వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 11

పాత చర్చ 10 | పాత చర్చ 11 | పాత చర్చ 12

alt text=2010 జనవరి 18 - 2010 అక్టోబరు 5 రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2010 జనవరి 18 - 2010 అక్టోబరు 5

గ్రామాల వ్యాసాల గురించి

మార్చు

సాక్షి ఆదివారం సంచిక ఫన్ డే లో "మా ఊరి ముచ్చట" అనే శీర్షికలో గ్రామాల గురించి పాఠకులు మంచి వ్యాసాలు రాస్తున్నారు. ఈ ఆదివారం వెగ్గళం రవి అనే పాఠకుడు రాసిన చల్లూర్ అనే వ్యాసాన్ని వికీకరించి రాశాను. ఈ శీర్షిక ఎప్పటి నుంచి ప్రారంభమైందో తెలుసుకుని అన్ని వ్యాసాలు వికీలో చేరిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఇవి ఎక్కడైనా ఆన్ లైన్ లో లభ్యమైతే లంకెలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. --రవిచంద్ర (చర్చ) 17:18, 18 జనవరి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

భారత వికీమీడియా సంఘం

మార్చు

http://lists.wikimedia.org/pipermail/wikimediaindia-l/2010-March/000461.html - ఇది దయచేసి చూడగలరు, చర్చించగలరు. సమయము శనివారము వరకు మాత్రమే ఉన్నది కావున త్వరపడగలరు. --Gurubrahma 05:35, 10 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

అంటే దీనికి మనం మద్ధతు ప్రకటిస్తే వాళ్ళు వికీమీడియా భారతీయ విభాగం ఏర్పాటు చేస్తారా? --రవిచంద్ర (చర్చ) 06:53, 10 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఆయా ప్రాంతపు వికీమీడియా విభాగాలు ఒక భాషా వికీపీడియాపై కేంద్రీకృతమై అభివృద్ధి చెందాయి. భారతదేశంలో ఒకే సంఘటిత భాషంటు లేకపోవటం వలన భారతీయ వికీ సమాజమంతా సంఘటితమై వికీమీడియా భారతవిభాగం ఏర్పడ్డానికి పెద్ద మద్దతు కూడగట్టుకోలేకపోయారు. ఇప్పుడు కూడా ఇది ఎంతగా సఫలీకృతమౌతుందో కొంత ప్రశ్నార్ధకమే అయినా, సరైన దిశలో ఒక చిన్న అడుగు. అందులో తెలుగు వికీపీడియన్లు కూడా పాల్గొనటం ఆనందదాయకం. --వైజాసత్య 00:28, 11 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంగ్లీషు వికీ పెరుగుదల తగ్గు ముఖం పట్టటంతో, వీక్షణల వృద్ధిలో మన భారతీయభాషలు ముందంజలో వుండడంతో, ఈ ప్రయత్నానికి అన్ని చోట్లనుండి మద్దతుంది. ముందు ముందు భాషా వికీ సంఘాలు ఏర్పాటుకు వీలవుతుంది. అర్జున 04:08, 11 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మీ అందరి మద్దతు చాలా అవసరం, కావున దయయుంచి శనివారం సాయంత్రంలోగా ఇక్కడ మీ మద్దతు తెలుపగలరు - మీ మద్దతు మాత్రమే కాదు, అభ్యంతరాలు, ఇతర వ్యాఖ్యలు కూడా తెలుపగలరు. ధన్యవాదాలు. --Gurubrahma 04:03, 12 మార్చి 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Wikimania Scholarships

మార్చు

The call for applications for Wikimania Scholarships to attend Wikimania 2010 in Gdansk, Poland (July 9-11) is now open. The Wikimedia Foundation offers Scholarships to pay for selected individuals' round trip travel, accommodations, and registration at the conference. To apply, visit the Wikimania 2010 scholarships information page, click the secure link available there, and fill out the form to apply. For additional information, please visit the Scholarships information and FAQ pages:

Yours very truly, Cary Bass
Volunteer Coordinator
Wikimedia Foundation

తెవికీ వార్తా పత్రిక

మార్చు

తెవికీ ఔత్సాహికులు, వారి పని గురించి తెలియచేసే త్రైమాసిక తెవికీ వార్తా పత్రిక తయారు చేద్దామని ఆలోచన. ది వికీ సైన్ పోస్ట్ లాగా. మీ అభిప్రాయాలు, అనుభవాలు, తెలపండి. అర్జున 04:29, 2 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మంచి ఆలోచన. ఈ పత్రికలో తెవికీలో గత మూడునెలల్లో జరిగిన అభివృద్ధి గణాంకాలు అంటే కొత్త వాడుకరుల సంఖ్య, కొత్త వ్యాసాల సంఖ్య మొదలైనవి, మరియు ఇతర గణాంకాలు పొందుపరిస్తే మనకు పునరావలోకనం చేసుకునేందుకు బావుంటుంది. అలాగే వికీ అకాడమీ తరపున గానీ ఇంకేదైనా సంస్థ తరపున గానీ వికీ ప్రచారం సాగించినా, అవగాహనా శిబిరాల్ని నిర్వహించినా, మాధ్యమాల్లో ఎక్కడైనా వికీపీడియా ప్రస్తావన వచ్చినా అవన్నీ ఇందులో చేరిస్తే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇవీ నా ఆలోచనలు. మళ్ళీ ఏదైనా స్పురణకు వస్తే తెలియబరుస్తాను.--రవిచంద్ర (చర్చ) 05:06, 2 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మీస్పందనకి ధన్యవాదాలు. వికీ వాడుకరులతో ఈమెయిల్ పూర్వక సందర్శనాలు కూడా బాగుంటాయి. మీరు, ఈ కార్యక్రమానికి సహసంపాదకునిగా చేరమని విజ్ఞప్తి. ఈ నెలలోనే మొదలెడదాం.అర్జున 11:50, 3 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
తప్పకుండానండీ. అన్నట్టు ఆ మూడునెలల్లో టాప్ 10 కంట్రిబ్యూటర్లు లాంటివి కూడా చేరిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుందేమో. --రవిచంద్ర (చర్చ) 14:16, 3 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదాలు. అర్జున 05:23, 6 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

చాలా మంచి ప్రయత్నం. విజయోస్తు --కాసుబాబు 10:20, 6 ఏప్రిల్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

మొదటి సంచికకి సన్నాహాలు
మార్చి వరకు వికీ గణాంకాలు లభ్యమైనవి. కాకపోతే సంచిక తయారి దశలో ఎ పద్ధతి వాడాలో తెలియుటలేదు. అంటే ఈ స్థితిలో సంపాదకులు కొరకు అందుబాటులో వుండాలి, వారు మాత్రమే మార్చగలగాలి. వాటికి నిర్వాహక లేక అధికారి హక్కులు కావాలా? వికీపీడియా సైన్ పోస్ట్లో ప్రశ్న వేస్తే ఎవరు స్పందించలేదు. అర్జున 07:50, 2 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
స్పందన en:Wikipedia_talk:Wikipedia_Signpost#How to start another language edition of Signpost?. అందుకని చాలా సులభంగా మొదలెడదాం. వార్తలు లో లింకు ద్వారా, స్పందనలు వ్యాసం క్రింద సంతకంతో, వచ్చేటట్టు, అనుభవజ్ఞులు ఎవరైనా మూస తయారీకి సహకరించండి. అర్జున 14:42, 15 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
పత్రిక పేరు కి సూచనలు, మద్దతులు

పేర్లు చదవండి, మద్దతు తెలపండి. కొత్త పేరులు కూడా కొత్త లైనులో  : తో ప్రారంభంచి తెలపండి. ముగింవు తేది: మే 30, 2010, అర్జున 07:50, 2 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ ప్రపంచం
తెవికీ వార్త
తెవికీ వార్త అనే పేరు బాగుంటుందనుకుంటున్నాను. —రవిచంద్ర (చర్చ) 15:35, 2 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
"తెవికీ వార్త" ఓకే --కాసుబాబు 18:55, 15 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
పత్రిక చిహ్నం
 
తెవికీ వార్త

చిహ్నం ముసాయిదా తయారైంది. విమర్శలుతెలియచేయండి అర్జున 05:44, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పత్రిక సంపాదకత్వం, విధానాలు
  • పత్రిక సంపాదకత్వం వెబ్ 2.0 విధానాలకి దగ్గరగా వుంటుంది. అంటే, సమన్వయకర్త(లు) నిర్వాహకుడు(లు) గా మాత్రమే వ్యవహరిస్తాడు(రు).
  • పత్రిక సజీవ పత్రిక, అంటే రచయితల అనుకూలాన్ని బట్టి వారు తమ రచనలని చేర్చవచ్చు. విషయాంశం, వికీపీడియా తెర వెనుక సంగతులు, ప్రజలకి చేరువచేర్చేది అయి వుండాలి. విషయం, వ్యాసం, కవిత, బొమ్మ, చిన్ని సినిమా తరహాలో వుండాలి. మీ వ్యక్తిగత అభిప్రాయాలకి దీనిలో చోటుంటుంది. మీ కృతి సొంతంగాని, ఇతరుల కాపీ హక్కులున్నదైతే, మీరు అనుమతి పొంది ఆ తరవాత చేర్చాలి. మీరు వికీపీడియా గురించి, మీ స్వంత బ్లాగులో రాస్తున్నట్లయితే ఆటువంటివి, దీనిలో రాయవచ్చు. ఇతర ఫార్మాటులు, కావలసిన చోటు పరిమితుల గురించి మీరు బాధపడనవసరంలేదు. మీ రచనలని ఇక్కడ వుంచటం వలన, తెవికీ ని మరింత బలపరిచిన వారవుతారు.
  • ఐతే,కొత్తగా రచన చేసే వారు, సోదర రచయిత విమర్శని వాడి, వ్యాసాన్ని మెరుగు పరిచి పంపితే మంచిది. అవసరమైతే, సమన్వయకర్త సలహాలు తీసుకోవచ్చు.
  • మీ రచన ని, మీ వాడుకరి విభాగంలో,తెవికీ వార్త అన్న ఉప సంచయంలో రాసి, వికీపీడియాలో తెవికీ వార్త పేజీలో లింకు చేయాలి. వీటిగురించి మరిన్ని సూచనలు కాలక్రమేణా ఇవ్వబడతాయి.
  • పత్రికకి ఆర్ఎస్ఎస్ ద్వారా చందా దారుడవ్వాలి. ప్రారంభంలో, ఈ మెయిల్ ద్వారా తెవికీ గూగుల్ గుంపుకి పంపబడుతాయి.
  • మొదటి వ్యాస రచయిత గామీరే ఎందుకు కాకూడదు, ప్రయత్నించండి.
  • ఈ విధానాలపై సలహాలు కూడా ఇక్కడ చర్చా వ్యాఖ్యల ద్వారా తెలపండిఅర్జున 06:19, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
బీటా వర్షన్, దానివల్ల మెరుగుపడిన సౌకర్యాల గురించి ఓ వ్యాసంగా రాయాలనుకుంటున్నా. దీన్ని మనం తెవికీ వార్తగా ప్రచురించవచ్చా?—రవిచంద్ర (చర్చ) 14:56, 30 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మంచి ఆలోచన. మొదలెట్టండి. అర్జున 03:40, 31 మే 2010 (UTC)[ప్రత్యుత్తరం]
మాటామంతీ శీర్షిక

వికీపీడియా:తెవికీ వార్త/మాటామంతీ ముసాయిదా చూడండి. విమర్శలు తెలపండి.ఈ శీర్షికకి స్వతహాగా ముందుకి రావడానికి సభ్యులు ఇష్టపడక పోవచ్చు కాబట్టి సమన్వయ కర్తలు ప్రతిపాదనలు, ఆహ్వానాలు వుంటాయి. మీ తోడ్పాటు అందించండి. అర్జున 09:58, 2 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ వార్త మూసలు తయారయ్యాయి.ముఖ్య కథనం, మాటామంతీ అనే రెండు శీర్షికల తో ప్రారంభం. మీ విమర్శలు తెలియచేయండి. మీ వ్యాసాలకే నిరీక్షణ. అర్జున 11
23, 18 జూన్ 2010 (UTC)
మొదటి సంచిక విడుదలయ్యింది

ఆలోచన తర్వాత మూడు నెలలకి తెవికీ వార్త విడుదలయ్యిందోచ్!! సహకరించిన అందరికి ధన్యవాదాలు . అసలు పని కొనసాగించడమే. అది ఇప్పుడే మొదలవుతుంది, మీ వ్యాఖ్యలతో, రచనలతో. మీ రచనలతో నన్ను కాని రవిచంద్ర ని కాని సంప్రదించండి. అర్జున 06:52, 1 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రాజెక్టు అనుభవాలు

మార్చు

తెవికీ లో వికీప్రాజెక్టు లోటు పాట్లు అన్న పేజీ చూడండి. మీ అనుభవాలు పంచుకోండి. నేను వికీప్రాజెక్టు నిర్వహణ సమర్థవంతం చేయడానికి వికీమేనియా 2010 లో, ఒక |ప్రదర్శన పత్రాన్ని సమర్పిస్తున్నాను. మీ అనుభవాలతో దాన్ని మెరుగు పరచుదామని ఆలోచన, దయచేసి 30 జూన్ 2010 లోగా స్పందించండి. ముందస్తు ధన్యవాదాలు. అర్జున 12:59, 13 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

Embassy లింకు వికీపడియా పానెల్ నుండి.

మార్చు

మళయాళ వికీ వారు భారతీయ వికీ భాషల సమన్వయం పెంపొందించేందుకు, Embassy లింకు నావిగేషన్ నుండి ఇవ్వమని ప్రతిపాదన చేశారు. దీని ద్వారా ఇతర భారతీయ భాషల వికీ సభ్యులు మనతో సంభాషించటానికి వీలవుతుంది. ఉదా: మలయాళం వీకీ నావిగేషన్ లో Embassy చూడండి.--అర్జున 06:07, 27 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల్లో కులాలు, ఇంటి పేర్ల వివరాలు ఉంచటం

మార్చు

గ్రామాల్లో కులాలు, ఇంటి పేర్లు ఉంచటం - విలువైన సమాచారం. ఏ వికీ నియమం ప్రకారం ఇది ఉంచకూడని సమాచారంగా నాకు అనిపించటం లేదు. కల్లూరు మండలం లింగాల గ్రామం నుండి ఆ సమాచారాన్ని తొలగించారు. ఇంటి పేర్లు, కులాలు మన పల్లెలు ఎక్కువగా చిన్నవే కనుక పేజీలో సమాచారం మొత్తం అవే ఆక్రమిస్తాయి అని నేను అనుకోవటం లేదు. మీ అభిప్రాయాలు, మంచి చెడు చెప్పగలరు. Chavakiran 10:29, 4 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రస్తుతానికి గ్రామ వ్యాసాలలో సమాచారం అంతంత మాత్రంగానే ఉంది. గ్రామవ్యాసాలలో సమాచారం చేర్చడానికి ఎంతో అవకాశం ఉన్ననూ ప్రతి ప్రాంతం నుండి తెవికీలో చురుగ్గా పనిచేసే సభ్యులు లేరు. ఇప్పట్లో గ్రామ వ్యాసాల సమాచారం అభివృద్ధి చెందడం కష్టమే. అప్పుడప్పుడు కొందరు కొత్త సభ్యులు వారికి అనుకూలమైన సమాచారం చేరుస్తున్నారు. అందులో భాగంగానే కులాలు, ఇంటిపేర్లు తెవికీలో వ్రాస్తున్నారు. నా వంతుకు కులాలు, ఇంటిపేర్ల సమాచారం గ్రామవ్యాసాలలో అవసరం లేదనుకుంటున్నాను. ఇది వరకు ఇలాంటి సమాచారం తొలిగించాను కూడా. కొందరు సభ్యులు ఇలాంటి విషయాలు చేర్చిననూ అది గ్రామానికి సంబంధించి పరిపూర్ణమని, సరైనవని మనం అనుకోలేము, వాటికి ఎలాంటి ఆధారము ఉండదు మరియు సరిచూడడానికి అవకాశం కూడా లేదు.. వారికి తెలిసిన కొన్ని ఇంటిపేర్లు, కులాలు చేర్చినను వాటి వలన ఉపయోగం కూడా అంతగా ఉండదనే అనుకుంటున్నాను. ప్రముఖ వ్యక్తులు అంటూ ఎందరో వారి కుటుంబ సభ్యుల పేర్లు, బంధువుల పేర్లు చేరుస్తుండడం మనం తరుచుగా గమనిస్తూనే ఉన్నాము. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వరాదనే నా అభిప్రాయం. C.Chandra Kanth Rao-చర్చ 19:18, 4 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
వికీపీడియా లో సమాజంలో అన్ని వర్గాల వారికి కావలసిన విషయాలపై(రవాణా సౌకర్యాలు, పాఠశాలలు, పంటలు ..) దృష్టి పెడితేనే బాగుంటుంది.--అర్జున 05:28, 5 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఒక కులం ఉంది అని వ్రాయటం సభ్యునికి అనుకూలం కాని గ్రామంలో ఉన్న అన్ని కులాల వివరాలు వ్రాయటం, గ్రామంలో ఉన్న అన్ని ఇంటి పేర్లు వ్రాయటం అనుకూలంగా వ్రాయటం కాదు. అది గ్రామం గురించిన సమాచారం వికీలో చేర్చటం మాత్రమే. సభ్యులు అందరూ తలో చెయ్యి వేస్తేనే వ్యాసాలు సమగ్రంగా తయారవుతాయి. మొదట చేసిన మార్పులు కేవలం పరిపూర్ణంగా లేవు అని తొలగించలేము, వాటిని పరిపూర్ణంగా చెయ్య ప్రయత్నం చెయ్యాలి. మరీ కులాల, ఇంటి పేర్లు పెద్దవయితే వాటితో మరో వ్యాసం తయారు చెయ్యవచ్చు. కొన్ని పేద్ద గ్రామాలకయితే ఈ వివరాలు లెక్కలోనికి రావేమో కాని చాలా వరకు గ్రామాలలో కులాలు వేళ్లపై లెక్కిచవచ్చు, అలాగే ఇంటి పేర్లు కూడా. ఇవి చాలా విలువైన సమాచారం. కులం అనేది వికిలో బూతు పదం కాదు. కుల నిర్మూలన అంటే పిల్లి కళ్లు మూసుకోని పాలు తాగుతూ తన్నెవరూ చూడటం లేదు అనుకోవటం కాదు కదా. కులాల గురించి వీలైనంత సెక్యులర్ సమాచారానికి వికీలో చోటు ఉందని నా ఉద్దేశ్యం. ఒక గ్రామంలో వందో, వెయ్యో ఇంటి పేర్లు ఉంటే ఆ సమాచారం అవసరం లేదు కాని పదో ఇరవయ్యో ఉంటే ఆ గ్రామం చరిత్ర, సంస్కృతుల నుండి ఇంటి పేర్లను విడదియ్యలేము అని నా ఉద్దేశ్యం. వికీలో చేర్చిన ఏ విషయం పరిపూర్ణం అనుకోలేము మనం అది నిరంతరం అభివృద్ది అయ్యే సమాచారం. పలువురు పలు చేతులు చేరిస్తేనే ఇక్కడి సమాచారం పరిపూర్ణం అవుతుంది కదా. గ్రామాలలో ఇంటి పేర్లకు ఎలాంటి ఆధారం ఉండదు కాని వికీ డవలప్ అయ్యే కొద్ది, చదువరులు పెరిగే కొద్ది సమాచారం నాణ్యత పెరుగుతుంది. మనకు రిఫరెన్సులు ఆ గ్రామం గురించి తెలిసిన వారే, చదువరులు పెరుగుతుంటే ఈ సమాచారం సరి అవుతుంది కదా. ప్రముఖ వ్యక్తులు అంటూ బంధువులను చేర్చటం వేరు, గ్రామంలోని అన్ని కులాల, ఇంటి పేర్లు చేర్చటం వేరు కదా. మీరు చెప్పినట్టు ఒకటి రెండు కులాలే చేరిస్తే అది పక్షపాతం, కాని ఉన్న అన్ని కులాల పేర్లు చేరిస్తే అది సమాచారమే అవుతుంది కదా. రేపు జనగణనలో కులాల లెక్కలు తీసి ప్రతి గ్రామానికి ఆ వివరాలు ప్రభుత్వం ప్రకటిస్తే అప్పుడు కూడా మనం వాటిని కలపమా. Chavakiran 16:14, 5 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
చావాకిరణ్ గారూ!, మీరు చెప్పిన విషయాలు చాలా వరకు ఒప్పుకుంటాను, కులాల పేర్లు, ఇంటిపేర్లు వికీలో చేర్చకూడని బూతుపదాలేమీ కావు, సెక్యులర్ సమాచారానికి వికీలో చోటు ఉండరాదని నేను చెప్పడం లేదు కాని అదే సమయములో వికీలో ఉండవలసిన, చేర్చవలసిన అంశాలపై దృష్టిసారిస్తే -> ఇప్పుడు కులాలు, ఇంటిపేర్లు చేర్చడానికి అవకాశం ఇస్తే రేపు ఆ అంశాలను విభాగాలుగా చేసి అందులో వ్యక్తుల పేర్లు కూడా చేరుస్తారు (ఇప్పటికే అలా చేసినవారు ఉన్నారు). కులాల గురించిన సమాచారం అస్సలు ఉండరాదని నేను అనడం లేదు, ఈ గ్రామంలో ఫలానా కులస్థులు అధికంగా ఉన్నారు అంటే సరిపోతుంది. ఈ ఇంటిపేరు కలవారు అధికంగా ఉన్నారని చేరిస్తే చాలనిపిస్తుంది. అలాంటి సమాచారం ఇప్పటికే కొన్ని గ్రామవ్యాసాలలో ఉంది. అలాంటి వాటిని తొలిగించడం లేదుకదా. కులాలు, ఇంటిపేర్లు కూడా గ్రామ సమాచారమే అని ఒప్పుకుంటాను, అలా అయితే చెట్లు, పుట్టల గురించి, గొర్రెలు, బర్రెలు గురించి ఒక్కోదానికీ వివరంగా గ్రామవ్యాసాలలో చేరిస్తే మనం ఒప్పుకోవాలా? అదీ గ్రామసమాచారమే అని వారు వాదించవచ్చు ( ఈ గ్రామంలో ఈ జంతువులు, ఈ చెట్లు అధికంగా ఉన్నాయంటే సరిపోతుంది కదా). గ్రామం యొక్క స్థాయిని బట్టి వ్యాస సమాచారం ఉంటే బాగుంటుంది. ఒక ప్రముఖ వ్యక్తి గురించిన వ్యాసంలో ఎన్ని వివరాలైనా చేర్చవచ్చు, కాని ఎవరో ఎల్లయ్య గురించిన వ్యాసంలో చిన్న విషయాలు అవసరం లేదు కదా! గ్రామంలో మనం చేర్చాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి మనకు అందుబాటులో ఉన్నాయి కూడా. గ్రామ జనాభా, గ్రామంలోని విద్యాసంస్థలు, దేవాలయాలు, సర్పంచులు తదితర అంశాలు అంతర్జాలంలో ఇప్పటికే లభిస్తోంది. అలాంటి అంశాలను చేరిస్తే పాఠకులకు ఉపయోగంగా ఉంటుంది. కులాలు, ఇంటిపేర్లు చేర్చడానికి అవకాశం ఇచ్చిననూ అప్పుడప్పుడు ఎవరో కొందరు సభ్యులు ఏవో కొన్ని గ్రామాలలో చేర్చినంతమాత్రానా గ్రామవ్యాసాల నాణ్యత పెరుగుతున్నట్లు అనుకోలేము. 22వేలకు పైగా ఉన్న గ్రామవ్యాసాలలో పదో, పాతికో వ్యాసాలలో మాత్రమే చేర్చేఅంశాలు, అదీ సరిపోల్చడానికీ అవకాశం లేని సమాచారం, కేవలం ఒకరిద్దరిపైనే ఆధారపడగలిగే వాక్యాలు ఉంచడానికీ ఇప్పట్లో అవకాశం ఇవ్వకపోవడమే బాగుంటుంది. సభ్యుల సంఖ్య పెరిగి, వ్యాసాలలో సమాచారం పెరిగినప్పుడు మనం కూడా మారాల్సి ఉంటుంది. చరిత్ర, సంస్కృతులతో సంబంధం ఉన్న ఇంటిపేర్లు, కులాల పేర్లు ఇవ్వవచ్చు, కాని ప్రతిగ్రామంలో ఈ అవకాశం ఉండదు కదా! చిన్న గ్రామంలో ఇంటిపేర్లు, కులాల పేర్లు కొద్దిగే ఉంటాయి, జనాభా కూడా కొద్దిగే ఉంటుంది అలాంటప్పుడు గ్రామంలోని వ్యక్తుల పేర్లన్నింటినీ లేదా ఓటర్లందరినీ చేర్చలేము (దీనికి ఆధారము కూడా చూపించవచ్చు). C.Chandra Kanth Rao-చర్చ 18:40, 5 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ గ్రామంలో పలానా కులస్థులు, లేదా పలానా మతస్థులు ఇంత (లేదా శాతం) మంది ఉన్నారు లాంటి సంక్షిప్త సమాచారం చేరిస్తే సరిపోతుంది అని నా అభిప్రాయం. అలా కాకుండా కులాలు, వాటిలో ఇంటి పేర్లు మరీ Individualistic అయిపోతుందేమో...ఉదాహరణకు లింగాల వ్యాసంలో ఎవరో వాడుకరి కమ్మ వారి ఇంటి పేర్లు మాత్రం చేర్చారు. మిగతా ఇంటి పేర్లు అతనికి తెలిసి ఉండకపోవచ్చు. లేదా ఆసక్తి ఉండకపోవచ్చు. ఇప్పుడు జనాభా లెక్కలు కూడా మరీ ఇంత డీటెయిల్డ్ గా సమాచారం సేకరించలేదనుకుంటా. కులాలు, ఇంటి పేర్లకు సంబంధించి వ్యాసంలో ఏమి ఉండచ్చో నా సలహా
  • ఈ గ్రామంలో x,y,z కులాలు ఉన్నాయి. ఒక్కో కులంలో ఇంత మంది జనాభా ఉన్నారు. ఫలానా ఫలానా ఇంటి పేర్లు కలవారు ఉన్నారు. అని అన్నింటినీ ఒకే విభాగం కింద సంక్షిప్తంగా రాస్తే సరిపోతుంది.

రవిచంద్ర (చర్చ) 07:04, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ చర్చ నుండి నాకు అర్థం అయినంత వరకు, గ్రామాల్లో కులాల వివరాలు, ఇంటి పేర్ల వివరాల గురించి మనం గ్లోబల్గా నిషేధం విధించనక్కర్లేదు, కాని ఏదన్నా తేడాగా ఉంటే ఆ గ్రామం చర్చా పేజీలో చర్చించి మార్పులు చేర్పులు చెయ్యవచ్చు. ఏమంటారుChavakiran 13:10, 6 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
తెవికీ విధానాలకి (ముఖ్యంగా విషయ ప్రాముఖ్యత, తటస్థ దృక్కోణం, నిర్థారింపతగినది), వీటికిఅనుగుణంగా వుందా లేదా అని పరిశీలించి రాయండి. చర్చాపేజీలని సమర్థవంతంగా వాడటంగురించి మీతో ఏకీభవిస్తున్నాను --అర్జున 03:08, 9 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సీడీపై తెవికీ

మార్చు

ఇప్పుటికిప్పుడే మనం తెవికీని సీడీపై విడుదల చేయకపోవచ్చు. కానీ ఆ దిశగా ఆలోచన ప్రారంభించవలసిన సమయం వచ్చిందనుకుంటా. దీనికి కావలసిన సాంకేతికత దాదాపు ఉన్నట్టే. కానీ ఎన్ని వ్యాసాలు? ఏఏ వ్యాసాలు అని నిర్ణయించి, వాటిని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడు నిర్ణయించుకోవచ్చు --వైజాసత్య 15:47, 13 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

నేను మళయాళ వికీపీడియన్లతో మాట్లాడి,skype phone/chat సెషన్ ఏర్పాటు చేయగలను.--అర్జున 06:41, 14 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
నాణ్యత బేరీజు వేయటంలో, ఈ వారం వ్యాసాలు మెరుగుపరచడంలో మన సముదాయం వెనుకబడివుంది. ఆ దిశగా మనం పనిచేస్తే సిడి ప్రాజెక్టు చేయటం సులభం అవుతుంది. నాణ్యత మూసని నేను కొంత తెలుగు అనువాదము చేసాను. దీనిని ఈవారం వ్యాస పరిగణనలలో వాడితే బాగుంటుంది. అలాగే విశేష వ్యాసము పేజీ (రచ్చబండ) లో పాతదైంది. --అర్జున 07:53, 13 సెప్టెంబర్ 2010 (UTC)

ఆదర్శ గ్రామ వ్యాసంలో ఉండాల్సిన విషయాలు

మార్చు

మనకు ఇప్పుడు గ్రామ వ్యాసాలు కొన్ని తయారు అయ్యాయి. వీటిని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ఇప్పటి వరకు గ్రామ వ్యాసాలను పరిశీలించి ఒక ఆదర్శ గ్రామ వ్యాసంలో ఉండాల్సిన విషయాల గురించి చర్చించుకుందాం. ఎవరన్నా కొత్తగా గ్రామ వ్యాసం గురించి వ్రాయాలంటే ఈ మూస లాంటిది ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఉద్దేశ్యం. ఈ దిగువ విషయాలు నా దృష్టిలో ఉన్నాయి.

  1. జనాబా వివరాలు - స్త్రీలు, పురుషులు, చదువుకున్న వారు, కూలి వారు, వివిధ వయసుల వారు, ఓటర్లు.
  2. సంస్కృతి - మతస్తులు, దేవాలయాలు మసీదులు చర్చిలు .., పండుగలు, ఉత్సవాలు, భాష, కులాలు, గ్రంధాలయాలు
  3. ఆర్దిక విషయాలు - ప్రధాన ఆధారం, వ్యవసాయం, కాలవలు, చెరువులు, చేతి వృత్తులు, పరిశ్రమలు, ..
  4. బొమ్మలు - గ్రామ బస్టాండ్ బొమ్మ, దేవాలయాల బొమ్మలు, పంచాయితీ ఆఫీస్ బొమ్మ, పోస్టాఫీస్ బొమ్మ, గ్రామంలో ఏవన్నా విగ్రహాలు అంటే గాంధీ విగ్రహం లాంటివి ఉంటే ఆ బొమ్మలు, స్కూలు బొమ్మ, గ్రంథాలయం బొమ్మ, శ్మశానం బొమ్మ,
  5. గూగుల్ మ్యాపులో గ్రామానికి లింకు.
  6. చరిత్ర - తెలిసినంత వరకు ఈ గ్రామం చరిత్ర.
  7. ప్రముఖులు - ప్రస్తుత సర్పంచ్, మాజీ సర్పంచులు, ఇతర రాజకీయ నాయకులు, రచయతలు, స్వామీజీలు, శాస్త్రవేత్తలు, ఇంకా మీడియాలో వచ్చిన ఇతర ప్రముఖులు.
  8. సౌకర్యాలు - రక్షిత మంచినీరు, రోడ్డు, పాఠశాలలు, కాలేజీలు, కేబుల్ టీవీ, డిష్ టీవీ, పోస్టాఫీసు..
  9. అసౌకర్యాలు - ఈ గ్రామానికి ప్రస్తుతం ఉన్న పెద్ద ఇబ్బందులు , రోడ్డు లేకపోవటం, లైబ్రరీ లేకపోవటం, యువకులు అంతా పట్టణం వెళ్లటం, మంచి నీటి సౌకర్యం లేకపోవటం, స్కూలు లేకపోవటం..
  10. భౌగోళికం - అక్షాంశాలు, రేఖాంశాలు.
  11. రాజకీయం - గ్రామం చెందు నియోజక వర్గం, శాసన సభ, మొన్నగు విషయాలు.

మీ మీ అభిప్రాయాలు చెప్పగలరు. Chavakiran 10:09, 17 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

పై వివరాలను గ్రామవ్యాసాలలో చేర్చవచ్చు. వాటితో పాటు రవాణా సదుపాయాలు, గ్రామానికి మండల కేంద్రము మరియు సమీపంలోని ప్రముఖ పట్టణాలనుండి దూరము, గ్రామ ఎల్లలు/సరిహద్దులు, ఇటీవల జరిగిన ప్రముఖ సంఘటనలు, ఎన్నికల వివరాలు, గ్రామానికి చెందిన పంచాయతీ మరియు ఎమ్పీటీసి నియోజకవర్గాలు, గ్రామం పొందిన అవార్డులు (నిర్మల్ అవార్డులు, ఉత్తమ పంచాయతీ అవార్డులు), చారిత్రక ప్రాధాన్యత ఉన్న కట్టడాలు, గ్రామసమీపంలో చూడదగిన ప్రముఖ ప్రదేశాలు, భౌగోళిక ప్రాధాన్యత ఉన్న పర్వతాలు, గుట్టలు, నదులు, ప్రాజెక్టులు కూడా చేర్చవచ్చు. C.Chandra Kanth Rao-చర్చ 19:49, 17 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]
ఆ గ్రామంలోఏమైనా అరుదైన మొక్కలు, జంతువులు, ప్రాచీనకాలంనాటి వృక్షాలు (మర్రిచెట్లు వంటివి), వింత మొక్కలు, వింత జంతువులు, వైద్యానికి పనికి వచ్చే మొక్కలు, అరుదుగా పండే పంటలు, కొన్ని గ్రామాలు ఫ్లోరైడు బాధిత గ్రామాలు, ఉద్దానం వంటి ప్రాంతాలలో కిడ్నీ వ్యాదులు, కోనసీమ లో బోదకాలు వ్యాదులు వగైరా వివరాలు కూడా చేర్చాలి. Talapagala VB Raju 09:55, 25 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు సాఫ్ట్‌వేర్ - వికీపీడియా

మార్చు

ఎమ్.ఎస్. వర్డ్ పేజీ లో తెలుగు లో ఎదైనా వ్యాసం టైపు చేసి, దానిని కాపీ చేసి తెలుగు వికీపీడియాలో అంటించడానికి ఎదైనా పద్ధతి ఉందా! లేదంటే ఏదైనా సాఫ్ట్‌వేరు ఉందా!. ఎక్కువ సేపు అంతర్జాలంలో ఉండి టైపు చేయాలంటే ఒక్కొక్క సారి అంతర్జాలం అందుబాటులో లేకపోవటం, కనెక్షను వేగంగా లేకపోవటం వంటి సమస్యలు ఉన్నాయి. నేను, లీప్ సావ్ట్‌వేరు, 'బరాహ' సాప్ట్‌వేరు ప్రయత్నించాను. కానీ, సఫలం కాలేదు. ఏదైనా దారి చూపండి. Talapagala VB Raju 07:00, 18 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

గతంలో నేను ఇలా చాలా సార్లు చేశాను. ముందు వర్డ్లో టైప్ చేసి, తరువాత నోట్ ప్యాడ్లో పేస్టే చేసి అక్కడ నుండి కాపీ చేసి ఇక్కడ వికీలో అతికించండి, ఆ తరువాత ఫార్మటింగ్ సంగతి చూసుకోవచ్చు. మీకేమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండిChavakiran 07:55, 18 జూలై 2010 (UTC).[ప్రత్యుత్తరం]
ఎమ్మెస్ వర్డ్‌లో టైపు చేయడానికి యూనికోడ్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు సిస్టంలో దానికి తగిన మార్పులు చేయాల్సి ఉంటుంది. కాని దీనివలన టైపులో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. తెవికీలో టైపు చేయడానికి, ఎమ్మెస్ వర్డ్‌లో టైపు చేయడానికి కొని అక్షరాలలో తేడా ఉంది. కాబట్టి మనం ఇక్కడి అలవాటు వలన టైపు చేస్తే అక్షరదోషాలు వచ్చే అవకాశం ఉంది. ఇక రెండో మార్గం లేఖినిని కాపీ చేసుకోవడం ఇది చాలా సులువు. దీని ద్వారా నెట్ కనెక్షన్ లేకున్ననూ టైపు చేయవచ్చు. మూడవది మన తెవికీ ఎడిట్ పేజీనే సేవ్ చేసి పెట్టుకోవడం. C.Chandra Kanth Rao-చర్చ 08:03, 18 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సాక్షాత్

మార్చు

Please translate the article on the to Hindi. Thanks. --92.11.24.4 ౧౭:౨౨, ౨౩ జులాఈ ౨౦౧౦ (UTC)

రాబోయే సంఘటనలు

మార్చు

వికీపీడియా మొదటిపేజీ మార్గదర్శకము వరుసలో (వర్తమాన ఘటనలు) ఉన్నది. దాని తరువాత (రాబోయే ఘటనలు) చేరిస్తే, వాటిలో ఈ క్రింద ఇచ్చిన గటనలు వంటివి చేర్చవచ్చును. ఇంగ్లీషు వికీపీడియాలో ఇది ఉన్నది.

"7 సెప్టెంబరు 2010 న భారత్ బందు. దేశ వ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 7 న భారత బంద్ చేయాలని నిర్ణయించినట్టు ఐఎన్‌టీయుసీ ప్రకటించింది. కేంద్ర వైఖరి వల్ల 378 కోట్లమంది దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారు. కష్టాల్లో ఉన్న పరిశ్రమలను పట్టించుకోకుండా లాభాల్లోని కర్మాగారాలను ప్రైవేటు పరం చేయటాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు." Talapagala VB Raju 15:20, 24 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

ఇంగ్లీషు వికీపీడియా మూలమును తెలపండి, నాకు కనపడలేదు. భవిష్యత్తు సంఘటనలలో మార్పులు జరగవచ్చు,వాటిని వెంటనే వికీలో పొందుపరచటము వీలు కాకపోవచ్చు. వీటికోసము సమయం ఎక్కువ కేటాయించేవారు మన తెవికీలో ప్రస్తుతం లేరు. ఇలాంటివాటిగూర్చి మీకు ఉత్సాహంవుంటే, వికీవార్తలు ప్రాజెక్టు ప్రారంభించవచ్చు.--అర్జున 03:00, 2 సెప్టెంబర్ 2010 (UTC)

ప్రాచీన గ్రంధాలు వెబ్‌సైట్లు

మార్చు


telugumoviesinfo గురించి

మార్చు

ఈ సభ్యుడు చేసే మార్పులు కేవలం తన వెబ్ సైట్ ప్రచారం కోసం చేసే మార్పులులాగానే ఉన్నాయి. పరిశీలించి తగు సలహాలు ఇవ్వగలరు. ఇంకా ఇతర సినిమా వెబ్ సైట్ల రిఫరెన్సులు తీసేస్తున్నారు. ఉదాహరణకు వేదంలో ఐడిల్ బ్రైన్ లింకు తొలగించారు. Chavakiran 01:44, 27 జూలై 2010 (UTC)[ప్రత్యుత్తరం]

సభ్యుని మార్పులే కాకుండా సభ్యనామం కూడా ప్రచారం లాగానే ఉంది. ఇదివరకు వెబ్‌సైట్ల పేరుతో ఉన్న సభ్యనామాలపై నిరోధం విధించాము. ఈ సభ్యుడు చేసిన మార్పులు రెండే కావచ్చు. అయిననూ భవిష్యత్తులో ఇలాంటి సభ్యనామాల సమస్యను ఎదుర్కోడానికి ఇతనిపై అపరిమితకాల నిరోధం విధించాలి. సి. చంద్ర కాంత రావు - చర్చ 09:06, 1 ఆగష్టు 2010 (UTC)

పిల్లలమర్రి వ్యాసం

మార్చు

సూర్య దినపత్రికలో (ప్రతి మంగళవారం ప్రచురించే "విహారి" అనుబంధంలో) పిల్లలమర్రి (వృక్షం) వ్యాసం ప్రచురించబడినది. (లింకు ) వ్యాసం కొద్ది మార్పులతో దాదాపు పూర్తిగా తెవికీనే కాపీచేయడం జరిగింది. ఇచ్చిన రెండు బొమ్మలు కూడా తెవికీ నుంచే తీసుకోబడినవి. ఇలా తెవికీ వ్యాసాన్ని పత్రికలో ప్రచురించడం ఒకవైపు మనకు గర్వకారణమే, మరోవైపు చూస్తే కనీసం మన కృషికి గుర్తింపు కూడా ఇవ్వలేరు. ఆంగ్ల దినపత్రికలలో కూడా ఆంగ్ల వికీ నుంచి తీసుకున్న వ్యాసాలు, సమాచారం, పట్టికలు, బొమ్మలకు మూలం వికీపీడియా అని ఇవ్వడం చాలా సార్లు గమనించాను. కాని తెలుగు పత్రికలు కనీసం మనకు రావలసిన గుర్తింపును ఇవ్వడం లేదు. గుర్తింపు లేకున్నా సరే మరో బాధ ఏమంటే అక్కడి వ్యాసాన్ని చదివినవారు తెవికీ వ్యాసాన్ని చదివితే మనమే పత్రికల నుండి కాపీ చేశామని భావించే అవకాశం ఉంటుంది. ఒక వ్యాసాన్ని విశేష వ్యాసంగా మరల్చడానికి మనం ఎంతో కృషిచేయవలసి ఉంటుంది. కృషికి తగిన ఫలితం మనం ఎలాగూ ఆశించలేము, కనీసం తెవికీకి గుర్తింపు లభిస్తే చాలు, అంతేకాకుండా మనం వ్యాసాలను యధాతథంగా పత్రికల నుంచి కాపీ చేశామనే భావన ఉండరాదు. భవిషత్తులో ఈ విధంగా జరగకుండా మనం చర్యలు/జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. - సి. చంద్ర కాంత రావు - చర్చ 18:02, 14 ఆగష్టు 2010 (UTC)

పత్రికలు/పుస్తక మాధ్యమాలకు, వికీపీడియా కి విడదీయరాని సంభందం వుంది.మన వికీకి కావలసిన సమాచారం చాలా వరకు వాటినుండే కదా. మీ సలహాలతో పూర్తిగా ఏకీభవిస్తాను. సూర్య పత్రిక సంపాదకునికి లేఖ రాయండి. మన తెవికీలో తరచు అడిగే ప్రశ్నలలో దీనికి సంభందించిన విషయాన్ని చేరిస్తే మంచిది.--అర్జున 05:53, 15 ఆగష్టు 2010 (UTC)

చర్చ విధానము మరియు పాలసీలు

మార్చు

వికిపిడియా కీలక పలసిలను] తెలుగులో అనువాదించి, తెవికిలో అమోధపరచమని నిర్వాహకులకు విన్నపము. --Ranjithsutari 11:45, 3 సెప్టెంబర్ 2010 (UTC)

రంజిత్ గారూ! ఈ విషయమై ఇదివరకు కూడా చర్చ జరిగింది. సమయాభావం వలన ఇది ఇప్పటిలో సాధ్యమయ్యేలా కనబడడంలేదు. అనువాదానికి మీరు సహకరిస్తే కొంత ప్రగతి సాధ్యమవుతుంది. --కాసుబాబు 16:01, 3 సెప్టెంబర్ 2010 (UTC)
అవునండీ, ఈ కార్యాన్ని మీరే నిర్వహిస్తే బాగుంటుంది. ఈ నియమాలు, పాలసీలు వ్రాయటానికి ఎవరూ అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఇదివరకు చదువరి అనే నిర్వాహకుడు ఉండేవారు. ఆయన కొంత ఆసక్తితో అప్పటికి కావలసిన నియమాలను తర్జుమా చేశారు. కానీ సముదాయం పెరుగుతున్న కొద్దీ మరిన్ని నియమాలను ఇక్కడ పొందుపర్చవలసిన అవసరం వచ్చింది. --వైజాసత్య 16:12, 3 సెప్టెంబర్ 2010 (UTC)

సెక్స్ విషయాలకు సంబంధించిన వ్యాసాలు

మార్చు

ఇటీవల సెక్స్‌కు సంబంధించిన అనేక వ్యాసాలను ఒక సభ్యులు చేరుస్తున్నారు. ఇది వరకు కూడా కొన్ని ఇలాంటి వ్యాసాలు ఉన్నాయి. సాధారణంగా వ్యాసాలు నియమాలకు లోబడే ఉంటున్నాయి కాని బొమ్మల వియంలో కొంత ఇబ్బంది అనిపిస్తున్నది. తెలుగు వికీపీడియా పరిధి, పాఠకుల విస్తృతి దృష్ట్యా ఇలాంటి బొమ్మలు అవుసరం లేదని నా అభిప్రాయం. అంతగా కావాలనుకొంటే కామన్స్‌లోని బొమ్మల పేర్లకు లింకు మాత్రం ఇస్తే సరిపోతుంది గదా? సభ్యుల అభిప్రాయాలను కోరుతున్నాను --కాసుబాబు 15:57, 3 సెప్టెంబర్ 2010 (UTC)

మరీ బొమ్మలను పూర్తిగా తీసివేయమనకూడదు కానీ, ఈ వ్యాసాల్లో ఉన్న విషయాలను వివరించడానికి ఒకటి మహా అయితే రెండు బొమ్మలు సరిపోతాయి (ఎందుకంటే వీటిలో పెద్దగా సమాచారం లేదు). బూతు పుస్తకంలా కేవలం బొమ్మల కోసమే బొమ్మలు, ఇతర వ్యాసాలలో ఉన్న పరిమాణం కంటే వీటి పరిమాణాన్ని పెంచడం వంటి పనులను అడ్డుకోవాలి. ఇంకా చాలా చోట్ల సంపాదకుడు అనే సభ్యుని వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ఉన్నాయి. (ఉదాహరణకి సామూహిక సంభోగం వ్యాసం ఒక వ్యక్తిగత అభిప్రాయంతోనే ప్రారంభమౌతుంది) --వైజాసత్య 16:20, 3 సెప్టెంబర్ 2010 (UTC)
నేను గమనించాను, చర్చావిషయంగా రాద్దామనుకున్నాను. ఈ విషయమై వికీఫౌండేషన్ స్థాయిలో పని [1] జరుగుతున్నది. ఈ వ్యాసాలు తెవికీని నలుగురి సమక్షంలో వాడటానికి అడ్డంకులు కావచ్చు. ఈ పేజీలని సాధారణంగా బొమ్మలు లేకుండా చూపించి, ఐచ్ఛికంగా బొమ్మలతో చూపించే పద్ధతి వుంటే ఎలావుంటుంది, మన తెలుగుకి సంబంధించి బొమ్మలు ఇవ్వదలచినట్లయితే, ఖజరహో శిల్పాల చిత్రాలు వాడటము ఎలావుంటుంది. ఇప్పటికే ప్రచురితమైన తెలుగు విజ్ఞాన సర్వస్వాలలో లేక ఆరోగ్య శాస్త్ర పుస్తకాలలో ఏ విధానం వాడుతున్నారు? --అర్జున 13:44, 4 సెప్టెంబర్ 2010 (UTC)

సభ్యనామం మార్పు గురించి

మార్చు

సార్ నేను ఖాతాని తెరువడంకోసం ఒక సభ్యనామాన్ని వాడాను కాని అది ఇప్పుడు మార్చాలనుకుంటున్నాను ఎలాగో తెలుపగలరు.

మీ పేరు ఎలా మార్చాలో చెబుతూ వైజా సత్య గారి చర్చా పేజీలో ఒక అభ్యర్ధన పెట్టండి. --కాసుబాబు 12:07, 15 సెప్టెంబర్ 2010 (UTC)

ఇస్లామిక వ్యాసాలు

మార్చు

తెలుగు వికీలో వేయి సంవత్సరాల వాస్తవాలను, సమకాలీన చరిత్రను కూడ లెక్క పెట్టక హింసను, మనిషిలోని దానవత్వాన్ని, రాక్షసప్రవృత్తిని ప్రేరేపించె ఒక మతాన్ని శాంతికాముక మతముగా ప్రచారము చేసె ప్రయత్నాలు, వ్యాస రచనలు జరుగుతున్నాయి. ధరిత్రిలో ఏ మూల చూసినా హింసకూ, అశాంతికీ, మారణహోమాలకు మూల కారణం ఒకే ఒక మతం. పచ్చినిజాలను వక్రీకరించి వికీ ని ఒక ప్రచారసాధనము వాడుకొనుట దురదృష్టకరం. Kumarrao 16:49, 16 సెప్టెంబర్ 2010 (UTC)

వ్యాస చర్చా పేజీల లో చర్చించండి. -- అర్జున 09:37, 5 అక్టోబర్ 2010 (UTC)

ఆంధ్ర శాఖాహార వంటల జాబిత

మార్చు

ఆంధ్ర శాఖాహార వంటల జాబిత ప్రస్తుతము వర్గం:కూరలు లో వున్నది. దీనిని ఆంధ్ర శాఖాహార వంటల జాబిత లోకి దయచేసి మార్చగలరు.

అది వ్యాసము, ఏ వర్గంలో లేదు. అంతేకాక వర్గం:కూరలు లోదీని నకలు వుంది. అక్కడ తొలగించి, నేను వ్యాసాన్ని ప్రస్తుతానికి వర్గం:కూరలు లో చేర్చాను. మీరు కొత్త వర్గం సృష్టించి దీనిని మెరుగుపరచవచ్చు..--అర్జున 09:36, 5 అక్టోబర్ 2010 (UTC)