వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 53

పాత చర్చ 52 | పాత చర్చ 53 | పాత చర్చ 54

alt text=2016 ఆగస్టు 27 - 2016 డిసెంబరు 21 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 ఆగస్టు 27 - 2016 డిసెంబరు 21

Wiki Loves Monuments 2016 in India మార్చు

Greetings from Wikimedia India! Wiki Loves Monuments in India is an upcoming photo competition, part of the bigger Wiki Loves Monuments 2016. We welcome you all to be part of it, as participants and as volunteers. The aim of the contest is to ask the general public—readers and users of Wikipedia, photographers, hobbyists, etc.—to take pictures of cultural heritage monuments and upload them to Wikimedia Commons for use on Wikipedia and its sister projects. This in turn would lead to creation of new articles along with development of new articles in Indian languages.

We seek your support to make this event a grand success ! Please sign up here -- Abhinav619 (sent using MediaWiki message delivery (చర్చ) 18:49, 27 ఆగష్టు 2016 (UTC))

12 వ వార్షికోత్సవం మార్చు

వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 53 11 వార్షికోత్సవం తిరుపతిలో పెద్దగా లోపాలు లేకుండా జరిగినట్టుగా అనుకొంటాను. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నా ఎక్కువ మంది సభ్యులు, ముఖ్యంగా కొందరు సీనియర్ సభ్యులు కూడా ఉత్సాహంగా వికీలో రచనలు చేస్తున్నారు. ఇపుడు 12 వ వార్షికోత్సవం జరిపి వారిలో మంచి కృషి జరిపిన., జరుపుతున్న సభ్యులను సత్కరిస్తే భావుంటుందని నా ఆలోచన. బహుమతులు వంటివి లేకుండా కేవలం సత్కార కార్యక్రమం మాత్రమే. ప్రస్తుతం ఉన్న కొన్ని అంతర్గత సమస్యలను తొలగించుకొవడానికి, సభ్యులు పరస్పరం కలిసి ఆనందంగా గడపడానికి, ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవడానికి ఉన్న అవకాశాలను చర్చించగలరు. దీంతోపాటు ఈ కార్యక్రమ భాద్యతలను కొందరు కొత్త వాడుకరులకు ఉత్సాహంగా ఉన్న వాళ్ళకు ఇచ్చి వారిని మిగతా సభ్యులు ప్రోత్సాహం ఇచ్చి, వారి ద్వారా జరిపిస్తే వారు మరింత క్రియాశీలకంగా పనిచేయగలరు అని ఆలోచన. మీ స్పందనలు తెలియచేయండి...--Viswanadh (చర్చ) 07:40, 30 ఆగష్టు 2016 (UTC)

నిజానికి 2016 ఫిబ్రవరిలోనే 12వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవాలి. కాని అప్పటి కారణాలవల్ల అది జరగలేదు. గత నెలవారి సమావేశంలో తెలుగు వికీపీడియా పుష్కర వార్షికోత్సవం గురించి చర్చ వచ్చింది.. కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటుచేసి, ఆ కమిటీ ద్వారా పుష్కర వార్షికోత్సవానికి సంబంధించిన పనులను చేయాలనీ సభ్యులు సూచించడం జరిగింది. గత రెండు వార్షికోత్సవాల్లో ఏర్పాటైన కార్యనిర్వాహక కమిటీ విజయవంతంగా కార్యక్రమాల్ని నిర్వహించింది. అయితే, గత వార్షికోత్సవాల కమిటీలో ఉన్న సభ్యులు కాకుండా ఈసారి కొత్తవారు కమిటీలో ఉండి, 12వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తే బాగుంటుందని అనుకోవడమైనది.. కనుక.... కార్యక్రమ నిర్వహణలో ఆసక్తి ఉన్న సభ్యులు తెలుపగలరు...

కార్యనిర్వహక కమిటీ విధులు - బాధ్యతలు మార్చు

  • అధ్యక్షులు:
  • ఉపాధ్యక్షులు:
  • ప్రధాన కార్యదర్శి:
  • సంయుక్త కార్యదర్శి:
  • కోశాధికారి:
  • సభ్యులు:

కార్యనిర్వహక కమిటీ మార్చు

కార్యనిర్వహక కమిటీలో ఆసక్తి ఉన్న సభ్యులు సెప్టెంబర్ 10లోపు పైవరసలో తమ చేర్చండి లేక సంతకం చేయండి --Pranayraj1985 (చర్చ) 08:57, 30 ఆగష్టు 2016 (UTC)

ఆమోదం మార్చు

12వ తెవికి వార్షికోత్సవము తప్పకుండా జరపాలి. ఇప్పటికే ఆలస్యమైనది. ఈ విషయమై సహ సభ్యులు స్పందించగలరు.

నా స్పంధన......... తప్పక జరపాలని. భాస్కరనాయుడు (చర్చ) 07:21, 3 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యులు ముందుకు వచ్చి జరిపితే మంచిదేPalagiri (చర్చ) 06:41, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకం మార్చు

అభిప్రాయం మార్చు

  1. వ్యక్తిగత పనుల వలన ఈ కార్యక్రమానికి నేను సహకరించలేకున్నాను. ఆసక్తి ఉన్న సభ్యులు పాల్గొనగలరు. --రవిచంద్ర (చర్చ) 13:48, 3 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2. నేనూ పాల్గొనలేను.__చదువరి (చర్చరచనలు) 15:32, 4 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఫలితం మార్చు

తెలుగు గ్రామాల విస్తరణకు ప్రాజెక్టు ఉప పేజీ మార్చు

అందరికీ నమస్కారం,
ఇప్పటికే పర్యావరణవేత్తలు మాధవ్ గాడ్గిల్, సుబోధ్ కులకర్ణి, ప్రశాంత్ పవార్లతో మనం కలిసి కృషిచేసి తయారుచేసిన సమాచారంతో వ్యాసాలు సృష్టించడం, వాటిని మెరుగుపరచడం, ఖమ్మం జిల్లాలోని కొన్ని వ్యాసాలను నమూనాగా అభివృద్ధి చేయడం వంటివి జరిగేవున్నాయి. ఈ నేపథ్యంలో పలు చక్కని చర్చోపచర్చల అనంతరం యాంత్రికంగా తయారైన సమాచారాన్ని మానవీయంగా మార్చుకుని చక్కని శైలిలో రాయవచ్చని సభ్యులు పేర్కొన్నారు. ఈ ప్రకారం గ్రామ వ్యాసాల విస్తరణకు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టు పేజీకి ఉప పేజీ సృష్టించి, ఈ మూలాన్ని అక్కడ అందుబాటులో పెట్టి, ఇప్పటికే ఆసక్తి కనబరిచిన సభ్యుల సమిష్టి కృషితో విస్తరించాలని భావిస్తున్నాం. ఇందుకు సభ్యులు తమ సూచనలు, సలహాలు, ఆలోచనలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:43, 27 ఆగష్టు 2016 (UTC)

New Wikipedia Library accounts available now (August 2016) మార్చు


Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to published research as part of our publisher donation program. You can now sign up for new accounts and research materials from:

  • Nomos – Primarily German-language publisher of law and social sciences books and journals - 25 accounts
  • World Scientific – Scientific, technical, and medical journals - 50 accounts
  • Edinburgh University Press – Humanities and social sciences journals - 25 accounts
  • American Psychological Association – Psychology books and journals - 10 accounts
  • Emerald – Journals on a range of topics including business, education, health care, and engineering - 10 accounts

Many other partnerships with accounts available are listed on our partners page, including Project MUSE, EBSCO, DeGruyter, Gale and Newspaperarchive.com.

Do better research and help expand the use of high quality references across Wikipedia projects: sign up today!
--The Wikipedia Library Team 18:38, 30 ఆగష్టు 2016 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language! Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

The visual editor is now active here మార్చు

Hello again. This message is only available in English at this time: Please help translate to your language. కృతజ్ఞతలు!

As some of you have noticed, this Wikipedia now has the visual editor (విజువల్ ఎడిటరు) enabled for all registered users. The rollout to logged-out users will likely happen in a week or so.

For an explanation of how the editing system now works and how to choose/go back to your favorite setting, please see my previous announcement above. If you wish to change your editing system preferences now, this can be done from this link to your Preferences --> దిద్దుబాట్లు --> సవరణ విధం:.

All edits using the visual editor will be tagged with "విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ" in recent changes, watchlists, and page histories. To access the User Guide for the visual editor, click on the "(?)" icon in its toolbar.

Please let us know if you find any problems. You can report issues directly in Phabricator, the new bug tracking system or on at mw:VisualEditor/Feedback; by all means, feel free to also ping or contact me directly if you prefer. In case of emergency (like an unexpected bug causing widespread problems), please contact James Forrester, the product manager, at jforrester@wikimedia.org or on IRC in the #mediawiki-visualeditor channel.

Happy editing! Respectfully, Elitre (WMF) 19:17, 30 ఆగష్టు 2016 (UTC)

PS: Are you seeing interface messages that are not in this wiki's language? Please fix this by providing translations here. Translations may be also provided for the user guide. Please contact me if you want guidance in contributing translations!

Just a heads-up that rollout of the visual editor on this wiki is now complete. Please refer to my previous messages for details. You can read the "checklist" that was written to help communities like yours in their process of adapting the visual editor to their customs and needs. Best, Elitre (WMF) 18:27, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ మెషీన్ తో అనువదించిన వ్యాసాలు మార్చు

యంత్రంతో అనువాదం చేసిన వ్యాసాలని మరమ్మత్తు చేసి మెరుగుపరచడం చాల కష్టంగా ఉంది. బోలెడంత లకాలం వెచ్చించినా వాటిని ఒక దారికి తీసుకురావడం కూదరడం లేదు. అగ్నిపర్వతాలు ప్రయత్నించి చూసేను. హిట్లర్ ప్రయత్నించి చూసేను. చేతులెత్తేసేను. ఇంతకంటె నా అంతట నేను రాసిన వ్యాసాలు స్వయంబోధకంగా ఉంటున్నాయి. కనుక నిర్వాహకులకి ఒక మనవి. యంత్రంతో అనువాదం చేసిన వ్యాసాలని మరమ్మత్తు చెయ్యడమనే కార్యక్తరమానికి స్వస్థి చెప్పేసి మనమే రాసుకుంటే బాగుంటుందని అనిపిస్తున్నాది. ఇలా సలహా ఇచ్చి మరొకరిని నొప్పించాలని నా ఉద్దేశం కాదు. Vemurione (చర్చ) 23:57, 6 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నా అభిప్రాయమూ ఇదే. ఈ విషయమై ఓ నెల కిందట చర్చ జరిగినపుడు, కొన్ని వ్యాసాలను సంస్కరించే వీలుందని కొందరు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ నెల రోజుల్లోనూ సంస్కరణ విషయంలో జరిగిన ప్రగతిని నేను గమనించలేకపోయాను. రవిచంద్ర గారు ఒకటీ రెండు వ్యాసాలను తొలగించినట్లు మాత్రం చూసాను. __చదువరి (చర్చరచనలు) 01:13, 7 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మరమత్తులకు వీలుకాని వ్యాసాలస్థానంలో ఆసక్తిగల సభ్యులు కొత్త వ్యాసము చేర్చడమే సముచితం.అలాగే మూలకాలకు సంబంధిన చాలా వ్యాసాలు కనిష్టస్థాయి మొలకలుగా వున్నాయి.ఎటూవంటి చేర్పులు లేవు గత కొన్నిఏళ్ళుగా.అటువంటివాటిని తొలగిస్తే వాటిస్థానంలో కొత్త వ్యాసాలు వ్రాస్తాను.Palagiri (చర్చ) 08:35, 9 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసాలను డిలీట్ చేయడమనేది ఈ సమస్యకు పరిష్కారంగా నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఆ గూగుల్ అనువాద వ్యాసాల్లో అతి ముఖ్యమైన వ్యాసాలు చాలా ఉన్నాయి. వాటిని తీసేయడం వల్ల జరిగే లాభాల కన్నా నష్టాలే ఎక్కువ. ముఖ్యంగా ఆ వ్యాసాల గురించి మనం పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉంది. Palagiriగారూ,Vemurioneగారూ ప్రస్తుతం నేను కంటెంట్ ట్రాన్స్ లేషన్ టూల్ ఉపయోగించి అనువాదం చేస్తున్నాను. ఈ టూల్ వల్ల చరిత్ర మిగిలి ఉంటుంది, మనం రాసే వ్యాసం పాత వ్యాసంపై అచ్చు వేయబడుతుంది. దీన్లో మూలాలు ఇవ్వడం, లింకులు చేర్చడం అనువాదం చేయడం, ఫోటోలు చేర్చడం చాలా సులభం. ఒకసారి ప్రయత్నించి చూడండి. మీకూ వీలుగా అనిపించవచ్చు. ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 4 వరకు నేను దాదాపు 17 గూగుల్ అనువాద వ్యాసాలను అనువదించాను. నా వరకూ అయితే నేను ఈ పనిపై దృష్టి పెట్టి చేసుకుంటూ వస్తున్నాను. అవి పూర్తి అవుతాయనే నమ్మకం కూడా నాకు ఉంది.--Meena gayathri.s (చర్చ) 11:33, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు శుద్ధి చేసిన గూగుల్ అనువాద వ్యాసాలకు వర్గం:గూగుల్ అనువాద వ్యాసాలు-మెరుగుపరచిన వర్గం చేర్చండి.-- కె.వెంకటరమణచర్చ 11:45, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణగారూ అలాగేనండీ--Meena gayathri.s (చర్చ) 02:55, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Meena gayathri.s ఈ పని చెయ్యడానికి కావల్సిన పనిముట్లు, ఉత్సాహం ఉంటే తప్పకుండా చెయ్యండి. నాకు చేతకాలేదు కనుక నేను చెయ్యలేను అంటున్నాను. Vemurione (చర్చ) 15:09, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurioneగారూ నాకు అర్ధం అయిందండీ. మీకు ఆసక్తి ఉండి, అనువాదం చేయడం ప్రాసెస్ వల్ల ఇబ్బంది అయితే ఆ టూల్ బాగా పనికివస్తుంది అని చెప్తున్నా. దీనికనే కాదు అసలు అనువాదాలకు అది మంచి టూల్. లైన్ టు లైన్ అనువదించుకుని, డిలీట్ చేసుకుని ఇంత శ్రమ అక్కర్లేదు పక్కన ఇంగ్లీష్ పేరా కనపడుతుంది మనం తెలుగులో లింకులు, ఫోటోలు, మూలాలతో సహా అనువదించేసుకోవచ్చు.--Meena gayathri.s (చర్చ) 02:56, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వేమూరి గారితో ఏకీభవిస్తున్నాను. వేమూరి గారు మీకు వ్యాసం మొదటి నుంచి బాగా రాయగలనని అనిపిస్తే అలానే రాయండి. నేను మరీ చెత్తగా కనిపించిన, విషయ ప్రాముఖ్యత లేని రెండు మూడు వ్యాసాలను తొలగించాను. అలాగే ప్రాముఖ్యత ఉన్న వాటిని తొలగించకుండా ఆ అనువాదం మొత్తం తీసేసి కేవలం వ్యాసం మొదట్లో పరిచయ వాక్యాలు రాసి మొలక స్థాయి దాటించి వదిలేశాను. అడపాదడపా అలాంటి వ్యాసాల మీద ఇప్పటికీ పని చేస్తూ ఉన్నాను. కానీ అది కొండంతలా ఉంది. కాబట్టి దాన్ని గురించి వర్రీ అవకుండా మీ పద్ధతిలో మీరు సాగిపోండి. అన్నట్టు నేను ఇటీవలే విజ్ఞాన శాస్త్ర వ్యాసాలు ఆది నుంచి రాద్దామని మొదలు పెట్టి విజ్ఞానశాస్త్రం, ప్రకృతి శాస్త్రం అని రెండు వ్యాసాలు రాశాను. ఈ విషయంలో మీ సలహాలు, సూచనలు సహకారం ఆశిస్తున్నాను. --రవిచంద్ర (చర్చ) 16:03, 12 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర (చర్చ) నా సలహా అడిగేరు కనుక చెబుతున్నాను. విజ్ఞానశాస్త్రం, ప్రకృతి శాస్త్రం వంటి అంశాల పరిధి, విస్తృతి బాగా ఎక్కువ. వీటిని వర్గీకరించి మొదటి నుండీ నరుక్కురావడమంటే చాల శ్రమతో కూడిన పని అవడమే కాకుండా వాటిని ఎలా వర్గీకరించాలో అన్న విషయంలో ఏకీభావం ఉండదు. ఇటువంటి పెద్ద పెద్ద అంశాలని గురించి top-down పద్ధతిలో రాయాలంటే పదార్థం మీద గట్టి పట్టు ఉండాలి, రాతలో మంచి అనుభవం ఉండాలి. నా ఉద్దేశంలో చిన్న చిన్న అంశాలని తీసుకుని, చిన్న చిన్న వ్యాసాలు bottom-up పద్ధతిలో రాయడం తేలిక. సైంసు విషయాల గురించి తెలుగులో రాసే ఒరవడి, సంప్రదాయం ఇంకా స్థిరపడలేదు. కనుక ఫలానా విధంగా రాస్తే బాగుంటుందని నేనూ ఘంటాపథంగా చెప్పలేను. ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సైంసు రాసేటప్పుడు తెలుగులో సాంకేతిక పదాలు వాడి, పక్కనే కుండలీకరణాలలో ఇంగ్లీషు మాట కూడ చూపిస్తూ ఉంటే వ్రతమూ చెడదు, ఫలమూ దక్కుతుంది. నా అభిప్రాయం అడిగినందుకు ధన్యవాదాలు. Vemurione (చర్చ) 04:01, 13 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Vemurione గారూ, Top Down పద్ధతిలో రాయడం కష్టమని నాక్కూడా అనిపించింది. ఎందుకంటే చాలా ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు ఏవి వాడాలో తెలియలేదు. అందుకే ఆంగ్ల వికీలో ఉన్న వర్గీకరణ యధాతథంగా అనుసరిద్దామనుకున్నా. నాకు భాషమీద కొద్దో గొప్పో పట్టు ఉంది కానీ పదార్థం మీద పట్టు లేదు. నేను నేర్చుకుంటూ రాద్దామని నా ఆలోచన. విజ్ఞానశాస్త్ర విషయాలను తెలుగులో రాసే సాంప్రదాయం ఇంకా స్థిరపడలేదంటున్నారు కాబట్టి మనమే ఓ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మనం ఇక్కడ ప్రయత్నం చేస్తే తరువాత మీలాంటి అనుభవం ఉన్న వారి సాయంతో మెరుగు పరచవచ్చని అనుకుంటున్నాను. మీ సూచనలు తప్పకుండా పాటిస్తాను. ధన్యవాదాలు. --రవిచంద్ర (చర్చ) 05:26, 13 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Machine translation support to be enabled soon for Content Translation మార్చు

Please help translate to your language

Hello, I wanted to give you a heads up that machine translation support for Telugu is now ready to be extended to Content Translation (beta feature) using Yandex. It is scheduled to be made active on this Wikipedia on September 14, 2016. This service can be used when translating Wikipedia articles into Telugu with Content Translation. To start using this service, please choose ‘’Yandex.Translate’’ from the ‘’Automatic Translation’’ dropdown menu that you see on the sidebar after you start translating an article. Please note, machine translation is available from all the languages that are supported by Yandex.Translate, but Content Translation can still be used in the usual manner for translating from all languages, with or without machine translation support. For more information, we request you to kindly take a look at the details about machine translation services in Content Translation and about Yandex translation services, including a summary of the legal contract. Please note, the translations made using Content Translation are also used to improve machine translation services.


We look forward to your feedback. You can reach us using the Project Talk page or phabricator ticket. This message could only be written in English and we will really appreciate if it can be translated into Telugu for other users of this Wikipedia. Thank you. On behalf of WMF Language team: --Runab WMF (చర్చ) 13:55, 8 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]


Hi Runab WMF, I have tried to translate some text using automated translation but couldn't do it because translation is too poor to use. This may be because of the structural differences (of sentences) between english and dravidian languages especially Telugu. So, personally I don't think this is going to work, anyway we are already trying to deal many machine translated poor quality articles published years ago in Telugu Wikipedia with content translation tool and proved to be successful because we can translate from scratch over there. So, I don't think this is going to help in our language atleast for now. --పవన్ సంతోష్ (చర్చ) 17:08, 15 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
Hello, Thanks for the feedback. It is indeed a correct observation that for some Indian languages, machine translation needs to improve much more to have a greater impact. We are hoping that in its current stage it is usable in some ways (e.g. small sentences) and over a period of time the improvements from the manually edited content will become more obvious and useful. It is a non-default feature at the moment, so please feel free to turn it on and check how it works and if you see improvements. Thanks. --Runa Bhattacharjee (WMF) (చర్చ) 23:56, 15 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తేవికీ లో విశేష వ్యాసాలు (Featured articles) మరియు మంచి వ్యాసాలు (Good articles) గుర్తించాలి మార్చు

ఎన్వికీ లో మాదిరిగా తెవికీ లో కూడా విశేష వ్యాసాలు(Featured articles) మరియు మంచి వ్యాసాలను (Good articles) గుర్తించాలి.ఇలా చేస్తే తెలుగు వికీపీడియా బాగా అభివృద్ది చెందుతుంది. ఈ విషయంలో నిర్వహకులు తప్పక స్పందించాలి.తెలుగు వికీపీడియా ను ఇంగ్లీషు వికీపీడియా తో సమస్థితికి తీసుకురావాలి.ఇందు కోసం నేను కూడా కృషి చేస్తా. ఇట్లు మీ తోటి వాడుకరి WPMANIKHANTA' (talk) 06:39, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మీరన్నట్లు ప్రస్తుతం మొదటి పేజీలో ప్రచురించాలంటే మంచి వ్యాసం దొరకడం లేదు. వర్గం:ఈ వారం వ్యాసం పరిగణనలు వర్గంలో శుద్ధి చేయబడని గూగుల్ అనువాదం వ్యాసాలు, మూలాలూ లేని వ్యాసాలు, కొంతభాగం అనువాదం జరిగిన ఆంగ్ల వ్యాసాలు. విస్తరణ మూస ఉన్న వ్యాసాలు ఉన్నాయి. భవిష్యత్తులో మంచి వ్యాసాలను మొదటి పేజీలో ప్రచురిద్దామంటే యిబ్బంది పడే పరిస్థితి రావచ్చు. గత కొంత కాలంగా అనేక మొలక వ్యాసాలు, మూలాలు లేని వ్యాసాలు, యాంత్రిక అనువాద వ్యాసాలు ఎక్కువయ్యాయి. కనుక మంచి వ్యాసాలను గుర్తించాలి. కొన్ని మంచి వ్యాసాలను అభివృద్ధి చేయడానికి ఒక ఎడిట్ ఎ థాన్ లాంటిది నిర్వహించినా కొన్ని వ్యాసాలు అభివృద్ధి చేయవచ్చును. సమిష్టి కృషితో కొన్ని వ్యాసాలను విశేష వ్యాసాలుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన బాగుంటుంది. దీనికోసం ఒక ప్రణాళికను తయారుచేసినా విశేష వ్యాసాల అభివృద్ధి కొరకు నా సహకారాన్ని అందించగలను.-- కె.వెంకటరమణచర్చ 11:21, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గతంలో విశేష వ్యాసం, మంచి వ్యాసాలను గుర్తించేందుకు మనకంటూ వేరే నిబంధనలు ఏర్పరుచుకుందామని గతంలో ప్రయత్నించాము. అప్పట్లో ఎందుకనో సాధ్యపడలేదు. నాణ్యత అభివృద్ధికి మంచి అడుగు, ఈ ప్రయత్నం చాలా మంచిది, తప్పకుండా ప్రయత్నిద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 15:30, 10 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
కన్నడ వీకిపీడియాలో ఒక కొత్త సంప్రదాయానికి తెర తీసారు.పోయిన నెలనుండి "ಈ ತಿಂಗಳ ವಿಕಿಪೀಡಿಯ ಸಂಪಾದಕ"అని తెలుగులోఅర్థం ఈనెల వికీపిడియా సంపాదకుడని.అప్పటికి వరకు ఎక్కువ విశిష్టవ్యాసాలు చేర్చిన సంపాదకుల/వాడుకరి పరిచయం.తెలుగులో దీని పరిణామం ఎలా ఉంటుందంటారుPalagiri (చర్చ) 14:12, 12 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఎప్పటి నుంచో దీన్ని గురించి రచ్చబండలో రాద్దామనుకుంటున్నాను. మణికంఠ గారు మంచి చర్చ ప్రారంభించారు. తెవికీలో ఖచ్చితంగా వ్యాసాలను విశేష వ్యాసాలుగా, మంచి వ్యాసాలుగా బేరీజు వేసే నిబంధనలు కొన్ని ఉండాలి. దీనివల్ల మనం ఈ వారం వ్యాసంలో మంచి వ్యాసాలు ప్రచురించగలుగుతాము. అంతే కాకుండా వైవిధ్య భరితమైన వ్యాసాలు అందించగలుగురాము. అంటే కేవలం వ్యక్తులు, ప్రాంతాలే కాక ఇతర విషయాలు గురించి కూడా వ్యాసాలు ప్రచురిస్తే మనం అన్ని విభాగాల్లోనూ కృషి చేస్తున్నామని పాఠకులకు తెలుస్తుంది. దీనివల్ల ఇంకో మంచి విషయం ఏమిటంటే విశేష వ్యాసాలు రాసేవారికి, ఎక్కువ మార్పులు చేసేవారికన్నా మంచి గుర్తింపు వస్తుంది. మనం ఈ ప్రక్రియ ప్రారంభించాలంటే నిబంధనల కోసం ఎక్కువగా కష్టపడనక్కర్లేదు. వికీ మూలస్తంభాలైన విషయ ప్రాముఖ్యత, మూలాలు, తటస్థత, స్వీయ రచన ఉపయోగించుకుంటే మనకు మంచి వ్యాసాలు తయారవుతాయి. నేను ఇటీవల రాసిన విఠోబా వ్యాసం ఈ లక్షణాలు కలిగి ఉందని నా అభిప్రాయం. ఇలాంటి వ్యాసాలు ఇంకా రాయాలని ఉంది. వికీ నియమాలు బాగా తెలిసిన సభ్యులందరూ తలా ఒక చేయి వేస్తే చక్కటి వ్యాసాలు అందించగలము.--రవిచంద్ర (చర్చ) 15:07, 12 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వెంకటరమణ గారు విశేష వ్యాసాలను గుర్తించడం అంటే విశేష వ్యాసాలు అనే వర్గం సృష్ఠించబడి గుర్తించడం మాత్రమే కాకుండా enwiki లో మాదిరిగా తేవీకీలో విశేష వ్యాసాలకు సాంకేతక పరంగా వ్యాసం యొక్క పై భాగంలో ఈ రకముగా   నక్షత్ర గుర్తు వచ్చేలా చూడాలి. ఈ సాంకేతికత మన తేవికీలో కూడా ఉండాలి దీనికి తగిన ఏర్పాట్లు నిర్వాహకులు చెయ్యాలి అని నా అభిప్రాయం.ప్రస్తుతం ఇలా చేయడం సాధ్యమేనా లేదో తెలియజేయగలరు. WPMANIKHANTA' (talk) 01:56, 16 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:విశేష వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లో కొన్ని వ్యాసాలను యిదివరకు ప్రదిపాదించబడినవి. వాటి నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా ఉండాలో తెలియజేయడమైనది. కొన్ని వ్యాసాలను విశేష వ్యాసాలుగా గుర్తించడం జరిగినది. గుర్తించిన విశేష వ్యాసాలకు ఆంగ్ల వికీలో వలెనే {{విశేషవ్యాసం}} మూసను చేర్చడం జరిగినది. ఈ మూస ఒక చిన్న కాంస్య తారను ( ) వ్యాసానికి కుడివైపు పై మూలలో ఉంచుతుంది. అలా ఉంచటం వలన ఆ వ్యాసం విశేష వ్యాసంగా గుర్తింపు వస్తుంది. అలాగే ఆ వ్యాసాన్ని వర్గం:విశేషవ్యాసాలు అనే వర్గంలో చేర్చేస్తుంది. ఉదాహరణకు ఆంగ్‌కోర్ వాట్ వ్యాసం చూడండి.-- కె.వెంకటరమణచర్చ 13:41, 16 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ జాబితాలో వ్యాసాలు కొన్నే ఉన్నట్టున్నాయి. వర్గీకరణ చేయబడనివి కూడా చాలా ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఈ వర్గంలో చేర్చాలి మనం. --రవిచంద్ర (చర్చ) 13:54, 16 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా:విశేష_వ్యాసాలు/ప్రతిపాదనలు/2014 లోని జాబితా చూసాను. ఈ వ్యాసాలపై పనిచేసి ముందు వీటిని విశేష స్థాయికి తీసుకువెళ్ళవచ్చు. నేను విజయనగర సామ్రాజ్యము పై పని చెయ్యాలని అనుకుంటున్నాను. కన్యాశుల్కం (నాటకం) కూడా బాగుంది. కానీ అది ఈమాట నుండి ఉన్నదున్నట్టుగా తెచ్చి ఇక్కడ పెట్టింది. (కొంత పాఠ్యాన్ని చేర్చినట్టుగా కనబడుతోంది). అలాంటివాటిని విశేష వ్యాసాలుగా పరిగణించకపోవడం మంచిదని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 11:01, 18 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • కన్యాశుల్కం (నాటకం)పైన నేను పనిచేస్తాను. ఈ మధ్య గురజాడ కన్యాశుల్కం రెండు కూర్పులవీ చదివి ఆనందించాను. అలాగే నాకు గురజాడ సాహిత్య సర్వస్వాలు వేసినవారి సాంగత్యం, ఆయన గురించి, నాటకం గురించి చక్కని విశ్లేషణలు, విమర్శలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి నేను పనిచేసి పున: ప్రతిపాదిస్తాను, సహసభ్యులు ఎవరైనా సోదర సమీక్ష (peer review) చేసి అంగీకరించడమో, సవరణలు-విస్తరణ వంటివి సూచించడమో చేస్తే బావుంటుంది కదా. ఒకవేళ ప్రస్తుత వ్యాసాలు ఆ స్థాయిలో లేకుంటే విస్తరించి ఆ స్థాయికి తీసుకురావడమో లేకుంటే హోదా తొలగించడమో మేలేమో. ఎందుకంటే విశేష వ్యాసం అని మనం ఏదైనా వ్యాసాన్ని గుర్తిస్తే అది తెవికీ నాణ్యతకు గీటురాయి అని బయటివారు అనుకునే అవకాశం ఉంది. అలా గీటురాయి కాని వ్యాసానికి ఆ హోదా ఉండడం బావోదు. ఏమంటారు. --పవన్ సంతోష్ (చర్చ) 15:39, 19 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సంతోషం పవన్ గారు. వికీలో ఆ నాటకం "గురించి" రాస్తే బాగుంటుంది. ఎప్పుడు రాసాడు, ఎలా రాసాడు, ఎన్ని కూర్పులు రాసాడు, ఇంగ్లీషులో ఎప్పుడు, ఎందుకు రాసాడు. అప్పట్నుండి ఇప్పటిదాకా దానిపై వచ్చిన అనుకూల, ప్రతికూల విమర్శలేంటి, అది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది, అందులోని ఏయే సంభాషణలు సామెతలు, నుడికారాలుగా మారాయి.. వగైరా సమాచారం ఉంటే వికీకి అనుకూలంగా బాగుంటుందని నా ఉద్దేశం.__చదువరి (చర్చరచనలు) 06:26, 20 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యాసం వికీశైలిలో లేదు కనుక ముందుగా దాన్ని వికీకరించి, క్రమంగా నాటకాన్ని గురించిన వివరాలు రాస్తూంటే బావుంటుంది. మొదటి రెండవ కూర్పుల మధ్య భేదం అనూహ్యంగా ఉంటుంది, గిరీశం లెక్చర్లు, గిరీశం కార్టూన్ స్ట్రిప్, మధురవాణి ఇంటర్వ్యూలు, మధురవాణి ఆత్మకథ వగైరా పద్ధతుల్లో బాపురమణలు, నండూరి వారూ, ఇతర్లూ ఆయా పాత్రలను తీసుకుని సాహిత్యం సృష్టించారు. మధురవాణి, గిరీశం, వగైరా పాత్రలు తర్వాతి సాహిత్యంపై చూపిన ప్రభావం, ఆ పాత్రలకు సంస్కృతంలోనూ, ఆంగ్లంలోనూ, సమాజంలోనూ ఉన్న మూలాల గురించి ఎంతో విశ్లేషణ లభిస్తోంది. డామిట్ కథ అడ్డంగా తిరిగింది, తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి లాంటివైతే ఈ నాలుగు రోజుల్లోనే కనీసం నాలుగైదు మార్లు వినివుంటాను. మూలాలను వినియోగించుకుంటూ ఇదంతా చక్కగా రాయగలిగితే చదివేవారికి, రాసేవారికి కూడా చాలా ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉంటుంది. మీ సూచనలకు ధన్యవాదాలు, అలాగే చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 09:01, 20 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్థంభం స్తంభం - ఏది సరైనది? మార్చు

నాకు స్థంభం, స్తంభం లలో ఏది సరైనదోననే సందేహం ఉంది. తీర్చగలరా? __చదువరి (చర్చరచనలు) 08:53, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆంధ్రభారతి నిఘంటువు ప్రకారం అయితే "స్తంభము" సరియైనది. -- కె.వెంకటరమణచర్చ 09:45, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
స్తంభమే సరి. --పవన్ సంతోష్ (చర్చ) 10:06, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
థాంక్సండి. ఆ ప్రకారమే వెళ్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 10:17, 11 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

RevisionSlider మార్చు

Birgit Müller (WMDE) 15:08, 12 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Machine translation support enabled today for Content Translation మార్చు

Please help translate to your language

Hello, machine translation support for Content Translation (beta feature) has now been extended and enabled for users of Telugu Wikipedia using Yandex. It can be used when translating Wikipedia articles into Telugu with Content Translation. To start using this service, please choose ‘’Yandex.Translate’’ from the ‘’Automatic Translation’’ dropdown menu that you see on the sidebar after you start translating an article. Please note, machine translation is available from all the languages that are supported by Yandex.Translate, but Content Translation can still be used in the usual manner for translating from all languages, with or without machine translation support.

Wikimedia Foundation’s Legal team and Yandex had collaborated earlier to work out an agreement that allows the use of Yandex.Translate without compromising Wikipedia’s policy of attribution of rights, privacy of our users and brand representation. Since November 2015, Yandex machine translation has been used for articles translated for Wikipedias in many languages. For more information, we request you to kindly take a look at the details about machine translation services in Content Translation and about Yandex translation services, including a summary of the legal contract. Please note, translations made using Content Translation are also used to improve machine translation services.

We have tested the service for use on the Telugu Wikipedia, but there could be unknown problems that we are not aware of yet. Please do let us know on our Project Talk page or phabricator if you face any problems using Content Translation. This message is only in English and we will be very grateful if it could be translated into Telugu for other users of this Wikipedia. Thank you. On behalf of WMF Language team: --Runa Bhattacharjee (WMF) (చర్చ) 23:52, 15 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]


AWB తో తప్పుల సవరణ మార్చు

వికీపీడియా:AutoWikiBrowser/Typos లో ప్రస్తుతం 250 పైచిలుకు టైపాట్లను చేర్చాను. నాకు తోచిన, నేను గమనించిన పొరపాట్లను అందులో చేర్చాను. తెవికీలో తప్పుల కొరత లేదు కాబట్టి, ఇంకా బోలెడు చేర్చవచ్చు. వీటి న్నేను విస్తృతంగా వాడాను. తేడాలను సవరించాను/సవరిస్తున్నాను. అనుకోని తప్పులు దొర్లితే టైపాట్లలో తగు సవరణలు చేస్తున్నాను. అయితే AWB సరిదిద్దే తప్పులతో పోలిస్తే, అది చేసే తప్పులు బహు స్వల్పం. కాబట్టి వాడొచ్చనుకుంటున్నాను. అది చేస్తున్న తప్పుల గురించి ఉదాహరణ లిక్కడ రాస్తాను.

  1. బహువచన పదం తరవాత లో, కు, ను వంటి ప్రత్యయాలు చేరినపుడు, పదాంతంలోని "లు" లుప్తమై "ల" చేరుతుంది. అలాగే ఆ ప్రత్యయం ముందు స్పేసు ఉండదు. ఉదా: "చెరువులు లో" అని కాక, "చెరువులలో" అని రాయాలి. AWB ఈ పని చేస్తుంది. అయితే బహువచనం కాని పదాలకు కూడా ఈ సవరణ చేస్తుంది. "పంతులు తో" ను "పంతులుతో" అని రాయాలి. కానీ AWB "పంతులతో" అని రాస్తుంది. నాకు తోచిన అలాంటి పదాలకు - రైలు, పంతులు, బైబిలు, స్కేలు మొదలైనవాటికి - మినహాయింపులు ఇచ్చాను. తోచనివి ఇంకా తగలవచ్చు.
  2. "లో" రాసేబదులు "లొ" (హ్రస్వం) అని రాయడం కద్దు -మొదట్లో వెయ్యికి పైనే ఉండేవి, ప్రస్తుతం 400 లోపు ఉన్నాయి. దీన్ని లో గా మారుస్తుంది. "లొ" కలిగిన పదాలు మనకు బాగా తక్కువ. అయితే అసలంటూ ఉన్నాయి -లొసుగు, తలొగ్గు లాంటివి. మెలొడి లాంటి ఇంగ్లీషు మాటలూ రాస్తాం. ఈ పదాలను మార్చకుండా మినహాయింపు ఇచ్చాను గానీ, ఇంకా ఉంటే ఉండవచ్చు.

ఈ సవరణలు చెయ్యడంపై మీ మీ అభిప్రాయాలను చెప్పాలని కోరుతున్నాను. పోతే, AWB వాడుకరు లెవరైనా వీటిని వాడవచ్చు. ఎంతమందైనా వాడవచ్చు. దీన్ని విస్తృతంగా వాడాలని వినతి. ఒకేసారి ఎక్కువ మంది వాడే పనైతే, వ్యాసాలను పంచుకుందాం. అంకెలతో మొదలయ్యే వ్యాసాలను ఒకరు, అ-అః తో మొదలయ్యే పేజీలను ఒకరు, క వర్గాక్షరాలతో మొదలయ్యే పేజీలను ఒకరు - ఇలాగ. దీనివలన దిద్దుబాటు ఘర్షణలను నివారించవచ్చు. __చదువరి (చర్చరచనలు) 06:56, 20 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నాకు ఈ టూల్ ని వాడిన అనుభవం లేదు లానీ మీరు చాలా మంచి పని చేస్తున్నారు. AWB తో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చక్కగా చేయవచ్చని నిరూపించారు. అభినందనలు. --రవిచంద్ర (చర్చ) 07:04, 20 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు చదువరి గారు...AWBతో తప్పులను సరిదిద్దుతూ మాకు మార్గదర్శకులయ్యారు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:54, 20 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారు, ప్రణయ్‌రాజ్ గారు, నెనరులు. AWB నడపడం పెద్ద విశేషమేమీ కాదు. మీరిద్దరూ ఒక్కసారి AWB ని చూడండి. వాడ్డం మొదలుపెట్టండి. అందరం కలిసి చేస్తే పేజీలన్నిటినీ చకచకా చూడొచ్చు, తప్పులు సరిచెయ్యొచు. __చదువరి (చర్చరచనలు) 07:32, 21 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ సెప్టెంబరు 25, 2016 సమావేశం మార్చు

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ సెప్టెంబరు 25, 2016 సమావేశం… సెప్టెంబరు 25, 2016 (నాలుగవ ఆదివారం) నాడు మధ్యాహ్నం 3 గం.లకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
  • ఇతర అంశాలు

సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ సెప్టెంబరు 25, 2016 సమావేశం లో చూడగలరు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:14, 21 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సెప్టెంబర్ నెల సమావేశాన్ని రద్దు చేయడమైనది. సభ్యులు గమనించగలరు.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 09:59, 24 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సెప్టెంబరు నెల గదండి --Nrgullapalli (చర్చ) 03:27, 25 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంతో చర్చలు మార్చు

అందరికీ నమస్కారం,
అనంతపురానికి చెందిన శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, జీవవైవిధ్యంపై విశిష్ట పరిశోధన చేసిన పరిశోధకులు ఆచార్య రవిప్రసాద రావుతో తెలుగు వికీపీడియాలో ప్రత్యేకించి వృక్షశాస్త్రం, జీవవైవిధ్యం వంటి అంశాలపై విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో కృషిచేసే అంశంపై చర్చించనున్నాము. ఆచార్య రవి ప్రసాద రావు సెప్టెంబరు 3న విజయవాడ ఆంధ్ర లొయోలా కళాశాలలో పర్యావరణ పరిరక్షణ, పర్యావరణహితమైన అభివృద్ధికి సంబంధించి నిర్వహించిన జాతీయ సెమినార్ లో మాట్లాడేందుకు వచ్చారు. అదే సెమినార్ లో మా సహకారంతో పర్యావరణవేత్త సుబోధ్ కులకర్ణి వికీపీడియాపై ఎలా పనిచేస్తున్నామో వివరించగా, ఆ కార్యక్రమంలోనే స్పందించి తెలుగు వికీపీడియాలో కృషిచేసేందుకు ఆసక్తి చూపారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే 30వ తేదీన చర్చ జరగనుంది.
ఆచార్య రవి ప్రసాద రావు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ వృక్షజాలంలో ప్రమాదకరమైన స్థితిలో పడ్డ జాతుల గురించి, అంతరిస్తున్న వృక్షజాతుల విస్తరణ అంచనాలు, తూర్పుకనుమల్లో వృక్షజాతుల వైవిధ్యం, సంఖ్య అంచనాలు, అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో జీవవైవిధ్య అధ్యయనం, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కార్బన్ నియంత్రణ అధ్యయనం వంటి అధ్యయనాలు సాగించిన పరిశోధకులు. ఆయనతో ప్రతిపాదనల్లో ప్రస్తుతం అనంతపురం జిల్లాకు చెందిన నమూనా గ్రామాలు స్వీకరించి వాటిని సమగ్రంగా అభివృద్ధి చేయడం, విశ్వవిద్యాలయంలోని వృక్షజాతుల ఫోటోలు తీసి కామన్స్ లో చేర్చడం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొన్ని అరుదైన వృక్షజాతుల గురించి వ్రాయడం వంటివి ఉన్నాయి. ఈ అంశంపై తెవికీపీడియన్ల సూచనలను ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:46, 27 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి అడుగు. వృక్ష శాస్త్రం పై తెవికీలో పెద్దగా వ్యాసాలు లేవు. ఈ భాగస్వామ్యంతో మనం విలువైన సమాచారాన్ని చేర్చగలమని భావిస్తున్నాను. నా సలహా ఏంటంటే వికీపీడియాను వాళ్ళ పరిశోధనకు వాడుకోమనడం. అలానే వాళ్ళకి దొరకని సమాచారం గురించి వ్యాసాలు రాయడం మీద వారికి శిక్షణ, అవగాహన కల్పిస్తే బాగుంటుంది.--రవిచంద్ర (చర్చ) 07:18, 27 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇదొక మంచి శుభసూచకము. కొనసాగించండి. భాస్కరనాయుడు (చర్చ) 14:40, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పుస్తక ప్రదర్శనల్లో స్టాల్ విషయం మార్చు

అందరికీ నమస్కారం,
నవ్యాంధ్ర పుస్తక సంబరాల పేరిట ఎన్టీఆర్ ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో 1 అక్టోబర్ 2016 నుంచి 70 రోజుల పాటు పుస్తక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అనంతపురం (అక్టోబర్ 1 నుంచి 9), తిరుపతి (అక్టోబర్ 15 నుంచి 23), నెల్లూరు (నవంబర్ 5 నుంచి 13), రాజమండ్రి (నవంబర్ 19 నుంచి 27), విశాఖపట్టణం (డిసెంబర్ 3 నుంచి 11), శ్రీకాకుళం (డిసెంబర్ 17 నుంచి 25), విజయవాడ (జనవరి 1 నుంచి 11) నగరాలు, పట్టణాల్లో ఈ పుస్తక ప్రదర్శనలు జరుగనున్నాయి. స్థానికంగా ఉండే వికీపీడియన్లు ఎవరికైనా ఈ కార్యక్రమాల్లో స్టాల్ నిర్వహించేందుకు ఆసక్తి ఉండడం కానీ, ఈ నగరాలన్నిటిలోనూ స్టాల్ నిర్వహించడం లేదా కొన్ని నగరాల్లో నిర్వహించడం కానీ చేయవచ్చా అన్నది తెలుగు వికీపీడియన్లను స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:30, 27 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

అన్ని పట్టణాలలో స్టాల్ నిర్వహించడము సాద్యం కాక పోవచ్చునేమో గాని. ఒకటి రెండు పట్టణాలలో నిర్వహిస్తే బాగుంటుంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ ఉత్సవాలను సద్వినియోగము చేసుకుంటే మంచిదే. భాస్కరనాయుడు (చర్చ) 14:44, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
పైన ఇప్పటికే ఏయే నగరాల్లో నిర్వహిస్తున్నారో ఇచ్చినందున, ప్రస్తుతం అనంతపురంలో పుస్తక ప్రదర్శన ముగిసిపోతున్నందున, స్థానికంగా ఉన్నవారు కానీ, ప్రయాణం చేయదలుచుకున్నవారు కానీ ఎవరైనా ఈ పుస్తకాల పండుగల్లో స్టాల్ నిర్వహించేందుకు ఆసక్తి కనబరిస్తే తెలియజేయగలరు. అలానే ఏయే నగరాల్లో చేయగలరో తెలుపగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:07, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాల అభివృద్ధిపై చర్చ మార్చు

ప్రముఖ పర్యావరణవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ మాధవ్ గాడ్గిల్, ఆయన సహ పర్యావరణవేత్తలైన సుబోధ్ కులకర్ణి, ప్రశాంత్ పవార్ సహ నిర్వహణలో తెలంగాణా-ఆంధ్రప్రదేశ్ గ్రామ వ్యాసాల అభివృద్ధిపై ఐఐఐటీ, హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 6 తేదీన ఉదయం 11 నుంచి 1 గంట వరకూ చర్చ నిర్వహించనున్నాం. కార్యక్రమంలో ఆసక్తి కలిగిన కొత్త వికీపీడియన్లకు కార్యశాల కూడా చేపట్టదలిచాం. కార్యక్రమంలో పర్యావరణవేత్తలు, జీవవైవిధ్య శాస్త్రవేత్తలు కూడా పాల్గోనున్నారు. కార్యక్రమంలో ప్రధానంగా ప్రస్తుతం ఇతర భాషల్లో గ్రామ వ్యాసాలపై చేస్తున్న కృషి గురించి, తెలుగులో జరుగుతున్న ప్రయత్నాల గురించి చర్చిస్తారు. అలాగే ఖమ్మం, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల గ్రామాల జనగణన వివరాలతో తయారుచేసి Githubలో ప్రచురించిన వ్యాసాల భాష శైలి మార్చి ప్రచురించే అవకాశాన్ని గురించి కూడా చర్చించవచ్చు. కార్యక్రమం గురించిన ఆసక్తి కానీ, ఈ విషయంపై సూచనలు కానీ తెలియజేస్తూ స్పందించేందుకు ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:01, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంటి పేర్ల వ్యాసాలు మార్చు

ప్రసాద్ గారు, పెద్ద సంఖ్యలో ఇంటి పేర్ల వ్యాసాలు చేరుస్తున్నారు. అందులో ప్రస్తుతం ఒక్క వాక్యం, అయోమయ నివృత్తి మూస తప్ప ఇంకే సమాచారమూ లేదు. భవిష్యత్తులో ఈ వ్యాసాల నుంచి ఆ ఇంటి పేర్లతో ప్రారంభమయ్యే వికీ వ్యాసాలకు లింకు ఇచ్చే ప్రణాళిక ఉందా? కొన్ని ఇంటి పేర్లతో వికీలో ఏ వ్యాసాలు లేకపోయినా ఆ వ్యాసాలు ఊరికే అలా పడి ఉంటాయి. దయచేసి మీ ప్రణాళిక గురించి ఇక్కడ తెలియజేయండి. --రవిచంద్ర (చర్చ) 13:09, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కొత్తగా ఏమీ చేర్చడం లేదు. ఇది వరకు పాత వాడుకరులు ఇదే పద్ధతిలో చేర్చారు. వారు ఏమి చేస్తే నేను అదే చేయాలని లేదు కూడా. నాకు ఎంత పని చేయాలనిపించితే అంతే చేస్తాను. నాకు ప్రణాళిక అంటూ ఏమీ లేదు. ఇంటి పేర్లతో ఉన్న వికీ వ్యాసాలకు లింకులు నాకు ఇవ్వాలనుకుంటే, వీలుంటే ఇస్తాను, ఇంతకుముందు కూడా లింకులు ఇచ్చాను. వికీ వ్యాసాలు ఉన్న వాటికి మాత్రమే ఇంటి పేరు వ్యాసాలు మాత్రమే ఉండాలనే నియమం ఉంటే నాకు తెలియదు. ఇంటిపేర్లకు ఎర్రలింకులు ఉండే వాటికి వ్యాసాలు ఇస్తున్నాను. కొత్త వికీ నియమాలు నాకు తెలియవు. ఒక వాక్యం అయినా వ్రాయవచ్చు అని కొత్తవారికి మరియు పాతవారికి అందరూ చెబుతున్నారు. ఇలా వ్రాయడమే తప్పు అయితే మానేస్తాను. JVRKPRASAD (చర్చ) 13:21, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ప్రసాద్ గారూ, మీరు ఇలా రాయడం తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. విషయ ప్రాముఖ్యత, భవిష్యత్తులో ఆ వ్యాసంలో సమాచారం పోగుపడగలదని విశ్వాసం ఉంటే ఏకవాక్య వ్యాసాలు ఎవరు సృష్టించినా తప్పు లేదు. ఉదాహరణకు ఘంటసాల అనే ఇంటి పేరుతో వ్యాసం ఉండవచ్చు. ఎందుకంటే మనకు ఘంటసాల ఇంటి పేరుతో వెంకటేశ్వర రావు, బలరామయ్య మొదలైన వ్యాసాలు ఉన్నాయి. ఎవరికీ తెలీని ఒక ఇంటి పేరు గురించి ఊరికే ఒక అయోమయ నివృత్తి వ్యాసం సృష్టించి పడేయడం ఎందుకు? నా దృష్టిలో ఆవ్యాసాలు అవసరం లేదు. ఇది నియమం కాదు. ఇటువంటి వ్యాసాల వల్ల ఎటువంటి సమాచారం అందదు అని చెప్పడం మాత్రమే నా ఉద్దేశం. దీన్ని మరోలా భావించకండి.--రవిచంద్ర (చర్చ) 13:29, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఒకరి అభిప్రాయము తప్పు పట్టడము అనేది ఎప్పుడూ చేయను. మీ అభిప్రాయము మీది, నా అభిప్రాయము నాది. ఈ రోజున ఒక ఇంటిపేరుకు అంతగా ప్రాముఖ్యత లేకపోవచ్చును. కానీ రాబోయే కొన్ని సంవత్సరాలలో ఆపేరు ప్రసిద్ధి అవుతుంది లేదా అవదు అని చెప్పలేము. ఒక ఇంటిపేరు గురించి వాడుకరులకు పెద్దగా తెలియకపోవచ్చును. కానీ ఎర్రలింకులు ఉన్న ఇంటిపేర్లు ఎప్పటికీ అలాగే ఉంటున్నాయి, ఉంటాయేమో అన్న ఉద్దేశ్యముతో కనీసం ఆ ఇంటిపేరు తెలిసిన వారైనా భవిష్యత్తులో ఏదైనా సమాచారము వ్రాస్తారేమోనని ఉద్దేశ్యంతో ఏకవాక్య వ్యాసాలు వ్రాయడము జరిగింది. ఇక అయోమయ నివృత్తి వ్యాసం సృష్టించి పడేయడం ఎందుకు అని మీ ప్రశ్నకు, ఒకే ఇంటిపేరుగల వారు ఒకరికి మించి ప్రముఖులు ఉండవచ్చునేమో అన్న ధోరణిలో మూస పెట్టడము జరిగింది. దీని గురించి పెద్ద చర్చలు అవసరము లేదు. ఇంటిపేరు గురించి వికీ వ్యాస సమచారము లేని వాటికి కొత్తగా ఇంటిపేరు వ్యాసము నేను వ్రాయను. JVRKPRASAD (చర్చ) 13:45, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియాలో ఒకే పేరుతో కలిగి యుండి పాఠకులకు అయోమయం కలిగిస్తున్నప్పుడు అటువంటి వ్యాసాలనన్నింటినీ ఒక అయోమయ నివృత్తి పేజీ సృష్టించవచ్చును. కానీ ఒకే పేరుతో వ్యాసం ఉన్నప్పుడు ఆ యింటిపేరుకు అయోమయ నివృత్తి వ్యాసం అవసరం లేదు. అదే యింటి పేరుతో అనేకమంది లేనపుడు యితరులకు అయోమయం కలిగే అవకాశం లేనపుడు అయోమయ నివృత్తి పేజీ అవసరం లేదని నా అభిప్రాయం. ఒకె ఇంటి పేరుతో రెండు గానీ అంతకంటే ఎక్కువ వ్యాసాలు ఉన్నప్పుడు ఆ పుటను సృష్టించవచ్చు. -- కె.వెంకటరమణచర్చ 13:52, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంటిపేరుతో ఎర్రలింకులు ఉన్నవి ఏనాటి నుంచో ఉన్నాయి. వాటి లింకులు తీసివేయాలా లేదా వాటికి ఏక వాక్య వ్యాసంగా వ్రాయాలో అదికూడా తెలియజేస్తే బావుంటుంది అని నా అభిప్రాయము. JVRKPRASAD (చర్చ) 13:59, 28 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక్కో ఇంటిపేరుకు ఒక్కో పేజీని సృష్టిస్తే వాటిని వ్యాసాలుగా తీర్చిదిద్దేంత సమాచారం ఉంటుందని నేను అనుకోను. అవి ఎల్లకాలం మొలకలుగానే ఉండిపోతాయి. రేపో ఎల్లుండో అవి పెద్ద వ్యాసాలుగా తయారయ్యే అవకాశం ఉందనుకుంటే అలా చెయ్యొచ్చు. అంచేత ఇంటిపేరుకు మొలకలను తయారుచెయ్యకపోవడం మేలు. ఎర్రలింకులెక్కడైనా ఈపాటికే ఉంటే వాటిని తీసెయ్యడం నయం, కొత్త మొలకలను సృష్టించే బదులు. ఒక్క వివరణ -నేను మొలకలకు వ్యతిరేకం కాదు, కానీ ఒక్కో ఇంటిపేరుకు ఒక్కో మొలక అనేది అనవసరం.__చదువరి (చర్చరచనలు) 06:28, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సందర్భంగా మరొక అంశాన్ని సముదాయం దృష్టికి తెస్తాను.. కొన్ని సినిమా పాటలకు కూడా పేజీలు సృష్టించారు. అవి అనవసరమని నా ఉద్దేశం. బహుచర్చిత పాట/వివాదాస్పద పాట లాంటివేవైనా ఉంటే సంబంధిత మూలాలను ఉటంకిస్తూ వ్యాసం రాయవచ్చు. పాట కో పేజీ అవసరం ళేదని నా ఉద్దేశం. __చదువరి (చర్చరచనలు) 07:04, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామవ్యాసాలు, సినిమా వ్యాసాలు, ఇంటిపేర్లు వ్యాసాలు, ఇత్యాదివి ఒక వాక్యంగా ఉన్నా అవి ఒక ప్రత్యేక తరగతికి చెందినవి. వాటిని మొలకలు జాబితాలో సాధారణ వ్యాసాలుగా పరిగణించకూడదు అని నా అభిప్రాయము. ఒక వాక్యం ఉన్న ఇలాంటి ప్రత్యేక తరగతివి కూడా మొలకలు అని అందరూ నిర్ణయిస్తే అన్నింటిని తొలగించడంలో పెద్ద సమస్య లేదు. తొలగించేటప్పుడు ఆలోచించి తొలగిస్తే మంచిది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఎర్రలింకులు ఎందుకు తొలగించటం లేదో అర్థం చెప్పాలి. ఒక ఇంటిపేరు ఉన్న వారిలో గొప్ప వ్యక్తులు మహా అయితే ఒక 10 మంది ఉండటం గొప్ప విషయం. ఓ పేజీ సృష్టించి, ఆ పదిమంది పేర్లు వ్రాసి, ఒక అయోమయ మూస పెట్టేస్తే, అది ఒక వ్యాసం అవుతుందా ? ఒక ఇంటిపేరు ఒక వ్యాసంగా రూపాంతరం చెందాలంటే ఎంతో సమాచారము అందుబాటులో ఉండాలి. కొంతమందివి మాత్రమే ఇంటిపేర్లు వ్యాసాలుగా వ్రాసి, విగతా వారివి వదలి వేయడం వికీలో మూలసూత్రాలలోని ఏ పద్ధతి ఇది ? కొన్ని ఇళ్ళపేర్లు మాత్రమే గొప్పవా ? తదుపరి ఒక వాక్యంతో ఉన్న గ్రామవ్యాసాలు సంగతి ఏమిటి ? సంవత్సరాలుగా ఉన్న ఏక వాక్య సినిమాలు, గ్రామాలు వ్యాసాలు ఇప్పుడు కొంత కొన్ని మెరుగు పడుతున్నాయి. ఏ వ్యాసాలు అయినా అన్నీ ఒకే గాటన కట్టడం ఎంతవరకు సమంజసం ? ఒక వాడుకరికి నచ్చిన తెలుగు యాస, భాష మాత్రమే అందరూ వ్రాయాలి, అనుసరించాలి, ఆచరించాలి అన్న దాష్టిక ధోరణికి ప్రస్తుతం కొనసాగుతున్న మార్పుల యొక్క దాని పర్యవసానము లోని భాగమే ఈ ఏక వాక్య వ్యాసాల తొలగింపు అని అనుకునే వారెందరో ఉంటారని గమనించవలసిన విషయంలొని ఆంతర్యభాగం అని అనుకునేందుకు ఆస్కారముందేమో ? JVRKPRASAD (చర్చ) 11:17, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఈమధ్యన JVRKPRASAD ని టార్గెట్ చేయడం మూమూలైపోయింది. 90 ఏళ్ళ వయసులో కూడా ఆయన వికీ అభివృద్దికి చేస్తున్న కృషిని గమనించకుండా ఆయనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మామూలైపోయింది. సభ్యులు ఆత్మవిమర్శ చేసుకొని పనిచేసేవారిని చెడగొట్టవద్దు. ఇది మిక్కిలి బాధాకరం. దయచేసి ఆయనను గౌరవించండి. ఆయనను తూలనాడకండి. ఆయనను రెచ్చగొట్టి రాక్షసానందం పొందవద్దు. -- సునీల్
చర్చలు జరుగుతుంటే ఎవరో వాడుకరి వచ్చి ఏవేవో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు చేయడం మామూలైపోయింది. అసలు అయోమయంనివృత్తి మూస ఎందుకు వ్యాసంలో ఉంచుతారో తెలుసుకోవాలి. పాఠకులకు అయోమయం కలిగించే పదాలు వివిధ శీర్షికలలొ ఉన్నప్పుడు అయోమయ నివృత్తి కోసం పుటలు తయారుచేసుకోవాలి. ఒకే ఇంటి పేరు కలిగిన ఒకే వ్యక్తి ఉన్నప్పుడు దానిని ఎవరైనా వెతుకుపెట్టెలో వెదికినట్లయితే దొరుకుతుంది. దానిని అయోమయం ఏముంది? ఉదాహరణకు దేవులపల్లి వ్యాసం తీసుకుందాం అదే యింటి పేరుతో అనేక మంది ఉండటమే కాకుండా "దేవులపల్లి కృష్ణశాస్త్రి" పేరుతో వారి వంశంలో ఆరుగురు ఉన్నారు. వారిలో నలుగురి వ్యాసాలు వికీలో ఉన్నాయి. పాఠకులకు ఎవరు ఏకాలంలోని వ్యక్తో తెలియని అయోమయం వస్తుంది. మరో ఉదాహరణ పూసపాటి ఆనంద గజపతి రాజు అనే వ్యక్తులు ఇద్దరి వ్యాసాలు వికీలో ఉన్నాయి. అటువంటి అయోమయం కలిగించే వ్యాసాలకు అయోమయ నివృత్తి పేజీ ఉండాలి. అది మొలక అయినా నష్ఠం లేదు. మన లక్ష్యం పాఠకులకు సులువుగా వ్యాసం గుర్తించేటట్లు చేయడమే కదా! అలీ అనే పదం "హైదర్ అలీ" "అలీ(నటుడు), "అలీ ఇబ్న్ అబీ తాలిబ్" , హజరత్ అలి, "మహమ్మద్ అలీ" అనే వ్యాసాలలో ఉంది. పాఠకులకు అయోమయాన్నినివారించడానికి ఆ పదంపై అయోమయ నివృత్తి వ్యాసం ఉండాలి. అలా కాకుండా ఎర్రలింకులున్నాయి కదా అని మూల సూత్రాలను విస్మరించి మొలకలు సృష్టిస్తె బాగుంటుందా? ఒకసారి దయచేసి విజ్ఞులు ఆలోచించమనవి.-- కె.వెంకటరమణచర్చ 11:44, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

నా ప్రశ్న మీ సమాధానము మార్చు

కె.వెంకటరమణ గారు, మనకు వచ్చే ఇబ్బందులు గురించి తరువాత ఆలోచిద్దాము. నేను అడిగే సూటి ప్రశ్నలకు సూటిగా సమాధానము మీదగ్గర ఉందా లేదా అనేది నాకు తెలియాలి. మీకు తెలియకపోతే తెలియదు అని చెప్పండి. వివరణలు మనకు అనవసరం. మీ నుండి ఏ సంగతి సమాధానము వస్తే ప్రశ్న వేస్తాను. ఆలోచించండి. JVRKPRASAD (చర్చ) 12:03, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామ వ్యాసాల్లో అనుచిత మార్పులు మార్చు

చాలా కాలంగా గ్రామ వ్యాసాలు కొంతమంది అనామక వ్యక్తులు (ఐపీ అడ్రసులు) ద్వారా వార్తా పత్రికల్లో వచ్చిన సమాచారాన్నంతా కుమ్మరిస్తున్నారు. ఉదాహరణకు ఆ గ్రామంలో ఒక విద్యార్థి మండలం ఫస్టు వచ్చిందనీ, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైందనీ, వారి ఊర్లో దేవాలయంలో ఫలానా తేదీలో ఫలానా ఉత్సవం జరిగిందనీ.. ఇలాంటి సమాచారం నాకైతే ప్రాముఖ్యత కలిగిందనీ అనవసరమనీ నా నమ్మకం. సదరు సభ్యులకు మూలాలు తెలపడం కూడా రావడం లేదు. నా వంతు నేను వారిని మూలాలు సరిగా ఇమ్మని, ఖాతా సృష్టించుకోమనీ కోరాను. వారు వినలేదు. చాలా సార్లు చెప్పిన తర్వాత ఒక రోజు నిషేధం కూడా విధించి చూశాను. వాళ్ళకు నేను పంపించిన సందేశం అందిందో లేదో తెలియదు కానీ మళ్ళీ అలాంటి సమాచారమే చేరుస్తున్నారు. ఇలాంటి మార్పులను ఎలా అడ్డుకోగలం?--రవిచంద్ర (చర్చ) 05:38, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సదరు ఐ.పి నెంబరుల సభ్యులను పూర్తిగా నిషేధించడమే.Palagiri (చర్చ) 06:16, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
కొత్తవాళ్లతో, ఐపీ వాడుకరులతో ఇది సహజం, మనకిది తప్పదు. ఎప్పటికప్పుడు మనం సరిద్దిద్దుకుంటూండాలి. ఒక పరిష్కారం ఏంటంటే, ఆయా ఐపీలను, ఐపీ రేంజినీ నిషేధించి చూట్టం. ఈ సందర్భంలో మరొక సూచన: పాత సభ్యులు, ముఖ్యంగా సదరు వ్యాసాలపై ఎక్కువగా పనిచేసేవాళ్ళు ఈ విషయంపై దృష్టి పెడితే బాగుంటుంది. ఒక గ్రామం పేజీని తీసుకుంటే, అందులో ఇలాంటి రాతలను తీసెయ్యడం/సరిదిద్దడం, భాషలో తప్పులను సరిదిద్దడం, అవసరమైన మూసలు పెట్టడం, మూలాలను చేర్చడం/సరిదిద్దడం, వర్గాలను చేర్చడం/సరిదిద్దడం వంటివి చేసి, వ్యాసాలను మరింత సమగ్రంగా సరిదిద్దితే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 06:59, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గ్రామ వ్యాసాలపై ప్రధానంగా పని చేస్తున్నవారికి నా సూచన కూడా అదే.--రవిచంద్ర (చర్చ) 08:36, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అనామక వాడుకరులు గ్రామవ్యాసాలలో విషయం చేర్చడం, తొలగించడం అనేక సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆ విషయానికి ఎటువంటి ఆధారం ఉండదు. ఎంతమందిని నిరోధించగలం? నిరోధిస్తే గడువు ముగిసిన తదుపరి మరల అదే కార్యక్రమం. ఎన్నిసార్లు సూచనలు చేసినప్పటికీ ప్రయోజనం కనిపించడంలేదు. ఖాతా సృష్టించుకోమని సలహాలిచ్చినప్పటికీ వారు వినరు. వారిని ఎలా అడ్డుకోవాలో తెలియడం లేదు. వారు సరియైన సమాచారాన్ని మూలాలతో చేర్చితే పరవాలేదు. ఉన్న విషయాలను తొలగించడం. గ్రామంలో ఒక విద్యార్థికి ఫస్టు వచ్చిందని మరియు అనేక ప్రాముఖ్యం లేని విషయాలను చేరుస్తుంటారు. వారు ఎలా మారుతారో అర్థం కావటంలేదు.-- కె.వెంకటరమణచర్చ 12:00, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter August 2016 మార్చు

 

Hello,
CIS-A2K has published their newsletter for the months of August 2016. The edition includes details about these topics:

  • Event announcement: Tools orientation session for Telugu Wikimedians of Hyderabad
  • Programme reports of outreach, education programmes and community engagement programmes
  • Ongoing event: India at Rio Olympics 2016 edit-a-thon.
  • Program reports: Edit-a-thon to improve Kannada-language science-related Wikipedia articles, Training-the-trainer programme and MediaWiki training at Pune
  • Articles and blogs, and media coverage

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 08:25, 29 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
If you want to subscribe/unsubscibe this newsletter, click here.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యాటక, చారిత్రక స్థలాలు ఎడిటథాన్ మార్చు

అందరికీ నమస్కారం,
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పర్యాటక, చారిత్రక స్థలాల గురించి కొత్త వ్యాసాల సృష్టించి, ప్రస్తుత వ్యాసాల అభివృద్ధి చేసే ఎడిటథాన్ నిర్వహించేందుకు ప్రతిపాదిస్తున్నాము. ఇటీవల వెంకటరమణ గారు ఏదైనా చక్కని వ్యాసాల సృష్టి జరిగే ప్రయోజనకరమైన ఎడిటథాన్ ప్రణాళిక వెయ్యమని అడగడంతో, ఆపైన రవిచంద్ర గారు ఈ థీమ్ తో ఎడిటథాన్ ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు సృష్టించుకుని దానిలో అభివృద్ధి చేయగల, సృష్టించగల వ్యాసాలు జాబితా వేసుకుని, మూలాలను తీసుకుని తయారుచేస్తే బావుంటుందని భావిస్తున్నాం. ఎడిటథాన్ కనీసం 15 రోజులు ఉంటే బావుంటుదని ఆలోచన. దీనిపై సభ్యులు స్పందించగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:14, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మద్దతు మార్చు

  1.   ' పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) ప్రతిపాదించిన ఎడిటథాన్ చాలా మంచిదే. ఇది మన తెలుగు వికీ వాడుకరులకు ఏమంత కష్టమైన విషయము మాత్రము కాదు అని నా అభిప్రాయము. ఎందుకంటే ఒకరోజులోనే కొన్ని వందల వ్యాసాలు పంజాబ్ ఎడిథాన్ నందు కలసికట్టుగా అందరూ ఒకే మాట, ఒకబాట అన్నట్లుగా భారతదేశంలోనే ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి, ప్రథమ విజేతగా నిలిచి, కప్పు గెలుచుకుని, ఒక గొప్ప విజయం సాధించి, సరికొత్త ప్రయోగంతో తెలుగువారి సత్తా ఏమిటో దేశప్రజలకు రుచి చూపించారు. అందరి అభినందలను కూడా (నేను లేకపోయాను అన్నింటిలోనూ) అందుకుని, విజేతలమని నిరూపించుకున్నవారు, ఈ ఎడిటథాన్ నందు కూడా మూకుమ్మడిగా ఒకచూపు చూసారంటే ఈ ప్రయోగం సఫలం ఎలాగూ అవుతుంది కనుక ఇది ఒక పరాకాష్టగా ప్రతివారి మదిలో మరచి పోలేని తీపి గుర్తుగా మెదిలి తదుపరి తెలుగు వికీపీడియా సరికొత్త పుంతలు తొక్కుతుందనుటలో ఎలాంటి సందేహం ఉండదేమో ? శుభమస్తు. విజయీభవ. జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్ (చర్చ) 15:35, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  2.   ' ఈ ఎడిటథాన్ కార్యక్రమానికి నా మద్దతు ఇస్తున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:34, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  3.   '--' కె.వెంకటరమణచర్చ 11:38, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  4.   '--రవిచంద్ర (చర్చ) 16:44, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  5.   '__చదువరి (చర్చరచనలు) 03:05, 2 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  6.   ' -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 16:17, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  7.   ' --t.sujatha (చర్చ) 02:47, 7 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యతిరేకం మార్చు

తటస్థము మార్చు

ప్రకటన మార్చు

ఈ నేపథ్యంలో 5-19 దాదాపు రెండు వారాల పాటు నిర్వహించుకోవడం బావుంటుందని భావిస్తున్నాను. సెలవులతో పాటుగా రెండు వీకెండ్లు కలిసి రావడంతో అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని భావించడమైంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:06, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆసక్తి కలవారు ఇక్కడ నమోదు చేసుకుని ప్రారంభించవచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 17:36, 5 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Grants to improve your project మార్చు

Please help translate to your language:

Greetings! The Project Grants program is currently accepting proposals for funding. There is just over a week left to submit before the October 11 deadline. If you have ideas for software, offline outreach, research, online community organizing, or other projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF) (talk) 20:11, 30 సెప్టెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు పదాలు కూడా చచ్చిపోతున్నాయి మార్చు

ఈ మధ్యన ఒక వాడుకరి తప్పులు సరిదిద్దుతాననే ముసుగులో తన యాస, భాష, నచ్చిన పదాలతో భారీ మార్పులు కొనసాగించటం జరుగుతున్నది. ఈ విషయములో ఎవరూ స్పందించటం లేదు. తెలుసు అక్షరాలు వాడకం ఇప్పటికే చాలా తగ్గిపోయాయి అని ప్రభుత్వం, పెద్దలు ఒక ప్రక్క ఘోషిస్త్గుంటే, ఈ వాడుకరి అధికారినన్న ధీమాతో ఏకంగా తెలుగు పదాలనే మూలన, మరుగున పడేయటం చేయటం జరుగుతున్నది. ఇటువంటి దుశ్చర్యలను అరికట్టే వాళ్ళు ఎవరూ లేరా  ? JVRKPRASAD (చర్చ) 03:05, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRKPRASAD గారూ, మీరు ఉద్దేశించినది నన్నే అయితే.. ఒక విన్నపం. నా తప్పుల గురించి సూటిగానే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. అన్యాపదేశంగా చెప్పనక్కర్లేదు. నేను అసలు తప్పులే చెయ్యను అనే తప్పుడు ఆలోచన నాకు లేదు. అధికారిని అనే ధీమా నాకు అసలే లేదు. అధికారికి అధికార మేదో ఉంటుందనే ఆలోచన కూడా నాకు లేదు. మీరు ఉద్దేశించిన తప్పులను చెప్పండి, సరిదిద్దుకుంటాను. __చదువరి (చర్చరచనలు) 06:45, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రచ్చబండలో చర్చ చేసేటప్పుడు ఎవరిమీదైనా అభిప్రాయాలు తెలియజేయాలనుకున్నప్పుడు సూటిగా తెలియజేయాలే గానీ ఇలా అన్యాపదేశంగా చెప్పడం ఏమిటి? ఆయన చేస్తున్నవి తప్పులని చెప్పారు. ఏమి తప్పులు చేశారో చెప్పండి. సరైందేదో కూడా చెప్పండి. ప్రసాద్ గారికి ఏ చర్చలోనైనా రెచ్చగొట్టేలా మాట్లాడటం, ఆయనను వ్యతిరేకిస్తే చిన్నా పెద్దా చూడకుండా తిట్ల దండకం లంకించుకోవడం అలవాటు. ఇలాంటి చర్యలు మాని సజావుగా చర్చలు చేస్తే అందరికీ మంచిది. --రవిచంద్ర (చర్చ) 16:44, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరైనా వాడుకరులు (అధికారులైనా, నిర్వాహకులైనా, సాధారణ వాడుకరులైనా) తప్పు చేస్తున్నప్పుడు మనం సూటిగా తెలియజేయాలి. ఏ తప్పులు చేస్తున్నారో తెలియజేస్తే వారు సరిదిద్దుకుంటారు. ఏ తెలుగు పదాలు మరుగునపడ్డాయో, చచ్చిపోతున్నాయో దయచేసి తెలియజేయగలరు. సరిదిద్దుకుందాం.-- కె.వెంకటరమణచర్చ 16:48, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఉన్నది లోపము - శోధించండి.JVRKPRASAD (చర్చ) 04:50, 2 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
తిన్నగా చర్చించడం రాదా మీకు ఎవరితోనూ.ఎందరు చెప్పినా అదే పద్దతి.పోనీ చర్చల్లో పాల్గొకుండా మీ పని మీరు చేసుకోరు. మీరనుకొనే లోపాలు శోధించడానికి ఇక్కడ ఉన్నవాళ్ళు దివ్యదృష్టి కల దేవుళ్ళా. 08:25, 2 అక్టోబరు 2016‎ 117.213.106.219 (చర్చ | నిరోధించు)‎
అజ్ఞాత వాడుకరుల జోక్యం ఎక్కువయిపోయింది. వారు లాగిన్ అయి చర్చించవచ్చుకదా!......ప్రసాద్ గారూ, నేను శోధించినా తప్పులు ఎక్కడ జరిగాయో తెలియడంలేదు. దయచేసి దోషాలుగల పదాలను తెలియజేయగలరు. లోపాలు, దోషాలు తెలియజేయనప్పుడు ఈ చర్చలేల? "దుశ్చర్యలను అరికట్టీవారే లేరా?" అనే వాక్య ప్రయోగాలేల? దయచేసి జరిగిన దోషాలు తెలియజేస్తే అందరం కలసి సరిదిద్దుకుందాం.-- కె.వెంకటరమణచర్చ 15:43, 2 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
117.213.106.219, (మొగల్స్ హోటల్, రాజ థియేటర్ దగ్గర, కోయంబత్తూరు, తమిళనాడు), తిక్కళోళ్ళకి సమాధానం ఎలా ఇవ్వాలి ? నువ్వు ఎవరో ముందు చెప్పుకోలేవు ? పిచ్చి రాతలు వ్రాయకు. నీలాంటి వాళ్ళు ఎక్కువయ్యారు. నేను చెప్పను నీకేంటిరా నెప్పి ? నువ్వు ఎవడు నన్ను చర్చ వ్రాయవద్దు అనడానికి ? నువ్వు ఎవడివో నాకు తెలుసుకునేందుకు నేను దివ్యదృష్టి దేవుడినా ? నా పద్ధతిలో నేను చర్చ లేదా వ్రాస్తానురా. నీకేంటి ? నువ్వు చెప్పినట్లు, నీకు నచ్చినట్లు ఎందుకు రాస్తానురా ? నీకు వ్రాయడం చేతకాకపోతే మూసుకోరా.--JVRKPRASAD (చర్చ) 14:01, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రమణ గారు, చాలా చిన్న విషయం. రోజూ జరిగే మార్పులు చూస్తుంటే మీకు తెలియడం లేదు అంటే ఆశ్చర్యంగా ఉంది. ఉన్నది, లోపము, సూచిస్తున్నది, వస్తున్నది, నడుస్తున్నది, ఇలా నకార, మకార శబ్దాలు సున్నాతో అంతమయ్యే పదాలుగా మార్చటం మీరు చూడలేదా ? తెలుగు వికీలో అధిక సంఖ్యలో కనుమరుగు అవుతున్నాయి. అక్షరాలు కుంచించుకుని పోయాయని, కొత్త పదాలు కనిపెట్టి ఏదోవిధంగా చొప్పించాలని అందరూ ఘోషిస్తున్నారు కదా ! ఏమన్నా వివరంగా తెలియజేసానంటే అంటే వికీ మూలసూత్రాలు, వ్యాకరణం అంటూ నాకు హితబోధనలు చేస్తారు. ప్రతివాడు పిచ్చిరాతలు నాకు వ్రాస్తాడు, అలాంటి దరిద్రపు రాతలు వ్రాసేవాళ్ళను నేను ఏమీ అనకూడదు. నేను ఒక సీనియర్, నిర్వాహకుడు, ఇలా ఎవేవో వ్రాస్తారు. నాకేదో ఇలాంటి వాళ్ళు నీతులు చెబుతున్నారు. ఏంటండి ఇది ? --JVRKPRASAD (చర్చ) 14:06, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు చూపిన లోపాలు స్పష్టంగా లేవు. మరింత వివరంగా చెప్పగలరు. ఉన్నది, లోపము, సూచిస్తున్నది, వస్తున్నది, నడుస్తున్నది - వీటిని "సున్నాతో అంతమయ్యే పదాలు"గా మారుస్తున్నానని అన్నారు అంటే.. - ఉన్నదిం, లోపముం, సూచిస్తున్నదిం, వస్తున్నదిం, నడుస్తున్నదిం - అని. నేను అలా మార్చడం లేదు. __చదువరి (చర్చరచనలు) 16:04, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
  • వ్యక్తిగతంగా వికీపీడియన్ హోదాలో నాకు తెలిసిన కొద్దిపాటి తెలుగు వికీపీడియా విధానాలతో పరిచయంతోనూ, తెలుగు భాష-వ్యాకరణం-చరిత్రలపై, మరీ ముఖ్యంగా వ్యవహారిక, గ్రాంథిక భాషోద్యమాలపై, చక్కని అవగాహనతోనూ ఈ అంశాన్ని రాస్తున్నాను. 20వ శతాబ్ది తొలి అర్థభాగం నాటికే ప్రజల వ్యవహారంలో ఉన్న భాషని విశ్వవిద్యాలయాలు సైతం ప్రామాణికమని అంగీకరించడంలో నన్నయ నుంచి చిన్నయ వరకూ భాషా, సాహిత్యాలను ఆపోశన పట్టిన మహనీయుడు గిడుగు రామమూర్తి పంతులు నేతృత్వంలోని వ్యవహారిక భాషావాదులు ఒప్పించారు. వాడుక భాషనే ఆధునిక భాష అని స్థిరీకరిస్తున్నారు. పత్రికలు మొదలుకొని విశ్వవిద్యాలయ పరిశోధనల వరకూ వ్యవహారిక భాష లేక ఆధునిక భాష ఉపయోగించడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అన్ని ప్రామాణిక రచనల్లోనూ దాదాపుగా 'లోపము' అని కాక 'లోపం' అనే రాస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యవహారిక భాష లేక ఆధునిక భాష వినియోగాన్ని తోసిరాజనడానికి మన వద్ద ఉన్న వాదం ఏమిటన్నది నా ప్రశ్న. నా వ్యక్తిగత అభిప్రాయమైతే సర్వధా శతధా గ్రాంథిక భాష కాకుండా ఆధునిక భాష వాడాలన్నదే. ఇది నేను కాదు గత శతాబ్దిలోని తెలుగు మహనీయులు గిడుగు రామ్మూర్తి పంతులు, గురజాడ అప్పారావు, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి మొదలుకొని మహామహులు ఎందరో అంగీకరించిన మార్గం. అలానే ఇది వాదన కోసం, ఒక స్థిరమైన విధానం కోసం పూర్తిగా వ్యక్తిగత స్థాయిలో చేస్తున్న చర్చ తప్ప వేరొకటి కాదని గమనించాలి. అంశాన్ని దాటకుండా చక్కని చర్చ చేసుకుని, దీనిపై స్థిరమైన విధానాన్ని ఏర్పరుచుకోగలమని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 16:06, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వ్యావహారిక భాషే సరైందని నేను భావిస్తున్నాను. చదువరి గారు చేస్తున్న మార్పులు ఏమీ అసంబద్ధంగా ఉన్నట్లు నాకు తోచలేదు. ఇవాళ అన్ని మాధ్యమాలలోనూ ఇదే ప్రామాణిక భాషగా చలామణీ అవుతున్నది. --రవిచంద్ర (చర్చ) 16:12, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇప్పటి వరకూ వెల్లడైన అభిప్రాయాలలో ఈ మార్పుల పట్ల వ్యతిరేకత కనిపించలేదు. వ్యతిరేకత ఉన్న ప్రసాదు గారు, ఇదమిత్థంగా నా వ్యతిరేకత ఇందుకూ అని చెప్పలేదు. ఈ విషయమై ఇతర వాడుకరులు కూడా తమ తమ అభిప్రాయాలు వెల్లడించాలని మనవి. __చదువరి (చర్చరచనలు) 06:58, 13 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి చేస్తున్న మార్పులు సరియైనవని భావిస్తున్నాను. వ్యవహారిక భాష సరియైనదని నా భావన.-- కె.వెంకటరమణచర్చ 13:21, 13 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇక్కడ వచ్చిన అభిప్రాయాలను బట్టి, ప్రస్తుతం చేస్తున్న సవరణలు సముదాయానికి ఆమోదమేనని భావిస్తున్నాను. తిరిగి సవరణలను కొనసాగిస్తాను. AWB ద్వారా నేను చేస్తున్న సవరణలన్ని వికీపీడియా:AutoWikiBrowser/Typos పేజీలో ఉన్నాయి. ఆ పేజీలో కొన్ని సవరణల పక్కన వివరణలు రాసాను, గమనించగలరు. AWB వాడుకరులెవరైనా ఈ మార్పులు చెయ్యవచ్చు. ఎవరైనా ముందుకు వస్తారని భావిస్తున్నాను. __చదువరి (చర్చరచనలు) 11:20, 18 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక వ్యాసాలు సృష్టి మార్చు

అయ్యా తెలుగు వికీపీడియా లో అత్యధిక మార్పులు చేసిన జాబితాలో అగ్రగణ్యులు అయిన వారు కూడా వికీ విధి విధానాలను తెలుసుకోకపోవడం శోచనీయం. గ్రామ వ్యాసాల మొలకలను యిదివరకు ఉన్నవే మరలా సృష్టిస్తున్నారు. అనేకసార్లు వారి వాడుకరుల పేజీలో చెప్పినప్పటికి అదే ప్రహసనం జరుగుతూ ఉంది. ఎన్ని వ్యాసాలను సరిదిద్దగలం? ఎన్ని వ్యాసాలను పరిశీలించి తొలగించగలం? నిర్వాహకులకు కష్టం అవుతుంది. దయచేసి వికీపీడియాకు మంచి వ్యాసాలను అందించవలసినదిగా ప్రార్థన. ఈ మొలకలు ఎందుకు ఉపయోగపడతాయో నాకు తెలియదు. కొత్త వాడుకరులు ఏక వాక్య, ద్వివాక్య వ్యాసాలను మూలాలు, లింకులు లేకుందా వ్రాసినప్పుడు మనం వ్యాసంగా పరిగణించలేమని తొలగిస్తున్నాం. యితరులకు వికీ విధివిధానాల గూర్చి తెలియజెప్పవలసిన సీనియర్ సభ్యులమైన మనమే మొలకలను యధేచ్ఛగా వ్రాస్తే కొత్తవాడుకరులు మనను ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలం? దయచేసి మంచి వ్యాసాలను, మంచి ప్రమాణాలతో అందించాలని మనవి. ప్రస్తుతం విశేష వ్యాసాల ఆవశ్యకత ఉంది. కొద్ది రోజుల తరువాత మొదటి పేజీలో ప్రచురించడానికి కూడా మంచి వ్యాసాలు లేని పరిస్థితి రావచ్చు. ఆ దిశగా కృషి చేయాలని సభ్యులకు మనవి. -- కె.వెంకటరమణచర్చ 13:14, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

రమణగారు, ఈ రోజు చాలా మార్పులు చేసినవే అనేక సార్లు చేశాను. తదుపరి, గ్రామ వ్యాసాలు, సినిమా వ్యాసాలు, ఇంటిపేర్లు వ్యాసాలు ఇలాంటి ప్రత్యేక తరగతికి చెందినవి ఏక వాక్యంగా ఉన్నా ఎకాఎకీగా అలాంటి ఏక వాక్యవ్యాసాలు, మూలాలు లేవు, లేక ఏవో లేవు అన్న కారణంగా తొలగించలేము అని నా అభిప్రాయము. ఇలాంటివి సాధారణ తరగతికి చెందినవి కావు అని నా అభిప్రాయము.--JVRKPRASAD (చర్చ) 14:10, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
యిదివరకు గ్రామ వ్యాసాల గూర్చి వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు, సినిమా వ్యాసాల గూర్చి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సినిమాలు ప్రాజెక్టులను అనేక మంది వికీ ప్రముఖులు ప్రారంభించి వాటి అభివృద్ధికి కృషి చేయడం జరిగినది. ఆ మొలకలలో గ్రామ వ్యాసాలను ప్రస్తుతం అనేకమంది పెద్దలు సరిదిద్దుతూనే ఉన్నారు. సినిమా వ్యాసాలను కూడా సరిదిద్దుతూ ఉన్నారు. అందులో భాగంగా పవన్‌సంతోష్ గారు వికీపీడియా:వికీప్రాజెక్టు/పాత తెలుగు సినిమా వ్యాసాల విస్తరణ ఎడిటథాన్ కూడా నిర్వహించినారు. ఆయా గ్రామ వ్యాసాలను అభివృద్ధి చేయడానికి గణాంకాలను, గ్రామంలో ఉన్న విశేషాలను కూడా సేకరించేపనిలో ఉన్నారు. ఆయా వ్యాసాలు ప్రాజెక్టులో భాగంగా కొంతకాలానికి అభివృద్ధి చెందవచ్చు! కానీ ఏ ప్రాజెక్టులో భాగంగా ఈ ఇంటిపేర్ల వ్యాసాల మొలకలను వ్యాసాలుగా పరిగణించవచ్చో తెలియజేయగలరు. వికీలో ఒక వ్యాసం చేరిందంటే అది వ్యాస లక్షణాలను కలిగి ఉండాలి. ఇవి సాధారణ తరగతికి చెందినవి కావని ఎవరు నిర్ణయించారు? సముదాయమా? లేదా వ్యక్తిగతమా? తెలియజేయగలరు. ఇంటి పేర్లు లక్షల సంఖ్యలలో ఉంటాయి. మనం యిలా చేర్చితే అది తప్పుకాదని కొత్త వాడుకరులు పుంఖానుపుంఖాలుగా వారి ఇంటిపేర్లను కూడా వ్యాసాలుగా వాస్తే వారిని నిరోధించగలమా? తెలియజేయగలరు.-- కె.వెంకటరమణచర్చ 15:00, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరి అభిప్రాయము వారిది. మీ అభిప్రాయాము మీది. ఇవి సాధారణ తరగతికి చెందినవి కావని, నాది వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే అని వ్రాసాను. గ్రామాలు ఇప్పటికీ ఒక వాక్యంతో ఉన్న వ్యాసాలు అనేకం ఉన్నాయి. ఎలా తొలగిస్తాము ? నా ఆలోచనలోని దృష్టి కోణం దరిదాపుల్లో మీ ఆలోచన శైలి లేదు, కనుక మన అభిప్రాయములు ఎప్పటికీ ఒకటి కాలేవు. కనుక నా అభిప్రాయము మాత్రమే చెబుతున్నాను ఎల్లప్పుడూ, చెల్లుబాటు కావాలనే ఆలోచనే లేదు, అయినా నా మాటకు, అభిప్రాయానికి పెద్ద విలువ, ఆలోచించేవారు ఎవరున్నారు ? కనుక నా గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరము కూడా ఉండదు. నేను పెద్దగా ఆలోచించను, బుర్రలో పెట్టుకోను. ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. --JVRKPRASAD (చర్చ) 15:19, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వికీ వ్యాసాల్లో సాధారణ, ప్రత్యేక అంటూ తరగతులేమీ లేవు. __చదువరి (చర్చరచనలు) 16:10, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అవును ఏ వ్యాసాలకైనా మూలాలు ఉండాల్సిందే. కనీస సమాచారం ఉండాల్సిందే. తొలగింపు మూస ఉంచిన వారం రోజుల తర్వాత ఆ వ్యాసంలో ఎటువంటి మార్పూ కనబడకపోతే ఏ నిర్వహకుడైనా ఆ వ్యాసాన్ని తొలగించవచ్చని నేను అనుకుంటున్నాను. ఇందుకు వ్యతిరేకించేవారు ఎవరిపైనా చర్యలు తీసుకొనవచ్చు. --రవిచంద్ర (చర్చ) 16:14, 4 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Creative Commons 4.0 మార్చు

Hello! I'm writing from the Wikimedia Foundation to invite you to give your feedback on a proposed move from CC BY-SA 3.0 to a CC BY-SA 4.0 license across all Wikimedia projects. The consultation will run from October 5 to November 8, and we hope to receive a wide range of viewpoints and opinions. Please, if you are interested, take part in the discussion on Meta-Wiki.

Apologies that this message is only in English. This message can be read and translated in more languages here. Joe Sutherland (talk) 01:35, 6 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వాడుకరులకు ప్రోత్సాహం మార్చు

నేను కన్నడ వికీపీడియాలో వంద మార్పులు చేసిన తరువాత ఈ క్రింది నోటీసును ఆ వికీపీడియా వారు నాకు పంపారు.

You just made your hundredth edit; thank you very much!

ఇలాంటి సంప్రదాయం తెలుగు వికీపీడియాలో కూడా అనుసరించి 100 మార్పులు, 500 మార్పులు, 1000 మార్పులు చేసిన వారిని అభినందిస్తూ మెసేజి పెడితే కొత్త వాడుకరులకు అవి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందని నా అభిప్రాయం. ఈ దిశగా నిర్వాహకులు ఆలోచించగలరు.స్వరలాసిక (చర్చ) 17:16, 7 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

స్వరలాసికగారూ, ఇదివరకు తెవికీలో కూడా సభ్యుల దిద్దుబాట్లను బట్టి వారిని అభినందించే పద్దతి ఉండేది. కాని ఆ అభినందనలు స్వీకరించడం కాస్త విషమించి కొందరు సభ్యులు కేవలం గణాంకాలపైనే దృష్టిపెట్టి తెవికీని దారుణంగా దెబ్బతీశారు. అనవసరమార్పులు-చేర్పులు చేయడం, సునాయాస దిద్దుబాట్లతో తెవికీ నాణ్యతను పట్టించుకోకపోవడం, వారి గణాంకాలపిచ్చితో తోటి సభ్యుల సూచనలను ఖాతరు చేయకపోవడం తదితరాలు విపరీతంగా జరగడంతో ఆపై గణాంకాల ఆధారంగా అభినందనలు, పతకాలు ఇవ్వరాదని నిర్ణయించబడింది. నాణ్యమైన వ్యాసాలు తయారుచేయడం, నిర్వహణలో పాల్గొనడం, తోటి సభ్యులకు సూచనలు-సలహాలు ఇవ్వడం మొదలగు విషయాలలో మాత్రం సభ్యులకు గుర్తింపు, పతకాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో మాత్రం అంటే 50 దిద్దిబాట్లు, 100 దిద్దుబాట్లు వరకు మాత్రమే అబినందనలు తెలిపితే కొత్త సభ్యులకు ప్రోత్సాహకరంగానూ, తెవికీకి ఉపయోగకరంగానూ ఉంటుంది. ఈ విషయంపై మాత్రం ఆలోచించవచ్చు. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:31, 7 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ సంప్రదాయం తెవికీలోనూ ఉందండి. నేను ChaduvariAWB అనే కొత్త వాడుకరి పేరుతో మార్పులు చేస్తూండగా ఆ నోటిఫికేషన్లు వచ్చాయి. __చదువరి (చర్చరచనలు) 06:19, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
మార్పుల సంఖ్యను బట్టి వాడుకరులను గుర్తించజాలము. అధిక మార్పులు చేసినవారికి కనీసం చెప్పుకోదగ్గ, మొదటి పుటలో ప్రచురణార్థం ఎంపికచేయడానికి సరైన వ్యాసం లేని వారుకూడా ఉన్నారు! ఈ అధిక మార్పులు చేసిన వాళ్లలో కొందరికి వికీనియమాలు ఏ మాత్రం తెలియని వారు కూడా ఉన్నారు. ఎలా గుర్తించగలం? అందువలన గణాంకాల ఆధారంగా అభినందనలు, పతకాలు ఇవ్వరాదని నిర్ణయించబడింది. వికీ నియమాలతో మంచి వ్యాసాలను అందించేవారికి గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. ప్రారంభంలో కొత్త వాడుకరులకు 100 మార్పులు చేసే వారికి అభినందనలు తెలిపితే బాగుంటుంది.-- కె.వెంకటరమణచర్చ 10:23, 8 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఆటోమేటిగ్గా వస్తోందేమో మరి గానీ, 100 అనువాదాలు పూర్తయినప్పుడు నాకు కూడా అభినందనలు వచ్చాయి. కానీ అది మెడల్ లాంటిది కాదు. మెసేజ్ మాత్రమే.--Meena gayathri.s (చర్చ) 03:45, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

JVRK PRASAD గారి నిర్వాహకహోదా రద్దు ప్రతిపాదన పై చర్చ మార్చు

వికీపీడియా:నిర్వాహకుల_నోటీసు_బోర్డు#వికీలో JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదన లో వికీ సభ్యులందరు 16 అక్టోబరు లోగా స్పందించమని మనవి. అర్జున (చర్చ) 05:01, 9 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో నిర్వాహకులే కాదు, లాగినైన వాడుకరులందరూ పాల్గొనవచ్చు. __చదువరి (చర్చరచనలు) 08:45, 10 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, JVRKPRASAD గారి నిర్వాహక హోదా అంతు చూసేదాకా వదిలిపెట్టేటట్లు లేకున్నారు సుమా.--తెగించినోడు (చర్చ) 10:05, 12 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
‌చర్చలో పాల్గొన్న సభ్యులందరికి ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 15:33, 19 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Editing news n.3-2016 మార్చు

Sorry for the delay in delivering this newsletter!


Read this in another languageSubscription list for this multilingual newsletter

 
Did you know?
Did you know that you can easily re-arrange columns and rows in the visual editor?
 


Select a cell in the column or row that you want to move. Click the arrow at the start of that row or column to open the dropdown menu (shown). Choose either "Move before" or "Move after" to move the column, or "Move above" or "Move below" to move the row.

You can read and help translate the user guide, which has more information about how to use the visual editor.

Since the last newsletter, the VisualEditor Team has mainly worked on a new wikitext editor. They have also released some small features and the new map editing tool. Their workboard is available in Phabricator. You can find links to the list of work finished each week at mw:VisualEditor/Weekly triage meetings. Their current priorities are fixing bugs, releasing the 2017 wikitext editor as a beta feature, and improving language support.

Recent changes మార్చు

  • You can now set text as small or big.[1]
  • Invisible templates have been shown as a puzzle icon. Now, the name of the invisible template is displayed next to the puzzle icon.[2] A similar feature will display the first part of hidden HTML comments.[3]
  • Categories are displayed at the bottom of each page. If you click on the categories, the dialog for editing categories will open.[4]
  • At many wikis, you can now add maps to pages. Go to the Insert menu and choose the "Maps" item. The Discovery department is adding more features to this area, like geoshapes. You can read more at mediawiki.org.[5]
  • The "Save" button now says "Save page" when you create a page, and "Save changes" when you change an existing page.[6] In the future, the "మార్పులను ప్రచురించు" button will say "పేజీని ప్రచురించు". This will affect both the visual and wikitext editing systems. More information is available on Meta.
  • Image galleries now use a visual mode for editing. You can see thumbnails of the images, add new files, remove unwanted images, rearrange the images by dragging and dropping, and add captions for each image. Use the "Options" tab to set the gallery's display mode, image sizes, and add a title for the gallery.[7]

Future changes మార్చు

The visual editor will be offered to all editors at the remaining 10 "Phase 6" Wikipedias during the next month. The developers want to know whether typing in your language feels natural in the visual editor. Please post your comments and the language(s) that you tested at the feedback thread on mediawiki.org. This will affect several languages, including Thai, Burmese and Aramaic.

The team is working on a modern wikitext editor. The 2017 wikitext editor will look like the visual editor and be able to use the citoid service and other modern tools. This new editing system may become available as a Beta Feature on desktop devices in October 2016. You can read about this project in a general status update on the Wikimedia mailing list.

Let's work together మార్చు

  • If you aren't reading this in your preferred language, then please help us with translations! Subscribe to the Translators mailing list or contact us directly, so that we can notify you when the next issue is ready. కృతజ్ఞతలు!

Elitre (WMF) 21:34, 17 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K Newsletter September 2016 మార్చు

 

Hello,
CIS-A2K has published their newsletter for the months of September 2016. The edition includes details about these topics:

  • Gender gap study: Another 5 Years: What Have We Learned about the Wikipedia Gender Gap and What Has Been Done?
  • Program report: Wikiwomen’s Meetup at St. Agnes College Explores Potentials and Plans of Women Editors in Mangalore, Karnataka
  • Program report: A workshop to improve Telugu Wikipedia articles on Nobel laureates
  • Article: ସଫ୍ଟଓଏର ସ୍ୱାଧୀନତା ଦିବସ: ଆମ ହାତେ ଆମ କୋଡ଼ ଲେଖିବା

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 06:15, 19 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

అనాథ పేజీలు మార్చు

వాడుకరులందరికీ బహుశా తెలిసిన సంగతే.. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. 2016 అక్టోబరు 24 నాటికి తెవికీలో పన్నెండొందలకు పైగా (కచ్చితంగా చెప్పాలంటే - 1249) అనాథ పేజీలున్నాయి. అనాథ పేజీ అంటే ఆ పేజీకి వెళ్ళేందుకు వికీలో మరే ఇతర పేజీనుండీ లింకు లేదని అర్థం. ఈ పేజీల సంఖ్యను సున్నా చేసేందుకు అందరం కింది చర్యలు తీసుకోవాలని ప్రతిపాదిస్తున్నాను.

  1. ప్రతీ ఒక్కరం రోజుకు కనీసం ఐదు అనాథ పేజీలను ఆ జాబితా నుండి తీసేద్దాం. ఇందుగ్గాను, ఆ పేజీకి సంబంధించిన పేజీల్లో ఒక్కదాన్నుండైనా ఆ పేజీకి లింకు ఇస్తే చాలు.
  2. ఇకనుండి మనం సృష్టించే ఏ కొత్త పేజీ అయినా సరే, అనాథగా సృష్టించవద్దు. వేరే పేజీ నుండి ఆ పేజీకి కనీసం ఒక్క లింకైనా ఇవ్వకుండా కొత్త పేజీని అసలు సృష్టించనే వద్దు. (కొన్ని సందర్భాల్లో మనం సృష్టించబోయే వ్యాసం వికీలో ఉండదగ్గదేనా అనేదానికి ఇదొక కొలమానంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే వికీలో ఏ ఒక్క పేజీనుండీ లింకు ఇవ్వలేకపోతే ఆ పేజీ వికీలో ఉండదగ్గది కాకపోవచ్చు. గమనిక:"ఇది అన్ని సందర్భాలకూ వర్తించదు") __చదువరి (చర్చరచనలు) 16:04, 24 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
నేను వీలైనన్ని చేస్తాను. సినిమా పేజీలకు ఒక సులభమైన పద్ధతి ఏంటంటే ఆ సినిమా పేరును అందులో నటించిన నటుల పేజీలో లింకు ఇవ్వడం.--రవిచంద్ర (చర్చ) 17:59, 24 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి. __చదువరి (చర్చరచనలు) 02:31, 25 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
గమనిక:ఈ జాబితాను రెండు మూడు రోజులకొకసారి తాజాకరిస్తూంటారు, ఎప్పటికప్పుడు చెయ్యరు. అంచేత అనాథలు కానివి కూడా ఇందులో కనిపించే అవకాశం ఉంది. ఏదైనా అనాథ విషయంలో చర్య తీసుకునే ముందు, "ఇక్కడికి లింకున్న పేజీలే"మీ లేవని ఖాయం చేసుకుని, ముందుకు పోవడం మంచిది. ఉదాహరణకు నేను నిన్న కొన్ని పేజీలను తగ్గించాఅను. కానీ అవన్నీ ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయి, తదుపరి తాజాకరణ దాకా ఇవి కనిపిస్తూనే ఉంటాయి.__చదువరి (చర్చరచనలు) 02:36, 25 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
ఇవ్వాళ అనాథల సంఖ్య 981. గత ఆర్రోజుల్లో 268 పేజీలు తగ్గాయి. మళ్ళీసారి లెక్క చూసేసరికి ఇంకో మూణ్ణాలుగొందలు తగ్గించే అవకాశం కనబడుతోంది. పంజాబు వ్యాసాలే ఉన్నై మరో మూడొందల యాభై! __చదువరి (చర్చరచనలు) 13:03, 27 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా ఏషియన్ నెల మార్చు

 

వికీపీడియా ఏషియన్ నెల బహు భాషల్లో, పలు దేశాల్లో నిర్వహిస్తున్న ఎడిటథాన్. ఆసియా దేశాల వివిధ సముదాయాల మధ్య అవగాహన పెంచడం కోసం నవంబర్ 2016 నెల అంతా జరగనుంది. ఆసియా ఖండంలోని దేశాలు, ప్రదేశాలు, ప్రాంతాలకు చెందిన వివిధ అంశాల గురించి వ్యాసాలు సృష్టించడం కానీ, మెరుగుపరచడం కానీ చేయొచ్చు.

ఆసియా వికీమీడియా సముదాయాల మధ్య గల స్నేహాన్ని గుర్తిస్తూ, కనీసం ఐదు వ్యాసాలను వ్రాసిన వారికి పాల్గొన్న ఇతర దేశ సముదాయాలనుండి ఒక ప్రత్యేక వికీపీడియా పోస్టుకార్డు పంపబడుతుంది. ఈ కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న దేశాలు - చైనా, భారతదేశం, ఇండోనేషియా, జపాన్, ఫిలిప్పైన్స్, తైవాన్, థాయ్‌లాండ్.

మన భాషల్లో అన్నిటికంటే ఎక్కువ నాణ్యమైన వ్యాసాలు వ్రాసిన వ్యక్తికి "వికీపీడియా ఏషియన్ అంబాసడర్" బిరుదు ఇవ్వబడుతుంది.

మరిన్ని వివరాలకు ఈ ప్రాజెక్టు పేజీ చూడగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 08:04, 31 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

New Wikipedia Library Accounts Available Now (November 2016) మార్చు


Hello Wikimedians!

 
The TWL OWL says sign up today!

The Wikipedia Library is announcing signups today for free, full-access, accounts to published research as part of our Publisher Donation Program. You can sign up for new accounts and research materials from:

Expansions

Many other partnerships with accounts available are listed on our partners page. Sign up today!
--The Wikipedia Library Team 18:30, 1 నవంబర్ 2016 (UTC)

You can host and coordinate signups for a Wikipedia Library branch in your own language. Please contact Ocaasi (WMF).
This message was delivered via the Global Mass Message tool to The Wikipedia Library Global Delivery List.

నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pranayraj1985 మార్చు

తెవికీకి విశేష సేవలందించిన ప్రణయ్‌రాజ్ గారి నిర్వాహకహోదా కొరకు ప్రతిపాదించాను. వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Pranayraj1985 లో మీ అభిప్రాయాలను తెలుపగలరు.-- కె.వెంకటరమణచర్చ 00:41, 2 నవంబర్ 2016 (UTC)

నవంబరు నెల సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వకేట్ (తెలుగు) టాస్క్ లిస్టు మార్చు

అందరికీ నమస్కారం, సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వకేట్ (తెలుగు) బాధ్యతల్లో భాగంగా నవంబర్ 2016 నెల ఈ కింది కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక చేశాను.

  • ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌తో కార్యశాల, భవిష్యత్ ప్రతిపాదనల విషయమై చర్చించడం.
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో 18-20 నడుమ డిజిటైజేషన్ స్ప్రింట్, కార్యశాల నిర్వహణ.
  • సీఐఎస్-ఎ2కె కృషి ద్వారా చేర్చిన వికీసోర్సు పుస్తకాలను ఓసీఆర్4వికీసోర్సు ద్వారా ప్రాథమికంగా డిజిటైజ్ చేయడం.
  • తెలుగు వికీపీడియా గ్రంథాలయం గురించి సముదాయంలో చర్చించి, దానికై ప్రయత్నాలు ప్రారంభించడం.
  • సముదాయం అంగీకరించిన శైలిలోకి గ్రామ వ్యాసాల టేంప్లెట్ వ్యాసాలు మార్పుచేసి, ప్రచురించేందుకు మాధవ్ గాడ్గిల్ బృందంతో సాంకేతికంగా సమన్వయం.
  • జెండర్ గ్యాప్ తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా సంబంధిత కార్యశాలను నిర్వహించే ప్రయత్నం, తద్వారా స్త్రీలకు సంబంధించిన కొన్ని వ్యాసాలను తెలుగు వికీపీడియాలో అభివృద్ధి చేయడం
  • వికీపీడియా ఏషియన్ నెలను సమన్వయం చేయడంలో కృషి.
  • నెలవారీ సమావేశంలో సాంకేతిక ఉపకరణాలపై చిరు శిక్షణ.
  • గుంటూరు జెకెసి కళాశాలతో భాగస్వామ్యం అంశంపై ప్రాథమిక చర్చలు.
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్‌ను కలవడం, గతంలో చేసిన ప్రతిపాదనలు వివరించి చర్చలు ముందుకు తీసుకువెళ్ళడం.
  • మొలక వ్యాసాలను జాబితా వేయడం.
  • తెలుగు వికీపీడియా, వికీసోర్సుకు అవసరమైన సాంకేతిక సహకారం కోసం విద్యార్థులకు హ్యాకథాన్ నిర్వహించే ప్రతిపాదనలపై పెదతాడేపల్లిలోని ఎన్‌ఐటీ, శ్రీవాసవి ఇంజనీరింగ్ కళాశాల సంస్థతో ప్రాథమిక దశలో చర్చలు.
  • గూగుల్ అనువాద వ్యాసాల ప్రాధాన్యత గుర్తించే ప్రయత్నాన్ని మళ్ళీ ప్రతిపాదించడం, దాని కొరకు సముదాయం కావాలనుకుంటే మరిన్ని మాడల్స్ ప్రయత్నించడం.
  • తెలుగు వికీపీడియాకు ఉపకరించే తమ ఫోటో సంచయాన్ని అందజేయడానికి అంగీకరించిన వ్యక్తులతో పనిచేసి ఫోటోలు కామన్స్‌కు తీసుకురావడం.
  • పశ్చిమ గోదావరి చరిత్ర గురించి విడుదలైన పుస్తకాలకు వికీకామన్స్, వికీసోర్సుల్లోకి తీసుకువచ్చే పని ముగించడం.
  • సముదాయ సభ్యుల సహకారం, సూచనలు, ఆమోదం మేరకు పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాల్ నిర్వహణ.

ఈ కార్యక్రమాల విషయమై అవసరం మేరకు ముందస్తుగా సముదాయంతో చర్చించడం, సలహా సూచనలు స్వీకరించడం జరుగుతుంది. చర్చల ఫలితాలు, కార్యక్రమ సారాంశాలు తెవికీపీడియన్లతో ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతూంటుంది. అలానే చర్చల ఫలితంగా ప్రగతి జరిగి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సివస్తే ఈ టాస్క్ లిస్టులోకి అవి చేరుతూంటాయి. వీటికి మించి మరేమైనా చేయమని సముదాయ సభ్యులు అభిలషిస్తూంటే ఇక్కడ రాయవలసిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:46, 2 నవంబర్ 2016 (UTC)

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో కార్యశాల ఏర్పాటుకై ప్రయత్నాలు మార్చు

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం తెలుగు డిపార్ట్మెంట్ హెచ్.వో.డి. ప్రొఫెసర్ తలారి వాసుతోనూ, అనంతరం ప్రిన్సిపాల్ తోనూ ప్రారంభించిన చర్చల్లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు తెలుగు వికీపీడియాలో రాయడం గురించి ఓ కార్యశాల నిర్వహించాలన్న ప్రతిపాదన జరిగింది. ఆసక్తి కలిగిన విద్యార్థులకు రెండు రోజుల పాటు తెలుగు వికీపీడియాలో మౌలిక, ప్రాథమిక అంశాలను వివరిస్తూ, వారి ఆసక్తి, అధ్యయనం ఉన్న అంశాల్లో వ్యాసాలు రాసేలా ప్రోత్సహిస్తూ కార్యశాల సాగాలని ప్రాథమికంగా ప్రతిపాదన. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్లో తెలుగు, ఆంగ్ల భాషలు అభ్యసించే పీజీ విద్యార్థులను జట్లుగా విడదీసి వారిలో తెలుగు విద్యార్థులు ఆంగ్ల విద్యార్థుల నుంచి ఆంగ్ల రచయితలు, కవుల వివరాలు తెలుసుకుని ఎంచుకున్న ఆంగ్ల కవి గురించి తెలుగు వికీపీడియాలో రాయడం, ఆంగ్ల భాషా విద్యార్థులు తెలుగు విద్యార్థి నుంచి తెలుగు కవి రచయితల వివరాలు తెలుసుకుని ఒక తెలుగు కవి గురించి ఆంగ్ల వికీలో వ్యాసం అభివృద్ధి చేయడడాన్ని ప్రాజెక్టు పనిగా ఇచ్చే అంశాన్ని ప్రాచార్యులు ప్రతిపాదించారు. దీనికి సమాయత్తం కావడానికి విద్యార్థులకు జనవరిలో జరిగే కార్యశాల ఉపయోగపడుతుందని వారు భావించారు. విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం అంశంపై అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవలసిందిగా కోరుతూ, వచ్చేవారం మరింత విస్తృత స్థాయిలో నిర్ణయాత్మకంగా కళాశాల ఉపకులపతి (విసి)తో జరిగే చర్చల్లో ఆసక్తి కల సముదాయ సభ్యులు పాల్గొనవచ్చని ఆహ్వానిస్తున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:28, 6 నవంబర్ 2016 (UTC)

పవన్ సంతోష్ గారు మంచి ప్రయత్నం. రాజమండ్రి పరిసరప్రాంతాలలో వికీ వ్యాప్తికి ఇలాంటి ప్రయత్నాలు అవసరం. దీనికి నేనూ నాకు వీలైనంత సహకారాన్ని అందించగలను..--Viswanadh (చర్చ) 04:59, 10 నవంబర్ 2016 (UTC)
మంచి కార్యక్రమం పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు. రాజమండ్రి పరిసరప్రాంతాలలో వికీ వ్యాప్తికి ఇలాంటి ప్రయత్నాలు అవసరం. నేను కూడా నా వీలును బట్టి సహకరించగలను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:23, 10 నవంబర్ 2016 (UTC)

సమయం తెలియజేయండి నేను పాల్గొనగలను --Nrgullapalli (చర్చ) 00:43, 11 నవంబర్ 2016 (UTC)

విశ్వనాథ్, ప్రణయ్ రాజ్, గుళ్ళపల్లి గార్లకు ధన్యవాదాలు. విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ తో జరుగాల్సిన ఈ సమావేశం విశ్వవిద్యాలయ అంతర్గత వ్యవహారాలపై చర్చల కారణంగా వారు బిజీ అవడంతో వాయిదా పడింది, తేదీ ఖరారు కాలేదు. ఈ నెల చివరి రెండు వారాల్లో ఉండవచ్చని భావిస్తున్నాం. తేదీ ఖరారు కాగానే ముందస్తుగా తెలియపరచగలం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:11, 11 నవంబర్ 2016 (UTC)

ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీసోర్సు డిజిటైజేషన్ స్ప్రింట్, వికీపీడియా కార్యశాల (నవంబర్ 2016) మార్చు

అందరికీ నమస్కారం,
విజయవాడ ఆంధ్ర లొయొలా కళాశాలలో తెలుగు భాష అభ్యసించే విద్యార్థులకు, ఆసక్తికల అధ్యాపకులకు వికీసోర్సులో పుస్తకాలను డిజిటైజేషన్, ప్రూఫ్ రీడింగ్ అంశాలపై శిక్షణ ఇచ్చి, వికీసోర్సులో చేర్చిన గ్రంథాలను ప్రూఫ్ రీడ్ చేయించడానికి, వికీపీడియాలో విద్యార్థులకు ఆసక్తికలిగిన అంశాలపై మూలాలను ఇస్తూ చక్కని వ్యాసాలు తయారుచేయించడంలో శిక్షణ ఇవ్వడానికి కార్యశాల నిర్వహించనున్నాం. నవంబరు 18-20 తేదీల్లో ఈ కార్యక్రమం ఆంధ్ర లొయోలా కళాశాల వేదికగా జరుగుతుంది. ఈ కార్యక్రమం విషయమై సముదాయ సభ్యులు సూచనలు అందజేయాల్సిందిగా, ఆసక్తి కలవారు పాల్గొనేందుకు ముందస్తుగా ఇక్కడ తెలియపరచాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:40, 8 నవంబర్ 2016 (UTC)

మంచి కార్యక్రమం పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) గారు. గత కొన్నిరోజులుగా ఆఫ్లైన్ వికీపీడియా కార్యక్రమాలు సరిగా జరగడంలేదు. ఈ కార్యక్రమంతోనైనా, అవి మున్ముందు ఇంకా చురుకుగా సాగాలని కోరుకుంటూ, దీనికి వీలైనంతగా నా సహకారం అందిస్తాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:29, 10 నవంబర్ 2016 (UTC)

సమయం తెలివజేస్తే నేను పాల్గొనగలను --Nrgullapalli (చర్చ) 00:41, 11 నవంబర్ 2016 (UTC)

గుళ్ళపల్లి గారూ, ప్రణయ్ రాజ్ గారూ మీ సహకారానికి ధన్యవాదాలు. 18 తేదీ ఉదయం నుంచి 20 తేదీ సాయంత్రం వరకూ ఈ కార్యక్రమం జరుగుతుంది. మీ సహకారంతో కార్యక్రమాన్ని మరింత ఫలప్రదం చేయవచ్చని భావిస్తున్నాను. ప్రయాణ, వసతి వంటి ఏర్పాట్ల విషయమై మిమ్మల్ని సంప్రదిస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 04:15, 11 నవంబర్ 2016 (UTC)

రాజమండ్రిలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలులో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి తరపుర నేను పాల్గొనవలసి రావడంవల్ల ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీసోర్సు డిజిటైజేషన్ స్ప్రింట్, వికీపీడియా కార్యశాలకు హాజరుకాలేకపోతున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:56, 17 నవంబర్ 2016 (UTC)
  • ఆంధ్ర లొయోలా కళాశాలలో వికీసోర్సు కార్యశాల కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి సహకరించిన ఆంధ్ర లొయొలా కళాశాల యాజమాన్యానికి, హాజరైన Nrgullapalli గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:59, 22 నవంబర్ 2016 (UTC)
ఈ కార్యశాలకు అనుబంధ కార్యక్రమం నవంబర్ 25, 26 తేదీల్లో జరుగుతుంది. నేర్చుకున్న విద్యార్థుల్లో చాలామంది ఈ వారం వారి క్లాసులు అయిపోయాకా స్వంతంగా కళాశాలలోని ల్యాబ్ వినియోగించుకుని వికీసోర్సులో ప్రూఫ్ రీడింగ్ చేయడం విశేషం. ఐతే వారికి వికీసోర్సులో ప్రూఫ్ రీడింగ్ కు తర్వాతి దశను నేర్పించేందుకు, వికీపీడియా మహిళా ఏషియన్ నెల ఎడిటథాన్ పరిచయం చేసి కొన్ని వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ఈ రెండురోజుల కార్యక్రమం ఉపయోగపడనుంది. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:23, 24 నవంబర్ 2016 (UTC)

రాజమండ్రి పుస్తక సంబరాల్లో తెవికీ స్టాల్ ఏర్పాటుపై చర్చ మార్చు

అందరికీ నమస్కారం,
ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ అసోసియేషన్, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా 19 నుంచి 27 నవంబర్ 2016 వరకూ రాజమండ్రిలో పుస్తక సంబరాలు నిర్వహిస్తోంది. పుస్తక సంబరాల్లో తెవికీ స్టాల్ ఏర్పాటుచేసి నిర్వహించడానికి ఇప్పటికే తెవికీ సముదాయ సభ్యులు కొందరు ఆసక్తి చూపించడంతో పుస్తక సంబరాల్లో స్టాల్ నిర్వహణ విషయమై ఏయే రోజులు ఎవరెవరు సమయం కేటాయించగలరన్న అంశం ఇక్కడ తెలియజేయగలరు. 19 నుంచి 27 తేదీ వరకూ ఉన్న 9 రోజుల్లో ఏయే రోజులు ఆసక్తి కలిగిన సముదాయ సభ్యులకు అనుకూలంగా ఉంటుందో తెలపగలరు. ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయబడును. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:13, 10 నవంబర్ 2016 (UTC)

నేను పాల్గొని సహకరించగలను ముందుగా తెలియపర్చండి ఏరోజుల్లో కాళీ వుంటే ఆసమయంలో నిర్వహించగలను. --Nrgullapalli (చర్చ) 00:48, 11 నవంబర్ 2016 (UTC)

తెలుగు వికీపీడియా కోసం ఉచితంగా స్టాల్ ఇచ్చే విషయమై నవ్యాంధ్ర పుస్తక సంబరాలు సహ నిర్వాహకులైన ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈవో టి.విష్ణువర్ధన్ గారిని సంప్రదించాం. నవ్యాంధ్ర పుస్తక సంబరాలు నిర్వహణలో స్టాల్స్ విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ(విబిఎఫ్ఎస్) వారి పరిధిలోని అంశమని, వారి పాలసీ ప్రకారం ప్రతి స్టాల్ ఏర్పాటుకు స్టాల్ నిర్వాహకులు తప్పక చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. అయితే సహ-నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నందున తాము చేస్తున్న పనులను ప్రదర్శించేందుకు కొన్ని స్టాల్స్ కేటాయించారని, ఎన్టీఆర్ ట్రస్టు తరఫు నుంచి ఒక స్టాల్ తెలుగు వికీపీడియా లేక వికీమీడియా ప్రాజెక్టుల అవుట్ రీచ్ కోసం స్పాన్సర్ చేయడానికి సంతోషంగా అంగీకరిస్తామని, తమ సిబ్బంది స్టాల్ ఏర్పాటులో సహకరిస్తారని తెలిపారు. ఈ అంశంపై తెలుగు వికీపీడియన్లు తమ అభిప్రాయాన్ని తెలియజేమని ఆహ్వానిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 16:22, 16 నవంబర్ 2016 (UTC)
నవ్యాంధ్ర పుస్తక సంబరాలులో ఎన్టీఆర్ ట్రస్ట్ వారు ఏర్పాటుచేసిన... నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల సమాచార కేంద్రం, ఉచిత వైద్య కేంద్రం మరియు రక్తదాన కేంద్రాలకు విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ(విబిఎఫ్ఎస్) వారు కొన్ని స్టాల్స్ ను కేటాయించారు. గతంలో నేను తెవికీ స్టాల్ గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రతినిధిని అడిగినప్పుడు ట్రస్ట్ కు కేటాయించిన స్టాల్ లో తెవికీ స్టాల్ ఏర్పాటుచేసుకోమని చెప్పారు. కనుక, దీనిని ఉపయోగించుకోవడం మంచిదని నా అభిప్రాయం.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 05:28, 17 నవంబర్ 2016 (UTC)
కార్యక్రమమం నిర్వహిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి కార్యక్రమాలకు రాజమహేంద్ర వాసులు ఆదరించగలరు.వికీపీడియా అభి వృద్దికి మంచి స్పందన వస్తుందనుటకు సందేహం లేదు.--Nrgullapalli (చర్చ) 12:55, 18 నవంబర్ 2016 (UTC)

Password reset మార్చు

I apologise that this message is in English. ⧼Centralnotice-shared-help-translate⧽

We are having a problem with attackers taking over wiki accounts with privileged user rights (for example, admins, bureaucrats, oversighters, checkusers). It appears that this may be because of weak or reused passwords.

Community members are working along with members of multiple teams at the Wikimedia Foundation to address this issue.

In the meantime, we ask that everyone takes a look at the passwords they have chosen for their wiki accounts. If you know that you've chosen a weak password, or if you've chosen a password that you are using somewhere else, please change those passwords.

Select strong passwords – eight or more characters long, and containing letters, numbers, and punctuation. Joe Sutherland (చర్చ) / MediaWiki message delivery (చర్చ) 23:59, 13 నవంబర్ 2016 (UTC)

Adding to the above section (Password reset) మార్చు

Please accept my apologies - that first line should read "Help with translations!". Joe Sutherland (WMF) (talk) / MediaWiki message delivery (చర్చ) 00:11, 14 నవంబర్ 2016 (UTC)

గుంటూరు జెకెసి కళాశాలతో భాగస్వామ్య ప్రతిపాదన మార్చు

అందరికీ నమస్కారం,
గుంటూరుకు చెందిన విద్యాసంస్థ జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి (జెకెసి) కళాశాల ప్రిన్సిపాల్ తో 14 నవంబర్ 2016న కళాశాల విద్యార్థులకు తెలుగు వికీపీడియా గురించి అవగాహన కల్పించి, వారిలో ఆసక్తి కలిగిన విద్యార్థులకు వికీపీడియాలో రాయడంపై శిక్షణను ఇచ్చే అంశంపై చర్చ జరిగింది. చర్చలో కళాశాలకు చెందిన సీనియర్ సిబ్బంది రామమోహనరావు, భవాని పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల విద్యార్థులు అందరికీ తెలుగు వికీపీడియా గురించి అవగాహన కల్పించేలా గెస్ట్ లెక్చర్ ఇవ్వమని, ఆపైన ఆసక్తి కల విద్యార్థులను తీసుకుని వారికి శిక్షణ ఇచ్చేందుకు కార్యశాల నిర్వహించడం వల్ల ఆసక్తి కల విద్యార్థులు తెలుగు వికీపీడియాలో కృషిచేయగలుగుతారని పేర్కొన్నారు. నవంబర్ ఆఖరి వారంలో అవగాహన సదస్సు, తర్వాతి వారంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భాగస్వామ్యం గురించి, కార్యక్రమాల గురించి తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:13, 15 నవంబర్ 2016 (UTC)

విద్యర్ధులకు తెలుగు వికీపీడియా గురించి అవగాహన కల్పించిటం వారికి ఆసక్తి కలిగించే శిక్షణ వల్ల ఎంతో మంది విద్యర్ధులు పాల్గొని వ్యాసాల అభివృద్దికి తోడ్పడగలరు --Nrgullapalli (చర్చ) 00:42, 16 నవంబర్ 2016 (UTC)

మంచి కార్యక్రమం.. గుంటూరులో ఇది అవసరం కూడా..-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 07:57, 17 నవంబర్ 2016 (UTC)
కార్యశాల నిర్వహించడానికి ముందుగా విద్యార్థులకు వికీపీడియాపై అవగాహన కల్పించేందుకు, తద్వారా వారి ఆసక్తిని గుర్తించి కార్యశాలలో పాల్గొనేలా చేసేందుకు గాను తెలుగు వికీపీడియా అవగాహన సదస్సు నిర్వహించామని కళాశాల వారు కోరారు. కనుక ఈ రోజు కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాం. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 08:31, 2 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతితో చర్చ మార్చు

ఈరోజు (15 నవంబర్ 2016) మధ్యాహ్నం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎస్.వి.సత్యనారాయణను కలిశాం. ఈ సమావేశంలో ప్రణయ్ రాజ్ కూడా పాల్గొన్నారు. 2014 డిసెంబరులో తెలుగు వికీపీడియా కార్యక్రమానికి హాజరైన ఎస్వీ సత్యనారాయణకు ఆయన పదవీ స్వీకారానికి పూర్వం తెలుగు విశ్వవిద్యాలయంతో మనం సాగించిన చర్చల గురించి వివరించాము.

  1. రిఫరెన్సు పరంగానూ, సాహిత్యపరంగానూ మంచి విలువ ఉండి కూడా పునర్ముద్రణకు నోచుకోని, అమ్మకాలు లేని పలు పుస్తకాలు విశ్వవిద్యాలయం కాపీహక్కుల పరిధిలో ఉన్నాయని అటువంటి పుస్తకాలను సీసీ-బై-ఎస్ఎ లైసెన్సులోకి పునర్విడుదల చేసి, తెలుగు వికీసోర్సులో డిజిటైజ్ చేయడం. విశ్వవిద్యాలయం పుస్తకాల ప్రచురణ ద్వారా ఆశించే పరమ ప్రయోజనం అయిన ఆసక్తి కలిగినవారికి, సంబంధిత రంగంలో కృషిచేసేవారికి పుస్తకం అందుబాటులోకి రావడం నెరవేరడమే కాక ప్రస్తుతం ఉన్నత విద్యారంగంలో పాలసీ మేకర్లు ఆశిస్తున్న డిజిటైజేషన్ కూడా జరుగుతుందని తెలిపాము.
  2. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు, అధ్యాపకులకు తెలుగు వికీపీడియా, వికీసోర్సుల్లో కృషిచేసేందుకు తగ్గ శిక్షణకు కార్యశాల నిర్వహించడం. దీని ద్వారా అందరికీ తెలుగులో విజ్ఞానం అందుబాటులోకి రావడం అన్న లక్ష్యానికి కృషిచేసినవారు అవడంతో పాటు పాల్గొన్నవారికి రచన, సాంకేతికత వంటి అంశాలు నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని వివరించాము.

వ్రాతపూర్వకంగా ఈ రెండు ప్రతిపాదనలు అందజేయమని ఉపకులపతి సూచించారు. ఈ నేపథ్యంలో తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం అంశంపై సూచనలు అందించమని కోరుతున్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:26, 15 నవంబర్ 2016 (UTC)

ఈకార్యక్రమం తెలుగు వికి విస్తరణకు తోడ్పడుతుంది అలాగే విశ్వవిద్యాలయంలోని విద్యర్ధులకు అవగాహన కల్పించడం తో వ్యాసాల విస్థరణ ఎక్కువగా జరిగే అవకాశం కలుగుతుంది. --Nrgullapalli (చర్చ) 00:38, 16 నవంబర్ 2016 (UTC)

హైదరాబాద్ లో వికీపీడియా ఏషియన్ నెల (ఆఫ్లైన్) ఎడిటథాన్ ప్రతిపాదన మార్చు

అందరికీ నమస్కారం,
వికీపీడియా ఏషియన్ నెల వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు ఆఫ్ లైన్ ఎడిటథాన్ పలు భారతీయ నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నవంబర్ 26 శనివారం నాడు నిర్వహించుకోవడంపై ప్రతిపాదిస్తున్నాను. సభ్యులు హాజరుకాదలిస్తే కార్యక్రమం నిర్వహించవచ్చు. ఈ ప్రతిపాదిత కార్యక్రమం పట్ల ఆసక్తి ఉన్నవారు, హాజరు కాగలిగినవారు, హాజరుకావడానికి కుదరని వారు, లేదా మరే ఇతర సూచనలు అయినా చేసేవారు ఇక్కడ తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 13:32, 16 నవంబర్ 2016 (UTC)

ఎడిటథాన్ ద్వారా తెవికీ సభ్యులకు వ్యాసాలు రాయడంలో ఉత్సాహం ఏర్పడుతుందని నా అభిప్రాయం. అయితే రాజమండ్రిలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలులో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి తరపుర నేను పాల్గొనవలసి రావడంవల్ల ఈ ఎడిటథాన్ లో పాల్గొనలేకపోతున్నాను.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 08:00, 17 నవంబర్ 2016 (UTC)

అన్ లైన్ లో నవంబర్ నెలవారి సమావేశం మార్చు

అందరికి నమస్కారం... నవంబర్ నెలలో తెలుగు వికీపీడియా నెలవారి సమావేశాన్ని గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించాలని నేను, పవన్ సంతోష్ అనుకున్నాము. రాజమండ్రిలో జరుగుతున్న నవ్యాంధ్ర పుస్తక సంబరాలులో ఎన్టీఆర్ ట్రస్ట్ వారి తరపుర నేను పాల్గొనవలసి రావడంవల్ల, గోల్డెన్ త్రెషోల్డ్ లో నిర్వహించడానికి అస్కారం లేకుండా అయింది. మనకున్న ఇతర ప్రత్యామ్నాయాల్ని వినియోగించుకోడానికి, గతంలో సభ్యులు దూరమని వ్యక్తం చేసిన అభిప్రాయాలవల్ల సంశయించాము. ఈ నేపథ్యంలో రాజశేఖర్ గారి ల్యాబ్ లో నిర్వహించేందుకు ప్రయత్నించి చూశాము. అయితే, రాజశేఖర్ గారు తన వ్యక్తిగత పనులలో బిజీగా ఉండడంతో అదికూడా సాధ్యపడుటలేదు. దీనిపై అలోచించిన మీదట తాత్కలికంగా ఐ.ఆర్.సి. గాని, గూగూల్ హంగౌంట్స్ లోగాని సమావేశం నిర్వహించుకోవడం మంచిదేమోనని అభిప్రాయ పడుతున్నాం. వచ్చే నెల రెండో ఆదివారం యధావిదిగా సమావేశం నిర్హంచుకోవచ్చు. ఈ నెల అన్ లైన్ ప్రత్యామ్నాయాల ద్వారా నిర్వహించడం గురించి మీ అభిప్రాయం చెబితే ముదుకువెలుదాం...-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 15:00, 17 నవంబర్ 2016 (UTC)

CIS-A2K Newsletter October 2016 మార్చు

 

Hello,
CIS-A2K has published their newsletter for the months of October 2016. The edition includes details about these topics:

  • Blog post Wikipedia Asian Month — 2016 iteration starts on 1 November — a revisit
  • Program report: Impact Report form for the Annual Program Grant
  • Program report: Kannada Wikipedia Education Program at Christ university: Work so far
  • Article: What Indian Language Wikipedias can do for Greater Open Access in India
  • Article: What Indian Language Wikipedias can do for Greater Open Access in India
  • . . . and more

Please read the complete newsletter here. --MediaWiki message delivery (చర్చ) 05:18, 21 నవంబర్ 2016 (UTC)
If you want to subscribe/unsubscribe this newsletter, click here.

అక్టోబర్ నెల మొలకల జాబితా మార్చు

అందరికీ నమస్కారం,
అక్టోబర్ నెల మొలకల జాబితా ఇక్కడ చేర్చాను. దయచేసి తెవికీపీడియన్లు గమనించవలసిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 10:58, 22 నవంబర్ 2016 (UTC)

ఇంతకు ముందు గమనించాను. ఇందులో నేను సృష్టించిన కొన్ని అయోమయ నివృత్తి పేజీలు కూడా ఉన్నాయి. నేను సృష్టించిన మొలకలను ఇదివరకే రెండింటిని విస్తరించాను. మిగతా వాటిని కూడా అలాగే విస్తరిస్తాను.--రవిచంద్ర (చర్చ) 11:14, 22 నవంబర్ 2016 (UTC)
రవిచంద్ర గారూ ప్రయోగశాలలో ప్రచురించినప్పుడు మీరన్నట్టు అయోమయ నివృత్తి పేజీలు ఉన్నా, తర్వాత తొలగించి లైవ్ చేశాను. ఇప్పటికీ ఉన్నాయోమో మీ వాటిలో చూసి చెప్తారా, మరో సారి చెక్ చేస్తాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:32, 22 నవంబర్ 2016 (UTC)
ఇప్పుడు కనిపించడం లేదు. పోయినట్లున్నాయి.--రవిచంద్ర (చర్చ) 12:37, 22 నవంబర్ 2016 (UTC)
తీసేశాను :-) --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 15:21, 22 నవంబర్ 2016 (UTC)

తెలుగు వికీపీడియా దినోత్సవం - మిని మీడియా వికీ ట్రైనర్, మిని టిటిటి నిర్వహణ మార్చు

అందరికీ నమస్కారం,
డిసెంబరు రెండవ ఆదివారం నాడు తెలుగు వికీపీడియా దినోత్సవంగా గత సంవత్సరం నుంచి నిర్మాణాత్మకమైన చక్కని కార్యక్రమాలతో నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో నిర్వహించ తలపెట్టి వివిధ కారణాలుగా వాయిదా వేసుకున్న మిని మీడియా వికీ ట్రైనర్, మిని ట్రైన్-ద-ట్రైనర్ కార్యక్రమాలు డిసెంబరు 2016 రెండవ శనివారం, ఆదివారం (డిసెంబర్ 10, 11) నాడు నిర్వహించుకుందాం. అవి కాక రెండవ రోజు సాయంత్రం పత్రికల ప్రతినిధులను ఆహ్వానించి తెలుగు వికీపీడియా, వికీమీడియా విజయాలు, సాధించాల్సినవి ఒక ఉద్యమంగా దీని విశిష్టత వంటివి వివరించే కార్యక్రమమూ నిర్వహిద్దాం. మినీ మీడియా వికీ ట్రైనర్ కార్యక్రమం ద్వారా తెలుగు వికీపీడియాన్లకు అవసరమైన సాంకేతిక అంశాలు నేర్పించవచ్చు, అలానే మిని టిటిటి ద్వారా పలు శిక్షకులకు అవసరమైన నాయకత్వ లక్షణాలు వంటివి నేర్పించేందుకు ఉపకరిస్తుంది. ఈ కార్యక్రమాలు తెలుగు వికీపీడియా సముదాయాన్ని బలపరిచి, తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల అభివృద్ధికి నిర్మాణాత్మకంగా ఉపకరిస్తుందని భావిస్తున్నాం. దీనిపై సముదాయ సభ్యులు తమ అభిప్రాయాలు తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 09:51, 22 నవంబర్ 2016 (UTC)

వికీ సభ్యులకు సదవకాశం. ఈకార్యక్రమం నిర్వహించవలసిన అవసరం చాలావుంది --Nrgullapalli (చర్చ) 10:28, 26 నవంబర్ 2016 (UTC)

తెవికీ పుష్కరోత్సవాలు ఎలాగూ జరిగేటట్లు లేదు. కనీసం ఇదయినా నిర్వహించి మన ఉనికిని నిలుపుకొనే ప్రయత్నం చేయడం బాగుంటుంది. సభ్యులు ఆలోచించి కార్యక్రమాల్ని రూపొందించి వికీ సభ్యులలో నూతనోత్సాహాన్ని నింపవచ్చును.--Rajasekhar1961 (చర్చ) 12:43, 26 నవంబర్ 2016 (UTC)

ముందస్తు నమోదు, నేర్చుకోదలచిన అంశాల సర్వే మార్చు

కార్యక్రమంలో పాల్గొనదలిచిన సభ్యులంతా కార్యక్రమ పేజీలో ముందస్తుగా నమోదుచేసుకుని, మీరు కార్యక్రమంలో ప్రత్యేకించి నేర్చుకోదలచిన అంశాలను సంతకం చేసిన దగ్గరే రాయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 14:44, 4 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

Help test offline Wikipedia మార్చు

Hello! The Reading team at the Foundation is looking to support readers who want to take articles offline to read and share later on their phones - a use case we learned about from deep research earlier this year. We’ve built a few prototypes and are looking for people who would be interested in testing them. If you’d like to learn more and give us feedback, check out the page on Meta! Joe Sutherland (WMF) (talk) 20:08, 29 నవంబర్ 2016 (UTC)

వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ డిసెంబర్ 11, 2016 సమావేశం మార్చు

అందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ డిసెంబర్ 11, 2016 సమావేశం… డిసెంబర్ 11, 2016 (రెండవ ఆదివారం) నాడు మధ్యాహ్నం 4 గం.లకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.

చర్చించాల్సిన అంశాలు మార్చు

  • తెలుగు వికీపీడియా దినోత్సవం జరుపుకోవడం

సభ్యులు హాజరుకాగలరు.

వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ డిసెంబర్ 11, 2016 సమావేశం లో చూడగలరు. Pranayraj Vangari (Talk2Me|Contribs) 17:40, 6 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తన్వీర్ హాసన్ హైదరాబాదు, విజయవాడ, గుంటూరు పర్యటన మార్చు

అందరికీ నమస్కారం.. సీఐఎస్ ఏ2కే ఉద్యోగి తన్వీర్ హాసన్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు నగరాలకు ప్రస్తుత, నూతన భాగస్వాములతో మాట్లాడేందుకు 12 నుంచి 15 వరకు పర్యటిస్తున్నారు. భాగస్వామ్యాల విషయంలో పురోగతిని కానీ, నూతన భాగస్వామ్య ప్రతిపాదనలు ఏర్పడుతున్నా కానీ వాటి గురించి విడివిడిగా ఆన్ వికీ తెలియపరిచి చర్చకు పెట్టగలమని తెలియజేస్తున్నాను. ధన్యవాదాలతో ..పవన్ సంతోష్ (చర్చ) 08:44, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీలో రాయాల్సిన వ్యాసాలు మార్చు

తెవికిలో ఇప్పటికే చాలా వ్యాసాలున్నాయి కదా! ఇంకా ఏం రాయాలి అని చాలా మందికి సందేహం ఉండవచ్చు. దీనికోసమే వెతుకుతుంటే ఈ ఉపకరణం కనిపించింది. ఇది మన తెవికీలో ఎక్కువ ఎర్ర లింకులున్న వ్యాసాలు చూపిస్తుంది. అంటే అన్ని వ్యాసాల్లోని ఎర్రలింకులు సేకరించి వాటి సంఖ్యల అవరోహణా క్రమంలో చూపిస్తుందన్న మాట. ఉదాహరణకు శ్వేతాశ్వతరోపనిషత్తు అనే వ్యాసం తీసుకుందాం. ఈ వ్యాసానికి 199 వ్యాసాల నుంచి లింకు ఉంది. కానీ దీనికి మన తెవికీలో వ్యాసం లేదు. ప్రస్తుతం సుమారు 8000కి పైగా వ్యాసాలు వాటిని సృష్టించే వారికోసం ఎదురు చూస్తున్నాయి. ఈ జాబితా నుంచి వ్యాసం సృష్టిస్తే అది ఖచ్చితంగా అనాథ వ్యాసం కాదు అని ఇప్పటికే మీకు అర్థం అయి ఉంటుంది. అంతే కాదు ఈ వ్యాసాలు సృష్టించడం వల్ల మనం ఎర్ర లింకులు తగ్గించిన వారమవుతాం కూడా.--రవిచంద్ర (చర్చ) 06:00, 7 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా బాగుంది సర్. అన్ని వ్యాసాల్లోని ఎర్రలింకులు సేకరించి (కేటగిరీ ప్రకారంగా) ఒక లిస్టు గా చూపించే ఇలాంటి టూల్ కొత్త, పాత వాళ్లకే కాదు, తెలుగు వికిలో వ్యాసాలు రాయాలనుకొని ఏ వ్యాసం వుందో, ఏ వ్యాసం లేదో వెతుక్కొనే ప్రతీ ఒక్కరికి చాలా చక్కగా ఉపయుక్తంగా వుంటుంది. చాలా మంచి టూల్ పరిచయం చేసారు.కృతజ్ఞతలు. --Vmakumar (చర్చ) 23:12, 7 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

టూల్ బాగుంది. ఎర్రలింకులు ఉన్న వ్యాసాలను వికీనియమాలననుసరించి మంచి వ్యాసాలుగా తయారుచేస్తే మంచిదే. దీనికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలి.-- కె.వెంకటరమణచర్చ 14:02, 9 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారూ, ఇందులో ఆంగ్ల లింకులు కూడా కనిపిస్తున్నాయి. వాటిని తీసివేసి కేవలం తెలుగు లింకులు మాత్రమే చూసే వీలున్నదా? తెలుపగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 04:19, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సుల్తాన్ ఖాదర్ గారూ అవునండీ, నేను కూడా తరువాత గమనించాను. ప్రస్తుతానికైతే ఆంగ్ల వ్యాసాలను ఫిల్టర్ చేయడానికి ఆ టూల్ లో మార్గమేమీ కనిపించలేదు. రహ్మాన్ కి ఏమైనా తెలిసుండచ్చేమో.--రవిచంద్ర (చర్చ) 04:47, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మొలక వ్యాసాల సృష్టి మార్చు

వికీపీడియాలో కొత్తవాడుకరి తప్పులు చేస్తే సరియైన మార్గనిర్దేశనం చేయవచ్చు. వికీనియమాలు తెలియకపోతే చెప్పవచ్చు. సరియైన వికీపీడియనుగా తయారుచేయవచ్చు. కానీ మార్పుల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న వ్యక్తులు వికీనియమాలు తెలియకుండా విపరీతంగా మొలకల సృష్టి చేయడం బాధాకరం. వారు అనుభవంతో ఎన్నో విశేష వ్యాసాలు తయారుచేయవచ్చు. కానీ ఒక వ్యాసం యిదివరకు వికీలో ఉన్నదా? లేదా? అనే నిర్థారణ లేకుండా విపరీతంగా మొలకలను సీనియర్ సభ్యులు కొందరు సృష్టిస్తున్నారు. ఎన్నిసార్లు చర్చాపేజీలలో చెప్పినా, రచ్చబండలో సూచనలు తెలియజేసినా వారి వైఖరి మారడంలేదు. ఎన్ని వ్యాసాలను నిర్వాహకులు పరిశీలించగలరు? కొత్త వాడుకరులు, అనామక వాడుకరులు చేసిన మార్పులను పరిశీలించాలి. కానీ అనుభవమున్న వాడుకరుల నియమాలకు విరుద్ధంగా మార్పులు చేస్తే ఎన్నని పరిశీలించగలము? రాయాలంటే ఎన్నో వ్యాసాలు ఉన్నాయి. కానీ ఏక వాక్య వ్యాసాలను, యిదివరకే ఉన్న వ్యాసాలను దయచేసి రాయవద్దని మనవి.-- కె.వెంకటరమణచర్చ 14:02, 9 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారు ఈ విషయమై ఇప్పటికి చాలాసార్లు చెప్పారు. నెలవారీగా జరిగే సమావేశాల్లో ఇలాంటి అంశాలను చేర్చి, ప్రతీసారీ చెబుతూ ఉంటే ఫలితమేమైనా ఉంటుందేమో. ముఖతః చెబితే నేర్చుకోగలగడం తేలిగ్గా ఉంటుందేమోనని నా భావన. __చదువరి (చర్చరచనలు) 09:47, 10 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
అవును కె.వెంకటరమణ గారు. మొలక వ్యాసాలు అనేవి తెవికీకి సమస్యే. మొలక వ్యాసాలను, వాటిని రాసిన రాసిన వారి పేర్లను ఇక్కడ ప్రస్తావిస్తే, అది వారికి తెలిసి, వాటిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది. వాటిని తెలియజేయగలరు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 18:48, 16 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

డిసెంబరు నెల సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వకేట్ (తెలుగు) టాస్క్ లిస్టు మార్చు

అందరికీ నమస్కారం, సీఐఎస్-ఎ2కె కమ్యూనిటీ అడ్వకేట్ (తెలుగు) బాధ్యతల్లో భాగంగా నవంబర్ 2016 నెల ఈ కింది కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళిక చేశాను.

  • తెలుగు వికీపీడియా గ్రంథాలయం గురించి తెవికీపీడియన్లతో చర్చించి, తదనుగుణంగా పుస్తకాల కొనుగోలుకు ప్రయత్నించడం
  • మాధవ్ గాడ్గిల్ టీంతో కలిసి పనిచేసి, గతంలో ప్రచురించిన గ్రామవ్యాసాల టెంప్లెట్ ను సముదాయం ఇప్పటికే ఆమోదించిన పద్ధతిలోకి మార్పించి ప్రచురించడం
  • జెండర్ గ్యాప్ బ్రిడ్జింగ్ అంశంపై ఎడిటథాన్ నిర్వహణ
  • మినీ ఎండబ్ల్యుటి, టిటిటి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం
  • తెలుగు వికీపీడియా దినోత్సవ నిర్వహణ
  • ఫోటోగ్రఫర్ అరుణ్ భాగవతుల ఫోటో గాలరీ సీసీ-బై-ఎస్ఎలో కామన్స్ లో విడుదల చేసేందుకు సహకారం
  • సురేష్ ప్రొడక్షన్స్ తో వారి సినిమాల ఫోటోలను స్వేచ్ఛా నకలు హక్కుల్లో పునర్విడుదల గురించి చర్చలు
  • గుంటూరు జేకేసీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహణ
  • గుంటూరు జేకేసీ కళాశాలలో కార్యశాల నిర్వహణ
  • పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ప్రతిపాదనలు సమర్పణ
  • ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అచల మునిగళ్ తో చర్చ
  • నవంబరు నెల మొలకల జాబితా తయారుచేసి ప్రచురించడం
  • విజయవాడ ఫోటోవాక్ లో భాగంగా తీసిన ఫోటోలు విద్యార్థులతో కామన్స్ లో చేర్పించడం
  • కట్టా శ్రీనివాసరావు ఫోటో గ్యాలరీ కామన్స్ లో విడుదల చేసేందుకు, వాటిని తెవికీపీడియాలో వ్యాసాల్లో చేర్చేందుకు సహకారం
  • హైదరాబాద్ ప్రెస్ క్లబ్ తో భాగస్వామ్య చర్చలు

ఈ కార్యక్రమాల విషయమై అవసరం మేరకు ముందస్తుగా సముదాయంతో చర్చించడం, సలహా సూచనలు స్వీకరించడం జరుగుతుంది. చర్చల ఫలితాలు, కార్యక్రమ సారాంశాలు తెవికీపీడియన్లతో ఎప్పటికప్పుడు చర్చించడం జరుగుతూంటుంది. అలానే చర్చల ఫలితంగా ప్రగతి జరిగి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాల్సివస్తే ఈ టాస్క్ లిస్టులోకి అవి చేరుతూంటాయి. వీటిలో కొన్నిటిని ఇప్పటికే పూర్తిచేయడం జరిగింది, ఇప్పటివరకూ కార్యక్రమాల నిర్వహణ ఒత్తిడిలో సమయం దొరక్క సముదాయం ముందు పెట్టడంలో ఆలస్యమైంది, క్షమించగలరు. వీటికి మించి మరేమైనా చేయమని సముదాయ సభ్యులు అభిలషిస్తూంటే ఇక్కడ రాయవలసిందిగా మనవి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:44, 13 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

New way to edit wikitext మార్చు

James Forrester (Product Manager, Editing department, Wikimedia Foundation) --19:31, 14 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనల్లో స్టాల్ ఏర్పాటు మార్చు

అందరికీ నమస్కారం, పుస్తక సంబరాలలో తెవికీ స్టాల్ విషయమై గతంలో పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) రచ్చబండలో తెలియజేసిన విషయం అందరికి తెలిసిందే. పుస్తక సంబరాల స్టాల్ ఏర్పాటు విషయంలో సభ్యుల నుండి అనుకూల స్పందన వచ్చింది. దానిని దృష్టిలో ఉంచుకోవడంతోపాటు... డిసెంబర్ 10, 11న గోల్డెన్ త్రెషోల్డ్ లో జరిగిన తెలుగు వికీపీడియా దినోత్సవం - మిని మీడియా వికీ ట్రైనర్, మిని టిటిటి నిర్వహణ కు వచ్చిన తెవికీ సభ్యుల కోరిక మేరకు 2016 డిసెంబర్ 15 నుండి 26 వరకు జరిగే హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తెవికీ స్టాల్ ఏర్పాటు చేయడమైనది. కనుక హైదరాబాద్ పుస్తక ప్రదర్శనల్లో స్టాల్ నిర్వాహణకు వచ్చే తెవికీ సభ్యులు ఏఏ రోజులలో రాగలరో తెలుపగలరు. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 06:32, 15 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

వికీ నాణ్యతను పెంచేందుకు మార్చు

తెవికీలో కొత్త పేజీని మొదలుపెట్టే పద్ధతులను బోధించే వ్యాసం ఉంది. కానీ ఆ సందర్భంగా ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి, ఓ వ్యాసానికి ఉండాల్సిన కనీస మాత్రపు హంగులు ఏమేంటి అనే విషయాలను అది చెప్పడం లేదు. వీటిని సూచనామాత్రంగా చెప్పే వ్యాసం ఒకటి రాసాను. దానికి అవసరమైన మార్పుచేర్పులు చెయ్యాల్సిందిగా/చర్చ పేజీలో చర్చించాల్సిందిగా అందరికీ వినతి.__చదువరి (చర్చరచనలు) 08:42, 21 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరి గారు వ్యాసం చాలా బాగుందండి. కొత్తవాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది. కొత్త వాడుకరికి సభ్యులు పంపే వెల్ కం మూసలో ఇది ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 11:58, 21 డిసెంబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]