి వికీమీడియన్-ఇన్-రెసిడెన్స్ ఎంపిక, కార్యకలాపాల పర్యవేక్షణ చేస్తుంది. ఆరు నెలల పాటు జరిగే పైలట్ ప్రాజెక్టుకు భాషా సాంస్కృతిక శాఖ కొంతమేరకు ఆర్థికంగా కంట్రిబ్యూట్ చేయగా మిగిలిన మొత్తాన్ని వికీమీడియా ఫౌండేషన్ కంట్రిబ్యూట్ చేయడానికి ముందుకువస్తోంది.
  • విడుదలై, వికీమీడియా కామన్సులో చేరిన ఫోటోలు, వీడియోలు, పుస్తకాల సహా చేసిన పనిని ఎప్పటికప్పుడు తెలుగు వికీపీడియాలో ప్రచురిస్తూ ఉంటారు. మిగిలిన సముదాయ సభ్యులు కూడా దానిపై సూచనలు, సలహాలు ఇవ్వవచ్చు.

ఈ ప్రాజెక్టు ద్వారా బయటకు వచ్చే మీడియా తెలుగు వికీపీడియాకే కాక వికీమీడియా ప్రపంచం మొత్తానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నాము. పై ఆలోచనలపై మీ అభిప్రాయాలు దయచేసి చెప్పగలరు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 05:27, 9 జూన్ 2023 (UTC)Reply

చాలా మంచి ప్రణాళిక , చాలా ముఖ్యమైన ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలు, పుస్తకాల రీలైసెన్సింగ్ త్వరలో కార్యరూపం దాల్చాలని ఆశిస్తూ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వారికి ,సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం వారికీ వందనాలు Kasyap (చర్చ) 07:22, 13 జూన్ 2023 (UTC)Reply
ఈ ప్రణాళిక తెలుగు వికీపీడియా అభివృద్ధికి మరింత దోహదం కలుగచేస్తుందని భావిస్తూ, ఈ ప్రణాళిక రూపకల్పన చేయటానికి ముందుకు వచ్చిన తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ వార్కి, సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం వార్కి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:35, 13 జూన్ 2023 (UTC)Reply


తెలుగు వికీపీడియాకు ఇది శుభ సూచికం, తెలుగు వికిపీడియాకు తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ వారు అందిస్తున్న ప్రోత్సాహం మనలో నిత్యం స్ఫూర్తిని నింపుతూ వస్తుంది, ఈ కార్యక్రమం ద్వారా అది మరింత బలం చేకూర్చుకుంటుందని విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణకై చొరవ తీసుకున్న సీఐఎస్-ఎ2కె వారికి ధన్యవాదాలు. NskJnv 13:36, 14 జూన్ 2023 (UTC)Reply
అభిప్రాయాలు తెలియజేసినందుకు @Kasyap, @యర్రా రామారావు, @Nskjnv గార్లకు ధన్యవాదాలు. ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళి భవిష్యత్ కార్యక్రమాలలో తెలుగు వికీ సముదాయాన్ని భాగం చేస్తూ ఉంటాము. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 12:42, 26 జూన్ 2023 (UTC)Reply

ప్రతిపాదన : కొత్త అధికారులు

మార్చు

తెలుగు వికిపీడియాకు నిర్వాకుడిగా,ఆధికారిగా ఎంతో విలువైన సేవలు అందించిన @చదువరి గారు స్వచ్చంద విరమణ తీసుకోవటం వలన, ఈ కొరత తీర్చడానికి నిర్వాహకులుగా క్రియాశీలకంగా పనిచేస్తున్న @వెంకటరమణ గారిని @ప్రణయ్‌రాజ్ గారిని కూడా అధికారిగా ప్రతిపాదిస్తున్నాను, దీనికి సంబంధించి సహసభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను, మార్గ నిర్దేశం చేయమని @అర్జునరావు గారు @రాజశేఖర్ గారిని కొరుతున్నాను. Kasyap (చర్చ) 05:30, 15 జూన్ 2023 (UTC)Reply

@Kasyap గారూ, మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు. అయితే, తెలుగు వికీపీడియా సంప్రదాయం ప్రకారం @K.Venkataramana, @Pranayraj1985 గార్లు ఇందుకు అంగీకారం తెలియజేయాలి. చర్చ కూడా రచ్చబండలో కాకుండా వేరే ప్రత్యేక పేజీలో జరగాలన్నట్టు గుర్తు. ఇలాంటి పాలసీలపై శ్రద్ధ గల @యర్రా రామారావు గారిని ఇందులో ముందుకు వెళ్ళే పద్ధతి గురించి తెలియజేయమని కోరుతున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 14:41, 15 జూన్ 2023 (UTC)Reply
పై విషయంలో నేను వెంటనే స్పందించాల్సింది.కానీ ఆలస్యం అయినందుకు మన్నించాలి.నాకు ఉన్న అవగాహన ప్రకారం అధికారులు ఇంతమంది మాత్రమే ఉండాలనే నిబంధన ఏమీ లేదని అనుకుంటున్నాను. చదువరి గారు స్వచ్చంద విరమణ తీసుకోవటం,అర్జునరావు గారూ ఈ మధ్య కాలంలో క్రియాశీలంగా లేకపోవటం, అలాగే అధికారిగా ఉన్న రాజశేఖర్ గారు వికీసోర్స్ లో క్రియాశీలంగా ఉంటూ, తెలుగు వికీపీడియాలో క్రియాశీలంగా లేకపోవటంవలన ఒకరకంగా చెప్పాలంటే దిశానిర్థేశం చేసేవారులేక ప్రస్తుతం వికీపీడియా చుక్కానిలేని నావలాగా ప్రయాణిస్తుంది.వికీపీడియాలో వ్యాసాలు రాయటం, సవరణలు చేయటం, వికీపీడియాలో ఏమి జరుగుతుందని పర్వేక్షించటం , నడిపించటానికి దిశానిర్థేశం, ఇవన్నీ సవ్యంగా ఉంటేనే వికీపీడియా అనుకున్న లక్ష్యాలు సాధించిదని నా అభిప్రాయం.అన్నీ ముఖ్యమైనవే.వీటిన్నిటిలో ఏది ముఖ్యం అంటే పైవాటిలో చివరి రెండు మరింత ముఖ్యమైనవే.బండి నడవాలంటే నడిపించేవాడు ఉండాలి,లాగేవాడు ఉండాలి.అందువలన మరింతమంది అధికారులు ఉంటే మంచిదని నాఅభిప్రాయం.చదువరి గారు స్వచ్చంద విరమణ చేసినందున ప్రస్తుతం రవిచంద్ర గారు ఆపద్ధర్మ అధికారిగా స్వచ్చంధంగా ముందుకువచ్చి బాధ్యతలు తీసుకున్నారు.ఇక నా అభిప్రాయం.కశ్యప్ గారు ఈ విషయం చర్చకు ప్రవేశపెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారు ప్రతిపాదించిన వెంకటరమణ , అలాగే ప్రణయ్‌రాజ్ గార్లుతో పాటు గతంలో అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన పవన్ సంతోష్ గారిని, రవిచంద్ర గారిని అధికార్లుగా బాధ్యతలు నిర్వర్తించటానికి ప్రతిపాదిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 16:35, 15 జూన్ 2023 (UTC)Reply
పైన నా అభిప్రాయానికే పరిమితమయ్యాను.ఆ తరువాత పవన్ సంతోష్ గారు ఇందులో ముందుకు వెళ్లే పద్ధతి గురించి తెలియజేయమని కోరారు.నాకు స్వంతంగా ఈ విషయంలో పెద్దగా తెలిసిందేమీలేదు.అయితే నామీద ఉన్న వారి అభిప్రాయానికి ధన్యవాదాలు. అయితే గతంలో జరిగిన దానిప్రకారం వివరాలు మీ ముందు ఉంచుతున్నాను.
కొత్త అధికారుల ప్రతిపాదనలలో ముందుకు వెళ్లటానికి గతంలో జరిగిన దానిప్రకారం రెండు పద్ధతులు ఉన్నవి.
మొదటి పద్ధతి: ఎవరికి వారు స్వీయ ప్రతిపాదన చేసుకోవటం.ఈ పద్ధతిలో అధికారిగా ఉండటానికి సమ్మతించిన అభ్యర్థి స్వంత ప్రతిపాదనను వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి /స్వీయ ప్రతిపాదకుని పేరుతో ఒక పేజీని ఈ విధంగా తయారు చేసుకొని ఓటింగుకు పెట్టాలి.
రెండవ పద్ధతి:ఈ పద్దతి అధికార బాధ్యతలు నిర్వహించటానికి అంగీకారం తెలిపినయెడల ప్రతిపాదించిన వ్యక్తులు వారిపేరుతో ప్రతిపాదనలు పేజీని వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రతిపాదన చేసిన వ్యక్తి పేరుతో ఒక పేజీని ఈ విధంగా తయారు చేసుకొని ఓటింగుకు పెట్టాలి.
ఈ రెండిటిలో మొదటి పద్ధతి ప్రకారం ముందుకువెళితే మంచిదేమో అని నా అభిప్రాయం.లేదా రెండవ పద్దతి ప్రకారం పోదాం అనుకుంటే అధికార బాధ్యతలు స్వీకరించటానికి సమ్మతించే వారు అంగీకారం తెలిపితే దాని ప్రకారం ముందుకు వెళ్లవచ్చు. యర్రా రామారావు (చర్చ) 20:42, 15 జూన్ 2023 (UTC)Reply
సభ్యులకు నమస్కారం, తెలుగు వికీపీడియా అధికార బాధ్యతలు స్వీకరించటానికి నా సమ్మతిని తెలియజేస్తున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:48, 16 జూన్ 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, మీరు నాపై విశ్వాసంతో అధికార హోదాకు ప్రతిపాదించినందుకు చాలా ధన్యవాదాలు. అయితే, నేను గత కొద్ది సంవత్సరాలుగా నిర్వాహక బాధ్యతలు కూడా నాకు సంతృప్తి కలిగించేలా నిర్వహించలేకపోయాను. ఇటీవల మళ్ళీ సచేతనం అయి పుంజుకుని ఆ కార్యకలాపాలు ప్రారంభించాను. కాబట్టి, నిర్వాహక బాధ్యతల్లో నా పనితీరును నేను ఒక మూడు నాలుగు నెలలు పరిశీలించుకుని సంతృప్తికరంగా పనిచేస్తున్నానని నమ్మకం కలిగితే స్వీయప్రతిపాదన చేసుకుంటాను. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 05:10, 25 జూన్ 2023 (UTC)Reply
అధికారిగా స్వీయ ప్రతిపాదన చేసుకోదలచినవారు వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి పేజీని చూడవచ్చు. __చదువరి (చర్చరచనలు) 05:50, 18 జూన్ 2023 (UTC)Reply
ప్రణయ్‌రాజ్ గారూ తెలుగు వికీపీడియా అధికార బాధ్యతలు స్వీకరించటానికి ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు స్యీయ ప్రతిపాదన వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి లో మీ పేరున ఉప పేజీ తయారుచేసి మద్దతు కొరకు రచ్చబండ ప్రత్వేక విభాగంలో మీ ఉప పేజీ లింకును ఇవ్వగలందులకు సూచించటమైనది.అలాగే తెలుగు వికీపీడియా అధికార బాధ్యతలు స్వీకరించటానికి ఆసక్తి ఉన్న నిర్వాహకులు సాధ్యమైనంత త్వరలో స్వీయ ప్రతిపాదన పై విధంగా ప్రతిపాదించగలరు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 08:54, 20 జూన్ 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ... మీరు సూచించినట్టుగా స్వీయ ప్రతిపాదనలో భాగంగా అధికార హోదా కొరకు ఒక ఉపపేజీ తయారుచేసి, మద్దతు కొరకు రచ్చబండ ప్రత్వేక విభాగంలో రాసి, సముదాయ సభ్యులను అభ్యర్థించడం జరిగింది. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:58, 20 జూన్ 2023 (UTC)Reply

Invitation to join at WikiConverse India Call - June 24th, 2023

మార్చు

Apologies to write in English please help us to translate the message in your language

Greetings! WikiConverse India is a new initiative that A2K is working on to improve collaboration among communities in India. WikiConverse India aims to initiate and foster dialogue within the Indian language Wikimedia community on various topics that are important for the growth of the Wikimedia movement. Currently, we are conducting regular calls as part of this initiative. For the month of June, this call will be scheduled on June 24th, 2023, from 6:00 PM to 7:30 PM IST. A2K will invite Indian participants from recent international conferences, namely the Wikimedia Hackathon and EduWiki Conference, to share their important takeaways specifically relevant to India.

To join the WikiConverse India Call, You can find the call details below:

If you have any questions, please write to a2k@cis-india.org. Regards MediaWiki message delivery (చర్చ) 18:29, 16 జూన్ 2023 (UTC)Reply

తొలగింపుల గురించి

మార్చు

చర్చ:నాటకరంగం ఎందుకు తొలగించారు. Theatre or theater కి థియేటర్ వ్యాసం వుంది కదా. థియేటర్ వ్యాసం en:Theatre వ్యాసం నుంచి అనువాదం చేయబడింది. నాటకరంగం అనే వ్యాసం విరుడ్డంగా సృష్టించబడింది. మరీ విరుడ్డంగా నాటకం నుండి దారిమార్పు ఇవ్వడం జరిగింది. YVSREDDY (చర్చ) 15:04, 17 జూన్ 2023 (UTC)Reply

@YVSREDDY గారూ...Theatre, Theater పదాల మధ్య తేడా ఉంటుంది. Theatre అంటే నాటక కళారూపం, Theater అంటే నాటకం లేదా సినిమా ప్రదర్శించే స్థలం లేదా వేదిక అని అర్థం. కాబట్టి, మీరు అనవసర దారిమార్పులు ఇవ్వకండి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:23, 17 జూన్ 2023 (UTC)Reply
తెలుగు నాటకం వ్యాసం పేరు సరియైనది కాదు, దీనికి నాటకం అనే పేరు సరిపోతుంది.

చదువరి నిర్వహిస్తున్న ప్రాజెక్టులు

మార్చు

గతంలో నేను నిర్వహిస్తూ ఉన్న ప్రాజెక్టుల్లో కొన్ని ముగిసినై, కొన్ని అచేతనంగా ఉన్నాయి. అలాగే చేతనంగా ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. కానీ నేను చేతనంగా లేనందున వాటి నిర్వహణ చురుగ్గా ఉన్న వాడుకరులు చేపడితే బాగుంటుంది.

నేను నిర్వహిస్తూ, ప్రస్తుతం చేతనంగా ఉన్న ప్రాజెక్టులు:

  1. వికీపీడియా:వికీప్రాజెక్టు/మూలాల్లో లోపాల సవరణ: నాణ్యత రీత్యా ముఖ్యమైన ప్రాజెక్టు ఇది. బాగా విజయవంతంగా నడిచి 9000 పేజీల్లో ఉన్న లోపాలను సవరించి ఆ పేజీల సంఖ్యను 500 లోపుకే తగ్గించిన ప్రాజెక్టు. నిజానికి నిర్వహణా కార్యక్రమాల్లో భాగంగా ఉండే పని ఇది. నిరవధికంగా కొనసాగాల్సిన పనేమీ లేదు. అయితే ఒక ప్రాజెక్టుగా ఉంటే ఒక గుర్తుగా ఉంటుందంతే.
  2. వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు: పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రాజెక్టు. ఏయే ఏట ఎంత పని చేసామో తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూసుకోడానికి ఇది పనికొస్తుంది. అచేతనం చేసినా పెద్దగా నష్టం లేదు.
  3. వికీపీడియా:వికీప్రాజెక్టు/గ్రోత్ ప్రాజెక్టు: ఇది నిరవధికంగా సాగే ప్రాజెక్టు. కొత్త వాడుకరులను నిలుపుకునేందుకు చేపట్టిన ప్రాజెక్టు.
  4. వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశ జిల్లాల పేజీల పునర్వ్యవస్థీకరణ: జిల్లాల, ముఖ్యపట్టణాలకు విడివిడిగా పేజీలను సృష్టించి వాటిలోని లింకులను సరిచేసే ప్రాజెక్టు ఇది. దాదాపు పన్నెండు వందల పేజీల నాణ్యతను పెంచే దిశలో సుమారు 70% దాకా పని పూర్తైన ప్రాజెక్టు ఇది. మొదటి నుండీ ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న యర్రా రామారావు గారు ఇప్పటికీ చురుగ్గా పని చేస్తూ దాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఆ ప్రాజెక్టులో చెయ్యాల్సిన పనుల గురించి చక్కటి అవగాహన కూడా ఆయనకు ఉంది. అంచేత ఈ ప్రాజెక్టు నిర్వహణను చేపట్టి విజయవంతంగా ముగించాలని ఆయనను కోరుతున్నాను.
  5. వికీపీడియా:వికీప్రాజెక్టు/చెక్ వికీపీడియా: వికీలో దొర్లే అనేక రకాలైన లోపాలను యాంత్రికంగానూ, మానవికంగానూ సవరించేందుకు సృష్టించిన ప్రాజెక్టు ఇది. వికీలో నాణ్యతను పెంచేందుకు పనికొచ్చే ప్రాజెక్టు ఇది

ఆయా ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత స్వీకరించేవారు ప్రాజెక్టు పేజీలోను, ప్రాజెక్టుల పేజీ లోని పట్టిక లోనూ ప్రాజెక్టు నిర్వాహకులుగా తమ పేరు చేర్చవలసినదిగా కోరుతున్నాను. ఒక వారం తరువాత ఎవరూ ముందుకు రాకపోతే ఆ ప్రాజెక్టుల స్థితిని అచేతనంగా మారుస్తాను.__ చదువరి (చర్చరచనలు) 15:13, 17 జూన్ 2023 (UTC)Reply

@Chaduvari గారూ, మూలాల్లో లోపాల సవరణ, చెక్ వికీపీడియా ప్రాజెక్టుల్లో నేను నా పేరు చేర్చుకున్నాను. ప్రాజెక్టు పేజీల పట్టికలో కూడా మూలాల్లో లోపాల సవరణ వద్ద నా పేరు చేర్చాను. అయితే, చెక్ వికీపీడియా ఆ జాబితాలో నాకు కనిపించలేదు. ఉంటే నా పేరు చేర్చండి. ఆయా పేజీల్లో మంచి డాక్యుమెంటేషన్ ఉన్నట్టు గమనించాను. చదివి పనిచేయడానికి ప్రయత్నిస్తాను. సందేహాలుంటే రాబోయే వారం రోజుల్లోనే మీ నుంచి తెలుసుకుంటాను. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 07:06, 18 జూన్ 2023 (UTC)Reply
@Pavan santhosh.s గారూ ధన్యవాదాలు. చెక్ వికీపీడియా ప్రాజెక్టు అక్కడీ జాబితాలో చేర్చడం మర్చిపోయి ఉంటాను బహుశా. దయచేసి మీరే చేర్చండి. __ చదువరి (చర్చరచనలు) 07:12, 18 జూన్ 2023 (UTC)Reply
@Chaduvari గారూ, సరేనండీ. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (చర్చ) 07:41, 18 జూన్ 2023 (UTC)Reply

@ చదువరిగారు, @ పవన్ సంతోష్ గారు - పైన పేర్కొన్న రెండవ విషయం "గణాంకాలు" యాంత్రికంగా ఏర్పడవా? ప్రత్యేకంగా తయారు చేయాలా? అని నాకు ఒక సందేహం. వీలయితే చెప్పండి. ధన్యవాదాలు.--VJS (చర్చ) 09:11, 21 జూన్ 2023 (UTC)Reply

@Vjsuseela గారూ, నాకూ పూర్తి అవగాహన లేదండీ ఈ విషయంలో. మీరు చదువరి గారిని ట్యాగ్ చేశారు కాబట్టి ఆయన స్పష్టత ఇస్తారనుకుంటున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 05:19, 22 జూన్ 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, గణాంకాలు యాత్రికంగా వచ్చేవి కాదండి, మానవికంగా తయారుచేసేవే. నేరుగా వికీపీడియా డేటాబేసును అడిగి, డేటా తెచ్చుకుని దాన్ని వివిధ పట్టికల లోకి చేరుస్తాం. అయితే దీన్ని కొంతవరకు ఆటోమేటు చెయ్యగలిగాను.
క్లుప్తంగా, ఈ గణాంకాల తయారీ కింది విధంగా ఉంటుంది
  1. క్వారీలో వివిధ క్వెరీలు రాసి డేటాను తెస్తాం. ఇందు కోసం ఓ ఇరవై పాతిక క్వెరీలున్నాయి. వీటిలో ఎక్కువగా వాడేవి ఒక తొమ్మిది ఉంటై
  2. గూగుల్ షీట్స్ వాడిచ్చిన ఒక యాడాన్ ద్వారా ఆ క్వెరీల నుండి గూగుల్ షీట్స్ లోకి డేటాను తెచ్చుకుంటాం
  3. ఈ డేటాను గూగుల్ షీట్ల లోనే ప్రాసెస్ చేసి, దాన్ని కాపీ చేసి తెచ్చి వికీలో పెడతాం
  4. అయితే, "వికీపీడియా:" పేరుబరిలో విజువల్ ఎడిటరు పని చెయ్యదు కాబట్టి, సోర్సు ఎడిటరులో పట్టికల తయారు చెయ్యడమనేది పెద్ద తల్నెప్పి పని కాబట్టీ, ఈ పట్టికలను ముందుగా "వాడుకరి:" పేరుబరిలో తయారు చేసి, చిన్నా చితకా మార్పులేమైనా అవసరమైతే అవి చేసి, దాని సోర్సును తీసుకెళ్ళి "వికీపీడియా:గణాంకాలు" పేజీల్లో తగిన వాటిలో చేరుస్తాం
క్లుప్తంగా ఇదండీ పద్ధతి. ఈ పని చెయ్యడానికి కొద్దిగా ఎక్సెల్ నైపుణ్యం, కొద్దిగా sql నైపుణ్యం, కొద్దిగా ఓపిక అవసరం. మీకు ఈ పని చేసేందుకు ఆసక్తి ఉంటే దీనిపై మరింత చర్చించుకుందాం. ఉంటాను. __ చదువరి (చర్చరచనలు) 23:27, 24 జూన్ 2023 (UTC)Reply
చదువరి గారు! మీరు చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
ఒకసారి ప్రయత్నం చేసి చూస్తాను. చేయగలిగితే కొనసాగిస్తాను. నాకు కొన్ని సందేహాలున్నాయి.
  • డేటాబేస్ access restriction ఉంటుంది కదా.  
  • డేటాబేస్ access కి ఏదేని TOOL ఉపయోగిస్తారా.
  • ఎంత కాలవ్యవధి (ఫ్రీక్యెన్సీ) లో డేటాని  సేకరిస్తారు. వారానికి / నెలకి / మూడు నెలలు / 6నెలలు / సంవత్సరానికి ఒకసారి.  
  • Documentation ఏమైయినా ఉందా.
మీరు ఇచ్చిన లంకె (వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు)లో ఉన్న  వాటిలో గణాంకాలు చూసాను. చాలా అంశాల వారీగా డేటా సేకరించాలి అని తెలుస్తోంది. సాంకేతికపరంగా చూసినా, పరిమాణం పరంగా చూసినా కూడా నాలాంటి వాళ్లకు ఇది పెద్ద ప్రాజెక్ట్. కాబట్టి,  తెలుగు వికిపీడియాకు ఈ గణాంకాలు అవసరం నిర్వాహకులు/అధికారులు భావిస్తేనే ప్రయత్నం చేయవచ్చు  అనుకుంటున్నాను. ఎందుకంటే -
Please refer -< “వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు”: పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రాజెక్టు. ఏయే ఏట ఎంత పని చేసామో తెలుసుకునేందుకు వెనక్కి తిరిగి చూసుకోడానికి ఇది పనికొస్తుంది. అచేతనం చేసినా పెద్దగా నష్టం లేదు.”>
మీరు ఇదివరలో అందచేసిన మార్గదర్శకానికి ధన్యవాదాలు. VJS (చర్చ) 12:19, 25 జూన్ 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, "పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రాజెక్టు" అని నేను క్యాజువల్గా అనకుండా ఉండాల్సింది. మనకున్న అతికొద్ది మంది చురుకైన వాడుకరుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఇది మనకు "ఖరీదైన" పని అవుతుంది, అంచేత ప్రస్తుతం దీన్ని పట్టించుకోకుండా ఉంటే మంచిది అనేది నా మనసులో ఉన్న అసలు సంగతి. కానీ దాన్ని నేను సరిగ్గా చెప్పలేకపోయాను. అంతే తప్ప దీనికి ప్రాముఖ్యత లేదని నా ఉద్దేశం కాదు. చేసేవాళ్ళుంటే చక్కగా ముందుకు తీసుకెళ్ళవచ్చు. __చదువరి (చర్చరచనలు) 14:34, 25 జూన్ 2023 (UTC)Reply
ఈ ప్రాజెక్టు నా దృష్టిలో చాలా ముఖ్యమైన ప్రాజెక్టు.ఒకరకంగా చెప్పాలంటే యాక్టివ్ గా లేని వాడుకరులకు మనం ఆ స్థాయికి ఎందుకు వెళ్లలేక పోతున్నాం అని ఆలోచించటానికి అవకాశం కలిగిస్తుంది. ఇంక యాక్టివ్ గా పనిచేసే వాడుకరులకు న్యూరోబిన్ టాబ్లెట్స్ (నీరసంగా ఉంటే శక్తి కోసం వాడతారు) లాంటివి ఈ గణాంకాలు.ఇంకోటి వికీ అభివృద్ధికి ఇవి కొలమానాలు. మిగతా ప్రాజెక్టులు కంటే ఏ మాత్రం తక్కువైనది కాదు.అలాగా సులభమైనది కాదని నా అభిప్రాయం. యర్రా రామారావు (చర్చ) 14:58, 25 జూన్ 2023 (UTC)Reply
రామారావు గారు! మీ స్పందనకి ధన్యవాదాలు. VJS (చర్చ) 16:55, 25 జూన్ 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, మరిన్ని వివరాలిక్కడ..
డేటాబేస్ access restriction ఉంటుంది కదా. - ఉండదు
డేటాబేస్ access కి ఏదేని TOOL ఉపయోగిస్తారా. - https://quarry.wmcloud.org అనేచోట sql వాడతాం
ఎంత కాలవ్యవధి (ఫ్రీక్యెన్సీ) లో డేటాని సేకరిస్తారు. వారానికి / నెలకి / మూడు నెలలు / 6నెలలు / సంవత్సరానికి ఒకసారి. - మనకు తీరిక ఉన్నపుడే చెయ్యొచ్చండి. నేను నెలకో రెణ్ణెల్లకో, ఆర్నెల్లకో ఒకసారి చేసేవాణ్ణి
Documentation ఏమైయినా ఉందా.- లేదు.
నేను రాసిన క్వెరీలను ఇక్కడ చూడవచ్చు: https://quarry.wmcloud.org/Chaduvari ఈ క్వెరీల్లో కిందివి, రోజువారీ డేటాను తెస్తాయి.
  • Tewiki: Date wise all NS new pages creation
  • Tewiki: Date-wise All_NS edit count
  • Tewiki: Datewise bytes added
  • Tewiki: Date-wise NS0 edit count
  • Tewiki: Date wise new user registrations
  • Tewiki: Date wise NS0 new pages creation
  • Tewiki Date-wise pages published from Content translation
  • Tewiki: Date-wise file uploads
  • Tewiki:Date-wise NS0 page deletions
అలాగే నెలవారీ గానూ, వార్షికం గానూ డేటా తెచ్చే క్వెరీలను కూడా పైన చూపిన నా క్వెరీల పేజీలో చూడవచ్చు. పై క్వెరీల యూఆరెల్ ఇలా ఉంటుంది: https://quarry.wmcloud.org/query/XXXXX ఇందులో XXXXX అనే సంఖ్యను వాడుకుని గూగుల్ షీట్స్ లోకి డేటాను తెచ్చుకుంటాం. ఈ క్వెరీల్లో ఉన్న సంవత్సరం/నెలను మనకు కావలసిన విధంగా మార్చుకుని అవసరమైన కాలానికి చెందిన డేటాను తెచ్చుకుంటాం. గూగుల్ షీట్స్‌లో ఇందు కోసం ఒక యాడాన్ ఉంది. దాని ద్వారా వికీ సంబంధ డేటాను షీట్స్‌ లోకి తెచ్చుకునే సౌకర్యం ఉంది. అలా షీట్స్ లోకి వచ్చిన డేటాలో టైమ్‌స్టాంఫు ఉంటుంది గానీ తేదీ ఉండదు. దాన్ని తేదీలోకి మార్చుకుని డేటాను తెవికీ పట్టిక రూపం లోకి మార్చుకుంటాం. దాన్ని కాపీ చేసి వికీలో పెడతాం. వికీలో పెట్టేటపుడు "వికీపీడియా:" పేరుబరిలో ఉన్న ఇబ్బంది గురించి పైన రాసాను కదా.. అంచేత వాడుకరి: పేరుబరిని బదిలీ పేరుబరి లాగా వాడుకుంటాం. __చదువరి (చర్చరచనలు) 14:59, 25 జూన్ 2023 (UTC)Reply
చదువరి గారు. ధన్యవాదాలు. మీరు రాసిన quarries, నమూనాలు మొదలైన సమాచారం ఇచ్చినందుకు. అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఒక ఆవృతం వరకు మీరు సహాయం చేయగలరా? చేయటానికి వీలయితే మిమ్మల్ని ఏవిధముగా సంప్రదించాలి. VJS (చర్చ) 16:54, 25 జూన్ 2023 (UTC)Reply
చదువరిగారు. మీ SQL కోడ్ ఉపయోగించాను. పరిశీలించండి. https://quarry.wmcloud.org/Vjsuseela
VJS గారూ, మీ ఆసక్తికీ ఉత్సాహానికీ తగినట్లుగా వేగంగా స్పందించనందుకు మన్నించండి. తగినంత సమయం దొరక్క రాయలేక పోయాను.
  1. మీరు రాసిన క్వెరీ చూసాను. బాగుంది. నేను పైన చూపిన క్వెరీలన్నిటినీ ఫోర్క్ (Fork) చెయ్యండి. అప్పుడు వాటిని మీరు మీ అవసరానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు (తేదీ మార్చుకోడం, నెల, సంవత్సరం మార్చుకోడం లాంటివి), నడుపుకోవచ్చు. మీకు sql వస్తే ఇక నేను దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ పాయింటును ఇకపై మీరు చదవనక్కర్లేదు. రాకపోతే మాత్రం.. దాని గురించి కొంత తెలుసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ క్వెరీలో (rev_timestamp,1,4) అని ఉన్న చోట్లల్లా దాని స్థానంలో (rev_timestamp,1,6) అని పెట్టి ఆ క్వెరీని నడపండి. ఫలితాలు ఎలా వచ్చాయో చూడండి... నెలవారీ గణాంకాలు వచ్చాయి గదా!? ఆ విధంగా చిన్నాచితకా మార్పులు చేసుకుని మనకు కావలసిన డేటాను తెచ్చుకునే నేర్పు అలవాటు చేసుకోవాలి.
  2. మీకు ఎక్సెల్/గూగుల్ షీట్స్‌పై పని చేసిన అనుభవం ఉంటే తరువాతి అంగ తేలిగ్గా ఉంటుంది. ఆ అనుభవం లేకపోతే ఇబ్బంది అవుతుంది. గూగుల్ షీట్లలో ఉన్న సౌకర్యం ఏంటంటే, పై క్వెరీలను నడిపి ఆ డేటాను తచ్చి షీట్లో పెట్టుకునే సామర్థ్యం దానికి ఉంది. క్వెరీ రాయడం మన పని, దాన్ని నడిపి డేటా తెచ్చుకోడం దాని పని అన్నమాట!
  3. ఆ తరవాత మనం ఆ షీట్ల లోని డేటాను ప్రాసెస్ చేసి వికీలో పెట్టుకోవచ్చు.
నాకు ఇవ్వాళ రాత్రికి, రేపు మధ్యాహ్నం తరువాత - మొత్తం ఒక మూణ్ణాలుగు గంటల పాటు దీనిపై పనిచేసే అవకాశం ఉంది. నేను ఈ పని గురించి వీలైనంత వివరంగా ఒక డాక్యుమెంటు రాస్తాను. దాన్ని చదివి మీరు ఈ పని చెయ్యగలరేమో చూద్దురు గాని. అయితే ఈ డాక్యుమెంటు SQL నేర్పదు, క్వెరీలను ఎలా మార్చుకోవాలో నేర్పదు. గూగుల్ షీట్లు మాత్రం తయారు చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈలోగా మీరు క్వెరీలను ఫోర్కు చేసి తెచ్చుకునే పనిపై కసరత్తులు చెయ్యండి. ఏమైనా సందేహాలుంటే ఇక్కడ రాయండి.__చదువరి (చర్చరచనలు) 15:24, 1 జూలై 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా_గణాంకాలు#పని_చేసే_పద్ధతి చూడండి. __ చదువరి (చర్చరచనలు) 02:13, 2 జూలై 2023 (UTC)Reply
చదువరిగారు ధన్యవాదాలు. మీరు సెలవు లో ఉండి కూడా చాలా సమయం వెచ్చిస్తున్నారు. నాకు ఎక్సెల్/గూగుల్ షీట్స్‌పై పని చేసిన అనుభవం ఉంది. మీరు చేసినవి ఇంకా తదితర క్వెరీలు Fork చేసి SQL కోడ్ అర్ధంచేసికోవడానికి ప్రయత్నం చేస్తాను. డాక్యుమెంటు రాస్తే షేర్ చేయండి. ముందు ముందు గణాంకాలకు మీ సూచనలు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా గణాంకాలు చర్చ లో ఉంచుతే దాని మీద పనిచేసే వాళ్లు భవిష్యత్తు లో ఉపయోగించుకుంటారు. రచ్చబండలో అయితే ఇది అనేక చర్చలలో మరుగు పడుతుందని అనుకుంటున్నాను. నిర్ణయం మీదే. VJS (చర్చ) 05:59, 2 జూలై 2023 (UTC)Reply
@Vjsuseela గారూ, నేను దీన్ని ప్రాజెక్టు పేజీలో పెట్టి పైన లింకు ఇచ్చాను చూడండి. __చదువరి (చర్చరచనలు) 12:01, 2 జూలై 2023 (UTC)Reply
చూసానండి. ఇంక నేను ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు. VJS (చర్చ) 13:46, 2 జూలై 2023 (UTC)Reply

చదువరి నిర్వాహకత్వ సమీక్ష

మార్చు

2023 జనవరి - జూన్‌ల మధ్య నా నిర్వాహకత్వ స్వీయ సమీక్షను ఇక్కడ చూడవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 16:22, 17 జూన్ 2023 (UTC)Reply

అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్

మార్చు

సభ్యులకు సమస్కారం, వికీ అధికారులకు సంబంధించి రచ్చబండలో జరిగిన చర్చను అనుసరించి, అధికారిగా స్వీయ ప్రతిపాదనలో భాగంగా అధికార హోదా కొరకు వికీపీడియా:అధికార హోదా కొరకు విజ్ఞప్తి/ప్రణయ్‌రాజ్ పేరున ఒక ఉపపేజీ తయారుచేశాను. ఆ ఉపపేజీని పరిశీలించి తమ మద్దతును తెలుపవలసిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 11:53, 20 జూన్ 2023 (UTC)Reply

ఆంధ్రప్రదేశ్ 736 మండల పేజీలలో మూలాలు లోపాలు

మార్చు

ఆంధ్రప్రదేశ్ మండలాలలోని 736 పేజీలలో [Error: Unable to display the reference properly. See the documentation for details.] అనే ఎర్రర్ చూపిస్తుంది.ఇది నాకు తెలిసినంతవరకు వికీడేటా నందు ఏర్పడిన లోపం వల్ల ప్రతి మండలంలో ఆ ఎర్రర్ చూపుతుందని నేను భావిస్తున్నాను.తెలిసిన వారు ఈ లోపం సరిచేయగలరు.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 ముందు ప్రతి మండల వ్యాసంలో మూస:సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం అనే మూస ఉండేది.దాని ప్రకారం అయితే ఏ వ్యాసంలో లోపం ఉంటే ఆ వ్యాసంలో కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరైనా చేయటానికి అవకాశం ఉండేది. ఇంకా అదనపు సమాచారం లభ్యమైతే ఎవరైనా అదనపు సమాచారం చేర్చుటానికి సులభంగా ఉండేది.ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022 తరువాత పునర్వ్యవస్థీకరణ భాగంగా అర్జున గారు ఆంగ్ల వ్యాసాల ప్రకారం కేంద్ర డేటాకు సమాచారం చేర్చి ప్రతి మండలవ్యాసంలో మూస:Infobox India AP Mandal మూసను కూర్పు చేసారు.సమాచార పెట్టెలో ఏదైనా అదనపు సమాచారం చేర్చాలంటే ఇది అందరికి సాధ్యమయ్యే పనికాదు.దీని మీద అవగాహన ఉంటే తేలికగానే ఉండవచ్చుగానీ, దీనిమీద పూర్తి అవగాహన నాకు తెలిసినంతవరకు అర్జున గార్కి, చదువరి గార్కి మాత్రమే ఉందని అనుకుంటున్నాను.దీనికి సరియైన ప్రత్యామ్నాయ పద్దతి లేకపోతే అందరూ కష్టపడి చేసిన శ్రమ వృధాఅయ్యే అవకాశం ఉంది.దీనికి పరిష్కారం మార్గం చర్చించగలరు. అలాగే ఈ లోపం ఏలా సవరించాలో తెలిసిన విజ్ఞులు ఎవరైనా వివరించగలరు.దీని మీద ముఖ్యంగా అర్జున గారు స్పందించవలసిందిగా కోరుచున్నాను. యర్రా రామారావు (చర్చ) 14:40, 23 జూన్ 2023 (UTC)Reply

@యర్రా రామారావు గారూ, మూలాల్లో లోపాలను గుర్తించినందుకు, లోపం వికీడేటాలో ఉందని గుర్తించి చూపినందుకూ ధన్యవాదాలు. ఇన్నాళ్ళుగా లేని ఈ లోపం అకస్మాత్తుగా ఇప్పుడు ఎందుకు వచ్చిందో, పైగా ఇన్నేసి పేజీల్లో ఎందుకు వచ్చిందో ఆలోచించాలి. వికీడేటా ఆయా మూలాలను ప్రాసెస్ చేసే పద్ధతిలో ఏమైనా మార్పు వచ్చిందా, లేక మూసలోనో మాడ్యూలులోనో తేడా ఏమైనా వచ్చిందా, ఇంకేదైనా సమస్య ఉందా.. అనేది చూడాలి. దీనిక్కావలసిన క్వాలిటీ టైము పెట్టేంత తీరిక నాకు లేదు. ఆసక్తి, ఓపిక, తీరిక ఉన్నవాళ్ళు దీన్ని పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 01:33, 25 జూన్ 2023 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, బొబ్బిలి మండలం వ్యాసంలో అలానే ఎర్రర్ మూలాలు వచ్చినవి. ఆ పేజీ వికీడేటా లింకు పేజీకి వెళ్ళి ఏ అంశం వద్ద అలాంటి లోపాలు వస్తున్నవో చూసి వాటిని సరిచేయవలసి ఉంది. ఈ వ్యాసం లో "విస్తీర్ణం" విభాగంలో రెండు దోషాలు వచ్చినవి. వికీడేటా పేజీలో population area విభాగంలో సంబంధిత మూలం లింకు పనిచేయడం లేదు. దానిని సరిచేసి చేర్చాను. ఇప్పుడు ఈ వ్యాసంలో అటువంటి లింకులు లేవు. మీరు ఏదైనా సమాచారం చేర్చాలన్నా/మార్పు చేయాలన్నా సంబంధిత పుట యొక్క వికీడేటా పేజీలో సరైన సమాచారాన్ని చేర్చితే ఈ వ్యాసంలో కనిపిస్తుంది. ➤ కె.వెంకటరమణచర్చ 03:27, 25 జూన్ 2023 (UTC)Reply
వెకటరమణ గారూ లోపాలు గమనించి స్పందించినందుకు ధన్యవాదాలు.ఈ లోపాలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మండలాలలో చూపుతున్నవి.ఏక మొత్తంగా ఒకేసారి సవరించటానికి అవకాశం ఏమైనా ఉందేమో పరిశీలించాల్సిన అవసరముంది. యర్రా రామారావు (చర్చ) 03:47, 25 జూన్ 2023 (UTC)Reply

Reminder: Invitation to Join WikiConverse India Call

మార్చు

Apologies for writing in English

Hello all,

As we informed you earlier, CIS-A2K has begun a new initiative to improve collaboration among communities in India. WikiConverse India aims to initiate and foster dialogue within the Indian language Wikimedia community on various topics that are important for the growth of the Wikimedia movement. Currently, we are conducting regular calls as part of this initiative. For the month of June, this call will be scheduled for June 24th, 2023, today at 6:00 PM. The call meta page is already prepared and you can find it here.

The call details are here to join us:

We hope you can find some time to join us and listen to the amazing stories and learning experiences from the speakers. Regards MediaWiki message delivery (చర్చ) 10:01, 24 జూన్ 2023 (UTC)Reply

ఒక్క అధికారి సరిపోరు

మార్చు

ప్రణయ్ రాజ్ గారు అధికారిగా ఎన్నికైతే మనకు ఒక అధికారి ఉన్నట్టు. కానీ ఒకరు సరిపోరు. ఇంకా కనీసం ఒక్కరైనా ఉండాలి. ఆసక్తి ఉండి, చురుగ్గా ఉంటున్న నిర్వాహకులు మరెవరైనా ముందుకు రావలసినదిగా కోరుతున్నాను. గతంలో రవిచంద్ర గారు తాను ప్రతిపాదించుకుంటానని అన్నారు. ఆయన్ను ఆ సంగతి పరిశీలించవలసినదిగా కోరుతున్నాను. __చదువరి (చర్చరచనలు) 01:16, 25 జూన్ 2023 (UTC)Reply

చదువరి గారూ, ఆలస్యం అయినందులకు క్షమించండి. నా ప్రతిపాదన ఇక్కడ చేశాను. రవిచంద్ర (చర్చ) 17:55, 25 జూన్ 2023 (UTC)Reply

Announcing the new Elections Committee members

మార్చు
You can find this message translated into additional languages on Meta-wiki.

Hello there,

We are glad to announce the new members and advisors of the Elections Committee. The Elections Committee assists with the design and implementation of the process to select Community- and Affiliate-Selected trustees for the Wikimedia Foundation Board of Trustees. After an open nomination process, the strongest candidates spoke with the Board and four candidates were asked to join the Elections Committee. Four other candidates were asked to participate as advisors.

Thank you to all the community members who submitted their names for consideration. We look forward to working with the Elections Committee in the near future.

On behalf of the Wikimedia Foundation Board of Trustees,

RamzyM (WMF) 18:00, 28 జూన్ 2023 (UTC)Reply

తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు గడువు పొడగింపు గురించి

మార్చు

సభ్యులకు నమస్కారం, తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించేందుకు వికీమీడియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు నిర్వహించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతున్నందున ఇప్పటివరకు తయారు చేసిన పాఠాల స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగా పాఠాలను రూపొందించాల్సివస్తుంది. అందుకు మరికొంత గడువు అవసరమయింది. ఈ విషయమై వికీమీడియా ఫౌండేషన్ గ్రాంట్ మేనేజర్ గారికి మెయిల్ చేయగా, వారి నుండి అనుమతి వచ్చింది. 2023 అక్టోబరు చివరి నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి, తుది నివేదికను అందించగలను. ప్రాజెక్టు గురించిన అప్డేట్ కోసం వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు పేజీని చూడగలరు. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:48, 2 జూలై 2023 (UTC)Reply

MinT Machine Translation added to your Wikipedia

మార్చు

నమస్తే!

Apologies as this message is not in your language, ⧼Please help translate⧽ to your language.

The WMF Language team has added another machine translation (MT) system for Content Translation in your Wikipedia called MinT; you can use MinT machine translation when translating Wikipedia articles using the Content and Section Translation tool.

The WMF Language team provides the MinT service. It is hosted in the Wikimedia Foundation Infrastructure with neural machine translation models that other organizations have released with an open-source license. MinT integrates translation based on NLLB-200, OpusMT and IndicTrans2 which is the model MinT is using in your Wikipedia. This MT is set as optional in your Wikipedia. Still, you can choose not to use it by selecting "Start with empty paragraph" from the "Initial Translation" dropdown menu.

Since MinT is hosted in the WMF Infrastructure and the models are open source, it adheres to Wikipedia's policies about attribution of rights, your privacy as a user and brand representation. You can find more information about the MinT Machine translation and the models on this page.

Please note that the use of the MinT MT is not compulsory. However, we would want your community to:

  • use it to improve the quality of the Machine Translation service
  • provide feedback about the service and its quality, and the service you prefer as default for your Wikipedia.

We trust that introducing this MT is a good support to the Content Translation tool.

Thank you!

UOzurumba (WMF) (చర్చ) 08:05, 3 జూలై 2023 (UTC)Reply

మింట్ (MinT) యాంత్రికానువాదం

మార్చు

పైన MinT Machine Translation added to your Wikipedia అంటూ రాసిన విభాగాన్ని చూడండి. ఈ పరికరాన్ని నేను కొంత పరీక్షించి చూసాను. నేను గమనించినవి ఇవి:

  • కొత్తగా వచ్చిన పరికరం అయినప్పటికీ, బాగుందిది. అనువాదం నాణెంగా ఉంది. గూగుల్‌తో పోటాపోటీగా ఉంది. కొండొకచో మెరుగ్గా ఉంది. కొత్తగా వచ్చినప్పటికీ సున్నా దగ్గర్నుండి మొదలు పెట్టలేదిది.. దీనికి ముందు వచ్చిన పరికరాల భుజాలపై ఎక్కి ఎక్కువ దూరం చూసినట్టే అనిపించింది.
  • కొన్ని చోట్ల గూగుల్ కంటే మెరుగ్గా ఉంది.
    • ".. it was placed under the administrative control of nearby Saint Kitts" అనే వాక్యాన్ని "దీనిని సమీపంలోని సెయింట్ కిట్స్ పరిపాలనా నియంత్రణలో ఉంచారు" అని మింట్ చక్కగా అనువదించగా, గూగుల్ "బడు"ద్ధాయి మాత్రం "ఇది సమీపంలోని సెయింట్ కిట్స్ యొక్క పరిపాలనా నియంత్రణలో ఉంచబడింది" అని రాసింది. ఈ వాక్యానికి మింట్ చేసిన అనువాదం గూగుల్ కంటే చాలా చాలా చాలా మెరుగ్గా ఉంది. మూలం లోని కర్మణి వాక్యాన్ని తెలుక్కు సహజమైన కర్తరి వాక్యంగా మార్చేసింది. చాలా గొప్ప విషయం ఇది. ఇన్నాళ్ళూ గూగుల్ చేసిన అనువాదాల్లో కొన్ని వేల కర్మణి వాక్యాలను మార్చి ఉంటాను. అందరం కలిసి మరెన్నో వేల సార్లు మార్చి ఉంటాం. అయినా గూగుల్ ఇంకా నేర్చుకోలేదు (ఏమి మెషిన్ లెర్నింగో ఏంటో..). భేష్ మింట్! అయితే మింట్ కూడా అన్ని చోట్లా ఇలా చెయ్యలేదు. కొన్నిచోట్ల కర్మణి వాక్యాలను రాసింది.
    • "contain over 100" అనేదాన్ని అనువదించేటపుడు "100 కు పైగా" అని అనువదించింది. కానీ గూగుల్ మాత్రం "100 కంటే ఎక్కువ". ("100 పైచిలుకు" అని రాస్తే మరింత సహజంగా ఉండేది.)
  • "యొక్క" ను ఇది కూడా ఎక్కువ గానే వాడుతోంది. పై ఉదాహరణలో యొక్క లేకపోవడాన్ని గమనించవచ్చు. అయితే అసలు వాడడం లేదని కాదు, కానీ గూగుల్ కంటే తక్కువగా వాడింది.
  • గూగుల్‌కు లాగానే దీనికి కూడా "మరియు" జబ్బు ఉంది. అయితే దీని డిగ్రీ కొంచెం తక్కువ. కొన్ని చోట్ల "మరియు" వాడలేదు. అయితే పెద్ద తేడా లేదు.
  • కొన్ని చోట్ల గూగులే మెరుగ్గా ఉంది.
    • Precisely when Anguilla was first seen by Europeans is uncertain:అనే వాక్యాన్ని మింట్ "అంగుయిల్లాను యూరోపియన్లు మొదటిసారిగా చూసినప్పుడు ఖచ్చితంగా తెలియదు -" అని అనువదించగా, గూగుల్ మెరుగ్గా, మరింత అర్థవంతంగా "అంగుయిలాను యూరోపియన్లు ఎప్పుడు చూశారు అనేది ఖచ్చితంగా తెలియదు:" అని అనువదించింది. అయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే యాండెక్స్ పరికరం ఈ రెంటి కంటే మెరుగ్గా, "యూరోపియన్లు మొదటిసారిగా ఆంగ్విల్లాను ఎప్పుడు చూశారో ఖచ్చితంగా తెలియదు:" అని అనువదించింది.
  • రెండూ ఒకే తప్పులు చేసాయి. "contain over 100" ను అనువదించినపుడు "..(అది)..కలిగి ఉంది" అని రాసాయి తప్ప "(అందులో).. ఉన్నాయి" అని రాయలేదు.

దీన్ని మరింత పరీక్షించాలి. మింట్ అందరం వాడి దాని పనితనాన్ని పరిశీలించి, మంచి చెడులను మాట్టాడుకుని వాళ్ళకు కూడా చెప్పాలి.

ఒక గమనిక: అనువాద పరీక్ష కోసం నేను వాడిన మూల వ్యాసంలో ఇంగ్లీషు భాష నాణ్యత అంత బాగాలేదు. ఇలాంటి వాటిని అనువదించడంలో యంత్రాలు చాలా తప్పులు చేస్తాయి. అంచేత నాణ్యమైన ఇంగ్లీషు వ్యాసాన్ని అనువదించి చూడాలి. రాబోయే రోజుల్లో మరిన్ని పరీక్షలు చేసి ఆయా ఫలితాలను ఇక్కడ రాస్తాను. మింట్ వాళ్ళకు కూడా చెబుతాను.

ఈ పరికరంలో భారతీయ భాషల అనువాదాల కోసం ఐఐటి చెన్నై వాళ్ళు తోడ్పడ్డారు. ఐఐఐటి హైదరాబాదు వాళ్ళు తమ "పది లక్షల వ్యాసాల" పథకాన్ని మొదలుపెట్టినపుడు కొందరు తెలుగు వికీపీడియన్లని పిలిచారు మాట్టాడ్డానికి. నేనూ వెళ్ళాను. అప్పుడు వాళ్ళకు నేను ఇదే చెప్పినట్టు గుర్తు - మీరు అనువాద యంత్రాన్ని తయారు చేసారు గదా.. దాన్ని వికీమీడియా వాళ్ళకు ఇచ్చి వికీపీడియాలో చేర్చవచ్చు గదా అని. ఇంకా మెరుగు పరచాలి, అదయ్యాక చేస్తాం అని చెప్పారు. వీళ్ళు చెయ్యలేదు గానీ, ఇప్పుడు చెన్నై ఐఐటీ వాళ్ళు తమ మేధను వికీమీడియాకు అందించి ఈ పరికరం తయారీలో తోడ్పడ్డారని గమనించాను. ఆమధ్య నేను ఐఐఐటీ వారి ప్రాజెక్టులో తయారు చేసిన "పది లక్షల" వ్యాసాల్లో ఒక రెండొందల వ్యాసాలను ర్యాండంగా చూసాను. వాటి నాణ్యత ఈ పరికరం నాణ్యతతో పోలిస్తే బాగా తక్కువగా ఉంది -నేలబారుగా ఉందని చెప్పొచ్చు. __ చదువరి (చర్చరచనలు) 00:48, 4 జూలై 2023 (UTC)Reply

@Chaduvari గారూ... నేను కూడా మింట్ అనువాద పరికరాన్ని పరిశీలించాను. మీరన్నట్లుగా ఇది కొంచెం మెరుగే అనిపించింది. ఒక వ్యాసంలో గూగుల్ అనువాదం ఉపయోగిస్తే ఆంగ్ల పదాలు యధాతదంగా అనువాదంలో వచ్చాయి. మింట్ అనువాదంలో ఆ ఆంగ్ల పదాల స్థానంలో తెలుగు పదాలు వచ్చాయి. ఈరోజు నుండి మింట్ అనువాదం ఉపయోగించి వ్యాసాలను అనువదించి పరిశీలిస్తాను. ధన్యవాదాలు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:16, 4 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారూ... మింట్ అనువాదంలో ప్రస్తుతానికి నేను గమనించిన అంశాలు
  • మింట్ ద్వారా అనువాదం చేసినపుడు '్ ' తరువాత వచ్చిన అక్షరం, ముందరి అక్షరానికి వత్తుగా (ఉదా: థియేటర్లో) మారుతోంది. అదే పదం గూగుల్ అనువాదంలో సరిగానే (ఉదా: థియేటర్‌లో) వస్తోంది.
  • ఆంగ్ల వికీ వ్యాసంలోని పట్టికను మింట్ ద్వారా అనువాదం చేసినపుడు ఆంగ్ల వికీలోని 'Year' అనే పదానికి అనువాదంలో 'సంవత్సరం పక్కన ఫుల్ స్టాప్ (ఉదా: సంవత్సరం.)', పట్టికలోని పై మూడు గడులలో సంవత్సరం సంఖ్య పక్కన 'సంచిక' (ఉదా: 2017 సంచిక) అనే పదం వస్తోంది.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 07:18, 11 జూలై 2023 (UTC)Reply

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023

మార్చు

2021, 2022 సంవత్సరాలలో తెలుగు వికీపీడియాను ప్రపంచ స్థాయిలో నిలిపిన WPWP పోటీని ఈ సంవత్సరం కూడా జరుపుకుందాం. జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది, వాడుకరులు పేజీలలో ఫోటోలు చేర్చేటప్పుడు #WPWP #WPWPTE ట్యాగులను వాడవచ్చు, తద్వారా మనం అంతర్జాతీయంగా పోటీలో నిలవవచ్చు.

గ్లోబల్ గా జరుగుతున్న ఈ పోటీ తెలుగు వికీలో ఏ స్థాయిలో జరగాలి అన్న దానిపై సముదాయ సభ్యుల అభిప్రాయాలు కోరుతున్నాను. ఇక గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను అక్షరాలా 53000 రూపాయలు అందుబాటులో ఉన్నాయి.

ప్రాజెక్టు పేజీ : వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023

ఇక ప్రాజెక్టు లక్ష్యాలు అలాగే ఈ సంవత్సరం ఏ పని చేయాలో అనే దానిపై ఇక్కడ చర్చ ప్రారంభించాను.

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య గార్లకి అందరికి పేరు పేరున నమస్కారాలు, గత సంవత్సరం పోటీలో చక్కటి కృషి చేసిన మీ అందరిని ఈ ప్రాజెక్టు లక్ష్యాల నిర్దేశనలో అలాగే ప్రాజెక్టు అభివృద్ధికై సహాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను.

ప్రాజెక్టు నిర్వహణకు ఎవరైనా యువకులు సారధ్యం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. NskJnv 06:32, 4 జూలై 2023 (UTC)Reply

@Nskjnv గారూ... గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను అక్షరాలా 53000 రూపాయలు అందుబాటులో ఉన్న విషయం వికీమీడియా ఫౌండేషన్ వారికి చెప్పారా? వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి అనుమతి తీసుకున్నారా? మీరు చెప్పిన దానిబట్టి కార్యక్రమం నిర్వహించిన తరువాత మిగిలివున్న డబ్బులను ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవద్దు అని వికీమీడియా ఫౌండేషన్ వారు చెబితే అప్పుడు పరిస్థితి ఏంటి?
ఇలా ఎందుకు అడుగుతున్నానంటే వికీపీడియా:సమావేశం/తెవికీ జన్మదిన వేడుక 2022 నిర్వహించుకునేందుకు గ్రాంటులో మిగిలిన డబ్బును వినియోగించుకుందాం అని 2022 డిసెంబరు 20న వికీపీడియా_చర్చ:సమావేశం/తెవికీ_జన్మదిన_వేడుక_2022#తేదీ_ప్రదేశం_నిర్వహణ_వగైరాలు విభాగంలో రాశారు. ఆ తరువాత 'తన్వీర్ హస్సన్(వికీమీడియా) గారి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది' అని రాశారు. కార్యక్రమం నిర్వహించుకున్న తరువాత 2023 జనవరి 4న ఈ విషయమై మిమ్మల్ని మరోసారి అడిగాను. మీ నుండి సమాధానం రాలేదు. నిజానికి పోటీలో తనకు వచ్చిన డబ్బులను తెవికీ జన్మదిన వేడుకకు వినియోగించుకుందాం అని మన సహ సభ్యులు ఒకరు ముందుకు వచ్చారు. మీరు గ్రాంటు నుండి వినియోగించుకుందాం అనేసరికి ఆ సభ్యుడి దగ్గర డబ్బులను తీసుకోకుండా నా సొంత డబ్బు 6 వేలు రూపాయలు ఆ వేడుకకోసం ఖర్చు చేశాను. కానీ ఇప్పటివరకు నేను ఖర్చు చేసిన డబ్బు నాకు రాలేదు. కాబట్టి, మరోసారి ఇలా జరగకుండా ఉండేందుకు ఆ గ్రాంటులో మిగిలిన డబ్బుల గురించి క్లారిటీ ఇవ్వగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:06, 4 జూలై 2023 (UTC)Reply
నమస్కారం ప్రణయ్‌రాజ్ వంగరి గారు,

53000 రూపాయలు అందుబాటులో ఉన్న విషయం వికీమీడియా ఫౌండేషన్ వారికి తెలపడం జరిగింది.

ఇక మీరు మాట్లాడుతున్న తెవికీ జన్మదిన వేడుక విషయానికి వస్తే, తన్వీర్ గారికి నేను ఈ మెయిల్ చేయడం జరిగింది, కానీ దానికి నాకు ఎటుంవంటి స్పందన అందలేదు. ఇక 2023 పోటీ విషయానికి వస్తే, నేను ఎక్కడ కూడా బహుమతుల విషయం కానీ కార్యక్రమాల గురించి గాని ప్రస్తావించలేదు. కేవలం గ్లోబల్ గా జరుగుతున్న పోటీకి లోకలైసెషన్ అవసరమని తెలిపాను, ఇక సభ్యుల అభిప్రాయాలు తెలిపితే ప్రోగ్రామ్ ఆఫీసర్ ని అడిగి మనకు అనుమతి అందిన తరువాతనే కార్యక్రమాలు, బహుమతుల గురించి చర్చించుకుందాం. NskJnv 15:31, 4 జూలై 2023 (UTC)Reply

@Nskjnv గారూ... మీరు మళ్ళీ అదే సమాధానం రిపీట్ చేస్తున్నారు. 'సభ్యుల అభిప్రాయాలు తెలిపితే ప్రోగ్రామ్ ఆఫీసర్ ని అడిగి మనకు అనుమతి' అంటున్నారే కానీ, మిగిలిన డబ్బును ఏం చేయాలి (తిరిగి ఫౌండేషన్ కు పంపించాలా? ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవాలా?) అనే విషయంలో ఇంకా మీరు క్లారిటీ తెచ్చుకోలేదు అనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా నా దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పడమే తప్ప మీ నుండి ఇంకే సమాధానం రావడంలేదు. వాటిని ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోవడానికి ఫౌండేషన్ నుండి అనుమతి తీసుకున్నారా? అనేది స్పష్టత ఇవ్వగలరు. అది తెలిస్తేనే వేరే విషయాలు చర్చించడానికి అవకాశం ఉంటుంది. అది తెలువకుండా సభ్యుల అభిప్రాయాలు తెలిపిన తరువాత... మిగిలిన డబ్బును ఇతర కార్యక్రమాలకు వినియోగించుకోకుండా తిరిగి ఫౌండేషన్ కు పంపించాలి అంటే అప్పుడు ఎలా..?-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:11, 4 జూలై 2023 (UTC)Reply
అసలు ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలో చాలా లోపాలు, సందేహాలు ఉన్నాయి.
ఈ చర్చను ప్రవేశపెట్టిన సాయికిరణ్ గారు, గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను మిగిలిన 53000 రూపాయలు ఇప్పటికి దాదాపుగా అవి వారి వ్యక్తిగత ఖాతాలో సుమారు 10 మాసాలు పైనుండి ఉన్నాయని నేను భావిస్తున్నాను.ఈ 53,000 రుపాయలను అప్పటి నుండి దేనికి ఎలా వినియోగిద్దామనే అనే దానిపై ఇప్పటికి మూడు దఫాల చర్చలలో దానికిని, దీనికని చర్చలు జరిగనవి. ఆ చర్చలను ఒకసారి పరిశీలిద్దాం.
మొదటి దఫా చర్చ: తెవికీ జన్మదిన వేడుక 2022 చర్చాపేజీలో ఈ సొమ్ము మీద జరిగిన చర్చను ఒకసారి పరిశీలిద్దాం.
  • Pranayraj1985 గారు, WPWPTE కి సంబంధించిన గ్రాంటు కొంత మిగిలి ఉంది. ఈ కార్యక్రమ నిర్వహణకు ఎలాంటి అవసరాలు ఉన్నాయో మనం ఒకసారి అనుకుంటే, దానిపై తగిన నిర్ణయం తీసుకుందాం.NskJnv 12:53, 20 డిసెంబరు 2022 (UTC)Reply
  • ఎంత మిగిలింది అని వివరం తెలుపవచ్చుగదా?దానినిబట్టి కూడా ప్లాను చేసుకోవచ్చు. యర్రా రామారావు (చర్చ) 13:08, 20 డిసెంబరు 2022 (UTC)Reply
  • యర్రా రామారావు గారు, అక్షరాలా 53,000 యాభై మూడు వేయిలు మిగిలింది అండి, దీని ఉపయోగం పట్ల మీ అభిప్రాయం తెలియజేయగలరు. NskJnv 13:18, 20 డిసెంబరు 2022 (UTC)Reply
  • ధన్యవాదాలు @Nskjnv గారు. మన కార్యక్రమ నిర్వహణలో భాగంగా రెండు ఫ్లెక్సీలు (12*8 సైజు వేదిక, 8*8 సైజు బయట), తెవికీ జన్మదిన వేడుక కేకు, వచ్చిన సభ్యులను బట్టి మధ్యాహ్న భోజనం-టీ-స్నాక్స్, తెవికీ బ్యాడ్జీలు వంటివి అవసరమతున్నాయి.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:43, 20 డిసెంబరు 2022 (UTC)Reply
  • Pranayraj1985 గారు, అలాగే నండి, దీనికి సంబంధించి తన్వీర్ హస్సన్(వికీమీడియా) గారి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది. NskJnv 17:04, 20 డిసెంబరు 2022 (UTC)Reply
  • అలాగేనండి @Nskjnv గారు..!-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 12:44, 21 డిసెంబరు 2022 (UTC)Reply
వేడుక నిర్వహణలో భాగంగా ఫ్లెక్సీ (డిజైన్, ప్రింట్, పేస్టింగ్)లకు 3వేలు, మధ్యాహ్న భోజనంకు 2వేలు, కేకు-స్నాక్స్ లకు 1వేయి రూపాయలు... మొత్తంగా 6వేలు ఖర్చయ్యాయి. *@Nskjnv గారూ, WPWPTE గ్రాంటు గురించి తన్వీర్ హస్సన్(వికీమీడియా) గారి అభిప్రాయం తెలుసుకోవాల్సి ఉంది అన్నారు కదా, దాని గురించి అప్డేట్ చేయగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:32, 4 జనవరి 2023 (UTC)Reply
దీని తరువాత సాయికిరణ్ గారి ఎటువంటి స్పందనలేదు.
రెండవ దఫా చర్చ:పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/గ్రాంటు వినియోగం విభాగంలో ఈ 53,000 రుపాయల మీద సాయికిరణ్ గారు ప్రవేశపెట్టిన చర్చను ఒకసారి పరిశీలించండి.
  • జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది, *సముదాయ సభ్యులకు నమస్కారం!తెలుగు వికీలో 2022 సంవత్సరానికి గాని నిర్వహించిన వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని అందరికి తెలిసిన విషయమే. ఇటీవల ఈ గ్రాంటు ఉపయోగం అలాగే ఈ కార్యక్రమం ద్వారా జరిపిన అభివృద్ధి పనుల రిపోర్టు వికీమీడియా ఫౌండేషన్ వారికి అందజేయటం జరిగింది. ఈ గ్రాంటు రిపోర్టును మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక గ్రాంటు రుసుం ఉపయోగం విషయానికి వస్తే మనకి అందిన 2,94,756 రూపాయలలో ఖర్చులు పోగా 53000 రూపాయలు మిగిలి ఉంది. సముదాయంలో ఎవరైనా సరే ఈ మిగిలి ఉన్న గ్రాంటుతో ఏదైనా కార్యక్రమం నిర్వహించదలిస్తే ఇక్కడ చర్చ జరపవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు NskJnv 02:51, 3 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • గ్రాంటును ముగించి, రిపోర్టు సమర్పించినందుకు అభినందనలు @Nskjnv గారూ. కొంత సొమ్ము మిగల్చడమే కాకుండా దాన్ని వేరే మంచి కార్యకలాపాలకు వాడదామని ప్రతిపాదించడమూ, అందుకు సముదాయాన్ని మీరు సలహా అడగడమూ చాలా మంచి సంగతి. మిగిలిన సొమ్ముతో ఫోటోగ్రఫీ, కాపీహక్కుల విషయంలో కామన్సులో చురుకుగా ఉన్న తెలుగు వికీపీడియన్లకు ఒక రెండు రోజుల కార్యశాల చేస్తే బావుంటుందని నా ప్రతిపాదన. ఇలాంటి అనుబంధ కార్యకలాపాలకు అవకాశం ఉందో లేదో మీరు గ్రాంట్స్ ఆఫీసరుతో ఒకసారి చర్చిస్తే మనం ఈ చర్చను ముందుకు తీసుకుపోవచ్చు. మీరు మెయిల్ చేసి, అనుమతి తీసుకున్నాకా మనం తదుపరి చర్చ కొనసాగించవచ్చు. మీరు అక్కడ నుంచి అనుమతి తెచ్చుకుంటే మనం అందరం ఆలోచించి ఏదైనా చేద్దాం. ముందస్తు శుభాకాంక్షలతో.. పవన్ సంతోష్ (చర్చ) 06:58, 8 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది,*పవన్ సంతోష్ గారు, మీ సూచనలకు ధన్యవాదాలు. అయితే ఈ ప్రాజెక్టుని సముదాయంలో చురుకైన వికీపీడియన్లలో ఎవరైనా నిర్వహిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అలా ఎవరైనా నిర్వహించడానికి సిద్ధంగా ఉంటె నేను వెంటనే వికీమీడియా వారి అనుమతి పనులు ప్రారంభించగలను. NskJnv 15:34, 16 మే 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • @Nskjnv మీరు అడగండి. వారు ఒప్పుకుంటే నేను ఈ బాధ్యత తీసుకుని పనిచేస్తాను. పవన్ సంతోష్ (చర్చ) 16:03, 16 మే 2023 (UTC)
గమనించండి పవన్ సంతోష్ గారు ముందుకువస్తే దీని తరువాత సాయికిరణ్ గారి నుండి ఎటువంటి స్పందనలేదు.దీనిని బట్టి సాయికిరణ్ గారు ముందు దృష్టితో దీనిని ఆలోచనలో పెట్టుకుని కాలక్షేపం కోసం చర్చలు కొనసాగిస్తూ, ఇలా పొడిగించుకుంటూ వచ్చారా అని నేను సూటిగా అడుగుతున్నాను.
ప్రస్తుత చర్చలో
మరలా అదే 53,000 లు వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023 లో ఖర్చుచేద్దాం అనే మరో ప్రతిపాదనను చర్చకు ప్రవేశపెట్టారు. ఈ చర్చను పరిశీలిద్దాం. ఈ చర్చలో
జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది, ఇక గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను అక్షరాలా 53000 రూపాయలు అందుబాటులో ఉన్నాయి.ప్రాజెక్టు పేజీ వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023 (సాయికిరణ్ గారు సృష్టించిన ప్రాజెక్టు పేజీ లింకు) లింకును ఉదహరిస్తూ ప్రాజెక్టు నిర్వహణకు ఎవరైనా యువకులు సారధ్యం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని తెలిపారు.
పై విషయంలో నేను అనేది ఏమిటంటే ఈ ప్రాజెక్టుకు ఎవరైనా యువకులు సారధ్యం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఉన్న సాయికిరణ్ అసలు ప్రాజెక్టు పేజీ, దాని ఉపపేజీలు సముదాయంలో ఎటువంటి చర్చలు జరగకుండానే సాయికిరణ్ గారు ఎందుకు సృష్టించాల్సిన అవసరమొచ్చిందని నేను సూటిగా అడుగుతున్నాను.
మాములుగా అయితే సముదాయం ముందు జులై 1 నుండి అంతర్జాతీయంగా ఈ పోటీ మొదలైంది.గత ప్రాజెక్టు డబ్బు 53000 రుపాయలు మిగిలి ఉన్నవి అవిదీనికి బదలాయిద్దాం.ఈ ప్రాజెక్టుకు ఎవరైనా యువకులు సారధ్యం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చర్చను ప్రవేశపెట్టి అభిప్రాయాలు తీసుకోవాలి.అతరువాత చర్చలో జరిగిన అభిప్రాయాలు ప్రకారం చర్యలు ఉండాలి. అంతేగాని ఈ రకంగా ఉంటే ఎలా అనేది అర్థం చేసుకోవాలి.
ఇంకొక విషయం ఎంతసేపు చెప్పినా ఇదే విషయం. గత సంవత్సరం పోటీకి వచ్చిన గ్రాంటులో ఖర్చులు పోను అక్షరాలా 53000 రూపాయలు అందుబాటులో ఉన్నాయి అనే చెబుతున్నారుగానీ, వికీమీడియా ఫౌండేషన్ వారి అనుమతి మాత్రం తెలుసుకుని చర్చకు పెట్టుటలేదు.ఇలా ఎందుకు జరుగుతుంది సూటిగా సాయికిరణ్ గారు చెపితే తెలుసుకోవాలని ఉంది.
తరువాత ఇంకొక విషయం ఈ ప్రాజెక్టు ఒకవేళ మీరు నిర్వహిస్తే ఈ 53,000 పోను ఇంకా ఎంత గ్రాంటు మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపుచున్నారో తెలుసుకోవాలని ఉంది. యర్రా రామారావు (చర్చ) 11:07, 5 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ, ఈ విషయంలో మీకు రెండు సూచనలు చేసి సహాయపడాలనుకుంటున్నానండీ:
  1. ప్రస్తుతం తన్వీర్ హాసన్ వికీమీడియా ఫౌండేషన్ లో పనిచేయట్లేదండీ. Grants:Regions/South_Asia అన్న పేజీకి వెళ్ళి అక్కడ కాంటాక్ట్ మెయిల్ ని సంప్రదిస్తే ప్రస్తుత గ్రాంట్స్ మేనేజర్ నుంచి మీకు తగిన జవాబు లభించవచ్చు. (ఎప్పుడైనా గ్రాంట్స్ మేనేజర్ మెయిల్ కి పంపడంతో పాటుగా వారిచ్చే సౌత్ ఏసియా గ్రాంట్స్ గ్రూప్ మెయిలైడీని సిసి చేయడం మంచిది. వ్యక్తులు మానేయవచ్చు, సెలవులో వెళ్ళవచ్చు, ఇంకేదైనా కారణాల వల్ల మీకు స్పందన లభించకపోవచ్చు. అదే గ్రూప్ మెయిల్ ని సీసీ చేస్తే ఆ సమస్య ఉండదు)
  2. అలానే మరొక సూచన - తప్పనిసరిగా ఫలానా కార్యక్రమమే చేయాలని ఏమీ లేదు, మీరూ, మీ గ్రాంట్స్ మేనేజర్ కలసి చర్చించుకుని ఏదోక నిర్ణయం తీసుకుని సముదాయంలో ప్రారంభమైన చర్చను అది తెలియజేసి ముగించండి సరిపోతుంది. సముదాయానికి వివరం తెలియజెప్పి ఈ అంశాన్ని ముగించడం ముఖ్యం కానీ ఈ విషయంలో కచ్చితంగా ఇదే చేయాలి, అదే చేయాలి అని ఏమీ లేదు.
పవన్ సంతోష్ (చర్చ) 14:04, 5 జూలై 2023 (UTC)Reply
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు,
  1. తన్వీర్ గారు ఇప్పుడు ఫౌండేషన్ నుండి తొలగినట్లు తెలిపినందుకు ధన్యవాదాలు, అలాగే మీరు సూచించినట్లు గ్రూప్ మెయిల్ ని సీసీ చేయటం అనే అంశం తెలియజెప్పినందుకు కూడా ధన్యవాదాలు.
  2. మీరు అన్నట్లు ప్రోగ్రాం ఆఫీసర్ తో చర్చ జరిపి ఈ విషయంలో గ్రాంటీ గా నేను నిర్ణయం తీసుకోవచ్చు, ఇక ఈ గ్రాంటు ఖర్చు విషయాన్నీ ప్రోగ్రాం ఆఫీసర్ తో చర్చించి దేనికి ఖర్చు చేయాలో సొంతంగా నేనే నిర్ణయం తీసుకుంటాను.

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ అనేది ఒక అంతర్జాతీయ వికీ ఉద్యమం, దీంట్లో ఏ కమ్యూనిటీ వారైనా పాల్గొనవచ్చు. తెలుగు కమ్యూనిటీ కూడా పాల్గొనవచ్చు, అందరికి ఈ పోటీని గుర్తు చేయాలని నేను ఆయా పేజీలు సృష్టించాను- వాటి వల్ల గ్లోబల్ గా మన గుర్తింపు ఉంటుంది. ఈ ప్రాజెక్టుని నిర్వహించడానికి ఏ గ్రాంటు అవసరం లేదు ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటె తెవికీ పేజీలలో దిద్దుబాట్లు చేయవచ్చు, అవి గ్లోబల్ పోటీకి లెక్కలోకి వస్తాయి.

సదరు సభ్యులు తెవికీ అభివృద్ధికి దిశగా నేను ఏ పని చేయడానికి ముందుకు వచ్చిన అడ్డుకోవాలి అన్నట్లుగా వారి ప్రవర్తన ఉన్నదని తోస్తుంది, అంతర్జాతీయంగా తెలుగు వికీ ఖ్యాతి పెంచిన ప్రాజెక్టు నిర్వహణ గురించిన చర్చలో వ్యక్తిగత విమర్శే తప్ప ప్రాజెక్టు నిర్వహించే దిశగా ఏ అంశం లేకపోవటం శోచనీయం.

అయినా సదుద్దేశంతో సదరు సభ్యులు ఈ సూచనలు చేశారని భావిస్తున్నాను.

మరొక్క సారి గత సంవత్సరం పోటీలో చక్కటి కృషి చేసిన తెలుగు వికీ సభ్యులను అందరిని ఈ ప్రాజెక్టు లక్ష్యాల నిర్దేశనలో అలాగే ప్రాజెక్టులో గ్లోబల్ స్థాయిలో మన ఉనికి నిలుపుకునేందుకు దశ దిశలపై చర్చకు ఆహ్వానిస్తున్నాను.

అభిలాష్ మ్యాడం, మమత, Divya4232, Thirumalgoud, Muralikrishna M, ప్రభాకర్ గౌడ్ నోముల, Ch Maheswara Raju☻, స్వరలాసిక, కె.వెంకటరమణ, యర్రా రామారావు, రమేష్‌బేతి, ప్రణయ్, MYADAM KARTHIK, కుమ్మరి నరేష్, Kishorahs, ప్రశాంతి, Anjali4969, Kasyap, ఆదిత్య పకిడే Adbh266, Shashi gara , Vinod chinna, Laya dappu, Prasanna murahari, బివిప్రసాద్ తెవికీ Bvprasadtewiki, Batthini Vinay Kumar Goud, ఊరే మనోజ్, Pravallika16, వి భవ్య.


NskJnv 15:27, 5 జూలై 2023 (UTC)Reply

@Nskjnv గారూ, కాస్త శాంతంగా ఆలోచించి చూడండి.
రామారావు గారూ, ప్రణయ్ గారూ ఇలా రాయడం వెనుక మీరు గతంలో ప్రారంభమైన చర్చల్లో చెప్తానన్న విషయం ఇప్పటిదాకా చెప్పలేదన్న ఉద్దేశం మినహా మరేమీ లేదని నా అభిప్రాయం. ఉదాహరణకు మీరిప్పుడు అడిగాకనే పాత గ్రాంట్స్ ప్రోగ్రామ్ మేనేజర్ నుంచి ప్రతిస్పందన కోసం వేచిచూస్తూ ఉన్నారన్న సంగతి చెప్పారు. అలాక్కాకుండా, మీరే ఒక పది పదిహేను రోజులు ప్రతిస్పందన లేకపోవడం చూసి రచ్చబండలో రాసివుంటే నేనిప్పుడు ఇచ్చిన సలహా అప్పుడే ఇద్దును కదా.
అదలా ఉంచితే, ప్రణయ్ గారు జేబులోంచి డబ్బులు ఖర్చుపెట్టానంటున్నారు. డబ్బు వెచ్చించి సమాధానం కోసం ఆరేడు నెలల నుంచి వేచిచూస్తున్న వ్యక్తులకు ఆ సంగతిపై స్పష్టత లేకుండా వేరే విషయాలు మాట్లాడితే కాస్తో కూస్తో కోపం వస్తుంది కదా. మీ పరిస్థితి మీకుంది, ఆయన పరిస్థితి ఆయనకుంది కదా. ఒక్కోసారి వేచిచూడాల్సిన పరిస్థితి తప్పదనుకోండి. అలాంటప్పుడు అనునయంగా వివరించి చెప్తే కాస్త వాళ్ళు కూడా సర్దుకునేవాళ్ళు కదా.
అందుకుతోడు, సముదాయ సభ్యుల్లో ఎవ్వరికీ గ్రాంట్ల నిర్వహణ గురించి సరైన అవగాహన లేదని నాకు తోస్తున్నది. మనం వార్షికోత్సవం చేసేసుకుని, మన దగ్గర వేరే పనికి తీసుకున్న డబ్బులు మిగిలాయి, ఆ డబ్బులు దీనికి చెల్లగొట్టనా అని అడిగితే వికీమీడియా ఫౌండేషన్ సానుకూలంగా స్పందిస్తుందని నాకు అనిపించట్లేదు. కాబట్టి, నేనేమంటానంటే ఇప్పుడు మనకు కావాల్సింది గ్రాంట్ల గురించి మంచి శిక్షణ. @Pranayraj1985 గారూ, @యర్రా రామారావు గారూ: మీరు కూడా ఈ అంశాన్ని గమనించండి. మన సముదాయానికి గ్రాంట్లు ఎలా తీసుకోవాలి, ఎలా మనలో మనం చర్చించుకోవాలి, ఎలా పనిచేయాలి అన్నదానిపై తగిన శిక్షణ అవసరం. అలాంటిదేమీ లేకపోవడం వల్ల నేనూ, మరికొందరు కూడా గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పటికీ అవే ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం.
ఇక @Nskjnv గారూ, మీవరకూ మీరు, ఎవ్వరూ మిమ్మల్ని అడిగే పనిలేకుండా సమాచారం ఇవ్వడం అన్నదొకటి అలవరుచుకోండి. ఈ విషయంలో ఎవ్వరూ ఏ తప్పిదాలు చెయ్యరని కాదు. నేనూ సమాచారాన్ని ఆలస్యంగా ఇచ్చే విషయంలో పొరబాట్లు చేసివుండొచ్చు. కానీ, పొరబాటుకు మూలం ఇదీ అని గమనించినప్పుడు మనం దిద్దేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది.
ఒకవేళ ఎవరైనా మాట్లాడిన మాటల్లో అవమానకరమైనదో, అభ్యంతరకరమైనదో ఉంటే సహించాల్సిన పనేమీ లేదు. ఫలానా మాట నిరాధారమైన విమర్శ అనిపిస్తే అదే చెప్పి, ఆధారం ఉంటే ఇవ్వమని వాళ్ళనే అడగండి. అలానే, వారు మన లోటుపాట్లు ఎత్తిచూపితే, అది వాస్తవం అనిపిస్తే నిస్సంకోంచగా ఫలానాది నా లోపం నేను దిద్దుకుంటాను అనో, ఎవరైనా నాకు సాయం చేయండి అనో చెప్పండి. దానివల్ల అందరం లాభపడతాం.
ఏదైనా పాయింట్ బై పాయింట్ వెళ్దాం. ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకానీ, అందరమూ ఆవేశపడడం వల్ల ఏ ఉపయోగం ఉండదు. పవన్ సంతోష్ (చర్చ) 09:51, 6 జూలై 2023 (UTC)Reply

దిగుమతులకు సంబంధించి

మార్చు

ఇతర వికీల నుంచి దిగుమతి చేసుకునే విధానం గురించి వికీపీడియా:వాడుకరులకు సూచనలు/దిగుమతి అనే పేజీని సృష్టించి దాన్ని వాడుకరులకు సూచనలు పేజీలో ఇమిడ్చాను. అలాగే దిగుమతి చెయ్యమని నిర్వాహకులను అభ్యర్థించేందుకు గాను వికీపీడియా:దిగుమతి అభ్యర్థనలు అనే పేజీని తయారు చేసాను. వాడుకరులు తమ అభ్యర్థనలను ఆ పేజీలో చేర్చవచ్చు. __ చదువరి (చర్చరచనలు) 15:21, 5 జూలై 2023 (UTC)Reply

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 15:26, 5 జూలై 2023 (UTC)Reply

తెవికీ నిర్వాహకత్వం

మార్చు

తెవికీలో 2013 తరువాత కొత్తగా నిర్వాహకుల జాబితాలోకి కొత్త వారు ఎక్కువగా ఎవరు చేరనట్లు వికీపీడియా:నిర్వాహకుల జాబితా పేజీ ద్వారా తెలుస్తుంది, అలాగే 2023 జనవరిలో వాడుకరి:దురుపయోగాల వడపోత ని నిర్వాహకుల జాబితాలో చేర్చడం జరిగింది, ఈ ఖాతా ఎవరిది దీనిని నిర్వాహకుల జాబితాలో ఎలా చేర్చడం జరిగింది అనే దానిపై ఎవరికైన సమాచారం ఉంటె తెలుపగలరు.

NskJnv  15:42, 5 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ... వాడుకరి:దురుపయోగాల వడపోత అనేది నిర్వాహకుల జాబితాలోకి చేరడం విషయమై గతంలో సహ సభ్యులతో చర్చించినట్టు (ఆన్ వికీ/ఆఫ్ వికీ) నాకు గుర్తుంది. దురుపయోగాల వడపోత అనేది ఏ ఒక్కరికి సంబంధించిన వ్యక్తిగత ఖాతా కాదని, బాట్ ద్వారా వచ్చిన మార్పు అని, దీని గురించి స్టీవార్డులకు తెలియపరిచి నిర్వాహకుల జాబితాలోనుండి తీసేయించినట్టు గుర్తు. చదువరి గారూ, రామారావు గారూ దీని వివరం మీకేమైనా తెలుసా..?-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:29, 7 జూలై 2023 (UTC)Reply

ఎన్వికీలో Wikipedia_languages మూసలో తెవికీ చేరింది

మార్చు

en:Template:Wikipedia_languages మూసలో ఇప్పుడు తెవికీ కూడా చేరింది. ఈ మూస ఎన్వికీ మొదటి పేజీలో అడుగున ఉంటుంది. చాలా ఎక్కువ పేజీవ్యూలుండే పేజీ అది - రోజుకు 13 కోట్ల పైచిలుకు పేజీ వ్యూలు! ఇప్పుడు ఆ మూసలో మన లింకు కూడా చేర్చడంతో మనకూ పేజీ వ్యూలు పెరిగే అవకాశం ఉంది.

అందులో మన లింకు కూడా చేర్చమని చేర్చమని అడిగే సమయంలో, గతంలో మనవాళ్ళు అడిగారని, అప్పట్లో మనకు ఆ అర్హత లేనందువల్ల చేర్చలేదనీ తెలిసింది. ఇప్పుడు మనకు ఆ అర్హతలు ఉన్నాయి కాబట్టి అడగ్గానే రెండు మూడు రోజుల్లో చేసేసారు. నిజానికి ఆ అర్హతలు మనకు ఎప్పుడో వచ్చేసాయి. ఇన్నాళ్ళూ అడగకపోవడం మన తప్పే. __ చదువరి (చర్చరచనలు) 00:33, 6 జూలై 2023 (UTC)Reply

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 00:45, 6 జూలై 2023 (UTC)Reply
ఇది మన తెలుగువారందరికీ ముఖ్యంగా తెవికీ వాడుకరులకు గర్వకారణం. చదువరి గారికి ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 06:29, 6 జూలై 2023 (UTC)Reply
మంచి వార్త తెలిపినందుకు చదువరి గార్కి ధన్యవాదాలు.దీనినిబట్టి తెలుగు వికీపీడియా మంచి గుర్తింపు పొందిందని భావిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 07:57, 6 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారూ, ఇంత చక్కని పనిచేసినందుకు ధన్యవాదాలండీ. మీ చురుకుదనం నాబోటివాళ్ళం కూడా అరువు తెచ్చుకుని తెవికీకి మరింత ఉత్సాహంగా సేవచేయగలమని ఆశిస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 10:26, 6 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారూ, గొప్ప విజయం, అభినందనలు --Muralikrishna m (చర్చ) 13:01, 6 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారు, చక్కటి పని చేశారు, ధన్యవాదాలు. NskJnv 14:34, 6 జూలై 2023 (UTC)Reply

వెక్టరు 2022 రూపులో సమస్య

మార్చు

వెక్టరు 2022 రూపులో పేజీకి పైన కుడి మూలన ఉండే వాడుకరి డ్రాప్ డౌన్ మెనూలో నిన్నటి నుండి సమస్య ఏర్పడింది. ఆ మెనూలో నా మార్పులు, అనువాదం, ఎక్కింపులు ఈ మూడూ వివిడిగా డ్రాప్ డౌనులో కనబడేవి. నిన్నటి నుండి ఆ మూడింటినీ నా మార్పులు అనే మెనూకు ఉపమెనూగా మార్చారు. ఇప్పుడూ "నా మార్పులు" మీద కర్సరును ఉంచినపుడు పై మూడూ ఉపమెనూలిఉగా కనిపిస్తాయి. అంతవరకూ బానే ఉంది. కానీ ఈ ఉపమెనూలను క్లిక్కు చేద్దామని పోతే అవి అమంకు అందవు, మాయమై పోతాయి. దాంతో వాటిని క్లిక్కు చెయ్యడం దాదాపు అసాధ్యంగా మారిపోయింది. ఆ సంగతిని డెవలపర్లకు చెప్పాను.__ చదువరి (చర్చరచనలు) 02:06, 7 జూలై 2023 (UTC)Reply

నిన్న నాకూ ఇదే సమస్య ఎదురైంది. దీనినిబట్టి చూస్తే వెక్టరు 2022 రూపు అనేది ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నదనిపిస్తోంది, పూర్తిస్థాయిలో ఎప్పటికి అందుబాటులోకి వస్తుందో తెలియడంలేదు. సమస్యను డెవలపర్లకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు ::Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 02:28, 7 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారూ... వాడుకరి డ్రాప్ డౌన్ మెనూలో డెవలపర్లు మార్పులు చేసినట్టున్నారు. ఆ మెనూలోని నా మార్పులు, అనువాదం, ఎక్కింపులు ఈ మూడూ విడివిడిగా డ్రాప్ డౌనులో కనబడతున్నాయి. అయితే కొద్దిసేపు గురువు డ్యాష్ బోర్డు, అనువాదాలు స్థానాలు ఒకదానిపై ఒకటి పైకి కిందికి మార్చబడ్డాయి. గతంలో ఏదైనా పేజీ మొదట్లో ఉన్నపుడు వాడుకరి డ్రాప్ డౌన్ మోనూ నొక్కితే ఆ మెనూలో ఉన్న అనువాదాలు విభాగం, పేజీని కిందికి జరిపినపుడు వాడుకరి డ్రాప్ డౌన్ మెనూ నొక్కితే అప్పుడు మెనూలో అనువాదాలు విభాగం కనపడకపోయేది. కానీ ఇప్పుడు పేజీలోని ఏ భాగంలో ఉండైనా వాడుకరి డ్రాప్ డౌన్ మెనూ నొక్కితే ఆ మెనూలో అనువాదాలు విభాగం కనిపిస్తోంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 16:08, 27 జూలై 2023 (UTC)Reply

వికీ భాష ప్రామాణికత - క్రీస్తు శకం / సామాన్య శకం

మార్చు

ఇటీవల యోగా అనే వ్యాసంలో జరిగిన మార్పులు ఇలా ఉన్నాయి ఈ వ్యాసం ఆంగ్ల మూలంలో కూడా సామాన్య శకం Common Era (CE) and సామాన్య శకం, సామాన్య శక పూర్వము Before the Common Era (BCE) అనే ఉంది. కానీ తెలుగు అనువాదంలో ఇక్కడ క్రీపూ, క్రీశ వాడారు. లౌకికవాదం కోసం ఆధునిక చర్తిత్ర కారులు ఈ మార్పుని చేయడం జరిగింది. లౌకిక భాషనీ తెలుగులో కూడా విరివిగా వాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మార్పు చేయడం జరిగింది అని రాశారు, దీనివలన ఇప్పటి వ్యాసాలలో ఉన్న క్రీ.పూ. 512, సా.శ..పూ. 512 గాను, సా.శ.. 1757, సా.శ.. 1757 గాను మారుతాయి,ఇది నాకూ సబబు గానే అనిపించినది ఇలాంటివి చాలా వరకు అటోవికీ ద్వారా సవరించవచ్చు, దీని మీద చర్చ చేసి ఆమోదయోగ్యమైన వికీ రచనా శైలి లో సూచన చేద్దామా? : Kasyap (చర్చ) 10:31, 7 జూలై 2023 (UTC)Reply

"సామాన్య శకం" వాడుక సహేతుకమే. కానీ క్రీస్తు శకం అని ఉన్నవాటిని పనిగట్టుకుని మార్చాల్సిన అవసరం లేదేమోనని నా అభిప్రాయం. ఒకే వ్యాసంలో రెండు రకాలు వాడకుండా ఉంటే మంచిది. సామాన్య శకం వాడిన వ్యాసాల్లో మొదటిసారి ఆ పదం వచ్చిన చోట దానికి సామాన్య శకం పేజీ లింకు ఇస్తే బాగుంటుంది. అలాగే క్రీస్తు శకానికి కూడా. __ చదువరి (చర్చరచనలు) 14:25, 7 జూలై 2023 (UTC)Reply
@Chaduvari @Kasyap ఒక table తయరు చెసీ వికీపీడియా:రచ్చబండ (సాంకేతికము)

పజీలొ ఉంచితె మంచిది అని నా అభిప్రయం.

5 AD ?
5 BC ?
5 BCE ?
సా.శ..పూ. 512 ?
క్రీ.పూ. 512 ?

రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 00:41, 11 జూలై 2023 (UTC)Reply

వివిధ భారతీయ భాషా వికీపీడియాల గణాంకాలు

మార్చు

వివిధ భారతీయ భాషల వికీపీడియాలకు చెందిన ముఖ్యమైన గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు. తమిళం, హిందీల్లో వ్యాసాలు మనకంటే 80% పైగా ఎక్కువ. కానీ డేటాబేసు పరిమాణం మాత్రం మనకంటే తక్కువ. మలయాళంలో వ్యాసాలు మనతో సమానం. కానీ డేటాబేసు మాత్రం మనకంటే 30% ఎక్కువ. బెంగాలీ వికీలో వ్యాసాలు మనకంటే 65% ఎక్కువ, కానీ డేటాబేసు మాత్రం మనకంటే 160% ఎక్కువ. ఈ విధంగా చూస్తే బెంగాలీ, మలయాళం వికీపీడియాల మూలాలు వికీలన్నిటి లోకీ గట్టిగా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. ఆ తరవాత మనమే. హిందీ తమిళ వికీలు మనకంటే బోలుగా ఉన్నై. పరిశీలించండి.

ఈ గణాంకాలు 2023 జూలై 5 నాడు wikiscan.org నుండి తీసినవి. __చదువరి (చర్చరచనలు) 14:16, 7 జూలై 2023 (UTC)Reply

2023 జూలై 5 నాటి గణాంకాలు (wikiscan.org నుండి) తెలుగు తమిళం మలయాళం కన్నడం హిందీ బెంగాలీ మరాఠీ పంజాబీ గుజరాతీ ఒరియా
వ్యాసాల సంఖ్య 83,922 1,57,010 84,940 30,934 1,61,621 1,39,536 93,692 50,620 30,380 16,949
మొత్తం పేజీలన్నిటి సంఖ్య 3,26,669 4,91,629 5,09,738 1,34,986 12,62,175 11,76,224 2,98,429 1,61,313 1,23,781 75,391
మొత్తం దిద్దుబాటు చేసిన వాడుకరులు 16,061 25,583 25,542 16,014 81,621 58,740 16,740 5,249 7,140 3,855
చురుగ్గా ఉన్న వాడుకరులు 184 299 244 174 1239 1095 178 96 69 40
వ్యాసాల్లో చేసిన దిద్దుబాట్లు 26,99,491 25,95,173 19,68,232 6,06,459 33,83,585 41,50,015 16,90,840 5,01,993 5,04,910 2,73,265
మొత్తం దిద్దుబాట్లన్నీ 36,29,212 35,34,340 36,82,025 11,15,288 51,58,820 62,25,885 21,80,605 6,66,314 8,07,760 4,28,583
డేటాబేస్ పరిమాణం 1.7 జిబి 1.6 జిబి 2.2 జిబి 674 ఎంబి 1.6 జిబి 4.6 జిబి 590 ఎంబి 389 ఎంబి 245 ఎంబి 231 ఎంబి
సగటున రోజువారీ వ్యాసాల దిద్దుబాట్లు 572 588 275 120 526 1247 324 181 37 51
సగటున రోజువారీ మొత్తం దిద్దుబాట్లు 670 744 356 162 825 2056 404 260 61 67
సగటున రోజుకు చేరే వ్యాసాల కంటెంటు 228 కెబి 260 కెబి 174 కెబి 114 కెబి 191 కెబి 644 కెబి 144 కెబి 224 కెబి 9.4 కెబి 27 కెబి
సగటున రోజుకు చేరే మొత్తం కంటెంటు 477 కెబి 316 కెబి 388 కెబి 148 కెబి 308 కెబి 973 కెబి 171 కెబి 276 కెబి 18 కెబి 45 కెబి
సగటున రోజుకు కొత్త వ్యాసాలు 20 24 14 5 19 40 22 30 1 3
సగటున రోజుకు అన్ని వ్యాసాలు 66 86 66 15 224 535 64 80 18 11


చదువరి (చర్చరచనలు) 14:16, 7 జూలై 2023 (UTC)Reply

ధన్యవాదాలు @Chaduvari గారు.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 18:19, 7 జూలై 2023 (UTC)Reply

నాకు తెలిసిన హిందీ వంటి భాషలలో 30 శాతం మానవ సవరణల నిబంధన లేదు అనుకొంటున్నాను.Kasyap (చర్చ) 06:20, 9 జూలై 2023 (UTC)Reply

భారత స్వాతంత్ర్యోద్యమం

మార్చు

"భారత స్వాతంత్ర్యోద్యమం" అనే పదం దోషంగా కనపడుతోంది. ఈ శీర్షికలో దోషాన్ని సరిచేయడానికి ప్రయత్నించండి. ఇటువంటి చర్చ వికీపీడియా:రచ్చబండ/పాత_చర్చ_68#2010వికీపీడియా ఎడిటర్ తో దోష నిర్ధారణకు సహాయం లో జరిగింది. దీనిని సరిచేయవలసినదిగా వీవెన్, చదువరి, ప్రణయ్ రాజ్ లు ఈ దోషాన్ని సరిచేయుటకు తగు చర్యలు తీసుకోవలసినదిగా కోరుతున్నాను.➤ కె.వెంకటరమణచర్చ 02:17, 9 జూలై 2023 (UTC)Reply

మొబైల్ లో సరిగానే కనిపిస్తుంది.➤ కె.వెంకటరమణచర్చ 02:28, 9 జూలై 2023 (UTC)Reply
@K.Venkataramana గారూ, సరిగ్గా ఇదే సమస్య నా ఆఫీసు ల్యాప్‌టాపులో ఉంది. కానీ నా సొంత ల్యాప్‌టాపులో బాగానే ఉంది. నా ఆఫీసు ల్యాప్‌టాపులో క్రోం బ్రౌజరులో స్టాండర్డ్ ఫాంటును "Gidugu" అని ఎంచుకున్నాను. అప్పుడు బాగానే చూపించింది. అలాగే కొన్ని ఇతర ఫాంటుల్లో కూడా బాగానే చూపించింది. "Times New Roman" అని ఉన్నపుడు మాత్రం ఈ సమస్య వచ్చింది. విండోస్ డిఫాల్టు ఫాంటైన "Gautami" కి కూడా ఈ సమస్య వచ్చింది. క్రోమ్‌లో ఉన్న సమస్యే ఎడ్జ్‌లో కూడా ఉంది. అసలు సమస్య ఎక్కడ ఉందో నాకు తెలీదు గానీ ఒక పరిష్కారం మాత్రం చూపించగలను - బ్రౌజరు సెట్టింగుల్లో "Standard Font" గా Mandali, TenaliRamakrihshna, Srikrishnadevaraya లాంటివి పెట్టుకుంటే ఈ సమస్య ఉండకపోవచ్చు.
ఇక అసలు సమస్య పరిష్కారానికి కశ్యప్ గారు కూడా తోడ్పడవచ్చు. ఈ సమస్య గురించి ఆయన (బహుశా ఆయనే అయి ఉండవచ్చు) మైక్రోసాఫ్టు సైటులో చర్చించగా చూసాను.__ చదువరి (చర్చరచనలు) 05:21, 9 జూలై 2023 (UTC)Reply

నేను విండోస్ 11 తో పాటు తెలుగు ఇంటర్ఫేస్ ప్యాక్ వాడుతున్నాను నాకు ఈ సమస్య ఉన్నప్పుడు లోహిత్ ఫాంట్ వాడాను. Kasyap (చర్చ) 06:16, 9 జూలై 2023 (UTC)Reply

మూలాల పెట్టెలో మార్పు

మార్చు

పేజీలో కింద చూపించే మూలాల పెట్టెలో మార్పులు చేసారు. దిద్దుబాటు మోడ్‌లో మూలాల పెట్టెపై నొక్కితే మామూలు మూసపై నొక్కినట్టు మూసంతా సెలెక్టయ్యేది. ఏదైనా ఒక మూలాన్ని సెలెక్టు చేసుకునే వీలు ఉండేది కాదు. ఇప్పుడు ఒక్కో మూలాన్ని విడివిడిగా నొక్కవచ్చు. అలా నొక్కినపుడు ఆ మూలాన్ని సరిదిద్దే పెట్టె ప్రత్యక్షమౌతుంది. ఇక్కడ మూలాన్ని సరిదిద్దవచ్చు. గతంలో మూలాన్ని దిద్దాలంటే పేజీ పాఠ్యంలో ఆ మూలం ఉన్నచోటనే చెయ్యాల్సి వచ్చేది. పరిశీలించండి.

దీని వలన అసలు ఉపయోగం లేదని అనను గానీ.., అలవాటు కాకనో ఎంచేతనో గానీ ఇది నాకు నచ్చలేదు. మూస లక్షణాన్ని మారుద్దామని (రెండు వరసల్లో చూపించడం) మూసపై నొక్కగానే మూలాన్ని సరిచేసే దిద్దుబాటు పెట్టె ప్రత్యక్షమౌతోంది. దాన్ని చూస్తంటే చిరాగ్గా ఉంది. __ చదువరి (చర్చరచనలు) 00:17, 11 జూలై 2023 (UTC)Reply

మూలాల పెట్టెలో మార్పు విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు @Chaduvari గారూ... ఇది నేను కూడా గమనించాను. ఆంగ్ల వికీలో కూడా ఇదే మార్పు జరిగివుంది.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:58, 11 జూలై 2023 (UTC)Reply

నెలలు పేర్లు ఎల వ్రాయలి!

మార్చు

నెలలు పేర్లు ఎల వ్రాయలి! రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 01:28, 12 జూలై 2023 (UTC)Reply

@రుద్రుడు చెచ్క్వికి గారూ, వికీ శైలిలో తెలుగులో నెలల పేర్లు ఇవి:
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు
దానికి సంబంధించిన చర్చ చూడండి. __ చదువరి (చర్చరచనలు) 01:45, 12 జూలై 2023 (UTC)Reply

స్త్రీలకు సంబంధించిన వర్గాలు?

మార్చు

స్త్రీలకు సంబంధించిన వర్గాలు చూస్తున్నప్పుడు, ఈ క్రింది రెండు వర్గాలు/ఉపవర్గాలు గమనించాను.

వర్గం:మహిళలు; యుద్ధాలు చేసిన భారతీయ మహిళలు; 18వ శతాబ్ది యుద్ధరంగాల్లో మహిళలు.

గమనించండి - వర్గం:మహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 2018 ఈ పేజీలో చాలావరకు వ్యాధులు (మహిళలవే కాకుండా జనరల్) ఉన్నాయి.

వర్గం: మహిళలలో ఈ పేజీ కూడా గమనించండి.

గమనించండి - వర్గం:ఆదర్శ వనితలు - వికీపీడియా కూడా ఉంది.

ఇవి కాకుండా కవయిత్రులు ; వర్గం:రచయిత్రులు గురించి చూస్తే విడిగా చాలానే ఉన్నాయి.

ప్రధానం గా వనితలు లేదా మహిళలులో ఏది ప్రామాణికంగా తీసుకోవాలనే విషయంలో స్పష్టత లేదు. పరిశీలించండి. ధన్యవాదాలు. VJS (చర్చ) 05:16, 12 జూలై 2023 (UTC)Reply

@Vjsuseela గారూ, మీరు చెప్పేది పూర్తిగా అర్థం కాలేదుగానీ మీరు చూపించిన వర్గాల్లో సమస్యలు కొన్ని తెలుసుకోగలిగాను.
  1. వర్గం:మహిళలు గురించి - మనకు వర్గం:భారతీయ మహిళలు అనే వర్గం ఉంది. దాన్ని మహిళలు వర్గంలో చేర్చాలి, కానీ మిస్సైంది. ఇప్పుడు చేర్చాను. భారతీయ మహిళలు చూడండి. దాన్ని భౌగోళికంగా, వాళ్ళు పనిచేసిన రంగాల పరంగా వర్గీకరించాం. పరిశీలించి తప్పొప్పులు చెప్పండి.
  2. వర్గం:ఆదర్శ వనితలు: వనితలు/మహిళలు పేరుల్లో ఏది వర్గం పేరులో పెట్టాలి అనేది మీ ప్రశ్న అయితే "మహిళలు" అనాలని నా ఉద్దేశం ఎందుకంటే ఆ పేరుతోటే ఎక్కువ వర్గాలున్నాయి.
  3. యుద్ధాలు చేసిన భారతీయ మహిళలు; 18వ శతాబ్ది యుద్ధరంగాల్లో మహిళలు - "అహల్యా బాయి హ్ఫోల్కర్" పేజీని ఈ రెండు వర్గాల్లోనూ చేర్చడం మీ అభ్యంతరం అయి ఉండవచ్చు. అది సరైన అభ్యంతరమే. "అతివర్గీకరణ" సమస్యేగానీ కొన్నిసార్పు తప్పదనుకుంటాను. (ఏదిఏమైనప్పటికీ వికీలో వర్గీకరణ గురించి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. మీవంటి వారు చొరవ తీసుకుని సరిచెయ్యడం, నేర్పడంలో చొరవ తీసుకోవాలి.)
  4. వర్గం:మహిళా శ్రేయస్సు కోసం వికీ మహిళలు 2018 లో మీరన్నట్లు సంబంధించని పేజీలు కూడా ఉన్నాయి.
నిజానికి ఇలాంటి తప్పు వర్గీకరణలు, అవసరం లేని వర్గీకరణలు తెవికీలో కోకొల్లలు. చూసినవి చూసినట్లు సవరించుకుంటూ ఉండాలి. సమస్య బాగా విస్తృతంగా, లోతుగా ఉన్నపుడు ఇలా చర్చకు పెట్టాలి. నిజానికి వర్గాల చర్చ మొదలుపెడితే.., వాటి పేర్ల దగ్గర్నుండి, వాటి వర్గవృక్షం దాకా అనేక సమస్యలున్నాయి. ఉదాహరణగా గతంలో జరిగిన చర్చల కోసం వికీపీడియా:చర్చ కొరకు వర్గాలు పేజీలో "వర్గాల తొలగింపు పాత చర్చల సూచికలు" విభాగం లోని లింకులు చూడండి. అలాగే ఇక్కడ రచ్చబండలో కూడా ప్రముఖుల వర్గాల గురించి జరిగిన చర్చ కూడా చూడొచ్చు. __ చదువరి (చర్చరచనలు) 16:08, 12 జూలై 2023 (UTC)Reply
మీ పరిశీలనకు ధన్యవాదాలు. వర్గాల సమస్య నిజానికి ఎక్కువగానే ఉన్నా మీరు చెప్పినట్లు ఎప్పడికప్పుడు సవరించుకోవడం ప్రస్తుతం మంచిది. మొత్తం ప్రక్షాళన అంటే పెద్ద ప్రాజెక్ట్. VJS (చర్చ) 15:22, 13 జూలై 2023 (UTC)Reply
@Chaduvari & @Vjsuseela గార్లకు: అసలు ఆదర్శ వనితలు లేక మహిళలు అన్నప్పుడు మనం సబ్జెక్టివ్ అయిపోతున్నాం కదండీ. నా అభిప్రాయంలో వికీపీడియా మూల సూత్రాలకు (తటస్థ దృక్కోణం) విరుద్ధంగా ఉన్న ఈ పదబంధాన్ని మార్చాలి, దాని కాంటెక్స్ట్ ఏమైనప్పటికీ. పవన్ సంతోష్ (చర్చ) 09:43, 21 జూలై 2023 (UTC)Reply
@ పవన్ సంతోష్ గారు - నిజమే మీరన్నట్లు వికీపీడియా విజ్ఞాన సర్వస్వము తటస్థ దృక్కోణ విధానం అనుసరిస్తుంది. వ్యాసాలకు విషయ (సబ్జెక్టు రిఫరెన్స్) పరిమితులు ఉంటాయి. ఒకే విషయానికి లేదా వర్గానికి (సబ్జెక్టు) సంబంధించి వేరు శీర్షికలు ఉంటే వ్యాసాలు అన్ని శీర్షికల కు పంపిణీ అయిపోతాయి. ఒక సబ్జెక్టు కు ఒక శీర్షిక ఉంటే ఆ సబ్జెక్టు కు సంబంధించిన వ్యాసాలు ఒక దగ్గర కనపడుతాయి అని దృష్టికి తీసుకు వచ్చాను. కానీ ఇంత మంది పని చేసే చోట ఈ మాత్రం సమస్య సహజమే. దాన్ని ఎప్పడికప్పుడు సవరించుకోవడం చేయవచ్చు. మీ స్పందన కు ధన్యవాదాలు. VJS (చర్చ) 17:25, 22 జూలై 2023 (UTC)Reply

infobox filmలో "విడుదల తేదీకి" {{Film date}} ఉపయోగించగలరు

మార్చు

మన వికిీలో సుమారు 3,000 వ్యాసలో మూస:Infobox film ఉపయొగించిగబడినది. విడుదల తేదీకి లేద releasedకు {{Film date}} ముూసను ఉపయోగించగలరు వివరాలకు మూస:Infobox film#Release_dates మరియు మూస:Film date గమనించండి. రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 10:07, 12 జూలై 2023 (UTC)Reply

@రుద్రుడు చెచ్క్వికి మంచి సలహా! ధన్యవాదాలు.__ చదువరి (చర్చరచనలు) 16:09, 12 జూలై 2023 (UTC)Reply

మూస:సినిమా wikidataలో తపుగా జత చేసారు!!!!!

మార్చు

మూస:Infobox film wikidataలో en:template:infobox filmకు జత ౘయాలి. మూస:సినిమా ముసాను నుండి import చేసారు? రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 14:08, 12 జూలై 2023 (UTC)Reply

చంద్రయాన్-3 పేజీలో దుశ్చర్య

మార్చు

చంద్రయాన్-3 పేజీలో Amityyt అనే వాడుకరి పదేపదే దుశ్చర్య చేస్తున్నారు. ఒక రోజుపాటు వారిని నిరోధించాలేమో నిర్వాహకులు పరిశీలించవలసినది.__ చదువరి (చర్చరచనలు) 10:37, 14 జూలై 2023 (UTC)Reply

  • ఇదే వాడుకరి తమిళ, ఇతర వికీలోకూడా ఇలాంటి దుశ్చర్యలు చేస్తున్నారు,మూలాలు ఇవ్వటం ద్వారా వారి సైట్లకు క్లిక్కులు పెంచుకొనే ప్రయత్నం, నిరోధించినందుకు ధన్యవాదములు @యర్రా_రామారావు గారు : Kasyap (చర్చ) 11:15, 14 జూలై 2023 (UTC)Reply
ఒక రోజు నిరోధం విధించబడింది. యర్రా రామారావు (చర్చ) 11:42, 14 జూలై 2023 (UTC)Reply

మూస:Filmdateను మూస:Film dateకు దారిమర్పు

మార్చు

దయచేసి మూస:Filmdateను మూస:Film dateకు ధారిమర్పు చెయగలురు రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 01:28, 15 జూలై 2023 (UTC)Reply

రుద్రుడు గారూ, రెండు మూసలు ఒకే విషయానికి సంబంధించినవి అయినందున దారిమార్పు చేసాను.➤ కె.వెంకటరమణచర్చ 06:33, 16 జూలై 2023 (UTC)Reply

సినీమా వ్యాసాలో ఒకే సమచారము నకలు

మార్చు

కొన్ని సినిమా వ్యాసాలో ఒకే సమచారము నకలు వున్నవి.‌ ఉధాహరినికి: "సాంకేతిక నిపుణులు" డ్రైవర్ జమున వ్యాసంలొ. సమాచార పెట్టె మరియు సాంకేతిక నిపుణులు విభాగం ఒకే సమచారము నకలు. "సాంకేతిక నిపుణులు" విభాగం తీసివేయచ? రుద్రుడు చెచ్క్వికి (రుద్రుడు checkwiki) (చర్చ) 23:21, 15 జూలై 2023 (UTC)Reply

దీనిమీద ఆ వ్యాస సృష్టికర్త వినయ్ కుమార్ గౌడ్ గారు స్పందించాలి. యర్రా రామారావు (చర్చ) 02:26, 17 జూలై 2023 (UTC)Reply
@రుద్రుడు చెచ్క్వికి గారూ, ఇలాంటివి సదరు వ్యాసం చర్చా పేజీలోనూ, ఆ వ్యాసకర్త చర్చాపేజీలోనూ లేవనెత్తడం బావుంటుంది. కనీసం ఐదారు పేజీలకు మించి సమాచారంలో సమస్య ఉంటేనే రచ్చబండలో రాయగలరు. అప్పుడు కూడా ఆ ఐదారు పేజీలేమిటో ఇక్కడ ఇస్తే మిగిలిన సభ్యులు తగిన మార్పుచేర్పులో, చర్యలో తీసుకోవడానికి బావుంటుంది. ఏమంటారు? పవన్ సంతోష్ (చర్చ) 05:11, 23 జూలై 2023 (UTC)Reply

ఈ ఏడు జరగబోయే ఘటనలు

మార్చు

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా జరిగింది. తెవికీలో జూలై 14 న ఆ పేజీకి 8,807 పేజీ వ్యూలు వచ్చాయి. భారతీయ భాషా వికీల్లో హిందీ (59,487) తరవాత తెలుగుపేజీకే ఎక్కువ వ్యూలొచ్చాయి. ఈ పేజీ కారణంగా ఇతర పేజీలు కూడా లబ్ధి పొందాయి. చంద్రయాన్-2 కు జూలై 13 న 200, 14 న 1300 పేజీ వ్యూలొచ్చాయి, చంద్రయాన్-1 కు జూలై 13 న 180, 14 న 1450 వ్యూలు వచ్చాయి. అంతకుముందు వరకూ వీటికి రోజుకు సగటున పాతిక ముప్పై పేజీవ్యూలే ఉండేవి. చంద్రయాన్-3 అనే ఘటన కారణంగా ఈ మూడు పేజీలకు సందర్శకులు పెరిగారు. ఆ పేజీల్లో ఉన్న సమాచారం వాళ్ళకు సంతృప్తి కలిగించి ఉంటుందని భావిద్దాం.

ఈ పేజీలు గనక నిన్నటికి లేకపోయి ఉంటే బహుశా వికీ సందర్శకులకు నిరాశ కలిగి ఉండేది. అంచేత ఇలాంటి ఆసక్తి కలిగించే ఘటనలు ఏమేం రాబోతున్నాయో (ఆటలు, ఎన్నికలు వగైరాల్లాంటివి) మనం ముందే ఒక జాబితా వేసుకుని వాటికి ఒక ఏడాది ముందే లేదా కనీసం ఒక నాలుగైదు నెలల ముందే పేజీలు సృష్టించి/తగు సమాచారంతో విస్తరించి పెట్టుకుంటే బావుంటుంది.__ చదువరి (చర్చరచనలు) 00:34, 16 జూలై 2023 (UTC)Reply

  • మంచి ఆలోచన @Chaduvari గారు, అలాగే చేద్దాం.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:37, 16 జూలై 2023 (UTC)Reply
  • ఆగష్టు లో ఆదిత్య L1(సూర్యుడి మీదకి ఉపగ్రహం ) ప్రయోగం ఉంది. 2024 చివరి కల్లా gaganyaan (రోదసిలోకి ఇస్రో తరఫున వ్యోమగాముల యాత్ర ఉంది). Svpnikhil (చర్చ) 06:47, 16 జూలై 2023 (UTC)Reply
  • చాలా మంచి ఆలోచన. అదే వ్యూహంతోనే రాబోయే ఎన్నికకు ఉపయోగపడే నియోజకవర్గాలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. వాటిని విస్తరిస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే ఈసారి ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన వ్యాసాలను విస్తరిస్తే ఫ్రాన్స్ (2024) ఒలింపిక్ క్రీడలకు మంచి సమాచారం అందుబాటులోకి వస్తుంది. ఢిల్లీ వరదలు చాలామందిని మన దేశ రాజధానిలో విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఉత్తరాది వరదలను గురించి సమగ్ర సమాచారం చేరిస్తే బాగుంటుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:42, 16 జూలై 2023 (UTC)Reply
  • 2023 క్రికెట్ ఆసియా కప్ ఉంది. 2023 క్రికెట్ ప్రపంచ కప్ ఉంది. క్రికెట్‌కు సంబంధించి మనకున్న వ్యాసాలు బాగా తక్కువ. దీన్ని దృష్టిలో ఉంచుకుని క్రికెట్ వ్యాసాల ఎడిటథాన్ ప్రాజెక్టు ఒకటి పెట్టుకుంటే బాగుంటుంది. ఆటగాళ్ళు, పరిభాష, గతంలో జరిగిన ముఖ్యమైన పోటీలు, భారత్ పాల్గొన్న సీరీస్‌లు, వివాదాలు, వగైరాలతో ఒక మూణ్ణాలుగొందల మంచి పేజీలు రావచ్చు. అలాగే ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్పుంది. భారత ఆటగాళ్ళు బానే రాణిస్తూంటారిందులో. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలున్నాయి. ఇలాంటి ముందే నిశ్చయించి ప్రకటించిన కార్యక్రమాలు కాకుండా కొద్దిగా అటూ ఇటూగా జరిగేవి (ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, భారత సార్వత్రిక ఎన్నికలు).. వీటికి పేజీలు పెట్టుకోడం/విస్తరించడాలకు సిద్ధంగా ఉండాలి. క్రికెట్ ఎడిటథాన్ గురించి ఆలోచించాల్సిందిగా చురుగ్గా ఉన్న వాడుకరులను కోరుతున్నాను.__చదువరి (చర్చరచనలు) 08:15, 16 జూలై 2023 (UTC)Reply
    • @Chaduvari గారూ, @Rajasekhar1961 గారూ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల గురించి కనీసం సమగ్రమైన సమాచారం (ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు గెలిచారుతో పాటుగా కులాల వారీ లెక్కలు, బలాబలాలు, పార్టీల కంచుకోటలు, పోటీపోటీ ఎన్నికలు వగైరా)తో "ఎన్ని'కుల' రాజకీయాలు" పేరితో శంకర్ అనే జర్నలిస్టు రాశారు. ఈ పుస్తకాలు తెప్పించుకుని రిఫర్ చేస్తూ అభివృద్ధి చేయవచ్చు. పవన్ సంతోష్ (చర్చ) 10:03, 19 జూలై 2023 (UTC)Reply

క్రికెట్ 2023 ప్రాజెక్టు

మార్చు

2023 క్రికెట్ ప్రపంచ కప్పు జరగనున్న సందర్భంగా వికీపీడియా:వికీప్రాజెక్టు/క్రికెట్ 2023 అనే ప్రాజెక్టును నడపాలని ప్రతిపాదించాను. పరిశీలించండి. __ చదువరి (చర్చరచనలు) 01:01, 17 జూలై 2023 (UTC)Reply

ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన చదువరి గార్కి ధన్యవాదాలు.క్రికెట్ అభిమానులకు ఈ ప్రాజెక్టులోని వ్యాసాలు అన్నీ మంచి సమాచారం అందిస్తాయని నేను భావిస్తున్నాను.ఈ ప్రాజెక్టులో నేనూ భాగస్వామ్యం వహిస్తాను యర్రా రామారావు (చర్చ) 02:20, 17 జూలై 2023 (UTC)Reply
ధన్యవాదాలు @Chaduvari గారు. ఈ ప్రాజెక్టులో నేను కూడా భాగస్వామ్యం వహిస్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:03, 17 జూలై 2023 (UTC)Reply
ధన్యవాదాలు @Chaduvari గారు. ఈ ప్రాజెక్టులో నేను కూడా భాగస్వామ్యం వహిస్తాను.➤ కె.వెంకటరమణచర్చ 08:53, 17 జూలై 2023 (UTC)Reply

CIS-A2K Newsletter June 2023

మార్చు


Please feel free to translate it into your language.

 

Dear Wikimedians,

Greetings! We are pleased to inform you that CIS-A2K has successfully completed several activities during the month of June. As a result, our monthly newsletter, which covers the highlights of the previous month, is now ready to be shared. We have taken care to mention the conducted events/activities in this newsletter, ensuring that all relevant information is captured.

Conducted events
  • Community Engagement Calls and Activities
    • India Community Monthly Engagement Calls: 3 June 2023 call
    • Takeaways of Indian Wikimedians from EduWiki Conference & Hackathon
    • Punjabi Wikisource Proofread-a-thon
  • Skill Development Programs
    • Wikidata Training Sessions for Santali Community
  • Indian Community Need Assessment and Transition Calls
  • Partnerships and Trainings
    • Academy of Comparative Philosophy and Religion GLAM Project
    • Wikimedia Commons sessions with river activists
    • Introductory session on Wikibase for Academy of Comparative Philosophy and Religion members

Please find the Newsletter link here.
If you want to subscribe/unsubscribe to this newsletter, click here.

Thank you MediaWiki message delivery (చర్చ) 07:27, 17 జూలై 2023 (UTC)Reply

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటు గురించి సంప్రదింపు

మార్చు

అందరికీ నమస్కారం,

మనం గతంలో చర్చించుకున్నదాని ప్రకారం మెటా-వికీలో యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటుచేసి యూజర్ గ్రూపును ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఉన్నాను. ఈ క్రమంలో ఒకసారి సముదాయానికి నిర్ణయాలన్నీ చెప్పి అభ్యంతరాలు లేకుంటే వెంటనే ఏర్పాటుచేద్దామని ఈ పోస్టు చేస్తున్నాను:

  • తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ లక్ష్యాలను ఇక్కడ చూడవచ్చు. అంశాల వారీగా చర్చకు అక్కడ అవకాశం ఉంది.
  • తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పడ్డాకా చేయాలని భావించిన కార్యక్రమ ప్రణాళిక ఇక్కడ ఉంది: వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/కార్యక్రమ ప్రణాళిక 2023. ఈ కార్యక్రమ ప్రణాళికతో పాటుగా దీనిలో ఈ కార్యక్రమాలు నిర్వహించేప్పుడు అనుసరించదగ్గ కొన్ని మార్గదర్శక సూత్రాలు కూడా ఉన్నాయి: వీటిలో సముదాయం చేసే కార్యక్రమాలు కాక చేయలేని కార్యక్రమాలు యూజర్ గ్రూప్ చేపట్టాలని, సముదాయం చేసే పని-యూజర్ గ్రూప్ చేసే పని మధ్య భేదాన్ని గమనించి నివేదికలు రాయాలని, అన్ని కార్యక్రమాలూ హైదరాబాదులోనే కాక మిగిలిన ప్రాంతాల్లోనూ చేయాలనీ, ఒకరే అన్నీ చేయకుండా నలుగురూ నాలుగు బాధ్యతలు తీసుకుని చేసేలా ప్రోత్సహించాలనీ ఉన్నాయి.
  • యూజర్ గ్రూపు నుంచి వికీమీడియా ఫౌండేషన్ తో సంప్రదింపులు జరపడానికి కనీసం ఇద్దరు ప్రాథమిక కాంటాక్ట్ పర్సన్లు అవసరం. అందులో ఒకరిగా నా పేరు చదువరి గారు ప్రతిపాదించగా, రెండోవారిగా @Nskjnv గారి పేరు నేను ప్రతిపాదించాను. ఈ ప్రతిపాదనలు, ఈ ప్రతిపాదనలకు ఇచ్చిన కారణాలు, వీటికి లభించిన మద్దతు గురించి ఇక్కడ చూడవచ్చు.
  • యూజర్ గ్రూప్ సభ్యత్వం, హోదాలు, ఓటు హక్కులు, అర్హతా - అనర్హత మొదలైన వివరాల చర్చలన్నీ వికీపీడియా:తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్/విధి విధానాల ప్రతిపాదన వద్ద రాసి ఉన్నాయి.

వీటిపై అభ్యంతరాలేమీ లేకపోతే ఈ జూలై 26 నాడు పేజీ సృష్టించి యూజర్ గ్రూప్ కార్యకలాపాలు ప్రారంభిస్తాను. ధన్యవాదాలతో పవన్ సంతోష్ (చర్చ) 09:59, 19 జూలై 2023 (UTC)Reply

ఈ విషయంపై నాకొక అభిప్రాయం ఉంది. వాడుకరి:Nskjnv గారు గతంలో తెలుగు వికీపీడియాకు అంబాసిడరుగా ఉండేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, మూవ్‌మెంటు చార్టరుకు సంబంధించిన కొంత కంటెంటును తెలుగు లోకి అనువదించేందుకు గ్రాంటు అడిగారు. గ్రాంటు విషయం ముందుగా రచ్చబండలో పెట్టి చర్చించలేదు. మెటాలో ఆ విషయమై ఆయనకు చెప్పిన తరువాత ఇక్కడ చర్చకు పెట్టారు. ఆ గ్రాంటు విషయమై రచ్చబండలో జరిగిన చర్చలో లేవనెత్తిన అంశాలకు ఆయన స్పందించనే లేదు. సముదాయం పట్ల ఆయనకున్న నిబద్ధత విషయమై నాకు సందేహాలున్నాయి. అంచేత ఈ పనికి ఆయనను తీసుకోకూడదని నా అభిప్రాయం. ఆయన కాకుండా ఇప్పుడు చురుగ్గా ఉన్నవారిలో మరొకరెవరు పనిచేసినా నాకు అభ్యంతరంలేదు. __ చదువరి (చర్చరచనలు) 01:59, 20 జూలై 2023 (UTC)Reply

నమస్కారం వాడుకరి:Chaduvari గారు,

మీ అభిప్రాయం తెలియ పరిచినందుకు ధన్యవాదాలు, అలాగే కానివ్వండి తెలుగు వికీ యూజర్ గ్రూప్ లో లేనంత మాత్రాన తెలుగు వికీకి నేను అందించే సేవలు ఆగవు, తప్పక కొనసాగిస్తాను.

ఇక మీరు మాట్లాడుతున్న ఆ గ్రాంటు విషయమై రచ్చబండలో జరిగిన చర్చలో విషయానికి వస్తే, ఈ విషయంలో అసలు జరిగింది ఏమిటి అంటే..

ఈ మూవెమెంట్ చార్టర్ అంబాసిడరు కార్యక్రమం పూర్తిగా వ్యక్తిగతం, ఈ పని ఎవరైనా చేయవచ్చు. ఈ కార్యక్రమం ఒకటి ఉన్నదని సముదాయానికి చెప్పవలసిన భాద్యత వికీమీడియా వారిది, కానీ వారు కొంత మంది వ్యక్తులకు మాత్రమే సంప్రదించారు. అందుకే నేను నమోదు చేసుకున్నాను. ఆ తరువాత ఈ గ్రాంటు అనేది అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి వెచ్చించే సమయానికి పనికి అందించే రుసుము.

ఇక గ్రాంటు నియమాల ప్రకారం గ్రాంటు పేజీ సృష్టించిన తరువాత సముదాయ మద్దతును కొరవలసిందిగా ఇక్కడ ఇచ్చిన నియమాల ప్రకారం పేజీ సృష్టించిన 24 గంటల్లో నేను సముదాయంలో చర్చకు పెట్టాను ఇక్కడ దీనికి సంబంధించి మరింత చర్చ చూడవచ్చు. అయితే నేను సముదాయంలో 24 గంటల్లో పెట్టేలోపే పవన్ సంతోష్ గారు ఇతర వాడుకరులు ముఖ్యముగా వాడుకరి:యర్రా రామారావు గారు లేని పోనీ విషయాలను కల్పించి కట్టు కథలు అల్లడం చూడవచ్చు.

ఇక విషయానికి వస్తే, లెక్క ప్రకారం పనిని నిర్వహిస్తున్న నా వంటి వాడిపై అపోహలు సృష్టించే దిశగా పనులు చేసే పవన్ సంతోష్ గారికే అసలు యూజర్ గ్రూప్ మొదటి కాంటాక్టు పర్సన్ గా ఉండే అర్హత లేదని నా అభిప్రాయం. NskJnv 06:57, 20 జూలై 2023 (UTC)Reply

@Nskjnv గారూ, మీరిచ్చిన రెండు లింకులూ సరిగా పనిచేయట్లేదు. ఒకసారి లింకులు సరిజూడండి. పవన్ సంతోష్ (చర్చ) 07:39, 20 జూలై 2023 (UTC)Reply
పవన్ సంతోష్ గారు సరిచేసానండి, చెప్పినందుకు ధన్యవాదాలు. NskJnv 07:52, 20 జూలై 2023 (UTC)Reply
నా అభిప్రాయం ప్రకారం Nskjnv గారి విషయంలో నాకు తీవ్రమైన అసంతౄప్తి ఉంది, వికీలొ సముదాయ సభ్యులతో చర్చలలో ఆయన తీరు సరిగా ఉండదు అని నా స్వానుభవం. అడిగిన వెంటనే జవాబు ఇవ్వకపొవడం, కొత్త వాడూకరులను ప్రోత్సహించడంలో అస్సలు ఆశక్తి లేకపోవడం, వారిని నిరుత్సాహపరచడం జరిగింది. ఆయనను అడిగిన వాటికి ఆయన కాక సముదాయ సభ్యులు జావాబు ఇచ్చినా కూడా ఆయన వైపుగా జవాబు ఇవ్వాల్సిన భాద్యతను ఆయన విస్మరించారు, గ్రాంట్స్ విషయంలో కూడా అడిగిన వెంటనే స్పందించకపొవడం అనేవి ఒక వ్యక్తి పదవి లేదా భాద్యతలలో తన వ్యక్తిగత ఆశక్తులతో పనిచేస్తాడా లేక సముదాయ అవసరాల ద్వారా పని చెస్తాడా అనేది తెలియచెస్తుంది. ఆయన తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప సముదాయ వికీ వృద్ది కోసం లేదా వికీపై ప్రేమ అభిమానాలతో పనిచెయలేరని, చేయడం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. .B.K.Viswanadh (చర్చ) 09:45, 20 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారు నా అభిప్రాయానికి ఇచ్చిన స్పందనలో తోటి వాడుకరులపై ఆరోపణలు చేసారు తప్ప, ఆనాడు రచ్చబండలో సభ్యులడిగిన ప్రశ్నలకు తాను ఎందుకు అస్సలు స్పందించనే లేదో, ఆ కారణం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడ రాసిన సంగతి అప్పుడు అక్కడ ఎందుకు రాయలేదు? సముదాయంలో లేవనెత్తిన ప్రశ్నలకు జవాబంటూ ఒకటి చెప్పాలి కదా.. (జవాబు ఏం చెప్పారనేది కాదు, అసలు జవాబు చెప్పారా లేదా అనేది), అస్సలు జవాబే చెప్పకపోవడం ఏంటి? ఇక్కడ నేను రాసిన అభిప్రాయానికి ప్రాతిపదికే ఈ ప్రశ్న.
----------------------------------
పోతే, Nskjnv గారూ, మీరు చేసిన ఆరోపణల గురించి.. వాటికి ఆయా వాడుకరులే సమాధానాలు చెప్పుకుంటారు. కానీ నేను అడిగేది ఒకటే.. వాటికి ఆధారాలేవి?
"అయితే నేను సముదాయంలో 24 గంటల్లో పెట్టేలోపే పవన్ సంతోష్ గారు ఇతర వాడుకరులు ముఖ్యముగా వాడుకరి:యర్రా రామారావు గారు లేని పోనీ విషయాలను కల్పించి కట్టు కథలు అల్లడం చూడవచ్చు." అని రాసారు. వాళ్ళిద్దరూ రాసిన వాటిలో ఏవి కట్టుకథలు?
1. రచ్చబండలో పెట్టకముందే, మీరు చేసిన గ్రాంటు ప్రతిపాదనకు కొంతమంది మద్దతు పలికారు. వారికి ఆ ప్రతిపాదన సంగతి ఎలా తెలిసింది. వాళ్ళే చూసారా? మీరు వాళ్ళకు చెప్పారా? చెబితే, రచ్చబండలో పెట్టే సంగతి గురించి కూడా వాళ్ళకు మీరు ఫోనులో చెప్పారా?
2. రచ్చబండలో పెట్టకముందే, యర్రా రామారావు గారికి ఫోను చేసి గ్రాంటు ప్రతిపాదన గురించి ఆయనకు చెప్పారా లేదా?
3. రచ్చబండలో రాయమని పవన్ సంతోష్ గారు మీకు ప్రతిపాదన చర్చలో చెప్పిన తరువాతనే రాసారా? లేక ముందే రాసారా?
4. రచ్చబండలో జరుతుగున్న చర్చ లింకును ప్రతిపాదనలో పెట్టమని పవన్ గారు మీకు ప్రతిపాదన చర్చలో చెప్పారు. అయినా మీరు ఇవ్వలేదు. పవన్ గారే ఇచ్చారు. రచ్చబండ లింకు మీరెందుకు ఇవ్వలేదక్కడ?
5. ఇక్కడ వాడుకరులు అడుగుతున్న ప్రశ్నలకు మీరు స్పందించడం లేదని కూడా పవన్ గారు అక్కడ రాసారు. ఆ తరువాత కూడా మీరు రచ్చబండలో స్పందించలేదు. అవునా కాదా?
"లెక్క ప్రకారం పనిని నిర్వహిస్తున్న నా వంటి వాడిపై అపోహలు సృష్టించే దిశగా పనులు చేసే పవన్ సంతోష్.." అని రాసారు. ఆయన మీపై సృష్టించిన అపోహలు ఏమిటి? నాకైతే ఆయన రాసినవాటి వల్ల మీపై అపోహేమీ కలగలేదు. నిజానికి 53,000 రూపాయలను ఎలా వాడాలన్న విషయమై ఇదే రచ్చబండ పేజీలో జరిగిన చర్చలో ఆయన వచ్చి ఆ విషయమై మీకు ఒక దారి చూపించారు. నాకైతే ఆయన మీకు సాయపడినట్లే కనిపించింది. అపోహేమీ కలగలేదు.
కొన్ని ప్రశ్నలు అడుగుతాను Nskjnv గారూ.. సమాధానం చెప్పాలనిపిస్తే చెప్పండి
1. మీరు ఇప్పటి వరకూ మెటాలో మొత్తం ఎన్ని గ్రాంటుల కోసం అప్లై చేసుకున్నారు (తెవికీ కోసం గానీ ఇతర వికీల కోసం గానీ)? వాటి గురించి ఆయా వికీల్లో రాసి చర్చకు పెట్టారా? ఎన్ని గ్రాంటులు తీసుకున్నారు, ఎంత డబ్బు తీసుకున్నారు అనేది నేను అడగడం లేదు, అది నాకు అక్కర్లేదు, చెప్పడం చెప్పకపోవడం మీ ఇష్టం.
2. గత WPWP కోసం తీసుకున్న గ్రాంటులో మీవద్ద మిగిలిన డబ్బుల గురించి చర్చలు జరిగాయి గదా.. చివరిగా వాటిని ఏం చేద్దామని మీరు నిర్ణయించారు?
__ చదువరి (చర్చరచనలు) 01:25, 21 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ మరొక్క సంగతి. "తెలుగు వికీ యూజర్ గ్రూప్ లో లేనంత మాత్రాన తెలుగు వికీకి నేను అందించే సేవలు ఆగవు," అని రాసారు. నేను అభ్యంతర పెట్టింది యూజర్ గ్రూపు ఏర్పాటులో మీ పాత్ర గురించి తప్ప, అందులో మీ సభ్యత్వం గురించి కాదు, గమనించండి. అపోహపడకండి. ఇక, తెలుగు వికీకి అందించే సేవల పట్ల మీ నిబద్ధతకు అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 01:44, 21 జూలై 2023 (UTC)Reply
నమస్కారం B.K.Viswanadh గారు, తెలుగు వికీపీడియాలో మొట్ట మొదటగా ప్రాజెక్టు అందుకున్న వారీగా మీపై నాకు మంచి గౌరవం ఉన్నది. అయితే మీరు ఇక్కడ వెళ్లబుచ్చిన అభిప్రాయం విషయానికి వస్తే, ఈ విషయంలో ఈ రోజు మాట్లాడుతున్నట్టు మీరు నాతో ఎక్కడ కూడా సంప్రదించలేదు. అదీ కాక గత రెండు సంవత్సరాలుగా తెలుగు వికీ కోసం నేను నిర్వహించిన శిక్షణా శిబిరాలు చాలానే ఉన్నాయి, నిరంతరం తెలుగు వికీపీడియన్లకు నాకు తోచినంతగా సహకరిస్తూనే వస్తున్నాను.

ఇక మీరు అన్నట్లు వెంటనే సమాధానం ఇవ్వటం అంటే, మీరు నేను నిర్వహించిన ఏ ప్రాజెక్టులో కానీ చర్చల్లో పాల్గొన్న దాఖలాలు నాకు కనిపించలేదు(ఒకవేళ ఉంటె చూపగలరు). మీరు అడిగిన ప్రశ్నలకు ఎక్కడైనా సమాధానం చెప్పకుండా ఉంటె తెలుపగలరు, తప్పక సహకరించగలను. ఇక అసలు నేను నిర్వహించే ప్రాజెక్టు చర్చల్లోనే పాల్గొనని మీరు ఈరోజు అకస్మాత్తుగా ఈ అభిప్రాయం వెళ్ళబుచ్చటం నాకు అనుమానాస్పదంగా ఉంది.

ఇక ఈ ర్యాపిడ్ గ్రాంటుల విషయానికి వస్తే, ర్యాపిడ్ ఇండివిడ్యుల్ గ్రాంటులు అలాగే ఇతర గ్రాంటుల గురించి పవన్ సంతోష్ సముదాయంలో ఎవరైనా, ఒక శిక్షణా తరగతి నిర్వహిస్తే బాగుంటుంది, తద్వారా సముదాయ సభ్యులకు వారి/వాటి పరిధులు అర్థమవుతాయి. NskJnv 15:18, 20 జూలై 2023 (UTC)Reply

Nskjnv గారు..
  • పవన్ సంతోష్ గారు ఇతర వాడుకరులు ముఖ్యముగా వాడుకరి:యర్రా రామారావు గారు లేని పోనీ విషయాలను కల్పించి కట్టు కథలు అల్లడం చూడవచ్చు.
  • నా వంటి వాడిపై అపోహలు సృష్టించే దిశగా పనులు చేసే పవన్ సంతోష్
  • ఈరోజు అకస్మాత్తుగా ఈ అభిప్రాయం వెళ్ళబుచ్చటం నాకు అనుమానాస్పదంగా ఉంది." ఇవి మీ తోటి సముదాయ సభ్యులపై మీకున్న అవగాహనా పూర్వక అభిప్రాయాలు.
  • ఇక "నేను నిర్వహించిన ఏ ప్రాజెక్టులో కానీ చర్చల్లో పాల్గొన్న దాఖలాలు నాకు కనిపించలేదు" అన్నారు. "గ్రాంట్స్ విషయంలో కూడా అడిగిన వెంటనే స్పందించకపొవడం అనేవి ఒక వ్యక్తి పదవి లేదా భాద్యతలలో తన వ్యక్తిగత ఆశక్తులతో పనిచేస్తాడా లేక సముదాయ అవసరాల ద్వారా పని చెస్తాడా అనేది తెలియచెస్తుంది" అన్న నా వాఖ్య మునుపటి చర్చలపై జనరలైజ్ చెసి చెప్పింది...
  • మీ ప్రశ్నలకు జవాబులు వచ్చి ఉంటాయి అనుకుంటాను. మీరు పారదర్శకంగా, నిబద్దతతో, ముఖ్యంగా వికీపై అభిమానంతో పని చెయాలనుకుంటే నాకూ సంతోషమే..B.K.Viswanadh (చర్చ) 08:11, 21 జూలై 2023 (UTC)Reply
    ఈ చర్చకు నేను దూరంగా ఉందామనుకున్నాను.కానీ ఈ చర్చలో "ముఖ్యముగా వాడుకరి:యర్రా రామారావు గారు లేని పోనీ విషయాలను కల్పించి కట్టు కథలు అల్లడం చూడవచ్చు." అనే ప్రస్తావించబడింది, కాబట్టి స్పందించక తప్పటలేదు.Nskjnv గారు కట్టు కథలు భావించే ఆ చర్చ వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023 లో ఉదహరించిన వాటికి ఏ ఒక్క సమాధానం ఇవ్వకపోగా "నేను ఏ పని చేయడానికి ముందుకు వచ్చిన అడ్డుకోవాలి అన్నట్లుగా వారి ప్రవర్తన ఉన్నదని తోస్తుంది, అంతర్జాతీయంగా తెలుగు వికీ ఖ్యాతి పెంచిన ప్రాజెక్టు నిర్వహణ గురించిన చర్చలో వ్యక్తిగత విమర్శే తప్ప" అనే ఒక వాక్యంతో సరిపుచ్చారు.దీని మీద నా అభిప్రాయం ఇలా ఉంది.
    ఎవరైనా పొరపాట్లు చేయటం సహజం.మొదటి పొరపాటు చేసినప్పుడు దానిని పెద్ద మనసుతో ఒప్పుకుని సరిదిద్దుకుంటే ఇలాంటి సమస్యలు తలెత్తవు.అలాకాకుండా పొరపాటు మీద మరిన్ని పొరపాట్లు చేసినప్పుడు, ఎవరైనా ప్రశ్నిస్తే లేదా వివరణ అడిగితే అసలు సమస్యను పక్కనబెట్టి, వారి తప్పు వారికి అర్థమై, ఎటువంటి గత్యంతరం లేక, పొరపాట్లు ఒప్పకోవటానికి అహం అడ్డువస్తే, "కట్టు కథలు అల్లడం, వ్యక్తిగత విమర్శ" అనే పదాలు వాడి వారి విలువను వారే తగ్గించుకుంటారు.
    యర్రా రామారావు (చర్చ) 14:41, 21 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ, మీరు అన్నట్టుగా నేనేమీ మీ గురించి అపోహలు సృష్టించేలా ఏమీ చెయ్యలేదు, రాయలేదు. మీరు చేసే పనుల్లో బావున్నవాటిని ప్రోత్సహించాను, ఎక్కడైనా సమస్యలు ఉన్నాయని తోచితే సరైన సమయంలో ఎత్తిచూపాను, మీకూ - తోటి సముదాయ సభ్యులకు ఇబ్బందులు తలెత్తినప్పుడు కూడా సామరస్యపూర్వకంగా పరిష్కారం కోసం ప్రయత్నించాను. ఇదంతా మీకు రుచించినట్టు లేదని ఇప్పుడు మీ మాటలు బట్టి తేలింది. కాబట్టి, మీరు నామీద చేసింది నిరాధారమైన, అసమంజసమైన ఆరోపణ. నిజానికి, మీకూ సముదాయానికి సమస్యలు రావడానికి మూలం మీరు సముదాయ సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు చెప్పకపోవడంలో ఉంది.
  • మీమీద ఆరోపణ ఏమిటంటే మీరు సముదాయ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు వేటికీ సమాధానాలు ఇవ్వట్లేదని. మీ సమాధానం ఏదైనా కావచ్చు - వాళ్ళ సూచనలు ఆమోదించడం కావచ్చు, వ్యతిరేకించడం కావచ్చు, తిరస్కరించడం కావచ్చు, వివరించడం కావచ్చు - ఏదైనా కానివ్వండి. మీరు సమాధానాలు ఇవ్వట్లేదన్నది సమస్య. ఉదాహరణలు చూద్దాం:
    • సముదాయ సభ్యులు ఒకరు మీరు తీసుకున్న గ్రాంట్ విషయమై రాస్తూ - "తెలుగు వికీపీడియాకు సంబంధించిన కార్యక్రమం కోసం గ్రాంటు అడుగుతున్నపుడు ముందు తెలుగు వికీపీడియాకు చెప్పాలి కదా? అక్కర్లేదా?" అని ప్రశ్నించారు. 24 గంటల లోపల రచ్చబండలో పెట్టాను, అప్పటికే అనవసరమైన రాద్ధాంతం జరిగిపోయిందని దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల తర్వాత ఈ చర్చలో అంటున్నారు. అంతే కానీ, సముదాయంలో లేవనెత్తిన ఈ ప్రశ్నకు అక్కడ చర్చలో ఇప్పటికీ సమాధానం రాయలేదు. సమాధానం మీరు ఇవ్వకుండా, సమస్య వేరేవారు సృష్టించారని ఊహించుకుంటూ ఉంటే ఎలాగండీ. ఇప్పటికైనా మీరు ఈ విషయం అర్థం చేసుకుంటారని చెప్తున్నాను.
    • అదే ప్రశ్నలో భాగంగా అదే సముదాయ సభ్యుడు బడ్జెట్ గురించి వ్యాఖ్యానిస్తూ "రోజుల లెక్కన చూస్తే ఒక్కో రోజుకు 18,000 అడుగుతున్నట్లు (10 రోజులకు 1,80,000 కాబట్టి). అదే నెలకు సుమారు రూ 5,40,000 అన్నమాట. పదాల లెక్కన చూస్తే ఒక్కో పదానికి రూ 7.2 అడుగుతున్నారు. ఒక్కో లైనుకు 8 పదాలు, పేజీకి 40 లైన్లు ఉంటాయనుకుంటే పేజీకి దాదాపు రూ 2,500." అన్నారు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ చూస్తే ఎంత కొమ్ములు తిరిగిన అనువాదకులైనా ఆంగ్లం నుంచి తెలుగుకు పదానికి రూ.2 నుంచి రూ.4 మధ్యలో తీసుకుంటున్నారు. అందుకనే మీరు ఇంత బడ్జెట్ పెట్టారేమిటి అని ఆయనకు సందేహం కలిగింది. నిజానికి మీరు రాసిన రిపోర్టులో పెట్టిన పేజీలు, వాటిలో పదాలు (1335 పదాలకు 700 డాలర్లు) లెక్కకట్టి చూస్తే ఆయన వేసిన లెక్కే చిన్నదని తేలుతుంది. మరి సముదాయ సభ్యుడు ఒకరు అంత సూటిగా మీ బడ్జెట్ మీద వ్యాఖ్యానించినప్పుడు మీకు తోచిన సమాధానమేదో ఇచ్చి ఉండాల్సింది కదా. మీరు ఇలా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే మిమ్మల్ని గురించి ఎవరైనా ఏం అనుకుంటారు?
    • వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2023 అన్న చర్చలో మీకూ ఇతర సభ్యులకు ఒక సమస్య తలెత్తితే నేను దాన్ని పరిష్కరించేందుకు సంయమనంతో కృషి చేశాను. ఫలానా చోట మీ రీజనల్ గ్రాంట్స్ మేనేజర్ మెయిల్ ఐడీ ఉంటుంది, వాళ్ళకి రాసి ఈ ఆరువేలు వార్షికోత్సవానికి ఖర్చుచేసిన మనిషికి ఇచ్చి అక్కడికి ఆ సమస్య పరిష్కరించండి అని సూచించాను. ఆ తర్వాత కూడా చివరగా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నం చేశాను. ఇన్నాళ్ళకు ఆ రూ.ఆరువేలకు అవసరమైన రిపోర్టులు, రసీదులు ఇవ్వమనీ, ఆ సంగతి ముగించే ప్రయత్నం చేస్తున్నారు. అంతా బావుంది. మరి కనీసం ఫలానా విధంగా ఈ సమస్య పరిష్కారం చేస్తున్నాను అని ఆ రచ్చబండ చర్చలో సమాధానం చెప్పారా? అందుకు తోడు నేను ఇంతగా మీకు సాయపడుతోంటే నాపై నిరాధారమైన ఆరోపణలు చేశారు. ఇప్పటిదాకా జరిగిన చర్చలన్నిటిలోనూ మీ గురించి, మీ ప్రతిపాదనల గురించి నేను రాసినది చదివిన నిష్పాక్షిక పరిశీలకులు ఎవ్వరైనా మీ ఆరోపణ తప్పనే తేలుస్తారు. అలాంటప్పుడు ఈ నిరాధారమైన ఆరోపణలు చేస్తే చదివిన సగటు వికీపీడియన్లు మీ గురించి ఏమనుకుంటారో మీరేమైనా ఆలోచించారా?
  • "ఇక ఈ ర్యాపిడ్ గ్రాంటుల విషయానికి వస్తే, ర్యాపిడ్ ఇండివిడ్యుల్ గ్రాంటులు అలాగే ఇతర గ్రాంటుల గురించి పవన్ సంతోష్ సముదాయంలో ఎవరైనా, ఒక శిక్షణా తరగతి నిర్వహిస్తే బాగుంటుంది, తద్వారా సముదాయ సభ్యులకు వారి/వాటి పరిధులు అర్థమవుతాయి." అని రాశారు పైన. అసలు సముదాయ సభ్యులకు ఉన్న పరిధి ఏమిటని మీరనుకుంటున్నారు? ఒకపక్కన తెలుగు వికీపీడియాలో ఎవరేం అడిగినా సమాధానం చెప్పకపోవడం, మరోపక్కన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే సముదాయం పరిధి బాగా తక్కువని మీరు ఊహించుకుంటున్నారన్న అభిప్రాయం కలుగుతోంది. ప్రశ్నలు అడగడం, సమాధానాలు కోరడం పరిధులు మీరినట్టే అనుకుంటున్నారా? మీరు అలా అనుకున్నట్టైతే పొరబడుతున్నారని చెప్పాలి.
  • 2014-15లో మొట్టమొదటి భారతీయ ఇండివిడ్యువల్ ఎంగేజ్మెంట్ గ్రాంటీగా నేను గ్రాంట్లు తీసుకుని పనిచేయడం మొదలుపెట్టిన నాటి నుంచి ఈనాటి వరకూ బోలెడన్ని నియమ నిబంధనలు మారాయి. ఈ మారడంలో సూత్రస్థాయిలో నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాను. (వికీమీడియా స్ట్రాటజీ 2030 రూపకల్పనలో ఒక వర్కింగ్ గ్రూప్ కి నేతృత్వం వహించి పనిచేశాన్లెండి) దానాదీనా నాకు అర్థమైనదేమంటే - నియమ నిబంధనలు ముఖ్యమే కానీ ఈరోజు ఉంటాయి, రేపు మారిపోతాయి. కానీ, వికీ స్ఫూర్తి మాత్రం పోదు. అది ఎప్పుడూ పునాదిగా ఉంటుంది. గ్రాంట్స్ విషయంలోనే కాదు వికీమీడియా కార్యకలాపాల్లో దేని విషయంలోనైనా "నియమ-నిబంధనల" వెనుక ఉండే వికీ స్ఫూర్తిలో నిస్సందేహంగా "పారదర్శకత", "జవాబుదారీతనం" ముఖ్యమైన దినుసులు. కాబట్టి, నియమాలను కన్నా ఉన్నతమైన ఆ స్ఫూర్తిని ఒంటబట్టించుకోవడం గౌరవప్రదమూ, మర్యాదకరమూను.
ఆఖరుగా - ఎప్పుడూ కూడా, నామీదే కాదు ఎవ్వరి మీదా నిరాధారమైన, అర్థరహితమైన ఆరోపణలు చెయ్యకండి. అది అన్ని విధాలా తప్పు. మీరు చర్చల్లో మీ ధోరణిని మీరే ఒక మూడో మనిషిగా పరిశీలించుకుని చూడండి ఎందుకు మీ తోటి వికీపీడియన్లు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారో మీకే అర్థమవుతుంది. ఇంతకుముందే పైన జరిగిన చర్చలో నేను చెప్పిన సంగతి మళ్ళీ చెప్తున్నాను: "ఒకవేళ ఎవరైనా (నాతో సహా) మాట్లాడిన మాటల్లో అవమానకరమైనదో, అభ్యంతరకరమైనదో ఉంటే సహించాల్సిన పనేమీ లేదు. ఫలానా మాట నిరాధారమైన విమర్శ అనిపిస్తే ఆ మాటేమిటో చెప్పి, ఆధారం ఉంటే ఇవ్వమని వాళ్ళనే అడగండి. అలానే, వారు మన లోటుపాట్లు ఎత్తిచూపితే, అది వాస్తవం అనిపిస్తే నిస్సంకోంచగా ఫలానాది నా లోపం నేను దిద్దుకుంటాను అనో, ఎవరైనా నాకు సాయం చేయండి అనో చెప్పండి. దానివల్ల అందరం లాభపడతాం."
మీ వ్యవహార శైలిలోనూ, అవగాహనలోనూ మార్పుచేర్పులు చేసుకుంటే మీ వల్ల స్థూలంగా వికీపీడియాకు మేలు జరుగవచ్చునన్న సదుద్దేశం నాకిప్పటికీ ఉండబట్టి ఇలాంటి సూచనలు చేస్తున్నాను. పవన్ సంతోష్ (చర్చ) 10:06, 22 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ, బైదవే - ఇప్పుడే మీ చర్చా పేజీ చూస్తే ఒక సంగతి కనబడింది. నేను బహుముఖ కృషి పురస్కారం పేరిట ఒక బార్న్ స్టార్ ఇచ్చి, "సాయి కిరణ్ గారూ! తెలుగు వికీపీడియాలో ఈనాటి కొత్త నీటికి మీరు సంకేతం, కొత్త నాయకత్వానికి మీ పనితీరు ప్రామాణికం! అందుకే అందుకోండి ఈ పతకం - పవన్ సంతోష్ (చర్చ) 04:11, 3 అక్టోబరు 2022 (UTC)" అని మీ గురించి రాశాను కదా. ఈ సంగతి నాకు నిన్న గుర్తురాలేదు - ఇచ్చినవాణ్ణి కనుక. ఊరికే మీ వాడుకరి పేజీ చూస్తూంటే అక్కడ కనిపించింది. మీరూ మర్చిపోయి ఉండొచ్చు కనుక గుర్తుచేయడానికి ఇక్కడ పెడుతున్నాను. ధన్యవాదాలతోReply
ఈ చర్చలో అసలు ప్రధాన అంశం."తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ పేజీ ఏర్పాటు గురించి" దీనిని ముందుకు తీసుకువెళ్లవలసిన అవసరముంది.యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్ట్ పర్సన్స్ చర్చలో, మొదటి కాంటాక్ట్ పర్సన్ గా చదువరి గారు ప్రతిపాదించిన పవన్ సంతోష్ గారికి గతంలోకూడా నా మద్దతును లేదా అంగీకారం తెలిపాను.అ అబిప్రాయం మీదే నేను బద్ధుడనై ఉన్నాను. అలాగే ఆ చర్చలో రెండవ కాంటాక్ట్ పర్సన్ గా పవన్ సంతోష్ గారు ప్రతిపాదించిన సాయికిరణ్ గారికి కూడా నా మద్దతు లేదా అంగీకారం తెలిపాను.అయితే ఆ తరువాత సాయికిరణ్ గారు కొన్ని విషయాలలో సముదాయ సభ్యులు అడిగినదానికి వివరణ ఇవ్వకుండా దాటవేసే ధోరణి ఎక్కువుగా కనపడుతుంది.ఈ చర్చలో ప్రధాన అంశం కన్నా దానిమీదనే ఎక్కువ చర్చ జరిగింది.పై పరిణామాలు దృష్ట్యా సాయికిరణ్ గారిపై నా అభిప్రాయం ఉపసంహరించుకుంటున్నాను. రెండవ కాంటాక్ట్ పర్సన్ గా చురుకుగా ఉన్న వాడుకరులలో ఎవరినైననూ పవన్ సంతోష్ గారిని ప్రతిపాదించి, చర్చను ముందుకు తీసుకువెళ్లవలసిందిగా కోరుచున్నాను.అందరికి ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 06:11, 24 జూలై 2023 (UTC)Reply
యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్ట్ పర్సన్స్ విషయంలో పైన యర్రా రామారావు గారు వెళ్ళిబుచ్చిన అభిప్రాయమే నాది కూడా. కాబట్టి, మొదటి కాంటాక్ట్ పర్సన్ గా పవన్ సంతోష్ గారికి గతంలో తెలిపిన విధంగా ఇప్పుడు కూడా నా మద్దతును తెలుపుతూ, రెండవ కాంటాక్ట్ పర్సన్ గా వేరే ఎవరినైననూ ప్రతిపాదించాల్సిందిగా సముదాయ సభ్యులను కోరుతున్నాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 04:48, 25 జూలై 2023 (UTC)Reply
సముదాయ సభ్యులకు నమస్కారం,

ఇక్కడ నా గురించి జరుగుతున్న చర్చలో గమనించవలసిన విషయాలు ఏమిటి అంటే, నేను ఏ గ్రాంటు తీసుకున్న ఏ పని చేసిన వికీమీడియా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వర్తిస్తున్నాను, నిర్వర్తిస్తాను అలాగే కొనసాగిస్తాను. ఇక మూమెంట్ చార్టర్ గ్రాంటులో నేను సముదాయంలో చర్చకు పెట్టె 24 గంటల్లోనే కొంత మంది వ్యక్తులు నా మీద వ్యక్తిగత దాడికి దిగారు, వారికి అర్ధమయ్యే విధంగా చెప్పిన కూడా నేను మాట్లాడుతున్న విషయాల్లో మధ్య మధ్యలో ఉన్న అక్షరాలను పట్టుకొని నన్ను దోషిగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు. వీరు ఇప్పుడు ఒకసారి ఇలాగ ఉన్నారా అంటే! కానే కాదు, ఇంతకూ ముందు జరిగిన ఎన్నో చర్చల్లో వ్యక్తుల మీద దాడులు చేయడం చూడవచ్చు (అవన్నీ నేను మాట్లాడ దలుచుకోలేదు), సముదాయంలో ఏంతో మంది చురుకైన వాడుకరులు ఎందుకు తెలుగు వికీని వదిలారో మనమంతా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సముదాయం అంటే మేమె అని చెప్పుకొనే ముగ్గురు నలుగురు వ్యక్తులేనా! మిగతా అందరి అభిప్రాయం కూడా ఉంటె బాగుంటుంది.

ఇక నేను తీసుకున్న గ్రాంటు ఇండివిడ్యుఅల్ కి సహాయం అందించడానికి పెట్టినది, అది కమ్యూనిటీ రిసోర్సెస్ కి సంబంధం ఉన్నది కాదు. ఇకపై మాట్లాడ దలుచుకుంటే మూమెంట్ చార్టర్ గ్రాంట్ ల గురించి మరింత అవగాహన పొంది చర్చిస్తే బాగుంటుంది.

ఇక ఈ చర్చ పక్క దోవ పట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు, తెలుగు వికీ అభివృద్ధి దిశగా పవన్ గారు ఇప్పటి ఈ చర్చ ప్రారభించినందుకు ధన్యవాదాలు, నేను యూజర్ గ్రూప్ లో ఉంటానని ముందుకు రాలేదు, మీరే ప్రస్తావించారు ఇప్పుడు మీరే కాదంటున్నారు. ఆ స్థానంలో ఉండకపోవడం వల్ల తెలుగు వికీకి నేను అందించే సేవలు ఏం మారవు, ఆ భాద్యతలు ఎవరు చేపట్టిన నా సహాయ సహకారాలు ఉంటాయి.

ఇంకో ముఖ్యమైన విషయం, గతంలో యూజర్ గ్రూప్ గురించి జరిగిన చర్చల ద్వారా నేను గ్రహించిన కొన్ని విషయాలు ఈ క్రింది అభిప్రాయాన్ని కలిగించాయి:

  1. యూజర్ గ్రూప్ నిర్వహణ లేదా వికీమీడియాతో కాంటాక్ట్ పర్సన్ గా ఉండే వారు ఎటువంటి సంస్థాగత అనుబంధం లేకుండా ఉంటె మంచింది. ఇక పవన్ గారి విషయానికి వస్తే ఇప్పుడు సి.ఐ.ఎస్ ప్రోగ్రామ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు, వారు ఆల్రెడీ ఒక బాధ్యతాయుత పదవిలో తెలుగు వికీకి సేవ అందించే అవకాశం కలదు. ఇక తెలంగాణా ప్రభుత్వం, ఐఐఐటీ లాంటి సంస్థలతో అనుబంధం ఉన్న వ్యక్తులు కూడా వారి వారి అజెండాలా మీద పని చేస్తున్నారు కాబట్టి వేరే వారు ఎవరైనా ఉంటె బాగుంటుంది.
  2. ఇక ఎటువంటి సంస్థాగత అనుబంధం లేకుండా వికీకి నిస్వార్థంగా సేవ అందిస్తున్న వాడుకరి:రవిచంద్ర, User:K.Venkataramana, వాడుకరి:Arjunaraoc, వాడుకరి:Rajasekhar1961 గార్లు లేదా ఇతరులు ఎవరైనా ముందుకు వస్తే బాగుంటుందని విశ్వసిస్తున్నాను. మీకు కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.

NskJnv 07:54, 25 జూలై 2023 (UTC)Reply

సముదాయానికి ఎందుకు చెప్పలేదు అని ఒకే ఒక ప్రశ్న అడిగితే సమాధానం చెప్పకపోగా, "సముదాయంలో ఏంతో మంది చురుకైన వాడుకరులు ఎందుకు తెలుగు వికీని వదిలారో మనమంతా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది." అంటూ తనపై వచ్చిన ఆరోపణల నుండి దృష్టి మరల్చే ప్రయత్నం చేయబూనారు. సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో పడినప్పుడు బహుశా ఎవరైనా ఇలాంటి పనులే చేస్తారేమో. కానీ అంబాసిడరుగా ఆయన చేసిన, చేయని పనుల గురించి కొంత చర్చించాల్సిన అవసరం ఉందని నేను గమనించాను. వాటి గురించి క్లుప్తంగా ఉపతరువాతి విభాగంలో.

Nskjnv గారు తీసుకున్న గ్రాంటుల గురించి

మార్చు
Nskjnv గారు తాను తీసుకున్న గ్రాంటు గురించి చెబుతూ "ఆ తరువాత ఈ గ్రాంటు అనేది అంబాసిడర్ గా ఉన్న వ్యక్తి వెచ్చించే సమయానికి పనికి అందించే రుసుము." అని చెప్పారు. వికీమీడియా ప్రాజెక్టుల్లో, దాని మెటా ప్రాజెక్టుల్లో స్వచ్ఛంద సేవ ఉంటుందనే విన్నాను గానీ, ఫీజులు వసూలు చెయ్యొచ్చని నాకు తెలియదు. దానికి మీరిచ్చిన లింకులో గ్రాంటు అని ఉందిగానీ, రుసుము అని నాకు కనబళ్ళేదు. అది రుసుము (ఫీజు) అని ఎక్కడ ఉందో దాని లింకు ఇవ్వండి Nskjnv గారు.
మెటాలో ఈ విధంగా అనువాదాలకు గ్రాంటు ఇస్తున్నారు.. మీరు కూడా అప్లయి చేసుకోండి అని తెవికీలో ఎందుకు చెప్పలేదు? అని గతంలో రచ్చబండలో అడిగాను కానీ సమాధానం రాలేదు. ఒక అంబాసిడరుగా వికీమీడియాకు తెలుగు వికీపీడియాకూ మధ్య సమాచార వారధిగా ఉన్న అంబాసిడరుకు ఆ బాధ్యత ఉంది అని నా భావన. ఇప్పుడు మరొక సంగతిని గమనించాను.
ఉరుగ్వేలో ఈ సంవత్సరం నవంబరులో GLAM Wiki 2023 అనే ప్రపంచ స్థాయి కాన్ఫరెన్సు జరగబోతోంది. GLAM అంటే గాలరీలు, లైబ్రరీలు, ర్కైవులు, మ్యూజియంలు. వాటి గురించి జరుపుతున్న కాన్ఫరెన్సు అది. పై రంగాలకు చెంది, వికీలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు, వికీ లవ్స్ ఫోక్‌లోర్ లాంటి ప్రాజెక్టులు నిర్వహించినవారూ ఈ కాన్ఫరెన్సు స్కాలర్‌షిప్పుకు అర్హులు. nskjnv గారూ, మీకు దాని గురించి తెలుసు. మీరు అప్లై చేసుకుందామని ప్రయత్నించారు కూడా. ఒక అంబాసిడరుగా మీరు తెలుగు వికీపీడియాలో ఆ సంగతి ప్రకటించి అర్హత/ఆసక్తి ఉన్నవారిని అప్లయి చేసుకొమ్మని చెప్పి ఉండాలి కదా? అది అంబాసిడరు బాధ్యత కాదా? ఆ స్కాలర్‌షిప్పు కోసం అప్లయి చేసుకోగలిగే అర్హత ఉన్నవారు తెవికీలో నాకు తెలిసి కనీసం ఇద్దరున్నారు. పైగా ఆ ఇద్దరూ మహిళలే. వాళ్ళకు ఈ కాన్ఫరెన్సు గురించి తెలుసో లేదో మరి! దానికి అప్లయి చేసుకోడానికి ఇంకా సమయం ఉంటే, కనీసం ఇప్పుడైనా దాని వివరాలను ఇక్కడ ప్రకటించండి.
అసలు "ఒక అంబాసిడరుగా" తెవికీకి సంబంధించి ఇప్పటి వరకు ఏం పనులు చేసారు? వాటి తెవికీ లింకులు ఇవ్వగలరు.
Nskjnv గారూ, తాజాగా "కొలామీ వికీపీడియా" అభివృద్ధి కోసం తీసుకున్న 4 లక్షలతో కలిపి, గత రెండేళ్ళలో మీరు తీసుకున్న గ్రాంటుల మొత్తం సుమారొక 9 లక్షలుంటుందా? వికీపీడియాలో వివిధ రకాలైన గ్రాంటులు, స్కాలర్‌షిప్పులూ వగైరాల పేరిట డబ్బులు తీసుకునే మార్గాల గురించి ఆసక్తి ఉన్నవారికి శిక్షణ నివ్వడంలో ఒక అంబాసిడరుగా బాధ్యత, గ్రాంటులు తీసుకున్న అనుభవజ్ఞునిగా మంచి అర్హతా మీకున్నాయని భావిస్తున్నాను. "వికీపీడియా:" పేరుబరిలో దీనికోసం ఒక పేజీ పెట్టి ఆ వివరాలను రాయవచ్చు, లేదా దానికోసం ఒక ప్రాజెక్టు పెట్టవచ్చు. కొత్త గ్రాంటుల సమాచారం, వాటిపై చర్చ, గ్రాంటు కోసం అప్లయి చేసుకున్నవారు, గ్రాంటు అందుకున్నవారు.. వగైరా వివరాలను కూడా అక్కడ చేర్చవచ్చు.
ఇకపోతే, పవన్ సంతోష్ గారు ఈ పని చేపట్టడం పట్ల ఒక మాట.. పవన్ గారికి సముదాయం పట్ల ఉన్న నిబద్ధత విషయంలో నాకు ఏ సందేహమూ లేదు, సముదాయం అంటే చులకన భావంతో ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు. __ చదువరి (చర్చరచనలు) 12:43, 28 జూలై 2023 (UTC)Reply
చదువరి గారు మీరిక్కడ ప్రస్తావించిన వాటికి సూటిగా సమాధానం చెపుతున్నాను..

మొదటిగా

  • మెటాలో ఈ విధంగా అనువాదాలకు గ్రాంటు ఇస్తున్నారు.. మీరు కూడా అప్లయి చేసుకోండి అని తెవికీలో ఎందుకు చెప్పలేదు?

అలా చెప్పే భాద్యత నాది కాదు, ముమ్మాటికీ కానే కాదు. ఫౌండేషన్ వారు అసలు ఈ మూమెంట్ చార్టర్ అంబాసిడర్ కార్యక్రమం గురించి తెలపాలి, వారు తెలపలేదు. నాకు అందిన మెయిల్ ద్వారా నేను తెలుసుకున్నాను. అలాగే ఇంతకు ముందు ప్రస్తావించిన విదంగా వారు సూచించిన నియమావళికి అనుగుణంగా నేను ఆ పని చేపట్టాను.

  • ఉరుగ్వేలో ఈ సంవత్సరం నవంబరులో GLAM Wiki 2023 అనే ప్రపంచ స్థాయి కాన్ఫరెన్సు జరగబోతోంది. GLAM అంటే గాలరీలు, లైబ్రరీలు, ర్కైవులు, మ్యూజియంలు. వాటి గురించి జరుపుతున్న కాన్ఫరెన్సు గురించి ....

ఈ కాంఫరెన్సుకు మూమెంట్ చార్టర్ అంబాసిడర్ కార్యక్రమానికి ఎటువంటి సంబంధం లేదు, దీని గురించి ఒక సాటి వికీపీడియన్ గా నాకు చెప్పే భాద్యత ఉందని నేను భావిస్తాను! కానీ మూమెంట్ చార్టర్ అంబాసిడరుకు ఇది భాద్యత కానే కాదని మీరు గమనించగలరు. ------ నేను దరఖాస్తు చేసుకుంది కూడా చివరి రోజున, ఆది పూర్తి కూడా అవ్వలేదు. ఇంకా మీకు ఆసక్తి ఉంటె ఆయా మెటా పేజిలకి వెళ్లి తెలుసుకోగలరు, మీకు కనుక్కోవడం కష్టంగా ఉంటె అడగండి నేను తప్పకుండ సహకరిస్తాను.

  • అంబాసిడర్ గా నేను గత సంవత్సరం మూమెంట్ చార్టర్ గురించి సముదాయ సభ్యులను ఆహ్వానించి చర్చ జరిపాను, తీరా చూస్తే మీటింగ్ కి వచ్చింది ఇద్దరు ముగ్గురు, వారిలో పవన్ గారు కూడా ఒకరు. వికీ స్ఫూర్తి పాటించడంలో పవన్ గారిని నేను అభినందిస్తాను. (ఇంకా చెప్పాలి అంటే అసలు నేను తెలుగు వికీలో చేరిన మొదట్లో పవన్ గారు ఒక అంతర్జాతీయ ఎన్నికల్లో పాల్గొంటే క్యాంపైగ్న్ కూడా చేసాను లెండి.)
  • Nskjnv గారూ, తాజాగా "కొలామీ వికీపీడియా" అభివృద్ధి కోసం తీసుకున్న 4 లక్షలతో కలిపి, గత రెండేళ్ళలో మీరు తీసుకున్న గ్రాంటుల మొత్తం సుమారొక 9 లక్షలుంటుందా?

నేను తీసుకున్న గ్రాంటుల విలువ 8 లక్షలకు దగ్గరగా ఉంటుంది, ఇక నేను ఇంతకు ముందు తీసుకున్న ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసాను కాబట్టే ఇటీవల కొలామి వికీపీడియా గ్రాంటు అందుకున్నాను.

అంతే కాదండి నేను ప్రస్తుతం మూడు భారతీయ భాషల్లో దాదాపు 7 వికీమీడియా ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టాను. నయా పైసా తీసుకోకుండా గత సంవత్సర కాలంగా రెండు కొత్త భాషలలో వికీపీడియాను నిర్మిస్తున్నాము, వాటిల్లో ఒకటే ఈ కొలామి వికీపీడియా. ఇక తెలంగాణా ప్రభుత్వం సహకారంతో, ఆయా భాషల సంఘాలతో కలిసి దాదాపు 10 కి పైగా ఆఫ్ లైన్ మీటింగులు కూడా నిర్వహించాను.

ఇక మీరు నా అనుభవం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇది కూడా చెప్తే బాగుంటుంది అనిపించి చెబుతున్న, నేను తెలంగాణ, అస్సాం రాష్ట్రాలలోని లోని మూడు జిల్లాలలో పని చేస్తూ ప్రైవేట్, ప్రభుత్వం ఇలా రకరకాల సంస్థల అనుబంధంతో విద్య, వైద్యం, ఉపాధి కల్పన, శిశు సంక్షేమం ఇతరాత్ర అంశాలపై దాదాపు 36 కోట్లు విలువ చేసే ప్రాజెక్టుల రూపకల్పన, నిర్వహణపై కృషి చేసాను. ఇక నాకున్న సంస్థాగత అనుభవంతో తెలుగు వికీ యూజర్ గ్రూప్ కి కూడా ప్రాజెక్టుల రూపకల్పన అందించగలను.

సముదాయంలో ఎన్నో ప్రాజెక్టులో మొదలుకొని అసంపూర్ణంగా అలాగే సంవత్సరాల కొద్దీ ఉండేవి ఉంటూనే ఉంటాయి, వాటి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు వ్యక్తిగతంగా నామీద చేస్తున్న ఆరోపణలను నా పట్ల మీ ధోరణిని నేను పూర్తిగా ఖండిస్తున్నాను, దీనిని నేను వ్యక్తిగత దాడిగా పరిగణిస్తున్నాను. ఎవరెన్ని దాడులు చేసిన, నన్ను పదే పదే నా మనోధైర్యం దెబ్బతినే విధంగా దూషణలు చేసిన నా వికీ స్ఫూర్తి చావదు, వికీ కాన్ఫరెన్సు 2023 సాక్షిగా మన దేశంలో ఉన్న 1600కు పైగా మాతృ భాషలలో కేవలం ~29 భాషలలో మాత్రమే ఉన్న వికీపీడియాను మరిన్ని భాషలలో మానవాళికి అందించే దిశగా నా కృషి సాగుతూనే ఉంటుంది.

ఇక్కడితో నేను ఈ చర్చ ముగిస్తున్నాను.

NskJnv 05:13, 1 ఆగస్టు 2023 (UTC)Reply

తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు

మార్చు

సముదాయ సభ్యులకు నమస్కారం!

తెలుగు వికీపీడియా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వికీ ప్రాజెక్టులలో ఒకానొక గొప్ప ప్రాజెక్టు. 84 వేయిలకు పైగా వ్యాసాలతో ముందుకు వెళ్తున్న మనం 1 లక్ష వ్యాసాలకు చేరువ కాబోతున్నాము, ఈ విషయం గురించి సముదాయంలో చాలా సార్లు చర్చ జరిగింది. ఇక 2023 సంవత్సరాన్ని ప్రాతిపదికగా లక్ష వ్యాసాల మైలు చేరుకునే దిశగా మన ప్రయాణం ఉండే అవసరం ఎంతో ఉంది. అలాగే మనం నిర్వహించుకుంటున్న, నిర్వహించుకోబోయే ప్రాజెక్టులను గురించి చర్చించి వ్యూహాలు రచించవలసిన అవసరం ఉన్నది.

ఈ ప్రయాణంలో వాడుకరి:Pranayraj1985 గారు సమన్వయ కర్తగా వాడుకరి:Pavan santhosh.s, వాడుకరి:Veeven, వాడుకరి:యర్రా రామారావు గార్లు కమిటీ సభ్యులుగా నిర్వహిస్తున్న తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదిగా నా అభిప్రాయం. ఈ ప్రాజెక్టులో జరిగిన పురోగతి అలాగే ప్రాజెక్టు యెంత వరకు పూర్తయింది, దీనికి సముదాయం నుండి ఏదైనా సహాయం కావాలా! వగైరా విషయాలను గురించి ప్రాజెక్టు నిర్వాహకులని, సముదాయ సభ్యులని చర్చకు ఆహ్వానిస్తున్నాను.

ఇటీవల ప్రణయ్ రాజ్ గారు చెప్పినట్టు ,

"తెలుగు వికీపీడియా గురించి వాడుకరులు స్వయంగా నేర్చుకోగలిగే పాఠ్య ప్రణాళిక, దానికి అవసరమైన అన్ని రకాల బోధనా ఉపకరణాలు తయారుచేసి అందించేందుకు వికీమీడియా ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు నిర్వహించబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతున్నందున ఇప్పటివరకు తయారు చేసిన పాఠాల స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగా పాఠాలను రూపొందించాల్సివస్తుంది. అందుకు మరికొంత గడువు అవసరమయింది."

ఈ ప్రాజెక్టులో భాగాంగా నిర్మించిన పాఠాలకు సంబంధించి లింకులు అందజేయవల్సిందిగా కోరుతున్నాను.

NskJnv 06:18, 20 జూలై 2023 (UTC)Reply

@Nskjnv గారూ, ఈ విషయంపై ప్రాజెక్టు సమన్వయకర్తగా పనిచేస్తున్న @Pranayraj1985 గారు ప్రతిస్పందిస్తారు. పవన్ సంతోష్ (చర్చ) 07:49, 20 జూలై 2023 (UTC)Reply
@Nskjnv గారూ... ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీ ప్రాజెక్టులలో తెలుగు వికీపీడియా గొప్ప తనాన్ని ప్రస్తావిస్తూ తెవికీలో మనం నిర్వహించుకుంటున్న, నిర్వహించుకోబోయే ప్రాజెక్టులను గురించి చర్చించి వ్యూహాలు రచించవలసిన అవసరం ఉన్నదని తెలుపుతూ 'తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు' అప్డేట్ కు సంబంధించి చర్చను తీసుకొచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు.
ఈ ప్రాజెక్టులో జరిగిన పురోగతి,
  1. తెలుగు వికీపీడియా పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టులో భాగంగా వికీపీడియా శిక్షణకు సంబంధించి పాఠ్యాంశాల జాబితా, వాటికి తగిన ప్రశ్నావళిని రూపొందించి, సముదాయ సభ్యుల సలహాలు-సూచనలు-మార్పులు కోరుతూ 2021, సెప్టెంబరు 5న తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాల జాబితా అని రచ్చబండలో రాయడం జరిగింది.
  2. పాఠ్యాంశాల ప్రశ్నావళి ఆధారంగా వికీపీడియా పరిచయం, యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, వ్యాస వివరాల పరిచయం, ఖాతాను తెరవడం, వాడుకరి పేజీ సృష్టి, వాడుకరి చర్చాపేజీ, ప్రయోగశాల, వీక్షణ జాబితా వంటి అంశాలకు సంబంధించి పాఠ్యాన్ని రాసి సముదాయ సభ్యుల సలహాలు-సూచనలు-మార్పులు కోరుతూ 2022, మార్చి 4న తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలు అని రచ్చబండలో రాయడం జరిగింది.
ఇందులో 'తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాల జాబితా'కు సంబంధించి సహ సభ్యులు ఏలాంటి సలహాలు-సూచనలు-మార్పులు చేయలేదు. 'తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలు'కు సంబంధించి ఆయా పాఠాల చర్చాపేజీలో ఒక్క వాడుకరి:Chaduvari గారు మాత్రమే సూచనలు చేశారు. ఆ సూచనలను అనుసరించి పాఠాలలో మార్పులు చేయడం జరిగింది. వాటి మాదిరిగానే మరిన్ని పాఠాలు రూపొందించే క్రమంలో, వికీ రూపు "వెక్టర్" నుండి "వెక్టర్ 2022" మారబోతోందని తెలిసింది. దాంతో కొత్త రూపుకు తగ్గట్టుగా పాఠాలు రూపొందించుకుంటేనే బాగుంటుందన్న ప్రాజెక్టు కమిటీ సభ్యుల సూచనమేరుకు, వికీలో దిద్దుబాట్లు చేస్తూ కొత్తగా వస్తున్న వెక్టర్ 2022 రూపును పరిశీలించిన తదుపరి పాఠాలు రూపొందించాలని నిర్ణయించడం జరిగింది. అయితే, ఏదోఒకటి చేసేసి చేతులు దులుపుకునే ప్రాజెక్టు కాదు ఇది, కొత్తవారికి తెవికీ రచనపై పూర్తిస్థాయాలో శిక్షణ అందించేందుకు చేస్తున్న ప్రాజెక్టు కాబట్టి మరికొంత సమయం అవసరమై 2023 అక్టోబరు 30 వరకు ప్రాజెక్టు గడువును పొడగించడం జరిగింది. రాబోవు మూడు నెలల్లో ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.
ఏ ఒక్కరి (ప్రాజెక్టు సమన్వయకర్త) దృష్టికోణం నుండి మాత్రమేకాకుండా వికీ రచనలో ప్రాథమిక, మధ్యమ, ఉన్నతస్థాయిలకు చెందిన వివిధ వాడుకరుల దృష్టికోణాలను పరిగణలోకి తీసుకొని చేయాల్సివుంటుంది. ఇందుకోసం గతంలో కోరినట్టుగానే ఇప్పుడుకూడా తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠ్యాంశాల జాబితా, తెవికీ పాఠ్య ప్రణాళిక పాఠాలలో సలహాలు-సూచనలు-మార్పులు సూచించడంలోనూ, పాఠాల కంటెంట్ ను తయారీ, వీడియోల తయారీ విషయంలోనూ సముదాయ సభ్యుల నుండి సహాయాన్ని కోరుతున్నాను.
పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టుకు సంబంధించిన పలు లింకులు ప్రాజెక్టు ఉప పేజీలు విభాగంలో ఉన్నాయి, సముదాయ సభ్యులు గమనించగలరు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 10:14, 20 జూలై 2023 (UTC)Reply
@Pranayraj1985 గారూ, ఈ ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా జరగలేదని నేను భావిస్తున్నాను. రూపు మార్పు, సముదాయం నుండి అభిప్రాయాలు రాకపోవడం కారణాలుగా ఇక్కడ మీరు చెప్పారని నేను అనుకుంటున్నాను. అయితే నేను ఇకముందు, ఉన్న కాస్త సమయంలో ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకుపోవాలనే విషయమై కొన్ని అభిప్రాయాలు, సూచనలు రాయదలచాను. అవి ఇక్కడ:
  1. కొత్త రూపు, వెక్టరు 2022, వచ్చేసింది కాబట్టి పాఠాలను తయారుచెయ్యవచ్చు. ప్రతీ పాఠం లోనూ మీరు వివరించే పేజీ ఇతర రూపులలో ఎలా ఉంటుందో చూపించే లింకులు ఇవ్వండి. అంటే పాఠం, పాఠ్యం, వివరణ వగైరాలన్నీ ఒక్క రూపు లోనే ఉంటాయి. ఇతర రూపులవి కేవలం తెరపట్టు బొమ్మలకు లింకులు ఇస్తారంతే.
  2. ప్రాజెక్టు ముగింపు ఈ అక్టోబరు అని చెప్పారు. అంటే మూణ్ణెల్ల సమయముంది. ఈ మూణ్ణెల్లలో ఏమేం చేస్తారో మీ ప్రణాళిక ఇవ్వండి. ఏ నెలలో ఎంత పని జరుగుతుందో చెప్పండి. తద్వారా ఈ మూణ్ణెల్లలో ఈ ప్రాజెక్టు నుండి మేం ఏమేం ఆశించవచ్చో తెలుస్తుంది.
  3. ఈ మూణ్ణెల్లలో ప్రతి నెల మొదటి రోజున గత నెలలో మీరు చేసిన పనిని క్రోడీకరిస్తూ ఒక నివేదిక ఇవ్వండి. ఎంత పని చేస్తే అంతే రాయండి, అసలు పనే జరక్కపోతే అదే రాయండి. కానీ నెలనెలా ఒక నివేదిక మాత్రం ఇవ్వండి. ఒకవేళ ఒక నెలలో ఒకటి కంటే ఎక్కువ నివేదికలు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడితే ఇవ్వండి. ఎన్నైనా ఇవ్వండి. ఆగస్టు 1 న ఇప్పటి వరకూ జరిగిన పనిని క్రోడీకరిస్తూ ఒక నివేదిక ఇవ్వండి.
  4. ఇకనుండీ మీరు చేసిన పనిపై సముదాయం అభిప్రాయాలను రచ్చబండలో కాకుండా ప్రాజెక్టు పేజీల్లోనే అడగండి (గతంలో కొన్ని అలా అడిగారు, నాకు తెలుసు). అయితే ప్రాజెక్టుకు సంబంధించి సామాన్య/సాధారణ (కామన్/జనరల్) అంశాలపై చర్చ కోసం అవసరమైతే ప్రత్యేకించి ఒక పేజీ పెట్టండి. ఇతర చర్చలు ఆయా పేజీల చర్చపేజీల్లోనే చెయ్యవచ్చు. అక్కడికి వచ్చి రాయమని రచ్చబండలో కోరండి. తద్వారా ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలన్నీ ఒకచోట ఉంటాయి. వెనక్కి తిరిగి చూసుకోటానికి వీలుగా ఉంటుంది. రచ్చబండలో జరిగిన పాత చర్చలేమైనా ఉంటే వాటి లింకులను ఆ ప్రాజెక్టు పేజీలో ఇవ్వవచ్చు.
  5. ఆయా చర్చల్లో వచ్చిన అభిప్రాయాల మేరకు మీరు, పరిశీలక సంఘంలోని ముగ్గురు సభ్యులు నిర్ణయాలు చేస్తారు గదా.., ఆ నిర్ణయాలన్నిటినీ క్రోడీకరించి ఒకచోట (నిర్ణయాల పేజీ) పెట్టండి.
  6. చర్చను నిరవధికంగా కొనసాగించకండి. ఖచ్చితమైన వ్యవధి ఇవ్వండి. ఆలోపు వచ్చిన అభిప్రాయాలను పరిగణించి నిర్ణయాలు తీసుకోండి. కాకపోతే ఒకటి రెండు సార్లు రచ్చబండలో గమనింపు పెట్టండి. చర్చా వ్యవధి వారం సరిపోతుందని నా అభిప్రాయం.
  7. సముదాయం నుండి అభిప్రాయాలు, సూచనలూ ఏమీ రాకపోతే మీ ఆలోచనల మేరకు (మీవి, పరిశీలక సంఘ సభ్యులవీ) ముందుకు సాగండి. ఇప్పుడు @Nskjnv గారు ఈ చర్చ మొదలుపెట్టి తొమ్మిది రోజులైంది. దానికి మీరు సమాధానం చెప్పికూడా తొమ్మిది రోజులైంది. ఆ సమాధానం తరువాత మీరు ఇచ్చిన లింకుల్లో ఉన్న సమాచారంపై ఆయన గానీ మరెవరైనా గానీ సూచనలు అభిప్రాయాలూ చెప్పారో లేదో నేను గమనించలేదు. ఒకవేళ వచ్చి ఉంటే సరే.., లేదంటే ఇక ముందుకు పోవచ్చునేమో ఆలోచించండి.
పరిశీలించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 15:48, 29 జూలై 2023 (UTC)Reply
ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే విషయమై మీ అభిప్రాయాలు, సూచనలు తెలియజేసినందుకు ధన్యవాదాలు @Chaduvari గారు. మీ సూచనలతో ప్రాజెక్టులో ముందుకు తీసుకెళ్తాను.-- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:24, 29 జూలై 2023 (UTC)Reply

ఈ వెబ్‌సైట్‌ను ఒకసారి పరిశీలించండి

మార్చు

ఈ వెబ్‌సైట్‌ ప్రత్వేకంగా ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలకు సంభందించినది. ఇందులోని సమాచారం దాదాపుగా 90 శాతానికి పైగా తెవికీ నుండి యథావిధిగా సేకరించిందే. తెవికీ నుండి తీసుకోకూడదు అనేది ఏమీ లేదు కదా? కాబట్టి ఇది తప్పు అని అనలేం.కాకపోతే కొన్ని మీడియా సంస్థలు వార్కి సమాచారం గ్రహించి, లేదా సేకరించి రాయటానికి వార్కి ఓపిక లేకనో, అంత నిష్ణాతులు లేకనో ఇలా జరుగుచుందేమోనని నా స్వంత అభిప్రాయం.ఉదాహరణకు ఆనందపురం గ్రామ వ్యాసం చూడండి.కాకపోతే తెలుగు వికీపీడియా నుండి సేకరించిందని రాయకపోవటం శోచనీయం.ఇంకో విషయం ఈ వెబ్‌సైట్‌ అడ్మిన్ గురించి తెవికీలో ఒక పేజీ ఉంది. కేవలం ఇది పరిశీలనకోసం మాత్రమే. యర్రా రామారావు (చర్చ) 05:02, 26 జూలై 2023 (UTC)Reply

అలా ఎత్తి రాసిన వారు కాపీరైట్ © 2001-2023 అని క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-ఎలైక్ లైసెన్సు గౌరవించ కుండా అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది అనిరాయటం శోచనీయం . Kasyap (చర్చ) 06:13, 26 జూలై 2023 (UTC)Reply
ఆయన కోసం ఎవరో తయారు చెసి ఉండాలి. ఆయనకి తెలుసో లేదో మరి..కాంటాక్ట్ డిటైల్స్ లేవు.B.K.Viswanadh (చర్చ) 07:40, 26 జూలై 2023 (UTC)Reply
నిజమేనండి. ఉచితంగా లభ్యమయ్యే కంటెంట్ కి ఉల్లేఖించడం, లైసెన్స్ ల గురించి చాలామందికి అవగాహన ఉండదు. కేవలం వైజ్ఞానిక వ్యాసాలకు మాత్రమే ఉల్లేఖనాలు అవసరం అనుకుంటారు. అక్కడ ప్రచురణ కర్తలు అంగీకరించరు కాబట్టి. తెవికీ మార్గదర్శక సూత్రాలకు ఇబ్బంది లేకపోతె మొదటి పేజీ లోనే ఈ విషయం తెలియచేయడం మంచిది. VJS (చర్చ) 09:18, 26 జూలై 2023 (UTC)Reply
నిజానికి ఆ వికీ పేజీ ఒక పెద్ద ప్రచార పేజీ. ఆ పేజీ చరిత్ర చూస్తే, దాని చర్చ పేజీ చూస్తే - ఆ పేజీలో ఎంత ప్రచారం చేసుకున్నారో తెలుస్తుంది. నేను కొంతవరకు అడ్డుకున్నాను. అతనికి, ఆ కంపెనీకి అమెరికాలో పడిన శిక్ష గురించి రాస్తే దాన్ని అడ్డుకున్నాడు. ఆ పేజీ రాయడం కోసం రెండు మూడు ఖాతాలు సృష్టించారు. నేను ఈమధ్య ఆ పేజీ చూళ్ళేదు, ఇవ్వాళే చూసాను.
అసలు సైన్సు పేరిట, పరిశోధనల పేరిట, సైంటిఫిక్ పబ్లిషింగ్ పేరిట ఆ పెద్దమనిషి చేసిన పనులతో పోలిస్తే ఇదంతా పెద్ద లెక్క లోది కాదు. తీరిక చూసుకుని వాటి లింకులు ఇస్తాను. వికీపీడియా మాదే, అక్కడ రాసేవాళ్ళు మా ఉద్యోగులే అని వాళ్ళు ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. చదువరి (చర్చరచనలు) 14:50, 28 జూలై 2023 (UTC)Reply

ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 ఫలితాలు

మార్చు

అందరికీ నమస్కారం,

2023 ఫిబ్రవరి 1 నుండి మార్చి 31 వరకు ఫెమినిజం, ఫోక్‌లోర్ ఎడిటథాన్ 2023 పేరుతో అంతర్జాతీయ రచనల పోటీ నిర్వహించబడింది. ఈ పోటీలో 77 కొత్త వ్యాసాలతో మురళీకృష్ణ గారు ప్రథమ స్థానంలోనూ, 12 కొత్త వ్యాసాలతో ప్రణయ్‌రాజ్ వంగరి గారు ద్వితీయ స్థానంలోనూ, 1 కొత్త వ్యాసంతో చదువరి గారు తృతీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీలో పాల్గొన్నందుకు వారికి నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు.--Nagarani Bethi (చర్చ) 06:49, 26 జూలై 2023 (UTC)Reply

కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపినందుకు Nagarani Bethi గారికి, పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన మురళీకృష్ణ, ప్రణయ్‌రాజ్ వంగరి , చదువరి గార్లకి శుభాకాంక్షలు. NskJnv 14:54, 26 జూలై 2023 (UTC)Reply
నా ధన్యవాదాలు..! Muralikrishna m (చర్చ) 14:59, 26 జూలై 2023 (UTC)Reply
అందరికీ ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:34, 31 జూలై 2023 (UTC)Reply

Deploying the Phonos in-line audio player to your Wiki

మార్చు

నమస్తే!

Apologies if this message is not in your language, ⧼Please help translate⧽ to your language.

This wiki will soon be able to use the inline audio player implemented by the Phonos extension. This is part of fulfilling a wishlist proposal of providing audio links that play on click.

With the inline audio player, you can add text-to-speech audio snippets to wiki pages by simply using a tag:

<phonos file="audio file" label="Listen"/>

The above tag will show the text next to a speaker icon, and clicking on it will play the audio instantly without taking you to another page. A common example where you can use this feature is in adding pronunciation to words as illustrated on the English Wiktionary below.

{{audio|en|En-uk-English.oga|Audio (UK)}}

Could become:

<phonos file="En-uk-English.oga" label="Audio (UK)"/>

The inline audio player will be available in your wiki in 2 weeks time; in the meantime, we would like you to read about the features and give us feedback or ask questions about it in this talk page.

Thank you!

UOzurumba (WMF), on behalf of the Foundation's Language team

02:26, 27 జూలై 2023 (UTC)

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటు గురించి

మార్చు

అందరికీ నమస్కారం,

తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటును ముందుకుతీసుకువెళ్ళే ఉద్దేశంతో జరిగిన చర్చల్లో గత డిసెంబరు ప్రాంతంలో సముదాయ సభ్యులు పలువురు నన్ను యూజర్ గ్రూప్‌కి ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌గా ఉండమని కోరారు. దానితో వికీమీడియా ఫౌండేషన్‌తోనూ, ఇతర యూజర్ గ్రూపులూ, సంస్థలతోనూ సంప్రదింపులు జరిపుతూ, నివేదికలు అందచేస్తూ ఉండాల్సిన ఈ నియమిత పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బాధ్యతలను స్వీకరించడానికి నేను అంగీకారం తెలిపాను.

గత ఏడాది వరకూ చేస్తున్న ఉద్యోగంలోంచి మారి ఇటీవల మూడు నెలల క్రితం నేను సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ ఉద్యోగంలో చేరాను. వృత్తిపరమైన పనుల కోసం, వ్యక్తిగతమైన పనుల కోసం వేర్వేరు మెయిల్ ఐడీలు, వేర్వేరు వికీమీడియా ఖాతాలు నేను ఉపయోగిస్తూ స్వచ్ఛంద, వృత్తిపరమైన పనుల విషయంలో భేదాన్ని, స్పష్టతని పాటిస్తున్నాను. అంతేకాక, ప్రపంచవ్యాప్తంగానూ, భారతదేశవ్యాప్తంగానూ కూడా వికీమీడియా ఉద్యమంలో వివిధ హోదాలు/బాధ్యతలు స్వీకరించి పనిచేస్తున్న వ్యక్తుల ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

నా ఉద్యోగ బాధ్యతలకు, యూజర్ గ్రూప్ కాంటాక్టు పర్సన్ బాధ్యతలకు మధ్య మా సంస్థపరంగా వృత్తిపరమైన వైరుధ్యం లేదనీ నిర్ధారించుకున్నాను. నావైపు నుంచి ఈ బాధ్యత తలకెత్తుకోవడానికి ఏ విధమైన అభ్యంతరమూ లేదు. అదే విధంగా, తెలుగు వికీమీడియా సముదాయం కూడా ఆలోచించుకుని నాకు యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌గా ఉండడానికి అంగీకారం తెలిపితేనే ఈ విషయంలో నేను ముందుకువెళ్తాను. పవన్ సంతోష్ (చర్చ) 06:01, 28 జూలై 2023 (UTC)Reply

  • ఒక ముఖ్యమైన సంగతి.. ఇక్కడ యూజరు గ్రూపును "ఏర్పరచడంలో" అవసరమైన పనులు చేసే బాధ్యతలను మోసేవారి కోసం వెతుకుతున్నాం. యూజరు గ్రూపు నిర్వాహకుల కోసం కాదు. నిర్వహకులను గ్రూపులో చేరే సభ్యులందరం కలిసి ఎన్నుకుంటాం. అది గ్రూపు ఏర్పాటయ్యాక జరిగేది, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనకు కావలసింది గ్రూపు ఏర్పాటు. పవన్ సంతోష్ గారికి ఉన్న అనుభవం రీత్యా ఆయన్ని ఈ పని చేపట్టవలసినదిగా కోరాం. దీనిలో ఆయన పని మనకు అడ్డం అవుతుందని నేను భావించడం లేదు. ఆయనకు ఉద్యోగ రీత్యా ఇబ్బందేమీ ఉండదంటున్నారు కాబట్టి ఆయనే ఈ పని చెయ్యాలని నా అభిప్రాయం. __చదువరి (చర్చరచనలు) 12:52, 28 జూలై 2023 (UTC)Reply
    @పవన్ సంతోష్ గారు సీఐఎస్-ఎ2కె ప్రోగ్రామ్ మేనేజర్ గా పనిచేస్తూ, యూజర్ గ్రూప్‌కి ఏర్పాటుకు, ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌ గా బాధ్యతలు నిర్వహించుటకు, తను పనిచేసే సంస్థపరంగా వృత్తిపరమైన వైరుధ్యం లేదనీ నిర్ధారించుకున్నందున, ఉద్యోగ రీత్యా ఇబ్బందేమీ లేదని తెలిపారు. కావున, అతనికి ఉన్న అనుభవం రీత్యా ఈ పనిని అతనే చేపట్టవలసినదిగా, నా అభిప్రాయం ఈ విషయంలో గతంలో ఇచ్చిన మద్దతును కొనసాగిస్తూ, అవసరమైన చర్యలు చేపట్టటానికి ముందుకు వెళ్లాలని నా అభిప్రాయం.అలాగే రెండవ కాంటాక్టు పర్సన్‌ గా ఎవరినైననూ వ్యక్తిగతంగా సంప్రదించి, అంగీకారం తెలిపిన వ్యక్తిని ప్రతిపాదించవలసినదిగా కోరుచున్నాను.ధన్యవాదాలు యర్రా రామారావు (చర్చ) 07:43, 31 జూలై 2023 (UTC)Reply
చదువరి, యర్రా రామారావు గార్లు పైన తెలిపిన అభిప్రాయాలతో నేనూ ఏకీభవిస్తూ, యూజర్ గ్రూప్ ప్రాథమిక కాంటాక్టు పర్సన్‌గా పవన్ సంతోష్ గారు ఉండడానికి అంగీకారం తెలుపుతున్నాను.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 17:27, 31 జూలై 2023 (UTC)Reply

రెండవ కాంటాక్టు పర్సన్ విషయమై

మార్చు

వారంరోజుల పాటు సాగిన పై చర్చలో భిన్నాభిప్రాయాలేమీ వ్యక్తం కాకపోవడంతో ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తూ రెండవ కాంటాక్ట్ పర్సన్‌ని ప్రతిపాదించాను. దయచేసి అక్కడ మీ అభిప్రాయాలు రాయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:21, 4 ఆగస్టు 2023 (UTC)Reply

వికీమీడియన్స్ యూజర్ గ్రూప్

మార్చు

యూజర్ గ్రూప్ గురించి అనేక సంవత్సరాలుగా పలుదఫాలుగా (మొదటి అవగాహాన సదస్సు 2015) జరిగినప్పటికీ వివిధ కారణాల వలన వాయిదా పడుతూ ఉన్నది ఈ సారి అయినా ఒక దరికి చేరుతున్నది అని ఆశిస్తున్నాను, కొత్తగా చేరిన వారి సౌలభ్యంకోసం పవన్ గారు రాసిన ప్రాథమిక ప్రతిపాదన తోపాటు నాకు తెలిసిన సమాచారం ఇక్కడ పంచుకొంటున్నాను . ఒకే తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ ఏర్పాటు సమూహం వికీమీడియా ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగించడం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా నిర్దిష్ట గ్రాంట్లు పొందడానికి అనుమతిస్తుంది అయితే ఇది ఐచ్చికం , ఇవి చట్టబద్ధంగా వికీమీడియా ఫౌండేషన్‌కు ప్రాతినిధ్యం వహించవు. ఇవి స్వయంసేవకుల ప్రత్యేక & స్వతంత్ర సమూహాలు, సాధారణ వినియోగదారు సమూహాలు చేసే లేదా చేయగల ఏ పనిని చేయడానికి గుర్తింపు అవసరం లేదు, తెలుగు వారందరికీ ఖచ్చితంగా ఒకే యూజర్ గ్రూపు ఉండాలని నిబంధన కూడా లేదు సమూహ ఆసక్తి బట్టి ఒక ప్రాంతానికో , ఇస్టమైన వికీ అంశానికో ఇలా వివిధ రకాల యూజర్ గ్రూప్ ఉండవచ్చు వాటి లక్ష్యాలు అనుగుణంగా ఉన్నంత వరకూ , ఆ లక్ష్యాలకు తోర్పడుతున్నంత వరకూ ఎంత మంది ఎన్ని యూజర్ గ్రూప్ లలో అయినా చేరవచ్చు లేదా ఆ గుంపు నుండి బయటకు రావచ్చు , ఇవి లేకుండా కూడా సభ్యులు ప్రాజెక్ట్ & ఈవెంట్ గ్రాంట్లు , వ్యక్తిగత గ్రాంట్లు మరియు ట్రావెల్ & పార్టిసిపేషన్ సపోర్ట్ గ్రాంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు . నాకు తెలిసి ఖచ్చితంగా తెలుగు వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ అనుమతి ఖచ్చితంగా ఉండి తీరాలి అన్న నిబంధన లేదు, అయితే వీటికి యూజర్ గ్రూప్ ఆమోద ప్రక్రియ , అనుసంధాన మద్దతు కు తోర్పడుతుంది అంతే కాక ఈ గ్రూప్ సభ్యులలో ఒకరికి ప్రతి సంవత్సరం బెర్లిన్‌లో నిర్వహించే వికీమీడియా సమావేశానికి హాజరయ్యేందుకు ఒక స్కాలర్‌షిప్ కూడా ఉంటుంది , ఈ ఏర్పాటుకు దాదాపు 10 మంది సభ్యులను కలిగి ఉండాలని సిఫార్సు చేయబడినప్పటికీ, అప్లికేషన్‌కు ముందు సంవత్సరంలో కనీసం 3 మంది సభ్యులు 500 లేదా అంతకంటే ఎక్కువ సహకారాలతో సక్రియంగా ఉండాలి. ఈ క్రియాశీల సభ్యులు తప్పనిసరిగా మంచి కమ్యూనిటీ స్టాండింగ్‌లో ఉండాలి (సస్పెండ్ కాకుండా , పాల్గొనకుండా నిరోధించ బడకుండా) ఉండాలి అవి ఇక్కడ (xtools) తెలుసుకోవచ్చు , వ్యవస్థాపక సభ్యుల నేపథ్యం సమూహం యొక్క విజయానికి చాలా కీలకం కాబట్టి అందుకు అనుగుణంగా ఎంపిక ఉండాలి, స్వచ్ఛందంగా పనిచేయదలుచుకున్నవారు ఎవరైనా కాంటాక్టు పర్సన్ గా బాధ్యతలు తీసుకోవచ్చు (వీరికి ఇలా ఉన్నందుకు ఎలాంటి డబ్బు రాదు, ఇది ఉపాధి కాదు ), వీరు కాలానుగుణంగా ఇంకొకరికి ఆ బాధ్యత అప్పగించవచ్చు ప్రాథమిక సంప్రదింపు అనేది వినియోగదారు సమూహంలోని ఇతర సభ్యులపై అధికారం చెలాయించే స్థానం కాదు, వికీమీడియా మార్గదర్శక సూత్రాలకు విరుద్ధంగా లేదా ఇతర వికీమీడియా సంస్థలు లేదా వికీమీడియా ప్రాజెక్ట్‌లకు గణనీయమైన ప్రమాదాన్ని కలిగించే కార్యాచరణలో పాల్గొనకూడదు. కాంటాక్టు పర్సన్ సమూహంలో చర్చలు ఏకాభిప్రాయం తర్వాత మాత్రమే అవసరమైన చర్యలు తీసుకోంవాలి. వికీమీడియా మార్గదర్శక సూత్రాలకు లోబడి నిర్వహించే కార్యకలాపాలకు సంబంధించిన ఆన్-వికీ డాక్యుమెంటేషన్ లో క్రియాశీలకంగా ఉండాలి, పారదర్శకంగా ప్రవర్తించాలి ,తప్పనిసరిగా వికీమీడియా వినియోగదారు సమూహ ఒప్పందం మరియు ప్రవర్తనా నియమావళికి అంగీకరించాలి. వివరాలు సమర్పించిన తరువాత WMF వారినుండి ఆమోదం రావటానికి అంచనా సమయం సుమారు 1-3 వారాలు, ప్రారంభ గుర్తింపు సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది, ఆపై సమీక్షించబడుతుంది. సమూహం నిష్క్రియంగా మారితే, గుర్తింపు నిలిపివేయబడుతుంది లేదా అవసరమైతే తీసివేయబడుతుంది. Kasyap (చర్చ) 08:46, 28 జూలై 2023 (UTC)Reply

ఎన్ని కుంపట్లైనా పెట్టుకోవచ్చన్నమాట.., బావుంది. కశ్యప్ గారూ, ఈ సమాచారం చెప్పినందుకు ధన్యవాదాలు. మరొక సంగతి కశ్యప్ గారూ.., ఇక్కడ మనం చర్చిస్తున్నది గ్రూపును ఏర్పాటు చేసేప్పుడు చెయ్యాల్సిన పనుల గురించి. అంతేగానీ, గ్రూపు చేపట్టే కార్యక్రమాల గురించో, గ్రూపు నిర్వహణ గురించో కాదు. గ్రూపు ఆ బాధ్యతలు ఎన్నికైన కార్యవర్గానివి. దీన్ని అందరం గమనించాలి. __ చదువరి (చర్చరచనలు) 12:56, 28 జూలై 2023 (UTC)Reply
@Chaduvari గారు ఏదైనా ఏర్పాటు చేసేముందు,వాటి సభ్యులుగా చేరేముందు కనీస అవగాహన కోసం సంగ్రహంగా ఉంటుంది, అని ఒక ప్రత్యేక అంశంగా తెలియచేసాను, ఎన్నికైన వర్గంలో, సముదాయలో ఉండేవారికి కనీస అవగాహన ఉండటం, ఆపై చర్చలలో క్రియాశీల సభ్యులందరూ పాలుపంచుకోవటం చాలా ముఖ్యం. Kasyap (చర్చ) 15:26, 28 జూలై 2023 (UTC)Reply
@Kasyap గారూ, మీ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. __ చదువరి (చర్చరచనలు) 14:43, 29 జూలై 2023 (UTC)Reply
కశ్యప్ గారూ వికీమీడియన్స్ యూజర్ గ్రూప్ గురించి సందేహాలుకు తావులేకుండా చాలావరకు నివృత్తి చేసారు.ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 12:59, 28 జూలై 2023 (UTC)Reply

క్రికెట్ ప్రాజెక్టు

మార్చు

క్రికెట్ ప్రాజెక్టు మొదలయ్యేది రేపే.__ చదువరి (చర్చరచనలు) 01:28, 31 జూలై 2023 (UTC)Reply

ప్రాజెక్టు బావుందండీ, @Chaduvari గారూ! టీమ్ ఇండియా (మెన్స్) ప్రపంచకప్పు రెండోసారి కొడుతుందా అన్న ప్రశ్నతో పది పన్నెండేళ్ళు క్రికెట్ చూశాను. ఆ పన్నెండేళ్ళలో మూడు కప్పులు ఆస్ట్రేలియానే కొట్టి నా శాపనార్థాలు సంపాయించుకుంది. ఊరించీ ఊరించీ చివరకు 2011లో కొట్టాకా నాకు సంతృప్తి కలిగిపోయింది. క్రికెట్ చూడ్డం మీద ఆసక్తి పోయింది. అయితే, మీ ప్రాజెక్టు పేజీ చూశాకా క్రికెట్ గురించి రాయబుద్ధేస్తోంది. నా వాటా వ్యాసాలకు నేను నమోదుచేసేసుకున్నాను. రేపణ్ణించి వాటి మీద పడదాం. పవన్ సంతోష్ (చర్చ) 09:38, 31 జూలై 2023 (UTC)Reply